స్పోర్ట్స్‌ ఈవెంట్‌లో మెరిసిన రణబీర్‌, అలియా...మరో విశేషమేమంటే..! | Alia Bhatt And Ranbir Kapoor With Nita Ambani At A Football Match, Photo Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ ఈవెంట్‌లో మెరిసిన రణబీర్‌, అలియా...మరో విశేషమేమంటే..!

Oct 9 2023 12:05 PM | Updated on Oct 9 2023 12:54 PM

pic viral Alia Bhatt And Ranbir Kapoor With Nita Ambani At A Football Match - Sakshi

న్యూఢిల్లీ: ముంబైలో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లో బాలీవుడ్‌ లవబుల్‌ కపుల్‌ సందడి చేశారు.  బ్రహ్మాస్త్ర జంట అలియా భట్, రణబీర్ కపూర్ తళుక్కున మెరిసారు. అదీ  ISLని నిర్వహించే ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ చైర్‌పర్సన్ నీతా అంబానీతో కలిసి ఆదివారం సందడి చేశారు.  ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ముంబై సిటీ FC vs కేరళ బ్లాస్టర్ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు బాలీవుడ్ తారలతో పాటు, నీతా అంబానీ ,అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అలియా, రణబీర్‌  జంటను నీతా   ప్రత్యేకంగా అభినందించారు.

ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ ముంబై సిటీ FC సహ-యజమాని ఏ దిల్ హై ముష్కిల్ హీరో రణబీర్ తన జట్టుకు మద్దతుగా స్పోర్ట్స్ ఈవెంట్‌లో, ఇనీషియల్స్‌తో పాటు వెనుక ఎనిమిది నంబర్ ప్రింట్ చేసిన బ్లాక్ జెర్సీలో బ్యూటిఫుల్‌గా ఫ్యాన్స్‌ను అలరించాడు. బ్లాక్‌ కార్గో-స్టైల్ ప్యాంటు,మ్యాచింగ్ బ్లాక్ క్యాప్‌ను ధరించగా, ప్లస్ వన్ బ్లూ జెర్సీలో అలియా చేతులు పట్టుకుని స్టేడియంలోకి ప్రవేసించారు. అక్కడ  ఫ్యాన్స్‌తో, సెల్పీలకు పోజులిచ్చారు. ఈ  క్రమంలో ఒలింపిక్ అధ్యక్షురాలు నీతి అంబానీతో కలిసి పోజులివ్వడం విశేషంగా నిలిచింది. రణబీర్, అలియా జంట క్రీడాభిమాన్లు. గత నెలలో న్యూయార్క్‌లో విహారయాత్ర చేస్తున్నప్పుడు, ఈ జంట యూఎస్‌  ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో  కూడా మెరిసిన సంగతి తెలిసిందే

.

 కాగా అంబానీ నివాసంలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు  గత నెలలో, అలియా,  బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీతో కలిసి హాజరయ్యారు. అయితే  ఈ వేడుకుకు భర్త రణ్‌బీర్ ఈవెంట్‌కు మిస్సయ్యాడు. ఇక వర్క్ ఫ్రంట్‌ విషయానికి వస్తే నేషనల్‌ అవార్డు విన్నర్‌ అలియాస్వయంగా నిర్మిస్తున్న జిగ్రా అనే యాక్షన్ చిత్రంలోనూ నటిస్తూ, నిర్మిస్తోంది. రణవీర్ సింగ్‌తో కలిసి  బైజు బావ్రా అనే పీరియాడికల్ డ్రామాలో నటిస్తోంది. అలాగే  రణబీర్ కపూర్ యానిమల్ కోసం సిద్ధమవుతున్నాడు. బాబీ డియోల్, అనిల్ కపూర్ , నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న కూడా  నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement