ఆసీస్ గడ్డపై పాక్ ఏడేళ్ల తర్వాత తొలిసారి ఓ వన్డేలో విజయం సాధించింది. జనవరి 15, 2017లో పాక్ చివరిసారి ఆసీస్‌ను వారి సొంతగడ్డపై (మెల్‌బోర్న్) ఓ వన్డేలో ఓడించింది. 2854 రోజుల తర్వాత పాక్ తిరిగి ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించింది. అడిలైడ్ వేదికగా ఇవాళ (నవంబర్ 8) జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆసీస్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో హరీస్ రౌఫ్ (8-0-29-5).. ఆతర్వాత బ్యాటింగ్‌లో సైమ్ అయూబ్ (71 బంతుల్లో 82; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగిపోయారు. వీరికి తోడు మొహమ్మద్ రిజ్వాన్ వికెట్‌కీపింగ్‌లో చెలరేగాడు. రిజ్వాన్ ఈ మ్యాచ్‌లో ఏకంగా ఆరు క్యాచ్‌లు పట్టాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో పాక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో నవంబర్ 10న పెర్త్ వేదికగా జరుగనుంది.
మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా హరీస్ రౌఫ్ (5/29), షాహీన్ అఫ్రిది (3/26), నసీం షా (1/65), మొహమ్మద్ హస్నైన్ (1/27) ధాటికి 35 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం 164 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 26.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజతీయాలకు చేరింది. ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో (69 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అలరించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపాకు ఓ వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment