ముంబై: 2023 నుంచి చూస్తే 28 మ్యాచ్‌లలో 22.7 సగటుతో 47 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ కూడా చాలా మెరుగ్గా (5.41) ఉంది. ఎలా చూసినా ఇది చెప్పుకోదగ్గ ప్రదర్శనే. సిరాజ్ చాలా వరకు నిలకడగా రాణించాడు. అతను మరీ ఘోరంగా విఫలమైన మ్యాచ్‌లు కూడా అరుదు. అయినా సరే...నలుగురు స్పిన్నర్లతో ఆడాలనే టీమిండియా ప్రణాళికల కారణంగా అతనికి చోటు దక్కలేదు.కెప్టెన్ రోహిత్ శర్మ మాటల్లో చెప్పాలంటే ఆరంభ ఓవర్లలో కొత్త బంతితో చెలరేగినంతగా సిరాజ్ చివర్లో ఆకట్టుకోలేకపోతున్నాడు.
బంతి పాతబడిన కొద్దీ అతని ప్రభావం తగ్గుతోంది. ఇప్పటికే టి20ల్లో తనను తాను నిరూపించుకోవడంతో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఆకట్టుకున్న అర్ష్‌దీప్ సింగ్‌పై సెలక్టర్లు నమ్మకముంచారు. ఎడమచేతి వాటం బౌలర్ కావడం అతనికి మరో అదనపు అర్హతగా మారింది. ‘ఆరంభంలో, చివర్లో కూడా బాగా బౌలింగ్ చేయగలిగే ఆటగాడు మాకు కావాలి. కొత్త బంతితో షమీ ఏం చేయగలడో అందరికీ తెలుసు. చివర్లో ఆ బాధ్యతఅర్ష్‌దీప్ తీసుకోగలడు. సరిగ్గా ఇక్కడే సిరాజ్ ప్రభావం తగ్గుతూ వస్తోంది.
అతను కొత్త బంతితో తప్ప చివర్లో ఆశించిన ప్రదర్శన ఇవ్వడం లేదు. దీనిపై మేం చాలా సుదీర్ఘంగా చర్చించాం. ఆల్‌రౌండర్లు కావాలి కాబట్టి ముగ్గురు పేసర్లనే తీసుకున్నాం. సిరాజ్ లేకపోవడం దురదృష్టకరమే కానీ కొన్ని రకాల బాధ్యతల కోసం కొందరిని తీసుకొని మరికొందరిని పక్కన పెట్టక తప్పదు’ అని రోహిత్ వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment