ODI series
-
శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ పోస్ట్
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్(Sam Curran) ఉద్వేగానికి లోనయ్యాడు. తన సోదరుడు, జింబాబ్వే ఓపెనర్ బెన్ కరన్(Ben Curran) వన్డేల్లో తొలి శతకం బాదడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ అద్భుత ఇన్నింగ్స్ ఆడావు’’ అంటూ అన్నను ప్రశంసల్లో ముంచెత్తాడు. కాగా ఐర్లాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో జింబాబ్వే ఓపెనర్ బెన్ కరన్ అజేయ సెంచరీతో కదంతొక్కిన విషయం తెలిసిందే. 130 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 118 పరుగులు సాధించాడు.తద్వారా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించిన జింబాబ్వే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. హరారే వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. 120 బంతుల్లో శతకంఓపెనర్ అండీ బాల్బిర్నీ (99 బంతుల్లో 64; 4 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో లొర్కన్ టక్కర్ (54 బంతుల్లో 61; 7 ఫోర్లు), హ్యారి టెక్టర్ (84 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు.ప్రత్యర్థి జట్టు బౌలర్లలో రిచర్డ్ ఎన్‌గరవ, ట్రెవర్ వాండు చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 39.3 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 246 పరుగులు చేసి గెలిచింది. బ్రియాన్ బెన్నెట్ (48 బంతుల్లో 48; 6 ఫోర్లు) ఇన్నింగ్స్ ప్రారంభించిన బెన్ కరన్ తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించి చక్కటి శుభారంభం ఇచ్చాడు. తర్వాత కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (59 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్‌కు 122 పరుగులు జోడించాడు.రోమాలు నిక్కబొడుచుకున్నాయిఈ క్రమంలో 120 బంతుల్లో కరన్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో సామ్ కరన్ ఎక్స్ వేదికగా తన అన్నను అభినందించాడు. ‘‘రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వాట్ ఏ బాయ్!.. అద్బుత ఇన్నింగ్స్’’ అని ఉద్వేగపూరిత ట్వీట్ చేశాడు. కాగా జింబాబ్వే మాజీ క్రికెటర్ కెవిన్ కరన్‌కు ముగ్గురు కుమారులు. వారిలో 29 ఏళ్ల టామ్ కరన్ పెద్దవాడు కాగా.. బెన్ కరన్ రెండోవాడు. ఇక సామ్ అందరికంటే చిన్నవాడు. అయితే, బెన్ తండ్రి మాదిరి జింబాబ్వే జట్టుకు ఆడుతుండగా.. టామ్, సామ్ మాత్రం ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు. అయితే, కరన్ సోదరుల్లో తొలి ఇంటర్నేషనల్ సెంచరీ చేసిన ఘనత మాత్రం బెన్కే దక్కింది. 28 ఏళ్ల బెన్ స్పెషలిస్టు బ్యాటర్ కాగా.. 26 ఏళ్ల సామ్ కరన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. లెఫ్టార్మ్పేస్ మీడియం బౌలర్ అయిన అతడు లెఫ్టాండర్ బ్యాటర్. ఇక వీరిద్దరి పెద్దన్న టామ్ కరన్ కూడా బౌలింగ్ ఆల్‌రౌండరే. అయితే అతడిది కుడిచేతి వాటం కావడం గమనార్హం. ఇదిలా ఉంటే... జింబాబ్వే- ఐర్లాండ్ మధ్య ఫిబ్రవరి 22, 23, 25 తేదీల్లో ఇరుజట్ల మధ్య హరారే వేదికగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది.చదవండి: సచిన్ కాదు!.. నంబర్ వన్ వన్డే బ్యాటర్ అతడే: సెహ్వాగ్ -
ZIM Vs IRE: శతక్కొట్టిన ఓపెనర్.. ఐర్లాండ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే.. సిరీస్ సొంతం
ఐర్లాండ్‌తో మూడో వన్డేలో జింబాబ్వే(ZImbabwe Vs Ireland) అదరగొట్టింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టికరిపించి ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్(ODI Series)ను 2-1తో కైవసం చేసుకుంది. కాగా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు ఐర్లాండ్ క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వచ్చింది.ఈ క్రమంలో ఏకైక టెస్టులో ఐర్లాండ్ అనూహ్య రీతిలో విజయం సాధించగా.. ఆతిథ్య జింబాబ్వే తొలి వన్డేలో గెలుపుతో సిరీస్‌ను ఆరంభించింది. అనంతరం రెండో వన్డేలో ఐరిష్ జట్టు చేతిలో ఓడిన జింబాబ్వే తాజాగా నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌లో మాత్రం దుమ్ములేపింది. హరారే వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ చేసింది.ఆండ్రూ బల్బిర్నీ, టెక్టర్, టకర్ అర్ధ శతకాలుఐర్లాండ్ ఓపెనర్లలో ఆండ్రూ బల్బిర్నీ అర్ధ శతకం(99 బంతుల్లో 64)తో రాణించగా.. మరో ఓపెనర్, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ 9 పరుగులకే నిష్క్రమించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ కర్టిస్ కాంఫర్(11) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఇలా జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ హ్యారీ టెక్టర్(51), వికెట్ కీపర్ బ్యాటర్ లోర్కాన్ టకర్(61) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు.మిగతా వాళ్లలో డాక్రెల్(2) విఫలంకాగా.. మార్క్ అడెర్ 26, ఆండీ మెక్‌బ్రిన్ 7 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో ఐర్లాండ్ జట్టు ఆరు వికెట్లు నష్టపోయి 240 పరుగులు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో ఎంగర్వ, ట్రెవర్ గ్వాండు రెండేసి వికెట్లు కూల్చగా.. ముజర్బాని, వెల్లింగ్టన్ మసకద్జ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.శతక్కొట్టిన ఓపెనర్.. ఇక ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎర్విన్ బృందం 39.3 ఓవర్లలోనే కథ ముగించింది. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ 48 బంతుల్లో 48 పరుగులు చేసి గ్రాహమ్ హ్యూబ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ బెన్ కరన్(Ben Curran) మాత్రం శతక్కొట్టాడు. 130 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 118 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.కరన్‌కు తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ క్రెయిగ్ ఎర్విన్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 59 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదిన ఎర్విన్ 69 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా కేవలం ఒకే ఒక వికెట్ నష్టపోయిన జింబాబ్వే 246 పరుగులు చేసి.. ఘన విజయం సాధించింది. అంతేకాదు.. సిరీస్‌నూ 2-1తో కైవసం చేసుకుంది. బెన్ కరన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, బ్రియాన్ బెనెట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.జింబాబ్వే వర్సెస్ ఐర్లాండ్ సంక్షిప్త స్కోర్లు👉వేదిక: హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే👉టాస్: జింబాబ్వే.. తొలుత బౌలింగ్👉ఐర్లాండ్ స్కోరు: 240/6 (50 ఓవర్లలో)👉జింబాబ్వే స్కోరు: 246/1 (39.3 ఓవర్లలో)👉ఫలితం: తొమ్మిది వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై జింబాబ్వే విజయం.. మూడు వన్డేల సిరీస్ 2-1తో సొంతం.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
Pak vs NZ: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సిరీస్ కివీస్‌దే
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ప్రారంభానికి ముందు సొంతగడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్(Tir Nation Series) ఫైనల్లో పాకిస్తాన్ పరాజయం పాలైంది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్తాన్... న్యూజిలాండ్(Pakistan Vs New Zealand)తో తుదిపోరులో మాత్రం అదే జోరు కనబర్చలేకపోయింది. రాణించిన రిజ్వాన్కరాచీ వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (76 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), సల్మాన్ ఆఘా (65 బంతుల్లో 45; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు.మిచెల్, లాథమ్ హాఫ్ సెంచరీలుగత మ్యాచ్‌లో సెంచరీలతో కదంతొక్కిన ఈ ఇద్దరూ... తాజా పోరులో మాత్రం భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. తయ్యబ్ తాహిర్ (38), బాబర్ ఆజమ్ (29) ఫర్వాలేదనిపించారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో రూర్కే 4 వికెట్లు పడగొట్టగా... సాంట్నర్, బ్రాస్‌వెల్ చెరో రెండు వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 45.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (58 బంతుల్లో 57; 6 ఫోర్లు), టామ్ లాథమ్ (64 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా... కాన్వే (48), కేన్ విలియమ్సన్ (34) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో నసీమ్ షా 2 వికెట్లు తీశాడు. రూర్కేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సల్మాన్ ఆఘాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్- త్రైపాక్షిక సిరీస్ ఫైనల్ సంక్షిప్త స్కోర్లు👉వేదిక: నేషనల్ స్టేడియం, కరాచీ👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉పాకిస్తాన్ స్కోరు- 242 (49.3)👉న్యూజిలాండ్ స్కోరు- 243/5 (45.2)👉ఫలితం: పాకిస్తాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన న్యూజిలాండ్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విలియం రూర్కే(4/43)చాంపియన్స్ ట్రోఫీకి సియర్స్ దూరంక్రైస్ట్చర్చ్: చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆటగాళ్ల జాబితాలో మరో పేస్ బౌలర్ చేరాడు. న్యూజిలాండ్ ఆటగాడు బెన్ సియర్స్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. బుధవారం ప్రాక్టీస్ సెషన్ తర్వాత పిక్క కండరాల నొప్పితో ఇబ్బంది పడిన అతనికి పరీక్షలు చేయించగా చీలిక ఉన్నట్లు తేలింది. దాంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సియర్స్ స్థానంలో జేకబ్ డఫీని ఎంపిక చేసినట్లు కివీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. చదవండి: చాంపియన్స్ ట్రోఫీ: ‘భారత తుదిజట్టులో ఇషాన్, చహల్’! -
అద్భుత ఫామ్.. అతడిని ఆపతరమా!.. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే!
చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్(ICC Champions Trophy 2025)కు ముందు ఇంగ్లండ్‌పై క్లీన్‌స్వీప్ విజయం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కి సంతృప్తిని మిగిల్చింది. విజయానంతరం మాట్లాడుతూ.. "ఈ సిరీస్‌లో మేము ఏదైనా పొరపాటు చేశామని నేను భావించడం లేదు. అయితే జట్టు సమిష్టిగా మరింత మెరుగ్గా ఆడాలని నేను భావిస్తున్నాను. ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలున్నాయి. తప్పకుండా జట్టు మరింత మెరుగ్గా ఆడాలని నేను కోరుకుంటున్నాను" అని రోహిత్ వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం.అయ్యర్ అద్భుత ఫామ్ వాస్తవానికి... ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ బ్యాటింగ్ అన్ని విధాలా ఆకట్టుకుంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మోకాలి నొప్పి కారణంగా తొలి వన్డే నుంచి వైదొలగడంతో.. తుదిజట్టులోకి వచ్చాడు అయ్యర్. అద్భుత రీతిలో రాణించి మరోసారి టీమిండియా మిడిలార్డర్‌కు వెన్నెముక గా నిలిచాడు.ఇంగ్లండ్ జట్టులో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్ వంటి అగ్రశ్రేణి పేస్ బౌలర్లున్నారు. వారిని ఎదుర్కొని రాణించడం ఆషామాషీ విషయం కాదు. ఇందుకు అనుగుణంగా తన స్టాన్స్ ని కూడా మార్పు చేసుకొని అయ్యర్ తన మునుపటి ఫామ్ ని ప్రదర్శించాడు. అయ్యర్ ఫామ్ ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ జట్టుకి కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు.భారత్ జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చే అయ్యర్ పై మిడిల్ ఓవర్లలో నిలకడగా పరుగులు సాధించాల్సిన బాధ్యత ఉంటుంది. గతం లో 2023 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన అయ్యర్ తర్వాత అనూహ్యంగా జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత గాయాల కారణంగా గత సంవత్సరం ఒక్క రంజీ ట్రోఫీ మ్యాచ్ కూడా ఆడకపోవడంతో తన కేంద్ర కాంట్రాక్టును కోల్పోవడంతో శ్రేయస్ అయ్యర్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.చలించని దృఢ సంకల్పంఅయితే అయ్యర్ దృఢ సంకల్పం ఎప్పుడూ చలించలేదు. దేశవాళీ వైట్-బాల్ టోర్నమెంట్లలో నిలకడగా రాణించి 188.52 స్ట్రైక్ రేట్‌తో 345 పరుగులతో, 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ లో ఐదు ఇన్నింగ్స్‌లలో 131.57 సగటుతో 325 పరుగులు చేశాడు.కేవలం ఒకే ఒక్కసారి అవుట్ అయ్యాడు. దేశవాళీ టౌర్నమెంట్లలో మళ్ళీ మునుపటి రీతిలో రాణిస్తుండంతో మళ్ళీ భారత్ జట్టులో స్థానం సంపాదించాడు. తొలి వన్డేలో కోహ్లి గాయంతో ఇలా కీలకమైన బ్రేక్ దొరికింది. దాంతో చెలరేగిపోయిన అయ్యర్ జట్టుకి తన అవసరం ఎలాంటితో చూపించి సత్తా చాటుకున్నాడు. ఇంగ్లండ్‌పై అద్భుతమైన ప్రదర్శనఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 3-0 తో విజయం సాధించడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో వరుసగా 59 పరుగులు (తొలి వన్డే) , 44 (రెండో వన్డే), 78 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ గాయపడిన కారణంగానే తాను ఈ సిరీస్ లోని తొలి వన్డే లో ఆడగలిగానని అయ్యర్ వెల్లడించాడు. అయితే ఆ అవకాశాన్ని అయ్యర్ రెండు చేతులతో అందిపుచ్చుకున్నాడు.అందుకే కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత కూడా అయ్యర్ స్థానం జట్టులో పదిలంగా నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 78 పరుగులతో అయ్యర్ వన్డేల్లో తన 20వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అయ్యర్ ఐదు సెంచరీలు కూడా చేసాడు. మొత్తం 65 వన్డేల్లో 48.18 సగటుతో 2,602 పరుగులు సాధించాడు. ఇక 2023 ప్రపంచ కప్ లో అయ్యర్ అద్భుతంగా రాణించి 66.25 సగటుతో 113.24 స్ట్రైక్ రేట్‌తో 530 పరుగులు చేశాడు. ఇంతటి అపార అనుభవం ఉన్న అయ్యర్ మళ్ళీ మునుపటి రీతిలో రాణిస్తుండంతో చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ బ్యాటింగ్‌ను నిలువరించడం ప్రత్యర్థి జట్లకు అంత తేలికైన విషయం కాదు. చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
అదంతా అబద్దం.. మాకంటూ ఓ విధానం ఉంది: మెకల్లమ్ ఫైర్
కామెంటేటర్లు రవి శాస్త్రి(Ravi Shastri), కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్(Brendon Mccullum) మండిపడ్డాడు. వీరిద్దరు మాట్లాడిన మాటల్లో ఏమాత్రం నిజం లేదంటూ కొట్టిపారేశాడు. ఆట విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తమకంటూ ఓ విధానం ఉందని.. ఫలితాలు అనుకూలంగా లేనపుడు ఇలాంటివి సహజమేనని పేర్కొన్నాడు.అసలేం జరిగిందంటే.. టీమిండియా(India vs England)తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో సూర్యసేన చేతిలో 4-1తో చిత్తైన బట్లర్ బృందం.. రోహిత్ సేనతో వన్డేల్లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది.తద్వారా ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభానికి ముందు గట్టి ఎదురుదెబ్బను చవిచూసింది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో ఇంగ్లండ్ మూడో వన్డే సందర్భంగా.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకే ఒక్క నెట్ సెషన్ఈ సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో ఇంగ్లండ్ ఒకే ఒక్క నెట్ సెషన్లో పాల్గొన్నదంటూ బట్లర్ బృందం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆట పట్ల అంకితభావం లేదంటూ విమర్శలకు దిగారు. ఈ విషయంపై ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తాజాగా స్పందించాడు.టాక్స్పోర్ట్తో మాట్లాడుతూ.. ‘‘మేము అసలు శిక్షణా శిబిరంలో పాల్గొననేలేదన్న వారి మాటలు పూర్తిగా అవాస్తవం. సిరీస్ ఆసాంతం మేము నెట్ సెషన్స్‌లో బిజీగా ఉన్నాం.అంతకు ముందు కూడా మా వాళ్లు వరుస సిరీస్‌లు ఆడారు. ఎదుటివారి విషయంలో ఆధారాలు లేకుండా ఇష్టారీతిన మాట్లాడటం సులువే. ఫలితాలు మాకు అనుకూలంగా లేవు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.మాకంటూ ఒక విధానం ఉందిఏ ఫార్మాట్లో ఎలా ఆడాలో మాకంటూ ఒక విధానం ఉంది. దానినే మేము అనుసరిస్తాం. ఇక ఇప్పటికే జట్టులోని చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు తెలుసు. ముందుగా చెప్పినట్లు వాళ్లు మాట్లాడిన మాటలు అబద్దాలు’’ అని మెకల్లమ్ రవిశాస్త్రి, పీటర్సన్ వ్యాఖ్యలను తిప్పికొట్టాడు.ఇక ఇప్పటికే ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సైతం వీరి మాటలను ఖండించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ప్రయాణాలు, బిజీ షెడ్యూల్ కారణంగా ఒకటీ రెండు సెషన్లు మాత్రమే మిస్సయ్యామని తెలిపాడు. అంతేతప్ప రవిశాస్త్రి, పీటర్సన్ అన్నట్లుగా తామేమీ పూర్తిగా ప్రాక్టీస్‌కు దూరంగా లేమని పేర్కొన్నాడు.కాగా టెస్టుల్లో ‘బజ్‌బాల్’ విధానంతో దూకుడైన ఆటను పరిచయం చేసిన బ్రెండన్ మెకల్లమ్.. టీమిండియాతో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్‌గానూ నియమితుడయ్యాడు. అయితే, తొలి ప్రయత్నంలోనే ఘోర పరాజయాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు.చదవండి: CT 2025: సురేశ్ రైనా ఎంచుకున్న భారత తుదిజట్టు... వరల్డ్‌కప్ వీరులకు నో ఛాన్స్! -
SL vs Aus: శతక్కొట్టిన కుశాల్ మెండిస్.. అసలంక ధనాధన్ ఇన్నింగ్స్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో శ్రీలంక స్టార్ క్రికెటర్ కుశాల్ మెండిస్(Kusal Mendis) శతక్కొట్టాడు. అద్భుత సెంచరీతో మెరిసి.. ఆసియా ఖండంలో వన్డే ఇంటర్నేషనల్స్‌లో మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కాగా రెండు టెస్టులు, రెండు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.టెస్టు సిరీస్ వైట్వాష్ఇరుజట్ల మధ్య టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసిన స్టీవ్ స్మిత్ బృందం.. వన్డేల్లో మాత్రం శుభారంభం అందుకోలేకపోయింది. కొలంబో వేదికగా లంకతో జరిగిన తొలి వన్డే(Sri Lanka vs Australia)లో 49 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆతిథ్య శ్రీలంక 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది.వన్డేల్లో లంక ఆధిక్యంఇదే జోరులో రెండో వన్డేలోనూ గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలనే తలంపుతో బరిలోకి దిగింది. కొలంబో(Colombo)లోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆసీస్ పేసర్ ఆరోన్ హార్డీ ఓపెనర్ పాతుమ్ నిసాంక(6)ను స్వల్ప స్కోరు వద్ద బౌల్డ్ చేయడంతో ఆదిలోనే లంకకు ఎదురుదెబ్బ తగిలింది.అయితే, యువ ఓపెనర్ నిషాన్ మదుష్క.. వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ కలిసి శ్రీలంక ఇన్నింగ్స్ చక్కదిద్దారు. కంగారూ పేసర్ బెన్ డ్వార్షుయిస్ నిషాన్‌ను అవుట్ చేసి ఈ జంటను విడదీశాడు. 70 బంతులు ఎదుర్కొన్న నిషాన్ 51 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక మెండిస్‌తో కలిసి నిషాన్ రెండో వికెట్‌కు 98 పరుగులు జతచేశారు.జంపా బౌలింగ్లోఇక నిషాన్ నిష్క్రమణ తర్వాత కూడా చెలరేగిన మెండిస్ శతకం పూర్తి చేసుకున్నాడు. 115 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. అయితే, జంపా బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌కు క్యాచ్ ఇవ్వడంతో కుశాల్ మెండిస్ శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది. కెప్టెన్ చరిత్ అసలంక(66 బంతుల్లో 78 నాటౌట్)తో కలిసి 94 పరుగులు జతచేసి కుశాల్ పెవిలియన్ చేరాడు.కాగా కుశాల్ మెండిస్‌కు ఆస్ట్రేలియాపై ఇది తొలి వన్డే శతకం కాగా ఓవరాల్‌గా ఐదవది. ఇదిలా ఉంటే.. మిగిలిన వాళ్లలో కమిందు మెండిస్(4) విఫలం కాగా.. జనిత్ లియనగే 21 బంతుల్లో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి శ్రీలంక 281 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో ఆరోన్ హార్డీ, డ్వార్షుయిస్, సీన్ అబాట్, ఆడం జంపా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: టీమిండియా ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడు.. అతడి స్థానానికి ఎసరు! -
టీమిండియా ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడు.. అతడి స్థానానికి ఎసరు!
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) ప్రశంసలు కురిపించాడు. రానున్న కాలంలో భారత బౌలింగ్ దళంలో ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో హర్షిత్ అద్భుత ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హర్షిత్.. స్వదేశంలో ఇంగ్లండ్(India vs England)తో పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అరంగేట్రం చేశాడు. తొలుత టీ20లలో ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ పేసర్.. అనంతరం వన్డేల్లోనూ చోటు దక్కించుకున్నాడు.బుమ్రా స్థానంలో ఐసీసీ టోర్నీకిఇంగ్లండ్తో ఆడిన టీ20 మ్యాచ్‌లో మూడు వికెట్లతో మెరిసిన రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.. మూడు వన్డేల్లో కలిపి ఆరు వికెట్లు కూల్చాడు. తద్వారా ఈ రెండు సిరీస్‌లలో టీమిండియా గెలవడంలో తాను భాగమయ్యాడు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని బీసీసీఐ హర్షిత్ రాణాతో భర్తీ చేసింది.ఈ నేపథ్యంలో కామెంటేటర్, భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ హర్షిత్ రాణా ఆట తీరును కొనియాడాడు. రాణా రాకతో అర్ష్‌దీప్ సింగ్‌కు గట్టి పోటీ తప్పదని అభిప్రాయపడ్డాడు. ‘‘ఇటీవలి కాలంలో హర్షిత్ రాణా పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించిన తీరు ఆకట్టుకునే విధంగా ఉంది.టీమిండియా ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడుతన ప్రదర్శనతో అతడు జట్టు విజయాలపై ప్రభావం చూపగలిగాడు. అతడి ఆటిట్యూడ్ కూడా ముచ్చటగొలిపేలా ఉంది. సమీప భవిష్యత్తులోనే అతడు టీమిండియా బౌలింగ్ బిగ్ స్టార్‌గా అవతరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఆట పట్ల అతడి అంకితభావం, ఆలోచనా ధోరణి నాకెంతో నచ్చింది. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీ తుదిజట్టులో సీనియర్‌గా అర్ష్‌దీప్ సింగ్‌కే ప్రాధాన్యం దక్కుతుంది. అయితే, దీర్ఘ కాలంలో రాణా వల్ల అర్ష్‌దీప్‌నకు కష్టాలు తప్పవు. సెకండ్ సీమర్‌గా అతడికి హర్షిత్ నుంచి పోటీ ఎదురవుతుంది.సిరాజ్ రీ ఎంట్రీ కష్టమే!కచ్చితంగా హర్షిత్ రాణా అర్ష్‌కు గట్టిపోటీగా మారతాడు. అతడి వల్ల ఇప్పటికే సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్లో పునరాగమనం చేయడం కష్టంగా మారింది’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగాడు హర్షిత్ రాణా.గత ఎడిషన్‌లో మొత్తంగా పదమూడు మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లతో మెరిసిన ఈ ఢిల్లీ బౌలర్.. కోల్‌కతాను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక నాడు కోల్‌కతా జట్టు మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్ కావడంతో హర్షిత్‌కు టీమిండియా ఎంట్రీ కాస్త సులువుగానే దక్కింది.చదవండి: Champions Trophy: ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. వామ్మో ఇన్ని కోట్లా? -
CT 2025: చతికిలపడ్డ ఇంగ్లండ్.. గాయాల ఊబిలో ఆస్ట్రేలియా
ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ఇంగ్లండ్‌పై మూడు వన్డేల సిరీస్ విజయం టీమిండియాలో ఉత్తేజాన్ని రెట్టింపు చేసింది. ఈ సిరీస్ సందర్భంగా జట్టులోని ప్రధాన బ్యాటర్లందరూ పరుగులు సాధించడంతో మేనేజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది. జట్టులోని ప్రధాన బౌలరైన జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోవడం జట్టుకి కాస్త అసంతృప్తిని కలిగించినా.. గాయాలపై భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు కానీ.. టీమ్ మేనేజిమెంట్ కానీ చేయగలిగింది ఏమీ లేదు.ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న క్రీడాకారులతో వ్యూహం రూపొందించాల్సి ఉంటుంది. ఈ విధంగా చూస్తే భారత్ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఆస్టేలియా పర్యటనలోనూ, సొంతగడ్డ పై శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల తో వరుసగా పరాజయాలు చవిచూసింది రోహిత్ సేన. అయితే, ఇంగ్లండ్ విజయంతో మళ్ళీ మునుపటి రీతిలో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ముందు ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టు తో ఈ సిరీస్ ఏర్పాటు చేయడం భారత్ వ్యూహం ఫలించిందని చెప్పాలి.వరుస పరాజయాలతో చతికిలపడ్డ ఇంగ్లండ్అయితే ఈ టోర్నమెంట్లో టీమిండియా ప్రధాన ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. పేపర్ మీద ఇంగ్లండ్ చాలా పటిష్టమైన జట్టుగా కనిపిస్తున్నా..ఈ టోర్నమెంట్ పాకిస్తాన్, దుబాయ్ ల లో జరుగుతున్నందున.. ఆసియా జట్లు ఈ పిచ్‌లపై ఆధిపత్యం చెలాయించే అవకాశముంది. ఇక బుధవారం అహ్మదాబాద్‌లో జరిగిన మూడవ వన్డేలో ఇంగ్లండ్ 142 పరుగుల భారీ ఓటమి చవిచూడడం ఆ జట్టుకి ఛాంపియన్స్ ట్రోఫీ ముందు పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు.ఇంగ్లండ్ ఈ వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోవడమే కాక అంతకుముందు జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కూడా భారత్ చేతిలో 1-4 తేడాతో పరాజయం చవిచూసింది. ఈ పరాజయంపై స్పందిస్తూ, భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ జోస్ బట్లర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టును తీవ్రంగా దుయ్యబట్టారు.భారత పర్యటనలో ఇంగ్లీష్ జట్టు కేవలం ఒక నెట్ సెషన్ లో మాత్రమే పాల్గొందని, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ముందు ఇది చాల దారుణమైన విషయమని శాస్త్రి వెల్లడించాడు. "నేను విన్న దాని ప్రకారం, ఈ పర్యటన అంతటా ఇంగ్లాండ్ ఒకే ఒక నెట్ సెషన్ లో పాల్గొంది. ఇంగ్లండ్ జట్టు సిరీస్ విజయం కోసం కష్టపడటానికి సిద్ధంగా లేదు," అని శాస్త్రి వ్యాఖ్యానించాడు. వ్యాఖ్యాత బృందంలో భాగమైన పీటర్సన్, జాకబ్ బెథెల్ స్థానంలో ఇంగ్లాండ్ జట్టులో చేరిన టామ్ బాంటన్ భారత్ తో జరిగిన మూడో వన్డే కి ముందు గోల్ఫ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని వెల్లడించడంతో.. శాస్త్రి ఆ జట్టుపై మరింత అసంతృప్తి వ్యక్తం చేసాడు.గాయాల ఊబిలో ఆస్ట్రేలియాఇక ఇంగ్లండ్ పరిస్థితి ఇలా ఉంటే, ఈ టోర్నమెంట్ లో ప్రధాన ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియా జట్టు గాయాల ఊబిలో చిక్కుకొని ఉంది. ఇటీవల శ్రీలంకలో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత, గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా ఆ తర్వాత జరిగే వన్డే మ్యాచ్‌లలో కూడా విజయం సాధించాలని.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జట్టు ఆత్మవిశ్వాసానికి ఇది ఎంతో కీలకమని భావిస్తోంది.ఇటీవల భారత్‌తో సొంత గడ్డ పై జరిగిన టెస్ట్ సిరీస్ లో తన సత్తా చాటిన ఆస్ట్రేలియా తర్వాత గాయాల కారణంగా చతికిలపడింది. జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్, సీనియర్ బౌలర్ మిచెల్ స్టార్క్, మరో పేస్ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్, ఆల్ రౌండర్ మిచ్ మార్ష్ గాయాల కారణంగా జట్టు నుంచి తప్పుకున్నారు, మరో ముఖ్యమైన ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ గత వారం వన్డేల నుండి రిటైర్మెంట్ అవుతున్నట్టు అనూహ్యమైన ప్రకటన చేసాడు.ఈ ఈ పరిస్థితులలోశ్రీలంక సిరీస్ కోసం రిజర్వ్ ఫాస్ట్ బౌలర్లు సీన్ అబాట్, స్పెన్సర్ జాన్సన్, బెన్ డ్వార్షుయిస్తో పాటు లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘ, స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్ కూపర్ కొన్నోలీ, బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్లను సెలెక్టర్లు జట్టులోకి చేర్చారు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ వంటి కీలకమైన టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా వంటి ప్రత్యర్థి ని పూర్తిగా కొట్టివేయడానికి లేకపోయినా, ఆ జట్టు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని చెప్పడంలో సందేహం లేదు.చదవండి: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్.. కోహ్లి కామెంట్స్ వైరల్ -
క్రెడిట్ అతడికే ఇవ్వాలి.. నా స్థానంలో ఎవరున్నా అంతే: రోహిత్ శర్మ
ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో తాను అవుటైన తీరు పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) స్పందించాడు. బౌలర్ అద్భుతమైన బంతిని సంధించాడని.. అది ఆడటం ఎవరితరం కాదంటూ తనను తాను సమర్థించుకున్నాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి ముందు భారత క్రికెట్ జట్టు అద్భుతమైన విజయం అందుకున్న విషయం తెలిసిందే.స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను రోహిత్ సేన 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత నాగ్‌పూర్‌లో బట్లర్ బృందాన్ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. కటక్‌లో జరిగిన రెండో వన్డేలోనూ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన భారత ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ.. విధ్వంసకర శతకం(119) బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.మార్క్‌వుడ్ సూపర్ డెలివరీఅయితే, అహ్మదాబాద్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం హిట్‌మ్యాన్ తేలిపోయాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్(Mark Wood) గంటకు దాదాపు 142 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతిని ఆడటం తప్ప రోహిత్ శర్మకు మరో ఆప్షన్ లేకపోయింది. ఈ క్రమంలో అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్ తన కుడివైపునకు డైవ్ చేసి మరీ ఒడిసిపట్టాడు. దీంతో రోహిత్ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది.టాస్ ఓడిన టీమిండియా.. ఇలా ఆరంభంలోనే వికెట్ కోల్పోయినప్పటికీ భారీ స్కోరు చేయగలిగింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్(112) శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లి(52), శ్రేయస్ అయ్యర్(78), కేఎల్ రాహుల్(40) రాణించడం వల్ల నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. వీరి దెబ్బకు 34.2 ఓవర్లలో 214 పరుగులు చేసి బట్లర్ బృందం ఆలౌట్ అయింది. ఫలితంగా 142 పరుగుల తేడాతో గెలిచిన భారత్ సిరీస్‌ను సంపూర్ణ విజయంతో ముగించింది.క్రెడిట్ మొత్తం బౌలర్‌కే ఇవ్వాలిఈ నేపథ్యంలో విజయానంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్ సాగిన తీరుపట్ల ఎంతో సంతోషంగా ఉంది. సవాళ్లు ఉంటాయని ముందే తెలుసు. ఊహించనవి కూడా జరగడం సహజమే. నా విషయంలో క్రెడిట్ మొత్తం బౌలర్‌కే ఇవ్వాలి. బౌలర్‌గా నన్ను సవాల్ చేయడం అతడి కర్తవ్యం. బ్యాటర్‌గా బౌలర్‌ను ఎదుర్కోవడం నా పని.ఇక్కడ ఇద్దరం ఒకరితో ఒకరం పోటీ పడే క్రమంలో నేను ఆ బంతిని ఆడటంలో విఫలమయ్యాను. ఆ విషయం పక్కనపెడితే.. ఈ సిరీస్‌లో మా జట్టు ఆడిన తీరు పట్ల సంతృప్తిగా ఉన్నాను. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం మా ఆట తీరును మెరుగుపరచుకోవాల్సి ఉంది.చాంపియన్ టీమ్వాటి గురించి నేను ఇక్కడ వివరణ ఇస్తూ ఉండలేను. అయితే, జట్టుగా నిలకడైన ప్రదర్శన చేయడం పట్ల మాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. చాంపియన్ టీమ్ రోజురోజుకూ మరింత మెరుగవ్వాలని ఆశించడం సహజమే కదా! మేమూ అంతే.. తమకు నచ్చిన విధంగా ఆడేలా మా ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం. అందుకు వరల్డ్‌కప్(2023) చక్కటి ఉదాహరణ. అయితే, నాడు అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాం. ఆటలో ఇవన్నీ భాగమే’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పరిపూర్ణ విజయం సాధించిన టీమిండియా తదుపరి చాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగనుంది. తదుపరి ఐసీసీ టోర్నీలోపాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ టోర్నీ మొదలుకానుండగా.. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా రోహిత్ సేన తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. లీగ్ దశలో తొలుత బంగ్లాదేశ్‌తో.. అనంతరం పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో మ్యాచ్‌లు ఆడనుంది. ఇక 2017లో చివరగా నిర్వహించిన ఈ వన్డే ఫార్మాట్ ఈవెంట్లో ఫైనల్ చేరిన టీమిండియా పాక్ జట్టు చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డువారెవ్వా!.. శుబ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు Captain @ImRo45 is presented the winners trophy by ICC Chairman, Mr @JayShah as #TeamIndia clean sweep the ODI series 3-0 👏👏#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/1XaKksydw9— BCCI (@BCCI) February 12, 2025 -
ఘనమైన ముగింపు
వన్డేల్లో భారత జట్టు మరోసారి తమ బలాన్ని ప్రదర్శించింది. సొంతగడ్డపై తమ స్థాయిని చూపిస్తూ ఇంగ్లండ్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. గత రెండు మ్యాచ్‌ల తరహాలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా చివరి పోరులోనూ ఘన విజయాన్ని అందుకుంది. కెరీర్లో 50వ వన్డే ఆడిన శుబ్‌మన్ గిల్ శతకానికి తోడు శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి రాణించడంతో భారీ స్కోరు సాధించిన టీమిండియా ఆ తర్వాత బలమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టి పడేసింది.‘బజ్‌బాల్‘ మాయలో ‘బ్యాడ్బాల్’గా మారిపోయిన ఆటతో ఇంగ్లండ్ మరో భారీ ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు కోహ్లి సహా ప్రధాన బ్యాటర్లంతా ఫామ్‌లోకి వచ్చిన సానుకూలతతో ఇక చాంపియన్స్ ట్రోఫీ సమరానికి రోహిత్ బృందం సన్నద్ధమైంది. అహ్మదాబాద్: ఇంగ్లండ్‌పై టి20 సిరీస్‌ను 4–1తో గెలుచుకున్న భారత్ జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్ 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (102 బంతుల్లో 112; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... శ్రేయస్ అయ్యర్ (64 బంతుల్లో 78; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), కోహ్లి (55 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. కోహ్లితో 116 పరుగులు జోడించిన గిల్, అయ్యర్‌తో 104 పరుగులు జత చేశాడు. అనంతరం ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. అట్కిన్సన్ (19 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్), బాంటన్ (41 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సిరీస్‌లో 259 పరుగులు చేసిన గిల్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. శతక భాగస్వామ్యాలు... గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ (1) ఈసారి రెండో బంతికే వెనుదిరిగాడు. అయితే గిల్, కోహ్లి భాగస్వామ్యంలో భారత్ ఇన్నింగ్స్ సరైన దిశలో సాగింది. 7 పరుగుల వద్ద సమన్వయ లోపంతో కోహ్లి రనౌట్ ప్రమాదంలో పడినా వుడ్ త్రో నేరుగా వికెట్లను తగలకపోవడంతో బతికిపోయాడు. తొలి 10 ఓవర్లలో భారత్ 52 పరుగులు చేసింది. ఆ తర్వాత వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లతో అలరించారు. ఐదు బంతుల వ్యవధిలో గిల్ (51 బంతుల్లో), కోహ్లి (50 బంతుల్లో) అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. అయితే తర్వాతి ఓవర్లో రషీద్ వేసిన చక్కటి బంతిని ఆడలేక కోహ్లి వెనుదిరిగాడు. అనంతరం ఫామ్‌లో ఉన్న అయ్యర్...గిల్‌తో జత కలిశాడు. ఈ జోడీ కూడా పదునైన బ్యాటింగ్‌తో అలవోకగా పరుగులు సాధించింది. వుడ్ ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా ఫోర్ కొట్టి 95 బంతుల్లోనే గిల్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఆ వెంటనే 43 బంతుల్లో అయ్యర్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే తక్కువ వ్యవధిలో వీరిద్దరిని ఆదిల్ రషీద్ వెనక్కి పంపించాడు. గత రెండు వన్డేల్లో విఫలమైన కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్) ఈసారి మెరుగ్గా ఆడగా... రషీద్ ఓవర్లో వరుసగా 6, 6 బాది తర్వాతి బంతికి హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 17) అవుటయ్యాడు.తర్వాత వచ్చిన బ్యాటర్లందరూ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయినా... భారత్ 350 పరుగుల స్కోరును దాటగలిగింది. ఆఖరి 7 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. భారత తుది జట్టులో వరుణ్ చక్రవర్తి, షమీ, రవీంద్ర జడేజా స్థానాల్లో కుల్దీప్, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ తుది జట్టులోకి వచ్చారు. సమష్టి వైఫల్యం... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (21 బంతుల్లో 23; 4 ఫోర్లు), బెన్ డకెట్ (22 బంతుల్లో 34; 8 ఫోర్లు) సరైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 6.2 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. రాణా తన తొలి 2 ఓవర్లలో 5 ఫోర్లతో 22 పరుగులు ఇవ్వగా... అర్ష్ దీప్ ఓవర్లో డకెట్ వరుసగా 4 బంతుల్లో 4 ఫోర్లు కొట్టాడు. అయితే ఈ భాగస్వామ్యం విడిపోయిన తర్వాత ఇంగ్లండ్ తడబడింది. బాంటన్, రూట్ (29 బంతుల్లో 24; 2 ఫోర్లు) కొద్దిసేపు నిలబడినా వీరిద్దరు ఎనిమిది పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఆ తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. టపటపా వికెట్లను కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. రాణా వరుసగా రెండు ఓవర్లలో బట్లర్ (6), బ్రూక్ (26 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్)లను బౌల్డ్ చేయడంతో జట్టు ఆశలు కోల్పోయింది. మిగతా లాంఛనం ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. మరో 15.4 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు కుప్పకూలింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సాల్ట్ (బి) వుడ్ 1; గిల్ (బి) రషీద్ 112; కోహ్లి (సి) సాల్ట్ (బి) రషీద్ 52; అయ్యర్ (సి) సాల్ట్ (బి) రషీద్ 78; రాహుల్ (ఎల్బీ) (బి) మహమూద్ 40; పాండ్యా (బి) రషీద్ 17; అక్షర్ (సి) బాంటన్ (బి) రూట్ 13; సుందర్ (సి) బ్రూక్ (బి) వుడ్ 14; రాణా (సి) బట్లర్ (బి) అట్కిన్సన్ 13; అర్ష్ దీప్ (రనౌట్) 2; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 356. వికెట్ల పతనం: 1–6, 2–122, 3–226, 4–259, 5–289, 6–307, 7–333, 8–353, 9–353, 10–356. బౌలింగ్: సాఖిబ్ మహమూద్ 10–0–68–1, మార్క్ వుడ్ 9–1–45–2, అట్కిన్సన్ 8–0–74–1, రూట్ 5–0–47–1, ఆదిల్ రషీద్ 10–0–64–4, లివింగ్‌స్టోన్ 8–0–57–0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 23; డకెట్ (సి) రోహిత్ (బి) అర్ష్ దీప్ 34; బాంటన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 38; రూట్ (బి) అక్షర్ 24; బ్రూక్ (బి) రాణా 19; బట్లర్ (బి) రాణా 6; లివింగ్‌స్టోన్ (స్టంప్డ్) రాహుల్ (బి) సుందర్ 9; అట్కిన్సన్ (బి) అక్షర్ 38; రషీద్ (బి) పాండ్యా 0; వుడ్ (సి) అయ్యర్ (బి) పాండ్యా 9; మహమూద్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (34.2 ఓవర్లలో ఆలౌట్) 214. వికెట్ల పతనం: 1–60, 2–80, 3–126, 4–134, 5–154, 6–161, 7–174, 8–175, 9–193, 10–214. బౌలింగ్: అర్ష్ దీప్ 5–0–33–2, హర్షిత్ రాణా 5–1–31–2, వాషింగ్టన్ సుందర్ 5–0–43–1, అక్షర్ పటేల్ 6.2–1–22–2, పాండ్యా 5–0–38–2, కుల్దీప్ యాదవ్ 8–0–38–1. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకుండానే..చాంపియన్స్ ట్రోఫీ బరిలో టీమిండియా దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా భారత జట్టు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటం లేదు. బుధవారం వరకు స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడిన టీమిండియా... తమకు ప్రాక్టీస్ మ్యాచ్‌ల అవసరం లేదని తేల్చేసింది. టోర్నీలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 14–17 మధ్య జరుగుతాయి. 19న టోర్నీ ప్రారంభం కానుండగా, భారత జట్టు 15న దుబాయ్ చేరుకుంటుంది. మరోవైపు అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ టీమ్‌లు మాత్రం పాక్ గడ్డపైనే ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడబోతున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లలో తలపడేందుకు ప్రత్యర్థులుగా పాకిస్తాన్ మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. మరో ప్రాక్టీస్ పోరులో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ తలపడతాయి. 1ఒకే మైదానంలో మూడు ఫార్మాట్లలోనూ (టెస్టు, వన్డే, టి20) సెంచరీలు చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా శుబ్‌మన్ గిల్ గుర్తింపు పొందాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్ టి20ల్లో (న్యూజిలాండ్‌పై 126 నాటౌట్; 2023లో), టెస్టుల్లో (ఆ్రస్టేలియాపై 128; 2023లో), వన్డేల్లో (ఇంగ్లండ్‌పై 112; 2025లో) ఒక్కో సెంచరీ సాధించాడు. -
Pak vs SA: హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసర ఇన్నింగ్స్
పాకిస్తాన్‌తో వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు దంచికొట్టారు. త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా కరాచీ వేదికగా ప్రొటిస్ జట్టు 352 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. నేషనల్ స్టేడియంలో నాలుగో నాలుగో అత్యధిక స్కోరును నమోదు చేసింది.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) సన్నాహకాల్లో భాగంగా పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్, సౌతాఫ్రికా అక్కడకు వెళ్లాయి. ఈ క్రమంలో ట్రై సిరీస్‌లో భాగంగా తొలుత పాక్- న్యూజిలాండ్ మధ్య లాహోర్‌లో శనివారం మ్యాచ్ జరిగింది. ఇందులో కివీస్ జట్టు పాక్‌ను 78 పరుగుల తేడాతో చిత్తు చేసింది.ఫైనల్లో న్యూజిలాండ్అనంతరం సౌతాఫ్రికాతో సోమవారం తలపడ్డ న్యూజిలాండ్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో మరో ఫైనల్ బెర్తు కోసం సౌతాఫ్రికా- పాకిస్తాన్ కరాచీలో మంగళవారం మ్యాచ్ ఆడుతున్నాయి. ఇందులో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు.. తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో కెప్టెన్ తెంబా బవుమా(Temba Bavuma) అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. 96 బంతుల్లో పదమూడు ఫోర్ల సాయంతో 82 రన్స్ సాధించాడు.మరో ఓపెనర్ టోనీ డి జోర్జి(22) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కే( Matthew Breetzke) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 84 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసర ఇన్నింగ్స్కేవలం 38 బంతుల్లోనే యాభై పరుగులు అందుకున్న ఈ విధ్వంసకర వీరుడు.. మొత్తంగా 56 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. క్లాసెన్ ఇన్నింగ్స్‌లో పదకొండు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక మిగతా వాళ్లలో వియాన్ ముల్దర్(2) విఫలం కాగా.. కైలే వెరెన్నె(32 బంతుల్లో 44 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కార్బిన్ బోష్(9 బంతుల్లో 15 నాటౌట్) అతడికి సహకరించాడు.ఈ క్రమంలో నిర్ణీత యాభై ఓవర్లలో సౌతాఫ్రికా కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 352 పరుగులు సాధించింది. ఇక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఆఖరి పది ఓవర్లలో పాకిస్తాన్ ఏకంగా 110 పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టు బౌలర్ల చెత్త ప్రదర్శనకు నిదర్శనం. ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డేలోనూ చివరి పది ఓవర్లలో పాక్ బౌలర్లు 123 పరుగులు ఇచ్చుకున్నారు.శుక్రవారం ఫైనల్ మ్యాచ్ కాగా.. పాకిస్తాన్- సౌతాఫ్రికా మధ్య కరాచీ మ్యాచ్‌లో గెలిచిన జట్టు న్యూజిలాండ్‌తో శుక్రవారం ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది.ఈ మెగా టోర్నీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఈ ఈవెంట్లో అడుగుపెట్టాయి. ఈ క్రమంలో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించగా.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్-‘ఎ’ నుంచి.. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ గ్రూప్-‘బి’ నుంచి పోటీపడనున్నాయి.కాగా ఇటీవల సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా పాకిస్తాన్ ఆతిథ్య జట్టును 3-0తో వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ను వారి సొంతగడ్డపై ఓడించాలనే పట్టుదలతో కరాచీలో చితక్కొట్టిన సౌతాఫ్రికా.. బౌలింగ్‌లోనూ రాణించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు -
అహ్మదాబాద్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లు.. ఇదే తొలిసారి
ఇంగ్లండ్‌తో మూడో వన్డే(India vs England)లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఫలితంగా అహ్మదాబాద్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తద్వారా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ఖాతాలో అతిపెద్ద స్కోరు(Highest ODI total) నమోదైంది. కాగా రోహిత్ సేన ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా నాగ్‌పూర్, కటక్ వన్డేల్లో ఇంగ్లండ్‌ను నాలుగేసి వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డేలోనూ గెలిచి వైట్‌వాష్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది.అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆరంభంలోనే కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) వికెట్ రూపంలో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గత వన్డేలో సెంచరీ(119)తో చెలరేగిన హిట్‌మ్యాన్ మూడో వన్డేలో మాత్రం ఒక్క పరుగే చేసి మార్క్‌వుడ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.ఎట్టకేలకు ఫామ్లోకిఈ నేపథ్యంలో మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు జతైన వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 55 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు. అప్పటికే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. దానిని శతకంగా మార్చుకున్నాడు.గిల్ శతకంమొత్తంగా 102 బంతులు ఎదుర్కొన్న శుబ్‌మన్ గిల్ 14 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది.. 112 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 78 రన్స్) అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. మరోవైపు.. తన రెగ్యులర్ స్థానమైన ఐదో నంబర్లో వచ్చిన కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.కేవలం 29 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి 40 పరుగులు సాధించాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. మిగతా వాళ్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా(17), అక్షర్ పటేల్(13), వాషింగ్టన్ సుందర్(14).. పేసర్లు హర్షిత్ రాణా(13), అర్ష్‌దీప్ సింగ్(2), కుల్దీప్ యాదవ్(1*) నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.అవయవ దానం గురించిఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 356 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. పేసర్లు మార్క్ వుడ్ రెండు, గస్ అట్కిన్సన్ ఒకటి, పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ ఒక వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా- ఇంగ్లండ్ క్రికెటర్లు అవయవ దానం గురించి అవగాహన కల్పించే చేసే క్రమంలో గ్రీన్ ఆర్మ్ బ్యాండ్‌తో బరిలోకి దిగడం విశేషం.అహ్మదాబాద్‌లో వన్డేల్లో అత్యధిక స్కోర్లుసౌతాఫ్రికా వర్సెస్ ఇండియా- 2010లో 365/2ఇండియా వర్సెస్ ఇంగ్లండ్- 2025లో 356ఇండియా వర్సెస్ వెస్టిండీస్- 2002లో 325/5వెస్టిండీస్ వర్సెస్ ఇండియా- 2002లో 324/4 పాకిస్తాన్ వర్సెస్ ఇండియా- 2007లో 319/7.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డువారెవ్వా!.. శుబ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు -
వారెవ్వా!.. శుబ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు
టీమిండియా యువ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) సూపర్ సరికొత్త చరిత్ర లిఖించాడు. వన్డేల్లో సౌతాఫ్రికా బ్యాటర్ హషీం ఆమ్లా(Hashim Amla) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే(India vs England) సందర్భంగా శతకం బాదిన ‘ప్రిన్స్’ ఈ ఘనత సాధించాడు.కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత నాగ్‌పూర్‌లో నాలుగు వికెట్ల తేడాతో పర్యాటక జట్టును ఓడించిన రోహిత్ సేన.. కటక్‌లో జరిగిన రెండో వన్డేలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తద్వారా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.గిల్ సూపర్ సెంచరీఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా నామామాత్రపు మూడో వన్డేలోనూ గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉంది. నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, గత మ్యాచ్‌లో శతకం(119) బాదిన కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ(1) ఈసారి విఫలం కాగా.. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మాత్రం సెంచరీతో మెరిశాడు.తొలి యాభై ఇన్నింగ్స్లోమొత్తంగా 102 బంతులు ఎదుర్కొని 112 పరుగులు సాధించాడు. గిల్ ఇన్నింగ్స్‌లో ఏకంగా పద్నాలుగు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే గిల్ హషీం ఆమ్లాను అధిగమించాడు. వన్డేల్లో ఆడిన తొలి యాభై ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.అంతేకాదు.. ఒకే వేదికపై మూడు ఫార్మాట్లలో శతకం బాదిన ఐదో బ్యాటర్‌గానూ శుబ్‌మన్ గిల్ చరిత్రకెక్కాడు. ఇక ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో మూడో వన్డేలో గిల్ సెంచరీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.కోహ్లి కూడా ఫామ్లోకిఇక ఈ మ్యాచ్‌తో మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా ఫామ్‌లోకి వచ్చాడు. అహ్మదాబాద్‌లో 55 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు సాధించాడు. మరోవైపు.. నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుత హాఫ్ సెంచరీ(64 బంతుల్లో 78)తో మెరిశాడు.ఇదిలా ఉంటే.. 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శుబ్‌మన్ గిల్ ఇప్పటి వరకు 50 వన్డేలు, 32 టెస్టులు, 21 టీ20లు ఆడాడు. వరుసగా ఆయా ఫార్మాట్లలో 2587, 1893, 578 పరుగులు చేశాడు.అంతర్జాతీయ స్థాయిలో వన్డేల్లో తొలి యాభై ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు👉శుబ్‌మన్ గిల్(ఇండియా)- 2587 పరుగులు👉హషీం ఆమ్లా(సౌతాఫ్రికా)- 2486 పరుగులు👉ఇమామ్ ఉల్ హక్(పాకిస్తాన్)- 2386 పరుగులు👉ఫఖర్ జమాన్(పాకిస్తాన్)- 2262 పరుగులు👉షాయీ హోప్(వెస్టిండీస్)- 2247 పరుగులుఒకే వేదికపై వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో శతకం బాదిన క్రికెటర్లు👉ఫాఫ్ డుప్లెసిస్(సౌతాఫ్రికా)- వాండరర్స్ స్టేడియం, జొహన్నస్‌బర్గ్👉డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)- అడిలైడ్ ఓవల్, అడిలైడ్👉బాబర్ ఆజం(పాకిస్తాన్)- నేషనల్ స్టేడియం, కరాచి👉క్వింటన్ డికాక్(సౌతాఫ్రికా)- సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్👉శుబ్‌మన్ గిల్(ఇండియా)- నరేంద్ర మోదీ స్టేడియం(మొతేరా), అహ్మదాబాద్.చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డుJubilation as @ShubmanGill gets to a fine CENTURY!Keep at it, young man 🙌🙌Live - https://t.co/S88KfhFzri… #INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/Xbcy6uaO6J— BCCI (@BCCI) February 12, 2025 -
చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు
అహ్మదాబాద్ వన్డే సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు.కాగా గత కొంతకాలంగా కోహ్లి వరుస వైఫల్యాలతో సతమవుతున్న విషయం తెలిసిందే. గత పన్నెండు ఇన్నింగ్స్‌లో అతడు చేసిన పరుగులు వరుసగా 4, 1, 5, 100*, 7, 11, 3, 36, 5, 17, 6, 6. ఈ క్రమంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(India vs England)లోనైనా కోహ్లి ఫామ్‌లోకి వస్తాడని భావిస్తే.. మోకాలి గాయం కారణంగా నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు.కేవలం ఐదు పరుగులుఅనంతరం కటక్‌లో జరిగిన రెండో వన్డేతో పునరాగమనం చేసిన కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ సాయంతో కేవలం ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డేలోనైనా బ్యాట్ ఝులిపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో కోహ్లి ఓ అరుదైన ఘనత సాధించడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్‌పై నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. కాగా కోహ్లి ఇంగ్లండ్‌పై ఇప్పటి వరకు ఎనిమిది శతకాలు బాదడంతో పాటు 23 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. సగటు 41.23.హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లిఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. మార్క్ వుడ్ బౌలింగ్‌లో ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు.. వన్‌డౌన్ బ్యాటర్ కోహ్లి(52), ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చిన కోహ్లి అవుటయ్యాడు.ఇక ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ శతకం(112) బాదగా..శ్రేయస్ అయ్యర్(78), కేఎల్ రాహుల్(40) రాణించారు. ఫలితంగా నిర్ణీత యాభై ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది.అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు1. డాన్ బ్రాడ్‌మన్(ఆస్ట్రేలియా)- 63 ఇన్నింగ్స్‌లో 5028 పరుగులు2. అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా)- 124 ఇన్నింగ్స్‌లో 4850 పరుగులు3. స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా)- 114 ఇన్నింగ్స్‌లో 4815 పరుగులు4. వివియన్ రిచర్డ్స్(వెస్టిండీస్)- 84 ఇన్నింగ్స్‌లో 4488 పరుగులు5. రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 99 ఇన్నింగ్స్‌లో 4141 పరుగులు6. విరాట్ కోహ్లి(ఇండియా)-109 ఇన్నింగ్స్‌లో 4001కి పైగా పరుగులు.చదవండి: ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
Ind vs Eng 3rd ODI: వరుణ్ చక్రవర్తికి గాయం.. ఆ ఇద్దరికి విశ్రాంతి
Ind vs Eng 3rd ODI: టీమిండియాతో అహ్మదాబాద్ వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తన నిర్ణయం గురించి ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మేము ముందుగా బౌలింగ్ చేయాలని అనుకుంటున్నాం. మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ పరిస్థితి మెరుగుపడవచ్చు. తొలి రెండు వన్డేల్లో మేము ముందుగా బ్యాటింగ్ చేశాం. అందుకే చాంపియన్స్ ట్రోఫీకి ముందు కాస్త కొత్తగా ప్రయత్నిస్తున్నాం. వికెట్ బాగుంది. ఇక్కడే మేము న్యూజిలాండ్‌తో వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడాం. నల్లరేగడి మట్టి పిచ్ సెకండాఫ్‌లో బ్యాటింగ్‌కు ఇంకాస్త అనుకూలంగా మారుతుంది. ఈరోజు మేము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నాం. జేమీ ఓవర్టన్ స్థానంలో టామ్ బాంటన్ జట్టులోకి వచ్చాడు’’ అని తెలిపాడు.మరోవైపు.. టాస్ సందర్భంగా రోహిత్ శర్మ(Rohit Sharma) తాము మూడు మార్పులతో మూడో వన్డే ఆడుతున్నట్లు వెల్లడించాడు. రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చామన్న రోహిత్.. దురదృష్టవశాత్తూ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని తెలిపాడు. వరుణ్ పిక్కల్లో నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపాడు. ఇక ఈ ముగ్గురి స్థానంలో వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సూర్యకుమార్ సేన చేతిలో పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో 4-1తో ఓడిపోయిన బట్లర్ బృందం.. వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. నాగ్‌పూర్, కటక్ వేదికలుగా జరిగిన తొలి రెండు వన్డేల్లో రోహిత్ సేన జయభేరి మోగించగా.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 2-0తో ఓటమిపాలైంది.తాజాగా అహ్మదాబాద్ వేదికగా నామమాత్రపు మూడో వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు ఒక్క వన్డేలో అయినా గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకునే పనిలో ఉంది. మరోవైపు.. క్లీన్‌స్వీప్ విజయంతో ఐసీసీ టోర్నీలో అడుగుపెట్టాలని టీమిండియా పట్టుదలగా ఉంది. తుదిజట్లుటీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.ఇంగ్లండ్ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సకీబ్ మహమూద్.చదవండి: 119 ఏళ్ల రికార్డు బద్దలు: ప్రపంచంలోనే తొలి టెస్టు జట్టుగా ఐర్లాండ్ ఘనత -
భారత అత్యుత్తమ తుదిజట్టుకు ఆఖరి కసరత్తు.. వారిద్దరికి ఛాన్స్!
ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి భారత్ తన తుది జట్టును ప్రకటించడానికి సమయం దగ్గర పడుతోంది. జట్టులోని ఆటగాళ్ల ఫామ్ గురించి అంచనా వేయడానికి అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్(India vs England)తో బుధవారం జరిగే మూడో వన్డే మ్యాచ్ టీమిండియాకు చివరి అవకాశం. భారత్ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నందున.. ఈ మూడో వన్డేలో కొంతమంది ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ప్రయత్నించేందుకు వెసులుబాటు దొరుకుతుంది. ఫిబ్రవరి 19న పాకిస్తాన్(Pakistan)- దుబాయ్ వేదికగా ప్రారంభమయ్యే -2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను నిర్ణయించడానికి భారత్ కి ఇదే చివరి అవకాశం.పంత్‌కు అవకాశంకర్ణాటక వికెట్ కీపర్-బ్యాటర్ కెఎల్ రాహుల్ ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ వికెట్ కీపర్‌గా రాణించాడు. కానీ ఈ మూడో వన్డే లో రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ కు అవకాశం కల్పించడం తప్పనిసరి గా కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ భారత జట్టులో ప్రధాన వికెట్ కీపర్ అని కెప్టెన్ రోహిత్ శర్మ ఇంతకూ ముందే ప్రకటించినప్పటికీ పంత్ దూకుడుగా ఆడే స్వభావం వల్ల మిడిల్ ఆర్డర్లో అతనికి అవకాశం కల్పించే అవకాశం లేకపోలేదు.పైగా జట్టులో రెండో వికెట్ కీపర్ గా అతని ఎంపిక తప్పనిసరిగా కనిపిస్తోంది. పంత్కి వన్డేల్లో మెరుగైన రికార్డు (27 ఇన్నింగ్స్‌లలో 871 పరుగులు) ఉంది. అంతేగాక తన అసాధారణ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని క్షణాల్లో మార్చగల సత్తా పంత్‌కు ఉంది. మరోవైపు, ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వన్డేల్లో రాహుల్ వికెట్ కీపర్ గా రాణించినా తన బ్యాటింగ్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నాగ్‌పూర్ లో కేవలం రెండు పరుగులు చేయగా కటక్ లో పది పరుగులు చేశాడు. అయితే, ఎడమ చేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఇప్పటికే జట్టులో ఉండటంతో పంత్కి అది ప్రతికూలంగా మారవచ్చు.రాణా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ గురించి ఇంకా స్పష్టత లేక పోవడంతో.. అర్ష్‌దీప్ సింగ్ కి అవకాశం కల్పించే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ ఇంకా తన పూర్తి స్థాయి ఫామ్ కనిపించలేకపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వందేళ్లలో షమీ ప్రదర్శన అతని స్థాయికి తగ్గట్టుగా లేదు.ఫలితంగా తన పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ చేయలేక పోయాడు. ఈ కారణంగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేకు పేస్ బౌలర్ హర్షిత్ రాణా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకోవడం ఖాయం గా కనిపిస్తోంది. హర్షిత్ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు వన్డేల నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఆడే అవకాశం ఉంది.రేసులో వరుణ్ చక్రవర్తి ఇక కుల్దీప్ అవకాశం కల్పించిన ప్రతీ సారి తన వైవిధ్యమైన బౌలింగ్ తో రాణిస్తున్నాడు. ఈ కారణంగా అతనికి ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం తప్పనిసరిగా కనిపిస్తోంది. అయితే కుల్దీప్‌నకు వరుణ్ చక్రవర్తి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్లో వరుణ్ చక్రవర్తి తన అద్భుతమైన ప్రదర్శనతో నిలకడగా రాణిస్తూ భారత్ విజయానికి బాటలు వేస్తున్నాడు. ఈ కారణంగా భారత్ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ఆల్ రౌండర్లయిన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లను కూడా జట్టులో తీసుకోనే అవకాశం ఉంది. చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
హర్షిత్ రాణాపై రోహిత్ శర్మ ఫైర్!.. వీడియో వైరల్
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)పై కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘మెదడు పని చేస్తోందా?.. మనసు ఎక్కడపెట్టి ఆడుతున్నావు?’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.కాగా కటక్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్(India vs England) మధ్య ఆదివారం రెండో వన్డే జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పర్యాటక ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఫిల్ సాల్ట్(26) నిరాశపరిచినా.. బెన్ డకెట్ మాత్రం అర్ధ శతకం(56 బంతుల్లో 65)తో మెరిశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన జో రూట్(72 బంతుల్లో 69) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.ఉచితంగా నాలుగు పరుగులుఇక హ్యారీ బ్రూక్(31) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ జోస్ బట్లర్ పాతుకుపోయే ప్రయత్నం చేశాడు. అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో 32వ ఓవర్‌ను భారత యువ పేస్ బౌలర్ హర్షిత్ రాణా వేశాడు. అప్పుడు క్రీజులో ఉన్న బట్లర్ ఐదో బంతిని డిఫెన్స్ ఆడగా.. బంతిని అందుకున్న రాణా వికెట్ల వైపునకు త్రో చేశాడు.అయితే, అది స్టంప్స్‌ను తాకకపోగా.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ చేతికి కూడా అందకుండా బౌండరీ వైపు దూసుకువెళ్లింది. దీంతో రాణా చేసిన తప్పు వల్ల ఇంగ్లండ్‌కు ఉచితంగా నాలుగు పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రోహిత్ శర్మ.. హర్షిత్ రాణాను చూస్తూ.. ‘మెదడు ఎక్కడ పెట్టుకుని ఆడుతున్నావు?’ అన్నట్లుగా సైగలతో అతడిపై అసహనం వెళ్లగక్కాడు.రోహిత్ విశ్వరూపంఇదిలా ఉంటే.. ఇక బట్లర్ 34 పరుగులు చేసి నిష్క్రమించగా.. లివింగ్‌స్టోన్ 41 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లు విఫలం కాగా 49.5 ఓవర్లలో ఇంగ్లండ్ 304 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు రవీంద్ర జడేజా మూడు, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ పడగొట్టగా.. పేసర్లు హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ శతకం(90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు- 119 రన్స్) చెలరేగగా.. శుబ్‌మన్ గిల్(60), శ్రేయస్ అయ్యర్(47 బంతుల్లో 44), అక్షర్ పటేల్(43 బంతుల్లో 41*) కూడా రాణించారు. ఫలితంగా 44.3 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన టీమిండియా 308 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్‌ను దాటేసి.. Rohit sharma angry on harshit rana on overthrow #LCDLFAllStars #SEVENTEEN #jailstool #DelhiElectionResults #cepostaperte pic.twitter.com/XEUjyQMRdK— kyaa haal hai (@Nittin08572676) February 9, 2025What a way to get to the HUNDRED! 🤩A treat for the fans in Cuttack to witness Captain Rohit Sharma at his best 👌👌Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/oQIlX7fY1T— BCCI (@BCCI) February 9, 2025 -
క్రిస్ గేల్‌ను అధిగమించిన రోహిత్.. ప్రపంచ రికార్డుకు గురి
తాను బ్యాట్ ఝులిపిస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్ల పరిస్థితి ఎలా ఉంటుందో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి నిరూపించాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి.. బౌండరీలు, సిక్స్‌ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రో‘హిట్’.. వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్(Chris Gayle) సిక్సర్ల రికార్డును బద్దలుకొట్టాడు. అంతేకాదు.. అరుదైన ప్రపంచ రికార్డుకు మరింత చేరువయ్యాడు.కాగా గత కొంతకాలంగా బ్యాటింగ్ కష్టాలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ.. కటక్ వన్డేతో ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇంగ్లండ్(India vs England)తో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో డెబ్బై ఆరు బంతుల్లోనే శతకమార్కును అందుకుని.. తన వన్డే కెరీర్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో పన్నెండు ఫోర్లతో పాటు.. ఏడు సిక్స్‌లు ఉన్నాయి.రెండో స్థానానికి ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ రెండోస్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్‌ను అధిగమించి షాహిన్ ఆఫ్రిది తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 267 వన్డేలు పూర్తి చేసుకున్న రోహిత్ 338 సిక్స్‌లు బాదాడు.మరోవైపు.. వెస్టిండీస్ తరఫున 301 వన్డేల్లో గేల్ 331 సిక్సర్లు కొట్టాడు. ఇక పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది 351 సిక్స్‌లతో వన్డేల్లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. అతడి ప్రపంచ రికార్డుకు రోహిత్ శర్మ ఇంకా కేవలం పదమూడు సిక్స్‌ల దూరంలో ఉన్నాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్‌గా టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ ఇప్పటికే అత్యధిక సిక్సర్ల వీరుడిగా అవతరించిన విషయం తెలిసిందే. అతడి ఖాతాలో ఏకంగా 631 సిక్స్‌లు ఉన్నాయి. రోహిత్ వన్డేల్లో 338, టీ20లలో 205, టెస్టుల్లో 88 సిక్స్‌లు బాదాడు.సిరీస్ కైవసంకాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతున్న టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలుత సూర్యకుమార్ బృందం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకోగా.. మరో వన్డే మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను రోహిత్ సేన 2-0తో కైవసం చేసుకుంది. కటక్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. బట్లర్ బృందాన్ని 304 పరుగులకు ఆలౌట్ చేసింది.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ... మొత్తంగా తొంభై బంతుల్లో 119 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ మెరుపు అర్ధ శతకం(52 బంతుల్లో 60) రాణించగా.. శ్రేయస్ అయ్యర్(44), అక్షర్ పటేల్(41 నాటౌట్) మరోసారి రాణించారు.ఈ క్రమంలో 44.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. హిట్ షోతో అలరించిన రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య బుధవారం ఆఖరి వన్డే జరుగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్‌ను దాటేసి.. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. తిరుగులేని హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar)ను అధిగమించాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డే(India vs England) సందర్భంగా ఈ ఘనత సాధించాడు. అదే విధంగా.. ఈ మ్యాచ్‌లో శతక్కొట్టడం ద్వారా మరిన్ని రికార్డులను హిట్‌మ్యాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.అద్భుత ఇన్నింగ్స్కాగా రోహిత్ శర్మ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దారుణంగా విఫలమైన అతడు రిటైర్ అయిపోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఇంగ్లండ్‌తో కటక్ వన్డేలో తనదైన శైలిలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి.. విమర్శించినవాళ్లే ప్రశంసించేలా రోహిత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీబరాబతి స్టేడియంలో లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు రోహిత్ శర్మ. ఫ్లడ్‌లైట్ల సమస్య కారణంగా కాసేపు అవాంతరాలు ఎదురైనా.. అతడి ఏకాగ్రత చెదరలేదు. ఒంటిమీదకు బాణాల్లా దూసుకువస్తున్న ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ల బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్న రోహిత్ శర్మ తన వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.డెబ్బై ఆరు బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌లో ఏకంగా పన్నెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అయితే, లియామ్ లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో ఆదిల్ రషీద్‌కు క్యాచ్ ఇవ్వడంతో హిట్‌మ్యాన్ ధనాధన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇక ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా నిలిచాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఇప్పటి వరకు 15404 పరుగులు చేశాడు. తద్వారా సచిన్ టెండుల్కర్‌ను అధిగమించాడు.కాగా ఓపెనర్‌గా సచిన్ టెండుల్కర్ 15335 పరుగులు చేశాడు. మరోవైపు.. ఈ జాబితాలో విధ్వంసకర మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 15758 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలోకి ఇప్పుడు రోహిత్ దూసుకువచ్చాడు. కాగా 2007లో అరంగేట్రం చేసిన రోహిత్.. 2013లో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాడు.ద్రవిడ్‌ను అధిగమించివన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ (267 వన్డేల్లో 10,987 పరుగులు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న రాహుల్ ద్రవిడ్ (344 వన్డేల్లో 10,889 పరుగులు) ఐదో స్థానానికి చేరాడు. టాప్–3లో సచిన్ టెండూల్కర్ (463 వన్డేల్లో 18,246 పరుగులు), విరాట్ కోహ్లి (296 వన్డేల్లో 13,911 పరుగులు), సౌరవ్ గంగూలీ (311 వన్డేల్లో 11,363 పరుగులు) ఉన్నారు.32వ శతకంవన్డేల్లో రోహిత్ శర్మ సెంచరీలు 32. తద్వారా అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు. టాప్–2లో విరాట్ కోహ్లి (50), సచిన్ టెండూల్కర్ (49) ఉన్నారు.ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. కటక్‌లో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు బట్లర్ బృందం ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రోహిత్ సేన 44.3 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన భారత్.. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారత్- ఇంగ్లండ్ మధ్య నామమాత్రపు మూడో వన్డే అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరుగుతుంది.చదవండి: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ -
జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్: రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఫామ్‌లోకి వచ్చేశాడు. ఇంగ్లండ్(India vs England)తో రెండో వన్డేలో విధ్వంసకర బ్యాటింగ్‌తో శతక్కొట్టి తన ఆటను విమర్శిస్తున్న వాళ్లకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. కో..డితే బంతి బౌండరీ దాటడమే అన్నట్లుగా తనదైన శైలిలో హిట్టింగ్ ఆడి.. క్రికెట్ ప్రేమికులకు కనులవిందు చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగి.. జట్టును గెలిపించాడు.నా గేమ్‌ప్లాన్ అదేఈ నేపథ్యంలో విజయానంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... సెంచరీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈరోజు ఆటను పూర్తిగా ఆస్వాదించాను. జట్టు కోసం పరుగులు చేయడం ఎల్లప్పుడూ సంతృప్తిని ఇస్తుంది. ముఖ్యంగా సిరీస్ గెలవాలంటే మాకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.నిజానికి టీ20 ఫార్మాట్ కంటే కాస్త సుదీర్ఘమైన.. టెస్టుల కంటే చిన్నదైన ఫార్మాట్ ఇది. అందుకే పరిస్థితులకు తగ్గట్లుగా ఎప్పుటికప్పుడు ప్రణాళికలు మార్చుకుంటూ వెళ్లాలి. ఈరోజు నా వ్యూహాలను పక్కాగా అమలు చేయగలిగాను.నల్లరేగడి మట్టి పిచ్ ఇది. జారుతూ ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వికెట్ మీదకు కాకుండా.. శరీరం మీదకు బంతులు సంధిస్తున్న ఇంగ్లండ్ బౌలర్ల వ్యూహాన్ని పసిగట్టి నేను పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాను.గిల్ క్లాసీ ప్లేయర్గ్యాప్ దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాను’’ అని రోహిత్ శర్మ తన ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. శుబ్‌మన్ గిల్(Shubman Gill), శ్రేయస్ అయ్యర్ నుంచి తనకు మద్దతు లభించించదన్న హిట్‌మ్యాన్.. ‘‘ఇద్దరూ చక్కగా సహకరించారు. వాళ్లతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదించాను. గిల్ చాలా చాలా క్లాసీ ప్లేయర్. అతడి ఆటను నేను దగ్గరగా గమనించాను. పరిస్థితి ఎలా ఉన్న తలవంచని స్వభావం. అతడి బ్యాటింగ్ గణాంకాలే ఇందుకు నిదర్శనం’’ అని రోహిత్ శర్మ గిల్‌పై ప్రశంసలు కురిపించాడు.మిడిల్ ఓవర్లే ముఖ్యంఇక టీమిండియా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఏదేమైనా మిడిల్ ఓవర్లలో వికెట్లు కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. మధ్య ఓవర్లలో ఆట తీరును బట్టే ఫలితం నిర్ణయించబడుతుంది. ఒకవేళ అప్పుడే మనం జాగ్రత్తపడితే డెత్ ఓవర్లలో పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు.నాగ్‌పూర్‌లో కూడా మేము ఇదే విధంగా మిడిల్ ఓవర్లలో చక్కగా రాణించాం. తద్వారా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి అనుకున్న ఫలితాన్ని రాబట్టగలిగాం. రోజురోజుకూ మరింత గొప్పగా మారేలా మా జట్టు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోంది. జట్టులోని ప్రతి సభ్యుడికి తన పాత్ర ఏమిటో తెలుసు. కెప్టెన్, కోచ్ వాళ్ల నుంచి ఎలాంటి ఆట తీరును ఆశిస్తున్నారో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. కాబట్టి ముందుకు అనుకున్న వ్యూహాలను పక్కాగా అమలు చేస్తే దేని గురించి ఆందోళన చెందాల్సిన పని ఉండదు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.సిరీస్ కైవసంకాగా ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒడిశాలోని కటక్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 49.5 ఓవర్లలో 204 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ బెన్ డకెట్(65), జో రూట్(69) అర్ధ శతకాలతో రాణించారు.భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు- 119) సెంచరీతో చెలరేగి జట్టు విజయానికి బాటలు చేశాడు.మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(60) అర్ధ శతకంతో రాణించగా.. శ్రేయస్ అయ్యర్(44), అక్షర్ పటేల్(41 నాటౌట్) లక్ష్యాన్ని పూర్తి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. రో‘హిట్’ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక ఈ విజయంతో టీమిండియా ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం నామమాత్రపు మూడో వన్డే జరుగుతుంది.చదవండి: SA T20: ఫైనల్లో సన్‌రైజర్స్ చిత్తు.. ఛాంపియన్స్‌గా ముంబై టీమ్What a way to get to the HUNDRED! 🤩A treat for the fans in Cuttack to witness Captain Rohit Sharma at his best 👌👌Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/oQIlX7fY1T— BCCI (@BCCI) February 9, 2025𝗔 𝘀𝘂𝗽𝗲𝗿 𝘀𝗵𝗼𝘄 𝘁𝗼 𝘀𝗲𝗮𝗹 𝗮 𝘄𝗶𝗻 𝗶𝗻 𝗖𝘂𝘁𝘁𝗮𝗰𝗸! ✅The Rohit Sharma-led #TeamIndia beat England by 4⃣ wickets in the 2nd ODI & take an unassailable lead in the ODI series! 👏 👏Scorecard ▶️ https://t.co/NReW1eEQtF#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/G63vdfozd5— BCCI (@BCCI) February 9, 2025 -
రెండో వన్డే: టీమిండియా టార్గెట్ 305
కటక్: బారాబతి స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(26), బెన్ డకెట్(65)లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి 81 పరుగులు జత చేసిన తర్వాత సాల్ట్ తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సాల్ట్ ఔటయ్యాడు. అనంతరం జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు డకెట్. అయితే వీరి భాగస్వామ్యం ఎంతో సేపు నిలవలేదు. డకెట్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్ కు పంపాడు.ఆపై బ్రూక్(31), జాస్ బట్లర్(34)లు కాస్త ఫర్వాలేదనిపించారు. జో రూట్ 72 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 69 పరుగులు చేసి ఇన్నింగ్స్,ను చక్కదిద్దాడు. ఆపై ఆఖరి ఓవర్ వరకూ లివింగ్‌స్టోన్(41) ఉండటంతో ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగుల గౌరవప్రదమైన స్కోరును బోర్డుపై ఉంచింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు సాధించగా, షమీ, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలకు తలో వికెట్ దక్కింది.కాగా,తొలి వన్డేకు గాయం కారణంగా దూరమైన కోహ్లి.. పూర్తి ఫిట్నెస్ సాధించడంతో తిరిగి జట్టులోకి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌తో వరుణ్ చక్రవర్తి భారత తరపున వన్డే అరంగేట్రం చేశాడు. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో వరుణ్‌కు వన్డేల్లో కూడా అవకాశం దక్కింది. కోహ్లి, వరుణ్ రాకతో జైశ్వాల్,కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు ఇంగ్లండ్ తమ జట్టులో మూడు మార్పులు చేసింది. గుస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు. దీంతో జాకబ్ బెతల్, కార్స్, అర్చర్లకు ఇంగ్లండ్ మేనేెజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. -
నాయకుడే ఇలా ఉంటే ఎలా?: రోహిత్‌పై కపిల్ దేవ్ వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(Kapil Dev) కీలక వ్యాఖ్యలు చేశాడు. సారథి విఫలం కావడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నాడు. అదే విధంగా.. గెలిచినపుడు బ్రహ్మరథం పట్టినవాళ్లు ఓడినపుడు అదే స్థాయిలో విమర్శిస్తారని ఆటగాళ్లకు గుర్తు చేశాడు. విజయగర్వం తలకెక్కితే అడుగులు తడబడతాయని.. అందుకే ఆటగాళ్లను ఎవరూ అతిగా ప్రశంసించవద్దని సూచించాడు.దారుణ వైఫల్యాలుఅంతర్జాతీయ క్రికెట్లో ఫార్మాట్లకు అతీతంగా గత పది ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ సాధించిన స్కోర్లు వరుసగా... 2, 3, 9, 10, 3, 6, 18, 11, 0, 8. ఇటీవల ఇంగ్లండ్(India vs England)తో తొలి వన్డేలోనూ ‘హిట్‌మ్యాన్’ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఏడు బంతులు ఎదుర్కొన్న రోహిత్.. రెండు పరుగులే చేసి అవుటయ్యాడు. పేసర్ సకీబ్ మహమూద్ బౌలింగ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, నాగ్‌పూర్ వేదికగా గురువారం జరిగిన ఈ వన్డేలో వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(96 బంతుల్లో 87), శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 52), అక్షర్ పటేల్(47 బంతుల్లో 52) అద్భుత అర్ధ శతకాలతో రాణించారు. తద్వారా ఇంగ్లండ్‌పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఒకవేళ ఫలితం వేరుగా ఉంటే.. రోహిత్ శర్మపై విమర్శలు మరింత పదునెక్కేవి.నేరుగా చాంపియన్స్ ట్రోఫీ-2025లోఇక ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ తర్వాత టీమిండియా నేరుగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో అడుగుపెడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. క్రికెట్ అడ్డా యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ బిగ్ ప్లేయర్. అతడు త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని ఆశిస్తున్నా.అదే విధంగా కోచ్ గౌతం గంభీర్‌కు కూడా గుడ్‌లక్ చెబుతున్నా. ఎవరికైనా ఒక పనిలో కుదురుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఇక ఇప్పుడు దేశం మొత్తం భారత క్రికెట్ జట్టు ప్రదర్శనలపై మరింత దృష్టి సారించింది. ఇటీవలి కాలంలో టీమిండియా ఒడిదొడుకులు ఎదుర్కొంది.సారథి ఇలా ఉంటే.. సమస్యలు తప్పవుఅయితే, సొంతగడ్డపై మెరుగ్గానే రాణించింది. అయినప్పటికీ స్థూలంగా ఇటీవల వైఫల్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ ఫామ్‌లేమి ఆందోళనకు గురిచేస్తోంది. సారథి ఇలా ఉంటే.. జట్టుపై ప్రభావం పడుతుంది. సమస్యలు తప్పవు’’ అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.ఇక టీమిండియాపై అభిమానుల ఆగ్రహం గురించి ప్రస్తావన రాగా.. ‘‘జట్టు గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన(టెస్టుల్లో) కనబరిచింది. అభిమానులకు కోపం రావడంలో తప్పులేదు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత మన ఆటగాళ్లకు ఎంతటి ఘన స్వాగతం లభించిందో గుర్తుంది కదా!పొగిడినవాళ్లు.. తిడతారు కూడానేనైతే నా జీవితంలో మునుపెన్నడూ అలాంటి దృశ్యాలు చూడలేదు. కాబట్టి మనవాళ్ల ప్రదర్శన బాగా లేనప్పుడు కచ్చితంగా విమర్శలు వస్తాయి. అందుకే ఆటగాళ్లకు అతిగా పొగడవద్దని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా. దాని ద్వారా వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం అంత సులువేమీ కాదు. ఒకవేళ జట్టు, ఆటగాళ్ల ప్రదర్శనను విశ్లేషించాలన్న సద్విమర్శలు మాత్రమే చేయాలనేది నా అభిప్రాయం’’ అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.చదవండి: Indv vs Eng: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?: ఆసీస్ దిగ్గజం
టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)పై ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ప్రశంసలు కురిపించాడు. మిడిలార్డర్లో చక్కగా రాణించగల నైపుణ్యాలు అతడి సొంతమని కొనియాడాడు. అయితే, గత రెండేళ్లుగా టీమిండియా యాజమాన్యం అయ్యర్‌కు అడపాదడపా మాత్రమే అవకాశాలు ఇవ్వడం తనకు విస్మయం కలిగిస్తోందని పేర్కొన్నాడు.కాగా స్వదేశంలో గతేడాది ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా వెన్నునొప్పితో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఆ తర్వాత కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. రంజీల్లో ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఆదేశాలను తొలుత బేఖాతరు చేసిన ఈ ముంబైకర్.. తర్వాత గాయాన్ని సాకుగా చూపి తప్పించుకున్నాడు.ఈ క్రమంలో బీసీసీఐ అయ్యర్‌పై కఠిన చర్యలు తీసుకుంది. అతడి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేస్తూ వేటు వేసింది. ఈ తర్వాత అతడు దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి తనను తాను నిరూపించుకున్నాడు. అంతేకాదు.. ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా టైటిల్ గెలిచాడు.టీ20 జట్టులో మాత్రం చోటు కరువుఈ నేపథ్యంలో గతేడాది శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్.. టీ20 జట్టులో మాత్రం చోటు సంపాదించలేకపోయాడు. యాజమాన్యం అతడిని ఎప్పటికప్పుడు పక్కనపెట్టి.. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చింది. టీ20 ప్రపంచకప్-2024 జట్టులోనూ అతడికి చాన్స్ ఇవ్వలేదు.ఇక తాజాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్ సందర్భంగా పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్.. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డేలో అదరగొట్టాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లతో పాటు రెండు సిక్సర్లు ఉండటం విశేషం.అయితే, ఈ మ్యాచ్‌లో తనకు తొలుత తుదిజట్టులో స్థానం లేదని.. విరాట్ కోహ్లి గాయపడ్డ కారణంగానే తనను పిలిపించారని శ్రేయస్ అయ్యర్ స్వయంగా వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫామ్‌లో ఉన్న ఆటగాడిని బెంచ్‌కే పరిమితం చేయాలని చూడటం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అద్భుతమైన ఆటగాడు.. అతడినే పక్కనపెడతారా?ఈ నేపథ్యంలో లెజెండరీ బ్యాటర్ రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లుగా అతడి సేవలను ఎందుకు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదో అర్థం కావడం లేదు. వన్డే ప్రపంచకప్-2023లోనూ శతకాలతో చెలరేగి భీకరమైన ఫామ్ కనబరిచాడు.మిడిలార్డర్లో సొగసైన బ్యాటింగ్‌తో అలరించాడు. దీంతో జట్టులో అతడి స్థానం సుస్థిరమైందని నేను అనుకున్నా. కానీ అలా జరుగలేదు. వెన్నునొప్పి కారణంగా అతడు జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.అయినా.. అతడిని పక్కనపెట్టాలని చూడటం సరికాదు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్‌గా పాంటింగ్ నియమితుడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేలంలో భాగంగా శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేయడంలో పాంటింగ్ కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరు కలిసి గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున పనిచేశారు కూడా!ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో గురువారం నాటి తొలి వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఇరుజట్ల మధ్య ఆదివారం కటక్‌లో రెండో వన్డే జరుగుతుంది.చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
టీమిండియాకు భరోసానిచ్చిన బౌలర్లు.. అతడికీ త్వరలోనే అవకాశం!
ఇంగ్లండ్‌తో నాగపూర్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ తరుఫున మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)ని రంగంలోకి దించుతారని అందరూ భావించారు. అయితే, గురువారం నాటి ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడినప్పటికీ వరుణ్‌కు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇందుకు బదులుగా ఆల్‌రౌండర్లైన రవీంద్ర జడేజా(Ravindra Jadeja), మరో ఎడం చేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)లతో భారత్ బరిలోకి దిగింది. ఈ ఫార్ములా టీమిండియాకు బాగానే పనిచేసింది.తడబడినా రాణించిన రానాఇక పేస్ బౌలర్లలో గాయం నుంచి కోలుకున్న మహమ్మద్ షమీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలతో పాటు 23 ఏళ్ళ హర్షిత్ రాణాకి స్థానం ఇచ్చారు. అతడికి ఇదే తొలి వన్డే. ఢిల్లీకి చెందిన హర్షిత్ రాణా గత సీజన్ లో ఐపీఎల్ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరుఫున ఆడిన రానా 13 మ్యాచ్ లలో 20.15 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా లో నాలుగో బౌలర్ గా నిలిచాడు.ఇక డెత్ ఓవర్లలో 9.85 పరుగుల సగటు తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన రాణా.. అరంగేట్రంలోనే మూడు వికెట్లు పడగొట్టి వన్డే జట్టులోనూ స్థానం సంపాదించాడు. అయితే నాగపూర్ లో తన తొలి స్పెల్ లోని మూడో ఓవర్లో రాణా ఏకంగా 26 పరుగులు ఇచ్చి ఓ చెత్త రికార్డుని తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మూడు సిక్సలు, రెండు బౌండరీలతో ఏకంగా 26 పరుగులు సాధించాడు.అయితే అతడి స్థానంలో తర్వాత బౌలింగ్ కి వచ్చిన హార్దిక్ పాండ్యా నిలకడగా బౌలింగ్ చేయడమే కాక , అదే ఓవర్లో సాల్ట్ రనౌట్ అవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కి బ్రేకులు పడ్డాయి. మళ్ళీ రెండో స్పెల్ కి వచ్చిన రాణా ఎంతో మెరుగ్గా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ మరో ఓపెనర్ బెన్ డకేట్ వికెట్ తీయడమే కాక మొత్తం మీద ఏడు ఓవర్లలో 53 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.షమీ రాకతో కొంత ఊరట ఇక గాయం నుంచి కొలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చిన ౩౩ ఏళ్ళ షమీ పొదుపుగా బౌలింగ్ చేసి 38 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి నుంచి కోలుకోవడం పై స్పష్టమైన సమాచారం లేక పోవడం తో షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యల బౌలింగ్ భారత్ జట్టు మేనేజిమెంట్ కి కొద్దిగా ఊరట కలిగించవచ్చు. అయితే బుమ్రా లేని లోటు పూరించడం కష్టమే అయినా ఈ ముగ్గురు రాణించడం పేస్ బౌలింగ్ భారం కొద్దిగా తగ్గినట్టు భావించవచ్చు.వరుణ్‌కు త్వరలో అవకాశం అయితే ఈ మ్యాచ్ కి ముందు అందరూ ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తప్పక ఆడతాడని భావించారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్ లో వరుణ్ రాణించడమే ఇందుకు కారణం. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ జట్టులో వరుణ్ కి స్థానం కల్పించడానికి ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ లో ఆడించడం చాల ముఖ్యం. ఈ నేపథ్యంలో నాగపూర్ లో 33 ఏళ్ల వరుణ్ ఆడటం ఖాయమని భావించారు. అయితే మ్యాచ్ కి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ అయితే ఈ టోర్నమెంట్ లో ఏదో ఒక దశ లో వరుణ్ ఆడే అవకాశం ఉందని వివరించాడు.అయితే అతడు ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడడం పై ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనని ఈ టోర్నమెంట్ లో అతని ప్రదర్శన పై అది ఆధారపడి ఉంటుందని రోహిత్ వివరించాడు. "వరుణ్ బౌలింగ్ లో వైవిధ్యం ఉంది. ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఇది రుజువైంది. అయితే అతని ఆడింది టి20 ఫార్మాట్ అయినందున వన్డేల్లో అతని ప్రదర్శనపై ఇంకా అంచనా వేయాల్సి ఉందని రోహిత్ వ్యాఖ్యానించాడు."ఈ సిరీస్‌లో వరుణ్ తో ఏదో ఒక దశలో ఆడించడానికి ప్రయత్నిస్తాం. అతని సామర్థ్యం ఏమిటో చూడటానికి ఇది మాకు అవకాశాన్ని కలిపిస్తుంది. ప్రస్తుతం మేము అతన్ని తీసుకోవాలా వద్దా అనే దాని గురించి ఆలోచించడం లేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపికలో వరుణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే, అతని ప్రదర్శన కూడా మేము ఆశించిన స్థాయిలో ఉంటే వరుణ్ కి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో అవకాశం కల్పించే అవకాశం పై తప్పక పరిశీలిస్తాం’’ అని రోహిత్ వివరించాడు. -
సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్(KL Rahul) తీరుపై భారత దిగ్గజం సునిల్ గావస్కర్(Sunil Gavaskar) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏ ఆటగాడైనా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించాలని హితవు పలికాడు. అలా కాకుండా ప్రతి ఒక్కరు స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ చురకలు అంటించాడు.కాగా టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(India vs England ODIs)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇరుజట్ల మధ్య గురువారం నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరిగింది. 248 పరుగులుఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(26 బంతుల్లో 43), బెన్ డకెట్(29 బంతుల్లో 32)లు శుభారంభం అందించగా.. కెప్టెన్ జోస్ బట్లర్(67 బంతుల్లో 52), జాకొబ్ బెతెల్(64 బంతుల్లో 51) అర్ధ శతకాలతో మెరిశారు.అయితే, భారత బౌలర్ల విజృంభణ కారణంగా మరెవరూ రాణించలేకపోయారు. ఫలితంగా 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణాతో పాటు రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు.అయ్యర్ మెరుపు అర్ధ శతకంఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), కెప్టెన్ రోహిత్ శర్మ(2) వికెట్లు కోల్పోగా.. శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ భారత ఇన్నింగ్స్ చక్కదిద్దారు. గిల్ పట్టుదలగా క్రీజులో నిలబడి కాస్త నెమ్మదిగానే ఆడగా.. అయ్యర్ మెరుపు అర్ధ శతకం(36 బంతుల్లో 59), అక్షర్ పటేల్(52) విలువైన హాఫ్ సెంచరీ చేసి నిష్క్రమించారు.ఈ దశలో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శుబ్‌మన్ గిల్‌కు తోడయ్యాడు. అప్పటికి గిల్ సెంచరీకి 19 పరుగులు, టీమిండియా విజయానికి 28 పరుగులు కావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో స్ట్రైక్‌లో ఉన్న రాహుల్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ కేఎల్ రాహుల్ వ్యవహారశైలిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు సహకరించే క్రమంలో రాహుల్ తన ఆటపై శ్రద్ధ పెట్టలేక నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడని మండిపడ్డాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడు తన సహజశైలిలో ఆడాల్సింది.కానీ తన బ్యాటింగ్ పార్ట్నర్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు వీలు కల్పించే క్రమంలో అజాగ్రత్తగా వ్యవహరించాడు. అందుకు ఫలితంగా ఏం జరిగిందో చూడండి. ఇది టీమ్ గేమ్. కాబట్టి ఏ ఆటగాడు కూడా ఇలా చేయకూడదు. స్ట్రైక్ రొటేట్ చేసేందుకు ఏదో కొత్తగా ప్రయత్నించి వికెట్ పారేసుకున్నాడు. ఇది పూర్తిగా అతడు అనాసక్తితో ఆడిన షాట్’’ అని గావస్కర్ కేఎల్ రాహుల్ తీరును విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్‌లో గిల్ 96 బంతుల్లో 87 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.చదవండి: తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్ -
క్రెడిట్ మొత్తం అతడికే.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
భారత్‌లో ఇంగ్లండ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. తొలుత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కోల్పోయిన బట్లర్ బృందం.. వన్డే సిరీస్(India vs England ODIs)నూ ఓటమితోనే ఆరంభించింది. నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) విచారం వ్యక్తం చేశాడు.క్రెడిట్ మొత్తం అతడికేశుభారంభం అందుకున్నా దానిని కొనసాగించలేకపోవడమే తమ పరాజయానికి కారణమని బట్లర్ అన్నాడు. అదే విధంగా.. టీమిండియా విజయంలో క్రెడిట్ మొత్తం శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)కు దక్కుతుందంటూ అతడి బ్యాటింగ్ తీరును ప్రశంసించాడు. కాగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన బట్లర్ తొలుత బ్యాటింగ్ వైపు మొగ్గుచూపాడు.అతడి రనౌట్‌లో అయ్యర్ కీలక పాత్రఈ క్రమంలో టీమిండియా సీనియర్ పేసర్ భారత బౌలింగ్ అటాక్ ఆరంభించి.. తొలి ఓవర్లో పరుగులేమీ ఇవ్వలేదు. అనంతరం వన్డే అరంగేట్ర ఆటగాడు, మరో పేసర్ హర్షిత్ రాణా సైతం మెయిడిన్ వేసి సత్తా చాటాడు. అయితే, ఆ తర్వాత ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో హర్షిత్ రాణాకు చుక్కలు చూపించాడు.ఒకే ఓవర్లో ఏకంగా ఇరవై ఆరు పరుగులు పిండుకుని రాణాను పనిష్ చేశాడు. కానీ మంచి జోరు మీదున్న సమయంలో అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా సాల్ట్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు- 43 రన్స్) వెనుదిరిగాడు.A moment of brilliance on the field by #ShreyasIyer and #PhilSalt is RUNOUT! 🙌🏻Start watching FREE on Disney+ Hotstar ➡️ https://t.co/gzTQA0IDnU#INDvENGOnJioStar 1st ODI 👉 LIVE NOW on Disney+ Hotstar, Star Sports 2, Star Sports 3, Sports 18 1 & Colors Cineplex! pic.twitter.com/n9hvFfJQpE— Star Sports (@StarSportsIndia) February 6, 2025 ఇక మరో ఓపెనర్ బెన్ డకెట్ సైతం 29 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 32 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన రీఎంట్రీ స్టార్ జో రూట్(19) నిరాశపరిచాడు. ఇక హ్యారీ బ్రూక్ హర్షిత్ రాణా దెబ్బకు పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఇలాంటి తరుణంలో బట్లర్, జాకొబ్ బెతెల్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.బట్లర్ 67 బంతుల్లో 52 పరుగులు చేయగా.. బెతెల్ 64 బాల్స్ ఎదుర్కొని 51 రన్స్ సాధించాడు. కానీ మిగతా వాళ్లు మాత్రం చేతులెత్తేశారు. లియామ్ లివింగ్‌స్టోన్(5), బ్రైడన్ కార్సే(10), ఆదిల్ రషీద్(8) త్వరత్వరగా పెవిలియన్ చేరగా.. టెయిలెండర్ జోఫ్రా ఆర్చర్ 18 బంతుల్లో 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. 38.4 ఓవర్లలోనే..ఫలితంగా ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), కెప్టెన్ రోహిత్ శర్మ(2) విఫలమైనా.. శుబ్‌మన్ గిల్ (87) అద్భుత అర్థ శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ టీ20 తరహా మాదిరి 36 బంతుల్లోనే 59 పరుగులతో దుమ్ములేపాడు. ఇక ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(47 బంతుల్లోనే 52) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.మా ఓటమికి కారణం అదేఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. ‘‘గెలవలేకపోయినందుకు బాధగా ఉంది. పవర్ ప్లేలో మేము అద్భుతంగా రాణించాం. కానీ త్వరత్వరగా వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. ఇంకో 40- 50 పరుగులు చేసేందుకు వికెట్ అనుకూలంగానే ఉంది. కానీ మేము ఆఖరిదాకా నిలవలేకపోయాం.ఏదేమైనా మా వాళ్లు శుభారంభం అందించారనేది వాస్తవం. ఆ సమయంలో మ్యాచ్ మాకు అనుకూలంగానే ఉంది. ఇక టీమిండియా విజయంలో శ్రేయస్ అయ్యర్‌కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అతడి అద్భుత ఇన్నింగ్స్ వల్ల భారత్‌కు మెరుగైన భాగస్వామ్యం లభించింది. ఏదేమైనా.. ఇకపై మేము ఇన్నింగ్స్ ఆసాంతం ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సి ఉంది’’ అని పరాజయానికి గల కారణాలను విశ్లేషించాడు. చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు -
తుదిజట్టులో నాకసలు స్థానమే లేదు.. రోహిత్ కాల్ తర్వాత..: శ్రేయస్ అయ్యర్
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) పునరాగమనంలో అదరగొట్టాడు. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన ఈ ముంబైకర్.. ఇంగ్లండ్(India vs England)తో తొలి వన్డేలోనూ అదే ఫామ్‌ను కొనసాగించాడు. జట్టు కష్టాల్లో ఉన్న వేళ మెరుపు అర్ధ శతకంతో రాణించి భారత్ గెలుపొందడంలో తన వంతు పాత్ర పోషించాడు.అయ్యర్ షాకింగ్ కామెంట్స్ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌పై ప్రశంసల వర్షం కురుస్తుండగా.. విజయానంతరం అతడొక షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. నాగ్‌పూర్ వన్డే తుదిజట్టులో తనకు తొలుత అసలు స్థానమే లేదని చెప్పాడు. అయితే, ఆఖరి నిమిషంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నుంచి ఫోన్ కాల్ వచ్చిందని.. అప్పటికప్పుడు మ్యాచ్ కోసం తనను తాను మానసికంగా సన్నద్ధం చేసుకున్నట్లు తెలిపాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇదొక సరదా ఘటన. గత రాత్రి నేను సినిమా చూస్తూ సమయం గడిపేద్దామని అనుకున్న. అయితే, అంతలోనే అకస్మాత్తుగా కెప్టెన్ నుంచి కాల్ వచ్చింది. విరాట్ మోకాలు ఉబ్బిపోయింది కాబట్టి.. నీకు ఆడే అవకాశం రావొచ్చు అని మా కెప్టెన్ చెప్పాడు.తుదిజట్టులో నాకసలు స్థానమే లేదువెంటనే నా గదికి పరిగెత్తుకుని వెళ్లాను. మరో ఆలోచన లేకుండా నిద్రకు ఉపక్రమించాను. ఆ క్షణంలో ఆ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా నాకు తెలియలేదు. నిజానికి తొలి వన్డేలో మొదట నాకు ఆడే అవకాశం రాలేదు.దురదృష్టవశాత్తూ విరాట్ గామపడటం వల్ల నన్ను పిలిచారు. అయితే, ఏదో ఒక సమయంలో కచ్చితంగా నాకు అవకాశం వస్తుందనే ఉద్దేశంతో నన్ను నేను సన్నద్ధం చేసుకుంటూనే ఉన్నాను. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. గతంలో ఓసారి ఆసియా కప్ సమయంలో నేను గాయపడినపుడు నా స్థానంలో వేరొకరు వచ్చి శతకం బాదారు’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.అదే నాకు ఉపయోగపడిందిఇక దేశవాళీ క్రికెట్ ఆడటం వల్ల ప్రయోజనాలను వివరిస్తూ.. ‘‘గతేడాది డొమెస్టిక్ సీజన్‌ను నేను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నా. ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలన్న అంశం గురించి నేను మరిన్ని పాఠాలు నేర్చుకునే వీలు కలిగింది. కాలానుగుణంగా నా ఆటకు మెరుగులు దిద్దుకున్నా. నైపుణ్యాలకు పదును పెట్టుకున్నాను.ప్రతి విషయంలోనూ పరిపూర్ణత సాధించేందుకు కృషి చేశా. ముఖ్యంగా ఫిట్‌నెస్‌పై కూడా మరింత దృష్టి సారించాను. అదే నాకు ఇప్పుడిలా ఉపయోగపడింది’’ అని శ్రేయస్ అయ్యర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ముంబై తరఫున రంజీల్లో తాజా సీజన్లో అయ్యర్ ఓ ద్విశతకం బాదాడు. అంతేకాదు.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్‌గా ముంబైకి టైటిల్ అందించాడు.నాలుగు వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయంఇక భారత్- ఇంగ్లండ్ వన్డే విషయానికొస్తే.. నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బట్లర్ బృందం తొలుత బ్యాటింగ్ చేసింది. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించినా.. భారత బౌలర్ల మెరుగైన ప్రదర్శన కారణంగా 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌట్ అయింది.లక్ష్య ఛేదనలో టీమిండియా పందొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న వేళ వన్‌డౌన్ బ్యాటర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ శుబ్‌మన్ గిల్(96 బంతుల్లో 87), నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 59), ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(47 బంతుల్లో 52) ధనాధన్ దంచికొట్టారు. ఫలితంగా 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి భారత్ టార్గెట్‌ను పూర్తి చేసింది.చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డుSHREYAS on F-IYER! 🔥@ShreyasIyer15 shifts gears by taking on Jofra Archer for back-to-back sixes! 💪Start watching FREE on Disney+ Hotstar#INDvENGOnJioStar 1st ODI 👉 LIVE NOW on Disney+ Hotstar, Star Sports 2, Star Sports 3, Sports 18-1 & Colors Cineplex! pic.twitter.com/HrQ3WLGuPe— Star Sports (@StarSportsIndia) February 6, 2025 -
చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. తొలి భారత ప్లేయర్‌గా
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6 వికెట్లు కోల్పోయి కేవలం 38.4 ఓవర్లలోనే అందుకుంది. భారత బ్యాటర్లలో భ్‌మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్, రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. బెతల్, అర్చర్ చెరో వికెట్‌ను సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది.కెప్టెన్ జోస్ బట్లర్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), జాకబ్ బెతెల్ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా...ఫిల్ సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డకెట్(32) దూకుడగా ఆడారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరితో పాటు షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు.చరిత్ర సృష్టించిన రాణా..ఇక ఈ మ్యాచ్‌తో భారత తరపున వన్డే అరంగేట్రం చేసిన యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana) పర్వాలేదన్పించాడు. అయితే తన మొదటి మూడు ఓవర్లలో మాత్రం రాణా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రాణాను ఇంగ్లీష్ జట్టు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ ఊతికారేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఐదువ ఓవర్ వేసిన రాణా.. ఏకంగా 26 పరుగులు ఇచ్చాడు.కానీ ఆ తర్వాత మాత్రం ఈ కేకేఆర్ స్పీడ్ స్టార్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు బెన్ డకెట్, హ్యారీ బ్రూక్‌లను ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపి తిరిగి భారత్‌ను గేమ్‌లోకి తీసుకొచ్చాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన రాణా.. 53 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో రాణా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో అరంగేట్రంలోనే మూడు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి భారత ప్లేయర్‌గా రాణా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాలేదు. కాగా రాణా తన టీ20 అరంగేట్రం కూడా ఇంగ్లండ్‌పైనే చేశాడు. పుణే వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో రాణా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అంతకుముందు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై తన టెస్టు అరంగేట్రం చేశాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రాణా 48 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రాణా ఓ చెత్త రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే అరంగేట్రంలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి భారత బౌలర్‌గా రాణా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రాణా ఒకే ఓవర్లో ఏకంగా 26 పరుగులిచ్చాడు.చదవండి: శుబ్‌మన్, శ్రేయస్ సత్తా చాటగా... -
Ind vs Eng 1st ODI: కోహ్లి దూరం.. జైస్వాల్‌తో పాటు అతడి అరంగేట్రం
టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్(India vs England) టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య నాగ్‌పూర్‌లో గురువారం మ్యాచ్ మొదలైంది. అయితే, దురదృష్టవశాత్తూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.జైస్వాల్‌తో పాటు అతడి అరంగేట్రంటాస్ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఈ విషయాన్ని వెల్లడించాడు. అదే విధంగా.. ఇంగ్లండ్‌తో తొలి వన్డేతో స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, యువ పేసర్ హర్షిత్ రాణా యాభై ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నట్లు వెల్లడించాడు.‘‘టాస్ ఓడినా మరేం పర్లేదు. మేము తొలుత బౌలింగ్ చేయాలనే భావించాం. బంతితో, బ్యాట్‌తో దూకుడుగానే రాణించాలని కోరుకుంటున్నాం. ఇదొక సరికొత్త ఆరంభం. చాంపియన్స్ ట్రోఫీకి ముందుకు మాకు వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం.జైస్వాల్, హర్షిత్ రాణా వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ మోకాలి సమస్య వల్ల కోహ్లి ఆడలేకపోతున్నాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీమిండియా తరఫున టెస్టుల్లో ఓపెనర్‌గా పాతుకుపోయిన యశస్వి జైస్వాల్.. ఇప్పటికే టీ20లలోనూ అరంగేట్రం చేశాడు. ఈ రెండు ఫార్మాట్లలోనూ తనను తాను నిరూపించుకున్న జైసూ.. తాజాగా వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. మరోవైపు.. హర్షిత్ రాణా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం ఇటీవల ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 సందర్భంగా.. శివం దూబేకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి పొట్టి ఫార్మాట్లో ఎంట్రీ ఇచ్చాడు. జో రూట్‌కు స్వాగతంమరోవైపు.. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సరికొత్త ఉత్సాహంతో వన్డే బరిలో దిగుతున్నామని.. జో రూట్‌కు తిరిగి జట్టులోకి స్వాగతం పలికాడు. ఇక తాము ప్రస్తుతం పటిష్ట జట్టుతో తలపడుతున్నామన్న బట్లర్.. హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ప్రతి విషయంలోనూ తమను జాగ్రత్తగా చూసుకుంటున్నాడని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము ముగ్గురు పేసర్లతో పాటు ఒక అదనపు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను కూడా ఆడిస్తున్నట్లు తెలిపాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడే నిమిత్తం ఇంగ్లండ్ భారత్ పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. సూర్యకుమార్ సేన 4-1తో జయభేరి మోగించింది. అనంతరం గురువారం నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్‌కు తెరలేచింది.భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ.భారత్‌తో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టుబెన్ డకెట్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకొబ్ బెతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్.చదవండి: హార్దిక్ పాండ్యా లేకపోతే ఏంటి?.. అతడు లేకుండానే వరల్డ్‌కప్ ఆడాం: రోహిత్ శర్మ -
హార్దిక్ లేకపోతే ఏంటి?.. అతడు లేకుండానే వరల్డ్‌కప్ ఆడాం: రోహిత్
హార్దిక్ పాండ్యా(Hardik Pandya) జట్టుతో లేకపోయినా తాము గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అన్నాడు. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సేవలు తమకు ముఖ్యమేనని.. అయితే, అతడి గైర్హాజరీలో కూడా తమవైన వ్యూహాలతో ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో వైఫల్యం తర్వాత రోహిత్ శర్మ సొంతగడ్డపై టీమిండియా తరఫున పునరాగమనం చేస్తున్నాడు.ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(India vs England)లో హిట్‌మ్యాన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇరుజట్ల మధ్య నాగ్‌పూర్‌లో గురువారం తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా గురించి ప్రశ్న ఎదురైంది. ఒకవేళ పాండ్యా గాయపడితే అతడికి ప్రత్యామ్నాయ ఆటగాడు ఎవరంటూ విలేకరులు అడిగారు.ప్రతిసారీ నెగటివ్‌గానే ఎందుకు?ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ‘‘ప్రతిసారీ ప్రతికూల అంశాల గురించే మనం ఎందుకు మాట్లాడాలి? ‘అతడు గాయపడతాడు.. ఇతడికి గాయమవుతుంది.. అప్పుడెలా? ఇలా జరిగితే జట్టుకు కష్టమే’.. అనే మాటలు ఎందుకు?సెలక్టర్లు, నాయకత్వ దళంలో ఇందుకు సంబంధించిన ఆలోచనలు ఉంటాయి. కానీ అవన్నీ మీకు చెప్పలేం కదా! కానీ మా వ్యూహాలు మాకుంటాయి. పాండ్యా గాయపడ్డా మేము వరల్డ్‌కప్ సజావుగానే పూర్తిచేశాం.అతడు గాయపడితే ఎలా అన్న ఆలోచన నాకు లేదుటోర్నీ మూడు లేదంటే నాలుగో మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడనుకుంటా. ఆ తర్వాత కూడా మేము టోర్నీ ఆసాంతం మంచి క్రికెట్ ఆడాం. ఫైనల్లో ఓడిపోయినప్పటికీ.. అప్పటి దాకా అజేయంగా నిలిచాం. కాబట్టి ఇప్పుడు అతడు గాయపడితే ఎలా అన్న విషయం గురించి నేను ఆలోచించడం లేదు. ఒకవేళ అతడు గాయపడినా ఏం చేయాలో మాకు తెలుసు. జట్టు మొత్తం సమిష్టిగా రాణిస్తే మాకు ఎలాంటీ సమస్యా ఉండదు’’ అని రోహిత్ శర్మ ఘాటుగా సమాధానమిచ్చాడు. కాగా సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా పాండ్యా గాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటిన పాండ్యాతద్వారా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్.. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.బ్యాట్‌తో, బంతితో రాణించిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వరల్డ్‌కప్-2024లో 144 పరుగులు చేయడంతో పాటు పదకొండు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో 3/20తో రాణించి టీమిండియాకు విజయం అందించాడు. సౌతాఫ్రికా విధ్వంసకర వీరులు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ల వికెట్లు తీసి రోహిత్ సేన చాంపియన్‌గా నిలవడంలో హార్దిక్ పాండ్యా ప్రధాన భూమిక పోషించాడు.ఇక ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లోనూ హార్దిక్ పాండ్యా ఫర్వాలేదనిపించాడు. ముఖ్యంగా నాలుగో టీ20లో మెరుపు అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. 30 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 53 పరుగులు రాబట్టాడు. ప్రస్తుతం అతడు వన్డే సిరీస్‌కు సిద్ధమయ్యాడు. కాగా ఫిబ్రవరి 6(గురువారం), ఫిబ్రవరి 9(ఆదివారం), ఫిబ్రవరి 12(బుధవారం)న భారత్- ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు నాగ్‌పూర్, కటక్, అహ్మదాబాద్. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియారోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా. చదవండి: CT 2025: ‘నాణ్యమైన బౌలర్.. సిరాజ్‌ను ఎలా పక్కనపెట్టారు?’ -
CT 2025: ‘నాణ్యమైన బౌలర్.. సిరాజ్‌ను ఎలా పక్కనపెట్టారు?’
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)కు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ బంగర్(Sanjay Bangar)మద్దతుగా నిలిచాడు. అతడిని ఇంగ్లండ్‌తో వన్డేలకు, చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ హైదరాబాదీ స్టార్ నాణ్యమైన నైపుణ్యాలున్న బౌలర్ అని.. అలాంటి ఆటగాడిని పక్కనపెట్టడం సరికాదని యాజమాన్యానికి హితవు పలికాడు.వన్డేలకు సిద్ధమైన రోహిత్ సేనకాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో టెస్టు సిరీస్ కోల్పోయిన అనంతరం.. టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లతో బిజీ అయింది. ఇప్పటికే సూర్యకుమార్ సేన ఐదు టీ20లలో నాలుగింట గెలిచి బట్లర్ బృందాన్ని చిత్తు చేసి సిరీస్ గెలుచుకోగా.. తాజాగా రోహిత్ సేన వన్డేలకు సిద్ధమైంది.అందుకే చోటివ్వలేదుఅయితే, ఆసీస్ పర్యటన తర్వాత విశ్రాంతి పేరిట సిరాజ్‌ను టీ20 సిరీస్ నుంచి తప్పించిన మేనేజ్మెంట్.. వన్డేల్లోనూ చోటివ్వలేదు. అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపిక సమయంలోనూ అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ.. సిరాజ్‌ను పక్కనపెట్టడానికి గల కారణాన్ని వెల్లడించాడు.ఇన్నింగ్స్ ఆరంభంలో కొత్త బంతితో రాణించగలుగుతున్న సిరాజ్.. డెత్ ఓవర్లలో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడని రోహిత్ పేర్కొన్నాడు. అందుకే మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో చోటిచ్చినట్లు తెలిపాడు.నాణ్యమైన బౌలర్.. అతడిని ఎలా పక్కనపెట్టారుఇక ఇంగ్లండ్‌తో గురువారం నుంచి టీమిండియా వన్డే సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో ఈ విషయాలపై సంజయ్ బంగర్ స్పందించాడు. ‘‘జట్టు విజయాల్లో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించిన సిరాజ్‌ను పక్కనపెట్టడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కొన్ని మ్యాచ్‌లలో అయితే తన అద్భుత ప్రదర్శనతో అతడే జట్టును గెలిపించాడు.ఉదాహరణకు అహ్మదాబాద్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా విజయంలో తన పాత్ర కూడా ఉంది. అయితే, పాత బంతితో రాణింలేకపోతున్నాడన్న కారణం చూపి అతడిని పక్కనపెట్టడం సరికాదు. అతడొక క్వాలిటీ ప్లేయర్. ఏ దశలో బాగా బౌలింగ్ చేస్తాడన్న అంశంతో సంబంధం లేకుండా నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాడికి జట్టులో చోటివ్వాలి’’ అని సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.కాగా ఆసియా వన్డే కప్-2023 ఫైనల్లోనూ సిరాజ్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఏడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 21 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ లంక 50 పరుగులకే కుప్పకూలడంలో కీలక పాత్ర పోషించాడు.తద్వారా టీమిండియా సునాయాస విజయానికి బాటలు వేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ రెండు కీలక వికెట్లు తీసి భారత్ విజయంలో పాలుపంచుకున్నాడు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా గడ్డ మీద మాత్రం సిరాజ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అలా అయితే సిరాజ్‌కు చోటుకానీ టెస్టులు.. వన్డే ఫార్మాట్ వేరు కాబట్టి సిరాజ్‌కు ఇంగ్లండ్‌తో వన్డేల్లోనైనా అవకాశం ఇచ్చి చూడాల్సిందని సంజయ్ బంగర్ పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ నాటికి జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోతే.. సిరాజ్‌కు దుబాయ్ ఫ్లైట్ ఎక్కే అవకాశం ఉందని మరో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరుగుతుంది. అనంతరం ఆదివారం(ఫిబ్రవరి 9) కటక్‌లో రెండో వన్డే.. అదే విధంగా అహ్మదాబాద్‌లో బుధవారం(ఫిబ్రవరి 12) మూడో వన్డే జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ సంయుక్త వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్లో భారత్ తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడుతుంది.చదవండి: ఇదేం పద్ధతి?: రోహిత్ శర్మ ఆగ్రహం -
ఇంగ్లండ్‌తో వన్డేలు: రోహిత్, కోహ్లి ఫామ్‌లోకి వస్తారా?
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్(India vs England)తో గురువారం ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్ సంసిద్ధమవుతోంది. త్వరలో ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్(ICC Champions Trophy) జరగనున్న నేపథ్యంలో ఇరుజట్లకు ఇది కీలకంగా మారింది. అయితే టీమిండియా అభిమానుల దృష్టి మాత్రం సీనియర్ బ్యాటర్లు కెప్టెన్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీల పైనే ఉంది. మామూలుగా అయితే వారిద్దరి ఎంపిక ఎప్పుడూ చర్చనీయాంశం కాదు. కానీ ప్రస్తుతం వారిద్దరూ పేలవమైన ఫామ్ తో వరుసగా విఫలమవుతూదండటంతో అందరి దృష్టి వారిపైనే ఉంది.సీనియారిటీ పరంగా వారిద్దరూ జట్టులో చాల కీలకం కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం. వారిద్దరూ ఆడటం ప్రారంభిస్తే జట్టులో ఉత్తేజం మామూలు స్థాయిలో ఉండదు. ఇక అందరికీ కోహ్లీ సంగతి తెలిసిందే. అతడు ఫీల్డ్ లో మెరుపు తీగలా కలయ తిరుగుతూ జట్టు సభ్యులని ఉత్తేజపరుస్తాడు. రోహిత్ శర్మ జట్టు సారథి. జట్టుని ముందుండి నడిపించాల్సిన ఆటగాడు వరుసగా విఫలమవుతూ ఉంటే అది తప్పనిసరిగా అతని నాయకత్వ తీరు పై ప్రభావం చూపిస్త ఉందనడంలో సందేహం లేదు.పైగా వారిద్దరి వయస్సు కూడా ముప్పై అయిదు సంవత్సరాలు దాటడంతో ఈ ఇద్దరి పై ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం వారిద్దరూ మళ్ళీ ఫామ్ లోకి వస్తే తప్ప విమర్శలకి చెక్ పెట్టడం సాధ్యం కాదు. వరుసగా విఫలమవుతూ ఒత్తిడిలో ఉన్న వారిద్దరూ రిటైర్మెంట్ గురుంచి ఆలోచిస్తున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.కోహ్లిని వెంబడిస్తున్న బలహీనతఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటన లో ఘోరంగా విఫలమైన రోహిత్, కోహ్లీ దేశవాళీ రంజీ ట్రోఫీ లో రాణిస్తారని అందరూ ఆశించారు. కానీ అక్కడ కూడా వారి ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదు. రోహిత్, కోహ్లీ ఆగస్టులో శ్రీలంక పర్యటనలో చివరిసారిగా వన్డే క్రికెట్లో ఆడారు. ఆ సిరీస్‌లో రోహిత్ 141.44 స్ట్రైక్ రేట్‌తో మూడు ఇన్నింగ్స్‌లలో 157 పరుగులు చేశాడు.అయితే కోహ్లీ మాత్రం మూడు మ్యాచ్‌లలో కేవలం 58 పరుగులు మాత్రమే సాధించాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీకి దీర్ఘకాలంగా ఉన్న బలహీనత మళ్లీ బయటపడింది. అతను ఆఫ్-స్టంప్ దిశగా వచ్చే బంతుల్ని ఛేజ్ చేస్తూ ఏకంగా ఎనిమిది సార్లు అవుట్ అయ్యాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ నుంచి వైదొలగడానికి ముందు ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు.బ్యాటింగ్ దిగ్గజాలని గౌరవించండిఇంగ్లాండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్ మాత్రం విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మల కు మద్దతుగా నిలిచాడు. ఇటీవల కాలంలో కోహ్లీ, రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడటం వాస్తవమే అయినా వారిద్దరూ రిటైర్మెంట్ కావాలని కోరడం అన్యాయమని చెప్పాడు. ప్రతి ఆటగాడు తమ కెరీర్లో కఠినమైన దశలను ఎదుర్కొంటాడనీ.. విరాట్, రోహిత్ లు 'రోబోలు కాదని భారత్ అభిమానులు గుర్తించాలని పీటర్సన్ పేర్కొన్నాడు."నా కెరీర్లో కూడా ఇలాంటి సవాళ్ళే ఎదురయ్యాయి. రోహిత్, విరాట్ రోబోలు కాదు. వారు బ్యాటింగ్ చేసిన ప్రతిసారీ సెంచరీ చేయడం సాధ్యం కాదు. ఆస్ట్రేలియా పర్యటనలో వారిద్దరూ విఫలమై ఉండవచ్చు. అంత మాత్రం వారిద్దరూ ఇంక అంతర్జాతీయ క్రికెట్ కి పనికిరారని ముద్ర వేయడం సరికాదు’’ అని పీటర్సన్ అన్నాడు. వారిద్దరి రికార్డులని దృష్టిలో ఉంచుకొని వారి పట్ల సానుభూతి చూపాలని పీటర్సన్ భారత్ అభిమానులకి పిలుపునిచ్చాడు.సచిన్ రికార్డుపై కోహ్లీ కన్నుభారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో సాధించిన రికార్డుకు విరాట్ కోహ్లీ అతి చేరువలో ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయి ని సాధించిన బ్యాటర్‌గా సచిన్ సాధించిన రికార్డ్ కి కోహ్లీ కేవలం 94 పరుగుల దూరంలో ఉన్నాడు. సచిన్ఈ మైలురాయి ని చేరాడనికి 350 ఇన్నింగ్స్ లు తీసుకోగా కోహ్లీ ప్రస్తుతం 283 వన్డే మ్యాచ్ లలో 58.18 సగటుతో 13,906 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ లో కోహ్లీ మరో 94 పరుగులు సాధించి ఈ రికార్డ్ ని అధిగమిస్తాడని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు.చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ -
ఇదేం పద్ధతి?: రోహిత్ శర్మ ఆగ్రహం
భారత టెస్టు, వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు కోపం వచ్చింది. తన ఫామ్ గురించి ప్రశ్నించిన విలేకర్ల తీరుపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి పనికిరాని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారని అతడు అసహనానికి లోనయ్యాడు . అదే విధంగా.. తన రిటైర్మెంట్ గురించి వస్తున్న ఊహాగానాలపై కూడా రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు.టెస్టుల్లో విఫలంగత కొంతకాలంగా టెస్టుల్లో రోహిత్ శర్మ విఫలమవుతున్న విషయం తెలిసిందే. తొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో.. అనంతరం ఆస్ట్రేలియా గడ్డ మీద అతడి వైఫల్యాల పరంపర కొనసాగింది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో ఈ ముంబైకర్ ఐదు ఇన్నింగ్స్ ఆడి కేవలం 31 పరుగులే చేశాడు.ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తగా ఇటీవల ముంబై ఓపెనర్‌గా రంజీ ట్రోఫీ(Ranji Trophy) బరిలో దిగాడు రోహిత్ శర్మ. అయితే, అక్కడా ‘హిట్‌మ్యాన్’కు చేదు అనుభవమే ఎదురైంది. జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులకే అతడు పరిమితమయ్యాడు.అసలు ఇదెలాంటి ప్రశ్న?ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్(India vs England)కు సిద్ధమయ్యాడు. ఇరుజట్ల మధ్య గురువారం నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మకు తన పేలవ ఫామ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘అసలు ఇదెలాంటి ప్రశ్న?.. ఆ ఫార్మాట్(టెస్టు) వేరు.. ఇది వేరు.దానికీ.. దీనికీ పోలిక ఎందుకు తెస్తున్నారు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. ‘‘క్రికెటర్లుగా మా కెరీర్లో ఎత్తుపళ్లాలు సహజం. నా ప్రయాణంలో ఇలాంటివెన్నో చూశాను. నాకు ఇదేమీ కొత్త కాదు. ప్రతిరోజూ సరికొత్తదే. అలాగే ఆటగాడిగా నాకు ప్రతి సిరీస్ ఒక తాజా ఆరంభాన్ని ఇస్తుంది’’ అని రోహిత్ శర్మ సానుకూల దృక్పథంతో మాట్లాడాడు.ఇలాంటి సమయంలో ఇక చాంపియన్స్ ట్రోఫీ తర్వాత తాను రిటైర్ కాబోతున్నట్లు వస్తున్న వార్తలపై కూడా రోహిత్ శర్మ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఇలాంటి సమయంలో నా భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడటం సరైందేనా?నా గురించి ఎన్నో వార్తలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటన్నింటికి సమాధానం ఇచ్చేందుకు నేను ఇక్కడ కూర్చోలేదు. నాకు ప్రస్తుతం ఈ మూడు వన్డేలు.. అనంతరం చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ మాత్రమే ముఖ్యమే.ప్రస్తుతం నా దృష్టి మొత్తం ఈ మ్యాచ్‌ల మీదే ఉంది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’’ అని రోహిత్ శర్మ ఘాటుగా సమాధానమిచ్చాడు. కాగా రోహిత్ చివరగా శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా యాభై ఓవర్ల ఫార్మాట్ బరిలో దిగాడు. గతేడాది లంకతో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడి వరుసగా 58, 64, 35 పరుగులు చేశాడు.చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ📍 NagpurGearing up for the #INDvENG ODI series opener....in Ro-Ko style 😎#TeamIndia | @IDFCFIRSTBank | @ImRo45 | @imVkohli pic.twitter.com/gR2An4tTk0— BCCI (@BCCI) February 5, 2025 -
తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ
టీమిండియాతో తొలి వన్డేకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ తుది జట్టును బుధవారం ప్రకటించింది. జోస్ బట్లర్(Jos Buttler) కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో మాజీ సారథి జో రూట్(Joe Root)కు స్థానం కల్పించింది. దీంతో.. వన్డే ప్రపంచకప్-2023 తర్వాత అతడు తొలిసారిగా వన్డే ఫార్మాట్ బరిలో దిగనున్నాడు.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్(India vs England)లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే టీ20 సిరీస్ ముగియగా.. బట్లర్ బృందం సూర్యకుమార్ సేన చేతిలో 4-1తో చిత్తుగా ఓడి.. సిరీస్‌ను కోల్పోయింది. కేవలం రాజ్‌కోట్ టీ20లో మాత్రమే గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది.ఓపెనర్లుగా వారేఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా గురువారం(ఫిబ్రవరి) వన్డే సిరీస్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తాజాగా తమ తుదిజట్టును వెల్లడించింది. తొలి వన్డేలో ఓపెనర్లుగా బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ తమ స్థానాలను పదిలం చేసుకోగా.. జో రూట్ వన్‌డౌన్‌లో ఆడనున్నాడు. దాదాపు పదిహేను నెలల విరామం తర్వాత రూట్ తిరిగి రాగా.. కెప్టెన్ బట్లర్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో లియామ్ లివింగ్‌స్టోన్- జాకొబ్ బెతెల్ జోడీ కొనసాగనుంది.ముగ్గురు సీమర్లతోమరోవైపు.. తొలి వన్డేలో ఇంగ్లండ్ ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగనుంది. జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్సేలతో పాటు సకీమ్ మహమూద్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమ వెటరన్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను ఆడించనుంది.మ్యాచ్ ఆరంభ సమయం ఇదేఇక భారత్- ఇంగ్లండ్ మధ్య కటక్ వేదికగా రెండో వన్డే ఆదివారం(ఫిబ్రవరి 9) జరుగనుండగా.. అహ్మదాబాద్‌లో ఆఖరి వన్డే(ఫిబ్రవరి 12) నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. భారత కాలమానం ప్రకారం భారత్- ఇంగ్లండ్ మధ్య మధ్యాహ్నం ఒంటిగంట ముప్పై నిమిషాలకు వన్డే మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరుజట్లకు ఈ సిరీస్ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. వరుస చేదు అనుభవాల తర్వాతఇదిలా ఉంటే.. బట్లర్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టు గత రెండు వన్డే సిరీస్‌లను కోల్పోయింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల చేతిలో ఓటమిపాలైంది. ఇక వన్డే వరల్డ్‌కప్-2023లోనూ ఇంగ్లండ్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమై అప్రదిష్టను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్‌లో రోహిత్ సేనకు ఏమేర పోటీ ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఇంగ్లండ్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన బ్రెండన్ మెకల్లమ్‌కు తొలుత టీ20 సిరీస్‌లో చేదు అనుభవం ఎదురైంది. అయినప్పటికీ వన్డే సిరీస్‌లోనూ అదే దూకుడును కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు మేనేజ్మెంట్ చెప్పడం విశేషం. టీమిండియాతో తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టుబెన్ డకెట్, ఫిల్ సాల్ట్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జాకొబ్ బెతెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్. చదవండి: ఐసీసీ టోర్నీ తర్వాత రోహిత్ గుడ్‌బై? కోహ్లికి మాత్రం బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్! -
మా మధ్య అలాంటి పోటీ లేనేలేదు.. రోహిత్ భయ్యా మాత్రం: గిల్
జట్టు విజయానికి కారణమైన ప్రతి ఒక్కరిని తాను అభినందిస్తానని టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) అన్నాడు. తనకు ఎవరిపట్లా ద్వేషభావన లేదని స్పష్టం చేశాడు. దేశం కోసం ఆడేటపుడు ఆటగాళ్లంతా జట్టు ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తారని.. తాను కూడా అంతేనని పేర్కొన్నాడు.కాగా వన్డే, టీ20, టెస్టు.. ఇలా మూడు ఫార్మాట్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా ఒకప్పుడు శుబ్‌మన్ గిల్‌కు ప్రాధాన్యం దక్కిన విషయం తెలిసిందే. అయితే, యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) రాకతో టెస్టుల్లో ఓపెనర్‌గా గిల్ స్థానం గల్లంతైంది. ఇక అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన తర్వాత.. కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కొత్త ఓపెనింగ్ జోడీని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.టీ20లలో కొత్త జోడీకేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌తో పాటు పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ టీ20లలో భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. సౌతాఫ్రికా గడ్డపై రెండు శతకాలతో సంజూ.. ఇంగ్లండ్‌తో స్వదేశంలో తాజా సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అభిషేక్ ఓపెనర్లుగా తమ స్థానాలను పటిష్టం చేసుకున్నారు.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో సంజూ విఫలమైనా అతడికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధంగానే ఉందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. అభిషేక్ ఈ సిరీస్‌లో రికార్డు శతకం(54 బంతుల్లో 135)తో సత్తా చాటి ఓపెనర్‌గా పాతుకుపోయేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు.‘టాక్సిక్’ కాంపిటిషన్?ఈ నేపథ్యంలో ఓపెనింగ్ స్థానం విషయంలో శుబ్‌మన్ గిల్‌కు అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ పోటీగా తయారయ్యారని.. దీంతో అతడు ఇబ్బందులు పడుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం గురించి మంగళవారం మీడియా గిల్‌ను ప్రశ్నించగా.. హుందాగా స్పందించాడు.‘‘అభిషేక్ నాకు చిన్ననాటి నుంచే స్నేహితుడు. అదే విధంగా జైస్వాల్ కూడా నాకు ఫ్రెండే. మా మధ్య అనారోగ్యకరమైన పోటీ ఉందని నేను అనుకోను. దేశం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్క ఆటగాడు తాను గొప్పగా రాణించాలని కోరుకుంటాడు.అతడు బాగా ఆడకూడదనుకోనుప్రతి మ్యాచ్‌లోనూ అద్బుతంగా ఆడాలనే అనుకుంటాడు. అంతేకానీ.. ‘అతడు బాగా ఆడకూడదు. అలాగైతేనే నేను బాగుంటాను’ అనుకునే వాళ్లు ఎవరూ ఉండరు. జట్టు కోసం ఎవరైతే కష్టపడి ఆడి.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటారో వారిని తప్పక అభినందించాలి’’ అని శుబ్‌మన్ గిల్ సమాధానం ఇచ్చాడు.ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫామ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘వన్డేల్లో గత ఏడాదిన్నర కాలంగా రోహిత్ భాయ్ అద్భుతంగా ఆడుతున్నాడు. మాకు అదొక గేమ్ చేంజింగ్ మూమెంట్. ఇక ముందు కూడా అదే జోరును కొనసాగిస్తాడు’’ అని శుబ్‌మన్ గిల్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ.. జట్టు ఫైనల్ చేరడంలో కీలకప్రాత పోషించాడు. అంతేకాదు.. శ్రీలంకతో గతేడాది వన్డే సిరీస్‌లోనూ రెండు అర్ధ శతకాలు బాదాడు. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(ఫిబ్రవరి 6) నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. ఇందులో రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగనున్నారు.చదవండి: ఐసీసీ టోర్నీ తర్వాత రోహిత్ గుడ్‌బై? కోహ్లికి మాత్రం బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్! -
BCCI: రోహిత్ శర్మకు డెడ్‌లైన్?.. కోహ్లికి మాత్రం గ్రీన్‌సిగ్నల్?!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికే సమయం సమీపిస్తోందా?.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో భారత్‌ను చాంపియన్‌గా హిట్‌మ్యాన్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న రోహిత్ శర్మ మునుపటిలా దూకుడు ప్రదర్శించలేకపోతున్నాడు. గతేడాది శ్రీలంకతో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో అతడు చేసిన పరుగులు 58, 64, 35. వైట్‌బాల్ క్రికెట్లో ఈ మేర ఫర్వాలేదనిపించినా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు.కెప్టెన్‌గానూ చెత్త రికార్డుతొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో తేలిపోయిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గానూ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అతడి సారథ్యంలో భారత్ కివీస్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా స్వదేశంలో ప్రత్యర్థి చేతిలో ఇంతటి పరాభవం చవిచూసిన తొలి భారత కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.అనంతరం ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లోనూ రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగింది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరమైన అతడు.. ఫామ్‌లేమి కారణంగా ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి స్వయంగా తప్పుకొన్నాడు. ఇక ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 3-1తో ఓడిపోయింది.రోహిత్ శర్మకు డెడ్లైన్ఈ క్రమంలో 37 ఏళ్ల రోహిత్ శర్మ రిటైర్మెంట్పై పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఇప్పట్లో తాను రిటైర్ కాబోనని ఈ కుడిచేతి వాటం బ్యాటర్ స్పష్టం చేశాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రోహిత్ శర్మకు డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడి అంతర్జాతీయ కెరీర్‌పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించినట్లు సమాచారం.రోహిత్ శర్మ వయసుతో పాటు.. 2027 వన్డే వరల్డ్‌కప్ నాటికి జట్టును సన్నద్ధం చేసే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మేర అతడితో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్‌తో వన్డేలు, చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎంపిక చేసిన సమయంలో సెలక్టర్లు, బోర్డు పెద్దలు రోహిత్ శర్మతో సుదీర్ఘ చర్చలు జరిపారు.చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత భవిష్యత్ గురించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించారు. రానున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ సీజన్‌కు.. అదే విధంగా వన్డే ప్రపంచకప్ టోర్నీకి జట్టును సిద్ధం చేసే విషయంలో యాజమాన్యానికి కొన్ని స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి.కోహ్లికి మాత్రం గ్రీన్‌సిగ్నల్?!కాబట్టి ఇప్పటి నుంచే జట్టు పరివర్తనపై దృష్టి పెట్టింది. అన్నీ సజావుగా సాగేలా జాగ్రత్తలు తీసుకుంటోంది’’ అని పేర్కొన్నాయి. అయితే, మరో దిగ్గజ బ్యాటర్, 36 ఏళ్ల విరాట్ కోహ్లి విషయంలో మాత్రం బీసీసీఐ మరికొన్నాళ్ల పాటు వేచిచూడాలనే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.ఇక రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్‌తో వన్డేతో సిరీస్‌తో బిజీగా ఉన్నారు. ఇరుజట్ల మధ్య నాగ్‌పూర్‌లో గురువారం తొలి వన్డేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ మొదలుకానుంది. అంతకుముందు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు -
టీ20లు సరే.. గంభీర్‌కు అసలు పరీక్ష ఇప్పుడే!
ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన గవాస్కర్-బోర్డర్ సిరీస్ అయిదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా పరాజయం చవిచూసిన భారత్ జట్టు తిరిగి గాడిలో పడటం శుభపరిణామం. ఇంగ్లండ్ వంటి ప్రధాన జట్టు పై 4-1 తేడాతో టీ20 సిరీస్ ను చేజిక్కించుకోవడం సానుకూలాంశం. కొత్త సంవత్సరంలో అదీ ఇంగ్లండ్‌పై పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించడం రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కి ముందు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు.అయితే ఈ సిరీస్‌కు ముందు భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదన్నది వాస్తవం. సొంత గడ్డపై 27 సంవత్సరాల తర్వాత శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను కోల్పోవడం భారత్ క్రికెట్ చరిత్రలో తొలిసారి. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్‌లో భారత్ జట్టు 12 సంవత్సరాల తర్వాత ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన లో జరిగిన గవాస్కర్-బోర్డర్ సిరీస్ అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ భారత్ జట్టు 3-1 తేడాతో ఓటమి పాలయింది. ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల ఘోర వైఫల్యంతో వారిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించనున్నారని, భారత్ జట్టు క్యాంప్ లో విభేదాలు తలెత్తాయని , కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ ఒకే పేజీలో లేరని విమర్శలు కూడా వచ్చాయి.టీ20ల్లో అద్భుతమైన ఫామ్ఇదిలా ఉంటే.. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీ20 ఫార్మాట్ లో భారత్ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తోంది. 2024 ప్రారంభం నుంచి భారత్ జట్టు 29 మ్యాచ్‌లలో కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే ఓటమి చవిచూసింది. ఏదేమైనా.. గంభీర్ తన శైలిని మార్చుకోవడానికి ఇష్టపడడు. ఈ సిరీస్ అనంతరం మాట్లాడుతూ భారత్ జట్టుకి ఓడిపోతామనే భయం లేదు. మేము అధిక-రిస్క్, అధిక-రివార్డ్ క్రికెట్ ఆడతాం. ప్రతీసారి 250 పరుగులు చేయడం సాధ్యం కాదు. కొన్నిసార్లు 130 పరుగులకే ఔట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ దానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని వ్యాఖ్యానించాడు.రోహిత్, కోహ్లీతో అభిప్రాయభేదాలు? అయితే భారత్ టి20 ఫార్మాట్ రికార్డును అటుంచితే , వన్డే , టెస్ట్ ఫార్మాట్లలో భారత్ ప్రదర్శన ఆశించినంత స్థాయిలో లేదు. ఇక గురువారం నుంచి ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. త్వరలో జరుగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ భారత్ కి ఎంతో కీలకం. ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్ళీ జట్టులోకి రానున్నారు.వన్డే క్రికెట్లో వారిద్దరికీ అపారమైన నైపుణ్యం ఉందని, గంభీర్ అన్నాడు. వారిద్దరితో ఆస్ట్రేలియా పర్యటన లో అభిప్రాయభేదాలు తలెత్తయన్న పుకార్లకు చెక్ పెడుతూ, "వారిద్దరు ఎంతో అనుభవం ఉన్నవారు. పరిస్థితులు సరిగా లేనప్పుడు డ్రెస్సింగ్ రూమ్ గురించి చాలా విషయాలు మాట్లాడుకుంటారు. కానీ ఫలితాలు మీకు అనుకూలంగా రావడం ప్రారంభించిన తర్వాత, విషయాలు సరిగ్గా జరగడం ప్రారంభిస్తాయి" అని గంభీర్ ఆ పుకార్లను కొట్టి పారేసాడు.అభిషేక్‌పై ప్రశంసలు కోచ్ గంభీర్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సాధించిన సెంచరీ పై ప్రశంసలు కురిపించాడు."నేను ఇలాంటి టి20 సెంచరీని ఇంతవరకు చూడలేదు. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ వంటి హేమాహేమీలైన బౌలర్లు ఎదుర్కొని అలా అలవోకగా షాట్ లు కొట్టడం సామాన్య విషయం కాదు. ఐపీఎల్ లో మీరు చాలా సెంచరీలు చూసి ఉండవచ్చు. కానీ ఇంగ్లండ్ వంటి జట్టు పై ఆ స్థాయి లో షాట్లు కొట్టి అభిషేక్ సెంచరీ సాధించాడు. అందుకే నేను చూసిన వాటిలో ఇది అత్యుత్తమైన టీ20 సెంచరీగా భావిస్తున్నాను" అని గంభీర్ వ్యాఖ్యానించాడు. -
‘అతడిని మర్చిపోయాం.. ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమే!’
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్(Ishan Kishan)ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడిన అతడిని అందరూ త్వరగానే మర్చిపోయామన్నాడు. ఇప్పట్లో ఇషాన్ టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డాడు.కాగా 2023లో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్.. మేనేజ్మెంట్ ఆగ్రహానికి గురయ్యాడు. తిరిగి జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆదేశాలను పెడచెవిన పెట్టాడు. నాటి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచనలను కూడా లెక్కచేయక మొండిగా వ్యవహరించాడు.సెంట్రల్ కాంట్రాక్టు పాయె!ఈ క్రమంలో బీసీసీఐ ఇషాన్ కిషన్‌పై కఠిన చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అతడిని తప్పించింది. దీంతో దిగొచ్చిన ఇషాన్ తన సొంతజట్టు జార్ఖండ్ తరఫున దేశీ క్రికెట్ బరిలో దిగాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.వికెట్ కీపర్ల కోటాలో టీ20 ఫార్మాట్లో సంజూ శాంసన్(Sanju Samson) ముందుకు దూసుకురాగా.. టెస్టుల్లో రిషభ్ పంత్‌తో కలిసి ధ్రువ్ జురెల్ పాతుకుపోయాడు. ఇక వన్డేల్లో సీనియర్ కేఎల్ రాహుల్ ఉండనే ఉన్నాడు. ఈ క్రమంలో రీఎంట్రీ కోసం ప్రయత్నించిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయి.ప్రపంచకప్‌లో ఆడినా..వన్డే ప్రపంచకప్-2023 జట్టులో కేఎల్ రాహుల్‌తో పాటు ఇషాన్‌ను ఎంపిక చేసినా.. అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 టీమ్‌లో మాత్రం రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు బీసీసీఐ మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సంజూ- జురెల్‌లను ఎంపిక చేసిన బోర్డు.. వన్డేలకు రాహుల్- పంత్‌లను ఎంచుకుంది.అదే విధంగా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులోనూ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్లకే వికెట్ కీపర్ కోటాలో చోటిచ్చింది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్‌కు మద్దతుగా ఉండే కొంతమంది నెటిజన్లు.. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడిని ఎందుకు ఆడించడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ విషయమై ఆకాశ్ చోప్రాను స్పందించాల్సిందిగా కోరారు. డబుల్ సెంచరీ కూడా చేశాడు.. కానీఇందుకు బదులిస్తూ.. ‘‘ఇషాన్ కిషన్.. అతడిని మనం ఇంతత్వరగా మర్చిపోవడం ఆసక్తికరమే!.. మళ్లీ అతడిని గుర్తు కూడా చేసుకోవడం లేదు. అతడు టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్ టోర్నీలు ఆడాడు. దుబాయ్‌లో టీ20 ప్రపంచకప్.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఆడాడు. వన్డేల్లో అతడి పేరిట డబుల్ సెంచరీ కూడా ఉంది.కాకపోతే అతడు చేసిన తప్పు ఇప్పటికీ వెంటాడుతోంది. ఫస్ల్ క్లాస్ క్రికెట్ ఆడటం ఇష్టం లేదనే సందేశం ఇచ్చాడు. అయితే, సెలక్టర్లకు ఇది నచ్చలేదు. అందుకే బీసీసీఐ అతడి ప్రాధాన్యం తగ్గించింది. ఇప్పట్లో సెలక్టర్లు మళ్లీ అతడిని కనికరించకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్లో గనుక సత్తా చాటితే ఏదేమైనా ప్రస్తుతం ధ్రువ్ జురెల్‌తో పోటీలో ఇషాన్ కిషన్ వెనుకబడి పోయాడన్న ఆకాశ్ చోప్రా.. జట్టులో చోటు కోసం మరికొంత కాలం ఓపికగా ఎదురుచూడక తప్పదని పేర్కొన్నాడు. సెలక్టర్లు అతడి గత ప్రదర్శనలు పరిగణనలోకి తీసుకోవడం లేదని.. ఈసారి ఐపీఎల్లో గనుక సత్తా చాటితే పరిస్థితి మారవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ. 11.25 కోట్లకు ఇషాన్ కిషన్‌ను కొనుగోలు చేసింది.చదవండి: CT 2025: బుమ్రా, కోహ్లి కాదు!.. టీమిండియా ‘ఎక్స్’ ఫ్యాక్టర్ అతడే: డివిలియర్స్ -
రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో విఫలమైనా ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డే ఫార్మాట్లో(ODI Format) సత్తా చాటుతారని విశ్వాసం వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వీరిద్దరు మరోసారి పరుగుల వరద పారించడం ఖాయమని పేర్కొన్నాడు.రోహిత్‌తో పోలిస్తే కోహ్లి కాస్త నయంకాగా భారత సారథి రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్లో నిరాశపరుస్తున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఈ ఇద్దరు విఫలమయ్యారు. అయితే, రోహిత్‌తో పోలిస్తే కోహ్లి కాస్త నయం. పెర్త్టెస్టులో కనీసం శతకం బాదాడు.దేశవాళీ క్రికెట్ బాటకానీ ఆ తర్వాత మరోసారి చేతులెత్తేశాడు. అయితే, అన్నింటికంటే కూడా ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లు షాట్ల ఎంపికలో నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ పారేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్- కోహ్లి కచ్చితంగా దేశవాళీ క్రికెట్లో ఆడితేనే పునర్వైభవం పొందే అవకాశం ఉంటుందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.ఈ క్రమంలో రోహిత్ శర్మ ముంబై తరఫున రంజీ ట్రోఫీ రెండో దశ బరిలో దిగగా.. కోహ్లి మాత్రం మెడ నొప్పి కారణంగా ఢిల్లీ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక రోహిత్ రంజీల్లోనూ తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. జమ్ము కశ్మీర్‌తో మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో మూడు పరుగులకే అవుటైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.ఇక ‘విరాహిత్’ ద్వయం తదుపరి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా.. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత వీరు యాభై ఓవర్ల ఫార్మాట్ బరిలో దిగనున్నారు. అనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లో భాగమవుతారు. అయితే, వీరిద్దరి తాజా వరుస వైఫల్యాల నేపథ్యంలో మెగా టోర్నీలో ఏమేరకు రాణిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వైట్‌బాల్ క్రికెట్లో అదరగొడతారుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘త్వరలోనే రోహిత్- కోహ్లి వైట్‌బాల్ క్రికెట్లో పరుగులు తీయడం మొదలుపెడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. టెస్టు క్రికెట్ భిన్నమైంది.అవుట్ ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతులను ఆడాలనే ప్రయత్నంలో విరాట్ సఫలం కాలేకపోయాడు. మరోవైపు.. రోహిత్ కూడా మునుపటి లయను అందుకోలేకపోయాడు. అయితే, వీరిద్దరికి వన్డే ఫార్మాట్ అంటే ఎంతో ఇష్టం. కాబట్టి కచ్చితంగా తిరిగి పుంజుకుంటారు’’ అని పేర్కొన్నాడు.మొక్కుబడిగా వద్దు!ఇక టీమిండియా ప్రధాన ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో ఆడటం గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఏదో షో ఆఫ్ చేయడానికి మాత్రం రెండు మ్యాచ్‌లు ఆడేసి వెళ్లిపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. వీలు దొరికినప్పుడల్లా.. తరచుగా క్రికెట్ ఆడుతూ ఉంటేనే ఫామ్‌లో ఉంటారు.యువ ఆటగాళ్లకు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిలతో పోటీ అంటే మంచి మజా ఉంటుంది. వాళ్లకు బౌలింగ్ చేయాలనే ఉద్దేశంతో మరింత ఎక్కువగా కష్టపడతారు. అంతిమంగా ఇది భారత క్రికెట్ ఉజ్వల భవిష్యత్తుకు దోహదం చేస్తుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.చదవండి: Ind vs Eng: ‘అదృష్టం వల్లే గెలిచారు’... జోఫ్రా ఆర్చర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం -
సిరాజ్‌లో పదును తగ్గిందా!
ముంబై: 2023 నుంచి చూస్తే 28 మ్యాచ్‌లలో 22.7 సగటుతో 47 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ కూడా చాలా మెరుగ్గా (5.41) ఉంది. ఎలా చూసినా ఇది చెప్పుకోదగ్గ ప్రదర్శనే. సిరాజ్ చాలా వరకు నిలకడగా రాణించాడు. అతను మరీ ఘోరంగా విఫలమైన మ్యాచ్‌లు కూడా అరుదు. అయినా సరే...నలుగురు స్పిన్నర్లతో ఆడాలనే టీమిండియా ప్రణాళికల కారణంగా అతనికి చోటు దక్కలేదు.కెప్టెన్ రోహిత్ శర్మ మాటల్లో చెప్పాలంటే ఆరంభ ఓవర్లలో కొత్త బంతితో చెలరేగినంతగా సిరాజ్ చివర్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. బంతి పాతబడిన కొద్దీ అతని ప్రభావం తగ్గుతోంది. ఇప్పటికే టి20ల్లో తనను తాను నిరూపించుకోవడంతో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఆకట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్‌పై సెలక్టర్లు నమ్మకముంచారు. ఎడమచేతి వాటం బౌలర్ కావడం అతనికి మరో అదనపు అర్హతగా మారింది. ‘ఆరంభంలో, చివర్లో కూడా బాగా బౌలింగ్ చేయగలిగే ఆటగాడు మాకు కావాలి. కొత్త బంతితో షమీ ఏం చేయగలడో అందరికీ తెలుసు. చివర్లో ఆ బాధ్యతఅర్ష్దీప్ తీసుకోగలడు. సరిగ్గా ఇక్కడే సిరాజ్ ప్రభావం తగ్గుతూ వస్తోంది. అతను కొత్త బంతితో తప్ప చివర్లో ఆశించిన ప్రదర్శన ఇవ్వడం లేదు. దీనిపై మేం చాలా సుదీర్ఘంగా చర్చించాం. ఆల్‌రౌండర్లు కావాలి కాబట్టి ముగ్గురు పేసర్లనే తీసుకున్నాం. సిరాజ్ లేకపోవడం దురదృష్టకరమే కానీ కొన్ని రకాల బాధ్యతల కోసం కొందరిని తీసుకొని మరికొందరిని పక్కన పెట్టక తప్పదు’ అని రోహిత్ వివరించాడు. -
Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే
ఇంగ్లండ్‌తో స్వదేశంలో మూడు వన్డేల(Ind vs Eng ODI Series)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన వివరాలను శనివారం వెల్లడించింది. ఇదే జట్టు ఒక్క మార్పుతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) బరిలోకి దిగుతుందని వెల్లడించిందిఓపెనర్గా ఎవరు?కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) వైస్ కెప్టెన్‌గా ఎంపికకాగా.. మరో యంగ్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తొలిసారిగా వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఈ ఇద్దరిలో ఎవరు తుదిజట్టులో ఆడతారనేది ఆసక్తికరంగా మారింది.కాగా వెస్టిండీస్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్ అరంగేట్రంలోనే టెస్టుల్లో భారీ శతకం(171)తో దుమ్ములేపాడు. అనంతరం రెండు ద్విశతకాలు కూడా బాది సత్తా చాటాడు. అదే టూర్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలోనూ జైసూ ఎంట్రీ ఇచ్చాడు.బుమ్రా బదులు హర్షిత్ రాణాఇక ఇప్పటి వరకు ఓవరాల్‌గా టీమిండియా తరఫున 19 టెస్టులు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. టెస్టుల్లో 1798, టీ20లలో 723 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. వెన్నునొప్పితో బాధపడుతున్న పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేనట్లు తెలుస్తోంది.అందుకే ఇంగ్లండ్‌తో వన్డేలకు బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు టీమిండియా సెలక్టర్లు. అయితే, ఫిట్నెస్ ఆధారంగా చాంపియన్స్ ట్రోఫీ నాటికి బుమ్రా జట్టుతో చేరనుండగా.. హర్షిత్ పక్కకు తప్పుకొంటాడు.షమీతో పాటు వారు కూడాఇక ఈ జట్టులో వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ స్థానం సంపాదించగా.. స్పిన్ దళంలో కుల్దీప్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఇక పేసర్ల విభాగంలో మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చోటు దక్కించుకున్నారు.కాగా జనవరి 22 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య మొత్తం ఐదు టీ20లు(జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2) జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 6,9, 12 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తమ జట్లను ప్రకటించింది.ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు భారత జట్టురోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.ఇంగ్లండ్‌తో టీ20లకు భారత జట్టుసూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్).భారత్‌తో వన్డేలకు/చాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.భారత్‌తో టీ20లకు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.చదవండి: CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్‌కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్! -
చాంపియన్స్ ట్రోఫీ: భారత జట్టు ప్రకటన తేదీ ఖరారు!
చాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్టును ప్రకటించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్ధమైంది. ఈ ఐసీసీ టోర్నీకి శనివారం టీమిండియాను ప్రకటించనుంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి మీడియా ముఖంగా జట్టు వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.కాగా వన్డే ఫార్మాట్లో నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) చివరగా 2017లో జరిగింది. నాడు ఫైనల్లో టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈసారి ఆతిథ్య హక్కులు దక్కించుకుంది. దుబాయ్లోఇక మెగా ఈవెంట్‌కు వన్డే ప్రపంచకప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై కాగా.. ఆతిథ్య జట్టు హోదాలో పాక్ నేరుగా అర్హత సాధించింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాకిస్తాన్‌కు పంపేందుకు నిరాకరించిన బీసీసీఐ(BCCI).. హైబ్రిడ్ విధానాన్ని ప్రతిపాదించింది. ఇందుకు అంగీకరించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ను కూడా ఒప్పించింది. ఈ క్రమంలో టీమిండియా దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.ఇక ఈ మెగా టోర్నీకి ప్రొవిజనల్ జట్లను ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 13ను డెడ్‌లైన్‌గా విధించగా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ ఇప్పటికే తమ టీమ్‌ల వివరాలు వెల్లడించాయి. అయితే, పాకిస్తాన్, భారత్, ఇంగ్లండ్ మాత్రం గడువు పొడిగించాల్సిందిగా కోరినట్లు సమాచారం.అదే రోజు ఇంగ్లండ్‌తో వన్డేలకు జట్టు ప్రకటనఈ నేపథ్యంలో శనివారం(జనవరి 18)న తమ జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇక అదే రోజు ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు కూడా టీమ్‌ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా ఘోర పరాభవం చవిచూసింది.ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1తో ఓడి దశాబ్ద కాలం తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఇక తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు కాగా.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి.ఇక ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగిసిన తర్వాత టీమిండియా చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుండగా.. దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. క్రికెట్ ప్రపంచానికి ఎంతో ఇష్టమైన దాయాదుల పోరు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరుగనుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025 భారత జట్టు (అంచనా)రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ సాధిస్తే), మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం! ఆమె ఎవరంటే? -
వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్
సైకాలజీ స్టూడెంట్ ఇప్పుడు టీమిండియా తరఫున సత్తా చాటుతోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఆరో ఇన్నింగ్స్‌లోనే ఏకంగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. భారత మహిళా క్రికెట్ జట్టులోకి దూసుకువచ్చిన ఆ యువ కెరటం మరెవరో కాదు.. ప్రతీకా రావల్(Pratika Rawal).యువ ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma) వరుస వైఫల్యాల నేపథ్యంలో సెలక్టర్లు ప్రతీకా రావల్‌కు పిలుపునిచ్చారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న 24 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గతేడాది డిసెంబరులో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసింది. ఈ క్రమంలో ఆడిన తొలి నాలుగు వన్డేల్లోనే రెండు అర్ధ శతకాలతో మెరిసింది.వరల్డ్ రికార్డు బద్దలుతాజాగా ఐర్లాండ్‌తో వన్డే సిరీస్(India Women Vs Ireland Women) జట్టులోనూ చోటు దక్కించుకున్న ప్రతీకా రావల్.. మూడు మ్యాచ్‌లలోనూ అదరగొట్టింది. తొలి వన్డేలో 89, రెండో వన్డేలో 67 పరుగులు సాధించిన ప్రతీకా.. బుధవారం నాటి మూడో వన్డేలో భారీ శతకంతో అదరగొట్టింది. మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 154 పరుగులు సాధించింది.ఈ క్రమంలో ప్రతీకా రావల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల వన్డే క్రికెట్లో తొలి ఆరు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండేది. ఇదిలా ఉంటే.. ప్రతీకా రావల్ భారత్ తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు (154)ను సాధించింది. దీప్తి శర్మ (188), హర్మన్‌ప్రీత్ (171 నాటౌట్) ఆమెకంటే ముందున్నారు. మహిళల వన్డే క్రికెట్లో తొలి ఆరు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు👉ప్రతీకా రావల్(ఇండియా)- 444 పరుగులు👉చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్)- 434 పరుగులు👉నథాకన్ చాంథమ్(థాయ్‌లాండ్)- 322 పరుగులు👉ఎనిడ్ బేక్వెల్(ఇంగ్లండ్)- 316 పరుగులు👉నికోలే బోల్టన్(ఆస్ట్రేలియా)- 307 పరుగులు.అతిపెద్ద వన్డే విజయంరాజ్కోట్ వేదికగా ఐర్లాండ్‌తో మూడో వన్డేలో భారత ఓపెనర్లు ప్రతీక రావల్(154), స్మృతి మంధాన(135) శతకాలతో చెలరేగారు. వీరిద్దరికి తోడు రిచా ఘోష్ హాఫ్ సెంచరీ(59)తో రాణించింది. ఈ క్రమంలో భారత జట్టు 435 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది. పురుషులు, మహిళల వన్డే క్రికెట్లో భారత్‌కు ఇదే అతిపెద్ద స్కోరు. ఓవరాల్‌గా మహిళల వన్డేల్లో ఇది నాలుగో అత్యధిక స్కోరు. టాప్–3 అత్యధిక స్కోర్లు న్యూజిలాండ్ (491/4; 2018లో ఐర్లాండ్‌పై; 455/5; 1997లో పాక్‌పై; 440/3; 2018లో ఐర్లాండ్‌పై) పేరిటే ఉండటం విశేషం.ఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 131 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 304 పరుగులతో ఐర్లాండ్‌పై టీమిండియా జయభేరి మోగించింది. పరుగుల తేడా పరంగా భారత మహిళా జట్టుకిదే అతిపెద్ద విజయం. 2017లో భారత్ 249 పరుగుల తేడాతో ఐర్లాండ్‌నే ఓడించింది. ఇక ఈ గెలుపుతో 3–0తో వన్డే సిరీస్‌ను స్మృతి బృందం క్లీన్‌స్వీప్ చేసింది. అదే విధంగా.. భారత జట్టు ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేయడం ఇది 13వసారి. అత్యధికసార్లు ఈ ఘనత సాధించిన రికార్డు ఆస్ట్రేలియా (33 సార్లు) పేరిట ఉంది. ఇక.. ఐర్లాండ్‌తో ఇప్పటి వరకు ఆడిన 15 వన్డేల్లోనూ భారత జట్టే గెలవడం మరో విశేషం.చదవండి: ముంబై రంజీ జట్టుతో రోహిత్ శర్మ, యశస్వి ప్రాక్టీస్A post-series chat with the record-breaking opening duo! 😎From Maiden ODI century to Fastest ODI Hundred for India in women's cricket 💯Captain Smriti Mandhana and Pratika Rawal 𝙚𝙡𝙖𝙗𝙤𝙧𝙖𝙩𝙚 it all 😃👌 - By @mihirlee_58 #TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/7c0xsYGaIo— BCCI Women (@BCCIWomen) January 16, 2025 -
టీమిండియా సరికొత్త చరిత్ర.. వన్డేల్లో అత్యధిక స్కోరు
ఐర్లాండ్‌తో మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన విధ్వంసానికి తోడు వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కూడా రాణించడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత యాభై ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయిన స్మృతి సేన ఏకంగా 435 పరుగులు సాధించింది. నాటి రికార్డు బ్రేక్తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు(Highest ODI total) సాధించిన భారత జట్టుగా నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు భారత పురుషుల క్రికెట్ జట్టు పేరిట ఉండేది. ఇండోర్ వేదికగా 2011లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 418 పరుగులు సాధించింది. తాజాగా స్మృతి సేన ఆ రికార్డును బద్దలు కొట్టి.. ఈ మేర సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు మరెన్నో రికార్డులు సొంతం చేసుకుంది.ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా సొంతగడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు ఐర్లాండ్(India Women Vs Ireland Women)తో తలపడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గైర్హాజరీ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే.. రాజ్‌కోట్ వేదికగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు గెలిచిన భారత్.. సిరీస్‌ను 2-0తో గెలిచింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం నామమాత్రపు మూడో వన్డేలోనూ స్మృతి సేన ఆధిపత్యం కనబరిచింది. ఓపెనర్ల ధనాధన్ శతకాలుటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి, ప్రతికా రావల్(Pratika Rawal) శతక్కొట్టి అదిరిపోయే ఆరంభం అందించారు. స్మృతి 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 135 పరుగులు సాధించగా.. ప్రతికా భారీ సెంచరీతో దుమ్ములేపింది. మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని ఇరవై ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఏకంగా 154 పరుగులు రాబట్టింది.హాఫ్ సెంచరీతో మెరిసిన రిచాఇక వన్‌డౌన్ బ్యాటర్ రిచా ఘోష్ సైతం అర్ధ శతకంతో చెలరేగింది. 42 బంతులు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులు సాధించింది. మిగతా వాళ్లలో తేజల్ హెసాబ్నిస్(25 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్ 15 రన్స్ చేసింది. జెమీమా రోడ్రిగెస్ 4, దీప్తి శర్మ 11 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా రికార్డు స్థాయిలో 435 పరుగులు స్కోరు చేసింది. ఐరిష్ బౌలర్లలో ఓర్లా ప్రెండెర్గాస్ట్కు రెండు వికెట్లు దక్కగా.. అర్లెనీ కెల్లీ, ఫ్రెయా సార్జెంట్, జార్జియానా డెంప్సీ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఐర్లాండ్‌తో మూడో వన్డే సందర్భంగా స్మృతి సేన సాధించిన రికార్డులువుమెన్స్ వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు బాదిన జట్లలో మూడో స్థానం1. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 712. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 593. ఇండియా వర్సెస్ ఐర్లాండ్- 2025- రాజ్‌కోట్- 57వుమెన్స్ వన్డేల్లో 400కిపైగా స్కోర్లు సాధించిన జట్లలో నాలుగో స్థానం1. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 491/42. న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్- 1997- క్రైస్ట్‌చర్చ్- 455/53. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 440/34. ఇండియా వర్సెస్ ఐర్లాండ్- 2025- రాజ్‌కోట్- 435/5.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. ‘తొలి ప్లేయర్’గా స్మృతి మంధాన చరిత్ర
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో తక్కువ బంతుల్లోనే శతకం బాదిన(Women's ODI Fastest Century) భారత తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సాధించింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా స్మృతి మంధాన ఈ ఘనత సాధించింది. అంతేకాదు.. మహిళల వన్డే క్రికెట్లో పది సెంచరీలు పూర్తి చేసుకుని మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది.కెప్టెన్‌గా, బ్యాటర్‌గా స్మృతి అదుర్స్ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు.. భారత్(India Women Vs Ireland Women)లో పర్యటిస్తోంది. ఈ మూడు వన్డేల సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ దూరం కాగా.. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఈ క్రమంలో కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ స్మృతి అద్బుత ప్రదర్శన కనబరుస్తోంది.రాజ్‌కోట్ వేదికగా సాగుతున్న ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలు గెలిచిన టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లలో స్మృతి వరుసగా 41, 73 పరుగులు సాధించి.. గెలుపులో తన వంతు పాత్ర పోషించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం జరుగుతున్న మూడో వన్డేలోనూ స్మృతి సూపర్ ఫామ్‌ను కొనసాగించింది.వుమెన్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన శతక్కొట్టారు. స్మృతి 70 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. వుమెన్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన తొలి ఇండియన్‌గా నిలిచింది. అంతేకాదు.. వన్డేల్లో పది సెంచరీలు సాధించిన భారత తొలి మహిళా క్రికెటర్‌గా, ఓవరాల్‌గా నాలుగో ప్లేయర్‌గా చరిత్రకెక్కింది.Led from the front and how 👏👏What a knock THAT 🙌Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/4dQVq6JTRm— BCCI Women (@BCCIWomen) January 15, 2025 ఇక స్మృతి మొత్తంగా ఈ మ్యాచ్‌లో 80 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్ ఓర్లా ప్రెండెర్‌గాస్ట్ బౌలింగ్‌లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. అవా కానింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది.వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరుఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌తో మూడో వన్డేలో మరో ఓపెనర్ ప్రతికా రావల్ భారీ శతకంతో మెరిసింది. 129 బంతులు ఎదుర్కొని 154 పరుగులు సాధించింది. ప్రతికా ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం. మిగతా వాళ్లలో రిచా ఘోష్ 59 పరుగులతో రాణించగా.. తేజల్ హెసాబ్నిస్ 28, హర్లీన్ డియోల్ 14 రన్స్ చేశారు. ఇక జెమీమా 4, దీప్తి శర్మ 11 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 435 పరుగులు స్కోరు చేసింది. భారత్ తరఫున మహిళా, పురుష క్రికెట్లో వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.మహిళల వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన భారత ప్లేయర్లు1. స్మృతి మంధాన- ఐర్లాండ్ వుమెన్స్‌పై- రాజ్‌కోట్(2025)లో- 70 బంతుల్లో శతకం2.హర్మన్‌ప్రీత్ కౌర్- సౌతాఫ్రికా వుమెన్స్‌పై- బెంగళూరు(2024)లో- 87 బంతుల్లో శతకం3. హర్మన్‌ప్రీత్ కౌర్- ఆస్ట్రేలియా వుమెన్స్‌పై- డెర్బీ(2017)లో- 90 బంతుల్లో శతకం4. జెమీమా రోడ్రిగ్స్- ఐర్లాండ్ వుమెన్స్‌పై- రాజ్‌కోట్(2025)లో- 90 బంతుల్లో శతకం5. హర్లీన్ డియోల్- వెస్టిండీస్ వుమెన్స్‌పై- వడోదర(2024)లో- 98 బంతుల్లో శతకం.మహిళల వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లుమెగ్ లానింగ్- 15సుజీ బేట్స్- 13టామీ బీమౌంట్- 10స్మృతి మంధాన- 10చమరి ఆటపట్టు- 9చార్లెట్ ఎడ్వర్డ్స్- 9నాట్ సీవర్ బ్రంట్- 9.MAXIMUM x 2⃣Captain Smriti Mandhana's elegance on display here in Rajkot!Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/wMlnuoUWIr— BCCI Women (@BCCIWomen) January 15, 2025 చదవండి: పంత్ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలా: డీడీసీఏ ఆగ్రహం -
వరల్డ్ రికార్డుపై కన్నేసిన షమీ.. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడంటే..
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో గనుక అతడు రాణిస్తే.. మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంటాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023లో షమీ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.కాస్త ఆలస్యంగా ఈ మెగా టోర్నీలో ఎంట్రీ ఇచ్చినా.. వికెట్ల వేటలో మాత్రం దూసుకుపోయాడు షమీ. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో ఏకంగా 24 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే, వరల్డ్‌కప్ మధ్యలోనే చీలమండ నొప్పి వేధించినా లెక్కచేయని షమీ.. టోర్నీ ముగిసిన తర్వాత మాత్రం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు ఏడాది కాలం పట్టింది. అయితే, ఇప్పటి వరకు అతడు టీమిండియాలో పునరాగమనం చేయలేకపోయాడు. తొలుత దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన ఈ పేస్ బౌలర్.. పదకొండు వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో షమీ స్థానం దక్కించుకున్నాడు. సొంతగడ్డపై జరిగే ఈ సిరీస్ సందర్భంగా అతడు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డేల్లోనూ షమీ చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయమైంది.ఈ నేపథ్యంలో షమీని ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అతడు ఐదు వికెట్లు తీస్తే చాలు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరిన మొదటి క్రికెటర్‌గా నిలుస్తాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది.షమీ ఇప్పటికి 100 ఇన్నింగ్స్లోస్టార్క్ 102 ఇన్నింగ్స్‌లో 200 వికెట్ల మార్కును అందుకున్నాడు. అయితే, షమీ ఇప్పటికి 100 ఇన్నింగ్స్‌లో 195 వికెట్లు పడగొట్టాడు. కాబట్టి తదుపరి ఆడబోయే వన్డేలో షమీ ఐదు వికెట్లు తీశాడంటే.. స్టార్క్ వరల్డ్ రికార్డును అతడు బద్దలుకొడతాడు. ఇక భారత్ తరఫున అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్‌గా.. టీమిండియా ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కొనసాగుతున్నాడు. అతడు 133 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ అందుకున్నాడు.కాగా టీమిండియా ఇంగ్లండ్‌తో జనవరి 22- ఫిబ్రవరి 2 వరకు ఐదు టీ20లు ఆడనుంది. అనంతరం.. ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో తొలి వన్డే, ఫిబ్రవరి 9న కటక్‌లో రెండో వన్డే, ఫిబ్రవరి 12న మూడో అహ్మదాబాద్‌లో మూడో వన్డే జరుగనున్నాయి.వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్లు వీరే1. మిచెల్ స్టార్క్- 102 మ్యాచ్‌లలో2. సక్లెయిన్ ముస్తాక్- 104 మ్యాచ్‌లలో3. ట్రెంట్ బౌల్ట్- 107 మ్యాచ్‌లలో4. బ్రెట్ లీ- 112 మ్యాచ్‌లలో5. అలెన్ డొనాల్డ్- 117 మ్యాచ్‌లలో.చదవండి: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు! -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఐర్లాండ్ మహిళా జట్టుతో తొలి వన్డేలోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టింది. కేవలం 29 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 41 పరుగులు సాధించింది.ఈ క్రమంలో స్మతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగుల మార్కు అందుకున్న తొలి మహిళా ప్లేయర్‌గా నిలిచింది. కాగా ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా మూడు వన్డేలు ఆడేందుకు ఐర్లాండ్ భారత్ పర్యటన(India Women vs Ireland Women)కు వచ్చింది.కెప్టెన్‌గా స్మృతిఈ సిరీస్‌కు భారత మహిళా జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దూరం కాగా స్మృతి సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఇక ఇరుజట్ల మధ్య శుక్రవారం రాజ్‌కోట్ వేదికగా వన్డే సిరీస్ ఆరంభమైంది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఓపెనర్ గాబీ లూయిస్ అద్భుత అర్ధ శతకం(92)తో చెలరేగగా.. మిడిలార్డర్లో లీ పాల్(59) కూడా హాఫ్ సెంచరీ సాధించింది. వీరిద్దరికి తోడు లోయర్ ఆర్డర్లో అర్లెనె కెలీ 28 పరుగులతో రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐర్లాండ్ ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. టైటస్ సాధు, దీప్ది శర్మ, సయాలీ సట్ఘరే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నాలుగు వేల పరుగుల పూర్తిఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్(Pratika Rawal) శుభారంభం అందించారు. మంధాన 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫ్రేయా సార్జెంట్ బౌలింగ్‌లో ఓర్లా ప్రెండర్‌గాస్ట్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుటైంది. అయితే, ఈ క్రమంలోనే స్మృతి వన్డేల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అధిగమించింది.ఇంతకు ముందు భారత్ తరఫున మిథాలీ రాజ్ ఈ ఘనత సాధించగా.. స్మృతి తాజాగా ఈ ఫీట్ నమోదు చేసింది. అయితే, మిథాలీ రాజ్ నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకోవడానికి 112 వన్డే ఇన్నింగ్స్ ఆడగా.. స్మృతి కేవలం 95 వన్డే ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించింది. తద్వారా అత్యంత వేగంగా 4 వేల వన్డే పరుగుల క్లబ్లో చేరిన భారత తొలి మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది.వన్డేల్లో వేగంగా నాలుగు వేల పరుగుల మైలురాయికి చేరుకున్న మహిళా క్రికెటర్లు👉బెలిండా క్లార్క్- ఆస్ట్రేలియా- 86 ఇన్నింగ్స్👉మెగ్ లానింగ్- ఆస్ట్రేలియా- 87 ఇన్నింగ్స్👉స్మృతి మంధాన- ఇండియా- 95 ఇన్నింగ్స్👉లారా వొల్వర్ట్- సౌతాఫ్రికా- 96 ఇన్నింగ్స్👉కరేన్ రాల్టన్- ఆస్ట్రేలియా- 103 ఇన్నింగ్స్👉సుజీ బేట్స్- న్యూజిలాండ్- 105 ఇన్నింగ్స్👉స్టెఫానీ టేలర్- వెస్టిండీస్- 107 ఇన్నింగ్స్👉టస్మిన్ బీమౌంట్- ఇంగ్లండ్- 110 ఇన్నింగ్స్👉మిథాలీ రాజ్- ఇండియా- 112 ఇన్నింగ్స్👉డేబీ హాక్లీ- న్యూజిలాండ్- 112 ఇన్నింగ్స్‌ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ప్రతికా రావల్ 89 పరుగులతో చెలరేగగా.. తేజస్ హసాబ్నిస్ 53 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరి అద్బుత ఇన్నింగ్స్ కారణంగా భారత్ తొలి వన్డేలో ఐర్లాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. -
వన్డే సిరీస్ నుంచి రాహుల్‌కు విశ్రాంతి!
న్యూఢిల్లీ: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాల్సిందిగా అతను కోరినట్లు సమాచారం. ‘ఆ్రస్టేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత రాహుల్ విరామం కోరుకుంటున్నాడు. అందుకే ఈ సిరీస్‌కు తన పేరును పరిగణనలోకి తీసుకోవద్దని అతను చెప్పాడు. అయితే చాంపియన్స్ ట్రోఫీ కోసం మాత్రం తాను అందుబాటులో ఉంటానని రాహుల్ స్పష్టం చేశాడు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఆసీస్‌తో ఐదు టెస్టులూ ఆడిన రాహుల్ 10 ఇన్నింగ్స్‌లలో 2 అర్ధసెంచరీలతో 276 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. చాంపియన్స్ ట్రోఫీకి తాను సిద్ధమని చెప్పినా... వన్డే జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం కోసం పంత్, సంజు సామ్సన్ల నుంచి అతను పోటీని ఎదుర్కొంటున్నాడు. మరోవైపు కర్ణాటక జట్టు ఆడే విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కూ తాను అందుబాటులో ఉండనని రాహుల్ ఇప్పటికే సమాచారం అందించాడు. -
స్మృతి సారథ్యంలో...
న్యూఢిల్లీ: ఐర్లాండ్‌తో స్వదేశంలో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ టీమ్‌కు స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన టి20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు స్మృతినే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. విండీస్‌తో వన్డే పోరులో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పేస్ బౌలర్ రేణుకా సింగ్‌కు కూడా విరామం ఇచ్చారు. విండీస్‌తో సిరీస్‌లో అరంగేట్రం చేసిన ప్రతీక, తనూజ తమ స్థానాలను నిలబెట్టుకోగా... రాఘ్వీ బిస్త్‌కు తొలిసారి వన్డే టీమ్ పిలుపు దక్కింది. భారత వన్డే టీమ్‌లోకి ఎంపికైనా మ్యాచ్ ఆడని సయాలీ సత్ఘరేకు మరో అవకాశం దక్కింది. మరోవైపు ఇప్పటికే స్థానం కోల్పోయిన షఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌లపై మాత్రం సెలక్టర్లు ఇంకా విశ్వాసం ఉంచలేదు. రాజ్‌కోట్‌లో ఈ నెల 10, 12, 15 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఇప్పటి వరకు భారత్, ఐర్లాండ్ మధ్య 12 వన్డేలు జరగ్గా...అన్నీ భారత్ గెలిచింది. జట్టు వివరాలు: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్‌కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా ఛెత్రి, రిచా ఘోష్, తేజల్ హసబ్నిస్, రాఘ్వీ బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజ కన్వర్, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, సయాలీ సత్ఘరే. -
విల్ యంగ్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి వన్డేలో శ్రీలంక చిత్తు
స్వదేశంలో శ్రీలంకతో వన్డే సిరీస్‌ను అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో శ్రీలంకను కివీస్ చిత్తు చేసింది. లంకేయులు నిర్దేశించిన 179 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఓ వికెట్ కోల్పోయి కేవలం 26.2 ఓవర్లలోనే ఊదిపడేసింది.కివీస్ ఓపెనర్ విల్ యంగ్(86 బంతుల్లో 90, 12 ఫోర్లు) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు రచిన్ రవీంద్ర(45), మార్క్ చాప్మన్(29 నాటౌట్) రాణించారు. శ్రీలంక బౌలర్లలో విక్రమసింఘే ఒక్కడే ఓ వికెట్ సాధించాడు. మిగితా బౌలర్లంతా తేలిపోయారు. నిప్పులు చెరిగిన హెన్రీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 43.4 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది. కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ 4 వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. అతడితో పాటు జాకబ్ డఫీ, నాథన్ స్మిత్ తలా రెండు వికెట్లు సాధించారు.శ్రీలంక బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో(56) టాప్ స్కోరర్‌గా నిలవగా..లియాంగే(36), హసరంగా(35) పర్వాలేదన్పించారు. ఇక విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే హామిల్టన్ వేదికగా జనవరి 8న జరగనుంది. కాగా ఇప్పటికే లంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో కివీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
45 ఏళ్లలో ఇదే తొలిసారి.. టీమిండియా ఒక్కటీ గెలవలేదు!
గతేడాది టీమిండియాకు మధుర జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాల్నీ మిగిల్చింది. పొట్టి ఫార్మాట్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత జట్టు.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత మరోసారి టీ20 ప్రపంచకప్(T20 World Cup 2024) గెలిచింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007లో తొట్టతొలి పొట్టి కప్ గెలుచుకున్న భారత్.. మళ్లీ 2024లో రోహిత్ కెప్టెన్సీలో ట్రోఫీని ముద్దాడింది.చాంపియన్లుగా వీడ్కోలుఅయితే, ఈ మెగా టోర్నీలో టీమిండియా టైటిల్ విజేతగా నిలిచిన తర్వాత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli)లతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇకపై వీరు కేవలం ఫ్రాంఛైజీ క్రికెట్లో మాత్రమే టీ20 ప్రేమికులను అలరించనున్నారు.ఇక.. ఐసీసీ టోర్నమెంట్ తర్వాత శుబ్‌మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వేను టీ20 సిరీస్‌లో చిత్తు చేసింది టీమిండియా. ఇక భార టీ20 జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిష్క్రమించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అతడి స్థానాన్ని అధికారికంగా భర్తీ చేశాడు. సూర్య సారథ్యంలో తొలిసారి శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు 3-0తో ఆతిథ్య జట్టును క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ దుమ్ములేపింది.సౌతాఫ్రికా గడ్డపై సత్తా చాటిన సూర్య సేనఆ తర్వాత సౌతాఫ్రికా గడ్డపై కూడా సూర్య సేన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. పొట్టి ఫార్మాట్ సంగతి ఇలా ఉంటే.. టెస్టుల్లో ఆరంభంలో అదరగొట్టిన రోహిత్ సేన.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 4-1తో గెలిచిన భారత్.. బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.మర్చిపోలేని వైట్‌వాష్ పరాభవంఅయితే, స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో మాత్రం ఘోర పరాభవం ఎదుర్కొంది. పర్యాటక జట్టు చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురై చరిత్రలోనే తొలిసారిగా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ప్రత్యర్థి చేతిలో క్లీన్‌స్వీప్ అయిన జట్టుగా రోహిత్ సేన చెత్త రికార్డు మూటగట్టుకుంది.ఆసీస్‌తో సిరీస్లోనూఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఈ వైఫల్యాలను కొనసాగిస్తోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లిన భారత్.. తొలి టెస్టులో గెలుపొందినా.. ఆ తర్వాత అదే ఫలితాన్ని పునావృతం చేయలేకపోయింది.అడిలైడ్‌లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. అలా చేదు అనుభవంతో గతేడాదిని ముగించింది.ఒక్క వన్డే కూడా గెలవలేదుఇదిలా ఉంటే.. 2024లో భారత జట్టుకు ఎదురైన మరో ఘోర అవమానం ఏమిటంటే.. గతేడాది టీమిండియా ఒక్కటంటే ఒక్క వన్డే కూడా గెలవలేదు.శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో ఓ మ్యాచ్‌ను టై చేసుకున్న రోహిత్ సేన.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. తద్వారా దాదాపు రెండు దశాబ్దాల అనంతరం లంకతో వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లో ఓటమిని చవిచూసింది. ఇలా ఓ ఏడాదిలో వన్డేల్లో భారత్ ఒక్కటి కూడా గెలవకపోవడం 45 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1979లోనే టీమిండియా ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది. అదీ విషయం!! వచ్చే ఏడాది మరింత బిజీఇక ఆసీస్‌తో సిడ్నీ టెస్టుతో 2025ను మొదలుపెట్టనున్న టీమిండియా.. తదుపరి స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇందులో ఐదు టీ20లతో పాటు మూడే వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ నాలుగు టెస్టులు ఆడుతుంది. తదుపరి బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లతోనూ సిరీస్‌లు ఆడాల్సి ఉంది.చదవండి: సిగ్గుపడాలి!.. టీమిండియాకు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్ -
పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత
సౌతాఫ్రికా గడ్డపై పాకిస్తాన్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. వన్డే సిరీస్‌లో ఆతిథ్య ప్రొటిస్ జట్టును 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగగా.. సౌతాఫ్రికా 2-0తో నెగ్గింది. అనంతరం జరిగిన వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో జయభేరి మోగించిన పాకిస్తాన్.. తాజాగా మూడో వన్డేలోనూ విజయం సాధించింది. జొహన్నస్‌బర్గ్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది.సయీమ్ అయూబ్ శతకంఇక వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ బృందం తొమ్మిది వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఓపెనర్ సయీమ్ అయూబ్(94 బంతుల్లో 101) శతకంతో చెలరేగగా.. బాబర్ ఆజం(52), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(53) హాఫ్ సెంచరీలు సాధించారు. మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(48), తయ్యబ్ తాహిర్(28) రాణించారు. టాపార్డర్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్(0)తో పాటు లోయర్ ఆర్డర్ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైంది. ప్రొటిస్ బౌలర్లలో కగిసో రబడ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ రెండు, క్వెనా మఫాకా, కార్బిన్ బాష్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. క్లాసెన్ ఒక్కడేఅయితే, లక్ష్య ఛేదనలో మాత్రం సౌతాఫ్రికా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయింది. ఓపెనర్లలో టోనీ డి జోర్జి(26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ తెంబా బవుమా 8 పరుగులకే నిష్క్రమించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాసీ వాన్ డెర్ డసెన్ 35 రన్స్‌తో రాణించగా.. మిడిలార్డర్ బ్యాటర్ ఐడెన్ మార్క్రమ్(19) నిరాశపరిచాడు.ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ధనాధన్ బ్యాటింగ్‌తో ప్రొటిస్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కేవలం 43 బంతుల్లోనే 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 81 పరుగులు సాధించాడు. అయితే, షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో తయ్యబ్ తాహిర్‌కు క్యాచ్ ఇచ్చి క్లాసెన్ పెవిలియన్ చేరడంతో ప్రొటిస్ జట్టు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.36 పరుగుల తేడాతో పాక్ గెలుపుమార్కో జాన్సెన్(26), కార్బిన్ బాష్(40 నాటౌట్) కాసేపు పోరాడగా.. జార్న్ ఫార్చూన్(8), కగిసో రబడ(14), మఫాకా(0) విఫలమయ్యారు. ఫలితంగా 42 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌట్ అయిన సౌతాఫ్రికాపై.. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం పాకిస్తాన్ 36 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది. పాక్ బౌలర్లలో సూఫియాన్ ముకీం నాలుగు వికెట్లు కూల్చగా.. షాహిన్ ఆఫ్రిది, నసీం షా చెరో రెండు.. మహ్మద్ హొస్నేన్, సయీమ్ ఆయుబ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.సౌతాఫ్రికాలో సౌతాఫ్రికాను వన్డేల్లో వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగాకాగా 1991లో అధికారికంగా తొలిసారి వన్డే సిరీస్ ఆడిన సౌతాఫ్రికా.. స్వదేశంలో క్లీన్‌స్వీప్ కావడం ఇదే మొదటిసారి. తద్వారా ప్రొటిస్ గడ్డపై సౌతాఫ్రికాను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా పాకిస్తాన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇంతవరకు ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన ఫీట్ నమోదు చేసింది.అంతేకాదు.. సౌతాఫ్రికాపై పాకిస్తాన్‌కు ఇది మూడో ద్వైపాక్షిక సిరీస్ విజయం. ఈ ఘనత సాధించిన తొలి జట్టు కూడా పాకిస్తాన్ కావడం విశేషం. ఇక మూడో వన్డేలో సెంచరీ చేసిన సయీమ్ ఆయుబ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా అందుకున్నాడు.చదవండి: VHT 2024: అయ్యర్ సెంచరీ వృథా.. 383 పరుగుల టార్గెట్‌ను ఊదిపడేసిన కర్ణాటక -
రూట్ పునరాగమనం
లండన్: చివరిసారి భారత్ వేదికగా 2023లో జరిగిన ప్రపంచకప్‌లో ఆడిన ఇంగ్లండ్ సీనియర్ స్టార్ క్రికెటర్ జో రూట్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో... ఆ తర్వాత పాకిస్తాన్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే ఇంగ్లండ్ జట్టును ఆదివారం ప్రకటించారు. భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పోటీపడే ఇంగ్లండ్ జట్టును కూడా ఎంపిక చేశారు. ఈ రెండు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టుకు వికెట్ కీపర్ జోస్ బట్లర్ నాయకత్వం వహిస్తాడు. టెస్టు ఫార్మాట్లో ఈ ఏడాదిని వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించనున్న రూట్ చివరి వన్డే 2023 ప్రపంచకప్‌లో ఆడాడు. 33 ఏళ్ల రూట్ ఇప్పటి వరకు 171 వన్డేలు ఆడి 6522 పరుగులు సాధించాడు. ఇందులో 16 సెంచరీలు, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్ వేసే రూట్ వన్డేల్లో 27 వికెట్లు కూడా పడగొట్టాడు. మరోవైపు ఇంగ్లండ్ టెస్టు జట్టు కెపె్టన్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ భారత్‌తో జరిగే సిరీస్‌కు, చాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా స్టోక్స్‌కు తొడ కండరాల గాయం తిరగబెట్టింది. ప్రస్తుతం స్టోక్స్ ఈ గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఫలితంగా అతని పేరును సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్. ఇంగ్లండ్ టి20 జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.భారత్–ఇంగ్లండ్ టి20 సిరీస్ షెడ్యూల్ జనవరి 22: తొలి టి20 (కోల్‌కతాలో) జనవరి 25: రెండో టి20 (చెన్నైలో) జనవరి 28: మూడో టి20 (రాజ్‌కోట్‌లో) జనవరి 31: నాలుగో టి20 (పుణేలో) ఫిబ్రవరి 2: ఐదో టి20 (ముంబైలో) భారత్–ఇంగ్లండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్‌పూర్‌లో) ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్‌లో) ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్‌లో) -
మూడో వన్డేలో ఘన విజయం.. అఫ్గాన్‌దే వన్డే సిరీస్
జింబాబ్వే పర్యటనలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న అఫ్గానిస్తాన్ జట్టు... వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. టి20 సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన అఫ్గాన్... తాజాగా వన్డే సిరీస్‌ను 2–0తో చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఆఖరి వన్డేలో అఫ్గాన్ 8 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది.మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 30.1 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (61 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీతో రాణించగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. కెపె్టన్ ఇరి్వన్ (5), ఆల్‌రౌండర్ సికందర్ రజా (13), బెనెట్ (9) ఒకరివెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు.అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్ 5 వికెట్లతో విజృంభించగా... రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ 26.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. సెదిఖుల్లా అతల్ (50 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఘజన్ఫర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సెదిఖుల్లా అతల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి తొలి టెస్టు జరగనుంది.చదవండి: IND vs AUS: టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం -
పాకిస్తాన్‌తో మూడో వన్డే.. సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ
పాకిస్తాన్‌తో మూడో వన్డేకు ముందు సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పర్యాటక జట్టుకు సిరీస్ సమర్పించుకున్న ప్రొటిస్.. కీలక పేసర్ సేవలను కోల్పోనుంది. ఫాస్ట్ బౌలర్ ఒట్నీల్ బార్ట్‌మన్ గాయం కారణంగా పాక్‌తో మూడో వన్డేకు దూరం కానున్నాడు.వన్డే సిరీస్‌లో విఫలంకాగా సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌ను 2-0తో చిత్తు చేసిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. తొలి వన్డేలో మూడు వికెట్లు, రెండో వన్డేలో 81 పరుగుల తేడాతో పాక్ చేతిలో ఓటమి పాలైంది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది.ఇక జొహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం జరిగే మూడో వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని తెంబా బవుమా బృందం పట్టుదలగా ఉంది. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు ప్రొటిస్ జట్టుకు షాక్ తగిలింది. పేసర్ ఒట్నీల్ బార్ట్‌మన్ గాయం బారినపడ్డాడు. దీంతో అతడు మూడో వన్డేకు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు.మోకాలి నొప్పి వల్లరెండో వన్డే కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే బార్ట్మన్కు మోకాలి నొప్పి వచ్చింది. దీంతో ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే, ఇప్పటికీ అతడు ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. కాగా టీ20 సిరీస్‌లో మూడు వికెట్లు తీసిన బార్ట్‌మన్.. తొలి వన్డేలోనూ రాణించాడు. ఏడు ఓవర్లపాటు బౌలింగ్ చేసిన ఈ 31 ఏళ్ల రైటార్మ్ పేసర్.. 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.ఆల్‌రౌండర్‌కు పిలుపుఇక పాకిస్తాన్ చేతిలో వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకునేందుకు సౌతాఫ్రికా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా బార్ట్‌మన్ స్థానంలో ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్‌ను వన్డే జట్టులో చేర్చింది. కాగా బార్ట్‌మన్ కంటే ముందే స్పిన్నర్ కేశవ్ మహరాజ్ కూడా గాయం వల్ల సిరీస్‌కు దూరమయ్యాడు.పాకిస్తాన్‌దే వన్డే సిరీస్కేప్టౌన్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాకిస్తాన్ జట్టు... దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 81 పరుగుల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తద్వారా 2–0తో సిరీస్ చేజిక్కించుకుంది. పాకిస్తాన్ జట్టుకు విదేశాల్లో ఇది వరుసగా రెండో సిరీస్ విజయం కావడం విశేషం.టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (82 బంతుల్లో 80; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మాజీ కెపె్టన్ బాబర్ ఆజమ్ (95 బంతుల్లో 73; 7 ఫోర్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా... కమ్రాన్ గులామ్ (32 బంతుల్లో 63; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.సఫారీ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ ఎడాపెడా బౌండ్రీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి దూకుడుతో పాకిస్తాన్ చివరి 10 ఓవర్లలో 105 పరుగులు రాబట్టింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎమ్పాకా 4, యాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (74 బంతుల్లో 97; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకోగా... తక్కినవాళ్లు ఆకట్టుకోలేకపోయారు.కెప్టెన్ తెంబా బవుమా (12), టోనీ (34), డసెన్ (23), మార్క్రమ్ (21), మిల్లర్ (29) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 4, నసీమ్ షా మూడు వికెట్లు పడగొట్టారు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టిన కమ్రాన్ గులామ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. చదవండి: SA vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
SA vs Pak: పాక్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. సౌతాఫ్రికా చిత్తు
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. సమిష్టిగా రాణించి 81 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా టీ20, వన్డే, టెస్టులు ఆడేందుకు పాక్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. ఆతిథ్య సౌతాఫ్రికా 2-0తో సిరీస్ గెలుచుకుంది. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం పాకిస్తాన్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. పర్ల్ వేదికగా మంగళవారం నాటి తొలి వన్డేలో మూడు వికెట్ల తేడాతో గెలిచిన రిజ్వాన్ బృందం.. కేప్‌టౌన్ మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది.ఓపెనర్లు విఫలంన్యూలాండ్స్ మైదానంలో గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫీక్ అబ్దుల్లా డకౌట్ కాగా.. మరో ఓపెనర్ సయీమ్ అయూబ్ 25 పరుగులకే వెనుదిరిగాడు.కమ్రాన్ గులామ్ మెరుపు అర్ధ శతకంఅయితే, వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(95 బంతుల్లో 73) మెరుగ్గా రాణించగా.. రిజ్వాన్ కెప్టెన్ ఇన్నింగ్స్(82 బంతుల్లో 80)తో మెరిశాడు. మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(33) ఫర్వాలేదనిపించగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కమ్రాన్ గులామ్(32 బంతుల్లో 63) మెరుపు అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో 329 పరుగులు చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయింది.ప్రొటిస్ జట్టు బౌలర్లలో యువ పేసర్ క్వెనా మఫాకా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్కో జాన్సెన్ మూడు, బిజోర్న్ ఫార్చూన్, పెహ్లూక్వాయో తలా ఒక వికెట్ తీశారు. అయితే, లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్‌లో ఓపెనర్లు కెప్టెన్ తెంబా బవుమా(12), టోనీ డి జోర్జీ(34), వన్‌డౌన్ బ్యాటర్ రాసీ వాన్ డెర్ డసెన్(23) విఫలమయ్యారు.హెన్రిచ్ క్లాసెన్ ధనాధన్ ఇన్నింగ్స్‌ఇక మిడిలార్డర్లో ఐడెన్ మార్క్రమ్(21) నిరాశపరచగా.. హెన్రిచ్ క్లాసెన్ మాత్రం విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. 74 బంతుల్లో అతడు 8 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 97 పరుగులు సాధించి.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక డేవిడ్ మిల్లర్(29) కాసేపు పోరాడే ప్రయత్నం చేయగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం లభించలేదు.సిరీస్ పాక్ కైవసంఈ క్రమంలో 43.1 ఓవర్లకే సౌతాఫ్రికా కథ ముగిసిపోయింది. ఆతిథ్య ప్రొటిస్‌ను 248 పరుగులకే పరిమితం చేసిన పాకిస్తాన్.. 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది నాలుగు, నసీం షా మూడు, అబ్రార్ అహ్మద్ రెండు, సల్మాన్ ఆఘా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు మూడో వన్డే ఆదివారం జొహన్నస్‌బర్గ్‌లో జరుగుతుంది.చదవండి: IND W Vs WI W: విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం -
చరిత్ర సృష్టించిన అఫ్గనిస్తాన్
Zimbabwe vs Afghanistan, 2nd ODI: అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే ఫార్మాట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం నమోదు చేసింది. జింబాబ్వేతో రెండో వన్డే సందర్భంగా ఈ ఘనత సాధించింది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా తొలుత హరారేలో టీ20 సిరీస్ జరుగగా.. అఫ్గనిస్తాన్ 2-1తో నెగ్గింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అదే వేదికపై మంగళవారం వన్డే సిరీస్ మొదలైంది. అయితే, వర్షం కారణంగా తొలి వన్డే ఫలితం తేలకుండానే ముగిసిపోయింది.అతల్ సెంచరీఈ నేపథ్యంలో జింబాబ్వే- అఫ్గనిస్తాన్ మధ్య గురువారం రెండో వన్డే జరిగింది. ఇందులో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. అఫ్గన్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు సెదికుల్లా అతల్ సెంచరీతో చెలరేగగా.. అబ్దుల్ మాలిక్ అర్ధ శతకంతో మెరిశాడు. అటల్ 128 బంతుల్లో 104 పరుగులు చేయగా.. అబ్దుల్ 101 బంతుల్లో 84 పరుగులు రాబట్టాడు.ఇలా ఓపెనర్లు బలమైన పునాది వేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ అజ్మతుల్లా(5), నాలుగో స్థానంలో వచ్చిన రహ్మత్ షా(1) మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో కెప్టెన్ హష్మతుల్లా షాహిది(30 బంతుల్లో 29 నాటౌట్) బ్యాట్ ఝులిపించగా.. మహ్మద్ నబీ(16 బంతుల్లో 18) అతడికి సహకారం అందించాడు. వికెట్ కీపర్ ఇక్రమ్ అలిఖిల్ 5 పరుగులు చేశాడు.54 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన అఫ్గనిస్తాన్ 286 పరుగులు స్కోరు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో అఫ్గన్ బౌలర్లు నిప్పులు చెరగడంతో జింబాబ్వే 54 పరుగులకే(17.5 ఓవర్లలో) కుప్పకూలింది. దీంతో ఏకంగా 232 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్ జయభేరి మోగించింది.తద్వారా.. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇక జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికందర్ రజా సాధించిన 19 పరుగులే టాప్ స్కోర్. అతడు ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.సింగిల్ డిజిట్ స్కోర్లుఓపెనర్లు బెన్ కర్రన్(0), తాడివనాషి మరుమాణి(3).. అదే విధంగా మిగతా ఆటగాళ్లలో డియాన్ మైయర్స్(1), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్(4), బ్రియాన్ బెనెట్(0), న్యూమన్ నియామురి(1), రిచర్డ్ ఎంగర్వ(8), ట్రెవర్ గ్వాండు(0), టినోడెండా మపోసా(0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సీన్ విలియమ్స్ 16 పరుగులు చేయగలిగాడు.ఇక అఫ్గనిస్తాన్ బౌలర్లలో ఘజన్ఫర్, నవీద్ జద్రాన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. ఫజల్హక్ ఫారూకీ రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. సెంచరీ వీరుడు సెదికుల్లా అతల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య శనివారం మూడో వన్డే జరుగనుంది. చదవండి: ‘త్వరలోనే భారత్‌కు కోహ్లి గుడ్‌బై... లండన్‌లో స్థిరనివాసం’ -
ఫాస్టెస్ట్ సెంచరీ.. వెస్టిండీస్ బ్యాటర్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్ క్రికెటర్ అమిర్ జాంగూ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే అరంగేట్రంలోనే అత్యంత వేగంగా శతకం బాదిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో మూడో వన్డే సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేశాడు.సొంతగడ్డపై సెయింట్ కిట్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడింది వెస్టిండీస్. ఇందులో భాగంగా తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఆతిథ్య జట్టు.. రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక వార్నర్ పార్క్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. అదరగొట్టిన మహ్మదుల్లాసౌమ్య సర్కార్(73) హాఫ్ సెంచరీతో రాణించగా.. మెహదీ హసన్ మిరాజ్(77) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మహ్మదుల్లా 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అతడితో కలిసి జాకర్ అలీ(62*) ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు, గుడకేశ్ మోటీ, షెర్ఫానే రూథర్‌ఫర్డ్ ఒక్కో వికెట్ తీశారు.అమిర్ జాంగూ ఆకాశమే హద్దుగాఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ ఆదిలోనే ఓపెనర్లు బ్రాండన్ కింగ్(15), అలిక్ అథనాజ్(7) వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ షాయీ హోప్(3) పూర్తిగా విఫలం కాగా.. షెర్ఫానే రూథర్‌ఫర్డ్(30) కూడా నిరాశపరిచాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ జట్టును ఆదుకున్నాడు.ఫాస్టెస్ట్ సెంచరీ.. మొత్తంగా 88 బంతులు ఎదుర్కొన్న కార్టీ 95 పరుగులతో రాణించగా.. అతడికి జతైన అరంగేట్ర బ్యాటర్ అమిర్ జాంగూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 80 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. కార్టీతో కలిసి ఐదో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన 27 ఏళ్ల ఈ లెఫ్టాండర్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 104 పరుగుల సాధించాడు. గుడకేశ్ మోటీ(31 బంతుల్లో 44 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కార్టీ, జాంగూ, గుడకేశ్ విజృంభణ కారణంగా వెస్టిండీస్ 45.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్లు నష్టపోయి 325 పరుగులు సాధించి.. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది. అమిర్ జాంగూ ‘ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్’, రూథర్‌ఫర్డ్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నారు. రీజా హెండ్రిక్స్ ప్రపంచ రికార్డు బద్దలుకాగా ట్రినిడాడ్‌కు చెందిన అమిర్ జాంగూకు అంతర్జాతీయ క్రికెట్లో ఇదే తొలి మ్యాచ్. బంగ్లాదేశ్‌తో మూడో వన్డే సందర్భంగా అతడు అరంగేట్రం చేశాడు. వచ్చీ రాగానే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి.. సౌతాఫ్రికా స్టార్ రీజా హెండ్రిక్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జాంగూ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 18వ క్రికెటర్‌గా నిలిచాడు. ఇక వన్డే అరంగేట్రంలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఇంగ్లండ్ బ్యాటర్ డెనిస్ అమీ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియా మీద 134 బంతుల్లో అతడు 103 పరుగుల సాధించాడు.వన్డే అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన టాప్-5 క్రికెటర్లు1. అమిర్ జాంగూ(వెస్టిండీస్)- బంగ్లాదేశ్ మీద- 83 బంతుల్లో 104* రన్స్2. రీజా హెండ్రిక్స్(సౌతాఫ్రికా)- శ్రీలంక మీద- 89 బంతుల్లో 102 రన్స్3. కేఎల్ రాహుల్(ఇండియా)- జింబాబ్వే మీద- 115 బంతుల్లో 100* రన్స్4. మార్క్ చాప్మన్(హాంగ్‌కాంగ్)- యూఏఈ మీద- 116 బంతుల్లో 124* రన్స్5. మైకేల్ లాంబ్(ఇంగ్లండ్)- వెస్టిండీస్ మీద- 117 బంతుల్లో 106 రన్స్.చదవండి: నా పరిస్థితి బాలేదు.. తాగడం మానేశాను.. వారి సాయం తీసుకుంటా: వినోద్ కాంబ్లీAn unforgettable moment on debut!🔥Amir Jangoo takes today's CG United Moment of the Match!👏🏾#WIvBAN #MatchMoment #WIHomeForChristmas pic.twitter.com/TzNnmWvHwG— Windies Cricket (@windiescricket) December 12, 2024Amazing Amir! 🙌A century on debut, only the second West Indian to do so.#WIvBAN | #WIHomeForChristmas pic.twitter.com/UGWGBiNNmm— Windies Cricket (@windiescricket) December 12, 2024 -
ఆసీస్‌తో వన్డే సిరీస్.. భారత క్రికెట్ జట్టుకు మరో షాక్
భారత మహిళల క్రికెట్ జట్టుకు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన హర్మన్ సేనకు.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) గట్టి షాకిచ్చింది. ఆసీస్‌తో బ్రిస్బేన్‌లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా స్లో ఓవర్‌రేట్‌కు పాల్పడటంతో ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో కోత పడింది. నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువ వేయడంతో ఓవర్‌కు 5 చొప్పున... భారత ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు రెఫరీ డేవిడ్ గిల్బర్ట్ వెల్లడించాడు.విచారణ లేకుండా నేరుగాఐసీసీ నియమావళిలోని 2.22 ఆర్టికల్ ప్రకారం జరిమానా విధించినట్లు పేర్కొన్నాడు. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పు అంగీకరించడంతో ఎలాంటి విచారణ లేకుండా నేరుగా కోత విధించినట్లు తెలిపాడు. కాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో భారత్ 3-0తో క్వీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే.మూడో వన్డేలో స్మృతి ‘శత’క్కొట్టినా...పెర్త్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆసీస్ ప్లేయర్లలో అనాబెల్ సదర్లాండ్ (95 బంతుల్లో 110; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకంతో చెలరేగగా... కెప్టెన్ తాలియా మెక్‌గ్రాత్ (56 నాటౌట్; 5 ఫోర్లు), ఆష్లే గార్డ్నర్ (50; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు.ఒకదశలో 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను అనాబెల్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకుంది. మొదట గార్డ్నర్తో ఐదో వికెట్‌కు 96 పరుగులు జోడించిన అనాబెల్... ఆ తర్వాత తాలియాతో ఆరో వికెట్‌కు 95 బంతుల్లో 122 పరుగులు జతచేసి జట్టుకు భారీ స్కోరు అందించింది. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి 4 వికెట్లు తీయగా... దీప్తి శర్మ ఒక వికెట్ దక్కించుకుంది.ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (109 బంతుల్లో 105; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు నుంచి ఆమెకు ఎటువంటి సరైన సహకారం లభించలేదు. ఒక్క హర్లీన్ డియోల్ (39; 4 ఫోర్లు) మినహా మిగతా వాళ్లు విఫలమయ్యారు.అండగా హర్లీన్ డియోల్స్మృతి–హర్లీన్ రెండో వికెట్‌కు 118 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేసినా... తర్వాత వచ్చిన వాళ్లు అదే జోరును కొనసాగించలేకపోయారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (12), రిచా ఘోష్ (2), జెమీమా రోడ్రిగ్స్ (16), దీప్తి శర్మ (0), మిన్ను మణి (8) విఫలమయ్యారు. ఫలితంగా టీమిండియా 45.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ కాగా.. కంగారూ జట్టు 83 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 5 వికెట్లు తీయగా... మేగన్ షుట్, అలానా కింగ్ రెండేసి వికెట్లు తీశారు. ఇక ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన అనాబెల్ సదర్లాండ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.చదవండి: ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్ -
పాక్‌తో వన్డే సిరీస్.. సౌతాఫ్రికా విధ్వంసకర వీరుల రీఎంట్రీ
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు క్రికెట్ సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. తెంబా బవుమా సారథ్యంలోని ఈ జట్టులో క్వెనా మఫాకాకు తొలిసారి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఇక ఈ సిరీస్‌తో కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్ పునరాగమనం చేయనుండగా.. టీ20 వీరులు డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ సైతం తిరిగి వన్డే జట్టులో స్థానం సంపాదించారు.డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య డిసెంబరు 10న తొలి టీ20 జరుగగా.. ఆతిథ్య జట్టు 11 పరుగుల తేడాతో పాక్‌పై గెలిచింది. ఇక డిసెంబరు 13న రెండో, డిసెంబరు 14న మూడో టీ20 జరుగునుండగా.. డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.‘అన్క్యాప్డ్’ ప్లేయర్‌కు చోటుఈ నేపథ్యంలో సౌతాఫ్రికా గురువారం తమ వన్డే జట్టును ప్రకటించింది. ఇక ఈ సిరీస్‌తో పద్దెమినిదేళ్ల లెఫ్టార్మ్ పేసర్ క్వెనా మఫాకా వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన క్వెనా మఫాకా.. పాక్‌తో తొలి టీ20లో అదరగొట్టాడు. తన అద్భుత బౌలింగ్‌తో బాబర్ ఆజంను అవుట్ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తిచేసి 39 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు.గాయాల బెడదమరోవైపు.. స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే కాలి గాయం కారణంగా.. మిగిలిన రెండు టీ20లు, వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక వేలు విరిగిన కారణంగా వియాన్ ముల్దర్, తుంటినొప్పి వల్ల లుంగి ఎంగిడి, గజ్జల్లో గాయం కారణంగా గెరాల్డ్ కోయెట్జి, వెన్నునొప్పితో బాధపడుతున్న నండ్రీ బర్గర్ సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయారు.వారికి పునఃస్వాగతంఇదిలా ఉంటే.. పాక్‌తో టీ20 సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న రబడ, స్టబ్స్, కేశవ్ మహరాజ్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. తాము తమ వన్డే జట్టు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నట్లు తెలిపాడు. క్వెనా మఫాకాకు కొత్త పాఠాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుందని.. క్లాసెన్, మిల్లర్లకు వన్డే జట్టులోకి తిరిగి స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నాడు.పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా క్రికెట్ జట్టుతెంబా బవుమా (కెప్టెన్), ఒట్ట్నీల్ బార్ట్‌మన్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్.సౌతాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ వన్డే సిరీస్ షెడ్యూల్తొలి వన్డే- డిసెంబరు 17- పర్ల్- బోలాండ్ పార్క్రెండో వన్డే- డిసెంబరు 19- సెంచూరియన్- సూపర్‌స్పోర్ట్ పార్క్మూడో వన్డే- డిసెంబరు 22- జొహన్నస్‌బర్గ్- ది వాండరర్స్ స్టేడియం.చదవండి: భారత్‌తో మూడో టెస్టు... ఆసీస్ స్టార్ క్రికెటర్‌పై వేటు! -
WI Vs BAN: రూథర్ ఫర్డ్ విధ్వంసం.. బంగ్లాను చిత్తు చేసిన వెస్టిండీస్
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. 295 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ 5 వికెట్లు కోల్పోయి 47.4 ఓవర్లలో చేధించింది. కరేబియన్ బ్యాటర్లలో షర్ఫెన్ రూథర్‌ఫర్డ్(113) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ షాయ్ హోప్(86) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో టాంజిమ్ హసన్, నహిద్ రానా, రిహద్ హోస్సేన్, మెహది హసన్ మిరాజ్, సౌమ్య సర్కార్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. టాంజిద్ హసన్(60), మహ్మదుల్లా(50), జకీర్ అలీ(48) రాణించారు. విండీస్ బౌలర్లలో షెపర్డ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అల్జారీ జోషఫ్ రెండు, సీల్స్ ఒక్క వికెట్ సాధించారు.చదవండి: IND vs AUS: ట్రావిస్ హెడ్, సిరాజ్‌లకు షాక్ ఇవ్వనున్న ఐసీసీ!? -
Ind Vs Aus ODI: ఈసారైనా...!.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో
ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్‌లు నెగ్గిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియాలో మాత్రం ఇప్పటి వరకు నిరాశే మిగిలింది. ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడేందుకు ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియా రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో అందని ద్రాక్షగా ఉన్న ఆ్రస్టేలియాలో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు భారత జట్టుకు మరో అవకాశం లభించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు జట్ల మధ్య ఈరోజు తొలి వన్డే జరగనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్ సన్నాహాలు ఈ సిరీస్ నుంచే భారత్ మొదలుపెట్టనుంది. బ్రిస్బేన్: ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించిన భారత మహిళల క్రికెట్ జట్టు మరో సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా తొలి వన్డే జరగనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... ఈ సిరీస్ టీమిండియాకు కీలకం కానుండగా... మరోవైపు సొంతగడ్డపై ఆసీస్ జట్టు ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తోంది. భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా... స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న యువ ఓపెనర్ షఫాలీ వర్మను ఈ పర్యటనకు ఎంపిక చేయలేదు. జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్, దీప్తి శర్మలతో జట్టు బలంగానే ఉన్నా... వీరంతా కలిసికట్టుగా రాణించాల్సిన అవసరముంది. ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య 16 వన్డేలు జరగగా... అందులో భారత జట్టు కేవలం 4 విజయాలు మాత్రమే సాధించింది. 2021లో చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించిన మన జట్టు 1–2తో సిరీస్ కోల్పోయింది. ఆస్ట్రేలియాపై విజయం సాధించాలంటే భారత జట్టు శక్తికి మించి పోరాడాల్సిన అవసరముంది. 2025లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో... దానికి ముందు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడుతుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. కెప్టెన్‌గా తొలిసారి సిరీస్ ఆడుతున్నామరోవైపు ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ అలీసా హీలీ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో తహిలా మెక్‌గ్రాత్ జట్టుకు సారథ్యం వహించనుంది. ‘భారత జట్టులో చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. వారిపై పైచేయి సాధించడం అంత సులువు కాదు. స్వదేశంలో ఆడుతుండటంతో మాపై అంచనాలు ఎక్కువ ఉంటాయి. నేను పూర్తి స్థాయి కెప్టెన్‌గా తొలిసారి సిరీస్ ఆడుతున్నా. ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తా’ అని తహిలా పేర్కొంది.రాధ యాదవ్‌పై భారీ అంచనాలుఇటీవల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబర్చడంతో హర్మన్‌ను కెప్టెన్‌గా తప్పించాలనే వాదనలు ఎక్కువైనా... మేనేజ్మెంట్ ఆమె సారథ్యంపై నమ్మకముంచింది. మరి స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో హర్మన్ తన సత్తా చాటాల్సిన అవసరముంది. ఇక స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న రాధ యాదవ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బౌలింగ్‌లో హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, దీప్తి శర్మ కీలకం కానున్నారు. ఆసీస్ జట్టులో స్టార్లకు కొదవలేకపోగా... మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆటకు పెద్దగా ఇబ్బంది కలగకపోవచ్చు.షఫాలీ వర్మ చాలా ముఖ్యమైన ప్లేయర్. జాతీయ జట్టు తరఫున షఫాలీ ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడింది. తిరిగి పుంజుకొని జట్టులోకి వస్తుందని నమ్మకముంది. ప్రత్యర్థి ఎవరైనా విజయం సాధించాలనే తపనతోనే మైదానంలో అడుగు పెడతాం. వన్డేల్లో మా జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది. దాన్నే ఇక్కడ కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం.ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని జట్టు కూర్పుపై కసరత్తు చేస్తాం. స్వదేశంలో న్యూజిలాండ్‌పై సిరీస్ విజయం సాధించాం. ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వాటి కోసం సిద్ధంగా ఉన్నాం. – హర్మన్‌ప్రీత్ కౌర్, భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ 10 భారత్, ఆ్రస్టేలియా మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 53 వన్డేలు జరిగాయి. ఇందులో భారత జట్టు 10 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... ఆస్ట్రేలియా 43 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.9 భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 9 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు జరిగాయి. తొమ్మిది సిరీస్‌లలోనూ ఆ్రస్టేలియానే గెలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు నాలుగు వన్డే సిరీస్‌లు ఆడి నాలుగింటిలోనూ ఓటమి పాలైంది. -
సూపర్ ఫామ్‌లో భారత ఓపెనర్.. ఆల్‌టైమ్ రికార్డుకు గురి
భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుంటోంది. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ వన్డేలో సెంచరీతో చెలరేగిన ఈ ముంబై బ్యాటర్.. మహిళల బిగ్‌బాష్ లీగ్-2024లోనూ ఫామ్‌ను కొనసాగించింది. ఈ ఆస్ట్రేలియా టీ20 లీగ్‌లో మొత్తంగా ఐదు మ్యాచ్‌లలో కలిపి 142కు పైగా స్ట్రైక్‌రేటుతో 144 పరుగులు సాధించింది.ఇక స్మృతి మంధాన తదుపరి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో బిజీ కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ అరుదైన రికార్డు ముంగిట నిలిచింది. ఆసీస్‌తో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో స్మృతి గనుక 310 పరుగులు సాధిస్తే.. వన్డేల్లో 4000 పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ల క్లబ్లో చేరుతుంది. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డుఅంతేకాదు భారత్ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలుస్తుంది. కాగా ఇంతకు ముందు దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్... 112 మ్యాచ్‌లలో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకుంది. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో 2011నాటి వన్డేలో ఈ ఘనత సాధించింది.ఇక స్మృతి మంధాన ఇప్పటి వరకు 88 వన్డేలు ఆడి 3690 పరుగులు సాధించింది. ఇందులో ఎనిమిది శతకాలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో స్మృతి ఆసీస్‌తో సిరీస్ సందర్భంగా 310 రన్స్ చేస్తే.. మిథాలీ రాజ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలుకొట్టగలుగుతుంది. టాప్‌లో ఉన్నది వీరేకాగా ఓవరాల్‌గా మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగుల క్లబ్లో చేరిన క్రికెటర్లలో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ ముందు వరుసలో ఉంది. ఆమె 86 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ నమోదు చేసింది. బెలిండా తర్వాతి స్థానాల్లో... మెగ్ లానింగ్(89 ఇన్నింగ్స్), లారా వొల్వర్ట్(96 ఇన్నింగ్స్), కరేన్ రాల్టన్(103 ఇన్నింగ్స్), సుజీ బేట్స్(105 ఇన్నింగ్స్), స్టెఫానీ టేలర్(107 ఇన్నింగ్స్), టామీ బీమౌంట్(110 ఇన్నింగ్స్) ఈ జాబితాలో ఉన్నారు.ఇదిలా ఉంటే.. భారత మహిళా జట్టు మూడు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. డిసెంబరు 5న బ్రిస్బేన్‌లోని అలెన్ బోర్డర్ ఫీల్డ్‌లో ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. -
భారత్‌తో సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం
భారత్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ మహిళా జట్టును ప్రకటించింది. హేలీ మాథ్యూస్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన టీమ్ వివరాలను గురువారం వెల్లడించింది. కాగా భారత్- వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లకు షెడ్యూల్ ఖరారైంది.డిసెంబరు 15న టీ20తో మొదలునవీ ముంబై వేదికగా డిసెంబరు 15న టీ20తో మొదలుకానున్న విండీస్ ఇండియా టూర్.. డిసెంబరు 27న మూడో వన్డేతో ముగియనుంది. పొట్టి సిరీస్‌కు నవీ ముంబై వేదికకాగా... బరోడా వన్డే సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రకటించిన విండీస్ జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ స్టెఫానీ టేలర్ పేరు మిస్ అయింది.మహిళల టీ20 ప్రపంచకప్ -2024 సందర్భంగా స్టెఫానీ మోకాలికి గాయమైంది. ఆ తర్వాత మళ్లీ ఆమె మైదానంలో దిగలేదు.ఇప్పుడు ఇండియా టూర్‌కు కూడా స్టెఫానీ దూరమైంది. మరోవైపు.. మాజీ కెప్టెన్ డియాండ్ర డాటిన్ దాదాపు రెండేళ్ల తర్వాత వన్డే క్రికెట్లో పునరాగమనం చేయనుంది. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్‌కప్ తాజా ఎడిషన్‌లో విండీస్ సెమీస్ చేరగా.. భారత జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగింది.భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు వెస్టిండీస్ మహిళా జట్టుహేలీ మాథ్యూస్ (కెప్టెన్), షెమైన్ కాంప్‌బెల్ (వైస్ కెప్టెన్), ఆలియా అల్లీన్, షమీలియా కాన్నెల్, నెరిస్సా క్రాఫ్టన్, డియాండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్, షబికా గజ్నాబి, చినెల్ హెన్రీ, జైదా జేమ్స్, కియానా జోసెఫ్, మాండీ మంగ్రూ, అష్మిని మునిసర్, కరిష్మా రాంహారక్, రషదా విలియమ్స్ .భారత్ వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్టీ20 సిరీస్👉మొదటి టీ20- డిసెంబరు 15- ఆదివారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబై👉రెండో టీ20- డిసెంబరు 17- మంగళవారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబై👉మూడో టీ20- డిసెంబరు 19- గురువారం- రాత్రి ఏడు గంటలకు- నవీ ముంబైవన్డే సిరీస్👉తొలి వన్డే- డిసెంబరు 22- ఆదివారం- మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు- బరోడా👉రెండో వన్డే- డిసెంబరు 24- మంగళవారం- మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు- బరోడా👉మూడో వన్డే- డిసెంబరు 27- శుక్రవారం- ఉదయం తొమ్మిదిన్నర గంటలకు- బరోడా. -
పాక్ ఓపెనర్ విధ్వంసకర సెంచరీ.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో ఊచకోత
తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో ఓటమికి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం బులవాయో వేదికగా జరిగిన రెండో వన్డేలో 10 వికెట్లను తేడాతో జింబాబ్వేను పాక్ చిత్తు చేసింది. 146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షషీక్ ఊదిపడేశారు.కేవలం 18.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా పాక్ లక్ష్యాన్ని చేధించింది. సైమ్ ఆయూబ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 53 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 62 బంతులు ఎదుర్కొన్న అయూబ్.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 113 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు అబ్దుల్ షఫీక్(32 నాటౌట్) రాణించాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వే 32.3 ఓవర్లలో కేవలం 145 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో డియాన్ మైర్స్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక పాక్ బౌలర్లలో స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. అఘా సల్మాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ ఇదే వేదికలో నవంబర్ 28న జరగనుంది.చదవండి: IPL 2025: 'రూ.75 లక్షలకు కూడా ఎవరూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు' -
సంచలనం.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన జింబాబ్వే
జింబాబ్వే పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. బులవాయో వేదికగా జరిగిన తొలి వన్డేలో 80 పరుగుల(డీఎల్ఎస్) తేడాతో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వే 40.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో నగరవా(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రజా(39) పరుగులతో రాణించారు. మరోవైపు పాక్ బౌలర్లలో ఆఘా సల్మాన్, ఫైజల్ ఆక్రమ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు జింబాబ్వే బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు. ఆతిథ్య జట్టు బౌలర్లు దాటికి పాక్ జట్టు 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో మ్యాచ్ నిలిచిపోయింది. అయితే వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో జింబాబ్వేను విజేతగా అంపైర్లు నిర్ణయించారు.జింబాబ్వే బౌలర్లలో ముజాబ్ రానీ, సికిందర్ రజా, సీన్ విలియమ్స్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన సికిందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా వన్డేల్లో పాకిస్తాన్‌ను జింబాబ్వే ఓడించడం ఇదే ఆరోసారి కావడం గమనార్హం. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే నవంబర్ 26న ఇదే వేదికలో జరగనుంది.చదవండి: IPL 2025: వేలంలోకి లేటుగా వచ్చేశాడు.. కట్ చేస్తే! రూ. 12.50 కోట్లు కొట్టేశాడు -
SL vs NZ: న్యూజిలాండ్‌కు ఘోర అవమానం.. తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి!
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను విజయంతో మొదలుపెట్టింది శ్రీలంక. డంబుల్లా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో పర్యాటక కివీస్ జట్టును ఓడించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.సెంచరీలతో చెలరేగిన అవిష్క, కుశాల్తొలి వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లలో పాతుమ్ నిసాంక(12) నిరాశపరిచినా.. అవిష్క ఫెర్నాండో(115 బంతుల్లో 100) అద్భుత శతకంతో మెరిశాడు. అతడికి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్(128 బంతుల్లో 143) భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు.ఇక చరిత్ అసలంక సైతం కెప్టెన్ ఇన్నింగ్స్(28 బంతుల్లో 40) అలరించాడు. ఈ ముగ్గురి అద్భుత బ్యాటింగ్ కారణంగా శ్రీలంక 49.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 324 పరుగులు స్కోరు చేసింది. వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు.కివీస్ లక్ష్యం 221అనంతరం.. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. న్యూజిలాండ్ లక్ష్యాన్ని 27 ఓవర్లలో 221 పరుగులుగా నిర్దేశించారు అంపైర్లు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 27 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 175 పరుగులే చేసింది. ఓపెనర్లు విల్ యంగ్(48), టిమ రాబిన్సన్(35), మిడిలార్డర్ మిచెల్ బ్రాస్‌వెల్(34 నాటౌట్) ఫర్యాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు.45 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమిహెన్రీ నికోల్స్(6), మార్క్ చాప్మన్(2), గ్లెన్ ఫిలిప్స్(9) పూర్తిగా నిరాశపరచగా.. మిచ్ హే(10), కెప్టెన్ మిచెల్ సాంట్నర్(9), నాథన్ స్మిత్(9), ఇష్ సోధి(0), జాకోబ్ డఫీ(4 నాటౌట్).. లంక బౌలర్ల ధాటికి తాళలేక చేతులెత్తేశారు. దీంతో 45 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. ఇక.. లంక బౌలర్లలో దిల్షాన్ మధుషాంక మూడు, మహీశ్ తీక్షణ, చరిత్ అసలంక చెరో రెండు, జాఫ్రీ వాండర్సే ఒక వికెట్ కూల్చారు. భారీ శతకంతో మెరిసిర కుశాల్ మెండిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.న్యూజిలాండ్‌కు ఘోర అవమానం.. తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి!కాగా 2015 తర్వాత న్యూజిలాండ్‌పై వన్డేల్లో శ్రీలంకకు ఇదే తొలి విజయం. ఓవరాల్‌గా గత 12 వన్డేల్లోనూ లంక కివీస్‌పై వన్డేలో గెలవడం ఇదే తొలిసారి. కాగా 2015, డిసెంబరులో న్యూజిలాండ్ గడ్డపైనే కివీస్‌ను లంక వన్డే మ్యాచ్‌లో చివరగా ఓడించింది. ఇక 2024లో ఇప్పటి వరకు సొంతగడ్డపై 13 వన్డేలు ఆడిన శ్రీలంకకు ఇది పదో విజయం.చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత -
వచ్చే నెలలో విండీస్‌తో భారత మహిళల జట్టు సిరీస్
ముంబై: వచ్చే నెలలో భారత మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 3 టి20లు ఆడనుంది. దాంతో పాటు జనవరిలో స్వదేశంలో ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ మూడు సిరీస్‌ల కోసం బీసీసీఐ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 15 నుంచి వెస్టిండీస్ మహిళల జట్టు భారత్‌లో పర్యటించనుండగా... నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వరుసగా మూడు టి20లు (15న, 17న, 19న) ఆడనుంది. ఆ తర్వాత వడోదరలో డిసెంబర్ 22, 24, 27వ తేదీల్లో మూడు వన్డేలు ఆడనుంది.అనంతరం వచ్చే ఏడాది జనవరి 10, 12, 15న రాజ్‌కోట్‌లో ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుండగా... ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్‌లు జరగనున్నాయి. -
అదే నా కెరీర్లో చివరి టోర్నీ: అఫ్గన్ స్టార్ ఆల్‌రౌండర్ రిటైర్మెంట్ ప్రకటన
వచ్చే ఏడాది జరగనున్న చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం వస్తే.. అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదని అఫ్గనిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ అన్నాడు. ఈ ఐసీసీ టోర్నీ తర్వాత తాను వన్డేల నుంచి తప్పుకొంటానని తెలిపాడు. కాగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో సమష్టి ప్రదర్శనతో సత్తాచాటిన అఫ్గనిస్తాన్.. సిరీస్‌ను కైవసం చేసుకుంది.హ్యాట్రిక్ విజయాలుతద్వారా ఈ ఫార్మాట్లో వరుసగా మూడో సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం నాటి ఆఖరి వన్డేలో అఫ్గన్ 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. ఫలితంగా 2–1తో సిరీస్ చేజిక్కించుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.మహ్ముదుల్లా (98 బంతుల్లో 98; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ (119 బంతుల్లో 66; 4 ఫోర్లు) అర్ధ శతకంతో రాణించాడు. అఫ్గనిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గాన్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది.రహమానుల్లా గుర్బాజ్ సూపర్ సెంచరీఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ (120 బంతుల్లో 101; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ పూర్తి చేసుకోగా... అజ్మతుల్లా (77 బంతుల్లో 70 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. చివర్లో మొహమ్మద్ నబీ (34 నాటౌట్; 5 ఫోర్లు) కీలక పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో నహీద్ రాణా, ముస్తఫిజుర్ రహమాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అజ్మతుల్లాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, మొహమ్మద్ నబీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. అది ముగిసిన తర్వాత వన్డేల నుంచి తప్పుకొంటాఈ నేపథ్యంలో నబీ మాట్లాడుతూ.. ‘‘‘గత ఏడాది వన్డే ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి దీని గురించి ఆలోచిస్తున్నా. కానీ మా జట్టు చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది. దీంతో ఆ టోర్నీ ఆడాలనుకున్నా. అది ముగిసిన తర్వాత వన్డేల నుంచి తప్పుకొంటా’ అంటూ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించాడు. కాగా సుదీర్ఘ కాలంగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న 39 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ను అభిమానులు అఫ్గన్ క్రికెట్ హీరోగా పిలుచుకుంటారు.ఇక అఫ్గన్ తరఫున ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున 167 వన్డేలు ఆడిన నబీ... 27.48 సగటుతో 3,600 పరుగులు చేయడంతో పాటు 172 వికెట్లు పడగొట్టాడు. 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నబీ... 2 సెంచరీలు, 17 అర్ధశతకాలు తన పేరిట రాసుకున్నాడు.గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన అఫ్గనిస్తాన్ జట్టు... ఆరో స్థానంలో నిలవడం ద్వారా తొలిసారి చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన విషయం తెలిసిందే.చదవండి: BGT 2024: అతడి బ్యాటింగ్ అద్భుతం.. భారత తుదిజట్టులో చోటివ్వాల్సిందే: ఆసీస్ మాజీ కెప్టెన్ -
గుర్భాజ్ విధ్వంసకర సెంచరీ.. బంగ్లాను చిత్తు చేసిన అఫ్గాన్
షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో అఫ్గానిస్తాన్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(98) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మెహాది హసన్ మిరాజ్(66) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 4 వికెట్లతో సత్తాచాటగా.. నబీ, రషీద్ ఖాన్ తలా వికెట్ సాధించారు.గుర్భాజ్ విధ్వంసకర సెంచరీ..అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. అఫ్గాన్ లక్ష్య చేధనలో ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 120 బంతులు ఎదుర్కొన్న గుర్భాజ్ 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అతడితో పాటు 'మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్' అజ్మతుల్లా ఒమర్జాయ్(70 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. బంగ్లా బౌలర్లలో నహిద్ రాణా, ముస్తఫిజుర్ రెహ్మాన్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: అదొక పగటి కల.. భారత్‌కు పీసీబీ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలి: పాక్ మాజీ కెప్టెన్ -
మెరిసిన షాంటో.. అఫ్గాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిన బంగ్లాదేశ్... రెండో మ్యాచ్‌లో సత్తా చాటింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం షార్జా వేదికగా జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ 68 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై గెలుపొందింది. ఫలితంగా సిరీస్ 1–1తో సమమైంది.టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిరీ్ణత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నజ్ముల్ షంటో (119 బంతుల్లో 76; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధసెంచరీ నమోదు చేయగా... సౌమ్య సర్కార్ (35), జాకీర్ అలీ (37 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు), నసుమ్ అహ్మద్ (25; ఒక ఫోర్, రెండు సిక్సర్లు) రాణించారు. తన్జిద్ హసన్ (22), మెహది హసన్ మిరాజ్ (22) కూడా ఫర్వాలేదనిపించారు అఫ్గాన్ బౌలర్లలో నంగెయాలియా ఖరోటె 3, రషీద్ ఖాన్ ఘజన్ఫర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గానిస్తాన్ 43.3 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. రహమత్ షా (76 బంతుల్లో 52; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా... సెదిఖుల్లా అటల్ (39; 5 ఫోర్లు), గుల్బదిన్ నైబ్ (26; 4 ఫోర్లు, ఒక సిక్సర్) తలా కొన్ని పరుగులు చేశారు. గత మ్యాచ్‌లో స్ఫూర్తివంతమైన ప్రదర్శన కనబర్చిన అఫ్గాన్ బ్యాటర్లు ఈ సారి అదే జోష్ కొనసాగించలేకపోయారు. రహామనుల్లా గుర్బాజ్ (2), అజ్మతుల్లా (0), హష్మతుల్లా (17), మొహమ్మద్ నబీ (17), రషీద్ ఖాన్ (14) విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నసుమ్ అహ్మద్ 3... ముస్తఫిజుర్ రహమాన్, మెహదీ హసన్ మిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే సోమవారం ఇక్కడే జరగనుంది. -
నిప్పులు చెరిగిన పాక్ బౌలర్లు.. 140 పరుగులకే ఆసీస్ ఆలౌట్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చేరిగారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా పాక్ బౌలర్ల దాటికి 31.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. షాహీన్ షా అఫ్రిది, నసీం షా తలా మూడు వికెట్లతో కంగారుల పతనాన్ని శాసించగా, హారిస్ రౌఫ్ రెండు, హస్నన్ ఒక వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో ఆల్‌రౌండర్ సీన్ అబాట్(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌కు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు రెగ్యూలర్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్ వుడ్ అందుబాటులో లేరు. వీరిందరూ భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపికైన నేపథ్యంలో ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండడానికి ఈ ఆఖరి వన్డేకు దూరమయ్యారు. కాగా ఈ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే సిరీస్ వారి వశమవుతుంది.చదవండి: CK Nayudu Trophy: ఊచకోత.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు! 46 ఫోర్లు, 8 సిక్స్‌లతో Congratulations to pakistan winning series against australia.All World class field. Most hyped team Australia in the world 😁 #PAKvsAUSpic.twitter.com/AiwacybfvT— JassPreet (@JassPreet96) November 10, 2024 -
Aus Vs Pak: 5 వికెట్లతో చెలరేగిన పాక్ పేసర్.. కుప్పకూలిన ఆసీస్! ఇమ్రాన్ రికార్డు బ్రేక్
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో పాకిస్తాన్ బౌలర్లు అదరగొట్టారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి కంగారూ జట్టును కోలుకోని దెబ్బకొట్టారు. పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్ల వికెట్లు తీసి శుభారంభం అందించగా.. మరో ఫాస్ట్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఏకంగా ఐదు వికెట్లు కూల్చి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. షాహిన్, రవూఫ్ దెబ్బకు కమిన్స్ బృందం కనీసం 200 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా మెల్బోర్న్ వేదికగా సోమవారం తొలి వన్డే జరుగగా.. ఆతిథ్య ఆసీస్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో ఆసీస్- పాక్ మధ్య శుక్రవారం నాటి రెండో వన్డేకు అడిలైడ్ వేదికగా మారింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ నమ్మకాన్ని నిలబెడుతూ షాహిన్ ఆఫ్రిది ఆసీస్ ఓపెనర్లు మాథ్యూ షార్ట్(19), జేక్ ఫ్రేజర్ మెగర్క్(13)లను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.ఐదు కీలక వికెట్లు అతడి సొంతంవన్డౌన్లో వచ్చిన స్టీవ్ స్మిత్(35) క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. హస్నైన్ అతడిని అవుట్ చేశాడు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హ్యారిస్ రవూఫ్ జోస్ ఇంగ్లిస్(18), మార్నస్ లబుషేన్(6), ఆరోన్ హార్డీ(14), గ్లెన్ మాక్స్వెల్(16), ప్యాట్ కమిన్స్(13) రూపంలో ఐదు కీలక వికెట్లు దక్కించుకున్నాడు. The man of the moment #AUSvPAK pic.twitter.com/t0UJ3iZJLh— cricket.com.au (@cricketcomau) November 8, 2024 మరోవైపు.. టెయిలెండర్లలో మిచెల్ స్టార్క్(1)ను షాహిన్ అవుట్ చేయగా.. ఆడం జంపా (18) కాసేపు పోరాడగా నసీం షా అతడిని బౌల్డ్ చేసి పని పూర్తి చేశాడు.Vintage Smith 👌#AUSvPAK pic.twitter.com/PWKlbk4NgK— cricket.com.au (@cricketcomau) November 8, 2024 ఈ క్రమంలో 35 ఓవర్లకే ఆస్ట్రేలియా కథ ముగిసింది. కేవలం 163 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక ఆసీస్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేదిస్తుందా? లేదంటే తొలి వన్డే మాదిరి ఈసారీ మ్యాచ్‌ను చేజార్చుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్‌తో రెండో వన్డేలో హ్యారిస్ రవూఫ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. షాహిన్ ఆఫ్రిది మూడు, నసీం షా, మహ్మద్ హస్నైన్ ఒక్కో వికెట్ తీశారు.చరిత్ర సృష్టించిన హ్యారిస్ రవూఫ్.. పాక్ తరఫున తొలి పేసర్గాఆసీస్తో రెండో వన్డేలో ఐదు వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ హ్యారిస్ రవూఫ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అడిలైడ్‌లో వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మొట్టమొదటి పాకిస్తాన్ పేసర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాక్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రం, ఇమ్రాన్ ఖాన్ పేరిట ఉన్న రికార్డును రవూఫ్ బద్దలు కొట్టాడు.ఇక అడిలైడ్‌లో అంతకు ముందు స్పిన్నర్ సక్లెయిన్ ముస్తాక్ వన్డేల్లో ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ పాక్ తరఫున ఈ ఘనత నమోదు చేసిన మొదటి బౌలర్‌గా కొనసాగుతున్నాడు.అడిలైడ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన పాక్ బౌలర్లుహ్యారిస్ రవూఫ్- 5/29*సక్లెయిన్ ముస్తాక్- 5/29ఇజాజ్ ఫాకిహ్- 4/43ఇమ్రాన్ ఖాన్-3/19షాహిన్ ఆఫ్రిది- 2/24.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
చరిత్ర సృష్టించిన అఫ్గాన్ యువ సంచలనం.. ప్రపంచంలోనే?
షార్జా క్రికెట్ గ్రౌండ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో 92 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చారిత్రత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఘజన్ఫర్ స్పిన్ ఉచ్చులో చిక్కుకుని బంగ్లా బ్యాటర్లు విల్లవిల్లాడారు.ఈ మ్యాచ్‌లో 6.3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన ఘజన్ఫర్ కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఘజన్ఫర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ఘజన్ఫర్ సాధించిన రికార్డులు ఇవే..👉వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో అఫ్గానిస్తాన్ బౌలర్‌గా 18 ఏళ్ల ఘజన్ఫర్ నిలిచాడు. ఈ జాబితాలో రషీద్ ఖాన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2018లో గ్రాస్ ఐలెట్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 18 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.👉అంతర్జాతీయ వన్డేల్లో 6 వికెట్ల ఘనత సాధించిన మూడో అత్యంత పిన్న వయష్కుడిగా ఘజన్ఫర్ రికార్డులకెక్కాడు. ఈ అఫ్గానీ 18 సంవత్సరాల 231 రోజుల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజం వకార్ యూనిస్(18 సంవత్సరాల 164 రోజులు) అగ్రస్ధానంలో ఉండగా, రషీద్ ఖాన్(18 సంవత్సరాల 174 రోజులు) రెండో స్ధానంలో ఉన్నాడు.👉అదే విధంగా బంగ్లాదేశ్-అఫ్గాన్ వన్డేల్లో గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా కూడా ఘజన్‌ఫన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ షకీబ్ అల్హసన్ పేరిట ఉండేది. 2019లో సౌతాంప్టన్‌లో అఫ్గాన్‌తో జరిగిన వన్డేల్లో షకీబ్ 29 పరుగులిచ్చి 5 వికెట్ల పడగొట్టాడు. తాజా మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టిన ఘజన్‌ఫన్.. షకీబ్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. From 132/3 to 143 all out! 🤯Bangladesh have just been routed by the spin wizardry of AM Ghazanfar! 🪄#AFGvBANonFanCode pic.twitter.com/vLUXe6Xc56— FanCode (@FanCode) November 6, 2024 -
WI Vs ENG: కెప్టెన్‌తో గొడవ.. మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన విండీస్ స్టార్ ప్లేయర్
బ్రిడ్జ్‌టౌన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయ భేరి మ్రోగించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో విండీస్ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోషఫ్ కెప్టెన్ షాయ్ హోప్‌తో విభేదాల కారణంగా మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి డగౌట్‌కు వెళ్లిపోయాడు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు.అసలేం జరిగిందంటే?ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ హోప్ తొలుత ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం దక్కలేదు. 3 ఓవర్లోనే విల్ జాక్స్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. దీంతో ఫస్ట్‌డౌన్‌లో యువ ఆటగాడు జోర్డాన్ కాక్స్ క్రీజులోకి వచ్చాడు. కాక్స్‌కు ఇద్దర్ స్లిప్ ఫీల్డర్లను విండీస్ కెప్టెన్ సెట్ చేశాడు. అయితే ఈ ఫీల్డ్ ప్లేస్మెంట్ నాలుగో ఓవర్ వేసేందుకు వచ్చిన జోషఫ్‌కు నచ్చలేదు. దీంతో హోప్‌తో జోషఫ్ వాగ్వాదానికి దిగాడు. అతడితో గొడవ పడుతూనే ఓవర్‌ను జోషఫ్ కొనసాగించాడు.ఆ ఓవర్లో నాలుగో బంతికి కాక్స్‌ను జోషఫ్ ఔట్ చేశాడు. జోషఫ్ వికెట్ సాధించినప్పటకి కనీసం సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. సహచర ఆటగాళ్లు తన దగ్గరకి వచ్చినప్పటకి జోషఫ్ మాత్రం సీరియస్‌గా హోప్‌తో తన వాగ్వాదాన్ని కొనసాగించాడు.అంతటితో ఆగని జోషఫ్ తన ఓవర్ పూర్తి కాగానే మైదానం విడిచిపెట్టి డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కోచ్ సామీతో సంప్రదింపులు జరిపిన తర్వాత జోషఫ్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: IND vs AUS: రాహుల్ నీవు మారవా? ఎక్కడకి వెళ్లినా అంతేనా?Gets angry! 😡Bowls a wicket maiden 👊Leaves 🤯An eventful start to the game for Alzarri Joseph! 😬#WIvENGonFanCode pic.twitter.com/2OXbk0VxWt— FanCode (@FanCode) November 6, 2024 -
కింగ్, కార్టీ విధ్వంసకర సెంచరీలు.. ఇంగ్లండ్‌పై విండీస్ ఘన విజయం
బార్బోడస్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో విండీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది.ఇంగ్లీష్ జట్టు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మోస్లీ(57), సామ్ కుర్రాన్(40), ఆర్చర్(38) పరుగులతో రాణించారు. కరేబియన్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డే 3 వికెట్లు పడగొట్టగా.. జోషఫ్, షెఫార్డ్ తలా రెండు వికెట్లు సాధించారు.కింగ్, కార్టీ ఊచకోత.. అనంతరం 264 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 43 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో వెస్టిండీస్ ఆటగాళ్లు కార్టీ(114 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లు, 128 నాటౌట్), బ్రాండెన్ కింగ్(117 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 102) విధ్వంసకర సెంచరీలతో చెలరేగారు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లీ, ఓవర్టన్ తలా వికెట్ మాత్రమే సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ నవంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs AUS: రాహుల్ నీవు మారవా? ఎక్కడకి వెళ్లినా అంతేనా? -
BAN Vs AFG: ఘజన్ఫర్ మాయాజాలం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్ జట్టు...బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి పోరులో అఫ్గానిస్తాన్ 92 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 49.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది.ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ (79 బంతుల్లో 84; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించగా... కెపె్టన్ హష్మతుల్లా షాహిది (92 బంతుల్లో 52; 2 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. గుర్బాజ్ (5), రహమత్ షా (2), అజ్మతుల్లా (0) విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తఫిజుర్, తస్కిన్ అహ్మద్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 34.3 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ అల్లా మొహమ్మద్ ఘజన్ఫర్ 26 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను దెబ్బ కొట్టాడు.బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజుమల్ హోస్సేన్ షాంటో (68 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ నిలిచాడు. సౌమ్య సర్కార్ (33), మిరాజ్ (28) మినహా ఇతర బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. తంజీద్ హసన్ (3), మహ్ముదుల్లా (2), ముష్పికర్ (1), రిషాద్ (1), తౌహిద్ (11) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు. ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడే రెండో వన్డే జరగనుంది.చదవండి: టాప్–20 నుంచి కోహ్లి, రోహిత్ అవుట్ -
కివీస్‌తో సిరీస్‌లకు లంక జట్ల ప్రకటన.. వాళ్లకు మరోసారి మొండిచేయి
న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై కివీస్‌తో టీ20, వన్డేలకు పదిహేడు మందితో కూడిన జట్లను ఎంపిక చేసినట్లు తెలిపింది. చరిత్ అసలంక వన్డే జట్టుకు సారథిగా కొనసాగనుండగా.. మాజీ కెప్టెన్ దసున్ షనకకు ఈ జట్టులో స్థానం లభించలేదు.వారికి మొండిచేయిఇక వరల్డ్‌కప్-2023 తర్వాత కుశాల్ పెరీరా తొలిసారిగా వన్డే జట్టులో చోటు దక్కించుకోగా.. మహ్మద్ షిరాజ్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. మరోవైపు.. షనకతో పాటు పేసర్ దుష్మంత చమీరాకు మరోసారి మొండిచేయి ఎదురుకాగా.. భనుక రాజపక్స కూడా జట్టుతో కొనసాగనున్నాడు.టీమిండియా, విండీస్లపై వరుస సిరీస్ విజయాలుకాగా చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత శ్రీలంక వన్డేల్లో అద్వితీయ విజయాలు సాధించింది. స్వదేశంలో తొలుత టీమిండియాను 2-1తో చిత్తు చేసి సిరీస్ గెలుచుకున్న లంక.. తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్‌లోనూ ఇదే ఫలితం పునరావృతం చేసింది.ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ సత్తా చాటేందుకు అసలంక బృందం సిద్ధమైంది. కాగా ఇటీవల శ్రీలంకలో పర్యటించిన న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైన విషయం తెలిసిందే. అయితే, వెంటనే ఇండియా టూర్లో 3-0తో ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేసి చారిత్రాత్మక విజయం సాధించింది.ఇప్పుడు మరోసారి పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు కివీస్ జట్టు శ్రీలంకకు తిరిగి రానుంది. ఇందులో భాగంగా రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. నవంబరు 8, 10 తేదీల్లో లంక- కివీస్ మధ్య టీ20లకు డంబుల్లా ఆతిథ్యం ఇవ్వనుండగా.. నవంబరు 13, 17, 19 తేదీల్లో వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.న్యూజిలాండ్‌తో వన్డేలకు శ్రీలంక జట్టుచరిత్ అసలంక (కెప్టెన్), అవిష్క ఫెర్నాండో, పాతుమ్ నిసాంకా, కుశాల్ జనిత్ పెరీరా, కుశాల్ మెండిస్, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, సదీర సమరవిక్రమ, నిషాన్ మదుష్క, దునిత్ వెల్లలగే, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిదు విక్రమసింఘే, అసితా ఫెర్నాండో, దిల్షాన్ మదుశంక, మహ్మద్ షిరాజ్. న్యూజిలాండ్‌తో టీ20లకు శ్రీలంక జట్టుచరిత్ అసలంక, పాతుమ్ నిసాంకా, కుశాల్ మెండిస్, కుశాల్ జనిత్ పెరీరా, కమిందు మెండిస్, దినేష్ చండీమాల్, అవిష్కా ఫెర్నాండో, భనుక రాజపక్స, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, జెఫ్రీ వాండర్సే, చమిదు విక్రమసింఘే, నువాన్ తుషార, మతీషా పతిరానా, బినూరా ఫెర్నాండో, అసితా ఫెర్నాండో.చదవండి: Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే -
Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే
పాకిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమించింది. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్‌కు తొలిసారిగా సారథ్య బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. పాక్‌తో మూడో వన్డేకు కూడా ఇంగ్లిస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.కాగా ఆస్ట్రేలియా ప్రస్తుతం స్వదేశంలో పాకిస్తాన్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా నవంబరు 4- నవంబరు 18 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్గాఇక శుక్రవారం(నవంబరు 8) అడిలైడ్ వేదికగా ఆసీస్- పాక్ మధ్య రెండో వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం కీలక ప్రకటన చేసింది. పాక్‌తో ఆఖరి వన్డేతో పాటు.. టీ20 సిరీస్‌కు జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపింది.ప్యాట్ కమిన్స్ అందుకే దూరంకాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే.. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఇరుజట్లకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో పాక్‌తో రెండో వన్డే ముగిసిన తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ తదితరులు జట్టుకు దూరం కానున్నారు.వీరంతా భారత్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్ధం కానున్నారు. ఇక వీరి గైర్హాజరీ నేపథ్యంలో పేసర్లు స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్, వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ వన్డే జట్టుతో చేరనున్నారు. ఇదిలా ఉంటే.. జోష్ ఇంగ్లిస్‌కు గతంలో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది.వన్డేల్లో 30వ సారథిగాఅయితే, సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక కావడం మాత్రమ ఇదే మొదటిసారి. ఇక తాజా నియామకంతో ఆస్ట్రేలియా జట్టుకు వన్డేల్లో 30వ, టీ20లకు పద్నాలుగో కెప్టెన్‌గా ఇంగ్లిస్ చరిత్రకెక్కనున్నాడు. ఇంగ్లిస్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలడనే నమ్మకం తమకు ఉందని ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ పేర్కొన్నాడు. అదే విధంగా.. జట్టులోని సీనియర్లు ఆడం జంపా, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్ నుంచి ఇంగ్లిస్‌కు పూర్తి సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఆసీస్ టీ20 రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ పాక్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.పాకిస్తాన్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్ - మొదటి రెండు మ్యాచ్‌లకు), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్ - మూడవ మ్యాచ్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్ (మూడవ మ్యాచ్ మాత్రమే), కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్ (రెండవ మ్యాచ్ మాత్రమే), స్పెన్సర్ జాన్సన్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మార్నస్ లబుషేన్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే), గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జోష్ ఫిలిప్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే మాత్రమే), మిచెల్ స్టార్క్ (తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే), మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా.పాకిస్తాన్‌తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టుసీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా. -
Aus vs Pak: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. మెల్బోర్న్ వేదికగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచింది. పాకిస్తాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా.. ఆసీస్ గెలుపు కోసం కష్టపడాల్సి వచ్చింది.చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియాపాక్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని(204) ఛేదించే క్రమంలో 167 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఓవర్ ఓవర్‌కు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకు అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ గెలుపుతో ఆసీస్ చరిత్ర సృష్టించింది.వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్‌తో ఆడిన తక్కువ మ్యాచ్‌లలోనే.. ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు పాక్‌తో 109 మ్యాచ్‌లు ఆడిన కంగారూ జట్టు 71 మ్యాచ్‌లలో జయభేరి మోగించింది. ఇక ఈ జాబితాలో వెస్టిండీస్ రెండోస్థానంలో ఉంది. ఆసీస్‌తో సమానంగా 71సార్లు పాక్‌పై గెలుపొందినప్పటికీ.. మ్యాచ్‌ల పరంగా ఆసీస్ కంటే వెనుకబడింది.రిజ్వాన్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమికాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా సోమవారం(నవంబరు 4) ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. పాక్ వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు ఇదే తొలి మ్యాచ్.ఇక మెల్బోర్న్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ చేసింది. మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో రాణించగా.. కమిన్స్ రెండు, ఆడం జంపా రెండు, లబుషేన్, సీన్ అబాట్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో పాక్ 46.4 ఓవర్లలో కేవలం 203 పరుగులే చేసింది.నసీం షా బ్యాట్ ఝులిపించినాపాక్ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టెయిలెండర్ నసీం షా 40 రన్స్‌తో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ ఆతిథ్య ఆసీస్ కమిన్స్ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడంతో 33.3 ఓవర్లలో పనిపూర్తి చేసింది. పాక్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్లు షఫీక్(12), సయీమ్ ఆయుబ్(1) సహా 19 బంతుల్లోనే 24 రన్స్ చేసిన షాహిన్ ఆఫ్రిదిని అవుట్ చేసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను అతడు దెబ్బకొట్టాడు. పాకిస్తాన్‌పై వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లుఆస్ట్రేలియా- 71 (109 మ్యాచ్‌లు)వెస్టిండీస్- 71 (137 మ్యాచ్‌లు)శ్రీలంక- 59 (157 మ్యాచ్‌లు)ఇంగ్లండ్- 57 (92 మ్యాచ్‌లు)ఇండియా- 57 (135 మ్యాచ్‌లు)ఆసీస్ వర్సెస్ పాక్ తొలి వన్డే - ప్లేయింగ్ ఎలెవన్ఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.పాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, ఆఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.చదవండి: ICC: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలకు భారత్ ఆతిథ్యం