Saim Ayub
-
సల్మాన్ ఆల్‌రౌండ్ షో.. సౌతాఫ్రికాపై పాక్ విజయం
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్ విజయంతో ఆరంభించింది. పార్ల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో పాక్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 239 పరుగులు మాత్రమే చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(97 బంతుల్లో 86 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మార్క్రమ్(35), రికెల్టన్(36), టోనీ డీజోర్జీ(33) రాణించారు. పాక్ బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ సల్మాన్ ఆఘా 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు మరో స్పిన్నర్ ఆర్బర్ ఆహ్మద్ రెండు, షాహీన్ అఫ్రిది, సైమ్ అయూబ్ తలా వికెట్ సాధించారు.అయూబ్ సూపర్ సెంచరీ..ఇక 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. పాక్ బ్యాటర్లలో సైమ్ అయూబ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 119 బంతులు ఎదుర్కొన్న అయూబ్.. 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు.మరోవైపు బంతితో మాయ చేసిన సల్మాన్ అలీ అఘా బ్యాట్‌తో కూడా సత్తాచాటాడు. 90 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. సఫారీ బౌలర్లలో కగిసో రబడ, బార్టమన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షమ్సీ, జానెసన్ చెరో వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 19న కేప్‌టౌన్ వేదికగా జరగనుంది. -
SA Vs PAK: రీజా హెండ్రిక్స్ విధ్వంసకర సెంచరీ.. పాక్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
పాకిస్తాన్‌తో రెండో టీ20లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాక్‌తో టీ20 సిరీస్‌ను 2-0తో ప్రొటీస్ జట్టు కైవసం చేసుకుంది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.సయీమ్ ఆయుబ్ అద్భుత ఇన్నింగ్స్.. సెంచరీ మిస్ఇందులో భాగంగా డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా పదకొండు పరుగుల తేడాతో పాక్‌పై గెలిచింది. ఈ క్రమంలో సెంచూరియన్ వేదికగా రెండో టీ20లో ఇరుజట్లు శుక్రవారం రాత్రి తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(11) విఫలం కాగా.. సయీమ్ ఆయుబ్ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.మొత్తంగా యాభై ఏడు బంతులు ఎదుర్కొన్న ఆయుబ్ పదకొండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 98 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(20 బంతుల్లో 31), ఆరో స్థానంలో వచ్చిన ఇర్ఫాన్ ఖాన్(16 బంతుల్లో 30) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ఐదు వికెట్లు నష్టపోయి 206 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఒట్నీల్ బార్ట్‌మన్, డయాన్ గాలియెమ్ రెండేసి వికెట్లు తీయగా.. జార్జ్ లిండే ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక పాక్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.రీజా హెండ్రిక్స్ విధ్వంసం.. ‘తొలి’ శతకంపాక్ యువ పేసర్ జహన్‌బాద్ ఖాన్ ఓపెనర్ రియాన్ రికెల్టన్ను రెండు పరుగుల వద్దే పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్(12)ను కూడా తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. అయితే, మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ విధ్వంసం ముందు పాక్ బౌలర్లు తలవంచకతప్పలేదు.రీజా 63 బంతుల్లోనే ఏడు ఫోర్లు, పది సిక్స్‌ల సాయంతో ఏకంగా 117 పరుగులు సాధించాడు. కాగా అంతర్జాతీయ టీ20లలో 35 ఏళ్ల రీజా హెండ్రిక్స్‌కు ఇదే తొలి శతకం కావడం విశేషం.సిరీస్ సౌతాఫ్రికా కైవసంఇక రీజాకు తోడుగా రాసీ వన్ డెర్ డసెన్ మెరుపు ఇన్నింగ్స్(38 బంతుల్లో 66)తో అజేయంగా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రీజా విధ్వంసకర సెంచరీ, డసెన్ ధనాధన్ బ్యాటింగ్ కారణంగా సౌతాఫ్రికా 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించిన ప్రొటీస్.. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక పాక్ బౌలర్లలో జహన్‌బాద్ ఖాన్‌కు రెండు, అబ్బాస్ ఆఫ్రిదికి ఒక వికెట్ దక్కాయి.ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు మూడో టీ20 శనివారం జరుగనుంది. జొహన్నస్‌బర్గ్‌లోని ది వాండరర్స్ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు -
పాక్ ఓపెనర్ విధ్వంసకర సెంచరీ.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో ఊచకోత
తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో ఓటమికి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం బులవాయో వేదికగా జరిగిన రెండో వన్డేలో 10 వికెట్లను తేడాతో జింబాబ్వేను పాక్ చిత్తు చేసింది. 146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షషీక్ ఊదిపడేశారు.కేవలం 18.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా పాక్ లక్ష్యాన్ని చేధించింది. సైమ్ ఆయూబ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 53 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 62 బంతులు ఎదుర్కొన్న అయూబ్.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 113 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు అబ్దుల్ షఫీక్(32 నాటౌట్) రాణించాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వే 32.3 ఓవర్లలో కేవలం 145 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో డియాన్ మైర్స్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక పాక్ బౌలర్లలో స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. అఘా సల్మాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ ఇదే వేదికలో నవంబర్ 28న జరగనుంది.చదవండి: IPL 2025: 'రూ.75 లక్షలకు కూడా ఎవరూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు' -
AUS Vs PAK: ఏడేళ్ల తర్వాత పాక్ సాధించింది..!
ఆసీస్ గడ్డపై పాక్ ఏడేళ్ల తర్వాత తొలిసారి ఓ వన్డేలో విజయం సాధించింది. జనవరి 15, 2017లో పాక్ చివరిసారి ఆసీస్‌ను వారి సొంతగడ్డపై (మెల్బోర్న్) ఓ వన్డేలో ఓడించింది. 2854 రోజుల తర్వాత పాక్ తిరిగి ఆసీస్‌ను వారి సొంతగడ్డపై ఓడించింది. అడిలైడ్ వేదికగా ఇవాళ (నవంబర్ 8) జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆసీస్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయం సాధించింది. తొలుత బౌలింగ్‌లో హరీస్ రౌఫ్ (8-0-29-5).. ఆతర్వాత బ్యాటింగ్‌లో సైమ్ అయూబ్ (71 బంతుల్లో 82; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగిపోయారు. వీరికి తోడు మొహమ్మద్ రిజ్వాన్ వికెట్‌కీపింగ్‌లో చెలరేగాడు. రిజ్వాన్ ఈ మ్యాచ్‌లో ఏకంగా ఆరు క్యాచ్‌లు పట్టాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో పాక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో నవంబర్ 10న పెర్త్ వేదికగా జరుగనుంది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా హరీస్ రౌఫ్ (5/29), షాహీన్ అఫ్రిది (3/26), నసీం షా (1/65), మొహమ్మద్ హస్నైన్ (1/27) ధాటికి 35 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 164 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 26.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజతీయాలకు చేరింది. ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలతో (69 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అలరించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపాకు ఓ వికెట్ దక్కింది. -
సైమ్ అయూబ్ విధ్వంసం.. రోవ్‌మన్ పావెల్ ఊచకోత
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో ఇవాళ (ఫిబ్రవరి 25) లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మీ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఖలందర్స్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన పెషావర్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ సైమ్ అయూబ్ (55 బంతుల్లో 88; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), రోవ్‌మన్ పావెల్ (20 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు), మొహమ్మద్ హరీస్ (5 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో పెషావర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. పెషావర్ ఇన్నింగ్స్‌లో ఆసిఫ్ అలీ (6) తక్కువ స్కోర్‌కు ఔట్ కాగా.. పాల్ వాల్టర్ 2 పరుగులతో అజేయంగా నిలిచాడు. లాహోర్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4-0-33-3) విజృంభించగా.. జహాన్దాద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన లాహోర్ ఇంతవరకు బోణీ కొట్టలేదు. ఈ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌లు ఆడిన పెషావర్ ఓ విజయం, రెండు పరాజయాలతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ముల్తాన్ సుల్తాన్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. క్వెట్టా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
క్యాప్‌తో బంతిని ఆపాడు!?.. పాక్‌కు 5 పరుగుల పెనాల్టీ లేదెందుకు?
Australia vs Pakistan, 3rd Test- Day 3: అరంగేట్ర టెస్టుతోనే పాకిస్తాన్ యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ పేరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే, అద్భుత బ్యాటింగ్‌తో అతడు ట్రెండింగ్‌లోకి వచ్చాడనుకుంటే పొరపాటేనండోయ్! మరి హాట్‌టాపిక్‌లా మారడానికి అంత ‘గొప్ప’గా ఈ యంగ్ క్రికెటర్ ఏం చేశాడు?! ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2తో కోల్పోయిన పాకిస్తాన్ నామమాత్రపు ఆఖరి టెస్టులో సయీమ్ ఆయుబ్తో అరంగేట్రం చేయించింది. సిడ్నీ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో అతడు డకౌట్‌గా వెనుదిరిగి చేదు అనుభవం మూటగట్టుకున్నాడు. అప్పుడు ఈజీ క్యాచ్ వదిలేశాడు అదే విధంగా.. ఫీల్డింగ్ తప్పిదాలతోనూ మూల్యం చెల్లించుకున్నాడు. రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసి సొంతజట్టు అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇక మూడో రోజు ఆట సందర్భంగా మరోసారి బ్యాటింగ్ చేసే అవకాశం రాగా. కేవలం 33 పరుగులకే పరిమితమయ్యాడు 21 ఏళ్ల ఈ లెఫ్టాండర్ ఓపెనర్. ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇంకా నయం.. గాయపడలేదు ఈ పరిణామాల క్రమంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సయీమ్ ఆయుబ్.. తాజాగా మైదానంలో మరోసారి చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. సిడ్నీ అవుట్‌ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా ఫీల్డింగ్ చేసే క్రమంలో జర్రున జారి పడ్డాడు ఆయుబ్. అయితే, అదృష్టవశాత్తూ అతడికి ఎటువంటి గాయం కాలేదు. దీంతో పాక్ శిబిరం ఊపిరి పీల్చుకుంది. క్యాప్‌తో బంతిని ఆపాడు? అయినా పెనాల్టీ లేదెందుకు? శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో... నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. ఫీల్డింగ్ చేస్తున్నపుడు.. స్టీవ్ స్మిత్ బాదిన బంతిని ఆపే క్రమంలో జారిపడ్డ ఆయుబ్ క్యాప్ బాల్‌ను బౌండరీకి వెళ్లకుండా అడ్డుపడింది. దీంతో నిబంధనల ప్రకారం.. బ్యాటింగ్ చేస్తున్న జట్టు అంటే ఆస్ట్రేలియాకు పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు రావాల్సిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే, ఈ విషయంపై స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ‘‘ఎవరైతే పెనాల్టీ పరుగుల గురించి అడుగుతున్నారో వారి కోసం ఈ జవాబు: క్యాప్ కారణంగా బంతి బౌండరీ వెళ్లకుండా ఆగిపోయినప్పటికీ.. ఇది యాక్సిడెంటల్‌గా జరిగిన పరిణామం. ఫీల్డర్ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అందుకే బ్యాటింగ్ జట్టుకు పెనాల్డీ పరుగులు రాలేదు’’ అని ప్రకటన విడుదల చేసింది. ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. చదవండి: T20 WC: అగార్కర్ ఒప్పించేశాడు.. కోహ్లి, రోహిత్ రీఎంట్రీ!? For those asking: It's not a five-run penalty for hitting the cap as the contact between ball and hat was accidental, and nor was the cap deliberately left on the field, as helmets tend to be #AUSvPAK https://t.co/BFcgfoKnnT — cricket.com.au (@cricketcomau) January 5, 2024 -
Aus Vs Pak: ఈజీ క్యాచ్ వదిలేశాడు.. తలపట్టుకున్న బాబర్! వీడియో
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ ఫీల్డింగ్ తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్‌లలో సులువైన క్యాచ్‌లు వదిలేసి పాక్ భారీ మూల్యం చెల్లించిన విషయం తెలిసిందే. పెర్త్ టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ జారవిడిచాడు. అదే విధంగా.. మెల్బోర్న్లో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ డేవిడ్ వార్నర్ క్యాచ్‌ను వదిలేశాడు. ఇలా కీలక సమయాల్లో ఇద్దరు స్టార్ ఆటగాళ్లను పెవిలియన్‌కు పంపే ఛాన్స్ మిస్ చేసుకున్న పాకిస్తాన్.. ఆయా మ్యాచ్‌లలో 360, 79 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా సిరీస్ కోల్పోవడమే గాకుండా కంగారూ గడ్డపై వరుసగా 16 టెస్టుల్లో ఓడి తమ చెత్త రికార్డును మరింత పదిలం చేసుకుంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన షాన్ మసూద్ బృందం తొలుత బ్యాటింగ్ చేసి.. 313 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో మొదటిరోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో 6/0తో రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ను ఆరంభంలోనే దెబ్బకొట్టే ఛాన్స్ పాకిస్తాన్‌కు వచ్చింది. గురువారం నాటి ఆటలో పద్నాలుగో ఓవర్ రెండో బంతికి ఆమిర్ జమాల్ బౌలింగ్‌లో వార్నర్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను సయీమ్ ఆయుబ్ మిస్ చేశాడు. వార్నర్ బంతిని గాల్లోకి లేపగా ఫస్ట్‌స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆయుబ్.. బాల్‌ను రెండు చేతులతో ఒడిసిపట్టినట్టే పట్టి జారవిడిచేశాడు. దీంతో పక్కనే ఉన్న బాబర్ ఆజం తీవ్ర అసహనానికి గురయ్యాడు. సులువైన క్యాచ్ వదిలేయడంతో లైఫ్ పొందిన వార్నర్ మరోసారి ప్రమాదకారిగా మారుతాడేమోనన్న భయంతో తలపట్టుకుని కూర్చున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో వార్నర్ క్యాచ్ మిస్ చేసిన పాక్ అరంగేట్ర బ్యాటర్ సయీమ్ ఆయుబ్‌పై సొంత జట్టు అభిమానులే ఫైర్ అవుతున్నారు. బ్యాటర్‌గా విఫలమయ్యావు.. ఫీల్డింగ్ చేయడం కూడా రాదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా సిడ్నీ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆయుబ్.. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. ఆయుబ్ క్యాచ్ చేసే సమయానికి వార్నర్ 20 పరుగులతో ఆడుతున్నాడు. అయితే, 24.3వ ఓవర్ వద్ద ఆగా సల్మాన్ బౌలింగ్‌లో బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి వార్నర్(34) వెనుదిరిగాడు. చదవండి: Ind Vs SA 2nd Test: రెండో టెస్టులో విజయం భారత్‌దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం It's happened again! 😲 David Warner gets a life courtesy of the debutant Saim Ayub #AUSvPAK pic.twitter.com/VAr7bBis6L — cricket.com.au (@cricketcomau) January 4, 2024