ధోని లేకుండానే... | Dhoni Not Selected In South Africa T Twenty Series | Sakshi
Sakshi News home page

ధోని లేకుండానే...

Published Fri, Aug 30 2019 6:38 AM | Last Updated on Fri, Aug 30 2019 6:39 AM

Dhoni Not Selected In South Africa T Twenty Series - Sakshi

న్యూఢిల్లీ: వెటరన్‌ దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోని రిటైర్మెంట్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రపంచ కప్‌ అనంతరం ధోని రిటైర్‌ అవుతాడని భావించగా... అతడేమో సైన్యంలో పనిచేసేందుకు మొగ్గుచూపుతూ వెస్టిండీస్‌ పర్యటన నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్నాడు. ఆ బాధ్యతలూ ముగించుకున్నప్పటికీ.. ముందుగా ప్రకటించిన మేరకు రెండు నెలల విరామం (జూలై 21–సెప్టెంబర్‌ 21) పూర్తి కాకపోవడంతో సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు.  పనిభారం తగ్గించే ఉద్దేశంతో గురువారం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కూ చోటివ్వలేదు. వెస్టిండీస్‌పై టి20 సిరీస్‌ గెలిచిన జట్టులోని మిగతా సభ్యులందరికీ స్థానం కల్పించారు. కరీబియన్‌ పర్యటన నుంచి పూర్తి విశ్రాంతినిచ్చిన ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పునరాగమనం చేయనున్నాడు. 
ధోని అమెరికాలో: ధోని ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. ఖాళీ సమయాన్ని అతడు విహార యాత్రకు కేటాయించినట్లు సమాచారం. ఏకైక వికెట్‌ కీపర్‌గా పంత్‌ బాధ్యతలు మోయనున్నాడు. 

దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత టి20 జట్టు: ధావన్, రోహిత్, కోహ్లి (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్, రాహుల్‌ చహర్, దీపక్‌ చహర్, ఖలీల్‌ అహ్మద్, నవదీప్‌ సైనీ.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement