
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) 2023–2024 సీజన్‌కు ఈ నెల 21న తెర లేవనుంది. కొచ్చిలో కేరళ బ్లాస్టర్స్, బెంగళూరు ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్‌తో ఐఎస్‌ఎల్ పదో సీజన్ మొదలవుతుంది. డిసెంబర్ 29 వరకు తొలి అర్ధభాగం మ్యాచ్‌లను నిర్వహిస్తారు. మొత్తం 12 జట్లు బరిలో ఉన్నాయి. అయితే ఆసియా క్రీడలు జరిగే సమయంలోనే ఈ లీగ్ జరుగుతుండగా... ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న 22 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో ఐఎస్‌ఎల్‌లోని 10 క్లబ్‌లకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు.
ఆసియా క్రీడల కోసం తమ ఆటగాళ్లను విడుదల చేసేందుకు కొన్ని క్లబ్‌లు విముఖత వ్యక్తం చేస్తున్నాయని తెలిసింది. ఆసియా క్రీడలు సెపె్టంబర్ 23న మొదలవుతున్నా... ఫుట్‌బాల్ మ్యాచ్‌లు మాత్రం సెప్టెంబర్ 19 నుంచి జరుగుతాయి. భారత్ తమ గ్రూప్ లీగ్ మ్యాచ్‌లను సెప్టెంబర్ 19న చైనాతో, 21న బంగ్లాదేశ్‌తో, 24న మయన్మార్‌తో ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment