రణబీర్, అలియా కొత్త ఇల్లు రూ. 250 కోట్లు.. వారిద్దరి పేరుతో రిజిస్ట్రేషన్‌ | Ranbir Kapoor And Alia Bhatt's New House Registered On This Two Persons | Sakshi
Sakshi News home page

రణబీర్, అలియా కొత్త ఇల్లు రూ. 250 కోట్లు.. వారిద్దరి పేరుతో రిజిస్ట్రేషన్‌

Published Thu, Oct 24 2024 11:01 AM | Last Updated on Thu, Oct 24 2024 11:18 AM

Ranbir Kapoor And Alia Bhatt's New House Registered On This Two Persons

జీవితంలో ప్రతి ఒక్కరూ సొంతింటి కోసం చాలా కలలు కంటారు. ఈ విషయంలో సినిమా సెలబ్రిటీలు కూడా ఇంకాస్త ఎక్కువగానే ఆలోచిస్తారు. బాలీవుడ్‌ జంట రణబీర్ కపూర్, అలియా భట్‌ల ఇల్లు ఎట్టకేలకు పూర్తి అయింది. సుమారు రెండేళ్లుగా ఈ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా నడిబొడ్డున ఉన్న ఈ కొత్త ఇంట్లోకి వారు షిఫ్ట్‌ కానున్నారు. సుమారు రూ. 250 కోట్ల విలువ చేసే ఈ ఆస్తిని తన కూతురు రాహా కపూర్‌ పేరుతో పాటు ఆయన అమ్మగారు నటి నీతూ కపూర్ పేరుతో రిజిస్టర్‌ చేయించారని తెలుస్తోంది.

బాలీవుడ్‌ నివేదికల ప్రకారం రణబీర్,  అలియా నవంబర్‌ నెలలో కొత్త ఇంటిలోకి షిఫ్ట్‌ కానున్నారని తెలుస్తోంది. అదే నెలలో తమ కుమార్తె రెండో పుట్టినరోజు జరుపుకోనుంది. ఆ వేడుకలు అక్కడే జరుపుకోవాలని వారు ప్లాన్‌ చేస్తున్నారట.  ఆరు అంతస్తులు ఉన్న ఆ భవనంలో ఎంతో ఖరీదైన ఫర్నీచర్‌తో పాటు ఇండోర్‌ స్విమ్మింగ్ పూల్, జిమ్‌ అందుకు ఉన్నాయట. రణబీర్, అలియా భట్,  నీతూ కపూర్ గత కొన్ని నెలలుగా భవన నిర్మాణ స్థలంలో తరచుగా కనిపించారు.

ఇప్పటికే అలియా పేరు మీద మూడు విల్లాలు ఉన్నాయి. అవి కూడా దాదాపు రూ. 100 కోట్లు విలువ చేస్తాయని తెలుస్తోంది. అయితే, రణబీర్‌ కపూర్‌కు వారసత్వంగా వచ్చిన ఆస్తి ఎక్కువగా తన తల్లి నీతూ కపూర్ పేరు మీదే ఉంది. ఆమె  భర్త దివంగత రిషి కపూర్ తన ఆస్తులన్నింటికి సగం యజమానిగా ఆమెను నియమించారు. దీంతో రణబీర్‌ కూడా రూ. 250 కోట్ల తన కొత్త ఇంటిని కూతరు రాహా, నీతూ కపూర్‌ పేరు మీద రిజస్టర్‌ చేయించారు.

యానిమల్‌ సినిమాతో రణబీర్‌ కపూర్‌ భారీ విజయం అందుకున్నారు. తన కొత్త సినిమా 'రామాయణ' కోసం ఆయన కసరత్తులు ప్రారంభించారు.  మూడు భాగాలుగా దీన్ని విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. తొలి పార్ట్‌ను 2025 దీపావళికి తీసుకురానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. జిగ్రాలో కనిపించిన అలియా భట్ తన రాబోయే చిత్రం సంజయ్ లీలా బన్సాలీ  'లవ్ అండ్ వార్‌'లో విక్కీ కౌశల్ సరసన నటించడానికి సిద్ధమవుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement