
సిడ్నీ: ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా చేరిన టీమిండియా క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్ బుధవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)లోని నెట్స్‌లో సాధన చేశారు.
బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సమక్షంలో ధోని ఇండోర్ నెట్స్‌లో గడపగా... రాయుడు, ధావన్ పూర్తిగా కుడి, ఎడమ త్రో డౌన్స్‌ను ఎదుర్కొన్నారు. జాదవ్ రెండు నెట్స్‌లోనూ పాల్గొన్నాడు. ప్రాక్టీస్ ఐచ్ఛికం కావడంతో టెస్టు సిరీస్ నెగ్గిన మిగతా జట్టు సభ్యులెవరూ రాలేదు.