తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో ఓటమికి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం బులవాయో వేదికగా జరిగిన రెండో వన్డేలో 10 వికెట్లను తేడాతో జింబాబ్వేను పాక్ చిత్తు చేసింది. 146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షషీక్ ఊదిపడేశారు.
కేవలం 18.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా పాక్ లక్ష్యాన్ని చేధించింది. సైమ్ ఆయూబ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 53 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 62 బంతులు ఎదుర్కొన్న అయూబ్.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 113 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు అబ్దుల్ షఫీక్(32 నాటౌట్) రాణించాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వే 32.3 ఓవర్లలో కేవలం 145 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో డియాన్ మైర్స్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక పాక్ బౌలర్లలో స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. అఘా సల్మాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ ఇదే వేదికలో నవంబర్ 28న జరగనుంది.
చదవండి: IPL 2025: 'రూ.75 లక్షలకు కూడా ఎవరూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు'
Comments
Please login to add a commentAdd a comment