austalia
-
ఆరేళ్ల చిన్నారి.. రూ.3.6 కోట్ల విలువైన ఇల్లు.. ఎలా కొనుగోలు చేసిందో తెలుసా?
చాలా మందికి చిరకాల కోరిక.. కచ్చితంగా తమకంటూ ఒక ఇల్లు ఉండాలని.. పైగా ఉద్యోగం చేస్తున్నప్పుడే కట్టుకోవాలనుకుంటారు.. కొన్ని సార్లు పరిస్థితులు అనుకూలించకపోవడంతో కట్టుకోలేకపోతారు. కానీ ఇక్కడొక ఆరేళ్ల చిన్నారి ఏకంగా రూ.3.6 కోట్లు విలువ చేసే ఇల్లు కొనేసింది. ఎలాగో చదివేయండి. (చదవండి: పంచాయితీ ఎన్నికల్లో ఒక అభ్యర్థికి కనివినీ ఎరుగని ఓట్లు!... కచ్చితంగా షాక్ అవుతారు!!) అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాకి చెందిన రూబీ అనే ఆరేళ్ల చిన్నారి తన తోబుట్టువులైన సోదరుడు గుస్, సోదరి లూసితో కలిసి మెల్బోర్న్లోని క్లైడ్‌లో ఉన్న ఇంటిని ఏకంగా రూ.3.6 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ మేరకు పిల్లలు ఇంటి పనులు చేయడం, పుస్తకాలను ప్యాక్ చేయడం వంటి పనులు చేస్తూ డబ్బలు సంపాదించారని తండ్రి క్యామ్ మెక్లెల్లన్ చెప్పారు. అంతేకాదు ప్రతి ఒక్కరూ లక్ష రూపాయలు చొప్పున ఆదా చేస్తూ వచ్చారని క్యామ్ అన్నారు. అంతేకాదు తన పిల్లలకు ఈ ఆస్తిని వారికి తగిన వయసు వచ్చినప్పుడు పంచుతానని చెప్పానని కూడా వివరించారు. ఈ క్రమంలో ఆ చిన్నారుల తండ్రి క్యామ్ ఈ ఇంటి విలువ పదేళ్లలో రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అన్నారు. పైగా ఇప్పటికే ఈ ఇంటి ధర రూ 5 లక్షల వరకు పెరిగిందని చెప్పారు. అంతేకాదు 2032లో ఈ ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బును వారికి సమ భాగాలుగా పంచి ఇస్తానని చెప్పారు. అయితే ఆ చిన్నారుల తండ్రి కామ్ ఏ పని చేయకుండా ఏడాదికి రూ 190 లక్షలను ఆర్జించడం కనుగొనటం విశేషం. ఆ తర్వాత క్యామ్ 36 ఏళ్ల వయసులో పదవీ విరమణ తీసుకున్నాడు. అయితే అతను 20 ఏళ్ల వయసులోనే ఆస్తులు కూడాబెట్టడం ప్రారంభించాడు. పైగా అతనికి 50 ఏళ్ల వయసులో పని చేయడం అసలు ఇష్టం లేదంట.. (చదవండి: బాప్రే! గాలి పటంతో పాటు మనిషి కూడా గాల్లోనే... !! -
వ్యాక్సిన్ వేయించుకుంది.. రూ 7.4 కోట్లు గెలుచుకుంది
ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ వ్యాక్సిన్లు తీసుకునేలా అధికారులు రకరకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా తమ దేశంలోని ప్రజలంతా వ్యాక్సిన్లు వేయించుకునేలా రకరకాల కార్యక్రమాలతో పాటు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. (చదవండి: అక్తర్‌కు పరువు నష్టం నోటీస్.. భజ్జీతో కనిపించినందుకే!) ఈ మేరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఉచితంగా బీర్లు, ఆహారపదార్థాలు, లాటరీ వంటి టికెట్లను ఇస్తామంటూ రకకరాల ప్రోత్సహాకాలను అందించింది. అంతేకాదు ప్రజలందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించే నిమిత్తం ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రవేట్ కంపెనీలు ఒక మిలియన్ డాలర్ వ్యాక్స్ అలయన్స్ లాటరీని రూపొందించారు. ఇది ప్రజలనుంచి విశేష స్పందన వచ్చింది. పైగా దాదాపు 30 లక్షల మంది ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవటమే కాక ఈ లక్కీ డ్రాలో తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. అయితే చివరికి ఈ లక్కీ డ్రాని 25 ఏళ్ల ఝూ గెలుచుకంది. సదరు లక్కీ డ్రా అధికారులు చెప్పేంత వరకు ఆమెకు తెలియదు. దీంతో ఆమె ఈ డబ్బులో కొంత భాగం తమ కుటుంబ సభ్యుల కోసం వెచ్చించడమే కాక మిగిలి డబ్బుని భవిష్యత్తు అవసరాల కోసం ఖర్చుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. (చదవండి: దీపావళి పండుగ ముగింపు... ఒక వింతైన ఆచారం) -
చరిత్ర సృష్టించనున్న మిథాలీ సేన..
ముంబై: భారత మహిళా క్రికెట్ లో మరో ఘట్టానికి తెర లేవనుంది. మహిళల క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకు వేళ్లేందుకు బీసీసీఐ అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా భారత మహిళా క్రికెట్ జట్టు తమ తొలి డేనైట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాలో మిథాలీ సేన పింక్ బాల్ టెస్ట్ ఆడనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ మ్యాచ్ జరగునుంది. ఈ విషయాన్ని భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే మహిళల క్రికెట్ చరిత్రలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే పింక్‌బాల్ టెస్టు రెండోది మాత్రమే. 2017లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా తొలి డేనైట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.జూన్ 2న భారత పురుషులతో పాటు మహిళలు కూడా ఇంగ్లండ్ పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఏడేళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో మిథాలీ సేన టెస్టు మ్యాచ్ ఆడనుంది. జూన్ 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. (చదవండి:ఇంగ్లండ్ వేదికగా ఐపీఎల్ ?) -
Mike Hussey: ఎట్టకేలకు స్వదేశానికి..
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ ఎట్టకేలకు స్వదేశానికి బయలు దేరాడు. మాల్దీవుల నుంచి ఆదివారం దోహా మీదుగా హస్సీ ఆస్ట్రేలియాకు పయనమయ్యాడని, సోమవారం అక్కడికి చేరుకుంటాడని చెన్నై జట్టు సీఈవో కేఎస్ విశ్వనాథన్ ట్విటర్లో పేర్కొన్నాడు. ఇక మాల్దీవుల్లో ఉన్న ప్యాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ సహా ఇతర ఆస్ట్రేలియా ఆటగాళ్లు బీసీసీఐ ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేరుకోనున్నారు. సిడ్నీలోని ఓ హోటల్లో క్వారంటైన్ పూర్తి చేసుకున్న అనంతరం వారు ఇళ్లకు వెళ్లే అవకాశం ఉంది. కాగా భారత్‌లో కరోనా మహమ్మారి ప్రకంపనల నేపథ్యంలో ఐపీఎల్-2021 నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. చదవండి: సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు -
న్యూజిలాండ్‌దే టి20 సిరీస్
వెల్లింగ్టన్: సిరీస్ విజేతను తేల్చే నిర్ణాయక ఐదో టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఏడు వికెట్లతో ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్‌ను 3–2తో సొంతం చేసుకుంది. తొలుత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. వేడ్ (44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫించ్ (36; 5 ఫోర్లు, సిక్స్) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. ఇష్ సోధి 3 వికెట్లు తీయగా... సౌతీ, బౌల్ట్ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం న్యూజిలాండ్ 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి నెగ్గింది. గప్టిల్ (71, 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), గ్లెన్ ఫిలిప్స్ (34 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. -
ఫేస్బుక్ వర్సెస్ ఆస్ట్రేలియా
కాన్బెరా: గూగుల్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు వార్తాసంస్థలకు డబ్బులు చెల్లించాలన్న చట్టం తెస్తున్న ఆస్ట్రేలియాపై దిగ్గజ టెక్ సంస్థ ఫేస్బుక్ సంచలనాత్మక తిరుగుబాటు చేసింది. ఆస్ట్రేలియాలోని ఫేస్బుక్ వినియోగదారులకు వార్తలను అందించడాన్ని, వారు తమ ప్లాట్‌ఫామ్‌పై వార్తలను షేర్ చేయడాన్ని బ్లాక్ చేసింది. అత్యవసర సేవలకు సంబంధించిన వివరాలు సహా ప్రభుత్వ సందేశాలను ప్రసారం చేయడాన్ని నిలిపేసింది. ఫేస్బుక్ చర్యను ఆస్ట్రేలియా ప్రభుత్వం ఖండించింది. ‘ఫేస్బుక్ నిర్ణయం సార్వభౌమ దేశంపై దాడి’అని ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రి గ్రెగ్ హంట్ అభివర్ణించారు. ‘ఇది టెక్నాలజీపై నియంత్రణను దుర్వినియోగం చేయడమే’అని మండిపడ్డారు. వార్తలను షేర్ చేసినందుకు గూగుల్, ఫేస్బుక్ తదితర సంస్థలు ఆస్ట్రేలియా వార్తా సంస్థలకు డబ్బులు చెల్లించాలని, అందుకు ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని పేర్కొంటూ ఆస్ట్రేలియా ఒక బిల్లును రూపొందించింది. ఆ బిల్లును ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదించింది. సెనెట్ ఆమోదించాక చట్టరూపం దాలుస్తుంది. తమ ప్లాట్‌ఫామ్‌కు, వార్తాసంస్థలకు మధ్య సంబంధాన్ని ఈ చట్టం తప్పుగా అర్థం చేసుకుందని ఫేస్బుక్ వ్యాఖ్యానించింది. -
విమర్శలకు కౌంటరిచ్చిన రోహిత్ శర్మ
‘ఎందుకు, ఎందుకలా? నేను నమ్మలేకపోతున్నా. ఇది చాలా బాధ్యతారాహిత్యమైన షాట్. లాంగాన్, డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డర్లు ఉన్నారు. రెండు బంతుల ముందే ఫోర్ కొట్టిన తర్వాత అలాంటి షాట్ ఆడాల్సిన అవసరం ఏముంది. దీనికి ఎలాంటి సాకులు కూడా చెప్పడానికి లేదు. అతి సునాయాస క్యాచ్. అలాంటివి వదిలేసే ఫీల్డర్ (స్టార్క్) కూడా కాదు. తన వికెట్‌ను బహుమతిగా ఇచ్చేశాడు. ఒక వికెట్ వృథా అయిపోయింది. ఇది టెస్టు మ్యాచ్. మంచి ఆరంభం తర్వాత దానిని భారీగా మలచాలి గానీ ఇలా కాదు’... రెండో రోజు రోహిత్ శర్మ అవుటైన తీరుపై దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన తీవ్ర వ్యాఖ్య ఇది. పలువురు మాజీలు కూడా ఇదే రకంగా తమ అసంతృప్తిని ప్రదర్శించారు. రోహిత్ ఆత్మవిశ్వాసంతో ఆడుతూ మ్యాచ్‌ను శాసించే భారీ ఇన్నింగ్స్‌కు సిద్ధమైనట్లుగా కనిపించాడు. కానీ అతను అనూహ్యంగా వెనుదిరగడం భారత్‌ను ఆత్మరక్షణలో పడేసింది. అయితే ఈ విమర్శలకు రోహిత్ తనదైన శైలిలో బలంగా బదులిచ్చాడు. ‘నేను అవుటైన తీరు పట్ల ఎలాంటి బాధా లేదు. ఇలా ఆడటాన్నే నేను ఇష్టపడతాను. ఈ సిరీస్‌లో పరుగులు చేయడానికి ఇరు జట్లు ఎంత ఇబ్బంది పడుతున్నాయో చూస్తున్నాం. కుదురుకున్న తర్వాత బౌలర్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తా. జట్టులో నాకు అప్పగించిన పని కూడా అదే. ఎవరో ఒకరు ఆ పని చేయాల్సిందే కదా. ఈ క్రమంలో తప్పులు కూడా జరగవచ్చు. అందుకు సిద్ధంగా ఉండాలి. నేను ఆడిన షాట్లు కూడా మా ప్రణాళికల్లో భాగమే. కాబట్టి ఆ షాట్ విషయంలో పశ్చాత్తాపం చెందడం లేదు. లయన్ తెలివిగా బంతిని వేయడం వల్ల నేను కొట్టిన షాట్‌కు బంతి అనుకున్నంత దూరం వెళ్లలేదు’ అని రోహిత్ తన మాటను స్పష్టంగా చెప్పాడు. గతంలోనూ తాను ఈ తరహా షాట్లను సమర్థంగా ఆడిన విషయాన్ని భారత ఓపెనర్ గుర్తు చేశాడు. ‘ఈ షాట్ ఎక్కడి నుంచో అనూహ్యంగా రాలేదు. గతంలో చాలాసార్లు ఆడాను కాబట్టి ఎప్పుడైనా ఆడగలనని నాపై నాకు నమ్మకముంది. తర్వాత చూస్తే తప్పుడు షాట్లాగా అనిపించవచ్చని ఒప్పుకుంటాను. కానీ ఇలాంటివి ఆడినప్పుడు కొన్నిసార్లు అవుట్ కావచ్చు. కొన్నిసార్లు బౌండరీ బయట బంతి పడవచ్చు. ఇక ముందూ వాటిని ఆడతాను. రెండు టెస్టులు క్వారంటైన్లో ఉండి చూశాను. ఇంత పదునైన, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌లో పరుగులు చేసేందుకు ఏదో ఒక దారి వెతకడం గురించే ఆలోచించేవాడిని. ఎవరైనా చివరకు పరుగులు చేయడమే ముఖ్యం. ఇలా దూకుడు ప్రదర్శించి పరుగులు రాబడితే ప్రత్యర్థి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నా. నేను అవుటైన బంతి ముందు వరకు నేను ఆడిన ఆట నాకు చాలా నచ్చింది. ఆ బంతి వరకు అంతా నేను అనుకున్నట్లే సాగింది’ అని తన ఆటను రోహిత్ విశ్లేషించాడు. -
లంచ్‌కు ముందే ఆసీస్ ఆలౌట్
బ్రిస్బేన్ : భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్సింగ్స్‌లో ఆతిథ్య జట్టు మొదటి ఇన్సింగ్స్‌లో ఆసీస్ 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టు ఆటగాళ్లలో లబుషేన్ 108, టిమ్ పైన్ 50, గ్రీన్ 47 పరుగులతో రాణించారు. 274/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఈ రోజు ఆటలో భాగంగా లంచ్‌కు ముందే ఆసీస్‌ను ఆలౌట్ చేశారు. ఓవరనైట్ ఆటగాళ్లు పైన్, కామెరూన్ గ్రీన్‌లు ఆకట్టుకున్నారు.(పంత్ మొత్తుకున్నా నమ్మలేదు..) ఈ జోడి 98 పరుగులు జోడించారు. ఆరో వికెట్‌గా పైన్ ఔటైన తర్వాత ఆసీస్ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్లలో స్టార్క్ 20 పరుగులతో అజేయంగా నిలవగా, లయన్ 24 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో నటరాజన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్లు తలో మూడు వికెట్లు సాధించగా, సిరాజ్‌కు వికెట్ దక్కింది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లు 1-1తో సిరీస్ సమానంగా ఉన్నాయి.చివరి టెస్ట్‌లో ఎవరి గెలిస్తే వారికే సిరీస్ దక్కుతుంది. దీంతో నాలుగో టెస్టులో గెలుపు కోసం ఇరుజట్లు తీవ్రంగా శ్రమించే అవకాశం ఉంది. -
టీమిండియా విజయం బహుదూరం
సిడ్నీ: ఈ సిరీస్‌లో జరిగిన రెండు టెస్టులు ఆఖరి రోజు దాకా సాగనేలేదు. ఐదో రోజు బంతి గమనం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అయితే ఆసీస్ పేస్ బలం పదునుగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌ను శాసించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఓపెనర్లను తీసి పట్టు బిగించింది. ఇలాంటి పరిస్థితుల్లో మన బ్యాట్స్‌మెన్ పోరాటం బహుదూరపు లక్ష్యానికి ఎలా చేరువవుతుందో మరి! క్రీజులో ఉన్న చతేశ్వర్ పుజారా (29 బంతుల్లో 9 బ్యాటింగ్; 1 ఫోర్), కెప్టెన్ అజింక్యా రహానే (14 బంతుల్లో 4 బ్యాటింగ్)ల భాగస్వామ్యం చివరి రోజు తొలి సెషన్లో కీలకం కానుంది. ఈ జోడీకి సోమవారం ఉదయం సెషన్లోనే చుక్కెదురైతే మాత్రం భారత్ పరాజయాన్ని... ఆస్ట్రేలియా 2–1 ఆధిక్యాన్ని... ఎవరూ అడ్డుకోలేరు. ఇదీ ఈ టెస్టు సంగతీ! భారత్ ముందు ఆస్ట్రేలియా 407 పరుగుల కఠిన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (98 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (64 బంతుల్లో 31; 4 ఫోర్లు) కాసేపు ఓపిగ్గా ఆడారు. ప్రత్యర్థి పేస్ బౌలింగ్‌ను చక్కగానే ఎదుర్కొన్నారు. 71 పరుగుల దాకా సాఫీగా సాగిపోయిన రెండో ఇన్నింగ్స్‌ను మొదట హాజల్‌వుడ్, కాసేపటికే కమిన్స్ కుదిపేశారు. దీంతో భారత్ వంద పరుగులలోపే ఓపెనర్లిద్దరినీ కోల్పోయి కష్టాల్లో పడింది. కుదురుగా ఆడుతున్న గిల్‌ను హాజల్‌వుడ్, అర్ధసెంచరీ సాధించిన రోహిత్ శర్మను కమిన్స్ ఔట్ చేశారు. ఇప్పుడైతే చేతిలో 8 వికెట్లున్నా... గాయపడిన రవీంద్ర జడేజా బ్యాట్ పట్టలేని పరిస్థితి. మిగతా బౌలర్లను తీసేస్తే స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ నలుగురే చేతిలో ఉన్నారు. కానీ ఇంకా భారత్ చేయాల్సినవి 309 పరుగులు. చివరిరోజు ఎదుర్కోవాల్సిన ఓవర్లు 90. రోజంతా ఆడినా టెస్టుల్లో 309 పరుగులు చేయడం కష్టమే. క్రీజులో నిలబడితే ‘డ్రా’ అవుతుందేమో తప్ప... భారత్ విజయానికి చేరువ కాలేనంత దూరంలోనే ఉంది. ముగ్గురు ఫిఫ్టీ... తొలి ఇన్నింగ్స్‌లో చితగ్గొట్టిన లబ్‌షేన్, స్మిత్‌లు రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్‌కు మింగుడు పడని స్కోర్లే చేశారు. వీళ్లిద్దరితో పాటు కామెరాన్ గ్రీన్ కూడా అర్ధశతకం సాధించడంతో భారత లక్ష్యం కొండంత అయ్యింది. ఆదివారం ముందుగా ఓవర్‌నైట్ స్కోరు 103/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 312 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ లబ్‌షేన్ (118 బంతుల్లో 73; 9 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (167 బంతుల్లో 81; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. వీళ్లిద్దరు మూడో వికెట్‌కు 103 పరుగులు జోడించాక... లబ్‌షేన్ ఔటయ్యాడు. జట్టు స్కోరు 138 పరుగుల వద్ద నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి అతను నిష్క్రమించాడు. మరో 10 పరుగులు జతయ్యాక మాథ్యూ వేడ్ (4)ను సైనీనే పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన గ్రీన్, అక్కడే పాతుకుపోయిన స్మిత్ జట్టు స్కోరును 200 పరుగులు దాటించారు. కాసేపటికే స్మిత్‌ను అశ్విన్ ఎల్బీగా పంపించాడు. తర్వాత కూడా భారత్‌కు పట్టుచిక్కలేదు. గ్రీన్ (132 బంతుల్లో 84; 8 ఫోర్లు, 4 సిక్సర్లు)తో పాటు కెప్టెన్ పైన్ (52 బంతుల్లో 39 నాటౌట్; 6 ఫోర్లు) టీమిండియా బౌలింగ్‌ను తేలిగ్గా ఎదుర్కొన్నారు. వీరిద్దరి మధ్య 104 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. దీంతో ఆతిథ్య జట్టు స్కోరు 300 పరుగులు దాటింది. బుమ్రా... గ్రీన్‌ను ఔట్ చేయడంతో జట్టు స్కోరు 312 పరుగుల వద్ద కెప్టెన్ పైన్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగుల ఆధిక్యంతో భారత చేదించాల్సిన లక్ష్యం కాస్త 400 పరుగులను దాటింది. ► అత్యధికసార్లు ఒకే టెస్టు మ్యాచ్‌లో సెంచరీతోపాటు అర్ధసెంచరీ కూడా చేసిన బ్యాట్స్‌మన్‌గా జాక్వస్ కలిస్ (11 సార్లు–దక్షిణాఫ్రికా) పేరిట ఉన్న రికార్డును ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ (11 సార్లు) సమం చేశాడు. రికీ పాంటింగ్ (10 సార్లు–ఆస్ట్రేలియా) రెండో స్థానంలో నిలిచాడు. ► విదేశీ గడ్డపై టెస్టులోని నాలుగో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు 50 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం 17 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 2006లో వెస్టిండీస్‌తో సెయింట్ కిట్స్‌లో జరిగిన టెస్టులో సెహ్వాగ్–వసీమ్ జాఫర్ జంట తొలి వికెట్‌కు 109 పరుగులు జోడించింది. ► టెస్టు ఇన్నింగ్స్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ అత్యధికంగా నాలుగు క్యాచ్‌లు తీసుకోవడం ఇది రెండోసారి. 2001లో బంగ్లాదేశ్‌తో టెస్టులో యూనిస్ ఖాన్ (పాక్) నాలుగు క్యాచ్‌లు... తాజా సిడ్నీ టెస్టులో భారత సబ్‌స్టిట్యూట్ కీపర్ సాహా నాలుగు క్యాచ్‌లు పట్టారు. ► కష్టాలన్నీ భారత్‌నే చుట్టుముట్టాయి. కొండంత లక్ష్యం... ఓపెనర్ల నిష్క్రమణ... జడేజా బ్యాట్ పట్టలేని స్థితి. 90 ఓవర్లు ఎదుర్కొనేందుకు స్కోరు బోర్డుపై 8 వికెట్లు కనబడుతున్నా... స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ అందులో సగమే (నలుగురే). క్లిష్టమైన ఎదురీత ఎందాక సాగుతుందో నేటి ఉదయం సెషన్ గడిస్తేగానీ తెలియదు. ఆఖరి రోజంతా ఆడే సత్తా, భారీ భాగస్వామ్యం, క్రీజులో పాతుకుపోయే బ్యాట్స్‌మెన్ ఉంటే టీమిండియా కనీసం ‘డ్రా’తోనైనా గట్టెక్కవచ్చు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 338; భారత్ తొలి ఇన్నింగ్స్: 244; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వార్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 13; పకోవ్‌స్కీ (సి) సబ్–సాహా (బి) సిరాజ్ 10; లబ్‌షేన్ (సి) సబ్–సాహా (బి) 73; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 81; వేడ్ (సి) సబ్–సాహా (బి) సైనీ 4; గ్రీన్ (సి) సబ్–సాహా (బి) బుమ్రా 84; పైన్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (87 ఓవర్లలో 6 వికెట్లకు డిక్లేర్డ్ ) 312 వికెట్ల పతనం: 1–16, 2–35, 3–138, 4–148, 5–208, 6–312. బౌలింగ్: బుమ్రా 21–4–68–1, సిరాజ్ 25–5–90–1, సైనీ 16–2–54–2, అశ్విన్ 25–1–95–2. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్టార్క్ (బి) కమిన్స్ 52; శుబ్‌మన్ గిల్ (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 31; పుజారా (బ్యాటింగ్) 9; రహానే (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (34 ఓవర్లలో 2 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–71, 2–92. బౌలింగ్: స్టార్క్ 6–0–27–0, హాజల్‌వుడ్ 8–3–11–1, కమిన్స్ 9–1–25–1, లయన్ 9–3–22–0, గ్రీన్ 2–0–12–0. -
పుజారా ఆడకపోయుంటే...
100 బంతుల్లో 16 పరుగులు... 133 బంతుల్లో 40... 174 బంతుల్లో అర్ధ సెంచరీ... తొలి వంద బంతుల్లో ఒక్క ఫోర్ కూడా లేదు... శనివారం చతేశ్వర్ పుజారా బ్యాటింగ్ సాగిన తీరు ఇది. దీనిపైనే పలువురు మాజీలు, అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. రికీ పాంటింగ్ కూడా ‘ఇది సరైన పద్ధతి కాదు. స్కోరింగ్ వేగం మరింత ఎక్కువగా ఉండాల్సింది. ఈ తరహా ఆట ఇతర బ్యాట్స్‌మెన్‌పై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది’ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఇలా ఆడటం ఇదేమీ మొదటిసారి కాదు! నిజానికి ఇదే అతని బలం కూడా. పరుగులు చేయడంలో అతని శైలే ఇది. పుజారా విషయంలో ఇలాంటిది బ్రహ్మాండంగా పని చేస్తుంది కూడా. సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో పాతుకుపోయి... ప్రత్యర్థి బౌలర్లు అలసిపోయి, గతి తప్పి పేలవ బంతులు వేసే వరకు వేచి చూడటం... ఆపై పరుగులు రాబట్టడం అతనికి తెలిసిన విద్య. 2018లో జొహన్నెస్‌బర్గ్ టెస్టులో 50వ బంతికి తొలి పరుగు తీసిన రోజు కూడా పుజారా శైలిపై విమర్శలు రాలేదు. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచినప్పుడు పుజారా ఇదే మంత్రం పఠించాడు. సిరీస్ మొత్తంలో అసాధారణంగా సుమారు 30 గంటల పాటు అతను బ్యాటింగ్ చేసిన విషయం మరచిపోవద్దు. అతనిలో ‘దూకుడు’ లోపించిందని చెప్పడంలో అర్థం లేదు. సాధారణంగా అయితే నిలదొక్కుకోవడానికి కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత షాట్లు ఆడుతూ లెక్క సరి చేయడం అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ చేస్తుంటారు. అడిలైడ్ టెస్టులో కోహ్లి తన తొలి 80 బంతుల్లో 29 పరుగులే చేసి ఆపై కొంత జోరు పెంచాడు. అయితే పుజారాకు అలాంటి షాట్ల ‘రిస్క్’ విలువేమిటో బాగా తెలుసు. శనివారం భారత జట్టు ఉన్న స్థితిలో అలాంటి రిస్క్‌లు కూడా అనవసరమని అతను భావించినట్లున్నాడు. అన్నింటికి మించి ఫామ్‌లో ఉన్న ముగ్గురు అత్యుత్తమ పేసర్లను అతను ఎదుర్కొంటున్నాడు. పిచ్ భిన్నంగా స్పందిస్తోంది. ఎన్ని ఎక్కువ బంతులు ఆడితే అన్ని ఎక్కువ పరుగులు చేసే అవకాశం తనకు పెరుగుతుందని అతను అనుకున్నాడు. అన్నింటికి మించి తన సహచరుల బ్యాటింగ్ బలంపై కూడా అతనికి అంచనా ఉంది. టెస్టు క్రికెట్లో సుమారు 31 వేల బంతులు ఆడిన పుజారాకు తనకు ఏది బాగా పని చేస్తుందో తెలీదా! చివరకు అతను భయపడినట్లే జరిగింది. కమిన్స్ వేసిన ఒక అద్భుత బంతికి పుజారా వెనుదిరిగాక జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. అతను కూడా పట్టుదలగా నిలబడకుండా వేగంగా ఆడితే చాలనే భావనలో వెళితే అసలు ఈ మాత్రం స్కోరైనా వచ్చేదా! జట్టు పేలవ ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఎదుర్కోగలిగిన బ్యాట్స్‌మెన్ అని చూడకుండా రహానేపై ఒత్తిడి పెరిగి అవుట్ కావడానికి కారణమయ్యాడని, అతని ఆట శైలి కారణంగానే విహారి కూడా రనౌట్ అయ్యాడని విమర్శించడంలో ఏమాత్రం అర్థం లేదు. నేను బాగా ఆడుతున్న సమయంలో ఒక మంచి బంతికి అవుటయ్యాను. నాకు తెలిసిన శైలిలోనే నేను బ్యాటింగ్ చేస్తాను. అంతకంటే మెరుగ్గా నేను ఏమీ చేయలేను. కమిన్స్ వేసిన ఆ బంతి ఈ సిరీస్‌లోనే అత్యుత్తమమైంది. నేను ఆడక తప్పని పరిస్థితి. మనది కాని రోజు చిన్న తప్పులు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. పుజారా, భారత బ్యాట్స్‌మన్ -
పాండ్యా మెరుపులతో... బుమ్రా మలుపుతో...
వరుస సెంచరీలు, శతక భాగస్వామ్యాలు, భారీ స్కోర్లతో చెలరేగిపోతున్న ఆస్ట్రేలియాను ఆఖరి వన్డేలో భారత్ ఆల్‌రౌండ్ దెబ్బకొట్టింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా వీరోచిత పోరాటం, రవీంద్ర జడేజా సందర్భోచిత మెరుపులు భారత్‌కు పోరాడేందుకు సాయపడితే... బౌలింగ్‌లో బుమ్రా అద్భుతమైన మలుపు ఆసీస్ గెలుపు బాటనే కాదు... ఈ సిరీస్‌లోనే జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది. కాన్బెర్రా: ఇది ఒకరితో దక్కిన విజయం కాదు. అలాగని ఇదేమీ ఊరట గెలుపు కాదు. ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని, బ్యాటింగ్ బలాన్ని బద్దలు కొట్టిన విజయం. రెండు వన్డేల్లోనూ 370 పైచిలుకు పరుగులు చేసి కూడా చెమటోడ్చిన ఆసీస్‌ను... భారత్ కేవలం 302 పరుగులు చేసి నిలువరించడం గొప్ప విషయం. సిరీస్ చేజారినా ఇక్కడ బ్యాటింగ్... బౌలింగ్... ఆతిథ్య జట్టును పెట్టించిన ‘కంగారూ’ అంతా ఇంత కాదు. క్లీన్‌స్వీప్ తప్పించి శుక్రవారం ఇక్కడే జరిగే తొలి టి20 మ్యాచ్‌కు ముందు భారత్‌కు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన విజయం ఇది. ఆసీస్ లక్ష్యం 303. గత మ్యాచ్‌ల భారీస్కోర్ల దృష్ట్యా, స్మిత్ వరుస సెంచరీల ఫామ్ దృష్ట్యా ఆతిథ్య జట్టుకు ఇదేమాత్రం కష్టం కానేకాదు. అయితే 158 పరుగులకే 5 వికెట్లు కోల్పో వడంతో భారత్‌కు విజయం ఖాయమవుతున్న తరుణంలో మ్యాక్స్‌వెల్ ధాటిగా ఆడిన ఇన్నింగ్స్ ఆసీస్‌ను 268/6 దాకా తీసుకెళ్లింది. ఇక 34 బంతుల్లో 35 పరుగుల విజయ సమీకరణం భారత్‌ను క్లీన్‌స్వీప్ చేసేలా కనిపించింది. కానీ బుమ్రా వేసిన 45వ ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేయడంతో 268 పరుగుల వద్ద ఏడో వికెట్ పడింది. తర్వాత టెయిలెండర్లు 21 పరుగుల వ్యవధిలోనే నిష్క్రమించడంతో ఆసీస్ ఆలౌటైంది. భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో నెగ్గిన ఆసీస్ సిరీస్‌ను 2–1తో గెల్చుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (76 బంతుల్లో 92 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (50 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశారు. తర్వాత ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఫించ్ (82 బంతుల్లో 75; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్ (38 బంతుల్లో 59; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. శార్దుల్ 3 వికెట్లు, బుమ్రా, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు. కోహ్లి అర్ధ సెంచరీ... భారత ఓపెనర్లలో ధావన్ (16) నిరాశపర్చగా, శుబ్‌మన్ గిల్ (33; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. తర్వాత కోహ్లి (78 బంతుల్లో 63; 5 ఫోర్లు) బాధ్యతగా ఆడాడు. కానీ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామమైన ఈ పిచ్‌పై రన్‌రేట్ జోరందుకోలేదు. అయ్యర్ (19), రాహుల్ (5) చేతులెత్తేశారు. కోహ్లి 32వ ఓవర్లో 152 పరుగుల వద్ద నిష్క్రమించాడు. ఈ దశలో పాండ్యా, జడేజా జోడీ అదరగొట్టింది. ఆరో వికెట్‌కు అజేయంగా 150 పరుగులు జోడించడంతో భారత్ స్కోరు 300 దాటింది. భయపెట్టిన మ్యాక్స్‌వెల్... అరంగేట్రం చేసిన నటరాజన్, జట్టులోకి వచ్చిన శార్దుల్ ఆసీస్ టాపార్డన్‌ను ఇబ్బంది పెట్టారు. వారి బౌలింగ్‌లో లబ్‌షేన్ (7), స్మిత్ (7) సింగిల్ డిజిట్‌కే పరిమితమైనా మరో ఓపెనర్ ఫించ్ చక్కని ఇన్నింగ్స్‌తో విజయానికి అవసరమైన పరుగులు జతచేశాడు. వరుస విరామాల్లో హెన్రిక్స్ (22), గ్రీన్ (21), క్యారీ (38) ఔట్ కావడంతో భారత శిబిరంలో ఆశలు రేగాయి. కానీ మ్యాక్స్‌వెల్ చెలరేగడంతో ఆసీస్ ఒక్కసారిగా లక్ష్యానికి చేరువైంది. ఈ దశలో బుమ్రా చక్కని డెలివరీతో మ్యాక్స్‌వెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇది మ్యాచ్‌ను అనూహ్య మలుపు తిప్పింది. భారత్‌ను విజేతగా మార్చింది. స్మిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ధావన్ (సి) అగర్ (బి) అబాట్ 16; శుబ్‌మన్ గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అగర్ 33; కోహ్లి (సి) క్యారీ (బి) హజల్‌వుడ్ 63; అయ్యర్ (సి) లబ్‌షేన్ (బి) జంపా 19; రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అగర్ 5; పాండ్యా (నాటౌట్) 92; జడేజా (నాటౌట్) 66; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 302. వికెట్ల పతనం: 1–26, 2–82, 3–114, 4–123, 5–152. బౌలింగ్: హజల్‌వుడ్ 10–1–66–1, మ్యాక్స్‌వెల్ 5–0–27–0, అబాట్ 10–0–84–1, గ్రీన్ 4–0–27–0, అగర్ 10–0–44–2, జంపా 10–0–45–1, హెన్రిక్స్ 1–0–7–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: లబ్‌షేన్ (బి) నటరాజన్ 7; ఫించ్ (సి) ధావన్ (బి) జడేజా 75; స్మిత్ (సి) రాహుల్ (బి) శార్దుల్ 7; హెన్రిక్స్ (సి) ధావన్ (బి) శార్దుల్ 22; గ్రీన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 21; క్యారీ (రనౌట్) 38; మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 59; అగర్ (సి) కుల్దీప్ (బి) నటరాజన్ 28; అబాట్ (సి) రాహుల్ (బి) శార్దుల్ 4; జంపా (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 4; హజల్‌వుడ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 289. వికెట్ల పతనం: 1–25, 2–56, 3–117, 4–123, 5–158, 6–210, 7–268, 8–278, 9–278, 10–289. బౌలింగ్: బుమ్రా 9.3–0–43–2, నటరాజన్ 10–1–70–2, శార్దుల్ 10–1–51–3, కుల్దీప్ 10–0–57–1, జడేజా 10–0–62–1. వన్డే సిరీస్ ట్రోఫీతో ఆస్ట్రేలియా జట్టు జడేజా, హార్దిక్ పాండ్యా -
సిరేసులో ఉండాలంటే...
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. ఇప్పుడు కోహ్లి బృందం కూడా అదే చేయాలి. సిడ్నీలో ఎదురైన ఓటమికి... ఈ సిడ్నీలోనే విజయంతో ఆసీస్‌కు సమాధానం ఇవ్వాలి. అప్పుడే సిరీస్‌లో ఉంటాం. లేదంటే క్లీన్‌స్వీప్ దారిలో పడిపోతాం. సిడ్నీ: తొలి వన్డే ఓటమితో సిరీస్‌లో వెనుకబడిన భారత జట్టు ఇప్పుడు రేసులో నిలిచే పనిలో పడింది. ఇక్కడే జరిగే రెండో వన్డేలో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఐపీఎల్ పొట్టి ఫార్మాట్ నుంచి, గత మ్యాచ్‌లో చేసిన పొరపాట్ల నుంచి తొందరగా బయటపడాలని కోహ్లి సేన భావిస్తోంది. మరోవైపు సిరీస్‌లో శుభారంభం చేసిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు వరుస విజయంపై కన్నేసింది. బ్యాటింగ్, బౌలింగ్... ఆల్‌రౌండ్ సత్తాతో పర్యాటక జట్టును మళ్లీ కంగారు పట్టించేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో ఆదివారం రెండో వన్డే జరుగుతుంది. కోహ్లి ఫామ్‌పైనే కలవరం... ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి చక్కగా రాణించిన సందర్భాలున్నాయి. కానీ ప్రత్యేకించి ఇక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో అతని ఆటతీరు పేలవం. ఇక్కడ అతని టాప్ స్కోరు 21 పరుగులే. గత మ్యాచ్‌లో అదేస్కోరును సమం చేశాడంతే! సగటైతే 11.40 పరుగులే. ‘టన్’లకొద్దీ పరుగులు బాదిన ఈ సీనియర్ బ్యాట్స్‌మన్‌కు ఎస్సీజీ అంతుచిక్కడం లేదు. ఆదివారం భారత కెప్టెన్ నిలబడినా, రాణించినా గత విశ్లేషణలన్నీ మారుతాయి. విజయం కూడా దక్కుతుంది. ఓపెనర్ మయాంక్ ఐపీఎల్లో అదరగొట్టాడు. ఇక్కడ అదేపని చేస్తే... మరో ఓపెనర్ ధావన్ ఫామ్‌లో ఉండటంతో చక్కని ఆరంభమే కాదు భారీ భాగస్వామ్యం నమోదు చేయొచ్చు. ఆ తర్వాత కోహ్లితో పాటు మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాట్‌కు పనిచెబితే పరుగుల వరద పారుతుంది. హార్దిక్ పాండ్యా చాలా రోజుల తర్వాత వన్డే ఆడినా... తొలి మ్యాచ్‌తోనే ఫామ్ కనబరిచాడు. ఇది జట్టుకు సానుకూలాంశం. ఫిట్‌గానే చహల్... స్పిన్నర్ యజువేంద్ర చహల్ తొలి వన్డే ఆడుతూ స్వల్ప గాయంతో మైదానం వీడినా... తన 10 ఓవర్ల కోటా పూర్తి చేశాడు. దీంతో అతడి ఫిట్‌నెస్‌పై జట్టుకు ఎలాంటి కలవరం లేదు. అయితే గత మ్యాచ్‌లో అతనితో పాటు బుమ్రా, సైనీ ధారాళంగా సమర్పించుకున్న పరుగులతోనే జట్టు మేనేజ్మెంట్ ఆందోళన పడుతోంది. సీమర్లకు అనుకూలమైన పిచ్‌లపై బుమ్రా విఫలమవడమే కాస్త ఇబ్బందికర పరిణామం. అయితే రెండో వన్డేలో అతను కుదుటపడితే ఆ ఇబ్బందులు ప్రత్యర్థి జట్టుకు బదిలీ చెయొచ్చు. కొత్త బౌలర్ నటరాజన్‌కు అవకాశమివ్వాలని భావిస్తే సైనీని పక్కనబెట్టే అవకాశాలున్నాయి. జోరు మీదున్న ఆసీస్... భారత బౌలింగ్‌ను చితగ్గొట్టిన బ్యాట్స్‌మెన్ ఫామ్‌తో, శతక భాగస్వామ్యాలతో ఆస్ట్రేలియా జోరుమీదుంది. ఇది ఇలాగే కొనసాగించి ఇక్కడే సిరీస్ గెలుచుకోవాలనే ఆత్మవిశ్వాసంతో ఫించ్ సేన ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ వార్నర్, ఫించ్, స్మిత్‌ల ప్రదర్శన ఆతిథ్య జట్టు బలాన్ని రెట్టింపు చేసింది. గాయపడిన ఆల్‌రౌండర్ స్టొయినిస్ స్థానంలో మరో ఆల్‌రౌండర్ గ్రీన్ అందుబాటులో ఉన్నాడు. దీంతో అతని అరంగేట్రం దాదాపు ఖాయమైంది. సొంతగడ్డపై పేసర్లు స్టార్క్, కమిన్స్, హాజల్వుడ్లది ఎప్పుడైనా పైచేయే! ఆతిథ్య అనుకూలతలు వారిని ఓ మెట్టుపైనే నిలబెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక స్పిన్నర్ జంపా గత మ్యాచ్‌లో భారత వెన్నువిరిచాడు. కీలక బ్యాట్స్‌మెన్‌నే కాదు... క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్‌మన్‌ను కూడా తన స్పిన్ ఉచ్చులో ఉక్కిరిబిక్కిరి చేశాడు. పిచ్, వాతావరణం గత మ్యాచ్‌లాగే పరుగుల వరద పారే పిచ్. బ్యాట్స్‌మెన్ నిలబడితే చాలు... భారీస్కోర్లు రిపీట్ అవుతాయి. మ్యాచ్‌కు వర్షం ముప్పయితే లేదు. -
అప్పుడు 88.. ఇప్పుడు 89
సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌కి మరచిపోలేని రోజులా మారింది. తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్ కట్టడి చేసే చహల్ ఈ రోజు ధారాళంగా పరుగులు సమర్పించాడు. ఈ క్రమంలోనే చెత్త గణాంకాలను నమోదు చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగుల్ని సమర్పించుకున్న భారత స్పిన్నర్‌గా అపప్రథను మూటగట్టుకున్నాడు. 10 ఓవర్లలో వికెట్ మాత్రమే సాధించిన చహల్.. 89 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఒక భారత స్పిన్నర్‌గా వన్డేల్లో ఇది చెత్త రికార్డు. ఈ క్రమంలోనే తన రికార్డు తానే అధిగమించాడు చహల్. వన్డేలో భారత్ తరఫున అత్యధిక పరుగులు ఇచ్చిన స్పిన్నర్ గా చహల్ పేలవ రికార్డును నమోదు చేసుకున్నాడు. ఇంతకు ముందు 2019 ఎడ్జ్‌బాస్టన్ వన్డేలో ఇంగ్లాండ్‌పై 88 పరుగులు ఇచ్చిన చహల్ ప్రస్తుతం తన రికార్డును తానే అధిగమించాడు. ప్రధానంగా ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు కెప్టెన్ ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్ లు చహల్ బౌలింగ్ పై విరుచుకుపడ్డారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ కలిసి 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఫించ్ తన 17 వ వన్డే సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఇదేకాక 126 ఇన్నింగ్స్‌లలో 5000 వన్డే పరుగులు వేగవంతంగా సాధించిన రెండో ఆస్ట్రేలియన్ ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డును సాధించే క్రమంలో డీన్ జోన్స్(128 ఇన్నింగ్స్‌ల్లో) రికార్డును ఫించ్ సవరించాడు.ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ తొలి స్థానంలో ఉన్నాడు. వార్నర్ 115 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని సాధించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 374 పరుగులు చేయగా, టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసి ఓటమి పాలైంది. హార్దిక్ పాండ్యా(90) వన్డేల్లో తొలి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోగా, ధావన్(74) సైతం ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంచితే, వన్డే ఫార్మాట్లో భారత్‌పై ఆసీస్‌కు ఇదే అత్యధిక స్కోరుగా రికార్డు పుస్తకాల్లో నమోదైంది. -
నాలుగున్నర నెలల్లో 22 సార్లు : గంగూలీ
సాక్షి, ముంబై: బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. చుట్టూ కరోనా పాజిటివ్ కేసులు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా కరోనా వైరస్ బారిన పడకుండా, జాగ్రత్తలు తీసుకుంటూ లీగ్‌ను ముగించామంటూ సంతోషం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి ఆందోళన మధ్య ఐపీఎల్-2020ను విజయవంతంగా ముగించడం గర్వంగా ఉందన్నారు. దుబాయ్‌లో ఐపీఎల్ నిర్వహణలో బిజీగా బిజీగా గడిపిన గంగూలీ, రానున్న ఆస్ట్రేలియా పర్యటనపై మంగళవారం వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గత నాలుగున్నర నెలల్లో 22 సార్లు పరీక్షలు చేయించుకున్నానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తన చుట్టూ కేసులు ఉండటం వల్లే అన్ని సార్లు టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ముఖ్యంగా పెద్దవాళ్లైన తల్లిదండ్రులతో కలిసి ఉన్నాను. మొదట్లో చాలా భయపడ్డా. తన కోసం కాదు కానీ చుట్టూ ఉన్నవారికి తన వల్ల వైరస్ సోకకూడదుకదా అందుకే.. అంటూ హైజీన్ టెక్నాలజీ బ్రాండ్ లివింగ్ గార్డ్ ఏజీ బ్రాండ్ అంబాసిడర్ గంగూలీ పేర్కొన్నారు. సిడ్నీలో 14 రోజుల సెల్ఫ్ క్వారంటైన్ తరువాత ఆటగాళ్లందరూ క్షేమంగా ఉన్నారన్నారు. వారంతా ఆరోగ్యంగా ఆటకు సిద్ధంగా ఉన్నారని గంగూలీ ప్రకటించారు. ఆస్ట్రేలియాలో కూడా కరోనా కేసులు పెద్దగా లేవని బీసీసీఐ చీఫ్ చెప్పారు. అలాగే దేశీయంగా క్రికెట్ చాలా త్వరలోనే ప్రారంభంకానుంది. ఇంగ్లాండ్ భారత్ పర్యటనలో భాగంగానాలుగు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డేలు, ఐదు టి టీ20 మ్యాచ్‌లు ఆడనుందని చెప్పారు. అలాగే దేశమంతా కరోనా సెకండ్‌వేవ్ గురించి మాట్లాడుతున్నారు ఈ క్రమంలో 8-10 జట్లు వచ్చినపుడు కొంచెం కష్టమవుతుందని చెప్పారు. ముంబై, న్యూఢిల్లీలో కేసులు బాగా పెరిగినట్టు తెలుస్తోంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని అంచనా వేయాలని గంగూలీ వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనలో నవంబర్ 27 న సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్ తొలి వన్డే ఆడనుంది. -
భారత్, పాక్ మహిళల టి20 మ్యాచ్ రద్దు
బ్రిస్బేన్: మహిళల టి20 ప్రపంచ కప్ సన్నాహాల్లో భాగంగా జరగాల్సిన భారత్, పాకిస్తాన్ టి20 ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయింది. ఇక్కడి అలెన్ బోర్డర్ ఫీల్డ్ మైదానంలో ఆదివారం జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంతో ఒక్క బంతి కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. భారీ వర్షం ఎంతకీ తగ్గక పోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. భారత్ తన తదుపరి ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఈనెల 18న వెస్టిండీస్‌తో ఆడుతుంది. భారత్–పాక్ మ్యాచ్‌తో పాటు ఆస్ట్రేలియా–వెస్టిండీస్, బంగ్లాదేశ్–థాయ్‌లాండ్ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా జరగలేదు. అడిలైడ్ వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఈనెల 21న భారత్, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్‌తో పొట్టి ప్రపంచ కప్‌కు తెరలేవనుంది. -
కార్చిచ్చు బాధితుల కోసం
-
భారత్‌కు మూడో విజయం
జొహర్ బారు (మలేసియా): సుల్తాన్ జొహర్ కప్ అంతర్జాతీయ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఖాతాలో మూడో విజయం చేరింది. ఆ్రస్టేలియాతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున శిలానంద్ లాక్రా (26వ, 29వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... దిల్‌ప్రీత్ సింగ్ (44వ ని.లో), గుర్సాహిబ్జిత్ సింగ్ (48వ ని.లో), మన్దీప్ మోర్ (50వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఆ్రస్టేలియాకు ఆరోన్ నైట్ (57వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోరీ్నలో భారత్ 9 పాయింట్లతో బ్రిటన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో బ్రిటన్‌తో భారత్ తలపడుతుంది. లీగ్ దశ పూర్తయ్యాక పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో ఆడతాయి. భారత్–బ్రిటన్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే రెండు జట్లు ఫైనల్‌కు చేరుతాయి. -
ఇంగ్లండ్ లక్ష్యం 398
బర్మింగ్‌హామ్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్మిత్ (142; 14 ఫోర్లు), వేడ్ (110; 17 ఫోర్లు) శతక్కొట్టడంతో ఇంగ్లండ్ ముందు 398 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 124/3తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 112 ఓవర్లలో 487/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలుత స్మిత్, ట్రావిస్ హెడ్ (51) నాలుగో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. తర్వాత ఐదో వికెట్‌కు వేడ్, స్మిత్ జోడీ 126 పరుగులు జతచేసింది. స్మిత్ యాషెస్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన ఐదో ఆసీస్ బ్యాట్స్‌మన్‌గా ఘనతకెక్కాడు. గతంలో బార్డ్స్లే, మోరిస్, స్టీవ్ వా, హేడెన్ ఇలా రెండు సెంచరీలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 3, మొయిన్ అలీ 2 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ ఆట నిలిచే సమయానికి 7 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (7 బ్యాటింగ్), రాయ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చివరి రోజు ఇంగ్లండ్ నెగ్గాలంటే మరో 385 పరుగులు చేయాలి. -
సూపర్ స్టార్క్ ఆసీస్‌కు ఏడో విజయం
లండన్: ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో తమ జోరు కొనసాగిస్తోంది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన డేనైట్ మ్యాచ్‌లో ఆసీస్ 86 పరుగుల తేడాతో గెలిచి ఈ టోర్నీలో ఏడో విజయాన్ని నమోదు చేసుకుంది. 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను ఆసీస్ పేసర్ మిషెల్ స్టార్క్ (5/26) హడలెత్తించాడు. స్టార్క్ ధాటికి న్యూజిలాండ్ 43.4 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలి ఓటమి చవిచూసింది. ఆసీస్ మిగతా బౌలర్లలో బెహ్రాన్డార్ఫ్కు రెండు వికెట్లు దక్కగా... కమిన్స్, లయన్, స్టీవ్ స్మిత్ ఒక్కో వికెట్ తీశారు. తమ చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో జూలై 6న దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా; జూలై 3న ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ తలపడతాయి. -
చేజారింది
‘లక్ష్య ఛేదనలో భారత్ అత్యుత్తమ జట్లలో ఒకటి. ఇవాళ దానిని చూపించాల్సి ఉంది. వరల్డ్ కప్ జట్టు కూర్పు ఎలా ఉండబోతోందో మాకు స్పష్టత వచ్చేసింది. ఇవాళ ఆడుతున్న జట్టు సమతూకంగా ఉంది’ టాస్ సమయంలో భారత కెప్టెన్ కోహ్లి వ్యాఖ్య ఇది. కానీ భారత జట్టు ఆసీస్ విధించిన 273 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. పైగా ఈ మ్యాచ్ ప్రపంచ కప్‌కు ముందు కూర్పు విషయంలో అనేక కొత్త ప్రశ్నలు కూడా రేకెత్తించింది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టి20 సిరీస్ కోల్పోయిన తర్వాత తొలి రెండు వన్డేలు నెగ్గిన ఉత్సాహం ఆ తర్వాత నీరుగారిపోయింది. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌లో రెండోసారి టీమిండియా 2–0తో ఆధిక్యంలో ఉండి కూడా చివరకు అనూహ్యంగా 2–3తో సిరీస్‌ను కోల్పోయింది. సొంతగడ్డపై ‘ఢిల్లీ బాయ్స్’ శిఖర్ ధావన్, రిషభ్ పంత్, కోహ్లిలతో విజయ్ శంకర్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కూడా వెనుదిరగడంతో భారత్ ఒక దశలో 132/6తో ఓటమికి చేరువైనట్లు అనిపించింది. కానీ కేదార్ జాదవ్, భువనేశ్వర్ ఏడో వికెట్‌కు 103 బంతుల్లోనే 91 పరుగులు జోడించి ఆశలు రేపారు. కానీ ఈ పోరాటం సరిపోలేదు. వీరిద్దరిని వరుస బంతుల్లో ఔట్ చేసిన ఆసీస్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా తమ వైపునకు లాక్కుంది. అంతకుముందు ఉస్మాన్ ఖాజా చక్కటి సెంచరీకి హ్యాండ్స్కోంబ్ కూడా ఒక చేయి వేయడంతో ఆసీస్ మెరుగైన స్కోరు సాధించి భారత్‌కు సవాల్ విసరగలిగింది. ఎనిమిదో వికెట్‌కు రిచర్డ్సన్, కమిన్స్ కలిసి 16 బంతుల్లో జోడించిన 34 పరుగులే చివరకు మ్యాచ్ ఫలితంలో కీలకంగా మారడం విశేషం. ఢిల్లీ: విరాట్ కోహ్లి నాయకత్వంలో భారత జట్టు తొలిసారి స్వదేశంలో వన్డే సిరీస్ కోల్పోయింది. బుధవారం జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా 35 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌ను 3–2తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ ఉస్మాన్ ఖాజా (106 బంతుల్లో 100; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సిరీస్‌లో రెండో సెంచరీ సాధించగా, హ్యాండ్స్కోంబ్ (60 బంతుల్లో 52; 4 ఫోర్లు) రాణించాడు. భువనేశ్వర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 50 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (89 బంతుల్లో 56; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా...భువనేశ్వర్ (54 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేదార్ జాదవ్ (57 బంతుల్లో 44; 4 ఫోర్లు, సిక్స్) పోరాడారు. జంపాకు 3 వికెట్లు... కమిన్స్, స్టొయినిస్, రిచర్డ్సన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఖాజా మరో శతకం... ఆస్ట్రేలియాకు మరోసారి ఓపెనర్లు శుభారంభం అందించారు. ఖాజా తన ఫామ్‌ను కొనసాగిస్తూ చక్కటి షాట్లు ఆడగా, ఫించ్ (43 బంతుల్లో 27; 4 ఫోర్లు) అండగా నిలిచాడు. షమీ రెండో ఓవర్లో ఖాజా రెండు బౌండరీలు బాదగా, అతని తర్వాతి ఓవర్లో ఫించ్ మరో రెండు ఫోర్లు కొట్టాడు. పవర్‌ప్లే ముగిసేసరికి ఆసీస్ 52 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 76 పరుగులు జత చేసిన అనంతరం ఈ జోడీని జడేజా విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన హ్యాండ్స్కోంబ్ కూడా స్వేచ్ఛగా ఆడటంతో ఆసీస్ స్కోరు దూసుకుపోయింది. కుల్దీప్ బౌలింగ్‌లో కవర్స్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో సిరీస్‌లో ఖాజా రెండో సెంచరీ (102 బంతుల్లో) పూర్తయింది. 32.5 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 175/1 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. మిగిలిన ఓవర్లలో చెలరేగి భారీ స్కోరు చేయడం ఖాయమనుకున్న దశలో భారత బౌలర్లు కట్టడి చేశారు. ఫలితంగా ఆసీస్ 21 బంతుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. ఖాజాతో పాటు మ్యాక్స్‌వెల్ (1), హ్యాండ్స్కోంబ్ వెనుదిరిగారు. గత మ్యాచ్ హీరో టర్నర్ (20 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్)ను ఈసారి కుల్దీప్ నిరోధించగా, ఆ తర్వాత వరుస ఓవర్లలో స్టొయినిస్ (20), క్యారీ (3) ఔటయ్యారు. అయితే జే రిచర్డ్సన్ (21 బంతుల్లో 29; 3 ఫోర్లు), కమిన్స్ (8 బంతుల్లో 15; 2 ఫోర్లు) కలిసి ఆసీస్‌కు చెప్పుకోదగ్గ స్కోరు అందించారు. బుమ్రా అసహనం! భారత బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలో ఆసీస్‌ను పూర్తిగా కట్టి పడేశాడు. తన తొలి 8 ఓవర్లలో అతను 14 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. అయితే అతని 9వ ఓవర్ (ఇన్నింగ్స్ 48వ) ఆసీస్‌కు కలిసొచ్చింది. ఈ ఓవర్లో రిచర్డ్సన్ వరుస బంతుల్లో రెండు ఫోర్లు కొట్టాడు. తర్వాతి యార్కర్‌ను అతను డిఫెన్స్ ఆడగా బంతి బుమ్రా వద్దకు వచ్చింది. అయితే కోపంతో అతను దానిని వికెట్లపైకి విసిరాడు. స్టంప్స్‌ను తాకిన బంతి అదే వేగంతో థర్డ్‌మ్యాన్ బౌండరీ దిశగా దూసుకుపోవడంతో మరో నాలుగు పరుగులు వచ్చాయి. చివరి బంతికి కమిన్స్ కూడా ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో బుమ్రా ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఇద్దరూ పోరాడినా... భారత్ లక్ష్య ఛేదన తడబడుతూనే సాగింది. పిచ్ బాగా నెమ్మదించడం, బంతి బ్యాట్‌పైకి రాకపోవడంతో పరుగులు తీయడం ఒక్కసారిగా కష్టంగా మారిపోయింది. గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన శిఖర్ ధావన్ (15 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఈసారి ప్రభావం చూపలేకపోయాడు. అనూహ్యంగా దూసుకొచ్చిన స్టొయినిస్ బంతిని ఆడలేక కోహ్లి (22 బంతుల్లో 20; 2 ఫోర్లు) కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా, నాలుగో స్థానానికి ప్రమోట్ అయిన రిషభ్ పంత్ (16 బంతుల్లో 16; ఫోర్, సిక్స్) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. ఇటీవల తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వచ్చిన విజయ్ శంకర్ (21 బంతుల్లో 16; సిక్స్) అత్యుత్సాహంతో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. మరోవైపు తన శైలికి భిన్నంగా ప్రతీ పరుగు కోసం శ్రమించిన రోహిత్ 73 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే జంపా వేసిన ఇన్నింగ్స్ 29వ ఓవర్ భారత్ ఆశలపై నీళ్లు చల్లింది. ఆస్ట్రేలియన్లు రెండు సార్లు క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన రోహిత్ మూడోసారి దొరికిపోయాడు. ముందుకొచ్చి షాట్ ఆడే క్రమంలో బ్యాట్ చేజార్చుకున్న రోహిత్‌ను క్యారీ స్టంపౌట్ చేయగా, అదే ఓవర్లో జడేజా (0) కూడా స్టంపౌటయ్యాడు. ఇక ఓటమి లాంఛనమే అనుకున్న తరుణంలో జాదవ్, భువనేశ్వర్ జోడి జట్టును నడిపించింది. ఒక్కసారి నిలదొక్కుకున్న తర్వాత వీరిద్దరు ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా రెండు సిక్సర్లతో భువీ కనబర్చిన దూకుడు ఆకట్టుకుంది. అయితే 25 బం తుల్లో 50 పరుగులు చేయాల్సిన దశలో... వరుసగా రెండు బంతుల్లో భువనేశ్వర్, జాదవ్‌లు ఔటవ్వ డంతో టీమిండియా ఓటమి దిశగా పయనించింది. ►భారత్‌లో భారత్‌పై ఐదు వన్డేల సిరీస్‌లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా ఉస్మాన్ ఖాజా (ఆస్ట్రేలియా) గుర్తింపు పొందాడు. డివిలియర్స్ (దక్షిణాఫ్రికా–358 పరుగులు; 2015లో) పేరిట ఉన్న రికార్డును ఖాజా తిరగ రాశాడు. ఐదు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్న వన్డే సిరీస్‌లో 0–2తో వెనుకబడి ఆ తర్వాత సిరీస్ గెలిచిన నాలుగో జట్టు ఆస్ట్రేలియా. గతంలో దక్షిణాఫ్రికా రెండుసార్లు (2003లో పాక్‌పై; 2016లో ఇంగ్లండ్‌పై) ఇలా చేయగా... పాక్ (భారత్‌పై 2005లో)... బంగ్లాదేశ్ (జింబాబ్వేపై 2005లో) ఒక్కోసారి ఈ ఘనత సాధించాయి. ►ఐదు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్న వన్డే సిరీస్‌లో తొలుత 2–0తో ఆధిక్యంలో ఉండి ఆ తర్వాత వరుస పరాజయాలతో సిరీస్‌ను రెండుసార్లు చేజార్చుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది. వన్డేల్లో 8 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. కోహ్లి సారథ్యంలో స్వదేశంలో భారత జట్టు కోల్పోయిన తొలి వన్డే సిరీస్ ఇదే. కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు వరుసగా మూడు వన్డేలు ఓడిపోవడం కూడా ఇదే మొదటిసారి. -
సిరీస్... నేడు గెలుస్తారా? ఆఖరి దాకా రానిస్తారా?
వరుస విజయాలతో జోరుమీదున్న భారత్‌కు గత మ్యాచ్‌లో చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో నేడు నాలుగో మ్యాచ్‌కు కోహ్లి సేన సిద్ధమైంది. ఇక్కడే సిరీస్‌ను గెలుపుతో ముగిస్తారా లేక ఆఖరిదాకా తీసుకొస్తారా అనేది నేటి మ్యాచ్ ఫలితంతో తేలుతుంది. కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉండగా... అతనికి అండగా నిలిచేవారూ, బాగా ఆడేవారు కరువయ్యారు. ఆ ఒక్కడిపైనే భారం వేయకుండా బాధ్యతగా అందరూ ఆడితేనే జట్టు సమష్టితత్వంతో గెలుస్తుంది. లేదంటే ఆసీస్ సిరీస్‌ను సమం చేయడం గ్యారెంటీ! మొహాలి: భారత్ ఇక్కడ గెలవాలన్నా... ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్నా... టీమిండియా ఆటగాళ్లంతా కష్టపడాలి. అప్పుడే ప్రపంచకప్ సన్నాహాన్ని విజయంతో ముగించగలం. అలా కాదని ఏ ఒక్కరి మీదో ఆధారపడితే మళ్లీ చేదు ఫలితం... ఆఖరిదాకా (ఐదో వన్డే) పోరాటం... ఈ రెండూ తప్పవు. ఈ సిరీస్‌లో గెలుపు రుచి చూసిన ఆస్ట్రేలియా ఇప్పుడు సమంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే నాలుగో వన్డే రసవత్తర పోరుకు తెరతీస్తుందేమో చూడాలి. ఆస్ట్రేలియా గత మ్యాచ్ విజయంతో టచ్‌లోకి వచ్చింది. భారత్ బలగాన్ని దెబ్బ తీసింది. భారత బలం కూడా అర్థమైపోయింది. ధోని దూరమైన బృందంలో ఒకే ఒక్కడి (కోహ్లి) వికెట్‌తో మళ్లీ మ్యాచ్ గెలవొచ్చని పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. సూపర్ ఫామ్‌లో కోహ్లి... భారత సారథి కోహ్లి అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్‌ను మజా చేసుకుంటున్నాడు. సెంచరీలతో పండగ చేసుకుంటున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో మూడే మ్యాచ్‌లాడిన కెప్టెన్ మూడొందలకు (283 పరుగులు) చేరువయ్యాడు. ఇందులో రెండు సెంచరీలుండటం విశేషం. అతను ఐదునెలల క్రితమే (అక్టోబర్)లో 10 వేల పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆడింది 12 మ్యాచ్‌లే... కానీ స్కోరేమో 10, 816కు చేరింది. ఇంతగా ఎవరికీ సాధ్యంకానీ నిలకడతో, ఎవరికీ సాధ్యంకానీ ఆటను అతను ఆడుతున్నాడు. కానీ సహచరులే టీమిండియా కొంపముంచుతున్నారు. గత మ్యాచ్‌లో ఏ ఒక్కరైనా ఫిఫ్టీ చేసినా, లేదంటే ఏ ఇద్దరు 30 చొప్పున పరుగులు చేసినా భారతే గెలిచేది. కానీ ఎవరూ ఆ బాధ్యత తీసుకోలేదు. కనీసం పీకలమీదికి (ఐదో వన్డే దాకా) రాకముందే ఈ మ్యాచ్‌లోనైనా భారత ఆటగాళ్లు తమ వంతు సహకారాన్ని కెప్టెన్‌కు అందించాలి. కలిసికట్టుగా కంగారూ పనిపట్టాలి. ప్రపంచకప్ దగ్గరవుతున్న కొద్దీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్‌కు దూరమవుతుండటం టీమ్ మేనేజ్మెంట్కు సమస్యగా మారింది. రోహిత్ ప్రదర్శన అతని కంటే మెరుగే కానీ గొప్పగా ఏమీ లేదు. 51 పరుగులే చేయగలిగాడు. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు (33 పరుగులు) ఇచ్చిన అవకాశాలన్నీ చేజార్చుకున్నాడు. ఇప్పుడైనా అతను కళ్లు తెరవాలి. బ్యాట్‌కు పనిచెప్పాలి. లేదంటే ప్రపంచకప్ సంగతేమో గానీ... ఐదో వన్డేకే బెర్తు గల్లంతైనా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే కోహ్లి జట్టులో మార్పులుంటాయని కరాఖండీగా చెప్పేశాడు. రిషభ్, భువీ వచ్చేశారు రెగ్యులర్ వికెట్ కీపర్ ధోని విశ్రాంతి తీసుకోవడం రిషభ్ పంత్‌కు కలిసొచ్చింది. అతన్ని తుది జట్టులోకి తెచ్చింది. ధోని ఉండగా కేవలం బ్యాట్స్‌మన్‌గా పనికొచ్చే పంత్‌కు ఇప్పుడు కీపర్‌గానూ నైపుణ్యం చాటుకునే అవకాశాన్ని ఈ రెండు వన్డేలు ఇస్తున్నాయి. ఇది అతని ప్రపంచకప్ పయనాన్ని కచ్చితంగా నిర్ణయిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. సీనియర్ సీమర్ భువనేశ్వర్ కూడా ఫైనల్ ఎలెవన్‌లోకి వచ్చాడు. దీంతో షమీ, బుమ్రాలలో ఒకరికే చాన్స్ దక్కొచ్చు. బహుశా భువీ–బుమ్రా కాంబినేషన్‌కే జట్టు యాజమాన్యం సై అనే అవకాశముంది. స్పిన్నర్ యజువేంద్ర చహల్వైపు జట్టు మేనేజ్మెంట్ మొగ్గడంతో రవీంద్ర జడేజా మ్యాచ్‌కు దూరమవుతున్నాడు. కుల్దీప్కు జతయిన చహల్ రాణిస్తే ఆస్ట్రేలియాను స్పిన్‌తో దెబ్బకొట్టొచ్చు. అప్పుడే సిరీస్‌కు గెలుపుతో తెరదించవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా... మూడో వన్డేలో సాధించిన సాధికార విజయం ఆస్ట్రేలియాను సిరీస్ వేటలోకి తెచ్చింది. రాంచీ మ్యాచ్‌లో కంగారూ జట్టు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో అదరగొట్టింది. వీళ్ల టాపార్డరేమో భారీగా పరుగులు చేసింది. ప్రత్యర్థి టాపార్డర్‌ను నిలువునా కూల్చేసింది. కోహ్లి గనక ఆడకపోతే భారత్‌కు భారీ పరాభవం ఖాయమయ్యేది. ఓపెనర్లు ఉస్మాన్ ఖాజా, ఫించ్ ఫామ్‌లోకి వచ్చారు. మిడిలార్డర్లో స్టోయినిస్ నిలకడగా రాణిస్తుంటే గత మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించాడు. హ్యాండ్స్కోంబ్ గత మ్యాచ్‌లో డకౌటైనా... రెండో వన్డేలో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. టెయిలెండర్లలో క్యారీ జట్టుకు ఉపయుక్తమైన స్కోర్లు చేస్తున్నాడు. బౌలింగ్‌లో ఆడమ్ జంపా తన స్పిన్ మాయాజాలంతో టీమిండియా వెన్నెముకను విరిచేస్తున్నాడు. కీలక వికెట్లను చేజిక్కించుకోవడం ద్వారా అతను భారత బ్యాట్స్‌మెన్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు. పేసర్లలో కమిన్స్, రిచర్డ్‌సన్‌లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో మొహాలిలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత్ కేవలం ఒక మ్యాచ్‌లో గెలిచి, మూడింటిలో ఓడిపోవడం గమనార్హం. 1996లో టైటాన్ కప్‌లో భాగంగా ఈ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై గెలిచిన భారత్... 2006, 2009, 2013లలో జరిగిన మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓవరాల్‌గా మొహాలిలో భారత్ ఇప్పటి వరకు 15 వన్డేలు ఆడింది. 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఐదింటిలో ఓడింది. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, రాయుడు, రిషభ్ పంత్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, భువనేశ్వర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా/షమీ. ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాజా, షాన్ మార్‡్ష, మ్యాక్స్‌వెల్, హ్యాండ్స్కోంబ్, స్టొయినిస్, క్యారీ, కమిన్స్, లయన్, రిచర్డ్సన్, జంపా. పిచ్, వాతావరణం ఫ్లాట్ వికెట్ ఇది. దీంతో ఇక్కడ బ్యాట్స్‌మెన్ పరుగుల పండగ చేసుకోవచ్చు. వర్షం ముప్పేమీ లేదు. మ్యాచ్‌కు అడ్డంకీ లేదు. కానీ మంచు ప్రభావం ఉంటుంది. -
ధోని, ధావన్ సాధన
సిడ్నీ: ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా చేరిన టీమిండియా క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్ బుధవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లోని నెట్స్‌లో సాధన చేశారు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సమక్షంలో ధోని ఇండోర్ నెట్స్‌లో గడపగా... రాయుడు, ధావన్ పూర్తిగా కుడి, ఎడమ త్రో డౌన్స్‌ను ఎదుర్కొన్నారు. జాదవ్ రెండు నెట్స్‌లోనూ పాల్గొన్నాడు. ప్రాక్టీస్ ఐచ్ఛికం కావడంతో టెస్టు సిరీస్ నెగ్గిన మిగతా జట్టు సభ్యులెవరూ రాలేదు. -
పడగొట్టలేకపోయారు!
పేస్‌కు బాగా అనుకూలమైన పిచ్... ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామం... బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు... రెండో టెస్టు ఆరంభానికి ముందు బాగా వినిపించిన మాటలు ఇవి. కానీ ఆస్ట్రేలియా ఈ ప్రతికూలతలన్నింటినీ సమర్థంగా అధిగమించింది. అప్పుడప్పుడు కొన్ని బంతులు అనూహ్యంగా దూసుకొచ్చినా మొత్తంగా పెద్దగా భయపెట్టే పిచ్ ఏమీ కాదని తేలిపోయింది. వంద పరుగులు దాటాక కానీ భారత్ తొలి వికెట్‌ను తీయలేకపోయింది. ఆసీస్ పట్టుదలకు తోడు మన నలుగురు పేసర్ల దళం ఆశించిన స్థాయిలో చెలరేగకపోవడంతో ఆతిథ్య జట్టు మెరుగైన స్కోరు నమోదు చేసింది. పార్ట్ టైమ్ స్పిన్నర్ హనుమ విహారి రెండు కీలక వికెట్లు తీయగా... నలుగురు ఫాస్ట్‌బౌలర్లు కలిసి నాలుగు వికెట్లే పడగొట్టగలిగారు. ఫలితంగా ఒక దశలో భారత్‌కు పట్టు చిక్కినట్లే కనిపించిన ఆటలో చివరకు తొలి రోజు కంగారూల వశమైంది. పెర్త్: తొలి టెస్టులో భారత్ చేతిలో పరాజయం పాలైన ఆస్ట్రేలియా రెండో టెస్టును ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. హారిస్ (141 బంతుల్లో 70; 10 ఫోర్లు), టిమ్ హెడ్ (80 బంతుల్లో 58; 6 ఫోర్లు), ఆరోన్ ఫించ్ (105 బంతుల్లో 50; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. హారిస్, ఫించ్ తొలి వికెట్‌కు 112 పరుగులు జోడించగా, హెడ్, షాన్ మార్‡్ష (45) ఐదో వికెట్‌కు 84 పరుగులు జత చేశారు. ఇషాంత్ (2/35), విహారి (2/53)లకు చెరో 2 వికెట్లు దక్కగా... బుమ్రా, ఉమేశ్‌లకు చెరో వికెట్ దక్కింది. ప్రస్తుతం పైన్ (16 బ్యాటింగ్), కమిన్స్ (11బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. భారీ భాగస్వామ్యం... గత టెస్టులో తొలి ఓవర్లోనే వికెట్ చేజార్చుకున్న ఆస్ట్రేలియాకు ఈసారి ఓపెనర్లు పటిష్టమైన పునాది వేశారు. హారిస్, ఫించ్ కలిసి ఎలాంటి తడబాటు లేకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఆరంభంలో కొంత పేస్, స్వింగ్‌కు పిచ్ అనుకూలించినా భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. ఇషాంత్ ఓవర్లో మూడు ఫోర్లు బాది దూకుడు కనబర్చిన హారిస్... ఆ తర్వాత ఉమేశ్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. ‘నో బాల్’లు వేయకుండా ఇషాంత్ అతి జాగ్రత్తకు పోవడంతో అతని బౌలింగ్‌లో పదును లోపించింది. ఫించ్ 20 పరుగుల వద్ద ఉన్నప్పుడు షమీ బౌలింగ్‌లో భారత్ ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూ చేసినా ఫలితం ప్రతికూలంగా వచ్చింది. లంచ్ సమయానికి ఆసీస్ స్కోరు 66 పరుగులకు చేరింది. లంచ్ తర్వాత షమీ వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన హారిస్ 90 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చూస్తుండగానే వీరిద్దరి భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. విహారి వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ఫించ్ కూడా 103 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆస్ట్రేలియా 36/4... కంగారూల జోరుకు ఈ దశలో బ్రేక్ పడింది. ఎట్టకేలకు ఫించ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని బుమ్రా భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు. బుమ్రా బౌలింగ్‌లో దెబ్బలు తగిలించుకొని చచ్చీ చెడి ఒక్కో బంతిని ఎదుర్కొన్న ఉస్మాన్ ఖాజా (38 బంతుల్లో 5)ను ఉమేశ్ వెనక్కి పంపించాడు. ఆ తర్వాత తన రెండో ఓవర్ బౌలింగ్ చేసేందుకు వచ్చిన విహారి కీలక వికెట్‌తో ఆసీస్‌ను దెబ్బ తీశాడు. సెంచరీ దిశగా దూసుకుపోతున్న హారిస్ అనూహ్యంగా ఎగసిన బంతిని ఆడబోయి స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చాడు. టీ విరామం తర్వాత కోహ్లి అద్భుత క్యాచ్‌కు హ్యాండ్స్కోంబ్ (7) పెవిలియన్ చేరాడు. 36 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు పడగొట్టిన భారత్ ఒక్కసారిగా పైచేయి సాధించింది. ఆదుకున్నమార్ష, హెడ్... ఈ దశలో ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష, టిమ్ హెడ్ ఆసీస్ ఇన్నింగ్స్‌ను మళ్లీ దారిలోకి తెచ్చారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేయడంతో భాగస్వామ్యం చకచకా 50 పరుగులు దాటింది. పార్ట్‌టైమర్ విజయ్‌తో ఒక ఓవర్ ప్రయత్నించగా మార్ష రెండు ఫోర్లు కొట్టాడు. ఇలాంటి స్థితిలో విహారి మళ్లీ ఆసీస్‌ను దెబ్బ తీయడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. మరోసారి విహారి బంతిని కట్ చేయబోయిన మార్ష స్లిప్‌లో రహానే చక్కటి క్యాచ్‌కు ఔటయ్యాడు. మరోవైపు 70 బంతుల్లో హెడ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే కొత్త బంతి తీసుకున్న తర్వాత రెండో ఓవర్లోనే ఇషాంత్ బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చిన హెడ్ నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా పైన్, కమిన్స్ ఆట ముగించారు. 85 సెకన్లలో ఓవర్ పూర్తి! పెర్త్‌లో మొదటి రోజు దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటంతో భారత ఆటగాళ్లకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ముఖ్యంగా నలుగురు పేసర్లు బాగా శ్రమించాల్సి వచ్చింది. దీనికి తోడు ఓవర్‌రేట్‌ను కూడా కాపాడుకోవాల్సి రావడంతో హనుమ విహారితో ఎక్కువ ఓవర్లు వేయించారు. చకచకా బౌలింగ్ చేసే రవీంద్ర జడేజాను గుర్తు చేసే విధంగా ఒక ఓవర్‌ను విహారి కేవలం 1 నిమిషం 25 సెకన్లలో ముగించడం విశేషం. ఈ వేగం కారణంగానే భారత్ తొలి రోజు పూర్తిగా 90 ఓవర్లు వేయగలిగింది. ఆ రెండు క్యాచ్‌లు... తొలి రోజు భారత్ రెండు క్యాచ్‌లు వదిలేసి ఆసీస్‌ను సహకరించింది. హారిస్ 60 పరుగుల వద్ద ఉన్నప్పుడు షమీ ఓవర్లో స్లిప్‌లో రాహుల్ కొంత కష్టసాధ్యమైన క్యాచ్‌ను వదిలేశాడు. ఆ తర్వాత విహారి బౌలింగ్‌లో మార్ష (24 వద్ద) ఇచ్చి న సునాయాస క్యాచ్‌ను కీపర్ పంత్ పట్టలేకపోయాడు. వీటి వల్ల భారత్‌కు భారీ నష్టం జరగకపోయినా... హారిస్ తన స్కోరు అదనంగా 10 పరుగులు, మార్ష మరో 21 పరుగులు జత చేయగలిగాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: హారిస్ (సి) రహానే (బి) విహారి 70; ఫించ్ (ఎల్బీ) (బి) బుమ్రా 50; ఖాజా (సి) పంత్ (బి) ఉమేశ్ 5; షాన్ మార్‡్ష (సి) రహానే (బి) విహారి 45; హ్యాండ్స్కోంబ్ (బి) కోహ్లి (బి) ఇషాంత్ 7; హెడ్ (సి) షమీ (బి) ఇషాంత్ 58; పైన్ (బ్యాటింగ్) 16; కమిన్స్ (బ్యాటింగ్) 11; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (90 ఓవర్లలో 6 వికెట్లకు) 277. వికెట్ల పతనం: 1–112; 2–130; 3–134; 4–148; 5–232; 6–251. బౌలింగ్: ఇషాంత్ 16–7–35–2; బుమ్రా 22–8–41–1; ఉమేశ్ 18–2–68–1; షమీ 19–3–63–0; హనుమ విహారి 14–1–53–2; విజయ్ 1–0–10–0. -
మొగ్గు మన వైపే!
ప్రత్యర్థిని మన స్కోరు దాటకుండా చేసి, తక్కువే అయినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని పొందిన టీమిండియా... దానిపై ఒక్కో పరుగూ పేర్చుకుంటూ పోతోంది. పిచ్ అంతకంతకూ నెమ్మదిస్తుండగా... కంగారూలకు కఠిన సవాల్ లాంటి లక్ష్యాన్ని నిర్దేశించేందుకు ప్రయత్నిస్తోంది. ఆస్ట్రేలియాను ఆత్మ రక్షణలోకి నెట్టి... అడిలైడ్ టెస్టును వశం చేసుకునే దిశగా కదులుతోంది. ఆతిథ్య జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆడాల్సిన స్థితిలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్ కేఎల్ రాహుల్ దూకుడైన ఆరంభాన్నివ్వగా, పుజారా మరోసారి గోడ కట్టాడు. అతడికి కెప్టెన్ కోహ్లి అండగా నిలిచాడు. పరిస్థితుల ప్రకారం చూస్తే ఇప్పటికే సురక్షిత స్థితిలో ఉన్నందున... చేయాల్సింది మ్యాచ్‌ను క్రమంగా లాగేసుకోవడమే. మధ్యలో వరుణుడు అడ్డుపడితేనో... పైన్ బృందం వీరోచితంగా పోరాడితేనో తప్ప... ఇప్పటికైతే మొగ్గంతా టీమిండియా వైపే! అడిలైడ్: చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ మొట్టమొదటి టెస్టులోనే విజయం సాధించే దిశగా టీమిండియా అడుగులేస్తోంది. సాధికారికంగా ఆడుతూ కంగారూలపై పూర్తి పైచేయి సాధించింది. రెండు జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో శనివారం ఓపెనర్ రాహుల్ (67 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్) జోరు, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ పుజారా (40 బ్యాటింగ్; 4 ఫోర్లు) ఓర్పు, కోహ్లి (34; 3 ఫోర్లు) తోడ్పాటుతో రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం భారత్ మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులతో నిలిచింది. చేతిలో ఏడు వికెట్లుండగా, 166 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 191/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 235 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు స్కోరుకు 11 పరుగులు జోడించిన ట్రావిస్ హెడ్ (72)తో పాటు హాజల్‌వుడ్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేసిన షమీ ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు తెరదించాడు. దీంతో భారత్‌కు 15 పరుగుల ఆధిక్యం దక్కింది. మూడో రోజు వర్షం కారణంగా రెండుసార్లు ఆటకు అంతరాయం కలిగింది. దగ్గరగా వచ్చింది... కానీ ఆసీస్ తొలి ఇన్నింగ్స్ శనివారం 10.4 ఓవర్లపాటు సాగింది. ఈ వ్యవధిలోనే ఆ జట్టు 44 పరుగులు చేసింది. స్టార్క్ (15)ను బుమ్రా త్వరగానే పెవిలియన్ పంపినా, నాథన్ లయన్ (24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆందోళన కలిగించాడు. హెడ్‌తో కలిసి 9వ వికెట్‌కు 31 పరుగులు జోడించాడు. అయితే, షమీ చక్కటి బంతితో హెడ్‌ను ఔట్ చేసి భాగస్వామ్యాన్ని విడదీశాడు. రెండు జంటలు... 134 పరుగులు జట్టు పరిస్థితి కంటే వ్యక్తిగత ఫామ్ కారణంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత ఓపెనర్లు మురళీ విజయ్ (18), రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో శుభారంభం అందించారు. దీంతో తొలి వికెట్‌కు 63 పరుగులు సమకూరాయి. సహజ శైలిలో కనిపించిన విజయ్... స్టార్క్ బౌలింగ్‌లో డ్రైవ్ చేయబోయి ఔటయ్యాడు. కాసేపటికే రాహుల్ దూకుడుకు హాజల్‌వుడ్ తెరదించాడు. టీకి కొద్దిగా ముందు జత కలిసిన పుజారా, కోహ్లి పూర్తి నియంత్రణతో ఆడారు. లయన్ బౌలింగ్‌లో పుజారా ఎల్బీ అయినట్లుగా అంపైర్ ప్రకటించినా, సమీక్షలో నాటౌట్‌గా తేలింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించి ఊపుమీదున్న దశలో కోహ్లిని ఔట్ చేసి లయన్ దెబ్బకొట్టాడు. రహానే (1 బ్యాటింగ్) తోడుగా పుజారా మరో నాలుగు ఓవర్లు ఎదుర్కొని రోజును ముగించాడు. కోహ్లి... హి...హి..హి... తొలుత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా, తర్వాత బ్యాటింగ్‌కు దిగుతున్నప్పుడు, అనంతరం ఔటైన సందర్భంలో... ఇలా అడిలైడ్ టెస్టులో శనివారం భారత కెప్టెన్ కోహ్లి పేరు పదేపదే చర్చనీయాంశమైంది. వాతావరణం ఉల్లాసంగా ఉన్న కారణంగానో ఏమో, ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్‌లో ఉన్న కోహ్లి డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇక అతడు క్రీజులోకి వస్తుండగా అభిమానులు పెద్దఎత్తున శబ్దం చేశారు. షార్ట్ లెగ్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి అతడు ఔటై వెనుదిరుగుతుండగా... డిఫెన్స్ అలా కాదు... ఇలా ఆడాలన్నట్లు స్పిన్నర్ లయన్ సంజ్ఞలు చేసి చూపాడు. పంత్... రికార్డు ‘పట్టేశాడు’ కంగారూల తొలి ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు అందుకుని... భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తొలి ఆస్ట్రేలియా పర్యటనలోనే రికార్డును పట్టేశాడు. తద్వారా ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు (6) అందుకున్న భారత వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న రికార్డును పంత్ సమం చేశాడు. శుక్రవారం ఖాజా, హ్యాండ్స్కోంబ్, పైన్... శనివారం హెడ్, స్టార్క్, హాజల్‌వుడ్ ఇచ్చిన క్యాచ్‌లను పంత్ పట్టాడు. 2009 న్యూజిలాండ్ పర్యటనలో వెల్లింగ్టన్ టెస్టులో ధోని 6 క్యాచ్‌లు అందుకున్నాడు. -
ఆసీస్ అదుర్స్...
ఆస్ట్రేలియా హాకీ జట్టు వరుసగా మూడోసారి ప్రపంచకప్‌ను సాధించేందుకు అజేయంగా దూసుకెళుతోంది. పూల్ ‘బి’లో శుక్రవారం జరిగిన పోరులో కంగారూ జట్టు 11–0తో చైనాపై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్ని గెలిచి లీగ్ దశను ముగించింది. ఆట మొదలైన పది నిమిషాలకే ఆసీస్ ధాటికి చైనా చేతులెత్తేసింది. బ్లేక్ గోవర్స్ (10వ, 19వ, 34వ ని.) హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగాడు. టిమ్ బ్రాండ్ (33వ, 55వ ని.) రెండు గోల్స్ చేయగా, జలెస్కీ (15వ ని.), క్రెయిగ్ (16వ ని.), హేవర్డ్ (22వ ని.), వెటన్ (29వ ని.), వొదెర్స్పూన్ (38వ ని.), ఫ్లిన్ ఒగిలివ్ (49వ ని.) తలా ఒక గోల్ చేశారు. ఆసీస్‌కు మెగా టోర్నీలో ఏకపక్ష విజయం కొత్తేం కాదు. 2010 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా 12–0తో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. మరోవైపు ఈ పూల్ నుంచి చిత్రంగా చైనాను అదృష్టం ముందుకునెట్టింది. ఆసీస్‌తో ఘోరంగా ఓడినా కూడా చైనా క్వార్టర్స్ దారిలో క్రాస్ ఓవర్ నాకౌట్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. ఇదే పూల్‌లో ఇంగ్లండ్ చేతిలో ఐర్లాండ్ 2–3తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ రెండు జట్లతో డ్రా చేసుకోవడంతో చైనా పూల్ నుంచి మూడో జట్టుగా నాకౌట్‌కు అర్హత పొందింది. 10న జరిగే క్రాస్ ఓవర్ మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్‌తో చైనా, న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ తలపడతాయి.