రెండో సారి ఐఎస్‌ఎల్ టైటిల్ సాధించిన జట్టు
ఫైనల్లో మోహన్‌బగాన్‌పై 3–1తో విజయం
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) టోర్నీలో ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ రెండో సారి విజేతగా నిలిచింది. దాదాపు 62 వేల సామర్థ్యం గల సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన తుది పోరులో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. శనివారం జరిగిన ఫైనల్లో ముంబై 3–1 గోల్స్ తేడాతో మోహన్‌బగాన్ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఆరంభంలో ఇరు జట్లూ జాగ్రత్తగా ఆడుతూ డిఫెన్స్‌పైనే దృష్టి పెట్టాయి.
44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ సాధించిన గోల్‌తో ముందుగా మోహన్‌బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే రెండో అర్ధభాగంలో 3 గోల్స్‌తో ముంబై చెలరేగింది. ముంబై తరఫున జార్జ్ పెరీరా డియాజ్ (53వ నిమిషం), బిపిన్ సింగ్ (81వ నిమిషం), జాకబ్ వోజస్ (90+7వ నిమిషం)లో గోల్స్ కొట్టారు. 2020–21 సీజన్‌లో ముంబై విజేతగా నిలిచిన మ్యాచ్‌లో కూడా ఇదే తరహాలో మోహన్‌బగాన్ 1–0తో ఆధిక్యంలో నిలిచినా...బిపిన్ సింగ్ సాధించిన గోల్‌తోనే ముంబై గెలిచింది.
అదనపు సమయంలో మోహన్‌బగాన్‌కు స్కోరు సమం చేసే అవకాశం వచ్చినా... ఫార్వర్డ్‌లు పూర్తిగా విఫలమయ్యారు. కొన్ని క్షణాల్లో ఆట ముగుస్తుందనగా ముంబై మరో గోల్‌తో తిరుగులేని విజయా న్ని అందుకుంది. ముంబైకి చెందిన ఫుర్బా లచెన్పాకు ‘గోల్డెన్ గ్లవ్’, విక్రమ్ ప్రతాప్ సింగ్‌కు ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డు, కేరళ బ్లాస్టర్స్ ప్లేయర్ దిమిత్రియోస్ దియామంతకూస్‌కు ‘గోల్డెన్ బూట్’ అవార్డులు దక్కగా, మోహన్ బగాన్ ఆటగాడు పెట్రాటోస్ ‘ప్లేయర్ ఆఫ్ ద లీగ్’గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment