
లక్నో : భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 71 పరుగులతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో విండీస్ వెనకబడింది. భారత బౌలర్ల ధాటికి పర్యాటక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేయగలిగింది. ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ రెండేసి వికెట్లు తీశారు. కార్లోస్ బ్రాత్‌వైట్ 15, ఒషానే థామస్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 2-0 తో సొంతం చేసుకుంది. (ఆపసోపాలతో... ఐదు వికెట్లతో)