
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. సోమవారం హైదరాబాద్ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్ బగాన్ క్లబ్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ కూడా తొలి సెమీఫైనల్ మాదిరిగానే 0–0తో ‘డ్రా’గా ముగిసింది. దాంతో విజేతను నిర్ణయించడానికి షూటౌట్ నిర్వహించారు.
‘షూటౌట్’లో మోహన్ బగాన్ 4–3తో హైదరాబాద్‌ను ఓడించింది. షూటౌట్‌లో హైదరాబాద్ తరఫున జావో, డాను, రీగన్ సఫలంకాగా... సివెరియో, ఒగ్‌బెచె విఫల మయ్యారు. ఈనెల 18న గోవాలో జరిగే ఫైనల్లో బెంగళూరు ఎఫ్‌సీతో మోహన్ బగాన్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment