స్వదేశంలో పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. సిరీస్‌లో భాగంగా ఇవాళ (నవంబర్ 18) జరిగిన మూడో టీ20లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 18.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (41) టాప్ స్కోరర్‌గా నిలువగా.. హసీబుల్లా ఖాన్ (24), షాహీన్ అఫ్రిది (16), ఇర్ఫాన్ ఖాన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు.
ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆరోన్ హార్డీ మూడు వికెట్లతో పాక్ నడ్డి విరచగా.. ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ తలో రెండు వికెట్లు.. జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఇల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ కేవలం 11.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది (3 వికెట్లు కోల్పోయి). మార్కస్ స్టోయినిస్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి పాక్ బౌలర్లను చీల్చిచెండాడు. జోష్ ఇంగ్లిస్ 24 బంతుల్లో 27 పరుగులు.. జేక్ ఫ్రేజర్ 11 బంతుల్లో 18 పరుగులు.. టిమ్ డేవిడ్ 3 బంతుల్లో 7 పరుగులు.. మాథ్యూ షార్ట్ 4 బంతుల్లో 2 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, జహన్‌దాద్ ఖాన్, అబ్బాస్ అఫ్రిదిలకు తలో వికెట్ దక్కింది.
కాగా, ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా గెలుపొందిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌కు ముందు జరిగిన వన్డే సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment