సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. హరీస్ రౌఫ్ నాలుగు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. రౌఫ్ వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా బౌలింగ్ చేశాడు. మరో బౌలర్ అబ్బాస్ అఫ్రిది మూడు వికెట్లు తీశాడు. అబ్బాస్ కీలకమైన మాథ్యూ షార్ట్ వికెట్‌తో పాటు టెయిలెండర్ల వికెట్లు తీశాడు.
స్పిన్నర్ సూఫియాన్ ముఖీమ్ నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (32) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 20, జోస్ ఇంగ్లిస్ 0, మ్యాక్స్‌వెల్ 21, స్టోయినిస్ 14, టిమ్ డేవిడ్ 18, ఆరోన్ హార్డీ 28, జేవియర్ బార్ట్‌లెట్ 5, స్పెన్సర్ జాన్సన్ 0 పరుగులకు ఔటయ్యారు. నాథన్ ఇల్లిస్ 1, ఆడమ్ జంపా 0 పరుగులతో అజేయంగా నిలిచారు.
కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. 7 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేయగా.. పాక్ 7 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 64 పరుగులు మాత్రమే చేయగలిగింది. 19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment