న్యూఢిల్లీ: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాల్సిందిగా అతను కోరినట్లు సమాచారం. ‘ఆ్రస్టేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత రాహుల్ విరామం కోరుకుంటున్నాడు. అందుకే ఈ సిరీస్‌కు తన పేరును పరిగణనలోకి తీసుకోవద్దని అతను చెప్పాడు.
అయితే చాంపియన్స్ ట్రోఫీ కోసం మాత్రం తాను అందుబాటులో ఉంటానని రాహుల్ స్పష్టం చేశాడు’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఆసీస్‌తో ఐదు టెస్టులూ ఆడిన రాహుల్ 10 ఇన్నింగ్స్‌లలో 2 అర్ధసెంచరీలతో 276 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.
చాంపియన్స్ ట్రోఫీకి తాను సిద్ధమని చెప్పినా... వన్డే జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ స్థానం కోసం పంత్, సంజు సామ్సన్‌ల నుంచి అతను పోటీని ఎదుర్కొంటున్నాడు. మరోవైపు కర్ణాటక జట్టు ఆడే విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కూ తాను అందుబాటులో ఉండనని రాహుల్ ఇప్పటికే సమాచారం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment