వన్డేల్లో ‘ఫాస్టెస్ట్ సెంచరీ’ బాదిన స్మృతి మంధాన(PC: BCCI)
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో తక్కువ బంతుల్లోనే శతకం బాదిన(Women's ODI Fastest Century) భారత తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సాధించింది. ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా స్మృతి మంధాన ఈ ఘనత సాధించింది. అంతేకాదు.. మహిళల వన్డే క్రికెట్‌లో పది సెంచరీలు పూర్తి చేసుకుని మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది.
కెప్టెన్‌గా, బ్యాటర్‌గా స్మృతి అదుర్స్
ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు.. భారత్(India Women Vs Ireland Women)లో పర్యటిస్తోంది. ఈ మూడు వన్డేల సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ దూరం కాగా.. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఈ క్రమంలో కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ స్మృతి అద్బుత ప్రదర్శన కనబరుస్తోంది.
రాజ్‌కోట్ వేదికగా సాగుతున్న ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలు గెలిచిన టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లలో స్మృతి వరుసగా 41, 73 పరుగులు సాధించి.. గెలుపులో తన వంతు పాత్ర పోషించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం జరుగుతున్న మూడో వన్డేలోనూ స్మృతి సూపర్ ఫామ్‌ను కొనసాగించింది.
వుమెన్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన శతక్కొట్టారు. స్మృతి 70 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. వుమెన్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన తొలి ఇండియన్‌గా నిలిచింది. అంతేకాదు.. వన్డేల్లో పది సెంచరీలు సాధించిన భారత తొలి మహిళా క్రికెటర్‌గా, ఓవరాల్‌గా నాలుగో ప్లేయర్‌గా చరిత్రకెక్కింది.
Led from the front and how 👏👏
What a knock THAT 🙌
Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/4dQVq6JTRm— BCCI Women (@BCCIWomen) January 15, 2025
ఇక స్మృతి మొత్తంగా ఈ మ్యాచ్‌లో 80 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్ ఓర్లా ప్రెండెర్‌గాస్ట్ బౌలింగ్‌లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. అవా కానింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది.
వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు
ఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌తో మూడో వన్డేలో మరో ఓపెనర్ ప్రతికా రావల్ భారీ శతకంతో మెరిసింది. 129 బంతులు ఎదుర్కొని 154 పరుగులు సాధించింది. ప్రతికా ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం. మిగతా వాళ్లలో రిచా ఘోష్ 59 పరుగులతో రాణించగా.. తేజల్ హెసాబ్నిస్ 28, హర్లీన్ డియోల్ 14 రన్స్ చేశారు.
ఇక జెమీమా 4, దీప్తి శర్మ 11 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 435 పరుగులు స్కోరు చేసింది. భారత్ తరఫున మహిళా, పురుష క్రికెట్‌లో వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
మహిళల వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన భారత ప్లేయర్లు
1. స్మృతి మంధాన- ఐర్లాండ్ వుమెన్స్‌పై- రాజ్‌కోట్(2025)లో- 70 బంతుల్లో శతకం
2.హర్మన్‌ప్రీత్ కౌర్- సౌతాఫ్రికా వుమెన్స్‌పై- బెంగళూరు(2024)లో- 87 బంతుల్లో శతకం
3. హర్మన్‌ప్రీత్ కౌర్- ఆస్ట్రేలియా వుమెన్స్‌పై- డెర్బీ(2017)లో- 90 బంతుల్లో శతకం
4. జెమీమా రోడ్రిగ్స్- ఐర్లాండ్ వుమెన్స్‌పై- రాజ్‌కోట్(2025)లో- 90 బంతుల్లో శతకం
5. హర్లీన్ డియోల్- వెస్టిండీస్ వుమెన్స్‌పై- వడోదర(2024)లో- 98 బంతుల్లో శతకం.
మహిళల వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లు
మెగ్ లానింగ్- 15
సుజీ బేట్స్- 13
టామీ బీమౌంట్- 10
స్మృతి మంధాన- 10
చమరి ఆటపట్టు- 9
చార్లెట్ ఎడ్‌వర్డ్స్- 9
నాట్ సీవర్ బ్రంట్- 9.
MAXIMUM x 2⃣
Captain Smriti Mandhana's elegance on display here in Rajkot!
Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/wMlnuoUWIr— BCCI Women (@BCCIWomen) January 15, 2025
చదవండి: పంత్ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలా: డీడీసీఏ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment