అక్టోబరులో ఆరంభం | Ranbir Kapoor and Vicky Kaushal and Alia Bhatt to begin shooting for Sanjay Leela Bhansali Love And War | Sakshi
Sakshi News home page

అక్టోబరులో ఆరంభం

Published Mon, Aug 26 2024 3:56 AM | Last Updated on Mon, Aug 26 2024 3:56 AM

Ranbir Kapoor and Vicky Kaushal and Alia Bhatt to begin shooting for Sanjay Leela Bhansali Love And War

అక్టోబరులో లవ్‌ అండ్‌ వార్‌ అంటున్నారట రణ్‌బీర్‌ కపూర్‌. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం ‘లవ్‌ అండ్‌ వార్‌’. రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్‌ ఈ సినిమాలో లీడ్‌ రోల్స్‌లో నటించనున్నారు. ఈ ఏడాది జనవరిలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కానీ చిత్రీకరణ ప్రారంభం కాలేదు. అయితే ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌ను సెప్టెంబరు లోపు పూర్తి చేసి, అక్టోబరు మొదటి వారంలో సినిమాను సెట్స్‌ పైకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట భన్సాలీ.

ముందుగా అక్టోబరులో రణ్‌బీర్‌ కపూర్‌ సోలో సీన్స్‌తో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అవుతుందట. ఆ తర్వాత రణ్‌బీర్‌ – విక్కీ కౌశల్‌ల కాంబినేషన్‌లోని ఫ్రెండ్‌షిప్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తారని, ఆ తర్వాత రణ్‌బీర్‌ కపూర్‌ – ఆలియా – విక్కీ కౌశల్‌ కాంబినేషన్‌లోని సన్నివేశాలను షూట్‌ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్‌ సమాచారం. ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా ‘లవ్‌ అండ్‌ వార్‌’ని తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా 2025 క్రిస్మస్‌కి రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement