
దుబాయ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టి20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే పాకిస్తాన్ 2–0తో సొంతం చేసుకుంది. ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయిన ఆసీస్ టి20ల్లోనూ పాక్ ఎదుట నిలువలేకపోయింది. రెండో మ్యాచ్‌లో పాక్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది.
బాబర్ ఆజమ్ (45; 3 ఫోర్లు), హఫీజ్ (40; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో కూల్టర్‌నీల్ 3, స్టాన్‌లేక్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆసీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. పాక్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఇమాద్ వసీమ్ 4 ఓవర్లు వేసి 8 పరుగులే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య మూడో టి20 నేడు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment