ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. జంషెడ్‌పూర్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 1–0 గోల్‌తో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది.
ఆట 48వ నిమిషంలో మొహమ్మద్ యాసిర్ సాధించిన గోల్‌తో హైదరాబాద్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment