t 20 series
-
లంక ఉత్కంఠ విజయం
కొలంబో: చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన రెండో టి20 మ్యాచ్‌లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1–1తో సమమైంది. నేడే సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టి20 జరగనుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (42 బంతుల్లో 40; 5 ఫోర్లు), తొలి మ్యాచ్ ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్), రుతురాజ్ గైక్వాడ్ (18 బంతుల్లో 21; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. అకిల ధనంజయ రెం డు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌లో శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసి గెలుపొందింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధనంజయ డిసిల్వా (34 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), చమిక కరుణరత్నే (6 బంతుల్లో 12 నాటౌట్; 1 సిక్స్) కడదాక క్రీజులో నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరఫున దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, చేతన్ సకారియా టి20ల్లో అరంగేట్రం చేశారు. పోరాడిన భారత్... మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ విఫలమైనా... జట్టు విజయం కోసం భారత బౌలర్లు చివరి వరకు పోరాడారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి శ్రీలంక కష్టపడింది. 18 ఓవర్లు ముగిశాక శ్రీలంక విజయ సమీకరణం 12 బంతుల్లో 20 పరుగులుగా ఉండగా... 19వ ఓవర్‌ను భువనేశ్వర్ వేశాడు. ఆ ఓవర్లో కరుణరత్నే సిక్సర్ బాదడంతో మొత్తం 12 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా... బౌలింగ్‌కు వచ్చిన సకారియా శ్రీలంకను కట్టడి చేయలేకపోయాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) మినోద్ (బి) షనక 21; ధావన్ (బి) అకిల 40; పడిక్కల్ (బి) హసరంగ 29; సామ్సన్ (బి) అకిల 7; నితీశ్ రాణా (సి) హసరంగ (బి) చమీర 9; భువనేశ్వర్ (నాటౌట్) 13; సైనీ (నా టౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–49, 2–81, 3–99, 4–104, 5–130. బౌలింగ్: చమీర 4–0–23–1; కరుణరత్నే 1–0–6–0; అకిల 4–0–29–2; ఉదాన 1–0–7–0; హసరంగ 4–0–30–1; షనక 2–0–14–1; రమేశ్ మెండిస్ 2–0–9–0; ధనంజయ డిసిల్వా 2–0–13–0. శ్రీలంక ఇన్నింగ్స్: అవిష్క (సి) చహర్ (బి) భువనేశ్వర్ 11; మినోద్ (సి) చహర్ (బి) కుల్దీప్ 36; సమరవిక్రమ (బి) వరుణ్ 8; షనక (స్టంప్డ్) (బి) కుల్దీప్ 3; ధనంజయ డిసిల్వా (నాటౌట్) 40; హసరంగ (సి) భువనేశ్వర్ (బి) చహర్ 15; రమేశ్ మెండిస్ (సి) రుతురాజ్ (బి) సకారియా 2; కరుణరత్నే (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–12, 2–39, 3–55, 4–66, 5–94, 6–105. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–21–1; సకారియా 3.4–0–34–1; వరుణ్ 4–0–18–1; రాహుల్ చహర్ 4–0–27–1; కుల్దీప్ 4–0–30–2. -
అందరి చూపు బుమ్రా పైనే
గుహవాటి: టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. నాలుగు నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతూ బరిలోకి దిగని బుమ్రా తాజాగా శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు. దీనికి సంబంధించి బార్సపరా స్టేడియంలో బుమ్రా బౌలింగ్ చేస్తున్న వీడియో ఒకటి బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. ఆ వీడియోలో బుమ్రా తన పదునైన పుల్ డెలివరితో స్టంప్స్‌ను గిరాటేయడం కనిపించింది. నాలుగు నెలలు ఆటకు దూరంగా ఉన్న బుమ్రా ఎంత కఠోర శ్రమ పడ్డాడనేది వీడియోలో తెలుస్తుంది. 'బుమ్రా వేసిన డెలివరీని ఎవరైనా చూశారా.. ఎలా ఉంది అతని బౌలింగ్' అంటూ ట్వీట్ చేసింది. మరొక ట్వీట్లో 'బుమ్రా తన అన్ని అస్త్రాలతో సిద్ధంగా ఉన్నాడు. అతని ప్రదర్శన చూసేందుకు మీరంతా సిద్ధంగా ఉండండి' అంటూ బీసీసీఐ పేర్కొంది. రానున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని బుమ్రాకు జోడీగా కాంబినేషన్లను ప్రయత్నించేందుకు ఈ సిరీస్ కీలకంగా మరనుంది. కాగా శ్రీలంక సిరీస్‌లో నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్లు బుమ్రాతో బౌలింగ్ పంచుకునే అవకాశం ఉంది. కాగా భువనేశ్వర్, దీపక్ చాహర్‌లు గాయాలతో జట్టుకు దూరమవగా, మంచి ఫాంలో ఉన్న మహ్మద్ షమీకి ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. 'బుమ్రాతో కలిసి మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడనున్నాను. అతనితో బౌలింగ్ పంచుకునేందుకు ఎదురు చూస్తున్నాను. బుమ్రా బౌలింగ్‌ను పరిశీలించడం ద్వారా బౌలింగ్‌లో మరిన్ని మెలుకువలు నేర్చుకుంటాను. నాలోని బలహీనతలను అధిగమించేందుకు అతని సూచనలు వినేందుకు నాకు ఇదే మంచి అవకాశమని ' నవదీప్ సైనీ తెలిపాడు. ఇప్పటికే శ్రీలంక, భారత జట్లు గుహవాటికి చేరుకున్న సంగతి తెలిసిందే. మూడు టీ 20 ల సిరీస్‌లో మొదటి మ్యాచ్ జనవరి 5 ఆదివారం బారామతి స్టేడియంలో జరగనుంది. ఇప్పటివరకు బుమ్రా తన కెరీర్లో 58 వన్డేల్లో 103 వికెట్లు, 12 టెస్టుల్లో 62 వికెట్లు, 42 టీ20ల్లో 51 వికెట్లను పడగొట్టాడు. Missed this sight anyone? 🔥🔥🔝 How's that from @Jaspritbumrah93 #TeamIndia #INDvSL pic.twitter.com/hoZAmnvE2k — BCCI (@BCCI) January 3, 2020 -
టీమిండియాకు భంగపాటు
ఎదురులేదనుకున్న బ్యాటింగ్ ఆర్డర్ చెల్లాచెదురైంది. ప్రభావం చూపెట్టాల్సిన బౌలింగ్ తేలిపోయింది. మొత్తానికి భారత్ ఆట గాడి తప్పింది. వేగం పెంచాల్సిన చోట వికెట్లను కోల్పోవడం... ఆ తర్వాత ఏమాత్రం జోరందుకోలేకపోవడం... టీమిండియా భారీస్కోరుకు కళ్లెం వేసింది. విండీస్ ముందుగా బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించింది. అనంతరం బ్యాటింగ్ మెరుపులతో సులువుగా నెగ్గింది. కీలకదశలో భారత ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం కూడా వారికి కలిసొచ్చింది. తిరువనంతపురం: ప్రత్యర్థి జోరు ముందు భారత్ తలవంచింది. బ్యాటింగ్‌లో ఎదురుదాడి, బౌలింగ్‌లో వాడి లేక రెండో టి20లో టీమిండియా ఓడింది. ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో విరాట్ కోహ్లి బృందాన్ని ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–1తో నిలిచింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. శివమ్ దూబే (30 బంతుల్లో 54; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా, పంత్ (22 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సిమన్స్ (45 బంతుల్లో 67 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) జట్టు గెలిచేదాకా భారత బౌలర్లతో తలపడ్డాడు. లూయిస్ (35 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. ఓపెనర్ల వైఫల్యం... టాస్ నెగ్గిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. భారత్ మార్పుల్లేకుండా బరిలోకి దిగగా... విండీస్ తుది జట్టులో రామ్‌దిన్ స్థానంలో నికోలస్ పూరన్‌ను తీసుకుంది. అయితే భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు రాహుల్ (11; 1 ఫోర్), రోహిత్ శర్మ (15; 2 ఫోర్లు) శుభారంభం అందించలేకపోయారు. నాలుగో ఓవర్లోనే రాహుల్‌ను పియరీ పెవిలియన్ చేర్చగా... మరో నాలుగు ఓవర్లకు హోల్డర్ బంతిని అంచనా వేయడంలో విఫలమైన రోహిత్ క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో 56 పరుగులకే ఓపెనర్లిద్దరూ పెవిలియన్ చేరారు. జోరుకు బ్రేకులు... భారత్ 8వ ఓవర్లో 50 పరుగుల్ని పూర్తిచేసుకుంది. కానీ దూబే తాండవంతో 11వ ఓవర్లోనే వందకు చేరింది. రాకెట్ వేగాన్ని అందుకున్నాక విండీస్ బౌలర్లు పట్టుబిగించడంతో వెనక్కి తగ్గింది. దూబే ఔటైన కాసేపటికే కోహ్లి, శ్రేయస్ అయ్యర్ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో పరుగుల వేగం ఒక్కసారిగా మందగించింది. విలియమ్స్ బౌలింగ్‌లో ఫ్రంట్‌ఫుట్ ఆడేందుకు వచి్చ... ఆఖరి క్షణాల్లో కట్ చేయబోయిన కోహ్లి (17 బంతుల్లో 19; 2 ఫోర్లు) షార్ట్ థర్డ్ మ్యాన్ వద్ద సిమన్స్ చేతికి చిక్కాడు. అయ్యర్ (10; 1 ఫోర్)ను వాల్ష్ ఔట్ చేశాడు. మెరుపులు మెరిపించాల్సిన ఆఖరి ఓవర్లలో జడేజా (9), సుందర్ (0)ల వికెట్లు రాలడంతో భారత్ చేసేదేమీ లేకపోయింది. 11 ఓవర్లలో 100 పరుగులు చేసిన భారత్ ఆఖరి 9 ఓవర్లలో 70 పరుగులకే పరిమితమైంది. చకచకా ఛేదన... విండీస్ ఓపెనర్లు సిమన్స్, లూయిస్ విజయానికి అవసరమైన ఆరంభానిచ్చారు. లూయిస్ చెలరేగుతుంటే ఓపిక పట్టిన సిమన్స్ లక్ష్యఛేదనకు అవసరమైన రన్‌రేట్ పడిపోకుండా జాగ్రత్తపడ్డాడు. వ్యక్తిగత స్కోరు 6 పరుగుల వద్ద సిమన్స్ ఇచ్చిన క్యాచ్‌ను వాషింగ్టన్ సుందర్ వదిలేశాడు. 9 ఓవర్లయినా భారత బౌలర్లెవరూ ఈ జోడీని విడగొట్టలేకపోయారు. పదో ఓవర్ వేసిన సుందర్ బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టేందుకు క్రీజ్ వదిలిన లూయిస్ స్టంపౌట్ అయ్యాడు. దీంతో 73 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత సిమన్స్కు హెట్‌మైర్ (14 బంతుల్లో 23; 3 సిక్స్‌లు) జతయ్యాడు. భారీ సిక్సర్లు బాదిన హెట్‌మైర్... కోహ్లి పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు వెనుదిరిగాడు. తర్వాత పూరన్ (18 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అండతో సిమన్స్ 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. చేతిలో పుష్కలంగా వికెట్లు ఉండటంతో సిమన్స్ బ్యాట్‌కు పనిచెప్పాడు. అవతలివైపు పూరన్ దూకుడు పెంచడంతో లక్ష్యఛేదనలో విండీస్ చకచకా సాగిపోయింది. భారత్ చేతిలో వరుసగా ఏడు పరాజయాల తర్వాత తొలి విజయం సాధించింది. శివమ్... తాండవం బ్యాటింగ్ ఆర్డర్లో కోహ్లి స్థానంలో ప్రమోషన్లో వచ్చిన శివమ్ దూబే ఆరంభంలో కాస్త ఇబ్బంది పడినా... తర్వాత విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పొలార్డ్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో అయితే ఒక్కసారిగా చెలరేగాడు. కెపె్టన్ బౌలింగ్‌లో దూబే మూడు భారీ సిక్సర్లు బాదాడు. బౌన్సర్లు వేస్తే మిడ్‌వికెట్ మీదుగా రెండు సిక్సర్లు కొట్టిన శివమ్... ఆఫ్‌స్టంప్ ఆవల పడిన ఫుల్‌టాస్ బంతిని పాయింట్ వైపు ఫ్లాట్ సిక్స్‌గా మలిచాడు. 3 వైడ్లతో సుదీర్ఘంగా సాగిన ఈ ఓవర్లో 26 పరుగులొచ్చాయి. దూబే 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో కెరీర్లో తొలి ఫిఫ్టీ బాదాడు. మొదటి 14 బంతులకు 12 పరుగులే చేసిన శివమ్ మరో 13 బంతులెదుర్కొనేసరికీ అర్ధసెంచరే పూర్తయ్యింది. వాల్ష్ వేసిన 11వ ఓవర్లో భారీషాట్‌కు ప్రయత్నించి హెట్‌మైర్ చేతికి చిక్కాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) హోల్డర్ 15; రాహుల్ (సి) హెట్‌మైర్ (బి) పియరీ 11; శివమ్ దూబే (సి) హెట్‌మైర్ (బి) వాల్ష్ 54; కోహ్లి (సి) సిమన్స్ (బి) విలియమ్స్ 19; పంత్ (నాటౌట్) 33; శ్రేయస్ (సి) కింగ్ (బి) వాల్ష్ 10; జడేజా (బి) విలియమ్స్ 9; సుందర్ (సి అండ్ బి) కాట్రెల్ 0; దీపక్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 170. వికెట్ల పతనం: 1–24, 2–56, 3–97, 4–120, 5–144, 6–164, 7–167. బౌలింగ్: కాట్రెల్ 4–0–27–1, పియరీ 2–0–11–1, హోల్డర్ 4–0–42–1, విలియమ్స్ 4–0–30–2, పొలార్డ్ 2–0–29–0, వాల్ష్ 4–0–28–2. వెస్టిండీస్ ఇన్నింగ్స్: లెండిల్ సిమన్స్ (నాటౌట్) 67; ఎవిన్ లూయిస్ (స్టంప్డ్) పంత్ (బి) సుందర్ 40; హెట్‌మైర్ (సి) కోహ్లి (బి) జడేజా 23; పూరన్ (నాటౌట్) 38; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–73, 2–112. బౌలింగ్: దీపక్ చాహర్ 3.3–0–35–0, భువనేశ్వర్ 4–0–36–0, సుందర్ 4–0–26–1, చహల్ 3–0–36–0, దూబే 2–0–18–0, జడేజా 2–0–22–1. -
మేఘమా ఉరుమకే...
వానొచ్చేనంటే... ఈ మ్యాచే కాదు భారత్‌కు సిరీస్ గెలవడమే కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రత్యర్థి జట్టు 1–0తో ఆధిక్యంలో ఉంది. మనం ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్‌ను సమం చేయగలుగుతాం. పైగా చివరి పోరులో ఏ ఒత్తిడి లేకుండా ఆడగలుగుతాం. అలా కాకుండా ‘మహా’ తుఫానులో ఈ ఆట ఆగమైతే మాత్రం ఆఖరి పోరులో ఒత్తిడంతా రోహిత్ సేన పైనే ఉంటుంది. రాజ్‌కోట్: ఇరు జట్ల ఆటగాళ్లేమో ఆడేందుకు రె‘ఢీ’ అంటున్నారు. ప్రేక్షకులేమో వీక్షించేందుకు సిద్ధమంటున్నారు. ‘మహా’ తుఫానేమో వీళ్లందరి ఉత్సాహంపై నీళ్లు చల్లేందుకు ‘సై’ అంటోంది. ఏదేమైనా ‘మహా’ గర్జించకుంటేనే ఆటయినా... టి20 మెరుపులైనా సాధ్యమయ్యేవి! తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య గురువారం ఇక్కడ రెండో టి20 జరుగనుంది. టోర్నీలో శుభారంభం చేసిన ప్రత్యర్థి జట్టు సిరీస్ కైవసం చేసుకునే పనిలో పడగా... భారత్ తప్పకుండా గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. రోహిత్ సేన భారమంతా బ్యాట్స్‌మెన్‌పైనే వేసింది. గత మ్యాచ్‌లో చేసిన పొరపాట్లకు తావివ్వకుండా సిరీస్‌లో నిలవాలంటే ఇక్కడ గెలవాల్సిందే. బ్యాటింగ్‌తో పాటు బౌలర్లు కూడా శ్రమిస్తేనే బంగ్లాను ఓడించొచ్చు. లేదంటే మ్యాచ్‌నే కాదు ఏకంగా సిరీస్‌నే మూల్యంగా చెల్లించాల్సి వస్తుంది. ‘పొట్టి’ ఆటలో గట్టి దెబ్బలే! భారత్ ఇంటా బయటా బాగానే ఆడుతోంది. ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌దాకా వెళ్లింది. స్వదేశంలో టెస్టు సిరీస్‌లను వరుసబెట్టి గెలుస్తోంది. ఈ రెండు ఫార్మాట్లలో భారత్ అద్భుతంగా రాణిస్తోంది. కానీ పొట్టి ఫార్మాటే ఈ ఏడాది అదేపనిగా ఇబ్బంది పెడుతోంది. స్వదేశంలో ఆసీస్‌తో టి20 సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా, దక్షిణాఫ్రికాతోనూ కనాకష్టంగా సిరీస్‌ను సమం చేసుకొని బయటపడింది. అప్పుడు రెగ్యులర్ సారథి, బ్యాటింగ్ సంచలనం కోహ్లి ఉన్నప్పటికీ అలాంటి ఫలితాలొచ్చాయి. ఇప్పుడు అతను విశ్రాంతిలో ఉన్నాడు. దీంతో మరింత ఒత్తిడితో అదే ముప్పు ముంచుకొచి్చంది. ఇప్పటిదాకా బంగ్లాపై పొట్టి ఫార్మాట్లో ఎదురులేని రికార్డున్న భారత్... తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇప్పుడు ఎలాగైనా గెలవాలనే గడ్డు పరిస్థితుల్లో జట్టు నిలిచింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌లాంటి జట్టుతో ఓడితే మాత్రం జీరి్ణంచుకోలేని పరాభవం మిగులుతుంది. నాయకుడే నడిపించాలి... ఆ మ్యాచ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ మినహా ఇంకెవరూ పెద్దగా రాణించలేదు. తాత్కాలిక కెప్టెన్ రోహిత్ విఫలమయ్యాడు. ఇప్పుడు గెలిచి నిలవాల్సిన పరిస్థితిలో అతను కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం వచి్చంది. హిట్టర్ లోకేశ్ రాహుల్, యువ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్‌లు కూడా తమ బ్యాట్లకు పనిచెప్పాలి. జట్టులో స్థానం కోసం ఎంతో పోటీ ఉన్న నేపథ్యంలో అందివచి్చన అవకాశాల్ని కుర్రాళ్లు సది్వనియోగం చేసుకోవాలి. లోయర్ మిడిలార్డర్లో కృనాల్ పాండ్యా కూడా ధాటైన ఇన్నింగ్స్ ఆడితే పరుగుల ప్రవాహం పెరుగుతుంది. ప్రత్యర్థి ముందు గెలిచే లక్ష్యాన్ని నిర్దేశించగలుగుతుంది. తొలి మ్యాచ్‌లో పసలేని బౌలింగ్ కూడా భారత్‌ను ముంచింది. జోరు మీదున్న బంగ్లా... నిజానికి పొట్టి ఫార్మాట్లో ఫేవరెట్లంటూ ఉండరు...! ఆ రాత్రి ఎవరు మెరిపిస్తే వాళ్లే గెలుస్తారు. మొదటి మ్యాచ్‌లో బంగ్లా చేసింది అదే! ఇప్పుడు ఏకంగా సిరీస్‌ను చేజిక్కించుకునే మ్యాచ్ ఆడనుంది. గత మ్యాచ్‌లో ఓపెనర్ లిటన్ దాస్ ఒక్కడే విఫలమయ్యాడు. నయీమ్, సర్కార్ విలువైన పరుగులు జతచేశారు. దీనికి ముష్ఫికర్ మెరుపు ఇన్నింగ్స్ జతకావడంతో టి20ల్లో భారత్‌పై తొలి విజయం సాకారమైంది. ఈ విజయమిచి్చన ఆత్మవిశ్వాసంతో బంగ్లా జట్టు మళ్లీ చెలరేగేందుకు తహతహలాడుతోంది. జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెపె్టన్), ధావన్, రాహుల్/సామ్సన్, శ్రేయస్, రిషభ్ పంత్, శివమ్ దూబే, కృనాల్ పాండ్యా, సుందర్, చహల్, దీపక్ చహర్, శార్దుల్/ఖలీల్ అహ్మద్. బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెపె్టన్), లిటన్ దాస్, సౌమ్య సర్కార్, నయీమ్/ మిథున్, ముషి్ఫకర్ రహీమ్, మొసద్దిక్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్, ఇస్లామ్, ముస్తఫిజుర్, అల్ అమిన్/సన్నీ అరాఫత్, షఫీయుల్. ►1 ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ భారత్ తరఫున 100 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడనున్న తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందనున్నాడు. ఇంతకుముందు ధోని 98 మ్యాచ్‌లు ఆడాడు. ఓవరాల్‌గా 100 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడనున్న రెండో క్రికెటర్‌గా రోహిత్ నిలువనున్నాడు. ఈ జాబితాలో షోయబ్ మాలిక్ (పాకిస్తాన్–111 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్‌కే చెందిన షాహిద్ అఫ్రిది 99 మ్యాచ్‌లు ఆడి రిటైరయ్యాడు. ►1 రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం (ఎస్సీఏ) మైదానంలో ఇప్పటివరకు భారత్ రెండు టి20 మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌లో నెగ్గి, మరో మ్యాచ్‌లో ఓడింది. 2013లో ఆ్రస్టేలియా (201/7; 20 ఓవర్లలో)తో జరిగిన మ్యాచ్‌లో భారత్ (202/4; 19.4 ఓవర్లలో) ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. 2017లో న్యూజిలాండ్ (196/2; 20 ఓవర్లలో)తో జరిగిన మ్యాచ్‌లో భారత్ (156/7; 20 ఓవర్లలో) 40 పరుగుల తేడాతో ఓడిపోయింది. పిచ్, వాతావరణం గతంలో ఇక్కడ జరిగిన రెండు టి20ల్లో భారీగా పరుగులు వచ్చాయి. ఈసారి కూడా పిచ్ బ్యాటింగ్‌కే అనుకూలంగా కనిపిస్తోంది కాబట్టి మళ్లీ పరుగుల ప్రవాహం చూసే వీలుంది. నేటి మధ్యాహ్నంకల్లా ‘మహా’తుఫాన్ బలహీన పడుతుందని... సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతంగా ఉంటుందని... రాత్రి వేళలో మాత్రం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గత మ్యాచ్‌లో చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వం. ఇక్కడి పిచ్ బాగుంది. ఈ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం. పెద్ద స్కోర్లు ఖాయం. పొట్టి ఫార్మాట్ కొత్త ఆటగాళ్లను పరీక్షించేందుకు అనుకూలంగా ఉంటుంది. వచ్చే టి20 ప్రపంచకప్ నాటికి రిజర్వ్‌బెంచ్ సత్తా పెంచడమే లక్ష్యం. –భారత కెపె్టన్ రోహిత్ -
ధోని లేకుండానే...
న్యూఢిల్లీ: వెటరన్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ప్రపంచ కప్ అనంతరం ధోని రిటైర్ అవుతాడని భావించగా... అతడేమో సైన్యంలో పనిచేసేందుకు మొగ్గుచూపుతూ వెస్టిండీస్ పర్యటన నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్నాడు. ఆ బాధ్యతలూ ముగించుకున్నప్పటికీ.. ముందుగా ప్రకటించిన మేరకు రెండు నెలల విరామం (జూలై 21–సెప్టెంబర్ 21) పూర్తి కాకపోవడంతో సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. పనిభారం తగ్గించే ఉద్దేశంతో గురువారం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో పేసర్ భువనేశ్వర్ కుమార్‌కూ చోటివ్వలేదు. వెస్టిండీస్‌పై టి20 సిరీస్ గెలిచిన జట్టులోని మిగతా సభ్యులందరికీ స్థానం కల్పించారు. కరీబియన్ పర్యటన నుంచి పూర్తి విశ్రాంతినిచ్చిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం చేయనున్నాడు. ధోని అమెరికాలో: ధోని ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. ఖాళీ సమయాన్ని అతడు విహార యాత్రకు కేటాయించినట్లు సమాచారం. ఏకైక వికెట్ కీపర్‌గా పంత్ బాధ్యతలు మోయనున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత టి20 జట్టు: ధావన్, రోహిత్, కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చహర్, దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ. -
మార్పులు చేర్పులతో...
అమెరికా వేదికగా రెండు టి20 మ్యాచ్‌ల క్రికెట్ సంబరం తర్వాత ఇప్పుడు పోరు విండీస్ గడ్డకు చేరింది. వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్ నెగ్గి ఊపు మీదున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేస్తే... కనీసం సొంత మైదానంలోనైనా గెలుపు అందుకొని పరువు దక్కించుకోవాలని వెస్టిండీస్ ఆశిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల తర్వాత కుర్రాళ్లకు భారత తుది జట్టులో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. మరో వైపు రెండు సార్లు వరల్డ్ కప్ గెలిచినా... అతి ఎక్కువ మ్యాచ్‌లు ఓడిన చెత్త రికార్డు మూటగట్టుకున్న బ్రాత్‌వైట్ బృందం ఈ సారైనా తమ స్థాయికి తగినట్లుగా ఆడుతుందా చూడాలి. జార్జ్‌టౌన్ (గయానా): పొట్టి ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్‌ను మట్టికరిపించిన భారత్ మరో విజయంతో ముగింపు ఇచ్చేందుకు సన్నద్ధమైంది. వెస్టిండీస్‌తో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడి ప్రావిడెన్స్ స్టేడియంలో చివరి మ్యాచ్ జరుగుతుంది. భారత్ ఇప్పటికే 2–0తో సిరీస్ గెలుచుకుంది. భారత్ చేతిలో వరుసగా ఐదు టి20లలో ఓడిన విండీస్ ఒక్క విజయం కోసం తపిస్తోంది. చహర్ బ్రదర్స్‌కు చాన్స్! తొలి రెండు టి20ల్లో ఒకే జట్టుతో ఆడిన భారత్... బెంచీకే పరిమితమైన మిగిలిన నలుగురికి కూడా ఒకేసారి చాన్స్ ఇవ్వాలని భావిస్తోంది. సిరీస్ ఇప్పటికే సొంతమైన నేపథ్యంలో కొత్త కుర్రాళ్లు తమ సత్తా చాటుకునేందుకు ఇది మంచి అవకాశం. పైగా ఐపీఎల్ కారణంగా ఈ ఫార్మాట్లో మన ఆటగాళ్లు రాటుదేలారు కాబట్టి జట్టు కూర్పు మారినా టీమ్ పటిష్టంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ‘చహర్ బ్రదర్స్’ మ్యాచ్‌లో ఆడేందుకు ఎదురు చూస్తున్నారు. పేసర్ దీపక్ చహర్ భారత్ తరఫున ఒకే ఒక్క టి20 ఆడగా, లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ ఇప్పటి వరకు అరంగేట్రం చేయలేదు. ఈ ఏడాది ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా జట్టులోకి ఎంపికైన రాహుల్ ఎలాగూ వన్డే టీమ్‌లో లేడు కాబట్టి ఈ మ్యాచ్‌లో ఆడించవచ్చు. పైగా కెప్టెన్ కోహ్లి పదే పదే చెబుతున్నట్లు వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచ కప్ కోసం సరైన జట్టును తయారు చేసేందుకు కూడా ఈ మ్యాచ్‌లను భారత్ ఉపయోగించుకోనుంది. కేఎల్ రాహుల్‌ను పంత్ స్థానంలో ఆడించే అవకాశం ఉంది. ఇక చాలా రోజులుగా సరైన చాన్స్ లభించని శ్రేయస్ అయ్యర్‌ను బరిలోకి దించవచ్చు. వీరంతా కాకుండా కోహ్లి, రోహిత్, ధావన్, భువనేశ్వర్‌లాంటి ప్రధాన ఆటగాళ్లతో జట్టు తిరుగులేనిదిగా కనిపిస్తోంది. తాజా ఫామ్ ప్రకారం చూస్తే మరో విజయం భారత్‌కు కష్టం కాకపోవచ్చు. గెలిపించేదెవరు? టి20 లీగ్‌లో విధ్వంసక ఆటతో చెలరేగిపోయే వెస్టిండీస్ క్రికెటర్లు అంతర్జాతీయ పోరుకు వచ్చేసరికి మాత్రం పేలవంగా మారిపోయారు. తొలి మ్యాచ్‌లో చెత్త బ్యాటింగ్ ప్రదర్శనతో వంద పరుగులు కూడా చేయలేకపోయిన ఆ జట్టు రెండో మ్యాచ్‌లో కూడా పేలవ రన్‌రేట్‌తో బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను చేజార్చుకుంది. రావ్మన్ పావెల్ అర్ధసెంచరీ చేసినా, పూరన్ నెమ్మదైన బ్యాటింగ్ జట్టును దెబ్బ తీసింది. భారత స్పిన్నర్లు సుందర్, కృనాల్‌లను ఎదుర్కోవడంలో ఆ జట్టు విఫలమైంది. జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న హెట్‌మైర్ పెద్దగా ఆకట్టుకోలేదు. మొదటి మ్యాచ్‌లో బాగా ఆడిన పొలార్డ్ గత మ్యాచ్‌లో క్రీజ్‌లోకి వచ్చే సరికే పరిస్థితి చేయిదాటిపోయింది. పేరుకు బ్యాటింగ్ లైనప్‌లో అంతా దూకుడైన ఆటగాళ్లే కనిపిస్తున్నా ఆశించిన మెరుపులు మాత్రం రాలేదు. ముఖ్యంగా కెప్టెన్ బ్రాత్వైట్నుంచి విండీస్ అభిమానులు ఒక దూకుడైన ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. బ్యాటింగ్‌తో పోలిస్తే జట్టు బౌలింగ్ కొంత మెరుగ్గా ఉండటం ఊరట. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి, రోహిత్, ధావన్, అయ్యర్, రాహుల్, కృనాల్, జడేజా, రాహుల్ చహర్, దీపక్ చహర్, భువనేశ్వర్, ఖలీల్. వెస్టిండీస్: బ్రాత్‌వైట్ (కెప్టెన్), క్యాంప్‌బెల్, నరైన్, పూరన్, హెట్‌మైర్, పొలార్డ్, రావ్మన్ పావెల్, కీమో పాల్, ఖారీ పైర్, కాట్రెల్, థామస్ పిచ్, వాతావరణం దేశం మారినా తొలి రెండు మ్యాచ్‌లలాగే ఇక్కడ కూడా నెమ్మదైన పిచ్ సిద్ధంగా ఉంది. విధ్వంసక షాట్లకు అవకాశం తక్కువ. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చు. -
చెమటోడ్చి ఛేదన..!
పరుగుల ప్రవాహమే అనుకుంటే... వికెట్లు టపటపా పడ్డాయి. ఇరు జట్ల నుంచి ఒకటైనా సెంచరీ నమోదవుతుందని ఊహిస్తే... వంద పరుగులు చేయడం, ఛేదించడమే కష్టమైపోయింది. పట్టుమని పది ధనాధన్ షాట్లైనా లేవు... మెరుపు ఇన్నింగ్స్ అనే మాటే లేదు... అసలు ఆడుతున్నది టి20నేనా అనేంత అనుమానంతో సాగింది భారత్–వెస్టిండీస్ మ్యాచ్. మొదట్నుంచి నిస్సారంగానే కనిపించినా చివరకు టీమిండియానే విజయం సాధించడంతో ఊరట దక్కింది. లాడర్‌హిల్ (అమెరికా) ప్రపంచ కప్ అనంతర ప్రయాణాన్ని భారత్ విజయంతో ప్రారంభించింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్‌లో శనివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అరంగేట్ర పేసర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నవదీప్ సైనీ (3/17) అదరగొట్టడంతో పాటు మిగతా బౌలర్లు తలో చేయి వేయడంతో ప్రత్యర్థిని కట్టిపడేసిన కోహ్లి సేన... బ్యాట్స్‌మెన్ తలా కొన్ని పరుగులు చేయడంతో లక్ష్యాన్ని అందుకోగలిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ (49 బంతుల్లో 49; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్. పొలార్డ్ మినహా నికొలస్ పూరన్ (16 బంతుల్లో 20; ఫోర్, 2 సిక్స్‌లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశాడు. లక్ష్యం స్వల్పమే అయినా ఛేదనలో భారత్ చెమటోడ్చింది. ఓపెనర్ రోహిత్ శర్మ (25 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫటాఫట్ షాట్లకు తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి (29 బంతుల్లో 19; ఫోర్), మనీశ్ పాండే (14 బంతుల్లో 19; 2 ఫోర్లు) అవసరమైన పరుగులు చేశారు. దీంతో 17.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి గెలుపొందింది. ఆదివారం ఇక్కడే రెండో టి20 జరగనుంది. ఆడింది విండీసేనా...? టి20ల్లో భీకర హిట్టింగ్‌కు వెస్టిండీస్ మారుపేరు. కానీ, ఈ మ్యాచ్‌లో అలాంటిదేమీ కనిపించలేదు. టీమిండియా బౌలింగ్ దాడిని ప్రారంభించిన యువ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (0)ను ఔట్ చేశాడు. ఇదే మైదానంలో మూడేళ్ల క్రితం భారత్‌పై చెలరేగి శతకం బాదిన ఓపెనర్ ఎవిన్ లూయీస్ (0)ను భువనేశ్వర్ పెవిలియన్ చేర్చాడు. సిక్స్‌తో తనకు స్వాగతం పలికిన పూరన్‌పై ఆ వెంటనే సైనీ ప్రతీకారం తీర్చుకున్నాడు. దూకుడైన హెట్‌మైర్ (0)ను తదుపరి బంతికే బౌల్డ్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. అయితే, రావ్మన్ పావెల్ (4) అడ్డుకున్నాడు. సరిగ్గా ఆరు బంతుల తర్వాత పావెల్‌ను ఖలీల్ ఔట్ చేశాడు. పవర్ ప్లే ముగిసిన ఈ దశలో విండీస్ స్కోరు 33/5. స్పిన్నర్లు జడేజా, కృనాల్ రంగంలోకి దిగాక సిక్స్‌లు బాది పొలార్డ్ స్కోరు పెంచేందుకు ప్రయత్నించాడు. కానీ, కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వైట్ (24 బంతుల్లో 9) మరీ పేలవంగా ఆడాడు. బ్రాత్‌వైట్‌ను కృనాల్, నరైన్ (2)ను జడేజా వెనక్కుపంపాక కరీబియన్లు తేరుకోలేకపోయారు. అప్పటికీ సైనీ, భువీ ఓవర్లలో సిక్స్‌లు కొట్టిన పొలార్డ్ కాసిన్ని పరుగులు జోడించాడు. 120 బంతుల విండీస్ ఇన్నింగ్స్‌లో 79 బంతులకు పరుగే రాకపోవడం గమనార్హం. ఇబ్బందిపడ్డా... గెలుపు గట్టెక్కారు గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన ఓపెనర్ ధావన్ (1) నిరుత్సాహపర్చినా రోహిత్ తనదైన శైలిలో ఆడుతూ భారత్ ఛేదనను నడిపించాడు. కోహ్లి అతడికి సహకరించాడు. అయితే, నరైన్ (2/14) వరుస బంతుల్లో రోహిత్, రిషభ్ పంత్ (0)ను ఔట్ చేసి కలవరపెట్టాడు. నరైన్ యార్కర్ లెంగ్త్ బంతిని భారీ షాట్ కొట్టబోయి రోహిత్ లాంగాన్‌లో పొలార్డ్‌కు చిక్కాడు. పంత్ బంతి గమనాన్ని ఊహించకుండా బల ప్రయోగం చేసి వికెట్ పారేసుకున్నాడు. దాదాపు విండీస్ తరహాలోనే 32/3తో నిలిచిన భారత్‌ను కోహ్లి, పాండే ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 30 బంతుల్లో 32 పరుగులు జోడించి విజయానికి బాట వేశారు. వీరిద్దరూ ఒకరివెంట ఒకరు వెనుదిరిగినా... కృనాల్ (12), జడేజా (10 నాటౌట్) లక్ష్యానికి దగ్గరగా తీసుకొచ్చారు. కీమో పాల్ ఓవర్లో సిక్స్ కొట్టిన సుందర్ (8 నాటౌట్) లాంఛనాన్ని ముగించాడు. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: కాంప్‌బెల్ (సి) కృనాల్ (బి) సుందర్ 0; లూయిస్ (బి) భువనేశ్వర్ 0; పూరన్ (సి) పంత్ (బి) సైనీ 20; పొలార్డ్ ఎల్బీ (బి) సైనీ 49; హెట్‌మైర్ (బి) సైనీ 0; పావెల్ (సి) పంత్ (బి) ఖలీల్ 4; బ్రాత్‌వైట్ (సి అండ్ బి) కృనాల్ 9; నరైన్ (సి) ఖలీల్ (బి) జడేజా 2; పాల్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 3; కాట్రెల్ నాటౌట్ 0; థామస్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 95. వికెట్ల పతనం: 1–0, 2–8, 3–28, 4–28, 5–33, 6–67, 7–70, 8–88, 9–95. బౌలింగ్: సుందర్ 2–0–18–1, భువనేశ్వర్ 4–0–19–2, సైనీ 4–1–17–3, ఖలీల్ 2–0–8–1, కృనాల్ 4–1–20–1, జడేజా 4–1–13–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) పొలార్డ్ (బి) నరైన్ 24; ధావన్ ఎల్బీ (బి) కాట్రెల్ 1; కోహ్లి (సి) పొలార్డ్ (బి) కాట్రెల్ 19; పంత్ (సి) కాట్రెల్ (బి) నరైన్ 0; పాండే (బి) పాల్ 19; కృనాల్ (బి) పాల్ 12; జడేజా నాటౌట్ 10; సుందర్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.2 ఓవర్లలో 6 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–4, 2–32, 3–32, 4–64, 5–69, 6–88. బౌలింగ్: థామస్ 4–0–29–0, కాట్రెల్ 4–0–20–2, నరైన్ 4–0–14–2, పాల్ 3.2–0–23–2, బ్రాత్‌వైట్ 2–0–12–0. అమెరికాలో మ్యాచ్... అయినా అగ్ర రాజ్యం అమెరికాలో క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు... అటు కరీబియన్ దీవులకు దగ్గరగానూ ఉండే ఫ్లోరిడాలో నిర్వహిస్తున్న ఈ సిరీస్‌కు తొలి మ్యాచ్‌లో స్పందన అంతంతే కనిపించింది. ఈ మైదానంలో మూడేళ్ల క్రితం భారత్–విండీస్ మ్యాచ్‌కు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈసారి మాత్రం కనిష్ట టికెట్ ధర 50 డాలర్లే అయినా స్టాండ్స్ నిండలేదు. లాడర్‌హిల్‌లో మొత్తమ్మీద ఇది తొమ్మిదో మ్యాచ్ కావడం గమనార్హం. సై.. సై.. సైనీ తొలి టి20లో భారత్‌కు పెద్ద సానుకూలాంశం నవదీప్ సైనీ. ఆసాంతం 140 కి.మీ. పైగా వేగంతో సాగిన అతడి బౌలింగ్ ఆకట్టుకుంది. తన తొలి ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన సైనీ... తర్వాత సైతం కట్టుదిట్టంగా బంతులేశాడు. అతడి నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా 19 డాట్ బాల్స్ ఉండటమే దీనికి నిదర్శనం. జట్టులో అత్యధిక డాట్ బాల్స్ వేసింది కూడా సైనీనే. అన్నింటికి మించి చివరి ఓవర్‌ను సైనీ వేసిన తీరు ముచ్చటగొలిపింది. పొలార్డ్ వంటి హిట్టర్‌కు వరుసగా రెండు డాట్స్ వేయడంతో పాటు మూడో బంతికి ఔట్ చేసి అతడి అర్ధసెంచరీని అడ్డుకున్నాడు. మిగతా మూడు బంతులకూ పరుగివ్వకుండా విండీస్‌ను 100లోపే పరిమితం చేశాడు. టి20ల్లో సాధారణంగా మెయిడిన్ వేయడమే అరుదంటే... ఏకంగా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌ను వికెట్ మెయిడిన్‌గా ముగించి భళా అనిపించాడు. -
ఆంధ్ర అదరహో
సాక్షి, విజయవాడ: ముందు బ్యాట్స్‌మెన్ వీరవిహారం... ఆ తర్వాత బౌలర్ల విజృంభణ... వెరసి టి20 చరిత్రలోనే ఆంధ్ర క్రికెట్ జట్టు అతి పెద్ద విజయం నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించింది. దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం స్థానిక మూలపాడు మైదానంలో నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 179 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. పరుగుల పరంగా టి20 చరిత్రలో ఇది పెద్ద విజయం. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక జట్టు పేరిట ఉండేది. 2007లో తొలి టి20 ప్రపంచకప్‌లో భాగంగా కెన్యాతో జొహన్నెస్‌బర్గ్‌లో సెప్టెంబరు 14న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 172 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. ఆ రికార్డును ఆంధ్ర జట్టు శుక్రవారం బద్దలు కొట్టింది. 38 బంతుల్లోనే రికీ సెంచరీ... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ రికీ భుయ్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లతో 108 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 38 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా టి20ల్లో భారత్ తరఫున నాలుగో వేగవంతమైన సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ (38 బంతుల్లో), రిషభ్ పంత్ (32 బంతుల్లో), రోహిత్ శర్మ (35 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో) ముందున్నారు. రికీ భుయ్తోపాటు గిరినాథ్ రెడ్డి (31 బంతుల్లో 62; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా హడలెత్తించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 10 ఓవర్లలో 150 పరుగులు జోడించడం విశేషం. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ హనుమ విహారి (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడాడు. నాగాలాండ్ జట్టు కెప్టెన్ రంగ్సెన్ జొనాథన్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను బరిలోకి దించినా ఆంధ్ర జోరును నిలువరించలేకపోయాడు. సూపర్ శశికాంత్... 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నాగాలాండ్ 13.1 ఓవర్లలో 65 పరుగులకు కుప్పకూలి ఓడిపోయింది. ఆంధ్ర బౌలర్లు శశికాంత్ (3/8), షేక్ ఇస్మాయిల్ (3/25), కరణ్ శర్మ (3/14) మూడేసి వికెట్లు తీశారు. ముఖ్యంగా పేస్ బౌలర్ శశికాంత్ హడలెత్తించాడు. తాను వేసిన రెండో ఓవర్లో శశికాంత్ ఐదు బంతుల తేడాలో మూడు వికెట్లు తీయడం విశేషం. నాగాలాండ్ జట్టులో జొనాథన్ (25 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్), పారస్ షెరావత్ (11 బంతుల్లో 13; 3 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు దాటలేకపోయారు. -
అమ్మాయిలూ... ఇదొక్కటైనా?
హామిల్టన్: ఆతిథ్య న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ తప్పించుకోవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో భారత మహిళల క్రికెట్ జట్టు నేడు చివరి టి20 బరిలో దిగుతోంది. బ్యాటింగ్ వైఫల్యమే రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టును దెబ్బతీసినందున ఈసారైనా ఆ విభాగంలో మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌లపై జట్టు అతిగా ఆధారపడుతోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ పర్యటనలో స్థాయికి తగ్గ ఇన్నింగ్సే ఆడలేదు. త్వరలో టి20లకు వీడ్కోలు పలకనున్న వెటరన్ మిథాలీరాజ్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిడిలార్డర్ మెరుగైన స్కోరు చేస్తేనే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. మరోవైపు ముందుగా బ్యాటింగ్‌కు దిగినా, బౌలింగ్ చేసినా ప్రత్యర్థిని కీలక సమయాల్లో దెబ్బకొడుతూ సొంతగడ్డపై న్యూజిలాండ్ సమష్టిగా రాణిస్తోంది. భారత్... ఈ మ్యాచ్‌లో కలసి కట్టుగా ఆడితేనే గెలుపు తీరం చేరుతుంది. ►ఉదయం గం. 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
భారత్ – ఆసీస్ టీ20కి సన్నాహాలు
ప్రపంచ కప్‌కు ముందే విశాఖవాసులు క్రికెట్ విందు ఆస్వాదించనున్నారు. భారత్–ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు విశాఖ మహానగరం వేదికగా ఖరారైనవిషయం తెలిసిందే. ఈ మ్యాచ్ నిర్వహక కమిటీ మంగళవారం సమావేశమై ఏర్పాట్లపై చర్చించింది. టికెట్లరేట్లు, ఎప్పటినుంచి విక్రయాలు ప్రారంభించాలన్న అంశాలపై చర్చించడంతోపాటు నిర్వహణకు సంబంధించిసబ్ కమిటీలను నియమించారు. విశాఖ స్పోర్ట్స్: విశాఖలో, ఉత్తరాంధ్రలో క్రికెట్ వీరాభిమానులకు శుభవార్త! భారత, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ విశాఖలో వచ్చేనెల 27న జరగనుంది. భారత్‌లో పర్యటించనున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇరు దేశాల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ను విశాఖలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆడనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో రెండు టీ20 మ్యాచ్‌లు, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 24న జరగనుంది. ఈ సిరీస్‌లో కేవలం రెండే టీ20 మ్యాచ్‌లు జరగనుండగా రెండో టీ20 మ్యాచ్‌కు విశాఖ వేదికగా నిలిచింది. ఫిబ్రవరి 27న రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక వన్డే సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి వన్డే మార్చి రెండో తేదీన జరగనుండగా చివరిదైన ఐదో మ్యాచ్ మార్చి13న జరగనుంది. మ్యాచ్ నిర్వాహక కమిటీ సమీక్ష : ఆస్ట్రేలియాతో జరిగే టీ20 మ్యాచ్ నిర్వాహక కమిటీ మంగళవారం ఇక్కడ సమావేశమైంది. టిక్కెట్లు, నిర్వహణ వ్యవహారాల చర్చించింది. కమిటీ చైర్మన్‌గా వీపీటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వ్యవహరించనున్నారు. నిర్వహణకు సంబంధించి సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా, వీపీటీ డెప్యూటీ చైర్మన్ హరినాథ్, జీవీఎంసీ అదనపు కమిషనర్ జీవీవీఎస్ మూర్తి, ఈకో రైల్వే సహాయ క్రీడాధికారి శివహర్ష, కమర్షియల్ టాక్స్ విభాగం డిప్యూటీ సహాయ కమిషనర్ ఏఎన్‌వి ప్రసాద్, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, ఏసీఏ అధ్యక్షుడు రంగరాజు, కార్యదర్శి అరుణ్‌కుమార్, వీడీసీఏ కార్యదర్శి పార్ధసారథి, ఏసీఏ మీడియా మేనేజర్ సీఆర్‌మోహన్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సబ్కమిటీల ప్రతినిదులు ఈనెల30న మరోసారి సమావేశమై మ్యాచ్ నిర్వహణకు స్టేడియం సన్నద్ధతపై చర్చించనున్నారు. ఆన్లైన్ ద్వారా టిక్కెట్ల అమ్మకాలు మ్యాచ్‌ను వీక్షించేందుకు టిక్కెట్లను ఆన్లైన్లో ఈవెంట్ నౌ వెబ్సైట్ ద్వారా విక్రయించనున్నారు. రూ.500ను కనీస ధరగా రూ.1200, రూ. 1600, రూ. 2000, రూ. 4000 డినామినేషన్లలో టికెట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
లూయిస్ మెరుపులు
ఢాకా: విండీస్ విధ్వంసక ఓపెనర్ ఎవిన్ లూయిస్ (36 బంతుల్లో 89; 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన చివరిదైన మూడో టి20లో వెస్టిండీస్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. బంగ్లా పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లు కోల్పోయిన విండీస్ పొట్టి ఫార్మాట్లో సత్తా చాటింది. లూయిస్ మెరుపులకు తోడు షై హోప్ (23; 3 ఫోర్లు, 1 సిక్స్), నికోలస్ పూరన్ (29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లూయిస్ తుపానులా విరుచుకుపడటంతో 7.2 ఓవర్లలోనే విండీస్ స్కోరు 100 దాటింది. మూడో వికెట్ రూపంలో అతను వెనుదిరిగే సమయానికి విండీస్ స్కోరు 9.2 ఓవర్లలో 122/3. ఆ తర్వాత బంగ్లా బౌలర్లు మహ్ముదుల్లా (3/18), ముస్తఫిజుర్ (3/33), షకీబుల్ హసన్ (3/37) కట్టడి చేయడంతో విండీస్ చివరకు 190 పరుగులకు పరిమితమైంది. లక్ష్యఛేదనలో బంగ్లా 17 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (25 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 ఫోర్లు) ఒక్కడే పోరాడగా... తమీమ్ ఇక్బాల్ (8), సౌమ్య సర్కార్ (9), షకీబ్ (0), ముష్ఫికర్ రహీం (1) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో కీమో పాల్ 5 వికెట్లు పడగొట్టగా, అలెన్‌కు 2 వికెట్లు దక్కాయి. -
రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
లక్నో : భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 71 పరుగులతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో విండీస్ వెనకబడింది. భారత బౌలర్ల ధాటికి పర్యాటక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేయగలిగింది. ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. కార్లోస్ బ్రాత్‌వైట్ 15, ఒషానే థామస్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 2-0 తో సొంతం చేసుకుంది. (ఆపసోపాలతో... ఐదు వికెట్లతో) -
భారత్‌తో రెండో టీ20.. విండీస్ లక్ష్యం 196
లక్నో : భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ రెండో టీ20లో టీమిండియా బ్యాట్స్‌మెన్ చెలరేగారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 111 (8x4, 7x6, బంతులు 61) పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 41 బంతుల్లో 43 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. రోహిత్, ధావన్‌లు తొలి వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన రిషభ్‌పంత్ 5 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. లోకేష్‌రాహుల్ 26 పరుగులతో రోహిత్‌తో పాటు నాటౌట్‌గా నిలిచాడు. (చదవండి : కోహ్లి రికార్డుకు చేరువలో రోహిత్) (చదవండి : మ్యాచ్‌కు ముందు రోజే స్టేడియం పేరు మార్పు) -
ఈడెన్ గార్డెన్స్‌లో నేడు వెస్టిండీస్‌తో తొలి టి20
-
పాక్‌దే టి20 సిరీస్
దుబాయ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టి20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే పాకిస్తాన్ 2–0తో సొంతం చేసుకుంది. ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయిన ఆసీస్ టి20ల్లోనూ పాక్ ఎదుట నిలువలేకపోయింది. రెండో మ్యాచ్‌లో పాక్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్ (45; 3 ఫోర్లు), హఫీజ్ (40; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో కూల్టర్‌నీల్ 3, స్టాన్లేక్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆసీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. పాక్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఇమాద్ వసీమ్ 4 ఓవర్లు వేసి 8 పరుగులే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య మూడో టి20 నేడు జరుగుతుంది. -
బంగ్లాదేశ్‌దే టి20 సిరీస్
లాడెర్‌హిల్ (అమెరికా): వెస్టిండీస్‌తో మూడు టి20ల సిరీస్‌ను బంగ్లాదేశ్ 2–1తో కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 19 పరుగుల తేడాతో విండీస్‌పై గెలుపొందింది. మొదట బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఓపెనర్ లిటన్ దాస్ (32 బంతుల్లో 61; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. మహ్మూదుల్లా (20 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. కెప్టెన్ షకీబ్ 24, తమీమ్ ఇక్బాల్ 21 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో బ్రాత్‌వైట్, కీమో పాల్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి వెస్టిండీస్ 17.1 ఓవర్లలో 7 వికెట్లకు 135 పరుగులు చేసి ఓడింది. రస్సెల్ (21 బంతుల్లో 47; 1 ఫోర్, 6 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. పావెల్ 23, రామ్‌దిన్ 21 పరుగులు చేశారు. ముస్తఫిజుర్ రహమాన్‌కు 3 వికెట్లు దక్కాయి. లిటన్ దాస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, షకీబ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించాయి. -
ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది
-
అయ్యో.. ఐర్లాండ్ : భారత్ ఘన విజయం
అగ్రశ్రేణి జట్టుగా తమ స్థాయిని ప్రదర్శిస్తూ భారత జట్టు అలవోకగా ఐర్లాండ్ ఆట కట్టించింది. తొలి మ్యాచ్‌లో సునాయాసంగా నెగ్గిన కోహ్లి సేన రెండో మ్యాచ్‌లో ఆమాత్రం కూడా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది. ఏ విభాగంలోనూ సరితూగలేని ఐర్లాండ్‌కు ఎలాంటి సంచలనానికి అవకాశం ఇవ్వకుండా రికార్డు విజయంతో టీమిండియా టి20 సిరీస్‌ను ఏకపక్షంగా ముగించింది. ముందుగా రాహుల్, రైనా దూకుడుతో బ్యాటింగ్‌లో భారీ స్కోరుతో కదం తొక్కి... ఆ తర్వాత బౌలింగ్‌లో చెలరేగింది. ఐర్లాండ్‌తో ‘సన్నాహకం’ ముగిసిన తర్వాత మంగళవారం నుంచి ఇంగ్లండ్ సవాల్‌ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమైంది. డబ్లిన్: ఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–0తో కైవసం చేసుకుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో టి20లో భారత్ 143 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (36 బంతుల్లో 70; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), సురేశ్ రైనా (45 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 106 పరుగులు జోడించగా, చివర్లో హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరుపు ప్రదర్శన కనబర్చాడు. అనంతరం ఐర్లాండ్ 12.3 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. విల్సన్ (15) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో మరోసారి కుల్దీప్ (3/16), చహల్ (3/21) ప్రత్యర్థిని పడగొట్టారు. సెంచరీ భాగస్వామ్యం... భారత జట్టు అనుకున్నట్లుగానే నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. ధావన్, ధోని, భువనేశ్వర్, బుమ్రా స్థానాల్లో రాహు ల్, దినేశ్ కార్తీక్, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్ జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన కౌల్ భారత్ తరఫున టి20ల్లో ఆడిన 75వ ఆటగాడిగా నిలిచాడు. రోహిత్‌ను కాదని రాహుల్‌తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లి (9) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. అయితే రాహుల్, రైనా కలిసి ఐర్లాండ్‌ను ఆడుకున్నారు. ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ రాహుల్ సిక్సర్లతో చెలరేగగా, రైనా కూడా తనదైన శైలిలో జోరుగా ఆడాడు. సిమీ సింగ్ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన రాహుల్, ఆ తర్వాత రాన్‌కిన్ ఓవర్లో మరో రెండు భారీ సిక్సర్లతో 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కెవిన్ ఓబ్రైన్ తన తొలి బంతికే రాహుల్‌ను అవుట్ చేయడంతో సెంచరీ భాగస్వామ్యం ముగిసింది. మరో రెండు బంతులకే రోహిత్ (0) కూడా ఔటయ్యాడు. అనంతరం 34 బంతుల్లో రైనా హాఫ్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. రైనాను కూడా ఓబ్రైన్ వెనక్కి పంపించిన తర్వాత వచ్చిన మనీశ్ పాండే (20 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్) దూకుడుగా ఆడలేకపోయాడు. అయి తే హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్ భారత్‌కు భారీ స్కోరు అందించింది. ఆఖరి ఓవర్లో పాండ్యా వరుస బంతుల్లో 6, 6, 4 బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. వరుస కట్టి... భారీ లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ కనీస స్థాయి పోరాటాన్ని కూడా ప్రదర్శించలేకపోయింది. రెండో బంతికే స్టిర్లింగ్ (0)ను అవుట్ చేయడంతో మొదలైన పతనం చివరి వరకు కొనసాగింది. తొలి మ్యాచ్‌లోనైనా కాస్త చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చిన జట్టు ఈ సారి పూర్తిగా చేతులెత్తేసింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి అండ్ బి) కెవిన్ ఓబ్రైన్ 70; కోహ్లి (సి) డాక్రెల్ (బి) ఛేజ్ 9; రైనా (సి) డాక్రెల్ (బి) కెవిన్ ఓబ్రైన్ 69; రోహిత్ (సి) స్టిర్లింగ్ (బి) కెవిన్ ఓబ్రైన్ 0; మనీశ్ పాండే (నాటౌట్) 21; పాండ్యా (నాటౌట్) 32; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–22; 2–128; 3–128; 4–169. బౌలింగ్: సిమీ సింగ్ 2–0 –32–0; రాన్‌కిన్ 3–0–33–0; ఛేజ్ 4–0–42–1; థాంప్సన్ 1–0–17–0; డాక్రెల్ 4–0–30–0; స్టిర్లింగ్ 2–0–19–0; కెవిన్ ఓబ్రైన్ 4–0–40–3. ఐర్లాండ్ ఇన్నింగ్స్: స్టిర్లింగ్ (సి) రైనా (బి) ఉమేశ్ 0; షెనాన్ (సి) రాహుల్ (బి) కౌల్ 2; పోర్టర్‌ఫీల్డ్ (బి) ఉమేశ్ 14; బల్బిర్నీ (బి) చహల్ 9; విల్సన్ (బి) కుల్దీప్ 15; కెవిన్ ఓబ్రైన్ (సి) కుల్దీప్ (బి) పాండ్యా 0; సిమీ సింగ్ (ఎల్బీ) (బి) చహల్ 0; థాంప్సన్ (బి) చహల్ 13; డాక్రెల్ (సి) ఉమేశ్ (బి) కుల్దీప్ 4; రాన్‌కిన్ (స్టంప్డ్) కార్తీక్ (బి) కుల్దీప్ 10; ఛేజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (12.3 ఓవర్లలో ఆలౌట్) 70. వికెట్ల పతనం: 1–0; 2–16; 3–22; 4–30; 5–32; 6–36; 7–44; 8–56; 9–68; 10–70. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 2–0–19–2; సిద్ధార్థ్ కౌల్ 2–0–4–1; హార్దిక్ పాండ్యా 2–0–10–1; చహల్ 4–0–21–3; కుల్దీప్ 2.3–0–16–3. ► టి20ల్లో భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. గతంలో శ్రీలంకపై (2017లో) 93 పరుగుల విజయాన్ని భారత్ సవరించింది. డ్రింక్స్ తీసుకెళ్తున్న ధోని అరంగేట్రం చేసిన బౌలర్ సిద్ధార్థ్ కౌల్‌తో బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ -
భారత మహిళల జట్టుకు చుక్కెదురు
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టి20 సిరీస్ దక్కించుకోవాలనుకున్న భారత మహిళల జట్టు జోరుకు బ్రేక్ పడింది. వరుసగా రెండు టి20ల్లో గెలుపొందిన హర్మన్‌ప్రీత్ బృందం మూడో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మిడిలార్డర్ వైఫల్యంతో టీమిండియా 5 వికెట్లతో ఓడింది. తొలుత టీమిండియా 17.5 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది. మిథాలీ రాజ్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరినా... మరో ఓపెనర్ స్మృతి మంధాన (37; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), వేద కృష్ణమూర్తి (23; 4 ఫోర్లు) ధాటిగా ఆడారు. ఒకదశలో 91/2తో పటిష్టంగా కనిపించిన భారత్‌ను సఫారీ పేసర్ షబ్నమ్ 5 వికెట్లతో దెబ్బతీసింది. అనంతరం సఫారీలు ల్యూస్ ( 41; 5 ఫోర్లు), కెప్టెన్ నికెర్క్ (20 బంతుల్లో 26; 5 ఫోర్లు), ట్రియాన్ (34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో మరో ఓవర్ మిగిలుండగానే విజయం సాధించారు. నాలుగో మ్యాచ్ బుధవారం సెంచూరియన్‌లో జరుగనుంది. -
కివీస్ పై 'ఖాతా' తెరుస్తారా?
న్యూఢిల్లీ: మూడు వన్డేల సిరీస్ అనంతరం దొరికిన కొద్దిపాటి విరామంతో టీమిండియా-న్యూజిలాండ్ జట్లు మరో సిరీస్ కు సన్నద్ధమయ్యాయి. మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ జరుగునుంది. ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో రేపు రాత్రి గం.7.00 లకు ఇరు జట్ల మధ్య మొదటి టీ 20 ఆరంభం కానుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఓటమి పాలైన టీమిండియా.. ఆపై జరిగిన రెండు వన్డేల్లో విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకుంది. దాంతో వన్డే సిరీస్ ను గెలిచిన ఉత్సాహంతో విరాట్ సేన బరిలోకి దిగుతుండగా, కనీసం టీ 20 సిరీస్ ను సాధించాలనే పట్టుదలతో కివీస్ పోరుకు సిద్ధమవుతోంది. అయితే మూడు వన్డేల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న టీమిండియాకు టీ 20 సిరీస్ ల్లో కూడా గట్టి పోటీ తప్పకపోవచ్చు. న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఫామ్ లేకపోవడం ఆ జట్టును కలవరపరుస్తోంది. దాంతో టీమిండియాతో జరిగే టీ 20ల్లో బోణి కొట్టాలంటే మాత్రం న్యూజిలాండ్ సమష్టిగా రాణించాల్సి ఉంది. ఈ ఏడాది భారత జట్టు ఇప్పటివరకూ స్వదేశంలో ఆడిన టీ 20 సిరీస్ లు రెండు. జనవరిలో ఇంగ్లండ్ తో జరిగిన మూడు టీ 20ల సిరీస్ ఒకటైతై, ఇటీవల ఆసీస్ జరిగిన మూడు టీ 20ల సిరీస్ మాత్రమే స్వదేశంలో విరాట్ సేన ఆడింది. ఈ రెండు సిరీస్ ల్లోనూ భారత్ కు ప్రత్యర్థి జట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ఇంగ్లండ్ తో సిరీస్ ను 2-1 తో గెలిచిన విరాట్ సేన.. ఆసీస్ తో జరిగిన సిరీస్ ను 1-1తో సమం చేసుకుంది. ఆ క్రమంలో భారత్ కు న్యూజిలాండ్ సవాల్ విసిరే అవకాశం లేకపోలేదు. ఇప్పటివరకూ ఈ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ టీ 20లు నాలుగు మాత్రమే . గతేడాది టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లండ్-అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఇక్కడ తొలి మ్యాచ్ జరిగింది. ఆ వరల్డ్ కప్ లో మూడు గ్రూప్ మ్యాచ్ లతో పాటు ఒక సెమీస్ ఫైనల్ మ్యాచ్ కు ఫిరోజ్ కోట్ల ఆతిథ్యమిచ్చింది. కాగా, రేపు న్యూజిలాండ్ తో జరిగి టీ 20నే భారత్ కు మొదటి టీ 20 కావడం విశేషం. స్లో ట్రాక్ గా పేరున్న ఫిరోజ్ షాలో స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారీ స్కోరుకు అవకాశం ఉండకపోవచ్చు. ఖాతా తెరుస్తారా? న్యూజిలాండ్ తో ఇప్పటివరకూ జరిగిన అన్ని టీ 20 మ్యాచ్ ల్లోనూ భారత్ కు నిరాశే ఎదురైంది. 2007 నుంచి చూస్తే కివీస్ తో భారత్ ఐదు టీ 20ల్లో తలపడగా అన్నింట్లోనూ ఓటమి పాలైంది. వరల్డ్ టీ 20 ల్లో భాగంగా గతేడాది న్యూజిలాండ్ తో ఆడిన ఆఖరి మ్యాచ్ లో సైతం టీమిండియా పరాజయం చెందింది. దాంతో భారత్ పై కివీస్ కు తిరుగులేని టీ 20 రికార్డు ఉందనే విషయం అర్ధమవుతోంది. దాంతో పొట్టిఫార్మాట్ లో కివీస్ పై ఖాతా తెరిచి ఆ చెత్త రికార్డుకు చెరమగీతం పాడాలని విరాట్ సేన యోచిస్తోంది. మరొకవైపు తమ రికార్డును కొనసాగించేందకు కివీస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఆశిష్ నెహ్రాకు చోటు! న్యూజిలాండ్ తో జరిగే తొలి టీ 20 మ్యాచ్ భారత వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు చివరి మ్యాచ్ కావడంతో అతనికి చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. నెహ్రాకు ఘనంగా వీడ్కోలు ఇచ్చే క్రమంలో అతనికి తుది జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. ఆసీస్ తో టీ 20 సిరీస్ లో ఎంపికైన నెహ్రాకు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఒకసారి జట్టులో ఎంపికైన తరువాత అలా రిజర్వ్ బెంచ్ లో కూర్చోవడం నెహ్రా కెరీర్ లో అదే తొలిసారి. దాంతో తన కెరీర్ కు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని భావించిన నెహ్రా.. తన సొంత మైదానమైన ఫిరోజ్ షా కోట్లలో న్యూజిలాండ్ తో జరిగే టీ 20 మ్యాచ్ లో వీడ్కోలు చెప్పనున్నట్లు అప్పుడే ప్రకటించాడు. దాంతో భారత జట్టుకు విశేష సేవలందించిన నెహ్రాను గౌరవంగా సాగనంపాలనే ఉద్దేశంతో క్రికెట్ బోర్డు ఉన్నట్లు సమాచారం. తుది జట్లు అంచనా భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, ఆశిష్ నెహ్రా న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ లాథమ్, రాస్ టేలర్, గప్టిల్, రాస్ టేలర్, గ్రాండ్ హోమ్, నికోలస్, మిల్నే, మున్రో, సాంత్నార్, టిమ్ సౌథీ -
డబ్బులు వాపసు తీసుకోండి!
సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ రద్దయిన కారణంగా ప్రేక్షకులకు టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సిద్ధమైంది. దీనికి సంబంధించిన తేదీలను సోమవారం ప్రకటించింది. ఆయా తేదీల్లో ప్రేక్షకులు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి తమ టికెట్‌ను తీసుకురావడంతో పాటు తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా అందజేయాల ని... నేరుగా అకౌంట్లోకి డబ్బులు బదిలీ చేస్తామని హెచ్‌సీఏ వెల్లడించింది. ఉప్పల్‌లో మైదానం అనుకూలంగా లేకపోవడంతో ఈ నెల 13న జరగాల్సిన మూడో టి20 ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. కార్పొరేట్, హాస్పిటాలిటీ బాక్స్‌లకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. అక్టోబర్ 23, 24: రూ. 800; అక్టోబర్ 25, 26: రూ. 1,000; అక్టోబర్ 27, 28: రూ. 1,500; అక్టోబర్ 30, 31: రూ. 5,000 -
రెట్టించిన ఉత్సాహంతో ధోని సేన!
హరారే: జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తో క్లీన్‌స్వీప్ చేసిన మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని యువ సేన.. ఇప్పుడు టీ 20 సిరీస్‌కు రెట్టించిన ఉత్సాహంతో సన్నద్ధమైంది. రేపట్నుంచి ఆరంభమయ్యే మూడు టీ 20 సిరీస్‌లో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. దీనిలో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం సాయంత్రం గం.4.30ని.లకు హరారే స్పోర్ట్ క్లబ్ స్టేడియంలో తొలి టీ 20 ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా మరికొంత ఆటగాళ్లను భారత్ పరీక్షించనుంది. యువ ఆటగాళ్లు మన్ దీప్ సింగ్, జయంత్ యాదవ్, జయదేవ్ ఉనాద్కత్ లు జింబాబ్వే టూర్ కు ఎంపికైనా ఇప్పటివరకూ అవకాశం రాలేదు. దీంతో వీరిని టీ 20 సిరీస్‌లో బరిలోకి దింపే అవకాశం ఉంది. చివరి వన్డేలో అవకాశం దక్కించుకుని హాఫ్ సెంచరీతో మెరిసిన ఫజల్ కు మరో అవకాశం ఇచ్చే అవకాశం కనబడుతోంది. భారత టీ 20 జట్టులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితోపాటు, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉండగా, బౌలింగ్ విభాగంలో బూమ్రా, బరిందర్ శ్రవణ్ లతో పాటు చాహల్ లు మరోసారి ఆకట్టుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. చివరిసారి(2015)లో భారత్ ఇక్కడ పర్యటించినప్పుడు వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసినా, ఆ తరువాత టీ 20 సిరీస్‌ను వైట్ వాష్ చేయడంలో విఫలమైంది. అజింక్యా రహానే నేతృత్వంలోని ఆనాటి భారత జట్టు టీ 20 సిరీస్ ను 1-1 తో సరిపెట్టుకుంది. దీంతో టీ 20 సిరీస్ లో టీమిండియా ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శంచకుండా ఉండాలి. మరోవైపు ప్రస్తుతం ఉన్న జట్టులో మనీష్ పాండే, కేదర్ జాదవ్‌లకు మాత్రమే గత జింబాబ్వే పర్యటనలో టీ 20సిరీస్ ఆడిన అనుభవం ఉంది. టీమిండియా మరోసారి పూర్తి స్థాయి ఆటను ప్రదర్శిస్తే ఆతిథ్య జింబాబ్వే కష్టాలు ఖాయం.