చాలా మందికి చిరకాల కోరిక.. కచ్చితంగా తమకంటూ ఒక ఇల్లు ఉండాలని.. పైగా ఉద్యోగం చేస్తున్నప్పుడే కట్టుకోవాలనుకుంటారు.. కొన్ని సార్లు పరిస్థితులు అనుకూలించకపోవడంతో కట్టుకోలేకపోతారు. కానీ ఇక్కడొక ఆరేళ్ల చిన్నారి ఏకంగా రూ.3.6 కోట్లు విలువ చేసే ఇల్లు కొనేసింది. ఎలాగో చదివేయండి.
(చదవండి: పంచాయితీ ఎన్నికల్లో ఒక అభ్యర్థికి కనివినీ ఎరుగని ఓట్లు!... కచ్చితంగా షాక్ అవుతారు!!)
అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాకి చెందిన రూబీ అనే ఆరేళ్ల చిన్నారి తన తోబుట్టువులైన సోదరుడు గుస్, సోదరి లూసితో కలిసి మెల్‌బోర్న్‌లోని క్లైడ్‌లో ఉన్న ఇంటిని ఏకంగా రూ.3.6 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ మేరకు పిల్లలు ఇంటి పనులు చేయడం, పుస్తకాలను ప్యాక్ చేయడం వంటి పనులు చేస్తూ డబ్బలు సంపాదించారని తండ్రి క్యామ్ మెక్‌లెల్లన్ చెప్పారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ లక్ష రూపాయలు చొప్పున ఆదా చేస్తూ వచ్చారని క్యామ్ అన్నారు.
అంతేకాదు తన పిల్లలకు ఈ ఆస్తిని వారికి తగిన వయసు వచ్చినప్పుడు పంచుతానని చెప్పానని కూడా వివరించారు. ఈ క్రమంలో ఆ చిన్నారుల తండ్రి క్యామ్ ఈ ఇంటి విలువ పదేళ్లలో రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అన్నారు. పైగా ఇప్పటికే ఈ ఇంటి ధర రూ 5 లక్షల వరకు పెరిగిందని చెప్పారు. అంతేకాదు 2032లో ఈ ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బును వారికి సమ భాగాలుగా పంచి ఇస్తానని చెప్పారు. అయితే ఆ చిన్నారుల తండ్రి కామ్ ఏ పని చేయకుండా ఏడాదికి రూ 190 లక్షలను ఆర్జించడం కనుగొనటం విశేషం. ఆ తర్వాత క్యామ్ 36 ఏళ్ల వయసులో పదవీ విరమణ తీసుకున్నాడు. అయితే అతను 20 ఏళ్ల వయసులోనే ఆస్తులు కూడాబెట్టడం ప్రారంభించాడు. పైగా అతనికి 50 ఏళ్ల వయసులో పని చేయడం అసలు ఇష్టం లేదంట..
Comments
Please login to add a commentAdd a comment