
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తమ హెడ్ కోచ్ తంగ్బోయ్ సింగ్టో(Thangboi Singto)కు ఉన్నపళంగా ఉద్వాసన పలికింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టు ప్రదర్శన పేలవంగా ఉండటంతో అతడిని తప్పించింది. 13 జట్లు తలపడుతున్న ప్రస్తుత సీజన్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 12వ స్థానంలో ఉంది.
పదకొండు మ్యాచ్‌లాడిన జట్టు కేవలం రెండింట గెలిచి ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకోగా... 8 మ్యాచ్‌లో ఓడింది. నిరాశజనక ప్రదర్శనపై అసంతృప్తితో ఉన్న ఫ్రాంచైజీ యాజమాన్యం ఉన్నపళంగా మణిపూర్‌కు చెందిన కోచ్‌పై వేటు వేసింది.
అసిస్టెంట్ కోచ్ షమీల్ చెంబకత్‌కు తాత్కాలిక హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పగించింది. గత ఐదేళ్లుగా సింగ్టో జట్టుతో ఉన్నాడు. మొదట్లో (2020లో) డైరెక్టర్‌గా ఉన్న అతడు.. తదనంతరం అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. గతేడాది జూలైలో హెడ్‌కోచ్‌గా నియమించారు.