House Purchase
-
అందుబాటు ధరల్లో ఇళ్లు... విలువ రూ. 67 లక్షల కోట్లు
దేశంలో 2030 నాటికి దాదాపు రూ.67 లక్షల కోట్లు విలువ చేసే గృహాల కొరత ఉండబోతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని వర్గాల ప్రజలకు 3.12 కోట్ల కొత్త ఇళ్లు అవసరం అవుతాయని ఇండస్ట్రీ బాడీ సీఐఐ, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా బుధవారం జరిగిన ఒక సమావేశంలో సంయుక్తంగా ‘అఫర్డబుల్ హౌసింగ్ ఇన్ ఇండియా’ నివేదికను విడుదల చేశాయి.నివేదికలోని వివరాల ప్రకారం..పెరుగుతున్న పట్టణీకరణ, ఉపాధి అవకాశాల వల్ల 2030 నాటికి దేశంలోని వివిధ పట్టణ కేంద్రాల్లో 2.2 కోట్ల గృహాలు అవసరం అవుతాయి.ఇందులో 2.1 కోట్ల గృహాలు(95.2 శాతం) ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి అందుబాటులో ఉండాలి.ప్రస్తుతం 1.1 కోట్ల యూనిట్ల ఇళ్ల కొరత ఉంది. మొత్తంగా 2030 నాటికి వీటి డిమాండ్ 3.2 కోట్లకు చేరనుంది.ఈమేరకు దేశవ్యాప్తంగా దాదాపు రూ .67 లక్షల కోట్ల రియల్టీ వ్యాపారం జరుగుతుందని అంచనా.ప్రస్తుతం గృహాల కొనుగోలు రుణ మార్కెట్ విలువ రూ.13 లక్షల కోట్లుగా ఉంది. అందులో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీ) రూ.6.9 లక్షల కోట్లు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీ) రూ .6.2 లక్షల కోట్ల రుణ విలువను కలిగి ఉన్నాయి.భవిష్యత్తులో వివిధ ఆర్థిక సంస్థలు అందజేసే గృహ రుణ వాటా మరింత పెరగనుంది.కొత్తగా ఇళ్లు కొనేవారు దాదాపు 77 శాతం మంది 2030 నాటికి రుణాలు తీసుకుంటారని అంచనా.మొత్తం రూ.67 లక్షల కోట్ల మార్కెట్లో దాదాపు రూ.45 లక్షల కోట్లు బ్యాంకులు, హెచ్ఎఫ్సీలు ప్రజలకు ఫైనాన్సింగ్ ఇచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: గగనతలంలో 17 కోట్ల మంది!నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ..‘2030 నాటికి దేశంలో పెద్దమొత్తంలో గృహాలు అవసరం అవుతాయి. అప్పటివరకు చాలా ఇళ్ల కొరత కూడా ఏర్పడనుంది. ప్రధానంగా పట్టణ కేంద్రాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటికి డిమాండ్ ఏర్పడుతుంది’ అన్నారు. -
హైదరాబాద్‌లో రియల్టీ జోరు!
హైదరాబాద్‌లో గృహ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దేశంలోని ఏడు మెట్రో నగరాల్లోని ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ వాటా 12 శాతంగా ఉంది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ3)లో నగరంలో 12,700 గృహాలు అమ్ముడుపోగా.. 13,900 యూనిట్లు సిద్ధం అయ్యాయి. క్యూ2తో పోలిస్తే విక్రయాలు 16 శాతం క్షీణించగా.. కొత్తగా సిద్ధమైనవి ఒక శాతం పెరిగాయని అనరాక్ తాజా అధ్యయనం వెల్లడించింది.గృహ విక్రయాల్లో పశ్చిమ హైదరాబాద్ హవా కొనసాగుతోంది. క్యూ3లో అమ్ముడైన ఇళ్లలో 53 శాతం వెస్ట్ జోన్లోనే జరిగాయి. ఆ తర్వాత నార్త్‌లో 28 శాతం, సౌత్‌లో 13 శాతం, ఈస్ట్‌లో 4 శాతం, సెంట్రల్ హైదరాబాద్‌లో ఒక శాతం విక్రయాలు జరిగాయి. నగరంలో అపార్ట్మెంట్ల చదరపు అడుగు ధర సగటున రూ.7,150లుగా ఉన్నాయి.లక్ష దాటిన ఇన్వెంటరీ..హైదరాబాద్‌లో తొలిసారిగా ఇన్వెంటరీ లక్ష యూనిట్లను దాటింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి నగరంలో 1.01 లక్షల గృహాల ఇన్వెంటరీ ఉంది. దేశంలోని ఇన్వెంటరీలో 18 శాతం నగరానిదే. అత్యధికంగా పశ్చిమ హైదరాబాద్‌లో 60 శాతం, నార్త్‌లో 25 శాతం ఇన్వెంటరీ ఉంది.3–5 శాతం ధరల వృద్ధి..నగరంలో మూడు నెలల్లో గృహాల అద్దెలు 1–4 శాతం, అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకు ధరలు 3–5 శాతం మేర పెరిగాయి. ఆదిభట్లలో చ.అ. ధర సగటు రూ.4,650, ఎల్బీనగర్లో రూ.6,800, మియాపూర్‌లో 6,700, కొండాపూర్‌లో రూ.8,600, గచ్చిబౌలీలో రూ.8,900లుగా ఉన్నాయి. ఇక అద్దెలు డబుల్, ట్రిపుల్ బెడ్ రూమ్‌లకు నెలకు ఆయా ప్రాంతాల్లో రూ.14 వేల నుంచి రూ.42 వేలుగా ఉన్నాయి.ఇదీ చదవండి: మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!లగ్జరీ గృహాలే ఎక్కువ..నగరంలో క్యూ3లో 13,900 యూనిట్లు సిద్ధం కాగా.. లగ్జరీ గృహాలు అత్యధికంగా ఉన్నాయి. రూ.1.5 కోట్లకు పైగా ధర ఉన్న ప్రీమియం ఇళ్ల వాటా 60 శాతంగా ఉంది. విభాగాల వారీగా చూస్తే.. రూ.40–80 లక్షల ధర ఉన్న గృహాల వాటా మూడు శాతం, రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల ఉన్న యూనిట్ల వాటా 37%, రూ.1.5–2.5 కోట్ల ధర ఉన్న ఇళ్ల వాటా 40%, రెండున్నర కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న యూనిట్ల వాటా 20 శాతంగా ఉంది. -
నెలలో 5.9 శాతం తగ్గిన ఇళ్ల ధరలు!
చైనాలో కొత్త ఇళ్ల ధరలు భారీగా తగ్గుతున్నాయి. గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈసారి గృహాల ధరలు 5.9 శాతం క్షీణించాయి. అంతకుముందు సెప్టెంబర్‌లో ఇది 5.8 శాతం పడిపోయింది. వరుసగా గత 16 నెలల నుంచి కొత్త ఇళ్ల ధరలు తగ్గుతుండడం గమనార్హం. 2015 అక్టోబర్ నెలతో పోలిస్తే ఏడాది ప్రాతిపదికన గత తొమ్మిదేళ్లుగా వీటి ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. అయితే చైనా ప్రభుత్వం వీటి ధరలను స్థిరీకరించేందుకు ప్రయత్నిస్తుందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) డేటా ఆధారంగా రాయిటర్స్ నివేదించింది.ఎన్బీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. చైనాలోని ప్రధాన నగరాలతోపాటు టైర్ 2, టైర్ 3 పట్టణాల్లోనూ రియల్ఎస్టేట్ వ్యాపారం భారీగా తగ్గిపోయింది. దాంతో కొత్త ఇళ్ల ధరలు క్షీణిస్తున్నాయి. అయితే సమీప భవిష్యత్తులో ఇది మారనుంది. రానున్న రోజుల్లో గృహాల ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందని 75.9% మంది అభిప్రాయపడుతున్నారు. ఇటీవల చేసిన సర్వేలో 70 నగరాల్లో కేవలం మూడింటిలో మాత్రమే అక్టోబర్ నెలలో గృహాల ధరలు పెరిగాయి.ఇదీ చదవండి: మరిన్ని జిల్లాల్లో ‘తప్పనిసరి హాల్‌మార్కింగ్’చైనాలోనే అతిపెద్ద కంపెనీగా పేరున్న రియల్ఎస్టేట్ సంస్థ ఎవర్‌గ్రాండ్ గ్రూప్ 2021లో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దాని ప్రభావం చైనాపై బలంగానే ఉంది. ఆ సంక్షోభం తర్వాత చైనా ప్రాపర్టీ సెక్టార్‌కు మద్దతుగా కొన్ని విధానాలు ప్రవేశపెట్టింది. ఈ విధానాల ప్రభావం త్వరలో చూడబోతున్నామని ప్రభుత్వం తెలిపింది. రానున్న రోజుల్లో ప్రాపర్టీ మార్కెట్ స్థిరీకరించబడుతుందని ధీమా వ్యక్తం చేసింది. -
రణబీర్, అలియా కొత్త ఇల్లు రూ. 250 కోట్లు.. వారిద్దరి పేరుతో రిజిస్ట్రేషన్
జీవితంలో ప్రతి ఒక్కరూ సొంతింటి కోసం చాలా కలలు కంటారు. ఈ విషయంలో సినిమా సెలబ్రిటీలు కూడా ఇంకాస్త ఎక్కువగానే ఆలోచిస్తారు. బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, అలియా భట్ల ఇల్లు ఎట్టకేలకు పూర్తి అయింది. సుమారు రెండేళ్లుగా ఈ ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా నడిబొడ్డున ఉన్న ఈ కొత్త ఇంట్లోకి వారు షిఫ్ట్ కానున్నారు. సుమారు రూ. 250 కోట్ల విలువ చేసే ఈ ఆస్తిని తన కూతురు రాహా కపూర్ పేరుతో పాటు ఆయన అమ్మగారు నటి నీతూ కపూర్ పేరుతో రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది.బాలీవుడ్ నివేదికల ప్రకారం రణబీర్, అలియా నవంబర్ నెలలో కొత్త ఇంటిలోకి షిఫ్ట్ కానున్నారని తెలుస్తోంది. అదే నెలలో తమ కుమార్తె రెండో పుట్టినరోజు జరుపుకోనుంది. ఆ వేడుకలు అక్కడే జరుపుకోవాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఆరు అంతస్తులు ఉన్న ఆ భవనంలో ఎంతో ఖరీదైన ఫర్నీచర్‌తో పాటు ఇండోర్ స్విమ్మింగ్ పూల్, జిమ్ అందుకు ఉన్నాయట. రణబీర్, అలియా భట్, నీతూ కపూర్ గత కొన్ని నెలలుగా భవన నిర్మాణ స్థలంలో తరచుగా కనిపించారు.ఇప్పటికే అలియా పేరు మీద మూడు విల్లాలు ఉన్నాయి. అవి కూడా దాదాపు రూ. 100 కోట్లు విలువ చేస్తాయని తెలుస్తోంది. అయితే, రణబీర్ కపూర్‌కు వారసత్వంగా వచ్చిన ఆస్తి ఎక్కువగా తన తల్లి నీతూ కపూర్ పేరు మీదే ఉంది. ఆమె భర్త దివంగత రిషి కపూర్ తన ఆస్తులన్నింటికి సగం యజమానిగా ఆమెను నియమించారు. దీంతో రణబీర్ కూడా రూ. 250 కోట్ల తన కొత్త ఇంటిని కూతరు రాహా, నీతూ కపూర్ పేరు మీద రిజస్టర్ చేయించారు.యానిమల్ సినిమాతో రణబీర్ కపూర్ భారీ విజయం అందుకున్నారు. తన కొత్త సినిమా 'రామాయణ' కోసం ఆయన కసరత్తులు ప్రారంభించారు. మూడు భాగాలుగా దీన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తొలి పార్ట్‌ను 2025 దీపావళికి తీసుకురానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. జిగ్రాలో కనిపించిన అలియా భట్ తన రాబోయే చిత్రం సంజయ్ లీలా బన్సాలీ 'లవ్ అండ్ వార్'లో విక్కీ కౌశల్ సరసన నటించడానికి సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ధరెంతైనా.. ఖరీదైన ఇళ్లను ఎగబడి కొనుగోలు చేస్తున్న భారతీయులు
భారతీయలు లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ గ్రూప్ నివేదిక ప్రకారం.. మన దేశంలో విక్రయించే లగ్జరీ గృహాల వాటా గత ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగింది.శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం విలాసవంతమైన గృహాల విలువ కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉన్నట్లు తెలింది. భారత్‌లోని తొలి ప్రధాన ఏడు నగరాల్లో ఈ ఏడాది జనవరి- మార్చి (మొదటి త్రైమాసికం)లో విక్రయించిన రెసిడెన్షియల్ యూనిట్లు 21 శాతంగా ఉన్నాయి. 2019లో ఇదే కాలానికి 7శాతం మాత్రమే విక్రయించినట్లు నివేదిక హైలెట్ చేసింది. బలమైన ఆర్థిక వృద్ధి, ప్రవాస భారతీయుల నుండి డిమాండ్ కారణంగా భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. వెరసి ఈ ఏడాది ప్రారంభంలో డీఎల్ఎఫ్ కంపెనీ న్యూఢిల్లీకి సమీపంలో 1,100 కంటే ఎక్కువ గృహాలు నిర్మాణాన్ని ప్రారంభించక ముందే మూడు రోజుల్లో అమ్ముడయ్యాయి. వీటిలో అధిక భాగం ఎన్ఆర్ఐలు కొనుగోలు చేశారు. బడ్జెట్ ధరలో లభ్యమయ్యే ఇళ్లు అదే కాలంలో అమ్మకాల వాటా 37శాతం నుండి 18శాతానికి క్షీణించాయి. మధ్య శ్రేణి, ప్రీమియం హౌసింగ్ సెగ్మెంట్లో 4 మిలియన్ నుంచి 15 మిలియన్ మధ్య ధర కలిగిన గృహాలు దాదాపు 59 శాతం వాటాతో అత్యధికంగా అమ్ముడు పోయినట్లు అనరాక్ నివేదిక హైలెట్ చేసింది. -
ఇల్లు కాదు పాముల పుట్ట, సామాను సర్దేలోగా.. సంతోషం ఆవిరి
ఒకటి కాదు, రెండు కాదు.. పదేళ్లు పైసా పైసా కూడబెట్టి ఇల్లు కొనుక్కొంది ఓ మహిళ. తన కలల సౌధం ఎలా ఉండాలన్నదానిపై అన్ని జాగ్రత్తలు చెప్పింది. తీరా ఇంట్లోకి వెళ్లిన తర్వాత సీన్ రివర్సయింది. అమెరికాలోని కొలరాడోలో ఉండే ఓ మహిళ పేరు అంబర్ హాల్. ఆమెకు ఇద్దరు పిల్లలు. సింగిల్ మదర్ కావడంతో ఖర్చులన్నీ తగ్గించుకుని ఇంటి కోసం ప్రయత్నించింది. నాలుగు బెడ్ రూంలు, ఓ చిన్న లాన్, అవసరాలకు సరిపడా కాసింత చోటు.. వీటి కోసం గాలించగా.. చివరికి ఓ ఇల్లు దొరికింది. ఏప్రిల్‌లో దీనికి సంబంధించిన డబ్బంతా కట్టి నాలుగు రోజుల కింద లగేజీ తీసుకుని వచ్చింది. తన వెంట రెండు లాబ్రాడార్ కుక్కలు కూడా ఉన్నాయి. ఇంకా ఫర్నీచర్ కూడా సెట్ చేయలేదు. అంతలోనే కుక్కలు మొరగడంతో అనుమానం వచ్చింది అంబర్ హాల్‌కు. క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే.. ఓ పాము కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్లి చూస్తే మరికొన్ని పాములు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏ గోడ తవ్వినా పామే. ఏ మూల చూసినా పామే. చిన్నవి కొన్ని, పెద్దవి కొన్ని. కొంత ధైర్యం చేసి స్నేక్ క్యాచర్లను పిలవగా ఇప్పటివరకు దాదాపు 40 పాములను పట్టుకెళ్లారు. ఇంకో చోటికి వెళదామంటే ఖర్చులు భరించలేని పరిస్థితి. అందుకే ఎన్ని కష్టాలు ఎదురయినా అదే ఇంట్లో ఉంటోంది అంబర్ హాల్. A first-time homeowner was shocked when she found as many as 30 snakes "coming out of every hole and crevice" of her new house. pic.twitter.com/dthRHno5n6 — CNN (@CNN) May 14, 2023 ఇప్పటికీ రోజూ ఏదో ఓ చోట పాము కనబడుతూనే ఉంది. ఇంట్లో రోజూ పాములను పట్టడం దగ్గరున్న అడవిలో వదిలేయడం జరుగుతోంది. ఈ ఇంటికి సమీపంలో ఒకప్పుడు చిన్నపాటి మడుగు ఉండేదట. అక్కడ బోలెడు పాములుండేవట. బహుశా అవే పాములు ఈ ఇంటికి వరుస కట్టి ఉంటాయని అంచనా వేస్తున్నారు. తన దీనస్థితిని అర్థం చేసుకుని సాయం చేసేందుకు ముందుకు రావాలని అంబర్ హాల్ కోరుతున్నారు. కనీసం ఆ మడుగుపై కాంక్రీట్ స్లాబ్ వేయగలిగితే పాముల బెడద తప్పుతుందన్నది అంబర్ ఆశ. -
హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియాలోనే ఇల్లు కావాలి!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఎప్పటినుంచో వెస్ట్జోన్కే ఎంతో డిమాండ్ ఉంది. పలు ఐటీ సంస్థలతోపాటు అక్కడి సదుపాయాల వల్ల ప్రజలు అటువైపే స్థిరనివాసాలకు మొగ్గుచూపేవారు. అయితే గత రెండేళ్లుగా మధ్యతరగతి ప్రజలు ఈస్ట్‌జోన్‌లో ఇళ్లు కట్టుకొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ జోన్‌కు దగ్గర్లో పలు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నందున పిల్లల చదువుల కోసం నగరానికి వచ్చేవారు, దాదాపు రెండు గంటల ప్రయాణ సమయం పట్టే ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, ఈస్ట్‌జోన్‌లోని సంస్థల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకుంటున్నారు. ఏడాదికాలంలో జీహెచ్ఎంసీ జారీ చేసిన భవన నిర్మాణ అనుమతులు సైతం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. వెస్ట్‌జోన్‌తో పోలిస్తే భూముల ధరలు తక్కువ ఉండటమే ప్రధాన కారణం. అలాగే ఇటీవల పలు ఫ్లైఓవర్లు అందుబాటులోకి రావడంతోపాటు యాదాద్రి, వరంగల్, నల్లగొండ, విజయవాడలకు వెళ్లే హైవేలు, మెట్రో సదుపాయం ఉండటంతో నివాస గృహాలకు ఎక్కువ మంది ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ లుక్ ఈస్ట్.. నినాదం కూడా పలువురిని ఆకట్టుకుంటోంది. ఏడాది కాలంలో జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో 11 వేల భవన నిర్మాణాలకు అనుమతులివ్వగా ఈస్ట్‌జోన్‌లోని హయత్‌నగర్ సర్కిల్లోనే అత్యధికంగా 1,722 ఉన్నాయి. ఈ జోన్‌లోని ఉప్పల్, కాప్రా సర్కిళ్లలో అత్యధిక భవనాలకు అనుమతులిచ్చారు. ఐదంతస్తుల వరకు నివాస భవనాల్లోనూ దాదాపు 2 వేల భవనాలకు అనుమతులివ్వగా ఈస్ట్ జోన్లోనే అత్యధికంగా 600 వరకు ఉన్నాయి. అందుబాటులో ధరలు.. ఈస్ట్‌జోన్‌లో భూముల ధరలు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉన్నాయి. హైక్లాస్ భవనాలైనా ఎస్ఎఫ్టీకి రూ. 5వేల లోపే లభిస్తున్నాయి. – శ్రీనివాస్‌రెడ్డి, బిల్డర్, ఉప్పల్ సదుపాయాలు బాగున్నాయి ఇళ్లు నివాసయోగ్యంగా ఉండటంతోపాటు ఇక్కడి నుంచి ఏ ప్రాంతంవైపు వెళ్లాలన్నా సౌకర్యాలు బాగుండటంతో ఇటీవలే ఇల్లు కట్టుకున్నాం. – బాలచందర్, ఉప్పల్ రవాణా సౌకర్యాలున్నాయి ఎల్బీనగర్ ప్రాంతం తెలంగాణలోని పలు జిల్లాలతోపాటు ఏపీవాసులకు ముఖద్వారంగా ఉంది. మెట్రో అనుసంధానంతోపాటు ఫ్లైఓవర్ల వల్ల ట్రాఫిక్ సమస్యల్లేవు. రాబోయే రోజుల్లో ఎల్బీనగర్ మరో గచ్చిబౌలిలా మారొచ్చు. – స్వప్నారెడ్డి, గృహిణి, సహారా ఎస్టేట్స్ కాలనీ, మన్సూరాబాద్ చదవండి: అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై ప్రత్యేక కేంద్రం -
రీసేల్ ప్రాపర్టీలను కొంటున్నారా? అయితే ఇది మీకోసమే!
సాక్షి, హైదరాబాద్: రీసేల్ ప్రాపర్టీలను కొనేవారైతే వర్షాకాంలో ఆయా ప్రాపర్టీలను స్వయంగా పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే వానల్లోనే ప్రాపర్టీ నిర్వహణ ఎలా ఉందో అవగతమవుతుంది. గోడల ధృడత్వం, డ్రైనేజీ, పంబ్లింగ్ లీకేజీలు వంటివి తెలుసుకునే వీలుంటుంది. ప్రాపర్టీ లోతట్టు ప్రాంతంలో ఉందా? వరదలు ఎక్కువగా వచ్చే అవకాశముందా అనేది తెలుస్తుంది. వరద నీరు భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు ఉన్నాయా? లేక అపార్ట్మెంట్ సెల్లార్ నీటిలో మునిగిపోతుందా? అనేది తెలుస్తుంది. వర్షాకాలంలో గృహ కొనుగోళ్లు అంతగా జరగవు. కాబట్టి ఇలాంటి సమయంలో నిజమైన గృహ కస్టమర్లు వచ్చినప్పుడు వారిని డెవలపర్లు స్వాగతిస్తారు. -
హైదరాబాద్‌లో చెలరేగిపోతున్న రియల్టీ,గృహ విక్రయాల్లో సరికొత్త రికార్డ్‌లు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్టీ తగ్గేదేలే అన్నట్లు చెలరేగిపోతుంది. గృహ విక్రయాలు, లాంచింగ్‌లో రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి – జూన్ (హెచ్1)లో ఇళ్ల అమ్మకాలు 11ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. కరోనా కారణంగా పెరిగిన ఐటీ నియామకాలు, ఉద్యోగులలో ఆదాయ వృద్ధితో గృహ విక్రయాలు ఊపందుకున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడించింది. 2022 హెచ్1లో నగరంలో 14,693 గృహాలు అమ్ముడుపోగా.. 21,356 యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. ♦ నగర సిరాస్తి మార్కెట్‌కు ఆయువు పట్టు ఐటీ రంగమే. గృహాలు, ఆఫీస్ స్పేస్ ఏదైనా ఐటీ నిపుణులను లక్ష్యంగా చేసుకొనే నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను చేపడుతుంటాయి. వారి అభిరుచులకు అనుగుణంగా ఉండే ఇళ్ల విక్రయాలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. కరోనా కారణంగా ఐటీ కంపెనీలకు విపరీతమైన ప్రాజెక్ట్‌లు వచ్చాయి. దీంతో కొత్త ఉద్యోగుల నియామకాలు పెద్ద ఎత్తున జరగడంతో వారందరూ వారి వారి బడ్జెట్లో ఇళ్లను కొనుగోలు చేశారని నైట్‌ఫ్రాంక్ హైదరాబాద్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థూర్ తెలిపారు. పశ్చిమానిదే హవా.. 2021 హెచ్1తో పోలిస్తే ఈ ఏడాది హెచ్1లో గృహ విక్రయాలలో 23 శాతం, లాంచింగ్స్‌లో 28 శాతం వృద్ధి నమోదయింది. అత్యధికంగా పశ్చిమ హైదరాబాద్‌లోని ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో 9,112 యూనిట్లు అమ్ముడుపోగా.. నార్త్‌లో 2,615, సెంట్రల్లో 835, ఈస్ట్‌లో 1,363, దక్షిణంలో 768 గృహాలు విక్రయమయ్యాయి. 4.2 శాతం పెరిగిన ధరలు.. ఏడాది కాలంలో నగరంలో ప్రాపర్టీ ధరలలో 4.2 శాతం వృద్ధి నమోదయింది. ప్రస్తుతం ధర చ.అ. సగటు రూ.4,918గా ఉంది. అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) గతేడాది హెచ్1లో 11918 యూనిట్లుగా ఉండగా.. 2022 హెచ్1 నాటికి 25262లకు పెరిగాయి. వీటి విక్రయానికి 4.60 త్రైమాసికాల సమయం పడుతుంది. కోలుకుంటున్న ఆఫీస్ స్పేస్ హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ కరోనా కంటే ముందు స్థాయికి చేరుకుంటుంది. 2019 హెచ్1లో నగరంలో 38 లక్షల చ.అ. ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరగగా.. ఈ ఏడాది హెచ్1 నాటికి 32 లక్షల చ.అ.లకు చేరింది. అయితే గతేడాది హెచ్1లో జరిగిన 16 లక్షల చ.అ.లతో పోలిస్తే ఇది 101 శాతం ఎక్కువ. 2015 నుంచి ఇప్పటివరకు నగరంలో అత్యధిక ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగిన అర్ధ సంవత్సరం 2019 హెచ్2నే. ఆ సమయంలో రికార్డ్ స్థాయిలో 89 లక్షల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు పూర్తయ్యాయి. 2022 హెచ్1లో జరిగిన ఆఫీస్ స్పేస్ ట్రాన్సాక్షన్స్లో బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగానిదే పైచేయి. 2021 హెచ్1లో ఈ రంగం వాటా 12 శాతంగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 22 శాతానికి పెరిగింది. మిగిలిన రంగాల వాటా చూస్తే ఐటీ 39 శాతం, కో–వర్కింగ్ స్పేస్ 6 శాతం, తయారీ రంగం 3 శాతం, ఇతర సేవల రంగాల వాటా 30 శాతంగా ఉన్నాయి. ♦ అదే సమయంలో కొత్త ఆఫీస్ స్పేస్ నిర్మాణాలలో కూడా వృద్ధి నమోదయింది. గతేడాది హెచ్1లో కేవలం 80 వేల చ.అ. ఆఫీస్ స్పే స్ అందుబాటులోకి రాగా.. ఈ ఏడాది హె చ్1 నాటికి 53 లక్షల చ.అ. స్థలం నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం నగరంలో చ.మీ. ఆఫీస్ స్పేస్ అద్దె రూ.63.7గా ఉంది. -
పిల్లల కోసం అదిరిపోయే లగ్జరీ ఇళ్లు..హైదరాబాద్‌లో ఎక్కడో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఆర్క్ గ్రూప్ మరో సరికొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. పిల్లలలో మానసిక, శారీరక ఎదుగుదలకు దోహదపడేలా వెంచర్ డిజైన్‌ను రూపొందించింది. ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆసుపత్రులు, షాపింగ్ కేంద్రాలకు నిలయంగా ఉన్న బాచుపల్లిలో సంయక్ పేరిట ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. 1.9 ఎకరాలలో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో రెండు టవర్లు, ఒక్కోటి పదంతస్తుల్లో ఉంటుంది. మొత్తం 160 ఫ్లాట్లుంటాయి. 1,315 నుంచి 1,760 చ.అ. మధ్య 2, 2.5, 3 బీహెచ్‌కే విస్తీర్ణాలుంటాయి. 7,250 చ.అ. విస్తీర్ణంలో నాలుగు అంతస్తులలో క్లబ్‌హౌస్ ఉంటుంది. ఈ సందర్భంగా ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి మాట్లాడుతూ.. నాణ్యత, భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. కామన్ ఏరియాలలో సౌర శక్తితో నడిచే ఉత్పత్తులను వినియోగించాం. ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లు, విద్యుత్‌ను ఆదా చేసే లైటెనింగ్ ఫిక్చర్లను అందుబాటులో ఉంచామని’ వివరించారు. సంయక్ ప్రాజెక్ట్‌కు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గోల్డ్ రేటింగ్ పొందిందని తెలిపారు. పిల్లలు వైట్ పేపర్లాంటోళ్లు.. అనంతరం సీఈఓ గుమ్మి మేఘన మాట్లాడుతూ.. వైట్ పేపర్‌పై అందమైన కళాకృతులను తీర్చిదిద్దాలంటే అందమైన క్రెయాన్స్ లేదా రంగులు ఉండాలి. అలాగే చిన్నతనం నుంచే పిల్లలలో మానసిక ఎదుగుదలకు అనుమైన సదుపాయాలు, మౌలిక వసతులను కల్పిస్తే అద్బుతాలు సృష్టిస్తారని తెలిపారు. అలాగే చిన్నారుల రక్షణ కోసం అన్ని రకాల సాంకేతిక భద్రతా ఏర్పాట్లుంటాయి. స్విమ్మింగ్ పూల్ అలారం, సేఫ్టీ ఎలక్ట్రిక్ సాకెట్, రౌండ్ కార్నర్ వాల్స్, గేమింగ్ ల్యాండ్ స్కేప్, కిడ్స్ ప్లే సెంటర్, కిడ్స్ అవుట్డోర్ జిమ్, బెడ్రూమ్, బాత్రూమ్లలో సెన్సార్లు, వినైల్ ఫ్లోర్ వంటివి ఏర్పాట్లుంటాయని వివరించారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లంబింగ్ పిక్చర్స్ వంటి వసతులు కూడా ఉంటాయి. చదవండి: హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు..ఎక్కువగా ఇళ్లు కొంటున్న ప్రాంతాలివే! -
హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఇళ్లు, హైదరాబాద్‌లో రియల్ బూమ్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త జోష్ మొదలైంది. కరోనా తర్వాతి నుంచి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న లేదా ఏడాదిలోపు నిర్మాణం పూర్తయ్యే గృహాల కొనుగోళ్లకు మక్కువ చూపిన కొనుగోలుదారులు.. క్రమంగా కొత్త గృహాల వైపు మళ్లారు. లాంచింగ్ ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరహా ట్రెండ్‌లో భాగ్యనగరంలోనే ఎక్కువగా ఉంది. దీంతో గతేడాది నగరంలో 25,410 యూనిట్లు అమ్ముడుపోగా.. ఇందులో 55 శాతం ఇళ్లు కొత్తగా ప్రారంభమైనవే. తుది గృహ కొనుగోలుదారులతో పాటు పెట్టుబడిదారులలో విశ్వాసం పెరగడమే లాంచింగ్ ప్రాజెక్ట్స్‌లో విక్రయాల వృద్ధికి కారణమని అనరాక్ నివేదిక వెల్లడించింది. తాత్కాలికంగా విరామం వచ్చిన కొత్త గృహాలకు డిమాండ్ మళ్లీ పుంజుకుంది. దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో గతేడాది 2.37 లక్షల యూనిట్లు అమ్ముడుపోగా.. ఇందులో 34 శాతం కొత్తగా ప్రారంభమైన ఇళ్లే. 2020లో ఈ తరహా గణాంకాలు పరిశీలిస్తే.. 1.38 లక్షల యూనిట్లు అమ్ముడుపోగా.. కొత్త గృహాల వాటా 28 శాతంగా ఉంది. అలాగే 2019లో 2.61 లక్షల ఇళ్లు విక్రయం కాగా.. వీటి వాటా 26 శాతంగా ఉంది. ఈ తరహా విక్రయాలు అత్యధికంగా హైదరాబాద్‌లోనే జరిగాయి. గతేడాది నగరంలో 25,410 యూనిట్లు సేల్ కాగా.. 55 శాతం కొత్త గృహాలే అమ్ముడుపోయాయి. అలాగే 2019లో 16,590 ఇళ్లు విక్రయం కాగా వీటి వాటా 28 శాతంగా ఉంది. అత్యల్పంగా ముంబైలో 2021లో 76,400 యూనిట్లు అమ్ముడుపోగా.. కొత్త గృహాల వాటా 26 శాతంగా ఉంది. ఈ ట్రెండ్ మంచిదేనా? గత 3–4 ఏళ్లలో నివాస సముదాయాలలో పెట్టుబడుల నుంచి నిష్క్రమించిన ఇన్వెస్టర్లు.. వాణిజ్యం, రిటైల్, గిడ్డంగుల వంటి ఇతర విభాగాలలో పెట్టుబడులపై దృష్టిసారించారు. వారంతా తిరిగి రెసిడెన్షియల్ ఇన్వెస్ట్మెంట్లపై ఫోకస్ పెట్టారు. ఇదే సమయంలో లిస్టెడ్, బ్రాండెడ్ డెవలపర్లు భారీ స్థాయిలో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తున్నారు. దీంతో గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 2.37 లక్షల యూనిట్లు లాంచింగ్ అయ్యాయి. గడువులోగా నిర్మాణం పూర్తి చేయగల సామర్థ్యం ఉన్న డెవలపర్ల ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో 2015లో 41:59గా ఉండే బ్రాండెడ్–నాన్ బ్రాండెడ్ డెవలపర్ల విక్రయాల నిష్పత్తి.. 2021 నాటికి 58:42కి పెరిగింది. గృహ విభాగంలోకి పెట్టుబడిదారులు చేరడం విక్రయాల పరంగా శుభపరిణామమే అయినా తుది కొనుగోలుదారులు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఎందుకంటే ఇన్వెస్టర్లు చేరిన చోట ధరలు వేగంగా పెరుగుతాయని చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. ఇతర నగరాల్లో.. గతేడాది ముంబైలో 76,400 గృహాలు అమ్ముడుపోగా.. కొత్త గృహాల వాటా 26 శాతంగా ఉంది. అలాగే ఎన్సీఆర్లో 40,050 ఇళ్లు విక్రయం కాగా వీటి వాటా 30 శాతం, చెన్నైలో 12,530 గృహాలు సేలవగా లాంచింగ్ యూనిట్ల వాటా 34 శాతం, కోల్‌కతాలో 13,080 ఇళ్లు అమ్ముడుపోగా.. వీటి వాటా 34 శాతం, బెంగళూరులో 33,080 యూనిట్లు విక్రయం కాగా.. కొత్త ఇళ్ల వాటా 35 శాతం, పుణేలో 35,980 ఇళ్లు అమ్ముడు పోగా.. లాంచింగ్ యూనిట్ల విక్రయాల వాటా 39 శాతంగా ఉంది. చదవండి: మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త!! -
మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త!!
ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. మీరు కోరుకున్న విధంగా ఈ సంవత్సరంలో మనదేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 3.85 లక్షల గృహ నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా. అనరాక్ రీసెర్చ్ డేటా ప్రకారం..2020లో 2.14 లక్షలకు పైగా గృహ నిర్మాణాలు పూర్తి కాగా.. 2021 ప్రథమార్ధంలో సెకండ్ వేవ్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ఏడాదిలో మొదటి ఏడు నగరాల్లో దాదాపు 2.78 లక్షల గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని తేలింది. ►2021లో పూర్తి చేసిన మొత్తం ఇళ్లలో గరిష్టంగా ఎన్‌సిఆర్‌లో దాదాపు పూర్తయ్యాయి. గతేడాది ఎన్సీపీఆర్లో 86,590 యూనిట్లు ఉండగా..2020లో 47,160యూనిట్లు పూర్తయ్యాయి. అంటే గతేడాది ఇళ్ల నిర్మాణం 2020 కంటే దాదాపు 84% ఎక్కువ. ►ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో సుమారుగా. 2021లో 70,490 యూనిట్లు పూర్తికాగా 2020లో 54,720 యూనిట్లు పూర్తయ్యాయి. ►పూణెలో సుమారు. 2021లో 46,090 యూనిట్లు పూర్తికాగా 2020లో 40,840 యూనిట్లు పూర్తయ్యాయి. ►బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో ఇళ్లనిర్మాణాలు సమానంగా ఉన్నాయి. 2021లో 63,870 యూనిట్లు పూర్తికాగా 2020లో 59,730 యూనిట్లు పూర్తయ్యాయి ►కోల్‌కతాలో 2020లో 11,920 పూర్తి కాగా 2021లో 11,620 యూనిట్లు పూర్తయ్యాయి. పరిశోధన ఫలితాలపై అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి మాట్లాడుతూ.. “2022లో టాప్ 7 నగరాల్లో 3.85 లక్షల యూనిట్లను పూర్తి చేయాలని డేటా సూచిస్తుందని అన్నారు. చాలా నగరాల్లో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయని, థర్డ్ వేవ్ ప్రభావం రియాల్టీమీద చాలా తక్కువగా ఉందని పూరి చెప్పారు. దీంతో 2022లో ఇళ్ల నిర్మాణాలు చాలా వరకు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. డెవలపర్లు కొత్త వాటిని ప్రారంభించే ముందు గతంలో ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నారని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా -
PMAY: కొత్త ఇల్లు కొనేవారికి కేంద్రం శుభవార్త..!
మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. పట్టణ ప్రాంతాల్లో కొత్త ఇల్లు కొనే మధ్య తరగతి, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్రం ఈ బడ్జెట్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి రూ.48,000 కోట్లు కేటాయించింది. 2023 నాటికి దేశంలో సుమారు 80 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లను గుర్తించి లబ్ధిదారులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రయోజనాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 3 వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇప్పటివరకు రాష్ట్రాల్లో సుమారు 114.02 లక్షల ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. వీటిలో ఇప్పటి వరకు 53.42 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇల్లు కొంటే మీరు భారీ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద మీకు ఏకంగా రూ. 2.35 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. మార్చి 31, 2022 నాటికి అర్హులైన కుటుంబాలు లేదా లబ్ధిదారులకు ఇళ్లు అందించే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నందున ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం వేగంగా అమలవుతోంది. మరోవైపు రూ.60,000 కోట్లతో 3.8 కోట్ల ఇళ్లకు ట్యాప్ వాటర్ ద్వారా మంచినీటిని అందించనుంది ప్రభుత్వం. పట్టణ సామర్థ్యం పెంపుదల, ప్రణాళిక అమలు, పాలన కోసం అర్బన్ ప్లానర్స్, ఎకనమిస్ట్‌లతో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేయనుంది. (చదవండి: 5జీ టెక్నాలజీతో కేంద్రానికి భారీగా ఆదాయం..!) -
ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?
చాలా మందికి చిరకాల కోరిక.. కచ్చితంగా తమకంటూ ఒక ఇల్లు ఉండాలని.. పైగా ఉద్యోగం చేస్తున్నప్పుడే కట్టుకోవాలనుకుంటారు.. కొన్ని సార్లు పరిస్థితులు అనుకూలించకపోవడంతో కట్టుకోలేకపోతారు. కానీ ఇక్కడొక ఆరేళ్ల చిన్నారి ఏకంగా రూ.3.6 కోట్లు విలువ చేసే ఇల్లు కొనేసింది. ఎలాగో చదివేయండి. (చదవండి: పంచాయితీ ఎన్నికల్లో ఒక అభ్యర్థికి కనివినీ ఎరుగని ఓట్లు!... కచ్చితంగా షాక్ అవుతారు!!) అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాకి చెందిన రూబీ అనే ఆరేళ్ల చిన్నారి తన తోబుట్టువులైన సోదరుడు గుస్, సోదరి లూసితో కలిసి మెల్బోర్న్లోని క్లైడ్‌లో ఉన్న ఇంటిని ఏకంగా రూ.3.6 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ మేరకు పిల్లలు ఇంటి పనులు చేయడం, పుస్తకాలను ప్యాక్ చేయడం వంటి పనులు చేస్తూ డబ్బలు సంపాదించారని తండ్రి క్యామ్ మెక్లెల్లన్ చెప్పారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ లక్ష రూపాయలు చొప్పున ఆదా చేస్తూ వచ్చారని క్యామ్ అన్నారు. అంతేకాదు తన పిల్లలకు ఈ ఆస్తిని వారికి తగిన వయసు వచ్చినప్పుడు పంచుతానని చెప్పానని కూడా వివరించారు. ఈ క్రమంలో ఆ చిన్నారుల తండ్రి క్యామ్ ఈ ఇంటి విలువ పదేళ్లలో రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అన్నారు. పైగా ఇప్పటికే ఈ ఇంటి ధర రూ 5 లక్షల వరకు పెరిగిందని చెప్పారు. అంతేకాదు 2032లో ఈ ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బును వారికి సమ భాగాలుగా పంచి ఇస్తానని చెప్పారు. అయితే ఆ చిన్నారుల తండ్రి కామ్ ఏ పని చేయకుండా ఏడాదికి రూ 190 లక్షలను ఆర్జించడం కనుగొనటం విశేషం. ఆ తర్వాత క్యామ్ 36 ఏళ్ల వయసులో పదవీ విరమణ తీసుకున్నాడు. అయితే అతను 20 ఏళ్ల వయసులోనే ఆస్తులు కూడాబెట్టడం ప్రారంభించాడు. పైగా అతనికి 50 ఏళ్ల వయసులో పని చేయడం అసలు ఇష్టం లేదంట.. (చదవండి: బాప్రే! గాలి పటంతో పాటు మనిషి కూడా గాల్లోనే... !! -
ఐటీ ఉద్యోగులు ఇళ్లు కొనాలంటే..
సాక్షి, హైదరాబాద్: కమర్షియల్, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు, ఉద్యోగుల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. టెకీల వేతనాలు, వాళ్ల అభిరుచులను అర్థం చేసుకొని, అందుకు తగ్గట్టు ప్రాజెక్ట్‌లను డిజైన్ చేయగలిగితే చాలు... ప్రాజెక్ట్‌లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది ఏపీఆర్ గ్రూప్. ఏ ప్రాంతంలో ప్రాజెక్ట్ చేసినా సరే 95 శాతం కస్టమర్లు ఐటీ ఉద్యోగులే ఉంటారని కంపెనీ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి తెలిపారు. ఐటీ వాళ్లే అధికం ఇప్పటివరకు 2,160 యూనిట్లను విక్రయించగా.. 1,800 మంది ఐటీ ఉద్యోగులే కొనుగోలు చేశారని చెప్పారు. రూ.కోటి నుంచి రూ.2 కోట్ల మధ్య ధర ఉండే విల్లా ప్రాజెక్ట్‌లను ఎక్కువగా కొనుగోళ్లు చేస్తారని తెలిపారు. ఏ ప్రాజెక్ట్‌ను చేపట్టినా సరే మొదటి 5 నెలల్లో ప్రాజెక్ట్‌లో వసతులను అందుబాటులోకి తీసుకొస్తాం. దీంతో కొనుగోలుదారులు వెంటనే వసతులను వినియోగించుకోవచ్చు. కొత్త ప్రాజెక్టులు - ప్రస్తుతం ఏపీఆర్ గ్రూప్ మల్లంపేటలో సిగ్నేటర్ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. 10 ఎకరాలలో మొత్తం 150 లగ్జరీ విల్లాలుంటాయి. ఒక్కో విల్లా 150 నుంచి 200 గజాల విస్తీర్ణంలో ఉంటుంది. 2,200 చ.అ. నుంచి 3 వేల చ.అ. మధ్య విల్లా బిల్టప్ ఏరియా ఉంటుంది. ధర రూ.1.3 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ఉంటుంది. - దుండిగల్‌లో హైనోరా పేరుతో మరో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 11 ఎకరాలలో 180 విల్లాలను నిర్మిస్తున్నాం. 150 నుంచి 200 గజాల విస్తీర్ణంలో ఒక్కో విల్లా ఉంటుంది. 2,200 చ.అ. నుంచి 3 వేల చ.అ. మధ్య విల్లా బిల్టప్ ఏరియా ఉంటుంది. రూ.1.3 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ధరలుంటాయి. - పటాన్చెరులో గ్రాండియో విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఇది 38 ఎకరాలు. ఇందులో 433 విల్లాలను నిర్మిస్తున్నాం. 150 నుంచి 200 గజాల విస్తీర్ణంలో 2,200 చ.అ. నుంచి 3 వేల చ.అ. మధ్య విల్లా బిల్టప్ ఏరియా ఉంటుంది. ధర రూ.1.3 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ఉంటుంది. ఇదే ప్రాంతంలో హైజీరియా పేరుతో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తున్నాం. 7 ఎకరాలలో 10 అంతస్తులలో 720 యూనిట్లుంటాయి. 1,200 చ.అ. నుంచి 1,600 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలున్నాయి. ధర రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య ఉన్నాయి. - వనస్థలిపురంలో క్రిస్టల్ పేరుతో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను చేపడుతున్నాం. 10 ఎకరాలు 150 విల్లాలు. ధర రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్లు ఈ ప్రాజెక్ట్‌లో 60% కస్టమర్లు డాక్టర్లే ఉన్నారు. చదవండి: దక్షిణ భారత్‌లోనే అతి పెద్ద భవనం.. స్కైస్క్రాపర్లకు పెరిగిన డిమాండ్ -
పాత ఇల్లు అమ్మకం.. పన్ను రాయితీ పొందడానికి మార్గాలు
దీర్ఘకాలిక మూలధన లాభాలని ఆదాయంగా భావించి పన్నుభారం లెక్కేస్తారు. ఇతర ఆదాయాలలో కలపకుండా, ఈ లాభం మీద ప్రత్యేక రేట్ల ప్రకారం లెక్కలు వేస్తారు. స్పెషల్ రేటు 20 శాతం, సెస్సు అదనం. పన్ను భారం లేకుండా బైటపడాలంటే మరో ఇల్లు కొనండి లేదా నిర్దేశించిన క్యాపిటల్ గెయిన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయండి. కింది పేర్కొన్న ఉదాహరణలు ఒకసారి గమనించండి (డిపార్ట్మెంట్ సౌజన్యంతో).. ∙ఎంత ఇన్వెస్ట్ చేయాలి? కేవలం వ్యవహారంతో ముడిపడ్డ లాభం మాత్రమే ఇన్వెస్ట్ చేయవచ్చు. అమ్మగా వచ్చిన మొత్తం కాదు. ఉదాహరణకు ఇల్లు అమ్మగా వచ్చిన ప్రతిఫలం రూ. 90,00,000 అనుకోండి. లెక్కల ప్రకారం దీనిలో మూలధనం లాభం రూ. 22,00,000 అనుకోండి. కొత్త ఇంటి నిమిత్తం కేవలం రూ. 22 లక్షలు వెచ్చిస్తే సరిపోతుంది. ∙రెండు ఇళ్ల మీద లాభం వెచ్చించవచ్చా? మూలధన లాభాలు రూ. 2 కోట్లకు లోబడి, గడువు తేదీ లోగా రెండు ఇళ్లు కొనుక్కోవచ్చు. అయితే, ఇలా ఒకేసారి రెండు ఇళ్లకు జీవితకాలంలో ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. మూలధన లాభం రూ. 2 కోట్లు దాటితే, రెండు ఇళ్లు అనుమతించరు. కొత్తవి రెండు ఇళ్లు ఒకేసారి కొనాలనేమీ లేదు. వెనుకా ముందు అయినా ఫర్వాలేదు. కానీ నిర్దేశించిన గడువు లోపల లావాదేవీ జరగాలి. అంటే 3 సంవత్సరాల లోపు గానీ లేదా ఒక సంవత్సరం ముందు/రెండు సంవత్సరాల లోపు గానీ జరగాలి. ∙మినహాయింపు ఎంత ఇస్తారు? మినహాయింపు మొత్తం మూలధన మొత్తాన్ని దాటదు. మొత్తం మూలధన లాభాలను ఇన్వెస్ట్ చేయాలి. లేదా ఎంత చేస్తే అంతకే మినహాయింపు పరిమితం అవుతుంది. మూలధన లాభం రూ.50,00,000 అనుకోండి.. రూ. 50 లక్షలు పెట్టి ఇల్లు కొంటేనే పూర్తిగా మినహాయింపు లభిస్తుంది. కేవలం రూ.40 లక్షలు పెట్టి కొంటే.. మినహాయింపు కూడా అంతకే పరిమితమవుతుంది. ∙పైన ఉదాహరణకు మరో మార్గం ఉందా? ఇల్లు కొనే బదులు మీరు క్యాపిటల్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మినహాయింపు ఇస్తారు. రూ. 40,00,000 పెట్టి ఇల్లు కొని మిగతా రూ. 10,00,000 పెట్టి బాండ్లు కొన్నా మీకు పూర్తి మినహాయింపునిస్తారు. ∙గడువు తేదీలోగా ఇల్లు కొనలేకపోతే? ఏవైనా ఇతరత్రా కారణాల వల్ల ఇల్లు కొనలేకపోయినా లేదా కట్టుకోలేకపోయినా గాభరా పడక్కర్లేదు. ఆయా సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్ను వేసే గడువు తేదీ లోపల మూలధన లాభాన్ని బ్యాంకులో ‘క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్‘లో డిపాజిట్ చేయాలి. ఇలా సకాలంలో డిపాజిట్ చేస్తే ఆ మొత్తం మీద మినహాయింపునిస్తారు. ఆ తర్వాత ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసి ఈ మొత్తాన్ని సకాలంలో వెచ్చించకపోతే మినహాయింపుని రద్దు చేస్తారు. ∙ఏయే పరిస్థితుల్లో మినహాయింపు పోతుంది? కొత్త ఇంటిని 3 సంవత్సరాల లోపల అమ్మేస్తే ముందు ఇచ్చిన మినహాయింపును రద్దు చేస్తారు. కాబట్టి హోల్డింగ్ పీరియడ్ విషయంలో తగిన జాగ్రత్త వహించాలి. (వచ్చే వారం ఉదాహరణలు చూద్దాం) - కేసీహెచ్ఏవీఎస్ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: 75 ఏళ్లు దాటినవారికి ఐటీ రిటర్నుల మినహాయింపు -
గృహల కొనుగోళ్లపై రాయితీలు ఎప్పుడు వస్తాయో తెలుసా ..
సాక్షి, హైదరాబాద్: వర్షంలో బయటికి వెళ్లాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తడిసిపోతామనో లేక బురదగా ఉంటుందనో. కానీ, గృహ అన్వేషణ కోసం ఇదే సరైన సమయం అంటున్నారు రియల్టీ నిపుణులు. వానల్లోనే ఇంటి నిర్మాణ నాణ్యత, ప్రాంతం పరిస్థితి క్షుణ్ణంగా తెలుస్తుంది కాబట్టి సొంతింటి ఎంపికకు ఇదే సరైన కాలమని సూచిస్తున్నారు. గృహ కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే వర్షంలో ప్రాజెక్ట్‌ను పరిశీలించాలి. నగరం ఏదైనా సరే వానొస్తే చాలు రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ అవుతాయి. వర్షం నీరు వెళ్లే చోటు లేక రోడ్లన్నీ మునిగిపోతాయి. ఇది ఇల్లు ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో ప్రజా రవాణా వ్యవస్థ ఎలా ఉంది? ఇంటి నుంచి బస్ స్టాండ్ లేక రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది. వంటి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. నాణ్యత తెలుస్తుంది.. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంతో పాటూ ఇంటి నిర్మాణ నాణ్యత బయటపడేది కూడా వానాకాలమే. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేసే కొనుగోలుదారులు మాత్రం వానాకాలంలో ఇంటి నాణ్యత చెక్ చేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఒక్కసారి గృహ ప్రవేశమయ్యాక కామన్‌గా ఏర్పాటుచేసిన వసతుల్లో లీకేజ్‌లను పునరుద్ధరించడం కొంత కష్టం. వర్షా్షకాలంలో ప్రాజెక్ట్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లోని వాష్‌రూమ్, సీలింగ్, ప్లంబింగ్, డ్రైనేజీ లీకేజ్ వంటివి తెలుస్తాయి. ఆయా లోపాలను పునరుద్ధరించమని డెవలపర్‌ను కోరే వీలుంటుంది. రీసేల్ ప్రాపర్టీలనూ.. రీసేల్ ప్రాపర్టీలను కొనేవారైతే వర్షాకాలంలో ఆయా ప్రాపర్టీలను స్వయంగా పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే వానల్లోనే ప్రాపర్టీ నిర్వహణ ఎలా ఉందో అవగతమవుతుంది. గోడల ధృడత్వం, డ్రైనేజీ, ప్లంబింగ్ లీకేజీలు వంటివి తెలుసుకునే వీలుంటుంది. ప్రాపర్టీ లోతట్టు ప్రాంతంలో ఉందా? వరదలు ఎక్కువగా వచ్చే అవకాశముందా అనేది తెలుస్తుంది. వరద నీరు భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు ఉన్నాయా? లేక అపార్ట్మెంట్ సెల్లార్ నీటిలో మునిగిపోతుందా? అనేది తెలుస్తుంది. వర్షంలో రాయితీలు.. వర్షాకాలంలో గృహ కొనుగోళ్లు అంతగా జరగవు. కాబట్టి ఇలాంటి సమయంలో నిజమైన గృహ కస్టమర్లు వచ్చినప్పుడు వారిని డెవలపర్లు స్వాగతిస్తారు. ధర విషయంలో బేరసారాలు ఆడే వీలుంటుంది. రాయితీలు, ఇతర ప్రత్యేక వసతుల విషయంలో డెవలపర్లతో చర్చించవచ్చు. పైగా సెప్టెంబర్–అక్టోబర్ పండుగ సీజన్ కావటంతో భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక రాయితీలతో అమ్మకాలను ప్రకటిస్తుంటారు డెవలపర్లు. -
ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్న టీమిండియా మాజీ సారధి
ముంబై: టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్ ధోని మరో ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తన స్వస్థలం రాంచీలో విలాసవంతమైన భవంతిలో నివసిస్తున్న ఈ ఝార్ఖండ్ డైనమైట్.. ఇటీవలే ముంబైలో ఓ విల్లాను, తాజాగా పూణేలోని పింప్రి-చిన్చ్వాడ్లో ఓ నూతన భవంతిని హస్తగతం చేసుకున్నాడు. పూణేలో రియల్ ఎస్టేట్‌కు మంచి డిమాండ్ ఉండటంతో రావేట్‌లోని ఎస్టాడో ప్రెసిడెన్షియల్ సొసైటీలో అతను నూతన భవంతి నిర్మాణాన్ని చేపట్టాడు. నిర్మాణంలో ఉన్న ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలను కొద్దిరోజుల కిందట అతని భార్య సాక్షి సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా, ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, వివిధ ఎండార్స్మెంట్లు, ఐపీఎల్ ద్వారా ఏటా కోట్లల్లో అర్జిస్తున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను.. క్రికెట్ ఆడుతూనే రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఇటీవలే అతను వినోద రంగంలోనూ అడుగుపెట్టాడు. ముంబైలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎంఎస్డీ ఎంటర్టైన్మెంట్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2021 సీజన్లో ధోని నేతృత్వంలోని సీఎస్కే జట్టు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చదవండి: కేకేఆర్‌కు భారీ షాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ ఆటగాడు ఔట్ -
అమెరికా ఉపాధ్యక్షురాలి ఇల్లు కొంటారా? ధర ఎంతంటే..
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమల హ్యారీస్ తన ఇల్లు విక్రయానికి పెట్టింది. శాన్ఫ్రాన్సిస్కోలోని తన ఇంటిని అమ్మేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలిపింది. అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ ఇంటిని 799 వేల డాలర్లకు విక్రయించనున్నారు. ఈ మేరకు కమలా హ్యారీస్ ఓ వెబ్‌సైట్‌కు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. భవనంతో ఉన్న17 ఏళ్ల అనుబంధాన్ని కమలా తెంచుకోనుంది. శాన్ఫ్రాన్సిస్కోలోని సౌతాఫ్ మార్కెట్లో ఓ అపార్ట్మెంట్ పై అంతస్తులో కమలా హ్యారీస్‌కు అపార్ట్మెంట్ ఉంది. 2004లో దీన్ని ఆమె కొనుగోలు చేశారు. అప్పట్లో 489,000 డాలర్లకు ఆమె కొనుగోలు చేయగా ఇప్పుడు 799,000 డాలర్లకు విక్రయించాలని నిర్ణయించింది. అధునాతన సౌకర్యాలు.. మంచి ఫర్నీషింగ్తో ఈ ఇల్లు ఉందని తెలుస్తోంది. ఈ ఇంటితో ఆమెకు 17 ఏళ్ల అనుబంధం ఉంది. పడకగదులు, హాల్, వంటగదులతో ఉన్న ఈ ఇంటిలో ఓ చిన్నపాటి కార్యాలయం కొనసాగించేందుకు కూడా అవకాశం ఉంది. మంచి సీలింగ్‌తో ఈ ఇల్లు ఉందని జిల్లో వెబ్సైట్ ఆ భవనం ఫొటోలతో పాటు ఇంటికి సంబంధించిన వివరాలు చెప్పింది. ఉపాధ్యక్షురాలు కావడంతో కమల వాషింగ్టన్కు మకాం మార్చింది. ప్రస్తుతం ఉపాధ్యక్షుల అధికారిక నివాసం నంబర్ వన్ అబ్జర్వేరీ సర్కిల్‌ను మరమ్మతులు చేస్తుండడంతో ప్రస్తుతానికి కమలా హ్యారీస్ శ్వేతసౌధం సమీపంలోని బ్లెయిర్ హౌజ్‌లో నివసిస్తున్నారు. మరమ్మతులు పూర్తయితే అధికారిక నివాసంలోకి వెళ్లనున్నారు. -
ఇల్లు కొనబోతున్న మోనాల్?!
సినిమాలతో రాని గుర్తింపు రియాలిటీ షో బిగ్‌బాస్‌తో సొంతం చేసుకున్నారు మోనాల్ గజ్జర్. ఓట్లు, గేమ్‌తో కాకుండా లవ్‌ట్రాక్‌తో బిగ్‌బాస్‌లో కొనసాగారు మోనాల్. ఎలిమినేషన్‌కు ముందు కొన్ని రోజుల పాటు తనలోని అసలు టాలెంట్‌ని చూపించినప్పటికి.. ఫైనల్‌కి మాత్రం చేరుకోలేకపోయారు. ఇక ఈ సారి బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారందరు ప్రస్తుతం టీవీ, సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్టుల్లో మోనాల్‌కి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ నటి మా టీవీలో డ్యాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసింది. తాజాగా మొనాల్‌కి సంబంధించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. (చదవండి: బంపర్ ఆఫర్ అందుకున్న మోనాల్.. ) ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోల ఆఫర్స్‌తో బిజీగా ఉన్న మోనాల్ హైదరాబాద్‌లో ఇల్లు కొనే ఆలోచనలో ఉందట. తనకు ఎంతో గుర్తింపు ఇచ్చిన టాలీవుడ్లోనే ఆమె కొనసాగాలునుకుంటున్నట్లు.. ఈ మేరకు సిటీలోనే ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు ఫిలీంనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. -
ఆ నటి ఇంటి ఖరీదు రూ.39 కోట్లు
ముంబైలోని జుహు ప్రాంతం సెలబ్రిటీల కేరాఫ్ అడ్రస్. బాలీవుడ్లో చాలా మంది స్టార్లు ఈ ప్రాంతంలో ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ధర కూడా భారీగానే ఉంటుంది. ఇప్పటికే అలియా భట్, రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్ వంటి స్టార్లు ఇక్కడ ఇల్లు కొనుక్కోగా తాజాగా అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా ఈ జాబితాలో చేరారు. జుహు ప్రాంతంలో జాన్వి ఇల్లు తీసుకున్నారు. దీని ఖరీదు 39 కోట్ల రూపాయలు. ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటి వరకు కేవలం రెండు సినిమాలు మాత్రమే విడుదల చేసిన జాన్వీ కపూర్ ఇంత భారీ మొత్తం పెట్టి ఇల్లు కొనడం ప్రస్తుతం బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. (చదవండి: ‘లోలోపల భయంగా ఉన్నా.. పైకి నవ్వేదాన్ని’) స్క్వేర్ ఫీట్ ఇండియా నివేదిక ప్రకారం, జాన్వీ కొన్న కొత్త ఇల్లు జుహు భవనంలో మూడు అంతస్తులలో విస్తరించి ఉంది. ఇక ఇంటి కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం గత ఏడాది డిసెంబర్ 7 జరిగిందని నివేదిక తెలిపింది. ఇక ఇంటి విస్తీర్ణం మొత్తం 3,456 చదరపు అడుగులు. ఇంటికి సంబంధించి జాన్వీ ఇప్పటికే 78 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు తెలిసింది. 2018లో ధడక్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ఆ తర్వాత గుంజన్ సక్సెనా చిత్రంలో నటించారు. ఇక జోయా అక్తర్ ఘోస్ట్ సిరీస్‌లో కూడా కనిపించారు. ఇక ప్రసుత్తం జాన్వీ దోస్తానా 2, రూహి అఫ్జానా చిత్రాల్లో నటించనున్నారు. -
నా జీవితం ఏ మగాడి సాయం లేకుండా సాగుతోంది: రేణు
తనపై వస్తున్న రూమర్స్ మీద నటి రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు. మాజీ భర్త పవన్ కల్యాణ్ ఖరీదైన ఇంటిని రేణు దేశాయ్‌కు బహుమతిగా ఇచ్చారని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఆద్య, అకీరాల కోసం హైదరాబాద్‌లో పవన్ ఇల్లు కొనిచ్చినట్టు వార్తలు షికార్లు చేశాయి. అంతేకాకుండా ప్రస్తుతం పుణేలో ఉంటున్న రేణు దేశాయ్.. పవన్ కొనిచ్చిన ఇంటికి మారుతున్నట్లు ఆ వార్తల్లో సారాంశం. అయితే.. ఆ వదంతులను రేణు దేశాయ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పడు వార్తలు తనపై ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తన కష్టార్జితంతో ఇల్లు కొనుక్కున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ రూమర్స్‌పై రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రేణు మునుపెన్నడూ లేనంతగా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. (రేణూ దేశాయ్ హార్ట్ టచింగ్ మెసేజ్) రేణు దేశాయ్ ఫేస్బుక్ పోస్ట్ నేను ఇప్పుడు మీ అందరికీ ఈ విషయం గురించి వివరణ ఇవ్వడానికి ఒకే ఒక్క కారణం, నిన్నటి నుండి నాకు మీడియా వాళ్ళ నుండి, స్నేహితుల నుండి వస్తున్న ఎన్నో మెసేజెస్, ఫోన్ కాల్స్ ఆధారంగా నాకు ఈ విషయం చాలా సీరియస్ అయింది అని అర్థమయ్యింది. వాళ్ళు చెప్పింది విని నాకు చాలా బాధ వేసింది అందుకే ఈ వివరణ... ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన ఆత్మగౌరవం ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన నిజాయితీ ఒక వ్యక్తి నిజమైన ఆస్తి తన అస్తిత్వం ఇది మీకు తెలియనిదా..? నేను, నా జీవిత మనుగడ కోసం ఒంటరిగా, తీవ్రంగా, నిబద్దతతో ఎంతగానో శ్రమిస్తున్నాను… శ్రమిస్తూనే పోరాడుతున్నాను. ఇప్పటి వరకూ కనీసం మా తండ్రి గారి దగ్గర్నుంచి కూడా ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించలేదు, పొందలేదు. అలాగే, నేనిప్పటివరకూ నా మాజీ భర్త దగ్గర్నుంచి కూడా ఎలాంటి అన్యాయ పూరితమైన భరణాన్నీ ఆశించలేదు, పొందలేదు. అది నా వ్యక్తిత్వం!!! అయినప్పటికీ మీరు నా గురించి అన్యాయంగా, అసంబద్దమైన అబద్దపు వార్తలను ప్రచారం చేస్తూనే ఉన్నారు! మీరందరూ అనుకుంటున్నట్టు, ప్రచారం చేస్తున్నట్టు ఇప్పుడు హైదరాబాద్‌లో నేను కొన్న ఫ్లాట్ నిజంగా మాకెవరూ కొనివ్వలేదు. అది నా కష్టార్జితంతో ఒక్కో రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న నా సొంత ఇల్లు. అది నా మాజీ భర్త మాకు కొనిచ్చారన్న ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల నా నిజాయితీకీ, ఆత్మగౌరవానికీ, నా అస్థిత్వానికీ, చివరగా నా ఉనికికే ప్రమాదం సంభవిస్తుందనే చిన్న ఆలోచన మీకెవ్వరికీ రాలేదా? నాకు తెలిసినంతవరకూ, ఈ వార్తకూ నా మాజీ భర్తకూ ఎలాంటి సంబంధం ఉండి ఉండదు. కనీసం ఈ ప్రచారం ఆయన దృష్టికి కూడా వెళ్ళి ఉండదు. అలాంటిది, ఒక వార్తను రాసేటప్పుడు, అది నిజమో కాదో నిర్ధారించుకోకుండానే, అత్యుత్సాహంతోనో, తొందరపాటుతోనో, లేక మీ సంస్థల మనుగడ కోసమో, ఒక ఒంటరి స్త్రీ మనుగడను ప్రమాదంలో నెట్టడం ఎంతవరకూ సమంజసం? ఇలాంటి వార్తలు ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్తాయో మీకు తెలియదా? ప్రజలు ఈ అబద్దపు వార్తను నిజమని నమ్మితే, సంఘంలో నాకున్న గౌరవం మసకబారదా? ఏది జరిగినా చెక్కు చెదరని నా అస్థిత్వం, వ్యక్తిత్వం, నా ఆత్మగౌరవం, నేను అనే ఒక నిజం అసత్యం అయిపోదా? నా ఆత్మ ఎంత ఘోషిస్తుంది! ఎంతలా చితికిపోతుంది!? దయచేసి ఆలోచించండి.. నా ఈ జీవితంలో ఇప్పటివరకూ ఏ మగవాడి సాయం లేకుండా సాగుతున్న నాలాంటి ఒంటరి తల్లి జీవన గమనానికీ, పోరాటానికి గౌరవం ఇవ్వకపోయినా సరే… దయచేసి, ఇలా కించపరచకండి. నేను మీతో పంచుకుంటున్న ఈ బాధను సరిగ్గా అర్థం చేసుకోకుండా మళ్ళీ నాకూ, నా మాజీ భర్త అభిమానులకూ మధ్య, దయచేసి ఎలాంటి గొడవలూ సృష్టించకండి అంటూ రేణు దేశాయ్ సుదీర్ఘమైన పోస్ట్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. వారిది నా రక్తం.. పవన్ రక్తం కాదు: రేణూదేశాయ్ -
నిర్మాతకు రజనీకాంత్ బహుమతి!
చెన్నై: తనను హీరోను చేసిన నిర్మాతకు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ స్థిర నివాసం కల్పించారా? ఇందుకు భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ ఆదిలో ప్రతినాయకుడిగా ఎదిగిన విషయం తెలిసిందే. అలాంటి రోజుల్లో ఆయనను హీరోగా పరిచయం చేసి భైరవా అనే చిత్రాన్ని నిర్మించారు ప్రఖ్యాత కథా రచయిత కలైజ్ఞానం. ఆ చిత్రం రజనీకాంత్ సినీ జీవితాన్నే మార్చేసింది. అలాంటి నిర్మాత నివసించడానికి సొంతంగా ఒక ఇల్లు కూడా ఏర్పరచుకోలేకపోయారు. ఈ విషయాన్ని రెండు వారాల క్రితం దర్శకుడు భారతీరాజా నేతృత్వంలో కలైజ్ఞానంకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో నటుడు శివకుమార్ తెలిపారు. అంతే కాదు కలైజ్ఞానంకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇల్లు కట్టించాలని విజ్ఞప్తి చేశారు. అదే కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రజనీకాంత్ ప్రభుత్వానికి ఆ అవకాశం ఇవ్వనని, తానే కలైజ్ఞానంకు ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చారు. అంతే కాదు 10 రోజుల్లో అందుకు డబ్బును తాను అందిస్తానని చెప్పారు. దీంతో దర్శకుడు భారతీరాజా కలైజ్ఞానం కోసం కోటి రూపాయల్లో ఒక ఇంటిని చూసినట్లు, దాన్ని రజనీకాంత్ కొనుగోలు చేసి నిర్మాత కలైజ్ఞానంకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై విచారించగా రజనీకాంత్ ఇంకా ఇల్లును కొనలేదని, దర్శకుడు భారతీరాజా ఇల్లు కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. అదే విధంగా కలైజ్ఞానంకు ఇంటిని కొనడానికి రజనీకాంత్ రూ.కోటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పినట్లు తెలిసింది. రజనీతో ఎలాంటి బంధంలేదు.. దీనిపై నిర్మాత కలైజ్ఞానం స్పందిస్తూ తనకు నటుడు రజనీకాంత్‌తో ఎలాంటి అనుబంధం, రక్త సంబంధంగానీ లేదన్నారు. ఆయన్ని హీరోగా పరిచయం చేసి చిత్రం నిర్మించానంతేనని పేర్కొన్నారు. అలాంటిది తనకు రజనీకాంత్ ఎంత పెద్ద సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆయన మానవత్వానికి ఇది నిదర్శనం అని అన్నారు. కాగా రజనీకాంత్ ఇంతకు ముందు నటించిన అరుణాచలం చిత్రానికి తనతో చిత్రాలు చేసి ఆ తరువాత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న ఏడుగురిని భాగస్వాములుగా చేశారు. ఆ చిత్రానికి వచ్చిన లాభాలను వారికి పంచారు. అందులో నిర్మాత కలైజ్ఞానం ఉన్నారన్నది గమనార్హం. -
డబ్బుల్ పెట్టలేదు
ఇండస్ట్రీలో మంచి ఫామ్‌లో ఉన్న టాప్ లిస్ట్ హీరోయిన్ తమన్నా ఇటీవల ముంబైలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. తమన్నా ముంబైలో ఇల్లు కొన్నారన్న వార్త కన్నా.. ఆమె ఆ ఫ్లాట్‌ను అక్కడ ఉన్న సాధారణ ఖరీదు కన్నా రెట్టింపు ధర చెల్లించి కొన్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ బ్యూటీ కొన్న ఫ్లాట్‌లోని ఏ వ్యూ నుంచి చూసినా సముద్రం కనిపిస్తుందట. అందుకే తమన్నా ఆ అపార్ట్మెంట్ కోసం అంత ఖర్చు చేశారన్నది బీ టౌన్ టాక్. ఈ విషయంపై తమన్నా స్పందిస్తూ – ‘‘నేను ముంబైలో కొత్త ఫ్లాట్ కొన్నమాట వాస్తవమే. కానీ ప్రచారంలో ఉన్నట్లు డబుల్ అమౌంట్ మాత్రం పెట్టలేదు. ఇదే విషయమై మా హిందీ టీచర్ నాకు మొబైల్లో మెసేజ్ చేశారు. కాస్త ఆశ్చర్యానికి గురయ్యాను’’ అని వాపోయారు తమన్నా. ఇంకా కొత్త ఇంటి విశేషాలను చెబుతూ– ‘‘ప్రస్తుతం ఫ్లాట్ లోపలి వర్క్ జరుగుతోంది. పూర్తి కాగానే గృహ ప్రవేశం చేస్తాం. నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయడానికే నేను ఇష్టపడతాను’’ అని చెప్పుకొచ్చారు. -
ఇళ్ల కొనుగోలుకు హైదరాబాద్, విజయవాడ బెస్ట్!
ఇళ్ల కొనుగోలుకు హైదరాబాద్, విజయవాడలు అత్యుత్తమమని ప్రముఖ రియల్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా ఒక నివేదికలో సూచించింది. ‘క్రియేటింగ్ వెల్త్ విత్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్’ పేరుతో జేఎల్ఎల్ విడుదలచేసిన నివేదికలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలుకు దేశంలో కొన్ని కీలక ప్రాంతాలను సిఫార్సు చేసింది. దక్షిణాదిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, విజయవాడలను సంస్థ సూచించింది. సంస్థ సూచించిన మరికొన్ని ప్రాంతాల్లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్, లక్నో, చండీఘర్, జైపూర్, డెహ్రాడూన్, భువనేశ్వర్, కోల్‌కతా, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్‌లు ఉన్నాయి. చదరపు అడుగుకు రూ.2,500-రూ.5000 శ్రేణి ఉత్తమం చదరపు అడుగుకు రూ.2,500 నుంచి రూ.5,000 వరకూ పెట్టుబడి అత్యుత్తమమనీ నివేదికలో సూచించింది. అటు పెట్టుబడిపరంగా, ఇటు ధర పెరగడానికి ఈ శ్రేణి తగిన స్థాయి అని నివేదిక వివరించింది. ప్రదేశం కీలకం... ఏ స్థాయి వద్ద హౌసింగ్‌లో పెట్టుబడి పెట్టాలన్న అంశంపై నివేదిక నిర్దిష్ట ప్రమాణాలను ప్రస్తావించింది. కొనుగోలు విషయంలో ‘ప్రదేశం ఎక్కడ’ అనే విషయం కీలకమని తెలిపింది. అక్కడ మంచి మౌలిక సదుపాయాలు ఉండాలనీ, రవాణా వ్యవస్థ బాగుండాలనీ, ఆ ప్రాంతం వృద్ధికి తగిన పరిస్థితులూ కీలకమని జేఎల్ ఇండియా చైర్మన్ అండ్ కంట్రీ హెడ్ అనూజ్ పురి ఈ సందర్భంగా పేర్కొన్నారు. టైర్ 1 ,టైర్ 2 నగరాల్లో పెట్టుబడులు బాగుంటాయనీ వివరించింది. ఇక ఇన్వెస్టరు రియల్టీ అమ్మకాలు జరపాల్సి వస్తే... తగిన లాభాలకు తగిన సమయం కీలకమనీ విశ్లేషించింది. తాము సూచించిన ప్రమాణాలకు లోబడిన కొనుగోళ్లకు ధర వచ్చే మూడేళ్లలో వార్షికంగా 15 శాతం పెరుగుతుందని అంచనావేసింది. ఒక అసెట్‌ను దాదాపు ఎవ్వరూ గరిష్ట స్థాయి వద్ద అమ్మి సొమ్ము చేసుకోలేరనీ, అలాగే కనిష్ట స్థాయి వద్ద ఎవ్వరూ కొనుగోలు చేయలేరన్న విషయాన్ని గుర్తెరగాలని కూడా నివేదిక పేర్కొంది.