వెస్టిండీస్ క్రికెటర్ అమిర్ జాంగూ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే అరంగేట్రంలోనే అత్యంత వేగంగా శతకం బాదిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో మూడో వన్డే సందర్భంగా ఈ ఫీట్ నమోదు చేశాడు.
సొంతగడ్డపై సెయింట్ కిట్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడింది వెస్టిండీస్. ఇందులో భాగంగా తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన ఆతిథ్య జట్టు.. రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
ఇక వార్నర్ పార్క్ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది.
అదరగొట్టిన మహ్మదుల్లా
సౌమ్య సర్కార్(73) హాఫ్ సెంచరీతో రాణించగా.. మెహదీ హసన్ మిరాజ్(77) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మహ్మదుల్లా 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అతడితో కలిసి జాకర్ అలీ(62*) ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు, గుడకేశ్ మోటీ, షెర్ఫానే రూథర్‌ఫర్డ్ ఒక్కో వికెట్ తీశారు.
అమిర్ జాంగూ ఆకాశమే హద్దుగా
ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ ఆదిలోనే ఓపెనర్లు బ్రాండన్ కింగ్(15), అలిక్ అథనాజ్(7) వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ షాయీ హోప్(3) పూర్తిగా విఫలం కాగా.. షెర్ఫానే రూథర్‌ఫర్డ్(30) కూడా నిరాశపరిచాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ జట్టును ఆదుకున్నాడు.
ఫాస్టెస్ట్ సెంచరీ..
మొత్తంగా 88 బంతులు ఎదుర్కొన్న కార్టీ 95 పరుగులతో రాణించగా.. అతడికి జతైన అరంగేట్ర బ్యాటర్ అమిర్ జాంగూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 80 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. కార్టీతో కలిసి ఐదో వికెట్‌కు 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన 27 ఏళ్ల ఈ లెఫ్టాండర్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 104 పరుగుల సాధించాడు. గుడకేశ్ మోటీ(31 బంతుల్లో 44 నాటౌట్)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కార్టీ, జాంగూ, గుడకేశ్ విజృంభణ కారణంగా వెస్టిండీస్ 45.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్లు నష్టపోయి 325 పరుగులు సాధించి.. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది. అమిర్ జాంగూ ‘ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్’, రూథర్‌ఫర్డ్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నారు.
రీజా హెండ్రిక్స్ ప్రపంచ రికార్డు బద్దలు
కాగా ట్రినిడాడ్‌కు చెందిన అమిర్ జాంగూకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే తొలి మ్యాచ్. బంగ్లాదేశ్‌తో మూడో వన్డే సందర్భంగా అతడు అరంగేట్రం చేశాడు. వచ్చీ రాగానే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి.. సౌతాఫ్రికా స్టార్ రీజా హెండ్రిక్స్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును జాంగూ బద్దలు కొట్టాడు.
ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 18వ క్రికెటర్‌గా నిలిచాడు. ఇక వన్డే అరంగేట్రంలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఇంగ్లండ్ బ్యాటర్ డెనిస్ అమీ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియా మీద 134 బంతుల్లో అతడు 103 పరుగుల సాధించాడు.
వన్డే అరంగేట్రంలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన టాప్-5 క్రికెటర్లు
1. అమిర్ జాంగూ(వెస్టిండీస్)- బంగ్లాదేశ్ మీద- 83 బంతుల్లో 104* రన్స్
2. రీజా హెండ్రిక్స్(సౌతాఫ్రికా)- శ్రీలంక మీద- 89 బంతుల్లో 102 రన్స్
3. కేఎల్ రాహుల్(ఇండియా)- జింబాబ్వే మీద- 115 బంతుల్లో 100* రన్స్
4. మార్క్ చాప్‌మన్(హాంగ్‌కాంగ్)- యూఏఈ మీద- 116 బంతుల్లో 124* రన్స్
5. మైకేల్ లాంబ్(ఇంగ్లండ్)- వెస్టిండీస్ మీద- 117 బంతుల్లో 106 రన్స్.
చదవండి: నా పరిస్థితి బాలేదు.. తాగడం మానేశాను.. వారి సాయం తీసుకుంటా: వినోద్ కాంబ్లీ
An unforgettable moment on debut!🔥
Amir Jangoo takes today's CG United Moment of the Match!👏🏾#WIvBAN #MatchMoment #WIHomeForChristmas pic.twitter.com/TzNnmWvHwG— Windies Cricket (@windiescricket) December 12, 2024
Amazing Amir! 🙌
A century on debut, only the second West Indian to do so.#WIvBAN | #WIHomeForChristmas pic.twitter.com/UGWGBiNNmm— Windies Cricket (@windiescricket) December 12, 2024
Comments
Please login to add a commentAdd a comment