పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్‌లో సొంత గడ్డపై ఎఫ్‌సీ పుణే సిటీ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 3-1 తేడాతో ముంబై సిటీ ఎఫ్‌సీపై ఘనవిజయం సాధించింది. టంకే సాన్లీ (12, 56వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో అదరగొట్టగా గురుంగ్ (68వ ని.) ఓ గోల్ చేశాడు. ముంబై తరఫున పికియాన్ ఏకైక గోల్ సాధించాడు. మంగళవారం జరిగే మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ ఆడుతుంది.