ranbir kapoor
-
నా ఇంటి గేటుని ఆమె పెళ్లి చేసుకుంది: 'యానిమల్' హీరో
రణబీర్ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ 'యానిమల్' సినిమా వల్ల మనోళ్లకు కూడా తెగ నచ్చేశాడు. ఇతడి భార్య ఆలియా భట్.. తెలుగులో 'ఆర్ఆర్ఆర్' మూవీలో హీరోయిన్ గానూ చేసింది.ఇకపోతే వీళ్లిద్దరూ 2022 ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. వీళ్లది ప్రేమ వివాహం. అదే ఏడాది నవంబరులో వీళ్లకు కూతురు కూడా పుట్టింది. సరే ఇదంతా పక్కనబెడితే ఆలియా తన మొదటి భార్య కాదని, గతంలో ఓ క్రేజీ అనుభవం ఉందని రణబీర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు)'హీరోగా నేను నటిస్తున్న తొలినాళ్లలో ఓ అమ్మాయి.. ఏకంగా పెళ్లి కూతురిలా రెడీ అయి నా ఇంటి దగ్గరకొచ్చింది. కూడా పురోహితుడు ఉన్నాడు. ఆ సమయానికి నేను వేరే దేశంలో ఉన్నాను. దీంతో నా ఇంటి గేటుకి బొట్టు పెట్టి ఆమె పెళ్లి చేసుకుంది. తిరిగొచ్చి మా వాచ్ మన్ ద్వారా జరిగిందంతా తెలుసుకుని.. ఇదేదో క్రేజీగా ఉందే అనుకున్నాను. ఇప్పటివరకైతే నా తొలి భార్యని కలుసుకోలేకపోయాను. ఏదో రోజు కచ్చితంగా కలుస్తానని అనుకుంటున్నాను' అని రణబీర్ కపూర్ చెప్పుకొచ్చాడు.మరి రణబీర్ అన్నట్లు అప్పుడెప్పుడో ఇతడి ఇంటి గేటుని పెళ్లి చేసుకున్న ఆ వీరాభిమాని ఎక్కడుందో? మరి ఇప్పుడు రణబీర్ చెప్పిన మాటలకు స్పందిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: కాలమే సమాధానం.. పోలీసు విచారణ తర్వాత విష్ణుప్రియ) -
అమ్మా... నాన్నా... ఒక రాహా!
‘అమ్మాయి పుట్టాక మా ఆయనలో పూర్తిగా మార్పు వచ్చింది’ అనే మాట అక్కడక్కడా వింటుంటాం. అంటే... ఎప్పుడూ ఫైర్‌బ్రాండ్‌లా ఉండే భర్త శాంతమూర్తిగా మారిపోతాడు. వ్యసనాల బారిన పడిన భర్త ఆ చీకటి నుంచి బయటికి వస్తాడు.ఒక్క ముక్కలో చెప్పాలంటే... పిల్లలకు ఉండే పవర్ అదే! తాజా విషయానికి వస్తే... ఒక ఇంటర్వ్యూలో భర్త రణ్‌బీర్ కపూర్ గురించి చెప్పారు ఆలియా.‘రాహా పుట్టిన తరువాత రణ్‌బీర్ మారిపోయాడు’ అనడమే కాదు ‘రాహాను ఎంటర్టైన్ చేయడానికి చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తాడు’ అని ప్రశంసలు కురిపించారు ఆలియా.మరి ముద్దుల కూతురు మాటేమిటి? ‘రాహా కూడా రణ్‌బీర్‌ను బాగా ఎంటర్టైన్ చేస్తుంది’ అని చెప్పారామె. ‘వారిద్దరూ మాట్లాడుకుంటుంటే తండ్రీ కూతుళ్లు మాట్లాడుకున్నట్లుగా కాకుండా ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుంది’ అని మురిసిపోతారు ఆలియా. ‘వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు తీసిన వీడియోలు నాకు భవిష్యత్ కాలంలో అపూర్వమైన నిధులు’ అని కూడా అంటారామె.ఇంతకీ రాహా వల్ల రణ్‌బీర్‌లో వచ్చిన మార్పు ఏమిటి? ఆలియా సూటిగా చెప్పకపోయినా ఆమె మాటలను బట్టి అర్థమయ్యేదేమిటంటే.... ‘మునుపటితో పోల్చితే చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు’ ‘ఇతరులతో మాట్లాడే విధానంలో మార్పు వచ్చింది’ మార్పు... మంచిదే కదా! థ్యాంక్స్.... రాహా! రాహా అంటే స్వాహిలీ భాషలో ‘సంతోషం’ అని అర్థం. -
ప్యార్ మే పడిపోయామే...
బాలీవుడ్లో కొందరు యంగ్ హీరోలు, హీరోయిన్లు ఉల్లాసంగా,ఉత్సాహంగా ప్రేమలో పడుతున్నారు. ప్యార్ మే పడిపోయామే... అంటూ సినిమా సెట్స్‌లో లవ్ సాంగ్స్, డైలాగ్స్ చెబుతున్నారు. సిల్వర్ స్క్రీన్ కోసం ఈ ప్యార్ ప్రపంచంలో మునిగి తేలుతున్న ఆ జంటల గురించి తెలుసుకుందాం...ముక్కోణపు ప్రేమ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం తొలిసారి కలిసి పని చేశారు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్. ఈ సినిమా ప్రయాణంలోనే రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ ప్రేమలో పడ్డారు. ఈ సినిమాలోని తొలిపార్టు ‘బ్రహ్మాస్త్ర:పార్టు 1 శివ’ 2022 సెప్టెంబరులో విడుదలైంది. కానీ అంతకు ముందే... అంటే 2022 ఏప్రిల్‌లోనే రణ్‌బీర్, ఆలియా పెళ్లి చేసుకున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందనున్న మూవీ ‘లవ్ అండ్ వార్’. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ మరో లీడ్ రోల్ చేయనుండగా, సంజయ్ లీలా భాన్సాలీ డైరెక్షన్ చేయనున్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయిల మధ్య సాగే ముక్కోణపు లవ్‌స్టోరీగా ఈ మూవీ ఉంటుందని సమాచారం.ఈ ఏడాదిలోనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీని ముందుగా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రీ ప్రోడక్షన్‌కు ఎక్కువ సమయం పట్టడం, హిందీ ‘రామాయణ’ మూవీతో రణ్‌బీర్ కపూర్ బిజీగా ఉండటం వంటి కారణాల వల్ల ఈ చిత్రం వాయిదా పడింది. ‘లవ్ అండ్ వార్’ మూవీని 2026 మార్చిలో రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించారు.దక్షిణాది అమ్మాయి... ఉత్తరాది అబ్బాయిదక్షిణాది అమ్మాయి, ఉత్తరాది అబ్బాయి లవ్ చేసుకుంటే ఏలా ఉంటుంది? వారి కుటుంబాలను ఒప్పించడం కోసం ఈ అబ్బాయి, అమ్మాయిలు ఏ విధంగా కష్టపడ్డారు? పెళ్లి తర్వాత వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అనే అంశాలతో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ‘పరమ్ సుందరి’. ఈ చిత్రో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కేరళలో జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాల్లో కనిపించే అథిరిపిల్లి వాటర్ ఫాల్స్ లోకేషన్స్లోనూ (ఇరువర్, రావన్, దిల్ సే.. వంటి సినిమాల్లో కనిపిస్తాయి) ‘పరమ్ సుందరి’ సినిమా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. ఈ చిత్రంలో నార్త్ అబ్బాయి పరమ్గా సిద్ధార్థ్ మల్హోత్రా, దక్షిణాది అమ్మాయి సుందరిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 25న విడుదల కానుంది.రెండు ప్రేమకథలుతులసీ ప్రేమ కోసం సన్నీ ఎన్నో సాహసాలు చేశాడు. ఈ సాహసాలను ఈ ఏడాది వెండితెరపై చూడొచ్చు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా శశాంక్ ఖైతాన్ డైరెక్షన్లో రూపొందుతున్న రొమాంటిక్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’. కరణ్ జోహర్ ఈ సినిమాకు నిర్మాత. ఈ మూవీ చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ఈ చిత్రంలో సన్నీగా వరుణ్ ధావన్, కుమారిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాగా ‘బవాల్ (2023)’ అనే ఓ హిందీ చిత్రంలో వరుణ్ ధావన్, జానీ ్వకపూర్ జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.ఇక ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’యే కాకుండా తన తండ్రి డేవిడ్ ధావన్ డైరెక్షన్లో వరుణ్ ధావన్ ఓ లవ్‌స్టోరీ ఫిల్మ్‌లో నటించనున్నారు. ఈ మూవీలోని హీరోయిన్స్‌గా మృణాళ్ ఠాకూర్, పూజా హెగ్డేల పేర్లు తెరపైకి వచ్చాయి. త్వరలోనే ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఫిల్మ్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇలా రెండు ప్రేమకథలతో వరుణ్ ధావన్ ఫుల్ బిజీ.ఏక్ దిన్ లవ్‌స్టోరీ ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హిందీలో ‘ఏక్ దిన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే లవ్‌స్టోరీ మూవీ చేస్తున్నారు. సునీల్‌పాండే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ లవ్‌స్టోరీ ఫిల్మ్‌లో సాయిపల్లవి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ‘ఏక్ దిన్’ రిలీజ్ కావొచ్చు. ఈ చిత్రంలో జునైద్ ఖాన్పోలీస్ ఆఫీసర్‌పాత్రలో నటిస్తున్నారని బాలీవుడ్ టాక్. ఈపోలీస్ ఆఫీసర్‌కు ఓ రోజు ఒక అమ్మాయి పరిచయం అవు తుంది. కానీ ఆ అమ్మాయి నెక్ట్స్ డే ఆ అబ్బాయిని గుర్తుపట్టలేకపోతుంది. అసలు వారిద్దరి మధ్య ఒక్క రోజులో ఏం జరిగింది? అన్నదే ‘ఏక్ దిన్’ కథాంశమని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. అలాగే జునైద్ ఖాన్ హిందీలో ‘లవ్యాపా’ అనే లవ్‌స్టోరీ ఫిల్మ్ కూడా చేశారు. దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా చేశారు. అద్వైత్ చందన్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్, తమిళ దర్శక–నటుడు ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాను నిర్మించారు. ప్రదీప్ రంగనాథన్ నటించి, స్వీయ దర్శకత్వం వహించిన తమిళ హిట్ ఫిల్మ్ ‘లవ్ టుడే’కు, హిందీ రీమేక్‌గా ‘లవ్యాపా’ రూపొందినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఖుషీ కపూర్ హీరోయిన్గా చేసిన మరో లవ్‌స్టోరీ మూవీ ‘నాదానియన్’. ఇందులో ఇబ్రహాం అలీ ఖాన్ హీరోగా చేస్తున్నారు.ధడక్ సీక్వెల్లో...జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘ధడక్’. ఇందులో ఇషాన్ కట్టర్ హీరోగా నటించారు. ఇప్పుడు ‘ధడక్’కు సీక్వెల్‌గా ‘ధడక్ 2’ రూపొందుతోంది. కానీ సీక్వెల్లో ఇషాన్, జాన్వీలు హీరోయిన్లుగా నటించడం లేదు. వీరి ప్లేస్‌లో సిద్ధాంత్ చతుర్వేది, ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ నటిస్తున్నారు. షాజియా డైరెక్షన్లో జీ స్టూడియోస్, ధర్మప్రోడక్షన్స్, క్లౌడ్ 9 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. అలాగే ‘దిల్ కా దర్వాజా ఖోల్నా డార్లింగ్’ అనే రొమాంటిక్ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు సిద్దాంత్ చతుర్వేది. వామికా గబ్బి హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో జయా బచ్చన్ ఓ లీడ్ రోల్లో చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ గోవాలో ప్రారంభమైంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.చాంద్ మేరా దిల్లక్ష్య, అనన్యాపాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ ‘చాంద్ మేరా దిల్’. ఆల్రెడీ ఈ మూవీ చిత్రీకరణ గత ఏడాదే మొదలైందని బాలీవుడ్ సమాచారం. వివేక్ సోని దర్శకత్వంలో ఈ మూవీని కరణ్‌జోహార్ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.హీరోయిన్ ఎవరు?∙బాలీవుడ్ లవ్‌స్టోరీ ఫ్రాంచైజీలో ‘ఆషికీ’కి మంచి క్రేజ్ ఉంది. దీంతో ‘ఆషికీ 3’ని రెండు సంవత్సరాల క్రితం ప్రకటించారు. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరో. అనురాగ్ బసు దర్శకుడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్ల లేదు. అయితే ‘ఆషికీ 3’ షూటింగ్ విషయంలో అన్ని సమస్యలు చక్కబడ్డాయని, ఈ మూవీ ఈ ఏడాది సెట్స్‌కు వెళ్లనుందని సమాచారం. అయితే ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తీ దిమ్రీ, శర్వారీ వంటి కథనాయికల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్ గా ‘ఆషికీ 3’ కోసం కార్తీక్ ప్రేమలో పడే హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయ క తప్పదు. ⇒ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్‌తో హిందీలో ‘రాంఝాణా, అత్రంగి రే’ వంటి సినిమాలు చేశారు హీరో ధనుష్. వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ‘తేరే ఇష్క్ మే’ అనే లవ్‌స్టోరీ మూవీ రానుంది. 2023లో ఈ సినిమాను ప్రకటించారు. కానీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ధనుష్ ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఈ మూవీ చిత్రీకరణ ఆలస్యం అవుతోందట. అయితే ఈ ఏడాది ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని ఆనంద్ .ఎల్ రాయ్ భావిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వానీ, త్రిప్తీ దిమ్రీ, కృతీసనన్ వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి... ధనుష్ సరసన ఎవరు హీరోయిన్గా నటిస్తారో చూడాలి.⇒ తెలుగు సూపర్‌హిట్ లవ్‌స్టోరీ ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ లీడ్ రోల్స్‌లో నటించి, సాయిరాజేష్ దర్శకత్వం వహించిన ‘బేబీ’ మూవీ 2023లో విడుదలై, సూపర్‌హిట్ సాధించింది. ఈ సినిమా హిందీలో రీమేక్ కానుందని తెలుస్తోంది. తెలుగు ‘బేబీ’కి దర్శకత్వం వహించిన సాయిరాజేష్నే హిందీ ‘బేబీ’కి రీమేక్ వహించనున్నట్లుగా తెలిసింది. అయితే బేబీ సినిమా నటీనటుల విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇషాన్ కట్టర్, ఆగస్త్య నంద, బాబిల్ ఖాన్ వంటి బాలీవుడ్ కుర్ర హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే హీరోయిన్పాత్ర కోసం ఖుషీ కపూర్, కృతీ శెట్టి వంటి తారల పేర్లు బీటౌన్‌లో వినిపిస్తున్నాయి. మరి..ఫైనల్‌గా హిందీ ‘బేబీ’లో ఎవరు యాక్ట్ నటించనున్నారో తెలియా లంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. – ముసిమి శివాంజనేయులు -
పుష్ప-2 రికార్డ్స్ బద్దలు కొడతా : యానిమల్ హీరో
-
కూతురు రాహాతో స్టార్ జంట రణ్‌బీర్ - ఆలియా వెకేషన్ (ఫోటోలు)
-
ఫ్యాన్స్‌పై లవ్.. అలియా భట్‌ను మించిపోతున్న కూతురు రాహా (ఫోటోలు)
-
హీరోకన్నా విలన్ కు ఎక్కువ పేమెంట్
ఏదైనా సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ ఖర్చు లెక్క రాసుకుంటే టాప్ రెమ్యునరేషన్ హీరోకు ఉంటుంది.. తరువాత హీరోయిన్.. అలా ఉంటుంది చివరి రేటు విలన్ కు ఉంటుంది. కానీ ఈ సరికొత్త రామాయణం సినిమాకు సంబంధించి హీరో అయిన రాముడి పాత్రధారి కన్నా విలన్ అయినా రావణుడి పాత్రధారికే ఎక్కువ పేమెంట్ ఇస్తున్నారు. ఎక్కువ అంటే అలాంటిలాంటి పేమెంట్ కాదండి.. ఏకంగా రెండొందల కోట్లు ఇస్తున్నారు. ఇంతకూ ఎవరా రాముడు.. ఎవరా రావణుడు అనేదేగా మీ అనుమానం..బాలీవుడ్ నిర్మాత, నటుడు నితీష్ తివారి నిర్మిస్తున్న రామాయణం(Ramayana) సినిమాకు సంబంధించి హీరోగా అంటే శ్రీరాముడిగా రణబీర్ కపూర్ ను ఎంపిక చేయగా అందులో మరో ప్రధాన పాత్రధారి అయిన రావణుడిగా కేజీఎఫ్ సిరీస్ హీరోగా చేసి బాక్సాఫీస్ కొల్లగొట్టిన కన్నడ స్టార్ యష్(Yash) కు మాత్రం హీరోకన్నా ఎక్కువే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. నటుడిగా ఇచ్చిన పారితోషికంతోబాటు డిస్ట్రిబ్యూషన్ హక్కులు.. అన్నీకలిపి మొత్తం రూ. 200 కోట్లవరకు యష్ కు ఇచ్చేనందుకు తివారీ అంగీకరించారట. ఇది హిందీ సూపర్ స్టార్లు అయినా సల్మాన్ ఖాన్.. అమీర్ ఖాన్.. షారూక్ ఖాన్ ల హీరోల పారితోషికం కన్నా ఎక్కువని తెలుస్తోంది.(చదవండి: తగ్గని శంకర్.. పెరిగిన బడ్జెట్)ఇటీవల ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన కల్కి చిత్రంలో విలన్ గా నటించిన కమల్ హాసన్ కూడా రూ. 40 కోట్లలోపే తీసుకున్నారట. కానీ యష్ మాత్రం ఏకంగా రూ. 200 కోట్లు తీసుకోవడాన్ని చూసి బాలీవుడ్ సైతం షాక్ అయిందని అంటున్నారు. సల్మాన్ , షారూక్.. అమీర్ ఖాన్లు సైతం ఇంతవరకూ హీరో పారితోషికంతోబాటు డిస్ట్రిబ్యూషన్ హక్కులు సైతం తీసుకుంటారు. ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ వంటివి అన్నీ కలుపుకున్న వారికి ఇంతవరకూ.. రూ. 150 కోట్లు దాటలేదట. కానీ తన అసాధారణ నటనతో కన్నడ బాక్సాఫీస్ కొల్లగొట్టిన యష్ మాత్రం విలన్ పాత్రకోసం ఏకంగా రూ. 200 కోట్లు తీసుకుంటున్నట్లు నితీష్ తివారి అఫీస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక సూపర్ స్టార్లు కూడా ఈ మార్కును టచ్ చేయలేదంటే ఇక రణబీర్ కపూర్ పారితోషికం ఈయనతో సరికిపోల్చడం కూడా కుదరదు అంటున్నారు. ఇక షారూక్ వంటి స్టార్లతో సమానంగా పారితోషికం తీసుకున్నది సౌత్ ఇండియాలో ముగ్గురే ఉన్నారు. రజనీకాంత్, విజయ్ తలపతి , అల్లు అర్జున్ మాత్రమే ఒక్కో సినిమాకు రూ. 200 కోట్లు తీసుకుంటున్నారట . మొత్తానికి మన సౌత్ ఇండియన్ నటుడు యష్ విలన్ పాత్రలో రెండు వందలకోట్ల పారితోషికం తీసుకుని బాలీవుడ్ హీరోలకు సవాల్ విసిరారు.- సిమ్మాదిరప్పన్న -
రాజ్ కపూర్ 100వ జన్మదినోత్సవం కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
రణబీర్ కపూర్‌కి నాసల్ డీవియేటెడ్ సెప్టం: అంటే ఏంటి..?
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ యానిమల్ మూవీలో విలక్షణమైన నటనతో ఆకట్టుకుని మంచి హిట్‌ని అందుకున్నారు. అమ్మాయిల కలల రాకుమారుడు, బాలీవుడ్ చాక్లెట్ బాయ్‌గా పిలిచే రణబీర్ ఒక ఇంటర్వ్యూలో తాను నాసల్ డీవియేటెడ్ సెప్టెమ్తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. దీని కారణంగా తాను వేగంగా తినడం, మాట్లాడటం వంటివి చేస్తుంటానని అన్నారు. అసలేంటీ వ్యాధి..?,ఎందువల్ల వస్తుందంటే..రణబీర్ ఫేస్ చేస్తున్న నాసల్ డీవియేటెడ్ సెప్టంని తెలుగులో ముక్కు సంబంధిత విచలనం (సెప్టం)గా చెబుతారు. దీని కారణంగా రెండు నాసికా రంధ్రాలను విభజించే సన్నని గోడ మధ్య భాగం ఒకవైపు వాలుగా ఉంటుంది. ఈ అపసవ్యమైన అమరిక రెండు నాసికా మార్గాలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా వివిధ సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి సమస్యలు తలెత్తుతాయంటే..విచలనం సెప్టం శ్యాసను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. నాసికా రంధ్రాలను వేరు చేసే గోడ(సెప్టం) విచలనం అంటే పక్కకు వాలడం. వల్ల రెండు రంధ్రాలు చిన్నగా లేదా మూసుకుపోయినట్లుగా అయిపోతాయి. దీంతో వాయుప్రసరణ సవ్యంగా ఉండదు. ఒక్కోసారి శ్వాసతీసుకోవడం కూడా కష్టమైపోతుంది. ఈ సమస్య కారణంగా ఆయా వ్యక్తులు నిద్రా సమసయంలో నోటి శ్వాసపై ఆధారపడుతుంటారు. ఇలా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల.. ఒక్కసారిగా వాయు మార్గాల్లో గాలి ఎక్కువై ప్రతిఘటన ఏర్పడుతుంది. ఈ గాలిని ఊపిరితిత్తుల వరకు నెట్టేందుకు మరింత శక్తి అవసరమవుతుంది. ఫలితంగా గురకకు దారితీసి అబ్స్ట్రక్టివ స్లీప్ ఆప్నియాకు దారితీస్తుంది. ఈశ్వాస లోపం కారణంగా వేగంగా సంభాషించేందుకు కారణమవుతుంది. ఈ వ్యక్తులో నాసికా రద్దీ ఏర్పుడుతుంటుంది. ఎందుకంటే ఒక వైపు రంధ్రం అత్యంత అధ్వాన్నంగా పనిచేస్తుండమే. పైగా శ్లేష్మం కూడా సరిగా బయటకి రాక సైనస్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే ముక్కు లోపల పొడిబారినట్లు అయిపోయి ముఖం నొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలతో బాధపడతారు. నిర్థారణ..ఈఎన్టీ స్పెషలిస్ట్ వద్ద ఓటోలారిన్జాలజిస్ట్ శారీరక పరీక్ష, నాసికా ఎండోస్కోపీ లేదా సిటీ స్కాన్ వంటి వాటితో ఈ సెప్టం విచలనంని గుర్తిస్తారు. విచలనం తీవ్రతను అనుసరించి చికిత్స ఆధారపడి ఉటుంది.ఎలా నివారిస్తారు..దీన్ని నివారించడమే గాని పూర్తిగా నయం కాదు. తేలికపాటి కేసుల్లో ఎలాంటి చికిత్స అవసరం ఉండదు. అలాకాకుండా కాస్త ప్రమాదకరమైన సమస్యలు ఎదుర్కొంటే..డీకాంగెస్టెంట్లు, యాంటిహిస్టామైన్లు, నాసల్ స్ప్రేలతో ఈ వ్యాదిని నిర్వహిస్తారు. అవన్నీ కేవలం సౌకర్యాన్ని అందిస్తాయే తప్ప సవస్యను పూర్తిగా నివారించలేవు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు పొగ తాగటం, పెయింట్ పొగలు, గృహ రసాయనాలు, పరిమళ ద్రవ్యాలు వంటి అలెర్జీ కారకాలకు దూరంగా ఉండాలి. దీన్ని సక్రమమైన జీవనశైలితో అధిగమించొచ్చని చెబుతున్నారు నిపుణులు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో శస్త్ర చికిత్సతో ఆ సెప్టంని సరిచేయడమే ప్రభావవంతమైన పరిష్కారం అని వెల్లడించారు వైద్య నిపుణులు.(చదవండి: 'సోలో ట్రిప్సే సో బెటర్'..! అంటున్న నిపుణులు..) -
వైభవంగా నటుడి రోకా వేడుక, రణబీర్, కరీనా,సైఫ్, సందడి (ఫొటోలు)
-
రెండు భాగాలుగా 'రామాయణ’ విడుదలపై ప్రకటన
-
స్టార్ హీరోయిన్ ఆలియా ముద్దుల తనయ రాహా కపూర్ బర్త్‌డే సెలబ్రేషన్స్
-
డాటర్ ఆఫ్ ఆలియ : రాహా ‘ఆహా’ అంటూ వింటుంది
‘ఆలియా భట్ నటి మాత్రమే కాదు, ఎంటర్ప్రెన్యూర్ కూడా’... ఈ వాక్యానికి కొనసాగింపుగా ‘చక్కని స్టోరీ టెల్లర్’ అనే ప్రశంసను కూడా చేర్చవచ్చు. ఎందుకంటే ఆలియా ప్రతి రాత్రి తన కూతురు రాహాకు ఏదో ఒక పిల్లల పుస్తకం చదివి వినిపిస్తుంది. రాహా ‘ఆహా’ అంటూ వింటుంది.‘తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పుస్తకాలు చదవడం అనేది వారి భవిష్యత్‌కు పెట్టుబడి పెట్టడంలాంటిది’ అంటుది ఆలియాభట్. ‘ఎడ్–ఏ–మమ్మా’ అనే చిల్డ్రన్ బ్రాండ్ (ప్లేవేర్, స్టోరీ బుక్స్, టాయ్స్ అండ్ మోర్) వోనర్ అయినా ఆలియా తన బ్రాండ్‌లో కొత్త చిల్డ్రన్ బుక్ సిరీస్‌ను లాంచ్ చేసింది. ‘పిల్లల కోసం తల్లులు స్టోరీ టెల్లింగ్ సెషన్లు నిర్వహించడం అనేది మంచి విధానం’ అంటున్నారు మానసిక నిపుణులు. ‘బెడ్ మీద పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించడం అనేది వారి మానసిక వికాసంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉచ్చారణలను, కొత్త పదాలను నేర్చుకుంటారు. పిల్లలకు కొత్త విషయాలు తెలియజేయడానికి ఇదొక అద్భుత సాధనం. ఇది పిల్లలతో తల్లిదండ్రుల భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుంది. పిల్లల ఏకాగ్రతను పెంచుతుంది. రోజువారీ షెడ్యూల్లో ప్రతి రాత్రి పుస్తక పఠనాన్ని తప్పనిసరి చేయడం పిల్లల్లో క్రమశిక్షణను పెంచుతుంది’ అంటుంది కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ శృతి వస్త. -
రెండు భాగాలుగా 'రామాయణ'.. విడుదలపై ప్రకటన
భారత ఇతిహాసాలను వెండితెరపై చూపించాలంటే పెద్ద సాహసమేనని చెప్పాలి. ఈ క్రమంలో వచ్చిన చిత్రాలు ఇప్పటకే చాలావరకు విజయాన్ని అందుకున్నాయి. బాలీవుడ్ తెరకెక్కిస్తున్న 'రామాయణ' గురించి ఒక ప్రకటన వచ్చింది. ఈ చిత్రం గురించి ఇప్పటికే కన్నడ స్టార్ యశ్ పలు విషయాలను పంచుకున్నాడు. ఇప్పుడు పోస్టర్స్ విడుదల చేస్తూ విడుదల తేదీలను కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రణ్‌బీర్‌కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్‌సింగ్ కనిపించనున్నట్లు ప్రచారం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా ఈ చిత్రం నిర్మిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల చేస్తున్నట్లు పోస్టర్స్‌ను కూడా పంచుకున్నారు.ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్‌బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్‌బీర్ ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ విషయంపై ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణతో పాటు డైట్ కూడా ఫాలో అవుతున్నట్లు తెలిపారు. రాముడి పాత్రలో నటిస్తుండటం వల్ల తాను మద్యపానం మానేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో సీత పాత్రలో నటిస్తున్న సాయిపల్లవి కూడా పలు విషయాలను పంచుకున్నారు. సీతమ్మ పాత్రలో నటించే అవకాశం దక్కడం తన అదృష్టమని సాయిపల్లవి పేర్కొన్నారు. ఒక నటిగా కాకుండా భక్తురాలిగా నటిస్తున్నట్లు తెలిపారు. -
రణబీర్ - అలియా కొత్త ఇల్లు ధర వింటే ఫ్యూజులు ఎగిరిపోతాయ్
-
రణబీర్, అలియా కొత్త ఇల్లు రూ. 250 కోట్లు.. వారిద్దరి పేరుతో రిజిస్ట్రేషన్
జీవితంలో ప్రతి ఒక్కరూ సొంతింటి కోసం చాలా కలలు కంటారు. ఈ విషయంలో సినిమా సెలబ్రిటీలు కూడా ఇంకాస్త ఎక్కువగానే ఆలోచిస్తారు. బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్ల ఇల్లు ఎట్టకేలకు పూర్తి అయింది. సుమారు రెండేళ్లుగా ఈ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా నడిబొడ్డున ఉన్న ఈ కొత్త ఇంట్లోకి వారు షిఫ్ట్ కానున్నారు. సుమారు రూ. 250 కోట్ల విలువ చేసే ఈ ఆస్తిని తన కూతురు రాహా కపూర్ పేరుతో పాటు ఆయన అమ్మగారు నటి నీతూ కపూర్ పేరుతో రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది.బాలీవుడ్ నివేదికల ప్రకారం రణబీర్, అలియా నవంబర్ నెలలో కొత్త ఇంటిలోకి షిఫ్ట్ కానున్నారని తెలుస్తోంది. అదే నెలలో తమ కుమార్తె రెండో పుట్టినరోజు జరుపుకోనుంది. ఆ వేడుకలు అక్కడే జరుపుకోవాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఆరు అంతస్తులు ఉన్న ఆ భవనంలో ఎంతో ఖరీదైన ఫర్నీచర్‌తో పాటు ఇండోర్ స్విమ్మింగ్ పూల్, జిమ్ అందుకు ఉన్నాయట. రణబీర్, అలియా భట్, నీతూ కపూర్ గత కొన్ని నెలలుగా భవన నిర్మాణ స్థలంలో తరచుగా కనిపించారు.ఇప్పటికే అలియా పేరు మీద మూడు విల్లాలు ఉన్నాయి. అవి కూడా దాదాపు రూ. 100 కోట్లు విలువ చేస్తాయని తెలుస్తోంది. అయితే, రణబీర్ కపూర్‌కు వారసత్వంగా వచ్చిన ఆస్తి ఎక్కువగా తన తల్లి నీతూ కపూర్ పేరు మీదే ఉంది. ఆమె భర్త దివంగత రిషి కపూర్ తన ఆస్తులన్నింటికి సగం యజమానిగా ఆమెను నియమించారు. దీంతో రణబీర్ కూడా రూ. 250 కోట్ల తన కొత్త ఇంటిని కూతరు రాహా, నీతూ కపూర్ పేరు మీద రిజస్టర్ చేయించారు.యానిమల్ సినిమాతో రణబీర్ కపూర్ భారీ విజయం అందుకున్నారు. తన కొత్త సినిమా 'రామాయణ' కోసం ఆయన కసరత్తులు ప్రారంభించారు. మూడు భాగాలుగా దీన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తొలి పార్ట్‌ను 2025 దీపావళికి తీసుకురానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. జిగ్రాలో కనిపించిన అలియా భట్ తన రాబోయే చిత్రం సంజయ్ లీలా బన్సాలీ 'లవ్ అండ్ వార్'లో విక్కీ కౌశల్ సరసన నటించడానికి సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పెళ్లికొడుకు గెటప్‌లో రణబీర్ కపూర్ సందడి (ఫొటోలు)
-
గ్యాప్ ఇవ్వలా... వచ్చింది
నచ్చిన కథ దొరక్క కొందరు, చేసే పాత్రకు తగ్గట్టు మేకోవర్ అవ్వాలని మరికొందరు, వ్యక్తిగత జీవితంతో ఇంకొందరు... ఇలా కారణాలు ఏమైనా యాక్టర్స్ కెరీర్లో కొన్నిసార్లు గ్యాప్‌లు వస్తుంటాయి. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ గ్యాప్‌ను ఫిల్ చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి గ్యాప్‌ల కారణంగా ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించకుండా ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’ అంటున్న కొందరు బాలీవుడ్ హీరోల గురించి తెలుసుకుందాం.స్పీడ్ బ్రేకర్ గత ఏడాది బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేశారు షారుక్ ఖాన్. 2023లో షారుక్ ఖాన్ హీరోగా చేసిన ‘పఠాన్, జవాన్’ రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను అధిగమించగా, ‘డంకీ’ రూ. 450 కోట్ల కలెక్షన్స్‌ను సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. ఇలా ఈ మూడు చిత్రాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గత ఏడాది రూ. 2,500 కోట్ల కలెక్షన్స్ పైగా రాబట్టగలిగారు షారుక్. కానీ ఈ ఏడాది షారుక్ జోరుకు స్పీడ్ బ్రేకర్ పడింది. 2024లో సిల్వర్ స్క్రీన్‌ని మిస్ చేసుకున్నారు షారుక్. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో షారుక్ తనయ సుహానా ఖాన్ మరో లీడ్ రోల్లో నటిస్తారు. ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో ఇంకా ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. ‘కింగ్’ 2025 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ది బుల్ మిస్ అయ్యాడు ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3’... ఈ రెండు సినిమాలతో సల్మాన్ ఖాన్ గత ఏడాది వెండితెరపై కనిపించారు. ఇదే జోష్‌లో ఈ ఏడాది ఈద్‌కు సల్మాన్ ఖాన్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందని అనుకున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ కుదర్లేదు. ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్తో సల్మాన్ ఖాన్ చేయాల్సిన ‘ది బుల్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా సరైన సమయంలో సెట్స్ పైకి వెళ్లలేదు. దాంతో ఈ ఏడాది సల్మాన్ ఖాన్ వెండితెరపై కనిపించలేకపోయారు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్‌తో సల్మాన్ ఖాన్ ‘సికందర్’ అనే యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా రిలీజ్ కానున్నట్లు యూనిట్ ప్రకటించింది. మరోవైపు దర్శకుడు విష్ణువర్ధన్తో సల్మాన్ చేయనున్న చిత్రం కూడా 2025లోనే రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. సో.. వచ్చే ఏడాది రెండుసార్లు సల్మాన్ తెరపై కనిపిస్తారని ఊహించవచ్చు. రెండేళ్లు పూర్తయినా... రెండేళ్లు దాటిపోయింది ఆమిర్ ఖాన్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి. 2022లో చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా (హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్) తర్వాత ఆమిర్ వెంటనే మరో సినిమా ఒప్పుకోలేదు. మరోవైపు తన కుమార్తె ఐరా ఖాన్ పెళ్లి పనులతో కొన్నాళ్లు ఆమిర్ ఖాన్ బిజీ అయ్యారు. దాంతో ఆయన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ లేట్‌గా సెట్స్‌పైకి వెళ్లింది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా వేశారని సమాచారం. భారీ చిత్రంతో... ‘యానిమల్’ సినిమాతో గత ఏడాది బ్లాక్‌బస్టర్ అందుకున్నారు రణ్‌బీర్ కపూర్. అయితే గత ఏడాది ‘తు ఝూతీ మై మక్కర్’ చిత్రంతో ఓ ఫ్లాప్ కూడా అందుకున్నారు ఈ హీరో. ఇక ఈ ఏడాది థియేటర్స్‌లో కనిపించకుండా బ్రేక్ తీసుకున్నారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘రామాయణ్’ సినిమాతో ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ బిజీగా ఉన్నారు. నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, యశ్ వంటి స్టార్స్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇది భారీ చిత్రం కాబట్టి షూట్‌కి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ఈ ఏడాది తెరపై కనిపించలేదు రణ్‌బీర్. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోందని, తొలి భాగం 2025లో రిలీజ్ అవుతుందని సమాచారం. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ హీరోగా నటిస్తున్న ‘లవ్ అండ్ వార్’ 2026లో విడుదల కానుంది. పర్సనల్ టైమ్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది రిలీజ్ కావడం లేదు. ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం గత ఏడాది జూలైలో రిలీజ్ అయింది. అయితే వెంటనే మరో మూవీకి సైన్ చేయలేదు రణ్వీర్. ఫిబ్రవరి చివర్లో తాము తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని రణ్వీర్ సింగ్–దీపికా పదుకోన్ వెల్లడించారు. సో... పర్సనల్ లైఫ్‌కు రణ్వీర్ టైమ్ కేటాయించారు. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు. కానీ ఈ చిత్రం 2025లోనే రిలీజ్ అవుతుంది. కాగా అజయ్ దేవగన్ హీరోగా నటించిన ‘సింగమ్ ఎగైన్’ సినిమాలో మాత్రం రణ్వీర్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. ఇక దీపికా పదుకోన్ ఈ ఏడాది సెప్టెంబరులో ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే,. బిజీ బిజీ... కానీ! ‘గదర్ 2’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి, మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు సీనియర్ హీరో సన్నీ డియోల్. 2023లో రిలీజైన ‘గదర్ 2’ సక్సెస్‌తో సన్నీ డియోల్‌కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ‘బోర్డర్ 2, లాహోర్ 1947, రామాయణ్’ (కీలక పాత్రధారి)లతో పాటు తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు సన్నీ. ఈ సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే ఆరంభమైంది. కానీ ఈ ఏడాది సన్నీ థియేటర్స్‌లోకి వచ్చే చాన్సెస్ కనిపించడం లేదు. అయితే 2025లో ఆయన మూడు చిత్రాలతో కనిపించే అవకాశం ఉంది. -
అలియా-రణబీర్ ఇష్టపడే వంటకాలివే..!
బాలీవుడ్ బ్యూటిఫుల్ స్టార్ జంట అలియా రణబీర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట ఏ ఈవెంట్లో సందడి చేసిన ఫోటోగ్రాఫర్లకు తమ కెమెరాలని క్లిక్‌మనిపించకుండా ఉండరు. అలాగే ఆ వేడుకలు కూడా మరింత అందంగా కోలహాలంగా మారిపోతుంది. అంతలా ఈ జంట వేడుకల్లో ఎంజాయ్ చేస్తూ..కొత్త సందడిని తీసుకొస్తారు. వీరిద్దరూ తమ గ్లామర్, అభినయంతో వేలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాగే డైట్ పరంగా ఇద్దరు చాలా స్ట్రిట్. ఇరువురు ఫిట్నెస్కి సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు. అయితే ఈ అందమైన జంట ఇష్టంగా వంటకాల గురించి వారి వ్యక్తిగత చెఫ్ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీ జంట వ్యక్తిగత చెప్ సూర్యన్ష్ సింగ్ కున్వర్ అలియా-రణబీర్‌లు ఇష్టమైన వంటకాల గురించి ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. వీడియోలో వాళ్లు కూడా మనలాగానే దోస, ఆమ్లెట్, గుడ్డు అప్పం, హమ్ముస్, మీట్ బాల్స్, స్పెఘెట్టి, ఫ్రైడ్ రైస్, సిన్నమోన్ టోస్ట్, కొబ్బరి చట్నీ, తదితరాలనే ఇష్టంగా తింటారని వివరిస్తున్నట్లు కనిపిస్తుంది. వీరిద్దరు రుచికరంగా ఉండే పోషకాహారానికి ప్రాధ్యాన్యత ఇస్తారని తెలిపాడు. అంతేగాదు అలియా, రణబీర్ గ్రిల్డ్ సాల్మన్, డ్రైఫూట్స్‌తో నింపిన సూప్, బ్లాక్ బీన్ సాస్ తోకూడిన టోపు, టోర్టెల్లిని పాస్తా, కలమారి, కుడుములు, ఖీర్, కస్టర్డ్ వంటి ఆకర్ణణీయమెన డెజర్ట్ ఇష్టంగా తింటారని చెప్పారు. అంతేగాదు గత కొద్ది రోజులగా తాను వాళ్ల కోసం అద్భుతమైన వంటకాలను అందిస్తున్నట్లు తెలిపాడు. ఈ అందమైన జంట కోసం వడంటం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ వంటకాలను ఆహారప్రియులు కూడా తమ మెనూలో చేర్చుకోవచ్చనేలా ఉన్నాయి ఆ రెసిపీలు. కాగా, అలియా భట్ రణబీర్ కపూర్లు తమ డైట్ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటారు. షూటింగ్, సినిమాల మధ్య కూడా, రణబీర్ తన డైట్ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు. View this post on Instagram A post shared by Suryansh Singh Kanwar (@suryansh.singh.kanwar) (చదవండి: స్ట్రీట్ ఫుడ్ విక్రేతగా పీహెచ్డీ విద్యార్థి..నెటిజన్లు ఫిదా!) -
అక్టోబరులో ఆరంభం
అక్టోబరులో లవ్ అండ్ వార్ అంటున్నారట రణ్‌బీర్ కపూర్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం ‘లవ్ అండ్ వార్’. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటించనున్నారు. ఈ ఏడాది జనవరిలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కానీ చిత్రీకరణ ప్రారంభం కాలేదు. అయితే ప్రీ ప్రోడక్షన్ వర్క్స్‌ను సెప్టెంబరు లోపు పూర్తి చేసి, అక్టోబరు మొదటి వారంలో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట భన్సాలీ.ముందుగా అక్టోబరులో రణ్‌బీర్ కపూర్ సోలో సీన్స్‌తో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అవుతుందట. ఆ తర్వాత రణ్‌బీర్ – విక్కీ కౌశల్‌ల కాంబినేషన్లోని ఫ్రెండ్షిప్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని, ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్ – ఆలియా – విక్కీ కౌశల్ కాంబినేషన్లోని సన్నివేశాలను షూట్ చేయాలనుకుంటున్నారని బాలీవుడ్ సమాచారం. ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా ‘లవ్ అండ్ వార్’ని తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా 2025 క్రిస్మస్కి రిలీజ్ కానుంది. -
ఆలియా పెద్ద గొంతుతో అరిచేది.. పెళ్లయ్యాక..: రణ్‌బీర్
ఆలియా భట్‌ది పెద్ద గొంతు.. పెళ్లికి ముందు వరకు ఎలా ఉన్నా తర్వాత మాత్రం తన కోసం టోన్ మార్చుకుంది అంటున్నాడు స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్. తాజాగా రణ్‌బీర్.. యూట్యూబర్ నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. 'మా నాన్న గొంతుకు నేను భయపడేవాడిని. చిన్నప్పుడు ఆయన గట్టిగా మాట్లాడితే వణికిపోయేవాడిని. నా భార్య ఆలియా స్వరం కూడా పెద్దదే! నేను కూడా అలా చేయాల్సిందికానీ నాకోసం దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించింది. 30 ఏళ్లుగా ఉన్న టోన్‌ను మార్చుకోవాలంటే అంత ఈజీ కాదు. రాహా(కూతురు) కిందపడగానే వెంటనే రియాక్ట్ అయిపోతుంది. కానీ నా మనసు ఎక్కడా బాధపడకుండా చెప్తోంది. ఎల్లప్పుడూ నన్ను ప్రశాంతంగా ఉంచాలనే ట్రై చేస్తోంది. నేను కూడా ఆమెను ప్రశాంతంగా ఉంచితే బాగుండేది. కానీ అందుకోసం పెద్దగా కృషి చేయడం లేదనుకుంటా!తనతో కలిసుండటం ఇష్టంఆలియా నా జీవితంలో చాలా స్పెషల్. తనపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఎప్పుడూ నన్ను నవ్విస్తూ ఉంటుంది. తనతో కలిసి హాలీడేకు వెళ్లడమన్నా, కలిసి ఇంటికి వెళ్లడమన్నా ఇష్టం. ఆమె చాలా తెలివైనది. పని పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తుంది' అని తెలిపాడు. కాగా రణ్‌బీర్- ఆలియా.. కొంతకాలం డేటింగ్ తర్వాత 2022లో ముంబైలో పెళ్లి చేసుకున్నారు. గతేడాది వీరికి రాహా అనే కూతురు పుట్టింది. వీళ్లిద్దరూ ప్రస్తుతం లవ్ అండ్ వార్ అనే సినిమాలో నటిస్తున్నారు.చదవండి: చిన్న పిల్లలతో లిప్ కిస్‌లా.. యాంకర్‌పై చిన్మయి ఫైర్! -
మోసగాడిగా ముద్ర.. ఇప్పటికీ అదే అంటున్నారు: స్టార్ హీరో
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, బ్రేకప్‌లు సర్వసాధారణం. సెలబ్రిటీలు వాటిని మర్చిపోయినా జనాలు మాత్రం గుర్తుచేస్తూనే ఉంటారు. అలా తనపై చీటర్ (మోసగాడు) అని ముద్ర వేశాడంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్. తాజాగా యూట్యూబర్ నిఖిల్ కామత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌బీర్ మాట్లాడుతూ.. నేను గతంలో ఇద్దరు సక్సెస్ఫుల్ హీరోయిన్లతో డేటింగ్ చేశాను.మోసగాడుఅప్పటినుంచి వారి మాజీ ప్రియుడు అని నన్ను సంభోదించేవారు. కాసినోవా అని మోసగాడు అని ఇలా ఏవేవో పేర్లు అంటగట్టారు. నా జీవితంలో చాలాభాగం చీటర్ అన్న పేరుతోనే బతికేశాను. ఇప్పటికీ కొందరు నన్ను చీటర్ అని అంటూనే ఉంటారు. నా కూతురు రాహా విషయానికి వస్తే తనంటే నాకు ప్రాణం. రాహాను చూస్తుంటే నా హృదయం తీసి నా చేతులో పెట్టినట్లు అనిపిస్తుంది. మా నాన్న (దివంగత నటుడు రిషి కపూర్)కు కోపం ఎక్కువ. కానీ చాలా మంచివాడు. ఏది చెప్పినా తల దించుకుని సరే అనేవాడిని. ఎన్నడూ నో చెప్పలేదు.థెరపీనా విషయానికి వస్తే గతంలో నేను థెరపీ చేయించుకున్నాను. నా గురించి నేను ఎక్కువగా ఓపెన్ కాను. మనసు విప్పి మాట్లాడేందుకు థెరపీ ఉపయోగపడుతుందని భావించాను అని చెప్పుకొచ్చాడు. కాగా యానిమల్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన రణ్‌బీర్.. ప్రస్తుతం నితేశ్ తివారి దర్శకత్వంలో రామాయణం సినిమా చేస్తున్నాడు. అలాగే సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో లవ్ అండ్ వార్ మూవీలోనూ నటించనున్నాడు.చదవండి: మూడేళ్లుగా సింగిల్‌గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు -
భర్తతో హీరోయిన్ ఆలియా భట్ క్యూట్ (ఫొటోలు)
-
చిన్న వయసులోనే స్టార్డమ్, నేషనల్ అవార్డ్.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఈమె స్టార్ హీరోయిన్. టీనేజీలోనే హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్ మూవీ హిట్. ఆ తర్వాత అద్భుతమైన నటనతో చాలా మూవీస్‌తో హిట్స్ కొట్టింది. తనకంటూ సెపరేట్ బ్రాండ్ సృష్టించుకుంది. పాన్ ఇండియా లెవల్లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న బూరె బుగ్గల చిన్నారి పేరు ఆలియా భట్. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో సీతగా నటించి, దక్షిణాదిలోనూ అభిమానుల్ని సొంతం చేసుకుంది. తండ్రి మహేశ్ భట్ ప్రముఖ దర్శకుడు. తల్లిది బ్రిటన్. ఈమె నటి కూడా. ఫ్యామిలీది మూవీ బ్యాక్ గ్రౌండే కాబట్టి 19 ఏళ్లకే 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.(ఇదీ చదవండి: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటిస్తూ హీరోయిన్గా అద్భుతమైన గుర్తింపు సంపాదించింది. 'గంగూబాయ్' సినిమాలో యాక్టింగ్ దెబ్బకు ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకుంది. ఇక ఆస్కార్ తెచ్చిపెట్టిన 'ఆర్ఆర్ఆర్'లోనూ చిన్న పాత్రలో కనిపించింది. ఇకపోతే ఫాదర్స్ డే సందర్భంగా తండ్రితో తాను చిన్నప్పుడు ఉన్న ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసి విషెస్ చెప్పింది. ఇందులో ఆలియాని చూసి ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఆలియా ఫ్యామిలీ విషయానికొస్తే.. హీరోయిన్గా ఫామ్‌లో ఉండగానే హీరో రణ్‌బీర్ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు రహ అనే కూతురు కూడా ఉంది. ఇలా ఓ వైపు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో) -
ఖరీదైన కారు కొన్న స్టార్ కపుల్.. ధర ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంట ఒకరు. తాజాగా ఈ జంట అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు హాజరయ్యారు. ఇటలీలో జరిగిన క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొని తాజాగా ముంబయికి తిరిగివచ్చారు. తమ ముద్దుల కూతురు రాహా కపూర్‌తో కలిసి ఇండియా చేరుకున్నారు.అయితే తాజాగా ఈ జంట కొత్త కారు కొన్నట్లు తెలుస్తోంది. ఇటలీ నుంచి ముంబయికి వచ్చిన ఈ జంట తమ ఖరీదైన లగ్జరీ కారులో ఇంటికి చేరుకున్నారు. దీంతో అందరి దృష్టి కారుమీదే పడింది. లెక్సస్ ఎల్ఎమ్ బ్రాండ్‌కు చెందిన ఈ కారు విలువ దాదాపు రూ.2 నుంచి రూ.2.5 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కాగా.. ఇటీవల ఏప్రిల్ నెలలో బెంటెలీ బ్రాండ్ కారును రణ్‌బీర్ కొనుగోలు చేశాడు. వీటితో పాటు రణ్‌బీర్ గ్యారేజీలో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆడి, మెర్సిడెస్ కార్లు ఉన్నాయి. అలియాకు సైతం రేంజ్ రోవర్, ఆడి ఏ6, బీఎండబ్ల్యూ, ఆడి క్యూ5, ఆడి క్యూ7 కార్లు కలిగి ఉన్నారు. దీంతో తాజాగా మరో లగ్జరీ కారు వచ్చి చేరింది. కాగా.. గతేడాది యానిమల్ మూవీతో రణ్‌బీర్ కపూర్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అతనికి జోడీగా కనిపించింది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
గాడ్ పవర్?
‘రామాయణ్’ టైటిల్ ‘గాడ్ పవర్’గా మారిందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి రాముడు, సీత పాత్రల్లో నితీష్ తివారీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి ఇప్పటివరకూ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రామాయణం ఆధారంగా ‘రామాయణ్’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చాయి.అలాగే సీతారాముల గెటప్స్‌లో సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ ఉన్న ఫొటోలు లీక్ అయి, వైరల్‌గా మారాయి. ముంబైలో చడీ చప్పుడూ లేకుండా కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్ ఆరంభించారు. ఆ లొకేషన్లోని రణ్‌బీర్, సాయి పల్లవి ఫొటోలే బయటికొచ్చాయి. కాగా.. ఈ చిత్రానికి ‘రామాయణ్’ టైటిల్‌కి బదులు ‘గాడ్ పవర్’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని యూనిట్ అనుకుంటోందనే వార్త ప్రచారంలో ఉంది. -
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
‘‘రామాయణ్’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించాలనే ఆసక్తి ఎవరికి మాత్రం ఉండదు? ఆ సినిమాలో నటించమని ఇప్పటివరకూ ఎవరూ నన్ను సంప్రదించలేదు. ఆ అవకాశం వస్తే మాత్రం నటించేందుకు నేను సిద్ధం’’ అన్నారు బాలీవుడ్ బ్యూటీ లారా దత్తా. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో హిందీలో ‘రామాయణ్’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. కాగా ఈ చిత్రంలోని నటీనటులపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ, రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారని లీక్ అయిన ఒక ఫొటో స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కైకేయి పాత్రలో లారా దత్తా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించారు లారా దత్తా. ‘‘రామాయణ్’లో నేను కైకేయి పాత్ర చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవి విన్నప్పుడు సంతోషంగానే ఉంది. ఎందుకంటే.. అంత గొప్ప సినిమాలో నటించాలని ఎవరు కోరుకోరు? ఒకవేళ ఈ మూవీలో నాకు అవకాశం వస్తే కైకేయి పాత్రే కాదు.. శూర్పణఖ, మండోదరి లాంటి క్యారెక్టర్స్ చేయడానికి కూడా నేను రెడీ. ఈ మూడు పాత్రల్లో దేనికైనా నేను చక్కగా సరిపోతాను’’ అంటూ తన మనసులోని మాటని బయటపెట్టారు లారా దత్తా. మరి... ఈ మూడు ్రపాతల్లో ఏదో ఒకటి చేసే చాన్స్ లారా దత్తాకి వస్తుందా? అనేది చూడాలి. -
సీతగా సాయిపల్లవి.. ఎంత ముద్దుగా ఉందో? ఫొటోలు వైరల్
పాన్ ఇండియా భారీ బడ్జెట్ 'రామాయణ్' షూటింగ్ మొదలైపోయింది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టేసినట్లు ఉన్నారు. సాయిపల్లవి సీతగా, రణ్‌బీర్ కపూర్ రాముడి గెటప్‌లో ఉన్న పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి నెటిజన్స్ తెగ మురిసిపోతున్నారు. మరీ ముఖ్యంగా సాయిపల్లవి అందానికి ఫిదా అయిపోతున్నారు.ప్రతిష్టాత్మక రామాయణం ఆధారంగా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపుగా ఇవన్నీ కూడా ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. గతేడాది రిలీజైన 'ఆదిపురుష్' మాత్రం ఘోరమైన ట్రోలింగ్కి గురైంది. తాజాగా బాలీవుడ్లో రామాయాణాన్ని సినిమాగా తీస్తున్నారు. గతంలో న్యూస్ వచ్చినప్పటికీ దీన్ని ఎవరూ నిర్ధారించలేదు.శ్రీరామ నవమికి అయినా సరే అధికారిక ప్రకటన వస్తుందనుకున్నారు. కానీ అలాంటిదేం రాలేదు. కానీ ఇప్పుడు సెట్స్ నుంచి రాముడు, సీత పాత్రలకు సంబంధించిన కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఇవి సర్క్యూలేట్ అవుతున్నాయి. లుక్స్ బాగానే ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాని మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఇందులో రావణుడిగా 'కేజీఎఫ్' ఫేమ్ యష్ కనిపించబోతున్నాడు. -
Deepika Padukone: ఫైనల్లీ ఆ టాటూని తొలగించిన దీపికా పదుకొణె!
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్లో దీపికొ పదుకొణె- రణ్వీర్ సింగ్ జంట ఒకటి. రామ్ లీలా సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట.. 2018 నవంబర్ 14న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. త్వరలోనే ఈ బ్యూటీ ఓ బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భం దాల్చిందనే విషయాన్ని రణ్వీర్ వెల్లడించాడు. తాజాగా ఈ భామ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో చర్చనీయాంశంగా మారింది. శనివారం దీపికా తన ఇన్‌స్టా ఖాతాలో ఓ ఫోటోని షేర్ చేసింది.అందులో ఆమె మెడ కనిపించేలా వెనుక వైపు తిరిగి ఉంది. గతంలో ఆమె వీపు భాగంపై ఓ టాటూ ఉండేది. ఇప్పుడది కనిపించలేదు. ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో రణ్వీర్ సింగ్‌తో పెళ్లి కంటే ముందు దీపికా పదుకొణె మరో స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమాయణం కొనసాగించింది. ఈ ఇద్దరి ప్రేమ విషయం బాలీవుడ్ అంతా తెలుసు. పెళ్లి కూడా చేసుకుంటారని అంతా భావించారు. కానీ కారణం ఏంటో తెలియదు కానీ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రణ్‌బీర్‌తో స్నేహం ఏర్పడడం..అది కాస్త ప్రేమగా మారడంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. అయితే రణ్‌బీర్‌తో ప్రేమలో ఉన్న సమయంలో దీపికా తన వీపుపై RK(రణ్‌బీర్ కపూర్ షార్ట్ కట్) అని టాటూ వేయించుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆ టాటూని చెరిపేయలేదు. దీంతో అప్పట్లో ఈ టాటూపై బాలీవుడ్లో పెద్ద చర్చే జరిగింది. కానీ దీపికా మాత్రం ఆ టాటూపై స్పందించలేదు. ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలో ఆ టాటూ కనిపించకపోవడంతో.. ప్రెగ్నెంట్ అయిన తర్వాత దీపికా ఆ టాటూని తొలగించిందనే నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ సరసన కల్కీ 2898 ఏడీ చిత్రంలో నటిస్తోంది. View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) -
పెళ్లిలో కోట్లు ఇచ్చావట, నిజమేనా? హీరో ఆన్సరిదే!
బాలీవుడ్ కామెడీ కింగ్ కపిల్ శర్మ 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో'తో వెబ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఈ కామెడీ షో తొలి ఎపిసోడ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ఫస్ట్ ఎపిసోడ్లో యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్ గెస్టుగా వచ్చాడు. అతడి వెంట నీతూ కపూర్, రిద్ధిమా కపూర్ కూడా ఉన్నారు. రూ.12 కోట్లు? రణ్‌బీర్‌కు ఇక్కడ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 'నీ పెళ్లిలో ఆలియా అక్కాచెల్లెళ్లకు, స్నేహితులకు డబ్బులిచ్చావట! వాళ్లు నీ చెప్పులు దాచిపెట్టి రూ.12 కోట్ల దాకా డిమాండ్ చేశారని విన్నాం. నువ్వు బేరాలాడి దాన్ని లక్షల్లోకి తీసుకువచ్చావట, నిజమేనా?' అని కపిల్ అడిగాడు. దీనికి ఫక్కున నవ్వేసిన హీరో.. 'మేము ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాం. ఒకవేళ వాళ్లు నా షూ దాచిపెట్టాలన్నా అవి ఇంట్లోనే కదా ఉంటాయి' అని చెప్పుకొచ్చాడు. దీంతో కపిల్ తన పెళ్లి సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. నా భార్య తరపు వాళ్లయితే ఏకంగా రూ.11 లక్షలడిగారని గుర్తు చేసుకున్నాడు. మీ చెల్లితో పాటు నా షూలు కూడా మీ దగ్గరే పెట్టుకోండి. అయినా నాకోసం క్షణం ఆలోచించకుండా వచ్చేంత ప్రేమ ఆమెకుంది. షూలంటారా? కావాలనుకుంటే కొత్తవి కొనుక్కుంటాను అని సరదాగా చెప్పానని పేర్కొన్నాడు. తర్వాత అందరూ అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో రణ్‌బీర్.. తన తల్లి నగలను.. గతంలో ప్రేమించిన ప్రియురాళ్లకు బహుమతిగా ఇచ్చినట్లు అంగీకరించాడు. కాగా రణ్‌బీర్- ఆలియా 2022 ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది నవంబర్‌లో కూతురు రాహాకు జన్మనిచ్చారు. చదవండి: పెరిగిన 'ఫ్యామిలీ స్టార్' బడ్జెట్.. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఎంతంటే? -
విల్లు ఎక్కు పెట్టి..!
రెండు రోజుల క్రితం రణ్‌బీర్ కపూర్ తలకిందులుగా నిలబడిన ఫొటో వైరల్ అయ్యింది. ఈ శీర్షాసనం ఎందుకూ అంటే.. శిక్షణలో భాగంగా. రామాయణం ఆధారంగా నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందనున్న ‘రామాయణ్’ చిత్రం కోసమే రణ్‌బీర్ వర్కవుట్స్ మొదలుపెట్టారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా నియమించిన ట్రైనర్ ఆధ్వర్యంలో రణ్‌బీర్ కపూర్ మేకోవర్ అవుతున్నారు. ఒకవైపు ఫిజికల్ మేకోవర్ మరోవైపు యుద్ధ విద్యలు నేర్చుకుంటూ బిజీగా ఉన్నారు రణ్‌బీర్. మొన్న శీర్షాసనం ఫొటో వైరల్ కాగా తాజాగా విలు విద్య నేర్చుకోవడానికి రణ్‌బీర్ సిద్ధమవుతున్న ఫొటోలు బయటికొచ్చాయి. మేకోవర్ ట్రైనర్ వేరు... విలు విద్య నేర్పిస్తున్న ట్రైనర్ వేరు. రాముడంటే యుద్ధ విద్యల్లో సూపర్ కాబట్టి ఆ పాత్రకు న్యాయం చేయడానికి ఏమేం చేయాలో అన్నీ చేయడానికి రణ్‌బీర్ రెడీ అయిపోయారు. ఇక ఈ చిత్రంలో సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడిగా యశ్, కైకేయీగా లారా దత్తా నటిస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. -
నిరాశే మిగిల్చనున్న రామాయణం మూవీ డైరెక్టర్
-
ఏప్రిల్ 17న 'రామాయణ' ప్రకటన.. అదే రోజు ఎందుకంటే
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో 'రామాయణ' అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, రావణుడి పాత్రలో యశ్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇతిహాస గాథను తెరపై అద్భుతంగా చూపించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది వేసవిలో ప్రారంభించాలనుకుంటున్నారట. అంతేకాకుండా ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలను శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్‌బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారని బాలీవుడ్ సమాచారం. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్‌బీర్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారట. ఇక ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, మధు మంతెన, అల్లు అరవింద్‌లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తారనే ప్రచారం సాగుతోంది. -
స్టార్ హీరో మూవీ.. నన్ను తీసేశారు: ప్రముఖ హీరోయిన్
'బచ్నా యే హసీనో'.. 2008లో రిలీజైన బాలీవుడ్లో మూవీ.. ఇందులో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించాడు. కథలో భాగంగా అతడు ముగ్గురు హీరోయిన్లతో ప్రేమలో పడతాడు. అయితే అతడు నాలుగో హీరోయిన్‌తో కూడా ప్రేమపాఠాలు నడుపుతాడని కథలో రాసుకున్నారట! కానీ ఫైనల్ స్క్రిప్ట్‌లో మాత్రం ఆ పాత్రనే లేపేశారంటోంది స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. ఆ నాలుగో హీరోయిన్ కోసం తనను సంప్రదించారని చెప్తోంది. నా రోల్ తీసేశారు తాజాగా కత్రినా కైఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'బచ్నా యే హసీనో సినిమాలో నన్ను నాలుగో అమ్మాయిగా అనుకున్నారు. కానీ చివరకు ఆ పాత్రను తీసేశారు. ఇకపోతే జీరో మూవీలో అనుష్క పాత్రను చేయాలనుకున్నాను. అదే సమయంలో బబిత ఆఫర్ రావడంతో దాన్ని చేశాను' అని చెప్పుకొచ్చింది. జీరో బాక్సాఫీస్ దగ్గర చతికిలపడగా బబిత హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా టైంలోనే డేటింగ్ కాగా బచ్నా యే హసీనో మూవీకి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా సిద్దార్థ్ ఆనంద్ నిర్మించారు. ఇందులో మనీషా లంబ, బిపాషా బసు, దీపిక పదుకోణ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో రణ్‌బీర్-దీపికాలు లవ్‌లో పడ్డారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కత్రినాతోనూ డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. చివరకు ఆలియా భట్‌ను పెళ్లాడాడు. కత్రినా సినిమాల విషయానికి వస్తే ఆమె చివరగా మేరీ క్రిస్మస్ సినిమాలో నటించింది. ఈ మూవీ జనవరి 12న రిలీజైంది. చదవండి: హైదరాబాద్ టు ముంబై... బాలీవుడ్లో ఫేమస్ విలన్.. హీరోల వల్ల కెరీర్ నాశనం! -
శరవేగంగా రణబీర్ కపూర్ రామాయణం..
-
శూర్పణఖ?
రామాయణం ఆధారంగా హిందీలో దర్శకుడు నితీష్ తివారి ఓ భారీ బడ్జెట్ ట్రయాలజీ ఫిల్మ్‌ను తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా జరుగు తున్న ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయి. దీంతో నితీష్ తివారి ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై దృష్టి సారించారు. ఈ సినిమాలోని రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, హనుమంతునిగా బాబీ డియోల్, విభూషణుడిగా విజయ్ సేతుపతి, రావణుడిగా యశ్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా శూర్పణఖ పాత్రలో రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. రకుల్‌కు ఆల్రెడీ నితీష్ స్టోరీ చెప్పారని, లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని టాక్. కాగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన ఈ వేసవిలో రానుందని, 2025 చివర్లో తొలి భాగం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ టాక్. మరోవైపు ఈ నెలలో రకుల్‌ప్రీత్ సింగ్ వివాహం జాకీ భగ్నానీతో జరగనుంది. -
రామాయణంలో రకుల్.. ఆ పాత్రకు సెట్ అయ్యేనా?
రకుల్ ప్రీత్ సింగ్.. ఒకప్పుడు టాలీవుడ్లో ఈ పేరు మారుమ్రోగింది. వరుస సినిమాల్లో నటిస్తూ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మొదలు రవితేజ లాంటి స్టార్ హీరోల వరకు అందరితో రకుల్ నటించింది. ఇక్కడ వచ్చిన ఫేమ్‌తో బాలీవుడ్‌కు చక్కెసింది. అక్కడ అనుకున్న స్థాయిలో క్లిక్ కాలేదు. ఇటీవల అయితే ఈ బ్యూటీకి అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ ఒక్క సినిమా లేదు. తాజాగా తమిళ్లో అలయాన్ సినిమాతో ఓ మోస్తరు కమర్షియల్ హిట్ అందుకుంది. అయినా కూడా ఈ బ్యూటి చేతికి పెద్ద ప్రాజెక్టులు రాలేదు. దీంతో వెస్ సిరీస్‌ల మీదనే ఎక్కువ దృష్టిపెట్టింది. ఇక వెండితెరకు రకుల్ దూరమైనట్లే అనుకుంటున్న సమయంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో రకుల్ నటించబోతుందని ఆ వార్త సారాంశం. (చదవండి: పెళ్లయి ఏడాది కూడా కాలేదు, అంతలోనే నటి విడాకులు!) బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారి రామాయణాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రొడ్యూసర్లతో కలిసి నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కాస్టింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటించబోతున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి లేదా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. హనుమంతుడిగా నటించేందుకు సన్నీ డియోల్ అంగీకారం తెలిపాడు. తాజాగా మరో కీలకమైన పాత్ర కోసం మేకర్స్ రకుల్‌ని సంప్రదించారట. రామాయణంలో కీలకమైన శూర్పణఖ పాత్రను రకుల్ పోషిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం మేకర్స్ ఆమెను సంప్రదించగా..వెంటనే ఓకే చెప్పిందట. త్వరలోనే లుక్ టెస్ట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రావణుడిగా యష్, విభీషణుడిగా విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
రాముడి కోసం శిక్షణ
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, రావణుడి పాత్రలో యశ్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది వేసవిలో ప్రారంభించాలనుకుంటున్నారట. ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్‌బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారని బాలీవుడ్ సమాచారం. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్‌బీర్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారట. ఇక ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, మధు మంతెన, అల్లు అరవింద్‌లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు హిందీలో ‘లవ్ అండ్ వార్’, ‘బ్రహ్మాస్త్రం’, ‘యానిమల్’ ఫ్రాంచైజీలు కమిటయ్యారు రణ్‌బీర్ కపూర్. -
'యానిమల్'లో ఆ సీన్స్.. నా భార్యకు నచ్చలేదు: సందీప్ రెడ్డి
'యానిమల్' సినిమా రిలీజై రెండు నెలలకు పైనే అయిపోయింది. కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం ఇప్పటికీ ఏదో ఓ ఇంటర్వ్యూ ఇస్తూనే ఉన్నాడు. రీసెంట్గా తనపై విమర్శలు చేసిన హీరో ఆమిర్ భార్య కిరణ్ రావ్, దిగ్గజ రైటర్ జావేద్ అక్తర్‌కి ఇచ్చిపడేశాడు. అది అలా ఉంచితే తాజాగా 'యానిమల్' చూసిన తర్వాత తన భార్య, కొడుకు ఎలా రియాక్ట్ అయ్యారనేది బయటపెట్టాడు. (ఇదీ చదవండి: టీవీ షోలో కుమారి ఆంటీ.. 'బిగ్‌బాస్ 7' బ్యాచ్‌తో కలిసి స్కిట్!) సందీప్ రెడ్డిని ఈ మధ్య ఇంటర్వ్యూ చేసిన సిద్ధార్థ్ కన్నన్.. ఈ సినిమా మీ ఏడేళ్ల కొడుక్కి చూపించారా? అతడి రియాక్షన్ ఏంటి? అని అడిగాడు. దీనికి సమాధానమిచ్చిన సందీప్.. 'చూపించకూడని కొన్ని సీన్స్ ఎడిట్ చేసి 'యానిమల్' మూవీని ఓ హార్ట్ డిస్క్‌లో ఉంచా. ఏ రేటింగ్స్ సన్నివేశాలు లేని వెర్షన్‌ని గోవాలో న్యూ ఇయర్ సందర్భంగా నా కొడుకు అర్జున్ రెడ్డికి చూపించాను. అది వాడికి బాగా నచ్చింది. అండర్వేర్ యాక్షన్ సీన్స్ చాలా కామెడీగా ఉన్నాయని చెప్పాడు' 'నా భార్య మనీషా మాత్రం ఈ సినిమాలోని రక్తపాతం సీన్స్ విషయంలో కాస్త డిసప్పాయింట్ అయింది. స్త్రీ పాత్రలని చూపించిన విధానం గురించి మాత్రం పెద్దగా ఏం చెప్పలేదు. అయితే నేను తీసే చిత్రాలకు సరైన ఫీడ్ బ్యాక్ నా సోదరుడు ప్రణయ్ రెడ్డి నుంచి వస్తుంది' అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కనబెడితే సందీప్.. ప్రభాస్‌తో 'స్పిరిట్' తీస్తాడు. దీని తర్వాత 'యానిమల్' సీక్వెల్, అనంతరం అల్లు అర్జున్‌తో మూవీ ఉంది. (ఇదీ చదవండి: మాజీ భర్త గురించి ప్రశ్న.. క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్) -
Filmfare Awards 2024: దుమ్ము రేపిన బాలీవుడ్ కపుల్, స్వీట్ కిస్, పిక్స్ వైరల్
ప్రతిష్టాత్మక 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోబాలీవుడ్ జంట రణబీర్ కపూర్-అలియాభట్ దుమ్ము రేపారు. అలియా, రణబీర్ ఇద్దరూ ఉత్తమ నటీ, ఉత్తన నటుడు అవార్డులను గెల్చుకుని రీల్ లైఫ్‌లో కూడా బెస్ట్ కపుల్‌గా నిలిచారు. రణబీర్ చిత్రం యానిమల్లోని జమాల్ కుడు అనే పాటకు ఇద్దరూ స్టెప్స్ వేయడం అక్కడున్న వారందరిన్నీ ఉత్సాహపరిచింది. ఈ డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అంతేకాదు ఆఖరులో రణ్‌బీర్ అలియాను ముద్దుపెట్టుకోవడం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అలియా భట్ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీకిగాను ఉత్తమ నటి అవార్డును అందుకోగా, ఆమె భర్త రణబీర్ కపూర్ యానిమల్‌లో తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' మూవీ ఏకంగా ఆరు అవార్డులను కైవసం చేసుకుంది. అంతేకాదు ఓటీటీ రికార్డుల మోత మోగించిన '12 త్ ఫెయిల్' ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా దర్శకుడు విధు వినోద్ చోప్రా ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకున్నారు. గుజరాత్ లోని గాంధీనగర్ వేదికగా అట్టహాసంగా నిర్వహించిన ఈ వేడుకలో 2023 లో విడుదలైన చిత్రాలకు సంబంధించి అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
భార్యతో స్టార్ హీరో డ్యాన్స్..
-
భార్యతో స్టార్ హీరో డ్యాన్స్.. తలపై గ్లాసు పెట్టుకుని..
బాలీవుడ్ పవర్ఫుల్ కపుల్ రణ్‌బీర్ కపూర్- ఆలియా భట్ అరుదైన ఘనత సాధించారు. 69వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఇద్దరూ ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్లుగా పురస్కారాలు అందుకున్నారు. దీంతో సంతోషంలో మునిగి తేలుతోందీ జంట. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన అవార్డుల వేడుకలో ఈ దంపతులు డ్యాన్స్‌తో కనువిందు చేశారు. అంతేనా.. యానిమల్ సినిమాలో హైలెట్ అయిన 'జమల్ కుదు' హుక్ స్టెప్‌ను రీక్రియేట్ చేశాడు రణ్‌బీర్. స్టేడియం ముందు వరుసలో ఉన్న భార్య దగ్గరకు వచ్చి చిందులేశాడు. తలపై గ్లాసు పెట్టుకుని డ్యాన్స్ చేశాడు. దీంతో ఆలియా కూడా భర్తతో కలిసి పాదం కదిపింది. ఈ జోష్‌లో భార్యను ఆప్యాయంగా ముద్దాడాడు హీరో. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మీ జంటను చూస్తే ముచ్చటేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. కాగా 'యానిమల్' సినిమాకుగానూ రణ్‌బీర్ ఉత్తమ నటుడిగా, 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని' చిత్రానికిగానూ ఆలియా భట్ ఉత్త నటిగా అవార్డులు అందుకున్నారు. #RanbirKapoor comes in all guns blazing at the 69th #HyundaiFilmfareAwards2024 with #GujaratTourism.@GujaratTourism @HyundaiIndia @VimalElaichi pic.twitter.com/N3ULAMvTsw — Filmfare (@filmfare) January 28, 2024 ఫిలింఫేర్ అవార్డులు ఏయే సినిమాలకు వచ్చాయో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
భార్య రికార్డును బద్ధలు కొట్టిన రణ్‌బీర్.. పప్పా అని ఎన్నిసార్లు..
కొందరు మాటకు ముందోసారి, వెనుకోసారి పేరు పెట్టి పిలుస్తూనే ఉంటారు. సినిమాల్లో కూడా ఇది జరుగుతుంది. అందుకు బ్రహ్మాస్త్ర మూవీ నిదర్శనం. ఈ సినిమాలో రియల్ జంట రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించారు. రణ్‌బీర్.. శివ అనే పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రంలో ఆలియా.. అతడిని పదేపదే శివ శివ అంటూ పిలిచేది. కొందరు దీన్ని లెక్కగట్టి సోషల్ మీడియాలో వదిలారు. సినిమా మొత్తమ్మీద రణ్‌బీర్‌ను 104 సార్లు శివ అని పిలిచిందని లెక్క తేల్చారు. ఇప్పుడీ రికార్డును బద్ధలు కొట్టాడు రణ్‌బీర్. అదెలాగంటే.. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో యానిమల్ రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ యానిమల్. రూ.890 కోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా తండ్రీకొడుకుల అనుబంధం చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో అనిల్ కపూర్ తండ్రి పాత్రను పోషించాడు. పదేపదే పప్పా (నాన్న).. పప్పా అని తండ్రి గురించి ఆరాటపడతాడు హీరో. సినిమా మొత్తం ఈ తండ్రి ప్రేమ పొందాలన్న హీరో తపన గురించే కథ నడుస్తూ ఉంటుంది. పప్పా అన్న పదం ఎన్నిసార్లు వచ్చిందంటే? అలా ఈ సినిమాలో పప్పా అన్న పదం ఏకంగా 196 సార్లు వచ్చిందట. ఒక్క రణ్‌బీర్ నోటి నుంచే 150 కంటే ఎక్కువసార్లు పప్పా అన్న పదం వచ్చినట్లు తెలుస్తోంది. ఇది చూసిన జనాలు మొత్తానికి బ్రహ్మాస్త్ర రికార్డును యానిమల్ బద్ధలు కొట్టిందని కామెంట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా భార్య రికార్డును రణ్‌బీర్ బ్రేక్ చేశాడని ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు. #Animal papa count. pic.twitter.com/ltaaIJzK1l — LetsCinema (@letscinema) January 27, 2024 చదవండి: సాయిపల్లవి సోదరి వీడియో.. అక్కనే మించిపోయిందిగా! -
'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి
మూవీ లవర్స్ ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న 'యానిమల్' సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే అందరూ మూవీన చూసేస్తున్నారు. అయితే గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో గట్టిగా వినిపించిన ఓ విషయం మాత్రం జరగలేదు. దీంతో అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు. (ఇదీ చదవండి: చాన్నాళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు) 'అర్జున్ రెడ్డి'తో సెన్సేషన్ సృష్టించిన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఆ తర్వాత బాలీవుడ్లో వరస సినిమాలు తీశాడు. 'అర్జున్ రెడ్డి' రీమేక్‌గా 'కబీర్ సింగ్' తీసి బ్లాక్‌బస్టర్ కొట్టాడు. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో 'యానిమల్' మూవీ తీశాడు. ఫ్యామిలీ డ్రామాకు తోడు వయలెన్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ కొంతమందికి తెగ నచ్చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. అలా డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని.. జనవరి 26న ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. అయితే సినిమా ప్రమోషన్స్ సందర్భంగా 'యానిమల్' గురించి ఎన్నో విషయాలు చెప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల మూవీ కాకుండా మరిన్ని సీన్లు ఉన్నాయని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓటీటీలోకి ఎడిట్ చేసిన సన్నివేశాలు కూడా జోడిస్తారని తెగ ఊరించారు. తీరా ఇప్పుడు చూస్తే థియేటర్లలో చూసిన సినిమా కట్నే ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. దీంతో అదనపు సన్నివేశాలు ఉంటాయని భావించిన వాళ్లు మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) -
చెంపదెబ్బ వల్ల చాలా గట్టిగా ఏడ్చేశాను: హీరోయిన్ రష్మిక
పాన్ ఇండియా రష్మిక కన్నీళ్లు పెట్టుకుంది. అవును మీరు సరిగానే విన్నారు. ఓ చెంపదెబ్బ వల్లే ఇదంతా జరిగింది. అప్పుడేం జరిగిందనే విషయాన్ని స్వయంగా ఈ బ్యూటీనే బయటపెట్టింది. ఈ సంఘటన జరిగిన సమయంలో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయానని.. ఏడుస్తూ అరిచేశానని చెప్పుకొచ్చింది. ఇంతకీ అసలేం జరిగింది? కన్నడ బ్యూటీ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. కొన్నాళ్ల క్రితం 'యానిమల్' మూవీలో నటించిన రష్మిక.. అద్భుతమైన సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. అలానే ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర సంగతుల్ని బయటపెట్టింది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన 21 సినిమాలు) యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో రష్మిక, రణ్ విజయ్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించారు. జోయా పాత్రలో తృప్తి దిమ్రి యాక్ట్ చేసింది. ఓ సీన్లో భాగంగా జోయాతో శృంగారంలో పాల్గొన్నానని రణ్ విజయ్ వచ్చి తన భార్య గీతాంజలితో చెబుతాడు. దీంతో ఈమెకు కోపమొచ్చి భర్త చెంపపై గట్టిగా లాగి పెట్టి కొడుతుంది. అయితే ఈ సీన్ పూర్తయిన తర్వాత తను ఏడవడంతో పాటు గట్టిగట్టిగా అరిచానని రష్మిక చెప్పింది. 'ఆ సీక్వెన్స్ మొత్తం ఒకే టేక్‌లో కంప్లీట్ చేశాం. అయితే ఈ సీన్లో యాక్ట్ చేస్తున్నప్పుడు నేనేం చేస్తున్నాననేది కూడా నాకు గుర్తులేదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఓ భార్య ఎలా ఫీల్ అవుతుందో అలానే రియాక్ట్ అవ్వాలని సందీప్ నాకు చెప్పాడు. నాకు అది మాత్రమే గుర్తుంది. యాక్షన్-కట్ తప్పితే మధ్యలో ఏం జరిగిందో గుర్తులేదు. అయితే సీన్లో రణ్‌బీర్ చెంపపై కొట్టిన తర్వాత గట్టిగా ఏడవడంతో పాటు అరిచేశాను. ఆ తర్వాత రణ్‌బీర్ దగ్గరకు వెళ్లి అంతా ఓకేనా అని అడిగాను. అయితే ఈ సినిమా, ఈ సీన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పాలంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది' అని రష్మిక చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: హనుమాన్ సినిమాపై హీరోయిన్ సమంత రివ్యూ) -
రాముడిగా రణ్‌బీర్.. కుంభకర్ణుడుగా బాబీ డియోల్!
‘యానిమల్’ సినిమాలో రణ్విజయ్ సింగ్‌గా రణ్‌బీర్ కపూర్, అబ్రార్‌గా బాబీ డియోల్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కాగా రణ్‌బీర్, బాబీ డియోల్‌లు మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారన్నది బాలీవుడ్లో వినిపిస్తున్న తాజా కబురు. రామాయణం ఆధారంగా హిందీలో దర్శకుడు నితీష్ తివారి ‘రామాయణ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్లుగా నితీష్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నారని, ఈ పనులు తుది దశకు చేరుకున్న తరుణంలో నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారని టాక్. (చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది) ఈ నేపథ్యంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో దేవ్ దత్తా, రావణుడి పాత్రలో యశ్ నటించనున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ సినిమాలోని కుంభకర్ణుడి పాత్రలో బాబీ డియోల్, కైకేయి పాత్రలో లారా దత్తా కనిపించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. (చదవండి: జూ. ఎన్టీఆర్‌పై బాలకృష్ణ ద్వేషం.. చిచ్చు పెట్టింది ఎవరు..?) అన్నీ కుదిరి ‘రామాయణ్’ సినిమాలో రణ్‌బీర్, బాబీ డియోల్ సెట్ అయితే.. ‘యానిమల్’ తర్వాత ఈ ఇద్దరూ కలిసి నటించే సినిమా ఇదే అవుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ వేసవిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందట. మధు మంతెన, నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్‌లు కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారనే వార్తలు గతంలో వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?
ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా చాలా అంటే చాలా మాట్లాడుకున్నారా అంటే అందరికీ గుర్తొచ్చేది 'యానిమల్'. థియేటర్లలోకి వచ్చేంతవరకు ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. కానీ ఒక్కసారి బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేసిన తర్వాత ఆడియెన్స్‌కి ఎందుకో తెగ నచ్చేసింది. ఇప్పటికీ చాలాచోట్ల ఇంకా స్క్రీనింగ్ అవుతోంది. ఇలాంటి టైంలో ఓటీటీ న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పగానే 'అర్జున్ రెడ్డి' గుర్తొస్తుంది. ఈ సినిమాతో ట్రెండ్ సృష్టించాడు. ఇప్పుడు 'యానిమల్'తో దీన్ని మించిపోయేలా చేశాడు. తీసింది బాలీవుడ్ హీరోతోనే అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని చాలా ఓన్ చేసుకున్నారు. ఈ క్రమంలో మూవీ గురించి ఇప్పటికీ తెగ మాట్లాడుకుంటున్నారు. సీన్స్, సాంగ్స్, ఇందులోని యాక్టర్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) ఇకపోతే డిసెంబరు 1న థియేటర్లలోకి వచ్చిన 'యానిమల్' సినిమా డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. లెక్క ప్రకారం అయితే జనవరి 26న స్ట్రీమింగ్ చేస్తారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఆలోచన మారినట్లు కనిపిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 15నే ఓటీటీలోకి తీసుకొచ్చేయాలని అనుకున్నారట. ఈ తేదీ ఫిక్స్ అని, కాకపోతే అధికారిక ప్రకటన రావాల్సి ఉందని అంటున్నారు. ఒకవేళ సంక్రాంతికి వస్తే మాత్రం 'యానిమల్'కి ప్లస్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. థియేటర్లలో కొత్త సినిమాలకు వెళ్లే ఇంట్రెస్ట్ లేని వాళ్లు.. ఈ బ్లాక్‌బస్టర్‌పై లుక్కేసే అవకాశముంటుంది. అయితే ఈ సినిమా ఓటీటీ వెర్షన్.. థియేటర్ కంటే కాస్త పెద్దగానే ఉంటుందని సమాచారం. ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే.. కొన్నిరోజులు ఆగితే సరి. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) -
Alia Ranbir Daughter Raha Photos: ఏడాది తర్వాత కూతురి ముఖం చూపించిన రణ్‌బీర్-ఆలియా (ఫోటోలు)
-
నిద్రలేని రాత్రులు గడుపుతున్నా!
‘యానిమల్’ సినిమాతో ఒక్కసారిగా ట్రెండింగ్ స్టార్ అయ్యారు బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయర్స్ పెరిగిపోయారు. ఈ సడన్ స్టార్డమ్ గురించి త్రిప్తి దిమ్రీ స్పందిస్తూ– ‘‘ప్రేక్షకులు, అభిమానుల నుంచి నాకు లభిస్తున్న ప్రేమ ఆనందాన్నిస్తోంది. ఈ అనుభూతి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. చెప్పాలంటే నా మొబైల్ ఫోన్ మెసేజ్‌లతో మోగుతూనే ఉంది. చివరికి ఈ మెసేజ్‌ల వల్ల నేను నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తోంది. అన్ని వస్తున్నాయి. అవి చదువుతూ రాత్రి సమయాన్ని గడిపేస్తున్నాను. కానీ ఇది బాగుంది. ఇక రణ్‌బీర్ కపూర్ అమేజింగ్ యాక్టర్. చాలా సపోర్టివ్. రష్మికా మందన్నా కూడా చాలా కో–ఆపరేటివ్’’ అని చెప్పుకొచ్చారు. రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా, త్రిప్తి దిమ్రీ, బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్’ సినిమా ఈ నెల 1న విడుదలైన విషయం తెలిసిందే. సూపర్ హిట్ టాక్‌తో ఈ చిత్రం దూసుకెళుతోంది. -
బాక్సాఫీస్ వేటలో యానిమల్ బ్లాక్ బస్టర్
బాక్సాఫీస్ వద్ద ‘యానిమల్’ వసూళ్ల వేట కొనసాగుతోంది. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తోనే సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆ తర్వాత హిందీ పరిశ్రమ వైపు వెళ్లారు. అక్కడ ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్నే ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి, మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ రెండు చిత్రాలు ఒక ఎత్తయితే సందీప్ తెరకెక్కించిన మూడో చిత్రం ‘యానిమల్’ వసూళ్ల పరంగా మరో ఎత్తు అనాలి. రణ్‌బీర్ కపూర్ కథానాయకునిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలై, సంచలన వసూళ్లతో దూసుకెళుతోంది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 116 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక తొలి వారాంతానికి రూ. 356 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా 16 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ. 817.36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రణ్‌బీర్ కపూర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించే దిశగా ఈ చిత్రం దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ సాధించిన వసూళ్ల ప్రకారం ఈ ఏడాది విడుదలై, అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో ‘యానిమల్’ టాప్ ఫైవ్‌లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్ ’, ‘పఠాన్ ’ చిత్రాలు రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టి మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక ‘యానిమల్’ చిత్రం తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. తెలుగు అనువాదాన్ని ‘దిల్’ రాజు విడుదల చేశారు. రిలీజ్ అయిన తొలి రోజే రూ. 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని ‘దిల్’ రాజు పేర్కొన్నారు. తెలుగు వెర్షన్ ఇప్పటివరకూ దాదాపు రూ. 60 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఇలా ఈ ఏడాది సందీప్ రెడ్డి బాక్సాఫీస్‌ని షేక్ చేసే చిత్రం తీశారు. ఈ చిత్రానికి ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా ఓ నిర్మాత. రష్మికా మందన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రి కీలక పాత్రలు పోషించారు. ‘యానిమల్’కి రెండో భాగం ‘యానిమల్ పార్క్’ రానున్న సంగతి తెలిసిందే. -
100 కోట్లు కొల్లగొడుతున్న భార్య,భర్తలు
-
రణబీర్, సాయి పల్లవి కాంబినేషన్ లో సినిమా?
-
రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతున్న యానిమల్ మూవీ
-
1000 కోట్లు మార్క్ వైపు యానిమల్ పరుగులు
-
ఇండస్ట్రీలో మరో సూపర్ స్టార్
-
యానిమల్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా రణబీర్ కపూర్
-
ఈ ఏడాది కలిసొచ్చింది
రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్’. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ ఖేతని, క్రిషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 1న రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ‘యానిమల్’ చిత్రాన్ని పంపిణీ చేసిన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 15 కోట్ల మేరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. తొలి వారాంతంలోనే ‘యానిమల్’ రూ. 35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబడుతుందని అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది మాకు బాగా కలిసొచ్చింది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నాలుగు, ‘దిల్’ రాజుప్రోడక్షన్స్ బ్యానర్లో మూడు సినిమాలు.. ఇలా మొత్తంగా ఏడు సినిమాలు చేస్తున్నాం. రామ్‌చరణ్‌గారి ‘గేమ్ చేంజర్’ సినిమా చిత్రీకరణ 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ మేన్ ’ను మార్చిలో రిలీజ్ చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు. -
సెంచరీ కొట్టిన యానిమల్.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం యానిమల్. ఫస్ట్ లుక్ రిలీజైనప్పటి నుంచి ఈ సినిమాకు బోలెడంత హైప్ వచ్చింది. టీజర్, ట్రైలర్ రిలీజయ్యాక ఆ అంచనాలు ఆకాశాన్నంటాయి. రణ్‌బీర్ యాక్టింగ్ చూసి మెంటలొచ్చేసిందని సూపర్‌స్టార్ మహేశ్‌బాబే చెప్పడం విశేషం. తండ్రీకొడుకుల భావోద్వేగం చుట్టూ తిరిగే ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడుగంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నప్పటికీ ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన లభిస్తోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహించిన సినిమా కావడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా ఈ సినిమా తొలిరోజు ఎంత రాబట్టిందనే విషయాన్ని యానిమల్ మూవీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధికారికంగా వెల్లడించింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల కలెక్షన్లు సాధించిందని పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే యానిమల్ రూ.500 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి యానిమల్ రానున్న రోజుల్లో ఎటువంటి రికార్డులు బద్ధలు కొడుతుందో చూడాలి! He has come to conquer all the records 🤙🏼🔥🪓#AnimalHuntBegins Book Your Tickets 🎟️ https://t.co/QvCXnEetUb#Animal#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23@imvangasandeep #BhushanKumar… pic.twitter.com/bF8nV2Nw09 — T-Series (@TSeries) December 2, 2023 చదవండి: అందుకే నా సినిమా కలెక్షన్స్ తగ్గుతున్నాయి: సల్మాన్ ఖాన్ -
'యానిమల్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే
మూవీ లవర్స్ చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్న మూవీ 'యానిమల్'. విడుదలకు ముందే ఓ రేంజు అంచనాలు సెట్ చేసిన ఈ చిత్రాన్ని.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేశారు. సినిమా ఎలా ఉంది? టాక్ ఏంటి? లాంటి విషయాలు పక్కనబెడితే ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ని అప్పుడే ఫిక్స్ చేసుకుంది. డేట్ కూడా చెప్పేస్తున్నారు. (ఇదీ చదవండి: Dhootha Web Series Review: నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ రివ్యూ) బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించిన సినిమా 'యానిమల్'. తండ్రి-కొడుకుల మధ్య బాండింగ్ అనే పాయింట్ ఆధారంగా ఈ మూవీ తీశారు. ఇందులో రణ్‌బీర్, రష్మిక, అనిల్ కపూర్ తదితరులు తమ తమ యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. అయితే సెకండాఫ్‌లో ల్యాగ్ అయ్యేసరికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇకపోతే థియేటర్లలో సినిమా రిలీజ్ కావడానికి ముందే 'యానిమల్'.. ఓటీటీ పార్ట్నర్ని ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. బిగ్స్క్రీన్పై 6-8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డేన 'యానిమల్' మూవీ ఓటీటీలోకి రావొచ్చనిపిస్తోంది. (ఇదీ చదవండి: Animal Review: ‘యానిమల్’మూవీ రివ్యూ) -
ప్రమోషన్ లో ‘Animal’ మూవీ టీమ్ (ఫొటోలు)
-
‘యానిమల్’ మూవీ ట్విటర్ రివ్యూ
‘అర్జున్‌రెడ్డి’సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు సందీప్‌రెడ్డి వంగ. అదే సినిమాను కబీర్‌సింగ్ పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత సందీప్ చాలా గ్యాప్ తీసుకొని ‘యానిమల్’సినిమాను తెరకెక్కించాడు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ చిత్రం నేడు(డిసెంబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ చిత్రం ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. యానిమల్ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. యానిమల్ చిత్రానికి ఎక్స్‌లో మంచి స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని ఎక్కువ మంది చెబుతున్నారు. రణ్‌బీర్, అనిల్ కపూర్, రష్మిక, బాబీ డియోల్ల నటన అదిరిపోయిందంటున్నారు. వయోలెన్స్ ఎక్కువైందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. Big day for the Indian box office 🥵 Anticipate the cinematic magic as #AnimalMovie hits screens tomorrow, promising an exhilarating experience. 💥💥💥💥💥 Also, get ready for the much-awaited #SalaarCeaseFire trailer dropping tomorrow. Double the excitement, double the… pic.twitter.com/h0evNakiCL — Thyview (@Thyview) November 30, 2023 ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో బిగ్డే ఇది. సినిమాటిక్ మ్యాజిక్ ఊహించబోతున్నాం. ఈ సినిమా అద్బుతమైన అనుభూతిని అందిస్తుందని ఆశిస్తున్నాం. ఈ రోజు డబుల్ ధమాకా. సలార్ ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతున్నది. నాకు డబుల్ ఎక్సైట్మెంట్ అంటూ ఓ నెటిజన్ ట్విట్ చేశాడు. Very good 1st half 👌👌 Ranbir like never before and Vanga has written a simply mind blowing character for him. Everything on point so far. Waiting for 2nd half #Animal — RGK 🍀 (@iamrgk_) December 1, 2023 ఫస్టాఫ్ చాలా బాగుంది. కర్బీర్ కపూర్‌ని ఇలాంటి పాత్రలో ఎప్పుడు చూడలేదు. అతనికి సందీప్ వంగ మంచి పాత్రను ఇచ్చాడు. ప్రతి పాయింట్ బాగుంది. సెకండాఫ్ కోసం ఎదురు చూస్తున్నానంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #OneWordReview...#Animal: BLOCKBUSTER Rating: ⭐️⭐⭐️⭐️½#RanbirKapoor𓃵 in a never seen before avatar his career best performance #AnimalReview#AnimalTheFilm #RanbirKapoor #Svr #AnimalOn1stDec #AnimalReview #BobbyDeol #AnilKapoor #AnimalOn1stDec #RashmikaMandanna #AnimalMovie pic.twitter.com/Kz4IXMFTSl — himesh (@himeshmankada) November 30, 2023 ఒక్కమాటలో చెప్పాలంటే.. యానిమల్ బ్లాక్ బస్టర్. ఇలాంటి పాత్రలో రణ్‌బీర్‌ని ఎప్పుడు చూడలేదు. అతని కెరీర్లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు’అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు. #Animal Blood batting fight Goosebumps 🔥🔥🔥#RanbirKapoor𓃵 #AnimalMovie #AnimalReview #AnimalTheFilm #Animal #AnimalAdvanceBooking #AnimalOn1stDec@Portalcoin $Portal #AnimalPremieres pic.twitter.com/nfAJJRtoDb — BTC6660 ll 🔥Champions Tactics (@BTC6660) December 1, 2023 Blockbuster first half.. Sandeep Reddy Vanga just hit this out of the park.. Terrific drama, Shot making, sound design, Ranbir intensity, supremely quality product from once in a generation talented director. Such a Feast to watch it on silver screen #Animal — PST (@PSTtwtz) December 1, 2023 I Really Wish #Animal to be biggest Blockbuster for Ranbir Kapoor, Bobby Deol , Sandeep Vanga ,Anil Kapoor for showing their Love &Respect towards @urstrulyMahesh Their gesture and way of receiving is so heart warming❤️ All The Best Sandeep & Ranbir#AnimalMovie #AnimalTheFilm pic.twitter.com/nWeQOFayyN — Hemanth Kiara (@ursHemanthRKO) November 30, 2023 Ranbir 🔥🔥🔥#AnimalMovie One of the best climax 😢#AnimalTheFilm #Animal #AnimalOn1stDec #AnimalAdvanceBooking #AnimalPremieres #AnimalReview #RanbirKapoor𓃵 pic.twitter.com/DXHF05TK1C — Abhishek (@Abhishek09kk) December 1, 2023 Inside reports ..everywhere positive#AnimalReview#ANIMAL : BLOCKBUSTER. Rating: 🌟🌟🌟🌟🌟½#SandeepReddyVanga immerses us into the world of #Animal, delivers a KING-SIZED ENTERTAINER… Imagine SPIRIT 🥵 #spirit #Prabhas #salaar pic.twitter.com/zcbo47vEAy — Film Royce (@film_royce) December 1, 2023 #Animal Blood batting fight Goosebumps 🔥🔥🔥#RanbirKapoor𓃵 #AnimalMovie #AnimalReview #AnimalTheFilm #Animal #AnimalAdvanceBooking #AnimalOn1stDec@Portalcoin $Portal #AnimalPremieres pic.twitter.com/nfAJJRtoDb — BTC6660 ll 🔥Champions Tactics (@BTC6660) December 1, 2023 Blockbuster first half.. Sandeep Reddy Vanga just hit this out of the park.. Terrific drama, Shot making, sound design, Ranbir intensity, supremely quality product from once in a generation talented director. Such a Feast to watch it on silver screen #Animal — PST (@PSTtwtz) December 1, 2023 -
తెలుగు డైరెక్టర్ - హిందీ హీరో సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా ?
-
యానిమల్కు 'A' సర్టిఫికెట్.. ఆనందించిన సందీప్ రెడ్డి వంగా
యానిమల్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ - రష్మిక కాంబినేషన్లో వస్తున్న ‘యానిమల్’ సినిమాను సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. విభిన్న కథతో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రన్ టైమ్ 3:20 నిమిషాలు అని డైరెక్టర్ ప్రకటించడంతో అందరూ చూడటం కష్టం అంటూ కామెంట్లు చేశారు. తీరా ట్రైలర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ భారీగా జరిగిపోయాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలివే!) యానిమల్ మూవీకి సెన్సార్ వాళ్లు 'A' సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయంలో చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అనడం గమనార్హం. ఈ సినిమా పిల్లలు చూసేది కాదని ఆయన క్లియర్‌గా చెప్పాడు. డిసెంబర్ 1న వచ్చే ఈ సినిమాకు పిల్లలతో వెళ్లకండని ఆయన ఓపెన్‌గానే చెప్పాడు. 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ సినిమా చూడాల్సి ఉంటుంది. నిజానికి ఈ సినిమా పిల్లలు చూసేలా లేదని సందీప్ బహిరంగంగా చెప్పడం విశేషం. చిన్నపిల్లలకు యానిమల్ సినిమా సెట్ కాదని .. తన కుమారుడితో పాటు కజిన్స్ పిల్లలను కూడా ఈ సినిమాకు తీసుకుపోనని ఆయన చెప్పాడు. అవకాశం ఉంటే ఈ సినిమాలో కొంత భాగాన్ని కట్ చేసి ఆ తర్వాత వారికి చూపించే ప్రయత్నం చేస్తానని సందీప్ తెలిపాడు. ఇలా సినిమా గురించి ఓపెన్‌గా చెప్పడం ఇండస్ట్రీలో చాలా అరుదు. తన వంతు బాధ్యతాయుతంగా సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులకు ఇలా చెప్పడంతో నెటిజన్ల నుంచి ఆయన ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇందులో అశ్లీలత అంతగా లేకున్నా కొంచెం వయలెన్స్ ఎక్కువుగా ఉంటుందని టాక్. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ... ఏ మేరకు రాబడుతుందో ఇప్పుడే అంచనా వేయలేమని చెప్పిన సందీప్ సినిమా మాత్రం ఆందరనీ ఆలోచింపజేస్తుందని తెలిపాడు. కానీ యానిమల్ రూ.800 కోట్ల మార్క్‌ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
మహేష్ బాబు డైలాగ్ తో అదరగొట్టిన రణబీర్ కపూర్
-
‘యానిమల్’ ప్రీ రిలీజ్లో మహేశ్‌బాబు,రణ్‌బీర్ సందడి (ఫొటోలు)
-
రణ్‌బీర్.. ఇక్కడికి షిఫ్ట్ అయిపో.. తెలుగువాళ్లు బాలీవుడ్‌ను..
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరో వయొలెంట్ సినిమాతో ముందుకు వస్తున్నాడు. తండ్రీకొడుకుల బంధం నేపథ్యంలో యానిమల్ మూవీ తెరకెక్కించాడు. రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. సోమవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై మంత్రి మల్లారెడ్డి మైక్ పట్టుకుని ఊగిపోయారు. ముంబై, బెంగళూరు వద్దు.. హైదరాబాదే బెస్ట్.. ఆయన మాట్లాడుతూ.. 'మహేశ్‌బాబు గారు.. నేను మీ బిజినెస్మెన్ సినిమా చూసి రాజకీయాల్లోకి వచ్చాను. పదిసార్లు ఆ సినిమా చూసే ఎంపీనయ్యాను. సేమ్ మోడల్.. సేమ్ సిస్టమ్.. అంతా సేమ్! రణ్‌బీర్.. మీకో విషయం చెప్పాలి. మరో ఐదేళ్లలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ.. బాలీవుడ్, హాలీవుడ్ అంతటినీ ఏలుతుంది. ఏడాది తర్వాత మీరు కూడా హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోండి. ముంబై పాతదైపోయింది. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ ఎక్కువుంది. ఇప్పుడు ఇండియాలో అనుకూలంగా ఉన్న ఏకైక నగరం హైదరాబాదే! తెలుగువాళ్లు తెలివైనవారు తెలుగు ప్రజలు చాలా తెలివైనవారు. రాజమౌళి, దిల్ రాజు, సందీప్ రెడ్డి వంగా, రష్మిక మందన్నా.. వీరంతా కూడా ఎంతో తెలివైనవారు. పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే! మీ యానిమల్ సినిమా కూడా రూ.500 కోట్ల కలెక్షన్లు రాబడుతుంది' అని చెప్పుకొచ్చారు. ఈయన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. మల్లారెడ్డి.. బాలీవుడ్ సెలబ్రిటీల ముందే హిందీ చిత్రపరిశ్రమను రోస్ట్ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతిథులుగా వచ్చిన వారిని చులకన చేసి మాట్లాడటం కరెక్ట్ కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Minister #MallaReddy sparked controversy at the #AnimalPreReleaseEvent, making bold statements. He declared, 'Telugu people will lead India; you must move to Hyderabad in a year. Mumbai is outdated Hyderabad is the only city for India.' #Animal pic.twitter.com/AhnSKmhTrZ — Anil Tiwari (@Anil_Kumar_ti) November 27, 2023 చదవండి: పెద్ద తప్పు చేసిన అమర్, అర్జున్.. గేమ్ చేతులారా నాశనం చేసుకోవడమంటే ఇదే! -
Animal: ‘యానిమల్’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
తండ్రిని తలుచుకుని ఎమోషనలైన స్టార్ హీరో
‘‘కొన్నేళ్ల క్రితం మా నాన్నను(రిషీ కపూర్) కోల్పోయా. నా చిన్నప్పుడు నాన్న షూటింగ్స్‌తో బిజీగా ఉండటంతో సరైన సమయాన్ని గడపలేకపోయాను. నాన్నపై నాకు ప్రేమ, గౌరవం ఉంది. కానీ, మా మధ్య స్నేహబంధం లేదు. ఆయనతో ఫ్రెండ్లీగా ఉండి మరెన్నో విషయాలు పంచుకుని ఉంటే బాగుండేదనే బాధ నాకు ఉంది. నా జీవితాంతం ఆ బాధ ఉంటుంది’’ అని హీరో రణ్‌బీర్ కపూర్ అన్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం ‘యానిమల్’. తండ్రీకొడుకుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రల్లో నటించారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 1న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ–‘‘తెలుగు ప్రేక్షకులంటే నాకెంతో అభిమానం. ఇక్కడ వాళ్లు చూపించే ప్రేమాభిమానం మరో స్థాయిలో ఉంటాయి. సినిమాలు మానేసి నా కుమార్తె రాహ కోసం నా సమయాన్ని కేటాయించాలని ఉంది. కాకపోతే నేనూ నా కలలను సాకారం చేసుకోవాలి కాబట్టి అలా చేయలేను (నవ్వుతూ)’’ అన్నారు. సందీప్ రెడ్డి మాట్లాడుతూ–‘‘మహేశ్‌బాబుకు ‘యానిమల్’ కథ చెప్పలేదు. ‘డెవిల్’ కథ చెప్పాను. కానీ మా కాంబో కుదరలేదు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘అన్ని చిత్రాలకు మన దగ్గర టికెట్ రేట్స్ ఎలా ఉంటాయో ‘యానిమల్’కి అలానే ఉంటాయి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశాం. అద్భుతమైన స్పందన లభించింది. ‘అర్జున్ రెడ్డి’ని మిస్ అయ్యాను. అప్పటి నుంచి సందీప్ సినిమా కోసం ప్రయత్నిస్తున్నాను. భూషణ్గారు నన్ను నమ్మి ఈ సినిమా మా చేతిలో పెట్టారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నేను రణ్‌బీర్ తండ్రి పాత్ర చేశాను’’ అన్నారు అనిల్ కపూర్. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘డీప్ ఫేక్ వీడియో’ గురించి రష్మిక మాట్లాడుతూ – ‘‘ఆ వీడియో చూసినప్పుడు ఇలాంటివాటికి రియాక్ట్ అయితే ఏమనుకుంటారో అనిపించింది. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడంతో.. తప్పకుండా స్పందించాలని నిర్ణయించుకున్నాను’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత భూషణ్ కుమార్, నటుడు బాబీ డియోల్ మాట్లాడారు. -
అప్పుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా : రాజమౌళి
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.ఈ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా విచ్చేసారు. ఈ సందర్బంగా దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఎంతోమంది కొత్త కొత్త డైరెక్టర్లు వస్తారు. హిట్లు, సూపర్ హిట్ సినిమాలు తీస్తారు. చాలా పెద్ద పేరు కూడా సంపాదిస్తారు. అవి మనం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడో ఓ సారి మాత్రమే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ మొతాన్ని షేక్ చేసే డైరెక్టర్ వస్తాడు. అతడు సినిమా అంటే ఇలాగే తీయాలన్న ఫార్ములాను కూడా షేక్ చేస్తాడు. అలాంటి డైరెక్టర్ నాకు తెలిసి నా తరంలో రాంగోపాల్ వర్మ. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా అలాంటి డైరెక్టర్. సినిమా ఇలాగే తీయాలన్న రూల్ పక్కన పెట్టి.. నేను ఇలాగే సినిమా తీస్తా అనే డైరెక్టర్ అతడు. నిన్ను చూసి చాలా గర్విస్తున్నా" అని సందీప్ ను ఉద్దేశించి రాజమౌళి అనడం విశేషం. యానిమల్ చిత్ర టీజర్ చూడగానే ఈ సినిమా నేను చూడాలని వెంటనే అనిపించింది. రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా టీజర్ చూడగానే మొదటి రోజే చూడాలనిపించిన చిత్రం యానిమల్ అంటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై దర్శక ధీరుడు ప్రశంసలు కురిపించాడు. నా ఫేవరేట్ యాక్టర్ రణ్‌బీర్ కపూర్: రాజమౌళి బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌బీర్ కపూర్ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. నా ఫేవరేట్ బాలీవుడ్ యాక్టర్ ఎవరు అంటూ నన్ను చాలా మంది అడిగితే ఏ మాత్రం ఆలోచించకుండ రణ్‌బీర్ కపూర్ అని చెప్తాను. నేను చూసిన తన సినిమాలు తక్కువే కానీ చాలా ఇంటెన్సిటీ ఉన్న నటుడు. తన 15 ఏళ్ల కెరీర్లో తన టాలెంట్ చూపించుకునేలాంటి చిత్రాలు చాలా తక్కువ వచ్చాయి. యానిమల్తో తనకు ఆ లోటు తీరుతుంది. రణ్‌బీర్ కపూర్ ఇండస్ట్రీలోనే టాప్‌లో ఉంటాడని జక్కన్న అన్నారు. -
యానిమల్ ట్రైలర్ చూసి నాకు మెంటలొచ్చేసింది: మహేష్ బాబు
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలివుడ్ సూపర్‌స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం (నవంబర్ 27) హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.ఈ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా విఛ్చేసారు. ఇక యానిమల్ మూవీ టీమ్ నుంచి రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ ఈవెంట్లో సందడి చేశారు. ఈ సందర్బంగా మహేష్ బాబు మాట్లాడుతూ యానిమల్ ట్రైలర్ చూసి నాకు మెంటలొచ్చేసింది. ఇంత ఒరిజనల్ ట్రైలర్ నేనెప్పుడూ చూడలేదు. డైరెక్టర్ సందీప్ అంటే నాకు చాలా ఇష్టం. తను చాలా స్పెషల్, యూనిక్ డైరెక్టర్. దేశంలోనే సందీప్ ఓ ఒరిజనల్ ఫిల్మ్ మేకర్ అన్నారు. అలానే ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ తాను రణ్‌బీర్ కపూర్‌కి చాలా పెద్ద అభిమానిని అని చెప్పడం విశేషం. ఇంతకుముందు కూడా ఈ విషయం రణ్‌బీర్‌కి చెప్పాను. కానీ అతడు దాన్ని అంత సీరియస్‌గా తీసుకున్నట్లు లేడు. ఈ స్టేజ్ పై మరోసారి చెబుతున్నాను. నేను రణ్‌బీర్‌కి వీరాభిమానిని. ఇండియాలోనే అతడు బెస్ట్ యాక్టర్. యానిమల్ చిత్రంలో తను అత్యుత్తమ నటన కనబరిచాడు. ఆల్ ద బెస్ట్ మై బ్రదర్ అని మహేష్ అన్నాడు. ఇక డిసెంబర్ 1వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. -
Rashmika Mandanna: ‘యానిమల్’ మూవీ ప్రెస్మీట్లో రష్మిక మందన్న గ్లామర్ షో (ఫొటోలు)
-
లైవ్ లో దొరికిపోయిన రష్మిక..అడ్డంగా బుక్ చేసిన హీరో..
-
ప్రభాస్ స్పిరిట్ లో రణబీర్ కపూర్!
-
పెద్దల కోసం రెడీ అయిన 'పేద్ద' సినిమా.. కాకపోతే!
ప్రస్తుతం సినిమా ప్రేక్షకుల ఇంట్రెస్ట్ పూర్తిగా మారిపోయింది. ల్యాగ్ ఉంటే అస్సలు లెక్క చేయట్లేదు. నిర్దాక్షిణ్యంగా ట్రోల్ చేసి పడేస్తున్నారు. దీంతో దర్శకనిర్మాతలు చాలావరకు తమ తమ సినిమాల్ని రెండున్నర గంటల నిడివికి కాస్త అటు ఇటు ఉండేలానే చూసుకుంటున్నారు. అలాంటిది ఓ స్టార్ డైరెక్టర్ పెద్ద రిస్క్ చేయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడా విషయమే పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. 'అర్జున్ రెడ్డి' పేరు చెప్పగానే చాలామందికి విజయ్ దేవరకొండ గుర్తొస్తాడు. మరికొందరికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గుర్తొస్తాడు. ఆ సందీప్.. ఇప్పుడు 'యానిమల్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తీసిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, కన్నడ బ్యూటీ రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా మూడున్నర గంటల నిడివి రాబోతుందని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడదే నిజమైంది. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?) లేటెస్ట్గా 'యానిమల్' సెన్సార్ జరగ్గా.. సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే ఈ సినిమా పెద్దలకు మాత్రమే. అలానే 201 నిమిషాల నిడివితో అంటే 3 గంటల 21 నిమిషాల మూవీ ఇది అని స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డినే సోషల్ మీడియాలో ప్రకటించాడు. అయితే సినిమాలో కంటెంట్ ఉంటే.. ఈ నిడివి అనేది అస్సలు సమస్యే కాదు. ఒకవేళ ఏమైనా తేడా కొడితే మాత్రం మొదటికే మోసపోయే ఛాన్స్ ఉంది. అయితే సందీప్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. 'యానిమల్'తో ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నాడు. గురవారం (నవంబరు 23) ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. అయితే ట్రైలర్ మాత్రం పెద్దలు-పిల్లల మాత్రం చూసేలా కట్ చేసినట్లు తెలుస్తోంది. అలానే పెద్ద సినిమా కాబట్టి రెండు ఇంటర్వెల్స్ ఉంటాయా? అనేది కూడా చూడాలి. ఒకవేళ నిడివితో సంబంధం లేకుండా ఈ మూవీ హిట్ అయితే మాత్రం సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసినట్లే! ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే డిసెంబరు 1 వరకు ఆగితే సరి! (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?) View this post on Instagram A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga) View this post on Instagram A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga) -
దుబాయ్‌లో యానిమల్
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. గుల్షన్ కుమార్, టి.సిరీస్ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషణ్ కుమార్, మురాద్ ఖేతాని నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబరు 1న విడుదలవుతోంది. ఈ సినిమాలోని ‘అర్జన్ వైలీ..’ అనే పాటను దుబాయ్‌లోని ఐకానిక్ గ్లోబల్ విలేజ్‌లో అభిమానుల మధ్య ఘనంగా విడుదల చేశారు మేకర్స్. ఈ వేడుకలో రణబీర్ కపూర్, బాబీ డియోల్ పాల్గొన్నారు. వేదికపై ‘అర్జన్ వైలీ...’ పాటకు స్టార్ కాస్ట్‌తో పాటు అభిమానులు చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. -
యానిమల్ నుంచి 'నాన్న నువ్ నా ప్రాణం' ఎమోషనల్ సాంగ్ రిలీజ్
ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న సినిమా ‘యానిమల్’. సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రష్మిక మందన్న కథానాయిక. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ మొదటి పాటను కూడా విడుదల చేశారు. తాజాగా ఎమోషనల్‌గా ఉన్న రెండో సాంగ్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. 'నాన్న నువ్ నా ప్రాణం' అంటూ సాగే ఈ సాంగ్ ఎంతో ఎమోషనల్‌గా ఉంది. తండ్రీకొడుకుల రిలేషన్ షిప్ నేపథ్యంలో సాగనున్న ఈ మూవీలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ పాటను అనంత శ్రీరామ్ రచించగా.. సోను నిగమ్ అద్భుతంగా ఆలపించారు. తాజాగా విడుదలైన పాటలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్ మధ్య ఉన్న బంధాన్ని చూపించారు. దీంతో సినిమా తండ్రి – కొడుకుల మధ్య జరిగే కథలా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎక్కువగా భావోద్వేగాలకు సంబంధించిన సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. యానిమల్ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో డిసెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
69th National Film Awards: జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో అలియా,రణబీర్ సందడి (ఫొటోలు)
-
స్పోర్ట్స్ ఈవెంట్లో మెరిసిన రణబీర్, అలియా...మరో విశేషమేమంటే..!
న్యూఢిల్లీ: ముంబైలో జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లో బాలీవుడ్ లవబుల్ కపుల్ సందడి చేశారు. బ్రహ్మాస్త్ర జంట అలియా భట్, రణబీర్ కపూర్ తళుక్కున మెరిసారు. అదీ ISLని నిర్వహించే ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ చైర్పర్సన్ నీతా అంబానీతో కలిసి ఆదివారం సందడి చేశారు. ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ముంబై సిటీ FC vs కేరళ బ్లాస్టర్ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు బాలీవుడ్ తారలతో పాటు, నీతా అంబానీ ,అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అలియా, రణబీర్ జంటను నీతా ప్రత్యేకంగా అభినందించారు. ఇండియన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ ముంబై సిటీ FC సహ-యజమాని ఏ దిల్ హై ముష్కిల్ హీరో రణబీర్ తన జట్టుకు మద్దతుగా స్పోర్ట్స్ ఈవెంట్లో, ఇనీషియల్స్‌తో పాటు వెనుక ఎనిమిది నంబర్ ప్రింట్ చేసిన బ్లాక్ జెర్సీలో బ్యూటిఫుల్‌గా ఫ్యాన్స్‌ను అలరించాడు. బ్లాక్ కార్గో-స్టైల్ ప్యాంటు,మ్యాచింగ్ బ్లాక్ క్యాప్‌ను ధరించగా, ప్లస్ వన్ బ్లూ జెర్సీలో అలియా చేతులు పట్టుకుని స్టేడియంలోకి ప్రవేసించారు. అక్కడ ఫ్యాన్స్‌తో, సెల్పీలకు పోజులిచ్చారు. ఈ క్రమంలో ఒలింపిక్ అధ్యక్షురాలు నీతి అంబానీతో కలిసి పోజులివ్వడం విశేషంగా నిలిచింది. రణబీర్, అలియా జంట క్రీడాభిమాన్లు. గత నెలలో న్యూయార్క్‌లో విహారయాత్ర చేస్తున్నప్పుడు, ఈ జంట యూఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో కూడా మెరిసిన సంగతి తెలిసిందే . కాగా అంబానీ నివాసంలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు గత నెలలో, అలియా, బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీతో కలిసి హాజరయ్యారు. అయితే ఈ వేడుకుకు భర్త రణ్‌బీర్ ఈవెంట్‌కు మిస్సయ్యాడు. ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే నేషనల్ అవార్డు విన్నర్ అలియాస్వయంగా నిర్మిస్తున్న జిగ్రా అనే యాక్షన్ చిత్రంలోనూ నటిస్తూ, నిర్మిస్తోంది. రణవీర్ సింగ్‌తో కలిసి బైజు బావ్రా అనే పీరియాడికల్ డ్రామాలో నటిస్తోంది. అలాగే రణబీర్ కపూర్ యానిమల్ కోసం సిద్ధమవుతున్నాడు. బాబీ డియోల్, అనిల్ కపూర్ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది. -
మూడు పార్టులుగా 'రామాయణం' సినిమా.. సీతగా ఆ బ్యూటీ?
తింటే గారెలే తినాలి వింటే రామాయణమే వినాలి అన్నది ఫేమస్ సామెత. రామాయణ ఇతిహాసాన్ని ఎన్నిసార్లు, ఎన్నో భాషల్లో సినిమాగా తీసినా ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది. అది ఆ పుణ్య పురుషులైన సీతారాముల చరితం విశేషం. రామాయణం గురించి విపులంగా టీవీ సీరియలే తీశారు. ఇక చిత్రాలు చాలానే వచ్చాయి. ఇకపై కూడా వస్తూనే ఉంటాయి అనడానికి మరో నిదర్శనం తాజాగా రెడీ అవుతున్న రామాయణం మూవీనే. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్, మధు మంతెన ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటికీ బండి ముందుకు కదల్లేదు. ఇప్పుడు దీని గురించి అప్డేట్ వచ్చింది. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణాసురుడిగా 'కేజీఎఫ్' యష్ నటించనున్నట్లు టాక్. కాగా రామాయణాన్ని మూడు భాగాలుగా తీయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెడతారట. మొదటి భాగంలో సీతారాములకు సంబంధించిన సీన్స్, రెండవ భాగంలో రావణుడు సీతని లంకకు తీసుకెళ్లడం.. రామ, రావణాసురుల యుద్ధ సన్నివేశాలు ఉంటాయని ఇక మూడో భాగంలో లవకుశల పుట్టుకకు సంబంధించిన అంశాలు ఉంటాయని తెలుస్తోంది. పదేళ్ల ముందు తెలుగులో 'శ్రీరామరాజ్యం' చిత్రంలో నయనతార సీతగా మెప్పించారు. 'ఆదిపురుష్'లో కృతిసనన్ సీతగా నప్పలేదని అన్నారు. దీంతో సాయిపల్లవి సీతగా ఎలా ఉంటుందా అని ఇప్పటి నుంచే డిస్కషన్ మొదలైంది. (ఇదీ చదవండి: మెగా ఇంట మొదలైన పెళ్లి సందడి.. చిరంజీవి ట్వీట్ వైరల్!) -
‘మహాదేవ్’ లూటీ రోజుకు రూ.200 కోట్లు
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన వ్యవహారమిది. బాలీవుడ్ ప్రముఖ నటులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. యాప్‌పై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గత నెలలో భారత్‌లో 39 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.417 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, నగదు స్వా«దీనం చేసుకుంది. యాప్ కోసం ప్రచారం చేసిన బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురి నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ యాప్ బాగోతం బయటపడింది. ► ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి పట్టణానికి చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ దుబాయ్‌లో మకాం వేసి, మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ► కొత్తకొత్త వెబ్సైట్లు, చాటింగ్ యాప్‌ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తారు. ఆన్లైన్లో బెట్టింగ్‌ల్లో భారీగా లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ► తమ వలలో చిక్కిన కస్టమర్లతో వాట్సాప్‌లో గ్రూప్‌లు ఏర్పాటు చేస్తారు. వారితో నేరుగా ఫోన్లలో మాట్లాడరు. వాట్సాప్ ద్వారానే సంప్రదిస్తుంటారు. ► కస్టమర్లను బెట్టింగ్ యాప్‌లో సభ్యులుగా చేర్చి, యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత వారితో నగదు జమ చేయించుకుంటారు. ఈ వ్యవహారాన్ని మహాదేవ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు పర్యవేక్షిస్తుంటారు. ఈ డబ్బంతా తప్పుడు పత్రాలతో తెరిచిన యాప్ నిర్వాహకుల బినామీ బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది. ► యాప్‌లో బెట్టింగ్‌లు కాస్తే తొలుత లాభాలు వచి్చనట్లు నమ్మిస్తారు. దాంతో కస్టమర్లో ఆశ పెరిగిపోతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా అతడిని ప్రేరేపిస్తారు. చివరకు అదంతా నష్టపోయేలా బెట్టింగ్ యాప్‌లో రిగ్గింగ్ చేస్తారు. మళ్లీ కొత్త బకరా కోసం వేట మొదలవుతుంది. ► మహాదేవ్ బెట్టింగ్ యాప్ సంపాదన ప్రతిరోజూ రూ.200 కోట్లు ఉంటుందని ఈడీ దర్యాప్తులో తేలింది. ► భారత్, మలేసియా, థాయ్‌లాండ్, యూఏఈలో మహాదేవ్ యాప్‌నకు వందలాది కాల్ సెంటర్లు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉంది. నాలుగు దేశాల్లో పెద్ద సంఖ్యలో బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచారు. ► భారత్‌లోని 30 కాల్ సెంటర్లను అనిల్ దమానీ, సునీల్ దమానీ నిర్వహిస్తున్నారు. వీరిద్దరిని ఈడీ అరెస్టు చేసింది. ► బెట్టింగ్ యాప్ జోలికి రాకుండా ఉండడానికి పోలీసులకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు నిర్వాహకులు హవాలా మార్గాల్లో లంచాలు ఇచి్చనట్లు వెల్లడయ్యింది. ► బెట్టింగ్ సిండికేట్ నడిపిస్తున్న ఓ యాప్‌ను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రమోట్ చేస్తున్నట్లు ఈడీ చెబుతోంది. ► ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఓ పెళ్లి నిర్వహణకు రూ.200 కోట్లు నగదు రూపంలో చెల్లించారు. దీనిపై దర్యాప్తు చేయగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ గురించి బయటపడింది. ఈ పెళ్లిలో రణబీర్ కపూర్, శ్రద్ధాకపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్‌తోపాటు మరికొందరు బాలీవుడ్ నటులు ప్రదర్శన ఇచ్చారు. వారికి హవాలా మార్గంలో రూ.కోట్లలో చెల్లింపులు చేసినట్లు తేలింది. పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలను చార్టర్డ్ విమానంలో దుబాయ్‌కి తీసుకెళ్లారని ఈడీ అధికారులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ కు ఈడీ నోటీసులు
-
ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్.. స్టార్ హీరో రణ్‌బీర్‌కు షాక్..
ముంబై: మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసు బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో బాలీవుడ్ ప్రముఖులకు సమన్లు ఇచ్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సిద్ధమయ్యినట్లు ప్రచారం జరగ్గా అదే నిజమైంది. ఆన్లైన్ బెట్టింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు ఈడీ బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. మహాదేవ్ క్రికెట్ బెట్టింగ్ యాప్‌కు రణ్‌బీర్ ప్రచారకర్తగా వ్యవహరించాడు. తాజాగా అతడికి నోటీసులు జారీ చేసిన ఈడీ అక్టోబర్ 6న విచారణకు రావాలని ఆదేశించింది. దుబాయ్‌లో ఉంటూ భారత్‌లో బెట్టింగ్ వ్యాపారం కాగా సౌరభ్ చంద్రకర్, అతని భాగస్వామి రవి ఉప్పల్ ‘మహదేవ్ బెట్టింగ్ యాప్’ ప్రమోటర్లు. దుబాయ్‌లో ఉంటూ వారు భారత్‌లో బెట్టింగ్ వ్యాపారం సాగిస్తున్నారు. సౌరభ్ చంద్రకర్ వివాహం ఇటీవల యూఎఈలోని ఆరవ అతిపెద్ద నగరమైన రాక్‌లో జరిగింది. ఈ పెళ్లికి ఆయన ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. బంధువులను, సెలబ్రిటీలను దుబాయ్ తీసుకొచ్చేందుకు ప్రైవేట్ జెట్స్ సైతం ఏర్పాటు చేశాడు. పెళ్లికి హాజరైన వారికి షాక్? దీనికి సంబంధించిన చెల్లింపులను హవాలా ద్వారా నగదు రూపంలో చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలకు ఈడీ షాక్ ఇవ్వనున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. బాలీవుడ్ పెద్దలు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల నుంచి హవాలా ద్వారా నగదు చెల్లింపులు అందుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే మహాదేవ్ బుక్ యాప్ ఆన్లైన్ బెట్టింగ్ కుంభకోణంపై అనేక రాష్ట్రాల్లో ఈడీ విచారణ జరుపుతోంది. చదవండి: నాకున్న కోరికల్లా ఒక్కటే.. దానికోసం ఎంతవరకైనా, ఎక్కడిదాకానైనా వెళ్తా.. మనోజ్ పోస్ట్ -
యానిమల్ గా రణబీర్ ఊర మాస్ యాక్షన్..!
-
నాకన్నా చెడ్డవాడు లేడు!
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందిన హిందీ చిత్రం ‘యానిమల్’. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్. అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రీ ముఖ్య పాత్రలు చేశారు. భూషణ్‌కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, మురాద్ ఖేతని నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కానుంది. గురువారం రణ్‌బీర్ బర్త్ డే సందర్భంగా ‘యానిమల్’ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘జ్యోతి... క్రిమినల్‌ను కన్నాం మనం.. (అనిల్ కపూర్), ‘మై ఫాదర్ ఈజ్ ది బెస్ట్ ఫాదర్ ఇన్ ది వరల్డ్.. డోన్ట్ ఎవర్ గో దేర్, నేను చెడును వెంటాడుతూ వెళ్లాను. నాకెక్కడా కనపడలేదు. నాలో నేను చూసుకున్నాను. నాకన్నా చెడ్డవాడు లేడు’ (రణ్‌బీర్) అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. తెలుగులోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
యానిమల్ టీజర్.. సందీప్ రెడ్డి వంగా ఏ మాత్రం తగ్గలేదు
'అర్జున్ రెడ్డి' సినిమాతో అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి అక్కడా మంచి విజయాన్ని అందుకున్నారాయన. ఈ చిత్రం తర్వాత బాలీవుడ్ యువ కథానాయకుడు రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో 'యానిమల్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ-టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా టీజర్‌ను కూడా విడుదల చేశారు. (ఇదీ చదవండి: Chandramukhi 2 Twitter Review: ‘చంద్రముఖి 2’ మూవీ రివ్యూ) ఈరోజు రణబీర్ కపూర్ పుట్టినరోజు కావడంతో సందీప్ రెడ్డి వంగా టీజర్‌ను షేర్ చేశారు. ఇందులో రణ్‌బీర్ రగ్గడ్ లుక్‌లో, మాస్ అవతారంలో దుమ్ములేపాడు. ఈ టీజర్‌ను గమనిస్తే అనిల్ కపూర్-రణబీర్ కపూర్ మధ్య తండ్రీ కొడుకుల ఎమోషన్‌ను చూపిస్తోంది.నన్ను ఏ విషయం గురించి అడిగినా నిజాయితీగా జవాబు ఇస్తాను. కానీ, మా నాన్న గురించి మాత్రం అడగొద్దు అని హీరో చెప్పే డైలాగ్‌తో పాటు నా ఫాదర్ ఈ ప్రపంచంలోకెల్లా బెస్ట్ అనడం ఇలా అన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. టీజర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ మెప్పిస్తుంది. (ఇదీ చదవండి: పెళ్లికి ముందు ఆ నిర్మాత ప్రేమలో స్నేహ.. నటుడి సంచలన వ్యాఖ్యలు) ఇందులో రణబీర్‌ను మూడు వేరియేషన్స్ లో ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. ఒక షాట్లో రణబీర్ పడిపోయినప్పుడు కనిపించే సీన్ హైలెట్‌గా నిలుస్తుంది. అంతేకాకుండా టీజర్ ఎండ్‌లో బాబీ డియోల్ సింపుల్‌గా ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సూపర్ అనిపించేలా ఉంది. బాలీవుడ్లో కబీర్ సింగ్ సినిమాతో రూ.300 కోట్లకు పైగా కొల్లగొట్టిన సందీప్ రెడ్డి వంగ తాజాగా ఈ చిత్రంతో మరెన్ని కోట్లు కొల్లగొట్టనున్నాడో వేచి చూడాలి. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
‘యానిమల్’లో గీతాంజలిగా రష్మికా మందన్నా
‘మీ గీతాంజలి’ అంటూ ‘యానిమల్’లో రష్మికా మందన్నా చేస్తున్న పాత్ర పేరు ప్రకటించి, శనివారం లుక్‌ని విడుదల చేసింది యూనిట్. రణ్‌బీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రం టీజర్ ఈ 28న రిలీజ్ కానుంది. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. -
ట్రంప్ టవర్స్‌లోకి రణబీర్ అండ్ అలియా: అద్దె ఎంతో తెలిస్తే షాక్‌వుతారు
బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ అలియా భట్ పూణెలోని ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారన్న వార్తలు మీడియాలో సందడి చేస్తున్నాయి. పూణేలోని ట్రంప్ టవర్స్‌లోని దాదాపు 7,000 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌కు వార్షిక అద్దెగా రూ. 48 లక్షలకు లీజుకు తీసుకున్నారని సమాచారం. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌తో కలిసి ఇటీవల న్యూయార్క్ నుండి తిరిగి వచ్చిన రణబీర్ ఈ అపార్ట్మెంట్ లీజ్‌కు తీసుకోవడం వార్తల్లో నిలిచింది. (ఫెస్టివ్ సీజన్: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!) పూణేలోని కళ్యాణి నగర్‌లోని ట్రంప్ టవర్స్‌లోని 10వ అంతస్థులో ఉన్న రెసిడెన్షియల్ యూనిట్‌ని మూడు సంవత్సరాల పాటు నెలవారీ అద్దెకు రూ. 4 లక్షలు చెల్లించేలా డీల్ కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం, అపార్ట్‌మెంట్‌ను పూణేకు చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ అండ్ వెహికల్ కాంపోనెంట్ పరిశ్రమలోని ప్రముఖ తయారీదారు డ్యూరోషాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అద్దెకు తీసుకున్నారు. లీజు అండ్ లైసెన్స్ ఒప్పందంపై సెప్టెంబర్ 15, 2023న సంతకం చేసినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా రూ. 24 లక్షల రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌కూడా చెల్లించారు. మొదటి ఏడాది రూ.4 లక్షలు, రెండో ఏడాది రూ.4.2 లక్షలు, మూడో ఏడాది నెలకు రూ.4.41 లక్షలు నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. (పరిణీతి-రాఘవ్ చద్దా వెడ్డింగ్: ఒక్క నైట్‌కి హోటల్ సూట్ ఖర్చు ఎంతంటే?) మరోవైపు రణబీర్ అప్‌కమింగ్ మూవీ యానిమల్ డిసెంబరు 1న రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు రణబీర్. ఈ సినిమాలో రష్మిక మందన్న, బాబీ డియోల్ , అనిల్ కపూర్ కూడా నటించారు. గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న రణబీర్ ,అలియా భట్ రాహా అనే కుమార్తె ఉంది. కాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో నెలకు దాదాపు రూ. 1.5 లక్షల అద్దెకు మూడేళ్లపాటు ఒక ఫ్లాట్‌ను లీజుకు తీసుకున్నాడు. పూణేలోని ఈ జంట టవర్లు ఇండియాలో తొలి ట్రంప్ టవర్స్. 23 అంతస్తుల ఈ ట్రంప్ టవర్లను అతుల్ చోర్డియా నేతృత్వంలోని పంచశిల్ రియాల్టీ అభివృద్ధి చేసింది. -
అతని పెళ్లి ఒక బూటకం.. వాళ్లను నాశనం చేస్తా: కంగనా
బాలీవుడ్ సూపర్స్టార్లపై కంగనా రనౌత్ తాజాగా భారీ కామెంట్లే చేసింది. హృతిక్ రోషన్‌తో తనకున్న అనుబంధాన్ని మరోసారి పరోక్షంగా బయటపెట్టింది నటి కంగనా. బాలీవుడ్లో ఒక వ్యక్తి తన ప్రతినిధిగా (కంగనా) నటిస్తూ ఇతరులను స్కామ్ చేస్తున్నాడని, వారి సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తున్నాడని కొందరు ఆమెకు చెప్పడంతో కంగనా రియాక్ట్ అయింది. ఒకప్పుడు హృతిక్‌గా నటిస్తూ కొందరు తనకు కూడా పోస్ట్ చేశారని అప్పుడు తాను కూడా మోసపోయానని కంగనా గుర్తు చేసుకుంది. బాలీవుడ్ కక్షలు, బంధుప్రీతిపై ఎప్పుడూ తన స్వరం పెంచే కంగనా తాజాగా ఓ బాలీవుడ్ నటుడిని టార్గెట్ చేసింది. ఓ సూపర్ స్టార్ తనను డేట్‌కు రమ్మని అడిగాడని పేరు చెప్పకుండానే చెప్పింది కంగనా. అంతే కాదు పరోక్షంగా మరోసారి హృతిక్ రోషన్‌పై మండిపడింది. హృతిక్ రోషన్‌ని టార్గెట్! హృతిక్ రోషన్‌తో తనకున్న ఎఫైర్ గురించి కంగనా రనౌత్ మరోసారి ఓపెన్ అయ్యింది. కంగనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒకదాని తర్వాత ఒకటి అనేక పోస్ట్‌లను షేర్ చేసింది. తన ఖాతా కూడా హ్యాక్ అయిందని ఆమె ఇలా పేర్కొంది. 'బాలీవుడ్ ఫిల్మ్ మాఫియా ఎప్పుడూ నేర కార్యకలాపాలలో పాల్గొంటుంది. గతంలో నేను డేటింగ్ చేసిన సూపర్ స్టార్ కూడా ఇలాంటి పనే చేశాడు. అతను నాతో చాట్ చేయడానికి వేర్వేరు నంబర్లు, సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించాడు. ఒకానొక సమయంలో అతను నా ఖాతాను కూడా హ్యాక్ చేసి తప్పుగా ఆపరేట్ చేశాడు. ఆ సమయంలో అతను విడాకులు తీసుకుంటున్నాడని నేను అనుకున్నాను, కానీ అతని అనుమానాస్పద ప్రవర్తనకు దానితో సంబంధం లేదని నాకు తరువాత తెలిసింది.' అని కంగనా పేర్కొంది. 'ఫిల్మ్ మాఫియా' తరగతి బాలీవుడ్లో ఇదొక్కటే కాదు, ఒక సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే 'ఫిల్మ్ మాఫియా' ఎలా పనిచేస్తుందో కూడా కంగనా ప్రస్తావించింది. 'సినిమా విడుదల అయ్యాక వారు పెద్దమొత్తంలో నకిలీ టిక్కెట్లను కొనుగోలు చేస్తారు. అలా ఆ సినిమా కలెక్షన్స్‌ను తారుమారు చేస్తారు. దానిని జనాలకు ఎక్కువగా చూపుతారు. ఈ మాఫియా ఒక స్పై గా కొందరి కోసం పనిచేస్తుంది. ప్రముఖుల వాట్సాప్ డేటాను కూడా కొనుగోలు చేస్తారు, అలా నా సినిమా ఒప్పందాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా తస్కరించారు. (ఇదీ చదవండి: 'కల్కి' టీమ్ ముందు జాగ్రత్త.. దానికి భయపడి!) ఈ దోపిడీల గురించి నేను ఎల్లప్పుడూ చూస్తున్నాను, చెబుతున్నాను. ఇలాంటి పనులు చేసేది ప్రతిభ లేని వారు మాత్రమే. అలాంటి వారు తెలివి తక్కువ వ్యక్తులు.... వారికి నేర ప్రవృత్తి ఉంది... చాలా భయానకంగా ఉంది... @cybercrimehelp.mumbai దయచేసి చర్య తీసుకోండి. అని పరోక్షంగా రణబీర్ కపూర్, అలియాను కంగనా లాగింది. రణబీర్‌పై ఆరోపణలు? కంగనా మరొక ఇన్‌స్టా కథనంలో ఇలా రాసింది, 'బాలీవుడ్లో ఉమనైజర్ అని పిలువబడే మరో సూపర్ స్టార్ నా ఇంటికి వచ్చి అతనితో డేటింగ్ చేయమని అడిగాడు. అయితే దీనిని పూర్తిగా గోప్యంగా ఉంచాలన్నాడు. ఎందుకని కారణాన్ని నేను అడిగినప్పుడు, అతను తాను 'పాపా కి పరి'తో డేటింగ్ చేస్తున్నానని చెప్పాడు. అంటే వారి మధ్య ప్రేమ లేదు. అతని కోరికకు నేను అంగీకరించలేదు. తిరస్కరించాను. ఆ తర్వాత వివిధ నంబర్ల నుంచి నాకు కాల్ చేయడం ప్రారంభించాడు. అతని నంబర్లన్నీ బ్లాక్ చేశాను. అప్పటి నుంచి అతను నా సోషల్ మీడియా ఖాతాలతో పాటు.. నా ఫోన్లను కూడా హ్యాక్ చేయడం ప్రారంభించాడు. తర్వాత అది నేను గ్రహించాను. చివరకు తన పెళ్లి కూడా ఒక బూటకం. అతను ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు. తన సినిమాను ప్రమోట్ చేసేందుకు చాలా ఎత్తుగడలు వేశాడు. అవన్నీ తెలుసుకొని నేను ఆశ్చర్యపోయాను. ఎవరైనా ఇంత నైతికంగా అవినీతికి పాల్పడతారా అని నమ్మలేకపోయాను. వాళ్లు మనుషులు కాదు, రాక్షసులు.. అందుకే వారిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాను'. 'ధర్మానికి ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఆధర్మాన్ని నాశనం చేయడమే. ఇదే శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. కంగనా తెలిపిన ఈ స్టోరీలో డైరెక్ట్‌గా ఎవరి పేరు చెప్పకున్నా పరోక్షంగా రణబీర్ కపూర్, అలియాకు లింక్ అయ్యేలా చెబుతూ వచ్చింది. ఇదే విషయాన్ని ఆమె అభిమానులు కూడా కామెంట్ల రూపంలో చెబుతున్నారు. -
దీపికా పదుకోణె భర్తతో ఆలియా భట్ ర్యాంప్ వాక్
-
రాముడిగా రణ్‌బీర్.. రావణుడిగా యశ్?
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి.. ఇంకొన్ని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామాయణం ఆధారంగా అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా ఓ సినిమాను నిర్మించనున్నట్లుగా ప్రకటన వచ్చి దాదాపు మూడేళ్లు ముగిసింది. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. దాంతో ఈ చిత్రం నిలిచి΄ోయిందా? అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని, ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని నిర్మాతలు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్‌ను ఆరంభించాలని నిర్మాతలు అనుకుంటున్నారన్నది తాజా సమాచారం. ఈ చిత్ర దర్శకుడు నితీష్ తివారి ఈ సినిమా పనులను మరింత వేగవంతం చేశారని బాలీవుడ్లో వినిపిస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, హనుమంతుడు వంటి ప్రధాన పాత్రలకు ఆర్టిస్టులను ఎంపిక చేసి, లుక్ టెస్ట్‌ను నిర్వహించేందుకు నితీష్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా ఆలియా భట్, రావణుడి పాత్రలో యశ్‌లు నటించనున్నారని, ముందు వీరి లుక్ టెస్ట్ జరుగుతుందని టాక్. మరి.. ఈ ‘రామాయణం’లో రియల్ లైఫ్ జంట ఆలియా, రణ్‌బీర్ సీతారాములుగా కనిపిస్తారా? ‘కేజీఎఫ్’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విజృంభించిన యశ్ ఈ చిత్రంలో రావణుడిగా బీభత్సం సృష్టిస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. -
ఒక్క సినిమా.. 35 పాటలు.. అదే అసలు సమస్య!
ఆ డైరెక్టర్ తీసింది ఒక్కటే సినిమా. కానీ దేశవ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అదే మూవీని హిందీలో రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్. వందల కోట్ల కలెక్షన్స్. దీంతో ఆ దర్శకుడు నెక్స్ట్ చిత్రం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు తెగ ఎదురుచూశారు. ఇప్పుడేమో మరో నెలరోజుల్లో విడుదల ఉందనగా, రిలీజ్ డేట్ మార్చేశారు. ఏకంగా మూడున్నర నెలల తర్వాత థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. అసలు కారణం ఏంటో కూడా బయటపెట్టారు. 'యానిమల్' వాయిదా 'అర్జున్‌రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తీస్తున్న పాన్ ఇండియా మూవీ 'యానిమల్'. రణ్‌బీర్ కపూర్, రష్మిక హీరోహీరోయిన్లు. ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలి. ఇప్పుడేమో ఆ తేదీన రాలేకపోతున్నామని.. డిసెంబరు 1న విడుదలవుతుందని కొత్త డేట్ ప్రకటించారు. అభిమానులు కాస్త నిరుత్సాహపడిన మాట వాస్తవే.. కానీ డైరెక్టర్ చెప్పింది విని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన సినిమాపై పెట్టుకున్న నమ్మకం చూసి అంచనాలు పెంచేసుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) డైరెక్టర్ ఏం చెప్పారు? 'ఈ సినిమాలో ఏడు పాటలున్నాయి. ఐదు భాషల్లో లెక్కేస్తే మొత్తం 35 అవుతాయి. ఇన్ని సాంగ్స్ ని డిఫరెంట్ సెటప్ ప్లేసులు, డిఫరెంట్ సెటప్ సింగర్స్ తో రికార్డ్ చేయాలంటే కాస్త టైమ్ పడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్లే ఆగస్టు 11న విడుదల చేయలేమని మాకు అర్థమైంది. ప్రీ టీజర్ కు వచ్చిన స్పందనకు ధన్యవాదాలు. హిందీలో రికార్డ్ చేసిన పాటలకు లిరికల్ గా ఎలాంటి ఔట్పుట్ వచ్చిందో ఇతర భాషల్లోనూ అలాంటి దానికోసం ప్రయత్నిస్తున్నాం. దీనికోసం టైమ్, ఎనర్జీ కేటాయించాల్సి ఉంటుంది' 'అలానే ఇతర భాషల్లో విన్నవాళ్లకు డబ్బింగ్ అనే ఫీల్ రాకూడదనేదే మా ఆలోచన. అందుకే మూవీ రిలీజ్ వాయిదా వేశాం. డిసెంబరు 1న 'యానిమల్' విడుదల చేయబోతున్నాం. ప్రేక్షకులకు వీడియో, ఆడియో పరంగా బెస్ట్ క్వాలిటీ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాను. ఓవరాల్ గా ఇది చాలా పెద్ద మూవీ. థియేటర్లలో రణ్‌బీర్ కపూర్ విశ్వరూపం చూస్తారు' అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు. సందీప్ చెప్పిన దానిబట్టి చూస్తుంటే.. పాటలు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. అందుకే వాటి విషయంలో అస్సలు తగ్గట్లేదనిపిస్తోంది. ఇక 'యానిమల్' తర్వాత డైరెక్టర్ సందీప్.. ప్రభాస్ తో కలిసి పనిచేయబోతున్నాడు. 'స్పిరిట్' అనే మూవీని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. బహుశా దీని షూటింగ్.. వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశముంది. #1stDecemberANIMALrelease@AnilKapoor #RanbirKapoor @thedeol @iamRashmika@tripti_dimri23 @imvangasandeep #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar @anilandbhanu @VangaPictures @TSeries @rameemusic @cowvala #ShivChanana @neerajkalyan_24 @sureshsrajan pic.twitter.com/EAGLNTaEy9 — Sandeep Reddy Vanga (@imvangasandeep) July 3, 2023 (ఇదీ చదవండి: డైరెక్టర్‌తో హీరోయిన్ సీక్రెట్ పెళ్లి.. యూటర్న్ తీసుకున్న కల్పికా గణేశ్) -
డిసెంబరులో యానిమల్?
‘యానిమల్’ చిత్రం అనుకున్న సమయాని కన్నా కాస్త ఆలస్యంగా థియేటర్స్‌కు రానుంది. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘యానిమల్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, మురాద్ ఖేతని, అశ్విన్ వార్దే, ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్నారు. యాక్షన్, రొమాన్స్, ప్రతీకారం అంశాలతో తండ్రీకొడుకుల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కావడం లేదని, కొన్ని కారణాల వల్ల డిసెంబరులో రిలీజ్ చేసే యోచనలో చిత్రయూనిట్ ఉన్నారని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో అనిల్‌కపూర్, బాబీ డియోల్, శక్తికపూర్ కీలక పాత్రలు పోషించారు. -
భారీ స్థాయిలో మరో రామాయణం సీతగా సాయి పల్లవి.. రాముడు ఎవరంటే?
-
వైల్డ్ యానిమల్
రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ నుంచి చిన్న సీన్‌ను ప్రీ టీజర్‌గా ఆదివారం విడుదల చేసింది చిత్రయూనిట్. ‘వైల్డ్ యానిమల్’, ‘వైలెంట్ యానిమల్’ అంటూ ‘యానిమల్’ ప్రీ టీజర్ గురించి పోస్ట్‌లు చేస్తున్నారు నెటిజన్లు. ఫుల్ టీజర్ ఈ నెల 16న విడుదల కానుందని సమాచారం. తండ్రీ కొడుకుల భావోద్వేగాల నేపథ్యంలో ఈ సినిమా కథ, కథనాలు ఉంటాయట. ఓ కాలేజ్ లెక్చరర్ అయిన యువకుడు తండ్రి కోసం మాఫియాతో ఏ విధంగా పోరాడాడు? అనే కథాంశంతో ‘యానిమల్’ తెరకెక్కుతోందని ప్రచారం సాగుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్టులో విడుదల కానుంది. -
సుశాంత్ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పరిచయం అక్కర్లేని పేరు. బీ టౌన్ సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఎమర్జెన్సీ చిత్రంలో నటిస్తోన్న కంగనా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటోంది. ఇప్పటికే పలుసార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా మరోసారి బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో తనపై గూఢచర్యం చేస్తున్నారంటూ రణ్‌బీర్ కపూర్‌ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: థియేటర్లో లైంగిక వేధింపులు.. ఏం చేయాలో అర్థం కాలేదు: స్టార్ హీరోయిన్) తాజాగా కంగనా రనౌత్ రణబీర్‌ను 'దుర్యోధనునితో' పోలుస్తూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌ను శకునిగా అభివర్ణించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక ఈ దుష్టశక్తులు ఉన్నాయంటూ పరోక్షంగా ఆరోపించింది. వారి పేర్లు చెప్పకుండానే వైట్ ర్యాట్, పాపా జో అంటూ సంభోధిస్తూ కామెంట్స్ చేసింది. కంగనా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. 'సినిమా పరిశ్రమలో రకరకాల బెదిరింపులు ఉన్నాయి. అయితే ఈ దుర్యోధనుడు (తెల్ల ఎలుక),శకుని (పాప జో) జోడి వేధింపులు మరింత దారుణంగా ఉన్నాయి. వారు తమను తాము సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖగా ఫీలవుతారు. బాలీవుడ్ పరిశ్రమకు ఈ విషయం తెలుసు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక ప్రధాన నిందితులు వీరే. అతన్ని ఆత్మహత్యకు పురికొల్పింది వీరే. నాపై అన్ని రకాల అసభ్యకరమైన పుకార్లను కూడా వ్యాప్తి చేశారు. నా జీవితంలో వారి వేధింపులు మించిపోయాయి.' అంటూ రాసుకొచ్చారు. గతంలో హృతిక్ రోషన్‌తో వివాదంలో కూడా వీరిద్దరు తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించింది. బాలీవుడ్ క్వీన్‌గా పేరొందిన కంగనా తన సంచలన కామెంట్స్‌తో మరోసారి బీటౌన్‌లో చర్చ మొదలైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు ప్రేరేపించారని పరోక్షంగా రణ్‌బీర్, కరణ్‌ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో వివాదం మరింత చర్చనీయాంశంగా మారనుంది. (ఇది చదవండి: ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!) -
నా కూతురి విషయంలో రణ్‌బీర్ భయం అదే: ఆలియా భట్
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ల ముద్దుల కూతురే రాహా. సమయం దొరికితే చాలు ఇద్దరూ కూతురితో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. తల్లిగా ఆలియా చాలామటుకు రాహాతోనే ఉన్నప్పటికీ తండ్రి రణ్‌బీర్ మాత్రం తాను ఒప్పుకున్న సినిమాల వల్ల ఎక్కువగా ఇంట్లో ఉండలేకపోతున్నాడు. అయితే ఇలా దూరంగా ఉంటే కూతురు తనను ఎక్కడ మర్చిపోతుందోనని టెన్షన్ పడుతున్నాడట హీరో. ఈ విషయాన్ని స్వయంగా ఆలియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కూతుర్ని ముద్దుగా అలా పిలుస్తాం.. 'రాహా ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ఒకసారి నువ్వు నా కూతుర్ని చూసి నవ్వావంటే తను కూడా తిరిగి స్మైల్ ఇస్తుంది. రణ్‌బీర్, నేను తనని ముద్దుగా చీతా అని పిలుస్తాం. మాకెంత అలసటగా ఉన్నా, ఇబ్బందులు ఉన్నా తన ముఖం చూడగానే అవన్నీ పటాపంచలైపోతాయి. తనను దగ్గరకు తీసుకుని హత్తుకోవడం కన్నా ముఖ్యమైనది మరేదీ లేదనిపిస్తుంది. కానీ రాహా కాస్త పెద్దగా అయిందంటే మా ఒడిలో ఉండిపోవడానికి ఏమాత్రం ఇష్టపడదు. మొత్తం తిరిగేస్తానంటుంది. ఆ విషయం నాకు అర్థమైంది. రణ్‌బీర్ భయమదే.. రణ్‌బీర్ చాలా సెన్సిటివ్. రాహా పుట్టాక అతడు మరింత సెన్సిటివ్ అయ్యాడు. కూతురంటే అతడికి ఎంతో ప్రేమ, మమకారం. అతడు ఏనుగులా లేదా మరేదైనా జంతువులా మారిపోయి రాహాను ఆడిస్తుంటే చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అతడున్నాడంటే రాహా నా దగ్గరకు కూడా రాదు. కూతురితో కలిసి కిటికీ పక్కన కూర్చుని టైం స్పెండ్ చేస్తుంటాడు. అతడు పని వల్ల ఎటైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు కూతురు తనను మర్చిపోతుందేమోనని చాలా భయపడుతుంటాడు. అందుకే రణ్‌బీర్ ప్లేస్‌లో నేను కిటికీ దగ్గర కూర్చుని తనకు కబుర్లు చెప్తూ తండ్రిని గుర్తు చేస్తూ ఉంటాను' అని చెప్పుకొచ్చింది ఆలియా భట్. చదవండి: సాయిధరమ్ తేజ్ నాకు ఫోన్ నెంబర్ ఇవ్వనేలేదు: అబ్దుల్ ఓటీటీలోకి వచ్చిన దసరా, స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
రూ. 37 కోట్లతో ఇల్లు కొన్న అలియా.. ఆ వ్యాపారం కోసమేనట!
బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. నార్త్‌లోనే కాకుండా సౌత్ అడియన్స్‌కి కూడా బాగా దగ్గరైంది. ఆర్ఆర్ఆర్లో సీతగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో అలియా ముందు వరుసలో ఉంది. అయితే ఇది రంగుల ప్రపంచం. ఇప్పుడున్న అవకాశాలు రేపు ఉంటాయో ఉండవో తెలియదు. అందుకే ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అని ఆలోచిస్తుంది అలియా. స్టార్ హీరోయిన్ ఫేమ్‌ని మరో వ్యాపారానికి వాడాలనుకుంటుంది. త్వరలోనే ఈ బ్యూటీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతుంది. దాని కోసం ఏకంగా రూ. 37 కోట్లు పెట్టి ముంబైలో ఓ ఇంటిని కొలుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. తనకు సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ పేరిట ఆ ఇంటిని కొలుగోలు చేసిందట. ఇందుకు సంబంధించి స్టాంప్ డ్యూటీనే రూ. 2.26 కోట్లు చెల్లించిందట. (చదవండి: అందుకు పదేళ్లు పట్టింది: ప్రియాంకా చోప్రా) ఇప్పటికే అలియా పేరిట రెండు ఇల్లులు ఉన్నాయి. అందులో ఒకటి తన సోదరి షహీన్‌కి విక్రయదానం చేసింది. దాని విలువ దాదాపు రూ. 8 కోట్ల వరకు ఉంటుందట. ప్రస్తుతం తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి ఎనిమిది అంతస్తుల భవనంలో నివాసం ఉంటుంది. గతేడాది నవంబర్‌లో ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొన్నాళ్లు షూటింగ్స్‌కి గ్యాప్ ఇచ్చిన అలియా.. ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసింది. -
అలియా చెప్పులు మోసిన రణ్‌బీర్..నెటిజన్స్ ఫైర్
బాలీవుడ్ క్యూట్ కపుల్లో రణబీర్ కపూర్, అలియా భట్ జంట ఒకటి. ఈ జంట ఏ పని చేసినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్‌ని, కామెంట్స్‌ని పట్టించుకోకుండా చాలా అన్యోన్యంగా ఉంటారు. సినిమాల వరకే స్టార్స్‌లా ప్రవర్తిస్తారు కానీ.. నిజ జీవితంలో భార్యభర్తలుగా అందరిలాగే ఉంటారు. తాజాగా ఈ జంట, ముఖ్యంగా రణ్‌బీర్ ట్రోల్స్‌కి గురవుతున్నారు. దానికి కారణంగా రణబీర్.. అలియా చెప్పులను మోయడమే. భార్య చెప్పులను భర్త మోస్తే తప్పేంటని అనుకుంటున్నారా?... అయితే పూర్తి కథనం చదవండి. గత గురువారం (ఏప్రిల్ 21) ఫిల్మ్ మేకర్ ఆదిత్య చోప్రా తల్లి పమేలా చోప్రా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులంతా ఆదిత్య చోప్రా కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఆయన ఇంటికి వెళ్లి ఓదార్చారు. ఇక రణ్‌బీర్, అలియాభట్ జంట కూడా కాస్త ఆలస్యంగా ఆదిత్య చోప్రా ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లే క్రమంలో అలియా తన చెప్పులను గుమ్మం ముందు విడిచి వెళ్లింది. వెనకే వచ్చిన రణ్‌బీర్ ఆ చెప్పులను చేతులతో పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లి పెట్టాడు. (చదవండి: నగ్న వీడియో షేర్ చేసిన నిత్యా శెట్టి.. నెటిజన్స్ ఫైర్) ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు ట్రోలింగ్‌కు కారణం ఏంటంటే.. రణ్‌బీర్ ఆ చెప్పులను ఇంట్లో ఉన్న చిన్న గుడి ముందు పెట్టడమే. భార్య చెప్పులు మోయడం తప్పుకాదు.. కానీ వాటిని గుడిముందు పెట్టడం ఏంటి? అలియా ఆలోచించే ఆ చెప్పులను మెట్ల ముందు వదిలింది. కానీ రణ్‌బీర్ మాత్రం తెలివితక్కువ పని చేశాడు. పైగా అతను చెప్పులతో లోపలికి వెళ్లాడు’ అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. రణ్‌బీర్ కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు.పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని వెల్లడించింది. గతేడాది నవంబర్‌లో ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఆలియాకు రణ్‌బీర్ ఖరీదైన గిఫ్ట్.. స్పెషల్ ఏంటో తెలుసా?
బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లో ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంట ఒకటి. గతేడాది వివాహాబంధంతో ఒక్కటైన ఈ జంటకు నవంబర్‌లో పండంటి బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. తమ ముద్దురు కూతురుకు రాహా అని నామకరణం కూడా చేశారు. ఏప్రిల్ 14, 2022న సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు రోజుల క్రితమే మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. మొదటి వివాహా వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి ఆలియా భట్‌కు రణ్‌బీర్ కపూర్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. దాదాపు రూ.10 లక్షల విలువ చేసే హ్యాండ్‌బ్యాగ్ ఇచ్చి భార్యపై ప్రేమను చాటుకున్నాడు. కాగా.. బాలీవుడ్ జంట బాంద్రాలో కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. తమ కలల ఇంటి పనులను పర్యవేక్షించేందుకు రాగా.. ఆలియా, రణ్‌బీర్ కెమెరాలకు చిక్కారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా బ్యూటీఫుల్ కపుల్స్ అరుదైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
మూడేళ్ల తర్వాతే బ్రహ్మాస్త్రం పార్ట్ 2
‘బ్రహ్మాస్త్రం’ చిత్రంలోని తర్వాతి భాగాలను చూడాలనుకుంటున్న ప్రేక్షకులు మరింత సమయం వేచి ఉండక తప్పదు. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న హిందీ ట్రయాలజీ ‘బ్రహ్మాస్త్ర’. మూడు భాగాల ‘బ్రహ్మాస్త్రం’లోని తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: పా ర్ట్ వన్ శివ’ గత ఏడాది సెప్టెంబరు 9న విడుదలై, ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పా త్రల్లో ఈ చిత్రం రూ΄పొందింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించారు. కాగా ‘బ్రహ్మాస్త్ర’ ట్రయాలజీలోని రెండో భాగం ‘బ్రహ్మాస్త్ర: పా ర్టు 2 దేవ్’, ‘బ్రహ్మాస్త్ర’ థర్డ్ పా ర్టులను వరుసగా 2026 డిసెంబరు, 2027 డిసెంబరులో విడుదల చేయనున్నట్లు దర్శకుడు అయాన్ ముఖర్జీ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ‘‘బ్రహ్మాస్త్ర: పా ర్ట్ 1 శివ’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో సెకండ్ పా ర్ట్, థర్డ్ పా ర్ట్ స్క్రిప్ట్స్‌పై మరింత ఫోకస్ పెట్టాను. అలాగే ఈ రెండు సినిమాలను ఏడాది గ్యాప్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. అలాగే తాను మరో సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ ఉందని, సరైన టైమ్‌లో ఆ విషయాన్ని వెల్లడిస్తానని కూడా అయాన్ పేర్కొన్నారు. దాంతో ఇది ‘వార్ 2’ సినిమా గురించే అనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: ఆలియా-రణ్‌బీర్
సెలబ్రెటీ లైఫ్ అంటే సాధారణ ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వారి ప్రతి అడుగును గమనిస్తుంటారు. ఇక వారి లైఫ్ స్టైల్‌పై ఎప్పుడు ఓ కన్నేస్తుంటారు. అదే ఆసక్తితో ఇటీవల ఏకంగా ఆలియా భట్ ఇంటిపైనే ఫొకస్ పెట్టిన కొందరు బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లు. తల్లయిన అనంతరం కూతురు ఫొటోను ఇంతరకు ఆలియా దంపతులు రివీల్ చేయలేదు. దీంతో చాటుమాటుగా తమ కూతురి ఫొటోలను తీసేందుకు కొందరు ఫొటోగ్రాఫర్లు ప్రయత్నించారు. ఆలియా తన ఇంట్లో బాల్కానీలో కూర్చుని ఉండగా పక్క బిల్డింగ్ నుంచి ఫొటోలు తీసేందుకు ట్రే చేయగా అది గమనించిన ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: పెళ్లి చేసుకున్న నరేశ్-పవిత్ర? తన ఇంట్లోనే తనకు ప్రైవసీ లేకుండ పోయిందని, సెలబ్రెటీలకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుందనే విషయం మర్చిపోవద్దు సోషల్ మీడియా వేదికగా ఫొటో గ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఈ సంఘటనపై ఆలియా-రణ్‌బీర్‌లు మరోసారి స్పందించారు. రీసెంట్గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ జంట మాట్లాడుతూ.. దీనిపై లీగల్‌గా వెళతామన్నారు. ప్రతిఒక్కరికి పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో.. సెలబ్రెటీలకు కూడా అలాగే వ్యక్తిగత జీవితం ఉంటుందన్నారు. తమాషా చేస్తున్నారా? మాకంటూ ప్రైవసీ ఉండదా? ఏకంగా ఇంటికే వచ్చి సీక్రెట్ ఫొటోలు తీయాలని చూస్తారా? అంటూ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆలియా. చదవండి: ఆర్ఆర్ఆర్పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిర్మాతపై నెటిజన్ల ఆగ్రహం అనంతరం రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో ఫొటోగ్రాఫర్స్‌కి సెలబ్రెటీలకు మధ్య ఆరోగ్యకరమైన రిలేషన్ ఉండాలి. మాకు మీరు అవసరం.. మీకు మేము అవసరం. అది వృత్తిపరంగా మాత్రమే. ఎవరికి వారికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. మేము అందరిలా మనుషులమే. సెలబ్రెటీలు అయినంత మాత్రాన మాకుంటూ వ్యక్తిగత జీవితం ఉండదా? మాకు సంబంధించిన ప్రతి విషయం మీకు తెలియాలా. అసలు ఇంటికి వచ్చి కెమెరాలు పెట్టాల్సిన అవసరం ఏముందు. ఈ విషయాన్ని అంత తెలిగ్గా వదలిపట్టం. అవసరమైతే వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం. అసలు ఇంట్టో కెమెరాలు పెట్టడం ఏంటీ? తలచుకుంటూనే అసహ్యం వేస్తోంది’ అంటూ రణ్‌బీర్ ఘాటుగా స్పందించాడు. -
ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రణ్‌బీర్ కపూర్
‘భారత మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ బయోపిక్‌లో నేను నటించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు’ అన్నారు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్. డైరెక్టర్ లవ్ రంజన్ తెరకెక్కించిన తాజా హిందీ చిత్రం ‘తూ ఝూటీ మై మక్కార్’. రణ్‌బీర్ కపూర్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 3న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు రణ్‌బీర్ కపూర్. ‘‘గంగూలీగారికి ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన బయోపిక్ అంటే అది అందరికీ స్పెషలే. కానీ ఆయన బయోపిక్‌లో నటించాలనే అవకాశం నాకు రాలేదు. నాకు తెలిసి ఈ బయోపిక్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతుందనుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రముఖ గాయకులు, నటులు కిషోర్ కుమార్‌గారి బయోపిక్ కోసం 11ఏళ్లుగా వర్క్ జరుగుతోంది. దర్శక–నిర్మాత, నటుడు అనురాగ్ బసు ఈ స్క్రిప్ట్ వర్క్‌లో భాగస్వామిగా ఉన్నారు. నేను చేయబోయే నెక్ట్స్ బయోపిక్ కిషోర్ కుమార్గారిదే అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యాని మల్’ చేస్తున్నారు రణ్‌బీర్ కపూర్. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ కానుంది. -
‘నాన్నకు ప్రేమతో.... ’అంటున్న స్టార్ హీరోలు
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా ఈ ‘అనుబంధం’ ఎవర్ గ్రీన్. అందుకే ఈ రిలేషన్ చుట్టూ కొత్త కథలు అల్లుకుని సినిమాలు తీస్తుంటారు. ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ఈ అనుబంధం నేపథ్యంలో కొన్ని సినిమాలు రానున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం. కమల్‌హాసన్ తండ్రీకొడుకుగా రెండు పాత్రలు చేసిన ఓ చిత్రం ‘ఇండియన్’ (భారతీయుడు). 1996లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి, అతని తనయుడు, ప్రభుత్వ ఉద్యోగి చంద్రబోస్ సేనాపతి పాత్రల్లో కమల్‌హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. దేశభక్తుడైన సేనాపతి లంచగొండి అయిన తన తనయుడు చంద్రబోస్‌ను హత్య చేయడం ఈ సినిమాకే ప్రధాన హైలైట్. భారీ ఎత్తున ప్రేక్షకాదరణ పొందిన ఈ ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్‌గా పాతికేళ్ల తర్వాత కమల్‌హాసన్, శంకర్ ‘ఇండియన్ 2’ చేస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రధానంగా తండ్రీకొడుకుల నేపథ్యంలోనే సాగుతుందని తెలిసింది. ఇండియన్ సినిమాలో మాదిరిగానే ‘ఇండియన్ 2’లో కూడా కమల్‌హాసన్ తండ్రీకొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని కోలీవుడ్ టాక్. కథలోని కీలక సన్నివేశాలు 1920 నేపథ్యంలో ఉంటాయని తెలిసింది. అంటే కథ.. స్వాతంత్య్రానికి పూర్వం సేనాపతి, అతని తండ్రికి ఉన్న అనుబంధం నేపథ్యంలో ఉంటుందన్నట్లుగా ఈ చిత్రరచయితల్లో ఒకరైన జయ మోహన్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ► ప్రభాస్ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు లుక్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని వినికిడి. అలాగే ఈ సినిమా కథకు తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ను జోడించారట ప్రశాంత్ నీల్. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తండ్రి బాధ్యతను కొనసాగించి, సక్సెస్ అయ్యే కొడుకు పాత్రలో ప్రభాస్ కనిపిస్తారన్నది ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రం సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. దర్శకుడు శంకర్, హీరో రామ్‌చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కథాంశం తండ్రీతనయుల అనుబంధమేనట. ఈ రెండు పాత్రలనూ చరణే చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఓ వ్యక్తి శ్రమిస్తాడు. కానీ కొందరు స్వార్థపరుల కారణంగా అతనికి అన్యాయం జరుగుతుంది. ఆ తర్వాతి కాలంలో ఆ వ్యక్తి తనయుడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. తండ్రిని ఇబ్బంది పెట్టినవారిని శిక్షిస్తూనే, డబ్బు, స్వార్థం లేని రాజకీయాల కోసం ప్రజలు ఎలా చైతన్యవంతులై ఉండాలి? ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగా విధులు నిర్వర్తించాలి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► సుధీర్‌బాబు ప్రస్తుతం ‘మామా మశ్చీంద్ర’ అనే సినిమా చేస్తున్నారు. హర్షవర్థన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రధానంగా తండ్రీకొడుకుల ఎమోషన్ నేపథ్యంలో సాగుతుందని, ఇందులో మూడు డిఫరెంట్స్ లుక్స్‌లో సుధీర్‌బాబు కనిపిస్తారని టాక్. ► తండ్రీకొడుకుల ఎమోషన్ నేపథ్యంలో సాగే చిత్రాలు బాలీవుడ్‌లోనూ కొన్ని ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తండ్రి కోసం గ్యాంగ్‌స్టర్‌గా మారే ఓ యువకుడి కథే ‘యానిమల్’ అని బాలీవుడ్ టాక్. ఇందులో రణ్‌బీర్ కపూర్ తండ్రిగా అనిల్‌కపూర్ కనిపిస్తారని సమాచారం. -
ఆ అవార్డు అందుకునే అర్హత లేదనిపిస్తోంది: రణ్‌బీర్
బాలీవుడ్ దంపతులు, స్టార్ హీరోహీరోయిన్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్నారు. బ్రహ్మాస్త్ర సినిమాకు గానూ రణ్‌బీర్ ఉత్తమ నటుడిగా, గంగూబాయి కఠియావాడికిగానూ ఆలియా ఉత్తమనటిగా ఈ అవార్డులు పొందారు. తాజాగా తనకు ఈ పురస్కారం రావడంపై రణ్‌బీర్ స్పందించాడు. 'తు జూఠీ మై మక్కార్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఛండీఘడ్లో పర్యటిస్తున్న రణ్‌బీర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. 'దాదాసాహెబ్ ఫాల్కే రావడం సంతోషంగా ఉంది. కానీ బ్రహ్మాస్త్రలో నేను మరీ అత్యద్భుతంగా ఏమీ నటించలేదని నా అభిప్రాయం. ఈ పురస్కారానికి నేను పూర్తి అర్హుడిని కాదనిపిస్తోంది. ఆలియాకు అయితే తన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. ఏదైనా అవార్డు వచ్చిందంటే హమ్మయ్య మా సినిమాకు మంచి రిజల్స్ వచ్చింది అని హ్యాపీగా ఫీలవుతాం. మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవరకు ఏ టెన్షన్ లేకుండా ఉంటాం' అని చెప్పుకొచ్చాడు. ఇటీవలి కాలంలో తనకు బాగా నచ్చిన పర్ఫామెన్స్‌ల గురించి చెప్తూ పుష్పలో అల్లు అర్జున్, గంగూబాయి కఠియావాడిలో ఆలియా అలాగే ఆర్ఆర్ఆర్లో రాజమౌళి పనితనం తనను బాగా ఆకట్టుకున్నాయన్నాడు. కాగా బ్రహ్మాస్త్ర గతేడాది సెప్టెంబర్ 9న రిలీజై సూపర్ హిట్ సాధించింది. Icon star @alluarjun performance in #Pushpa impacted me a lot as an audience & an actor - #RanbirKapoorpic.twitter.com/xX96TwiQc3 — Bunny - Youth Icon Of India (@BunnyYouthIcon) February 22, 2023 చదవండి: వేరొకరితో ఎంగేజ్మెంట్.. మాజీ ప్రియుడిచ్చిన నగలు మాత్రం.. -
త్వరలో పట్టాలెక్కనున్న సౌరవ్ గంగూలీ బయోపిక్.. హీరో అతనే..!
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ బయోపిక్ అతి త్వరలో పట్టాలెక్కేందుకు రెడీ ఉందని తెలుస్తోంది. ఈ బయోపిక్‌లో దాదా పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్, చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ నటించడం దాదాపుగా ఖరారైందని సమాచారం. ఈ విషయాన్ని గంగూలీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి రివీల్ చేశాడని క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గతంలోనూ చాలా సందర్భాల్లో ఈ ప్రచారం జరిగినప్పటికీ.. గంగూలీ, రణ్‌బీర్‌లకు సంబంధించిన వారెవ్వరూ నోరు మెదపలేదు. తాజాగా గంగూలీకి అతి దగ్గరగా ఉండే ఓ వ్యక్తి ఈ విషయాన్ని ధృవీకరించాడు. దాదా బయోపిక్కు సంబంధించి గతంలో ఇరు వర్గాలు చాలాసార్లు సిట్టింగ్ చేసినప్పటికీ.. రణ్‌బీర్ డేట్స్ కుదరక ఎలాంటి ఒప్పందం జరగలేదని, ప్రస్తుతం రణ్‌బీర్ డేట్స్ కుదరడంతో డీల్ ఓకే అయ్యిందని, గంగూలీ గురించి లోతైన సమాచారం తెలుసుకునేందుకు మరో ముఖ్యమైన వ్యక్తితో (దర్శకుడు) కలిసి రణ్‌బీర్ త్వరలోనే కోల్‌కతాకు వెళ్లనున్నాడని సదరు వ్యక్తి మీడియాకు ఉప్పందించాడు. అయితే దర్శకుడు ఎవరనే విషయాన్ని వెల్లడించేందుకు ఆ వ్యక్తి నిరాకరించినట్లు తెలుస్తోంది. కోల్‌కతా పర్యటనలో రణ్‌బీర్.. ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని, క్యాబ్ అఫీస్ను అలాగే గంగూలీ ఇంటిని సందర్శించనున్నట్లు సమాచారం. కాగా, దాదా ప్రస్తుతం క్రికెట్‌కు సంబంధించి ఏ అధికారిక పదవిలో లేకపోగా.. రణ్‌బీర్ మాత్రం 'తూ ఝూటీ మై మక్కర్' అనే చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. తన బయోపిక్‌లో నటించేందుకు హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రాలను గంగూలీ గతంలో సంప్రదించినట్లు టాక్ నడిచిన విషయం తెలిసిందే. -
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటనపై కంగనా అసహనం
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె వార్తల్లోకి ఎక్కుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ సినీ ప్రముఖులు, స్టార్ కిడ్స్ను టార్గెట్ చేస్తూ మాటల దాడి చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు నిర్వహకులపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఈ అవార్డు కేటాయింపులో నిర్వాహకులు పక్షపాతం చూపించారని కంగనా మండిపడింది. కాగా చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో ‘దాదా సాహేబ్ ఫాల్కే’ అవార్డు ఒకటి. చదవండి: కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్ చేసిన నటి నిన్న (సోమవారం) రాత్రి ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ముంబైలో జరిగిన సంగతి తెలిసిందే. 2023కి గానూ పలువురు సినీ తారల సమక్షంలో దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఈ ఏడాదికి గానూ ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర) ఉత్తమ నటిగా ఆలియా భట్(గంగూబాయ్ కథియవాడి) చిత్రాలకు గానూ అవార్డును అందుకున్నారు. అలాగే కాంతార మూవీ హీరో రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా ఈ అవార్డును దక్కింది. చదవండి: నెపోటిజంపై నాని షాకింగ్ కామెంట్స్.. రానా రియాక్షన్ ఎంటంటే! ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’, ఫిలిం ఆఫ్ ది ఇయర్‌గా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు అవార్డును గెలుచుకున్నాయి. అయితే రణ్‌బీర్ కపూర్, ఆలియాలకు ఈ అవార్డు రావడంపై కంగనా తప్పుబట్టింది. నెపోటిజం వల్లే అలియా భట్, రణబీర్ కపూర్‌కు అవార్డులు దక్కాయని విమర్శించింది. అవార్డులు పొందే అర్హత వీరికే ఉందంటూ తన ట్విటర్లో ఓ జాబితాను పంచుకుంది. అనంతరం బాలీవుడ్‌ను నెపోటిజం వదలడంలేదని, అవార్డులు కూడా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే ఇస్తున్నారని కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది. కంగనా పేర్కొన్నా జాబితా ఇలా ఉంది బెస్ట్ యాక్టర్ అవార్డు రిషబ్ శెట్టి (కాంతార) బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు మృణాల్ ఠాకూర్ (సీతారామం) ఉత్తమ చిత్రం అవార్డు కాంతారా ఉత్తమ దర్శకుడు అవార్డు ఎస్ఎస్ రాజమౌళి (ఆర్ఆర్ఆర్) ఉత్తమ సహాయ నటుడు అనుపమ్ ఖేర్ (కశ్మీరీ ఫైల్స్) ఉత్తమ సహాయ నటి టబు (భూల్ భులయ్యా) Best director- SS Rajamouli ( RRR) Best supporting actor- Anupam Kher ( Kashmir Files) Best supporting actress- Tabu ( Drishyaman/Bhool Bhulaiya) Bolly awards are a big sham … when I get some time from my schedule I will make a list of all those I feel are deserving … thanks — Kangana Ranaut (@KanganaTeam) February 21, 2023 -
ఆ చిత్రం చూసే అమ్మాయిలతో మాట్లాడటం నేర్చుకున్నా: రణ్‌బీర్
దర్శక-నిర్మాత యశ్ రాజ్ చొప్రా స్మృత్యంజలిగా నెటిఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ సిరీస్‌ను రిలీజ్‌చేస్తోంది. ‘ది రొమాంటిక్స్’ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరిని రేపు(ఫిబ్రవరి 14న) వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ స్టార్స్‌తో యశ్ చొప్రాతో ఉన్న అనుబంధం, ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు లవ్‌స్టోరి చిత్రాలపై వారి అభిప్రాయలను సేకరించింది నెట్‌ఫ్లిక్స్. ఈ సందర్భంగా ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాను ఉద్దేశిస్తూ ‘ది రొమాంటిక్స్’లో షారుక్ ఖాన్, కాజోల్ ఈ మూవీ విశేషాలను పంచుకోగా.. ఆయుష్మాన్ ఖురానా, రణ్‌బీర్ కపూర్ ఈ మూవీ తమని ఎంతగా ప్రభావితం చేసిందో తెలిపారు. చదవండి: శివరాత్రి స్పెషల్: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే ఈ సందర్భంగా బాలీవుడ్ లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. ‘దిల్వాలే దుల్హనియా లేజాయంగే(DDLJ) మా తరానికి నిర్వచనంగా నిలిచింది. ఈ సినిమా చూసినప్పుడు నేను పొందిన అనుభూతి మాట్లల్లో చెప్పలేను. డిడిఎల్జే నాపై ఎంతో ప్రభావం చూపింది. ఎంతగా అంటే ఈ సినిమా చూశాకే నా తల్లిదండ్రులతో ఎలా నడుచుకోవాలో తెలుసుకున్నాను. డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలో తెలిసింది. అలాగే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా ఈ సినిమా చూసే నేర్చుకున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఈ డాక్యుమెంటరీ సిరీస్‌ని ఆస్కార్, ఎమ్మీ అవార్డుల నామినీ స్మృతి ముంద్రా నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు. చదవండి: ముంబైలో సిద్ధార్థ్-కియారా గ్రాండ్ రిసెప్షెన్, బాలీవుడ్ తారల సందడి.. ఫొటోలు వైరల్ View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
అభిమాని ఫోన్ విసిరేసిన హీరో.. అచ్చం బాలయ్యలా ఉన్నాడే!
ఆటోగ్రాఫ్‌ల కాలం పోయింది. ఇది సెల్ఫీల యుగం. ఫేవరెట్ హీరో కళ్లముందు కనిపిస్తే చాలు ఒక్క సెల్ఫీ తీసుకోకపోతే ప్రాణం పోయినట్లే ఫీలవుతున్నారు జనాలు. అదే సమయంలో సెల్ఫీల కోసం ఎగబడుతున్న అందరితోనూ ఫోటోలు దిగలేక అసహనంతో ఊగిపోతున్నారు సెలబ్రిటీలు. తాజాగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ఓ ఫోటో దిగేందుకు ప్రయత్నించాడో అభిమాని. అందుకు హీరో కూడా అభ్యంతరం చెప్పలేదు. కానీ ఒక్కసారి క్లిక్‌మనిపించి ఊరుకోకుండా పర్ఫెక్ట్గా రావాలని అదేపనిగా ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో చిరాకుపడ్డ హీరో అతడి ఫోన్ లాక్కుని విసిరేశాడు. ఊహించని పరిణామానికి అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడికెందుకంత పొగరని కొందరు, అచ్చం బాలయ్యలా ప్రవర్తిస్తున్నాడని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అతడి అభిమానులు మాత్రం ఇదేదో ప్రమోషన్ కోసమే అయ్యుంటుందని, ఏదైనా ఫోన్‌ను ప్రమోట్ చేయడానికి ఇలా చేసి ఉండొచ్చంటూ రణ్‌బీర్‌ను వెనకేసుకొస్తున్నారు. చదవండి: నటుడితో డేటింగ్, ప్రియుడిని పెళ్లాడిన నటి -
సందీప్ రెడ్డి వంగ, రణ్‌బీర్ కపూర్ యానిమల్ నుంచి క్రేజీ అప్డేట్
‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న చిత్రం యానిమల్. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇప్పటికే కబీర్ సింగ్ చిత్రంతో బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. దీంతో సందీప్ తదుపరి చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. టైటిల్ తగ్గట్టే ఫస్ట్‌లుక్ వైల్డ్ మలిచారు. ఈ పోస్టర్లో రణ్‌బీర్ ఒత్తయిన జట్టు, గుబురు గడ్డం, శరీర మొత్తం రక్తంతో తడిచి సిగరెట్ కాల్చుతూ కనిపించాడు. అర్జున్ రెడ్డి పోలిక కనిపిస్తున్నప్పటికీ చాక్లెట్ బాయ్ లాంటి రణ్‌బీర్‌ను వైల్డ్‌గా చూపించి అందరి దృష్టిని ఆకర్షించాడు సందీప్ వంగ. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. Presenting you the first look of ANIMAL. HAPPY NEW YEAR PEOPLE🙂 #RanbirKapoor #ANIMAL@AnilKapoor @thedeol @iamRashmika @tripti_dimri23 #BhushanKumar @VangaPranay @MuradKhetani #KrishanKumar @anilandbhanu @VangaPictures @Cine1Studios @TSeries @rameemusic @cowvala #ShivChanana pic.twitter.com/zrsyaXqWVx — Sandeep Reddy Vanga (@imvangasandeep) December 31, 2022 -
చిరు 'వాల్తేరు వీరయ్య', 'బాలయ్య వీరసింహారెడ్డి' స్పెషల్ పోస్టర్లు చూశారా?
నూతన సంవత్సరం (2023) వచ్చింది. కొత్త పోస్టర్లను తెచ్చింది.. సినీ లవర్స్‌కి ఆనందాన్ని ఇచ్చింది... ఇక ఆ కొత్త అప్డేట్స్పై ఓ లుక్కేద్దాం.... చిరంజీవి హీరోగా బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో హీరో రవితేజ కీలక పాత్ర చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మింన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 13న విడుదలకానుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రం నుంచి చిరంజీవి కొత్త పోస్టర్ని విడుదల చేసింది యూనిట్. అదేవిధంగా బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ మూవీ నుంచి బాలకృష్ణ, శ్రుతీహాసన్ లేటెస్ట్ పోస్టర్ని యూనిట్ రిలీజ్ చేసింది. ఈ మూవీలోని ‘మాస్ మొగుడు..’ అంటూ సాగే పాటని ఈ నెల 3న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. కాగా నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కస్టడీ’. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. మే 12న ఈ సినిమా విడుదల కానుంది. అలాగే హీరో అఖిల్ నటింన మూవీ ‘ఏజెంట్’. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో సాక్షీ వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్, సురేందర్ 2 బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలకావాల్సి ఉంది.. అయితే వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంటూ కొత్త పోస్టర్ని విడుదల చేసింది. అదేవిధంగా ‘బింబిసార’ వంటి హిట్ చిత్రం తర్వాత కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమీగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఫిబ్రవరి 10న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంటూ కల్యాణ్ రామ్ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. కాగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం యానిమల్’. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. టీ సీరీస్, భద్రకాళీ పిక్చర్స్‌పై భషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినివ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. వీటితో ΄ాటు మరికొన్ని సినిమాల కొత్త పోస్టర్స్, కొత్త అప్డేట్స్ని ఇచ్చాయి చిత్రవర్గాలు. -
ఆలియాకు రణ్‌బీర్ ప్రపోజ్.. ప్లాన్ మామూలుగా లేదుగా..!
బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. అంతలా ఫేమస్ అయింది ఈ బాలీవుడ్ జంట. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే వీరి ప్రేమ ఎలా మొదలైంది? మొదట ఆలియా భట్ ప్రపోజ్ చేసిందా? లేదా రణ్‌బీర్ కపూర్ ప్రపోజ్ చేశాడా? అని అభిమానుల్లో ఓ చిన్న సందేహం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటీవల ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది ఆలియా భట్. (ఇది చదవండి: బేబీ ఆలియా భట్.. వావ్ ఎంత క్యూట్‌గా ఉందో..!) గతంలో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఆలియా భట్ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. కెన్యాలో జరిగిన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం రణబీర్ కపూర్ ప్రపోజ్ చేసిన ఆ ఫోటో తెగ వైరలవుతోంది. ఆ ఫోటోలో రణ్‌బీర్ కపూర్ మోకాళ్లపై కూర్చుని ఆలియాకు సర్ప్రైజ్ షాక్ ఇచ్చాడు. దీంతో ఆలియా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆ సమయంలో ఏడుస్తూ కనిపించింది. అలియా మాట్లాడుతూ.. 'రణ్‌బీర్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడనే విషయాన్ని వివరించింది. చాలా అద్భుతమైన ప్రదేశంలో రణ్‌బీర్ నాకు ప్రపోజ్ చేశారు. అది కెన్యాలోని అడవుల్లోని ఓ అందమైన ప్రదేశం. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ మా గైడ్ ఆ ఫోటోలు తీసేలా రణ్‌బీర్ ప్లాన్ చేశాడు. ఆ తర్వాత నేను ఇంకా షాక్‌తో ఉన్నా. చాలా భావోద్వేగానికి గురయ్యా. ఆ ఫోటో నా జీవితంలో చాలా ప్రత్యేకమైనది.' అంటూ చెప్పుకొచ్చింది ఆలియా భట్. (ఇది చదవండి: ఆలియా భట్ షాకింగ్ కండీషన్.. బేబీని చూడాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!) అలియా, రణబీర్‌ల పెళ్లి: అలియా, రణబీర్ ఐదేళ్ల పాటు డేటింగ్ అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో సన్నిహితుల, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్లోనే ఈ జంట ఓ పాప జన్మించింది. వీరి బేబీకి రాహ కపూర్ అని పేరు పెట్టారు. ఈ ఏడాది అలియా భట్, రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మస్త్ర బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. -
అవకాశం వస్తే పాకిస్తాన్ సినిమాల్లోనూ నటిస్తా: రణ్‌బీర్ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం దారుణమైన ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నాడు. ఓ ఈవెంట్లో తన మనసులో మాట బయట పెట్టి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రణ్‌బీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ అవార్డ్ ఫంక్షన్లో పాల్గొన్న రణ్‌బీర్ అవకాశం వస్తే పాకిస్తాన్ సినిమాల్లోనూ నటించేందుకే రెడీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: జపాన్‌లో ఆర్ఆర్ఆర్ దూకుడు.. రజనీకాంత్ రికార్డు బ్రేక్ వివరాలు.. రీసెంట్గా సౌదీ అరేబియాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రణ్‌బీర్ ఆహ్వానం అందుకున్నాడు. ఈ ఫెస్టివల్లో అతడు ‘వెరైటీ ఇంటర్నేషనల్ వాన్ గార్డ్ యాక్టర్’ అవార్డును అందుకున్నాడు. అనంతరం రణ్‌బీర్ అక్కడి మీడియాతో ముచ్చటించాడు. ఈ నేపథ్యంలో ఓ రిపోర్డర్ రణ్‌బీర్‌ను పాకిస్థాన్ సినిమాల్లో నటిస్తారా? అని ప్రశ్నించాడు. దీనికి రణ్‌బీర్ స్పందిస్తూ ఆసక్తికరంగాసమాధానం ఇచ్చాడు. ‘తప్పకుండ... నా దృష్టిలో కళాకాలరుకు సరిహద్దులు లేవు. ముఖ్యంగా వారి ఆర్ట్ విషయంలో. ప్రస్తుతం నేను సౌదీ అరేబియాలో ఉన్నాను. చదవండి: ‘కాంతార’ లాంటి చిత్రాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి: స్టార్ డైరెక్టర్ నాకు ఇక్కడి పరిశ్రమతో పని చేయాలని ఉంది. కుదరితే ఇదే స్టేజ్‌పై ఓ సినిమాకు సైన్ చేసేందుకు కూడా రెడీ. అలాగే అవకాశం వస్తే పాకిస్తాన్ సినిమాల్లో సైతం నటించేందుకు నేనే సిద్ధంగానే ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు. దీంతో రణ్‌బీర్‌పై ఇండియన్ నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆలియా-రణ్‌బీర్‌లు శాశ్వతంగా పాకిస్తాన్‌కు వెళ్లిపోండి. అక్కడ ప్రశాంతంగా బీఫ్ తింటూ పాకిస్తాన్ సినీ పరిశ్రమలో పని చేసుకోండి’, ‘శాశ్వతంగా భారత పౌరసత్వాన్ని వదులుకోని పాకిస్తాన్లో సెటిలైపోండి.. అందుకు మా పూర్తి మద్దతు మీకు ఉంటుంది’ అంటూ రణ్‌బీర్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. Ranbir Kapoor says he would love to work in Pakistani films. And I loved him once upon a time.🥲 — khushi (@love_liv_laf) December 12, 2022 Both Alia & Ranbir Kapoor should shift to Pakistan. Wahan aaram se beef khana aur Pakistan Movies mein kaam karna — Sanjay Goyal (@SanjuG68) December 12, 2022 Ranbir Kapoor says he would love to act in a Pakistani film, claims ‘artists have no boundaries’https://t.co/TlyqHtoZcb — OpIndia.com (@OpIndia_com) December 12, 2022 -
ఆ గడ్డం వల్లే రూ.150 కోట్ల నష్టం.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్
బాలీవుడ్లో రొమాంటిక్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్. ఈ జంటకు ఇటీవలే ఓ కూతురు జన్మించింది. వీరిద్దరి కాంబినేషన్లో ఈ ఏడాది రిలీజైన బ్రహ్మస్త్ర బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయాన్ని అందుకుంది. అయితే జూలైలో విడుదలైన మూవీ 'షంషేరా' రణబీర్ కెరీర్లో ఓ పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఆ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాన్ని రణ్‌బీర్ వెల్లడించారు. షంషేరా చిత్రం జూలై 22న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. 'షంషేరా మూవీ ఫెయిల్ కావడానికి మేం చేసిన పొరపాట్లు ప్రధాన కారణం. అందులో నా గడ్డం కూడా ఒకటి. నేను ఈ చిత్రం కోసం కృత్రిమ గడ్డం పెట్టుకున్నా. ఎండలో షూటింగ్ చేసే సమయంలో అది సరిగా కనిపించలేదు. ముఖానికి అతుక్కుని ఉన్నట్లు కనిపించింది. అందుకే ఈ సినిమా ఫ్లాప్ అయిందనుకుంటా.' అని అన్నారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించారు రణ్‌బీర్ కపూర్. ఈ సినిమా వైఫల్యానికి గడ్డమే ప్రధాన కారణం కావచ్చని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సైతం అభిప్రాయం వ్యక్తం చేశారని వెల్లడించారు. కాగా.. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం యానిమల్‌లో రణబీర్ కపూర్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా అతని జోడీగా నటిస్తోంది. -
కూతురి పేరును రివీల్ చేసిన ఆలియా-రణ్‌బీర్.. ఫోటో వైరల్
బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియా భట్--రణ్‌బీర్ కపూర్ ఇటీవలె పేరెంట్స్‌గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్గా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా తాజాగా తన కూతురి పేరును రివీల్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఇంతకీ ఆ పేరు ఎవరు పెట్టారు? దానివెనకున్న అర్థాలేంటో కూడా వివరించింది ఆలియా. కూతుర్ని ఎత్తుకున్న ఫోటోను షేర్ చేసిన ఆలియా తన బుజ్జాయికి రాహా అని పేరు పెట్టినట్లు చెప్పింది. ఈ పేరును రణ్‌బీర్ కపూర్ తల్లి, నీతూకపూర్ సూచించిందట. అయితే మా కూతురు రాహ పేరుకు ఎన్నో అర్థాలు ఉన్నాయని అనేక భాషల్లో అనేక అర్థాలు ఉన్నాయని వివరించింది.రాహా అంటే దైవ మార్గమని, స్వాహిలి భాషలో ఆనందమని, సంస్కృతంలో వంశమని, బెంగాలీలో విశ్రాంతి, సౌకర్యం, ఉపశమనం, అరబిక్‌లో శాంతి, సంతోషం, స్వేచ్ఛ అని అనేక అర్థాలున్నట్లు తెలిపింది. ఇక రాహా రాకతో లైఫ్ ఇప్పుడే కొత్తగా ప్రారంభమైందని పేర్కొంది. ప్రస్తుతం ఆలియా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆలియా-రణ్బీర్క జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఆలియా-రణ్‌బీర్ దంపతులు ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
ఆలియా భట్ షాకింగ్ కండీషన్.. బేబీని చూడాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ దంపతులకు నవంబర్ ఆరో తేదీన పాప జన్మించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. ఇప్పటికే ఆస్పత్రి నుంచి గురువారం ఇంటికి కూడా చేరుకున్నారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్ నుంచి కారులో ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆలియా బేబీని ఇంతవరకు ఎక్కడా బయటకు చూపించలేదు. బేబీ ముఖాన్ని చూడకుండా జాగ్రత్తలు తీసుకుంది ఈ బాలీవుడ్ జంట. (చదవండి: కంగ్రాట్స్.. పెళ్లైన ఏడు నెలలకే.. అలియా భట్ దంపతులపై కేఆర్కే సంచలన ట్వీట్) అయితే బేబీని ఇంటికి తీసుకురావడంతో బంధువులు, సన్నిహితులు, స్నేహితులు చూసేందుకు క్యూ కట్టారు. చాలా మంది బంధుమిత్రులు ఆలియా-రణ్‌బీర్ బేబీని చూడడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. కానీ ఆలియా క్యూట్ బేబీని చూడాలంటే ఓ షరతు విధించింది ఈ జంట. పాపను చూడాలంటే తప్పనిసరిగా కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అంటూ కండిషన్ విధించారు. దీంతో కొద్దిమంది బంధుమిత్రులు నిరాశకు గురవుతున్నారు. ఈ ఏడాది విడుదలైన బ్రహ్మస్త్ర-పార్ట్-1 ఘనవిజయం సాధించింది. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఈ బాలీవుడ్ జంట ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. కాగా.. ఆలియా తర్వాత కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన "రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ", హాలీవుడ్ తొలి చిత్రం "హార్ట్ ఆఫ్ స్టోన్", గాల్ గాడోట్‌తో కలిసి నటించనుంది. కత్రినా, ప్రియాంకతో కలిసి ఫర్హాన్ అక్తర్ మూవీ "జీ లే జరా"లో కూడా నటించనుంది. రణబీర్ రాబోయే ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న "యానిమల్" లో నటిస్తున్నారు. -
ఆలియా భట్ బేబీని చూశారా.. సోషల్ మీడియాలో వైరల్.. కానీ..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ దంపతులకు ఇటీవలే పాప జన్మించిన విషయం తెలిసిందే. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న రణ్‌బీర్ కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు. పాపకు జన్మనివ్వడంతో కపూర్ కుటుంబంలో సంతోషంలో మునిగిపోయింది. కానీ ఇప్పటివరకు పాప ముఖాన్ని ఈ జంట ఎక్కడా చూపించలేదు. (చదవండి: ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆలియా భట్) కానీ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వీడియోలో ఉన్నది ఆలియా భట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో బేబీని ముద్దాడుతూ ఓ మహిళ కనిపిస్తోంది. ఆ వీడియో ఆలియా ఉన్న ఆసుపత్రి నుంచి లీక్ అయిందని పలువురు భావిస్తున్నారు. కానీ ఆ వీడియో మార్ఫింగ్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుండడంతో ఆలియా భట్ కాదని తెలుస్తోంది. Congratulations 🥳 alia so cute baby girl ❣️❣️❣️🥰🥰🥰🥰 pic.twitter.com/kpYSt1Qfs4 — Drx.monikachoudhary (@monikac60799851) November 7, 2022 -
కంగ్రాట్స్.. పెళ్లైన ఏడు నెలలకే.. అలియా భట్ దంపతులపై కేఆర్కే సంచలన ట్వీట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ దంపతులకు పాప జన్మించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. కొన్నాళ్లుగా డేటింగ్లో ఉన్న రణ్‌బీర్ కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు.పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని కన్ఫార్మ్ చేశారు. పాపకు జన్మనివ్వడంతో కపూర్ కుటుంబంలో సంతోషంలో మునిగిపోయింది. మరోవైపు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. (చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా) కానీ వివాదస్పద రివ్యూలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ కేఆర్కే అలియా భట్-రణ్‌బీర్ కపూర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. కానీ ఎప్పటిలాగే వివాదస్పద రీతిలో ట్వీట్ చేశారు. పెళ్లయిన ఏడు నెలలకే తల్లిదండ్రులైనందుకు అలియా భట్-రణ్‌బీర్ కపూర్‌కు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నీకు కూడ కూతురు ఉంది కదా.. వ్యక్తిగతంగా అలా ఎలా మాట్లాడుతారని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మీకు నెగెటివ్ కామెంట్స్ చేయడం తప్ప.. పాజిటివ్‌గా మీరు ఆలోచించరా అని కౌంటరిస్తున్నారు. దీనిపై స్పందించిన కేఆర్కే.. 'ఎందుకు మీరంతా నాకు చెబుతున్నారు..దేశంలో లక్షల మంది ఏడు నెలలకే పుట్టినవాళ్లు ఉన్నారు. ఇలాంటి ప్రీ మెచ్యూర్ బర్త్ సర్వ సాధారణం అంటూ' తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. Congratulations to #RanbirKapoor and #AliaBhatt for becoming proud parents of a beautiful daughter within 7months.👏🎉💃 — KRK (@kamaalrkhan) November 6, 2022 -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తల్లైయింది. ఆదివారం ఉదయం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా.. కాసేపటి క్రితమే పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. రణబీర్తోపాటు సోనీ రజ్దాన్, నీతూ కపూర్ ఆసుపత్రిలో అలియాతో ఉన్నట్లుగా సమాచారం. తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్లు కపూర్ కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న రన్బీర్ కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు.పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని వెల్లడించింది. గర్భిణీగా ఉన్నా షూటింగ్స్‌తో పాటు బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్స్‌లోనూ ఆమె యాక్టివ్‌గా పాల్గొంది.పాప రాకతో కపూర్ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆలియా, రణ్‌బీర్‌లకు శుభాకాంక్షలులు వెల్లువెత్తున్నాయి. అలియా తల్లి అయ్యారని తెలుసుకున్న అభిమానులు, సీనీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆలియా భట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం నిండు గర్భిణీగా ఉన్న ఆలియా మరికొద్ది గంటల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ క్రమంలో డెలివరీ కోసం నేడు(ఆదివాం)ఉదయం 7.30నిమిషాలకే ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రిలో చేరింది. ఆలియా వెంట భర్త రణ్‌బీర్ కపూర్‌తో పాటు నీతూ కపూర్, సోనీ రజ్దాన్, షాహిన్ భట్ కూడా ఉన్నారు. మరికాసేపట్లో ఆలియా, రణ్‌బీర్ గుడ్‌న్యూస్ చెప్పనున్నారు. దీంతో కపూర్ ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ ఆలియా బేబీ కోసం ఎదురుచూస్తున్నారు. బేబీ కపూర్‌కు స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆలియా పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని వెల్లడించింది. అయితే గర్భిణీగా ఉన్నా షూటింగ్స్‌తో పాటు ప్రమోషన్స్‌లోనూ ఆమె యాక్టివ్‌గా పాల్గొంది. ప్రసవం తర్వాత ఆలియా తిరిగి సినిమాల్లో నటించనుంది. -
ఇంటింటికీ వెళ్లి చెప్పాలా? నాకు వేరే లైఫే లేదా?: హీరో
స్టార్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 9న విడుదలైంది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.425 కోట్లు రాబట్టింది. థియేటర్లలో సందడి చేసిన బ్రహ్మాస్త్ర నవంబర్ 4 నుంచి హాట్స్టార్లోకి రాబోతోంది. సినిమా రిలీజ్‌కు ముందే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు చేసింది చిత్రయూనిట్. ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు కూడా ప్రమోషన్స్ చేయడం నావల్ల కాదంటున్నాడు రణ్‌బీర్. ఈ మేరకు ఓ వీడియోను ఆలియా భట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో హీరో ఓ ఫోన్‌కాల్ మాట్లాడుతూ.. 'ఇక నా వల్ల కాదు బ్రదర్. బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ చేసేశాం కదా! అయాన్ ముఖర్జీతో కూడా పనైపోయింది. ఇప్పుడేమంటావ్.. బ్రహ్మాస్త్ర హాట్‌స్టార్‌లో వస్తుందా? అంటే మళ్లీ ప్రమోషన్లు చేయాలా? సినిమాలో కూడా ఆలియా అన్నిసార్లు శివ శివ అని స్మరించలేదేమో.. ప్రతి ఈవెంట్లో కేసరియా(కుంకుమలా నువ్వు..) పాట పాడి ఆమె గొంతు పోయింది. పదేపదే స్టేజీ మీద డ్యాన్స్ చేసీ చేసీ నేనూ ఓ దెయ్యంలా మారిపోతున్నా.. బ్రహ్మాస్త్ర లోగో లాంచ్ చేసినప్పుడు 150 డ్రోన్లతో స్వీట్లు పంచాం. ఇంకా ఏం చేయాలి? ఇంటింటికీ వెళ్లి సోదరసోదరీమణులారా.. హాట్‌స్టార్‌లో బ్రహ్మాస్త్ర రాబోతోంది, దయచేసి చూడండి అని అడగాలా? అసలు అయాన్ ఏమనుకుంటున్నాడు? నాకు బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ కాకుండా వేరే జీవితమే లేదనుకుంటున్నాడా? నేను త్వరలో తండ్రిని కాబోతున్నాను, అది నా జీవితంలోనే గొప్ప విషయం' అని చెప్పుకొచ్చాడు. ఇలా మాట్లాడుతున్న సమయంలో డైరెక్టర్ అయాన్ నుంచి ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన రణ్‌బీర్.. 'హేయ్ అయాన్.. తప్పకుండా చేద్దాం. ప్రమోషన్స్ చేసి తీరాల్సిందే. ప్రతి ఒక్కరూ బ్రహ్మాస్త్ర చూడాలి' అంటూ ప్రమోషన్స్ చేసేందుకు రెడీ అయిపోయాడు. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
అఫీషియల్: ఓటీటీలోకి బ్రహ్మాస్త్ర, ఎప్పటినుంచంటే?
స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజైంది. ఇందులో నాగిని నటి మౌనీరాయ్, కింగ్ నాగార్జున, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలై భారీ విజయం అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం హాట్‌స్టార్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే! ఈ సినిమా నవంబర్ 4 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది. మరింకే, థియేటర్లో ఈ సినిమా చూడటం మిస్ అయినవాళ్లు వచ్చే నెల 4వ తారీఖు నుంచి హాట్‌స్టార్‌లో ఎప్పుడైనా చూసేయండి! The World of Ancient Indian Astras is coming to Disney+ Hotstar on November 4. #BrahmastraOnHotstar pic.twitter.com/chmZBI6grk — Disney+ Hotstar (@DisneyPlusHS) October 23, 2022 చదవండి: ఉదయ్ కిరణ్‌తో ఐదు సినిమాలకు సంతకం చేశా: పింకీ పవిత్ర నరేశ్ బ్రేకప్ -
‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..
బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియాభట్-రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'బ్రహ్మస్త్ర'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బ్రహ్మస్త్రం పేరుతో తెలుగులోనూ విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. చదవండి: సుకుమార్-దేవిశ్రీ మధ్య రెమ్యునరేషన్ చిచ్చు! అసలేం జరిగింది? భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దీపావళి సందర్భంగా బ్రహ్మస్త్ర మూవీ వచ్చేవారంలో ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 23 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని సినీవర్గాల నుంచి సమాచారం. త్వరలోనే దీనిపై హాట్‌స్టార్ అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని తెలుస్తోంది. -
ఆలియా భట్ డెలివరీ.. ఒక్క రోజుకు అంత ఖర్చు చేయనున్నారా..!
బాలీవుడ్ నటి ఆలియా భట్ గర్భం ధరించిన విషయం తెలిసిందే. అయితే ఆమె ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించనున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన ప్రకారం అలియా భట్ ఈ నెలాఖరులోపు బిడ్డకు జన్మనిస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే దీనికోసం ముందుగానే ప్లాన్ చేసుకున్నారు రణ్‌బీర్, ఆలియా జంట. ఇందుకోసం రోజుకు రూ.15 వేలు చెల్లించేందుకు ఓ ఆస్పత్రిని ఎంచుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై వారి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. (చదవండి: ఘనంగా ఆలియా భట్ సీమంతం, ఫొటోలు వైరల్) అయితే ప్రసవం కోసం ముంబైలోని గిర్గావ్లో ఉన్న సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో తన పేరును నమోదు చేసుకున్నట్లు ప్రముఖ మీడియా ద్వారా తెలిసింది. ఆస్పత్రిలో రోజుకు రూ. 15,000 వేలు ఫీజు ఉంటుందని సమాచారం. దీనిలో భాగంగా వారికి ప్రత్యేక గదులతో ఆధునాతన సదుపాయాలు కల్పిస్తారు. ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్న ఈ జంట జూన్‌లో గర్భం దాల్చినట్లు ప్రకటించారు. కాగా.. ఆలియా హాలీవుడ్ అరంగేట్ర చిత్రం స్పై థ్రిల్లర్ 'హార్ట్ ఆఫ్ స్టోన్'లో కనిపించనుంది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' లోనూ నటిస్తోంది. ఇందులో రణ్వీర్ సింగ్, షబానా అజ్మీ, జయ బచ్చన్, ధర్మేంద్ర నటించారు. -
దసరా సెలవుల్లో బ్రహ్మస్త్ర బంపర్ ఆఫర్.. థియేటర్లలో రూ.100 కే చూడొచ్చు
బాలీవుడ్లో బాక్సాఫీస్ వద్ద రికార్డుస్థాయిలో వసూళ్లు రాబట్టిన చిత్రం 'బ్రహ్మస్త్ర'. బాలీవుడ్ ప్రేమజంట రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇటీవలే వరల్ట్ వైడ్ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాల క్లబ్లో చేరింది. ఈ సినిమాను మిస్సవుతున్న వారి కోసం చిత్ర యూనిట్ సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఇప్పటికే ఈనెల 23న మల్టీప్లెక్స్‌ల్లో కేవలం రూ.75 కే సినిమా చూడవచ్చని బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో ప్రేక్షకుల నుంచి ఒక్కసారిగా ఊహించని రీతిలో స్పందన వచ్చింది. తాజాగా దసరా సెలవుల్లోనూ మరో బంపర్ ఆఫర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈనెల 29 వరకు కేవలం రూ.100 కే మల్టీప్లెక్స్‌ల్లో సినిమా చూడవచ్చని చిత్ర యూనిట్ ప్రకటించింది. దసరా సెలవులను కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసే వారికి ఈ ఆఫర్ మంచి సువర్ణావకాశం. ఇంకేముంది కుటుంబ సమేతంగా బ్రహ్మస్త్రను చూసేయండి. (చదవండి: ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మస్త్ర రికార్డ్.. తొలివారం ఎన్ని కోట్లంటే..!) బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం బ్రహ్మస్త్రం పేరుతో తెలుగులో విడుదలైంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్ కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. Celebrate Navratri with #Brahmastra! Enjoy this visual spectacle on big screens for just Rs. 100 + GST from 26th September to 29th September. Book your tickets now! BMS - https://t.co/qjPVPFdZfT Paytm - https://t.co/eVmK21uC8n T&C Apply* pic.twitter.com/vz7Du38dUG — BRAHMĀSTRA (@BrahmastraFilm) September 25, 2022 -
బ్రహ్మాస్త్రకు వారిద్దరు రెమ్యునరేషన్ తీసుకోలేదా.. అందులో నిజమెంత?
బాలీవుడ్ రొమాంటిక్ జోడీ ఆలియాభట్, రణ్‌బీర్ కపూర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఇటీవల విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో పోషించారు. అయితే ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్స్ విషయంలో పలు రకాల వదంతులు వ్యాపించాయి. ఈ సినిమా బడ్జెట్ పెరిగడంతో.. అలియాభట్, రణ్‌బీర్ కపూర్ రెమ్యునరేషన్ తీసుకోలేదనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై తాజాగా సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు. అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ ‘చాలా మంది త్యాగాలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమాలో నటించినందుకు రణ్‌బీర్ ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అలియాభట్ ఈ ప్రాజెక్టులో 2014లో జాయినైంది. ఆమెకు ఈ చిత్రానికి ఇచ్చిన పారితోషికం ప్రస్తుతం తాను తీసుకుంటున్న దానికి చాలా తక్కువ. మేం సినిమా పూర్తి చేసే సమయానికి అలియా కూడా ఈ చిత్రంలో భాగమైంది’ అని అన్నారు. (చదవండి: బిగ్‌బాస్ షో.. ఆ స్టార్ హీరో పారితోషికం భారీగా తగ్గనుందా..!) రెమ్యునరేషన్‌పై వస్తున్న వార్తలపై రణ్‌బీర్ కపూర్ కూడా స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘ నిజానికి నేను బ్రహ్మాస్త్ర మొదటి భాగానికి పారితోషికం తీసుకోలేదు. ఎందుకంటే నేను ఈ చిత్రానికి నిర్మాతను కూడా. కానీ నేను అంతకు మించి పొందాను. ఈ సినిమాను మూడు భాగాలుగా తీయగలమనే నమ్మకం ఉంది. ఒక నటుడిగా నేను ఇంతకంటే పొందగలిగేది ఏముంటుంది. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను’’ అని అన్నారు. " -
రణ్‌బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత
బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌కు చేదు అనుభవం ఎదురైంది. వీరిద్దరి తొలిసారి జంటగా నటించిన బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది. ఇక మూవీ ప్రమోషన్లో భాగంగా కొద్ది రోజులుగా ఈ జంట నార్త్ నుంచి సౌత్ వరకు పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు గుడిలోకి వెళ్లిన ఈజంటను కొందరు అడ్డుకున్నారు. బీఫ్ (గొడ్డు మాంసం) తినే విషయంలో ఆలియా-రణ్‌బీర్‌లు గతంలో చేసిన కామెంట్లపై నిరసన వ్యక్తం చేస్తూ భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఐశ్వర్య రాయ్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం, ఏం చేసిందంటే.. అంతేకాదు వారిని వారిని ఆలయంలోకి అనుమతించేది లేదని నిరసన చేపట్టారు. తనకు బీఫ్ అంటే చాలా ఇష్టమని అలియా చాలా ఏళ్ల కిందట చెప్పిన ఓ క్లిప్ ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల కిందట రణ్‌బీర్ తాను మటన్, చికెన్‌తో పాటు బీఫ్ కూడా తింటానని చెప్పాడు. దాంతో, అలియా, రణ్బీర్లపై భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను బాయ్‌కాట్ సేగ అట్టుకున్న సంగతి తెలిసిందే. లాల్ సింగ్ చడ్డా సినిమాతో పాటు బ్రహ్మాస్త్రను బాయ్‌కాట్ చేయాలంటూ నెజిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. చదవండి: నాకు ఫోన్ కొనివ్వడానికి మా నాన్న అప్పు చేశారు: బిగ్‌బాస్ నేహా చౌదరి ‘బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర’ పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. ఇక దీనిపై ఇటీవల స్పందించిన ఆలియా ‘సినిమాను చూడాలనుకుంటే చూడండి, ఆసక్తి లేకపోతే మానేయండి’ అని కామెంట్ చేసింది. ఈ కామెంట్స్‌పై కూడా ఆలియాను పలువురు టార్గెట్ చేస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం(సెప్టెంబర్ 9న) హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు బ్రహ్మాస్త్రం పేరుతో రాజమౌళి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. -
'బ్రహ్మాస్త్ర' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది, ఎలా ఉందంటే?
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో బ్రహ్మాస్త్రం పేరిట సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతోంది. నాగార్జున, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషించగా నాగిని బ్యూటీ మౌనీరాయ్ నెగెటివ్ రోల్ చేసింది. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో సమర్పిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న బ్రహ్మాస్త్ర సినిమా ఎలా ఉందనే విషయం అప్పుడే బయటకు వచ్చేసింది. సెన్సార్ బోర్డ్ సభ్యుడినని తనకు తానే ప్రకటించుకున్న ఉమైర్ సంధు రణ్‌బీర్ సినిమాపై సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చాడు. ‘ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్తో కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కనుల విందు చేస్తుంది. కథ, స్క్రీన్‌ప్లే యావరేజ్. ఆలియా భట్, మౌనీరాయ్ నటన అద్భుతం. అమితాబ్ బచ్చన్ కనిపించే సీన్ మామూలుగా ఉండదు, కానీ అతడి పాత్ర నిడివి చాలా తక్కువ. బాలీవుడ్లో ఫాంటసీ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటిది ఆ లైన్లో సినిమా తీసిన అయాన్ ముఖర్జీ ధైర్యాన్ని అభినందించాల్సిందే’అని ట్వీట్ చేశాడు. చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే -
‘బ్రహ్మాస్త్రం’ రిలీజ్‌కు ఇంకా 6 రోజులే.. అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన రాజమౌళి
బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్లు తొలిసారి జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల కాబోతోంది. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అంత్యంత ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న అన్ని భాషల్లో(హందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం) విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాను తెలుగులో డైరెక్టర్ రాజమౌళి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తూ ఓ క్రేజీ వీడియోను వదిలాడు రాజమౌళి. చదవండి: సమంతతో నా ప్రయాణం ముగిసిందనుకుంటున్నా: చిన్మయి బ్రహాస్త్రం ప్రీరిలీజ్ ప్రోమో పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో ట్రైలర్లో చూపించని, సినిమాకు హైలెట్‌గా నిలిచే పలు కీలక సన్నివేశాలతో చూపించారు. దీంతో ఈ వీడియో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక రాజమౌళి ఈ వీడియోను షేర్ చేస్తూ ‘బ్రహ్మాస్త్రం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది’ అని తెలిపాడు. కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ ‘కింగ్’ నాగార్జున, బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్లు కీలక పాత్రలు పోషిస్తుండగా.. ‘నాగిని’ బ్యూటీ మౌని రాయ్ నెగిటివ్ రోల్లో కనిపించనుంది. Here’s #Brahmastra PRE-RELEASE PROMO... Advance Bookings Open Now! Experience Brahmāstra in cinemas on September 9th. pic.twitter.com/9GFZWLwhrf — rajamouli ss (@ssrajamouli) September 3, 2022 -
‘బ్రహ్మాస్త్రం’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు.. భారీగా నష్టపోయిన మేకర్స్
టాలీవుడ్ స్టార్ హీరో ‘కింగ్’ నాగార్జున్ కీ రోల్ పోషించిన బాలీవుడ్ పాన్ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్రం. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేయగా చివరి నిమిషంలో ఈ కార్యక్రమం రద్ధయిన సంగతి తెలిసిందే. భారీ ఖర్చుతో ఏర్పాట్లు చేసిన ఈ కార్యక్రమం చివరి నిమిషంలో క్యాన్సిల్ కావడంతో మేకర్స్ భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను రాజమౌళి సమర్పిస్తుండగా.. జూనియర్ ఎన్టీఆర్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరు కానుండటంతో రామోజీ ఫిలిం సిటీలో భారీగా ఏర్పాట్లు జరిగాయి. దీని కోసం మేకర్స్ దాదాపు రూ. 2.25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ‘లైగర్’ ఫ్లాప్‌తో పారితోషికంలో భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్! ఎంతంటే.. ఈ కార్యక్రమానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో మేకర్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఖర్చంతా వృథా అయిపోయిందని మేకర్స్ ఆవేవదన వ్యక్తం చేసినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ఇక చేసేదేం లేక అప్పటికప్పుడు రూ. 10 లక్షల ఖర్చుతో పార్క్ హయత్‌లో ప్రెస్‌మీట్‌కు ఏర్పాట్లు చేశారట. అయితే గణపతి నవరాత్రి ఉత్సవాల కారణంగా సెక్యూరిటీ ఇవ్వమలేమని చెప్పి నగర పోలీసులు చెప్పడంతో ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దయ్యింది. కాగా బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్లు హీరోహీరోయిన్లుగా నటించగా.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, నాగిని బ్యూటీ మౌని రాయ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్, షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు -
లైవ్‌లో తెలుగు పాట పాడి అలరించిన ఆలియా
ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరైంది బాలీవుడ్ భామ ఆలియా భట్. ఆ చిత్రంలో ‘సీత’ పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది ఇప్పుడు ‘బ్రహ్మాస్త్రం’తో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తుంది. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దక్షిణాదిలో సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 9న ఈ చిత్రం విడుదల కాబోతుంది. (చదవండి: ఆ సవాల్‌ని చిత్ర పరిశ్రమ స్వీకరించాలి : ఎన్టీఆర్) ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రేస్మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో ఆలియా తన చక్కటి గాత్రంతో తెలుగు పాటను ఆలపించి అందరిని అశ్చర్యానికి గురి చేసింది. తన స్పీచ్ ను తెలుగు పాటతో క్లోజ్ చేస్తానని చెబుతూ.. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలోని ‘కేసరియా’ సాంగ్‌ని తెలుగులో అద్భుతంగా ఆలపించింది. ఆలియా స్టేజ్ మీద పాట పాడుతుంటుంటే.. వెనకాల కూర్చున్న రణ్‌బీర్ కల్లలో ఆనందం, ముఖంలో చిరునవ్వులు కనిపించాయి. కరణ్, రాజమౌళితో పాటు అక్కడ ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ ఆలియాను ప్రోత్సహించారు. తెలుగులో మాట్లాడమే కాకుండా..చక్కగా పాటను ఆలపించిన ఆలియాను అందరూ అభినందించారు. -
తెలుగు పాట పాడి అలరించిన ఆలియా
-
‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన తారక్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కాంబినేషన్లో ‘బ్రహ్మస్త్రం’ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందించారు. తెలుగులో ఈ మూవీని దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి ప్రమోట్ చేస్తున్నారు. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం రామోజీ ఫిలింసిటీలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో పార్క్ హయాత్ హోటల్‌కి మార్చారు. ఈ కార్యక్రమానికి ‘బ్రహ్మాస్త్రం’ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అక్కినేని నాగార్జున, రాజమౌళి, ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ.. ముందుగా ఇక్కడకు రావాలనుకున్న అభిమానులు రాలేకపోయినందుకు వారికి క్షమాపణలు చెప్పారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో ఆర్భాటంగా చేద్దామని అనుకున్నారని, అయితే గణేష్ బందోబస్తు ఉండడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేకపోయారన్నారు. అందుకే అభిమానుల మధ్య కోలాహలంగా ఈవెంట్ జరపడం కుదరలేదని వివరించారు. రాక్‌స్టార్ సినిమా నుంచి రణ్‌బీర్ నటనంటే తనకంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ ఒత్తిడి ఎదుర్కుంటోందని.. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారని, వారికి గుడ్ అండ్ గ్రేట్ మూవీస్‌ను ఇవ్వాలన్నారు. బ్రహ్మాస్త్రం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కి అల్ ది బెస్ట్ చెప్తూ, ఈ చిత్రం పెద్ద విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఇందులో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కీలక పాత్రలు పోషించారు. చదవండి: Brahmastra Movie Pre Release Event: బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్‌కు పోలీసుల షాక్, చివరి నిమిషంలో మార్పులు -
బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్, షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు
రణ్‌బీర్ కపూర్ బ్రహ్మాస్త్రం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు షాకిచ్చారు. ఈ రోజు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ చివరి నిమిషంలో రద్దయ్యింది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్లు హీరోహీరోయిన్లుగా నటించారు. ఇందులో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కీలక పాత్రలు పోషించారు. ఈ నెల ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో నేడు(సెప్టెంబర్ 2న) రామోజీ ఫిలిం సిటీలో ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గ్రాండ్‌గా ఏర్పాట్లు జరిగాయి. చదవండి: లైగర్ ఫ్లాప్.. ఆ వాటాతో సహా భారీ మొత్తం వెనక్కిచ్చేసిన విజయ్! అయితే చివరి నిమిషంలో ఈవెంట్‌కు తాము సెక్యూరిటీ ఇవ్వలేమని పోలీసులు చేతులెత్తాశారట. గణపతి నవరాత్రులు ఉత్సవాల్లో భాగంగా ఈ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చివరి నిమిషంలో ప్లాన్‌ను మార్చేశారు మూవీ యూనిట్. ఈ రోజు రాత్రి 8 గంటలకు బంజారాహిల్స్‌లోని పార్క్ హాయత్ హోటల్లో బ్రహ్మాస్త్రం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. కాగా ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను తెలుగులో దర్శకు ధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నాడు. సెప్టంబర్ 9న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. చదవండి: ‘పరిశ్రమలో ఎంతమంది బంధువులున్నా నటిగా కష్టపడుతూనే ఉన్నా’ -
బ్రహ్మాస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్: జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్
రణ్‌బీర్ కపూర్ నటించిన షంషేరా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా చతికిలపడింది. దీంతో తన తర్వాతి సినిమా బ్రహ్మాస్త్ర మీదే బోలెడాశలు పెట్టుకున్నాడీ హీరో. రణ్‌బీర్‌తో పాటు ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మొదటి భాగం 'బ్రహాస్త్ర: మొదటి భాగం శివ' పేరిట సెప్టెంబర్ 9న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌కు రెడీ అవుతోంది చిత్రయూనిట్. అందులో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఖరారు చేశారు. సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రీరిలీజ్ వేడుక జరుపనున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బ్రహాస్త్ర చిత్రయూనిట్ ఓ స్పెషల్ మీడియాను రిలీజ్ చేసింది. Gear up for a MASS-Traverse!🔥🔥🔥 MAN OF MASSES of Indian Cinema, @tarak9999 will be gracing the Biggest Pre-Release Event of Brahmāstra as the Chief Guest on September 2nd in Hyderabad💥 #Brahmastra #NTRforBrahmastra pic.twitter.com/grV1DgX2qY — BRAHMĀSTRA (@BrahmastraFilm) August 27, 2022 చదవండి: ఆంటీ లొల్లి.. అనసూయకు సపోర్ట్ చేసిన హీరోయిన్‌పై ట్రోలింగ్ బిగ్‌బాస్ పింకీ పెళ్లి? యాంకర్ రవి ఏమన్నాడంటే? -
విజువల్ వండర్‌గా బ్రహ్మాస్త్ర.. 'ల్యాండ్ మార్క్‌గా నిలుస్తుంది'
బ్రహ్మాస్త్ర చిత్రంపై క్రేజ్ మామూలుగా లేదు. రణ్వీర్ కపూర్, అలియాభట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్లైట్స్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించిన భారీ చిత్రం ఇది. దీనికి అయన్ ముఖర్జీ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. 3డీ ఫార్మెట్లో మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ కథా చిత్రం తొలి భాగం సెప్టెంబర్ 9వ తేదీన హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో భాగంగా బుధవారం మధ్యాహ్నం రణ్‌బీర్ కపూర్, నాగార్జున, దర్శకుడు రాజమౌళి చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్లో జరిగిన ఈ సమావేశంలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. తాను దర్శకుడిగా కాకుండా, చిత్ర సమర్పకుడిగా పాల్గొన్నానని తెలిపారు. బ్రహ్మాస్త్రం ఈ ఏడాది ఇండియన్ సినీ చరిత్రలో ముఖ్యమైన చిత్రంగా ఉంటుందన్నారు. మన పురాణ ఇతిహాసాల నుంచి తయారు చేసుకున్న కల్పిత కథా చిత్రం ఇదని చెప్పారు. ఇది చిత్ర యూనిట్ 8 ఏళ్ల శ్రమగా పేర్కొన్నారు. అస్త్రాల వివరాలను అందరికీ నచ్చే విధంగా చెప్పిన ఈ చిత్రంలో తానూ భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. నాగార్జున మాట్లాడుతూ.. దర్శకుడు అయన్ ముఖర్జీ ఒక కామిక్ పుస్తకంతో తనను కలిశారని తెలిపారు. తన పాత్ర నంది అస్త్రం నేపథ్యంగా ఉంటుందన్నారు. తనకు చిన్న తనం నుంచి ఇతిహాసాలంటే ఆసక్తి అని, ఈ నేపథ్యంలోనే ఇందులో నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. చిత్రంలో విజువల్స్ అబ్బుర పరుస్తాయన్నారు. దర్శకుడు అయన్ ముఖర్జీ 10 ఏళ్ల శ్రమ ఈ చిత్రం అన్నారు. రణ్‌బీర్ కపూర్, అలియాభట్‌లు చాలా శ్రమజీవులని ప్రశంసించారు. సినిమాను ప్రేమించేవారని, ఈ చిత్రం పెద్ద విజయం సాధించడంతో పాటు ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తాను నటించిన తొలి 3డీ చిత్రం అని ఆయన పేర్కొన్నారు. నటుడు రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్రం చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంస్కృతిని గౌరవించే సమాజంలో తాను ఈ చిత్రాన్ని తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్ర మూల కథను దర్శకుడు తనకు 10 ఏళ్ల క్రితం చెప్పారన్నారు. ఆయన ఆలోచన తనను విస్మయ పరిచిందన్నారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున వంటి గొప్ప నటులతో కలిసి నటించడం ఆనందకరం అన్నారు. చిత్ర షూటింగ్ సమయంలోనే తానూ అలియాభట్ కలుసుకున్నామని, ఇప్పుడు తమ పెళ్లి కూడా జరిగిందని, ఈ చిత్రం తనకు చాలా ముఖ్యం అని చెప్పారు. బ్రహ్మాస్త్రం కొత్త అనుభూతిని కలిగిస్తుందని రణ్‌బీర్ కపూర్ తెలిపారు. -
తొలి రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన ఆలియా..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఆలియా భట్ ఒకరు. ప్రస్తుతం పరిశ్రమలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. 2012 ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రముఖ దర్శక-నిర్మాత మహేష్ భట్ తనయగా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె నటిగా తనకంటూ సొంతగుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల తన ప్రియుడు, స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడిన ఆలియా త్వరలోనే తల్లి కాబోతోంది. చదవండి: కాబోయే భర్త అలా ఉండాలన్న సదా.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు ఇక రణ్‌బీర్-ఆలియా తొలిసారి జంటగా నటించిన బ్రహ్మస్త్రం మూవీ సెప్టెంబర్‌లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఆమె తన తొలి మూవీ రెమ్మునరేషన్ ఎంతో బయటపెట్టింది. 19 ఏళ్లకే సినిమాల్లో వచ్చిన ఆలియా తన తొలి చిత్రానికి తీసుకున్న పారితోషికం చాలా తక్కువని చెప్పింది. ఫస్ట్ మూవీకి గానూ రూ. 15 లక్షల పారితోషికం అందుకున్నానని, ఆ చెక్‌ను నేరుగా తన తల్లి సోని రజ్దాన్ ఇచ్చినట్లు చెప్పింది. అప్పుడు ఇది చాలా తక్కువ అని, తన తొలి సంపాదనతో కారు కొన్నట్లు పేర్కొంది. చదవండి: స్టార్స్ మేకోవర్, న్యూ లుక్కు.. వెరీ కిక్కు అయితే ఇప్పటికీ తన ఆర్థిక లావాదేవీలన్ని తన తల్లే చూసుకుంటుందని ఆలియా తెలిపింది. ‘నా బ్యాంక్ ఖాతాలో ఎంత నగదు ఉందనేది నేనెప్పుడు చూసుకోలేదు. నా ఖాతాలో డబ్బు బాగానే ఉందని తెలుసు. నేనే నా ఆర్థిక స్థితిని చేసుకోవాలని నా టీం ఎప్పుడూ సూచిస్తుంది. ఇక కొద్దిరోజుల్లోనే మాకు బిడ్డ రాబోతున్నాడు. ఇప్పుడైన నా ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నా. 19 సంవత్సరాలకే సినీరంగ ప్రవేశం చేసిన నేను, నా ఫస్ట్ రెమ్యునరేషన్‌తో ఓ కారును తీసుకున్నానను. 22 సంవత్సరాల వయసులోనే ఓ ఇంటిని కొనుగోలు చేశాను’ అని చెప్పుకొచ్చింది. -
ప్రెగ్నెంట్ లేడీపై అలాంటి జోకులా?.. రణ్‌బీర్‌పై నెటిజన్స్ ఫైర్
బాలీవుడ్ స్టార్ హీరో, ఆలియా భట్ భర్త రణ్‌బీర్ కపూర్‌పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఆలియా భట్‌పై అలాంటి కామెంట్ ఎలా చేస్తావని మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగిన్ బ్యూటీ మౌనీ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ వరుసగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. (చదవండి: కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ చురక, ఆమె కామెంట్స్‌పై ఘాటు స్పందన) తాజాగా రణ్‌బీర్, ఆలియా భట్, ఆయన్ ముఖర్జీ ఇన్‌స్టా లైవ్‌లో నెటిజన్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ‘బ్రహ్మాస్త్ర’సినిమాకు ఆ స్థాయిలో ప్రచారం చేయడం లేదేంటి?’అని ప్రశ్నించాడు. దీనిపై ఆలియా సమాధానం ఇస్తుండగా.. రణ్‌బీర్ మధ్యలో కలగజేసుకొని ‘మా చిత్రాన్ని ఎందుకు భారీగా ప్రమోట్ చేయడం లేదంటే ఇక్కడ ఒకరు భారీగా పెరుగుతున్నారు’అంటూ ఆలియా బేబీ బంప్వైపు చూశాడు. రణ్‌బీర్ మాటలతో ఆలియా ఒక్కసారిగా షాక్‌కు గురవ్వగా... ‘జస్ట్ జోక్ చేశా’అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు రణ్‌బీర్. అయితే ఈ విషయాన్ని ఆలియా లైట్ తీసుకుంటే.. నెటిజన్స్ మాత్రం రణ్‌బీర్‌పై మండి పడుతున్నారు. ‘రణ్‌బీర్ నీకు బుద్దుందా..? ఒక ప్రెగ్నెంట్ మహిళని బాడీ షేమింగ్ చేస్తావా?; ఆలియా కంటే పదేళ్లు పెద్ద..అయినా చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. పబ్లిక్‌లో ఇలాంటి జోకులు వేయడం ఏంటి? ఈ టైమ్‌లో ఆలియా నీకు బార్బీ బొమ్మలా కనిపించాలా? గతంలో కూడా కత్రినా గురించి హేళన చేస్తూ మాట్లాడావు.. ఇప్పుడు ఆలియాని బాడీ షేమింగ్ చేస్తున్నావు.. కొంచైమనా బుద్ది ఉండాలి’అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Ranbir Kapoor✨ (@ranbirkapoor143_) -
ఓటీటీలోకి వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ షంషేరా!
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం షంషేరా. సంజు సినిమా అనంతరం దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత రణ్‌బీర్ నటించిన మూవీ ఇది. కేజీఎఫ్ విలన్ సంజయ్‌దత్, వాణి కపూర్ ముఖ్య పాత్రలు పోషించారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం రణ్‌బీర్ కెరీర్లోనే లోయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రంగా నిలిచింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో జూలై 22న విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. మరి ఇంకెందుకాలస్యం, ఇప్పటివరకు షంషేరాను చూడకపోతే వెంటనే వీక్షించేయండి. a larger than life cinematic wonder that'll keep you on your toes throughout 🍿#ShamsheraOnPrime, watch now! https://t.co/eE88Gzl2nP #RanbirKapoor @Vaaniofficial @duttsanjay @RonitBoseRoy @saurabhshukla_s @karanmalhotra21 @yrf pic.twitter.com/LoMGKZ6jDK — prime video IN (@PrimeVideoIN) August 19, 2022 చదవండి: సీనియర్ ఎన్టీఆర్‌తో బ్రేకప్, 17 సినిమాలు వదులుకున్న హీరోయిన్! ప్రపోజల్స్‌పై సరిగమప విన్నర్ శ్రుతిక ఆసక్తిర వ్యాఖ్యలు -
ఆధ్యాత్మికం ఉట్టిపడేలా 'దేవ దేవ' పాట విడుదల
Deva Deva Song Out From Brahmastra Movie: భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా బాలీవుడ్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. రాక్ స్టార్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగిన్ బ్యూటీ మౌనీ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా ఈ సినిమాలో కనిపిస్తారని టాక్. ఇదివరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'కుంకుమల' వీడియో సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తాజాగా 'దేవ దేవ' అనే మరో పాటను విడుదల చేశారు. ప్రీతమ్ స్వరపరిచిన ఈ సాంగ్‌కు చంద్రబోస్ సాహిత్యం అందించారు. శ్రీరామ చంద్ర, జోనితా గాంధీ ఆలపించిన ఈ పాట ఆధ్యాత్మికతతో ఉల్లాసభరితంగా సాగింది. ఈ పాట గురించి 'నేను ఈ సాంగ్‌ను పూర్తిగా ఆస్వాదించాను. ఈ పాటతో ఆధ్యాత్మికంగా శక్తివంతమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ అనుభూతి పొందుతారని నేను ఆశిస్తున్నాను' అని రణ్‌బీర్ కపూర్ తెలిపాడు. 'ఈ పాటను విడుదల చేసేందుకు శ్రావణ సోమవారం కంటే మంచి సమయం ఉందని నేను అనుకోను' అని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ పేర్కొన్నాడు. కాగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. -
తొలిసారిగా బేబీ బంప్‌ను చూపించిన ఆలియా భట్
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్ ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్‌గానే ఆలియా తన ప్రెగ్నెన్సీ న్యూస్‌ను షేర్ చేసుకుంది. అయితే గర్బం దాల్చినా షూటింగ్స్‌కి ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా సినిమాలు, ప్రమోషన్స్‌లో పాల్గొంటుందీ బ్యూటీ. తాజాగా రణ్‌బీర్-ఆలియా జంటగా బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఓ సాంగ్ ప్రివ్యూ లాంచ్ కోసం ఈ ఇద్దరూ సందడి చేశారు. అయితే భర్తతో కనిపించిన ఆలియా భట్ తొలిసారిగా తన బేబీ బంప్ కనిపించేలా డ్రెస్ చేసుకుంది. ఇంతకుముందు డార్లింగ్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆలియా బేబీ బంప్ కనపడకుండా ఉండేందుకు వదులుగా ఉండే దుస్తులు వేసుకునేది. కానీ ఈసారి మాత్రం బేబీ బంప్‌ను హైలైట్ చేస్తూ దుస్తులు ధరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోట్ అవుతున్న ఈ జంటకి నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా బ్రహ్మస్త్ర సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున ఇందులో కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
స్టార్ హీరో షూటింగ్ సెట్లో భారీ అగ్ని ప్రమాదం, ఒకరు మృతి
స్టార్ హీరో షూటింగ్ సెట్లో అపసృతి చోటుచేసుకుంది. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ రంజన్’. చిన్న ముంబైలో జరిగిన ఈ మూవీ షూటింగ్లో భారీ అగ్నీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూవీ సిబ్బంది ఒకరు మృతి చెందినట్లు సమచారం. వివరాలు.. రణ్‌బీర్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ నిన్న ముంబైలోని అంధేరి చిత్రకూట్ మైదానంలో జరిగింది. చదవండి: ఒకప్పుడు సునీల్ నచ్చాడు, కానీ ఇప్పుడు కాదు: వేణు ఈ నేపథ్యంలో సెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షూటింగ్ సిబ్బంది మనీశ్ దేవాశీ(32) మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదంపై ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో హీరోహీరోయిన్లు అక్కడ లేకపోవడం వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సినిమా చూడకుండానే విషాన్ని చిమ్మారు, ద్వేషించారు: సంజయ్ దత్
నాలుగు సంవత్సరాల కష్టం.. నాలుగు రోజుల్లో బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఎంతో కష్టపడి అద్భుత కళాఖండాన్ని తీశామనుకున్న సినిమాను ఆదిరంచే ప్రేక్షకులే కరువయ్యారు. పాటలు హిట్.. కేజీఎఫ్ నటుడు సంజయ్‌దత్ విలన్.. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడు.. ఇంకేం.. సినిమా హిట్టుపో అనుకున్నారు అభిమానులు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర సినిమా బెడిసికొట్టింది. వెరసి రణ్‌బీర్ కపూర్ కెరీర్లోనే భారీ డిజాస్టర్‌గా నిలిచింది షంషేరా. కానీ అంత తేలికగా వైఫల్యాన్ని జీర్ణించుకోలేకపోతోంది చిత్రయూనిట్. ప్రాణం పెట్టి సినిమా తీశాం, ఇలాంటి ఫలితం వస్తుందని కలలో కూడా అనుకోలేదంటూ ఆవేదన చెందుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన షంషేరా సినిమా జూలై 22న థియేటర్లలో విడుదలైంది. సినిమా రిలీజై ఐదు రోజులు కావస్తున్నా ఎక్కడా పాజిటివ్ బజ్ లేదు, కలెక్షన్లు కూడా అరకొర, పైగా విమర్శలు.. దీంతో షంషేరాలో విలన్‌గా నటించిన సంజయ్ దత్ సోషల్ మీడియలో భావోద్వేగ లేఖను విడుదల చేశాడు. 'కథకు, మీకిదివరకు పరిచయం లేని పాత్రలకు జీవం పోసే కళ సినిమా. షంషేరా కూడా ఆ కోవలోకే చెందుతుంది. మా చెమట, రక్తం, కన్నీళ్లు ధారపోసి ఈ సినిమా చేశాం. దీన్ని వెండితెరపైకి తీసుకురావాలని కలగన్నాం. కానీ చాలామంది ఈ చిత్రాన్ని ద్వేషించారు. సినిమా చూడకుండానే విషాన్ని చిమ్మారు. మా కష్టాన్ని లెక్కచేయకుండా ఇలా ప్రవర్తించడం నిజంగా భయానకంగా అనిపిస్తోంది. నాలుగు దశాబ్ధాల కెరీర్లో నేను ఎంతోమందితో పనిచేశాను. అందులో కరణ్ ఓ గొప్ప డైరెక్టర్. ఒక్కో పాత్రను ఒక్కో ఆయుధంలా వాడుతాడు. మేము ఇంతకుముందు అగ్నిపథ్ చేశాం. అతడు నాకిచ్చిన కంచ చీనా పాత్ర బాగా వర్కవుట్ అయింది. నన్ను నమ్మి షంషేరాలో అవకాశం ఇచ్చాడు. సినిమా సక్సెసా? ఫెయిల్యూరా? అన్నది పక్కనపెడితే అతడు నాకు ఫ్యామిలీలో భాగమే అనిపిస్తాడు. అతడితో కలిసి పని చేయడం ఎప్పటికీ గౌరవప్రదమే! నేనెప్పుడూ అతడి వైపే నిలబడతాను షంషేరాలో వెతుకుతున్న తెగ ఎప్పటికైనా దొరుకుతుంది. కానీ అప్పటివరకు మేము కూడగట్టుకున్న జ్ఞాపకాలు, నవ్వులు, కష్టాలు, అనుబంధాలు అలాగే కొనసాగుతాయి. కరోనా వంటి ఇబ్బందులు ఎదురైనా నాలుగేళ్లుగా ఒకేతాటిపై నిల్చున్న చిత్రయూనిట్ సంకల్పానికి ఇవే నా అభినందనలు. ఈ సినిమాతో రణ్‌బీర్‌తో నాకు కలకాలం నిలిచిపోయే అనుబంధం ఏర్పడింది. ఇలాంటి టాలెంటెడ్ నటుల మీద విషం చిమ్మడానికి కాపు కాచుకుని ఎదురు చూస్తున్న వ్యక్తులను చూస్తుంటే బాధగా ఉంది' అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sanjay Dutt (@duttsanjay) Shamshera is mine! #Shamshera #Shamsheraismine pic.twitter.com/MZyCfaeHFB — Karan Malhotra (@karanmalhotra21) July 27, 2022 చదవండి: రెండో పెళ్లి, వివాహమైన ఐదు నెలలకే బిడ్డకు జన్మనిచ్చిన నటి అలా ఇంద్ర సినిమాలో నటించే ఛాన్స్ మిస్సయింది! -
Alia Bhatt: రణ్‌బీర్ జోక్ చేశాడు.. ఆ మాటల్లో నిజం లేదు
హీరోయిన్ ఆలియా భట్‌కి కవల పిల్లలు పుట్టబోతున్నారనే వార్తలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం హీరో, ఆలియా భర్త రణ్‌బీర్ మాటలే. ఇక ప్రచారంలో ఉన్న వార్త గురించి ఆలియా స్పందిస్తూ ‘ట్విన్సా.. అలాంటిదేం లేదు.. ఒక్కరే’ అంటూ క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్‌బీర్ కపూర్–ఆలియా భట్ ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయిన రెండు నెలలకు తాను తల్లి కాబోతున్నానని ప్రకటించి, సంతోషాన్ని పంచుకున్నారు ఆలియా. కాగా ఇటీవల ఒక ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న రణ్‌బీర్‌కి యాంకర్ ఓ సరదా టాస్క్ పెట్టారు. ఒక అబద్ధం, రెండు నిజాలు చెప్పాలని కోరారు. దీనికి రణ్‌బీర్ స్పందించి ‘ట్విన్స్ పుట్టబోతున్నారు’ అంటూ సమాధానం ఇచ్చి, అది నిజమా? అబద్ధమా? అనేది మీరే చెప్పుకోండి అన్నారు. ఆయన మాటలతో ఆలియాకి ట్విన్స్ పుట్టబోతున్నారనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై తాజాగా ఆలియా స్పందిస్తూ– ‘‘నాకు ట్విన్స్ పుట్టబోతున్నారంటూ రణ్‌బీర్ జోక్ చేశాడు. ఆ మాటల్లో నిజం లేదు. సరదాగా జోక్ చేస్తే జనం ఇంత సీరియస్‌గా తీసుకుంటారనుకోలేదు. నాకు ఒక్కరే పుట్టబోతున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలు, పుకార్లు వద్దు. అయినా అమ్మాయిలకు పెళ్లయితే ఒక టాపిక్, తల్లి కాబోతోందంటే ఒక టాపిక్.. ఇలా ఏదైనా టాపిక్కే. పెళ్లి, తల్లవడం అనేది వ్యక్తిగత విషయాలు. ఇవి వృత్తిపరంగా ఎలాంటి ప్రభావం చూపవు’’ అని స్పష్టం చేశారు. కాగా ఆలియా నటించిన తాజా చిత్రం ‘డార్లింగ్స్’ ఆగస్టు 5 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. -
రణ్‌బీర్‌కు ఆల్రెడీ చెప్పా.. ఒకవేళ కాదు అంటే అప్సెట్ అవుతా..
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సోమవారం ఓ ఆసక్తి విషయాన్ని వెల్లడించింది. తన భర్త రణ్‌బీర్ కపూర్ దర్శకత్వం వహించబోయే సినిమాకు తానే నిర్మాతగా ఉంటానని చెప్పింది. ఒకవేళ అందుకు రణ్‌బీర్ ఒప్పుకోకపోతే అప్సెట్ అవుతానని పేర్కొంది. ఈవిషయంపై ఇప్పటికే తన భర్తతో చర్చించినట్లు తెలిపింది. ఆలియా భట్ నటిస్తూ తొలిసారి నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం డార్లింగ్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగానే మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆలియా బదులిచ్చింది. తాను దర్శకత్వం విభాగంలో అరంగేట్రం చేయాలనుకుంటున్నట్లు, కరోనా టైంలోనే కథ కూడా సిద్ధం చేసుకున్నట్లు రణ్‌బీర్ ఇటీవల షంషేరా మూవీ ప్రమోషన్స్ సందర్భంగా వెల్లడించాడు. రచయితలను సంప్రదించి కథకు మెరుగులు దిద్దాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే రణ్‌బీర్ దర్శకత్వం వహించబోయే సినిమాలో మీరు ఉంటారా? అని ఆలియాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అందుకు ఆమె బదులిస్తూ.. ఈ విషయంపై రణ్‌బీర్‌తో ఇంతకుముందే మాట్లాడానని, నటిగా కాకపోయినా నిర్మాతగానైనా అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పింది. అందుకు రణ్‌బీర్ కూడా ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చింది. చదవండి: ‘గాడ్ ఫాదర్’లో నన్ను కాదని సల్మాన్‌ను ఎందుకు తీసుకున్నారు’ చిరును ప్రశ్నించిన ఆమిర్ -
ఓటీటీకి వచ్చేస్తున్న రణ్‌బీర్ షంషేరా మూవీ, ఎప్పుడు.. ఎక్కడంటే
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ లెటెస్ట్ మూవీ 'షంషేరా'. 'సంజు' మూవీతో అనంతరం దాదాపు నాలుగేళ్ల గ్యాప్ అనంతరం రణ్‌బీర్ నటించిన యాక్షన్ డ్రామా ఇది.ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోరపరాజయం పొందింది. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం(జూలై 22) హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో రణ్‌బీర్ కెరీర్లోనే లోయెస్ట్ ఒపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రంగా 'షంషేరా' నిలిచింది. చదవండి: లైగర్ చిత్రానికి కళ్లు చెదిరే శాటిలైట్, డిజిటల్ రైట్స్? ఎంతంటే.. దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్ కోవిడ్ అనంతరం బాలీవుడ్లో అత్యథిక థియేటర్లో రిలీజైన మూవీగా నిలిచింది. కానీ కలెక్షన్స్ రాబట్డడంలో మాత్రం వెనకడుగు వేసింది. రిలీజైన రెండు రోజుల్లో కనీసం 10కోట్ల షేర్‌ను కూడా రాబట్టలేకపోయింది షంషేరా. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ప్రేక్షకులు రాకపోవడంతో షోలను కూడా రద్దు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడులకు రెడీ అయింది. 1800 కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీకి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. చదవండి: రజనీకాంత్‌కు అరుదైన గౌరవం, తలైవాకు ఆదాయ పన్నుశాఖ అవార్డు కాగా ఈ చిత్రం ఆగస్టు రెండవ వారం నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. సాధారణంగా ఓ సినిమా రిలీజైన నెల రోజుల తర్వాతే ఓటీటీకి వస్తుంది. అలాంటిది స్టార్ హీరో అయిన రణ్‌బీర్ కపూర్ షెంషేరా మూవీ ఓటీటీకి వచ్చేందుకు నెలన్నరకుపైనే తీసుకోవాలి. కానీ డిజార్టర్గా నిలిచిన మూవీ విడుదలై నెలరోజులకు ముందే ఓటీటీకి రావడం ఆశ్చర్యం. దీని ఓటీటీ రిలీజ్‌పై దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. ఈ చిత్రంలో రణ్‌బీర్ 1800 కాలం నాటి స్వాతంత్య్ర కాంక్ష కలిగిన దోపిడి ముఠా నాయకుడిగా నటించాడు. వాణి కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించాడు. -
షంషేరా మూవీ టీం స్పెషల్ ఇంటర్వ్యూ
-
పార్వతిగా దీపికా పదుకొణె, ఏ సినిమాలో అంటే..
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. పౌరాణిక పాత్రలతో ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందిస్తున్నారు. తొలి భాగం ‘బ్రహ్మస్త్ర’: శివ’. సెప్టెంబర్ 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ దర్శకుడు రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో కనిపిస్తారు. అలాగే ఈ చిత్రం చివర్లో దీపికా పదుకోన్ అతిథి పాత్రలో కనిపిస్తారని, ఈ పాత్ర ‘బ్రహ్మస్త్ర’ రెండో భాగంలోనూ కొనసాగుతుందని సమాచారం. తొలి భాగంలో రణ్‌బీర్–ఆలియా చేసిన శివ–ఇషా పాత్రలు కీలకంగా ఉంటాయి. వీటితో పాటు రెండో భాగంలో మరో రెండు పాత్రలు మహాదేవ్–పార్వతి కూడా కీలకంగా నిలుస్తాయట. పార్వతి పాత్రకు దీపికా పదుకోన్‌ని ఎంపిక చేశారని భోగట్టా. గతంలో అయాన్ దర్శకత్వంలో ‘ఏ జవానీ హై దివానీ’ (2013)లో కథానాయికగా నటింన దీపికా ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 2 కథ విని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆమె చేయనున్న పార్వతి పాత్రకు సంబంధించి త్వరలో లుక్ టెస్ట్ జరగనుందని బాలీవుడ్ టాక్. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..
ప్రతివారం బాక్సాఫీసు వద్ద కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. అయితే సమ్మర్లో పెద్ద సినిమాలు, పాన్ ఇండియా చిత్రాలు సందడి చేయగా.. ఇప్పుడు చిన్న సినిమాలు వరుసగా థియేటర్లోకి వస్తున్నాయి. ఇక బిగ్స్క్రీన్పై వచ్చిన పలు పెద్ద సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. అలా ఈ వారం థియేటర్లో, ఓటీటీలో సందడి చేసే చిత్రాలేంటో చూద్దాం రండి! ఈ వారం థియేటర్లో సందడి చేసే చిత్రాలివే: ‘థ్యాంక్యూ’ చేప్పేందుకు వస్తున్న నాగ చైతన్య అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం 'థ్యాంక్ యూ'. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చై విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనసూయా ‘దర్జా’ సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మించారు. ఈ నెల 22న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘షంషేరా’గా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న రణ్‌బీర్ కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, వాణీ కపూర్ జంటగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘షంషేరా’. యశ్ రాజ్ ఫిలింస్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. ‘మహ’గా వస్తున్న హన్సిక హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రంలో హన్సిక నటించిన తొలి చిత్రం మహా. మదియళగన్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ సంస్థ, మాలిక్ స్ట్రీమింగ్ కార్పొరేషన్ అధినేత డత్తో అబ్దుల్ మాలిక్ నిర్మించిన ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. శింబు కీలక పాత్ర పోషిస్తుండగా శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం జూలై 22వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ‘హై ఫైవ్’ అమ్మ రాజశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం 'హై ఫైవ్'. మన్నార చోప్రా, సుధీర్, అమ్మ రాజశేఖర్, సమీర్ తదితరులు నటించిన ఈ చిత్రం జూలై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. మీలో ఒకడు శ్రీమతి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ''మీలో ఒకడు''. సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. నటులు కృష్ణ భగవాన్, సమీర్, అశోక్ కుమార్, బస్టాప్ కోటేశ్వరరావు, గబ్బర్ సింగ్ బ్యాచ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జూలై 22న థియేటర్లోకి రాబోతోంది. జగన్నాటకం మనిషి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘జగన్నా టకం’. ఆరజ్ అల్తాడ దర్శకత్వంలో పార్వతీశం, కుమారస్వామి, స్వాతి మండల్ అర్ఫితా లోహి ప్రధానా పాత్రలు పోషించారు. ఈ మూవీ జులై 22 ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. వి. కిరణ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటంటే... ట్రిబుల్ ఫన్‌తో వస్తున్న ‘ఎఫ్ 3’ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 22న ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, సోనిలివ్‌లో ఈ చిత్రం జూలై 22న నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియన్ ప్రిడెటర్ హిందీ సిరీస్ - జూలై 20 ద గ్రే మ్యాన్(తెలుగు డబ్బింగ్) - జూలై 22 యూత్ ఆఫ్ మే (కొరియన్ సిరీస్) - జూలై 22 అమెజాన్ ప్రైం కమెండెడ్ ఫర్ యూ షార్ట్‌ఫిల్మ్ విడుదల - జూలై 20 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పరంపర 2 తెలుగు సిరీస్ జూలై 21న హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆహా తొలి తెలుగు ఓటీటీలో బిగ్‌బాస్ ఫేం షణ్ముక్ జశ్వంత్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ తెలుగు సిరీస్ జూలై 22న విడుదల కానుంది. సోనీ లివ్ డాక్టర్ అరోరా(హిందీ సిరీస్) - జూలై 22 మీమ్ బాయ్స్ (తమిళ సిరీస్) - జూలై 22 ఎఫ్ 2 మూవీ - జూలై 22 -
ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను
‘‘దక్షిణాది ప్రేక్షకులు సినిమాలను ఎంతో ప్రేమిస్తారు. నేను కూడా స్ట్రైట్ తెలుగు సినిమా చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను’’ అని హీరో రణ్‌బీర్ కపూర్ అన్నారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, వాణీ కపూర్ జంటగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘షంషేరా’. యశ్ రాజ్ ఫిలింస్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న హిందీ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ– ‘‘కరణ్ మల్హోత్రాగారు ‘షంషేరా’ స్క్రిప్ట్ చెప్పగానే బాగా నచ్చేసింది. ఈ చిత్రంలో బల్లి, షంషేరా వంటి రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. సామాజిక విలువల కోసం పోరాడే వ్యక్తిగా కనిపిస్తాను. ఇలాంటి సినిమా చేయటం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. కరణ్ మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘షంషేరా’ ఫిక్షనల్ కథ. 1871లో ఓ ప్రాంతంలో జరిగిన కొన్ని ఘటలను ఆధారంగా చేసుకుని ఫిక్షనల్‌గా పాత్రలు, కథ రూపొందించాం. మా చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది’’ అన్నారు. ‘‘షంషేరా’లో శుద్ సింగ్ అనే డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు సంజయ్ దత్. ‘‘ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు ‘షంషేరా’లోని పాత్ర పూర్తి భిన్నమైనది. నా పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’’ అన్నారు వాణీ కపూర్.