football club
-
వారానికి రూ. 5 కోట్లు.. జాక్‌పాట్ కాదు! అంతకు మించి..
నార్వే ఫుట్‌బాల్ స్టార్ ఎర్లింగ్ హాలాండ్(Erling Haaland) జాక్‌పాట్ కొట్టేశాడు. ఊహకందని రీతిలో వారానికి రూ. 5 కోట్ల చొప్పున సంపాదించనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ సిటీ(Manchester City) ఫుట్‌బాల్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా 2000 సంవత్సరంలో జన్మించిన హాలాండ్ నార్వే జాతీయ జట్టు తరఫున ఫుట్‌బాల్ ఆడుతున్నాడు.రెండుసార్లు ‘గోల్డెన్ బూట్’ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో జరిగే ప్రీమియర్ లీగ్(Premier League)లో అడుగుపెట్టిన హాలాండ్.. అరంగేట్రంలోనే రికార్డులు బద్దలుకొట్టాడు. తొలి సీజన్లోనే 36 గోల్స్‌తో దుమ్ములేపాడు ఈ స్ట్రైకర్. ఇక గత సీజన్లో మాంచెస్టర్ తరఫున 27 గోల్స్ కొట్టిన అతడు.. రెండుసార్లు ‘గోల్డెన్ బూట్’ గెలిచాడు.కానీ ఈ దఫా 16 గోల్స్‌తో సరిపెట్టాడు. ఇక గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. అతడు మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఇంకో రెండేళ్లు మాత్రమే కొనసాగాల్సి ఉంది. కానీ తాజాగా ఈ డీల్‌ను పొడగిస్తూ మాంచెస్టర్ సిటీ నిర్ణయం తీసుకుంది. తొమ్మిదిన్నరేళ్ల పాటు హాలాండ్‌ను కొనసాగించనుంది.కళ్లు చెదిరే మొత్తంప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఇది సుదీర్ఘకాలం పాటు సాగే ఒప్పందం. అంతేకాదు.. ఈ డీల్ ద్వారా హాలాండ్ వారానికి ఐదు లక్షల పౌండ్లు(భారత కరెన్సీలో దాదాపు ఐదున్నర కోట్లకు పైగా) ఆర్జించనున్నాడట. ఈ నేపథ్యంలో హాలాండ్ స్పందిస్తూ.. ‘‘నేను చాలా చాలా సంతోషంగా.. గర్వంగా ఉన్నాను. సిటీ క్లబ్‌తో సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ ఒప్పందం గురించి సులువుగానే నిర్ణయానికి వచ్చేశాను.ఇక ఆటపై నేను మరింత దృష్టి పెట్టగలను. ఒకే జట్టుతో ఎక్కువకాలం కలిసి ప్రయాణించడం సానుకూల ఫలితాలను ఇస్తుంది’’ అని పేర్కొన్నాడు. ఇక మాంచెస్టర్ సిటీ టీమ్ మేనేజర్(కోచ్) జోసెప్ గ్వార్డియోలా సలాతో కలిసి మరికొంతకాలం పనిచేయడం ద్వారా తన నైపుణ్యాలు మరింత మెరుగుపరచుకోవచ్చని హాలాండ్ హర్షం వ్యక్తం చేశాడు.అలాంటి వ్యక్తిని చూడలేదు‘‘నేను ఇప్పటికే చాలా మెరుగయ్యాను. అతడితో కలిసి పనిచేయడం చాలా బాగుంటుంది. అతడు కేవలం అత్యుత్తమ వ్యక్తి మాత్రమే కాదు.. హార్డ్‌వర్కర్ కూడా. అలాంటి వ్యక్తిని నేను ఇంతకు ముందు చూడనేలేదు’’ అని గ్వార్డియోలాపై హాలాండ్ ప్రశంసలు కురిపించాడు. కాగా స్పెయిన్‌కు చెందిన గ్వార్టియోలా మాంచెస్టర్ సిటీ క్లబ్‌కు 2016 నుంచి కోచ్‌గా ఉన్నాడు. వివిధ టోర్నీల్లో కలిపి మొత్తంగా 18 సార్లు ట్రోఫీ అందించాడు. ఇదిలా ఉంటే.. తాజా ఒప్పందం ప్రకారం ఎర్లిండ్ హాలాండ్ మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో 2034 వరకు కొనసాగనున్నాడు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ -
హెడ్‌కోచ్‌పై వేటు.. అసిస్టెంట్ కోచ్‌కు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తమ హెడ్ కోచ్ తంగ్బోయ్ సింగ్టో(Thangboi Singto)కు ఉన్నపళంగా ఉద్వాసన పలికింది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ప్రదర్శన పేలవంగా ఉండటంతో అతడిని తప్పించింది. 13 జట్లు తలపడుతున్న ప్రస్తుత సీజన్లో హైదరాబాద్ ఎఫ్‌సీ 12వ స్థానంలో ఉంది.పదకొండు మ్యాచ్‌లాడిన జట్టు కేవలం రెండింట గెలిచి ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోగా... 8 మ్యాచ్‌లో ఓడింది. నిరాశజనక ప్రదర్శనపై అసంతృప్తితో ఉన్న ఫ్రాంచైజీ యాజమాన్యం ఉన్నపళంగా మణిపూర్‌కు చెందిన కోచ్‌పై వేటు వేసింది. అసిస్టెంట్ కోచ్ షమీల్ చెంబకత్కు తాత్కాలిక హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పగించింది. గత ఐదేళ్లుగా సింగ్టో జట్టుతో ఉన్నాడు. మొదట్లో (2020లో) డైరెక్టర్‌గా ఉన్న అతడు.. తదనంతరం అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. గతేడాది జూలైలో హెడ్‌కోచ్‌గా నియమించారు. -
హైదరాబాద్ ఎఫ్‌సీ తొలి విజయం
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) తాజా సీజన్లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ తొలి విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ జట్టు 4–0తో మొహమ్మదాన్ స్పోర్ట్స్ క్లబ్‌పై గెలుపొందింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో ఆకట్టుకోలేకపోయిన హైదరాబాద్... మొహమ్మదాన్ క్లబ్‌తో పోరులో చెలరేగి ఆడింది. అలాన్ డిసౌజా మిరండా (4వ, 15వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో మెరవగా... స్టీఫెన్ సాపిక్ (12వ నిమిషంలో), పరాగ్ శ్రీవాస్ (51వ ని.లో) చెరో గోల్ కొట్టారు. మ్యాచ్ ఆరంభం నుంచే విజృంభించిన హైదరాబాద్ జట్టు... ప్రత్యర్థి డిఫెన్స్ బలహీనతలను సొమ్ము చేసుకుంటూ మ్యాచ్ ఆరంభమైన తొలి 15 నిమిషాల్లోనే మూడు గోల్స్‌తో తిరుగులేని ఆధిక్యం సాధించారు. దీంతో ఒత్తిడికి గురైన మొహమ్మడన్ క్లబ్ ఆటగాళ్లు డిఫెన్స్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. బంతిని ఎక్కువసేపు అదుపులో పెట్టుకున్న మొహమ్మదాన్ ప్లేయర్లు... హైదరాబాద్ కన్నా ఎక్కువ షాట్లు ఆడినా... అవి లక్ష్యాన్ని చేరుకోకుండా మనవాళ్లు అడ్డుపడ్డారు. 60 శాతం బంతిని తమ ఆ«దీనంలో ఉంచుకున్న మొహమ్మడన్ జట్టుకు 13 కార్నర్లు, ఒక ఆఫ్‌సైడ్ లభించినా... వాటిని వినియోగించుకోలేకపోయారు. లీగ్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ ఒక విజయం, ఒక ‘డ్రా’, మూడు పరాజయలతో మొత్తంగా 4 పాయింట్లు సాధించి పట్టికలో 11వ స్థానంలో నిలిచింది. నార్త్ ఈస్ట్ రికార్డు విజయం గువాహటి వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ 5–0తో జంషెడ్పూర్ జట్టుపై గెలిచింది. ఐఎస్ఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇప్పటి వరకు ఈ లీగ్‌లో ఒక జట్టు ఐదు గోల్స్ నమోదు చేయడం కూడా ఇదే మొదటిసారి. నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు తరఫున అలాద్దీన్ (5వ, 90వ నిమిషాల్లో), పార్థిబ్ గొగొయ్ (44వ, 55వ నిమిషాల్లో) రెండేసి గోల్స్ చేయగా... లూయిస్ నిక్సన్ (82వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టుకు ఇది రెండో గెలుపు కాగా... 8 పాయింట్లతో ఉన్న ఆ జట్టు పట్టికలో ఐదో స్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌లో ఓడిన జంషెడ్పూర్ జట్టు ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో ఉంది. ఆదివారం ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌తో ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్ తలపడనుంది. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ హెడ్ కోచ్‌గా పోర్చుగల్ స్టార్
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఐ–లీగ్ టోర్నీలో గత రెండు సీజన్లలో రన్నరప్‌గా నిలిచిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. పోర్చుగల్‌కు చెందిన రుయ్ అమోరిమ్ తక్షణమే హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించి రాబోయే సీజన్ కోసం శ్రీనిధి జట్టును సిద్ధం చేయనున్నాడు. గత సీజన్లో హెడ్ కోచ్‌గా ఉన్న డొమింగొ ఒరామస్ ఇటీవల రాజీనామా చేయడంతో అతని స్థానంలో అమోరిమ్ వచ్చాడు.ఇక.. 2008 నుంచి అంతర్జాతీయ క్లబ్ ఫుట్‌బాల్‌లో కోచ్‌గా పని చేస్తున్న 47 ఏళ్ల అమోరిమ్ ఇప్పటి వరకు 10 క్లబ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన ఎస్సీ నోజ్మో క్లబ్ జట్టుకు ఈనెల 14 వరకు అమోరిమ్ కోచ్‌గా పని చేసి అక్కడి నుంచి శ్రీనిధి డెక్కన్ క్లబ్‌కు రానున్నారు. ‘శ్రీనిధి డెక్కన్ జట్టులో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నాను. నా అనుభవాన్ని పంచుకొని జట్టు మరింత ఉన్నతస్థితికి ఎదిగేందుకు కృషి చేస్తా’ అని అమోరిమ్ వ్యాఖ్యానించాడు. మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ బోణీ చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో తొలిసారి బరిలోకి దిగిన మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టు మొదటి విజయాన్ని అందుకుంది. భారత్‌లోని అతి పురాతన ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఒకటైన మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్... గురువారం జరిగిన తమ మూడో లీగ్ మ్యాచ్‌లో 1–0 గోల్ తేడాతో చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌ను ఓడించింది. ఆట 39వ నిమిషంలో లాల్రెమ్సంగా ఫనాయ్ గోల్ సాధించి మొహమ్మదాన్ జట్టుకు విజయాన్ని అందించాడు.కోల్‌కతాలో 1889లో ఏర్పాటైన మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ గత ఏడాది భారత దేశవాళీ టోర్నీ ఐ–లీగ్‌లో విజేతగా నిలిచి ఐఎస్ఎల్లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. మొత్తం 13 జట్లు పోటీపడుతున్న ఐఎస్ఎల్లో ప్రస్తుతం మొహమ్మదాన్ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడి, ఇంకో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. కోల్‌కతా వేదికగా నేడు జరిగే మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీ జట్టుతో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ జట్టు తలపడుతుంది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో స్నేహిత్ ఓటమి బీజింగ్: చైనా స్మాష్–2024 వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గురువారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో భారత్ తరఫున నలుగురు ప్లేయర్లు బరిలోకి దిగారు. మనుశ్ ఉత్పల్భాయ్ షా మినహా మిగతా ముగ్గురు తొలి రౌండ్లోనే ఓడిపోయారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ 11–6, 7–11, 3–11, 3–11తో మా జిన్బావో (అమెరికా) చేతిలో... హర్మీత్ దేశాయ్ 6–11, 11–9, 6–11, 11–8, 5–11తో కార్ల్సన్ (స్వీడన్) చేతిలో... సత్యన్ 9–11, 13–11, 6–11, 11–9, 4–11తో జు హైడాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. మనుశ్ షా 4–11, 11–5, 11–4, 3–11, 11–8తో చాన్ బాల్డ్విన్ (హాంకాంగ్)పై నెగ్గాడు. మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్‌లో తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ తమ ప్రత్యర్థులను ఓడించి రెండో రౌండ్‌కు చేరారు.సెమీఫైనల్లో రిత్విక్ చౌదరీ జోడీసాక్షి, హైదరాబాద్: బ్యాంకాక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ డబుల్స్‌లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రిత్విక్–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 7–6 (7/3), 7–6 (7/5)తో గాబ్రియెల్ డియాలో (కెనడా)–సీటా వతనాబె (జపాన్) జోడీని ఓడించింది.గంటా 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జంటలు తమ సర్వీస్‌ను రెండుసార్లు చొప్పున కోల్పోయాయి. అయితే టైబ్రేక్‌లో రిత్విక్–అర్జున్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది. ఇదే టోర్నీలో ఆడుతున్న రామ్‌కుమార్ రామనాథన్ (భారత్)–తొష్‌హిడె మత్సుయ్ (జపాన్) జోడీ కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో రామ్–తొష్‌హిడె జంట 6–3, 6–4తో అలెజాంద్రో మొరో కనాస్ (స్పెయిన్)–మార్కో ట్రున్‌గెలిటి (అర్జెంటీనా) జోడీపై గెలిచింది. -
కష్టాలన్నీ తీరినట్టే.. బెంగళూరుతో తొలి మ్యాచ్.. ఈసారైనా!
జట్టులోని ఆటగాళ్లకు ఫీజులు కూడా చెల్లించలేని నిస్సహాయత... కాంట్రాక్ట్‌ల రద్దు... ఆటగాళ్ల బదిలీలపై నిషేధం... టీమ్‌పై నిషేధం... కొద్ది రోజుల క్రితం వరకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) పరిస్థితి ఇది. వరుణ్ త్రిపురనేని తదితరులు యజమానులుగా ఉన్న ఈ టీమ్‌కు ఐఎస్ఎల్ నిర్వాహకులు హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులు ఇచ్చినా స్పందించలేని వైనం... చివరకు ఐఎస్ఎల్ నుంచి హైదరాబాద్ టీమ్‌ను తప్పించేందుకు రంగం సిద్ధం!ఇలాంటి సమయంలో బీసీ జిందాల్ గ్రూప్ బరిలోకి దిగింది. అన్ని రకాల బాకీలను తీరుస్తూ జట్టును తీసుకునేందుకు సిద్ధమైంది. చర్చోపచర్చల తర్వాత ఎట్టకేలకు యాజమాన్య మార్పు ఖాయమైంది. ఇప్పుడు అధికారిక అనుమతి తర్వాత హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ ఎలాంటి అంతరాయం లేకుండా ఐఎస్ఎల్లో ఆరో సీజన్‌కు ‘సై’ అంటోంది. సాక్షి, హైదరాబాద్: ఐఎస్ఎల్లో హైదరాబాద్ టీమ్ అడుగు పెట్టడమే అనూహ్యంగా జరిగింది. 2018–19 సీజన్ తర్వాత ఆర్థిక సమస్యలతో పుణే సిటీ టీమ్ సతమతమైంది. దాంతో తర్వాతి సీజన్లో పుణే స్థానాన్ని మరో జట్టుతో భర్తీ చేసేందుకు ఐఎస్ఎల్ నిర్వాహకులు సిద్ధం కాగా... అప్పటికే కేరళ బ్లాస్టర్స్ టీమ్‌తో కలిసి పని చేసిన వరుణ్ ఎక్కువ వాటాతో పుణే స్థానాన్ని హైదరాబాద్ టీమ్‌తో భర్తీ చేశాడు.తొలి సీజన్ (2019–20)లో పేలవమైన ఆటతో జట్టు చివరి స్థానానికే పరిమితమైంది. తర్వాతి ఏడాది కాస్త మెరుగైన ప్రదర్శనతో జట్టు ఐదో స్థానంతో ముగించింది. అయితే 2021–22లో ప్రస్తుత భారత జట్టు హెడ్ కోచ్ మనోలో మార్క్వెజ్ నేతృత్వంలో చాంపియన్‌గా నిలిచింది.తర్వాతి ఏడాదీ రన్నరప్‌గా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అయితే గత సీజన్లో జట్టు గతి తప్పింది. మైదానంలో ప్రదర్శన ఘోరంగా ఉండగా... మైదానం బయట సమస్యలు టీమ్ పరిస్థితిని పూర్తిగా దిగజార్చాయి. 22 మ్యాచ్‌లు ఆడితే 1 మ్యాచ్‌లో నెగ్గి, 16 మ్యాచ్‌లలో ఓడి, 5 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని అట్టడుగున నిలిచింది. అన్నీ సమస్యలే... బయటకు కనిపించని ఎన్నో కారణాలతో హైదరాబాద్ ఎఫ్‌సీ టీమ్ పరిస్థితిపై అనిశ్చితి నెలకొంది. కొన్ని నెలల పాటు తమకు ఒప్పందం ప్రకారం ఫీజులు చెల్లించలేదంటూ ఎనిమిది మంది ఆటగాళ్లు జట్టు నుంచి తప్పుకున్నారు. దాంతో ఆటగాళ్ల బదిలీపై కూడా ‘ఫిఫా’ నిషేధం విధించింది. టీమ్ అప్పులు పెరిగిపోయాయి. మ్యాచ్‌ల కోసం ప్రయాణాలను కూడా సరిగా ప్లాన్ చేయలేక వేదిక అయిన మరో నగరానికి మ్యాచ్ రోజు ఉదయం చేరిన ఘటనలు కూడా జరిగాయి.ఐఎస్ఎల్ నుంచి నోటీసు వచ్చినా టీమ్ యాజమాన్యం స్పందించలేదు. ఒకదశలో మాకు జీతాలు చెల్లించండి ప్రభూ అంటూ టీమ్‌తో కలిసి పని చేసిన పలువురు సహాయక సిబ్బంది మ్యాచ్‌ల సమయంలో గచ్చిబౌలి స్టేడియంలో పెద్ద బ్యానర్లను ప్రదర్శించారు. సమస్య తాత్కాలికమేనని, త్వరలో పరిష్కరిస్తామని వరుణ్ ప్రకటించినా ఎవరికీ నమ్మకం కుదరలేదు.గచ్చిబౌలి స్టేడియంలో కూడా జీతాలు ఇవ్వకపోవడంతో అక్కడి సిబ్బంది ఎవరూ మ్యాచ్ నిర్వహణకు సహకరించలేదు. చివరకు యాజమాన్య హక్కులను వదులుకోవాల్సి వచ్చింది. కొత్త యాజమాన్యంతో... సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆగస్టు 15ను డెడ్‌లైన్‌గా విధించగా... టీమ్ యాజమాన్యం మరో రెండు వారాలు అదనపు గడువు అడిగింది. దాంతో హైదరాబాద్ మ్యాచ్‌లను మినహాయించి ఇతర మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐఎస్ఎల్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ వ్యాపారాల్లో ఉన్న సంస్థ బీసీ జిందాల్ గ్రూప్ క్రీడల్లో అడుగు పెట్టేందుకు సిద్ధమై ముందుకు వచ్చింది.1952 నుంచి వ్యాపార రంగంలో ఉన్న ఈ సంస్థ ‘జిందాల్ ఫుట్‌బాల్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో తొలిసారి లీగ్‌లో ఒక టీమ్‌ను కొనుగోలు చేసింది. గత యాజమాన్యం చేసిన అప్పులు, లాభాలు, ఇతర లెక్కలు అన్నీ తేలిన తర్వాత ఈ నెల 2న హైదరాబాద్ టీమ్‌ను జిందాల్ గ్రూప్ తీసుకున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కొత్త మేనేజ్మెంట్ అండతో హెచ్ఎఫ్సీ 2024–25 సీజన్లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం.హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టు వివరాలు అర్ష్‌దీప్ సింగ్ సైనీ, లాల్బియాక్లువా జాంగ్తే, అలెక్స్ షాజీ, లియాండర్ కన్హా, మనోజ్ మొహమ్మద్, మొహమ్మద్ రఫీ, పరాగ్ సతీశ్ శ్రీవాస్, సోయల్ జోషి, విజయ్ మరాండి, రామ్లన్చుంగా, అబ్దుల్ రబీ అంజుకందన్, అభిజిత్ పా, ఆయుశ్ అధికారి, ఐజాక్ వన్మల్సవ్మా చాక్చువాక్, లాల్చన్హిమా చైలో, లెనీ రోడ్రిగ్స్, రషీద్ మదమ్బిల్లత్, అమోన్ లెప్చా, ఆరోన్ వన్లాల్రించనా, స్టీఫెన్ గొడార్డ్, దేవేంద్ర ఢాకూ ముర్గాంవ్కర్, జోసెఫ్ సన్నీ. కోచ్: తంగ్బోయ్ సింగ్‌తో. నేటి నుంచి ఐఎస్ఎల్ ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ 11వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. టోర్నీలో మొత్తం 13 జట్లు బరిలోకి దిగుతున్నాయి. నేడు జరిగే తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముంబై సిటీ ఎఫ్‌సీతో గత ఏడాది రన్నరప్ మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు తలపడుతుంది. ఈ రెండు టీమ్‌లతో పాటు డ్యురాండ్ కప్ విజేత నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ కూడా చక్కటి ఫామ్‌తో సవాల్ విసురుతోంది.నేడు జరిగే మొదటి మ్యాచ్‌లో రెండు జట్లలో కలిపి భారత సీనియర్ జట్టు ఆటగాళ్లంతా పెద్ద సంఖ్యలో ఉండటం ఆసక్తిని పెంచింది. టోర్నీలో ప్రాథమిక లీగ్ దశ పోటీలు డిసెంబర్ 30 వరకు సాగుతాయి. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. హైదరాబాద్ గచి్చబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం హోం టీమ్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ ఆడే ఆరు మ్యాచ్‌లకు (అక్టోబర్ 1, 30...నవంబర్ 25...డిసెంబర్ 4, 23, 28) ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్‌లన్నీ స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
ఫుట్‌బాల్ దిగ్గజం కాంప్‌బెల్ కన్నుమూత..
ఫుట్‌బాల్ దిగ్గజం, అర్సెనల్ ఎఫ్‌సీ లెజెండ్ కెవిన్ కాంప్‌బెల్(54) కన్నుమశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంప్‌బెల్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. విన్ కాంప్‌బెల్ మరణ వార్తను అర్సెనల్ ఎఫ్‌సీ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది."మా క్లబ్ మాజీ స్ట్రైకర్ కెవిన్ కాంప్‌బెల్ అనారోగ్యం కారణంగా మృతిచెందాడు. అతడి మరణ వార్త మమ్మల్ని కలిచివేసింది. కెవిన్ని క్లబ్లో ప్రతీఒక్కరూ గౌరవించేవారు. ఆ కష్టసమయంలో కెవిన్ కుటంబసభ్యులకు ఆ దేవుడు అండగా నిలివాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కాంప్‌బెల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాము" అని అర్సెనల్ ఎఫ్‌సీ ఎక్స్‌లో రాసుకొచ్చింది. ఫుట్‌బాల్ వరల్డ్‌లో కాంప్‌బెల్ తనకంటూ ఒక ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నారు. 1988లో ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన కాంప్‌బెల్.. రెండు దశాబ్దాలకు పైగా ఫుట్‌బాల్ గేమ్‌లో కొనసాగారు. 1988లో ఆర్సెనల్ తరపున ఫుట్‌బాల్ ఆసోషియేషన్ యూత్ కప్‌ను గెలుచుకున్నాడు. అంతేకాకుండా ప్రీమియర్ లీగ్‌లో అర్సెనల్ , నాటింగ్‌హామ్ ఫారెస్ట్ , ఎవర్టన్ , వెస్ట్ బ్రోమ్విచ్ అల్బియన్ జట్ల తరపున కూడా అర్సెనల్ ఆడాడు. కాంప్‌బెల్ తన కెరీర్లో ఓవరాల్‌గా 148 గోల్స్ చేశాడు. We are devastated to learn that our former striker Kevin Campbell has died after a short illness.Kevin was adored by everyone at the club. All of us are thinking of his friends and family at this difficult time.Rest in peace, Kevin ❤️ pic.twitter.com/Kiywyo7nTr— Arsenal (@Arsenal) June 15, 2024 -
‘డ్రా’తో గట్టెక్కిన శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ
షిల్లాంగ్: ఐ–లీగ్ జాతీయ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు ఐదో ‘డ్రా’ నమోదు చేసింది. నెరోకా ఎఫ్‌సీతో గురువారం జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి జట్టు 1–1తో ‘డ్రా’ చేసుకుంది. నెరోకా తరఫున రోహిత్ (70వ ని.లో), శ్రీనిధి తరఫున డేవిడ్ కాస్టనెడా మునోజ్ (82వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 44 పాయింట్లతో రెండో స్థానంలో, మొహమ్మదాన్ స్పోర్టింగ్ 49 పాయింట్లో తొలి స్థానంలో ఉన్నాయి. శ్రీనిధి జట్టుకు టైటిల్ దక్కాలంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు మొహమ్మదాన్ స్పోర్టింగ్ జట్టు తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా ఓడిపోవాలి. -
Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను'
ఆ అమ్మాయి ఒకప్పుడు గుంపులో రాళ్లు విసిరే కశ్మీరీ అమ్మాయి. ఇప్పుడు జమ్ము–కశ్మీర్లో కేవలం బాలికల కోసం ఫుట్‌బాల్ అకాడెమీ నడుపుతున్న ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. ఆమెలో వచ్చిన మార్పు ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ చేత కూడా మాట్లాడించేలా చేసింది. విరాట్ కోహ్లీ కూడా ఆమెను మెచ్చుకున్నాడు. యువతకు సరైన దిశ ఉంటే వారు గెలిచి తీరుతారనడానికి అఫ్షాన్ ఆషిక్ ఒక ఉదాహరణ. కొన్నేళ్లు వెనక్కు వెళితే 2017 డిసెంబర్లో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒకమ్మాయి... ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్ము కశ్మీర్ పోలీసులపైకి రాళ్లు విసురుతున్న ఫొటో అది. ఆ అమ్మాయి పేరు అఫ్షాన్ ఆషిక్. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ‘స్లోన్ పెల్టర్’ ముద్ర వేసింది. అప్పటికే ఆ అమ్మాయి ఫుట్‌బాల్ ఆటలో ప్రతిభ కనపరుస్తూ ఉంది. కాని ఈ ఫోటోతో ఆమె తన ఆటకే దూరమయ్యే స్థితి వచ్చింది. ‘ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను. అది కోపంలో చేసిన పని. దానికి కారణం పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమి ప్రొఫెషనల్ స్టోన్ పెల్టర్‌ను కాదు. కాని నా మీద ముద్ర పడింది. దాని నుంచి బయటపడాలంటే నేను నా చదువు మీద నా ఫుట్‌బాల్ ఆట మీద దృష్టి పెట్టి విజయం సాధించాలని అనుకున్నాను’ అంది అఫ్షాన్ ఆషిక్. ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి నెల రోజులు ఇంటికే పరిమితమైంది. అఫ్షాన్ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘ఒకరోజు చాలా ఏడుస్తుంటే నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాను’ అందామె. ముంబై వెళ్లి.. కశ్మీర్ యువత తమ చదువు, క్రీడల పట్ల దృష్టి పెట్టాలని భావించిన ప్రభుత్వం అఫ్షాన్ను తగిన ప్రోత్సాహం అందించింది. జమ్మూ కశ్మీర్ క్రీడాశాఖ చేయూతతో అఫ్షాన్ ముంబై వెళ్లి ఆటలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ నుంచి తొలిప్రొఫెషనల్ ఫిమేల్ ఫుట్‌బాల్ ప్లేయర్ అయ్యింది. ‘నువ్వు ఆడపిల్లవి. ఫుట్‌బాల్ నేర్చుకుని ఏం చేస్తావ్ అని అందరూ అడిగేవారు. నేను ఆడే సమయానికి ఆడపిల్లలు ఎవరూ మా ప్రాంతం నుంచి ఫుట్‌బాల్‌లోకి రాలేదు. కాని నేను ఆగలేదు. పట్టుదలగా ముందుకెళ్లాను. ఇండియన్ విమెన్స్ లీగ్‌లో ఆడాను. గోల్ కీపర్‌గా విశేష ప్రతిభ కనపరిచాను. ఆ సమయంలో విదేశీ మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లని గమనించాను. వాళ్లకు చాలా మంచిశిక్షణ ఆ దేశాల్లో లభిస్తోంది. మా ్రపాంతం బాలికలకు కూడా లభించాలని భావించాను. అందుకే జమ్ము కశ్మీర్ బాలికల కోసం యునీక్ ఫుట్‌బాల్ అకాడెమీ స్థాపించాను’ అని తెలిపింది అఫ్షాన్. మరింత గుర్తింపు.. నేడు జమ్ము కశ్మీర్లో మహిళా ఫుట్‌బాల్ పేరు చెప్తే అఫ్షాన్ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆమెకు అక్కడ ఒక సెలబ్రిటీ హోదా ఉంది. ’నేను నా గతాన్ని జయించాను. ఇప్పుడు నేను స్టోన్ పెల్టర్ని కాను. గోల్ కీపర్‌ని. ఇకపై నన్ను జనం అలాగే గుర్తు పెట్టుకుంటారు’ అంటుందామె. ఇవి చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి! -
I-League 2023-24: శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు మరో విజయం
లుధియానా: ఐ–లీగ్ జాతీయ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఖాతాలో 11వ విజయం చేరింది. ఢిల్లీ ఎఫ్‌సీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ జట్టు 1–0 గోల్ తేడాతో గెలుపొందింది. ఆట 22వ నిమిషంలో రిల్వాన్ పాస్‌ను హెడర్ షాట్‌తో లాల్రొమావియా బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో శ్రీనిధి డెక్కన్ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత శ్రీనిధి జట్టు ఈ ఆధిక్యాన్ని చివరి నిమిషందాకా కాపాడుకుంది. మొత్తం 13 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో ప్రస్తుతం శ్రీనిధి జట్టు 36 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈనెల 17న జరిగే తదుపరి మ్యాచ్‌లో గోకులం కేరళ ఎఫ్‌సీతో శ్రీనిధి జట్టు తలపడుతుంది. -
బ్రెజిల్లో ఫుట్‌బాల్ ఆడుతున్న మహాత్మాగాంధీ!
రియో డీ జెనెరో : బ్రెజిల్లో కుర్రాళ్లు ఫుడ్‌బాల్ ఆడడంలో వింతేం లేదు. ఆ దేశంలో ఫుట్‌బాల్‌కు ఇండియాలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.అయితే ఓ యువ ఫుట్‌బాల్ ప్లేయర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.దీనికి కారణం అతని ఆట తీరో ఇంకొకటో కాదు.అతని పేరులోని గొప్పతనం. బ్రెజిల్‌లోని ట్రిండేడ్ ఫుట్‌బాల్ క్లబ్లో మిడ్‌ఫీల్డర్‌గా ఆడుతున్న 31 ఏళ్ల ఆ ఆటగాడి పేరు మహాత్మాగాంధీ హెబెర్పియో మట్టోస్ పిరెస్.దీంతో అందరి దృష్టి అతడిపై పడుతోంది.2011 నుంచి మహాత్మా గాంధీ క్లబ్ తరపున ఫుట్‌బాల్ ఆడుతున్నాడు. మహాత్మాగాంధీ ఒక్క పేరే కాకుండా బ్రెజిల్‌లోని ఫుట్‌బాల్ క్లబ్బుల్లో చాలా మంది ఆటగాళ్లకు ప్రఖ్యాతి గాంచిన వ్యక్తుల పేర్లుండడం విశేషం.ఒక ఆటగాడికి బీటిల్స్ సింగర్ జాన్ లెన్నన్ పేరుండగా మరో ఆటగాడు బ్రెజిల్ ఫుట్‌బాల్ టీమ్‌లలో ఒకటైన పికాచు అనే పేరు పెట్టుకున్నాడు.ఇవే కాకుండా మర్లన్ బ్రాండో,మస్కిటో లాంటివి ఇంకా చాలా అందరి దృష్టిని ఆకర్షించే పేర్లున్న ఆటగాళ్లున్నారు. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రకారం జాతిపిత మహాత్మాగాంధీ 1893 నుంచి 1915 వరకు దక్షిణాఫఫ్రికాలో ఉన్నపుడు అక్కడ మూడు ఫుట్‌బాల్ టీమ్‌లను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. జోహెన్నెస్ బర్గ్, ప్రిటోరియా, డర్బన్ ఫుట్‌బాల్ క్లబ్లును గాంధీ స్వయంగా స్థాపించారు.దీంతో ఫుట్‌బాల్ క్రీడపై గాంధీ చెరగని ముద్ర వేసినట్లయింది. ఇదీ చదవండి.. ఫ్రీ మీల్స్ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే? -
అడ్డంకులను దూరంగా తన్ని,30 ఏళ్లుగా ఆడపిల్లల కోసం కష్టపడుతూ..
మణిపూర్ ఒక మంచి వార్తను వినిపించింది. ఆ రాష్ట్రానికి చెందిన మహిళా దర్శకురాలు మీనా లాంగ్జామ్ తీసిన ‘ఆండ్రో డ్రీమ్స్’ ముంబైలో జరుగుతున్న చలన చిత్రోత్సవంలో బెస్ట్ డాక్యుమెంటరీగా ఎంపికైంది. మణిపూర్‌లోని మారుమూల గ్రామం ‘ఆండ్రో’లో ఆడపిల్లల ఫుట్‌బాల్ క్లబ్‌ను 30 ఏళ్లుగా పరిస్థితులకు ఎదురీది నడుపుతున్న ‘లైబి’ అనే మహిళ పోరాటాన్ని ఈ డాక్యుమెంటరీ రికార్డు చేసింది. ఆడపిల్లల క్రీడా స్వేచ్ఛను ఎన్ని అడ్డంకులొచ్చినా కొనసాగనివ్వాలనే సందేశం ఇచ్చే ఈ డాక్యుమెంటరీ దేశ, విదేశాల్లో ప్రశంసలు పొందుతోంది. అంతా చేసి ఎనిమిది వేల మంది జనాభా మించని ఊరు ఆండ్రో. మణిపూర్ తూర్పు ఇంఫాల్ జిల్లాలో మారుమూల ఉంటుంది అది. అక్కడి ఆడపిల్లలు ఫుట్‌బాల్ ఆడితే ఏంటి... ఆడకపోతే ఏంటి? కాని 60 ఏళ్ల లైబి మాత్రం– ఆడాల్సిందే అంటోంది. ఆమె గత ముప్పై ఏళ్లుగా ‘ఆండ్రో మహిళా మండల్ అసోసియేషన్– ఫుట్‌బాల్ క్లబ్’ (అమ్మ– ఎఫ్‌సీ) నడుపుతోంది. ఈ క్లబ్‌కు నిధులు లేవు. బిల్డింగ్ లేదు. ఊళ్లో ప్రోత్సాహం లేదూ, ఏమీ లేదు. కాని లైబి మాత్రం అంతా తానై క్లబ్‌ను నడుపుతోంది. ఈ మధ్యే ఆమె ఒక పూరి పాక నిర్మించి దానినే క్లబ్ బిల్డింగ్‌గా ప్రారంభించుకుంది. ‘అమ్మాయిలు కేవలం వంటకు, ఇంటి పనికి అంకితమై పోకూడదు. చదువుకోవాలి. ఆడాలి. ధైర్యంగా భవిష్యత్తును నిర్మించుకోవాలి. మా ప్రాంతంలో పురుషులదే సర్వాధికారం. ఇంటి పెద్ద, తెగ పెద్ద ఎంత చెప్తే అంత. వారి దృష్టిలో ఆడవాళ్ల గురించి చింతించాల్సింది ఏమీ ఉండదు. అమ్మాయిలు ఆడతామన్నా ఒప్పుకోరు. నా పోరాటం వల్లే ఇవాళ మా ఊరి నుంచి జాతీయ స్థాయిలో అమ్మాయిలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు’ అంటుంది లైబి. ఈమె పోరాటం ప్రపంచానికి చెప్పదగ్గది అనిపించింది మణిపూర్‌కే చెందిన మహిళా దర్శకురాలు మీనా లాంగ్జామ్కు. అలా తయారైన డాక్యుమెంటరీనే ‘ఆండ్రో డ్రీమ్స్’. ఇద్దరి కథ ప్రస్తుతం ముంబైలో ‘జాగరణ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అట్టహాసంగా జరుగుతోంది. ఇందులో ‘ఆండ్రో డ్రీమ్స్’ బెస్ట్ డాక్యుమెంటరీగా నిలిచింది. ఇప్పటికే కేరళ, కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు ఎంపికైన ఈ డాక్యుమెంటరీ ముంబైలో విమర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ‘దీనికి కారణం ఆండ్రోలో అమ్మ క్లబ్‌ను నడుపుతున్న లైబి పోరాటాన్ని, ఆ క్లబ్లో గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఉంటూ మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలనుకునే నిర్మల అనే అమ్మాయి ఆకాంక్షలని నేను చూపించడమే. ఒక రకంగా చాదస్త వ్యవస్థతో రెండు తరాల స్త్రీల పోరాటం ఈ డాక్యుమెంటరీ’ అని తెలిపింది మీనా లాంగ్జామ్. మణిపూర్ వెలుతురు నిజానికి మే 3వ తేదీ నుంచి మణిపూర్ వేరే కారణాల రీత్యా వార్తల్లో ఉంది. కాని మణిపూర్‌ను అభిమానించేవారికి ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ సాధిస్తున్న విజయాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. ‘నా డాక్యుమెంటరీ విజయం మా ప్రాంతంలో గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం మొదలుపెట్టే ఉత్సాహాన్ని ఇస్తే అంతే చాలు’ అంది మీనా లాంగ్జామ్. మణిపూర్ యూనివర్సిటీలో కల్చరల్ స్టడీస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న మీనా పాఠాలు చెప్పడంతో పాటు డాక్యుమెంటరీలు కూడా తీస్తుంది. 2015లో ఆమె మణిపూర్‌లో ఫస్ట్ మహిళా ఆటోడ్రైవర్‌గా ఉన్న లైబీ ఓయినమ్ మీద డాక్యుమెంటరీ తీస్తే దానికి చాలా పేరొచ్చింది. ఆ తర్వాత ‘అచౌబీ ఇన్ లవ్’ పేరుతో పోలో ఆటకు అనువైన స్థానిక జాతి అశ్వాలపై డాక్యుమెంటరీ తీస్తే దానికీ పేరొచ్చింది. ఇప్పుడు ‘ఆండ్రో డ్రీమ్స్’ మణిపూర్ ఘనతను చాటుతోంది. బాలికలు, యువతులు క్రీడల్లో ఎంతో రాణిస్తున్నా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఆంక్షలు ఉండనే ఉంటాయి. అలాంటి ప్రతి చోట అమ్మాయిలను ప్రోత్సహించే లైబి లాంటి యోధురాళ్లు, వారి గెలుపు గాధలను లోకానికి తెలిపే మీనా లాంటి వాళ్లు ఉండాలని కోరుకుందాం. -
నెమార్‌కు బంపరాఫర్.. ఏకంగా 832 కోట్లు
రియాద్: ప్రపంచ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల కోసం కోట్లాది డాలర్లతో సౌదీ అరేబియా క్లబ్‌లు క్యూ కడుతున్నాయి. ఎంత భారీ మొత్తమైనా చెల్లించి సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్రిస్టియానో రొనాల్డో (అల్ నాసర్) ఇక్కడి లీగ్‌లో ఆడుతుండగా ఇప్పుడు మరో టాప్ ప్లేయర్ నెమార్ ఈ జాబితాలో చేరాడు. ఈ బ్రెజిల్ ఆటగాడితో తాజాగా సౌదీ క్లబ్ ‘అల్ హిలాల్’ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందు కోసం నెమార్‌కు వార్షిక వేతనంగా 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 832 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఇతర సౌకర్యాలూ నెమార్‌కు లభిస్తాయి. గత ఆరు సీజన్లుగా పారిస్ సెయింట్ జర్మయిన్ (పీఎస్జీ) క్లబ్ తరఫున నెమార్ ఆడాడు. తాజా పరిణామాల్లో భాగంగా ట్రాన్స్ఫర్ ఫీ కింద పీఎస్జీ క్లబ్‌కు అల్ హిల్ మరో 98 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 819 కోట్లు) కూడా చెల్లించనుంది. గాయాలతో ఇబ్బంది పడుతూ గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన నెమార్‌కు ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు అల్ హిలాల్ ముందుకు రావడం విశేషం. చదవండి: ODI WC 2023: ఇలా ఉంటే ఇంగ్లండ్‌ను ఆపడం సాధ్యమా..? వీళ్లు చాలదన్నట్లు స్టోక్స్ జతకలిశాడు..! -
ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే..
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఇంటర్ మియామి క్లబ్లో మంచి ముహూర్తంలో జాయిన్ అయినట్లున్నాడు. ఇప్పటివరకు ఇంటర్ మియామి క్లబ్ తరపున ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ మెస్సీ గోల్స్‌తో మెరిశాడు. అందులో రెండు మ్యాచ్‌ల్లో డబుల్ గోల్స్ కొట్టి అభిమానులను అలరించాడు. తాజాగా గురువారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) ఓర్లాండో సిటీ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్ మియామి 3-1తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఉరుములు, మెరుపుల కారణంగా మ్యాచ్ 95 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే మ్యాచ్ ఆలస్యమైనప్పటికి మెస్సీ మాత్రం గోల్ కొట్టడంలో పెద్దగా టైం తీసుకోలేదు. ఆట 7వ నిమిషంలోనే మెస్సీ తన జట్టుకు తొలి గోల్ అందించాడు. అయితే ఓర్లాండో సిటీ ఆట 11వ నిమిషంలో గోల్ కొట్టి సోర్కును సమం చేసింది. అక్కడి నుంచి తొలి హాఫ్ ముగిసేవరకు మరో గోల్ నమోదు కాలేదు. రెండో హాఫ్ మొదలైన కాసేపటికి ఆట 51వ నిమిషంలో జోసెఫ్ మార్టినేజ్ పెనాల్టీని గోల్‌గా మలిచాడు. ఇక ఆట 72వ నిమిషంలో మెస్సీ మరో గోల్ కొట్టి జట్టును 3-1తో స్పష్టమైన ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిర్ణీత సమయంలోగా ఓర్లాండో మరో గోల్ కొట్టలేకపోవడంతో ఇంటర్ మియామి విజయాన్ని నమోదు చేసింది. కాగా మెస్సీ రెండు గోల్స్ కొట్టిన సందర్భంలో మ్యాచ్‌కు హాజరైన అతని భార్య ఆంటోనెలా రోకుజో స్టాండ్స్‌లో సెలబ్రేట్ చేసుకోవడం వైరల్‌గా మారింది. జెర్సీ అమ్మకాల్లో దిగ్గజాలను అధిగమించిన మెస్సీ.. కాగా మెస్సీ మరొక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గోల్స్‌తో రికార్డులు కొట్టడమే కాదు తాజాగా మెస్సీకి చెందిన జెర్సీ అమ్మకాల్లోనూ రికార్డులను కొల్లగొట్టాడు. 24 గంటల వ్యవధిలో మెస్సీ ఇంటర్ మియామి జెర్సీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో జెర్సీ అమ్మకాల విషయంలో క్రిస్టియానో రొనాల్డో, టామ్ బ్రాడీ, ఎన్బీఏ దిగ్గజం లెబ్రన్ జేమ్స్‌లను మెస్సీ అధిగమించాడు. 2021లో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ తరపున, 2020లో టాంపా బే బుక్కానీర్స్లో టామ్ బ్రాడీ జాయిన్ అయిన సమయంలో.. 2018 లో ఎల్ఏ లేకర్స్ తరపున లెబ్రన్ జేమ్స్ జాయిన్ అయినప్పుడు వారి జెర్సీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. MESSI X ROBERT TAYLOR BANGERS ONLY 🤯🤯 Taylor puts Messi in with the chip to give us the early lead over Orlando City.#MIAvORL | 📺#MLSSeasonPass on @AppleTV pic.twitter.com/kvb8Lmcccj — Inter Miami CF (@InterMiamiCF) August 3, 2023 చదవండి: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ 100 మీటర్ల రేసు పరువు తీసింది.. చరిత్రలోనే అత్యంత చెత్త అథ్లెట్ -
'పదేళ్ల కాలానికి తొమ్మిది వేల కోట్లు చెల్లిస్తాం'.. ఎంబాపె తిరస్కరణ
ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపె పారిస్ సెయింట్ జెర్మన్(పీఎస్జీ క్లబ్)తో బంధం తెంచుకోవడానికి సిద్దమయ్యాడు.కాంట్రాక్ట్ పొడిగించుకోవడానికి ఎంబాపె ఇష్టపడకపోవడంతో అతన్ని వదులుకోవాలని పీఎస్జీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంబాపె వదులుకున్న మొత్తం తెలిస్తే కళ్లు తేలేయడం ఖాయం అని చెప్పొచ్చు. ఎంబాపెతో బంధాన్ని కొనసాగించేందుకు పీఎస్జీ క్లబ్ అతనికి పదేళ్ల కాలానికి గానూ దాదాపు 1 బిలియన్ యూరోలు(ఇండియన్ కరెన్సీలో సుమారుగా 9వేల కోట్లు) చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చింది. కానీ ఎంబాపె అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి ఇష్టపడలేదని సమాచారం. ప్రస్తుతం లీగ్ వన్ క్లబ్లో ఆడుతున్న ఎంబాపెకు పీఎస్జీ తరపున ఇదే చివరి సీజన్ కానుంది. ఆ తర్వాత జరగనున్న ప్రీ-సీజన్ జపాన్ టూర్‌కు ఎంబాపె వేరే క్లబ్ తరపున ఆడే అవకాశాలు ఉన్నాయి. అయితే తొలుత పీఎస్జీ క్లబ్ ఎంబాపెను వదులుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే భారీ ఆఫర్‌ను మూటజెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఎంబాపె తిరస్కరించడంతో చేసేదేం లేక అతన్ని వదులుకోవడానికి సిద్ధమైంది. ఇక ఫ్రాన్స్ సూపర్‌స్టార్ కైలియన్ ఎంబాపె 2018లో ఫ్రాన్స్ ఫిపా వరల్డ్‌కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లోనూ తనదైన ముద్ర వేసిన ఎంబాపె ఫైనల్లో మెస్సీ సేనకు చెమటలు పట్టించాడు. ఓటమిని అంత సులువుగా ఒప్పుకోని ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. అయితే పెనాల్టీ షూటౌట్లో ఎంబాపె మినహా మిగతా ఆటగాళ్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో ఫ్రాన్స్ రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. అయితే ఎంబాపె మాత్రం తన ప్రదర్శనతో అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. చదవండి: Smriti Mandhana: 'ప్రధాన కోచ్ లేకుంటే ఏంటి?.. బాగానే ఆడుతున్నాం కదా!' MLC 2023: నిప్పులు చెరిగిన పార్నెల్.. కుప్పకూలిన సూపర్ కింగ్స్ -
మెస్సీనా మజాకా.. క్లబ్‌లు మారినా గోల్స్ మాత్రం ఆగడం లేదుగా
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఏ క్లబ్‌కు ఆడినా తన జోరును చూపిస్తూనే ఉన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ నుంచి క్లబ్ మ్యాచ్ దాకా గోల్స్ కొడుతూనే ఉన్నాడు. ఇటీవలే పీఎస్జీ నుంచి ఇంటర్ మియామి(Inter Miami FC)కి రికార్డు ధరకు వెళ్లిన మెస్సీ క్లబ్ తరపున ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. లీగ్స్ కప్ ప్లేలో భాగంగా డీఆర్వీ పీఎన్కే స్టేడియం వేదికగా శనివారం తెల్లవారుజామున(భారత కాలామాన ప్రకారం) ఇంటర్ మియామి, క్రజ్ అజుల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మెస్సీ గోల్‌తో మెరిశాడు. మ్యాచ్ అదనపు సమయం(ఆట 94వ నిమిషం)లో లభించిన ఫ్రీకిక్‌ను సద్వినియోగం చేసుకున్న మెస్సీ బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ఇంటర్ మియామి జట్టు క్రజ్ అజుల్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. కాగా మ్యాచ్‌కు 22వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. మెస్సీని చూడడానికే వచ్చిన అభిమానులకు ఆట ముగిసే సమయానికి నిరాశే మిగిలింది. మెస్సీ గోల్ చూడకుండానే వెళ్లిపోతామేమోనని ఫీలయ్యారు. కానీ 94వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్‌ను మెస్సీ గోల్‌గా మలచడంతో స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఒక క్లబ్ తరపున అరేంగేట్రం మ్యాచ్‌లో ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచిన తొలి ఆటగాడిగా మెస్సీ రికార్డులకెక్కాడు. అమెరికన్ ప్రొఫెషనల్ సాకర్ క్లబ్ అయిన ఇంటర్ మయామి క్లబ్‌తో 2025 సీజన్ పూర్తయ్యే వరకు ఆడేందుకు మెస్సీ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం విలువ సీజన్‌కు రూ. 492 కోట్లు (60 మిలియన్ డాలర్లు) అని క్లబ్ వర్గాలు వెల్లడించాయి. LIONEL ANDRÉS MESSI IS NOT HUMAN. pic.twitter.com/2mBDI41mLy — Major League Soccer (@MLS) July 22, 2023 చదవండి: దురదృష్టవంతుల లిస్ట్‌లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్‌గా #Jadeja: ఔటయ్యింది ఒక బంతికి.. చూపించింది వేరే బంతిని -
ఇంగ్లండ్ స్టార్‌కు కళ్లు చెదిరే మొత్తం.. అవి డబ్బులా ఇంకేమైనా!
ఫుట్‌బాల్‌లో జెర్సీ నెంబర్-7 అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. ప్రస్తుత తరంలో ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్స్‌లో రొనాల్డో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. కాగా ఫుట్‌బాల్ జెర్సీ నెంబర్ 10కు ఎంత క్రేజ్ ఉందో.. ఏడో నెంబర్‌కు కూడా అంతే. రొనాల్డో కంటే ముందు ఇంగ్లండ్ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హమ్ మాత్రమే ఏడు నెంబర్ జెర్సీ ధరించాడు. తాజాగా బుధవారం చెల్సియా క్లబ్ ఫుట్‌బాల్ స్టార్ మాసన్ మౌంట్ మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు సంతకం చేశాడు. అతని ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఏకంగా 55 మిలియన్ పౌండ్స్(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 577 కోట్ల పైమాటే). కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడయిన మాసన్ మౌంట్‌కు రొనాల్డో జెర్సీ నెంబర్ (7)ను మాంచెస్టర్ యునైటెడ్ గిఫ్ట్‌గా అందించింది. ఇకపై మాసన్ మౌంట్ మాంచెస్టర్ క్లబ్ తరపున ఏడో నెంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. ఇక మాసన్ మౌంట్ చెల్సియాతో తన సీనియర్ ఫుట్‌బాల్ క్లబ్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2017-19 మధ్య విటెస్సే, డెర్బీ కౌంటీ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం చెల్సియాకు తిరిగి వచ్చిన మాసన్ మౌంట్ నిలకడైన ఆటతీరుతో స్టార్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయంగా ఇంగ్లండ్ తరపున UEFA ఛాంపియన్స్ లీగ్ , UEFA సూపర్ కప్ ,2021లో FIFA ప్రపంచకప్‌లో ప్రాతినిధ్యం వహించాడు. 2020–21, 2021–22 సీజన్లలో మాసన్ మౌంట్ చెల్సియా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. It's time to write a new chapter. #️⃣7️⃣ Mount 🔴#MUFC — Manchester United (@ManUtd) July 5, 2023 చదవండి: విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా #SlapKabaddi: పాకిస్తాన్‌ను షేక్ చేస్తున్న 'స్లాప్' కబడ్డీ.. వీడియో వైరల్ -
బొల్లారం నుంచి బ్రెజిల్ దాకా.. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వాళ్లు సైతం..
ఉదయం 6 గంటలు... పక్షుల కిలకిలరావాలు.. అప్పుడప్పుడే బయటకు వస్తోన్న ప్రజలు. బొల్లారంలోని సదర్ బజార్లో ఓ ఇరుకు గల్లీ నుంచి కొద్దిగా ముందుకు వెళితే ఓ గ్రౌండ్.. ఓ వైపు వందేళ్ల కింద కట్టిన బ్రిటీష్ కాలం నాటి ప్రభుత్వ పాఠశాల, మరోవైపు సదర్ బజార్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్. వాటి మధ్య విశాలమైన క్రీడా ప్రాంగణం. అదే కంటోన్మెంట్ ఫుట్‌బాల్ క్లబ్ అడ్డా బొల్లారం స్పోర్టింగ్ గ్రౌండ్. లోపలికి అడుగుపెడితే ఇంత పెద్ద గ్రౌండ్ లోపల ఉందా.. అనుకుంటూ ఆశ్చర్యపోతాం.. అక్కడి స్పోర్టింగ్ క్లబ్లో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా పిల్లలు రెడీ అయిపోతారు. 6గంటల కంటే ముందే వందకు పైగా పిల్లలు సాకర్ గెటప్‌లో వచ్చేస్తారు. 1,2,3.. వరుసగా కౌంట్ చేసుకుంటూ పిల్లలు వేసే కేకలు.. విశాల ప్రాంగణంలో మార్మోగుతాయి. ఎండాకాలం సెలవులంటే ఇంట్లోనే సెల్ఫోన్లకు పరిమితమై పోయే పిల్లలను ఫుట్‌బాల్ వైపు నడిపిస్తోంది బొల్లారం స్పోర్టింగ్ క్లబ్. ఇది కమర్షియల్‌గా చేస్తోంది కాదు. పూర్తిగా సామాజిక సేవగా, మట్టిలో మాణిక్యాలను వెలికితీసే కార్యక్రమంలో భాగంగా క్లబ్ కోచ్‌లు, గతంలో క్లబ్‌తో కలిసి ప్రయాణం చేసిన మాజీ ఆటగాళ్లు ఈ క్యాంప్‌ను నడిపిస్తున్నారు. సాధారణ వ్యక్తుల్లా ఇదే క్లబ్లో అడుగుపెట్టి.. ప్రొఫెషనల్ ఆటగాళ్లుగా మారి.. ఇప్పుడు వేర్వేరు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తోన్న కోచ్‌లు.. తమకిష్టమైన ఫుట్‌బాల్ కోసం వంతుల వారీగా బొల్లారం వచ్చి పిల్లలకు మెలకువలు నేర్పిస్తున్నారు. 1946లో ప్రారంభమైన బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ 75 ఏళ్ల వజ్రోత్సవాలను 2022లో పూర్తి చేసుకుంది. వజ్రోత్సవాలను పురస్కరించుకుని అమ్మాయిలకు, అబ్బాయిలకు ఫుట్‌బాల్ టోర్నీలను ఏడాదంతా నిర్వహించింది. మొత్తం 75 మ్యాచ్‌లు ఇందులో భాగంగా నిర్వహించారు. ఈ క్లబ్లో ఓనమాలు నేర్చుకుని జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పటివరకు 16 మంది ఆటగాళ్లు వేర్వేరు సంవత్సరాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. బొల్లారం ఫుట్ క్లబ్ నుంచి కొందరు ఆణిముత్యాలు. 1.పీటర్ తంగరాజ్ రెండు సార్లు ఒలింపిక్స్ (1956, 1960లో) ఫుట్ బాల్ మ్యాచ్‌ల్లో ఆడారు. అలాగే 1967లో అర్జున అవార్డు అందుకున్నారు. 2.తులసీదాస్ బలరాం కూడా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. పీటర్ తంగరాజ్‌తో కలసి 1956, 1960 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 3.డి.కన్నన్ 1958 ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 4.అంటోనీ పాట్రిక్ ఇక్కడి నుంచే గేమ్ మొదలుపెట్టి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. 5.GM పెంటయ్య 1960లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో కోచ్‌గా సేవలందించారు. 6.అలీం ఖాన్ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. DYSOగా పని చేసి రిటైర్ అయ్యారు 7.KRV మూర్తి ఇదే క్లబ్ నుంచి ఎన్నో మ్యాచ్‌లు ఆడి స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్‌లో పని చేసి రిటైరయ్యారు 8.GP విజయ్ కుమార్ ఫుట్ బాల్ ప్లేయర్‌గా రాణించారు, రాష్ట్ర టీంకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో సెంట్రల్ ఎక్సైజ్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్నారు. 9.B వేణుగోపాల్, ఫుట్‌బాల్ ప్లేయర్ నుంచి సాయ్‌లో సీనియర్ కోచ్‌గా ఎదిగారు. అలాగే NIS సర్టిఫైడ్ కూడా 10.విక్టర్ అమూల్ రాజ్ బొల్లారం నుంచి భారత జట్టకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నారు. 11.మణిభూషణ్, రాష్ట్ర జట్టుకు ఆడారు 12.ES శ్యాం స్థానిక ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మొదలుపెట్టి అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. ప్రస్తుతం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పని చేస్తూనే కోచ్‌గానూ సేవలందిస్తున్నారు. AFC ‘A’ లైసెన్స్ సర్టిఫైడ్ కోచ్‌గా ఉన్నారు 13. BR వివేక్– రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రైల్వేస్‌లో పని చేసి రిటైరయ్యారు 14. జయకుమార్ - రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. రైల్వేస్‌లో పని చేసి రిటైరయ్యారు 15. అమర్ చంద్ - రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. స్టేట్ బ్యాంకులో పని చేస్తున్నారు. యువతలో ముఖ్యంగా చిన్నారుల్లో ఆటల పట్ల ఉత్సాహం పెంచాలన్నది ఈ సమ్మర్ క్యాంపు ప్రధాన ఉద్దేశ్యం. దానికి ఫుట్‌బాల్‌ను ఒక టూల్‌గా వాడుతున్నారు. శారీరక, మానసిక ఉల్లాసం కలిగించడంతో పాటు ఉత్సాహం పెంచడానికి కృషి చేస్తున్నారు. అలాగే చారిత్రక బొల్లారం ఫుట్‌బాల్ క్లబ్ నుంచి మరింత మంది కొత్త ప్లేయర్లను తయారు చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ క్లబ్ నిర్వహణకు అన్ని రకాల సహకారం అందిస్తోన్న మాజీ కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, గోపాల్‌రావు, జ్ఞానేశ్వర్, జీపీ విజయ్‌కుమార్‌తో పాటు ప్రస్తుత కార్యదర్శి రాజ్ సాయికృపా ఆనంద్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రెగ్యులర్ కోచ్‌లుగా సీనియర్ ఆటగాళ్లున్నారు. 1. గండ్ల సందీప్, రంగారెడ్డి జిల్లాతో పాటు యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు 2. S సునీల్ కుమార్, అండర్ 19 రాష్ట్ర టీంకు ప్రాతినిధ్యం వహించారు 3. C ప్రభాకర్ రెడ్డి, NIS సర్టిఫైడ్ కోచ్, కేంద్రీయ విద్యాలయం బొల్లారంలో కోచ్‌గా ఉన్నారు 4. బొడ్డు రాఘవేందర్, జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ ప్లేయర్ 5. Y వినోద్ కుమార్, సీనియర్ ప్లేయర్ 6. R చండిల్, సీనియర్ ప్లేయర్ 7. B అనిల్ కుమార్, సీనియర్ ప్లేయర్ వేర్వేరు ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తోన్న మాజీ ఆటగాళ్లు ఈ క్లబ్ నిర్వహణలో తమ వంతుగా సహకరిస్తున్నారు. సమ్మర్ క్యాంపులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు, వారందరికి ధన్యవాదాలు. ప్రతీ రోజు ఉదయాన్నే పిల్లలకు ఆటతో పాటు క్రమశిక్షణ, వ్యాయామం నేర్పిస్తున్నాం. ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొన్న పిల్లల్లో స్పష్టమైన మార్పును కనిపెట్టవచ్చు. శారీరకంగా ఉత్సాహాంగా ఉంటారు. -సునీల్, కోచ్, బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ వ్యక్తిగతంగా తమ విలువైన సమయాన్ని కేటాయిస్తున్నాం. ఎక్కడెక్కడో పని చేస్తున్నా.. ఈ క్యాంపు కోసం వంతులు వేసుకుని వందల కిలోమీటర్లు ప్రయాణించి రెండు, మూడు రోజులు ప్లేయర్లతో గడుపుతున్నాం. ఆఫీసులో ఎంత పని ఒత్తిడి ఉన్నా.. వీకెండ్లో ఇక్కడికి వచ్చి క్లబ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఈ తరంలో కొందరయినా.. బొల్లారం క్లబ్‌కు పునర్వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాం. -శ్యాం, ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్, కోచ్, స్టేట్ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ చిన్నప్పటి నుంచి ఈ క్లబ్‌తో అనుబంధం ఉంది. ఇక్కడే ఎంతో నేర్చుకున్నాం. అదే ఆటను ఇక్కడి వాళ్లకు నేర్పించడంలో ఎంతో ఆనందం ఉంది. ఎంత బిజీగా ఉన్నా.. ఇక్కడికి వచ్చి పిల్లలకు మెలకువలు నేర్పిస్తాం. బొల్లారం ఫుట్‌బాల్ క్లబ్ మా జీవితంలో భాగం. సందీప్, కోచ్, బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ -
క్లబ్ మేనేజర్‌తో గొడవ.. పీఎస్జీని వీడనున్నాడా?
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ త్వరలోనే పారిస్ సెయింట్ జెర్మెన్(PSG Club) వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీఎస్జీ క్లబ్ మేనేజర్ క్రిస్టొఫీ గాల్టియర్‌తో గొడవలే ఇందుకు కారణమని తెలుస్తోంది. మేనేజర్‌తో గొడవ కారణంగా మెస్సీ పీఎస్జీ క్లబ్ కొనసాగేందుకు ఇష్టంగా లేడని.. త్వరలోనే తెగదెంపులు చేసుకునే అవకాశం ఉందని డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. శనివారం పీఎస్జీ క్లబ్ నిర్వహించిన ట్రెయినింగ్ సెషన్‌కు మెస్సీ హాజరుకాలేదని.. గాల్టియర్‌తో పొసగకనే మెస్సీ తన హాటల్ రూంకే పరిమితమయ్యాడని తెలిపింది. మేనేజర్‌తో మెస్సీకి పొసగడం లేదన్న వార్తలు నిజమేనని మెస్సీ తండ్రి పేర్కొనడంతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లయింది. కాగా మెస్సీ 2021లో పీఎస్జీతో రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఏడాది జూన్‌తో మెస్సీకి పీఎస్జీతో కాంట్రాక్ట్ ముగియనుంది. మేనేజర్‌తో గొడవ కారణంగా మెస్సీ తన కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేసుకుంటాడా లేక బయటికి వస్తాడా అనేది ఆసక్తికంగా మారింది. అంతకముందు 2004 నుంచి 2021 వరకు 17 ఏళ్ల పాటు మెస్సీ స్పానిష్ క్లబ్ బార్సిలోనాకు ఆడాడు. ఒకవేళ పీఎస్జీ నుంచి బయటికి వస్తే మెస్సీ కచ్చితంగా మళ్లీ బార్సిలోనా గూటికే చేరే అవకాశం ఉంది. అయితే మెస్సీ పీఎస్జీ వీడనున్నట్లు వస్తున్న వార్తలకు మరో కారణం ఉంది. ఫ్రాన్స్ స్టార్ కైలియన్ ఎంబాపెతో మెస్సీ రిలేషన్ అంతగా బాగా లేదని.. ఇద్దరు స్టార్స్ ఒకేచోట ఇమడలేకపోతున్నారంటూ సమాచారం. ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్ తర్వాత వీరిద్దరి మధ్య రిలేషిన్షిప్ దెబ్బ తిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే పీఎస్జీలోకి వచ్చిన తర్వాత మెస్సీ ప్రయాణం అనుకున్నంత గొప్పగా ఏమి సాగడం లేదు. దీంతో అతను బయటికి రావడానికి ఇది కూడా ఒక కారణమని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. I'm sorry but Messi is definitely bigger than PSG https://t.co/wASmdHD9hz — Liam (@ThatWasMessi) March 18, 2023 చదవండి: ప్రపంచ పొట్టి బాడీబిల్డర్ వివాహం.. వీడియో వైరల్ వయసు పెరిగినా వన్నె తగ్గలేదు.. -
కత్తి పట్టిన క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) క్రిస్టియానో రొనాల్డో కత్తి పట్టాడు. సౌదీ అరేబియా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న అల్ నస్ర్ క్లబ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఆర్7 ఈ సాహసానికి ఒడిగట్టాడు. స్థానికంగా ఉండే ఓ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రొనాల్డో కత్తి పట్టడంతో పాటు సౌదీ సంప్రదాయ నృత్యంలోనూ భాగమయ్యాడు. Happy founding day to Saudi Arabia 🇸🇦Was a special experience to participate in the celebration at @AlNassrFC ! pic.twitter.com/1SHbmHyuez— Cristiano Ronaldo (@Cristiano) February 22, 2023 ఈ వేడుకలో సౌదీ సంప్రదాయ దుస్తులు ధరించి ఫోటోలకు పోజిచ్చిన సీఆర్7.. ఆ దేశ జెండాను భుజాలపై వేసుకుని కత్తిని గాల్లోకి లేపుతూ డ్యాన్స్ చేశాడు. ఈ కార్యక్రమంలో అల్ నస్ర్ యాజమాన్యంతో పాటు క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించే ప్లేయింగ్, నాన్ ప్లేయింగ్ సభ్యులంతా పాల్గొన్నారు. దీనికి సంబంధించినర వీడియోను రొనాల్డో స్వయంగా తన సోషల్‌మీడియా ఖాతాల ద్వారా షేర్ చేశాడు. సౌదీ అరేబియాకు వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు.. ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక అనుభూతిని కలిగించిందంటూ కామెంట్స్ జోడించాడు. కాగా, సౌదీ ఫుట్‌బాల్ క్లబ్ అల్ నస్ర్.. 2023 నుంచి 2025 జూన్ వరకు రెండేళ్ల పాటు క్రిస్టియానో రొనాల్డోతో 400 మిలియన్ల యూరోలకు భారీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. భారత కరెన్సీలో ఈ డీల్ విలువ రూ.3500 కోట్లకు పై మాటే. డీల్‌లో భాగంగా రొనాల్డో 2030 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రమోషన్లో భాగం కావాల్సి ఉంటుంది. ఈ ప్రపంచకప్‌కు సౌదీ.. పక్క దేశాలతో కలిసి ఆతిధ్యం ఇచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, సీఆర్7 ఇటీవలే తన క్లబ్ కెరీర్లో 500 గోల్స్ మైలరాయిని అధిగమించాడు. సౌదీ లీగ్‌లో భాగంగా అల్ వెహదా క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 గోల్స్ చేయడం ద్వారా రొనాల్డో ఈ రేర్ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్‌లో అల్ నస్ర్ 4-0 తేడాతో గెలుపొందగా.. అన్ని గోల్స్ సీఆర్7 ఖాతాలోకే వెళ్లాయి. 5 సార్లు బాలన్ డి ఓర్ విన్నర్ అయిన రొనాల్డో.. అత్యధిక అంతర్జాతీయ గోల్స్, ఛాంపియన్స్ లీగ్ గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన విషయం విధితమే. -
Indian Super League: హైదరాబాద్ ఎఫ్‌సీ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు అనూహ్య ఓటమి ఎదురైంది. జంషెడ్పూర్ ఎఫ్‌సీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 2–3 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. జంషెడ్పూర్ తరఫున రిత్విక్ దాస్ (22వ ని.లో), జే ఇమ్మాన్యుయెల్ థామస్ (27వ ని.లో), డానియల్ చుక్వు (29వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... హైదరాబాద్ తరఫున ఒగ్బెచె (12వ, 79వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. -
చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో మరో ఘనత సాధించాడు. ఫుట్‌బాల్ క్లబ్స్ తరఫున 500 గోల్స్ చేశాడు. సౌదీ ప్రో లీగ్‌లో నాలుగు గోల్స్ కొట్టి ఈ రికార్డుకు చేరువయ్యాడు. అల్ వెహ్దాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో చెలరేగిపోయాడు. మునపటి రొనాల్డోను గుర్తు చేస్తూ 30 నిమిషాల వ్యవధిలో బంతిని నాలుగు సార్లు గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దాంతో, అల్-నసర్ క్లబ్ 4-0తో గెలుపొందింది. ప్రస్తుతం అతని ఖాతాలో 503 గోల్స్ ఉన్నాయి. పోర్చుగల్‌లోని సావో పెడ్రో అనే చిన్న ద్వీపంలో పుట్టిన రొనాల్డో మొదట్లో అండోరిన్హా, నసియోనల్ వంటి స్థానిక క్లబ్స్‌కు ఆడాడు. ఆటలో నైపుణ్యం సాధించిన అతను 18 ఏళ్లకే సీనియర్ టీమ్‌కు ఆడాడు. అతను ఇప్పటి వరకు ఐదు క్లబ్స్‌కు ఆడాడు. రియల్ మాడ్రిడ్ తరఫున రొనాల్డో అత్యధికంగా 311 గోల్స్ కొట్టాడు. ఆ తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున 103 గోల్స్ చేశాడు. జువెంటస్ క్లబ్‌కు ఆడిన సమయంలో 81 గోల్స్ చేశాడు. స్పోర్టింగ్ లెబనాన్ క్లబ్ తరఫున మూడు, తాజాగా అల్ నసర్ క్లబ్ తరపున ఐదు గోల్స్ కొట్టాడు. ఓవరాల్‌గా పోర్చుగల్ తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు సహా అన్ని క్లబ్‌లు కలిపి 1100 మ్యాచ్‌లకు పైగా ఆడిన రొనాల్డో 820 గోల్స్ కొట్టాడు. Not bad for a 38yr-old… https://t.co/aFZJFwtlH1 — Piers Morgan (@piersmorgan) February 9, 2023 చదవండి: 135 మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్.. ఆటగాడిపై జీవితకాల నిషేధం ఆసీస్ కుర్రాడు ఆకట్టుకున్నా.. జడ్డూ, అక్షర్ తొక్కేశారు -
రొనాల్డో వల్ల గెలవడం కష్టమైపోయింది.. సహచరుడి సంచలన కామెంట్స్
స్టార్ ఫుట్‌బాలర్, పోర్చుగల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోపై అతని కొత్త క్లబ్ (సౌదీకి చెందిన అల్ నస్ర్ క్లబ్) సహచరుడు, ఆ జట్టు మిడ్ ఫీల్డర్ లూయిజ్ గుస్తావో సంచలన వ్యాఖ్యలు చేశాడు. రొనాల్డో వచ్చినప్పటి నుంచి తమ జట్టు గెలవడం కష్టంగా మారిందని లూయిజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రొనాల్డో తమ జట్టులో ఉన్నందున ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు రెండొందల శాతం ప్రదర్శన ఇస్తున్నారు.. అందువల్లే తమకు గెలవడం కష్టంగా మారిందని అన్నాడు. ఇక, తమ జట్టు విషయానికొస్తే.. రొనాల్డో తమతో చేరినప్పటి నుంచి జట్టులో చాలా మార్పులు వచ్చాయి. ఫిజికల్‌గా, టెక్నికల్‌గా బలంగా ఉన్న రొనాల్డోను చూసి తాము చాలా నేర్చుకుంటున్నామని అన్నాడు. సవాళ్లు స్వీకరించి, వాటిని అధిగమించడంలో రొనాల్డో దిట్ట, అతని సహవాసంలో తాము కూడా ఈ విషయంలో మెరుగవుతున్నామని గుస్తావో తెలిపాడు. కాగా, సౌదీ అరేబియాకు చెందిన అల్ నస్ర్ క్లబ్ ఇటీవలే రొనాల్డోతో భారీ డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అల్ నస్ర్ క్లబ్ రెండున్నరేళ్ల కాలానికి గానూ రొనాల్డోకు రూ.4400 కోట్ల భారీ మొత్తం అప్పజెప్పేందుకు డీల్ కుదుర్చుకుంది. ఈ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాక రొనాల్డో ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో గోల్ చేయకుండా నిరాశ పరిచిన GOAT.. శుక్రవారం అల్ ఫతేహీతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి నిమిషంలో ఓ గోల్ చేశాడు. ఫలితంగా అల్ నస్ర్ టీమ్ 2-2తో మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. అల్ నస్ర్ తరఫున రొనాల్డో చేసిన మొదటి గోల్ ఇదే. సౌదీ ప్రో లీగ్‌లో రూడీ గార్సియా నేతృత్వంలో ఆడుతున్న రొనాల్డో.. అల్ నస్ర్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్క గోల్ మాత్రమే చేశాడు. -
Lionel Messi: రొనాల్డో అరుదైన రికార్డు బద్దలు కొట్టిన మెస్సీ.. ఏకంగా..
Lionel Messi- Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో- లియోనల్ మెస్సీ.. ఈ ఇద్దరు ఫుట్‌బాల్ దిగ్గజాల మధ్య రికార్డుల పోటీ నువ్వా- నేనా అన్నట్లుగా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దకాలంగా సాకర్ ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్న ఈ ఇద్దరు లెజెండ్స్‌లో.. మెస్సీ ఫిఫా ప్రపంచకప్-2022 ట్రోఫీని ముద్దాడి ఓ మెట్టు పైన నిలిచాడు. మరోవైపు.. పోర్చుగల్ స్టార్ రొనాల్టోకు మాత్రం వరల్డ్‌కప్ టైటిల్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఖతర్ టోర్నీలో అర్జెంటీనా సూపర్‌స్టార్ మెస్సీ అద్భుతాలు చేయగా.. రొనాల్డో మాత్రం అవమానకర రీతిలో ఈవెంట్ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. రొనాల్డో రికార్డు బద్దలు ఈ క్రమంలో రొనాల్డోకు సాధ్యం కాని పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న లియోనల్ మెస్సీ.. ఈ పోర్చుగల్ స్టార్ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. టాప్-5 యూరోపియన్ లీగ్‌లలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా 697 గోల్స్‌తో రొనాల్డోను అధిగమించాడు మెస్సీ. ఫ్రెంచ్ లీగ్‌లో భాగంగా పారిస్ సెయింట్ జర్మనీ(పీఎస్జీ), మాంట్పిల్లర్ మ్యాచ్ సందర్భంగా మెస్సీ ఈ ఫీట్ నమోదు చేశాడు. పీఎస్జీకి ప్రాతినిథ్యం వహించిన ఈ అర్జెంటీనా లెజెండ్.. ఈ మ్యాచ్‌లో గోల్ ద్వారా రొనాల్డోను వెనక్కినెట్టాడు. క్లబ్ కెరీర్లో మొత్తంగా 697 గోల్స్ చేసి టాప్‌లో నిలిచాడు. ఇక ఇందులో ఈ సీజన్లో పీఎస్జీ తరఫున చేసిన గోల్స్ 13. మరోవైపు.. రొనాల్డో ఇప్పటి వరకు రియల్ మాడ్రిడ్ తరఫున 450, మాంచెస్టర్ యునైటెడ్ తరఫున 145, జువెంటస్ తరఫున 101 గోల్స్‌తో కలిపి మొత్తంగా 696 గోల్స్ సాధించాడు. ఇదిలా ఉంటే.. మాంట్పిల్లర్తో మ్యాచ్‌కు ముందు మెస్సీ మాట్లాడుతూ తన రిటైర్మెంట్పై సంకేతాలు ఇచ్చాడు. కోరుకున్నవన్నీ దక్కాయి.. ఇకపై ‘‘జాతీయ జట్టు తరఫున నేనైతే సాధించాలని అనుకున్నానో ఆ కల నెరవేరింది. వ్యక్తిగతంగా.. వృత్తిగతంగా నేను కోరుకున్నవన్నీ నాకు లభించాయి. శిఖరాగ్రంలో ఉన్నపుడే కెరీర్‌ను ముగించడమే మిగిలి ఉంది. నేను ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టినపుడు ఇక్కడి దాకా వస్తానని అస్సలు ఊహించలేదు. కెరీర్లో అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాను. ప్రస్తుతం నా జీవితంలో ఎలాంటి అసంతృప్తి లేదు. మేము 2021లో కోపా అమెరికా, 2022లో వరల్డ్‌కప్ గెలిచాము. ఇంతకంటే సాధించాల్సిందేమీ లేదు’’అని మెస్సీ అర్బన్ప్లేతో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియా ఫుట్‌బాల్ క్లబ్ అల్ నసర్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాడు. చదవండి: Shubman Gill Century: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్‌కు సచిన్ రావాల్సిందే! IND vs NZ: 'తీవ్రంగా నిరాశపరిచాడు.. స్పిన్నర్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలి’ What a Goal by the World Champion Lionel Messi. 🔥🐐 pic.twitter.com/yPJmqUgZda — x3a6y 🇦🇪 (@x3a6y) February 1, 2023 -
రిటైర్ అవ్వాల్సిన వయసులో ఫుట్‌బాల్ క్లబ్‌తో ఒప్పందం
55 ఏళ్లు.. మాములుగా అయితే రిటైర్మెంట్కు బాగా దగ్గర వయసు. అదే క్రీడల్లో అయితే ఎప్పుడో రిటైర్మెంట్ ఇచ్చేవాళ్లు. ఎంత ఫిట్‌గా ఉన్న శరీరం సహకరించకపోవడం వల్ల 40 ఏళ్లు వచ్చేసరికి ఏ క్రీడకు చెందిన ఆటగాళ్లైన రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫుట్‌బాల్ ఆటగాడు మాత్రం అందుకు విరుద్ధం. జపాన్‌కు చెందిన ఖజుయెషి మియురా(55).. ఫుట్‌బాల్‌ను విపరీతంగా ప్రేమించేవాడు. 55 ఏళ్ల వయసులోనూ కళ్లు చెదిరే ఫిట్నెస్తో ఒక ఫుట్‌బాల్ క్లబ్‌తో ఒప్పందం చేసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. పోర్చుగల్‌కు చెందిన రెండో డివిజన్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన ఒలివరెన్స్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇంతకవరకు యొకహమాకు ఎఫ్‌సీ క్లబ్‌కు ఆడిన మియురా ట్రేడింగ్‌లో పోర్చుగీస్ క్లబ్‌కు వెళ్లాడు. గత ఐదు దశాబ్దాలుగా జపాన్ తరపున ఫుట్‌బాల్ ఆడుతున్న మియురా ఇప్పటికి ఐదు దేశాలకు చెందిన క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ లిస్ట్‌లో బ్రెజిల్, జపాన్, ఇటలీ, క్రొయేషియా, ఆస్ట్రేలియా ఉన్నాయి. తాజాగా పోర్చుగల్ క్లబ్‌కు ఆడనున్న మియురాకు ఇది ఆరో దేశం కానుంది. మరో విషయం ఏంటంటే.. ఫిబ్రవరి 26తో మియురాకు 56 ఏళ్లు నిండనున్నాయి. ఇదే క్రమంలో మియురా ఒక రికార్డు నెలకొల్పాడు. అదేంటంటే.. ఫుట్‌బాల్‌లో గోల్స్ కొట్టిన అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. ఇంతకముందు తెస్పాకుసాత్సు 50 ఏళ్ల 14 రోజులు తొలి స్థానంలో ఉన్నాడు. ఇక మియురా ఇప్పటివరకు జపాన్ తరపున 89 మ్యాచ్‌ల్లో 55 గోల్స్ కొట్టాడు. Miura Kazu in the house! 😎#𝗨𝗗𝗢 #𝗦𝗼𝗺𝗼𝘀𝗨𝗻𝗶ã𝗼 #𝗢𝗥𝗲𝗴𝗿𝗲𝘀𝘀𝗼𝗗𝗮𝗨𝗻𝗶ã𝗼 pic.twitter.com/XcHWKTPI1p — UD Oliveirense Futebol SAD (@oliveirense_sad) February 1, 2023 చదవండి: అభిమానులను ఆశ్చర్యపరిచిన 'కింగ్' కోహ్లి పోస్ట్ -
Cristiano Ronaldo: కళ్లు చెదిరే రీతిలో.. కాసుల పంట
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు బంపరాఫర్ తగిలింది. ఫిఫా వరల్డ్‌కప్‌కు ముందే మాంచెస్టర్ యునైటెడ్‌తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో అప్పటినుంచి ఏ క్లబ్‌కు సంతకం చేయలేదు. తాజాగా ఆ ఎదురుచూపులకు రొనాల్డో తెరదించాడు. ఇకనుంచి రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు అల్ నజర్ ఫుట్‌బాల్ క్లబ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2023 సీజన్ నుంచి 2025 జూన్ వరకూ (రెండేండ్లు) రొనాల్డో.. అల్ నజర్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డీల్ విలువ 200 మిలియన్ యూరోలకు పైగా ఉందని సమాచారం. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1770 కోట్లు. ఫిఫా ప్రపంచకప్ సందర్భంలో ఇదే డీల్ పై పలు రకాల కథనాలు వినిపించాయి. అప్పుడు రొనాల్డో వీటిని కొట్టిపారేసాడు. తాను ఎవరితో ఒప్పందం కుదుర్చుకోలేదని చెప్పాడు. కానీ ఇప్పుడు భారీ డీల్‌తో ప్రేక్షకుల ముందు రావడం గమనార్హం. ఇక ఫిఫా ప్రపంచకప్‌లోనూ రొనాల్డో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్‌గా పోర్చుగల్‌ను ఫైనల్ చేరుస్తాడనుకుంటే క్వార్టర్స్‌కే పరిమితమయ్యాడు. అంతేగాక ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఐదు మ్యాచ్‌లాడిన రొనాల్డో కేవలం ఒకే ఒక్క గోల్ చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.అంతకముందు ఫిఫా ప్రారంభానికి ముందు పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాంచెస్టర్ యునైటెడ్‌తో తెగదెంపులు చేసుకున్నాడు. అదీగాక మాంచెస్టర్ యునైటెడ్ హెడ్ కోచ్ తో గొడవ ఈ వివాదం మరింత ముదిరేలా చేసింది. History in the making. This is a signing that will not only inspire our club to achieve even greater success but inspire our league, our nation and future generations, boys and girls to be the best version of themselves. Welcome @Cristiano to your new home @AlNassrFC pic.twitter.com/oan7nu8NWC — AlNassr FC (@AlNassrFC_EN) December 30, 2022 చదవండి: Pele: భారత్‌తో అనుబంధం... నాడు సాకర్ మేనియాలో తడిసిముద్దయిన నగరం పీలే క్రేజ్‌కు ఉదాహరణ.. షూ లేస్ కట్టుకున్నందుకు రూ.కోటి -
బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు
మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో బంధం ముగిసింది. ఇటీవలే పియర్స్ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఓనర్స్‌తో పాటు కోచ్ ఎరిక్ టెన్ హగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు క్లబ్ ద్రోహం చేసిందనీ.. కొత్త మేనేజర్ ఎరిక్ టెన్ హాగ్ పట్ల తనకు ఏమాత్రం గౌరవం లేదని రొనాల్డో పేర్కొన్నాడు. ఈ ఇంటర్య్వూ వివాదాస్పదంగా మారింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న మాంచెస్టర్ యునైటెడ్.. రొనాల్డోను వెంటనే క్లబ్ నుంచి బయటకు పంపుతున్నట్లు ట్విటర్లో తెలిపింది. "పరస్పర అంగీకారం ప్రకారం క్రిస్టియానో రొనాల్డోనూ వెంటనే క్లబ్ నుంచి తొలగిస్తున్నాం. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో రొనాల్డో ఇచ్చిన రెండు స్పెల్స్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.'' అంటూ మాంచెస్టర్ వెల్లడించింది. ఇక రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున 346 మ్యాచ్‌ల్లో 145 గోల్స్ కొట్టాడు. కాగా తొలిసారి రొనాల్డో 2003 నుంచి 2009 వరకు మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత మళ్లీ 2021లో మాంచెస్టర్ యునైటెడ్‌కు తిరిగి వచ్చిన రొనాల్డో ఏడాది వ్యవధిలోనే క్లబ్‌ను వీడాల్సి వస్తోంది. మాంచెస్టర్ యునైటెడ్ తనను తొలగించడంపై రొనాల్డో స్పందించాడు. "ఇది ముందే ఊహించాను. అయితే ఇంతకముందే జరిగిన పరస్పర అంగీకారం మేరకే నేను జట్టును వీడుతున్నా. అయినా నాకు మాంచెస్టర్ యునైటెడ్ అంటే ప్రేమ.. వాళ్లు చూపించే అభిమానం ఎప్పటికి మరిచిపోలేను. నేను వేరే క్లబ్‌కు ఆడినా అవి ఎప్పటికీ మారవు. అయితే కొత్త సవాలును స్వీకరించేందుకు నాకు ఇదే సరైన సమయం . ఈ సీజన్‌తో పాటూ భవిష్యత్తులో కూడా మాంచెస్టర్ యునైటెడ్ విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా" అంటూ తెలిపాడు. ఇక రొనాల్డో ప్రస్తుతం ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు వచ్చాడు. పోర్చుగల్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో ఎలాగైనా జట్టుకు కప్ అందించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక గ్రూప్-హెచ్లో ఉన్న పోర్చుగల్ ఘనా, ఉరుగ్వే, సౌత్ కొరియాలతో ఆడనుంది. గురువారం ఘనాతో పోర్చుగల్ అమితుమీ తేల్చుకోనుంది. రొనాల్డోపై రెండు క్లబ్ మ్యాచ్‌ల నిషేధం అభిమానితో గొడవ పడి అతని ఫోన్‌ను విసిరేసినందుకు మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ మాజీ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోపై ఇంగ్లండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ రెండు క్లబ్ మ్యాచ్‌ల నిషేధంతోపాటు 50 వేల పౌండ్ల జరిమానా విధించింది. గత ఏడాది ఏప్రిల్ 9న ఎవర్టన్తో జరిగిన ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో మాంచెస్టర్ 0–1తో ఓడిపోయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో రొనాల్డో తెగదెంపులు చేసుకోవడంతో తదుపరి సీజన్లో అతను ఆడే కొత్త క్లబ్ జట్టుకు ఈ నిషేధం వర్తిస్తుంది. Cristiano Ronaldo is to leave Manchester United by mutual agreement, with immediate effect. The club thanks him for his immense contribution across two spells at Old Trafford.#MUFC — Manchester United (@ManUtd) November 22, 2022 "That moment was probably the most difficult moment that I have in my life." Cristiano Ronaldo opens up about the devastating death of his baby son, telling Piers Morgan: "We don't understand why it happened to us."@cristiano | @piersmorgan | @TalkTV | #PMU pic.twitter.com/tOba0WJpBf — Piers Morgan Uncensored (@PiersUncensored) November 15, 2022 చదవండి: 'పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు' FIFA WC: అర్జెంటీనాకు షాకిచ్చిన సౌదీ అరేబియా -
ISL 2022: హైదరాబాద్‌ను గెలిపించిన యాసిర్
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. జంషెడ్‌పూర్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 1–0 గోల్‌తో జంషెడ్పూర్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది. ఆట 48వ నిమిషంలో మొహమ్మద్ యాసిర్ సాధించిన గోల్‌తో హైదరాబాద్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
Durnad Cup: సెమీస్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ
కోల్‌కతా: డ్యూరాండ్ కప్ టోర్నీలో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఐఎస్ఎల్ ఛాంపియన్ అయిన హెచ్ఎఫ్సీ సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రాజస్తాన్ యునైటెడ్ ఎఫ్‌సీని 3–1 తేడాతో ఓడించింది. హైదరాబాద్ తరఫున ఒగ్బెచె (6వ ని.లో), ఆకాశ్ మిశ్రా (45వ ని.లో), సివెరియో (69వ ని.లో) తలో గోల్ సాధించగా.. రాజస్తాన్ తరఫున మార్టిన్ చావెజ్(29ని.లో) ఏకైక గోల్ చేశాడు. గురువారం జరిగే సెమీస్‌లో హైదరాబాద్.. బెంగళూరు ఎఫ్‌సీతో తలపడనుంది. -
'ఏ జట్టును కొనడం లేదు'.. ఆడుకోవడానికి మేమే దొరికామా!
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. వ్యాపార రంగంలో దూకుడుగా కనిపించే మస్క్.. తాజాగా బుధవారం ఉదయం ఒక ట్వీట్లో సంచలన ప్రకటన చేశాడు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్(ఈపీఎల్)లో అత్యంత ప్రజాధరణ కలిగిన మాంచెస్టర్ యునైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఎలాన్ మస్క్ ఫుట్‌బాల్ టీంను కొనుగోలు చేస్తున్నాడన్న దానిపై సోషల్ మీడియాలో విభిన్న వాదనలు వచ్చాయి. కొందరు మస్క్‌ను ట్రోల్ చేయగా.. మరికొందరు మాత్రం మస్క్ రాకతో మాంచెస్టర్ యూనైటెడ్ జట్టు రూపురేఖలు మారతాయని పేర్కొన్నారు. ఇలా ఒక్క ట్వీట్‌తో ప్రపంచం మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేసిన ఎలాన్ మస్క్.. మూడు గంటల తర్వాత తాను ఎలాంటి జట్టును కొనుగోలు చేయడం లేదంటూ మరో ట్వీట్‌తో చావు కబురు చల్లగా చెప్పాడు. టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ.. తమ సీఈవో ఎలాన్ మస్క్ ను ఇదే విషయమై అడిగారు. ''మీరు చెబుతున్నది నిజమేనా..?''అని ప్రశ్నించారు. అప్పుడు మస్క్.. ''లేదు. అది (మస్క్ మాంచెస్టర్ జట్టును కొనుగోలు చేస్తున్నాడని) ట్విటర్ లో చాలా కాలంగా జోక్ ప్రచారంలో ఉంది. నేను ఏ జట్టును కొనుగోలు చేయడం లేదు'' అని పేర్కొన్నాడు. మస్క్ స్పష్టతనిచ్చాక కూడా ట్విటర్ లో అతడిపై మీమ్స్ వర్షం కురుస్తూనే ఉంది. ''ఆడుకోవడానికి నీకు మేమే దొరికామా'' అంటూ ఘాటైన విమర్శలు చేశారు. Are you serious? — Tesla Owners Silicon Valley (@teslaownersSV) August 17, 2022 No, this is a long-running joke on Twitter. I’m not buying any sports teams. — Elon Musk (@elonmusk) August 17, 2022 చదవండి: ఎలాన్ మస్క్ మరో సంచలనం! ఫుట్‌బాల్ టీమ్‌ను కొంటున్నా! -
ఎలాన్ మస్క్ మరో సంచలనం! ఫుట్‌బాల్ టీమ్‌ను కొంటున్నా!
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొనుగోలుపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారు. 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకోవడంతో మస్క్‌పై ట్విట్టర్ చట్టపరమైన పోరాటానికి దిగింది. ఈ నేపథ్యంలో మస్క్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్ టీం మాంచెస్టర్ యూనైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. To be clear, I support the left half of the Republican Party and the right half of the Democratic Party! — Elon Musk (@elonmusk) August 16, 2022 ట్విట్టర్లో యాక్టీవ్‌గా ఉండే ఎలాన్ మస్క్ తాజాగా అమెరికన్ పాలిటిక్స్‌పై ట్వీట్ చేశారు. నేను రిపబ్లికన్,డెమోక్రటిక్ ఈ రెండు పార్టీలకు మద్దతు ఇస్తున్నాని ట్వీట్లో పేర్కొన్నారు. Also, I’m buying Manchester United ur welcome — Elon Musk (@elonmusk) August 17, 2022 కొద్ది సేపటికే ఫుట్‌బాట్ టీం మాంచెస్టర్ యూనైటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ట్వీట్లో వెల్లడించారు. ప్రస్తుతం మస్క్ నిర్ణయం బిజినెస్ వరల్డ్‌లో మరింత ఆసక్తికరంగా మారింది. ట్విట్టర్ కొనుగోలుపై విచారణ జరుగుతుండగా ఈ బిజినెస్ టైకూన్ నిర్ణయం సర్వత్రా ఆసక్తి నెలకొంది. చదవండి👉 'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వైరల్! -
తొమ్మిది నిమిషాల్లో 5 గోల్స్.. ఫుట్‌బాల్‌లో కొత్త మొనగాడు
ఫుట్‌బాల్‌లో పెను సంచలనం నమోదైంది. బేయర్న్ మ్యూనిచ్ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాడు రాబర్ట్ లెవాండోస్కీ కొత్త చరిత్ర నమోదు చేశాడు. కేవలం తొమ్మిది నిమిషాల వ్యవధిలో ఐదు గోల్స్ కొట్టి ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ అద్బుత దృశ్యం జర్మన్ క్లబ్ వోల్ఫ్స్బర్గ్, బేయర్ మ్యూనిచ్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఆట 50, 53, 54, 56, 59వ నిమిషం.. ఇలా 9 నిమిషాల వ్యవధిలోనే రాబర్ట్ లెవాండోస్కీ ఐదు గోల్స్ కొట్టాడు. ఇందులో 53,54,56 వ నిమిషాలు హ్యాట్రిక్ గోల్స్ కాగా.. ఓవరాల్‌గానూ 5-గోల్స్ హాల్ సాధించాడు. ఒక సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా వచ్చి ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత చేశాకా బేయర్న్ మ్యూనిచ్ గెలవకుండా ఉంటుందా. లెవాండోస్కీ జోరుతో గతేడాది ఓటమికి జర్మన్ క్లబ్ వోల్ప్స్ బర్గ్‌పై పనిలో పనిగా ప్రతీకారం తీర్చుకుంది.ఇక లెవాండోస్కీ లాంటి స్ట్రైకర్ కోసం అన్ని ఫుట్‌బాల్ క్లబ్స్ ఎదురుచూస్తున్నాయి. మంచి అటాకింగ్ గేమ్ కనబరిచే లెవాండోస్కీ.. 'ఫుట్‌బాల్‌లో కొత్త మొనగాడు వచ్చాడంటూ' అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. Never forget when Robert Lewandowski scored five goals in nine minutes as a sub ⚡ (via @FCBayernUS)pic.twitter.com/03wY6cyo85 — B/R Football (@brfootball) July 15, 2022 చదవండి: Tiger Woods: కన్నీటి పర్యంతమైన టైగర్‌వుడ్స్ Allyson Felix: మాట నిలబెట్టుకున్న దిగ్గజ అథ్లెట్.. కెరీర్‌కు గుడ్‌బై -
41 సొంత గోల్స్.. ఫుట్‌బాల్ క్లబ్‌పై జీవితకాల నిషేధం
41 సొంత గోల్స్ కొట్టి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఒక ఫుట్‌బాల్ క్లబ్‌పై జీవితకాల నిషేధం పడింది. ఆ క్లబ్లో ఉన్న నాలుగు టీమ్‌లకు ఈ నిషేధం వర్తించనుంది. వాస్తవానికి ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పొరపాటున సొంత గోల్ చేయడం సహజమే. ఒక్కోసారి ఫన్నీగానూ ఇలాంటి సొంత గోల్స్ నమోదవుతాయి. ఒకటి.. రెండు అంటే పర్వాలేదు గానీ.. అదే పనిగా సొంత గోల్‌పోస్ట్‌పై దాడి చేయడం మ్యాచ్ ఫిక్సింగ్ కిందకు వస్తుంది. దీంతో ఆయా జట్టుపై జీవితకాల నిషేధం విధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా సౌతాఫ్రికా ఫుట్‌బాల్ క్లబ్ సామీ మైటీబర్డ్స్ విషయంలో అదే జరిగింది. మతియాసితో జరిగిన మ్యాచ్‌లో సామీ మైటీబర్డ్స్ 59-1 రికార్డు గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఇందులో 41 గోల్స్ సామీ మైటీబర్డ్స్ సెల్ఫ్ గోల్స్ ఉన్నాయి. నిబంధనల ప్రకారం సెల్ఫ్ గోల్ చేసే అది ప్రత్యర్థి ఖాతాలోకి వెళుతుంది. ఈ నేపథ్యంలో సామీ మైటీబర్డ్స్ జట్టులో ప్లేయర్ నెం-2 10 గోల్స్, ప్లేయర్ నెంబర్-5 20 గోల్స్, మరొక ప్లేయర్ 11 గోల్స్.. సెల్ఫ్ గోల్స్ కొట్టినట్లు మ్యాచ్ రిఫరీ వెల్లడించాడు. దీంతో ఉద్దేశ పూర్వకంగానే మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో సౌతాఫ్రికా లోయర్ డివిజన్లోని నాలుగు క్లబ్స్పై జీవితకాలం నిషేధం పడింది. South African lower division side Matiyasi FC 🇿🇦 have been BANNED for life after beating Nsami Mighty Birds 59-1, with 41 of the goals scored as own-goals. Matiyasi were vying for promotion to the Provincial ABC Motsepe League. pic.twitter.com/6D59M0dmy0 — Nuhu Adams ™️ (@NuhuAdams_) June 1, 2022 చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణ హత్య చేసిన ఫుట్‌బాలర్ -
శ్రీనిధి ఖాతాలో మరో గెలుపు
ముంబై: ఐ–లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎస్‌డీఎఫ్‌సీ) వరుసగా రెండో విజయాన్ని సాధించింది. గురువారం జరిగిన పోరులో శ్రీనిధి జట్టు 2–1తో ఇండియన్ ఆరోస్పై గెలుపొందింది. మ్యాచ్ అసాంతం శ్రీనిధి ఆటగాళ్ల హవానే కొనసాగింది. తొలి అర్ధభాగంలో ఛాంగ్తే (30వ ని.) చేసిన గోల్‌తో ఎస్‌డీఎఫ్‌సీ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లగా... ఇండియన్ ఆరోస్ తరఫున రోడ్రిగ్స్ (45+4వ ని.) గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. అనంతరం శ్రీనిధి ఆటగాడు డేవిడ్ మునోజ్ (69వ ని.) గోల్ చేసి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. శ్రీనిధి తదుపరి మ్యాచ్ శ్రీనిధి జట్టు... చర్చిల్ బ్రదర్స్ ఎఫ్‌సీ (గోవా)తో తలపడుతుంది. చదవండి: Neymar: 'తాగి వచ్చి జట్టును సర్వనాశనం చేస్తున్నాడు'.. స్టార్ ఫుట్‌బాలర్‌పై ఆరోపణలు -
'తాగి వచ్చి జట్టును సర్వనాశనం చేస్తున్నాడు'
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మర్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ట్రెయినింగ్ సెషన్‌కు తాగి వచ్చాడని.. అంతేగాక ప్రాక్టీస్ సమయంలోనూ తాగుతూ కనిపించాడంటూ ఆర్ఎంసీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డేనియల్ రియోలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. డేనియల్ రియోలో వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ''కొంతకాలంగా నెయ్మర్ ఆశించిన విధంగా రాణించడం లేదు. పైగా ప్రాక్టీస్ సెషన్లకు తాగి వస్తున్నాడు. జట్టును మొత్తం సర్వ నాశనం చేస్తున్నాడు. పీఎస్జీ ఫ్యాన్స్ కూడా నెయ్మర్ ప్రవర్తనపై గుర్రుగా ఉన్నారు. వెంటనే అతన్ని జట్టును నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారంటూ'' తెలిపాడు. కాగా చాంపియన్స్ లీగ్‌లో రియల్ మాడ్రిడ్ చేతిలో పారిస్ సెయింట్ జెర్మెన్ ఓడిపోయినప్పటి నుంచి ఏది కలిసిరావడం లేదు. వరుసగా ఇటీవలే ఆడుతున్న అన్ని మ్యాచ్‌ల్లోనూ పరాజయాలు చవిచూస్తూ వచ్చింది. తాజాగా లీగ్ 1లో భాగంగా మొనాకోతో జరిగిన మ్యాచ్‌లో పారిస్ సెయింట్ జెర్మెన్(పీఎస్జీ) 3-0 తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. కాగా నెయ్మర్ 2017లో బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్స్ జెర్మన్(పీఎస్జీ)కు మారాడు. చదవండి: PAK vs AUS: స్టీవ్ స్మిత్ అరుదైన ఫీట్.. టెస్టు చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు! Womes WC 2022: 'జప్ఫా' బంతితో మెరిసిన బౌలర్.. వీడియో వైరల్ -
ఐఎస్ఎల్ ఫైనల్లో హైదరాబాద్
బాంబోలిమ్ (గోవా): హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) జట్టు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఏటీకే మోహన్ బగాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ రెండో దశ మ్యాచ్‌లో హైదరాబాద్ 0–1తో పరాజయం పాలైంది. మోహన్ బగాన్ తరఫున 79వ నిమిషంలో కృష్ణ గోల్ నమోదు చేశాడు. అయితే ఇరు జట్ల మధ్య శనివారం జరిగిన తొలి దశ సెమీ ఫైనల్లో హైదరాబాద్ 3–1తో విజయం సాధించింది. ఇప్పుడు రెండు సెమీఫైనల్ మ్యాచ్‌ల తర్వాత ఓవరాల్‌గా 3–2 గోల్స్ తేడాతో హైదరాబాద్ ముందంజ వేసింది. ఈ నెల 20న జరిగే ఫైనల్లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీతో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ తలపడుతుంది. -
ముందుంది మరింత మంచికాలం!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తమ జట్టు ప్రదర్శన పట్ల హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) యజమాని వరుణ్ త్రిపురనేని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో నిలకడైన ప్రదర్శనతో హెచ్ఎఫ్సీ సెమీఫైనల్లో చోటు దక్కించుకుంది. మున్ముందు తమ జట్టులో స్థానిక క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్న ఆయన... ఓవరాల్‌గా ఐఎస్ఎల్ కూడా ఒక బలమైన బ్రాండ్‌గా మారిందని విశ్లేషించారు. లీగ్‌లో తమ ఆట తదితర అంశాలపై వరుణ్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... హైదరాబాద్ ఎఫ్‌సీ ప్రదర్శనపై... చాలా బాగుంది. ఇది మాకు మూడో సీజన్. తొలిసారి ఆడినప్పుడు జట్టు చివరి స్థానంలో నిలవడంతో పలు కీలక మార్పులు చేసి భిన్నమైన ప్రణాళికలతో బరిలోకి దిగాం. ఫలితంగా గత ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరువగా వచ్చాం. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనతో సెమీస్‌ను లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగాం. హైదరాబాదీ ఆటగాడు లేకపోవడంపై... స్థానికంగా ప్రతిభ ఉన్నవారిని తీసుకునేందుకు మేం గట్టిగానే ప్రయత్నిం చాం. హైదరాబాద్‌లో చెప్పుకోదగ్గ టోర్నమెంట్లు కూడా లేకపోవడంతో మేం ఆశించిన స్థాయి ప్రమాణాలు గల ఆటగాళ్లు లభించలేదు. ‘నామ్‌కే వాస్తే’గా టీమ్‌లోకి తీసుకోలేం కదా. చివరకు అభినవ్ అనే కుర్రాడిని గుర్తించగలిగాం. గోల్‌కీపర్‌గా అతను మా రిజర్వ్ జట్టులో భాగంగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఒక పద్ధతి ప్రకారం ఆటగాళ్లను ఐఎస్ఎల్ కోసం తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రిటైరైన విదేశీయులతో ఆడటంపై... అది ఆరంభ సీజన్లలో మాత్రమే జరిగింది. ఇది ఎనిమిదో ఐఎస్ఎల్ సీజన్. ఇప్పుడు ఈ టోర్నీ గురించి బయటి ప్రపంచానికి కూడా బాగా తెలుసు. పలు విదేశీ సంస్థలు మాకు స్పాన్సర్లుగా రావడం అందుకు నిదర్శనం. ప్రతీ సీజన్‌కు లీగ్ బలంగా మారుతోంది. మున్ముందు ఐఎస్ఎల్ స్థాయి పెరగడం ఖాయం. వచ్చే సీజన్ నుంచి లీగ్ మళ్లీ ప్రేక్షకుల మధ్యలో రానుంది కాబట్టి ఐఎస్ఎల్ ఎదుగుదలను మనం స్పష్టంగా చూడవచ్చు. -
పుతిన్‌తో సంబంధాలు.. ఆస్తులు అమ్ముకుంటున్న రష్యన్ బిలియనీర్లు
ప్రపంచం మొత్తం వారిస్తున్న వినకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై దాడికి దిగాడు. దీంతో అతనికి దగ్గరి వారిగా పేరొందిన అందరినీ టార్గెట్ చేస్తున్నాయి వెస్ట్రన్ కంట్రీస్. ముఖ్యంగా రష్యన్ బిలియనీర్లు పుతిన్‌తో ఉన్న సంబంధాల కారణంగా చిక్కుల్లో పడుతున్నారు. ఇంగ్లండ్ దేశంలో ఫుట్‌బాల్ ఆటకు ఎనలేని క్రేజ్ ఉంది. అక్కడ క్లబ్ స్థాయిల్లో జరిగే లీగ్‌లకు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ స్థాయిలో హడావుడి ఉంటుంది. ప్రతీ క్లబ్‌కి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉంటారు. ఇలా ఫుల్ క్రేజ్ ఉన్న ఫుట్‌బాల్ క్లబ్స్‌లో చెల్సియా ఒకటి. లండన్‌లో ఈ క్లబ్‌ని 1905లో నెలకొల్పారు. ఈ క్లబ్‌ని రష్యాకి చెందిన అబ్రామోవిచ్ అనే బిలియనీర్ 2003లో కొనుగోలు చేశాడు. అబ్రామోవిచ్ చేతికి వెళ్లిన తర్వాత ఈ క్లబ్ జాతకం మారిపోయింది. ఇంగ్లండ్ ఫుట్‌బాల్ క్లబ్లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. 19 ఏళ్ల కాలంలో అనేక లీగుల్లో సత్తా చాటింది. 19 ట్రోఫీలను గెలుచుకుంది. క్లబ్‌ను విజయ ప్రస్థానంలో నడిపించడంలో దాని ఓనర్ రష్యన్ బిలియనీర్ అబ్రామోవిచ్ మనసు పెట్టి పని చేశారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా ఏకపక్ష దాడులను నాటో సభ్య దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, యూకేలు రష్యాపై గరంగరంగా ఉన్నాయి. వరుస పెట్టి రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నారు. తమ దేశంలో ఉన్న రష్యన్ దేశస్థుల ఖాతాలను స్థంభింపజేస్తున్నారు. పలు బ్యాంకులు రష్యన్ సంస్థలకు సంబంధించిన లావాదేవీలు ఆపేస్తున్నాయి. రష్యా దాడితో ఒక్కసారిగా ఆ దేశ బిలియనీర్లు జాతకం మారిపోయింది. వారి బ్యాంకు ఖాతాలు పని చేయడం లేదు. ముఖ్యంగా పుతిన్‌కి దగ్గర వాడిగా పేరున్న అబ్రామోవిచ్పై కఠిన చర్యలకు యూకే అథారిటీలు రెడీ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో చెల్సియా క్లబ్‌ను విజయవంతంగా నడిపించడం కష్టమని అబ్రమోవిచ్ భావించారు. దీంతో చెల్సియా క్లబ్‌ని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆర్థిక సమస్యలు, ఆంక్షల ప్రభావం చెల్సియాపై పడకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, రష్యా దాడుల ప్రభావంతో ఒక్క సారిగా పరిస్థితులు మారిపోయాయని అబ్రామోవిచ్ అంటున్నారు. తాజా నిర్ణయం మనసుకు ఎంతో కష్టంగా ఉన్నా తప్పడం లేదంటూ వాపోతున్నారు. రష్యా అధ్యక్షుడికి సన్నిహంతా మెలుగుతూ ఇంత కాలం ప్రభను అనుభవించిన బిలియనీర్లు ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం స్పెయిన్‌లో రష్యాకు చెందిన ఆయుధాల సరఫరా వ్యాపారికి చెందిన రూ. 59 కోట్ల విలువైన అధునాతన యాచ్‌ని అందులో పని చేసే సిబ్బంది సముద్రంలో ముంచి వేసేందుకు ప్రయత్నించారు. రష్యా దాడులకు నిరసనగా ఆ యాచ్ మెయింటనెన్స్ పనులు చూస్తున్న ఉక్రెయిన్ ఇంజనీరు ఈ పని చేసినట్టు దర్యాప్తులో తేలింది. మొత్తంగా రష్యన్ బిలియనీర్లు ప్రపంచ వ్యాప్తంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. -
మహిళలకు అసభ్యకర సందేశాలు.. మాజీ ఫుట్‌బాలర్ నిర్వాకం
అజాక్స్ ఫుట్‌బాల్ క్లబ్‌కు డైరెక్టర్ హోదాలో ఉన్న మాజీ ఫుట్‌బాలర్ మార్క్ ఓవర్‌మార్స్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఉన్నతస్థానంలో ఉంటూ మహిళలకు అసభ్యకర సందేశాలు పంపాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన డచ్క్లబ్ ఓవర్మార్స్ను డైరెక్టర్ పదవి నుంచి తొలగించడమే గాక తాత్కాలిక నిషేధం విధించింది. కాగా నెదర్లాండ్స్‌కు చెందిన మార్క్ ఓవర్‌మార్స్ 11 ఏళ్ల పాటు జాతీయ జట్టుకు ఆడడంతో పాటు 1992-97 మధ్య కాలంలో అజాక్స్ ఫుట్‌బాల్ క్లబ్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు గత కొద్దిరోజులుగా మార్క్.. తనతో ఏకాంతంగా గడపాలంటూ తనతో పాటు పనిచేస్తున్న మహిళలకు అసభ్యరీతిలో సందేశాలు పంపాడు. మొదట ఇందులో నిజం లేదని కొట్టిసారేసినప్పటికి.. మెసేజ్‌లు వచ్చిన మహిళలు వాటిని బయటపెట్టడంతో మార్క్ బాగోతం బయటపడింది. కాగా 2012లో తొలిసారి అజాక్స్‌కు తొలిసారి డైరెక్టర్ అయ్యాడు. ఇటీవలే మరోసారి అజాక్స్ ఫుట్‌బాల్ డైరెక్టర్‌గా తిరిగి ఎంపికయిన మార్క్.. 2026, జూన్ 30 వరకు పదవిలో కొనసాగాల్సింది. తనపై వచ్చిన ఆరోపణలపై మార్క్ ఓవర్‌మార్స్ స్పందించాడు. ''నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నా. మహిళలకు అసభ్య సందేశాలు పంపినప్పుడు ఇలా జరుగుతుందని భావించలేదు. ఏది ఏమైనా నేను చేసింది తప్పు. నాపై యాక్షన్ తీసుకోవడం సరైనదే.. ఏ శిక్షకైనా సిద్ధం'' అంటూ క్షమాపణ కోరాడు. చదవండి: Beijing Winter Olympics: 'నరకంలా అనిపిస్తుంది.. పెట్టిందే పెట్టి మమ్మల్ని చంపుతున్నారు' Ajax statement on Marc Overmars 🔴⤵️ #Ajax “Overmars made this decision after discussions in recent days - a series of inappropriate messages sent to several female colleagues over an extended period of time underlies his decision to leave the club”. #Overmars pic.twitter.com/P3x4pisd1x — Fabrizio Romano (@FabrizioRomano) February 6, 2022 -
తలకు బలమైన గాయం.. అనుకున్నది సాధించాడు
ఫుట్‌బాల్ ఆటలో ఇరుజట్లు గోల్ కొట్టాలని ప్రయత్నిస్తాయి ఈ నేపథ్యంలో గోల్ అడ్డుకునే క్రమంలో ఆటగాళ్లకు దెబ్బలు తగలడం సహజం అయితే ఒక్కోసారి అవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది తాజాగా ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్‌బాల్ లీగ్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా సెనెగల్, కేప్ వర్డేల మధ్య మ్యాచ్ జరిగింది. చదవండి: ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. 8 మంది మృతి ఆట 57వ నిమిషంలో సెనెగెల్ స్ట్రైకర్ సాడియో మానే, కేప్‌వర్డే గోల్‌కీపర్ వోజిన్హా ఒకరినొకరు బలంగా ఢీకొట్టుకున్నారు. గోల్ కొట్టే క్రమంలో సాడియో మానే.. కేప్‌వర్డే నెట్స్ వైపు వేగంగా దూసుకొచ్చాడు. అదే సమయంలో గోల్ కీపర్ వోజిన్హా గోల్‌ను అడ్డుకునే క్రమంలో బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కానీ మానే అతని పైనుంచి గోల్ కొట్టేందుకు ప్రయత్నించాడు. దీనిని అడ్డుకునే క్రమంలో అతని తల ..మానే తలకు బలంగా తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన మానే స్టేడియంలోనే కుప్పకూలాడు. వెంటనే ఫిజియో వచ్చి పరీక్షించి చికిత్స అవసరమని చెప్పాడు. చదవండి: Australian Open 2022: పాపం కార్నెట్.. ఈసారి కూడా కల నెరవేరలేదు కానీ మానే ఇదేం పట్టించుకోకుండా తన ఆటను కొనసాగించాడు. గాయం బాధిస్తున్నా నొప్పిని పంటికింద అదిమి సరిగ్గా ఆరు నిమిషాలకు గోల్ కొట్టాడు. అలా సెనెగ్ ఖాతాలో తొలి గోల్ నమోదైంది. ఆ తర్వాత గోల్ కొట్టడంలో కేప్‌వర్డే విఫలం కావడంతో సెనెగల్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. కాగా మానేను ఉద్దేశపూర్వకంగా గాయపరిచినందుకు గోల్ కీపర్ వోజిన్హాకు రిఫరీ రెడ్‌కార్డ్ చూపెట్టాడు. ఇక ఆదివారం మాలి వర్సెస్ ఈక్వెటోరియల్ జినియా మధ్య విజేతతో సెనెగల్ క్వార్టర్ఫైనల్లో తలపడనుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత మానేను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తలకు గాయం అయినప్పటికి పెద్దగా ఇబ్బంది పడాల్సిందేమి లేదని.. తర్వాతి మ్యాచ్‌కు తాను సిద్ధంగా ఉన్నట్లు మానే ఆసుపత్రిలో దిగిన ఫోటోను షేర్ చేశాడు. చదవండి: Mitchell Santner: మిచెల్ సాంట్నర్ సూపర్ సిక్స్.. అద్దాలు పగిలిపోయాయి 💥 NASTY HEAD COLLISION BETWEEN SADIO MANE AND YOSIMAR DIAS! The goalkeeper was sent off after VAR review 🟥 Cape Verde down to nine men! 😱#TotalEnergiesAFCON2021 | #AFCON2021 | #SENCPV pic.twitter.com/GBGwasSHmk — beIN SPORTS USA (@beINSPORTSUSA) January 25, 2022 -
'మా ఇంట్లో దొంగలు పడ్డారు; నన్ను కొట్టి.. నా ఫ్యామిలీని'
మాంచెస్టర్ సిటీ యునైటెడ్ ఆటగాడు.. పోర్చుగల్ సాకర్ ప్లేయర్ జావో క్యాన్సెల్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయంలోకి వెళితే.. జావో క్యాన్సెల్లో ఇంటికి నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి అతనిపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని విలువైన వస్తువులు, నగలు దోచుకెళ్లారు. అడ్డువచ్చిన కుటుంబసభ్యులను ఇంట్లో బంధించి వెళ్లారు. ఈ దాడిలో జావో క్యాన్సెల్లో ముఖానికి గాయాలయ్యాయి. వీటన్నింటిని జావో తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు. చదవండి: Cristiano Ronaldo: ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డోకు భారత్‌లో అరుదైన గౌరవం ''నిజంగా ఈరోజు నా జీవితంలో అత్యంత దురదృష్టకరం. ఎవరో నలుగురు పిరికివాళ్ల మా ఇంటికి వచ్చి నాపై దౌర్జన్యం చేశారు. అడ్డువచ్చిన నా ఫ్యామిలీకి హాని కలిగించాలని చూశారు. నేను ప్రతిఘటించడంతో నా ముఖంపై భౌతిక దాడికి దిగారు. ఆ తర్వాత ఇంట్లో కనిపించిన వస్తువులు.. బంగారం ఎత్తుకెళ్లారు. ఇక్కడ అదృష్టం ఏంటంటే నా ఫ్యామిలీలో అందరూ బాగానే ఉన్నారు.. ఎవరికి ఏం కాలేదు.. అది సంతోషం. ఇలాంటివి నాకు కొత్తేం కాదు.. జీవితంలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మాంచెస్టర్ సిటీ యునైటెడ్ క్లబ్ క్యాన్సెల్లోపై జరిగిన దాడిని ఖండించింది. క్యాన్సెల్లో దాడి మాకు షాక్‌తో పాటు దిగ్భ్రాంతి చెందాము. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాం. కేసు నమోదు చేసి విచారణ చేయమని పోలీసులకు చెప్పినట్లు తెలిపింది. జావో క్యాన్సెల్లో 2019లో జువెంటస్ క్లబ్ నుంచి మాంచెస్టర్ సిటీ యునైటెడ్‌కు మారాడు. చదవండి: 55 నిమిషాల పాటు నరకం అనుభవించా: స్టీవ్ స్మిత్ -
ఐఎస్ఎల్లో తొలి భారతీయ హెడ్ కోచ్‌గా ఖాలిద్ జమీల్
గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో ఓ ప్రాంచైజీకి తొలిసారి ఓ భారతీయుడు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్ తరఫున 11 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన 44 ఏళ్ల ఖాలిద్ జమీల్‌ను నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టు హెడ్ కోచ్‌గా ఆ ఫ్రాంచైజీ నియమించింది. గతేడాది జమీల్ జట్టు తలరాతను అసాధారణంగా మార్చేశాడు. వరుస పరాజయాలతో నార్త్ ఈస్ట్ డీలాపడగా... హెడ్ కోచ్ గెరార్డ్ నుస్ నుంచి తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన ఖాలిద్ వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజేతగా నిలిపాడు. -
ఐపీఎల్‌పై ఆసక్తి చూపుతున్న క్రిస్టియానో రొనాల్డో జట్టు..!
Manchester United Owners Interested To Bid For Two IPL New Franchises: ఐపీఎల్-2022లో పాల్గొనే రెండు కొత్త జట్ల కోసం బీసీసీఐ టెండర్లు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్రపంచంలోనే సంపన్నమైన ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఒకటైన మాంచెస్టర్ యునైటెడ్.. కొత్త ఐపీఎల్ జట్లలో ఒక దాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం క్లబ్ యాజమాన్యమైన గ్లేజర్ కుటుంబం టెండర్ పత్రాలు సైతం కొనుగోలు చేసిందని సమాచారం. టెండర్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 20తో ముగినప్పటికీ.. సదరు క్లబ్ కోసం బీసీసీఐ చివరి తేదీని సైతం పొడిగించిందని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మాంచెస్టర్ క్లబ్ కొత్త ఐపీఎల్ జట్టును చేజిక్కించుకుంటే.. డబ్బుతో పాటు ఐపీఎల్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని బీసీసీఐ భావిస్తుంది. కాగా, స్టార్ ఫుట్‌బాలర్, పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కొత్త ఫ్రాంచైజీల రేసులో అహ్మదాబాద్, లక్నో, గౌహతి, కటక్, ఇండోర్, ధర్మశాల వంటి నగరాలు ముందు వరుసలో ఉన్నాయి. వీటిని సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్, టోరెంట్ ఫార్మా, అరబిందో ఫార్మా, ఆర్పి-సంజీవ్ గోయెంకా గ్రూప్, హిందుస్థాన్ టైమ్స్ మీడియా, జిందాల్ స్టీల్ వంటి దేశీయ కంపెనీలు పోటీపడుతున్నాయి. వీటితో పాటు విదేశీ సంస్థలు కూడా టెండర్ల ప్రక్రియలో పాల్గొన వచ్చని బీసీసీఐ ప్రకటించిన నేపథ్యంలో మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఐపీఎల్ కొత్త జట్ల కొనుగోలు రేసులో నిలిచినట్లు తెలుస్తోంది. చదవండి: సండే బిగ్ మ్యాచ్.. మీరు ఒత్తిడిలో? మరి నా పరిస్థితి! -
స్టార్ ఫుట్‌బాలర్‌కు చేదు అనుభవం.. హోటల్ గదిలోకి చొరబడి..!
Messi Robbed In paris Hotel: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్, ప్రపంచ సంపన్న క్రీడాకారుల్లో ఒకడైన లియోనెల్ మెస్సీకి పారిస్‌లో చేదు అనుభవం ఎదురైంది. అతను బస చేస్త్నున హోటల్ గదిలో దొంగలు పడి విలువైన ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. ఇటీవలే బార్సిలోనా క్లబ్‌ను వీడి పారిస్ సెయింట్ జెర్మేన్(పీఎస్జీ) క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న మెస్సీ.. గత కొంత కాలంగా భార్య, ముగ్గురు పిల్లలతో కలసి పారిస్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటున్నాడు. పారిస్‌లో తన స్థిర నివాసానికి మరమ్మత్తులు చేస్తుండడంతో మెస్సీ ఇక్కడి నుంచే మ్యాచ్‌లు ఆడేందుకు వెళ్తున్నాడు. ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా బుధవారం మాంచెస్టర్ సిటీతో మ్యాచ్ అనంతరం తిరిగి హోటల్ గదికి వెళ్లిన మెస్సీ.. తన సూట్లో దొంగతనం జరిగిన విషయాన్నిగుర్తించాడు. బెడ్రూమ్ లాకర్లో ఉన్న 40వేల డాలర్ల విలువైన నగలతో పాటు 15 వేల డాలర్ల నగదు అపహరణకు గురైనట్లు మెస్సీ హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పటిష్ట భద్రత ఉండే స్టార్ హోటల్లో దొంగతనం జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రకారం.. పారిస్‌లోని అత్యంత ఖరీదైన హోటల్లలో ఒకటైన 'లె రాయల్ మాన్సీయా'లోని నాలుగు గదుల సూట్ రూమ్‌లో మెస్సీ తాత్కాలికంగా బస చేస్తున్నాడు. ఈ సూట్‌కు అతను రోజుకు 23వేల డాలర్ల అద్దె చెల్లిస్తున్నాడు. ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ లీగ్‌లో మాంచెస్టర్ సిటీతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ అద్భుతమైన గోల్ చేసి జట్టును గెలిపించాడు. పీఎస్జీ తరఫున ఇది మెస్సీకి తొలి గోల్. చదవండి: చారిత్రక టెస్ట్ మ్యాచ్‌లో రికార్డు శతకం.. కోహ్లి తర్వాత..! -
మాంచెస్టర్ యునైటెడ్‌కు రొనాల్డో.. 12 ఏళ్ల తర్వాత
Cristiano Ronaldo.. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డొ 12 ఏళ్ల తర్వాత మాంచెస్టర్ యునైటెడ్‌కు తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు మాంచెస్టర్ యునైటెడ్ రెండేళ్ల కాలానికి గానూ 25 మిలియన్ యూరోస్కు(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 216 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది. 2018 నుంచి జూవెంటెస్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డొ బాలన్ డీఓర్ అండ్ చాంపియన్స్ లీగ్ టైటిల్లో జూవెంటస్ తరపున తన చివరి మ్యాచ్‌ను ఆడేశాడు. ఇక 18 ఏళ్ల వయసులో 2003లో మాంచెస్టర్ యునైటెడ్‌కు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన రొనాల్డొ 2009 వరకు ఆ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 2009 నుంచి 2018 వరకు రియల్ మాడ్రిడ్‌కు ఆడాడు. 2018 నుంచి జూవెంటస్కు ఆడుతున్నాడు. ఇక రొనాల్డొ పోర్చుగల్ జట్టు తరపున 134 మ్యాచ్‌ల్లో 90 గోల్స్ సాధించాడు. ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత గొప్ప ప్లేయర్లలో స్థానం సంపాదించిన రొనాల్డొ తన కెరీర్లో 32 టైటిల్స్ అందుకున్నాడు. దాదాపు పదకొండు వందలకు పైగా మ్యాచ్‌ల్లో ఆడిన రొనాల్డొ 780 గోల్స్ సాధించాడు. చదవండి: ENG Vs IND: మళ్లీ వచ్చేశాడు.. ప్యాడ్స్ కట్టుకొని కోహ్లి స్థానంలో -
లైంగిక వేధింపుల కేసు.. స్టార్ ఫుట్‌బాలర్‌పై వేటు
Benjamin Mendy.. ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్.. ప్రస్తుతం మాంచెస్టర్ సిటీ క్లబ్‌కు ఆడుతున్న అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. మెండీపై వచ్చిన అత్యాచార ఆరోపణలు నిజమేనని పోలీసులు పేర్కొనడంతో ప్రీమియర్ లీగ్ చాంపియన్ అతన్ని మాంచెస్టర్ సిటీ క్లబ్ నుంచి సస్పెండ్ చేసింది. 27 ఏళ్ల మెండీపై నాలుగు అత్యాచారాలతో పాటు ఒక లైంగిక వేధింపుల కేసులు నమోదైనట్లు ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ కోర్టు స్పష్టం చేసింది. మెండీపై ఫిర్యాదు చేసిన ముగ్గురి వయస్సు 16 ఏళ్లు అని.. అక్టోబర్ 2020 నుంచి ఆగస్టు 2021 మధ్య ఇది జరిగినట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా మెండీపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. కాగా నేడు(ఆగస్టు 27న) మెండీని చెస్టర్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. ఇక ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బెంజమిన్ మెండీ 2018లో ఫిఫా వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇక 2017 నుంచి మాంచెస్టర్ సిటీ క్లబ్ తరపున ఆడుతున్న మెండీ మొత్తంగా 75 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. చదవండి: Mohammed Siraj: సిరాజ్ స్కోరెంత.. ఇంగ్లండ్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్ -
ఆటగాళ్లపై కాసులవర్షం కురిపిస్తున్న ఫ్యాన్ టోకెన్లు!
లియోనెల్ మెస్సీ.. ఫుట్‌బాల్‌తోనే కాదు.. క్రేజీ ఒప్పందాల ద్వారా కూడా సంచలనాలు సృష్టిస్తున్నాడు. సుదీర్ఘకాలం కొనసాగిన స్పెయిన్ బార్సిలోనా క్లబ్‌ను వీడి.. ఫ్రాన్స్ పారిస్ సెయింట్ జెర్మయిన్ క్లబ్‌తో రెండేళ్ల ఒప్పందం.. అదీ సుమారు 610 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం పెద్ద చర్చకే దారితీసింది. అయితే ఈ రెమ్యునరేషన్లో ఫ్రెంచ్ క్లబ్‌కు చెందిన క్రిప్టో కరెన్సీ ‘ఫ్యాన్ టోకెన్స్’ ప్రస్తావన రావడం చాలామందిని గందరగోళానికి గురి చేసింది. మెస్సీతో డీల్ గురించి చెబుతూ ‘ఫ్యాన్ టోకెన్స్’ ప్రాముఖ్యత సంతరించుకోబోతోందని పీఎస్జీ క్లబ్ కామెంట్లు చేసింది. ఇంతకీ ఈ ఫ్యాన్ టోకెన్స్ అంటే ఏమిటి? మెస్సీతో కుదుర్చుకున్న మల్టీ మిలియన్ పీఎస్జీ ప్యాకేజీలో క్రిప్టోకరెన్సీ పాత్ర ఏంటో చర్చిద్దాం. సాకర్ ఆటగాళ్లకు అవి ఎలా లాభాలు ఇస్తున్నాయో చూద్దాం. ఫ్యాన్ టోకెన్స్ ఎన్ఎఫ్టీలో ఒక రకం. నాన్ ఫంగిబుల్ టోకెన్స్(ఎన్ఎఫ్టీ) అంటే ఒక్క మాటలో డిజిటల్ ఆస్తులు అని అర్థం. బిట్ కాయిన్, డిజిటల్ కరెన్సీల మాదిరిగానే.. ఫ్యాన్ టోకెన్స్ కూడా రాత్రికి రాత్రే విలువ మారే అవకాశాలు ఉంటాయి. అయితే అదృష్టాన్ని తెచ్చిపెట్టొచ్చు.. లేదంటే తీవ్ర నష్టాల్ని మిగల్చవచ్చు. ఫ్యాన్ టోకెన్స్‌ను క్రియేట్ చేసేది సోసియోస్ అనే వెబ్సైట్. ఈ వెబ్సైట్ నుంచే ఫుట్‌బాల్ క్లబ్‌లు తమకు కావాల్సిన రీతిలో ఫ్యాన్ టోకెన్స్లను డిజైన్ చేయించుకుంటాయి. ఈ టోకెన్లను ఫుట్‌బాల్ ఫ్యాన్స్ క్లబ్‌ల నుంచి కొనుగోలు చేయొచ్చు. తద్వారా ఈ టోకెన్లకు సంబంధించిన కంటెంట్‌ను ఉపయోగించుకోవడం, లేదంటే అగుమెంటెడ్ రియాలిటీ గేమ్స్‌ను ఆడడం చేయొచ్చు. అంతేకాదు ఈ ఫ్యాన్ టోకెన్స్ కలిగి ఉన్నవాళ్లు.. సదరు ఫుట్‌బాల్ క్లబ్ నిర్వహించే ఓటింగ్లలో పాల్గొనవచ్చు. ఉదాహరణకు.. కిట్ డిజైన్లు, గోల్ మ్యూజిక్, ప్రీ సీజన్ టూర్లకు ముందు వేదికలను ఖరారు చేయడం లాంటి చిన్న చిన్న నిర్ణయాల్లో ఓట్లు కీలకంగా వ్యవహరించొచ్చన్నమాట. ఎన్ని ఎక్కువ ఫ్యాన్ టోకెన్లు కలిగి ఉంటే.. అన్ని ఓట్లు వేసే హక్కు దక్కుతుంది ఆవ్యక్తికి. అలాంటి టోకెన్లను ఒప్పందాల్లో భాగంగా ఆటగాళ్లకు ధారాదత్తం చేస్తున్నాయి క్లబ్‌లు. మెస్సీకి లాభమేనా? మెస్సీకి ఎన్ని పీఎస్జీ ఎఫ్‌సీ ఎన్ని ఫ్యాన్ టోకెన్లు ఇచ్చిందనేది క్లారిటీ లేదు. వాటి విలువ గురించి కూడా క్లబ్ బహిరంగంగా ప్రకటన చేయకపోయినప్పటికీ.. సుమారు 29-35 మిలియన్ డాలర్ల(దాదాపు 200 కోట్ల రూపాయలకు పైనే)విలువ ఉండొచ్చని ఓ ప్రముఖ మీడియా హౌజ్‌తో పీఎస్జీ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ లెక్క చూసుకుంటే మెస్సీ ఒప్పందం సొమ్ము అనుకున్న దానికంటే ఎక్కువే అవుతుంది. ఇక మెస్సీకి క్రిప్టోకరెన్సీతో అనుబంధం కొత్తేం కాదు. 2017లో సిరిన్ ల్యాబ్స్ అనే కంపెనీ ద్వారా, కోపా అమెరికా ఎన్ఎఫ్టీతో మిలియన్ల డాలర్లు వెనకేసుకున్నాడు. ఇక మెస్సీవర్స్ అనే తన కలెక్షన్లతో నాలుగు డిజిటల్ ఆర్ట్ వర్క్స్(ఫ్యాన్స్ కొనుగులు చేసుకోవచ్చు) ద్వారా కూడా సంపాదించుకుంటున్నాడు. చెస్ థీమ్, గ్రీక్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ థీమ్‌ల ద్వారా భారీగానే సంపాదిస్తున్నాడు. మరొక డిజిటల్ ఆర్ట్ వర్క్ ఏంటన్నది ఆగస్టు 20న రివీల్ చేయనున్నారు. హాట్ న్యూస్: ఇక బరిలో దిగుతానో? లేదో? ఎంత లాభమంటే.. మెస్సీ పీఎస్జీలో చేరాడన్న వార్త తర్వాత క్లబ్ క్రిప్టో కాయిన్(ఫ్యాన్ టోకెన్) విలువ అమాంతం పెరిగింది. జూన్‌లో పీఎస్జీ ఫ్యాన్ ఒక టోకెన్ విలువ 11.93 డాలర్లు ఉండగా.. గురువారం సాయంత్రం నాటికి ఆ విలువ 43.91 డాలర్లుకు చేరుకుంది. ఇక ట్రేడ్ విలువ మొత్తం సుమారు 1.2 బిలియన్ డాలర్లకు(సుమారు 9 వేల కోట్ల రూపాయలు) చేరిందని, మెస్సీ క్రేజ్‌తో డిజిటల్ రెవెన్యూలో మున్ముందు మరిన్ని అద్భుతాలను ఆశిస్తున్నామని పీఎస్జీ ప్రతినిధి మార్క్ ఆర్మ్స్రా్టంగ్ వెల్లడించారు. మరికొన్ని టీంలు ఫ్యాన్ టోకెన్ల వల్ల సాలీనా 200 మిలియన్ డాలర్ల రెవెన్యూ జనరేట్ అవుతోందని సోషియోస్ చెబుతోంది. అర్సెనెల్, అస్టోన్ విల్లా, ఎవర్టోన్, లీడ్స్, మాంచెస్టర్ సిటీ, బార్సెలోనా, ఏసీ మిలన్, ఇంటర్ మిలన్, జువెంటస్, పీఎస్జీ, పోర్చుగ్రీస్ నేషనల్ టీం.. ఇలా కొన్ని జట్లు ఫ్యాన్ టోకెన్ల ఒప్పందాలను ఆటగాళ్లతో కొనసాగిస్తున్నాయి. కిందటి ఏడాది జూన్‌లో బార్సిలోనా ఫస్ట్ బ్యాచ్ ఫ్యాన్ టోకెన్ ప్రారంభించగానే.. రెండు గంటల్లోనే అవన్నీ అమ్ముడుపోయి. దీంతో మిలియన్నర డాలర్ల ఆదాయాన్ని వచ్చింది క్లబ్‌కి. కొత్తేం కాదు 2018లో టర్కీష్ క్లబ్ హరునుస్టాస్పోర్ బిట్‌కాయిన్ ఒప్పందం ద్వారా ఓ ఆటగాడితో ఒప్పందం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఒమర్ ఫారూఖ్ అనే ప్లేయర్‌కి 0.0524 బిట్‌కాయిన్‌తో పాటు 2,500 టర్కీష్ లీరాలు ఒప్పందంలో భాగంగా చెల్లించింది. ఆపై స్పెయిన్ ఆటగాడు డేవిడ్ బారోల్ను కేవలం క్రిప్టో కరెన్సీ ఉపయోగించి ఒప్పందం చేసుకోవడం విశేషం. అయితే తమ ఆటగాళ్ల కోసం పూర్తిస్థాయిలో క్రిప్టో కరెన్సీని మూడేళ్ల క్రితమే ఉపయోగించినట్లు గిబ్రాల్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రకటించుకోవడం విశేషం. - సాక్షి, వెబ్‌డెస్క్ -
ఊహించని పరిణామం: 21 ఏళ్ల బంధానికి గుడ్‌బై
Lionel Messi: ఫుట్‌బాల్ అభిమానులకు, మెస్సీ ఫ్యాన్స్‌కు మింగుడుపడని వార్త ఇది. స్టార్ ఆటగాడు, ప్రపంచంలోనే రిచ్చెస్ట్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ఊహించని పరిణామం ఎదురైంది. 21 ఏళ్ల సుదీర్ఘ బార్సిలోనా క్లబ్(Catalan club) పయనం ముగిసింది. ఇకపై ఈ స్పెయిన్ క్లబ్ తరపున మెస్సీ ఆడబోవడం లేదు. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఆయనతో కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకునేందుకు సుముఖంగా లేమని క్లబ్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం క్లబ్ తరపు అధికారిక సమాచారం వెలువడింది. దీంతో సాకర్ అభిమానులు నివ్వెరపోతున్నారు. నిజానికి క్లబ్‌తో మెస్సీ కాంట్రాక్ట్ ముగిసి చాలా రోజులే అవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని క్లబ్‌లు పోటాపోటీ పడగా.. అర్జెంటీనా ఫుట్‌బాల్ మాంత్రికుడు తమతోనే కొనసాగుతాడని క్లబ్ చెబుతూ వస్తోంది. ఇదిలా ఉంటే కోపా అమెరికా 2021 అర్జెంటీనా విక్టరీ తర్వాత.. మెస్సీ సెలవుల్లో ఉన్నాడు. తిరిగి బుధవారం క్లబ్లో చేరాడు. దీంతో ఈ వారాంతంలో కాంట్రాక్ట్ రెన్యువల్ ఉండొచ్చని కథనాలు వెలువడ్డాయి. ఇంతలోపే మెస్సీతో బంధం ముగిసిందని బార్సిలోనా ప్రకటించడం ఫుట్‌బాల్ అభిమానుల్ని విస్మయానికి గురి చేసింది. చదవండి: ఏం తమాషాగా ఉందా? అయితే వ్యక్తిగత కారణాలతో కిందటి ఏడాదే మెస్సీ.. బార్సిలోనా నుంచి బయటకు వచ్చేయాలని ప్రయత్నించాడు. అయితే అప్పుడే క్లబ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న జోవాన్ లపోర్టా.. మెస్సీని బతిమాలి కొనసాగేలా చూశాడు. తిరిగి ఈ ఏడాది జూన్ 30న మెస్సీ -బార్సిలోనా క్లబ్ ఒప్పందం ముగియగా.. 1 బిలియన్ డాలర్ల అప్పుల్లో క్లబ్ కూరుకుపోవడం, పైగా కరోనా దెబ్బకి ఆర్థికంగా కుదేలుకావడంతో కాంట్రాక్ట్ రెన్యువల్ అయ్యేనా? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే లపోర్టా మాత్రం మరో ఐదేళ్లు మెస్సీ తమతోనే కొనసాగుతాడంటూ కాన్ఫిడెంట్‌గా ప్రకటనలు ఇచ్చాడు. ఈ తరుణంలో నిన్న(గురువారం) ఉదయం క్యాంప్‌నౌ స్టేడియం దగ్గర జరిగిన చర్చల అనంతరం.. మెస్సీ కాంట్రాక్ట్ ముగిసినట్లు క్లబ్ ఈ ప్రకటన చేయడం విశేషం. 50 శాతం కోతలు, ఒప్పందంలో క్లబ్ కండిషన్లకు మెస్సీ విముఖత వ్యక్తం చేయగా.. కాంట్రాక్ట్ రద్దుకే క్లబ్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 13 ఏళ్ల వయసులో బార్సిలోనా క్లబ్ యూత్ వింగ్‌లో చేరిన మెస్సీ.. 16 ఏళ్లకు క్లబ్ జట్టులో చేరాడు. ఈ స్పెయిన్ క్లబ్ తరపున 778 మ్యాచ్‌లు ఆడి.. 672 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే బార్సిలోనా నుంచి తన ఎగ్జిట్‌పై మెస్సీ ఎలా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఫ్రీ ఏజెంట్‌గా ఉన్న మెస్సీ.. ఏ క్లబ్లో చేరేది త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
చెత్త టీం-చెత్త ఆఫర్లు.. ఏం తమాషాగా ఉందా?
ప్రపంచంలోనే ఖరీదైన ఫుట్‌బాల్ ఆటగాడిగా లియోనెల్ మెస్సీ(34)కి ఘనత ఉంది. అయితే తాజాగా బార్సిలోనాతో అతని కాంట్రాక్ట్ ముగిసింది. దీంతో మెస్సీ పయనమెటు? గందరగోళంలో మెస్సీ? అనే శీర్షికలతో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో చిన్న టీంల నుంచి చెత్త టీంల దాకా ప్రతీ ఒక్క క్లబ్‌లు మెస్సీకి బంపరాఫర్లు ప్రకటిస్తున్నాయి ఇప్పుడు. లియోనెల్ మెస్సీ.. ఇప్పుడు ఫ్రీ ఏజెంట్. బార్సిలోనాతో నాలుగేళ్ల ఒప్పందం జూన్ 30 అర్థరాత్రితో ముగిసింది. దాదాపు 500 మిలియన్ల డాలర్ల ఒప్పందంగా.. ప్రపంచంలోనే కాస్ట్లీ ప్లేయర్ కాంట్రాక్ట్‌ల్లో ఒకటిగా నిలిచింది. ఎన్బీఎ, నేషనల్ ఫుట్‌బాల్ లీగ్, బేస్‌బాల్ లీగ్‌లోనూ ఏ ఆటగాడితో ఇంతటి కాస్ట్లీ కాంట్రాక్ట్‌లు జరగలేదు. ఇదిలా ఉంటే బ్రెజిల్ ఐబిస్ స్పోర్ట్ క్లబ్ నుంచి వచ్చిన మెస్సీకి ఆఫర్ గురించి పెద్ద ఎత్తున్న చర్చ నడుస్తోంది. É OFICIAL! 🚨 Hoje é o último dia do contrato de Messi com o Barcelona. A partir de amanhã ele já terá um novo clube. Assina, MESSI ✒️📄🤝@betsson_brasil #MessiNoÍbis pic.twitter.com/tJKMOrqnLD — Íbis Sport Club (@ibismania) June 30, 2021 ప్రపంచంలోనే చెత్త ఫుట్‌బాల్ టీంగా ఐబిస్ స్పోర్ట్ క్లబ్ పేరుంది. అంతేకాదు. డెబ్భై నుంచి ఎనభై దశకాల మధ్య దాదాపు నాలుగేళ్లపాటు ఒక్క గేమ్ కూడా గెల్వని రికార్డ్ ఈ క్లబ్ సొంతం. ఇక అలాంటి క్లబ్ మెస్సీకి కొన్ని షరతుల మీద ఒప్పంద పత్రాన్ని ప్రకటించింది. పదిహేనేళ్ల కాంటాక్ట్, అదీ మెరిట్ బేస్ మీద జీతం, గోల్స్ చేయకుంటే కాంట్రాక్ట్ రద్దు చేసి క్లబ్ నుంచి తొలగించడం, కాంటాక్ట్ రద్దైతే తర్వాత ఛాంపియన్ అనే ట్యాగ్‌ను తీసేయడం, పదో నెంబర్ జెర్సీ వేసుకోవద్దని.. అది తమ లెజెండ్ మారో షాంపూకి మాత్రమే సొంతమని , ఇక క్లబ్లో చేరే ముందు మారడోనా కంటే పీలే గొప్పోడని అద్దం ముందు మూడుసార్లు ప్రతిజ్క్ష చేయాలనే కండిషన్.. ఇలా చిత్రమైన ఒప్పందాలతో మెస్సీకి ఆహ్వానం ఆఫర్ ప్రకటించింది ఆ క్లబ్. దీంతో మండిపడుతున్నారు అతని ఫ్యాన్స్. ఇక మెస్సీ పీఆర్ టీం కూడా ఈ వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇలాంటి వ్యవహారాలను పట్టించుకునేంత తీరిక మెస్సీకి లేదని ప్రకటించింది. ఇక ఈ ఫ్రీ ఏజెంట్ కోసం.. చిన్నచితకా క్లబ్‌లు సైతం పోటీ పడుతున్నాయి. మెస్సీ స్వస్థలం రోసారియో నుంచి నెవెల్స్ ఓల్డ్ బాయ్స్ క్లబ్ ఆసక్తి చూపిస్తోంది. సొంత జట్టుకు వచ్చేయమంటూ ట్విటర్ ద్వారా అతనికి ఆహ్వానం కూడా పలికింది. ఎస్టాడియో మార్సెలో బైస్లా స్టేడియం వద్ద మెస్సీ.. పేరుతో పెద్ద కట్ అవుట్లు(మ్యూరాల్స్) ఏర్పాటు చేయించింది కూడా. ఇక తన కెరీర్ చివర్లో తాను సొంత గూటికే వెళ్తానని చాలాసార్లు మెస్సీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీంతో ఆశలు పెట్టుకుంది ఓల్డ్ బాయ్స్. ఇక నెదర్లాండ్స్‌కు చెందిన వోలెన్డామ్ క్లబ్, రియల్ సాల్ట్ లేక్(అమెరికా) కూడా మెస్సీకి ఆహ్వానం పలకడం విశేషం. మరి మెస్సీ మనసులో.. సాధారణంగా బార్సిలోనా ఈ సాకర్ మాంత్రికుడి కాంట్రాక్ట్ రెన్యువల్కోసమే ప్రయత్నిస్తుంది. కానీ, 1 బిలియన్ డాలర్ల అప్పుల్లో క్లబ్ కూరుకుపోవడం, పైగా కరోనా దెబ్బకి ఆర్థికంగా కుదేలుకావడంతో కాంట్రాక్ట్ రెన్యువల్ అయ్యేనా? అనే అనుమానాలు ఉన్నాయి. అయితే క్లబ్ ప్రెసిడెంట్ జోవాన్ లపోర్టా స్పందించాడు. అతను మాతో ఉండాలనే మేం అనుకుంటున్నాం. అతనూ కోరుకుంటున్నాడు. అంతా సవ్యంగానే ఉందని వ్యాఖ్యానించాడాయన. మరి మెస్సీ మనసులో ఏముందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ⚽EL MURAL DEL 🔟 EN LA CIUDAD😍 👏Así va quedando el mural en homenaje a Lionel #Messi que se pinta en Buenos Aires y Azara, una de las esquinas del barrio natal de La Pulga en Rosario. La obra de arte será presentada este jueves 1 de julio. 📸Increíbles imágenes de @rosdrone pic.twitter.com/iY1VSy866X — Rosario3.com (@Rosariotres) June 30, 2021 చదవండి: యూరో 2020.. కరోనా అంటించుకున్న ఆ దేశ అభిమానులు -
మూడు నిమిషాల్లో రెండు గోల్స్...
మార్గావ్ (గోవా): ఓటమి ఖాయం అనుకున్న చోట గోవా ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఫార్వర్డ్ ఇగోర్ ఎంజులో అద్భుతం చేశాడు. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి జట్టుకు ఓటమిని తప్పించాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ ఏడో సీజన్లో భాగంగా ఆదివారం ఎఫ్‌సీ గోవా, బెంగళూరు ఎఫ్‌సీ మధ్య జరిగిన మ్యాచ్ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది. సీజన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్కో గోల్ మాత్రమే నమోదు కాగా... మూడో మ్యాచ్ మాత్రం అసలైన ఫుట్‌బాల్ వినోదాన్ని పంచింది. బెంగళూరు ఆటగాళ్లు సిల్వా (27వ నిమిషంలో), ఆంటోనియో గొంజాలెజ్ (57వ నిమిషంలో) తలా ఓ గోల్ సాధించారు. గోవా తరఫున ఇగోర్ (66వ, 69వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసి జట్టును గట్టెక్కించాడు. సునీల్ చెత్రి నాయకత్వంలోని బెంగళూరు తొలి అర్ధ భాగంలో అదరగొట్టింది. హర్మన్జోత్ సింగ్ లాంగ్ త్రోను ముందుకు దూసుకుంటూ వచ్చిన సిల్వా... తలతో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపి బెంగళూరుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. ఇక రెండో అర్ధ భాగంలో ఎరిక్ ఎండెల్ హెడర్‌తో ఇచ్చిన పాస్‌ను గోల్‌గా మలిచిన ఆంటోనియో బెంగళూరును 2–0తో పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ దశలో బెంగళూరు గెలుపు ఖాయంలా కనిపించింది. అయితే బెంగళూరు విజయావకాశాలను ఇగోర్ దెబ్బ తీశాడు. అల్బెర్టో, జెసురాజ్ ఇచ్చిన పాస్‌లను గోల్స్‌గా మలిచి... మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాడు. నేటి మ్యాచ్‌లో ఒడిశా ఎఫ్‌సీతో హైదరాబాద్ ఎఫ్‌సీ తలపడుతుంది. -
టూత్ పేస్ట్ కొనడానికి బయటకొచ్చి..
బెర్లిన్: కరోనా వైరస్ కారణంగా తమ లాక్డౌన్ నిబంధనల్ని పలు దేశాలు కఠినంగా అమలు చేస్తూనే పలు ఆంక్షలతో కూడిన సడలింపులు ఇస్తున్నాయి. ఇలా లాక్డౌన్ అమలు చేస్తూ కొన్నింటికి మినహాయింపు ఇచ్చిన వాటిలో జర్మనీ ఒకటి. రేపట్నుంచి(శనివారం) నుంచి జర్మనీలో బుండెస్లిగా ఫుట్‌బాల్ లీగ్ ఆరంభం కానుంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లంతా క్వారంటైన్ నిబంధనల్ని పాటిస్తున్నారు. కాగా, ఆగ్స్‌బర్గ్ జట్టుకు చెందిన కోచ్ హీకో హెర్లిచ్ మాత్రం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించాడు. టీమ్ బస చేసిన హోటల్లో ఉండకుండా బయటకొచ్చాడు. టూత్ పేస్ట్ అయిపోయిందని చెప్పి సూపర్ మార్కెట్‌కెళ్లి మరీ కొనుక్కొచ్చాడు. దీనిపై బుండెస్లిగా యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ కారణంగా ఆటగాళ్లతో సహా కోచ్‌లు కూడా క్వారంటైన్ నిబంధనల్ని పాటించాలని చెబితే బయటకు వెళ్లి చిన్నపాటి కారణాలు చెప్పడాన్ని ఆక్షేపించింది. ('వాడంటే నాకు ఇష్టం లేదు.. అందుకే చంపేశా') ఇది ఒక కోచ్‌గా తగదంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో బుండెస్లిగా లీగ్ పునః ప్రారంభపు మ్యాచ్‌కు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ‘జర్మన్ ఫుట్‌బాల్ లీగ్ టాస్క్‌ఫోర్స్ రూల్స్‌ను హెర్లిచ్ బ్రేక్ చేసిన కారణంగా అతను కనీసం ప్రాక్టీస్ సెషన్‌కు కూడా రాకుండా వేటువేసింది.. దీనిపై హెర్లిచ్ మాట్లాడుతూ.. ‘ హోటల్ నుంచి బయటకొచ్చి తప్పు చేశాను. నేను ఇప్పటివరకూ రూల్స్ పాటిస్తూ వచ్చాను. కానీ టూత్ పేస్ట్ లేకపోవడం వల్ల బయటకు రావాల్సి వచ్చింది. నేను చేసిన తప్పును అంగీకరిస్తున్నా. ఒక రోల్ మోడల్‌గా ఉండాల్సిన నేను రూల్స్‌ను అతిక్రమించా. దాంతో ట్రైనింగ్‌తో పాటు మ్యాచ్ కూడా కోచ్‌గా చేసే అవకాశాన్ని కోల్పోయా. నాకు కరోనా టెస్టులు చేసి నెగిటివ్ వచ్చిన తర్వాత జట్టుతో కలుస్తా’ అని హెర్లిచ్ పేర్కొన్నాడు.కరోనా సంక్షోభం తర్వాత తిరిగి ప్రారంభం అవుతున్న యూరప్ తొలి మేజర్ లీగ్ ఇదే. శనివారం ఆరంభమయ్యే ఈ ఫుట్‌బాల్ లీగ్‌లో ఆగ్స్‌బర్గ్-వుల్ఫ్స్ బర్గ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ('జాగ్రత్త.. నేను బరిలోకి దిగుతున్నా') -
బాలా దేవి అరుదైన ఘనత
బెంగళూరు: భారత ఫుట్‌బాల్ ప్లేయర్ బాలా దేవి అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. విఖ్యాత స్కాట్లాండ్ ఫుట్‌బాల్ క్లబ్ రేంజర్స్ ఎఫ్సీకి ప్రాతినిధ్యం వహించే గొప్ప అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకుంది. బాలా దేవి తమ జట్టుతో 18 నెలలు పనిచేయనుందని పేర్కొంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా ప్రొఫెషనల్ పుట్బాలర్గా మణిపూర్‌కు చెందిన 29 ఏళ్ల బాలా దేవి నిలిచింది. ఆసియా తరఫు నుంచి రేంజర్స్ జట్టులో చోటు దక్కించుకున్న తొలి మహిళ కూడా ఆమే కావడం విశేషం. భారత జట్టుకు గతంలో కెప్టెన్‌గానూ వ్యవహరించిన ఈ ఫార్వర్డ్ ప్లేయర్ 2010 నుంచి ఇప్పటివరకు 52 గోల్స్‌ను సాధించింది. -
హైదరాబాద్ తొలి విజయం
సాక్షి, హైదరాబాద్: సొంత ప్రేక్షకుల మధ్య స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకున్న హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో తొలి విజయాన్ని అందుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన హైదరాబాద్‌కు సొంత మైదానం కలిసొచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 2–1 తేడాతో కేరళ బ్లాస్టర్స్‌పై గెలిచింది. హైదరాబాద్ ఆటగాళ్లు స్టాంకోవిచ్ (54వ ని.), మార్సెలినో (81వ ని.) చెరో గోల్ సాధించారు. కేరళ తరఫున ప్రవీణ్ (34వ ని.) గోల్ చేశాడు. ఆరంభంలో ప్రత్యర్థి బలహీన డిఫెన్స్‌ను పదే పదే ఛేదించిన కేరళ హైదరాబాద్ గోల్ పోస్టుపైకి దాడులు చేసింది. 34వ నిమిషంలో సమద్ అందించిన పాస్‌ను గోల్ పోస్టులోకి నెట్టిన 19 ఏళ్ల కేరళ ఆటగాడు ప్రవీణ్ 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. విరామం తర్వాత హైదరాబాద్ పుంజుకుంది. 54వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన స్టాంకోవిచ్ స్కోర్‌ను సమం చేశాడు. 9 నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఫ్రీ కిక్‌ను కళ్లు చెదిరే రీతిలో గోల్ పోస్టులోకి పంపిన మార్సెలినో హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు. -
ఫుట్‌బాల్ రాత మారుస్తాం
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌బాల్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) సహ యజమాని విజయ్ మద్దూరి తెలిపారు. భవిష్యత్తులో ఇక్కడినుంచి సాకర్ స్టార్లను తయారు చేస్తామని చెప్పారు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కొత్తగా ఈ ఏడాది హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్రవేశించింది. వచ్చే నెల 20న మొదలయ్యే ఈ సీజన్లో హైదరాబాద్ ఎఫ్‌సీ తలపడనుంది. ఈ సందర్భంగా ఆదివారం టీమ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం వేడుకగా జరిగింది. దీనికి ప్రముఖ తెలుగు సినీ హీరో విక్టరీ వెంకటేశ్, భారత క్రికెట్ మాజీ కెపె్టన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నూతన అధ్యక్షుడు అజహరుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జట్టు యజమాని విజయ్ మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా నగరంలో ఫుట్‌బాల్‌ను విస్తరిస్తామని అన్నారు. నగరానికి ఫుట్‌బాల్‌లో చక్కని చరిత్ర ఉందని, తమ జట్టు దాన్ని మరింత బలబరిచేందుకు కృషి చేస్తుందని సహ యజమాని వరుణ్ త్రిపురనేని చెప్పారు. వెంకటేశ్ మాట్లాడుతూ ‘ఓ క్రీడాభిమానిగా హైదరాబాద్ ఎఫ్‌సీ ఫ్రాంచైజీకి స్వాగతం పలుకుతున్నా. ఐఎస్ఎల్లో తలపడేందుకు ఇప్పుడు మనకంటూ ఓ జట్టు ఉందని సంతోషం కలుగుతోంది. హైదరాబాద్ నుంచి పలువురు అంతర్జాతీయ స్థాయిలో ఆడారు. 1956 ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులో ఎనిమిది మంది హైదరాబాదీలే. ఈ క్లబ్‌తో మళ్లీ నగరానికి సాకర్ వైభవం రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. అజహర్ మాట్లాడుతూ హైదరాబాద్ ఎఫ్‌సీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తొమ్మిదేళ్ల క్రితమే తాను ఫుట్‌బాల్ అభివృద్ధికి తపించానని... అయితే అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు. -
చార్మినార్ ... కోహినూర్
హైదరాబాద్: ఈ సీజన్ నుంచి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కాలిడనున్న ‘హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ)’... శనివారం తమ అధికారిక లోగోను ఆవిష్కరించింది. నగరానికి తలమానికమైన చార్మినార్ నేపథ్యంగా, విఖ్యాత కోహినూర్ వజ్రాన్ని పోలిన ఆకృతిలో ఈ లోగో చూడగానే ఆకట్టుకునేలా ఉంది. దీనికి ‘హైదరాబాద్ ఫుట్‌బాల్ ఖ్యాతిని పునరుద్ధరించడం’ అని శీర్షిక ఇచ్చారు. ఈ సందర్భంగా క్లబ్ సహ యజమాని వరుణ్ త్రిపురనేని మాట్లాడుతూ... ‘ఫుట్‌బాల్‌లో హైదరాబాద్‌కు 1910 నుంచి మంచి గుర్తింపు ఉంది. 1920–1950 మధ్య అయితే భారత్ ఫుట్‌బాల్‌ను శాసించింది’ అని అన్నారు. ‘హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ విశేష ఆదరణ చూరగొంటుందని మాకు నమ్మకం ఉంది. నగరంలో సందడి వాతావరణం నెలకొనడం ఖాయం’ అని మరో సహ యజమాని విజయ్ మద్దూరి తెలిపారు. హైదరాబాద్ చరిత్రను దృష్టిలో పెట్టుకుని లోగోను డిజైన్ చేశామని, హెచ్‌ఎఫ్‌సీతో ఈ ప్రాంతంలో ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతుందని పేర్కొన్నారు. ఐఎస్ఎల్ ఆరో సీజన్ అక్టోబరు 20 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబరు 25న హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కతా (ఏటీకే)తో కోల్‌కతాలో తలపడతుంది -
స్పెయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌కు హైదరాబాద్ కుర్రాడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వర్ధమాన ఫుట్‌బాల్ ఆటగాడు ఎన్. ఆదర్శ్‌కు అరుదైన అవకాశం దక్కింది. సబ్ జూనియర్ స్థాయిలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి సత్తా చాటి న ఆదర్శ్ స్పెయిన్‌లోని ప్రఖ్యాత సీడీ ఒలింపిక్ డి జటీవా ఎ క్లబ్‌కు ఎంపికయ్యాడు. రెండేళ్ల పాటు క్లబ్ తరఫున ఆడనున్నాడు. 17 ఏళ్ల ఆదర్శ్ ఎంపికపై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి జీపీ ఫల్గుణ ఆనందం వ్యక్తం చేశారు. -
ఫుట్‌బాల్ ప్లేయర్‌గా షాకిచ్చిన బోల్ట్
సాక్షి, స్పోర్ట్స్ : జమైకా చిరుత.. స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారి అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చాడు. నెక్స్ట్జర్నీ హాష్‌ట్యాగ్‌తో బోల్ట్ చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇంతకీ విషయమేమిటంటే.. జర్మన్ ఫుట్‌బాల్ టీమ్ బొరష్యా డార్ట్మండ్ చారిటీ కోసం ఉద్దేశించిన వార్మప్ మ్యాచ్‌లో బోల్ట్ పాల్గొన్నాడు. అనుభవమున్న ఆటగాడిలా రెండు గోల్స్ చేసి సహచరులను, అభిమానులను ఆశ్చర్యపరిచాడు. పెనాల్టీ కిక్, హెడర్ ద్వారా గోల్ చేసి ఫుట్‌బాల్ ఆటగాళ్లకి షాక్ ఇచ్చాడు. ప్రపంచ కప్ విన్నర్ మారియో గాట్జ్తో తలపడి మరీ గోల్ చేయడం విశేషం. తన ప్రదర్శన చూసి డార్ట్మండ్ టీమ్ క్లబ్ తనతో కాంట్రాక్ట్ చేసుకుంటుందోమో అంటూ బోల్ట్ సరాదాగా వ్యాఖ్యానించాడు. మ్యాచ్ అయిపోగానే అభిమానులతో పాటు, ఫుట్‌బాల్ ఆటగాళ్లు కూడా బోల్ట్ ఆటోగ్రాఫ్ కోసం పోటీపడ్డారు. డార్ట్మండ్ టీమ్ స్పాన్సర్ ‘పూమా’ తో ఉన్న ఒప్పందం కారణంగా ఈ మ్యాచ్‌లో పాల్గొని ప్రచారం కల్పించాల్సిందిగా కోరటంతో బోల్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా అవతారమెత్తాడు. జూన్‌లో జరిగే మరో చారిటీ మ్యాచ్‌లో కూడా బోల్ట్ పాల్గొననున్నాడు. ఎనిమిది ఒలంపిక్ స్వర్ణ పతకాలు సాధించిన బోల్ట్ వరల్డ్ చాంపియన్ షిప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. New Levels #NextJourney pic.twitter.com/aeOilbnSq9 — Usain St. Leo Bolt (@usainbolt) March 23, 2018 -
సత్తుపల్లిలో ఫుట్‌బాల్ క్లబ్ ఏర్పాటు
సత్తుపల్లి(ఖమ్మం): ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం స్థానిక ఫుట్‌బాల్ క్రీడాకారులందరు కలిసి సత్తుపల్లి ఫుట్‌బాల్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్లబ్‌ను ఏర్పాటు చేసిన వారికి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తుందని.. ఈ క్లబ్‌కు తన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.