Dhoni
-
రియల్టీ ప్లాట్ఫామ్లో ధోని పెట్టుబడులు
ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఫ్యామిలీ ఆఫీసు నుంచి వ్యూహాత్మక పెట్టుబడులు అందుకున్నట్లు రియల్టీ సర్వీసుల ప్లాట్‌ఫామ్ ఎస్ఐఎల్ఏ(సిలా) తాజాగా పేర్కొంది. అయితే ఏమేరకు పెట్టుబడి పెట్టారో మాత్రం వివరాలు వెల్లడించలేదు. 2010లో రుషభ్, సాహిల్ వోరా ఏర్పాటు చేసిన సిలా దేశవ్యాప్తంగా రియల్టీ అడ్వయిజరీ సర్వీసులు అందిస్తోంది. సంస్థలో నార్వెస్ట్ వెంచర్ పార్ట్నర్స్కు సైతం పెట్టుబడులున్నాయి. దేశీయంగా 20 కోట్ల చదరపు అడుగుల రియల్టీ ఆస్తులను నిర్వహిస్తున్న కంపెనీలో 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: నెలకు రూ.82,000 వేతనం.. ఇంటి ఖర్చులు భారం..కెప్టెన్కూల్గా పేరున్న మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికే వివిధ పరిశ్రమల్లో అనేక వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టారు. ఆయన ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీల జాబితా కింది విధంగా ఉంది.బ్లూస్మార్ట్ మొబిలిటీ: గురుగ్రామ్‌కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ ఆధారిత కంపెనీ టెక్నాలజీ సర్వీసులు అందిస్తూ స్థిరమైన రవాణాపై దృష్టి సారించింది.గరుడ ఏరోస్పేస్: వ్యవసాయం, రక్షణ, పారిశ్రామిక డ్రోన్లలో ప్రత్యేకత కలిగిన చెన్నైకి చెందిన డ్రోన్ టెక్నాలజీ సంస్థ.ఈమోటోరాడ్: ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్‌ను ప్రోత్సహించే ఎలక్ట్రిక్ సైకిల్ స్టార్టప్.హోమ్ లేన్: బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైన్ అండ్ హోమ్ డెకోర్ కంపెనీ.ఖాతాబుక్: డిజిటల్ పేమెంట్స్, బుక్ కీపింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్.కార్స్24: పాత కార్లను కొనడానికి, విక్రయించడానికి ఆన్లైన్ సేవలందించే ప్లాట్‌ఫామ్.షాకా హ్యారీ: ముంబైకి చెందిన మొక్కల ఆధారిత ఆహార సంస్థ.7ఇంక్ బ్రూస్: ఫుడ్ అండ్ బెవరేజ్ బ్రాండ్.తగ్డా రహో: ఫిట్నెస్ అండ్ వెల్నెస్ బ్రాండ్.రిగి: సోషల్, కంటెంట్ మానిటైజేషన్ ప్లాట్‌ఫామ్. -
ధోనీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. రిటైర్ మెంట్ ఫిక్స్?
-
సీక్రెట్ సాంటాతో టాప్ హీరోయిన్ బెస్ట్ క్రిస్మస్.. (ఫోటోలు)
-
నా భర్త ఎక్కుడున్నా!..నా హృదయం మాత్రం ఆ జట్టుతోనే: టీమిండియా స్టార్ భార్య(ఫొటోలు)
-
క్రికెటర్ ధోనీ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న ఏకైక సినీ హీరో
క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు మహేంద్ర సింగ్ ధోనీ.. తలైవా, జార్ఖండ్ డైనమైట్, కెప్టెన్ కూల్, ద ఫినిషర్ ఇలా అభిమానులు ఆయన్ను పిలుచుకుంటారు. ప్రపంచ క్రికెట్లో ఆయన ఒక చరిత్రను సృష్టించాడు. 2011 ప్రపంచకప్, 2007 T20 ప్రపంచకప్ భారత్‌కు అందించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. నేడు (జులై 7) ధోని 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో బర్త్‌డే కేక్‌ని ధోనీ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి సాక్షితో పాటు బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు.శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన మహీ బర్త్ డే వేడుకల్లో సల్మాన్ ఖాన్‌తో పాటు సాక్షి పాల్గొన్నారు. మిస్టర్ కూల్ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోను ఆయన భార్య సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బర్త్ డే వేళ ధోనీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చెన్నై టీమ్ ఒక అద్భుతమైన వీడియోతో మహీకి బర్త్‌డే విషెష్ చెప్పింది. క్రికెట్ ప్రపంచంలో ధోనీ క్రియేట్ చేసిన రికార్డ్స్‌ను అభిమానులు మరోసారి గుర్తుచేస్తున్నారు. ఇలా నెట్టింట సందడిగా #HBDMSDhoni హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది.బర్త్‌డేలో సల్మాన్ మాత్రమేధోనీ ప్రస్తుతం అనంత అంబానీ పెళ్లి వేడుకల్లో భాగంగా ముంబైలో ఉన్నాడు. ఈ క్రమంలోనే మహీ పుట్టినరోజు వేడుకల్లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఒక ఫోటోను ఆయన పంచుకున్నారు. సోషల్ మీడియా ద్వారా హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ సాహెబ్ అంటూ సల్మాన్ తెలిపారు. ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటో భారీగా ట్రెండ్ అవుతుంది. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్స్ అంటూ నెటిజన్లు తెలుపుతున్నారు. బాలీవుడ్ బాప్, క్రికెట్ బాప్ కలిస్తే రచ్చే అంటూ మరోక నెటిజన్ తెలిపాడు. సోషల్‌మీడియాలో వారిద్దరి అభిమానులు 'డ్రీమ్ కమ్ ట్రూ' అంటూ తెగ సంబరపడిపోతున్నారు.ధోనీ కాళ్లకు నమస్కరించిన సతీమణిధోనీ భార్య సాక్షి సింగ్ ఒక వీడియో షేర్ చేసి తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. కేక్ కట్ చేసిన ధోని మొదట తన సాక్షికి తినిపించాడు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌కు ధోనీ కేక్ తినిపించారు. ఈ క్రమంలో ధోనీ కాళ్లకు సాక్షి సింగ్ నమస్కరించింది. చాలా సరదాగా ఉన్న ఆ వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. సల్మాన్, ధోనీ మధ్య ఉన్న బలమైన బంధాన్ని ఇలా మరోసారి అభిమానులకు చూపించారు. ఇటీవల జూలై 6న జరిగిన ఆనంద్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత వేడుకలో వారిద్దరూ కలిసి కనిపించారు. View this post on Instagram A post shared by Sakshi Singh (@sakshisingh_r)This clip is going to break internet!Salman Khan × MS Dhoni ❤#HappyBirthdayMSDhonipic.twitter.com/HMeFiymdUo— ` (@WorshipDhoni) July 6, 2024 -
అనంత్- రాధిక ప్రీవెడ్డింగ్: ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న ధోని ఫ్యామిలీ (ఫొటోలు)
-
RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?
-
కెప్టెన్సీకి ధోని గుడ్‌బై సీఎస్కే కొత్త సారథిగా రుతురాజ్
చెన్నై: ‘కొత్త సీజన్లో కొత్త ‘పాత్ర’ పోషించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’... మార్చి 4న సోషల్ మీడియాలో ధోని పెట్టిన పోస్ట్ ఇది! ఆ కొత్త పాత్ర ఏమిటనేది ఎవరూ ఊహించలేకపోయారు. కానీ మార్చి 21కి వచ్చేసరికే అదేంటో ధోని చూపించాడు. తాజా ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి ధోని తప్పుకున్నాడు. కెపె్టన్‌గా కాకుండా కేవలం ఆటగాడిగా అతను ఈ సీజన్ బరిలోకి దిగనున్నాడు. ధోని స్థానంలో జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు సీఎస్కే యాజమాన్యం ప్రకటించింది. 42 ఏళ్ల ధోని 2008లో ఐపీఎల్ తొలి ఏడాది నుంచి చెన్నై కెపె్టన్‌గా వ్యవహరించాడు. మధ్యలో రెండేళ్లు జట్టు నిషేధానికి గురి కాగా... 2022 సీజన్లో రవీంద్ర జడేజా కెపె్టన్ అయ్యాడు. అయితే 8 మ్యాచ్‌ల తర్వాత తనవల్ల కాదంటూ జడేజా తప్పుకోవడంతో సీజన్ మధ్యలో మళ్లీ ధోని పగ్గాలు చేపట్టాడు. ఐపీఎల్లో అతను మొత్తం 212 మ్యాచ్‌లలో కెపె్టన్‌గా వ్యవహరించగా... 128 మ్యాచ్‌ల్లో గెలిచి, 82 మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నై 5సార్లు చాంపియన్ కావడంతో పాటు మరో 5సార్లు రన్నరప్‌గా నిలిచింది. మరో 23 చాంపియన్స్ లీగ్ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన అతను 2 టైటిల్స్ అందించాడు. 2023లో టైటిల్ గెలిచాక అదే ధోని ఆఖరి సీజన్ అనిపించింది. కెప్టెన్సీ కాకుండా ఆటగాడిగా అతని ప్రభావం దాదాపు శూన్యంగా మారింది. కానీ మోకాలి ఆపరేషన్ తర్వాత అతను మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. అనుభవం లేకపోయినా... మహారాష్ట్రకు చెందిన రుతురాజ్‌కు పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేదు. సీనియర్ స్థాయిలో కేవలం 16 టి20 మ్యాచుల్లోనే అతను కెపె్టన్‌గా వ్యవహరించి 10 విజయాలు సాధించాడు. ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత జట్టుకు అతనే కెపె్టన్. అయితే ఓపెనర్ రూపంలో భారీగా పరుగులు సాధిస్తూ జట్టు విజయాల్లో అతను కీలకంగా మారాడు. 2020 సీజన్ నుంచి చెన్నై జట్టుతో ఉన్న రుతురాజ్ 52 మ్యాచ్‌లలో 135.52 స్ట్రయిక్‌రేట్‌తో 1797 పరుగులు సాధించాడు. రుతురాజ్ భారత్ తరఫున 6 వన్డేలు, 19 టి20లు ఆడాడు. 2022లో జడేజాను అనూహ్యంగా కెపె్టన్ చేయడంతో సమస్య వచ్చిందని, కానీ ఈసారి మార్పుకు తాము ముందే సిద్ధమయ్యామని సీఎస్కే మేనేజ్మెంట్ ప్రకటించింది. -
టీమిండియాకు మరో ధోని దొరికేశాడు
-
కోపికో కాఫీ క్యాండీ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని
హైదరాబాద్: కోపికో కాఫీ క్యాండీ బ్రాండ్ తన అంబాసిడర్‌గా క్రికెటర్ మహీంద్ర సింగ్ ధోనిని నియమించుకుంది. ఇండియాలోని క్యాండీ కేటగిరీలో అగ్రస్థానంలో ఉన్న ‘కోపికో కాఫీ’ స్థాయిని మరింత బలోపేతం చేసేందుకు త్వరలో చేపట్టే ప్రచార కార్యక్రమాల్లో ధోని పాల్గొంటారని కంపెనీ తెలిపింది. కోపికో కాఫీ తనను ప్రచారకర్తగా ఎన్నుకోవడం పట్ల ధోని సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే నంబర్ వన్ కాఫీ క్యాండీతో కలిసి పనిచేసే అవకాశం దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ధోని పేర్కొన్నారు. -
కోలీవుడ్‌ను నమ్మి క్లీన్ బోల్డ్ అయిన 5 మంది స్టార్ క్రికెట్ ఆటగాళ్లు
కొందరు భారత్ ప్రముఖ క్రికెటర్లు సినిమా రంగంలో రానించాలనే కోరికతో తమిళ చిత్రసీమలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని కలలు కంటూ.. తొలి సినిమాతోనే క్లీన్ బౌల్డ్ కావడమే కాకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చినంత వేగంగానే చెన్నై వదిలి వెళ్లిపోయారు. అలాంటి ఐదుగురు సెలబ్రిటీల గురించి చూద్దాం. భారత్‌లో క్రికెట్‌కు అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో క్రికెటర్లకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకుని కొందరు క్రికెటర్లు తమిళ చిత్రసీమలోకి హీరోలుగా అడుగుపెట్టినా.. విజయావకాశాలను అందిపుచ్చుకోలేకపోయారు. (ఇదీ చదవండి: లారెన్స్ తన కూతురిని దాస్తున్నాడా? ఆయనకు అంత పెద్ద కూతురు ఉందా?) తమిళ సినీ పరిశ్రమలో కనిపించిన ఐదుగురు క్రికెట్ సెలబ్రిటీలకు కొంతమేరకు నష్టం తెచ్చింది. కానీ అందరికంటే భారత మాజీ కెప్టెన్ ధోనీనే ఎక్కువగా నష్టపోయాడని చెప్పవచ్చు. మరోవైపు సినిమాల్లో నటించి సక్సెస్ కాకపోవడంతో ఆ క్రికెటర్లకు అవకాశాలు రాలేదు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఎల్జీఎం అనే చిత్రాన్ని క్రికెటర్ ధోనీ నిర్మించాడు. ఎనిమిది కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించగా ఇవానా హీరోయిన్గా నటించింది. నదియా, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకుంది. అలాగే, ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని OTTకి విక్రయించడానికి ధోని కష్టపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అదే విధంగా ఈ సినిమా వల్ల ధోని సంస్థ నష్టపోయింది. మొదటి ప్రొడక్షన్ LGM ఫ్లాప్ కావడంతో, ధోని తన తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తాడా? అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. నటులుగా అరంగేట్రం చేసిన క్రికెట్ దిగ్గజాలు ఈ జాబితాలో క్రికెటర్ సదాగోపన్ రమేష్ మొదటి స్థానంలో ఉన్నాడు. 1999 సెప్టెంబరులో అతను వన్డే క్రికెట్లో మొదటి బంతికే వికెట్ తీసిన తొలి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. కానీ ఆయన కేవలం 19 టెస్ట్ మ్యాచ్‌లతో పాటు 24 వన్డేలు మాత్రమే ఆడారు. 2011లో దర్శకుడు యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో 'బొట్ట బొట్టి' తమిళ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం ఒక చిన్న గ్రామంలో క్రికెట్ మ్యాచ్ చుట్టూ కేంద్రీకృతమై, హాస్య కథాంశం ఆధారంగా రూపొందించబడింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆదిలోనే సినీ పరిశ్రమకు దూరమయ్యాడు. అతని తర్వాత నటుడు హర్భజన్ సింగ్ ఇటీవలే 'ఫ్రెండ్షిప్' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అదే విధంగా, ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా కోలీవుడ్‌లో నటించాడు. చియాన్ విక్రమ్ నటించిన 'కోబ్రా' చిత్రంలో పోలీసు అధికారి పాత్రను పోషించాడు. సినిమాలో అతని పాత్ర ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ 'కోబ్రా' సినిమా ఘోర పరాజయం అయింది. దీంతో ఇర్ఫాన్ పఠాన్ కూడా సినిమాల నుంచి కనిపించకుండా పోయాడు. అతని తర్వాత క్రికెటర్ శ్రీశాంత్ కూడా గత సంవత్సరం విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 'కథు వాకిల్ దౌ కాదల్'లో చిన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఆయన నటించిన సన్నివేశాలను ఎక్కువగా కట్ చేయడంతో ఆయన పాత్రకు స్కోప్ లేకుండా పోయింది. అలా ఆయన కూడా మరోసారి తమిళ చిత్రసీమలో అడుగుపెట్టలేదు. (ఇదీ చదవండి: విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాపై బ్యాన్ విధించిన కోర్టు) సినిమా అంటే తెలుగు ప్రేక్షకలకు చాలా మక్కువ.. అందుకే భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా జైలర్,జవాన్,విక్రమ్ వంటి సినిమాలకు టాలీవుడ్లో భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అలా ధోనీ నిర్మించిన మొదటి సినిమా టాలీవుడ్ నుంచి అయి ఉండుంటే కచ్చితంగా విజయవంతం అయి ఉండేదని పలువురు అభిప్రాయ పడ్డారు. ధోనీ తన LGM ప్రొడక్షన్ నుంచి తర్వాత నిర్మించబోయే సినిమా తెలుగు నుంచే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. -
ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?
టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో అద్భుతాలు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అంతర్జాతీయంగా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. మరోవైపు పలు వ్యాపారాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అలా సినిమాల్లోకి వచ్చాడు. నిర్మాతగా తమిళంలో ఫస్ట్ మూవీ తీశాడు. మరి దీని టాక్ ఏంటి? హిట్టా ఫట్టా? 'ఎల్‌జీఎమ్' కథేంటి? గౌతమ్(హరీశ్ కల్యాణ్), మీరా(ఇవానా) రెండేళ్లుగా లవ్‌లో ఉంటారు. పెద్దల అంగీకారంతో పెళ్లికి రెడీ అవుతారు. అయితే అత్తతో కలిసి ఉండటానికి మీరా నో చెబుతుంది. దీంతో గౌతమ్.. మన వివాహం కుదరదని అంటాడు. దీంతో రాజీకొచ్చిన మీరా.. అత్త(నదియా)ని అర్థం చేసుకోవడం కోసం తన పెళ్లికి ముందు ఆమెతో కలిసి వారం రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తుంది. అనుకోని పరిస్థితుల్లో ట్రిప్‌కి వెళ్లిన మీరాతో పాటు ఆమెకు కాబోయే అత్తని కొందరు కిడ్నాప్ చేస్తారు. చివరకు ఏమైంది? అనేది స్టోరీ. (ఇదీ చదవండి: ప్రియుడి కోసం పేరు మార్చుకున్న నటి.. రెండో పెళ్లి చేసుకుందా?) టాక్ ఏంటి? తమిళ ఆడియెన్స్, నెటిజన్స్ చెబుతున్న దాని ప్రకారం 'ఎల్‌జీఎమ్' చాలా బోరింగ్‌గా ఉందని అంటున్నారు. రెండున్నర గంటలపాటు నిడివితో ఉన్న ఈ సినిమాలో చాలాసేపు ప్రేమకథనే చూపడం, కూర్చుని మాట్లాడుకోవడం లాంటి సీన్స్ వల్ల విసుగొచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. తమిళ బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదని, కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వచ్చినట్లు సమాచారం. తెలుగు సంగతేంటి? తమిళంతోపాటు తెలుగులోనూ జూలై 28నే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ 'బ్రో' వల్ల ప్లాన్ మార్చుకున్నారు. ఓ వారం ఆలస్యంగా అంటే ఆగస్టు 4న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 'ఎల్‌జీఎమ్' రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో హరీశ్ కల్యాణ్, ఇవానా, నదియా ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళమణి దర్శకుడు. మరి తమిళంలో తేడా కొట్టేసిన ఈ సినిమా తెలుగులో ఏ మేరకు టాక్ తెచ్చుకుంటుందనేది చూడాలి. (ఇదీ చదవండి: ప్రముఖ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్!) -
ధోనీ నిర్మాతగా ఫస్ట్ సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్
మారుతున్న ట్రెండ్‌లో ప్రేమకు అర్థం మారిపోయింది. అమ్మాయి-అబ్బాయి లివ్ ఇన్ రిలేషన్లో ఉండి, నచ్చితే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లికి ముందు ఇదేం ప్యాషన్ అని అనుకోవచ్చు. కానీ అబ్బాయిని అమ్మాయి.. అమ్మాయిని అబ్బాయి అర్థం చేసుకోవటానికే ఇది కచ్చితమనే భావన ఉండటంతో చాలామంది అటు వైపుగానే ఆలోచనలు చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఆమె వల్ల చనిపోదామనుకున్నా.. నటుడు అబ్బాస్ కామెంట్స్) అలానే పెళ్లి చేసుకుని ఓ ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టాల్సిన అమ్మాయి తన ప్రేమికుడిని విచిత్రమైన కోరిక కోరుతుంది. తనకు కాబోయే అత్తతో కలిసి కొన్ని రోజులు ట్రిప్ వెళతానని అప్పుడు ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికీ తెలుస్తుందని చెబుతుంది. ఇది కాస్త వింతగానే ఉన్నా.. అతడు ఒప్పుకొంటాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే 'ఎల్జీఎం' చూడాల్సిందే. టీమిండియా సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన తీసిన ఫస్ట్ మూవీ ఇది. తెలుగు ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ చిత్రానికి రమేష్ తమిళమణి దర్శకత్వంతో పాటు సంగీతం అందించారు. త్వరలో ఈ సినిమాని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. (ఇదీ చదవండి: నటి ప్రగతి కొత్త జర్నీ.. ఇది అస్సలు ఎవరూ ఊహించలేదు!) -
ధోనీ ఫస్ట్ సినిమా ట్రైలర్.. అలాంటి కాన్సెప్ట్‌తో!
Dhoni LGM Movie Trailer: స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ మొన్నటివరకు గ్రౌండ్ లో సిక్సులు కొట్టాడు. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర హిట్స్ కొట్టడానికి రెడీ అయిపోయాడు. అవును మీరు విన్నది కరెక్టే. క్రికెటర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న మహీ.. తమిళంలో నిర్మాతగా తొలి సినిమా తీస్తున్నాడు. 'LGM' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా రిలీజ్ చేశారు. ఇది కాస్త ఫన్ క్రియేట్ చేస్తూనే అలరిస్తోంది. (ఇదీ చదవండి: ఒక్క ట్రైలర్.. మూడు సినిమాలు కనిపించాయ్!) ధోనీ చాలారోజుల తర్వాత మళ్లీ చెన్నైలో కనిపించాడు. ఈసారి క్రికెటర్‌గా కాదు నిర్మాతగా దర్శనమిచ్చాడు. సోమవారం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భార్య సాక్షితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. ధోనీ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ స్థాపించిన తర్వాత తొలి మూవీ తమిళంలోనే తీస్తున్నాడు. 'LGM' (లెట్స్ గెట్ మ్యారీడే) పేరుతో తీస్తున్న ఈ మూవీలో హరీశ్ కల్యాణ్, ఇవానా, నదియా ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. పెళ్లి-ఫ్యామిలీ ఎమోషన్స్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తీశారు. LGM కథేంటి? గౌతమ్(హరీశ్ కల్యాణ్), మీరా(ఇవానా) రెండేళ్లుగా లవ్‌లో ఉంటారు. పెద్దల అంగీకారంతో పెళ్లికి రెడీ అవుతారు. అయితే అత్తతో కలిసి ఉండటానికి మీరా నో చెబుతుంది. దీంతో గౌతమ్.. మన వివాహం కుదరదని అంటాడు. దీంతో రాజీకొచ్చిన మీరా.. అత్త(నదియా)ని అర్థం చేసుకోవడం కోసం తన పెళ్లికి ముందు ఆమెతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తుంది. అయితే ఈ క్రమంలో మీరాతో పాటు ఆమెకు కాబోయే అత్తని కొందరు కిడ్నాప్ చేస్తారు. చివరకు ఏమైంది? అనేది స్టోరీ. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!) -
అత్త చేతిలో ధోని బిజినెస్...
-
ఒకే బంతికి రెండు రివ్యూలు ధోనిని మించిపోయిన అశ్విన్
-
ఒకే బంతికి రెండు రివ్యూలు ధోనిని మించిపోయిన అశ్విన్..!
-
నీకో దణ్డం ద్రవిడ్ ....ఇక నుండి ధోని టైమ్
-
విజయ్ సినిమాకు ధోనీ ఇమేజ్, ఆ టైటిల్ ఫిక్స్ కానుందా?
సినీ ప్రపంచంలో స్టార్ కథానాయకుల చిత్రాలు ప్రారంభం కాక ముందు నుంచే ప్రచారం హోరెత్తిపోతున్న విషయం తెలిసిందే! కోలీవుడ్ హీరో విజయ్ కొత్త చిత్రం గురించి ఇలానే రోజుకో వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈయన లియో చిత్రంలో నటిస్తున్నారు. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. లియో చిత్రం దీపావళికి థియేటర్లో విడుదల కానుంది. (ఇదీ చదవండి: నయనతార గ్లామర్ రహస్యం.. ఆ రెండింటినీ అస్సలు మిస్ చేయని హీరోయిన్) దీంతో విజయ్ తన 68వ చిత్రానికి రెడీ అయిపోతున్నారు. దీనికి పలు దర్శకులు క్యూలో ఉండగా అనూహ్యంగా వెంకట్ ప్రభు పేరు ముందుకు రావడం విశేషం. ఇందులో త్రిష మరోసారి విజయ్‌తో జతకట్టనున్నట్లు ప్రచారం జరుగుతున్నా అధికారికంగా వెల్లడి కాలేదు. ప్రస్తుతం దర్శకుడు వెంకట్ ప్రభు ఇందులో నటించే నటీనటులు సాంకేతిక వర్గం ఎంపికపై దృష్టి పెట్టినట్లు సమాచారం అయితే ఈ చిత్రంలో విలన్‌గా నటుడు ఎస్ జే.సూర్యను ఎంపిక చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇది తండ్రి కొడుకుల మధ్య తలెత్తే అభిప్రాయ బేధాల నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రానికి క్రికెట్ క్రీడకు సంబంధించిన పేరును నిర్ణయించాలని భావిస్తున్నట్లు, ఆ విధంగా దీనికి సీఎస్కే అనే పేరు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. (ఇదీ చదవండి: ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌లు ఇవే! రానా నాయుడు ఏ ప్లేస్‌లో ఉందంటే?) దీంతో సినిమాపై క్రికెటర్ ధోనీ మార్క్ ఉండనుంది. ఐపీఎల్లో సీఎస్కే కోసం ధోనీ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌కు నటుడు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అధికారికంగా వెల్లడించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. సీఎస్కే పేరు బయటకు రావడంతో విజయ్ అభిమానులు ఆనందాల్లో మునిగి తేలుతున్నారు. -
మహి అన్న కోసం ఏదైనా చేస్తా టచ్ చేస్తున్న జడేజా మాటలు..!
-
ఆటోగ్రాఫ్ ఇవ్వని ధోని బతిమాలుకున్న చాహర్..!
-
గెలిచిన CSK.. పండగ చేసుకుంటున్న పాకిస్థాన్ ఫాన్స్ ..!
-
కోకిలాబెన్ హాస్పిటల్‌కు వెళ్లనున్న ధోని.. ఎందుకంటే?
ఐపీఎల్-2023 విజేతగా చెన్నైసూపర్ కింగ్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ను మట్టికరిపించిన సీఎస్కే.. ఐదోసారి ఛాంపియన్స్‌గా అవతరించింది. ఇక ఇది ఇలా ఉండగా.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో తన మోకాలి గాయానికి సంబంధించి పలు టెస్టులు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం తన మెకాలికి సర్జరీ చేసుకునున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా ధోని ఈ ఏడాది సీజన్ ఆరంభం నుంచి మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో నడవడానికి కూడా ధోని ఇబ్బంది పడ్డాడు. చెపాక్‌లో జరిగిన సీఎస్కే ఆఖరి హోం లీగ్ మ్యాచ్ అనంతరం ధోని.. స్టేడియం మొత్తం తిరిగుతూ అభిమానులకు అభివాదం చేశాడు. ఈ క్రమంలో దోని తన మెకాలికి ఓ క్యాప్(నీ క్యాప్) పెట్టుకుని తిరిగడం కన్పించింది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది.అయినప్పటికీ ఓ వైపు నొప్పిని భరిస్తునే. . ఒక్క మ్యాచ్‌కు కూడా దూరం కాకుండా తన జట్టును ఛాంపియన్స్‌గా మిస్టర్ కూల్ నిలిపాడు. ఇక వచ్చే ఏడాది సీజన్లో కూడా ధోని మళ్లీ కన్పించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫైనల్ మ్యాచ్ అనంతరం ఐపీఎల్ నుంచి ధోని తప్పుకుంటాడని అంతా భావించారు. కానీ వచ్చే ఏడాది సీజన్‌కు మరో 9 నెలల సమయం ఉంది కాబట్టి.. త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ధోని మ్యాచ్ అనంతరం చెప్పాడు. అయితే ఆడేందుకు తన శరీరం సహకరిస్తే కచ్చితంగా కొనసాగుతానని ధోని పేర్కొన్నాడు. చదవండి: #MS Dhoni On Retirement: నా కళ్లు చెమర్చాయి.. రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయం.. కానీ! ధోని భావోద్వేగం -
IPL 2024కి రెడీ 41 ఏళ్ళ వయసు ఆయన తగ్గేదేలే ..!
-
CSK వద్దనుకుంది GT కొనుక్కుంది 20 లక్షలు తీసుకుని చెన్నై పై రెచ్చి పోయడుగా ....
-
బ్యాటింగ్ చేసేది గిల్ అయితే కీపింగ్ చేసేది ధోని...
-
ధోనికి జడేజాకు మధ్య విబేధాలు ఇంకా ప్రూఫ్స్ కావాలా ....!
-
తలా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా...
-
చెన్నై పాంచ్ పటాకా
-
చెన్నై స్టేడియం లో ధోని చేసిన పనికి ...
-
చెన్నైVS గుజరాత్
-
ఒక్క విషయం చాలు గుజరాత్ తో గెలిచేది చెన్నై...
-
వారెవ్వా గిల్ ఆవిషయంలో ధోని తరువాత ఇతనే..
-
ధోని కప్.. గిల్ సెంచరీ.. ఫైనల్ పై ఉత్కంఠ..
-
ఐపీఎల్ కు ధోనీ రిటైర్మెంట్ ?
-
పతిరణకు నేను ఉన్న అంటున్న ధోని..
-
పతిరణకి ధోని సలహా...మండి పడుతున్న మలింగ
-
ధోని గురించి ఆఒక్క మాటతో టచ్ చేసిన హర్దిక్ పాండ్య,
-
పీక్స్ కి చేరిన ధోని రవీంధ్ర జడేజా గొడవలు...మధ్యలో ఏంట్రీ ఇచ్చిన జడ్డు వైఫ్
-
CSK సక్సెస్ ఫార్మలా చెప్పిన ధో ని
-
SRHకి ధోని పాఠాలు...రాత మారుతోందా?
-
ధోని తోపు కబాటే తప్పు చేసిన ఓకేనా? థర్డ్ అంపైర్ ఏం చేస్తున్నాడు?
-
ధోని కెప్టెన్సీ అంటే అలెర్ట్ గా ఉండాలి...లేదంటే ఇంతే
-
ఇదేమి ట్రోలింగ్ రా మామ..!
-
ధోనిసేన శుభారంభం.. ఎగసిన సీఎస్కే జెండా
-
ట్రాక్టర్‌తో పొలం దున్నుతున్న ధోని.. ఫోటోలు వైరల్
-
LGM: ధోని తొలి సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సినిమా రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ధోని, ఆయన సతీమణి సాక్షి కలిసి ‘ధోని ఎంటర్టైన్మెంట్’అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. తాజాగా తమ బ్యానర్‌పై రూపొందబోతున్న తొలి సినిమాకి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. హరీశ్ కళ్యాణ్, ఇవానా హీరో హీరోయిన్లుగా నదియా, యోగి బాబు ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాకి ‘ఎల్జీఎం’ (లెట్స్ గెట్స్ మ్యారేడ్) - అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ మోక్షన్ పోస్టర్ విడుదల చేశారు. నూతన దర్శకుడు రమేష్ తమిళమణి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘మంచి కథల ద్వారా దేశంలోని నలుమూలలో వున్న ప్రేక్షకులకు చేరువవ్వడమే ధోనీ ఎంటర్టైన్మెంట్ లక్ష్యం. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ఈ సినిమా రూపొందుతోంది’ అని గతంలో సాక్షి అన్నారు. We're super excited to share, Dhoni Entertainment's first production titled #LGM - #LetsGetMarried! Title look motion poster out now! @msdhoni @SaakshiSRawat @iamharishkalyan @i__ivana_ @HasijaVikas @Ramesharchi @o_viswajith @PradeepERagav pic.twitter.com/uG43T0dIfl — Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) January 27, 2023 -
ధోని సంవత్సరానికి కట్టే టాక్స్ ఎంతంటే ..?
-
అత్యుత్తమ వన్డే జట్టు ఎంపిక.. రోహిత్ శర్మకి నో ఛాన్స్!
టీమిండియా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ తన ఆల్-టైమ్ ఇండియన్ బెస్ట్ వన్డే ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. అతడు ప్రకటించిన జట్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిను కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, దిగ్గజ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్‌లకు అతడు అవకాశం ఇచ్చాడు. ఇక భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి 3వ స్థానంలో చోటు దక్కగా, క్రికెట్ లెజెండ్ మహమ్మద్ అజారుద్దీన్‌కి నాలుగో స్ధానంలో చోటు దక్కింది. ఇక ఐదో స్ధానంలో యువరాజ్ సింగ్‌కి అవకాశం ఇవ్వగా, ఆరో స్ధానంలో ధోనికి చోటు ఇచ్చాడు. ఆల్‌రౌండర్ల కోటాలో భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్‌ను వెంకటేష్ ప్రసాద్ ఎంపిక చేశాడు. ఇక తన జట్టులో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్‌ను బౌలర్లుగా వెంకటేష్ ప్రసాద్ ఎంచకున్నాడు. కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకి వెంకటేష్ ప్రసాద్ ప్రకటించిన జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. వెంకటేష్ ప్రసాద్ వన్డే అత్యత్తుమ జట్టు: వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహమ్మద్ అజారుద్దీన్, యువరాజ్ సింగ్, ఎంస్ ధోనీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, జవగల్ శ్రీనాథ్, జహీర్ ఖాన్ చదవండి: 25 ఏళ్ల తర్వాత పాక్ పర్యటనకు.. జట్టును ప్రకటించిన ఆసీస్ -
ఒకే జట్టులో సచిన్, ధోని,యువరాజ్.. కోహ్లి, రోహిత్‌కు నోఛాన్స్!
పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. తన జట్టులో నలుగురు భారత ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాడు. కాగా తన జట్టులో ఓపెనర్లుగా గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు గోర్డాన్ గ్రీనిడ్జ్‌ని ఎంచుకున్నాడు. పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్, సయీద్ అన్వర్‌కి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో చోటు కల్పించాడు. ఐదో స్ధానంలో భారత మాజీ కెప్టెన్ ధోనికి అవకాశం ఇచ్చాడు. ఆరో స్ధానంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్‌కి చోటు దక్కింది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో కపిల్‌దేవ్, యువరాజ్ సింగ్‌ను అక్తర్ ఎంపిక చేశాడు. తన జట్టులో ఏకైక స్పిన్నర్‌గా షేన్ వార్న్‌ను ఎంచుకున్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఇక బౌలర్ల కోటాలో వసీం అక్రమ్, వకార్ యూనిస్‌కు చోటు దక్కింది. కాగా అక్తర్ ప్రకటించిన జట్టులో భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి చోటు దక్కలేదు. షోయబ్ అక్తర్ ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: సచిన్ టెండూల్కర్, గోర్డాన్ గ్రీనిడ్జ్, ఇంజమామ్-ఉల్-హక్, సయీద్ అన్వర్, మహేంద్ర సింగ్ ధోనీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, యువరాజ్ సింగ్, షేన్ వార్న్ (కెప్టెన్), వసీం అక్రమ్, కపిల్ దేవ్, వకార్ యూనిస్ చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
నలుగురిని రిటైన్ చేసుకోవచ్చు.. సీఎస్కే నుంచి ధోని సహా 'ఆ ముగ్గురు'..!
IPL Teams Can Retain Upto 4 Players From Their Current Squad Before 2022 Auction: వచ్చే ఏడాది ఐపీఎల్ వేలానికి ముందు జట్లు రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల సంఖ్యపై బీసీసీఐ ఓ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను నిలుపుకునేందుకు అవకాశం ఉంటుందని ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ పేర్కొంది. రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో ముగ్గురు భారతీయ ఆటగాళ్లతో పాటు ఓ విదేశీ ఆటగాడు ఉంటాడని సమాచారం. ఇదిలా ఉంటే, ఆటగాళ్లను అట్టిపెట్టువడంపై ప్రస్తుత ఛాంపియన్ సీఎస్కే యాజమాన్యం ఇది వరకే ఓ క్లారిటీ ఇచ్చింది. జట్టు సారధి ధోనిని రిటైన్ చేసుకోనున్నట్లు స్వయానా ఆ ఫ్రాంచైజీ యజమానే వెల్లడించారు. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యపై తాజాగా ఓ క్లారిటీ రావడంతో మిగిలిన ముగ్గురు ఆటగాళ్లపై కూడా సీఎస్కే యాజమాన్యం ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ధోని సహా రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్‌లను స్వదేశీ ఆటగాళ్ల కోటాలో.. విదేశీ ప్లేయర్స్ కోటాలో బ్రావో లేదా డుప్లెసిస్‌లలో ఒకరిని రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సీఎస్కే వర్గాల సమాచారం. చదవండి: T20 World Cup 2021: పొట్టి ప్రపంచకప్ చరిత్రలో నెదర్లాండ్స్ అత్యంత చెత్త రికార్డు -
ధోని పక్కా వ్యూహం.. వారి వయసు 35 ఏళ్లకు పైనే..
సాక్షి క్రీడా విభాగం: ‘మేం వచ్చేసారి బలంగా తిరిగొస్తాం... అభిమానులకు ఇదే నా సందేశం’... గత ఏడాది ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచిన తర్వాత ధోని చేసిన వ్యాఖ్య ఇది. జట్టుపై, తనపై ఎంత నమ్మకముంటే ధోని ఇలాంటి మాటలు చెప్పగలడు. ఎందుకంటే అతను ధోని కాబట్టి! చూస్తుంటే టీమ్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. వయసు పెరిగిపోయి, ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఆటగాళ్లతో ఈసారే కాలేదు, వచ్చే ఏడాది ఏమవుతుంది అని అన్ని వైపుల నుంచి వ్యంగ్య స్పందనలు. కానీ ఇలాంటి స్థితి నుంచి టీమ్‌ను నిజంగా విజేతగా నిలపడం అంటే అసాధారణం. సీఎస్కేకు తొలి సీజన్ నుంచి కర్త, కర్మ, క్రియ అన్నీ ధోనినే. జట్టు గెలిచినా, ఓడినా, చాంపియన్‌షిప్‌లు సాధించినా అంతా అతని సారథ్యం అనడంలో సందేహం లేదు. టీమ్ మేనేజ్మెంట్ కూడా ఇదే నమ్మింది. ఇన్నేళ్ల విజయాల్లో భిన్న ఆటగాళ్లు తమదైన పాత్ర పోషించారు. కానీ మారనిది ధోని, అతని వ్యూహ చతురతే! సరిగ్గా చెప్పాలంటే ఈ సీజన్లో 40 ఏళ్ల ధోని బ్యాటింగ్ చూస్తే సూపర్ కింగ్స్ పది మంది ఆటగాళ్లు, ఒక కెప్టెన్‌తో ఆడినట్లు ఉంది. కేవలం నాయకత్వం కారణంగానే అతను టీమ్‌లో ఉన్నాడనేది వాస్తవమైతే అతను నాయకుడిగా ఉన్నాడు కాబట్టే టీమ్ ఇలా పురోగమించిందనేది కూడా అంతకంటే వాస్తవం! చెన్నై టీమ్‌లో ఐదుగురు ఆటగాళ్లు 35 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు. టి20లు అనగానే ఈ విషయంలో కాస్త సంశయం కనిపిస్తుంది. అయితే బరిలోకి దిగి అద్భుతాలు చేసేందుకు వారికి వయసు అడ్డు రాలేదు. వీరంతా టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. 37 ఏళ్ల డు ప్లెసిస్ ఏకంగా 633 పరుగులతో సత్తా చాటి ఓపెనర్‌గా శుభారంభాలు అందించాడు. 38 ఏళ్ల బ్రావో 14 కీలక వికెట్లు తీసి తాను చెన్నై బృందంలో సుదీర్ఘ కాలంగా ఎందుకు కొనసాగుతున్నాడో చూపించాడు. 34 ఏళ్ల సీనియర్, అత్యంత విజయవంతమైన చెన్నై ఆటగాడు సురేశ్ రైనా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతుంటే మరో 35 ఏళ్ల రాబిన్ ఉతప్పను తుది జట్టులోకి తీసుకొని చేసిన వ్యూహం సూపర్‌గా పేలింది. తొలి క్వాలిఫయర్‌లో మెరుపు బ్యాటింగ్ చేసిన ఉతప్ప, ఫైనల్లో జట్టు ఒత్తిడిలోకి వెళుతున్న సమయంలో 3 సిక్సర్లతో ఆట మార్చేశాడు. 36 ఏళ్ల రాయుడు కూడా కీలక సమయంలో రెండు అర్ధ సెంచరీలతో తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక ఐపీఎల్ గెలిచిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచిన 34 ఏళ్ల మొయిన్ అలీని కూడా ధోని సమర్థంగా వాడుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లతో పాటు అతని చక్కటి ఫీల్డింగ్ జట్టుకు ఎంతో పనికొచ్చాయి. ఎప్పటిలాగే రవీంద్ర జడేజా తనదైన శైలిలో అన్ని రంగాల్లో రాణించడం చెన్నై బలాన్ని పెంచింది. ఇక టీమ్ ప్రస్థానంలో చెప్పుకోదగ్గ పేరు రుతురాజ్ గైక్వాడ్. గత ఏడాది ఐపీఎల్ సమయంలో అనూహ్యంగా కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత ఆరంభంలో విఫలమైనా... చివరి మ్యాచ్‌లలో సత్తా చాటాడు. ఈసారి తనలోని పూర్తి స్థాయి ఆటను చూపిస్తూ సెంచరీ సహా 635 పరుగులు సాధించడం చెన్నై టైటిల్ విజయంలో కీలకంగా మారింది. వీరందరినీ సమర్థంగా వాడుకుంటూ ధోని నడిపించిన తీరు నాయకుడిగా అతని వన్నె ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. చివరగా... వచ్చేసారి ఐపీఎల్లో మెగా వేలం ఉన్న నేపథ్యంలో ఇంకా నియమ నిబంధనలు ఏమిటనేది బీసీసీఐ ఇంకా స్పష్టం చేయలేదు. అయితే విజేతలుగా నిలిచిన ఈ టీమ్‌లోని సభ్యుల్లో కూడా ఎంత మంది మళ్లీ ఐపీఎల్లో కనిపిస్తారనేది వేర్వేరు కారణాలతో సందేహమే. ఒకవేళ ఆడినా ఇదే సక్సెస్ఫుల్ టీమ్ ఒక్క చోటికి చేరడం సహజంగానే కష్టం. ఈ నేపథ్యంలో వీరు సాధించిన విజయపు ఘనత చిన్నదేమీ కాదు. చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు, సగటు క్రికెట్ అభిమాని కూడా... ఏం ఆడిందిరా ఈ టీమ్ అనేలా ఘనంగా చెన్నై ముగింపు పలికింది. -
భారత టీ20 ప్రపంచకప్ జట్టు ప్రకటన.. కొత్త బాధ్యతల్లో ధోని
రవిచంద్రన్ అశ్విన్‌కు అనుకోని అదృష్టం తలుపు తట్టింది. టెస్టు స్పెషలిస్ట్‌గానే కెరీర్ కొనసాగిస్తున్నా గత నాలుగు మ్యాచ్‌లలో అవకాశం దక్కని అతనికి నాలుగేళ్ల తర్వాత మళ్లీ టి20 జట్టులోకి, అదీ ప్రపంచకప్ కోసం పిలుపు రావడం విశేషం. ఒమన్, యూఏఈలలో అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరిగే వరల్డ్‌కప్ లో పాల్గొనేందుకు బుధవారం ప్రకటించిన భారత బృందంలో అశ్విన్ చేరిక కాస్త ఆశ్చర్యపరచగా... లెగ్‌స్పిన్నర్ చహల్, ఓపెనర్ ధావన్‌లకు మాత్రం చోటు లభించలేదు. ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఎమ్మెస్ ధోని ఈసారి కొత్తగా ‘మెంటార్’ పాత్రలో జట్టుతో కలిసి పని చేయబోతుండటం మరో అనూహ్య నిర్ణయం. కోహ్లి కెప్టెన్‌గా, రవిశాస్త్రి కోచ్‌గా, ధోని మార్గనిర్దేశనంలో ఈ జట్టు విశ్వ విజేతగా నిలుస్తుందా అనేది ఆసక్తికరం. ముంబై: టి20 వరల్డ్‌కప్–2021లో పాల్గొనే 15 మంది సభ్యుల భారత జట్టును సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. కోహ్లి నాయకత్వంలోని ఈ టీమ్‌లో స్పిన్నర్లకు ప్రాధాన్యత లభించింది. యూఏఈలో ఐపీఎల్ ముగిసిన తర్వాత జరిగే ఈ టోర్నీలో పిచ్‌లు బాగా నెమ్మదించి స్పిన్‌కు అనుకూలిస్తాయని భావించడం కూడా అందుకు కారణం. మరో ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా టీమ్‌లోకి ఎంపిక చేశారు. అశ్విన్ ఎంపిక మినహా దాదాపు అందరూ కొన్నాళ్లుగా టీమిండియా తరఫున, ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్నవారే ఉన్నారు. చదవండి: IND VS ENG: ఇంగ్లండ్‌లో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్.. షెడ్యూల్ ఇదే సుందర్ దూరం కావడంతో... రవిచంద్రన్ అశ్విన్ 2017 జూలైలో భారత్ తరఫున వెస్టిండీస్‌తో తన చివరి టి20 మ్యాచ్, అదే సిరీస్‌లో చివరిసారిగా వన్డే ఆడాడు. నాలుగేళ్లుగా అతను పూర్తిగా టెస్టులకు పరిమితమయ్యాడు. అయితే ఐపీఎల్లో అశ్విన్ నిలకడైన ప్రదర్శన సెలక్టర్లు టి20ల విషయంలో పునరాలోచించేలా చేసింది. 2020 ఐపీఎల్లో 7.66 ఎకానమీతో 13 వికెట్లు తీసి ఢిల్లీ తొలిసారి ఫైనల్‌కు చేరడంలో అశ్విన్ కూడా కీలకపాత్ర పోషించాడు. నిజానికి చెన్నైకే చెందిన వాషింగ్టన్ సుందర్ ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్‌గా జట్టులో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. అయితే గాయంతో బాధపడుతున్న అతను కోలుకోకపోవడంతో అశ్విన్ కు అవకాశం దక్కింది. చహల్, ధావన్ అవుట్... లెగ్‌స్పిన్నర్‌గా యజువేంద్ర చహల్ ఖాయమని అనిపించినా... సెలక్టర్లు రాహుల్ చహర్‌కే ఓటు వేశారు. ఓవరాల్‌గా ఇద్దరి ప్రదర్శన బాగానే ఉన్నా, 2019 నుంచి చూస్తే చహల్ బౌలింగ్‌లో పదును తగ్గింది. మ్యాచ్ మ్యాచ్‌కూ మెరుగవుతున్న రాహుల్ చహర్ వరల్డ్‌కప్ అవకాశం దక్కించుకున్నాడు. ఐపీఎల్ ప్రదర్శన ‘మిస్టరీ ఆఫ్ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తికి చాన్స్ ఇప్పించింది. జడేజా జట్టులో ఉండగా అక్షర్ పటేల్ ఎంపిక మాత్రం అనూహ్యం. అయితే అతనికి మ్యాచ్ దక్కే అవకాశాలు తక్కువ. ముగ్గురు ప్రధాన పేసర్లు మాత్రమే జట్టులో ఉండగా... అక్షర్ స్థానంలో శార్దుల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే జట్టు మరింత సమతుల్యంగా కనిపించేది. ఇటీవల శ్రీలంకలో భారత జట్టు కెపె్టన్‌గా వ్యవహరించినా... వరల్డ్‌కప్ టీమ్ లోకి మాత్రం ధావన్ ఎంపిక కాలేకపోయాడు. చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేస్తున్నా, ఓపెనింగ్‌లో అవకాశం లేకపోవడంతో పక్కన పెట్టక తప్పలేదు. ఇంకా గడువుంది... ప్రస్తుతానికి జట్టును ప్రకటించినా... ఐసీసీ నిబంధనల ప్రకారం అక్టోబర్ 10 వరకు టీమ్‌లో మార్పుచేర్పులు చేయవచ్చు. ఐపీఎల్ ముగిశాక అక్కడి ప్రదర్శనను బట్టి లేదా గాయాలవంటి కారణాలతో చివరి నిమిషంలో మార్పులకు చాన్స్ ఉంది. ధోని ముద్ర... 2007లో కెప్టెన్‌గా జట్టుకు తొలి టి20 ప్రపంచకప్ అందించిన ధోని తర్వాతి ఐదు టోర్నీలలో కూడా సారథిగా వ్యవహరించాడు. ఐపీఎల్ మినహా రెండేళ్లుగా టీమిండియాతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటున్న అతను... బోర్డు కార్యదర్శి జై షా విజ్ఞప్తి మేరకు మెగా టోర్నీ కోసం ‘మెంటార్’గా ఉండేందుకు అంగీకరించాడు. కెపె్టన్, కోచ్‌లతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని జై షా వెల్లడించారు. అయితే రవిశాస్త్రి రూపంలో హెడ్ కోచ్, టాప్ ప్లేయర్ కోహ్లి కెపె్టన్‌గా ఉన్న టీమ్‌కు అదనంగా ధోని మార్గనిర్దేశనం అవసరమా అనేదే చర్చనీయాంశం! భారత టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఉన్నారు. స్టాండ్ బై ప్లేయర్స్‌గా శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్ ఎంపికైనారు. చదవండి: BAN VS NZ: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. కివీస్‌పై తొలిసారి.. -
ధోనీ, రైనా వీర బాదుడు.. సంబరాల్లో సీఎస్కే ఫ్యాన్స్
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2021) సెకెండ్ లెగ్ మ్యాచ్‌ల కోసం కొద్ది రోజుల కిందటే దుబాయ్‌లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు ధోనీ, రైనా, అంబటి రాయుడు నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ధోనీ, రైనా అయితే నెట్స్‌లో భారీ షాట్లు ఆడుతూ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. బంతి పడడమే ఆలస్యం.. వీర బాదుడు బాదుతూ.. మాంచి జోష్‌లో కనిపించారు. వీరి నెట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. 1🤩 Shots!#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/lTlaQOmZHL — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) August 23, 2021 ఇందులో ధోనీ, రైనా బాధుడును చూసి సీఎస్కే అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. త్వరలో ప్రారంభంకాబోయే ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌ల్లో తమ స్టార్లకు పట్టపగ్గాలుండవని కాలర్ ఎగరేస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 19న చెన్నై, ముంబైల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంది. ప్రస్తుత సీజన్లో చెన్నై జట్టు 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 2 పరాజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఈ మ్యాచ్‌ల్లో ధోనీ, రైనా పెద్దగా రాణించింది లేదు. దీంతో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా రాణించాలని పట్టుదలగా ఉన్నారు. మరోవైపు ఫారిన్ ప్లేయర్, ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ జట్టుతో చేరడం సీఎస్కేలో నయా జోష్ వచ్చింది. చదవండి: తాలిబన్ల రాజ్యంలో తొలి నియామకం.. అఫ్గాన్ క్రికెట్ చీఫ్‌గా ఫజ్లీ -
ధోనీని వేధించాను.. కిట్ బ్యాగ్ కూడా మోయించాను: రైనా
న్యూఢిల్లీ: సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీని సరదాగా ఆటపట్టించిన సందర్భాన్ని సహచరుడు సురేష్ రైనా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. ధోనీతో తనకున్న ప్రత్యేకమైన అనుబంధం గురించి వివరిస్తూ.. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. గుజరాత్ లయన్స్‌కు సారథ్యం వహిస్తున్నప్పుడు జరిగిన ఓ సరదా సంఘటన గురించి రైనా వివరించాడు. 2018లో ఐర్లాండ్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో ధోనీ భాయ్ 12వ ఆటగాడిగా ఉన్నాడని, తాము బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రింక్స్ అందించాడని పేర్కొన్నాడు. నేను క్రీజ్‌లో ఉన్నప్పుడు పదేపదే గ్లోవ్స్, బ్యాట్ల కోసం పిలుస్తుండటంతో.. ధోనీ నా కిట్ బ్యాగ్ మొత్తం మోసుకొచ్చాడని, తాను సరదాగా ఆటపట్టించాలని అనుకుంటే ధోనీ కాస్త సీరియస్‌గానే రియాక్ట్య్యాడని గుర్తు చేసుకున్నాడు. ఏం కావాలో ఒకేసారి తీసుకో, మళ్లీ మళ్లీ పిలవకని కోపడ్డాడని, దానికి బదులుగా నేను.. నా బ్యాట్ హ్యాండ్ గ్రిప్ తీసుకురా అని చెప్పడంతో భలే మంచోడివే దొరికావని అన్నాడని తెలిపాడు. మాహీ భాయ్ కోప పడటాన్ని తాను ఆస్వాధించానని, ఆ రోజు అతను నాకు దొరికాడని సంతోషించానని చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంగా ధోనీతో జరిగిన మరో సరదా సంభాషణను రైనా వెల్లడించాడు. 2016లో ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా ఐపీఎల్ ప్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్‌పై నిషేధం పడిన విషయం తెలిసిందే. దాంతో రైజింగ్ పుణే జట్టుకు ధోనీ, గుజరాత్ లయన్స్‌కు సురేష్ రైనా సారథ్యం వహించారు. ఇరు జట్ల మధ్య రాజ్‌కోట్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్ చేస్తుండగా, నేను స్ట్రయిక్‌లో, బ్రెండన్ మెక్‌కలమ్ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో, ఫస్ట్ స్లిప్‌లో డుప్లెసిస్, ధోనీ భాయ్ కీపింగ్ చేస్తున్నాడని, ఆ సన్నివేశాన్ని ఊహించుకుంటే పొరుగింటి వాళ్లతో క్రికెట్ ఆడినట్టు అనిపించిందని వివరించాడు. పైగా నేను క్రీజులోకి వెళ్లినపుడు 'రండి కెప్టెన్ సాబ్' అని ధోనీ అన్నాడని, వస్తున్నాను భాయ్.. ముందు మీరు జరగండి అని నేను బదులిచ్చానని గుర్తు చేసుకున్నాడు. కాగా, రైనా, ధోనీ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌కు ఒకే రోజు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. ప్రస్తుతం వారిద్దరూ చెన్నై జట్టుకు ఆడుతున్నారు. -
న్యూలుక్లో ధోనీ అదుర్స్.. సరదాగా స్నేహితులతో అలా..!
రాంచీ: కరోనా మహమ్మారి కారణంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత రెండేళ్లుగా ఎక్కువ శాతం రాంచీలోని తన ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యాడు. అక్కడే సేంద్రీయ వ్యవసాయం చేస్తూ కుటుంబంతో సరదాగా సమయం గడుపుతున్నాడు. ఇక ఐపీఎల్ 2021 వాయిదా పడడంతో దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తున్నాడు. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ టూర్ ముగించుకుని స్వస్థలానికి చేరుకున్న మాహీ.. రాంచీలోని తన స్నేహితులను కలిశాడు. వారితో కలిసి కార్ గ్యారేజ్‌లో భోజనం చేస్తూ సరదాగా టైంపాస్ చేశాడు. గ్యారేజ్‌లో ఉండే ఓ బల్లపై భోజనం పెట్టుకుని, స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ విందు ఆరగించాడు. వారి వెనక పాతకాలం నాటి రోల్స్ రాయిస్ కారు ఒకటుంది. దానిని ఓ వ్యక్తి రిపేర్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by MS Dhoni / Mahi7781 🔵 (@ms.dhoni.sr07) ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెరిసిన గడ్డంతో ధోనీ నవ్వుతూ ఈ ఫొటోలో కనిపిస్తున్నాడు. సాధారణ వ్యక్తిలా ధోనీ భోజనం చేసిన విధానం అందరిని ఆకట్టుకుంటుంది. న్యూ లుక్‌లో ధోనీ అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. క్రికెట్ చరిత్రలో తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ధోనీ.. అలా సింపుల్‌గా ఉండటంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతని సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. స్టార్ క్రికెటర్ హోదాను పక్కకు పెట్టి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయడాన్ని అభినంధిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ నెలలో యూఏఈలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by MS Dhoni / Mahi7781 🔵 (@ms.dhoni.sr07) -
సూర్యకుమార్ జట్టులో ఆ ఇద్దరు స్టార్లకు దక్కని చోటు..
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మెన్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్‌యాదవ్.. తన ఐపీఎల్ డ్రీమ్ ఎలెవన్‌ను ఎన్నుకున్నాడు. తాజాగా ఓ ప్రముఖ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే.. సూర్యకుమార్‌ను తన డ్రీమ్ ఐపీఎల్ జట్టును ప్రకటించమని కోరాడు. అయితే హర్షా భోగ్లే సూర్యకుమార్‌కు రెండు కండీషన్లు పెట్టాడు. జట్టులో సూర్యకుమార్ తప్పనిసరిగా ఉండాలన్నది మొదటిది కాగా.. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి నలుగురిని ఎంచుకోవాలన్నది రెండోది. ఈ నిబంధనలకి లోబడే సూర్యకుమార్ తన ఐపీఎల్ జట్టుని ఎంపిక చేశాడు. అయితే, సూర్య తన జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి, ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాడు, ఆసీస్ విధ్వంసకర వీరుడు డేవిడ్ వార్నర్‌లకు చోటివ్వకపోవడం గమనార్హం. ఓపెనర్ల కోటాలో ఇంగ్లండ్ వికెట్‌కీపర్ జోస్ బట్లర్‌ను ఎనుకున్న సూర్య.. ఓపెనింగ్ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ధోనీని పక్కకు పెట్టేశాడు. ఈ ఒక్క దెబ్బతో ధోనీకి, ఆసీస్ స్టార్ ఓపెనర్ వార్నర్‌కు ఒకేసారి చెక్ పెట్టాడు. మరో ఓపెనర్‌గా రోహిత్ శర్మను ఏంపిక చేసిన ఆయన.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీకి అవకాశం ఇచ్చాడు. ఇక, నాలుగో స్థానం కోసం తన పేరును ప్రకటించుకున్న సూర్య.. ఐదో ప్లేస్ కోసం దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌ను ఎన్నుకున్నాడు. సూర్యకుమార్ తన జట్టులో ముగ్గురు ఆల్రౌండర్లకు అవకాశం ఇవ్వడం విశేషం. ఈ కోటాలో హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్, రవీంద్ర జడేజాలకు వరుసగా 6, 7, 8 స్థానాల్లో అవకాశం ఇచ్చాడు. ఇక స్పెసలిస్ట్ స్పిన్నర్ కోటాలో రషీద్ ఖాన్‌ను ఎంచుకున్న సూర్యకుమార్.. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలను జట్టులోకి తీసుకున్నాడు. కాగా, సూర్యకుమార్.. ప్రస్తుతం ధవన్ జట్టుతో పాటు శ్రీలంకలో పర్యటిస్తున్నాడు. ఈ పర్యటనలో భారత్.. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ ఎలెవన్ టీమ్: జోస్ బట్లర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, హార్దిక్ పాండ్యా, ఆండ్రీ రసెల్, రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ. -
ధోనీకి బర్త్‌డే విషెస్ తెలిపిన బాలయ్య..
హైదరాబాద్: నేడు(జులై 7) 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్న టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీకి నందమూరి బాలయ్య పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలిపాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ అరుదైన ఫొటోను షేర్ చేస్తూ..మచ్చ లేని నాయకుడు, ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన లెజండరీ క్రికెటర్ ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ బాలయ్య రాసుకొచ్చాడు. ఈ ఫొటోను అటు బాలయ్య అభిమానులు, ఇటు ధోనీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్, ఫేవరెట్ హీరో ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉండటం చూసి తెగ సంబర పడిపోతున్నారు. View this post on Instagram A post shared by Nandamuri balakrishna (@balakrishna_nandamuri_) ఈ పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే వేల సంఖ్యలో నెటిజన్లు స్పందించారు. ఈ ఫోటో ధోనీ హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడేందుకు వచ్చిన సందర్భంగా తీసుకున్నదిగా అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, ధోనీకి తెలుగు రాష్ట్రాలతో అభినాభావ సంబంధం ఉంది. ఆయన తన కెరీర్ ఆరంభంలో విశాఖ వేదికగా దాయాదిపై సూపర్ శతకాన్ని(123 బంతుల్లో 148) నమోదు చేశాడు. ఈ మ్యాచ్ ద్వారానే ధోనీ అంతర్జాతీయ క్రికెట్లో పాపులర్ అయ్యాడు. ఇదిలా ఉంటే, టీమిండియా క్రికెట్ చరిత్రలో సచిన్ తరువాత అంతటి పాపులారిటీని సొంతం చేసుకున్న ధోనీ.. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరికి ఫేవరేట్‌గా మారాడు. 2004లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి, అనతి కాలంలోనే కెప్టెన్‌గా ఎదిగిన మాహీ.. క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 13 సంవత్సరాల పాటు క్రికెట్లో కొనసాగిన ధోనీ.. తన చివరి మ్యాచ్‌ను 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆడాడు. -
మహేంద్రుడికి పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ.. రైనా ఎమోషనల్ ట్వీట్
న్యూఢిల్లీ: టీమిండియా దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 40వ పుట్టిన రోజు సందర్భంగా యావత్ క్రికెట్ ప్రపంచం శుభాకాంక్షలు తెలిపింది. ఐసీసీ మొదలుకొని బీసీసీఐ, పలు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, దిగ్గజ ఆటగాళ్లు, ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, అభిమానులు ఇలా దాదాపు ప్రతి ఒక్కరు ధోనీని పొగడ్తలతో ముంచెత్తుతూ బర్త్‌డే విషెస్ తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా వీరంతా ధోనీకి శుభాకాంక్షలు తెలుపుతూ, క్రికెట్ దిగ్గజంతో తమకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ధోనీకి విషెస్ చెప్తూ.. 2011 వన్డే ప్రపంచకప్ నాటి ఫొటోని షేర్ చేశాడు. ‘హ్యాపీ బర్త్‌డే కెప్టెన్’ అంటూ క్యాప్షన్ జోడించాడు. కాగా, 2017లో ధోనీ నుంచి పూర్తిస్థాయి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కోహ్లీ.. ధోనీ ఎప్పటికీ నా కెప్టెన్ అని పలు సందర్భాల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. A colleague, captain & friend! Happy Birthday, Mahi. Wishing you a wonderful year ahead full of joy and good health. pic.twitter.com/uyeqtBm7UW — Sachin Tendulkar (@sachin_rt) July 7, 2021 ఇక సచిన్ ట్వీట్ చేస్తూ.. నా సహచరుడు, నా కెప్టెన్, నా మిత్రుడు హ్యాపీ బర్త్‌డే మాహీ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. A legend and an inspiration! 🙌 🙌 Here's wishing former #TeamIndia captain @msdhoni a very happy birthday. 🎂 👏#HappyBirthdayDhoni pic.twitter.com/QFsEUB3BdV — BCCI (@BCCI) July 6, 2021 ధోనీ ఓ క్రికెట్ దిగ్గజం, భవిష్యత్తు తరాలకు ప్రేరణ.. అంటూ బీసీసీఐ విషెస్ చెప్పగా, కెప్టెన్ కూల్‌కు బర్త్‌డే విషెస్ అంటూ ఐసీసీ ట్వీటింది. Super Birthday to Namma #Thala @msdhoni 😍 The one, the only one, now and forever who makes 💛 go 𝒯𝒽𝒶𝓁𝒶 𝒯𝒽𝒶𝓁𝒶! #THA7A #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/8U9BoJDLrZ — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) July 6, 2021 ఇక ధోనీ ఐపీఎల్ జట్టైన చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేస్తూ.. సూపర్ బర్త్‌డే టు నమ్మ తలా.. వన్, ద ఓన్లీ వన్ ఎంఎస్ ధోనీ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. Wishing you a very happy birthday @msdhoni You have been a friend, brother & a mentor to me, all one could ever ask for. May God bless you with good health & long life! Thank you for being an iconic player & a great leader.#HappyBirthdayDhoni ❤️🙌 pic.twitter.com/qeLExrMonJ — Suresh Raina🇮🇳 (@ImRaina) July 6, 2021 నా సోదరుడు, నా ఫ్రెండ్, నా మెంటర్ ఎంఎస్‌డీకి పుట్టిన రోజు శుభాంకాంక్షలంటూ ధోనీ సీఎస్కే సహచరుడు సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. No. 7, you'll always be everyone's No. 1 💛💗#HappyBirthdayMSDhoni | @msdhoni pic.twitter.com/YF1CZLetki — Rajasthan Royals (@rajasthanroyals) July 7, 2021 Happy birthday @msdhoni bhai, have a wonderful birthday and an even better year ahead. 🎂🎂 — Mask up and take your vaccine🙏🙏🇮🇳 (@ashwinravi99) July 7, 2021 ఇలా ధోనీని విష్ చేసిన వారిలో రాజస్థాన్ రాయల్స్, ఇషాంత్ శర్మ, మహ్మద్ కైఫ్, అశ్విన్, హార్ధిక్ పాండ్యా, చహల్, ఉమేశ్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దిగ్గజ క్రికెటర్లు లక్ష్మణ్, సెహ్వాగ్, వసీం జాఫర్ తదితరులున్నారు. Wishing @msdhoni a very joyful birthday. May he experience ever more love and joy and continue to inspire in the times to come.#HappyBirthdayMSDhoni pic.twitter.com/XfFCxW0qDY — VVS Laxman (@VVSLaxman281) July 7, 2021 Mahendra - meaning Lord of the Sky. Certainly pleased the skies with his big hitting when he bust onto the scene and then by earning the love of so many people on earth pleased the earth as well. Once in a generation player , #HappyBirthdayMSDhoni pic.twitter.com/COuu9X2s6L — Virender Sehwag (@virendersehwag) July 7, 2021 -
పెళ్లి రోజు కానుకగా భార్యకు సర్ప్రైజ్ ఇచ్చిన ధోని
రాంఛీ: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ అతని ఫాలోయింగ్ మాత్రం తగ్గట్లేదు. ఇక, రిటైర్ దగ్గర నుంచి.. ఫామ్ హౌస్ లో భార్య సాక్షి, కూతురు జీవాలతో సరదాగా గడిపేస్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన భార్య సాక్షి సింగ్‌ల వివాహ వార్షికోత్సవం నేడు. 2010లో ప్రేమ పెళ్లి చేసుకుని ఒక్కటైన ఈ జంట దాంపత్యానికి 11 ఏళ్లు నిండాయి. వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి సాక్షి సింగ్ కి ధోని ఓ మధురమైన బహుమతి ఇచ్చాడు. సాక్షి కోసం స్పెషల్ గా ఓ వింటేజ్ కారును కొనుగోలు చేశాడు మహీ. లేత నీలం, వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న కారును యానివర్సరీ కానుకగా ఇచ్చాడంటూ ఇన్‌స్టా స్టోరీలో సాక్షి సింగ్ పోస్టు చేసింది. ధోనీ..సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండడు. దీంతో సాక్షినే.. ధోనీ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా ధోని ఫ్యాన్స్‌కు షేర్ చేస్తుంటోంది. వీరిద్దరికీ జీవా ధోనీ అనే కూతురు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఐదేళ్ల జీవాకి ఇన్‌స్టాలో సెపరేట్ అకౌంట్ ఉండడమే కాదు, దాదాపు 2 మిలియన్ల ఫాలోవర్లు కూడా ఉన్నారు. -
కెప్టెన్సీ నాకే ఇస్తారనుకున్నా.. కానీ మధ్యలో అతనొచ్చాడు
న్యూఢిల్లీ: 2007 టీ20 ప్రపంచకప్ సమయంలో టీమిండియా పగ్గాలు తనకే ఇస్తారని భావించానని సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. అయితే, సెలెక్టర్లు ధోనీ పేరు తెరపైకి తేవడంతో తాను కూడా అదే సరైన నిర్ణయంగా భావించానని ఆయన తెలిపాడు. ధోనీ కెప్టెన్ అయ్యాక అతనికి పూర్తిగా మద్దతిచ్చానని చెప్పుకొచ్చాడు. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ మాట్లాడుతూ.. 2007 వన్డే ప్రపంచ కప్‌లో భారత్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయని, దీంతో టీమిండియా పగ్గాలు చేపట్టేందుకు సీనియర్లందరూ అయిష్టత చూపారని, ఆ సమయంలో నేను కెప్టెన్సీ రేసులో ముందున్నాని గుర్తు చేసుకున్నాడు. సచిన్, గంగూలీ, ద్రవిడ్ లాంటి సీనియర్ల గైర్హాజరీలో తనకే కెప్టెన్సీ వస్తుందని అందరూ భావించారని, అయితే సెలక్టర్లు సడెన్‌గా ధోనీ పేరును తెరపైకి తేవడం, అతను టీమిండియా పగ్గాలు చేపట్టడం చకాచకా జరిగిపోయాయని తెలిపాడు. అయితే, ఆ విషయాన్ని తాను అప్పుడే వదిలేశానని, కెప్టెన్ ఎవరైనా సరే ఆటగాడిగా తాను రాణించడమే ముఖ్యమని భావించానని పేర్కొన్నాడు. కాగా, ఈ టోర్నీలో మొత్తం 6 మ్యాచ్‌లు ఆడిన యువీ 148 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఆ క్రమంలో అతను 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లోనూ యువీ 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇదిలా ఉంటే, 2007 వన్డే ప్రపంచకప్‌లో ఘోర పరాభవం తర్వాత, పెద్దగా అంచనాలు లేని యువ భారత జట్టు ధోనీ నేతృత్వంలో తొట్ట తొలి టీ20 ప్రపంచకప్‌ను ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ అంచనాలకు మించి రాణించి, రెండోసారి జగజ్జేతగా ఆవిర్భవించింది. ఈ విజయం తర్వాత భారత క్రికెట్లో ధోనీకి తిరుగు లేకుండా పోయింది. నాటి నుంచి ధోనీ, యువీ ఇద్దరూ టీమిండియాలో కీలక సభ్యులుగా ఎదుగుతూ భారత క్రికెట్ రూపురేఖలనే మార్చేశారు. ఈ క్రమంలో వారు భారత్‌ను రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. చదవండి: 'హాల్ ఆఫ్ ఫేమ్' జాబితాలో మరో పది మంది దిగ్గజాలు.. -
చోటా ధోనీని చూడండి.. హెలికాప్టర్ షాట్‌ను ఇరగదీస్తున్నాడు
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ట్రేడ్ మార్క్ షాటైన హెలికాప్టర్ షాట్‌ను ఓ బుడ్డోడు అచ్చం అలానే ఆడేస్తున్నాడు. గ్రౌండ్‌పై బంతిని ఆడటమే ఇష్టం లేదన్నట్లుగా భారీ షాట్లతో ఇరగదీస్తున్నాడు. ప్రస్తుత క్రికెటర్లలో హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రషీద్ ఖాన్లు హెలికాప్టర్ షాట్‌పై ఫర్ఫెక్షన్ సాధించగా, వారందరికంటే ఈ బుడ్డోడు ఇంకా మెరుగ్గా ఆడుతున్నాడు. नन्हा कलाकार #AakashVani pic.twitter.com/26D9Wk63D2 — Wear a Mask. Stay Safe, India (@cricketaakash) June 4, 2021 భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తాజాగా ఈ బుడ్డోడు అలవోకగా హెలికాప్టర్ షాట్ ఆడుతున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పాదాల వద్ద పడుతున్న యార్కర్లను కళ్లుచెదిరే రీతిలో హెలికాప్టర్ షాట్ ఆడుతున్న ఈ పిల్లాడు.. మిడ్ వికెట్ దిశగా, బౌలర్ తలపై నుంచి గాల్లో షాట్లు ఆడుతున్న తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. కుర్రాడి బ్యాటింగ్ స్టైల్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చోటా ధోనీ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, భారత్ జట్టులోకి వచ్చిన కొత్తలో ధోనీ ప్రతి మ్యాచ్‌లోనూ హెలికాప్టర్ షాట్ ఆడుతూ కనిపించేవాడు. అయితే వెన్నునొప్పి కారణంగా గత కొన్నేళ్లుగా ఆ షాట్‌ని ఆడటం మానేశాడు. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇకపోతే, ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన 31 మ్యాచ్‌లను సెప్టెంబరు- అక్టోబరు మధ్యలో యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: కోహ్లీకి పెద్ద ఫ్యాన్‌ని అంటున్న ప్రముఖ పాక్ క్రికెటర్ భార్య.. -
నా 'ఈ స్థాయికి' ధోనినే కారణం: జడ్డూ
ముంబై: అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో బ్యాటింగ్ పరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, 2015 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ధోని ఇచ్చిన సలహా తన బ్యాటింగ్‌ను ఎంతో మెరుగుపర్చిందని టీమిండియా స్టార్ ఆల్రండర్ రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. కెరీర్ ఆరంభంలో షాట్ల ఎంపిక విషయంలో చాలా తికమక పడేవాడినని, దీంతో షాట్ పిచ్ బంతులను ఆడమని ధోని సూచించాడని పేర్కొన్నాడు. కెరీర్లో ప్రస్తుతం తాను అనుభవిస్తున్న హోదాకు ధోనినే కారణమని ఆకాశానికెత్తాడు. ధోని చెప్పేంత వరకు షాట్ ఆడాలా వద్దా? ఏ షాట్ ఆడాలి? బంతిని వదిలేద్దామా?ఆడదామా? లాంటి ప్రశ్నలు మదిలో మెదిలేవని వెల్లడించాడు. ఈ తికమకలో క్రమంగా వికెట్ పారేసుకునేవాడినని, దీంతో జట్టులో స్థానం కూడా కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, గత రెండేళ్లుగా జడేజా కెరీర్ దూసుకుపోతుంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ దుమ్మురేపుతూ, టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జడ్డూ.. భారత జట్టు కీలక సభ్యుడిగా ఎదిగాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ప్రారంభమైన అతని బ్యాటింగ్ విధ్వంసం.. నిరంతరాయంగా సాగుతూ టీమిండియాను తిరుగులేని శక్తిగా నిలబెట్టింది. ఇటీవల కాలంలో బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ విశ్వరూపం చూపిస్తున్న జడ్డూ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సమాయత్తమవుతున్న అతను.. బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉన్నాడు. చదవండి: వాళ్లు లేకపోయినంత మాత్రానా ఐపీఎల్ నిర్వహణ ఆగదు.. -
సచిన్ 'దేవుడు', ధోని 'లెజెండ్', కోహ్లి..?
ముంబై: ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో "ఆస్క్ మీ ఎనీ థింగ్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు అతను సింగల్ వర్డ్‌లో సమాధానమిచ్చాడు. సచిన్ గురించి అభిమానులు అడగ్గా.. క్రికెట్ దేవుడని, ధోనిని దిగ్గజ క్రికెటర్ అని, కోహ్లి అంటే ఇన్స్పిరేషన్(స్పూర్తి) అని, రోహిత్ శర్మ అంటే హిట్‌మ్యాన్ అని, పోలార్డ్ అంటే లార్డ్ అని, హార్దిక్ పాండ్య అంటే ఎంటర్టైనర్ అని టకాటకా బదులిచ్చాడు. ఇక క్రికెటే తన ఊపిరని, అందులో తనకిష్టమైన షాట్ స్వీప్‌షాట్ అని చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ జట్టును అతను కుటుంబంతో పోల్చాడు. క్రికెటర్ కాకపోయుంటే ఏమైవుండేవాడివని ఓ అభిమాన్ని అడిగిన ప్రశ్నకు.. నటుడిగా రాణించేవాడినని సమాధానమిచ్చాడు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలే కాకుండా, అభిమానులడిన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా సూర్యకుమార్ ఓపికగా సమాధానమిచ్చాడు. బిర్యాని తనకిష్టమైన ఆహారమని, బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ఫేవరెట్ తన యాక్టర్ అని వెల్లడించాడు. కాగా, గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా.. సూర్యకుమార్, కోహ్లిల మధ్య మైదానంలో జరిగిన ఘర్షన నేపథ్యంలో కోహ్లిని స్పూర్తిదాయకమైన ఆటగాడని పేర్కొనడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. చదవండి: 45 ఏళ్ల వయసులో ఇరగదీశాడు.. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు -
ధోని సలహాల వల్ల చాలా మెరుగయ్యాను..
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని సలహాలు తనను మెరుగైన వికెట్‌కీపర్‌గా మార్చాయని భారత మహిళా జట్టు వికెట్ కీపర్ ఇంద్రాణి రాయ్ తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో సభ్యురాలైన ఈ పశ్చిమ్ బెంగాల్ మహిళా క్రికెటర్.. ధోనిని ఆదర్శంగా తీసుకుని, అతని అడుగుజాడల్లో నడుస్తానంటోంది. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుండగా ఇంద్రాణి.. మూడు ఫార్మాట్లలో జట్టు సభ్యురాలిగా ఉంది. టెస్ట్ ఫార్మాట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన కల అని, ఇంగ్లండ్ పర్యటనతో అది నిజం కాబోతుందని ఆమె ఉబ్బితబ్బిబవుతోంది. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వంటి సీనియర్లతో డ్రస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చింది. అండర్-19, అండర్-23 బెంగాల్‌కు ఆడిన ఆమె.. అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో 2018లో ఝార్ఖండ్‌కు మారింది. రాంచీలో జరిగే ట్రైనింగ్ సెషెన్స్‌లో ఆమె ధోనిని చాలాసార్లు కలిసింది. వికెట్ కీపింగ్‌పై ఆమెకు మక్కువను చూసిన మహేంద్రుడు ఆమెకు ఎన్నో సలహాలు ఇచ్చాడు. ఆ సలహాల వల్లే తాను జాతీయ జట్టుకు ఎంపిక కాగలిగానని ఆమె పేర్కన్నారు. -
ఆర్సీబీ అభిమానినే కానీ, కోహ్లికి కాదు: రష్మిక
బెంగళూరు: మత్తెక్కించే అందచందాలతో దక్షిణ భారత చిత్రసీమను ఉర్రూతలూగిస్తున్న కన్నడ భామ రష్మిక మంధన.. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే క్రికెట్‌ను కూడా రెగ్యులర్‌గా ఫాలో అవుతానంటోంది. ముఖ్యంగా ఐపీఎల్ అంటే తనకు పిచ్చి అని పేర్కొంది. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ఐపీఎల్లో తన ఫేవరెట్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పుకొచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను ఆర్సీబీ ఎలాగైనా సాధించాలని ఆకాంక్షించానని, కానీ అనుకోని పరిస్థితుల్లో లీగ్ వాయిదా పడటం ఆర్సీబీ అభిమానిగా తనను చాలా బాధించిందని తెలిపింది. స్వతహాగా ఆర్సీబీ అభిమానినే అయినప్పటికీ, తన ఫేవరెట్ క్రికెటర్ మాత్రం ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి కాదని వెల్లడించి, అందరిని ఆశ్చర్యపరిచింది. తనకు టీమిండియా మాజీ సారధి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అతని బ్యాటింగ్, వికెట్ కీపింగ్, సారధ్యం అన్నీ తనకు బాగా నచ్చుతాయని, అతనో మాస్టర్ క్లాస్ ప్లేయర్ అని అభివర్ణించింది. క్రికెట్లో ధోని తన ఆల్‌టైమ్ హీరో అని ఆకాశానికెత్తింది. ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ లీడ్ రోల్లో నటిస్తున్న "పుష్ప" సినిమాలో నటిస్తోంది. చదవండి: సెంచరీ చేయలేకపోయినా నీలా మ్యాచ్ ఫిక్సింగ్ మాత్రం చేయలేదు.. -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన మహేంద్రుడు..
ముంబై: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో(ఐపీఎల్) చరిత్ర సృష్టించాడు. లీగ్ చరిత్రలో ఇంత వరకు ఏ వికెట్ కీపర్‌కు సాధ్యంకాని 150 డిస్మిసల్స్ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌లలో సమాంతరంగా రాణిస్తూ.. తన జట్టును మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన మహేంద్రుడు.. లీగ్ చరిత్రలో 150 మందిని ఔట్ చేసిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. ముంబైలోని వాంఖడే వేదికగా బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీశ్ రాణా క్యాచ్ అందుకోవడం ద్వారా ధోని ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 208 మ్యాచ్‌ల్లో113 క్యాచ్లందుకున్న ఈ మిస్టర్ కూల్ కెప్టెన్.. 39 స్టంపింగ్‌లు చేశాడు. వికెట్ కీపర్‌గా అత్యధిక డిస్మిసల్స్లో భాగస్వాములైన ఆటగాళ్ల జాబితాలో ధోని తర్వాతి స్థానంలో కేకేఆర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఉన్నాడు. డీకే ఇప్పటి వరకు 112 క్యాచ్‌లు, 31 స్టంపింగ్‌లు చేసి 143 డిస్మిసల్స్తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే, నిన్న కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై 18 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో ధోని మూడు కీలకమైన క్యాచ్‌లందుకుని చెన్నై విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. చదవండి: భారీ టార్గెట్‌ను చూసి టాపార్డర్ జడుసుకుంది.. అందుకే అలా -
వైరలవుతున్న టీమిండియా ప్రస్తుత, మాజీ కెప్టెన్ల భార్యల ఫోటోలు
న్యూఢిల్లీ: టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనిల జీవిత భాగస్వాములు చిన్నతనంలో క్లాస్మేట్స్ అన్న విషయం ఇటీవలి కాలంలో అందరికి తెలిసిపోయింది. వీరిద్దరు చిన్నతనంలో అసోంలోని ఓ పాఠశాలలో చదువుకున్నట్లు 2012లో అనుష్క శర్మ వెల్లడించింది. ధోని భార్య సాక్షి, తను అసోంలోని ఓ చిన్న పట్టణంలో నివాసం ఉన్నట్లు, తామిద్దరం కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నట్లు ఆమె ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తెలిపింది. ఈ సందర్భంగా ఆమె, సాక్షి కలిసి స్కూల్లో తీయించుకున్న ఫోటోను ఆమె బహిర్గతం చేసింది. ఈ ఫోటోలో సాక్షి ఏంజెల్ వేషంలో ఉండగా, అనుష్క తన ఫేవరెట్ హీరోయిన్ మాధురి దీక్షిత్ తరహాలో గాగ్రా చోలీ ధరించి కనిపించింది. ఈ ఫోటోలు అప్పట్లో తెగ వైరలయ్యాయి. ఇదిలా ఉంటే, సాక్షి.. నాటి టీమిండియా టీ20 కెప్టెన్ ధోనిని 2010 జులై 4న వివాహం చేసుకోగా, కోహ్లి, అనుష్కల వివాహం 11 డిసెంబర్ 2017లో జరిగింది. అయితే వీరిద్దరి నిజ జీవితాల్లో చాలా కామన్ పాయింట్లు ఉన్నాయి. ఈ చిన్ననాటి స్నేహితురాళ్లు.. భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్లను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఒక్కో కూతురు జన్మనిచ్చారు. ధోని దంపతులు తమ కుమార్తెకు జీవా అని నామకరణం చేయగా, విరుష్క జంట తమ గారాలపట్టికి వామిక అని పేరు పెట్టారు. ప్రస్తుతం ధోని, కోహ్లిలిద్దరూ ఐపీఎల్ 2021 సీజన్లో బిజీగా ఉండగా.. సాక్షి, అనుష్క శర్మలు ఎప్పటికప్పుడూ తమ అప్ డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. అయితే ఈ త్రో బ్యాక్ ఫోటోలను అనుష్క శర్మ ఫ్యాన్స్ క్లబ్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. చదవండి: అందమైన రాజస్థానీ రాయల్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. -
మళ్లీ అదే రిపీట్ అయితే.. ఈసారి నిషేధమే
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై నిషేధపు కత్తి వేలాడుతూ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి 12 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో మళ్లీ అదే సీన్(స్లో ఓవర్ రేట్) రిపీట్ అయితే.. ఈసారి ధోనిపై తాత్కాలిక నిషేధం విధించే ప్రమాదం ఉంది. బీసీసీఐ రూపొందించిన కొత్త రూల్స్ ప్రకారం నేటి మ్యాచ్‌లో ధోని సేన.. తమ 20 ఓవర్ల కోటాను 90 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయని పక్షంలో ధోనిపై కనీసం రెండు నుంచి నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉంది. సవరించిన రూల్స్ గురించి లీగ్ ఆరంభానికి ముందు నుంచే అన్ని ఫ్రాంఛైజీలను హెచ్చరిస్తున్నప్పటికీ.. కొన్ని ఫ్రాంఛైజీలు తేలికగా తీసుకుంటున్న నేపథ్యంలో బీసీసీఐ కొరడా ఝుళిపించాలని నిర్ణయించుకుంది. అయితే స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన జట్టు కెప్టెన్‌పై ఎన్ని మ్యాచ్‌ల నిషేధం విధించాలన్న నిర్ణయాన్ని మ్యాచ్ రిఫరీ విచక్షణకే వదిలి పెట్టింది. అసలే ఢిల్లీతో మ్యాచ్‌ను చేజార్చుకున్న బాధలో ఉన్న ధోని సేనకు.. ఈ అంశం మరింత కలవరపెడుతుంది. కాగా, ముంబై వేదికగా నేడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. పంజాబ్ తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి ఉరకలేస్తుండగా.. ధోని సేన మాత్రం ఢిల్లీతో మ్యాచ్‌ను చేజార్చుకుని నిరాశలో కూరుకుపోయింది. చదవండి: సన్‌రైజర్స్ యాజమాన్యంపై సానియా మీర్జా తండ్రి ఫైర్.. -
నాడు గుంపులో గోవిందా.. నేడు అదే గుంపుచే..?
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విన్నింగ్ షాట్ బౌండరీగా బాది తన జట్టును విజయతీరాలకు చేర్చిన ఢిల్లీ కెప్టెన్ పంత్‌ను చెన్నై ఆటగాళ్లు ఊహించని రీతిలో సత్కరించారు. మ్యాచ్ అనంతరం పంత్ పెవిలియన్ చేరుకునే క్రమంలో చెన్నై ఆటగాళ్లు అతన్ని ఘనంగా సన్మానించారు. పంత్ ముందు నడుస్తుండగా చెన్నై సభ్యులు అతని వెనుకనడుస్తూ అతనికి జేజేలు పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే తాజాగా పంత్‌కు సంబంధించిన మరో ఫోటో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. గతంలో చెన్నై జట్టు గెలుపు సంబురాలు చేసుకుంటున్న తరుణంలో ప్రత్యర్ధి జట్టు సభ్యుడైనా పంత్, వారితో కలిసి సంబురాల్లో పాలుపంచుకుంటున్న ఫోటో అది. పంత్ అభిమానులు ఈ ఫోటోను, గత మ్యాచ్‌లో పంత్‌కు జరిగిన సన్మానికి సంబంధించిన ఫోటోను పోల్చుతూ రకరకాల కామెంట్లు చేశారు. ఇతరుల గెలుపును కూడా సెలబ్రేట్ చేసుకోగలిగితే, మనకు కూడా ఓ రోజు వస్తుంది. ఆ రోజు పంత్‌కు త్వరగా వచ్చిందంటూ కామెంట్లు చేశారు. ఈ రెండు ఫోటోలను కంపేర్ చేస్తూ అభిమానులు చేస్తున్న హడావిడి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇదిలా ఉండగా, టీమిండియా నయా బ్యాటింగ్ సెన్సేషన్ రిషబ్ పంత్‌కు 2021 సంవత్సరం బాగా కలిసొచ్చింది. గతేడాది ఆసీస్ పర్యటనలో అనూహ్యంగా తుది జట్టులో చోటు దక్కించుకున్న ఈ 23 ఉత్తరాఖండ్ కుర్రాడు.. ఆ సిరీస్ మొత్తంలో అదరగొట్టి, టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. నాటి నుంచి వెనుతిరిగి చూడని ఈ ఢిల్లీ డైనమైట్ అంచలంచెలుగా ఎదుగుతూ టీమిండియాలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ క్రమంలో అతనికి మరో అదృష్టం కూడా కలిసొచ్చింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌గా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్‌తో వన్డే సందర్భంగా గాయపడంతో అతని స్థానంలో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే లక్కీ ఛాన్స్ పంత్‌కు దొరికింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే తన ఆరాధ్య ఆటగాడు మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించిన అతను.. గురువు(ధోని)తో సహా అందరి మన్ననలను అందుకున్నాడు. -
ధోని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ అన్న పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం స్పందించింది. ధోనిలో అత్యుత్తమ క్రికెట్ ఆడగలిగే సత్తా ఇంకా ఉందని, అతను మరిన్ని ఐపీఎల్‌లు ఆడగలడని, ఐపీఎల్ 2021 కచ్చితంగా అతనికి ఆఖరి ఐపీఎల్ కాబోదని ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకటించాడు. అయితే ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయమని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి తాము ధోని ప్రత్యామ్నాయం గురించి ఆలోచించట్లేదని, మున్ముందు కూడా ఆ ఆలోచన చేసే అవకాశం రాకపోవచ్చని ఆయన స్పష్టం చేశాడు. కాగా, ధోని ఇటీవలే అంతార్జతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, జట్టులోని మరో ఇద్దరు ముఖ్య ఆటగాళ్ల గురించి కూడా కాశీ విశ్వనాథన్ స్పందించాడు. రైనా, జడేజాల రూపంలో తమ జట్టులో ఇద్దరు భారీ హిట్టర్లు ఉన్నారని, వారు రానున్న సీజన్లో కుర్రాలతో పోటీపడి మరీ పరుగులు సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశాడు. జడేజా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నప్పటికీ.. దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని, అతను ఫిట్‌గా ఉన్నాడని ఎన్సీఏనే స్వయంగా చెప్పిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం జడేజా జట్టుతో చేరాడని, తమ తొలి మ్యాచ్‌లోపు అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు రైనా గత పది రోజులుగా జట్టుతో పాటే ప్రాక్టీస్ చేస్తున్నాడని, ఈ సీజన్లో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆరాటపడుతున్నాడని తెలిపాడు. చదవండి: ఆర్సీబీతో ఫేస్ టు ఫేస్ ఫైట్‌లో ముంబైదే పైచేయి -
వారి నుంచి వచ్చిన సందేశాలు ఎన్నటికీ మరువలేనివి..
ముంబై: రాజస్థాన్ రాయల్స్ సారథిగా ఎంపికైన వెంటనే తనను అభినందిస్తూ టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనిలు పంపిన సందేశాలు ఎన్నటికీ మరువలేనని ఆర్ఆర్ నూతన సారధి సంజూ సాంసన్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అత్యున్నత శిఖరాలను అదిరోహించిన వారు.. తనకు అభినందనలు తెలపడంతో ఆనందం పట్టలేకపోయానని వెల్లడించాడు. ఆర్ఆర్ కెప్టెన్‌గా ఎంపికవ్వడం తన అదృష్టమని, తనపై నమ్మకం ఉంచిన ఫ్రాంఛైజీ యాజమాన్యానికి జీవితకాలం రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. క్రికెట్ దిగ్గజం సంగక్కరతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి అని వెల్లడించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన అనుభవం అంతగా అనుభవంలేని తనకు సంగక్కర లాంటి భాగస్వామి దొరకడం అదృష్టమని చెప్పుకొచ్చాడు. కాగా, ఐపీఎల్ తొలి ఎడిషన్(2008)లో ఛాంపియన్‌గా అవతరించిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆతరువాత మళ్లీ అదృష్టం కలిసిరాలేదు. మధ్యలో రెండేళ్లు నిషేధానికీ గురై క్యాష్ రిచ్ లీగ్‌కు దూరమైన ఆ జట్టు.. చాలామంది విదేశీ, స్వదేశీ సీనియర్లను ప్రయత్నించినా టైటిల్ మాత్రం అందని దాక్షాలానే మిగిలింది. అయితే, ఈ సీజన్ వేలానికి ముందు స్టీవ్ స్మిత్‌ను వదిలించుకున్న ఆర్ఆర్ జట్టు సంజు సాంసన్ రూపంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అతనికి మద్దతుగా నిలిచేందుకు క్రికెట్ డైరెక్టర్‌గా సంగక్కర్‌ను నియమించుకుంది. ఏప్రిల్ 12న ముంబై వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆర్ఆర్ జట్టు పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. చదవండి: బయో బబుల్ కష్టమే.. అయినా భారత క్రికెటర్లు తట్టుకోగలరు -
వైరల్ వీడియో: నాటి ధోనితో నేటి ధోని ఏమన్నాడంటే..
ముంబై: టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్ గెలిచి పదేళ్లు పూర్తయిన సందర్భంగా గల్ఫ్ ఆయిల్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో 2005 నాటి ధోని, ప్రస్తుత ధోనిల మధ్య జరిగే ఆసక్తికర సంభాషణ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో జట్టులోకి వచ్చిన కొత్తలో అమాయకంగా కనిపించే నాటి ధోనికి.. రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన నేటి ధోని తన అనుభవాన్ని వివరిస్తుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా షికార్లు కొడుతుంది. గల్ఫ్ ఆయిల్ సంస్థ శుక్రవారం ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. @msdhoni from 2021 met his younger self from 2005 and they had quite a conversation about consistency. Here’s a sneak peek into what happened. Dhoni fans, cricket fans, bikers, click https://t.co/fp5XiWzmle to join us on April 2nd at 3 pm to know more! #GulfDhoniXDhoni pic.twitter.com/Yd35WajTwB — Gulf Oil India (@GulfOilIndia) March 31, 2021 కాగా, ఇద్దరు ధోనిల మధ్య జరిగిన సంభాషణ సందర్భంగా ఓ ఆసక్తికర అంశం ప్రస్థావనకు వచ్చింది. 2005 నాటి ధోని.. నేటి ధోనిని తన ఫేవరెట్ వన్డే ఇన్నింగ్స్ ఏది అని అడగ్గా.. 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై చేసిన 91 పరుగుల ఇన్నింగ్సే తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని నేటి ధోని బదులిస్తాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియాను రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టినప్పుడు లభించిన ఆ మజానే వేరు అని నేటి ధోని చెప్తాడు. నాలుగు నిమిషాల పాటు సాగే ఈ వీడియోలో నేటి ధోని తన కెరీర్ అనుభవాలను, బైక్ రైడింగ్ తదితర అంశాలను నాటి ధోనితో పంచుకుంటాడు. ధోని vs ధోనిగా సాగే ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. చదవండి: సచిన్ కోవిడ్‌ను కూడా సిక్సర్ కొట్టగలడు: వసీం అక్రం -
నాడు పూణే ఫైనల్ చేరడానికి ధోనినే కారణం..స్మిత్ కాదు
న్యూఢిల్లీ: 2017 ఐపీఎల్ ఎడిషన్‌లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టు ఫైనల్ చేరడానికి మహేంద్రసింగ్ ధోనినే కారణమని, అందులో నాటి జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ పాత్ర ఏమీ లేదని మాజీ పూణే ఆటగాడు రజత్ భాటియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ విషయంలో స్టీవ్ స్మిత్‌కు ధోనికి పోలికేంటని, అసలు స్మిత్‌ను ధోనీతో పోల్చడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. తన దృష్టిలో టాప్ 10 కెప్టెన్లలో కూడా స్మిత్ ఉండడని పేర్కొన్నాడు. గతేడాది స్మిత్‌కు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించినప్పుడు తాను ఆశ్చర్యపోయానని, కీలక సమయాల్లో అతను తీసుకునే నిర్ణయాలు సరైనవి కావని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. కాగా, రజత్ భాటియా తన ఐపీఎల్ కెరీర్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, పూణే సూపర్ జెయింట్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉండగా, ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసుల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై 2015లో రెండేళ్లు పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో 2016, 2017 సీజన్లలో ఆయా జట్ల ఆటగాళ్లు నూతన ఫ్రాంఛైజీలైన గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్ల తరఫున ఆడారు. ఈ క్రమంలో పూణే కెప్టెన్‌గా స్మిత్, వికెట్ కీపర్‌గా ధోని వ్యవహరించారు. ఆ టోర్నీలో పూణే.. లీగ్ దశలో 9 విజయాలు సాధించి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. అయితే ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌తో చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలై, రన్నరప్‌గా నిలిచింది. చదవండి: అతను టీమిండియా కెప్టెనైనా ఆశ్చర్యపోనక్కర్లేదు: అజహర్ -
ధోని నేతృత్వంలో వినూత్న సాధన..
చెన్నై: ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్-2021 సీజన్ కోసం ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. మిగతా ఫ్రాంఛైజీల కన్నా ముందే ట్రైనింగ్ క్యాంప్‌ను ప్రారంభించిన చెన్నై జట్టు వినూత్నంగా ప్రాక్టీస్ చేస్తోంది. మ్యాచ్‌లో ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఆడాలనే అంశంపై ధోనీ ఇప్పటి నుంచే ఆటగాళ్లను సన్నద్ధం చేస్తున్నాడు. స్ట్రైక్ రొటేట్ చేయడం, కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడం, వేగంగా పరుగులు రాబట్టడం, ఆఖరి ఓవర్లలో ఒత్తిడిని అధిగమించి బ్యాటింగ్ చేయడం లాంటి అంశాలపై ధోని పర్యవేక్షణలో జట్టు సాధన చేస్తోందని ఆ జట్టు మేనేజ్మెంట్ పేర్కొంది. రెగ్యులర్ ప్రాక్టీస్‌కు భిన్నంగా తమ సాధన సాగుతుందని ఆ జట్టు ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. కాగా, చెన్నై జట్టు టాప్ ఆటగాళ్లు సురేశ్ రైనా, రవీంద్ర జడేజా ఇంకా జట్టుతో చేరాల్సి ఉంది. రైనా ఈనెల 24లోగా క్యాంప్‌లో చేరనుండగా, ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో కోలుకుంటున్న రవీంద్ర జడేజా.. ఈ వారం చివర్లో జట్టుతో కలువనున్నాడని సీఎస్కే టీమ్ మేనేజ్మెంట్ పేర్కొంది. ఈ ఏడిషన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగూళూరుతో ఢీకొట్టనుండగా, చెన్నై తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 10న జరుగనుంది. Gearing up for the #SummerOf2021! EP 2️⃣ - Anbuden Diaries brings the Pride's strategic preparations in upping their concentration and intensity levels. #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/aNodduo9km — Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2021 -
ధోని తెరపైకి తెచ్చాడు.. కోహ్లి పాటిస్తున్నాడు!
అహ్మదాబాద్: భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అప్పట్లో తెరపైకి తెచ్చిన ఓ నూతన సంప్రదాయాన్ని ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి 3-2తో సీరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ట్రోఫీని అందుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ దాన్ని నేరుగా తీసుకెళ్లి అరంగేట్రం ఆటగాడైన ఇషాన్ కిషన్ చేతికి అందించాడు. ధోనిని ఫాలో అవుతున్నకోహ్లీ గతంలో సిరీస్ గెలిచిన సందర్భాల్లో ధోని కూడా ఇలానే జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడి చేతికి మొదట ట్రోఫీని అందించి, తాను పక్కకి వెళ్లి నిల్చునేవాడు. ఇప్పుడు కోహ్లి కూడా అదే సంప్రదాయాన్నికొనసాగిస్తున్నాడు. వాస్తవానికి చివరి టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ తుది జట్టులో లేడు. కానీ.. రెండు, మూడు టీ20ల్లో ఆడిన ఇషాన్ కిషన్.. తన హిట్టింగ్తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తొడ కండరాల గాయం కారణంగా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇదే సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ కూడా భారత్ జట్టులోకి అరంగేట్రం చేసి.. అంచనాలకి మించి రాణించాడు. కానీ.. సూర్యకుమార్ వయసు 30 ఏళ్లుకాగా.. ఇషాన్ కిషన్ వయసు కేవలం 22 ఏళ్లే. దాంతో.. ధోని తరహాలో యువ క్రికెటర్లలో ఉత్సాహం నింపేందుకు ఇషాన్ చేతికి ట్రోఫీని అందించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు.. విరాట్ కోహ్లీ (80) నాటౌట్, రోహిత్ శర్మ (64) మెరుపు హాఫ్ సెంచరీలు, పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తమదైన శైలిలో మెరుపులు మెరిపించడంతో భారత్ 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో డేవిడ్ మలాన్ (68) జోస్ బట్లర్ (52) హాఫ్ సెంచరీలతో పోరాడినా వారి వికెట్ల అనంతరం ఇంగ్లండ్ జట్టు 188/8కే పరిమితమైంది. దాంతో.. 36 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. ( చదవండి :ఆఖరి పోరులో అదరగొట్టారు ) C.H.A.M.P.I.O.N.S! 🏆🏆#TeamIndia @GCAMotera #INDvENG @Paytm pic.twitter.com/V0zCW4BugT — BCCI (@BCCI) March 20, 2021 -
ధోని ఫ్యాన్స్‌పై లాఠీచార్జ్..
జైపూర్: రాజస్థాన్‌లో క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫ్యాన్స్‌పై లాఠీచార్జీ జరిగింది. ధోనిని చూసేందుకు ఫ్యాన్స్ అధిక సంఖ్యలో రావడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఫ్యాన్స్‌ను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో టెంట్లు చిరిగిపోయి, కుర్చీలు విరిగిపోయాయి. ప్రశాంతంగా ఉండాలని పోలీసులు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని అభిమానులు.. బారికేడ్లు తోసుకుని ధోనితో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పలేదు. ఊహించని ఈ హఠాత్పరిణామానికి షాక్‌తిన్న ధోని.. హడావిడిగా రిబ్బన్ కట్ చేసి వెళ్లిపోయారు. కాగా, స్నేహితుల కోరిక మేరకు జాలోర్ జిల్లాలోని జాఖల్ గ్రామంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు ధోనీ అక్కడికి వెళ్లారు. -
ధోని మంత్రం పని చేయలేదు
ఒకప్పుడు యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు అతను దిగ్గజాల్లాంటి సీనియర్లతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పుడు కుర్రాళ్లను ఎందుకు ఆడించడం లేదంటే వారిలో తనకు కావాల్సిన ‘మెరుపు’ కనిపించలేదని చెబుతున్నాడు. ఇన్నాళ్లూ ధోని ఏం వ్యూహం రచించినా అదో అద్భుతంగా అనిపించింది. ఎలాంటి ప్రణాళిక వేసినా ఆహా అన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. అనామక బౌలర్ కూడా ధోని సారథ్యంలో ఆడితే అసాధారణంగా కనిపించేవాడు. కానీ ఈసారి ఐపీఎల్లో అలాంటి చమక్కులు ఏమీ కనిపించలేదు. ఒక సీజన్లో జట్టు విఫలం కావడంలో తప్పు లేదు కానీ చెన్నై జట్టు ఆట చూస్తే మరీ ఇలానా... అన్నట్లుగా అభిమానులు సైతం నిట్టూర్చే విధంగా సాగడమే విషాదం. సాక్షి క్రీడా విభాగం: తాజా సీజన్లో ధోనితోపాటు జట్టు సహచరులకు కూడా ఏదీ కలిసి రాలేదు. లీగ్‌లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు పేరుకు ఈసారి మూడు మ్యాచ్‌లు గెలిచినా... ఒక్కసారి కూడా తమ స్థాయిని ప్రదర్శించే ప్రదర్శన ఇవ్వలేకపోయింది. నిషేధం తర్వాత తీవ్ర ఒత్తిడిలో 2018లో బరిలోకి దిగి చాంపియన్‌గా నిలవడంతో పాటు గత ఏడాది ఫైనల్ కూడా చేరగలిగిన టీమ్ ఇంతగా విఫలమవుతుందని ఎవరూ ఊహించలేదు. వ్యూహాలే గందరగోళం... ఐపీఎల్లో ఏ జట్టు విజయంలోనైనా పవర్‌ప్లేలో చేసే పరుగులు అత్యంత కీలకం. కానీ ఈసారి పవర్‌ప్లేలో చెన్నై ఆట అన్ని మ్యాచ్‌లలో టెస్టులను తలపించింది. తొలి 6 ఓవర్లలో చెన్నైకంటే తక్కువ పరుగులు ఎవరూ చేయలేదు. వికెట్లు కాపాడుకొని... చివర్లో చెలరేగిపోవచ్చనే వ్యూహం ఏమాత్రం పని చేయలేదు. ఆఖర్లో వచ్చేసరికి ఒత్తిడి పెరిగిపోయి సాధారణ లక్ష్యాలను కూడా ఛేదించలేక సీఎస్కే చతికిలపడింది. ఆఖరి బంతి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లి కూడా అద్భుతంగా గెలిపించవచ్చని గతంలో ఎన్నోసార్లు నిరూపించిన ధోని బ్యాట్ ఈసారి మూగబోయింది. చేయాల్సిన పరుగుల రన్‌రేట్ విపరీతంగా పెరిగిపోయి చివరి మెట్టుపై బోల్తా పడాల్సిన పరిస్థితి వచి్చంది. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో సూపర్ కింగ్స్ నుంచి ‘భారీ స్కోరు’ అనే మాట వినిపించడమే గగనంగా మారింది. ఆదివారం సూపర్ ఓవర్ల తర్వాత ఒక చెన్నై అభిమాని ‘మా జట్టుకు ఎప్పుడైనా సూపర్ ఓవర్ ఆడే అవకాశమే రాకపోతే మంచిది. ఎందుకంటే వాళ్లు నిలదొక్కుకునే లోపే ఓవర్ ముగిసిపోతుంది’ అంటూ చేసిన సరదా వ్యాఖ్య పరిస్థితిని చూపిస్తోంది. అందరూ అందరే... సీజన్లో చెన్నై 17 మంది ఆటగాళ్లను బరిలోకి దించింది. ఒకటి రెండు వ్యక్తిగత ప్రదర్శనలు మినహా జట్టుగా చూస్తే అందరి వైఫల్యం కనిపిస్తుంది. ‘సీనియర్ సిటిజన్స్ టీమ్’ అంటూ మొదటి నుంచీ వ్యంగ్య వ్యాఖ్యలు వినిపించినా మేనేజ్మెంట్ ఎప్పుడూ పట్టించుకోలేదు. అయితే సమస్య వయసు గురించి కాదు. సత్తా ఉంటే ఏ వయసువారైనా చెలరేగిపోగలరు. కానీ చెన్నై జట్టు పరిస్థితి భిన్నం. ప్రధాన ఆటగాళ్లలో సగం మంది రిటైర్డ్ లేదా సెమీరిటైర్డ్లాంటివారు ఉన్నారు. లీగ్‌కు నెల రోజుల ముందు అంతా ఒక్క చోటికి చేరడం, కొంత సాధన చేయడం, ఐపీఎల్ ఆడేయడం... కానీ వేర్వేరు కారణాలతో ఈసారి అది పని చేయలేదు. ఆటగాళ్లకు ‘కంటిన్యుటీ’ సమస్య బాగా కనిపించింది. జట్టుకు దిక్సూచి లాంటి ధోనినే స్వయంగా ఏడాదికి పైగా ఆటకు దూరంగా ఉండి నేరుగా ఐపీఎల్ మ్యాచ్ ఆడేశాడు. అందుకే ఎంత ప్రయతి్నంచినా ఆ షాట్లలో పదును కనిపించలేదు, బ్యాటింగ్‌లో చురుకుదనం కనిపించలేదు. వాట్సన్, బ్రేవో ఎప్పుడో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. ఇతర లీగ్‌లలో పాల్గొంటున్నా... ఐపీఎల్‌తో పోలిస్తే వాటి ప్రమాణాలు పేలవం. కేదార్ జాదవ్ సంగతి సరే సరి. మొత్తం జట్టులో అన్ని ఫార్మాట్లలో ఉన్న భారత ఆటగాడు రవీంద్ర జడేజా ఒక్కడే. అందువల్లే కావచ్చు అతనొక్కడిలోనే కాస్త ఆత్మవిశ్వాసం కనిపించింది. ఇదే తరహాలో డుప్లెసిస్ మెరుగైన ప్రదర్శన కనబర్చగా, తనకున్న అనుభవాన్ని బట్టి చూస్తే స్యామ్ కరన్ ఆటను కాస్త మెచ్చుకోవచ్చు. సర్వం తానే అయి వ్యవహరించే ధోని... రైనా, హర్భజన్‌లాంటి ఇద్దరు నాణ్యమైన ఆటగాళ్లు దూరమైతే, కనీసం వారి స్థానంలో మరొకరిని తీసుకునే ఆలోచన కూడా చేయకపోవడం తనపై తనకు ఉన్న అతి నమ్మకమని చెప్పవచ్చు. మొత్తం మార్చేస్తారా... మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి రేసులో నిలిచేందుకు ప్రయతి్నస్తాం అనే మొహమాటపు మాటకు పోకుండా తమ పని ముగిసిపోయిందని ధోని స్పష్టంగానే చెప్పేశాడు. కాబట్టి ఇక దృష్టి వచ్చే సీజన్ మీదే. నిబంధనల ప్రకారం 2018 వేలంలో తీసుకున్న ఆటగాళ్ల ఒప్పందం 2020తో ముగుస్తుంది. వచ్చే ఏడాది కొత్తగా మళ్లీ వేలం జరిగాలి. అయితే ఏప్రిల్‌లో జరిగే ఐపీఎల్‌కు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ సారికి వేలం నిర్వహించరాదనే ఆలోచనతో బీసీసీఐ ఉన్నట్లు వినిపించింది. అయితే ఇంతటి ‘భారమైన’ జట్టుతో చెన్నై 2021 లీగ్ ఆడే సాహసం చేయకపోవచ్చు. కాబట్టి ఆ జట్టు వేలం కోసం పట్టుబడవచ్చు. గత ఫలితాలు, చరిత్రను పక్కన పెడితే ఇప్పుడున్న టీమ్‌లో సమూల మార్పులు చేసి వస్తేనే చెన్నై మళ్లీ కొత్తగా కనిపిస్తుంది. ఈసారి ధోని ఆట చూస్తే వచ్చేసారి ఆటగాడిగా కొనసాగుతాడా అనేది సందేహమే కానీ టీమ్ మేనేజ్మెంట్ ఆలోచనలను బట్టి అది ఉండవచ్చు. అయితే తాజా సీజన్ మాత్రం అభిమానులకు చేదు జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది. ధోని పేద్ద పిస్తా అయితే కావచ్చు. అతను గొప్ప ఆటగాడు కూడా. కానీ కుర్రాళ్లలో తనకు కావాల్సిన మెరుపు కనిపించలేదని అతను చేసిన వ్యాఖ్యను నేను ఏమాత్రం సమరి్థంచను. అసలు అతని ఆలోచనే అర్థరహితం. ఫలితాలు కాదు ప్రక్రియ ముఖ్యం అనే ధోరణే అర్థం లేనిది. ఇచ్చిన ఒక అవకాశంలో రాణించిన జగదీశన్‌లో నీకు కనిపించని మెరుపు జాదవ్, చావ్లాలలో కనిపించిందా. అసలు జాదవ్ మైదానంలో దిగాలంటే ఒక స్కూటర్ కావాల్సిందేమో. –ధోనిపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్య -
ఐపీఎల్ 2020... తస్మాత్ జాగ్రత్త!
ఢిల్లీ: క్రికెట్ అభిమానులు పండగలా భావించే ఐపీఎల్ ప్రారంభమైతే జాగ్రత్త పడడం ఏంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు.. ఐపీఎల్ మ్యాచ్‌లో జరిగే కొన్ని సన్నివేశాలను ఉదాహరణగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడేలా సైబరాబాద్ పోలీసులు ఆలోచించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ రన్‌ఔట్‌ను ఉదాహరణగా తీసుకొని ట్రాఫిక్‌పై అవగాహన కల్పించేలా సోషల్ మీడియా ఫొటోను షేర్ చేశారు. చెన్నై, హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని పరుగులు తీయలేక అలసిపోయిన ఫొటోను షేర్ చేశారు. నాగ్‌పూర్ సిటీ పోలీసులు కూడా ఇలాంటిదే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బ్యాంకు ఉద్యోగుల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కోల్‌కతా జట్టుకు చెందిన ఆటగాడు వరున్ చక్రవర్తి ఫొటోను ఉపయోగించారు. బ్యాంకు ఉద్యోగుల పేరుతో మోసాలు చేస్తున్నారని... మీ ఓటీపీ, ఏటీమ్ పిన్ నెంబర్లను ఎవ్వరితో షేర్ చేసుకోకూడదని పోస్ట్ చేశారు. When you have shared an OTP with a so called "Bank Employee speaking from the Head Office" : pic.twitter.com/28NKdoCrG1 — Nagpur City Police (@NagpurPolice) October 4, 2020 ఇలా ఐపీఎల్ చూసేవారికి కనువిందుతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. (ఇదీ చదవండి: వైరల్: ధోని వయసును విమర్శిస్తూ ఇర్ఫాన్ ట్వీట్) -
ధోని, ఇన్ఫోసిస్ ఒకే సంవత్సరంలో..
ముంబై: దేశ చరిత్రలో 1981సంవత్సరం ఎంతో చరిత్రాత్మకమైనది. ఒకరు దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజయితే, మరొకటి ఐటీ రంగంలో ప్రపంచానికే ప్రేరణగా నిలిచిన దేశీయ ఐటీ దిగ్గజం ఇన్పోసీస్ స్థాపించిన రోజు(1981) కావడం విశేషం. మరోవైపు జులై 7, 1981సంవత్సరంలో రాంచీలో ధోని జన్నిస్తే, అదే రోజు పుణెలో ఇన్పోసీస్‌ను స్థాపించారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ 2లక్షల 39వేల మంది ఉద్యోగులతో ఎన్వైఎస్ఈ గ్లోబల్ కంపెనీ లిస్టింగ్‌లో రికార్డు సృష్టించింది. అదే విధంగా చిన్న పట్టణం నుంచి వచ్చి ప్రతిభ, సహనంతో క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ క్రికెటర్‌గా ధోని ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శనీయం. అయితే ధోని, ఇన్ఫోసిస్ ప్రేరణతో అత్యుత్తమ క్రీడాకారులు, ఐటీ దిగ్గజ కంపెనీలు మరెన్నో నెలకొల్పాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. చదవండి: ధోని రిటైర్మెంట్పై భార్య సాక్షి భావోద్వేగ పోస్ట్ -
ధోనిలా ఇంకెవరూ ఉండరు : మిథాలీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్పై భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించారు. మరో మహేంద్ర సింగ్ ధోని ఎప్పటికీ ఉండరని మిథాలీ రాజ్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ధోని శనివారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించాడు. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో ధోని తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఏడాది కాలంగా అతను జట్టుకు దూరంగా ఉంటూ ఏ స్థాయి క్రికెట్లో కూడా ఆడలేదు. ఈ క్రమంలోనే బీసీసీఐ సోమవారం తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోలో మిథాలీ ధోనిని ప్రశంసలతో ముంచెత్తారు. ‘అతను చెప్పింది చేస్తాడు. దేశం కోసం ఆడాలని కాంక్షించే చిన్న చిన్న పట్టణాలకి చెందిన కుర్రాళ్లకి అతను ఆదర్శం. క్లిష్ట పరిస్థితులలో కూడా అతను ఉక్కు సంకల్పంతో ప్రశాంతతతో వ్యవహరించే తీరును ఎంత పొగిడినా తక్కువే. బ్యాటింగ్ అయినా, వికెట్ కీపింగ్ అయినా అతనిది అసమానమైన శైలి. క్రికెట్ పాఠ్య పుస్తకాల్లోలేని ఆ హెలికాప్టర్ షాట్ అతని ప్రతిభ, ఆత్మ విశ్వాసానికి నిదర్శనం. అతనిలా ఇంకెవరూ ఉండరు’ అని మిథాలీ అన్నారు. అంతర్జాతీయ కెరీర్లో ధోని 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధశతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ 20 మ్యాచ్‌లలో 1600 పరుగుల సాధించాడు. -
కోహ్లి ట్వీట్ రికార్డు
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాట్‌తో మైదానంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. తాజాగా అతను బ్యాట్‌తో కాకుండా ట్వీట్‌తోనూ రికార్డులకెక్కాడు. అది కూడా తన స్ఫూర్తి ప్రదాత, మాజీ కెప్టెన్ ధోనికి చెప్పిన పుట్టిన రోజు శుభాకాంక్షల ద్వారా కావడం మరో విశేషం. ఈ ఏడాది తన అభిమాన కెప్టెన్ జన్మదినోత్సవం సందర్భంగా కోహ్లి ‘హ్యాపీ బర్త్ డే మహి భాయ్. చాలా కొద్దిమందికే నమ్మకానికి అర్థం తెలుసు. మీ నుంచి ఆ నమ్మకాన్ని పొందిన నేను అదృష్టవంతుణ్ని. మీ సహచర్యంలో నేను ఎన్నో ఏళ్లు నడిచాను. నా వరకైతే మీరే నాకు పెద్దన్న. నేనెపుడు చెప్పినట్లుగా ఎప్పటికీ నీవే నా సారథివి’ అని ట్వీట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో ప్రత్యేకించి స్పోర్ట్స్ విభాగంలో అత్యధికంగా రీట్వీట్ (45,500 సార్లు) అయిన పోస్ట్‌గా రికార్డుకెక్కిందని ట్విట్టర్ మంగళవారం వెల్లడించింది. -
ధోని లేకుండానే...
న్యూఢిల్లీ: వెటరన్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రపంచ కప్ అనంతరం ధోని రిటైర్ అవుతాడని భావించగా... అతడేమో సైన్యంలో పనిచేసేందుకు మొగ్గుచూపుతూ వెస్టిండీస్ పర్యటన నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్నాడు. ఆ బాధ్యతలూ ముగించుకున్నప్పటికీ.. ముందుగా ప్రకటించిన మేరకు రెండు నెలల విరామం (జూలై 21–సెప్టెంబర్ 21) పూర్తి కాకపోవడంతో సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. పనిభారం తగ్గించే ఉద్దేశంతో గురువారం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో పేసర్ భువనేశ్వర్ కుమార్‌కూ చోటివ్వలేదు. వెస్టిండీస్‌పై టి20 సిరీస్ గెలిచిన జట్టులోని మిగతా సభ్యులందరికీ స్థానం కల్పించారు. కరీబియన్ పర్యటన నుంచి పూర్తి విశ్రాంతినిచ్చిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం చేయనున్నాడు. ధోని అమెరికాలో: ధోని ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. ఖాళీ సమయాన్ని అతడు విహార యాత్రకు కేటాయించినట్లు సమాచారం. ఏకైక వికెట్ కీపర్‌గా పంత్ బాధ్యతలు మోయనున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత టి20 జట్టు: ధావన్, రోహిత్, కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చహర్, దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ. -
ప్రపంచకప్‌లో ఆఖరి ఆట!
కెరీర్లో ఒక్కసారైనా ప్రపంచ కప్ ఆడాలనేది ప్రతీ క్రికెటర్ కల. సచిన్ లాంటి దిగ్గజాలు ఆరు ప్రపంచ కప్‌లు ఆడగలిగితే సుదీర్ఘ కాలం కెరీర్ ఉండీ ఒక్క టోర్నీ కూడా ఆడే అవకాశం దక్కనివారు ఎందరో. అయితే కెరీర్ చివరి దశకు వచ్చిన సమయంలో ‘ఈ ఒక్కసారి’ అంటూ వరల్డ్ కప్ కోసం సర్వశక్తులు ఒడ్డి సిద్ధమయ్యే క్రికెటర్ల జాబితా కూడా పెద్దదే. ఆటగాళ్ల ఆలోచన, బోర్డు ప్రణాళికల్లో కూడా ఆయా సీనియర్లు, వారి అనుభవానికి ఒక ఆఖరి అవకాశం ఇచ్చి సగౌరవంగా పంపించాలనే భావన కనిపిస్తుంది. అందుకే సహజంగానే ప్రతీ ప్రపంచ కప్ తర్వాత ఎందరో స్టార్ల కెరీర్లకు ఫుల్‌స్టాప్‌పడుతుంది. కొందరు విజయంతో సంతృప్తికరంగా గుడ్‌బై చెబితే, మరికొందరు నిరాశాజనకంగా ఆటను ముగించాల్సి వస్తుంది. ఈసారి వన్డే వరల్డ్ కప్ తర్వాత కూడా చాలా మంది ఆట నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమవుతుండగా... మరికొందరు కెరీర్‌ను కొనసాగించినా వచ్చే ప్రపంచ కప్ వరకు మాత్రం మైదానంలో ఉండటం దాదాపు అసాధ్యం. అలాంటి క్రికెటర్ల జాబితాను చూస్తే... క్రిస్ గేల్ (వెస్టిండీస్) కొత్త మిలీనియం ప్రారంభానికి ముందు వన్డేల్లో అరంగేట్రం చేసి ఇప్పటికీ కొనసాగుతున్న అతి కొద్ది ఆటగాళ్లలో గేల్ ఒకడు. విధ్వంసక ఆటగాడిగా గుర్తింపు ఉన్నా, పలు రికార్డులు తన పేరిట ఉన్నా వన్డే వరల్డ్ కప్ విజయంలో మాత్రం అతను భాగం కాలేకపోయాడు. మధ్యలో కొంత కాలం టి20ల హోరులో జాతీయ జట్టుకు దూరంగా ఉండిపోయిన అతను ఇప్పుడు మళ్లీ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. విండీస్‌పై పెద్దగా అంచనాలు లేని సమయంలో గేల్ రాక జట్టులో కొత్త ఉత్సాహం నింపింది. కప్ గెలిపించగలడో లేదో కానీ ఇటీవలి ఫామ్ ప్రకారం చూస్తే వరల్డ్ కప్‌లో గేల్ మెరుపులు ఖాయం. 2003 నుంచి నాలుగు ప్రపంచ కప్‌లు ఆడిన గేల్ 26 మ్యాచ్‌లలో 37.76 సగటుతో 944 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. గత ప్రపంచ కప్‌లో డబుల్ సెంచరీ బాదాడు. మహేంద్ర సింగ్ ధోని (భారత్) నాలుగున్నరేళ్ల క్రితమే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినా... పరిమిత ఓవర్ల క్రికెట్లో ధోని ముద్ర కొనసాగింది. అయితే గత కొంత కాలంగా వరుస వైఫల్యాలు, అనంతరం అతని ఆటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ వరల్డ్ కప్‌లాంటి మెగా ఈవెంట్లో ధోని అనుభవం, వ్యూహాలు జట్టుకు ఎంత అవసరమో గుర్తించి సెలక్టర్లు అతనిపై నమ్మకముంచారు. ఎలాగైనా వరల్డ్ కప్ వరకైతే కొనసాగించాలని భావించారు. కెప్టెన్ కోహ్లి పదే పదే మద్దతుగా నిలవడం కూడా కలిసొచ్చింది. భారత్ గెలవాలంటే ధోనిలాంటి సీనియర్ పాత్ర కూడా కీలకం కానుంది. అయితే పరోక్షంగా బోర్డు వర్గాల వ్యాఖ్యల్లో కూడా ధోనికిదే చివరి టోర్నీ అని చాలా సార్లు వినిపించింది కాబట్టి ఇకపై రిషభ్ పంత్‌లాంటి యువ ఆటగాడు వేచి చూస్తున్న తరుణంలో టోర్నీ ఫలితం ఎలా ఉన్నా, 38 ఏళ్ల ధోని ఎలా ఆడినా అతనికి ఇదే ఆఖరి ఆట కావచ్చు. రికార్డు: రెండు సార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని ఒకసారి జట్టును జగజ్జేతగా నిలపడంతో పాటు మరోసారి సెమీస్ చేర్చాడు. అతనికి ఇది వరుసగా నాలుగో ప్రపంచ కప్. 20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో 42.25 సగటుతో 507 పరుగులు చేశాడు. 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొర్తజా (బంగ్లాదేశ్) బంగ్లాదేశ్ జట్టు ఇన్నేళ్లుగా ఎక్కడో ఒక చోట సంచలనానికి కారణమౌతోందంటే అందుకు పునాది వేసిన వారిలో మొర్తజా ఒకడు. తన వన్డే కెరీర్లో ఎక్కువ భాగం కెప్టెన్‌గా వ్యవహరించిన మొర్తజా సమర్థంగా టీమ్‌ను నడిపించాడు. 2007 వరల్డ్ కప్‌లో భారత్ పతనానికి కారణమై ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన క్షణాన్ని ఎవరూ మరచిపోలేరు. గత ప్రపంచకప్‌లో అతని సారథ్యంలోనే ఇంగ్లండ్‌ను వెనక్కి తోసి బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఈ ఏడాది ఆరంభంలో పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఎంపికైన అతను వరల్డ్ కప్ తర్వాత ఆటకు గుడ్‌బై చెప్పనున్నాడు. తన చివరి టోర్నీలో బంగ్లాకు గొప్ప విజయాలు అందించాలని అతను కోరుకుంటున్నాడు. గాయంతో 2011 ప్రపంచ కప్‌కు దూరమైన అతను 2003నుంచి 3 వరల్డ్ కప్‌లలో కలిపి 16 మ్యాచ్‌లలో 36.05 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు. మలింగ (శ్రీలంక) మూడు ప్రపంచ కప్‌లు... వరుసగా రెండు ఫైనల్స్‌లో పరాజయం. వన్డే ప్రపంచ కప్‌ను అందుకోలేని లంక అగ్రశ్రేణి క్రికెటర్లలో మలింగ ఒకడు. గాయాలతో 2016 మొత్తం ఆటకు దూరమై, ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు మాత్రమే మ్యాచ్‌లు ఆడుతూ వచ్చిన పేసర్ ‘స్లింగ’ ఇప్పుడు మరోసారి ప్రపంచ కప్ వేదికపై నిలబడ్డాడు. ఇటీవల ఐపీఎల్‌తో తన బౌలింగ్‌లో జోరు తగ్గలేదని చూపించిన అతను... ఈసారి మరింత బలహీనంగా కనిపిస్తున్న శ్రీలంకకు ఏమాత్రం ఉపయోగపడగలడో చూడాలి. ఈ మెగా టోర్నీ తర్వాత అతను పూర్తిగా టి20 లీగ్‌లకే పరిమితమయ్యే అవకాశం ఉంది. గత మూడు ప్రపంచ కప్‌లు ఆడిన మలింగ 22 మ్యాచ్‌లలో 21.11 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. షోయబ్ మాలిక్ (పాకిస్తాన్) సుదీర్ఘ కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో పాక్ కీలక ఆటగాళ్లలో మాలిక్ ఒకడు. ఇతను కూడా 1999లోనే వన్డేల్లోకి అడుగు పెట్టాడు. అయితే వేర్వేరు కారణాలతో ఒకే ఒక్క ప్రపంచ కప్ (2007) ఆడగలిగాడు. 3 మ్యాచ్‌లలో కలిపి 92 పరుగులు మాత్రమే చేశాడు. ఈసారి అతని అనుభవంపై పాక్ అంచనాలు పెట్టుకుంది. మిడిలార్డర్లో జట్టును నడిపించగలడని నమ్ముతోంది. వరల్డ్ కప్ తర్వాత మాలిక్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. తన 20 ఏళ్ల అంతర్జాతీయ వన్డే క్రికెట్ కెరీర్లో మాలిక్ 283 మ్యాచ్‌లు ఆడి 7522 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 44 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సఫారీల కల నెరవేరేనా! ఒకసారి కాదు...రెండు సార్లు కాదు... ప్రతీ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా గెలుపు ఆశలు ఏదో కారణంతో కుప్పకూలిపోవడం రొటీన్‌గా మారిపోయింది. 1992 నుంచి అన్ని ప్రపంచ కప్‌లలో గెలుపు అవకాశాలు కనిపిస్తూ చివరకు ఓడి ‘చోకర్స్’గా సఫారీ జట్టు ముద్ర వేసుకుంది. 2015 సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి గుండె బద్దలైన క్షణాన సఫారీ జట్టు ఆటగాళ్లంతా చిన్నపిల్లల్లా రోదించారు. నాటి టీమ్‌లో భాగంగా ఉండి ఇప్పుడు ‘ఆఖరిసారి’ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఐదుగురు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. వీరందరికీ ఇదే ఆఖరి ప్రపంచకప్ కానుంది. వీరందరికంటే ముందే నా వల్ల కాదు బాబోయ్, ప్రపంచ కప్ లేకపోయినా నాకేమీ లోటు లేదంటూ ఏబీ డివిలియర్స్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించగా... డు ప్లెసిస్, ఆమ్లా, డుమిని, స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్ మరోసారి పోరాడబోతున్నారు (వీరంతా 2011, 2015లలో జరిగిన రెండు ప్రపంచ కప్‌లు ఆడారు). ఈసారైనా వీరి కల నెరవేరుతుందో వేచి చూడాలి. డు ప్లెసిస్: 14 మ్యాచ్‌లలో 53.90 సగటుతో 539 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. హషీం ఆమ్లా: 15 మ్యాచ్‌లలో 42.60 సగటుతో 639 పరుగులు చేశాడు. 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. జేపీ డుమిని: 13 మ్యాచ్‌లలో 43.11 సగటుతో 388 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 1 అర్ధసెంచరీ ఉన్నాయి. డేల్ స్టెయిన్: 14 మ్యాచ్‌లలో 23.39 సగటుతో 23 వికెట్లు పడగొట్టాడు. ఇమ్రాన్ తాహిర్: 13 మ్యాచ్‌లలో 16.31 సగటుతో 29 వికెట్లు పడగొట్టాడు. -
‘ధోని హార్ట్ బ్రేక్ అయ్యింది’
డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ధోని సేనపై అద్భుత రికార్డు ఉన్న ముంబై అదే జోరును కొనసాగిస్తూ కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో కప్‌ను ఎగురేసుకుపోయింది. కచ్చితంగా గెలిచి నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ దక్కించుకుంటుందని భావించిన చెన్నై జట్టు ఓటమి పాలవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తమ జట్టు చేసిన తప్పులే తమకు ట్రోఫీని దూరం చేశాయంటూ చెన్నై సారథి ధోని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇరు జట్లు తప్పిదాలు చేశాయని, తమ కంటే ఒక తప్పిదం తక్కువ చేయడం వల్లే ప్రత్యర్థి జట్టు విజేతగా నిలిచిందని పేర్కొన్నాడు. కాగా ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిని ధోని తట్టుకోలేకపోయాడని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.‘మ్యాచ్ తర్వాత నా గుండె ధోనితో మాట్లాడటం మొదలుపెట్టింది. కేవలం ఒకే ఒక్క పరుగుతో టైటిల్ కోల్పోవడం తన హార్ట్‌ను బ్రేక్ చేసింది. ధోని ఇంతలా బాధపడటం ఇంతకు ముందెన్నడు చూడలేదు’ అని పేర్కొన్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో ఆట అంత గొప్పగా ఏమీలేదనీ, అయినా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూడాలనే ఉత్సాహం కచ్చితంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చాంపియన్ బౌలర్లు ఉన్న జట్టునే విజయం వరించే అవకాశాలు ఎక్కువ. క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచే ఐపీఎల్ చిరకాలం వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. కాగా హైదరాబాద్ వేదికగా జరిగిన ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డి కాక్ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. My heart went out to Dhoni speaking to him in the post match, he seemed really heartbroken. Never seen him like that before. — Sanjay Manjrekar (@sanjaymanjrekar) May 12, 2019 -
ఐపీఎల్ ఫైనల్లోకి ముంబై ఇండియన్స్
-
నన్ను రూ.40 కోట్లకు ముంచారు : ధోని
న్యూఢిల్లీ : రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్ తనను మోసం చేసిందని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆమ్రపాలి గ్రూప్ తరఫున ప్రచారం చేసినందుకుగానూ తనకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని చెల్లించలేదని పేర్కొన్నాడు. అదే విధంగా ఆమ్రపాలి ప్రాజెక్టులో తాను బుక్ చేసుకున్న పెంట్‌హౌజ్‌ను కూడా స్వాధీనం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. రియల్టీ కుంభకోణంలో చిక్కుకున్న ఆమ్రపాలి గ్రూపు ప్రస్తుతం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమ్రపాలి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు తనకు చెల్లిస్తానన్న రూ. 40 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారని ధోని పేర్కొన్నాడు. ఈ మొత్తం తనకు చెల్లించాల్సిందిగా ఆమ్రపాలిని ఆదేశించాలని ధోని అత్యున్నత స్థానానికి విఙ్ఞప్తి చేశాడు. రాంచీలోని ఆమ్రపాలి సఫారీలో ఉన్న పెంట్‌హౌజ్‌ను తనకు స్వాధీనపరచాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. చదవండి : కోర్టురూమ్‌లోనే ‘అమ్రపాలి’ డైరెక్టర్లు అరెస్ట్ కాగా ఈ రియల్టీ గ్రూప్‌నకు ధోని 2009 నుంచి 2016 వరకు అంబాసిడర్‌గా వ్యవహరించాడు. పెట్టుబడిదారులను ఆకర్షించేలా నిర్మించిన పలు ప్రకటనల్లో కనిపించాడు. అంతేగాక ఈ గ్రూపు నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో ధోనితో పాటు అతడి భార్య సాక్షి కూడా భాగస్వామ్యమయ్యారు. ఆమ్రపాలి గ్రూపునకు చెందిన చారిటబుల్ వింగ్ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఇక ఇన్వెస్టర్ల నుంచి రూ.2,765 కోట్లను వసూలు చేసి వాటిని దారి మళ్లించినట్టు ఆమ్రపాలి గ్రూప్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ గ్రూప్‌నకు చెందిన 16 ఆస్తుల వేలానికి సుప్రీంకోర్టు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా వచ్చిన నిధులను... నిలిచిపోయిన ప్రాజెక్టుల పని ప్రారంభించడానికి ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్బీసీసీ) వినియోగించుకోడానికి కూడా వీలు కల్పించింది. ఈ క్రమంలో నిలిచిపోయిన 15 హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 46,575 ఫ్లాట్స్‌ను 36 నెలల్లో దశల వారీగా నిర్మించి ఇవ్వగలమని.. ఇందుకు రూ.8,500 కోట్ల నిధులు కావాలని సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో ఎన్బీసీసీ ప్రతిపాదించింది. -
ధోనీ సతీమణి పోస్ట్‌పై నెటిజన్ల మండిపాటు
ధోని సతీమణి సాక్షిసింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు మోను కుమార్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'బంజరు భూమి.. పచ్చదనం కోసం ఎదురుచూస్తోంది.. గడ్డి ఈ సైడ్ పచ్చగా లేదనుకుంటా.. 'అంటూ మోను కుమార్ తలపై సాక్షి ముద్దు పెట్టింది. మోను కుమార్ బట్టతలపై సెటైర్ వేస్తూ బీపాజిటివ్ హ్యాష్ ట్యాగ్‌తో సరదాగా సాక్షి చేసిన పోస్ట్‌పై ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కొందరు హర్ట్ అయ్యారు. మీరు ఇలా పోస్ట్ పెట్టడం మమ్మల్ని బాధించింది, మిమ్మల్ని అన్‌ఫాలో అవుతున్నామంటూ మెసేజ్‌లు పెట్టారు. సాక్షిని అనుసరిస్తూ మరికొందరు.. ఫ్లాట్ పిచ్ బాగుంది బ్యాటింగ్‌కు పనికొస్తుంది అంటూ బట్టతలపై సెటైర్లు వేస్తున్నారు. ఇంతకు ముందు సాక్షిసింగ్‌ను ప్రపంచంలోనే ఉత్తమ వదిన అంటూ మోను కుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. View this post on Instagram Banjar zameen ... hariyaaalii ka intezaar.... Grass is not green on this side yet ! @monu_singh31 #bepositivealways A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on Apr 23, 2019 at 1:44pm PDT -
ధోని కేదార్ జాదవ్‌ల భ్రోమాన్స్
-
ధోనిపై 3 మ్యాచ్‌లు నిషేధం విధించాలి!
మైదానంలోకి దూసుకొచ్చి ఫీల్డ్ అంపైర్లతో వాదనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనిని భారత మాజీ కెప్టెన్ గంగూలీ వెనకేసుకొచ్చాడు. ‘ధోని మనలాంటి మనిషే. భావోద్వేగాలు సహజం. అయితే ఆటలో అతని పోటీతత్వం ఏంటో మనందరికీ తెలుసు. అది అసాధారణం’ అని అన్నాడు. ఒక చిన్న ఘటనతో అతన్ని తక్కువ చేయలేమని గంగూలీ వ్యాఖ్యానించాడు. గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ధోని చర్యను తప్పుబట్టాడు. ధోనిపై కనీసం రెండు లేదా మూడు మ్యాచ్‌లు నిషేధం విధిస్తే బాగుండేదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. -
సిక్సులు, ఫోర్లు ఇచ్చినా పర్లేదు గానీ : ధోనీ
‘మైదానం లోపల, వెలుపల మ్యాచ్ గురించి చాలా చర్చిస్తాం. ధోని ఎక్కువ సలహాలు ఇవ్వడు. కానీ అత్యవసర సమయాల్లో, విజయానికి దోహదపడే అంశాల గురించి తప్పక విలువైన సూచనలు చేస్తాడు. ఈరోజు కూడా అంతే. మ్యాచ్ ఫైనల్ ఓవర్లో ధోని నా దగ్గరికి వచ్చాడు. సిక్సులు, ఫోర్లు ఇచ్చినా సరేగానీ ఒక్క సింగిల్ కూడా తీసే అవకాశం ఇవ్వొద్దని చెప్పాడు. తద్వారా నాన్ స్ట్రైక్‌లో ఉన్న రస్సెల్‌కు అవకాశం లేకుండా చేయాలన్నదే మా ప్లాన్ అని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దీపక్ చహర్ తమ కెప్టెన్ ధోని ప్రణాళికల గురించి చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2019లో భాగంగా మంగళవారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాను నిర్ణీత 20 ఓవర్లలో 108 పరుగులకే కట్టడి చేసి చెన్నై బౌలర్లు తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా యువ బౌలర్ దీపక్ చహర్ ఓవర్‌కు ఒక వికెట్ చొప్పున క్రిస్ లిన్ (0), నితీశ్ రాణా (0), రాబిన్ ఉతప్ప (11)లను పెవిలియన్‌కు చేర్చి కోల్‌కతా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఇక డెత్ ఓవర్లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న చహర్.. కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి కోల్‌కతా హిట్టర్ ఆండ్రీ రసెల్‌ను కట్టడి చేశాడు. తద్వారా ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో ప్రధాన పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ వికెట్ చాలా స్లోగా ఉందని తెలిసి స్ట్రెయిట్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నా. ఇన్‌స్వింగ్, అవుట్‌స్వింగ్ ఏదైనా సరే స్టంప్స్‌ను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నా. చివరి ఓవర్లో ధోని విలువైన సలహాలతో ప్రత్యర్థి జట్టును కట్టడి చేశా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక శనివారం చెపాక్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా నోబాల్స్ వేసిన చహర్‌పై ధోని గుస్సా అయిన సంగతి తెలిసిందే. ధోని సలహా తర్వాత చహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆఖరు బంతికి కీలక బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్‌ను ఔట్ చేశాడు కూడా. -
‘ధోనీనా మజాకా.. ఆఖరికి బెయిల్స్ కూడానా!’
చెన్నై : ఐపీఎల్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న చెన్నై కెప్టెన్ ధోని(75 నాటౌట్; 46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన మిస్టర్ కూల్‌కు రైనా(36), బ్రేవో(27) తోడవడంతో చెన్నై వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. కాగా ఆరో ఓవర్లో రాజస్తాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ధోని డిఫెన్సివ్‌గా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో జోఫ్రా సంధించిన బంతి ధోని పాదాలను తాకి స్టంప్స్ దిశగా వెళ్లింది. ఆ సమయంలో స్లిప్‌లో ఉన్న స్మిత్‌తో పాటు రాజస్తాన్ ఆటగాళ్లు కూడా ఎగ్జైట్మెంట్కు లోనయ్యారు. అయితే బంతి స్టంప్స్‌ను తాకినప్పటికీ బెయిల్స్ మాత్రం కిందపడలేదు. దీంతో ధోనికి లైఫ్ లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేయడంతో పాటు.. ‘ తాలా ధోని ఎఫెక్ట్? బెయిల్స్ కూడా కిందపడటానికి నిరాకరించిన వేళ ’అంటూ క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియోకు ఫిదా అయినా ధోని అభిమానులు.. ‘అవును మరి తలైవా ధోని అంటే ఏమనుకున్నారు. చెన్నైతో ఆడేటప్పుడు కేవలం పిచ్ ఎఫెక్ట్ మాత్రమే కాదు ధోని ఎఫెక్ట్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి’ అని కామెంట్లు చేస్తున్నారు. WATCH: Thala Dhoni effect? When even bails refused to fall 📹📹https://t.co/ccTyMBLToc #CSKvRR — IndianPremierLeague (@IPL) March 31, 2019 -
శివమెత్తిన ధోని
చెన్నై: చెన్నై సూపర్‌కింగ్స్ దూసుకెళుతోంది. ఐపీఎల్–12లో వరుసగా మూడో విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన పోరులో సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ధోని (46 బంతుల్లో 75; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడగా... రైనా (32 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. రాజస్తాన్ బౌలర్ అర్చర్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. స్టోక్స్ (26 బంతుల్లో 46; 1 ఫోర్, 3 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. చహర్, శార్దుల్, బ్రేవో, తాహిర్ తలా 2 వికెట్లు తీశారు. పది ఓవర్లకు 55 పరుగులే టాస్ నెగ్గిన రాజస్తాన్ ఫీల్డింగ్‌కే మొగ్గుచూపింది. చెన్నై బ్యాటింగ్ తీరు, పరుగుల ప్రయాస చూశాక రాయల్స్ నిర్ణయం 15 ఓవర్లదాకా సబబుగానే అనిపించింది. సూపర్‌కింగ్స్ ఓపెనర్లు, టాపార్డర్ విఫలమైంది. రాయుడు ఒక పరుగుకే ఔట్. అప్పుడు జట్టు స్కోరు కూడా ఒకటే! మరో ఓపెనర్ వాట్సన్ (13 బంతుల్లో 13) ఒక్కో ఫోర్, సిక్సర్‌తో తన ధాటిని రుచి చూపించాడు. కానీ జోరు అప్పటికప్పుడే ముగిసింది. 14 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన చెన్నైకి కేదార్ జాదవ్ (8)రూపంలో మరో షాక్ ఎదురైంది. అంతే 27 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన చెన్నై 50 పరుగులు చేసేందుకు పదో ఓవర్‌దాకా ఆడాల్సి వచ్చింది. మొత్తానికి తొలి సగం ఓవర్లు ముగిసేసరికి చెన్నై 3 వికెట్లకు 55 పరుగులు చేసింది. ఇది టి20ల్లో చాలా తక్కువ స్కోరు. 60 బంతులాడి ఆరే ఫోర్లు కొట్టింది. ధోని దూకుడు రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 17 ఓవర్లు ముగిసేదాకా చెన్నై స్కోరు 115/4. కానీ రెండే ఓవర్లు సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్‌ను మలుపుతిప్పాయి. అప్పటిదాకా నింపాదిగా ఆడుతున్న ధోని ధనాధన్ మొదలుపెట్టాడు. కులకర్ణి వేసిన 18వ ఓవర్లో ధోని సిక్స్, బ్రేవో ఫోర్, సిక్స్ కొట్టడంతో పాటు నోబాల్, వైడ్ కలుపుకొని 24 పరుగులు వచ్చాయి. అర్చర్ 19వ ఓవర్లో 8 పరుగులిచ్చి బ్రేవో (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ తీశాడు. ఇక మిగిలింది ఒకే ఓవర్. ఉనాద్కట్ బౌలింగ్‌లో ధోని చెలరేగాడు. మొదట జడేజా సిక్సర్ బాదగా... ధోని చివరి 3 బంతుల్ని 6, 6, వైడ్, 6గా బాదేశాడు. 28 పరుగులు రావడంతో చెన్నై భారీస్కోరు చేయగలిగింది. రాయల్స్ చెన్నైలాగే... రాజస్తాన్ రాయల్స్ ఆట కూడా చెన్నై తరహాలోనే మొదలైంది. ఖాతా తెరవకముందే రహానే (0)ను, 14 పరుగుల వద్ద సంజూ సామ్సన్ (8), బట్లర్ (6) వికెట్లను చేజార్చుకుంది. ఈ దశలో రాహుల్ త్రిపాఠి, స్టీవ్ స్మిత్ జాగ్రత్తగా ఆడారు. నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించాక... త్రిపాఠి ఇన్నింగ్స్‌కు తాహిర్ రిటర్న్ క్యాచ్‌తో తెరదించాడు. దీంతో 75 పరుగుల వద్ద నాలుగో వికెట్ పడింది. ఆ తర్వాత స్మిత్‌కు స్టోక్స్ జతయినా మెరుపులు తక్కువయ్యాయి. జట్టు స్కోరు వంద పరుగులకు ముందే స్మిత్ (30 బంతుల్లో 28; 2 ఫోర్లు) వికెట్‌ను తాహిరే పడగొట్టడంతో రాజస్తాన్ కష్టాలు పెరిగాయి. అయితే స్టోక్స్‌కు జతయిన ఆర్చర్ (11 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) సిక్సర్లు బాదడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. చివరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సివుండగా బ్రేవో బౌలింగ్‌లో తొలిబంతికే స్టోక్స్ ఔటయ్యాడు. దీంతో రాజస్తాన్ శిబిరంలో ఏ మూలనో మిగిలున్న ఆశలు అడుగంటాయి. -
భద్రతా దళాలకు బీసీసీఐ రూ. 20 కోట్లు వితరణ
చెన్నై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం దేశ రక్షణ కోసం ప్రాణాలనే పణంగా పెట్టే భద్రతా దళాలకు రూ. 20 కోట్ల విరాళాన్ని అందజేసింది. ఇటీవల పుల్వామాలో ఉగ్రదాడికి 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవాన్లు బలయ్యారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో బీసీసీఐ, లీగ్ పాలక మండలి 12వ ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవ వేడుకల్ని రద్దు చేసింది. ఆ వేడుకలకు వెచ్చించే మొత్తానికి మరికొంత జతచేసి సాయుధ బలగాలకు ఇవ్వాలని బీసీసీఐ గతంలోనే నిర్ణయించింది. అనుకున్నట్లే శనివారం రూ. 11 కోట్లను భారత ఆర్మీకి, రూ. 7 కోట్లను సీఆర్పీఎఫ్కు, రూ. కోటి చొప్పున నావిక దళం, వాయు సేనలకు అందజేశామని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘వేడుకల్ని రద్దు చేసి ఆ మొత్తాన్ని అమర జవాన్లకు విరాళమివ్వాలని బీసీసీఐ, పరిపాలక కమిటీ (సీఓఏ) ఏకగ్రీవంగా తీర్మానించాయి’ అని సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ అన్నారు. ఇది స్వాగతించాల్సిన విషయమని బోర్డు ఇకముందు కూడా జాతి అభీష్టం మేరకు నడుచుకుంటుందని సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ అన్నారు. సీఎస్కే తరఫున రూ. 2 కోట్లు... భారత క్రికెటర్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పుల్వామాలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు అందజేశారు. ఇప్పుడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కూడా అలాంటి పనే చేసింది. తమ సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్‌లో టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన రూ. 2 కోట్లను జవాన్ల కుటుంబాలకు అందజేసింది. -
బెంగళూరును చెన్నై చుట్టేసింది
ఎంత ‘పొట్టి’ క్రికెటైతే మాత్రం ఎప్పుడు మెరుపులేనా? బ్యాట్లే ఝళిపించాలా? బంతులు బౌండరీని దాటాలా? బౌలర్లకే చుక్కల్ని చూపించాలా? వారే బలికావాలా..! అని అనుకుందేమో ఐపీఎల్. అందుకే ఈ సీజన్ ఆరంభం భారీ షాట్లతో, వీర విధ్వంసంతో కాకుండా బౌలర్ల చాణక్యంతో మొదలైంది. చెన్నై స్పిన్నర్లు కనికట్టుతో... మూకుమ్మడిగా పనిపట్టడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కుదేలైంది. స్పిన్‌తో మొదలుపెట్టి, బెంగళూరును నిర్ణీత ఓవర్లకు ముందే చెన్నై చుట్టేసింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ‘సూపర్ కింగ్స్’లా బోణీ కొట్టేసింది. చెన్నై: ఐపీఎల్ అంటే ధనాధన్ షాట్లు... ఫటాఫట్ మెరుపులు... కానీ ఆనవాయితీకి భిన్నంగా, విధ్వంసానికి విరుద్ధంగా 12వ సీజన్ మొదలైంది. కోహ్లి, డివిలియర్స్‌లాంటి బ్యాటింగ్ హేమాహేమీలున్న జట్టుపై ధోని సేన స్పిన్‌తో విన్నయింది. ఇక్కడి చిదంబరం స్టేడియంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు 17.1 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. పార్థివ్ పటేల్ (35 బంతుల్లో 29; 2 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్. హర్భజన్, ఇమ్రాన్ తాహిర్ చెరో 3 వికెట్లు తీయగా... రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు లభించాయి. తర్వాత చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసి గెలిచింది. రాయుడు (42 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. హర్భజన్ సింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇలా మొదలై... అలా ఆలౌటై బెంగళూరు ఇన్నింగ్స్‌లో పరుగులు, ఫోర్లు, సిక్సర్ల కన్నా నిలువెత్తు నిర్లక్ష్యమే నిండుగా కనిపించింది. బాధ్యత తీసుకునేందుకంటే వికెట్లను పారేసుకునేందుకే బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చారనిపించింది. ఒకరిని మించి ఒకరు పెవిలియన్ చేరేందుకు అదేపనిగా పోటీపడ్డారు. పతనం కెప్టెన్ కోహ్లితో మొదలైంది. దీనికి మొయిన్ అలీ వికెట్ జతయ్యింది. ఇంకాసేపటికి డివిలియర్స్ వికెట్టూ పడింది. అయినా బెంగళూరు బ్యాట్స్‌మెన్ కళ్లు తెరవలేదు. ఆ మూడు వికెట్లూ వన్నె తగ్గిన వెటరన్ స్పిన్నర్ హర్భజన్ తీశాడని, పిచ్ స్పిన్‌కు వశమైందని దీంతో ఇక పదును ఉన్న ఇమ్రాన్ తాహిర్, జడేజాల బౌలింగ్ కష్టమని ఏ ఒక్కరూ అంచనాకు రాలేదు. వచ్చారు... ఆడారు... ఔటయ్యారు... అంతే! పరుగుల హోరులో జరగాల్సిన మ్యాచ్ వికెట్ల జోరుకు విలవిల్లాడింది. ఒక్కరంటే ఒక్కరు మూడు పదులైనా చేయలేదు. 10 మంది పదేసి చొప్పున కూడా పరుగులు చేయలేకపోయారు. అదేం చిత్రమో గానీ క్యాచ్ మిస్సయితే తర్వాతి బంతికి క్యాచ్ ఇచ్చి వెళ్లడం డివిలియర్స్‌కు చెల్లితే... రనౌట్ నుంచి తప్పించుకొని మళ్లీ మరుసటి బంతికే రనౌట్ కావడం హెట్మైర్కే సాధ్యమైంది. భజ్జీ భల్లే భల్లే... టాస్ నెగ్గిన చెన్నై కెప్టెన్ ధోని బౌలింగ్ ఎంచుకోగా... బెంగళూరు ఇన్నింగ్స్‌ను కెప్టెన్ కోహ్లి, పార్థివ్ పటేల్‌తో కలిసి ప్రారంభించాడు. మైదానంలోకి దిగిన ఆటగాళ్లను ఇంకా గుర్తుపట్టకముందే... చెన్నై బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పనిపట్టారు. నాలుగో ఓవర్లో కోహ్లి (6) ఔటయ్యాడు. ఆరో ఓవర్లో మొయిన్ అలీ (9; 1 సిక్స్), 8వ ఓవర్లో డివిలియర్స్ (9) పెవిలియన్ చేరారు. ఈ ముగ్గురినీ హర్భజన్ సింగే ఔట్ చేశాడు. 8వ ఓవర్ రెండో బంతికి బెంగళూరు స్కోరు 38/3. ఈ ఓవర్ ముగిసేసరికి ఒక పరుగు వచ్చింది. మరో వికెట్ కూడా పడింది. హెట్‌మైర్ (0) రనౌట్. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా పిచ్‌ను పసిగట్టలేదు. స్పిన్నర్లను జాగ్రత్తగా ఎదుర్కోలేదు. క్రీజులో నిలబడే సాహసం చేయలేదు. ఓపెనర్ పార్థివ్ సరైన భాగస్వామి కోసం చూస్తుండగానే వచ్చినవారు వచ్చినట్లే ఔటయ్యారు. ఇమ్రాన్ తాహిర్ స్పిన్‌కు శివమ్ దూబే (2), నవ్‌దీప్ సైనీ (2), చహల్ (4) తలవంచారు. గ్రాండ్‌హోమ్ (4)ను, చివర్లో ఉమేశ్ (1)ను రవీంద్ర జడేజా పెవిలియన్ చేర్చితే, పార్థివ్ వికెట్ తీసి బ్రేవో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. చెన్నై జాగ్రత్తగా... ఛేదించాల్సిన లక్ష్యం తక్కువే అయినా ఒక్క వికెట్ పడగానే చెన్నై జాగ్రత్త పడింది. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ వాట్సన్ (0) చహల్ బౌలింగ్‌లో డకౌట్ కాగానే స్పిన్ తడాఖా తెలుసుకున్న సూపర్ కింగ్స్ నింపాదిగా ఆడింది. మరో ఓపెనర్ రాయుడు, రైనా (21 బంతుల్లో 19; 3 ఫోర్లు) రెండో వికెట్‌కు 32 పరుగులు జోడించారు. పదో ఓవర్లో జట్టు స్కోరు 40 పరుగుల వద్ద రైనా కూడా మొయిన్ అలీ స్పిన్‌కే వెనుదిరిగాడు. కాసేపటికి రాయుడు ఔటయినప్పటికీ చెన్నై గెలిచే స్థితిలో నిలిచింది. మిగతా లాంఛనాన్ని జాదవ్ (13 నాటౌట్; 1 ఫోర్), జడేజా (6 నాటౌట్) పూర్తి చేశారు. వ్యక్తిగత స్కోరు 15 పరుగుల వద్ద సురేశ్ రైనా ఐపీఎల్ చరిత్రలో 5000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. -
ఇండియన్ ప్రేమించే లీగ్
ధోని వ్యూహాలకు కోహ్లి వద్ద జవాబుందా? రహానే ప్రణాళికలు రోహిత్‌ను అడ్డుకోగలవా? అశ్విన్ ఆలోచనలకు దినేశ్ కార్తీక్ ఇచ్చే కౌంటర్ ఏమిటి? అయ్యర్ ఢిల్లీ శ్రేయస్సు కోసం ఎంతగా శ్రమించాల్సి ఉంది? విలియమ్సన్ కెప్టెన్సీకి వార్నర్ సలహాలు తోడైతే ఫలితం ఎలా ఉండబోతోంది...? అభిమానుల అందరి మదిలో ఉండే ప్రశ్నలివే... సమాధానాల కోసం మాత్రం ఒక్కో రోజు ఆసక్తిగా ఎదురు చూడటం వారి వంతు. స్టేడియాలు దద్దరిల్లే విధ్వంసకర ప్రదర్శనలు, ఆటోమీటర్ గిర్రున తిరిగినంత వేగంగా మీటర్ల లెక్కలు చూపే సిక్సర్లు, స్టార్ల కళకళ, కొత్త కుర్రాళ్ల కదనోత్సాహం... ఇలాంటి దృశ్యాలు ఇన్నేళ్లుగా చూస్తున్నా మరో ఐపీఎల్ వచ్చిందంటే మనసు మళ్లీ మళ్లీ అలాంటి వినోదాన్నే కోరుకుంటుంది. ఒకటి కాదు రెండు కాదు విరామం లేకుండా పదకొండేళ్లు గడిచిపోయాయి. అటు ఆటగాళ్లలో, ఇటు అభిమానుల్లో ఇప్పటికీ అదే జోష్. వేసవి అడుగు పెట్టిందంటే చాలు ఆటలకు విరామం అనిపించిన రోజుల నుంచి వేసవి అంటేనే ఫన్‌గా మార్చేసిన ఘనత ఐపీఎల్‌దే. ఎందుకంటే ఐపీఎల్‌లోని అరవై మ్యాచ్‌లు అందించే అచ్చమైన వినోదానికి, అనూహ్య మలుపులకు అభిమానులంతా సిద్ధమైపోయారు. అటు క్లాస్, ఇటు మాస్... వారు వీరు అని తేడా లేకుండా ఐపీఎల్‌తో అంతా పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. ఇప్పుడు ‘ద్వాదశ ఘట్టం’కు వేళయింది. రాబోయే 51 రోజులు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ సమాజం మొత్తం ఐపీఎల్‌తో బంధాన్ని ముడేసుకోబోతోంది. ఈ వేడుకలో భాగమయ్యేందుకు మీరు కూడా సిద్ధమా! చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్–2019కు విజిల్ మోగింది. నేటి నుంచి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి తెర లేవనుంది. ఇక్కడి చిదంబరం స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఐపీఎల్–12 ప్రారంభమవుతుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎనిమిది జట్లు బరిలోకి దిగనుండగా, లీగ్ దశలో 56 మ్యాచ్‌లు... అనంతరం మూడు ప్లే ఆఫ్‌లు, ఫైనల్ కలిపి మొత్తం 60 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మే 12న చెన్నైలోనే తుది పోరు జరుగుతుంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించరాదని బీసీసీఐ నిర్ణయించుకుంది. ఫలితంగా నేడు నేరుగా మ్యాచ్‌తోనే లీగ్ మొదలవుతుంది. మ్యాచ్ సమయాల (సా.4 గం., రా. 8. గం.)లో కూడా మార్పు లేదు. వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సీజన్‌ను రెండు వారాలు ముందుకు జరిపారు. వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత ఆటగాళ్ల ఫిట్నెస్, అలసటవంటి అంశాలు కూడా చర్చకు వస్తున్న నేపథ్యంలో అన్ని జట్లు వారిని ఎలా ఉపయోగించుకుంటాయనేది చూడాలి. ఎవరికి దక్కేనో... ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లతో పాటు ఒక్కసారి కూడా విజయానందం రుచి చూడని టీమ్‌లు ఉన్నాయి. ప్రతీ ఏటా శక్తిమేర ప్రయత్నించడం, చివరకు నిరాశకు గురి కావడం ఎన్నో జట్లకు అనుభవమే. అయితే కొత్త సీజన్ రాగానే ప్రతీ జట్టు ట్రోఫీనే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ నాలుగోసారి టైటిల్ ఆశిస్తోంది. గత ఏడాది టీమ్‌ను గెలిపించిన ‘ప్రధాన బృందం’ మొత్తం ఈసారి కూడా కొనసాగుతోంది. అటు ముంబై ఇండియన్స్ కూడా నాలుగోసారి ట్రోఫీని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని స్వల్ప మార్పులు మినహా ముంబైలో కూడా సీనియర్లే ఎక్కువ మంది ఉన్నారు. ఇక మాజీ చాంపియన్ కోల్‌కతా కూడా వరుసగా రెండో ఏడాది కార్తీక్ నాయకత్వంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గత ఏడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విలియమ్సన్ నేతృత్వంలోనే బరిలోకి దిగుతోంది. వార్నర్ రాకతో జట్టు బలం పెరిగిందనడంలో సందేహం లేదు. ఇక తొలి సీజన్ తర్వాత మళ్లీ ఆ మెరుపులు చూపించని రాజస్తాన్ రాయల్స్ కూడా రేసులో ఉంది. రహానే కెప్టెన్సీకి తోడు స్టీవ్ స్మిత్ రావడం జట్టుకు మేలు చేయవచ్చు. తొలి సీజన్‌నుంచి లీగ్‌లో ఉన్నా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని మూడు జట్ల బాధ వేరు! పేరునుంచి మొదలు పెట్టి ఆటగాళ్లు, సిబ్బంది సహా ఎన్నో మార్పులు చేసిన ఢిల్లీకి ఈ సారైనా అదృష్టం కలిసొస్తుందా చూడాలి. గత ఏడాది ఆరంభంలో చెలరేగిపోయి విశ్రాంతి తర్వాత వరుస ఓటములు ఎదుర్కొన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మళ్లీ అలాంటి తప్పు చేయరాదని భావిస్తోంది. ఇక అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా, టీమిండియాకు కెప్టెన్‌గా తిరుగు లేని విజయాలు అందిస్తున్న విరాట్ కోహ్లికి మాత్రం ఐపీఎల్ టైటిల్ లోటుగా ఉండిపోయింది. ఎనిమిదేళ్లు ప్రయత్నించినా అతను సఫలం కాలేకపోయాడు. అతని టి20 నాయకత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈసారి జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. మొత్తంగా తుది విజేతగా ఎవరు నిలిచినా... ఐపీఎల్లో అభిమానుల వినోదానికి మాత్రం వంద శాతం గ్యారంటీ ఖాయం! మలింగ ఔట్! ఐపీఎల్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్‌కు ఎదురు దెబ్బ తగిలింది. అత్యంత అనుభవజ్ఞుడైన పేసర్ లసిత్ మలింగ టోర్నీకి దూరమయ్యాడు. శ్రీలంక దేశవాళీ వన్డే టోర్నీ ‘సూపర్ ప్రొవిన్షియల్ టోర్నమెంట్’లో ఆడితేనే ప్రపంచ కప్ జట్టుకు పరిగణలోకి తీసుకుంటామని లంక బోర్డు ఆటగాళ్లకు హుకుం జారీ చేసింది. దాంతో అందులో పాల్గొనేందుకు మలింగ సిద్ధమయ్యాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన రైనా ఇప్పటివరకు 176 మ్యాచ్‌లు ఆడి 4,985 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రైనా తర్వాతి స్థానాల్లో కోహ్లి (బెంగళూరు; 4948 పరుగులు), రోహిత్ (ముంబై ఇండియన్స్; 4493 పరుగులు) ఉన్నారు. ఐపీఎల్లో మొత్తం 52 సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి 12 సెంచరీలు వచ్చాయి. మరో ఐదు క్యాచ్‌లు పడితే సురేశ్ రైనా ఐపీఎల్లో 100 క్యాచ్‌లు పట్టిన తొలి ఫీల్డర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ జాబితాలో 95 క్యాచ్‌లతో రైనా అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (79), డివిలియర్స్ (78) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ లసిత్ మలింగ. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ శ్రీలంక క్రికెటర్ ఇప్పటివరకు 110 మ్యాచ్‌లు ఆడి 154 వికెట్లు తీశాడు. తర్వాతి స్థానాల్లో అమిత్ మిశ్రా (ఢిల్లీ ; 146 వికెట్లు), పీయూష్ చావ్లా (కోల్‌కతా నైట్‌రైడర్స్; 140 వికెట్లు) ఉన్నారు. ఐపీఎల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టు ముంబై ఇండియన్స్. ఆ జట్టు ఇప్పటివరకు 171 మ్యాచ్‌లు ఆడి 97 విజయాలు నమోదు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ 148 మ్యాచ్‌లు ఆడి 90 విజయాలతో రెండో స్థానంలో... కోల్‌కతా నైట్‌రైడర్స్ 164 మ్యాచ్‌లు ఆడి 86 విజయాలతో మూడో స్థానంలో ఉన్నాయి. మరో ఎనిమిది సిక్స్‌లు కొడితే క్రిస్ గేల్ కేవలం ఐపీఎల్‌లోనే 300 సిక్సర్ల మైలురాయిని అందుకుంటాడు. 112 మ్యాచ్‌లు ఆడిన గేల్ ఖాతాలో 292 సిక్సర్లున్నాయి. 187 సిక్సర్లతో డివిలియర్స్ రెండో స్థానంలో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్‌నకు ముందు అలసటకు గురి కాకుండా ఉండేందుకు నేను కూడా ఐపీఎల్లో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇది వ్యక్తిగత విషయం. ఫిట్‌నెస్‌కు సంబంధించి చిన్నపాటి ఇబ్బంది ఉన్నా సరే ఆటగాళ్లు సమాచారం అందించి దానికి అనుగుణంగా తమ ప్రణాళికను రూపొందించుకోవాలి. ఫిట్‌గా లేకుంటే పూర్తిగా మ్యాచ్‌కు దూరం కావాలే తప్ప ఒకసారి బరిలోకి దిగితే వంద శాతం శ్రమించాలి. ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ఇంత కాలం ఆర్సీబీ కెప్టెన్‌గా కొనసాగడం అదృష్టమేనని గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోను. బయట ఉన్నవారి ఆలోచనల ప్రకారమే నేను కూడా పని చేస్తే కనీసం ఐదు మ్యాచ్‌లు కూడా ఆడకుండా ఇప్పటికే ఇంట్లో కూర్చునేవాడిని. ఇలాంటి విషయాల గురించి మాట్లాడే అవకాశం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారని నాకు తెలుసు. కానీ నా బాధ్యతలేమిటో బాగా తెలుసు. కెప్టెన్‌గా నేను కూడా ఐపీఎల్ గెలవాలనే కోరుకుంటా. అందుకోసం నేను చేయగలిగినంత చేస్తున్నా. కానీ కొన్నిసార్లు అనుకున్నవి జరగవు. అయినా ఐపీఎల్ విజయంతోనే నా గురించి మాట్లాడతారంటే అలాంటివి నేను పట్టించుకోను. –విరాట్ కోహ్లి, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ -
మాకొద్దీ యోయో టెస్టు!
చెన్నై: ఐపీఎల్ బరిలోకి దిగబోతున్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ‘ఓల్డేజ్ హోం’గా చెప్పవచ్చు. ధోని (37 ఏళ్లు), బ్రేవో (35), డు ప్లెసిస్ (34), హర్భజన్ (38), రాయుడు (33), మురళీ విజయ్ (34), వాట్సన్ (37), జాదవ్ (33), తాహిర్ (39 ఏళ్లు)లతో ఈ జాబితా బాగా పెద్దగానే ఉంది. గత ఏడాది జట్టును విజేతగా నిలపడంలో వీరిలో చాలా మంది కీలక పాత్ర పోషించినా... ఫిట్నెస్ పరంగా అందరూ అంతంత మాత్రమే. వీరందరికీ ‘యోయో టెస్టు’ పెడితే ఫలితాలు ఎలా ఉండవచ్చో ఊహించుకోవచ్చు! బహుశా ఇదే కారణంతో కావచ్చు చెన్నై తమ ఆటగాళ్లకు యోయో టెస్టు ఉండదని ప్రకటించేసింది. టీమిండియాకు ఇది తప్పనిసరిగా మారినా, అందరూ అదే అమలు చేయాల్సిన అవసరం లేదని చెన్నై ట్రైనర్ రాంజీ శ్రీనివాసన్ అన్నాడు. ఫుట్‌బాల్‌లాంటి ఆటలకు మాత్రమే అది అవసరం ఉంటుందని అతను తేల్చి చెప్పాడు. యోయోకు బదులుగా తమ ఆటగాళ్లను పరీక్షించేందుకు 2 లేదా 2.4 కిలోమీటర్ల పరుగు మాత్రమే నిర్వహిస్తున్నామని రాంజీ వెల్లడించారు. ‘బోల్ట్ స్ప్రింట్ చేస్తే నేను కూడా అదే చేయాలని లేదు. కోహ్లి చేసే ఎక్స్‌ర్‌సైజ్‌లు మరొకరికి సాధ్యం కాకపోవచ్చు. అందరు ఆటగాళ్లు భిన్నంగా ఉంటారని తెలుసుకోవాలి. కాబట్టి యోయో అందరికీ అవసరం లేదని గుర్తించాం’ అని ఆయన స్పష్టం చేశారు. -
చెన్నై చమక్...
సార్వత్రిక ఎన్నికల కారణంగా 2009లో దేశం నుంచి దక్షిణాఫ్రికాకు తరలి వెళ్లిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2010లో పుట్టింటికి వచ్చింది. ఈ సీజన్లో కొత్తగా ఐదు వేదికలు చేరాయి. తెలంగాణ ఉద్యమం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో డిఫెండింగ్ చాంపియన్ దక్కన్ చార్జర్స్ తమ మ్యాచ్‌లను సొంత వేదిక హైదరాబాద్ నుంచి తరలించింది. ఆ మ్యాచ్‌లను నాగ్‌పూర్, కటక్, ముంబైలలో ఏర్పాటు చేసుకుంది. తొలిసారిగా ఈ సీజన్‌లోని ఐపీఎల్ మ్యాచ్‌లను యూట్యూబ్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సెమీఫైనల్స్, ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లను దేశంలోని సినిమా హాల్స్‌లో త్రీడి మాధ్యమంలో ప్రసారం చేశారు. ఈ టోర్నీ విశేషాలను పరిశీలిస్తే.... రెండో ప్రయత్నంలో సఫలం... వరుసగా మూడో సీజన్లోనూ సెమీఫైనల్‌కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్ రెండో ప్రయత్నంలో టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలి సీజన్ ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడిన చెన్నై... రెండో సీజన్లో సెమీఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో పరాజయం పాలైంది. మూడో సీజన్లో మాత్రం చెన్నై ‘సూపర్ కింగ్స్’లా ఆడి చాంపియన్‌గా నిలిచింది. తొలిసారి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్‌తో జరిగిన టైటిల్ పోరులో చెన్నై 22 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసి ఓడిపోయింది. లీగ్ దశలో ముంబై (20 పాయింట్లు), దక్కన్ చార్జర్స్ (16 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలువగా... చెన్నై, బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ 14 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా చెన్నై, బెంగళూరు సెమీఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయి. సెమీఫైనల్స్‌లో బెంగళూరుపై ముంబై ఇండియన్స్ 35 పరుగుల తేడాతో... దక్కన్ చార్జర్స్‌పై చెన్నై 38 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించాయి. చాంపియన్స్ లీగ్ బెర్త్ కోసం సెమీఫైనల్లో ఓడిన దక్కన్ చార్జర్స్, బెంగళూరు జట్ల మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ నిర్వహించగా... బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఈ సీజన్లో అత్యధికంగా నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. యూసుఫ్ పఠాన్ (రాజస్తాన్ రాయల్స్), డేవిడ్ వార్నర్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్), జయవర్ధనే (కింగ్స్ ఎలెవన్ పంజాబ్), మురళీ విజయ్ (చెన్నై సూపర్ కింగ్స్) ఒక్కో సెంచరీ చేశారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూసుఫ్ పఠాన్ కేవలం 37 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేయడం విశేషం. లీగ్ మొత్తంలో ఒకటే ‘హ్యాట్రిక్’ నమోదైంది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు బౌలర్ ప్రవీణ్ కుమార్ హ్యాట్రిక్ సాధించాడు. వీరు గుర్తున్నారా! విజేత జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌లో జార్జి బెయిలీ, బొలింజర్, హేడెన్, మైకేల్ హస్సీ, జస్టిన్ కెంప్, ముత్తయ్య మురళీధరన్, మఖాయ ఎన్తిని, తిసారా పెరీరా, అల్బీ మోర్కెల్, జాకబ్ ఓరమ్ విదేశీ ఆటగాళ్లు కాగా... ధోని, మురళీ విజయ్, సుదీప్ త్యాగి, రైనా, పార్థివ్ పటేల్, బాలాజీ, మన్‌ప్రీత్ గోనీ, బద్రీనాథ్, హేమంగ్ బదాని భారత్ సీనియర్ జట్టుకు ఆడినవారు. ఇదే జట్టులోని అనిరుధ, అరుణ్ కార్తీక్, షాదాబ్ జకాటి, చంద్రశేఖర్ గణపతిలకు టీమిండియా తరఫున ఆడే అవకాశం ఎప్పుడూ రాలేదు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ సచిన్ టెండూల్కర్ (ముంబై ఇండియన్స్; 15 మ్యాచ్‌ల్లో 618 పరుగులు). అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్) సచిన్ టెండూల్కర్ అత్యధిక వికెట్లు (పర్పుల్ క్యాప్) ప్రజ్ఞాన్ ఓజా (దక్కన్ చార్జర్స్–21 వికెట్లు). -
ఐపీఎల్ వచ్చేసింది
వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ స్టంప్స్‌ను గాల్లో గిరాటేస్తే గానీ తాను వరల్డ్ బెస్ట్ బౌలర్‌ను కాలేనంటున్నాడు బుమ్రా... కెప్టెన్‌నే స్లెడ్జ్ చేస్తావా, ఎలాగైతేనేం అదీ నేర్చుకున్నావు అంటూ కోహ్లి జవాబు... మీ జట్టుపైనే విరుచుకు పడతానంటూ గురువుకే సవాల్విసురుతున్న పంత్... అప్పట్లో నేనూ నీలాగే ఉండేవాడిని, చూసుకుందాం రమ్మంటూ ధోని పిలుపు... ప్రకటనలు, థీమ్ సాంగ్‌లు, ప్రమోషన్లు... ఒకవైపు భారత్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ నడుస్తుండగానే మరో వైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి మొదలైంది. రేపు ఆఖరి మ్యాచ్ ముగిస్తే చాలు... టీమిండియా సభ్యులు తమ సహచరులపైనే కత్తులు దూసేందుకు ప్రతీ ఏడాదిలాగే సిద్ధమైపోతారు. జయహో అంటూ భారత్ విశ్వ సమరానికి వెళ్లే ముందే ఈనెల 23 నుంచి వేసవి వినోదం అందించేందుకు మరోసారి క్రికెట్ అభిమానుల పండగ ఐపీఎల్ వచ్చేసింది. అన్ని జట్లు అందుబాటులో ఉన్న క్రికెటర్లతో ఇప్పటికే జోరుగా సన్నాహాలు సాగిస్తుండగా, స్టార్ ఆటగాళ్లు కూడా వారితో చేరితే అందరి కళ్లూ లీగ్ వైపే నిలుస్తాయి. మరో 11 రోజుల్లో ‘ఆట తప్ప మాటలొద్దు’ అంటూ లీగ్ సంబరాలు షురూ కానున్న నేపథ్యంలో గత 11 ఐపీఎల్ టోర్నీల ఫలితాల విశేషాలు.... బిగ్ బ్యాంగ్... ఏప్రిల్ 18, 2008... ఐపీఎల్ చరిత్రలో మరచిపోలేని తేదీ. ఒక కొత్త టోర్నీకి ఎలాంటి ఆరంభం లభిస్తే అది సూపర్ డూపర్ హిట్ అవుతుందో ఆ రోజు అలాంటి మ్యాచ్‌తోనే లీగ్ మొదలైంది. బెంగళూరుతో మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్ 73 బంతుల్లోనే 10 ఫోర్లు, 13 సిక్సర్లతో అజేయంగా 158 పరుగులు చేసి ప్రేక్షకులకు మజా అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో టి20 రుచిమరిగిన అభిమానులను ఇప్పటికీ ఐపీఎల్ మత్తులోనే ముంచెత్తుతోంది. మరచిపోలేని చెంపదెబ్బ! తొలి ఐపీఎల్లో ఆటతో పాటు అత్యంత వివాదంగా నిలిచిన అంశం శ్రీశాంత్‌ను హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టడం... అతను చిన్న పిల్లాడిలా భోరున ఏడ్వడం! లీగ్‌లో పంజాబ్, ముంబై మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటగాళ్లు ఒకరికి మరొకరు షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో శ్రీశాంత్ నుంచి ఎలాంటి కవ్వింపు లేకుండా భజ్జీ కొట్టాడని విచారణలో రిఫరీ నిర్ధారించారు. దాంతో మిగిలిన 11 లీగ్ మ్యాచ్‌లు ఆడకుండా భజ్జీపై నిషేధం విధించారు. ఘట న జరిగిన మ్యాచ్ ఫీజు లో కూడా 100 శాతం కోత విధించారు. కేవలం తొలి రెండు మ్యాచ్‌లకే ఫీజు అందుకున్న భజ్జీఈ ఘటనతో భారీగా నష్టపోయాడు కూడా. ఫైనల్ ఫలితం... సెమీస్‌లో పంజాబ్‌ను ఓడించి చెన్నై, ఢిల్లీని ఓడించి రాజస్తాన్ ఫైనల్ చేరాయి. ముందుగా చెన్నై 5 వికెట్లకు 163 పరుగులు చేయగా, రాజస్తా న్ 7 వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు చేయాల్సి ఉండగా ఆఖరి బంతికి రాయల్స్‌కు గెలుపు దక్కింది. బ్యాటింగ్‌లో 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు తీసిన యూసుఫ్ పఠాన్ ‘మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్’గా నిలిచాడు. చార్జర్స్ అట్టడుగున... టోర్నీలో హైదరాబాద్ జట్టు దక్కన్ చార్జర్స్ ఘోరంగా విఫలమైంది. ఆడిన 14 లీగ్ మ్యాచ్‌లలో కేవలం 2 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్ట చివరన నిలిచింది. జట్టు తరఫున గిల్‌క్రిస్ట్ (436), రోహిత్ శర్మ (404) పరుగుల పరంగా టాపర్లుగా నిలవగా... ఆర్పీ సింగ్ 15, ప్రజ్ఞాన్ ఓజా 11 వికెట్లు తీశారు. రాజస్తాన్ రాయల్స్ రాజసం 2008 నుంచి 2018 వరకు 11 ఐపీఎల్ టోర్నీలు జరిగాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చెరో 3 సార్లు టైటిల్ సొంతం చేసుకొని తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు సార్లు విజేతగా నిలవగా... రెండు వేర్వేరు పేర్లతో హైదరాబాద్ జట్లు దక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ జట్లు ఒక్కోసారి టోర్నీని గెలుచుకున్నాయి. అయితే అనూహ్యంగా, అంచనాలు లేకుండా, స్టార్ ఆటగాళ్ల బలగం లేకుండా రాజస్తాన్ 2008 టైటిల్ సాధించడం విశేషం. పొట్టి క్రికెట్‌కు కొత్త ఊపు తెచ్చిన టోర్నమెంట్ తొలి టైటిల్‌ని సొంతం చేసుకున్న టీమ్‌గా షేన్ వార్న్ నాయకత్వంలోని రాయల్స్ ఘనత వహించింది. ఈ టోర్నీ విశేషాలను గుర్తు చేసుకుంటే... టీమ్ గుర్తుందా! రాజస్తాన్ టైటిల్ గెలిచిన జట్టు సభ్యులలో 19 మంది లీగ్‌లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడారు. వీరిలో అంతర్జాతీయ క్రికెటర్లు షేన్ వార్న్, గ్రేమ్ స్మిత్, షేన్ వాట్సన్, కమ్రాన్ అక్మల్, సొహైల్ తన్వీర్, డారెన్ లీమన్, మస్కరెన్హాస్, యూనిస్ ఖాన్‌లను వదిలిస్తే... యూసుఫ్ పఠాన్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ కైఫ్, మునాఫ్ పటేల్ భారత్ తరఫున తమ ముద్ర చూపించిన ఆటగాళ్లు. పంకజ్ సింగ్ 2 టెస్టులు, 1 వన్డే ఆడగా... నీరజ్ పటేల్, స్వప్నిల్ అస్నోడ్కర్, దినేశ్ సాలుంఖే, మహేశ్ రావత్, తరువర్ కోహ్లి, సిద్ధార్థ్ త్రివేది ఎప్పుడూ జాతీయ జట్టులోకి ఎంపిక కాలేకపోయారు. శతకవీరులు లీగ్‌లో మొత్తం ఆరు సెంచరీలు నమోదైతే నాలుగు ఆస్ట్రేలియన్లే చేశారు. మెకల్లమ్, సైమండ్స్, హస్సీ, షాన్ మార్‡్ష, గిల్‌క్రిస్ట్‌లతో పాటు సనత్ జయసూర్య సెంచరీ సాధించాడు. టోర్నీలో జయసూర్య మొత్తం 31 సిక్సర్లతో టాపర్‌గా నిలవడం విశేషం. పాకిస్తాన్ ఒకే ఒక్కసారి... తొలి ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. అయితే అదే ఏడాది 9/11 ముంబై దాడి తర్వాత వారు లీగ్‌లో పాల్గొనకుండా నిషేధం విధించారు. దాంతో 2008లో ఆడిన షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, మొహమ్మద్ ఆసిఫ్, సల్మాన్ బట్, ఉమర్ గుల్, మొహమ్మద్ హఫీజ్, షోయబ్ అక్తర్, కమ్రాన్ అక్మల్, సొహైల్ తన్వీర్, యూనిస్ ఖాన్, మిస్బావుల్ హక్ మళ్లీ ఐపీఎల్లో కనిపించలేదు. -
విరాట్ వీరోచితం సరిపోలేదు
లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి సెంచరీ చేయడం... భారత్ గెలవకపోవడమా! గతంలో 24 శతకాల్లో మూడు సార్లు మాత్రమే ఇలా జరిగింది. ఇది శుక్రవారం రాంచీలో మళ్లీ చోటు చేసుకుంది. తనకే సాధ్యమైన రీతిలో వరుసగా మరో శతకంతో భారత కెప్టెన్ మెరిసినా చివరకు విజయానందం మాత్రం దక్కలేదు. ముందుగా బ్యాటింగ్‌లో, ఆ తర్వాత బౌలింగ్‌లో స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా తొలి విజయంతో వన్డే సిరీస్‌లో నిలిచింది. ఖాజా తొలి సెంచరీ, ఫించ్ చక్కటి బ్యాటింగ్ ఆ జట్టు ఇన్నింగ్స్‌కు ఊపిరి పోస్తే... 314 పరుగుల లక్ష్యాన్ని చేరే ప్రయత్నంలో కోహ్లి మినహా మరే బ్యాట్స్‌మన్ కూడా కనీసం 40 పరుగులు చేయలేకపోవడం టీమిండియా ఓటమికి కారణమైంది. సొంత అభిమానుల మధ్య చివరి మ్యాచ్‌లో వారి జయజయధ్వానాల మధ్య బరిలోకి దిగిన ధోని ఆటగాడిగా మాత్రం అద్భుతం చేయలేకపోయాడు. రాంచీ: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సొంతం చేసుకునే లక్ష్యంతో మూడో వన్డే బరిలోకి దిగిన భారత్‌కు నిరాశే ఎదురైంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 32 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉస్మాన్ ఖాజా (113 బంతుల్లో 104; 11 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (99 బంతుల్లో 93; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు 193 పరుగులు జోడించడం విశేషం. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా తనవంతు పాత్ర పోషించగా, కుల్దీప్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 48.2 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లి (95 బంతుల్లో 123; 16 ఫోర్లు, 1 సిక్స్) వన్డేల్లో 41వ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్సన్, కమిన్స్, జంపా తలా 3 వికెట్లు తీశారు. భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం... భారత బౌలర్ల అరుదైన వైఫల్యంతో ఈ పర్యటనలో ఎట్టకేలకు ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభం అందించగలిగారు. ఫించ్ ఫామ్‌లోకి రాగా, ఖాజా మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఫించ్ రెండు ఫోర్లు కొట్టగా... అదే ఓవర్లో ఫించ్ ఎల్బీడబ్ల్యూ కోసం డీఆర్ఎస్ను ఆశ్రయించిన భారత్ తమ రివ్యూను కూడా కోల్పోయింది. జడేజా తొలి ఓవర్లో ఖాజా స్కోరు 17 వద్ద ధావన్ క్యాచ్ వదిలేయడం కూడా ఆసీస్‌కు కలిసొచ్చింది. పవర్‌ప్లే ముగిసేసరికి ఆసీస్ స్కోరు 52 పరుగులకు చేరింది. ‘ట్రంప్‌కార్డ్’ జాదవ్ ఓవర్లో ఫించ్ పండగ చేసుకున్నాడు. వరుస బంతుల్లో 6, 4, 6 బాదిన అతను 51 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కొద్ది సేపటికే ఖాజా హాఫ్ సెంచరీ (56 బంతుల్లో) కూడా పూర్తయింది. మరికొన్ని చక్కటి షాట్ల తర్వాత సెంచరీకి చేరువవుతున్న తరుణంలో వివాదాస్పద నిర్ణయంతో ఫించ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్ తనదైన శైలిలో చెలరేగి స్కోరు జోరును కొనసాగించాడు. జడేజా ఓవర్లో అతను వరుసగా 6, 4, 4 బాదాడు. అదే ఓవర్లో ఫైన్‌లెగ్ దిశగా సింగిల్ తీసి ఖాజా తన కెరీర్లో తొలి శతకాన్ని అందుకున్నాడు. అయితే వెంటనే షమీ బౌలింగ్‌లో అతను ఔటయ్యాడు. 40 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు 244 పరుగులు. ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నాయి. ఈ స్థితినుంచి భారత బౌలింగ్ ఒక్కసారిగా కట్టుదిట్టంగా మారిపోయింది. జడేజా చక్కటి ఫీల్డింగ్‌కు ధోని చురుకుదనం తోడై మ్యాక్స్‌వెల్ రనౌట్ కాగా...కుల్దీప్ ఒకే ఓవర్లో షాన్ మార్‡్ష (7), హ్యాండ్స్కోంబ్ (0)లను ఔట్ చేశాడు. స్టొయినిస్ (26 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు), అలెక్స్ క్యారీ (17 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) ఆరో వికెట్‌కు అభేద్యంగా 50 పరుగులు జోడించినా... చివరి పది ఓవర్లలో ఆసీస్ 69 పరుగులే చేయగలిగింది. కొనసాగిన కోహ్లి జోరు... ఛేదనలో భారత బ్యాటింగ్ కూడా తడబడింది. 27 పరుగులకే జట్టు 3 వికెట్లు కోల్పోయింది. తన తొలి రెండు ఓవర్లను మెయిడిన్‌గా వేసిన రిచర్డ్సన్... ధావన్ (1) వికెట్ కూడా తీశాడు. ఆ తర్వాత కమిన్స్ వరుసగా రెండు ఓవర్లలో రోహిత్ (14), అంబటి రాయుడు (2)లను ఔట్ చేశాడు. ఈ దశలో కోహ్లి, ధోని (42 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును ఆదుకున్నారు. సొంత ప్రేక్షకుల సమక్షంలో ధోని కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. రిచర్డ్సన్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అనంతరం లయన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా ధోని కొట్టిన భారీ సిక్సర్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. అయితే జంపా వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని మాజీ కెప్టెన్ నిష్క్రమించడంతో రాంచీ మైదానం ఒక్కసారిగా మూగబోయింది. మరోవైపు కోహ్లి మాత్రం తన స్థాయికి తగిన ఆటతో స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఆసీస్ జట్టులో బలహీన బౌలర్ అయిన స్టొయినిస్ వేసిన వరుస రెండు ఓవర్లలో కలిపి అతను 5 ఫోర్లు బాదడం విశేషం. కోహ్లికి సహకరించిన జాదవ్ (39 బంతుల్లో 26; 3 ఫోర్లు)ను జంపా ఔట్ చేయడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో 98 పరుగుల వద్ద కీపర్ క్యారీ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి అదే ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ దిశగా రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జంపా ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అనంతరం మరో షాట్‌కు ప్రయత్నించి క్లీన్‌బౌల్డ్ కావడంతో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో విజయ్ శంకర్ (30 బంతుల్లో 32; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (31 బంతుల్లో 24; 1 సిక్స్) కొంత పోరాడినా లాభం లేకపోయింది. ‘ఆర్మీ’ క్యాప్లతో బరిలోకి... పుల్వామా ఘటనలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లకు భారత క్రికెటర్లు తమదైన రీతిలో నివాళులు అర్పించారు. మూడో వన్డేలో జట్టు సభ్యులంతా ఆర్మీ అధికారులు ధరించే ‘క్యామోఫ్లాగ్’ క్యాప్‌లు ధరించి బరిలోకి దిగారు. బీసీసీఐ లోగోతో ఉన్న ఈ క్యాప్‌ను నైకీ ప్రత్యేకంగా రూపొందించింది. రాంచీ వన్డే ద్వారా తమకు లభించే మ్యాచ్ ఫీజు మొత్తాన్ని (సుమారు కోటి రూపాయలు) కూడా ‘జాతీయ రక్షణ నిధి’కి అందిస్తున్నట్లు కెప్టెన్ కోహ్లి ప్రకటించాడు. ‘ప్రత్యేక క్యాప్’ను ధరించే విషయంలో నిబంధనల గురించి ఐసీసీకి బీసీసీఐ ముందుగానే సమాచారం అందించి అనుమతి పొందింది. వాస్తవానికి మహేంద్ర సింగ్ ధోనిదే ఈ ఆలోచన. భారత సైన్యంలో గౌరవ హోదాలో లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్న అతనే స్వయంగా జట్టు సహచరులకు క్యాప్‌లు అందించాడు. కామెంటరీ బృందంలో ఉన్న గావస్కర్, మంజ్రేకర్ తదితర భారత మాజీలు కూడా ఇవే క్యాప్‌లను ధరించారు. టాస్కు డయానా ఎడుల్జీ... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ క్రికెటర్, ప్రస్తుత సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీని బీసీసీఐ టాస్ వేసే కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించింది. టాస్ వేసేందుకు కోహ్లికి ఎడుల్జీ నాణెం అందించింది. 63 ఏళ్ల ఎడుల్జీ భారత్ తరఫున 20 టెస్టులు, 34 వన్డేలు ఆడింది. రాత్రి 7.30 సమయంలో మంచు ప్రభావం చూపిస్తుందని మాకు ఎవరో చెప్పారు. అందుకే ముందు బౌలింగ్ ఎంచుకున్నా. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆరంభంలోనే ఇలా మేం వికెట్లు కోల్పోలేదు. మూడేసి వికెట్లు తక్కువ వ్యవధిలో పడిపోవడం సిరీస్‌లో రెండు సార్లు జరిగింది. ఇకపై ఇలా కుప్పకూలిపోవడాన్ని చూడదల్చుకోలేదు. తర్వాతి మ్యాచ్‌లకు మార్పులు ఖాయం. నేను ఆడిన చక్కటి ఇన్నింగ్స్‌లలో ఇది కూడా ఒకటి. – కోహ్లి చివరి 2 వన్డేలకు ధోని దూరం ఆస్ట్రేలియాతో జరిగే తర్వాతి రెండు వన్డేలలో ఎమ్మెస్ ధోని బరిలోకి దిగడం లేదు. ఈ మ్యాచ్‌ల నుంచి అతను విశ్రాంతి కోరాడని భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ నిర్ధారించాడు. వరల్డ్ కప్ తర్వాత రిటైరయ్యే అవకాశం ఉండటంతో... తన స్వస్థలం రాంచీలో మూడో వన్డే ఆడిన ధోనికి బహుశా స్వదేశంలో ఇదే చివరి మ్యాచ్ కావచ్చు. ధోని గైర్హాజరులో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్‌ను ఆడించే అవకాశం ఉంది. తర్వాతి మ్యాచ్‌లలో కచ్చితంగా మార్పులు ఉంటాయని కెప్టెన్ కోహ్లి ఇప్పటికే ప్రకటించాడు. -
ధోని జెర్సీ సైజు తగ్గింది!
సాక్షి, హైదరాబాద్: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటపైనే కాకుండా... పెరుగుతున్న వయసు కారణంగా అతని ఫిట్‌నెస్‌పై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ధోని తాను మరింత ఫిట్‌గా మారినట్లు చెప్పుకొచ్చాడు. టీమిండియా కొత్త జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘నా శరీరాన్ని మరింత ఫిట్‌గా ఉంచుకునేందుకు శ్రమించాను. ఇప్పటి వరకు గీఔ సైజు జెర్సీతో భారీగా కనిపించేవాడిని. ఇప్పుడు అది ఔకు మారింది. ఇకపై దీనిని కొనసాగిస్తా’ అని అతను అన్నాడు. ఇదే తరహాలో స్పందించిన కెప్టెన్ కోహ్లి తాను చాలా కాలంగా ఔ వాడుతున్నానని, అది ఇకపై మారదని సరదాగా వ్యాఖ్యానించాడు. 2008 అండర్–19 ప్రపంచ కప్‌లో తాను అడగకుండానే ‘18’ నంబర్ జెర్సీ ఇచ్చారని... వరల్డ్ కప్ గెలుచుకోవడంతో పాటు తర్వాతా కలిసి రావడంతో అదే నంబర్‌ను కొనసాగించాను తప్ప ప్రత్యేక కారణమేదీ లేదని కోహ్లి వెల్లడించాడు. మరిన్ని ప్రత్యేకతలతో... భారత క్రికెట్ జట్టు అపెరల్ పార్ట్నర్ ‘నైకీ’ వచ్చే సీజన్ కోసం టీమిండియా సభ్యులకు కొత్త జెర్సీని రూపొందించింది. శుక్రవారం దీని ఆవిష్కరణ జరిగింది. నేటినుంచి జరిగే ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో పాటు రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో కూడా భారత ఆటగాళ్లు ఇదే జెర్సీని ధరిస్తారు. గతంలోలాగే రీసైకిల్డ్ మెటీరియల్‌తో ‘నైకీ’ దీనిని తయారు చేసింది. కొత్త జెర్సీలో రెండు రకాల బ్లూ షేడ్స్ ఉన్నాయి. గత జెర్సీతో పోలిస్తే ఒక ప్రధానమైన మార్పు కొత్తదాంట్లో కనిపించింది. మూడు ప్రపంచకప్‌ల గెలుపునకు సంకేతంగా ఇప్పటి వరకు ఎదపై కనిపించిన మూడు ‘స్టార్లు’ ఇకపై కాలర్ లోపలి వైపు కనిపిస్తాయి. పైగా తొలిసారి ఆ మూడు వరల్డ్ కప్ విజయాల (1983, 2007, 2011) తేదీలు, ఫైనల్ మ్యాచ్‌ల్లో భారత్ చేసిన స్కోర్లు దానిపై ముద్రించారు. అంతే కాకుండా ఆ మూడు ఫైనల్స్ వేదికలు లార్డ్స్, వాండరర్స్, వాంఖడే మైదానాల భౌగోళిక స్థితి (అక్షాంశాలు–రేఖాంశాలు) కూడా దీనిపై ముద్రించడం మరో విశేషం. కార్యక్రమంలో కోహ్లి, ధోనిలతో పాటు మహిళా క్రికెటర్లు హర్మన్, జెమీమా... టెస్టు ఆటగాళ్లు రహానే, పృథ్వీ షా కూడా పాల్గొన్నారు. -
ధోని( vs) కోహ్లి
న్యూఢిల్లీ: జనరంజక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. బీసీసీఐ ఈ మేరకు రెండు వారాల (మార్చి 23– ఏప్రిల్ 5) షెడ్యూల్‌ను ప్రకటించింది. 8 వేదికల్లో 17 మ్యాచ్‌లు జరుగుతాయి. దీనిప్రకారం తొలి మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను విరాట్ కోహ్లి సారథ్యంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఢీ కొంటుంది. సంప్రదాయం ప్రకారం గత ఏడాది విజేత సొంతగడ్డ అయిన చెన్నైలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఎన్నికల తేదీల ఆధారంగా... ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు ఉండటంతో లీగ్‌కు 15 రోజుల ముందే తెరలేస్తోంది. మరోవైపు త్వరలో వెలువడనున్న ఎన్నికల షెడ్యూల్ ఆధారంగా... ఇప్పుడు ప్రకటించిన మ్యాచ్‌ల ప్రణాళికల్లో మార్పులు ఉంటాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ‘ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక పరిస్థితిని బోర్డు సమీక్షిస్తుంది. పోలింగ్ తేదీల ఆధారంగా స్థానిక సంఘాలను సమన్వయం చేసుకుంటూ లీగ్ షెడ్యూల్‌పై చర్చిస్తుంది’ అని ఆయన తెలిపారు. మూడు రోజులు రెండేసి మ్యాచ్‌లు మార్చి 24, 30, 31 తేదీల్లో రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి. ఢిల్లీ క్యాపిటల్స్ (3 సొంతగడ్డపై), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (3 ప్రత్యర్థి వేదికలపై) ఐదేసి మ్యాచ్‌లు ఆడనుండగా, మిగతా జట్లు నాలుగు మ్యాచ్‌లు (రెండు సొంతగడ్డపై, రెండు ప్రత్యర్థి వేదిలకపై) ఆడతాయి. రెండు మ్యాచ్‌లు ఉన్న తేదీల్లో ఏ మ్యాచ్ ఏ సమయానికి ప్రారంభం అవుతుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో తొలి మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 8 గంటలకు మొదలయ్యేవి. బీసీసీఐ ఈసారీ ఇదే పద్ధతి అనుసరిస్తుందా? లేక మార్పేమైనా చేస్తుందా? చూడాలి. హైదరాబాద్ తొలి మ్యాచ్ 24న... గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి తమ తొలి మ్యాచ్‌ను మార్చి 24న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడతుంది. సొంత నగరం హైదరాబాద్‌లో 29వ తేదీన రాజస్తాన్ రాయల్స్‌తో, 31న బెంగళూరుతో తలపడుతుంది. -
ఒకటే స్థానం ఖాళీ!
వన్డే వరల్డ్ కప్ ఫేవరెట్లలో ఒకటిగా భారత జట్టు బరిలోకి దిగబోతోంది. బలమైన బ్యాటింగ్ లైనప్, ఇంగ్లండ్ పిచ్‌లకు సరిపోయే పదునైన బౌలింగ్‌తో పాటు ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు మాయ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వన్డేల్లో టీమిండియా ఇటీవలి ప్రదర్శన చూస్తే సాధారణ క్రికెట్ అభిమానికి కూడా వరల్డ్ కప్ జట్టులో ఎవరెవరు ఉంటారో ఒక అంచనా వచ్చేసి ఉంటుంది. ఆసియా కప్ టైటిల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో సిరీస్ విజయాల తర్వాత టీమ్ కూర్పుపై సెలక్షన్ కమిటీకి కూడా మరింత స్పష్టత లభించింది. ఇదే అంశంపై సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ తన అభిప్రాయం వెల్లడించారు. ఐపీఎల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోబోమని... టీమ్ ఎంపికపై ఎలాంటి సందేహాలు లేకుండా మరింత స్పష్టతనిచ్చారు. ముంబై: వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక దాదాపుగా పూర్తయిందని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. 15 మంది సభ్యుల జట్టులో 14 మంది విషయంలో తాము దాదాపు నిర్ణయానికి వచ్చేశామని, మిగిలిన ఒకే ఒక స్థానం కోసం గట్టి పోటీ ఉందని ఆయన చెప్పారు. నిజానికి కొన్నాళ్ల క్రితం వరకు జట్టు ఎంపిక సాఫీగానే అనిపించిందని, అయితే ఇటీవల అవకాశం ఇచ్చిన కుర్రాళ్లంతా సత్తా చాటడంతో తమకు ‘ఆరోగ్యకరమైన తలనొప్పి’ మొదలైందని ప్రసాద్ వ్యాఖ్యానించారు. జట్టులో ధోని పాత్ర ఎంత కీలకమో కూడా ఆయన స్పష్టతనిచ్చారు. వరల్డ్ కప్‌కు సంబంధించి ప్రసాద్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... టీమ్ ఎంపికపై... వన్డేల్లో మన టీమ్ అద్భుత ప్రదర్శన తర్వాత వరల్డ్ కప్ టీమ్ ఎంపిక దాదాపుగా పూర్తయినట్లే. ఆఖరి క్షణంలో ఒక మార్పు మినహా మిగతా ఆటగాళ్ల గురించి ఎలాంటి సందేహం లేదు. సరిగ్గా చెప్పాలంటే ఒకటే స్థానం ఖాళీగా ఉంది. అది కూడా ఇటీవల కొత్త ఆటగాళ్ల చక్కటి ప్రదర్శన తర్వాత మా తుది ఎంపికపై పునరాలోచించుకోవాల్సి వచ్చింది. బహుశా స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత ఆ స్థానం ఖాయం అవుతుంది. 2011 వరల్డ్ కప్ తరహాలో సీనియర్లు, జూనియర్లతో జట్టు సమతూకంగా ఉంటుంది. అప్పుడు సచిన్, సెహ్వాగ్‌లే కాకుండా కోహ్లి, శ్రీశాంత్‌లాంటి కుర్రాళ్లూ ఉన్నారు. మిగిలిన స్థానానికి ఉన్న పోటీపై... చాలా మంది బరిలో ఉన్నారని మాత్రం చెప్పగలను. రిషభ్ పంత్, విజయ్ శంకర్, రహానేలతో పాటు కేఎల్ రాహుల్ కూడా ఇంకా రేసులోనే నిలిచారు. గత ఏడాది కాలంగా పంత్ అద్భుతంగా ఆడుతున్నాడు. తనకు లభించిన పరిమిత అవకాశాల్లోనే విజయ్ శంకర్ ఆకట్టుకున్నాడు. అతని ప్రదర్శన జట్టు కూర్పు గురించి మరో కోణంలో ఆలోచించేలా చేసింది. దేశవాళీ క్రికెట్లో రహానే పరుగుల వరద పారించాడు కాబట్టి అతడిని ఇంకా పూర్తిగా పక్కన పెట్టలేదు. వీరందరినీ దాటాలంటే రాహుల్ మిగిలిన కొద్ది సమయంలో మాత్రం భారీగా పరుగులు చేయాల్సి ఉంది. ఇప్పటికే నలుగురు ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, విజయ్ శంకర్ ఉన్నారు. వీరందరినీ తెలుసుకోలేం. వరల్డ్ కప్ కోసం కొన్ని లెక్కలను చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా 20 మందితో జాబితా మా ముందుంది. కాబట్టి వచ్చే ఐపీఎల్లో ప్రదర్శన ఎలా ఉన్నా దానిని మాత్రం ఎంపిక కోసం పరిగణనలోకి తీసుకోరాదని నిర్ణయించాం. మిడిలార్డర్ సమస్యలపై... ఇంగ్లండ్ గడ్డపై 1–2తో వన్డే సిరీస్ ఓడిపోయిన సమయంలో మా మిడిలార్డర్ సమస్యగా కనిపించింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌ల తర్వాత దానికి పరిష్కారం లభించినట్లే. మిడిలార్డర్ బాధ్యతల గురించి స్పష్టంగా వివరించి అవకాశాలు ఇచ్చిన వారందరూ తమ పాత్రకు న్యాయం చేయడం సంతోషకరం. ఇంకా చిన్న చిన్న లోపాలేమైనా ఉంటే ఆటగాళ్లే చూసుకుంటారు. నేను ఏ ఒక్కరి పేరు చెప్పను గానీ మిడిలార్డర్ సమస్య తీరినట్లుగానే భావిస్తున్నాం. రాయుడుపై విశ్వాసం ఉంచడంపై... మన మిడిలార్డర్ పటిష్టంగా ఉండాలి. నాలుగో స్థానంలో కోసం మేం ప్రయత్నించినవారి ఆట మాకు సంతృప్తి కలిగించలేదు. ఆ స్థానంలో అనుభవంతో పాటు పరిణతి అవసరం. టి20 ఫార్మాటే అయినా ఐపీఎల్ ప్రదర్శనతోనే రాయుడును వన్డేలకు ఎంపిక చేశాం. తనకు లభించిన అవకాశాలు చక్కగా ఉపయోగించుకున్న అతను, ఆ స్థానానికి సరైనవాడినేనని నిరూపించుకున్నాడు. ఇద్దరు స్పిన్నర్లపైనే నమ్మకం... వాస్తవానికి 2017 చాంపియన్స్ ట్రోఫీ తర్వాతి నుంచి మేం వరల్డ్ కప్ జట్టు నిర్మాణం గురించి ఆలోచించాం. ఆ టోర్నీలో భారత్ బాగానే ఆడి ఫైనల్ చేరింది. కానీ స్పిన్‌లో మరింత వైవిధ్యం ఉంటే బాగుంటుందని భావించాం. అందుకే చహల్, కుల్దీప్లకు అవకాశాలిచ్చాం. ఫలితాలు ఎలా ఉన్నాయో మీరే చూశారుగా. వీరిద్దరు కలిసి ఆడిన మ్యాచ్‌లలో భారత్ 70 శాతం (27 మ్యాచ్‌లలో 19 గెలిచి, 7 ఓడింది) విజయాలు సాధించింది. వారి వల్ల బౌలింగ్ బలం పెరిగింది. వరల్డ్ కప్ జరిగే సమయంలో ఇంగ్లండ్‌లో పిచ్‌లు బౌన్సీగా ఉంటాయి. అలాంటప్పుడు ఆఫ్ స్పిన్నర్లకంటే లెగ్ స్పిన్నర్లే ఎక్కువ ప్రభావం చూపుతారు కూడా. ధోని పాత్ర, అతని ప్రాధాన్యతపై... ధోని ఇప్పటికీ మ్యాచ్ విన్నర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరల్డ్ కప్‌లో కూడా అందరికంటే అతనే కీలకం కానున్నాడు. విరాట్ కోహ్లికి సలహాలివ్వడంలో గానీ వికెట్ కీపర్‌గా గానీ మైదానంలో కుర్రాళ్లకు మార్గనిర్దేశనం చేయడంలో గానీ అతడిని మించినవారు లేరు. ఇటీవల సిరీస్‌ల తర్వాత తన సహజశైలిలో దూకుడుగా ఆడతానని ధోని సందేశం ఇచ్చేశాడు. మనందరికీ తెలిసిన పాత తరహా ధోనిలా భారీ షాట్లతో చెలరేగితే మాకందరికీ ఆనందం. మధ్యలో మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల అతనిలో కొంత జోరు తగ్గి ఉండవచ్చు కానీ మళ్లీ టచ్‌లోకి వచ్చాడు. వరల్డ్ కప్‌కు ముందు ఐపీఎల్ సైతం ఆడతాడు కాబట్టి సమస్య లేదు. బ్యాటింగ్ ఫామ్ మాత్రం కొంత తగ్గినా... అతని కీపింగ్‌పై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. విరాట్ చెప్పినట్లు ధోనిపై విపరీతమైన అంచనాలు ఉండటమే సమస్య. మనకెప్పుడూ ధోని తొలి రోజులు గుర్తుకొచ్చి అలాగే ఆడాలని కోరుకుంటాం. ఇప్పుడు విఫలమవుతున్నాడని విమర్శిస్తాం. కానీ అతని స్థాయి ఆటగాళ్లకు తమనుంచి ఏం కోరుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాము విఫలమైతే వారు కూడా సహజంగానే బాధపడతారు! 2016 సెప్టెంబర్‌లో ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ బాధ్యతలు తీసుకున్న నాటినుంచి భారత్ 131 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడితే 89 గెలిచి, 33 ఓడింది. ఈ సమయంలో భారత్ గెలుపోటముల నిష్పత్తి (2.696) అన్ని జట్లకంటే చాలా ఎక్కువగా ఉంది. -
ధోని దేశభక్తి!
దేశం తరఫున ఆడుతున్నప్పుడు మైదానంలో ధోని అంకితభావం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మ్యాచ్‌లో జరిగిన ఒక ఘటన ధోని దేశభక్తిని మరోసారి ప్రపంచానికి చూపించింది. కివీస్ ఇన్నింగ్స్ సమయంలో ఒక అభిమాని భద్రతను ఛేదించుకొని గ్రౌండ్లోకి దూసుకొచ్చాడు. అతను నేరుగా ధోని వద్దకు వెళ్లి పాదాభివందనం చేశాడు. ఈ క్రమంలో అతని చేతిలో ఉన్న మన జాతీయ జెండా నేలను తాకింది. అంతే... అమిత వేగంతో కిందకు వంగిన ధోని ముందుగా మువ్వన్నెల జెండాను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ తర్వాతే సదరు అభిమానిని పక్కకు జరిపాడు. త్రివర్ణ పతాకాన్ని నేలకు తగలకుండా ‘లెఫ్ట్‌నెంట్ కల్నల్’ ధోని దానిపై తన గౌరవాన్ని ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. ఆ క్షణం మ్యాచ్‌లో ‘మూమెంట్ ఆఫ్ ద డే’గా నిలిచింది. -
ఆరేళ్ల తర్వాత...
మౌంట్ మాంగనీ: భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోని గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో బరిలోకి దిగలేదు. సోమవారం తొడ కండరాల గాయంతో అతను ఆటకు దూరంగా ఉన్నాడు. తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఫిట్నెస్ను కాపాడుకుంటూ వచ్చిన ధోని ఇప్పటి వరకు గాయంతో కేవలం ఐదు మ్యాచ్‌ల్లోనే గైర్హాజరీ అయ్యాడు. వెస్టిండీస్‌లో ఆరేళ్ల క్రితం (2013) చివరిసారిగా ఇలా గాయంతో ఆటకు దూరమయ్యాడు. అప్పుడు మూడు వన్డేలు ఆడలేకపోయాడు. అంతకుముందు 2007లో వైరల్ జ్వరం వల్ల ఐర్లాండ్, దక్షిణాఫ్రికాలతో జరిగిన మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు అర్ధసెంచరీలతో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అందుకున్న ఈ భారత మాజీ కెప్టెన్... కివీస్ పర్యటనలోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. రెండో వన్డేలో 33 బంతుల్లో 48 పరుగులు చేసి భారత్ భారీ స్కోరులో భాగమయ్యాడు. కివీస్ జట్టులో రెండు మార్పులు భారత్‌తో సిరీస్ కోల్పోయిన కివీస్ చివరి రెండు వన్డేలకు జట్టులో రెండు మార్పులు చేసింది. ఆల్‌రౌండర్ నీషమ్, లెగ్ స్పిన్నర్ టాడ్ ఆస్టల్లను జట్టులోకి తీసుకుంది. బ్రేస్‌వెల్ స్థానంలో నీషమ్, స్పిన్నర్ ఇష్ సోధి స్థానంలో ఆస్టల్ వచ్చారు. -
ధోనినే ‘బెస్ట్ ఫినిషర్’
న్యూఢిల్లీ: వన్డే క్రికెట్లో మ్యాచ్‌ను విజయవంతంగా ముగించడంలో ధోని తర్వాతే ఎవరైనా అని ఆస్ట్రే లియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయ పడ్డారు. ఈ తరంలో అతడిని మించినవారు ఎవరూ లేరని, ఇప్పటికీ అతనే ‘బెస్ట్ ఫినిషర్’ అని చాపెల్ ప్రశంసించారు. ‘చివరి వరకు నిలిచి జట్టును గెలిపించడంలో ధోని అంత సమర్థంగా ఎవరూ ఒత్తిడిని జయించలేరు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, ఇక కష్టం అనిపించినప్పుడల్లా కొన్ని అద్భుతమైన షాట్లు ఆడి అతను లెక్క సరి చేస్తాడు. ఉత్కంఠభరిత క్షణాల్లో తన వ్యూహానికి అనుగుణంగా ప్రశాంతంగా ఆడటం చూస్తే అతని బుర్ర ఎంత పక్కాగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు’ అని చాపెల్ విశ్లేషించారు. గతంలో మైకేల్ బెవాన్‌కు ఈ విషయంలో మంచి రికార్డు ఉన్నా...మారిన పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నా కూడా బెవాన్కంటే ధోనినే అత్యుత్తమమని ఆసీస్ దిగ్గజం అభిప్రాయం వ్యక్తం చేశారు. కోహ్లి ఇలాగే ఆడితే... వన్డే క్రికెట్లో నలుగురు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా రిచర్డ్స్, సచిన్, డివిలియర్స్, కోహ్లిలను చాపెల్ అభివర్ణించారు. వీరిలో కోహ్లి ఒక్కడే ఇప్పుడు ఆడుతున్నాడని...అతను ఇప్పటి జోరును కొనసాగిస్తే సచిన్‌కంటే 100 తక్కువ ఇన్నింగ్స్‌లలోనే అతని అన్ని రికార్డులు అధిగమిస్తాడని, మరో 20 సెంచరీలు ఎక్కువ చేస్తాడని కూడా ఇయాన్ అన్నారు. ఇదే జరిగితే విరాట్‌ను ‘వన్డే బ్రాడ్‌మన్’గా పిలవడంలో ఎలాంటి సందేహం ఉండనవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. -
సచిన్‌లో కోపం చూశా... ధోని ఎప్పుడూ ప్రశాంతమే
వన్డే సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని... భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా నిలుస్తాడని కొనియాడాడు. డకౌట్ అయినా, సెంచరీ కొట్టినా, ప్రపంచ కప్ గెలిచినా, తొలి మ్యాచ్‌లోనే ఓడినా ఒకే విధంగా స్వీకరించే ధోని స్వభావం తనను ఆశ్చర్యపరుస్తుందని పేర్కొన్నాడు. ఇదే ఊపులో పరోక్షంగా దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ సహా విమర్శకులపై తనదైన శైలిలో మండిపడ్డాడు. ఓ ఆస్ట్రేలియా పత్రికకు రవిశాస్త్రి ఇచ్చిన ముఖాముఖీ అతడి మాటల్లోనే... ధోనిని భర్తీ చేయలేం... ఆటలో కొనసాగుతున్న కాలంలో సచిన్‌లో కోపాన్ని చూశా. కానీ, ధోనిలో ఇంతవరకు అలాంటిదేమీ కనిపించలేదు. 30–40 ఏళ్లకోసారి మాత్రమే ఇలాంటి ఆటగాళ్లు వస్తారు. బ్యాట్స్‌మన్‌గానే కాదు... మంచి వ్యూహకర్తగా కెప్టెన్ కోహ్లిపై భారం తగ్గిస్తాడు. కీపర్‌గా ఆటను అతడు చూసే కోణం వేరు. కుర్రాళ్లతో బాగా ఉంటాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో వారంతా ధోనిని గొప్పగా చూస్తారు. ఈ మొత్తం జట్టు అతడి సారథ్యంలోనే రూపుదిద్దుకుంది. తన స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. అందుకని భారతీయులకు నేను ఒకటే చెబుతున్నా. ధోని ఆడినంత కాలం ఆస్వాదించండి. ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తే సహించను నిర్ణయాత్మక విమర్శలను నేను స్వీకరిస్తా. కానీ, పనిగట్టుకుని చేశారని అనిపిస్తే మాత్రం అవతలివారు గొప్పవారా? సాధారణ వ్యక్తా? అన్నది కూడా చూడను. వారికి తగిన రీతిలో బదులిస్తా. దీనిపై నా పంథా మారదు. సచిన్, కోహ్లి మధ్య... సచిన్, కోహ్లిల్లో మీరు గమనించిన పోలికలేమిటని నిన్న ఎవరో అడిగారు. పరుగుల కోసం తాపత్రయం, నెట్స్‌లో తీవ్రంగా శ్రమించడం, జీవితంలో ముఖ్యమైనవి త్యాగం చేయడం, ఎక్కడా రాజీ పడకపోవడం, ఇతరుల లోపాలను ఎత్తిచూపకపోవడం, తప్పులను అంగీకరించడం.. ఇలా చెప్పేందుకు చాలా ఉన్నాయి. సచిన్ స్థితప్రజ్ఞుడు. ప్రత్యర్థి ఎవరైనా లెక్కచేయని వివియన్ రిచర్డ్స్ తరహాలో కోహ్లి బ్యాటింగ్‌లో దూకుడెక్కువ. ఎంత గొప్పగా ఎదిగినా... పరిమితుల్లో ఉంటాడు. జట్టు సభ్యుల విషయంలో చాలా బాధ్యతగా ఉంటాడు. వారికి అతడో అద్భుతమైన రోల్ మోడల్. -
మిషన్ ఆసీస్ దిగ్విజయం
టెస్టుల్లో తొలిసారి అద్భుత రీతిలో సిరీస్ సొంతం... వర్షం అడ్డురాకపోతే టి20 సిరీస్ కూడా మన ఖాతాలో చేరేదే... ఇప్పుడు మొదటి సారి వన్డే సిరీస్ సైతం దక్కింది... గతంలో ఏ భారత జట్టుకూ సాధ్యం కాని ఘనతను కోహ్లి సేన చేసి చూపిస్తూ ఆస్ట్రేలియా నుంచి అజేయంగా తిరిగొచ్చింది. కంగారూ గడ్డపై ఒకే పర్యటనలో ఏ ఫార్మాట్లోనూ సిరీస్ ఓడని తొలి విదేశీ జట్టుగా ఘనత సాధించింది. వరల్డ్ కప్ సన్నాహకాల బాటలో మరపురాని విజయం భారత్ సొంతమైంది. టి20 టీమ్‌తో పాటు ఆస్ట్రేలియా వచ్చిన యజువేంద్ర చహల్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకుండానే తిరిగి వెళ్లిపోయాడు. వన్డే టీమ్‌తో చేరాక తొలి రెండు మ్యాచ్‌లకు చోటుదక్కలేదు. కానీ తనకు దక్కిన ఒకే ఒక్క చాన్స్‌ను అతను అద్భుతంగా వాడుకున్నాడు. 6 వికెట్లతో ఆసీస్ పని పట్టి టీమిండియా విజయానికి బాటలు వేశాడు. తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో పాటు ఆసీస్ గడ్డపై ఒక బౌలర్ అత్యుత్తమ గణాంకాలను అతను సమం చేశాడు. వరుసగా మూడు వన్డేల్లో మూడు అర్ధసెంచరీలు... నా నుంచి ఇంకా ఏం ఆశిస్తారు అన్నట్లుగా విమర్శకులకు తన బ్యాట్‌తోనే మహేంద్ర సింగ్ ధోని సమాధానం చెప్పిన తీరు ఈ సిరీస్‌కే హైలైట్. ఛేదనలో చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించడంలో తన అద్భుత రికార్డును నిలబెట్టుకుంటూ మహి మాయ చేశాడు. లక్ష్యం చిన్నదే అయినా పరిస్థితులకు తగినట్లుగా తన ఆటను మార్చుకుంటూ మరో విజయాన్ని అందించి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. మెల్బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ ఘనమైన ముగింపునిచ్చింది. కంగారూ టూర్లో టీమిండియా విసిరిన ఆఖరి పంచ్ సరిగ్గా లక్ష్యాన్ని తాకింది. మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో గెలుచుకొని కోహ్లి బృందం మరోసారి తమ సత్తాను ప్రదర్శించింది. శుక్రవారం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన చివరి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రే లియా 48.4 ఓవర్లలో 230 పరుగులకే ఆలౌటైంది. పీటర్ హ్యాండ్స్కోంబ్ (63 బంతుల్లో 58; 2 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... షాన్ మార్ష్ (54 బంతుల్లో 39; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖాజా (51 బంతుల్లో 34; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. భారత లెగ్ స్పిన్నర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ యజువేంద్ర చహల్ 42 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం భారత్ 49.2 ఓవర్లలో 3 వికెట్లకు 234 పరుగులు చేసి గెలిచింది. ధోని (114 బంతుల్లో 87 నాటౌట్; 6 ఫోర్లు), కేదార్ జాదవ్ (57 బంతుల్లో 61 నాటౌట్; 7 ఫోర్లు) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 121 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. కోహ్లి (62 బంతుల్లో 46; 3 ఫోర్లు) మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సిరీస్‌లో ధోని మొత్తం 193 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం అందుకున్నాడు. పలు క్యాచ్‌లు, రనౌట్ అవకాశాలు వృథా చేసి ఆస్ట్రేలియా చేజేతులా మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ కోల్పోయింది. ‘చహల్’చల్... టాస్ గెలిచిన భారత్ తేమను దృష్టిలో ఉంచుకొని ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు మార్పులు చేసిన జట్టు కుల్దీప్, రాయుడు, సిరాజ్ స్థానాల్లో చహల్, జాదవ్, విజయ్ శంకర్లకు అవకాశం ఇచ్చింది. 5 టి20లు ఆడిన విజయ్‌కు ఇది తొలి వన్డే కావడం విశేషం. వర్షంతో మ్యాచ్ పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కాగా... రెండు బంతులకే మళ్లీ వాన రావడంతో మరో 20 నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది. తన రెండో ఓవర్లోనే అలెక్స్ క్యారీ (5)ని ఔట్ చేసి శుభారంభం అందించిన భువనేశ్వర్... కొద్ది సేపటికే ఫించ్ (14) ఆట కూడా ముగించాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆసీస్ కెప్టెన్ భువీ బౌలింగ్‌లోనే ఔట్ కావడం గమనార్హం. ఈ దశలో ఖాజా, మార్ష్ కలిసి అతి జాగ్రత్తగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 11 పరుగుల వద్ద మార్ష్ ఇచ్చిన క్యాచ్‌ను ధోని వదిలేశాడు. అయితే చహల్ రంగప్రవేశంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మొదటి స్పెల్‌లో మూడు వికెట్లు తీసిన అతను, తన రెండో స్పెల్‌లో మరో మూడు వికెట్లు పడగొట్టాడు. చహల్ తొలి ఓవర్లోనే మార్ష్, ఖాజా వెనుదిరిగారు. ఆ తర్వాత మరో చక్కటి బంతికి స్టొయినిస్ (10)ను కూడా చహల్ ఔట్ చేశాడు. మరో ఎండ్‌లో హ్యాండ్స్కోంబ్ మాత్రం కొంత పోరాడే ప్రయత్నం చేసినా ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి అతనికి సహకారం లభించలేదు. దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన మ్యాక్స్‌వెల్ (19 బంతుల్లో 26; 5 ఫోర్లు)... షమీ బౌలింగ్‌లో భువీ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మళ్లీ చహల్ జోరు మొదలైంది. రిచర్డ్సన్ (16)ను ఔట్ చేసిన అనంతరం హ్యాండ్స్‌కోంబ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారీ భాగస్వామ్యం... స్వల్ప లక్ష్యమే అయినా పిచ్ పరిస్థితుల దృష్ట్యా భారత బ్యాట్స్‌మెన్‌కు పరుగులు అంత సులువుగా రాలేదు. ఫలితంగా చివరి ఓవర్లోనే విజయం సాధ్యమైంది. వ్యక్తిగత స్కోరు 1 వద్ద ‘రివ్యూ’ ద్వారా ఎల్బీగా ఔట్ కాకుండా తప్పించుకున్నా... రోహిత్ శర్మ (9) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. 14 పరుగుల వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో హ్యాండ్స్కోంబ్ వదిలేయగా, ఆరంభం నుంచి తడబడ్డ ధావన్ (46 బంతుల్లో 23) చివరకు స్టొయినిస్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాతి బంతికే మ్యాక్స్‌వెల్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో ధోని ‘డకౌట్’ కాకుండా బయట పడ్డాడు. ధోని 34 వద్ద ఉన్నప్పుడు సిడిల్ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడగా పాయింట్లో మ్యాక్స్‌వెల్ క్యాచ్ పట్టాడు. అయితే ఆసీస్ గట్టిగా అప్పీల్ చేయలేదు. రీప్లేలో బంతి ధోని బ్యాట్‌కు తగిలిందని తేలడంతో ఆసీస్ మరో అవకాశం కోల్పోయింది. చివరకు కోహ్లిని రిచర్డ్సన్ ఔట్ చేయడంతో 54 పరుగుల పార్ట్నర్షిప్ ముగిసింది. ధోని, కోహ్లి భాగస్వామ్యం 82 బంతుల పాటు సాగగా... కోహ్లి 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు! ఈ దశలో జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్న ధోని, జాదవ్ జోడి చివరి వరకు అజేయంగా నిలిచి విజయాన్ని అందించింది. 74 బంతుల్లో ధోని 70వ అర్ధ సెంచరీ... 52 బంతుల్లో జాదవ్ హాఫ్ సెంచరీ పూర్తయ్యాయి. భారత్ 3 ఓవర్లలో 27 పరుగులు చేయాల్సిన దశలో ధోని క్యాచ్‌ను మిడాఫ్‌లో ఫించ్ వదిలేశాడు. రెండు ఓవర్లలో 13 చొప్పున భారత్ 26 పరుగులు రాబట్టగా... ఆఖరి ఓవర్ రెండో బంతికి ఫోర్ కొట్టి జాదవ్ మ్యాచ్‌ను ముగించాడు. ► 48 లక్ష్య ఛేదనలో ధోని నాటౌట్‌గా నిలవడం ఇది 48వసారి. ఇందులో భారత్ 46 సార్లు గెలవగా ఒక సారి ఓడింది. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ► 103.07 ఛేదనలో భారత జట్టు గెలిచినప్పుడు ధోని సగటు. వందకు పైగా సగటు ఉన్న ఆటగాడు అతనొక్కడే. తర్వాతి స్థానంలో కోహ్లి (97.98) ఉన్నాడు. ► 3 ఒకే సిరీస్‌లో ధోని మూడు హాఫ్ సెంచరీలు చేయడం ఇది మూడో సారి. గతంలో ఇంగ్లండ్‌లో (2011), న్యూజిలాండ్‌లో (2014) అతను ఈ ఘనత సాధించాడు. ► 1 ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ నెగ్గడం భారత్‌కిదే తొలిసారి. భారత క్రికెట్ పట్ల ధోనికి ఉన్న అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. అతను కీలక పరుగులు సాధించడం పట్ల జట్టంతా సంతోషంగా ఉంది. దీంతో అతని ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. బయటి వ్యక్తులు ఎన్నో మాటలు చెబుతుంటారు. కానీ వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేశానికి ఎంతో చేసిన ధోనిని తన మానాన వదిలేయండి. అతను చాలా తెలివైనవాడు. తాను ఏం చేయాలో అతనికి బాగా తెలుసు. ఈ టూర్ చాలా అద్భుతంగా గడిచింది. రెండు ఫార్మాట్లు గెలిచి మూడో దాంట్లో సమంగా నిలిచాం. ఆస్ట్రేలియా రావడానికి ముందు ఇలాంటి ఫలితం గురించి ఎవరైనా చెప్పి ఉంటే నేను కూడా ఆశ్చర్యపోయేవాడినేమో. – కోహ్లి, భారత కెప్టెన్ ప్రైజ్‌మనీ లేదా! గావస్కర్ విమర్శ వన్డే సిరీస్ విజేతగా నిలిచిన జట్టుకు ఎలాంటి ప్రైజ్‌మనీ లేకపోవడాన్ని మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ తప్పు పట్టారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌లకు చెరో 500 డాలర్లు ఇవ్వగా... జట్టుకు మాత్రం ఆసీస్ బోర్డు ట్రోఫీతోనే సరి పెట్టింది. ‘500 డాలర్లు ఇవ్వడం ఏమిటి. పైగా జట్టుకు ఏమీ లేదు. నిర్వాహకులు ప్రసారహక్కుల ద్వారా భారీ మొత్తం ఆర్జిస్తారు. ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ కూడా ఇవ్వలేరా. ఆటలో డబ్బులు వస్తున్నాయంటే అందుకు క్రికెటర్లే కారణం కాదా’ అని గావస్కర్ ప్రశ్నించారు. -
మెల్‌బోర్న్‌లోనూ మెరిస్తే...
టి20 సిరీస్‌ను 1–1తో ముగించి సంతృప్తి పడినా, టెస్టు సిరీస్‌లో 2–1తో విజయం సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియా... వన్డే సిరీస్‌ను వశం చేసుకునేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. శుక్రవారం జరిగే మూడో మ్యాచ్‌లో గెలుపొందితే... దాదాపు రెండు నెలల ఆస్ట్రేలియా పర్యటనలో అజేయంగా నిలిచినట్లవుతుంది. మరోవైపు పరువు దక్కించుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన స్థితిలో ఉంది ఆతిథ్య జట్టు. ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారిన మెల్బోర్న్ వన్డేలో మెరిసేదెవరో? మెల్బోర్న్ : ఎంతో చర్చ జరిగి, మరెంతో ఆసక్తి రేపిన ఆస్ట్రేలియా పర్యటన ముగింపునకు వచ్చింది. నవంబరు 21న బ్రిస్బేన్‌లో టి20తో మొదలైన పోరాటానికి... మెల్బోర్న్లో నేడు జరుగనున్న మూడో వన్డేతో తెరపడనుంది. ప్రస్తుతం 1–1తో సమంగా ఉన్న సిరీస్ ఫలితాన్ని కూడా ఇదే మ్యాచ్ తేల్చబోతోంది. ఈ క్రమంలో తమ చారిత్రక పర్యట నకు అంతే ఘనంగా వీడ్కోలు పలకాలని కోహ్లి సేన భావిస్తుండగా, సొంతగడ్డపై పూర్తిగా విఫలమైందన్న అప్రతిష్టను తప్పించుకోవాలని ఫించ్ బృందం ప్రయత్నిస్తోంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత్ ఒకటి లేదా రెండు మార్పులతో దిగనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా రెండు మార్పులు చేయనుంది. రాయుడు ఉంటాడా? బ్యాటింగ్‌లో నాలుగో నంబరు స్థానంపై ఆందోళన తొలగిందని భావిస్తే, బౌలింగ్‌లో ఐదో బౌలర్ బెంగ పట్టుకుంది టీమిండియాకు. పేసర్ బుమ్రాకు విశ్రాంతితో ఇది తాత్కాలికమే అయినా, అతడి స్థానంలో వచ్చిన ఖలీల్ అహ్మద్, హైదరాబాదీ సిరాజ్ తీవ్రంగా నిరాశపర్చారు. వికెట్లు తీయలేకపోగా రెండు మ్యాచ్‌ల్లోనూ భారీగా పరుగులిచ్చారు. దీంతో మెల్బోర్న్లో పేస్ ఆల్‌రౌండర్ విజయ్‌శంకర్, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌లలో ఒకరిని ఆడించే అవకాశం కనిపిస్తోంది. అరంగేట్రంలోనే విజయ్ శంకర్ ఇక్కడి పిచ్‌లపై 10 ఓవర్లు వేయగలడా? అనే అనుమానాలున్నాయి. దీన్నిబట్టి చూస్తే చహల్‌నే తీసుకోవచ్చు. లేదా, నిఖార్సైన మూడో పేసరే తగినవాడనుకుంటే సిరాజ్ స్థానంలో ఖలీల్‌ను మళ్లీ బరిలో దింపొచ్చు. ప్రధాన పేసర్లు భువనేశ్వర్, షమీ, స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టిపడేస్తున్నారు. ఆస్ట్రేలియాను రెండు మ్యాచ్‌ల్లోనూ 300 మార్క్ చేరకుండా అడ్డుకున్నారు. ఇక గత మ్యాచ్‌లో ధావన్, కోహ్లి రాణించడంతో రోహిత్ సహా టాప్–3 బ్యాట్స్‌మెన్ ఎప్పటిలాగే టాప్ గేర్‌లోకి వచ్చినట్లైంది. మాజీ కెప్టెన్ ధోని తన ముగింపు సామర్థ్యాన్ని మరోసారి చాటుకోవడం, దినేశ్ కార్తీక్ విలువైన ఇన్నింగ్స్ ఆడటంతో మిడిలార్డర్ ఫామ్‌పై సందేహాలు తొలిగాయి. మిగిలింది అంబటి రాయుడు మాత్రమే. నాలుగో నంబరులో సరైనోడనుకున్న రాయుడు ఈ సిరీస్‌లో ఉనికి చాటలేదు. జట్టు కూర్పులో ఆరో బౌలర్‌గా పనికొస్తాడని కేదార్ జాదవ్‌ను ఆడిస్తే రాయుడి స్థానం ఇబ్బందుల్లో పడ్డట్లే. ఒకవేళ అవకాశం దక్కితే... మున్ముందు ప్రధాన టోర్నీలకూ తన పేరు పరిశీలనలో ఉండాలంటే అతడు ఈ మ్యాచ్‌లో తప్పక రాణించాలి. వారి స్థానంలో స్టాన్లేక్, జంపా టీమిండియా టాపార్డర్‌కు పూర్తి భిన్నంగా ఉంది ఆతిథ్య జట్టు టాపార్డర్. కెప్టెన్ అరోన్ ఫించ్ పేలవ ఫామ్ నుంచి బయటకు రావడం లేదు. ఇన్ స్వింగర్లను ఎదుర్కోవడంలో ఫించ్ చేతులెత్తేస్తున్నాడు. మరో ఓపెనర్ అలెక్స్ క్యారీ అంతంతే అన్నట్లున్నాడు. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఖాజా ఫర్వాలేదనిపిస్తున్నాడు. షాన్ మార్‡్ష అద్భుత ఫామ్‌తో పాటు హ్యాండ్స్కోంబ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్ రూపంలో లోతైన బ్యాటింగ్ లైనప్ ఉండటం ఆసీస్ బలం. పేసర్ బెహ్రెన్‌డార్ఫ్ గాయంతో దూరమవడం, స్పిన్నర్ లయన్ ప్రభావం చూపలేకపోతుండటంతో వీరి స్థానాల్లో బిల్లీ స్టాన్లేక్, ఆడమ్ జంపాలను ఆడించనుంది. మార్‡్షను త్వరగా వెనక్కు పంపి, యువ పేసర్ జెయ్ రిచర్డ్సన్ను సమర్థంగా ఎదుర్కొంటే మ్యాచ్‌లో కోహ్లి సేనదే పై చేయి అవుతుంది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), రాయుడు/జాదవ్, ధోని, దినేశ్ కార్తీక్, జడేజా, కుల్దీప్, విజయ్ శంకర్/ చహల్, భువనేశ్వర్, షమీ. ఆస్ట్రేలియా: క్యారీ, ఫించ్ (కెప్టెన్), ఖాజా, షాన్ మార్‡్ష, హ్యాండ్స్కోంబ్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, జంపా, స్టాన్లేక్, సిడిల్, రిచర్డ్సన్ పిచ్, వాతావరణం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) పిచ్‌పై బౌన్స్ పేసర్లకు ఉపయోగపడుతుంది. పెద్ద బౌండరీలు కావడంతో స్పిన్నర్ల పాత్ర కీలకం కానుంది. వర్ష సూచన లేదు. 27 డిగ్రీలు మించని ఉష్ణోగ్రతతో వాతావరణం ఆటకు అనుకూలంగా ఉండనుంది. -
ధోని, ధావన్ సాధన
సిడ్నీ: ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా చేరిన టీమిండియా క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్ బుధవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లోని నెట్స్‌లో సాధన చేశారు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సమక్షంలో ధోని ఇండోర్ నెట్స్‌లో గడపగా... రాయుడు, ధావన్ పూర్తిగా కుడి, ఎడమ త్రో డౌన్స్‌ను ఎదుర్కొన్నారు. జాదవ్ రెండు నెట్స్‌లోనూ పాల్గొన్నాడు. ప్రాక్టీస్ ఐచ్ఛికం కావడంతో టెస్టు సిరీస్ నెగ్గిన మిగతా జట్టు సభ్యులెవరూ రాలేదు. -
విహారి ఓపెనర్‌గా విఫలమైనా...
మెల్బోర్న్: ఆంధ్ర యువ బ్యాట్స్‌మన్ హనుమ విహారి ఓపెనర్‌గా విఫలమైతే మిడిలార్డర్లో మరిన్ని అవకాశాలిస్తామని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. వికెట్ కీపర్లు రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లకు తగినన్ని టి20 అవకాశాలు ఇచ్చేందుకే ధోనికి విశ్రాంతి కల్పించామని ఆయన వివరించారు. దీంతో కుర్రాళ్లను పరిశీలిస్తున్నామని చెప్పకనే చెప్పిన ఈ చీఫ్ సెలక్టర్ ఆసీస్‌లో 2020లో జరిగే టి20 ప్రపంచకప్‌లో ధోని ఆడడనే సంకేతాలిచ్చాడు. రవీంద్ర జడేజాను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికచేసే సమయంలో అతను ఫిట్నెస్తోనే ఉన్నట్లు చెప్పాడు. రెగ్యులర్ ఓపెనర్లు రాహుల్, విజయ్ పదేపదే నిరాశపర్చడంతో టీమ్ మెనేజ్మెంట్ విహారి, మయాంక్ అగర్వాల్‌లతో ‘బాక్సింగ్ డే’ టెస్టును ఓపెన్ చేయించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రెండే టెస్టులాడిన విహారి విఫలమైతే పరిస్థితి ఏంటని ప్రశ్నకు సమాధానమిస్తూ ‘విఫలమైనా అవకాశాలు సజీవంగా ఉంటాయి. దేశవాళీ క్రికెట్లో అతని ఆటను ప్రత్యక్షంగా గమనించా. కూకాబురా బంతుల్ని ఎదుర్కొనే సత్తా అతనిలో ఉంది’ అని అన్నాడు. 1999 పర్యటనలో మెల్బోర్న్లో ఎమ్మెస్కే కూడా ఓపెనర్‌గా దిగినా... స్పీడ్‌స్టర్ బ్రెట్ లీ ధాటికి నిలువలేకపోయాడు. దీనిపై అతను మాట్లాడుతూ అవకాశాల్ని అంచనాల్ని తాను అందుకోలేకపోయానని కానీ ఈ యువ ద్వయం (విహారి, మయాంక్) రాణిస్తారనే ధీమా వ్యక్తం చేశాడు. -
ధోని మళ్లీ వచ్చాడు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టి20ల్లో మహేంద్ర సింగ్ ధోని కెరీర్ ముగిసిందనుకున్న తరుణంలో అతను జట్టులోకి పునరాగమనం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగే టి20 సిరీస్ కోసం ధోనిని సెలక్టర్లు మళ్లీ ఎంపిక చేశారు. భారత్ ఆడిన గత రెండు టి20 సిరీస్‌లలో (సొంతగడ్డపై వెస్టిండీస్‌తో, ఆస్ట్రేలియాతో) ధోనికి చోటు దక్కలేదు. దాంతో పొట్టి ఫార్మాట్లో అతని ఆటకు ఫుల్స్టాప్ పడినట్లేనని అంతా భావించారు. అయితే ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనూహ్యంగా ధోనికి మరోసారి అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లు, న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ కోసం సోమవారం సెలక్టర్లు జట్లను ప్రకటించారు. వన్డే వరల్డ్ కప్‌కు ముందు మాజీ కెప్టెన్‌కు సాధ్యమైనంత మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించేందుకే అతడిని తిరిగి టి20 జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రపంచ కప్‌కు ముందు భారత్ మరో ఎనిమిది వన్డేలు (ఆసీస్‌తో 3, న్యూజిలాండ్‌తో 5) మాత్రమే ఆడనుంది. ధోని గైర్హాజరులో పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టగా, దినేశ్ కార్తీక్ రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగాడు. ఇప్పుడు ధోనితో పాటు వీరిద్దరు కూడా 15 మంది సభ్యుల టి20 జట్టులో ఉండటం విశేషం. ‘టి20 ఫార్మాట్లో పంత్‌లాంటి కుర్రాడికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం మంచిదని ధోని భావించాడు. అందుకే తనంతట తానే తప్పుకున్నాడు’ అని విండీస్‌తో సిరీస్‌కు ముందు కోహ్లి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ధోని మళ్లీ పొట్టి ఫార్మాట్ ఆడాలని నిర్ణయించుకోవడం అనూహ్యం. వన్డేలకు కార్తీక్... ఆసియా కప్ తర్వాత వన్డే టీమ్‌లో స్థానం కోల్పోయిన దినేశ్ కార్తీక్ కూడా పునరాగమనం చేశాడు. పంత్ స్థానంలో అతనికి చోటు లభించింది. గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యాకు ఊహించినట్లుగానే రెండు ఫార్మాట్లలో కూడా స్థానం దక్కింది. వెస్టిండీస్ సిరీస్‌లో తొలి రెండు వన్డేలు ఆడి స్థానం కోల్పోయిన షమీని కూడా వన్డేల కోసం ఎంపిక చేశారు. మరో పేసర్ ఖలీల్ అహ్మద్ రెండు జట్లలోనూ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. వన్డేల్లో రెగ్యులరే అయినా టి20ల్లో పెద్దగా ఆడని మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌కు కూడా చోటు దక్కింది. జాదవ్ తన ఆఖరి టి20 మ్యాచ్‌ను 2017 అక్టోబరులో ఆడాడు. పాండే, ఉమేశ్ ఔట్... మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే రెండు జట్లలోనూ స్థానం కోల్పోయాడు. వెస్టిండీస్‌తో ఐదు వన్డేలు, ఆసీస్‌తో మూడు టి20ల్లోనూ పాండేకు ఆడే అవకాశమే రాలేదు. విండీస్‌తో రెండు టి20లు ఆడిన అతను 19, 4 నాటౌట్ పరుగులు చేశాడు. వన్డే, టి20ల్లోనూ సభ్యుడిగా ఉన్న పేసర్ ఉమేశ్ యాదవ్‌ను కూడా సెలక్టర్లు పక్కన పెట్టారు. పునరాగమనం తర్వాత 2 వన్డేలు, 1 టి20 ఆడిన ఉమేశ్ ఘోరంగా విఫలమయ్యాడు. టి20 టీమ్ సభ్యులుగా ఉన్న శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్ కూడా ఆడే అవకాశం లభించకుండానే చోటు కోల్పోయారు. ‘ఎ’ జట్టు తరఫున పంత్... భారత సీనియర్ జట్టులోకి వేగంగా దూసుకొచ్చిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ జోరుకు సెలక్టర్లు చిన్న విరామం ఇచ్చారు. ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతున్న పంత్‌పై వన్డేల్లో వేటు పడింది. విండీస్‌తో సిరీస్‌లో పంత్ మూడు వన్డేలు ఆడగా... ధోని జట్టులో ఉండటంతో వికెట్ కీపింగ్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు టి20ల్లో కూడా ధోని పునరాగమనం చేయడంతో అతను ఇక్కడా తుది జట్టులో ఉండటం సందేహమే. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే పంత్ స్వదేశం పయనమవుతాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో అతను భారత్ ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగుతాడని బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జనవరి 12, 15, 18 తేదీల్లో మూడు వన్డేలు ఆడనున్న భారత్... జనవరి 23నుంచి ఐదు వన్డేలు, 3 టి20ల కోసం కివీస్ పర్యటనకు వెళుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో వన్డే సిరీస్‌లకు భారత జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, కార్తీక్, జాదవ్, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా, ఖలీల్, అంబటి రాయుడు, జడేజా, షమీ. న్యూజిలాండ్‌తో టి20లకు భారత జట్టు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, రాహుల్, కార్తీక్, జాదవ్, ధోని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా, ఖలీల్, పంత్. -
పంత్‌కు అవకాశం ఇచ్చేందుకే...
‘టి20 టీమ్‌లో ధోని లేకపోవడంపై అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సెలక్టర్లు ఇప్పటికే ధోనితో మాట్లాడారు కాబట్టి నేను ఇక్కడ కూర్చొని వివరణ ఇవ్వాల్సింది కూడా ఏమీ లేదు. టి20 ఫార్మాట్లో రిషభ్ పంత్ లాంటి కుర్రాడు ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే మంచిదని ధోని భావించాడు. అందుకే స్వయంగా తప్పుకున్నాడు. అతను ఇప్పటికీ మా వన్డే జట్టులో కీలక భాగమని జట్టు కెప్టెన్‌గా నేను చెబుతున్నాను. సరైన దిశలో బంతులు వేసిన బౌలర్లదే ఈ సిరీస్ విజయం. నిజానికి మేం కూడా బౌలింగ్ చేయాలనే కోరుకున్నాం. విండీస్ బ్యాటింగ్ ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించింది. మున్ముందు ఇదే జోరు కొనసాగించాలని భావిస్తున్నాం. ఈ సిరీస్‌కు సంబంధించి రెండు ప్రధాన విషయాలు... మూడో పేసర్‌గా ఖలీల్ ఆకట్టుకోవడం, నాలుగో స్థానంలో రాయుడు బాధ్యత తీసుకోవడం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పాండ్యా తిరిగొస్తే బలం మరింత పెరుగుతుంది. అప్పుడు పాండ్యా, జడేజాలలో ఎవరనేది పరిస్థితిని బట్టి తేల్చుకుంటాం. భువీ, బుమ్రాలలో ఎవరికైనా అనుకోనిది ఏదైనా జరిగితే వికెట్లు తీసేందుకు జట్టులో మరొకరు సిద్ధంగా ఉన్నారు. మా ఫీల్డింగ్ మరికొంత మెరుగవ్వాలని కోరుకుంటున్నా. కెప్టెన్‌గా ఉంటూ భారీ పరుగులు సాధించడం నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఇది ప్రతీసారి జరగదు కానీ ఒక సారి జోరు మొదలైందంటే దానిని కొనసాగించాలని చూస్తాను. నేను అవార్డుల కోసం ఆడను. నా పరుగులు ప్రభావం చూపించి జట్టు గెలవడం ముఖ్యం’ – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
300 మ్యాచ్‌లు... 30 మ్యాచ్‌లు
విశాఖపట్నం: రెండో వన్డే చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు చేయాల్సిన దశలో తొలి ఐదు బంతులకు వెస్టిండీస్ 9 పరుగులు రాబట్టింది. అనుకోకుండా వెళ్లిన లెగ్ బై బౌండరీని మినహాయిస్తే ఇద్దరు బ్యాట్స్‌మెన్ కూడా ఆ ఐదు బంతులను ఆడటంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ ఓవర్‌కు వ్యూహ రచన చేసిన ధోని ఆఖరి బంతికి మాత్రం ఫీల్డింగ్‌ను మార్చేశాడు. థర్డ్‌మ్యాన్‌ను మరి కాస్త లోపలకు తీసుకొచ్చి పాయింట్ ఫీల్డర్‌ను డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ వద్దకు పంపించాడు. స్వీపర్ కవర్, లాంగాఫ్‌ను కూడా తప్పించాడు. అయితే ఈ వ్యూహం వ్యతిరేకంగా పని చేసి ఆఖరి బంతిని హోప్ ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ‘టై’ చేయగలిగాడు. ఇదే విషయంపై మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో కుల్దీప్ యాదవ్‌ను ప్రశ్నించగా అతను సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదు. ‘ఇది ధోని ప్రణాళిక. దాని గురించి తెలిసేంత పెద్దవాడిని కాను. నేను 30 మ్యాచ్‌లు మాత్రమే ఆడాను. మహి భాయ్ 300 మ్యాచ్‌లు ఆడాడు. మా అందరికంటే అతనికి చాలా ఎక్కువ అనుభవం ఉంది. ఆ సమయంలో అతను అనుకున్నది అమలు చేశాడు’ అని కుల్దీప్ జవాబిచ్చాడు. దాదాపు పది నెలల క్రితం జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకొని కుల్దీప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అనిపించింది. ఇండోర్‌లో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్‌లో ధోని ఫీల్డింగ్ మార్పులు చేస్తూ కవర్‌ను తప్పించి పాయింట్‌ను మరింత ముందుకు తీసుకు రమ్మని బౌలర్ కుల్దీప్కు సూచించాడు. అయితే దీనిని పట్టించుకోని కుల్దీప్ తనకు ఈ ఫీల్డింగ్ బాగుందని చెప్పాడు. దాంతో చిర్రెత్తిన ధోని ‘300 మ్యాచ్‌లు ఆడిన నేనేమైనా పిచ్చివాడినా’ అంటూ ఏడో మ్యాచ్ ఆడుతున్న కుల్దీప్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరో వైపు మంచు కారణంగా బంతిపై పట్టు చిక్కక పోవడం వల్లే గెలుపు చేజారిందని ఈ చైనామన్ బౌలర్ విశ్లేషించాడు. -
ధోని... ‘సాక్షి’
ఆష్లే నర్స్ బౌలింగ్‌లో 37వ ఓవర్ మూడో బంతిని లాంగాన్ దిశగా పంపి సింగిల్ (81వ పరుగు) తీయడంతో ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి వన్డేల్లో 10 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ సమయంలో నాన్ స్ట్రయికింగ్‌లో ఉన్న ధోని అతడి వద్దకు వచ్చి అభినందించగా కోహ్లి బిగ్గరగా నవ్వాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిందేమంటే... భారత క్రికెట్లో మధుర ఘట్టాలుగా నిలిచే సందర్భాలన్నింటిలో ధోని సాక్షిగా నిలవడం! 2007 టి20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టినపుడు, 2010లో సచిన్ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీని సాధించినపుడు, రోహిత్ శర్మ వన్డేల్లో తన తొలి ద్విశతకాన్ని అందుకున్నప్పుడు... నాన్ స్ట్రయికర్‌గా ధోనినే ఉండటం విశేషం. ఇక వీటన్నింటికీ మించినదేమంటే, స్ట్రయికింగ్‌లో ఉండి... 2011 ప్రపంచ కప్ ఫైనల్లో సిక్స్‌తో దేశాన్ని విశ్వ విజేతగా నిలపడం. ఆ మ్యాచ్..: వన్డే క్రికెట్లో అందరికంటే ముందుగా 10 వేల పరుగుల మైలు రాయిని చేరుకోవడం మాస్టర్ బ్లాస్టర్‌కే సాధ్యమైంది. మార్చి 31, 2001న ఇండోర్‌లో ఆస్ట్రేలియాపై అతను ఈ ఘనతను నమోదు చేశాడు. భారత్ 118 పరుగుల భారీ తేడాతో గెలిచిన ఆ మ్యాచ్‌లో సచిన్ 125 బంతుల్లో 19 ఫోర్లతో 139 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఇది సచిన్ కెరీర్లో 28వ సెంచరీ. -
వెస్టిండీస్ చేతిలోనే...
సాక్షి క్రీడా విభాగం : విశాఖపట్నంలో వన్డే మ్యాచ్ అనగానే ధోని ఉప్పెన గుర్తుకు రావడం సహజం. 13 ఏళ్ల క్రితం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై అతను సృష్టించిన వీర విధ్వంసం అభిమానులందరి మదిలో అలా నిలిచిపోయింది. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానం ఐదు వన్డేలకు ఆతిథ్యమిచ్చిన తర్వాత కొత్తగా నిర్మించిన స్టేడియంలో అదే తొలి మ్యాచ్ కూడా కావడం విశేషం. ధోని మాత్రమే కాదు... సూపర్ స్టార్ విరాట్ కోహ్లి కూడా సాగర తీరంలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. వ్యక్తిగతంగానే కాకుండా ఫలితాల పరంగా టీమిండియాకు దీనిని కలిసొచ్చిన వేదికగా చెప్పవచ్చు. 2005 ఏప్రిల్ 5 నుంచి 2017 డిసెంబర్ 17 వరకు ఇక్కడ 7 వన్డేలు జరిగాయి. వీటిలో 6 గెలిచిన భారత్ ఒకే ఒక మ్యాచ్‌లో ఓడింది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, న్యూజిలాండ్‌లను ఒక్కోసారి ఓడించిన భారత్, శ్రీలంకపై రెండు సార్లు గెలుపొందింది. ఒకసారి మాత్రం విండీస్ చేతిలో పరాజయం పాలైంది. ఐదేళ్ల క్రితం తమపై గెలుపొందిన ప్రత్యర్థితోనే బుధవారం మరో మ్యాచ్‌లో భారత్ తలపడనున్న నేపథ్యంలో డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ– వీడీసీఏ స్టేడియంలో జరిగిన వన్డేల విశేషాలు చూస్తే... ►2005లో పాకిస్తాన్‌పై ధోని 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 148 పరుగులు సాధించాడు. ధోని కెరీర్లో ఇది ఐదో మ్యాచ్ కాగా...అతను సాధించిన తొలి సెంచరీ ఇదే. ► 2007లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మహరూఫ్ వేసిన 41వ ఓవర్లో యువరాజ్ సింగ్ వరుసగా 4 4 0 6 4 4 బాది మ్యాచ్‌ను గెలిపించాడు. ► భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్, ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిషెల్ స్టార్క్ 2010లో ఇక్కడే తమ తొలి మ్యాచ్ ఆడారు. ధావన్ 2 బంతులు ఆడి ‘డకౌట్’ కాగా, స్టార్క్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ► 2011లో జరిగిన వన్డేలో వెస్టిండీస్ పదో నంబర్ ఆటగాడు రవి రాంపాల్ 66 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వన్డేల్లో పదో స్థానంలో ఒక బ్యాట్స్‌మన్ సాధించిన అత్యధిక స్కోరు రికార్డు ఇదే. ►2013లో జరిగిన వన్డేలో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో నలుగురు విండీస్ ఆటగాళ్లు అర్ధసెంచరీలు సాధించారు. ధోని తన కెరీర్లో 50వ అర్ధ సెంచరీని ఇదే మ్యాచ్‌లో నమోదు చేయడం విశేషం. తీవ్రమైన మంచు కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు సార్లు బంతిని మార్చాల్సి రావడం భారత్‌కు ప్రతికూలంగా మారింది. ►2016లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో అమిత్ మిశ్రా 18 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. కివీస్ వన్డే చరిత్రలో అతి తక్కువ ఓవర్లలో (23.1) ఆలౌట్ అయిన మ్యాచ్ ఇదే. కోహ్లి స్పెషల్స్... విశాఖలో కోహ్లికి ఘనమైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన నాలుగు వన్డేల్లో కోహ్లి వరుసగా 118, 117, 99, 65 పరుగులు చేయడం విశేషం. ఇక్కడ జరిగిన ఏకైక టి20లో కోహ్లి ఆడలేదు. అయితే ఇంగ్లండ్‌తో 2016లో జరిగిన ఏకైక టెస్టులోనూ విరాట్ కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లలో 167, 81 పరుగులు సాధించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. -
జరిమానా కోరుకోను...
దుబాయ్: అఫ్గాన్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో అంపైరింగ్ పొరపాట్లపై స్పందించేందుకు ఎంఎస్ ధోని నిరాకరించాడు. ఈ మ్యాచ్‌లో ధోని, దినేశ్ కార్తీక్‌లను ఎల్బీగా ప్రకటించడం అంపైరింగ్ లోపాలను ఎత్తిచూపింది. అయినా, వీటిపై మాట్లాడనని ధోని పేర్కొన్నాడు. ‘మ్యాచ్‌లో జరిగిన కొన్ని ఘటనలపై స్పందించి జరిమానాకు గురికాదల్చుకోలేదు’ అని అతడు వివరించాడు. అఫ్గానిస్తాన్ బాగా ఆడిందని, ఈ పిచ్‌పై 250 మంచి స్కోరే అని పేర్కొన్నాడు. గెలవకున్నా, ఫలితం పట్ల సంతృప్తి చెందినట్లు తెలిపాడు. -
దాయాదుల 'సూపర్' పోరు
హాంకాంగ్‌తో మ్యాచ్ మేలుకొలిపిందో లేక పట్టుదలే పట్టాలెక్కించిందో గానీ భారత్ ఇప్పుడు ఆసియా కప్‌లో అజేయశక్తి. ఒక్కరి మీదే ఆధారపడటంలేదు. అరకొర ప్రదర్శనతోనే గట్టెక్కడంలేదు. అంతా కలిసి కదం తొక్కుతున్నారు. ప్రత్యర్థి జట్టును రఫ్ఫాడిస్తున్నారు. టీమిండియా అసాధారణ ఫామ్ ప్రత్యర్థి శిబిరాన్ని గుక్కతిప్పుకోకుండా చేస్తుంది. తాజాగా సూపర్–4లో దాయాది పాకిస్తాన్‌ను మళ్లీ దంచేందుకు టీమిండియా సిద్ధమైంది. దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి అదరగొడుతున్న భారత్ ఆసియా కప్‌లో మరోసారి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ‘ఢీ’ కొట్టేందుకు సిద్ధమైంది. సూపర్–4లో భాగంగా ఆదివారం దాయాదుల సమరం జరుగనుంది. ఈ టోర్నీలో తిరుగులేని జట్టేదైనా ఉందంటే అది రోహిత్ సేనే. ఇప్పటిదాకా ఈ జట్టుకు సాటి వచ్చే ప్రత్యర్థే లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతీ మ్యాచ్‌లోనూ సమష్టి ఫలితాలే. ప్రతీ ఒక్కరిలోనూ విజయకాంక్షే. ఇవన్నీ టీమిండియాను పటిష్టస్థితిలో నిలిపాయి. ఇప్పుడు భారత్‌కు ఎదురుపడటమంటే ఓటమితో దిగాలు పడటమనే విషయం ప్రత్యర్థి టీమ్ మేనేజ్మెంట్లకు అర్థమైపోయింది. కాబట్టే ఏ వ్యూహంతో బరిలోకి దిగాలో వాళ్లకు అంతుబట్టడం లేదు. ఇక్కడ భారత్ ఆడిన మ్యాచ్‌లు, గెలిచిన తేడాను చూస్తే... కచ్చితంగా ఎవరైనా హడలిపోవాల్సిందే. ఈ జోరు చూస్తుంటే రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి లేని జట్టే ఇలా వుంటే ఇక అతడు కూడా ఓ చెయ్యేస్తే... మిగతా జట్ల పరిస్థితి ఏంటా అని సగటు క్రీడాభిమాని భావించవచ్చు. రోహిత్ బృందానికి ఆరంభంలో ఒక్క హాంకాంగ్ మినహా ఏ జట్టూ కనీసం ఎదురునిలువ లేకపోయింది. తాజాగా ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందో చూడాలి. కసిదీరా కలివిడిగా... రోహిత్ సేన ఉరిమే ఉత్సాహంతో ఉంది. ఎవరెదురైనా ఓడించేందుకు సిద్ధంగా ఉంది. అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. హాంకాంగ్‌తో కష్టపడ్డ భారత్ అటుపై ఇక ఏ జట్టుతోనూ చెమట చిందించకుండానే గెలిచింది. రసవత్తరం అవుతుందనుకున్న ఇండో–పాక్ గ్రూప్ దశ మ్యాచ్ కూడా టీమిండియా జోరు ముందు తేలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా ఏ విభాగాన్ని చూసినా, ఏ ఆటగాడి సత్తాను పరిశీలించినా భారత్ ఇప్పుడు అసాధారణ జట్టు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ జట్టును ఓడించడం చాలా కష్టం. టాపార్డర్‌లో ధావన్ అద్భుతంగా ఆడుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో సెంచరీ బాదిన శిఖర్ గత రెండు మ్యాచ్‌ల్లోనూ 46, 40 పరుగులు చేశాడు. ఓపె నింగ్‌లో అతనితోపాటు కెప్టెన్ రోహిత్ కూడా టచ్‌లోకి వచ్చాడు. పాక్, బంగ్లాదేశ్‌లపై అర్ధసెంచరీలతో సత్తాచాటుకున్నాడు. మిడిలార్డర్లో రాయుడు, దినేశ్ కార్తీక్‌లు బాగా ఆడుతున్నారు. ప్రమోషన్‌తో ధోని కూడా... గత మ్యాచ్‌లో ప్రమోషన్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని కూడా ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చాడు. కెప్టెన్ రోహిత్‌తో కలిసి మూడో వికెట్‌కు విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ధనాధన్ మెరుపులు లేకపోయినా దడదడలాడిస్తున్న నాయకుడికి అండగా నిలిచాడు. ప్రత్యర్థి జట్ల తక్కువ స్కోర్లతో లోయర్ మిడిలార్డర్లో కేదార్ జాదవ్‌లాంటి బ్యాట్స్‌మెన్‌కు చెప్పుకోదగ్గ అవకాశం రాలేదు. కానీ హాంకాంగ్‌తో మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే తొలి మ్యాచ్ మినహా ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌ల్లో తమ ప్రతాపం చూపారు. పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, అవకాశం దక్కించుకున్న ఖలీల్ అహ్మద్, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చహల్... అందరూ కలిసి ప్రత్యర్థి ఇన్నిం గ్స్‌ను నిలువునా కూల్చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా గాయంతో ఏడాది తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజా వస్తూనే స్పిన్ బౌలింగ్‌తో పరిమిత ఓవర్లకు పనికొస్తానని తన ప్రదర్శనతో చాటాడు. ఆత్మరక్షణలో పాక్... ఈ టోర్నీలో మూడు మేటి జట్లలో శ్రీలంక లీగ్‌లోనే నిష్క్రమించింది. ఇక మిగిలిన జట్లలో భారత్‌కు పోటీ ఇస్తుందనుకున్న పాకిస్తాన్ లీగ్ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. టీమిండియా జోరుకు తలవంచింది. అయితే లీగ్‌లో ఇతర జట్లపై గెలిచి ముందంజ వేసిన ఈ జట్టు తమ తొలి సూపర్–4లో అఫ్గానిస్తాన్‌ను కష్టమ్మీద ఓడించింది. ఇప్పుడు పటిష్టమైన భారత్‌నూ ఓడిస్తే ఫైనల్ బెర్త్‌పై ధీమాతో ఉండొచ్చని భావిస్తోంది. నిలకడలేని బ్యాటింగ్ లైనప్‌తో భారత్‌ను ఢీకొనడం అంత సులభమేమీ కాదు. గత మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని పాక్ చివరి ఓవర్లో అధిగమించింది. టాపార్డర్‌లో బాబర్ ఆజమ్ ఒక్కడే ప్రతీ మ్యాచ్‌లోనూ స్థిరంగా ఆడుతున్నాడు. హాంకాంగ్, భారత్, అఫ్గానిస్తాన్‌పై అతను వరుసగా 33, 47, 66 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో అనుభవజ్ఞుడైన షోయబ్ మాలిక్ కూడా మెరుగ్గా ఆడుతున్నాడు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ బ్యాటింగ్‌కు దిగిన రెండుసార్లూ (6, 8 పరుగులు) విఫలమయ్యాడు. బౌలింగ్‌లో ఒక్కో మ్యాచ్‌లో ఒకరిద్దరు హిట్టయ్యారు. ఉస్మాన్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ ఆఫ్రిది, మొహమ్మద్ నవాజ్ పాకిస్తాన్ బౌలింగ్‌ను నడిపిస్తున్నారు. భారత బౌలింగ్‌తో పోలిస్తే పాక్ పేస్ దళం అంత పటిష్టంగా ఏమీ లేదు. ఇలాంటి నిలకడలేని బ్యాటింగ్, బౌలింగ్‌తో భారత్‌ను ఓడించాలంటే పాకిస్తాన్ శక్తికి మించి పోరాడాల్సి ఉంటుంది. పిచ్, వాతావరణం ఈ మ్యాచ్ కోసం కొత్త పిచ్‌ను ఉపయోగించనున్నారు. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని క్యూరేటర్ చెబుతున్నారు. అయితే తీవ్రమైన ఎండ వేడిమి దృష్ట్యా స్పిన్నర్లే ఎక్కువ ఓవర్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్‌కు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రాయుడు, ధోని, కార్తీక్, కేదార్ జాదవ్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. పాకిస్తాన్: సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్, బాబర్ ఆజమ్, హారిస్ సొహైల్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, నవాజ్, హసన్ అలీ, ఉస్మాన్, షాహీన్ ఆఫ్రిది. ►అబుదాబిలో నేడు జరిగే మరో ‘సూపర్–4’ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో అఫ్గానిస్తాన్ ఆడనుంది. సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ►సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ధోని వీరాభిమాని!
హాంకాంగ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ధోని డకౌట్‌గా వెనుదిరిగిన సమయంలో ఒక కుర్రాడి హావభావాలు చూశారా! తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ అతను తన అసహనాన్ని ప్రదర్శించాడు. తాను కూర్చున్న కుర్చీని కూడా దాదాపు విరగ్గొట్టినంత పని చేసిన అతను ధోని ఔట్ కాగానే స్టాండ్స్‌లో ఎక్కడికో వెనక్కి వెళ్లిపోయి కూర్చున్నాడు. స్టార్ స్పోర్ట్స్ కూడా పదే పదే ఈ అబ్బాయి ఉద్వేగంగా అరుస్తున్న దృశ్యాలను చూపించింది. మ్యాచ్ ముగిశాక అతను స్థానిక మీడియాలో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. టీవీ చానళ్లు, రేడియో స్టేషన్లు కూడా అతడిని స్టూడియోకు పిలిపించి ‘అంత కోపం ఎందుకు’ అనే శీర్షికతో కార్యక్రమాలు ప్రసారం చేశాయి. ఆ అబ్బాయి పేరు కోటమర్తి ఆద్రిత్. వయసు 9 ఏళ్లు. స్వతహాగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. ధోనికి వీరాభిమాని. దుబాయ్‌లో స్వయంగా ధోని నెలకొల్పిన అకాడమీలోనే శిక్షణ పొందుతున్నాడు. తొలిసారి ధోని మ్యాచ్‌ను ‘లైవ్’గా చూసేందుకు వచ్చాడు. అయితే 3 బంతుల్లోనే తన ఆనందం ఆవిరి కావడంతో తనను తాను నియంత్రించుకోలేకపోయానన్నాడు! -
వైరల్ : సీఎస్కే అభిమాని వినూత్న ప్రయోగం
చెన్నై : మన దేశంలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజే వేరు. క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ కోసం ఏడాది పొడవునా నిరీక్షిస్తుంటారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు, టీమిండియా సీనియర్ క్రికెటర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీఎస్కే, ధోని మీద ఉన్న అభిమానాన్ని ప్రదర్శించుకోవడానికి ఓ అభిమాని చేసిన వినూత్న ప్రయోగం క్రికెట్ ప్రియులనే కాక నెటిజన్లను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది. వివరాలు.. కె. వినోద్ అనే వ్యక్తికి సీఎస్కే జట్టుకి, ధోనికి వీరాభిమాని. తన అభిమానాన్ని ప్రదిర్శించుకోవడానికి వినోద్ తన వివాహ వేడుకనే అవకాశంగా మలచుకున్నాడు. ఈ ఆలోచనను గ్రాఫిక్ డిజైనర్ అయిన తన స్నేహితుడితో పంచుకున్నాడు. దీంతో ఇద్దరూ కలిసి బాగా ఆలోచించి పెళ్లి కార్డును సీఎస్కే టికెట్ మోడల్లో ప్రింట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా వినోద్ ‘చెన్నై సూపర్ కింగ్’గా తన పేరును, ‘చెన్నై సూపర్ క్వీన్’గా తన కాబోయే భార్య సాధన పేరును రాయించాడు. వివాహ సమయం, వేదిక గురించి మ్యాచ్ 2018 సెప్టెంబరు 12 బుధవారం అని కార్డులో ప్రింట్ చేయించాడు. సోషల్ మీడయాలో వైరల్‌గా మారిన ఈ కార్డు సీఎస్కే జట్టు అధికారులకు దృష్టికి వచ్చింది. దాంతో వారు వినోద్ పెళ్లి పత్రికతో పాటు అతని పెళ్లి ఫోటోను కూడా తమ అధికారిక ట్విటర్లో షేర్ చేయడమే కాక అతనికి శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ విషయం గురించి వినోద్ ‘2015 ఐపీఎల్ సందర్భంగా సీఎస్కే అధికారులు నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. చివరి రోజున వారు నన్ను ఆహ్వానించడమే కాక ధోని సంతకం చేసిన బ్యాట్‌ను నాకు బహుకరించారు’ అంటూ గుర్తు చేసుకున్నాడు. Wishing the Super fan in Vinod Buddy a very happy married life ahead! The invite is a special #Yellove from the super fan! Read More - https://t.co/VcTPPCGqbb #WhistlePodu 🦁💛 pic.twitter.com/TKOsxqVPDr — Chennai Super Kings (@ChennaiIPL) September 12, 2018 -
తండ్రికి తగ్గ తనయ, ఏం చేసిందో చూశారా?
కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని ముద్దుల కుమార్తె జీవా ధోని ఇప్పటికే సోషల్‌మీడియాలో ఓ సెన్సెషన్. జీవా పలు సార్లు తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. క్యూట్ క్యూట్‌గా డ్యాన్స్‌లు వేయడం, తండ్రి మ్యాచ్ మధ్యలో అలసిపోతే మంచినీళ్లు తీసుకెళ్లి ఇవ్వడం, ధోనితో పాటు గ్రౌండ్లో డ్యాన్స్‌లు వేయడం వంటివి చేస్తూ... జీవా ధోని నెటిజన్లను ఫిదా చేస్తోంది. తాజాగా తండ్రికూతుర్ల ఓ క్యూటెస్ట్ పిక్చర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిలో కూడా జీవా.. మరోసారి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. ధోని, కూతురు జీవా ఇద్దరూ కూడా తమ తమ గాడ్జెట్లలో మునిగిపోయిన పిక్చర్ అది. ఓ హోటల్లో కూర్చుని ఉన్న వీరిద్దరూ.. చుట్టుపక్కల పరిసరాలన్నింటిన్నీ పట్టించుకోకుండా గాడ్జెట్లకు అతుకుపోయారు. ధోని తన ఐప్యాడ్‌ను వాడుతుండగా.. ఈ బుల్లి జీవా కూడా తన చిన్న ఐప్యాడ్‌ను తీసుకుని ఎంతో శ్రద్ధగా గమనిస్తూ కనిపించింది. ఈ పిక్చర్లో ధోని తన ట్రైనింగ్ జెర్సీ వేసుకుని కనిపించాడు. అంటే ఈ పిక్చర్ ఇటీవల సిరీస్ మ్యాచ్‌ల సమయంలో తీసిందేనని తెలిసింది. వారి టేబుల్‌పై టీ కప్పులు, సూప్ బౌల్స్ వంటివి ఉన్నాయి. ట్విటర్లో షేర్ అయిన ఈ పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియా యూజర్ల హృదయాలను కొల్లగొడుతోంది.ఇటీవల కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కుమార్తె పూర్ణ పటేల్ వివాహంలో కూడా జీవా తన డ్యాన్స్‌తో నెటిజన్లను ఫిదా చేసింది. ముద్దుముద్దుగా జీవా వేసిన స్టెపులపై అభిమానులు పొగడ్తల వర్షం కురిపించారు. గతంలో కూడా జీవాకి సంబంధించిన వీడియోలని ధోని, సాక్షిలు ట్విట్టర్లో పోస్ట్ చేయడం, అవి కొద్ది నిమిషాలలోనే వైరల్‌గా మారడం సంగతి తెలిసిందే. Like father, like daughter. MS Dhoni and Ziva busy on their gadgets. pic.twitter.com/oxEKeMDeUQ — Circle of Cricket (@circleofcricket) August 15, 2018 -
ఇంగ్లండ్ గడ్డపై ఆ.. ఆరు ముత్యాలు
ఇంగ్లండ్‌లో మొత్తం 17 టెస్టు సిరీస్‌లు ఆడిన భారత్ మూడు సిరీస్‌లను సొంతం చేసుకుంది. ఒకదాంట్లో ‘డ్రా’తో గట్టెక్కగా... మరో 13 సిరీస్‌లలో ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో 57 టెస్టులు ఆడి ఆరు మ్యాచ్‌లలో విజయాలు సాధించి, 30 మ్యాచ్‌ల్లో ఓడింది. 21 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. రేపటి నుంచి మరో రసవత్తర పోరుకు తెర లేవనుంది. ఈ నేపథ్యంలో నాటి ఆరు ఆణి ముత్యాలను గుర్తు చేసుకుందాం. వచ్చే ఆరు వారాల్లో మరికొన్ని మధుర క్షణాలు ఈ జాబితాలో భాగమవుతాయని ఆశిద్దాం. సాక్షి క్రీడా విభాగం : 1971 – ఓవల్ గ్రౌండ్, లండన్ (4 వికెట్లతో భారత్ విజయం) – కెప్టెన్ అజిత్ వాడేకర్ మూడు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టులు ‘డ్రా’గా ముగిసిన అనంతరం స్పిన్ పిచ్‌పై జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌కు దక్కిన విజయమిది. నాట్, హటన్, జేమ్సన్ అర్ధ సెంచరీల సహాయంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 355 పరుగులు చేయగా, భారత్ 284 పరుగులకే ఆలౌటై 71 పరుగుల ఆధిక్యం కోల్పోయింది. కీపర్ ఫరూఖ్ ఇంజినీర్, దిలీప్ సర్దేశాయ్ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో దిగ్గజ స్పిన్నర్ బీఎస్ చంద్రశేఖర్ (6/38) ధాటికి ఇంగ్లండ్ 101 పరుగులకే కుప్పకూలింది. 173 పరుగుల లక్ష్యాన్ని భారత్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అజిత్ వాడేకర్ (45 నాటౌట్) చివరి వరకు పట్టుదలగా నిలబడగా, మన హైదరాబాదీ ఆబిద్ అలీ విన్నింగ్ షాట్ కొట్టాడు. విశేషాలు: ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు ఆడిన 39 ఏళ్ల తర్వాత, 15 టెస్టుల్లో పరాజయాల తర్వాత భారత్ టెస్టు గెలవగలిగింది. వరుసగా 26 టెస్టుల్లో ఓడిపోని ఇంగ్లండ్ రికార్డు కూడా ఈ మ్యాచ్‌తో బద్దలైంది. 1986 – లార్డ్స్, లండన్ (5 వికెట్లతో భారత్ విజయం) – కెప్టెన్ కపిల్ దేవ్ మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ వరుసగా తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవడం విశేషం. కపిల్ నేతృత్వంలోని మన టీమ్ అన్ని విధాలా ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసింది. గూచ్ (114) సెంచరీ సాధించగా, చేతన్ శర్మ 5 వికెట్లు పడగొట్టాడు. వెంగ్‌సర్కార్ (126 నాటౌట్) శతకం సహాయంతో భారత్ 341 పరుగులు సాధించి 47 పరుగుల ఆధిక్యం అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో కపిల్ (4/52) ధాటికి ఇంగ్లండ్ 180కే ఆలౌటైంది. భారత్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కపిల్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. విశేషాలు: చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో మూడు సెంచరీలు సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా వెంగ్‌సర్కార్ నిలిచాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఫిల్ ఎడ్మండ్ వేసిన ఓవర్లో కపిల్ వరుసగా 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 18 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ముగించాడు. కెప్టెన్‌గా 21 టెస్టుల్లో కపిల్‌కు ఇదే తొలి విజయం. 1986 – లీడ్స్ (279 పరుగులతో భారత్ విజయం) – కెప్టెన్ కపిల్‌దేవ్ భారత్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపు అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 272 పరుగులకు ఆలౌటైంది. వెంగ్‌సర్కార్ (61) టాప్ స్కోరర్. ఆ తర్వాత ఇంగ్లండ్ రోజర్ బిన్నీ (5/40) దెబ్బకు 102 పరుగులకే కుప్పకూలి ఏకంగా 170 పరుగుల ఆధిక్యం కోల్పోయింది. అనంతరం వెంగ్‌సర్కార్ (102 నాటౌట్) సెంచరీ సహాయంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేసి 408 పరుగుల లక్ష్యాన్ని విసిరింది. అయితే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో జట్టు 128కే ఆలౌటైంది. మణీందర్ సింగ్ (4/26) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. వెంగ్‌సర్కార్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. 15 ఏళ్లకే భారత్ మళ్లీ ఇక్కడ సిరీస్ గెలవగలిగింది. విశేషాలు: భారత దేశవాళీ దిగ్గజం, వికెట్ కీపర్ చంద్రకాంత్ పండిత్‌కు ఇది తొలి మ్యాచ్. అయితే మోరె కీపర్‌గా ఉండటంతో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా అతనికి అవకాశం దక్కింది. 2002 – లీడ్స్ (ఇన్నింగ్స్, 46 పరుగులతో భారత్ విజయం) – కెప్టెన్ సౌరవ్ గంగూలీ తొలి టెస్టును ఓడి, రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న అనంతరం భారత్‌కు దక్కిన విజయమిది. ఆ తర్వాత చివరి టెస్టు కూడా ‘డ్రా’ కావడంతో సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో సచిన్ (193), ద్రవిడ్ (148), గంగూలీ (128) పరుగుల వరద పారించడంతో భారత్ 8 వికెట్లకు 628 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ 273 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 355 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్... ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించింది. కెప్టెన్ నాసిర్ హుస్సేన్ (110) పోరాడినా, ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో ఇంగ్లండ్ 309 పరుగులకే పరిమితమై చిత్తుగా ఓడింది. కుంబ్లే 4 వికెట్లు తీయగా, ద్రవిడ్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. విశేషాలు: ముగ్గురు భారత దిగ్గజాలు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. సచిన్‌కు ఇది 99వ టెస్టు కాగా, ఇదే మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ 29 సెంచరీల రికార్డును అతను అధిగమించాడు. 2014 – లార్డ్స్, లండన్ (95 పరుగులతో భారత్ విజయం ) – కెప్టెన్ ధోని తొలి టెస్టు ‘డ్రా’ అయిన తర్వాత జరిగిన ఈ రెండో టెస్టులో భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అయితే తర్వాతి మూడు టెస్టులు ఓడి 1–3తో సిరీస్ చేజార్చుకుంది. రహానే (103) సెంచరీతో ముందుగా భారత్ 295 పరుగులు చేయగా, బ్యాలెన్స్ (110) శతకంతో ఇంగ్లండ్ 319 పరుగులు చేసింది. భువనేశ్వర్ 6 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో విజయ్ (95), జడేజా (68), భువనేశ్వర్ (52) రాణించడంతో భారత్ 342 పరుగులు సాధించింది. 319 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాంత్ శర్మ (7/74) దెబ్బ కొట్టాడు. ఫలితంగా ఆ జట్టు 223 పరుగులకే కుప్పకూలింది. ఈ టెస్టుకు ముందు నాటింగ్‌హామ్‌లో జడేజా–అండర్సన్ మధ్య పెద్ద గొడవ జరగ్గా... ఈ మ్యాచ్‌లో ఆఖరి వికెట్‌గా అండర్సన్‌ను జడేజా రనౌట్ చేయడం తీపి జ్ఞాపకం. విశేషాలు: లార్డ్స్ మైదానంలో భారత్‌కు 28 ఏళ్ల తర్వాత దక్కిన విజయమిది. మూడేళ్ల తర్వాత భారత్ విదేశాల్లో టెస్టు నెగ్గింది. 2007 – నాటింగ్‌హామ్ (7 వికెట్లతో భారత్ విజయం) కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మూడు టెస్టుల సిరీస్‌లో తొలి, చివరి టెస్టులు ‘డ్రా’ కాగా, రెండో మ్యాచ్‌లో విజయంతో భారత్ 1–0తో సిరీస్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా జహీర్ ఖాన్ (4/59) ధాటికి ఇంగ్లండ్ 198 పరుగులకే ఆలౌటైంది. సచిన్ (91), గంగూలీ (79), దినేశ్ కార్తీక్ (77), వసీం జాఫర్ (62), లక్ష్మణ్ (54) రాణించడంతో భారత్ 481 పరుగులు చేసింది. అనంతరం జహీర్ (5/75) జోరుకు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 355 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మైకేల్ వాన్ (124) సెంచరీ సాధించాడు. 73 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 3 వికెట్లు కోల్పోయి అందుకోగా, జహీర్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. విశేషాలు: విదేశీ గడ్డపై భారత్‌కు ఇది 200వ టెస్టు కాగా, 29వ విజయం. సచిన్ టెస్టుల్లో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్న మ్యాచ్. ఈ సిరీస్ నుంచే ఇంగ్లండ్‌లో భారత్ టెస్టు సిరీస్‌ను ‘పటౌడీ ట్రోఫీ’గా వ్యవహరిస్తున్నారు. -
బంతి అడిగింది బైబై చెప్పేందుక్కాదు...
లండన్: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని త్వరలో రిటైర్ కానున్నాడనే వార్తల్ని హెడ్ కోచ్ రవిశాస్త్రి తోసి పుచ్చారు. లీడ్స్‌లో మూడో వన్డే ముగిశాక ధోని ఫీల్డు అంపైర్ల నుంచి బంతిని తీసుకెళ్లాడు. ఇది ధోని రిటైర్మెంట్కు సంకేతమని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెలువెత్తాయి. దీన్ని గురువారం హెడ్ కోచ్ ఖండించారు. ధోని బంతిని తీసుకెళ్లింది భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌కు చూపించేందుకేనని ఆయన స్పష్టం చేశారు. ‘అవన్నీ అర్థంలేని వార్తలు. ధోని రిటైర్ కావట్లేదు. బంతి స్థితిగతుల్ని తెలిపేందుకే ధోని దాన్ని తీసుకెళ్లాడు. 45 ఓవర్లు వేసేసరికి బంతి ఎంతలా పాడైపోతుందో బౌలింగ్ కోచ్‌కు స్పష్టంగా చూపేందుకే ఆ మ్యాచ్ ఆడిన బంతిని అంపైర్లను అడిగి ధోని వెంటతీసుకెళ్లాడు. అంతే తప్ప రిటైర్మెంట్ ప్రకటించేందుకు కానే కాదు’ అని రవిశాస్త్రి తెలిపారు. ఇలాంటి ఊహాగానాలు, ఆధారం లేని వార్తలు ఎక్కడినుంచి మొదలవుతాయో తెలియదని అన్నారు. -
భారత్-ఇంగ్లండ్ తుది సమరం..గెలిచేదెవరు?
ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌ను గెలుచుకున్న భారత్... రెండో మ్యాచ్‌లో ఓడినా చివరి వరకు పోరాడగలిగింది. జట్టులో లోపాలేమీ కనిపించకుండా చివరి మ్యాచ్‌లో చెలరేగింది. అయితే వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో పరాజయం మాత్రం భారత్ బలహీనతలను బయట పెట్టింది. ముఖ్యంగా మిడిలార్డర్‌ను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం చూపించింది. ఇప్పుడు వాటిని అధిగమించి చివరి వన్డేలో విజయంతో ఈ పర్యటనలో మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంటుందా? ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్టు సిరీస్‌కు ముందు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటుందా అనేది ఆసక్తికరం. లీడ్స్: టి20లాగే వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న భారత్ చివరి సమరానికి సిద్ధమైంది. నేడు ఇక్కడి హెడింగ్లీ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేలో టీమిండియా తలపడనుంది. వన్డేల్లో కొంత కాలంగా తిరుగులేని ప్రదర్శన కనబరస్తున్న ఇంగ్లండ్ తొలి మ్యాచ్ పరాజయం నుంచి వెంటనే కోలుకొని సత్తా చాటింది. ఈ సిరీస్‌నైనా గెలుచుకుంటే సొంతగడ్డపై తమ పరువు నిలబడుతుందని ఆ జట్టు భావిస్తోంది. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఇంగ్లండ్, భారత్ తమ మొదటి, రెండు ర్యాంక్‌లు నిలబెట్టుకుంటాయి. పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన ఈ పిచ్‌పై భారీ స్కోరు ఖాయం. రైనా స్థానంలో కార్తీక్! ఇంగ్లండ్‌తో ఈ పర్యటనలో ఆడిన ఐదు అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్ మూడు గెలిచింది. వీటిలో టాపార్డర్‌లో రోహిత్ రెండు, రాహుల్ ఒక సెంచరీ చేశారు. కోహ్లి, ధావన్ కూడా రాణించారు. కాబట్టి టాప్–3 విషయంలో ఎలాంటి సమస్యా లేదు. మిడిలార్డర్ వైఫల్యంతోనే లార్డ్స్ వన్డేను టీమిండియా కోల్పోయింది. ఈ విషయంలో రాహుల్, ధోని, రైనా, పాండ్యా మరింత మెరుగవ్వాల్సి ఉంది. నెమ్మదైన ఆటతో అనూహ్యంగా ధోని కూడా ప్రేక్షకుల హేళనలకు గురయ్యాడంటే గత మ్యాచ్ పరిస్థితి అర్థమవుతుంది. యోయో టెస్టులో రాయుడు వైఫల్యంతో మూడేళ్ల తర్వాత వన్డే ఆడే అవకాశం దక్కించుకున్న రైనా ఫర్వాలేదనిపించినా అతను చాలా ఇబ్బంది పడుతూ ఆడటం కనిపించింది. ఎడమ చేతివాటం, బౌలింగ్ చేయడం అదనపు అర్హతగా రైనాకు చోటు లభిస్తున్నా... తాజా ఫామ్, షాట్ల వైవిధ్యాన్ని బట్టి చూస్తే దినేశ్ కార్తీక్‌ను ఆడించే అవకాశం కూడా కనిపిస్తోంది. టెస్టుల్లో ప్రధాన అస్త్రం కాగలడని భావిస్తున్న కుల్దీప్ యాదవ్‌ను ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంచుతారేమో చూడాలి. మ్యాచ్‌కు ముందు ఫిట్నెస్ పరీక్ష పాసైతేనే భువనేశ్వర్ ఆడతాడని అసిస్టెంట్ కోచ్ బంగర్ ప్రకటించాడు. జేసన్ రాయ్‌కు గాయం! రెండో వన్డేలో విజయం తర్వాత ఇంగ్లండ్ జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. ముఖ్యంగా కుల్దీప్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ఆ జట్టు 10 ఓవర్లలో 68 పరుగులు రాబట్టడం శిబిరంలో ఆనందం నింపింది. ఇదే జోరులో మరో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ విజయంతో టి20 లెక్క సరి చేయాలని కెప్టెన్ మోర్గాన్ భావిస్తున్నాడు. ఓపెనర్ జేసన్ రాయ్ గాయపడటంతో అతని స్థానంలో జేమ్స్ విన్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే దూకుడులో రాయ్‌కు సరిపోయే బిల్లింగ్స్ కూడా తుది జట్టులో స్థానాన్ని ఆశిస్తున్నాడు. లార్డ్స్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అన్ని రంగాల్లో సమష్టిగా రాణించి విజయాన్నందుకుంది. హెడింగ్లీలో గత నాలుగు మ్యాచ్‌లు కూడా గెలిచిన ఇంగ్లండ్ అదే జోరు సాగిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. - సాయంత్రం గం. 5 నుంచి సోనీ సిక్స్, సోనీ–టెన్ 3లలో ప్రత్యక్ష ప్రసారం -
నాన్న... నీ వయసు పైబడుతోంది!
కార్డిఫ్: భారత మాజీ కెప్టెన్ ధోని శనివారం 37వ పుట్టినరోజు జరుపుకున్నాడు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల దాకా శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఒకటి మాత్రం వీటన్నింటికీ భిన్నంగా వచ్చింది. ‘నీ వయసుపైబడుతోంది’ అని..! ఈ మాట ధోని గారా లపట్టి జీవా నోటి నుంచి వచ్చింది. ‘హ్యాపీ బర్త్‌డే పాపా... హ్యాపీ బర్త్‌డే. యూ ఆర్ గెట్టింగ్ ఓల్డర్’ (వయసుపైబడుతోంది నాన్న) అని జీవా పాడుతూ విష్ చేసింది. ప్రస్తుత జట్టు సహచరుల వీడియో శుభాకాంక్షలతో పాటు జీవా చిట్టిపొట్టి పలుకుల్ని బీసీసీఐ వెబ్సైట్లో ఉంచారు. ఈ వేడుకల్లో కోహ్లి, అనుష్క శర్మ, సహచరులు పాల్గొన్నారు. -
ఐదేళ్ల క్రితం టీమిండియా...
సరిగ్గా ఐదేళ్ల క్రితం మినీ ప్రపంచకప్‌గా భావించే చాంపియన్స్ ట్రోఫీని టీమిండియా ముద్దాడిన రోజు. ఆ మధుర క్షణాలకు నేటితో(జూన్ 23) సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఐసీసీ ఓ ట్వీట్ ద్వారా ఆ మధుర క్షణాలను గుర్తు చేసింది. 2013లో జరిగిన ఈ మెగా టోర్నీని ఇంగ్లండ్, వేల్స్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. మినీ ప్రపంచ కప్‌గా భావించే ఈ టోర్నీ ఫైనల్లో ఇంగ్లండ్ జట్టుపై ఐదు పరుగుల తేడాతో ధోని సేన అపురూప విజయం సాధించింది. మెగా టోర్నీని ఆ దఫా మాత్రమే టీ20 ఫార్మట్‌లో నిర్వహించటం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అనంతరం 130 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ సులభంగా ఛేదించేలా కనిపించింది. 20 బంతుల్లో 22 పరుగులు చేయాలి, చేతిలో ఆరు వికెట్లు ఉండటంతో మ్యాచ్ ఇంగ్లండ్‌కే అనుకూలంగా మారింది. ఈ తరుణంలో ఇషాంత్ శర్మ వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది. చివర్లో ధోని మాస్టర్ కెప్టెన్సీ, బౌలర్ల కట్టదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడికి గురైన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా రెండో సారీ చాంపియన్స్ ట్రోఫీని గెలచుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవటం ఇది రెండో సారి. గతంలో(2002) గంగూలీ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ట్రోఫీని గెలుచుకుంది. #OnThisDay in 2013, India won the Champions Trophy 2013 in a thriller. In a rain-shortened game, England had needed 20 runs from 22 balls with six wickets in hand, before Ishant Sharma took two wickets in an over to spark a collapse as India won by five runs. pic.twitter.com/0hauhN1e86 — ICC (@ICC) June 23, 2018 -
ధోనీ vs బ్రేవో : గెలిచిందెవరు?
సాక్షి, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ -11వ సీజన్లో త్రీ రన్స్ చాలెంజ్ బాగా పాపులర్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనితో ఆ జట్టు ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో ఈ పోటీలో పాల్గొన్నారు. మరి ఇద్దరిలో గెలిచిందెవరూ?. ఇంకెవరు వయసు మీద పడుతున్నా యువ ఆటగాళ్లకు సవాలు విసురుతున్న ధోనినే నెగ్గాడు. అవును. ధోని, బ్రేవోలు ఇద్దరు హోరాహోరీగా వికెట్ల మధ్య పరుగులు తీశారు. అయితే, బ్రేవో కంటే కొన్ని ఇంచ్‌ల ముందు క్రీజులో బ్యాట్‌ను పెట్టిన ధోని గెలుపొందాడు. అవార్డుల ప్రధానోత్సవం తర్వాత చాలాసేపు చెన్నై ఆటగాళ్లంతా మైదానంలో సందడి చేస్తూ గడిపారు. ఈ సమయంలోనే బ్రేవో-ధోనిల మధ్య త్రీ రన్స్ ఛాలెంజ్ నిర్వహించారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను చూసేయ్యండి. -
రణస్థలం
-
చెన్నైలో మ్యాచ్‌లు జరగకపోవడం నిరాశకు గురిచేసింది
-
ఫాలోయింగ్ పెరిగింది
మహేశ్‌బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరు. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హెడ్డింగ్ చూసి స్పెషల్‌గా ఫాలోయింగ్ పెరగడమేంటీ అని అనుకుంటున్నారు. ఇది సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి. ట్వీటర్ అకౌంట్లో మహేశ్‌బాబును సుమారు 65 లక్షలమంది ఫాలో అవుతారు. కానీ ఈ సూపర్ స్టార్ మాత్రం తన బావ గల్లా జయదేవ్, దర్శకుడు కొర టాల శివను మాత్రమే ఫాలో అవుతుంటారు. కానీ రీసెంట్గా ఆయన ఫాలో అయ్యేవారి సంఖ్య 2 నుంచి 8కి పెరిగింది. అందులో దర్శకులు రాజమౌళి, క్రికెట్ ప్లేయర్స్ సచిన్ టెండుల్కర్, మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లి, రాజకీయ నాయకుడు కేటీఆర్ రచయిత టోనీ రాబిన్స్ ఉన్నారు. ట్వీటర్లో చాలా యక్టీవ్గా ఉండే మహేశ్ తను అభిమానించే వాళ్లని, తన సన్నిహితులను ఫాలో అవుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఫారిన్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న మహేశ్ జూన్ 9న ఇండియా రిటర్న్ అవుతారట. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారు మహేశ్. -
జీవాతో కలిసి సందడి చేసిన ధోని..వీడియో వైరల్
-
ఢిల్లీ విజయ ఢంకా
ఓడిపోతే ఢిల్లీకి పోయేదేమీ లేదు! గెలిస్తే చెన్నైకు రన్‌రేట్ పెరగడం తప్ప ఒరిగేదేమీ లేదు! అభిమానులకు చూద్దామన్న ఆశ అంతకంటే లేదు...! దీనికి తగినట్లే ఆటలో మెరుపే లేదు...! పరుగులకు ఇబ్బంది పెట్టిన పిచ్‌పై ఆడుతున్నది టి20నా...? వన్డేనా...? అన్నట్లు సాగిన మ్యాచ్‌లో నమోదైంది ఒకే ఒక్క అర్ధ శతకం...! ఢిల్లీనే సాధారణ స్కోరు చేసిందనుకుంటే... చెన్నై అతి సాధారణంగా ఆడి ఓడింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హర్షల్ పటేల్ (16 బంతుల్లో 36 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు; 1/23) ఆల్‌రౌండ్ ప్రతిభతో డేర్‌డెవిల్స్‌కు ఊరట విజయం దక్కింది. ఢిల్లీ: అదేంటో మరి... ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు సీజన్ చివర్లో కాని జోష్ రాదనుకుంటా...! వరుస పరాజయాలతో ప్లే ఆఫ్‌కు ఎప్పుడో దూరమై... ప్రేక్షకులకు ఏ కోశానా ఆసక్తి లేకుండా పోయిన వేళ... ఆ జట్టు పటిష్ఠమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ఆశ్చర్యపర్చింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ... నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హర్షల్‌తో పాటు రిషభ్ పంత్ (26 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), విజయ్ శంకర్ (28 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో అంబటి తిరుపతి రాయుడు (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా మిగతావారి నుంచి మెరుపులు లేకపోవడంతో చెన్నై ఆరు వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేసి 34 పరుగులతో ఓటమి పాలైంది. లెగ్ స్పిన్నర్లు అమిత్ మిశ్రా (2/20), సందీప్ లమిచానే (1/21) ప్రత్యర్థిని కట్టిపడేశారు. అంతా చప్పచప్పగా... పంత్, హర్షల్ మినహా ఏ బ్యాట్స్‌మెన్ స్ట్రయిక్ రేట్ 130 దాటలేదంటేనే డేర్ డెవిల్స్ ఇన్నింగ్స్ సాగిన తీరును చెప్పొచ్చు. ఓపెనర్లలో పృథ్వీ షా (17) పూర్తిగా తడబడుతూ ఆడాడు. చాలా బంతులు అతడి బ్యాట్‌కు దగ్గరగా వెళ్లాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (19) బ్యాట్ ఝళిపించలేకపోయాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి స్కోరు 39/1. ఆ తర్వాత కూడా రిషభ్, అయ్యర్‌లను చెన్నై బౌలర్లు స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. హర్భజన్ వేసిన 10వ ఓవర్లో పంత్ రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టడంతో కొంత కదలిక వచ్చింది. కానీ, మరుసటి ఓవర్లోనే ఇన్‌గిడి ఇద్దరినీ అవుట్ చేశాడు. వైఫల్యాల పరంపర కొనసాగిస్తూ... జడేజా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్‌కు యత్నించి మ్యాక్స్‌వెల్ (5) బౌల్డయ్యాడు. గత మ్యాచ్‌లో గడగడలాడించిన అభిషేక్ శర్మ (2) ఈసారి చేతులెత్తేశాడు. 15 ఓవర్లకు స్కోరు 102/5. విజయ్ శంకర్, హర్షల్ అప్పుడో షాట్ ఇప్పుడో షాట్ కొడుతూ బండి నడిపించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో బ్రేవో పనిపట్టారు. హర్షల్ మూడు, శంకర్ ఒక సిక్స్ బాదడంతో ఈ ఓవర్లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. దీంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. విశేషమేమంటే బంతితో గిమ్మిక్కులు చేస్తూ, బ్యాట్స్‌మెన్‌ను బుట్టలో పడేస్తాడని పేరున్న బ్రేవో... హర్షల్ ధాటికి భారీగా (0/52) పరుగులిచ్చుకున్నాడు. అతడు కొట్టిన నాలుగు సిక్స్‌లూ బ్రేవో బౌలింగ్‌లోనే కావడం గమనార్హం. చెన్నై ఛేదించలేకపోయింది... లక్ష్యం మరీ పెద్దదేం కాదు. ప్రత్యర్థి బౌలింగ్ ఏమంత భీకరం కాదు. దీంతో ఛేదనను చెన్నై ఊదేస్తుందని అంతా భావించారు. కానీ, వారికీ పరుగులు గగనంగానే వచ్చాయి. 5 ఓవర్లకు స్కోరు 22 మాత్రమే. అయితే, అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రాయుడు మూడు సిక్స్‌లు, ఫోర్ సహా 22 పరుగులు రాబట్టడంతో ఒక్కసారిగా కదలిక వచ్చింది. కానీ, మిశ్రా వస్తూనే వాట్సన్‌ను బుట్టలో వేశాడు. ఓ ఎండ్‌లో తనవంతుగా ఆడుతూ అర్ధ సెంచరీ (28 బంతుల్లో) అందుకున్న రాయుడు ... భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో మ్యాక్స్‌వెల్‌కు చిక్కాడు. అప్పటికీ ధోని (17), రైనా (15) ఉండటంతో గెలుపుపై ఆశలున్నాయి. తొలి బంతికే అవుటయ్యే ప్రమాదం తప్పించుకుని, ఆసాంతం ఇబ్బందిగా కనిపించిన రైనాను సందీప్ లమిచానే పెవిలియన్‌కు చేర్చాడు. సమీకరణం 41 బంతుల్లో 73గా ఉన్న దశలో బిల్లింగ్స్ (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. జడేజాను మరోసారి బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా పంపినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బౌలర్లు ధోనికి షాట్లు కొట్టే చాన్సే ఇవ్వలేదు. దీంతో లక్ష్యం అంతకంతకు పెరుగుతూ పోయింది. 18వ ఓవర్లో ధోనిని అవుట్ చేసిన బౌల్ట్ ఐదు పరుగులే ఇచ్చాడు. 12 బంతుల్లో 50 పరుగులు చేయడం జడేజా(27 నాటౌట్), బ్రావో (1) తరం కాలేదు. -
బ్రావోతో కలసి స్టెప్పులేసిన ధోని కూతురు
-
ధోని కూతురితో బ్రావో స్టెప్పులు..!!
సాక్షి, హైదరాబాద్ : అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ తన వంతు వచ్చినప్పుడు ఆటలో సత్తా చూపించే ఆల్రౌండర్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో కూడా ఒకరు. 2016లో బ్రావో పాడిన ‘చాంపియన్స్’పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రావో ఆ పాటను ధోని, రైనా కూతుళ్లు జీవా, గ్రేసియాల కోసం మళ్లీ పాడారు. దీంతో ఈ పాటకు జీవా, బ్రావోతో కలసి స్టెప్పులేసింది. కేవలం జీవానే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరికొంత మంది పిల్లలు కూడా డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్టు చేసింది. -
రైనా కుమార్తె పుట్టిన రోజు వేడుకల్లో చెన్నై అటగాళ్ల సందడి
-
గ్రేసియా పుట్టినరోజు.. చెన్నై సందడి..
న్యూఢిల్లీ : చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా కుమార్తె గ్రేసియా పుట్టిన రోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు ధోనీ, బ్రావో, హర్భజన్ సింగ్‌లు హాజరై ఆటపాటలతో అలరించారు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ట్విటర్ నుంచి ఓ వీడియోను విడుదల చేసింది. లీగ్ మ్యాచ్‌లలో భాగంగా మంగళవారం ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో చెన్నై తలపడనుంది. రైనా గారాలపట్టి వేడుకకు బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. వేడుకల సందర్భంగా ఆటగాళ్లు సందడి చేసిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. Here is your midnight dose of cuteness to begin a super happy Wednesday! #WhistlePodu #GraciaTurns2 @ImRaina @_PriyankaCRaina @msdhoni @DJBravo47 @Geeta_Basra 🦁💛 pic.twitter.com/UbIRi7m0F6 — Chennai Super Kings (@ChennaiIPL) 15 May 2018 -
కోపం రాకుండా చూసుకోవాలి
ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి ఎం.ఎస్. ధోని రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి తర్వాత తొలిసారి బహిరంగంగా తన అసహనాన్ని ప్రదర్శించాడు. బ్యాట్స్‌మన్ రనౌటయ్యే అవకాశం లేకున్నా షేన్ వాట్సన్ అనవసర త్రో కారణంగా రెండో పరుగు కూడా రావడంతో రాజస్తాన్ విజయం ఖాయమైంది. బట్లర్ అసాధారణ ఇన్నింగ్స్‌తో రాజస్తాన్‌కు అద్భుత విజయం అందించాడు. వాట్సన్ నుంచి అనవసర త్రోలు రావడం ఇది తొలిసారేం కాదు. 2014లో రాజస్తాన్‌కు ఆడుతున్న సమయంలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ వాట్సన్ ఇలాగే చేశాడు. ఆ మ్యాచ్‌లో వాట్సన్ ఓవర్‌త్రో కారణంగా ముంబైకి రెండు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఫాల్క్‌నర్ వేసిన ఆఖరి బంతిని ఆదిత్య తారే సిక్సర్‌గా మలిచి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు కోచ్‌గా ఉన్న ద్రవిడ్ కూడా వాట్సన్ చర్యకు కోపగించుకొని డగౌట్లో తన టోపీని నేల కేసి విసిరి కొట్టాడు. ఒక మ్యాచ్‌లో చేసిన పొరపాట్లను తెలుసుకొని వాటిని తదుపరి మ్యాచ్‌లో పునరావృ తం చేయకుండా ఆడటం క్రికెట్లో కీలకం. గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయాన్ని మర్చిపోయి నేడు సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌పై చెన్నై దృష్టి పెట్టాలి. ధావన్, విలియమ్సన్ అద్భుత ఆటతీరుతో ఢిల్లీపై రైజర్స్ సూపర్ ఛేజింగ్ చేసింది. ధోనికి మళ్లీ కోపం రాకూడదంటే చెన్నై బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేసి సన్‌రైజర్స్‌పై విజయాన్ని అందించాలి. -
ఈ విషయం నా భార్యతో చెప్పొద్దు : ధోని
పూణె : టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోని జీవితం ఆధారంగా ‘ఎంఎస్ ధోని ది అన్‌టోల్డ్ స్టోరి’ చిత్రం తెరకెక్కిదంటే అతని క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఆ సినిమాలో కూడా ధోని వ్యక్తిగత అంశాలను అంత లోతుగా చూపెట్టలేదనేది అభిమానుల భావన. మిస్టర్ కూల్ ధోని కూడా ఎప్పుడు తన వ్యక్తిగత విషయాలను బయటికి వెళ్లడించడానికి అంతగా ఆసక్తి చూపలేదు. అభిమానులు మాత్రం అతని పర్సనల్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వారందరికి ఆనందం కలిగించేలా.. ధోని తన ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పేశాడు. మంగళవారం ఐపీఎల్ స్పాన్సర్స్ నిర్వహించిన ఓ ప్రచార కార్యక్రమంలో ధోని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధోనితో పాటు.. షేన్ వాట్సన్, రవీంద్ర జడేజా, సురేశ్ రైనాతో పాటు కొంత మంది సీఎస్కే ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత ధోనిని ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. అందుకు మొదట అయిష్టత వ్యక్తంచేసిన ధోని.. అప్పట్లో ఇలాంటి ట్రెండ్ లేదని తెలిపారు. చివరిగా మౌనం వీడిన ధోని.. తన ఫస్ట్ క్రష్ స్వాతి అని తెలిపారు. ఇది తన భార్యతో చెప్పొద్దని సరదాగా వ్యాఖ్యానించారు. తాను 1999లో ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు అ అమ్మాయిపై క్రష్ ఏర్పడిందని ధోని వెల్లడించారు. కాగా.. ధోని తన చిన్ననాటి స్నేహితురాలు సాక్షిని ధోని 2010లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. -
ధోని తీవ్ర అసంతృప్తి..
కోల్‌కతా : కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో పరాజయంపై జట్టు సభ్యులు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నారు. ఫీల్డింగ్, బౌలింగ్‌లలో ఆటగాళ్లు విఫలం కావడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పేలవ ఫీల్డింగ్, బౌలింగ్‌తో చెన్నై గురువారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చవి చూసింది. బౌలింగ్ విఫలం కావడంతో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి నుంచి తృటిలో తప్పించుకుంది. లైన్ అండ్ లెంగ్త్‌ను వదిలేసి, బౌలింగ్ ప్లాన్‌ను మరచిపోయి కేకేఆర్ బ్యాట్స్మన్లకు చెన్నై బౌలర్లు పరుగులు సమర్పించుకున్నారు. వాస్తవానికి ఏడో ఓవర్ వచ్చే సరికి క్రిస్ లిన్, రాబిన్ ఉతప్ప, సునీల్ నరైన్‌లను చెన్నై బౌలర్లు పెవిలియన్‌కు పంపారు. ఆ తర్వాత వచ్చిన యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్, కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌లు జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. ఫీల్డింగ్‌లో చెన్నై చేసిన పొరబాట్లు కూడా ధోనికి కోపం తెప్పించాయి. ఉత్తమ ఫీల్డర్‌గా పేరున్న జడేజా వరుస బంతుల్లో సునీల్ నరైన్ క్యాచ్‌లను జార విడిచారు. మైఖేల్ హస్సీ మైదానంలో వేగంగా కదలకపోయినా ఫీల్డింగ్‌లో మేనేజ్ విజయం సాధించడానికి కారణంగా అతను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటమేనని ధోని అన్నారు. బౌలర్ల పంథాలో మార్పు లేకుంటే తరచుగా వారిని మార్చాల్సివుంటుందని అభిప్రాయపడ్డారు. -
అది ధోనికి మాత్రమే సాధ్యం!
పరాజయం నుంచి కోలుకొని వెంటనే గెలుపు బాట పట్టడం ఐపీఎల్ జట్లకు ఎంతో అవసరం. ముంబై చేతిలో ఓడిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సరిగ్గా ఇదే చేసి చూపించింది. కొత్త ఓపెనింగ్ జోడితో ప్రయోగం చేసి కూడా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆ జట్టు ఢిల్లీని ఓడించింది. బ్యాటింగ్ ఆర్డర్లో దిగువ స్థానంలో రావడం తన ఆటపై ఎలాంటి ప్రభావం చూపిందంటూ సత్తా చాటిన రాయుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో తాను ఎంత చక్కటి ఆటగాడో నిరూపించాడు. మ్యాచ్‌లో ఏ సమయంలో దూకుడుగా ఆడాలో, ఏ సమయంలో సింగిల్స్, రెండు పరుగులు తీసి చకచకా ఇన్నింగ్స్‌ను నడిపించాలో అతనికి బాగా తెలుసు. ఒక ఎండ్‌లో అతను ఎక్కువ సేపు పట్టుదలగా క్రీజ్‌లో నిలవడం అంటే చెన్నై జట్టు మరో ఎండ్‌లో విరుచుకుపడి భారీ స్కోర్లు చేసేందుకు అవకాశం లభించినట్లే. విధ్వంకరమైన షాట్లు ఆడుతున్న ధోని ఫామ్‌ను బట్టి చూస్తే ప్రత్యర్థి ఎంత పెద్ద లక్ష్యం విధించినా చెన్నై ఛేదించేయగలదని అనిపిస్తుంది. జట్టు బ్యాటింగ్‌లో లైనప్‌లో అనుభవజ్ఞులైన రైనా, వాట్సన్ ఉన్నారు. వీరిద్దరు కూడా ఏ సమయంలోనైనా భారీ షాట్లు ఆడగలరు. అయితే చెన్నైలో ఒకే ఒక చిన్న లోపం కనిపిస్తోంది. సన్‌రైజర్స్ మినహా ఇతర జట్లలాగే ఇక్కడ బౌలింగ్ పదునుగా లేదు. పవర్‌ప్లేలో, ఆపై చివరి ఓవర్లలో కూడా బౌలింగ్ అంత ప్రభావం చూపించడం లేదు. ఈ విషయంలో అతి చిన్న లక్ష్యాలను కూడా మంచి తేడాతో కాపాడుకోగలిగిన సన్‌రైజర్స్ బౌలర్లు మాత్రం అద్భుతమని చెప్పవచ్చు. కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలింగ్ కూడా సమతూకంగా ఉంది. కార్తీక్ పేస్, స్పిన్‌ను సమర్థంగా ఉపయోగిస్తుండటంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ భారీ షాట్లు కొట్టడం కష్టంగా మారిపోతోంది. లీగ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లలో సరైన బౌలర్లను ఎంచుకోకుండా తప్పు చేసిన కోల్‌కతా కెప్టెన్ ఇప్పుడు ఆ విషయంలో కుదురుకున్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్‌లలో అతని వ్యూహాలను తప్పుపట్టలేం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై క్రిస్ లిన్ ప్రదర్శనను చూస్తే జట్టు బ్యాటింగ్ కూడా పటిష్టంగా మారినట్లే. లోయర్ ఆర్డర్లో పరిస్థితులకు తగినట్లుగా ఆడుతున్న యువ ప్రతిభావంతుడు శుబ్‌మన్ గిల్ ఉండటం కూడా జట్టుకు మేలు చేస్తోంది. ప్రత్యర్థులు షార్ట్ పిచ్ బంతులతో నరైన్‌ను పడగొడితే గిల్ ముందుగా బ్యాటింగ్‌కు వచ్చి అక్కడ కూడా సత్తా చాటగల సమర్థుడు. ఈడెన్ మైదానం కోల్‌కతా జట్టుకు పెట్టని కోట. దీనిని పడగొట్టాలంటే ధోనికుంటే ప్రత్యేక తెలివితేటలు అవసరం. -
అతడిలా ఆడితే కెప్టెన్లు, బౌలర్లకు కష్టమే
టైమింగ్‌ను దొరకబుచ్చుకుని చెలరేగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇలాగే ఆడితే... ప్రత్యర్థి కెప్టెన్లు, బౌలర్లకు కష్ట కాలమేనని ఆ జట్టు బ్యాట్స్‌మన్ డుప్లెసిస్ అన్నాడు. ‘ధోని అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. వైడ్ వేసినా లెగ్ సైడ్‌లో భారీ షాట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. తలచుకున్నదే ఆలస్యం... ఎలాంటి బంతినైనా షాట్ కొట్టేలా ఉన్న తనకు ఈ సమయంలో బౌలింగ్ చేయడం చాలా కష్టం’ అని కొనియాడాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల అంబటి రాయుడు సామర్థ్యం తనను ఆకట్టుకుందని చెప్పుకొచ్చాడు. -
చెన్నై @ 100 విజయాలు
సాక్షి, హైదరాబాద్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డు సృష్టించారు. అంతేకాకుండా అత్యధిక టీ-20లు గెలిచిన జట్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 11వ సీజన్లో భాగంగా సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలుపుతో ధోని ఈ ఘనతను అందుకున్నారు. కెప్టెన్‌గా ధోని నేతృత్వంలో చెన్నైకి ఇది 100వ విజయం. చెన్నై సూపర్‌కింగ్స్ మొత్తం 166 మ్యాచ్‌లు ఆడగా 100 విజయాలు నమోదు చేసుకుంది. ఐపీఎల్లో చెన్నై అత్యధిక విజయాలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పైనే సాధించింది. ఇప్పటివరకూ మొత్తం 12 సార్లు ఆర్సీబీపై చెన్నై గెలిచింది. కాగా, అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన జట్ల జాబితాలో ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకూ 186 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ 104 విజయాలను సాధించింది. -
అత్యధిక పరుగుల కెప్టెన్ ధోనినే
సాక్షి, హైదరాబాద్ : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నారు. సోమవారం ఢిల్లీపై ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా మహీ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకూ ఈ రికార్డు గౌతమ్ గంభీర్ (3518 పరుగులు) పేరిట ఉండేది. కాగా, ఢిల్లీపై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ధోనీ (3536 పరుగులతో) దాన్ని అధిగమించాడు. అత్యధిక పరుగులు చేసిన ఐపీఎల్ కెప్టెన్ల జాబితాలో విరాట్ కొహ్లీ (3333 పరుగులు), రోహిత్ శర్మ (2198 పరుగులు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే ధోని టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే గంభీర్, కోహ్లి, రోహిత్‌ల కంటే ముందుండటం కొసమెరుపు. -
ధోనిని చూసి కుర్రాళ్లు నేర్చుకోవాలి
పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్‌పై సాధికారిక విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు అనిపిస్తోంది. గత సీజన్లలో ముంబై ఆరంభంలో తడబడి ఆ తర్వాత కోలుకొని చాంపియన్‌గా నిలిచిన సందర్భాలున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆకట్టుకుంది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన అతను జట్టును విజయబాట పట్టించాడు. లీగ్ తొలి మ్యాచ్‌లోనే ముంబైను ఓడించి... ఇపుడు అదే జట్టు చేతిలో ఓటమి పాలైన చెన్నై నేడు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచ్‌లో పుంజుకునే అవకాశం ఉంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రాకతో ఢిల్లీ జట్టు పరాజయాల బాటను విడిచి విజయపథంలోకి వచ్చింది. మరోవైపు ఇద్దరు యువ బౌలర్లు అవేశ్ ఖాన్, శివమ్ మావి దుందుడుకు ప్రవర్తనకుగాను ఐపీఎల్ కౌన్సిల్ మందలించడం శుభపరిణామం. బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేశాక ఈ ఇద్దరు బౌలర్లు అభ్యంతరకర భాషను ప్రయోగించడం మంచిది కాదు. యువ క్రికెటర్లలో ఈ దూషణ పర్వం అలవాటును మొగ్గలోనే తుంచేయాలి. అయితే టీవీల్లో తమ సీనియర్ క్రికెటర్ల ప్రవర్తనను చూశాకే వీరు కూడా ఇలా చేసి ఉంటారనిపిస్తోంది. ఈ మందలింపు అనేది ఈ ఇద్దరితోపాటు మిగతా యువ ఆటగాళ్లకు హెచ్చరికలాంటిదే. వికెట్ తీసినపుడుగానీ, అర్ధ సెంచరీ చేసినపుడగానీ ఆవేశంతో సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో అర్ధం కావడంలేదు. ఆవేశం ప్రదర్శించే బదులు హాయిగా నవ్వుతూ ఆ క్షణాలను ఆస్వాదిస్తే అందరికీ బాగుంటుంది. మైదానంలో ఎలా ప్రవర్తించాలనే విషయంలో యువ క్రికెటర్లు ధోనిని చూసి నేర్చుకోవాలి. సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించినా ధోని ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లిపోతాడు. విజయంలోనూ అతను హుందాతనం చూపిస్తాడు. -
సొంతగడ్డపై పంజాబ్‌కు మరో గెలుపు
-
ధోని ధమాకా సరిపోలేదు
మొహాలి: ఐపీఎల్లో మరో ఉత్కంఠభరిత ముగింపు... మహేంద్ర సింగ్ ధోని (44 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శనతో సూపర్ కింగ్స్‌ను విజయానికి చేరువగా తెచ్చినా చివరకు పంజాబ్‌దే పైచేయి అయింది. విజయానికి చివరి ఓవర్లో 17 పరుగులు కావాల్సి ఉండగా, చెన్నై 12 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు రెండు ఓవర్లలో కలిపి ధోని ధమాకా బ్యాటింగ్‌తో 38 పరుగులు రాగా... వెన్నునొప్పితో సరిగ్గా కదల్లేకపోయిన చెన్నై కెప్టెన్ ఆఖరి ఓవర్లో లాంఛనం పూర్తి చేయలేకపోయాడు. ఆదివారం ఇక్కడి పీసీఏ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ 4 పరుగుల తేడాతో చెన్నైను ఓడించింది. సొంతగడ్డపై అశ్విన్ సేనకు ఇది రెండో విజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన క్రిస్ గేల్ (33 బంతుల్లో 63; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) తనదైన శైలిలో చెలరేగి అర్ధ సెంచరీ సాధించగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (22 బంతుల్లో 37; 7 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 48 బంతుల్లోనే 96 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ (19 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కరుణ్ నాయర్ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడటంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో ఠాకూర్, తాహిర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసింది. ధోని మెరుపు బ్యాటింగ్ చేయగా, అంబటి రాయుడు (35 బంతుల్లో 49; 5 ఫోర్లు, ఒక సిక్స్) కూడా మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. టైకి 2 వికెట్లు దక్కాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘బయటపడితే 8 పరుగులు ఇవ్వండి’
సాక్షి, హైదరాబాద్ : దాదాపు రెండేళ్ల తర్వాత పసుపు జెర్సీతో చెన్నై చెపాక్ స్టేడియంలో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ మంగళవారం అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ ప్రత్యర్థి జట్టు 17 సిక్సర్లు కొట్టగా.. చెన్నై జట్టు 14 సిక్సర్లు బాదింది. అయితే మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రస్సెల్ ఒక్కడే 17 సిక్సర్లలో 11 సిక్సర్లు బాదారు. అందులో కొన్ని సిక్సర్లకు బంతి స్టేడియం బయట పడ్డాయి. కీపర్‌గా వికెట్ల వెనుక ఉండి వీటిని తిలకించిన ధోని ప్రెజెంటేషన్ సమయంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. మ్యాచ్‌లో ఎక్కువ మొత్తంలో సిక్సర్లు నమోదయ్యాయని చెబుతూ బంతి స్టేడియం అవతల పడిన ప్రతిసారీ సిక్సర్‌కు ఆరుకు బదులు ఎనిమిది పరుగులు ఇస్తే బావుంటుందని జోక్ చేశారు. -
ధనాధన్ ఆటకు అంతా సిద్ధం!
పది వసంతాల క్రితం వేసవి అంటే భారత్‌లో ఆటలకు బ్రేక్... విశ్రాంతి అనో విరామం పేరుతోనో ఆటగాళ్లు మైదానానికి దూరమైతే అభిమానులు ‘ఇండోర్ గేమ్స్’కే పరిమితం! ఇలాంటి సమయంలో క్రికెట్ అభిమానులపై పన్నీటి జల్లు కురిసింది. చిన్నస్వామి స్టేడియంలో బ్రెండన్ మెకల్లమ్ సృష్టించిన పెద్ద తుఫాన్ క్రికెట్ వినోదానికి కొత్త చిరునామాను చూపించింది. టి20 క్రికెట్ అంటే ఆట మాత్రమే కాదు మరెంతో ఉందంటూ దూసుకొచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్‌ను మార్చేసింది. కొడితే ఫోర్, లేదంటే సిక్సర్... బంతి గాల్లో లేచిందంటే చాలు నరాలు తెగే ఉద్వేగం, ఉత్కంఠ... ఒక్క బంతితో ఫలితాలు మారిపోయే మ్యాచ్‌లు...ఒక్కటి కూడా ప్రేక్షకులను నిరాశ పరచని మ్యాచ్‌లు...చీర్ గర్ల్స్లు, ఆపై చీర గర్ల్స్ కూడా వచ్చి బౌండరీ బయటనుంచి కూడా అభిమానుల ఉత్సాహాన్ని పెంచాయి. ఐపీఎల్‌ను మన నట్టింట్లోకి తీసుకు వచ్చేశాయి. దశాబ్దం దాటిపోయింది... ఐపీఎల్ సాధారణ లీగ్ స్థాయి నుంచి పైపైకి ఎదిగి అందనంత ఎత్తులో శిఖరాన నిలిచింది. ఇప్పుడు ఐపీఎల్ అంటే ఒక టోర్నీ మాత్రమే కాదు. ప్రపంచ క్రికెట్ అభిమానుల గుండె చప్పుడు. ఇందులో అవకాశం దక్కడం అంటే క్రికెటర్‌కు ఎవరెస్ట్‌ను ఎక్కినంత ఆనందం. అభిమానుల దృష్టిలో తమ దినచర్యలో ఒక భాగం. క్రికెటర్లు కోటీశ్వరులు కావడమే ఐపీఎల్ సాధించిన గెలుపు కాదు. ఏదో ఒక రూపంలో లీగ్‌లో భాగం కావాలని చూసేవారికి లెక్కే లేదు... లీగ్‌లో లెక్కల విలువ గురించి తెలిసి క్రికెటర్ల భుజం మీద బొమ్మగా వాలితే చాలు తమ వ్యాపారం వర్ధిల్లుతుందని భావించి లైన్లో నిలబడే కార్పొరేట్ల జాబితాకు పరిమితే లేదు. ధనాధన్ ఫటాఫట్ బాదుడు... మార్ మార్ మెరుపులు చూడమంటూ ఐపీఎల్ ఇస్తున్న పిలుపుకు వచ్చే 51 రోజులు మనందరం దాసోహం అవడం మాత్రం ఖాయం. ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో సీజన్ సంబరాలకు రంగం సిద్ధమైంది. నేడు ఈ మెగా టోర్నీకి తెర లేవనుంది. వాంఖెడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. మే 27న ఇదే మైదానంలో ఫైనల్ జరుగుతుంది. ఎప్పటిలాగే ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. నిషేధం కారణంగా రెండు సీజన్ల పాటు లీగ్‌కు దూరమైన చెన్నై, రాజస్తాన్ జట్లు పునరాగమనం చేస్తున్నాయి. పదేళ్లు ముగిసిన తర్వాత ఆటగాళ్ల ఎంపిక కోసం ఈ ఏడాది పెద్ద ఎత్తున వేలం జరిగింది. కొద్ది మంది స్టార్లు మినహా ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లు ఈ సారి కొత్త జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు. పదేళ్ళుగా ఫలానా క్రికెటర్ అంటే ఆ జట్టు అంటూ ఐపీఎల్ అభిమానుల మనసులో ముద్రించుకుపోయిన అనేక మందిని ఈసారి వారంతా వేర్వేరు జెర్సీలో చూడబోతుండటం కూడా మరో విశేషం. మూడు సార్లు విజేతగా నిలిచిన ముంబై మరోసారి జయకేతనం ఎగురవేస్తుందా? ధోని మళ్లీ తన టీమ్‌ను గెలుపు దిశగా నడిపించగలడా? ఢిల్లీ, పంజాబ్‌లకు ఈ సారైనా చాన్స్ ఉందా? వార్నర్ లేని రైజర్స్, కొత్త కెప్టెన్‌తో కోల్‌కతా, రహానే నేతృత్వంలో రాజస్థాన్ల అదృష్టం మారుతుందా? అన్నింటికి మించి 2008 నుంచి జట్టు మారని ఒకే ఒక్కడు విరాట్ కోహ్లి ఈ సారైనా కప్‌ను ముద్దాడగలడా అనే ప్రశ్నలకు నేటి నుంచి సమాధానాలు వెతుక్కోవచ్చు. ►ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సురేశ్ రైనా. 161 మ్యాచ్‌లలో అతను 139.09 స్ట్రైక్‌రేట్‌తో 4540 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో కోహ్లి (4418), రోహిత్ శర్మ (4207) నిలిచారు. ►ఐపీఎల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టు ముంబై ఇండియన్స్. 157 మ్యాచ్‌లలో ఆ జట్టు 91 గెలిచి 65 ఓడింది. రెండో స్థానంలో ఉన్న చెన్నై 132 మ్యాచ్‌లలో 79 గెలిచి 51 ఓడింది. -
దిగ్గజాలు దున్నేస్తాయా?
జట్టులో లెక్కకు మిక్కిలి స్టార్లు... మ్యాచ్ ఫలితాన్ని మార్చేసే ఆటగాళ్లు... తడబడినా ఎదురీదగలిగేంత స్థైర్యం... నిలదొక్కుకుని గెలవగల బలగం... ...ఇదీ ముంబై ఇండియన్స్ పరిచయంజట్టును నడిపించేదే ఓ దిగ్గజం... ప్రతికూలత ఎదురైనా వెరవని వైనం... ఉన్న వనరులతోనే గెలవగల నేర్పు... సమష్టి ఆటతీరుకు పెట్టింది పేరు... ...ఇదీ చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం సాక్షి క్రీడా విభాగం : ఐపీఎల్ పది సీజన్లలో ఐదుసార్లు విజేతలు ముంబై ఇండియన్స్ (3), చెన్నై సూపర్‌కింగ్స్ (2) జట్లే. అంటే, మొత్తం టైటిళ్లలో సగం ఈ రెండింటి వద్దే ఉన్నట్లు. దీంతోపాటు ముంబై ఒకసారి, చెన్నై నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచాయి. గణాంకాలు చూస్తేనే తెలిసిపోతుంది ఈ రెండు ఫ్రాంచైజీలు ఎంత బలమైనవో! క్రమంగా ఊపందుకుని కప్‌ను ఎగరేసుకుపోవడం ముంబై తీరైతే, అడ్డంకులను అధిగమిస్తూ, నిలకడైన ఆటతో టైటిల్ కొట్టేయడం చెన్నై లక్షణం. ఈ ఏడాది రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగుతుండగా, రెండేళ్ల నిషేధం తొలగిన చెన్నై మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో పూర్వ వైభవం పొందాలని ఆశిస్తోంది. మరి వీటి బలాబలాలేమిటో, బలహీనతలేమిటో చూద్దాం...! క్రమంగా... బలంగా... తొలి రెండు సీజన్లు లీగ్ దశలో నిష్క్రమణ, తర్వాత మూడేళ్లలో ఒకసారి రన్నరప్, రెండుసార్లు ప్లే ఆఫ్స్, చివరి ఐదేళ్లలో మూడుసార్లు చాంపియన్. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ప్రయాణాన్ని ఇలా మూడు దశలుగా చెప్పుకోవాలి. ఒక దశలో స్టార్లు ఎక్కువై, ఆటగాళ్లు తక్కువై ఫలితాల పరంగా ఈ జట్టు పూర్తిగా నిరాశపరిచింది. కానీ, రోహిత్ చేతికి పగ్గాలు వచ్చాక పరిస్థితి మారింది. 2013లో కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన ఈ హిట్‌మ్యాన్... తర్వాతి ఏడాది నుంచి పూర్తిస్థాయి సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. ముఖ్యంగా 2015, 2017లలో టైటిల్ గెలవడంలో రోహిత్‌దే ముఖ్య పాత్ర. వేలంలోనూ మంచి ఆటగాళ్లను ఎంచుకుని ఈసారి సైతం భారీ అంచనాలతోనే రంగంలోకి వస్తోంది. అయితే... రోహిత్ కాక చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మెన్ ఎవిన్ లూయీస్, డుమిని, సౌరభ్ తివారీ మాత్రమే కావడంతో బ్యాటింగ్ భారమంతా కెప్టెన్‌పైనే పడేలా కనిపిస్తోంది. హార్దిక్, కృనాల్ పాండ్యా, పొలార్డ్ వంటి ఆల్‌రౌండర్లు, బుమ్రా, కమిన్స్, ముస్తాఫిజుర్ వంటి పేసర్లు ఉండటం భరోసానిస్తోంది. ఇదీ జట్టు: రోహిత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సౌరభ్ తివారీ, సూర్యకుమార్, సిద్దేశ్ లాడ్, శరద్లాంబా, తజిందర్ దిల్లాన్, మయాంక్ మార్కండే, అనుకూల్ రాయ్, ఇషాన్ కిషన్, తారే, బుమ్రా, రాహుల్ చహర్, మొహిసిన్ ఖాన్, నిధీశ్, ప్రదీప్ సాంగ్వాన్ (స్వదేశీ), డుమిని, లూయీస్, కట్టింగ్, ధనంజయ, పొలార్డ్, బెహ్రన్‌డార్ఫ్, కమిన్స్, ముస్తాఫిజుర్, మెక్లీనగన్ (విదేశీ). ఘన పునరాగమనం కోసం... ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టంటే చెన్నై సూపర్ కింగ్సే. 2008 నుంచి 2015 వరకు ఎనిమిది సీజన్లలో రెండుసార్లు విజేతగా నిలిచిందీ జట్టు. నాలుగుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకోగా, రెండుసార్లు సెమీఫైనల్స్‌కు చేరింది. పరిస్థితులకు తగ్గట్లు జట్టు సభ్యులను వాడుకునే ధోని నాయకత్వ ప్రతిభ, రైనా మెరుపులకు మిగతా ఆటగాళ్ల సహకారం తోడవడంతో లీగ్‌లో చెన్నై ఎప్పుడూ పేలవ ప్రదర్శన చేయలేదు. ఉన్న వనరులతోనే ఫలితం రాబట్టగలడం ధోని శైలి కాబట్టి ఈసారి కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే... టి20 స్థాయికి తగిన ఓపెనర్లు లేకపోవడం లోటు. వాట్సన్ మునుపటి స్థాయిలో ఆడట్లేదు. దీంతో బిల్లింగ్స్, విజయ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. డు ప్లెసిస్, జాదవ్, రైనా, రాయుడు, ధోనిలతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. బ్రావో, ఇన్‌గిడి, శార్దుల్ పేస్ బాధ్యతలు మో స్తారు. రెండేళ్ల నిషేధంతో జట్టు స్వరూపం కొంత మారినా... మహి నాయకత్వ పటిమ, స్థానిక అభిమానుల మద్దతు చెన్నైకి పెద్ద బలం. దీంతో ఎప్పటిలానే ఈ ఫ్రాంచైజీ కనీసం సెమీస్‌కు చేరగలదని చెప్పొచ్చు. ఇదీ జట్టు ధోని (కెప్టెన్), రైనా, మురళీ విజయ్, హర్భజన్, జాదవ్, రాయుడు, ధ్రువ్ షోరే, జడేజా, కరణ్ శర్మ, క్షితిజ్ శర్మ, నారాయణ్ జగదీశన్, కేఎం ఆసిఫ్, చైతన్య బిష్ణోయ్, దీపక్ చహర్, మోను కుమార్, కనిష్క్ సేథ్, శార్దుల్ ఠాకూర్ (స్వదేశీ). డు ప్లెసిస్, బ్రావో, వాట్సన్, బిల్లింగ్స్, ఇన్‌గిడి, తాహిర్, మార్క్ వుడ్ (విదేశీ). -
ధోని... ఇప్పుడు ‘పద్మభూషణ్’
న్యూఢిల్లీ: ఏప్రిల్ 2, 2011... భారత క్రికెట్ అభిమానులు మర్చిపోలేని రోజు. ధోని సిక్సర్‌తో వన్డే ప్రపంచకప్ అందించిన రోజు. ఇపుడు సరిగ్గా ఏడేళ్ల తర్వాత మళ్లీ ఏప్రిల్ 2న ధోని ‘పద్మభూషణ్’ అవార్డు అందుకున్నాడు. భారత మూడో అత్యున్నత పౌర పురస్కారమైన ఈ అవార్డును మాజీ కెప్టెన్ ఆర్మీ డ్రెస్‌లో అందుకోవడం మరో విశేషం. సోమవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగిన ఈ వేడుకలో లెఫ్టినెంట్ కల్నల్ (గౌరవ హోదా) అయిన ధోని... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకునేందుకు మిలిటరీ డ్రస్‌లో వచ్చాడు. 2007లో టి20 ప్రపంచకప్, అనంతరం వన్డే ప్రపంచకప్ అందించిన ధోనిని భారత ఆర్మీ 2011, నవంబర్ 1న లెఫ్టినెంట్ కల్నల్ హోదాతో సత్కరించింది. రెండు ఆసియా గేమ్స్ (2006, 2010)లలో భారత్‌కు బంగారు పతకాలు అందించడంతోపాటు కెరీర్లో మొత్తం 19 సార్లు వివిధ ఫార్మాట్లలో ప్రపంచ టైటిల్స్ నెగ్గిన క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీకి కూడా రాష్ట్రపతి ‘పద్మభూషణ్’ అవార్డు అందజేశారు.