
రామాయణం ఆధారంగా హిందీలో దర్శకుడు నితీష్ తివారి ఓ భారీ బడ్జెట్ ట్రయాలజీ ఫిల్మ్‌ను తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లుగా జరుగు తున్న ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ తుది దశకు చేరుకున్నాయి. దీంతో నితీష్ తివారి ఈ సినిమాలోని నటీనటుల ఎంపికపై దృష్టి సారించారు. ఈ సినిమాలోని రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, హనుమంతునిగా బాబీ డియోల్, విభూషణుడిగా విజయ్ సేతుపతి, రావణుడిగా యశ్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది.
తాజాగా శూర్పణఖ పాత్రలో రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. రకుల్‌కు ఆల్రెడీ నితీష్ స్టోరీ చెప్పారని, లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని టాక్. కాగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన ఈ వేసవిలో రానుందని, 2025 చివర్లో తొలి భాగం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ టాక్. మరోవైపు ఈ నెలలో రకుల్‌ప్రీత్ సింగ్ వివాహం జాకీ భగ్నానీతో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment