isl
-
హైదరాబాద్ పరాజయం
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు 0–1 గోల్ తేడాతో ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ చేతిలో ఓటమి పాలైంది. ముంబై జట్టు తరఫున మెహతాబ్ సింగ్ (29వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. మ్యాచ్‌లో ముంబై జట్టు హైదరాబాద్ గోల్ పోస్ట్‌పై 4 షాట్లు బాదగా... అందులో ఒకటి లక్ష్యాన్ని చేరింది. హైదరాబాద్ మూడు ప్రయత్నాలు చేసినా ఖాతా తెరవలేకపోయింది. 55 శాతం బంతిని తమ ఆ«దీనంలో ఉంచుకున్న ముంబై చివరకు విజేతగా నిలిచింది. తాజా సీజన్లో 9 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు 2 విజయాలు, ఒక ‘డ్రా’, 6 పరాజయాలతో 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 11వ స్థానంలో ఉండగా... ముంబై జట్టు 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 ‘డ్రా’లు, 2 పరాజయాలతో 13 పాయింట్లు సాధించి పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో మోహన్ బగాన్ జట్టు 1–0 గోల్స్ తేడాతో చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది. మోహన్ బగాన్ తరఫున జాసన్ కమింగ్స్ (86వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఆరో విజయం ఖాతాలో వేసుకున్న మోహన్ బగాన్ జట్టు 20 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలిచింది. ఆదివారం ఒడిశా జట్టుతో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ తలపడనుండగా... హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్‌ను బుధవారం గోవా ఫుట్‌బాల్ క్లబ్‌తో ఆడనుంది. -
బెంగళూరుకు తొలి ఓటమి
మార్గావ్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తున్న బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌కు భంగపాటు ఎదురైంది. తాజా సీజన్లో ఓటమి లేకుండా సాగుతున్న బెంగళూరు జట్టు... శనివారం జరిగిన పోరులో 0–3తో గోవా ఫుట్‌బాల్ క్లబ్ చేతిలో ఓడింది. సీజన్లో రెండో విజయం నమోదు చేసుకున్న గోవా జట్టు తరఫున ఆర్మాండో సాడికు (63వ నిమిషంలో), బ్రిసన్ ఫెర్నాండెస్ (72వ ని.లో), డెజాన్ డ్రాజిక్ (90+3వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు. భారత జాతీయ ఫుట్‌బాల్ జట్టు కోచ్ మనోలో మార్క్వెజ్ శిక్షణలో బరిలోకి దిగిన గోవా జట్టు... మ్యాచ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. నిర్ణీత సమయంలో గోవా 19 షాట్లు ఆడగా... బెంగళూరు బుల్స్ 8 షాట్లు ఆడింది. లక్ష్యంపైకి ఐదు షాట్లు సంధించిన గోవా... అందులో మూడింటిని గోల్ పోస్ట్‌లోకి పంపింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు 5 విజయాలు, ఒక పరాజయం, ఒక ‘డ్రాతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు 7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లు నమోదు చేసుకున్న గోవా 9 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం జరగనున్న మ్యాచ్‌ల్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఒడిషా ఫుట్‌బాల్ క్లబ్‌తో... ముంబై సిటీ జట్టుతో కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ తలపడతాయి. -
హైదరాబాద్ ఎఫ్‌సీ తొలి విజయం
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తాజా సీజన్లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ తొలి విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు 4–0తో మొహమ్మదాన్ స్పోర్ట్స్ క్లబ్‌పై గెలుపొందింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో ఆకట్టుకోలేకపోయిన హైదరాబాద్... మొహమ్మదాన్ క్లబ్‌తో పోరులో చెలరేగి ఆడింది. అలాన్ డిసౌజా మిరండా (4వ, 15వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో మెరవగా... స్టీఫెన్ సాపిక్ (12వ నిమిషంలో), పరాగ్ శ్రీవాస్ (51వ ని.లో) చెరో గోల్ కొట్టారు. మ్యాచ్ ఆరంభం నుంచే విజృంభించిన హైదరాబాద్ జట్టు... ప్రత్యర్థి డిఫెన్స్ బలహీనతలను సొమ్ము చేసుకుంటూ మ్యాచ్ ఆరంభమైన తొలి 15 నిమిషాల్లోనే మూడు గోల్స్‌తో తిరుగులేని ఆధిక్యం సాధించారు. దీంతో ఒత్తిడికి గురైన మొహమ్మడన్ క్లబ్ ఆటగాళ్లు డిఫెన్స్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. బంతిని ఎక్కువసేపు అదుపులో పెట్టుకున్న మొహమ్మదాన్ ప్లేయర్లు... హైదరాబాద్ కన్నా ఎక్కువ షాట్లు ఆడినా... అవి లక్ష్యాన్ని చేరుకోకుండా మనవాళ్లు అడ్డుపడ్డారు. 60 శాతం బంతిని తమ ఆ«దీనంలో ఉంచుకున్న మొహమ్మడన్ జట్టుకు 13 కార్నర్లు, ఒక ఆఫ్‌సైడ్ లభించినా... వాటిని వినియోగించుకోలేకపోయారు. లీగ్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ ఒక విజయం, ఒక ‘డ్రా’, మూడు పరాజయలతో మొత్తంగా 4 పాయింట్లు సాధించి పట్టికలో 11వ స్థానంలో నిలిచింది. నార్త్ ఈస్ట్ రికార్డు విజయం గువాహటి వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ 5–0తో జంషెడ్పూర్ జట్టుపై గెలిచింది. ఐఎస్ఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇప్పటి వరకు ఈ లీగ్‌లో ఒక జట్టు ఐదు గోల్స్ నమోదు చేయడం కూడా ఇదే మొదటిసారి. నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు తరఫున అలాద్దీన్ (5వ, 90వ నిమిషాల్లో), పార్థిబ్ గొగొయ్ (44వ, 55వ నిమిషాల్లో) రెండేసి గోల్స్ చేయగా... లూయిస్ నిక్సన్ (82వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టుకు ఇది రెండో గెలుపు కాగా... 8 పాయింట్లతో ఉన్న ఆ జట్టు పట్టికలో ఐదో స్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌లో ఓడిన జంషెడ్పూర్ జట్టు ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో ఉంది. ఆదివారం ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్ తలపడనుంది. -
ముంబై బోణీ
మార్గావ్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ తొలి విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో ముంబై జట్టు 2–1 తేడాతో గోవా ఫుట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. గోవాపై ముంబైకిది వరుసగా 13వ విజయం కావడం విశేషం. ముంబై జట్టు తరఫున నికోస్ కరెలిస్ (21వ నిమిషంలో), యోల్ వ్యాన్ నిఫ్ (40వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... గోవా జట్టు తరఫున ఆర్మాండో సాడికు (55వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. తొలి అర్ధభాగంలోనే రెండు గోల్స్‌తో అదరగొట్టిన ముంబై సిటీ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లగా... గోవా జట్టు వెనుకబడిపోయింది. ద్వితీయార్ధంలో పుంజుకొని పోరాడే ప్రయత్నం చేసినా ఒక గోల్‌తోనే సరిపెట్టుకుంది. తాజా సీజన్లో ముంబై సిటీ జట్టు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా... ఇదే తొలి విజయం ఒక ఓటమి, రెండు ‘డ్రా’లతో మొత్తంగా 5 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ముంబై జట్టు పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మరోవైపు ఐదు మ్యాచ్‌లు ఆడిన గోవా ఫుట్‌బాల్ క్లబ్ ఒక విజయం రెండు పరాజయాలు, రెండు ‘డ్రా’లతో 5 పాయింట్లతో ముంబై తర్వాతి స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు 2–0తో ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. మోహన్ బగాన్ తరఫున జెమీ మెక్లారెన్ (41వ నిమిషంలో), దిమిత్రీ పెట్రాటోస్ (89వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. ఈ విజయంతో మోహన్ బగాన్ జట్టు మూడో గెలుపు నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఈస్ట్ బెంగాల్ జట్టు పట్టిక అట్టడుగున ఉంది. లీగ్‌లో భాగంగా ఆదివారం మొహమ్మదాన్ స్పోర్ట్స్ క్లబ్‌తో కేరళ బ్లాస్టర్స్ ఫుట్‌బాల్ క్లబ్ తలపడనుంది. -
బెంగళూరు ‘హ్యాట్రిక్’ గెలుపు
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. మోహన్ బగాన్ సూపర్ జెయింట్ క్లబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. బెంగళూరు తరఫున ఎడ్గర్ మెండెజ్ (9వ ని.లో), సురేశ్ సింగ్ (20వ ని.లో), భారత మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి (51వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఐఎస్ఎల్ చరిత్రలో సునీల్ ఛెత్రికిది 64వ గోల్ కావడం విశేషం. ఈ గోల్‌తో ఐఎస్ఎల్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా సునీల్ ఛెత్రి అవతరించాడు. 63 గోల్స్‌తో బార్ట్ ఒగ్బెచె (నైజీరియా; హైదరాబాద్ ఎఫ్‌సీ) పేరిట ఉన్న రికార్డును సునీల్ ఛెత్రి అధిగమించాడు. శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో ఒడిశా ఎఫ్‌సీ 2–1తో జంషెడ్పూర్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది. గువాహటిలో నేడు జరిగే మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టుతో కేరళ బ్లాస్టర్స్ జట్టు తలపడుతుంది. -
‘డ్రా’తో మొదలైన ఐఎస్ఎల్
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 11వ సీజన్ ‘డ్రా’తో ప్రారంభమైంది. గత ఏడాది ఫైనలిస్ట్‌లు ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్, మోహన్ బగాన్ సూపర్ జెయింట్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 2–2 గోల్స్‌తో సమంగా ముగిసింది. ముంబై సిటీ తరఫున థేర్ క్రూమ్ 90వ నిమిషంలో గోల్ సాధించాడు. మోహన్ బగాన్ తరఫున తిరి 70వ నిమిషంలో, ఆల్బర్టో రోడ్రిగ్వెజ్ 28వ నిమిషంలో గోల్స్ కొట్టారు. అయితే మ్యాచ్ ఆరంభంలోనే 9వ నిమిషంలో తిరి సెల్ఫ్ గోల్ చేయడం తుది ఫలితం సమంగా ముగిసేందుకు కారణమైంది. సొంత మైదానంలో భారీ సంఖ్యలో ప్రేక్షకుల మధ్య మోహన్ బగాన్ మ్యాచ్ ఆద్యంతం దూకుడు ప్రదర్శించినా... ఈ టీమ్‌ను నిలువరించడంలో ముంబై సఫలమైంది. ఐఎస్ఎల్లో భాగంగా నేడు రెండు వేర్వేరు వేదికల్లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. భువనేశ్వర్‌లో ఒడిషా ఎఫ్‌సీతో చెన్నైయిన్ ఎఫ్‌సీ... బెంగళూరులో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీతో బెంగళూరు ఎఫ్‌సీ తలపడతాయి. -
చాంపియన్ ముంబై సిటీ
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ రెండో సారి విజేతగా నిలిచింది. దాదాపు 62 వేల సామర్థ్యం గల సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన తుది పోరులో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. శనివారం జరిగిన ఫైనల్లో ముంబై 3–1 గోల్స్ తేడాతో మోహన్‌బగాన్ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఆరంభంలో ఇరు జట్లూ జాగ్రత్తగా ఆడుతూ డిఫెన్స్‌పైనే దృష్టి పెట్టాయి. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ సాధించిన గోల్‌తో ముందుగా మోహన్‌బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే రెండో అర్ధభాగంలో 3 గోల్స్‌తో ముంబై చెలరేగింది. ముంబై తరఫున జార్జ్ పెరీరా డియాజ్ (53వ నిమిషం), బిపిన్ సింగ్ (81వ నిమిషం), జాకబ్ వోజస్ (90+7వ నిమిషం)లో గోల్స్ కొట్టారు. 2020–21 సీజన్లో ముంబై విజేతగా నిలిచిన మ్యాచ్‌లో కూడా ఇదే తరహాలో మోహన్‌బగాన్ 1–0తో ఆధిక్యంలో నిలిచినా...బిపిన్ సింగ్ సాధించిన గోల్‌తోనే ముంబై గెలిచింది. అదనపు సమయంలో మోహన్‌బగాన్‌కు స్కోరు సమం చేసే అవకాశం వచ్చినా... ఫార్వర్డ్లు పూర్తిగా విఫలమయ్యారు. కొన్ని క్షణాల్లో ఆట ముగుస్తుందనగా ముంబై మరో గోల్‌తో తిరుగులేని విజయా న్ని అందుకుంది. ముంబైకి చెందిన ఫుర్బా లచెన్పాకు ‘గోల్డెన్ గ్లవ్’, విక్రమ్ ప్రతాప్ సింగ్‌కు ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డు, కేరళ బ్లాస్టర్స్ ప్లేయర్ దిమిత్రియోస్ దియామంతకూస్కు ‘గోల్డెన్ బూట్’ అవార్డులు దక్కగా, మోహన్ బగాన్ ఆటగాడు పెట్రాటోస్ ‘ప్లేయర్ ఆఫ్ ద లీగ్’గా నిలిచాడు. -
ఈనెల 21 నుంచి ఐఎస్ఎల్
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 2023–2024 సీజన్‌కు ఈ నెల 21న తెర లేవనుంది. కొచ్చిలో కేరళ బ్లాస్టర్స్, బెంగళూరు ఎఫ్‌సీ జట్ల మధ్య మ్యాచ్‌తో ఐఎస్ఎల్ పదో సీజన్ మొదలవుతుంది. డిసెంబర్ 29 వరకు తొలి అర్ధభాగం మ్యాచ్‌లను నిర్వహిస్తారు. మొత్తం 12 జట్లు బరిలో ఉన్నాయి. అయితే ఆసియా క్రీడలు జరిగే సమయంలోనే ఈ లీగ్ జరుగుతుండగా... ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న 22 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో ఐఎస్‌ఎల్‌లోని 10 క్లబ్‌లకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఆసియా క్రీడల కోసం తమ ఆటగాళ్లను విడుదల చేసేందుకు కొన్ని క్లబ్‌లు విముఖత వ్యక్తం చేస్తున్నాయని తెలిసింది. ఆసియా క్రీడలు సెపె్టంబర్ 23న మొదలవుతున్నా... ఫుట్‌బాల్ మ్యాచ్‌లు మాత్రం సెప్టెంబర్ 19 నుంచి జరుగుతాయి. భారత్ తమ గ్రూప్ లీగ్ మ్యాచ్‌లను సెప్టెంబర్ 19న చైనాతో, 21న బంగ్లాదేశ్‌తో, 24న మయన్మార్‌తో ఆడుతుంది. -
ISL 2022: హైదరాబాద్‌ను గెలిపించిన యాసిర్
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. జంషెడ్‌పూర్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 1–0 గోల్‌తో జంషెడ్పూర్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది. ఆట 48వ నిమిషంలో మొహమ్మద్ యాసిర్ సాధించిన గోల్‌తో హైదరాబాద్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
సూపర్ ఫుట్‌బాల్
కళ్లు చెదిరే ఫ్రీ కిక్‌లు... కళాత్మకమైన పాస్‌లు... మతి పోగొట్టే హెడర్స్... ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే డిఫెండర్ల విన్యాసాలు... వెరసి ప్రేక్షకుల్ని అలరించడానికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో కట్టు బాట్ల నడుమ బుడగలో కాలికి, బంతికి జరిగే ఈ పోరాటంలో గెలిచేందుకు 11 జట్లు రె‘ఢీ’ అయ్యాయి... మనల్ని ఉత్సాహపరిచేందుకు ఫుట్‌బాల్ పండుగను తీసుకొచ్చాయి. పనాజీ: నాలుగు నెలల పాటు భారత ఫుట్‌బాల్ అభిమానులను అలరించడానికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) వచ్చేసింది. నేడు కేరళ బ్లాస్టర్స్, ఏటీకే మోహన్ బగాన్ మ్యాచ్‌తో ఏడో సీజన్‌కు తెర లేవనుంది. కరోనా విరామం అనంతరం దేశంలో జరగనున్న తొలి క్రీడా ఈవెంట్ ఇదే కావడం విశేషం. దాంతో టోర్నీని ఒకే చోట నిర్వహించడానికి సిద్ధమైన లీగ్ నిర్వాహకులు... అందుకోసం గోవాను ఎంచుకున్నారు. అక్కడే ‘బయో సెక్యూర్ బబుల్’ను ఏర్పాటు చేశారు. మొత్తం మూడు స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వారంటైన్ నిబంధనలు ఉండటంతో టోర్నీలో పాల్గొనే ప్లేయర్లు నెల రోజులు ముందుగానే గోవాకు చేరుకున్నారు. ఇక టైటిల్ కోసం పోటీ పడే జట్ల సంఖ్య ఈ సారి పెరిగింది. లీగ్‌లోకి కొత్తగా స్పోర్టింగ్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ వచ్చి చేరడంతో... జట్ల సంఖ్య 11కు చేరింది. టైటిల్ ఫేవరెట్లుగా డిఫెండింగ్ చాంపియన్ ఏటీకే మోహన్ బగాన్, మాజీ చాంపియన్ బెంగళూరు ఎఫ్‌సీ కనిపిస్తున్నాయి. తమ తొలి సీజన్ (2019–20)లో అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన కనబరచని హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)... ఈ సారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం స్పెయిన్‌కు చెందిన మాన్యుయెల్ మార్కజ్‌ను తమ హెడ్ కోచ్‌గా కూడా నియమించింది. గత సీజన్లో హైదరాబాద్ ఎఫ్‌సీ... రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిన జరిగే ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం సెమీ ఫైనల్స్ జరుగుతాయి. కరోనా ఉండటంతో ఈ సారి ఇంటా, బయట పద్ధతిలో కాకుండా ఒకే చోట సెమీస్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక్కడ విజేతలుగా నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇప్పటి వరకు లీగ్ తొలి అంచె మ్యాచ్ తేదీలను మాత్రమే నిర్వాహకులు ప్రకటించారు. డిసెంబర్లో రెండో అంచె పోటీలతో పాటు సెమీస్, ఫైనల్ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. సబ్స్టిట్యూట్ల సంఖ్య పెరిగింది కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ప్రతిపాదించిన ‘ఐదుగురు సబ్‌స్టిట్యూట్’ నిబంధన ఐఎస్ఎల్లో కొనసాగనుంది. దాంతో మ్యాచ్ మధ్యలో ఒక జట్టు గరిష్టంగా ఐదుగురు సబ్స్టిట్యూట్లను ఆడించవచ్చు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మూడు సందర్భాల్లో మాత్రమే వీరిని బరిలోకి దించాలి. అంతేకాకుండా సబ్‌స్టిట్యూట్ బెంచ్‌ను ఏడుగురి నుంచి తొమ్మిదికి పెంచారు. హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టు: గోల్ కీపర్లు: లాల్బియాక్లువా జోంగ్టే, లక్ష్మీకాంత్, మానస్ దూబే, సుబ్రతా పాల్. డిఫెండర్లు: ఆకాశ్ మిశ్రా, ఆశిష్ రాయ్, చింగ్లెన్సనా సింగ్, డింపిల్ భగత్, కిన్‌సైలాంగ్ ఖోంగ్సిట్, నిఖిల్ ప్రభు, ఒడి ఒనైందియా, సాహిల్ పన్వార్. మిడ్ ఫీల్డర్లు: అభిషేక్ హల్దార్, ఆదిల్ ఖాన్, సాహిల్ తవోరా, హలిచరన్ నర్జారీ, హితేశ్ శర్మ, జావో విక్టోర్, లల్దాన్‌మవియా రాల్టే, లూయిస్ సస్ట్రే, మార్క్ జొతాన్‌పుయా, మొహమ్మద్ యాసిర్, నిఖిల్ పూజారి, సౌవిక్ చక్రవర్తి, స్వీడెన్ ఫెర్నాండెస్. ఫార్వర్డ్స్: సాంటాన, సాండ్రెజ్, ఇషాన్ డే, జోల్ చియానీస్, లాలాంపుయా, లిస్టన్ కొలాకో, రోహిత్ దను, హెడ్ కోచ్: మాన్యుయెల్ మార్కజ్. -
కొత్త వ్యూహాలతో సరికొత్తగా సిద్ధమవుతాం: రానా
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కొత్తగా అడుగుపెట్టిన హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) తొలి ఏడాది పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. అయితే తమ జట్టు వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచే సన్నద్ధమవుతుందని హెచ్ఎఫ్సీ సహ యజమాని, సినీనటుడు దగ్గుబాటి రానా చెప్పారు. ఐఎస్ఎల్లో ఈ సీజన్‌కు కొద్ది రోజుల ముందే తమ జట్టు కొత్తగా వచి్చందని, జట్టు కోసం వరుణ్ (సహ యజమాని) ఎంతో కష్టపడ్డారని ఆయన చెప్పారు. ‘ఈ సీజన్లో నిరాశ ఎదురైనా... సానుకూల దృక్పథంతో వచ్చే సీజన్ కోసం కష్టపడతాం. క్లిష్టమైన ఈ సమయంలో జట్టుకు మద్దతుగా నిలిచేందుకే నేను వచ్చాను. కొన్ని మార్పులు, చేర్పులతో జట్టు పటిష్టంగా తయారవుతుంది. వచ్చే సీజన్లో మా జట్టు ట్రోఫీ గెలుస్తుందన్న నమ్మకం నాకుంది’ అని రానా వివరించారు. మరో సహ యజమాని వరుణ్ త్రిపురనేని మాట్లాడుతూ రానా ఇచి్చన మద్దతును మరిచిపోలేమని, అలాంటి ఉత్తేజం ఇచ్చేవారు తమ జట్టులో ఉండటం ఎంతో లాభిస్తుందని చెప్పారు. వచ్చే సీజన్లో తమ జట్టు నూతనోత్సాహంతో బరిలోకి దిగుతుందని, సంతృప్తికర ఫలితాలు సాధిస్తుందని అన్నారు. 2019–20 సీజన్లో బరిలోకి దిగిన హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ 16 మ్యాచ్‌లాడి ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. 12 మ్యాచ్‌ల్లో ఓడగా... మరో 3 మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. దీంతో కోచ్ ఫిల్ బ్రౌన్‌ను తప్పించిన యాజమాన్యం వచ్చే రెండు సీజన్ల కోసం అల్బెర్ట్ రోకాను హెడ్ కోచ్‌గా నియమించింది. -
అదే నా విజన్: నీతా అంబానీ
ముంబై: దేశంలో లక్షల సంఖ్యలో చిన్నారులను తమకు నచ్చిన క్రీడలకు పరిచయం చేయడమే తన విజన్ అని ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్(ఎఫ్ఎస్డీఎల్) చైర్పర్సన్ నీతా అంబానీ స్పష్టం చేశారు. ఇందుకోసం ఐఎస్ఎల్ (ఇండియన్ సూపర్ లీగ్)వేదికను ఉపయెగించుకోవాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. దీనిలో భాగంగా అండర్-17, అండర్-12 స్థాయిలో అమ్మాయిలకు టోర్నీలు నిర్వహించేందుకు తలపెట్టినట్లు నీతా పేర్కొన్నారు. 2019-20 సీజన్లో అండర్-17, అండర్-12 స్థాయి ఫుట్‌బాల్ లీగ్‌ను ప్రవేశపెట్టనున్నామన్నారు. అండర్-17 గర్ల్స్ టోర్నీలో నాలుగు జట్లు పాల్గొంటాయని, ఇందులో వందకు మందికి పైగా క్రీడాకారిణులు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుందన్నారు. 2020లో అండర్-17 మహిళల ఫిఫా వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో అప్పటిలోగా ప్లేయర్ల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా ఎఫ్ఎస్డీఎల్ పని చేయనున్నట్లు తెలిపారు. మరొకవైపు తొలి విడతలో కేవలం మూడు రాష్ట్రాల చిల్డ్రన్స్ లీగ్‌లు మాత్రమే నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే మూడేళ్ల కాలంలో 12 రాష్ట్రాలకు దాన్ని విస్తరిస్తామని నీతా పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ముంబైలో జరిగిన సమావేశంలో నీతా అంబానీతో పాటు ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)క్లబ్ యాజమానుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అక్షయ్ టాండన్, విజయ్ మద్దూరి, పార్థ్ జిందాల్, సంజయ్ గుప్తా, చిరంజీవి, జాన్ అబ్రహం, ప్రపుల్ పటేల్, అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్, సంజయ్ గోయెంకా, అనిల్ శర్మ, చాణక్య చౌదరిలు హాజరయ్యారు. -
‘కనికట్టు’పై క్షేత్రస్థాయి విచారణ
తొండంగి (తుని): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ(ఐఎస్ఎల్) పథకంలో తొండంగి మండలం పైడికొండ పంచాయతీలో జరిగిన అవకతవకలను వెలికిస్తూ ‘సాక్షి’ గతేడాది ‘కనికట్టు’ పేరుతో కథనాన్ని ప్రచురించింది. మరోవైపు బాధిత లబ్ధిదారులు ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన నేప«థ్యంలో బుధవారం పైడికొండ, ఆనూరు గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. పైడికొండ పంచాయతీ ఆనూరు గ్రామంలో లబ్ధిదారులకు తెలియకుండానే ఎన్జీఓ పేరుతో కాంట్రాక్టర్, పంచాయతీ కార్యదర్శి కలిసి నిధులు దుర్వినియోగం చేసిన వ్యవహారంపై కొంత కాలం క్రితం బాధిత గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పంచాయతీలో 684 మరుగుదొడ్లు నిర్మించినట్టు ఆన్లైన్లో పేర్కొనడంతోపాటు తొంభైశాతం మరగుదొడ్లకు కాంట్రాక్టర్‌కు చెల్లింపులు జరిగాయి. దాదాపుగా పంచాయతీలోనే 70 నుంచి 80 లక్షల వరకూ అవినీతి జరిగిందని అంచనా. కాగా దీనిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జెడ్పీ సీఈవోను విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఏవో సుబ్బారావు, ఇతర అధికారులను విచారణ చేయాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ నుంచి ఏఓ సుబ్బారావు కొద్ది రోజుల క్రితం మండల పరిషత్ కార్యాలయంలో ప్రాథమికంగా రికార్డులు పరిశీలించి నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్‌కు చెల్లింపు జరిగినట్టు నిర్ధారించుకున్నారు. అనంతరం బాధితులందరూ కలిసి విచారణ పక్కదారి పడుతుందన్న అనుమానంతో క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని మరో మారు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో పైడికొండ, ఆనూరు గ్రామల్లో 32 మందితో కూడిన అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులనునిలదీసిన గ్రామస్తులు గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని నిధులు కాజేసిన వ్యవహారంపై కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు విచారణకు రావడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కచ్చితంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ భమిడి శివమూర్తితో సహా, విచారణ అధికారుల బృందాన్ని గ్రామస్తులు నిలదీశారు. దీనిపై అధికారులు వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏమి జరిగిందో తెలుసుకోవడానికే పరిశీలనకు వచ్చామని గ్రామస్తులకు వివరించారు. గ్రామంలో వారు విచారణ నిర్వహించారు. పైడికొండ పంచాయతీ ఆనూరు గ్రామంలో ఎనిమిది మంది నాలుగు బృందాలుగా, మిగిలిన దాదాపు 11 బృందాలు పైడికొండ గ్రామంలో ఇంటింటా తిరిగి పరిశీలన జరిపారు. వాస్తవంగా మరుగుదొడ్డి ఉందా? ఎప్పుడు నిర్మించుకున్నారు?, ఎవరు నిర్మించారు?, నిధులు అందాయలా? లేదా? అన్న విషయాలపై విచారణ జరుపుతున్నట్టు విచారణ అధికారి ఏవో సుబ్బారావు తెలిపారు. నిధులు దుర్వినియోగం అయినట్టు ప్రాథమికంగానే గుర్తించామని, ఏ స్థాయిలో జరిగిందనేది క్షేత్రస్థాయి పరిశీలనలో తేలుతుందని ఆయన వివరించారు. దీనిపై సమగ్రమైన నివేదికను జిల్లా పరిషత్ సీఈవోకు అందజేస్తామన్నారు. నాకు తెలియకుండా నిధులు దుర్వినియోగం చేశారు మా పంచాయతీలో ఐఎస్ఎల్ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై నాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా కార్యదర్శి, ఎంపీడీవో కలిసి నిధులు ఖర్చు చేశారు. జాయింట్ చెక్ పవర్ ఉన్నా నా ప్రమేయం లేకుండా ఖర్చు చేశారు. దీనిపై 19న జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాను.– పైడికొండ సర్పంచ్ భవిరిశెట్టి లోవ విచారణకు వచ్చిన అధికారులకు ఫిర్యాదు ఆనూరులో ఐఎస్ఎల్పై పరిశీలనకు వచ్చిన అధికారుల బృందానికి లబ్ధిదారులు కొంత మంది నిధులు అందలేదని ఫిర్యాదు చేశారు. తాము సొంత ఖర్చులతో మరుగుదొడ్లు నిర్మించుకున్నామని తెలిపారు. మరికొంత మంది మరుగుదొడ్డే నిర్మించుకోలేదని, కానీ తమపేరున తమకు తెలియకుండానే నిధులు విడుదల చేసుకున్నట్టు వచ్చిన అధికారులకు వివరించారు. -
సచిన్‌తో ప్రియా ప్రకాశ్ సందడి
మలయాళీ చిత్రం ‘ఒరు అదార్ లవ్’లో కన్నుగీటే సన్నివేశంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నటి ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో క్లిప్‌లో ఈ భామ కను సైగలతో చేసిన హావభావాలు అందర్నీ కట్టి పడేశాయి. టాలీవుడ్ హీరోల నుంచి సౌతాఫ్రికా క్రికెటర్ లుంగీ ఎంగిడీ వరకూ ప్రియాకు ఫ్యాన్స్ అయ్యారు. ఇపుడామే తనకు వచ్చిన స్టార్డమ్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ప్రియ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఐఎస్ఎల్-2018కు తన సహనటుడు రోషన్ అబ్దుల్ రవూఫ్‌తో కలిసి హాజరైంది. ఇందులో భాగంగా అక్కడే ఉన్న మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్, అభిషేక్ బచ్చన్ ను కలిసింది. ఈ సందర్భంగా సచిన్‌ను కలుసుకున్న ఫొటోను ప్రియా ట్విటర్లో షేర్ చేసింది. ‘ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజు నేను ఇద్దరు గొప్ప వ్యక్తులను కలుసుకున్నాను’ అంటూ పోస్ట్ చేసింది. సచిన్‌తో ప్రియా వారియర్, రోషన్ అబ్దుల్ రవూఫ్ -
మరుగులోనూ కక్కుర్తి!
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, మహిళల ఆత్మగౌర వం కోసం సర్కారు చేపట్టిన ‘ఇంటింటా మరుగుదొడ్డి’ సర్పంచులకు కాసుల వర్షం కురిపించింది. జిల్లాలో 90శాతం పైగా ఐఎస్ఎల్ నిర్మించుకోగా ఇందులో 1250 మంది లబ్ధిదారులకు ఒక్కపైసా చేతికి అందలేదు. వీరికి అందాల్సిన సుమారు రూ.1.50 కోట్లు స్థానిక ప్రజాప్రతినిధులు తమ జేబులో వేసుకున్నట్లు తెలిసింది. అధికారులు వారితో కుమ్మక్కైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడంలో జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇందుకోసం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు నాయకులు సైతం పోటీ పడి ఐఎస్ ఎ ల్ కట్టించారు. కానీ, లబ్ధిదారులకు బిల్లులు ఇప్పించడంలో తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా 1250మందికి అందాల్సిన బిల్లులు రూ.1.50 కోట్లు నేటికీ వారికి చేతిలో పడలేదు. 1,250 మందికి అందని బిల్లులు.. జిల్లాలో 2012 వరకు 1,07,872 మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. ‘ఇంటింటా మరుగుదొడ్డి’ నినా దంతో రాష్ట్రప్రభుత్వం 2015లో వ్యక్తిగత మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రతపై గ్రామాల్లో విసృత ప్రచారం నిర్వహించింది. జిల్లాలో సుమారు 30 వేల కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని తేల్చింది. మం త్రి కేటీఆర్, జిల్లాస్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ మరుగుదొడ్లను నిర్మించా రు. ఇలా నాలుగు నెలల వ్యవధిలోనే 25,563 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. ఆ తర్వాత వందశా తం మరుగుదొడ్లు నిర్మించినట్లు మంత్రి కేటీఆర్ 2016లో ప్రకటించారు. రాష్ట్రంలో సిద్దిపేట తర్వాత సిరిసిల్ల రెండోస్థానంలో ఉన్నట్లు అధికారులు వెల్లడిం చారు. అయితే, 1,250 మంది అప్పు చేసి మరుగుదొడ్లను నిర్మించుకోగా వారికి నేటికీ బిల్లులు అందలేదు. మరో 600 మంది అనుమతిలేకున్నా ఐఎస్ ఎల్‌ను కట్టుకున్నారని అధికారులు బిల్లులు తిరస్కరించారు. ఇంకొందరు దరఖాస్తు చేసుకున్నా గడువు ముగిసిందనే కారణంతో నిరాకరించారు. ఆఘమేఘాలపై పనులు.. పక్కదారి పట్టిన నిధులు.. సిరిసిల్ల నియోజకవర్గంలో రెండు నెలల వ్యవధిలోనే నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించాలనే లక్ష్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకుసాగారు. 2015లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఒక్కో యూనిట్‌కు రూ.12 వేలు చెల్లించేందుకు నిధులు సిద్ధం చేసుకున్నా రు. ఒకేసారి వేలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడంతో రింగులు, బేషిన్ల కొరత ఏర్పడింది. సర్పంచ్‌లే రింగులు తయారు చేసే కంపెనీల వద్దకు వెళ్లి.. నాసిరకం వాటిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. వాటిని తరలించే క్రమంలో 20శాతం విరిగిపోగా మరికొన్ని గుంతల్లో పెట్టాక శిథిలమయ్యాయి. విరిగిన వాటిస్థానంలో కొత్తవి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ నిధులు ఎవరు చెల్లించాలనే ఆందోళన నెలకొంది. ఈనేపథ్యంలోనే మెటీరియల్ పేరుతో నిధులు కాజేశారనే అపవాదును సర్పంచులు మూటకట్టుకున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో బిల్లులు చెల్లించాల్సిన ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు.. అడ్వాన్స్ పేరిట ప్రజాప్రతినిధులకు బిల్లులు చెల్లించారు. అయినా లబ్ధిదారులకు బిల్లులు అందలేదు. సర్పంచుల జేబుల్లోకి ఐఎస్ఎల్ బిల్లులు! ప్రభుత్వం ఐఎస్ఎల్ బిల్లులను మండల పరిషత్‌లకు పంపిణీ చేసింది. అక్కడి నుంచి నేరుగా గ్రామపంచాయతీ సర్పంచ్ వీడీసీ ఖాతాల్లో నిధులు జమచేశారు. ఈ నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా అధికారులతో కుమ్ముక్కై సర్పంచులు కాజేశారు. ఇందుకు బాధ్యులుగా గుర్తించి గంభీరావుపేట ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజ్‌కుమార్‌తోపాటు ఓ సర్పంచ్‌ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన రాజ్‌కుమార్.. రాష్ట్రస్థాయి అధికారుల సిఫారసుతో కొద్దినెలల్లోనే పోస్టింగ్ తెచ్చుకున్నారు. వీరేకాదు.. జిల్లావ్యాప్తంగా ఇట్లాంటివారు చాలామంది ఉన్నారు. అప్పు చేసి కట్టించిన అధికారులు, ప్రజాప్రతినిధులు రెండేళ్లకింద వచ్చి మరుగుదొడ్డి కట్టుకోవా లని చెప్పిండ్రు. వాళ్ల మాటలు నమ్మి అప్పు చేసి లెట్రిన్ కట్టించిన. ఒక్కరూపాయి రాలే. ఎవలను అడిగతినా తెల్వదంటున్నడు. అప్పుడు కట్టుకోవాలని చెప్పిన సార్లు.. ఇప్పుడు కనవడ్తలేరు. – లోకుర్తి రేణ, కంచర్ల విచారణ జరుగుతోంది ఐఎస్ఎల్ బిల్లుల చెల్లింపుల్లో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరుగుతోంది. కొన్ని మండలాల్లో పూర్తిస్థాయిలో ప్రభుత్వమే బిల్లులు చెల్లించింది. అయితే, బిల్లులు అందలేదని కొందరు లబ్ధిదారులు చెబుతున్నారు. వీటిపై విచారణ చేపట్టి అర్హులకు బిల్లులు అందజేస్తాం. – సురేశ్, స్వచ్ఛ భారత్ జిల్లా కో ఆర్డినేటర్ -
'భారత్ టాలెంట్ అదుర్స్.. అవకాశాలకు గొప్ప నిలయం'
సాక్షి, ముంబయి : భారత గొప్ప అవకాశాలకు నిలయం అని మాంచెస్టర్ నగర ఫుట్‌బాట్ కప్ సీఈవో ఫెర్రాన్ సోరియానో అన్నారు. ముఖ్యంగా ఫుట్‌బాల్‌కు ఆధరణ నానాటికి ఇండియాలో పెరుగుతోందని భవిష్యత్‌లో మరింత అభివృద్ధిచెందుతుందన్నారు. శుక్రవారం జంషెడ్ పూర్, ముంబయికి మధ్య జరిగిన హీరో ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ కప్ మ్యాచ్‌ను స్వయంగా తిలకించేందుకు వచ్చిన ఆయన భారత్‌లో ఫుట్‌బాల్ క్రీడకు పెరుగుతున్న క్రేజ్పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌లో ఫుట్‌బాల్ మార్కెట్ మరింత పెరుగుతుందనడంలో తనకు ఏ మాత్రం సందేహం లేదని, చాలా సానుకూల పరిస్థితులు ఇక్కడ ఉన్నాయన్నారు. 'ఫుట్‌బాల్‌కు భారత్ గొప్ప అవకాశ నిలయం అని మేం భావిస్తున్నాం. ఇక్కడ ఎంతో టాలెంట్, ప్యాషన్ ఉన్నవాళ్లున్నారు. భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధిపై మేం చాలా సానుకూలంగా ఉన్నాం. అందుకే మేం ఈ రోజు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ కొన్ని ఐఎస్ఎల్ మ్యాచ్‌లను చూడాలని, ప్రజలను కలుసుకోవాలని క్రీడాకారులను చూడాలని అనుకుంటున్నాం' అని ఆయన అన్నారు. ఫెర్రాన్ మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ కప్ సీఈవో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఆరు ఫుట్‌బాల్ క్లబ్బులు కూడా ఉన్నాయి. -
మైదానం నుంచి పొలాల్లోకి...
భారత ఫుట్‌బాలర్ వినీత్ వ్యవసాయం కన్నూర్ (కేరళ): అంతర్జాతీయ లేదా దేశవాళీ ఆటగాళ్లు సాధారణంగా విరామం లభించగానే కుటుంబ సభ్యులతో సమయం గడపడానికో లేదంటే ఎక్కడైనా విహారానికి వెళ్లేందుకు ఇష్టపడతారు. కానీ భారత ఫుట్‌బాల్ ఆటగాడు సీకే వినీత్ మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. తన స్వస్థలం కన్నూర్ జిల్లా వెంగాడ్లో తండ్రికి సహకరించేందుకు పొలం పనుల్లోకి దిగాడు. ఏదో సరదా కోసం కాకుండా సాధారణ రైతులా పూర్తి సమయం దానికి కేటాయిస్తూ పంట పండించడంపైనే దృష్టి పెట్టాడు. ‘వ్యవసాయం విషయంలో మా ఇంట్లో ఎవరైనా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి. నాన్నకు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది. ఇక్కడ కష్టపడేందుకు వెనుకాడాల్సిన అవసరం లేదు’ అని వినీత్ అన్నాడు. ఐ–లీగ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ తరఫున ఆడి ఆ జట్టు టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్ట్రైకర్/వింగర్ వినీత్ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో గత రెండేళ్లుగా కేరళ బ్లాస్టర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2016 ఐఎస్ఎల్లో కేరళ ఫైనల్ చేరడంలో ఐదు గోల్స్‌తో వినీత్‌దే ముఖ్య భూమిక. -
సమయం.. స్వల్పం–లక్ష్యం..దూరం
వీరవాసరం: స్వచ్ఛభారత్‌లో భాగంగా సంపూర్ణ పారిశుద్ధ్యం, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలే లక్ష్యంగా ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టింది. దీనిలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బహిరంగ మలవిసర్జన నేరంగా పరిగణిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోకుంటే రేషన్, పింఛన్లు వంటి పథకాలు నిలుపుచేస్తామని కూడా చెప్పారు. పెద్ద ఎత్తున నిర్మాణాలకు సన్నాహాలు కూడా చేశారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలు జరగడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం మరో తొమ్మిది రోజుల్లో ముగుస్తుండగా జిల్లాలో 13,757 మరుగుదొడ్లు నిర్మాణానికి నోచుకోలేదు. జిల్లాలో లక్ష్యం 1,73,197 పూర్తయినవి 1,36,611 నిర్మాణంలో ఉన్నవి 23,011 నిర్మాణం చేపట్టనవి 13,757 గడువు 9 రోజులు ఇక తొమ్మిది రోజులే.. 2016–17లో జిల్లావ్యాప్తంగా 1,73,197 వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రభుత్వం పూర్తిచేసింది. వాటిలో 1,36,611 పూర్తి కాగా మరో 23,011 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా 13,575 కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి వెనుకంజ వేస్తున్నాయి. మార్చి 31 నాటికి పూర్తిస్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు మండల స్థాయిల్లో అధికారులు గ్రామాల్లో తిరుగుతూ పర్యవేక్షిస్తున్నారు. అయినా ప్రజల్లో అవగాహన లోపం, చైతన్యలేమి కారణంగా నిర్మాణానికి ముందుకు రావడం లేదు. జిల్లాలో కేవలం భీమడోలు, తణుకు మండలాల్లో మాత్రమే నూరు శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్మాణాలు ఇలా.. మండలం మంజూరైనవి పూర్తయినవి చింతలపూడి 6341 2486 లింగపాలెం 3648 1303 టి.నరసాపురం 3501 1425 కామవరపుకోట 3877 2218 పోడూరు 2975 1636 గోపాలపురం 4117 2340 పోలవరం 4276 3158 కొవ్వూరు 4266 3170 తాడేపల్లిగూడెం 5575 4420 గణపవరం 3739 3283 ఇరగవరం 2600 1869 తాళ్లపూడి 3303 2439 పెరవలి 2859 2210 బుట్టాయగూడెం 4610 3084 మొగల్తూరు 4166 2316 నరసాపురం 4846 3415 పెదవేగి 9376 8084 దేవరపల్లి 4155 2903 పెదపాడు 4475 3293 జంగారెడ్డిగూడెం 2504 1936 జీలుగువిులి్ల 3005 1923 ఆచంట 2871 2479 ఉండ్రాజవరం 2630 2073 అత్తిలి 2287 1856 పెనుమంట్ర 2784 2262 భీమవరం 3077 2022 పెంటపాడు 4439 3979 నిడమర్రు 1750 1632 ఉంగుటూరు 5681 5324 ఏలూరు 4671 4320 కాళ్ల 4216 4076 చాగల్లు 2259 2028 యలమంచిలి 3022 3150 పాలకొల్లు 2095 1809 పాలకోడేరు 4218 4062 దెందులూరు 5069 4660 నల్లజర్ల 7822 7779 వీరవాసరం 2730 2282 పెనుగొండ 2834 2756 కొయ్యల గూడెం 3488 2901 ఆకివీడు 3529 3420 నిడదవోలు 2765 2680 ద్వారకాతిరుమల 2846 2791 ఉండి 3299 3268 భీమడోలు 1745 1745 తణుకు 2356 2346 గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం బహిరంగ మలవిసర్జనరహిత గ్రామాలు చేయడం కోసం అన్ని విధాలా కృషిచేస్తున్నాం. ప్రజల్లో అవగాహన, ప్రేరణ కల్పిస్తున్నాం. అయినా వినకుంటే ఉన్నతాధికారుల ఆదేశాలతో రేషన్, విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నాం. వీరవాసరం మండలంలో 27 మాత్రమే ప్రారంభం కాని వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి. ఈనెల 25 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతో పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు నిర్మించి తీరతాం. – పి.జగదాంబ, ఎంపీడీవో, వీరవాసరం -
మరుగుదొడ్ల నిర్మాణంలో అంబాజీపేట అథమం
అధికారుల తీరుపై మండిపడ్డ కలెక్టర్ నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు అంబాజీపేట (పి.గన్నవరం) : వ్యక్తిగత మరుగుదొడ్ల (ఐఎస్ఎల్) నిర్మాణంలో అంబాజీపేట మండలం జిల్లాలోనే అథమ స్థానంలో ఉందని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని, గంగలకుర్రు అగ్రహారం అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. మండలంలోని 11 గ్రామాల్లో నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని ఎంపీడీఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ హామీ ఇచ్చారన్నారు. అయితే ఇప్పటివరకూ ఏ ఒక్క గ్రామంలో కూడా నూరు శాతం నిర్మాణాలు పూర్తి కాలేదని చెప్పారు. ప్రజాప్రతినిధులకంటే అధికారుల నిర్లక్ష్యమే అధికంగా కనబడుతోందన్నారు. జిల్లాలో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలు 530కి గానూ ఇప్పటికే 270 గ్రామాల్లో నూరు శాతం ఐఎస్ఎల్ నిర్మించామని వివరించారు. ఈ 270 గ్రామాల్లో అంబాజీపేట మండలం నుంచి ఒక్క గ్రామం కూడా లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 830 అంగన్వాడీ కేంద్రాలకు 100 భవనాల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. మార్చి నెలాఖరుకు లక్ష్యం చేరుకుంటామన్నారు. ఈ భవన నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం నుంచి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. ఐఎస్ఎల్ నిర్మించుకున్నవారికి తక్షణమే బిల్లులు మంజూరు చేస్తామన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది బిల్లులు ఆన్లైన్ చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అందువల్లే బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందని వివరించారు. నిర్లక్ష్యంగా పనిచేసే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఐఎస్ఎల్ నిర్మాణాల్లో బాధ్యతారహితంగా వ్యవహరించిన ఎంపీడీఓపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో అందుబాటులో లేరని, కేవలం సెలవు చీటీ టేబుల్‌పై ఉంచి నిర్లక్ష్యంగా వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఉపాధి హామీ పథకం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్ జేఈలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, సర్పంచ్ మట్టపర్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కేరళ బ్లాస్టర్స్‌ను గెలిపించిన బెల్ఫోర్ట్
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ తొలి అంచె మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ జట్టు కేరళ బ్లాస్టర్స్ 1-0తో ఢిల్లీ డైనమోస్‌పై విజయం సాధించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు ప్రేక్షకులు భారీగా ఎగబడ్డారు. సుమార్ 50 వేల మంది ప్రత్యక్షంగా తిలకించిన ఈ మ్యాచ్‌లో కేరళ సొంతగడ్డపై తన జైత్రయాత్రను కొనసాగించింది. హోమ్ గ్రౌండ్లో సచిన్ జట్టుకిది వరుసగా ఆరో విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకై క గోల్‌ను బెల్ఫోర్ట్ 65వ నిమిషంలో సాధించి కేరళకు అద్భుత విజయాన్నందించాడు. తొలి అర్ధభాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు గోల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ఒక్క గోల్ అయిన లేకుండానే ఈ సెషన్ ముగిసింది. అనంతరం రెండో అర్ధభాగంలో బెల్ఫోర్ట్ అందివచ్చిన అవకాశాన్ని గోల్‌గా మలచడంతో కేరళ గెలుపొందింది. -
వినీత్ సూపర్ షో
కొచ్చి: నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసిన వినీత్ (85వ, 89వ నిమిషాల్లో).... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో కేరళ బ్లాస్టర్స్ జట్టుకు నాలుగో విజయాన్ని అందించాడు. చెన్నైరుున్ ఎఫ్‌సీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఆట 22వ నిమిషంలో మెండీ గోల్‌తో చెన్నైరుున్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అరుుతే 67వ నిమిషంలో కాడియో గోల్‌తో కేరళ స్కోరును 1-1తో సమం చేసింది. మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా వినీత్ గోల్‌తో కేరళ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి సెకన్లలో వినీత్ మరో గోల్ చేయడంతో కేరళ విజయం ఖాైయెుమంది. తాజా గెలుపుతో కేరళ 15 పారుుంట్లతో రెండో స్థానానికి చేరుకుంది. -
ఐఎస్ఎల్లో ముంబై మరో విజయం
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ముంబై సిటీ ఎఫ్‌సీ జట్టు తన జోరును కొనసాగిస్తోంది. శనివారం నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో నెగ్గి పారుుంట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రథమార్ధం 45వ నిమిషంలో జాకీచంద్ సింగ్ జట్టుకు ఏకై క గోల్‌ను అందించాడు. ఈ సీజన్లో ముంబైకి ఇది నాలుగో విజయం. -
ముంబై సిటీ ఎఫ్‌సీ విజయం
పుణే: ఐఎస్ఎల్ మూడో సీజన్లో ముంబై సిటీ ఎఫ్‌సీ శుభారంభం చేసింది. సోమవారం తమ తొలి మ్యాచ్‌లో ఎఫ్‌సీ పుణే సిటీపై 1-0తో ముంబై నెగ్గింది. 69వ నిమిషంలో మటియాస్ ఏకైక గోల్ సాధించాడు. పుణేకు ఆరంభంలోనే రెండు ఫ్రీ కిక్ అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. -
గోవా ఎఫ్సీకి రూ.11 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ:ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో భాగంగా గతేడాది డిసెంబర్లో చెన్నైయిన్ ఎఫ్‌సీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం గోవా ఎఫ్‌సీ జట్టు క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించినందుకు రూ. 11 కోట్ల భారీ జరిమానా పడింది. దీంతో పాటు ఆ ఫ్రాంచైజీ యజమానులు దత్తరాజ్ సాల్గాకోర్పై మూడు సంవత్సరాలు, శ్రీనివాస్ డెంపోపై రెండు సంవత్సరాలు నిషేధాన్ని విధించింది. దీనిపై ఐదుగురు సభ్యులతో కూడిన ఐఎస్ఎల్ కమిషన్ సుదీర్ఘంగా విచారించిన అనంతరం గురువారం గోవా ఎఫ్‌సీపై చర్యలకు ఆదేశించింది. ఈ మొత్తంలో రూ. 10 కోట్లను ఫుట్ బాల్ స్పోర్ట్ డెవలప్ మెంట్(ఎఫ్ఎస్డీఎల్) ఇవ్వాలని ఐఎస్ఎల్ కమిషన్ స్పష్టం చేసింది. ఆనాటి తుదిపోరులో గోవా ఎఫ్‌సీ 2-3 తేడాతో చెన్నైయిన్పై ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన వెంటనే ఎఫ్‌సీ గోవా ఆటగాళ్లు, అధికారులు రిఫరీని చుట్టుముట్టి భయాందోళనకు గురి చేశారు. మ్యాచ్ ఫిక్సయిందంటూ నానా హంగామా స్పష్టించారు. మరోవైపు జట్టు యజమాని సాల్గాకోర్ ను చెన్నైయిన్ ఎఫ్‌సీ ఆటగాడు ఎలానో బ్లమర్ దూషించాడంటూ ఆరోపించింది. దీనిలో భాగంగా ఆ మ్యాచ్ అనంతరం అవార్డుల కార్యక్రమాన్ని కూడా గోవా ఎఫ్‌సీ బహిష్కరించింది. -
గోవా ఎఫ్సీకి రూ.50 లక్షల జరిమానా
న్యూఢిల్లీ:ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా గతేడాది డిసెంబర్లో చెన్నైయిన్ ఎఫ్‌సీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించిన గోవా ఎఫ్‌సీ జట్టుకు రూ.50లక్షల జరిమానా విధించారు. ఆనాటి తుదిపోరులో గోవా ఎఫ్‌సీ 2-3 తేడాతో చెన్నైయిన్పై ఓటమి పాలైంది. దీంతో మ్యాచ్ తరువాత నిర్వహించే అవార్డుల కార్యక్రమానికి గోవా జట్టు హజరుకాకుండా బాయ్ కాట్ చేసింది. మరోవైపు ఆ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ ఆరోపణలకు దిగింది. దీంతో ఫుట్ బాల్ క్రమశిక్షణా కమిటీతో సుదీర్ఘంగా చర్చించిన తరువాత ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏఐఎఫ్ఎఫ్ ఆర్టికల్ 53 ప్రకారం ఇలా చేయడం క్రమశిక్షణా ఉల్లంఘన కిందకు రావడంతో గోవా జట్టుకు భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ జరిమానాను 10 రోజుల వ్యవధిలో చెల్లించాలని ఏఐఎఫ్ఎఫ్ స్పష్టం చేసింది. ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే ఎఫ్‌సీ గోవా సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు, అధికారులు ఎక్విప్మెంట్ మేనేజర్ రాజేశ్ మాల్గి ఆధ్వర్యంలో రిఫరీని చుట్టుముట్టి భయాందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే దీనిపై వివరణ ఇవ్వాలని గోవా ఎఫ్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేయడం కూడా నిబంధనలకు వ్యతిరేకం కావడంతో గోవా జట్టుకు జరిమానా విధిస్తూ ఏఐఎఫ్ఎఫ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. -
కొత్త చాంపియన్ ఎవరో?
గోవాతో చెన్నైయిన్ ‘ఢీ’ నేడు ఐఎస్ఎల్-2 ఫైనల్ రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం ఫటోర్డా: దాదాపు 80 రోజులుగా సాగుతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్ ముగింపు దశకు చేరింది. ఎఫ్‌సీ గోవా, చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్ల మధ్య నేడు (ఆదివారం) టైటిల్ పోరు జరుగుతుంది. ఈ రెండు జట్లు ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. దీంతో ఏ జట్టు గెలిచినా ఐఎస్ఎల్లో కొత్త చాంపియన్ అవతరించినట్టే. డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగిన అట్లెటికో డి కోల్‌కతా సెమీస్ వరకు చేరినా సగటు గోల్స్ తేడాతో చెన్నైయిన్ జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఇక సుదీర్ఘంగా సాగిన ఈ లీగ్‌లో ఇప్పటిదాకా 77 రోజుల్లో 60 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 181 గోల్స్ నమోదు కావడం విశేషం. రెండు సీజన్లలో కలిపి గోవా, చెన్నైయిన్ మధ్య నాలుగు మ్యాచ్‌లు జరగ్గా రెండు జట్లూ 2-2తో సమఉజ్జీగా ఉన్నాయి. ఈ సీజన్లోనూ చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో గోవా గెలవగా... గోవాలో జరిగిన మ్యాచ్‌లో చెన్నైయిన్ నెగ్గింది. ఈ నేపథ్యంలో ఈసారైనా తమ సొంత వేదికపై కీలక పోరులో నెగ్గి టైటిల్ సాధించాలనే కసితో గోవా ఉంది. అలాగే క్రితం సారి జోరునే చూపి ఆధిక్యం ప్రదర్శించాలని చెన్నైయిన్ భావిస్తోంది. బలాబలాల పరంగా గమనిస్తే ఈ రెండూ సమ ఉజ్జీలుగానే ఉన్నాయి. గోవా దూకుడును నమ్ముకుంటే చెన్నైయిన్ ఉత్తమ డిఫెన్స్‌ను కలిగి ఉంది. బ్రెజిల్ దిగ్గజం జికో శిక్షణలో రాటు దేలిన గోవా ప్రారంభం నుంచే ఊహించని రీతిలో ఆడి తుది పోరుకు చేరుకుంది. రాఫెల్ కొయెల్హో ఫిట్‌గా ఉండడం వీరికి అదనపు బలం. ఇక రినాల్డో ఇప్పటికే ఏడు గోల్స్‌తో అదరగొట్టడంతో పాటు నాలుగు గోల్స్ చేసేందుకు సహాయపడ్డాడు. అయితే అతను వంద శాతం ఫిట్‌గా లేకపోయినా ఫైనల్లో కొద్దిసేపైనా ఆడతాడని కోచ్ చెబుతున్నారు. మిడ్‌ఫీల్డ్‌లో లియో మౌరా బంతిని తన అదుపులో ఉంచుకోవడంతో పాటు సహచరులకు చక్కటి పాస్‌లు అందిస్తూ ఉపయోగపడుతున్నాడు. ప్రారంభంలో అంతగా ఆకట్టుకోని చెన్నైయిన్ ఎఫ్‌సీ లీగ్ జరుగుతున్న కొద్దీ అనూహ్యంగా పుంజుకుంది. అపౌలా ఈడెల్ రూపంలో వీరికి అత్యుత్తమ గోల్‌కీపర్ ఉన్నాడు. గోవాపై అతను ఆడిన మ్యాచ్‌ల్లో వారికి ఒక్క గోల్ కూడా చేసే అవకాశం ఇవ్వలేదు. వీరి డిఫెండర్లంతా పొడగరులే కావడం కూడా కలిసొచ్చింది. దీంతో ఈ సీజన్లో చెన్నైయిన్ ప్రత్యర్థులకు అతి తక్కువగా 17 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. మెండోజా సూపర్ ఫామ్ ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టనుంది. అయితే మిడ్ ఫీల్డర్ రాఫెల్ ఆగస్టో గాయం జట్టును ఆందోళన పరుస్తోంది. స్టార్ స్ట్రయికర్ ఎలనో ఫామ్ కనబరచడం లేదు. కోచ్ మెటరాజ్జి తమ జట్టు కూర్పును ఎలా రూపొందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఏదిఏమైనా ఈ రెండు జట్ల మధ్య జరిగే ఫైనల్ పోటాపోటీగా సాగి అభిమానులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ధోని, కోహ్లి రాక: నేటి ఫైనల్‌ను వీక్షించేందుకు సెలబ్రిటీలు గోవాకు రానున్నారు. వీరిలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీతో పాటు చెన్నైయిన్ సహ యజమాని, క్రికెటర్ ఎంఎస్ ధోని, గోవా సహ యజమాని, క్రికెటర్ విరాట్ కోహ్లి హాజరై తమ జట్లకు మద్దతునివ్వనున్నారు. అలాగే బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, వరుణ్ ధావన్ కూడా రానున్నారు. -
ఐఎస్ఎల్ ఫైనల్లో చెన్నైయిన్
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో చెన్నైయిన్ ఎఫ్‌సీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రెండో అంచె సెమీస్‌లో అట్లెటికో డి కోల్‌కతా 2-1తో చెన్నైయిన్పై నెగ్గింది. అయితే రెండు సెమీస్‌ల్లో కలిపి చెన్నైయిన్ మొత్తం 4 గోల్స్ చేయగా, కోల్‌కతా రెండింటికి పరిమితమైంది. తొలి అంచె సెమీస్‌లో మూడు గోల్స్ వెనుకబడటం కోల్‌కతా అవకాశాలను బాగా దెబ్బతీసింది. చెన్నైయిన్‌తో జరిగిన రెండో అంచె సెమీస్ మ్యాచ్‌లో ఆరంభం నుంచే ఎదురుదాడి చేసినా ఎక్కువ గోల్స్ చేయడంలో విఫలమైంది. కోల్‌కతా తరఫున డిజాన్ లికిస్ (22వ ని.), హ్యూమ్ (87వ ని.) గోల్స్ చేయగా, ఫిక్రు (90+2వ ని.) చెన్నైయిన్‌కు ఏకైక గోల్ అందించాడు. వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్న కోల్‌కతా మూడో గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా చెన్నైయిన్ డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు. కోల్‌కతా కోచ్ హబాస్ పదేపదే రిఫరీ, లైన్స్మ్యాన్లతో గొడవపడటంతో మ్యాచ్ చివర్లో ఆయన్ని బయటకు పంపించారు. రెండో అర్ధభాగంలో వచ్చిన ఒకటి, రెండు అవకాశాలను చెన్నైయిన్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో చెన్నైయిన్.. గోవా ఎఫ్‌సీతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
ఫైనల్ కు చేరతాం: సౌరవ్ గంగూలీ
కోల్ కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ లో తమ జట్టు ఫైనల్ కు చేరుతుందని ఆశిస్తున్నట్లు అట్లెటికో డి కోల్‌కతా సహయాజమాని సౌరవ్ గంగూలీ తెలిపాడు. గత శనివారం జరిగిన తొలి అంచె సెమీస్ ఫైనల్-2లో కోల్‌కతా 0-3 తేడాతో చెన్నైయిన్ ఎఫ్‌సీపై పరాజయం చూసింది. దీనిపై గంగూలీ స్పందిస్తూ.. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన తాము తిరిగి గాడిలో పడతామని అభిప్రాయపడ్డాడు. రెండో అంచె సెమీఫైనల్-2లో కోల్ కతా 3-0 తేడాతో చెన్నైయన్ ను ఓడిస్తామన్నాడు. 'మాకు ఫైనల్ కు చేరతామనే నమ్మకం ఉంది. తదుపరి మ్యాచ్ లో చెన్నైయన్ ను ఓడిస్తాం. చాలాసార్లు చెన్నైయన్ ఎఫ్ సీపై మాదే పైచేయి. ఈసారి అదే పునరావృతం అవుతుందని ఆశిస్తున్నా. మన శాయశక్తులా కృషి చేస్తే విజయం అదే వస్తుంది. ఒకవేళ ఓడిపోయినా పోరాడి ఓడితేనే ఆటకు అర్థం. ఏం జరుగుతుందో వేచి చూద్దాం 'అని గంగూలీ పేర్కొన్నాడు. ప్రపంచ ఫుట్ బాల్ లో మేటి జట్లైన బ్రెజిల్, జర్మనీ, నెదర్లాండ్స్ లకే ప్రతీసారి వరల్డ్ కప్ రావాలని కోరుకోవడం కూడా అత్యాశే అవుతుందని మరోపక్క గంగూలీ ఛలోక్తులు విసిరాడు. అట్లెటికో డి కోల్‌కతా -చెన్నైయిన్ ఎఫ్సీల మధ్య బుధవారం రెండో అంచె సెమీఫైనల్-2 మ్యాచ్ జరుగనుంది. -
కోల్‌కతాపై చెన్నైయిన్ ఘనవిజయం
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ లీగ్ ఆరంభ మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చెన్నైయిన్ ఎఫ్‌సీ కీలక దశలో సత్తా చూపింది. డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతాతో శనివారం జరిగిన తొలి అంచె రెండో సెమీస్‌లో 3-0తో ఘన విజయం సాధించింది. దీంతో పాటు లీగ్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లు నెగ్గిన తొలి జట్టుగా నిలిచింది. ఐఎస్ఎల్లో కోల్‌కతాపై చెన్నైయిన్ గెలవడం ఇదే తొలిసారి. బ్రూనో పెలిస్సారి (38వ నిమిషంలో), జేజే (57), వాలెన్సియా (68) గోల్స్ సాధించారు. ఈనెల 15న జరిగే రెండో అంచె సెమీఫైనల్లో గోవాతో ఢిల్లీ డైనమోస్ తలపడుతుంది. -
సెమీస్‌లో గోవా ఎఫ్‌సీ
కొచ్చి: రినాల్డో డి క్రుజ్ (29, 50, 61వ నిమిషాల్లో) హ్యాట్రిక్ చేయడంతో... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఎఫ్‌సీ గోవా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గోవా 5-1తో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. ఐఎస్ఎల్ బయటి మ్యాచ్‌ల్లో ఇదే అతి పెద్ద విజయం. రినాల్డో హ్యాట్రిక్‌తో పాటు జోఫ్రి (12వ ని.), దేశాయ్ (64వ ని.)లు గోవా తరఫున గోల్స్ చేశారు. పుల్గా (2వ ని.) కేరళకు ఏకైక గోల్ అందించాడు. రెండో అర్ధభాగంలో కేరళ పది మందితోనే ఆడటం జట్టుపై ప్రభావం చూపింది. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లతో 22 పాయింట్లు సాధించిన గోవా జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. కేరళ 12 పాయింట్లతో చివరి స్థానంలో కొనసాగుతోంది. -
ఢిల్లీ డైనమోస్ విజయం
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్లో వరుసగా మూడు ‘డ్రా’ల అనంతరం ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ ఘనవిజయం సాధించింది. గురువారం ఎఫ్‌సీ పుణే సిటీతో జరిగిన మ్యాచ్‌లో 3-1 తేడాతో నెగ్గింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఢిల్లీ తరఫున నబీ (35వ నిమిషంలో), ఎడతోడికా (40), రీసే (87) గోల్స్ సాధించారు. పుణే నుంచి ఇంజ్యురీ సమయం (90)లో ముటు ఏకైక గోల్ సాధించాడు. నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో ముంబై సిటీ ఎఫ్‌సీ తలపడుతుంది. -
హ్యుమే హ్యాట్రిక్: కోల్‌కతా విజయం
ముంబై: స్టార్ స్ట్రయికర్ ఇయాన్ హ్యుమే హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికోడి కోల్‌కతా ఘనవిజయం సాధించింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్లో భాగంగా ఆదివారం ముంబై సిటీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4-1 తేడాతో నెగ్గింది. 34వ నిమిషంలో హ్యుమే తొలి గోల్‌తో పాటు 45వ నిమిషంలో పెనాల్టీ కిక్‌తో రెండో గోల్ అందించాడు. ఆ తర్వాత 71వ నిమిషంలో ముంబై తరఫున బెనచౌర్ ఏకైక గోల్ సాధించాడు. 77వ నిమిషంలో ఫెర్నాండెజ్ కోల్‌కతా ఆధిక్యం మరింత పెంచగా 82వ నిమిషంలో హ్యుమే హ్యాట్రిక్ గోల్‌తో జట్టుకు తిరుగులేని విజయం దక్కింది. నేడు (సోమవారం) ఐఎస్ఎల్కు విశ్రాంతి దినం. -
గోవా, పుణే మ్యాచ్ డ్రా
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్లో భాగంగా శుక్రవారం ఎఫ్‌సీ గోవా, ఎఫ్‌సీ పుణే సిటీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ప్రథమార్ధంలో ఇరు జట్ల నుంచి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. అయితే ద్వితీయార్దంలో 47వ నిమిషంలో పుణే ఆటగాడు జాన్సన్ సెల్ఫ్ గోల్ చేయడంతో గోవాకు 1-0 ఆధిక్యం దక్కింది. కానీ 64వ నిమిషంలో పుణే ఆటగాడే లింగ్డో చేసిన గోల్‌తో స్కోరు సమమైంది. నేటి మ్యాచ్‌లో కేరళ, చెన్నైయిన్ తలపడతాయి. -
'శక్తివంతంగా భారత ఫుట్ బాల్'
కోల్ కతా: భారత్ లో ఫుట్ బాల్ పూర్వ వైభవం దిశగా పయనిస్తోందని ఢిల్లీ డైనమోస్ స్టార్ స్ట్రయికర్ రాబిన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. భారత్ లో ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ప్రవేశపెట్టిన అనంతరం దేశ ఫుట్ బాల్ కు మంచి రోజులు వచ్చాయన్నాడు. భారత్ లో ఫుట్ బాల్ కు రోజు రోజుకూ ఆదరణ పెరగడానికి ఐఎస్ఎల్ ఎంతగానో ఉపయోగపడిందన్నాడు. రానున్న రోజుల్లో భారత్ ఫుట్ బాల్ మరింత శక్తివంతంగా రూపాంతరం చెందుతుందన్నాడు. ఢిల్లీ జట్టుకు ఆటగాడిగా, కోచ్ గా సేవలందిస్తున్న బ్రెజిల్ స్టార్ రాబర్టో కార్లోస్ పై రాబిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ మేటి ఆటగాడితో కలిసి పని చేయడం చాలా ఆహ్లాదంగా ఉందన్నాడు. అతని నేతృత్వంలో పని చేయడంతో యూరోపియన్ ఫుట్ బాల్ గురించి అనేక విషయాలను తెలుసుకునే ఆస్కారం భారత ఆటగాళ్లకు దక్కుతుందన్నాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టలో అనేక మంది కీలక ఆటగాళ్లతో నిండివుందని రాబిన్ పేర్కొన్నాడు. తొలి ఐఎస్ఎల్ సీజన్ కు దూరంగా ఉన్న రాబిన్.. రెండో ఎడిషన్ లో ఢిల్లీ డైనోమోస్ తరపున బరిలోకి దిగాడు. ఇప్పటి వరకూ ఐదు గేమ్ లు ఆడిన రాబిన్ కేవలం ఒక గోల్ మాత్రమే నమోదు చేశాడు. -
కోల్‌కతాకు మళ్లీ షాక్
న్యూఢిల్లీ: డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా జట్టుకు మళ్లీ చుక్కెదురైంది. ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్ఎల్)లో భాగంగా నార్త్ఈస్ట్ యునెటైడ్ జట్టుతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 0-1 గోల్ తేడాతో ఓడిపోయింది. ఆట 77వ నిమిషంలో వెలెజ్ చేసిన గోల్‌తో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లిన నార్త్ఈస్ట్ జట్టు చివరి నిమిషం వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తమ ఖాతాలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. గత శనివారం పుణే సిటీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లోనూ కోల్‌కతా 0-1తో ఓడింది. గురువారం జరిగిన మరో మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీ 2-1తో కేరళ బ్లాస్టర్స్‌ను ఓడించింది. శనివారం జరిగే మ్యాచ్‌లో చెన్నైయిన్ ఎఫ్‌సీతో పుణే జట్టు ఆడుతుంది. -
పుణేకు మరో విజయం
పుణే: ఐఎస్ఎల్ రెండో సీజన్లో ఎఫ్‌సీ పుణే సిటీ జట్టు వరుస విజయాలతో దూసుకెళుతోంది. శుక్రవారం నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో నెగ్గింది. దీంతో ఆరు పాయింట్లతో ప్రస్తుతం టాప్‌లో నిలిచింది. ద్వితీయార్ధం 78వ నిమిషంలో నార్త్ఈస్ట్ డిఫెండర్ జోమింగ్లియానా రాల్టే సెల్ఫ్ గోల్ చేయడంతో పుణే గట్టెక్కింది. మరోవైపు నార్త్ఈస్ట్కిది రెండో పరాజయం. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో పలు అవకాశాలు దక్కినా పుణే సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక చివర్లో రాల్టే తప్పిదంతో జట్టు కొంప ముంచాడు. -
ముంబైపై పుణే సిటీ గెలుపు
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రెండో సీజన్లో సొంత గడ్డపై ఎఫ్‌సీ పుణే సిటీ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 3-1 తేడాతో ముంబై సిటీ ఎఫ్‌సీపై ఘనవిజయం సాధించింది. టంకే సాన్లీ (12, 56వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో అదరగొట్టగా గురుంగ్ (68వ ని.) ఓ గోల్ చేశాడు. ముంబై తరఫున పికియాన్ ఏకైక గోల్ సాధించాడు. మంగళవారం జరిగే మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ ఆడుతుంది. -
దుబాయ్ లో ఎఫ్ సీ గోవా కసరత్తు
మరి కొద్ది రోజుల్లో రెండో సీజన్ ప్రారంభం కానుండటంతో ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంఛైజీ లన్నీ విదేశీ ఆటగాళ్ల వేటలో పడ్డాయి. కొత్త ఒప్పందాలతో బిజీగా ఉన్నాయి. లేటెస్ట్ గా ఎఫ్ సీ గోవా స్ట్రైకర్ డెరిల్ డఫ్పీ తో ఒప్నందం కుదుర్చుకుంది. తమ టీమ్ లో ఖాళీగా ఉన్న ఇంటర్నేషనల్ ప్లేయర్, అడిషనల్ ప్లేయర్ స్థానాల కోసం రెండు డీల్స్ కుదుర్చుకుందని మేనేజ్ మెంట్ మీడియాకు తెలిపింది. ఇదిలా ఉంటే డఫ్పీ కేవలం ఐసీఎల్ సీజన్ లో మాత్రమే అందుబాటులో ఉంటాడు. సీజన్ ముగిసిన వెంటనే స్వంత క్లబ్ కు తిరిగి వెళ్లనున్నాడని తెలుస్తోంది. మరో వైపు గోవా తమ టీమ్ లోని ఎనిమిది మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కోటా పూర్తి కావడంతో.. అడిషనల్ ప్లేయర్ కోటాలో పూనే డిఫెండర్ లూసియానో సబ్రోసాను తెచ్చుకుంది. ఆటగాళ్ల ఎంపిక పూర్తి కావడంతో ఎఫ్ సీ గోవా టీమ్ ప్రీ సెషన్ ట్రైనింగ్ కోసం ఇవాళ దుబాయ్ బయల్దేరి వెళ్లనుంది. -
ఢిల్లీ డైనమోస్ కు స్పానిష్ గోల్ కీపర్
అక్టోబర్ 2న ప్రారంభం కానున్న రెండో సీజన్ కోసం ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ఫ్రాంచైజీ ఢిల్లీ డైనమోస్ ఎఫ్ సీ స్పానిష్ గోల్ కీపర్ టోనీ బోడ్లాస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. టోనీ రియల్ బెటీస్ తరఫున 95 మ్యాచ్ లు ఆడాడని... అతని రాక టీమ్ కు ఎంతో ఉపయోగపడుతుందని ఫ్రాంచైజీ అభిప్రాయపడింది. ఢిల్లీ డైనమోస్ తో ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని టోనీ తెలిపాడు. ఈ సీజన్ లో తన టీమ్ టైటిట్ గెలిచేందుకు కృషి చేస్తానని అన్నాడు. -
ఐఎస్ఎల్ వేలంలో టాప్ 10 ఆటగాళ్లు వీరే..
ముంబై : ఇండియన్ సూపర్ లీగ్ - 2015 నిర్వహణ కోసం ఆయా ఫ్రాంచైజీలు భారీ ధరను చెల్లించి ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. శుక్రవారం జరిగిన ఈ వేలంలో ఇద్దరు ఆటగాళ్లు మాత్రం కోటి రూపాయలకు పైగా ధర పలికారు. ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంచైజీ జట్ల యజమానులు పాల్గొని తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నారు. అత్యంత ఖరీదైన 10 మంది ఆటగాళ్ల వివరాలిలా ఉన్నాయి... ఆటగాడు క్లబ్(జట్టు) ఫ్రాంచైజీ ధర సునీల్ చైత్రి ముంబై రూ.1.20 కోట్లు యూగెన్సన్ లింగ్డో పూణే రూ.1.05 కోట్లు రినో ఆంటో కోల్‌కతా రూ. 90 లక్షలు తోయ్ సింగ్ చెన్నై రూ. 86 లక్షలు అరాటా ఇజుమి కోల్‌కతా రూ. 68 లక్షలు కరణ్‌జీత్ సింగ్ చెన్నై రూ. 60 లక్షలు సేత్యసేన్ సింగ్ నార్త్ ఈస్ట్ రూ. 56 లక్షలు రాబిన్ సింగ్ ఢిల్లీ రూ. 51 లక్షలు జాకీచంద్ సింగ్ పూణె రూ. 45 లక్షలు అనాస్ ఎడతోడిక ఢిల్లీ రూ. 41 లక్షలు -
ఐఎస్ఎల్ వేలానికి చెత్రి
ముంబై : భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ చెత్రితో పాటు మరో తొమ్మిది మంది ఆటగాళ్లు.. ఐఎస్ఎల్ వేలానికి అందుబాటులో ఉండనున్నారు. జూలై 10న ఈ వేలం జరగనుంది. చెత్రి కనీస విలువ రూ. 80 లక్షలు కాగా గోల్ కీపర్ కరణ్‌జీత్ సింగ్ కనీస ధర రూ. 60 లక్షలు. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఈ వేలంలో ఆటగాళ్ల కోసం పోటీ పడనున్నాయి. గతేడాది ఐ-లీగ్ క్లబ్స్‌తో ఉన్న వ్యక్తిగత ఒప్పందం మేరకు చెత్రి వేలానికి అందుబాటులో ఉండలేదు. అయితే ఈసారి వేలంపై ఈ యువ స్ట్రయికర్ ఆసక్తి కనబరుస్తున్నాడు. రాబిన్ సింగ్, ఆర్తజా ఇజుమి, అనాస్‌లు రూ. 40 లక్షల బేస్ ప్రైస్‌తో; తోయ్ సింగ్ రూ. 39 లక్షలు, ఎగున్సెన్ లింగ్డో రూ. 27.50 లక్షల కనీస ధరతో వేలానికి వస్తున్నారు. -
పుణే ఆశలు సజీవం
2-0తో ముంబైపై గెలుపు ఐఎస్ఎల్ పుణే: నాకౌట్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ పుణే సిటీ సత్తా చాటింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 2-0తో ముంబై సిటీ ఎఫ్‌సీపై విజయం సాధించింది. పుణే తరఫున డుడు (66, 80వ ని.) రెండు గోల్స్ చేశాడు. 66వ నిమిషంలో లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి కట్సొరనిస్ ఇచ్చిన పాస్‌ను డుడు డ్రిల్ చేసుకుంటూ వెళ్లి గోల్‌పోస్ట్‌లోకి నెట్టాడు. 80వ నిమిషంలో మరోసారి కట్సొరనిస్ బంతిని డ్రిల్ చేస్తూ వెళ్లాడు. అప్పటికే గోల్ పోస్ట్ దగ్గర ఉన్న డుడు పాస్‌ను అందుకుని నెట్లోకి పంపి ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. ప్రస్తుతం పుణే 16 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి చేరగా... ముంబై 12 పాయింట్లతో అట్టడుగున కొనసాగుతోంది. -
పుణే, కోల్‌కతా మ్యాచ్ డ్రా
పుణే: ఐఎస్ఎల్లో ఎఫ్‌సీ పుణే సిటీ, అట్లెటికో డి కోల్‌కతా జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో పుణే నాకౌట్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. 17 పాయింట్లతో కోల్‌కతా రెండో స్థానంలో ఉండగా, 13 పాయింట్లతో పుణే ఏడో స్థానంలో కొనసాగుతోంది. 11వ నిమిషంలోనే కోల్‌కతా తరఫున పోడి అద్భుత రీతిలో హెడర్ గోల్ సాధించి జట్టును ఆధిక్యంలో ఉంచాడు. ఆ తర్వాత ప్రథమార్ధం చివర 45వ నిమిషంలో కట్సౌరనీస్ గోల్‌తో పుణే స్కోరును సమం చేసింది. ద్వితీయార్ధంలో ఇరు జట్లుపేలవ ఆటతీరును ప్రదర్శించడంతో గోల్స్ నమోదు కాలేదు. కొచ్చిలో ఆదివారం జరిగే మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌తో చెన్నైయిన్ జట్టు తలపడుతుంది. -
దుమ్ము రేపిన ఢిల్లీ
4-1తో ముంబైపై గెలుపు న్యూఢిల్లీ: ఐఎస్ఎల్లో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ జట్టు సత్తా చూపింది. శుక్రవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ముంబై సిటీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ 4-1 తేడాతో నెగ్గింది. మ్యాచ్ ప్రథమార్ధం ముగుస్తుందనగా 44వ నిమిషంలో ఢిల్లీ తరఫున ముల్డర్ గోల్ చేశాడు. ఆ తర్వాత 50వ నిమిషంలో జుంకర్, 60వ నిమిషంలో డాస్ సాంటోస్ గోల్స్‌తో జట్టు 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 86వ నిమిషంలో ముంబైకి అభిషేక్ గోల్‌తో ఓదార్పు దక్కింది. కానీ 90వ నిమిషంలో మనీష్ గోల్‌తో ముంబై దారుణ పరాజయం పాలైంది. ఢిల్లీ ప్రస్తుతం 13 పాయింట్లతో ఐదో స్థానానికి చేరింది. ముంబై 12 పాయింట్లతో అట్టడుగున ఉంది. -
చెన్నైయిన్, నార్త్ఈస్ట్ మ్యాచ్ డ్రా
చెన్నై: హోరాహోరీ పోరులో చెన్నైయిన్ ఎఫ్‌సీ, నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ జట్లు సమ ఉజ్జీగా నిలిచాయి. ఐఎస్ఎల్లో భాగంగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. చెన్నైయిన్ తరఫున రెండు గోల్స్‌ను స్టార్ ఆటగాడు ఎలనో (25, 78వ నిమిషాల్లో) సాధించగా... నార్త్ఈస్ట్ తరఫున లెన్ (38వ ని.), కోకే (85వ ని.) గోల్ చేశాడు. ఈ ప్రదర్శనతో ఐఎస్ఎల్లో మొత్తం 9 గోల్స్‌తో ఎలనో టాప్‌లో ఉన్నాడు. చెన్నైయిన్ 11 పాయింట్లతో రెండో స్థానంలో, నార్త్ఈస్ట్ 9 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. -
కోల్ కతా ఫ్రాంచైజీని కొనుగోలు చేయాలనుకున్నా:షారుక్
కోల్ కతా: ఐపీఎల్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అసంతృప్తిగా ఉన్నాడు. అదేదో సినిమా గురించి కాదండోయ్. ఐఎస్ఎల్ సాకర్ టీం లో కోల్ కతా జట్టను కొనుగోలు చేయలేనందుకు తెగ బాధపడితున్నాడు. వేరే నగరాల నుంచి ఆఫర్లు వచ్చినా.. కోల్ కతాను మాత్రమే తాను కొనుగోలు చేయాలనుకున్నాడట. దీనిపై షారుక్ ఆవేదన వ్యక్తం చేశాడు. 'కోల్ కతా ఫ్రాంచైజీని కొనుగోలు చేయలేకపోవడం నిజంగా దురదృష్టం. ఐఎస్ఎల్ లో ఉండాలనుకున్నా. అది కూడా కోల్ కతా జట్టునే కొనుగోలు చేయాలనుకున్నా. కోల్ కతా ను కొనుగోలు చేయలేనప్పడు వేరే జట్టు అనవసరం అనుకున్నా' అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ లో కోల్ కతా ప్రాంఛైజీని మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ, హర్షవర్ధన్ నియోతియా, సంజీవ్ గోయంక తదితరులు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
అట్లెటికో డి కోల్‌కతా శుభారంభం
ముంబై సిటీ ఎఫ్‌సీపై 3-0తో విజయం కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తొలి మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కతా సత్తా చూపింది. ఫుట్‌బాల్‌ను విపరీతంగా అభిమానించే స్థానిక ప్రేక్షకుల మద్దతుతో చెలరేగిన ఈ జట్టు ఆదివారం వివేకానంద యువభారతి క్రిరంగన్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 3-0తో ముంబై సిటీ ఎఫ్‌సీని చిత్తు చేసింది. మ్యాచ్ కోసం స్టేడియంలో తొలిసారిగా 17 భారీ స్క్రీన్లను అమర్చారు. స్పెయిన్‌లో శిక్షణ పొందిన కోల్‌కత ఆటగాళ్లు ఆరంభం నుంచే ముంబైపై దాడులకు దిగారు. వీరి దూకుడును అరికట్టడంలో రణబీర్ కపూర్ జట్టు ఘోరంగా విఫలమైంది. 27వ నిమిషంలో ఇథియోపియా స్ట్రయికర్ ఫిక్రూ టెఫెరా కోల్‌కతాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఫిక్రూ షాట్‌ను అడ్డుకునేందుకు ముంబై గోల్‌కీపర్ సుబ్రతా పాల్ పోస్టును వదిలి ముందుకువచ్చినా ఫలితం లేకపోయింది. ద్వితీయార్ధం 69వ నిమిషంలో బోర్జా ఫెర్నాండెజ్ (స్పెయిన్) చేసిన సూపర్ గోల్‌తో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ ఎక్స్ట్రా సమయం (90+3)లో ఫిక్రూ ఇచ్చిన పాస్‌ను సబ్‌స్టిట్యూట్ ఆర్నల్ లిబర్ట్ గోల్ చేయడంతో జట్టు 3-0తో తిరుగులేని ఆధిక్యంతో నెగ్గింది. -
ఫుట్‌బాట్ క్రీడకు మంచి రోజులు: మమత
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)తో భారత్ లో ఫుట్‌బాట్ క్రీడకు మంచిరోజులు వస్తాయన్న ఆశాభావాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యక్తం చేశారు. ఐఎస్ఎల్ తో ప్రపంచపటంలోని అగ్రశేణి జట్ల సరసన భారత్ ఫుట్‌బాల్ జట్టు చోటు సంపాదిస్తుందన్న విశ్వాసం ఆమె ప్రకటించారు. ఐఎస్ఎల్ తో భారతదేశంలో ఫుట్‌బాల్ క్రీడకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ మెగా టోర్నమెంట్ లో పలువురు అంతర్జాతీయ ఆటగాళ్లు ఆడుతుడడం వల్ల కచ్చితంగా మనకు మంచి జరుగుతుందన్నారు. ఐఎస్ఎల్ ప్రారంభోత్సవంలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను ఆమె అభినందించారు. -
'ప్రేమతో చెబుతున్నా.. విజయం మాదే'
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) విజయవంతం కావడం భారత ఫుట్ బాల్ కు ఎంతో అవసరమని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం అభిప్రాయపడ్డారు.నార్త్ ఈస్ యునైటెడ్ ఫుట్ బాల్ యజమాని అయిన జాన్ మాట్లాడుతూ..'మాకు గొప్ప మద్దతు ఉంది. మా జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు.అయితే ఒక్కటి మాత్రం నిజం. మేము గట్టి పోటీని ఎదుర్కొవాల్సి ఉంది' అని తెలిపారు. ప్రేమతో చెబుతున్నా.. విజయం మాత్రం మాదే అని స్పష్టం చేశాడు. రేపు జరుగనున్న ఐసీఎల్ పోరులో తమ జట్టు కేరళ బ్లాస్టర్స్ తో తలపడనుందన్నారు. . అక్టోబరు 12 నుంచి డిసెంబరు 20 వరకు ఐఎస్ఎల్ లో పలువురు ప్రముఖ క్రికెటర్లు భాగస్వామ్యం అయ్యారు. కేరళ జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్, గోవా జట్టులో విరాట్ కోహ్లి, కోల్‌కతా జట్టులో గంగూలీ, చెన్నై జట్టులో వాటాలు కొనుగోలు చేసి సహ యజమానులుగా ఉన్నారు. -
ఐఎస్ఎల్లో ధోని కూడా...
చెన్నై జట్టులో వాటా కొన్న భారత క్రికెట్ కెప్టెన్ ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్‌లోకి మరో స్టార్ క్రికెటర్ వచ్చాడు. భారత కెప్టెన్ ధోని చెన్నైయన్ ఎఫ్‌సీ జట్టులో వాటా కొనుగోలు చేశాడు. ఈ జట్టుకు యజమాని బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్. ‘చెన్నైయన్ ఎఫ్‌సీలో సహ యజమానిగా ధోని ఒప్పందంపై సంతకం చేశాడు’ అని లీగ్ నిర్వహణ సంస్థ ఐఎంజీ-రిలయన్స్‌కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే కేరళ జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్, గోవా జట్టులో విరాట్ కోహ్లి, కోల్‌కతా జట్టులో గంగూలీ వాటాలు కొనుగోలు చేసి సహ యజమానులుగా ఉన్నారు. తాజాగా ధోని చేరికతో ఈ ఫుట్‌బాల్ లీగ్‌కు క్రికెట్ గ్లామర్ మరింత పెరిగింది. అక్టోబరు 12 నుంచి డిసెంబరు 20 వరకు ఐఎస్ఎల్ జరుగుతుంది. -
చెన్నై జట్టులో వాటా కొన్న భారత క్రికెట్ కెప్టెన్
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్‌లోకి మరో స్టార్ క్రికెటర్ వచ్చాడు. భారత కెప్టెన్ ధోని చెన్నైయన్ ఎఫ్‌సీ జట్టులో వాటా కొనుగోలు చేశాడు. ఈ జట్టుకు యజమాని బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్. ‘చెన్నైయన్ ఎఫ్‌సీలో సహ యజమానిగా ధోని ఒప్పందంపై సంతకం చేశాడు’ అని లీగ్ నిర్వాహణ సంస్థ ఐఎంజీ-రిలయన్స్‌కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే కేరళ జట్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్, గోవా జట్టులో విరాట్ కోహ్లి, కోల్‌కతా జట్టులో గంగూలీ వాటాలు కొనుగోలు చేసి సహ యజమానులుగా ఉన్నారు. తాజాగా ధోని చేరికతో ఈ ఫుట్‌బాల్ లీగ్‌కు క్రికెట్ గ్లామర్ మరింత పెరిగింది. అక్టోబరు 12 నుంచి డిసెంబరు 20 వరకు ఐఎస్ఎల్ జరుగునుంది. -
ఇద్దరికే అత్యధికం
►సచిన్ జట్టులో భారత సంతతి ఫుట్‌బాలర్ ►49 మందితో విదేశీ ఆటగాళ్ల డ్రాఫ్ట్ ►ఇండియన్ సూపర్ లీగ్ ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్‌లో గురువారం జరిగిన విదేశీ ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో ఇద్దరికే అత్యధిక ధర పలికింది. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ మెండీ, జార్జి ఆర్నోలిన్లకు అత్యధికంగా 80 వేల డాలర్లు (రూ. 48 లక్షల 55 వేలు) దక్కాయి. మెండీని చెన్నై జట్టు, జార్జిని గోవా జట్టు తీసుకున్నాయి. ఐఎస్ఎల్లో ఆడబోతున్న మొత్తం 56 మంది విదేశీ ఆటగాళ్లకు గాను 49 మందిని డ్రాఫ్ట్‌లో ఉంచారు. మిగతా ఏడుగురు నాలుగు ఫ్రాంచైజీలతో నేరుగా ఒప్పందాలు చేసుకున్నారు. జుంకర్, మోర్టాన్ స్కోబో (ఢిల్లీ), బెలార్డీ, సిరిలో (పుణే), చాన్సా, గ్లెన్ (నార్త్ఈస్ట్ ఎఫ్‌సీ), బోర్జా ఫెర్నాండేజ్ (కోల్‌కతా)లు ఇందులో ఉన్నారు. ఏడు రౌండ్ల పాటు జరిగిన ఈ డ్రాఫ్ట్‌లో 8 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫ్రాంచైజీ ‘కేరళ బ్లాస్టర్స్’... భారత సంతతికి చెందిన ఇంగ్లిష్ ఫుట్‌బాలర్ మైకేల్ చోప్రాను 58,185 డాలర్లకు (రూ. 35 లక్షల 31 వేలు) కొనుగోలు చేసింది. స్పెయిన్ ఫుట్‌బాలర్ గోంజాలెజ్‌కు 70 వేల డాలర్ల (రూ. 42 లక్షల 48 వేలు)తో రెండో అత్యధిక ధర పలికింది. కోల్‌కతా ఫ్రాంచైజీ ఇతన్ని తీసుకుంది. ఓవరాల్‌గా డ్రాఫ్ట్‌లో ఉన్న 34 మందికి ఒక్కొక్కరికి 58,185 డాలర్లు దక్కనున్నాయి. మరో 12 మందికి ఒక్కోకరికి 38,790 డాలర్లు (రూ. 23 లక్షల 54 వేలు) చెల్లించనున్నారు. ఈ టోర్నీ అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనుంది. షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. స్పెయిన్ నుంచి 9 మంది అత్యధికంగా స్పెయిన్ నుంచి 9 మంది ఆటగాళ్లను ఐఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో ఉంచారు. ఫ్రాన్స్ (8), చెక్ రిపబ్లిక్ (8), బ్రెజిల్ (5), పోర్చుగల్ (5), కొలంబియా (4), దక్షిణ కొరియా (2) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అర్జెంటీనా, కెనడా, సెర్బియా, సెనెగల్, బుర్కినా ఫాసో, ఇంగ్లండ్, గ్రీస్, కామెరూన్ల నుంచి ఒక్కొక్కరు డ్రాఫ్ట్‌లో ఉన్నారు. బెంగళూరు స్థానంలో చెన్నై ఫ్రాంచైజీ ఐఎస్ఎల్ నుంచి తప్పుకున్న బెంగళూరు స్థానంలో చెన్నై ఫ్రాంచైజీని తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విదేశీ ఆటగాళ్ల డ్రాఫ్ట్‌కు ముందు ఈ అంశాన్ని టోర్నీ సీఈఓ అనుపమ్ దత్తా ప్రకటించారు. అయితే చెన్నై ఫ్రాంచైజీ యజమానులు ఎవరనేది వెల్లడించలేదు. డ్రాఫ్ట్‌లో ఆ ఫ్రాంచైజీ తరఫున ప్రశాంత్ అగర్వాల్ అనే వ్యక్తి పాల్గొన్నారు. -
ఐఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో 49 మంది విదేశీ ఆటగాళ్లు
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) నిర్వాహకులు అంతర్జాతీయ ఆటగాళ్ల డ్రాఫ్ట్‌కు 49 మందితో జాబితా విడుదల చేశారు. స్పెయిన్, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, బ్రెజిల్, పోర్చుగల్, కొలంబియా, దక్షిణ కొరియా, అర్జెంటీనా, కెనడా, సెర్బియాలకు చెందిన ఈ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వచ్చే వారం జరిగే డ్రాఫ్ట్‌లో సొంతం చేసుకుంటాయి. మొత్తంగా 56 మంది విదేశీ ఆటగాళ్లుండగా ఏడుగురితో ఇప్పటికే నాలుగు క్లబ్‌లు నేరుగా ఒప్పందాలు చేసుకున్నాయి. -
కేంద్ర ప్రభుత్వ పథకాలపై సర్వే
భోగాపురం : కేంద్ర ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయూ లేదా అన్న అంశంపై కేంద్ర మానిటరింగ్ కమిటీ (జాతీయ పర్యవేక్షణ కమిటీ సభ్యులు) సభ్యులు శనివారం ముంజేరు గ్రామంలో సర్వే నిర్వహించారు. గ్రామానికి సమీపంలో ఉన్న ఉపాధి పనులను పరిశీలించి, వేతనదారులకు రో జుకు ఎంత వేతనం వస్తున్నది అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే పూర్తిస్థాయిలో పనులు కల్పిస్తున్నారా లేదా అన్న విషయూన్ని కూడా ఆరా తీశా రు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్యం, ఐఎస్ఎల్ మరుగుదొడ్లు వినియోగంపై పరిశీలించి, పంచాయతీ కార్యాల యంలో హౌసింగ్, ఉపాధి, ఐకేపీ అధికారులతో సమావేశమయ్యారు. గ్రామంలో వృద్ధాప్య, వికలాంగ, విం తంతు పింఛన్లు అందుకుంటున్న వారితో మాట్లాడారు. వారు ఎన్ని ఏళ్ల నుంచి పింఛన్లు అందుకుంటున్నారో అడిగి రికార్డులు పరిశీలించారు. అయితే చాలామంది వారికి ఇస్తున్న రూ. 200 పింఛన్ చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కమిటీ సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ... జిల్లాలో అన్ని మండలాల్లో నాలుగు పంచాయతీల చొప్పున పరిశీలన చేస్తున్నామన్నారు. భోగాపురం మండలంలో ద ల్లిపేట, కవులవా డ, లింగాలవలసతో పాటు ముంజేరులో నాలుగు రోజు లుగా సర్వే నిర్వహించినట్టు తెలిపారు.మండలంలో ప్ర జలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, వారికి అదనంగా అందించాల్సిన సంక్షేమ పథకాలు వంటి వాటిపై నివేదిక అందజేయనున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమం లో అడిషనల్ ప్రాజెక్టు అధికారి ఎస్. అప్పలనాయుడు, డీఆర్డీఏ ఏపీడీ వి.డి.ఆర్ ప్రసాద్, భోగాపురం క్లస్టర్ ఏపీడీ సత్యనారాయణ, డిప్యూటీ ఎస్ఓ కె.వి రామారా వు, ఇన్చార్జి ఎంఈఓ ఎన్.సుజాత, ఉపాధి ఏపీఓ కనకరాజు, తదితరులు పాల్గొన్నారు. -
కొచ్చి ఫ్రాంచైజీ దక్కించుకున్న సచిన్
ముంబై: క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ... ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్(ఐఎస్ఎల్)లో ఫ్రాంచైజీలు దక్కించుకున్నారు. పీవీపీ వెంచర్స్‌తో కలిసి కొచ్చి జట్టును సచిన్ కొనుగోలు చేశాడు. స్పెయిన్ లీగ్ దిగ్గజం అట్లెటికొ మాడ్రిడ్, వ్యాపారవేత్తలు హర్షవర్థన్ నియోటియా, సంజీవ్ గోయంకా కలిసి కన్సర్టియంగా ఏర్పడిన గంగూలీ.. కోల్‌కతా ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, రణ్‌బీర్ కపూర్ కూడా ఐఎస్ఎల్ ఫ్రాంచైజీలు దక్కించుకున్నారు. పుణే జట్టును సల్మాన్ ఖాన్, గువాహటి టీమ్‌ను జాన్ అబ్రహం, ముంబై ఫ్రాంచైజీని రణ్‌బీర్ కపూర్ వేలంలో దక్కించుకున్నారు. ఢిల్లీ జట్టును సమీర్ మాంచంద, బెంగళూరు టీమ్‌ను సన్ గ్రూపు, గోవా జట్టును వేణుగోపాల్ దూత్ కన్సర్టియం దక్కించుకున్నాయి. సెప్టెంబర్-నవంబర్‌లో ఐఎస్ఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.