
జంషెడ్‌పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ కీలక విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో జంషెడ్‌పూర్ 3–2 గోల్స్ తేడాతో ముంబై సిటీ ఎఫ్‌సీని ఓడించింది. జంషెడ్‌పూర్ తరఫున 36వ నిమిషంలో జె.ముర్రే...44వ, 50వ నిమిషాల్లో జేవీ హెర్నాండెజ్ గోల్స్ నమోదు చేశారు. ముంబై ఆటగాళ్లలో ఎన్.కరేలిస్ 18వ నిమిషంలో, వాన్ నీఫ్ 77వ నిమిషంలో గోల్స్ సాధించారు.
కోల్‌కతాలో మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్, ఎఫ్‌సీ గోవా మధ్య జరిగిన మరో మ్యాచ్ 1–1తో డ్రాగా ముగిసింది. మొహమ్మదాన్ తరఫున 66వ నిమిషంలో పెనాల్టీ ద్వారా ఎ.గోమెజ్ గోల్ కొట్టగా...గోవా ఆటగాళ్లలో ఎ.సాదికు (90+4) ఏకైక గోల్ సాధించాడు. కొచ్చిలో నేడు జరిగే మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీతో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment