
రణబీర్ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ 'యానిమల్' సినిమా వల్ల మనోళ్లకు కూడా తెగ నచ్చేశాడు. ఇతడి భార్య ఆలియా భట్.. తెలుగులో 'ఆర్ఆర్ఆర్' మూవీలో హీరోయిన్ గానూ చేసింది.
ఇకపోతే వీళ్లిద్దరూ 2022 ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లది ప్రేమ వివాహం. అదే ఏడాది నవంబరులో వీళ్లకు కూతురు కూడా పుట్టింది. సరే ఇదంతా పక్కనబెడితే ఆలియా తన మొదటి భార్య కాదని, గతంలో ఓ క్రేజీ అనుభవం ఉందని రణబీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు)
'హీరోగా నేను నటిస్తున్న తొలినాళ్లలో ఓ అమ్మాయి.. ఏకంగా పెళ్లి కూతురిలా రెడీ అయి నా ఇంటి దగ్గరకొచ్చింది. కూడా పురోహితుడు ఉన్నాడు. ఆ సమయానికి నేను వేరే దేశంలో ఉన్నాను. దీంతో నా ఇంటి గేటుకి బొట్టు పెట్టి ఆమె పెళ్లి చేసుకుంది. తిరిగొచ్చి మా వాచ్ మన్ ద్వారా జరిగిందంతా తెలుసుకుని.. ఇదేదో క్రేజీగా ఉందే అనుకున్నాను. ఇప్పటివరకైతే నా తొలి భార్యని కలుసుకోలేకపోయాను. ఏదో రోజు కచ్చితంగా కలుస్తానని అనుకుంటున్నాను' అని రణబీర్ కపూర్ చెప్పుకొచ్చాడు.
మరి రణబీర్ అన్నట్లు అప్పుడెప్పుడో ఇతడి ఇంటి గేటుని పెళ్లి చేసుకున్న ఆ వీరాభిమాని ఎక్కడుందో? మరి ఇప్పుడు రణబీర్ చెప్పిన మాటలకు స్పందిస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: కాలమే సమాధానం.. పోలీసు విచారణ తర్వాత విష్ణుప్రియ)
Comments
Please login to add a commentAdd a comment