fastest century
-
ఫాస్టెస్ట్ సెంచరీ
లంక ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో మూడు రోజుల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలైంది. జులై 7న కొలొంబో స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డంబుల్లా సిక్సర్స్ ఆటగాడు కుశాల్ పెరీరా 50 బంతుల్లో శతక్కొట్టగా.. ఇవాళ (జులై 10 అదే కొలొంబో స్ట్రయికర్స్పై జాఫ్నా కింగ్స్ ఆటగాడు రిలీ రొస్సో 44 బంతుల్లో సెంచరీ చేశాడు. జాఫ్నాతో జరిగిన మ్యాచ్‌లో రొస్సో 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు (నాటౌట్) చేశాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో ఇది మూడో అత్యధిక స్కోర్ కూడా కావడం విశేషం. రొస్సో పేరిట పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కూడా ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదై ఉండటం మరో విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కొలొంబో.. గ్లెన్ ఫిలిప్స్ (32 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కొలొంబో ఇన్నింగ్స్‌లో ఏంజెలో పెరీరా (34), రహ్మానుల్లా గుర్బాజ్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జాఫ్నా బౌలర్లలో అజ్మతుల్లా, అశిత ఫెర్నాండో చెరో 2 వికెట్లు.. మధుషన్, షంషి, ఫేబియన్ అలెన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జాఫ్నా.. రిలీ రొస్సో మెరుపు శతకంతో విజృంభించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాఫ్నా ఇన్నింగ్స్‌లో రొస్సోతో పాటు చరిత్ అసలంక (58) రాణించారు. కొలొంబో బౌలర్లలో వెల్లలగే, తస్కిన్ అహ్మద్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీశారు. -
టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. కేవలం 27 బంతుల్లోనే.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు
టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ 27 బంతుల్లోనే శతక్కొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది వేగవంతమైన శతకం. పురుషులు, మహిళలు, అంతర్జాతీయ స్థాయి.. ఇలా ఏ విభాగంలో చూసినా ఇదే వేగవంతమైన సెంచరీ. అంతర్జాతీయ టీ20ల్లో నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాప్టీ ఈటన్ నమోదు చేసిన ఫాస్టెస్ట్ సెంచరీని సాహిల్ చౌహాన్ కేవలం నాలుగు నెలల్లో బద్దలు కొట్టాడు. లాఫ్టీ ఈటన్ ఈ ఏడాది (2024) ఫిబ్రవరి 27న నేపాల్‌పై 33 బంతుల్లో శతక్కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో సాహిల్ సెంచరీకి ముందు ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20 ఫార్మాట్ మొత్తంలో చూసినా ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. సాహిల్‌కు ముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 2013 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడుతూ పూణే వారియర్స్‌పై 30 బంతుల్లో శతక్కొట్టాడు. తాజాగా సాహిల్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. సైప్రస్‌తో మ్యాచ్‌లో ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న సాహిల్ 144 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 18 సిక్సర్లు ఉన్నాయి. పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో (ఓ ఇన్నింగ్స్‌లో) ఓ బ్యాటర్ సాధించిన అత్యధిక సిక్సర్లు ఇవే. సాహిల్ సునామీ శతకంతో విరుచుకుపడటంతో సైప్రస్‌పై ఎస్టోనియా ఘన విజయం సాధించింది. -
అభిషేక్ శర్మ ఊచకోత.. 26 బంతుల్లో శతకం.. 14 సిక్సర్లతో విధ్వంసం
ఐపీఎల్ 2024 సెన్సేషన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించాడు. గురుగ్రామ్‌లో జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో అభిషేక్ 26 బంతుల్లో శతక్కొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. స్థానికంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అభిషేక్ పంటర్స్ అనే క్లబ్‌కు ప్రాతనిథ్యం వహిస్తూ.. ప్రత్యర్థి మారియో క్రికెట్ క్లబ్‌ను షేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 26 బంతులు ఎదుర్కొని 14 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. అభిషేక్ సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో అతని జట్టు పంటర్స్.. ప్రత్యర్థిపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లో జరిగిన ఫ్రెండ్షిప్ సిరీస్‌లో నిన్న పంటర్స్-మారియో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మారియో టీమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కృనాల్ సింగ్ (21 బంతుల్లో 60), నదీమ్ ఖాన్ (32 బంతుల్లో 74) చెలరేగడంతో మారియో టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 249 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓ ఓవర్ బౌల్ చేసిన అభిషేక్ 13 పరుగులు సమర్పించుకున్నాడు.అనంతరం 250 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అభిషేక్ టీమ్ (పంటర్స్) 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన అభిషేక్.. మారియో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎడాపెడా సిక్సర్లు బాది మారియో టీమ్ బౌలర్ల భరతం పట్టాడు. ఫలితంగా పంటర్స్ టీమ్ మరో 11 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. పంటర్స్ తరఫున అభిషేక్‌తో పాటు పునీత్ (21 బంతుల్లో 52), లక్షయ్ (29 బంతుల్లో 44 నాటౌట్) రాణించారు.కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. యూవీ మెంటార్షిప్లో అభిషేక్ గత ఐపీఎల్ సీజన్లో అద్భుతాలు చేశాడు. గత సీజన్లో అభిషేక్ 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో 400 పరుగులు చేసి సన్‌రైజర్స్‌ను ఫైనల్స్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. -
సొంత దేశాన్ని వీడి యూఎస్ఏకు ఆడనున్న ఫాస్టెస్ట్ సెంచరీ హీరో
వన్డేల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ (36 బంతుల్లో) సెంచరీ వీరుడు, న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ కోరె ఆండర్సన్ సొంత దేశాన్ని వీడి అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న యూఎస్ఏకు ఆడేందుకు సిద్దమయ్యాడు. త్వరలో కెనడాతో జరుగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం యూఎస్ఏ సెలెక్టర్లు ఆండర్సన్ ఎంపిక చేశారు. 2018 నవంబర్‌లో చివరిసారిగా న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆండర్సన్.. వ్యక్తిగత కారణాల చేత 2020లో యూఎస్ఏకు షిఫ్ట్ అయ్యాడు. అప్పటి నుంచి అక్కడే దేశవాలీ క్రికెట్ (మైనర్ లీగ్ క్రికెట్) ఆడుతూ ఐదేళ్ల నిరీక్షణ అనంతరం జాతీయ జట్టుకు ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. లోకల్ కేటగిరీలో మేజర్ లీగ్ క్రికెట్ ఆడే అవకాశం దక్కించుకున్న ఆండర్సన్.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ తరఫున మెరుగైన ప్రదర్శనలు చేశాడు. కెనడా సిరీస్ కోసం ఆండర్సన్‌తో పాటు మరికొందరు నాన్ ఆటగాళ్లు కూడా ఎంపికయ్యారు. భారత అండర్-19 ఫేమ్ హర్మీత్ సింగ్ యూఎస్ఏ దేశవాలీ టోర్నీలతో పాటు మేజర్ లీగ్ క్రికెట్లో సియాటిల్ ఆర్కాస్ తరఫున రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. హర్మీత్‌తో పాటు మరో భారత క్రికెటర్ కూడా యూఎస్ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఢిల్లీ మాజీ ఆటగాడు, ఐపీఎల్లో ఆర్సీబీ ప్లేయర్ మిలింద్ కుమార్ అక్కడి దేశవాలీ క్రికెట్లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. వీరితో పాటు కెనడా జాతీయ జట్టు మాజీ కెప్టెన్, భారత మూలాలున్న నితీశ్ కుమార్ కూడా యూఎస్ఏ జట్టుకు ఎంపికైన వారిలో ఉన్నారు. తాజాగా ప్రకటించిన యూఎస్ఏ జట్టులో భారత అండర్-19 మాజీ క్రికెటర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ బ్యాటర్ ఉన్ముక్త్ చంద్‌కు చోటు దక్కలేదు. ఉన్ముక్త్‌కు నితీశ్ కుమార్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అంతిమంగా సెలెక్టరు నితీశ్పైపే మొగ్గు చూపారు. కెనడా సిరీస్ కోసం ఎంపిక చేసిన యూఎస్ఏ జట్టు: మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), కోరె అండర్సన్, గజానంద్ సింగ్, జెస్సీ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, నిసర్గ్ పటేల్, స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్విక్, నోస్తుష్ కెంజిగే, మిలింద్ కుమార్, నితీష్ కుమార్, ఉస్మాన్ రఫిక్ -
రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు 11వ తరగతి మ్యాథ్స్ సిలబస్‌లో హిట్‌మ్యాన్ పేరిట ఉన్న 35 బంతుల టీ20 సెంచరీని పాఠ్యాంశంగా పొందుపరిచారు. రోహిత్ శతకాన్ని ఉదాహరణగా తీసుకుని గణిత శాస్త్రంలోని ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ కాన్సెప్ట్‌పై పలు ప్రశ్నలు అడిగారు. రోహిత్ క్రికెటింగ్ కెరీర్‌లోని ఘనతలను పాఠ్యాంశంగా పొందుపరచడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ ఓ అప్పర్ ప్రైమరీ స్కూల్ పాఠ్యపుస్తకంలో ఇతనికి సంబంధించిన అంశాలను పాఠ్యాంశంగా చేర్చారు. Captain Rohit Sharma featured in the 11th Class Maths Text book. 👌 pic.twitter.com/mSgDnHm6Ye — Johns. (@CricCrazyJohns) February 26, 2024 కాగా, పాఠ్యాంశంగా మారిన రోహిత్ టీ20 సెంచరీ 2017 డిసెంబర్లో చేసింది. ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన నాటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 35 బంతుల్లో 10 ఫోర్, 12 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. కొద్ది నెలల కిందటి వరకు ఇది అంతర్జాతీయ టీ20ల్లో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీగా చలామణి అయ్యింది. గతేడాది చివర్లో జరిగిన ఆసియా క్రీడల్లో నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా.. రోహిత్, డేవిడ్ మిల్లర్ పేరిట సంయుక్తంగా ఉండిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును చెరిపేశాడు. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో కుశాల్ 34 బంతుల్లోనే సెంచరీని బాదాడు. అయితే, కుశాల్ పేరిట ఈ రికార్డు ఎక్కువ రోజులు నిలబడలేదు. ఇవాళ (ఫిబ్రవరి 27) నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ కుశాల్ రికార్డును బద్దలు కొట్టాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో లాఫ్టీ కేవలం 33 బంతుల్లోనే శతక్కొట్టి, టీ20 ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. -
విల్ జాక్స్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్‌తో నిన్న (జనవరి 18) జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ ఓపెనర్, ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో జాక్స్ కేవలం 41 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి, లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. జాక్స్ రెచ్చిపోవడంతో ఈ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. Will Jacks is the King of Centurion 👑#Betway #SA20 #WelcomeToIncredible #PCvDSG pic.twitter.com/TvhnZcI3DN — Betway SA20 (@SA20_League) January 18, 2024 తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. జాక్స్ శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో జాక్స్‌తో పాటు కొలిన్ ఇంగ్రామ్ (23 బంతుల్లో 43), ఫిలిప్ సాల్ట్ (13 బంతుల్లో 23) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో రీస్ టాప్లే (4-1-34-3) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. జూనియర్ డాలా 2, కేశవ్ మహారాజ్, మార్కస్ స్టోయినిస్, కీమో పాల్, ప్రిటోరియస్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో తడబడిన సూపర్ జెయింట్స్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 187 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బ్యాట్‌తో విజృంభించిన విల్ జాక్స్.. బంతితోనూ (3-0-18-2) రాణించాడు. అతనితో పాటు వేన్ పార్నెల్ (2/54), విల్యోన్ (2/39), నీషమ్ (1/28) వికెట్లు తీశారు. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. డికాక్ (25), స్మట్స్ (27), కేశవ్ మహారాజ్ (25 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
IND VS AUS 3rd T20: మ్యాక్స్‌వెల్ ఊచకోత.. ఫాస్టెస్ట్ సెంచరీ
గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం బాదాడు. ఫలితంగా ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. రుతురాజ్ మెరుపు శతకం.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (6), ఇషాన్ కిషన్ (0) నిరాశపర్చగా.. సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (24 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) పర్వాలేదనిపించారు. కేన్ రిచర్డ్సన్, బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ పడగొట్టారు. మ్యాక్సీ ఊచకోత.. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. మ్యాక్స్‌వెల్ సునామీ శతకంతో చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఆరోన్ హార్డీ (16), జోష్ ఇంగ్లిస్ (10), మార్కస్ స్టోయినిస్ (17) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ట్రవిస్ హెడ్ (35) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో మ్యాక్స్‌వెల్.. మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సహకారంతో ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత బౌలర్లలో రవి భిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రసిద్ద్ కృష్ణ (4-0-68-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆఖరి బంతికి గెలిచిన ఆసీస్.. ఆసీస్ గెలవాలంటే చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కావడంతో భారత గెలుపు లాంఛనమే అని అంతా అనుకున్నారు. అయితే మ్యాక్సీ ఒక్కసారిగా మెరుపుదాడికి దిగి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. అక్షర్ వేసిన 19వ ఓవర్లో 22 పరుగులు, ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్లో 23 పరుగులు పిండుకున్న మ్యాక్సీ.. ఆఖరి బంతికి ఫోర్ బాది ఆసీస్‌ను గెలిపించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సమం చేసిన మ్యాక్సీ.. ప్రస్తుత భారత పర్యటనలో భీకర ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ వరల్డ్‌కప్ 2023లో రెండు మెరుపు శతకాలు బాదడంతో పాటు నిన్న (నవంబర్ 28) జరిగిన మూడో టీ20లోనూ సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. నిన్నటి మ్యాచ్‌లో 47 బంతుల్లోనే శతక్కొట్టిన అతను.. ఆస్ట్రేలియా తరఫున పొట్టి క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. మ్యాక్సీకి ముందు ఆరోన్ ఫించ్, జోష్ ఇంగ్లిస్ కూడా 47 బంతుల్లోనే శతకాలు బాదారు. ఆసీస్ తరఫున టీ20ల్లో టాప్-5 ఫాస్టెస్ట్ శతకాల్లో మ్యాక్స్వెల్వే మూడు ఉండటం విశేషం. దీనికి ముందు మ్యాక్సీ ఓసారి 49 బంతుల్లో, ఓసారి 50 బంతుల్లో టీ20 సెంచరీలు బాదాడు. -
కేఎల్ రాహుల్ సుడిగాలి శతకం.. వరల్డ్‌కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సుడిగాలి శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో 62 బంతుల్లోనే శతక్కొట్టిన రాహుల్.. వన్డే వరల్డ్‌కప్ చరిత్రలోనే భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రాహుల్‌కు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. ఇదే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో హిట్‌మ్యాన్ ఆఫ్ఘనిస్తాన్పై 62 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి ఔటయ్యాడు. నెదర్లాండ్స్‌పై సెంచరీతో రాహుల్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ (1999లో శ్రీలంకపై 145 పరుగులు) తర్వాత వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన భారత వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే వరల్డ్‌కప్‌లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోర్ చేసిన వికెట్‌కీపర్‌గానూ రికార్డు నెలకొల్పాడు. కాగా, రాహుల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా మెరుపు శతకంతో విరుచుకుపడటంతో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోర్ చేసింది. వీరితో పాటు రోహిత్ శర్మ (61), శుభ్‌మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ భారత్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్ 160 పరుగుల తేడాతో గెలుపొంది, ప్రస్తుత వరల్డ్‌కప్ ఎడిషన్‌లో వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్, రోహిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్, విరాట్‌తో పాటు శుభ్‌మన్ గిల్ కూడా బౌలింగ్ చేశాడు. ఈ విజయంతో భారత్ లీగ్ దశలో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. నవంబర్ 15న జరిగే తొలి సెమీస్‌లో భారత్.. న్యూజిలాండ్‌తో తలపడుతుంది. -
మాక్స్వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ
WC 2023- #AUSvsNED- #GlennMaxwellFastestCentury: వన్డే వరల్డ్‌కప్-2023లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. డచ్ బౌలర్లను ఓ ఆటాడుకున్న మాక్సీ కేవలం 40 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఏకంగా 252.50 స్ట్రైక్‌రేటుతో 101 పరుగులు సాధించి వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా వైస్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కాగా ప్రపంచకప్-2023లో ఢిల్లీలోనే మార్కరమ్ 49 బంతుల్లో శతకం సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ చరిత్రలో వేగవంతమైన సెంచరీలు(ఎదుర్కొన్న బంతుల పరంగా) నమోదు చేసింది వీరే ►40 - గ్లెన్ మాక్స్వెల్ నెదర్లాండ్స్ మీద, ఢిల్లీలో-2023 ►49 - ఎయిడెన్ మార్కరమ్ శ్రీలంక మీద, ఢిల్లీలో- 2023 ►50 - కెవిన్ ఓబ్రెయిన్ ఇంగ్లండ్ మీద, బెంగళూరులో- 2011 ►51 -గ్లెన్ మాక్స్వెల్ శ్రీలంక మీద, సిడ్నీలో- 2015 ►52 - ఏబీ డివిలియర్స్ వెస్టిండీస్ మీద, సిడ్నీలో 2015 ఆస్ట్రేలియా భారీ స్కోరు: నెదర్లాండ్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 104 , స్టీవ్ స్మిత్ 71, మార్నస్ లబుషేన్ 62 పరుగులతో అదరగొట్టగా.. మాక్సీ సునామీ ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా 399 పరుగుల భారీ స్కోరు చేసింది. పసికూన నెదర్లాండ్స్ ముందు కొండంత లక్ష్యాన్ని విధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా బ్యాటర్.. ఏబీ డివిలియర్స్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలు
21 ఏళ్ల ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఆస్ట్రేలియా దేశవాలీ వన్డే టోర్నీ మార్ష్ కప్ 2023-24లో భాగంగా టస్మానియాతో ఇవాళ (అక్టోబర్ 8) జరుగుతున్న మ్యాచ్‌లో ఫ్రేజర్ (సౌత్ ఆస్ట్రేలియా) కేవలం 29 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న ఫ్రేజర్ 10 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి ఔటయ్యాడు. 21-year-old Jake Fraser-McGurk set a world record by scoring a 29-ball century in Australia's Marsh Cup, breaking Ab de Villiers' record of a 31-ball List A hundred! 🤯👏 pic.twitter.com/z53anVA89r — CricTracker (@Cricketracker) October 8, 2023 ఈ సెంచరీ ద్వారా ఫ్రేజర్ లిస్ట్-ఏ క్రికెట్లో సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉండిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును బద్దలుకొట్టాడు. 2014-15లో జొహనెస్‌బర్గ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ 31 బంతుల్లోనే శతక్కొట్టగా.. ఇవాల్టి మ్యాచ్‌లో ఫ్రేజర్ దాదాపు 10 సంవత్సరాలుగా చలామణిలో ఉండిన ఆ రికార్డును బద్దలు కొట్టాడు. టస్మానియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఫ్రేజర్ సృష్టించిన విధ్వంసం ఏ రేంజ్లో ఉండిందంటే.. 436 పరుగులు అతి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న అతని జట్టు (సౌత్ ఆస్ట్రేలియా) కేవలం 11.4 ఓవర్లలోనే 172 పరుగులు చేసింది. కేవలం 11.4 ఓవర్లలోనే ఫ్రేజర్ సెంచరీని పూర్తి చేసుకుని ఔటయ్యాడు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తున్న సౌత్ ఆస్ట్రేలియా సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తుంది. 35 ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలంటే 90 బంతుల్లో 122 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. నాథన్ మెక్‌స్వీనీ (47), జేక్ లీమన్ (25) క్రీజ్‌లో ఉన్నారు. సౌత్ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఫ్రేజర్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. హెన్రీ బ్రంట్ (51), డేనియల్ డ్రూ (52) అర్ధసెంచరీలు నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టస్మానియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. టస్మానియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జోర్డన్ సిల్క్ (85 బంతుల్లో 116; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు శతకంతో విరుచుకుపడగా.. ఓపెనర్ కాలెబ్ జువెల్ (52 బంతుల్లో 90; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీతో మెరిశాడు. రైట్ (51) అర్ధసెంచరీతో రాణించగా... చార్లీ వాకిమ్ (48), వెబ్‌స్టర్ (42), వెథరాల్డ్ (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో టస్మానియా నిర్ధేశించిన 436 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆస్ట్రేలియా ఛేదిస్తే.. దేశవాలీ క్రికెట్ అతి భారీ లక్ష్య ఛేదనగా.. లిస్ట్-ఏ క్రికెట్లో రెండో సక్సెస్ఫుల్ రన్ చేజ్‌గా రికార్డుల్లోకెక్కుతుంది. లిస్ట్-ఏ క్రికెట్లో సక్సెస్ఫుల్ రన్‌ఛేజ్ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. 2006లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. -
వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ ఎవరిదో తెలుసా?
వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. మరో 24 గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో ఢిఫెడింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మెగా టోర్నీ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన టాప్-5 ఆటగాళ్లపై ఓ లూక్కేద్దం. కెవిన్ ఓబ్రియన్.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన రికార్డు ఐర్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ పేరిట ఉంది. భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌లో ఓబ్రియన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు. 6వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఓబ్రియన్ బౌండరీల వర్షం కరిపించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న కెవిన్ 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌పై 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్ ప్రపంచకప్ చరిత్రలోనే చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. గ్లెన్ మాక్స్వెల్ ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఓబ్రియన్ తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఉన్నాడు. సొంతగడ్డపై జరిగిన 2015 వన్డే ప్రపంచకప్‌లో కేవలం 51 బంతుల్లోనే మాక్సీ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మాక్స్వెల్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న మాక్సీ 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ ఇక లిస్ట్‌లో మాక్స్వెల్ తర్వాత ఈ లిస్ట్‌లో దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై కేవలం 52 బంతుల్లోనే డివిలియర్స్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో 66 బంతులు ఆడిన ఏబీడీ.. 17 ఫోర్లు, 8 సిక్స్‌లతో 162 పరుగులు చేశాడు. ఇయాన్ మోర్గాన్ ఇక ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నాలుగో స్ధానంలో ఉన్నాడు. సొంత గడ్డపై జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లో మోర్గాన్ 57 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆఫ్గానిస్తాన్‌పై ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 71 బంతులు ఆడిన మోర్గాన్ 4 ఫోర్లు, 17 సిక్స్‌లతో 148 పరుగులు చేశాడు. మాథ్యూ హేడన్ ఇక ఈ జాబితాలో ఐదు స్ధానంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడన్ ఉన్నాడు. 2007 వన్డే ప్రపంచకప్‌లో హేడన్.. దక్షిణాఫ్రికాపై 66 బంతుల్లో శతకాన్ని సాధించాడు. మొత్తంగా 68 బంతులు ఎదుర్కొన్న హేడన్ 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. చదవండి: Asian Games 2023: శ్రీలంక ఘోర పరాజయం.. సెమీఫైనల్లో ఆఫ్గానిస్తాన్ -
ఏషియన్ గేమ్స్‌లో మరో విధ్వంసకర శతకం.. 13 ఫోర్లు, 9 సిక్సర్లతో ఊచకోత
ఏషియన్ గేమ్స్ 2023లో మరో విధ్వంసకర సెంచరీ నమోదైంది. ఈసారి మలేషియా ఆటగాడు ప్రత్యర్ధి థాయ్‌లాండ్ బౌలర్లేను ఊచకోత కోసి శతక్కొట్టాడు. కొద్ది రోజుల ముందు మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ ఆటగాడు కుషాల్ మల్లా టీ20ల్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (34 బంతుల్లో) బాదగా.. తాజాగా మలేషియా ఆటగాడు సయ్యద్ అజీజ్ 56 బంతుల్లో 13 ఫోర్లు, 9 సిక్సర్లతో శివాలెత్తి 126 పరుగులు చేశాడు. అజీజ్‌తో పాటు ముహమ్మద్ అమీర్ (25 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), విరన్‌దీప్ సింగ్ (12 బంతుల్లో 30 నాటౌట్; 4 సిక్సర్లు) కూడా విజృంభించడంతో మలేషియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 268 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో అజీజ్ చేసిన సెంచరీ అంతర్జాతీయ టీ20ల్లో 12వ ఫాస్టెస్ట్ సెంచరీ కాగా.. మలేషియా చేసిన స్కోర్ అంతర్జాతీయ టీ20ల్లో నాలుగో అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డైంది. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన మలేషియా రికార్డు స్కోర్ సాధించగా.. ఛేదనలో చేతులెత్తేసిన థాయ్‌లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 74 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో థాయ్‌పై మలేషియా 194 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మలేషియా బౌలర్లలో అహ్మద్ ఫయాజ్, విజయ్ ఉన్ని, విరన్దీప్సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముహమ్మద్ అమిర్ అజిమ్ ఓ వికెట్ దక్కించుకుని థాయ్‌లాండ్‌ను దెబ్బకొట్టారు. థాయ్‌లాండ్ ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు మాత్రం అతికష్టం మీద రెండంకెల స్కోర్ చేయగా.. నొప్పొన్ సేనమోంత్రి చేసిన 15 పరుగులు ఇన్నింగ్స్ టాప్ స్కోర్‌గా నిలిచింది. ఈ క్రీడల్లో భారత్ మ్యాచ్ రేపు జరుగనుంది. టీమిండియా రేపు క్వార్టర్ ఫైనల్-1లో నేపాల్‌తో తలపడనుంది. -
ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిన టీ20 మ్యాచ్.. ఓ వినూత్న రికార్డు నమోదు
ఏషియన్ గేమ్స్‌లో పురుషుల క్రికెట్‌కు తొలిసారి ప్రాతినిథ్యం లభించిన విషయం తెలిసిందే. ఈ క్రీడలకు ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే ఆరంభం లభించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ టీ20 రికార్డులను తిరగరాసింది. మంగోలియాపై రికార్డు స్థాయిలో 273 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన నేపాల్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోర్‌తో (314/3) పాటు పరుగుల పరంగా భారీ విజయం (273), ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (26).. బౌండరీలు, సిక్సర్ల రూపంలో అత్యధిక పరుగులు (14 ఫోర్లు, 26 సిక్సర్లు కలిపి మొత్తంగా 212 పరుగులు), ఫాస్టెస్ట్ ఫిఫి (దీపేంద్ర సింగ్-9 బంతుల్లో), ఫాస్టెస్ట్ హండ్రెడ్ (కుషాల్ మల్లా-34 బంతుల్లో), మూడో వికెట్‌కు అత్యధిక పార్ట్నర్షిప్ (193 పరుగులు), అత్యధిక స్ట్రయిక్‌రేట్ (దీపేంద్ర సింగ్- 520 (10 బంతుల్లో 52 పరుగులు) ఇలా పలు ప్రపంచ రికార్డులను కొల్లగొట్టింది. Dipendra Singh Airee's fastest ever fifty in T20i history: 6,6,6,6,6,2,6,6,6. - A memorable day for Nepal cricket!pic.twitter.com/ih9cvYehCi — Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2023 పై పేర్కొన్న రికార్డులతో ఈ మ్యాచ్‌లో మరో వినూత్న రికార్డు కూడా నమోదైంది. మంగోలియా చేసిన 41 పరుగుల స్కోర్‌లో ఎక్స్‌ట్రాలే (23 పరుగులు, 16 వైడ్లు, 5 లెగ్ బైలు, 2 నోబాల్స్) టాప్ స్కోర్ కావడం. ఓ జట్టు స్కోర్‌లో 50 శాతానికి పైగా పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడం టీ20 చరిత్రలో ఇదే మొదటిసారి. మంగోలియా స్కోర్‌లో 56 శాతం పరుగులు ఎక్సట్రాల రూపంలో వచ్చాయి. ఎక్స్‌ట్రాల తర్వాత మంగోలియన్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ దవాసురెన్ జమ్యసురెన్ (10) చేశాడు. ఇతనొక్కడే మంగోలియా ఇన్నింగ్స్‌లో రెండంకెల స్కోర్ చేశాడు. మిగిలిన 10 బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. నేపాల్ బౌలర్లు కరణ్, అభినాశ్, సందీప్ లామిచ్చెన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సోంపాల్, కుశాల్ భుర్టెల్, దీపేంద్ర సింగ్ తలో వికెట్ దక్కించకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్లు కుషాల్ భుర్టెల్ (19), ఆసిఫ్ షేక్ (16) విఫలం కాగా.. కుషాల్ మల్లా (50 బంతుల్లో 137 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్సర్లు), దీపేంద్ర సింగ్ (10 బంతుల్లో 52 నాటౌట్; 8 సిక్సర్లు), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (27 బంతుల్లో 61; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి చరిత్రపుటల్లో చిరకాలం మిగిలుండిపోయే పలు రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. -
40 బంతుల్లో శతక్కొట్టిన టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్
వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్ట్‌ల్లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్న నాయర్.. గుల్భర్గా మిస్టిక్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 28) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 40 బంతుల్లోనే శతక్కొట్టి, తన జట్టు (మైసూర్ వారియర్స్) భారీ స్కోర్ సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న నాయర్.. 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి, అజేయంగా నిలిచాడు. నాయర్‌కు ఆర్ సమర్థ్ (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎస్ కార్తీక్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది. Karun Nair continues his dream run in the Maharaja T20 League 2023. pic.twitter.com/MojOUiPtim — CricTracker (@Cricketracker) August 28, 2023 నాయర్ విధ్వంసం ధాటికి గుల్భర్గా బౌలర్లు అభిలాష్ షెట్టి (4-0-63-1), విజయ్‌కుమార్ వైశాక్ (4-0-45-0), అవినాశ్ (3.4-0-44-1), నొరోన్హా (2-0-36-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం 249 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుల్భర్గా.. 9 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. గుల్భర్గా ఇన్నింగ్స్‌లో చేతన్ 28, ఆనీశ్ 23, నొరోన్హా 39 నాటౌట్, స్మరణ్ 0, అమిత్ వర్మ 11, హసన్ ఖలీద్ 4 నాటౌట్ పరుగులు చేశారు. మైసూర్ బౌలర్లలో జగదీశ సుచిత్ 2, మోనిశ్ రెడ్డి, గౌతమ్ మిశ్రా తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, టెస్ట్‌ల్లో భారత్ తరఫున సెహ్వాగ్ 2, కరుణ్ నాయర్ ఓసారి ట్రిపుల్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. సెహ్వాగ్ 2004లో పాకిస్తాన్‌పై తన తొలి ట్రిపుల్ సెంచరీని (309) (భారత్ తరఫున మొట్టమొదటిది), 2008లో సౌతాఫ్రికాపై తన రెండో ట్రిపుల్ హండ్రెడ్ను (319) బాదాడు. ఆ తర్వాత 2016లో కరుణ్ నాయర్ ఇంగ్లండ్‌పై చెన్నైలో ట్రిపుల్ సెంచరీని (303 నాటౌట్) సాధించి, భారత్ తరఫున టెస్ట్‌ల్లో సెహ్వాగ్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. -
హ్యారీ బ్రూక్ ఊచకోత.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
హండ్రెడ్ లీగ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఆటగాడు, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఈ ఫీట్ సాధించాడు. వెల్ష్ ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 22) జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. హండ్రెడ్ లీగ్ హిస్టరీలోనే ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. బ్రూక్ తన ఇన్నింగ్స్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. కేవలం ముగ్గురు మాత్రమే.. హండ్రెడ్ లీగ్‌లో చరిత్రలో (పురుషుల ఎడిషన్‌లో) ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే సెంచరీ మార్కును అందుకోగా.. బ్రూక్‌దే ఫాస్టెప్ట్ సెంచరీగా రికార్డైంది. 2022 సీజన్లో విల్ జాక్స్ (47 బంతుల్లో) (48 బంతుల్లో 108 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు), విల్ స్మీడ్ (49 బంతుల్లో) (50 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలు చేయగా, బ్రూకే అతి తక్కువ బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. హండ్రెడ్ లీగ్‌లో అత్యధిక స్కోర్.. హండ్రెడ్ లీగ్‌లో బ్రూక్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసినప్పటికీ, ఈ లీగ్‌లో అత్యధిక స్కోర్ (ఏకైక సెంచరీ) రికార్డు మాత్రం మహిళా క్రికెటర్ పేరిట నమోదై ఉంది. ప్రస్తుత సీజన్లో వెల్ష్ ఫైర్ ప్లేయర్ ట్యామీ బేమౌంట్ ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసింది. ఓవరాల్‌గా హండ్రెడ్ లీగ్‌లో ఇదే అత్యుత్తమ స్కోర్‌గా రికార్డైంది. Every. Ball. Counts. Harry Brook has done it 💥#TheHundred pic.twitter.com/iCC6FbKVkG — The Hundred (@thehundred) August 22, 2023 బ్రూక్ సెంచరీ వృధా.. వెల్ష్ ఫైర్‌పై బ్రూక్ ఫాస్టెస్ట్ సెంచరీతో విరుచుకుపడినా ప్రయోజనం లేకుండా పోయింది. అతను ప్రాతినిథ్యం వహించిన నార్త్రన్ సూపర్ ఛార్జర్స్.. వెల్ష్ ఫైర్ చేతిలో ఓటమిపాలై లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్.. బ్రూక్ శతక్కొట్టడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో బ్రూక్ (మూడంకెల స్కోర్), ఆడమ్ హోస్ (15) మినహా మిగతావారు కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. వెల్ష్ ఫైర్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 2, మ్యాట్ హెన్రీ, డేవిడ్ పెయిన్, వాన్ డర్ మెర్వ్, వెల్స్ తలో వికెట్ పడగొట్టారు. What a knock! 💥 Stephen Eskinazi scored the third-fastest fifty of the men's competition. 👏#TheHundred pic.twitter.com/pJqc1hXspG — The Hundred (@thehundred) August 23, 2023 విధ్వంసం సృష్టించిన వెల్ష్ ఫైర్ ప్లేయర్లు.. 159 పరుగుల లక్ష్య ఛేదనలో వెల్ష్ ఫైర్ ప్లేయర్లు విధ్వంసం సృష్టించారు. స్టెఫెన్ ఎస్కినాజీ (28 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (39 బంతుల్లో 44; ఫోర్, 3 సిక్సర్లు), జో క్లార్క్ (22 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి, తమ జట్టును 90 బంతుల్లోనే (2 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా వెల్ష్ ఫైర్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రూక్ విధ్వంసకర శతకం బూడిదలో పోసిన పన్నీరైంది. -
జింబాబ్వే తరపున ఫాస్టెస్ట్ సెంచరీ.. రెండు రోజుల్లోనే చెరిపేసి
జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో జింబాబ్వే తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సికందర్ రజా 54 బంతుల్లో ఆరు ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు నాటౌట్ సుడిగాలి శతకంతో మెరిశాడు. కేవలం 54 బంతుల్లోనే భారీ శతకం బాదిన సికందర్ రాజా జింబాబ్వే తరపున వన్డే క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సీన్ విలియమ్స్ పేరిట ఉండేది. జూన్ 18న నేపాల్‌పై విలియమ్స్ కేవలం 70 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డును సికందర్ రాజా కేవలం రెండు రోజుల్లోనే చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించాడు. కాగా 37 ఏళ్ల వయసులో శతకం బాదిన సికందర్ రజా.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన పెద్ద వయస్కుడిగా క్రెయిగ్ ఎర్విన్‌తో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ఇక వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే శతకం మార్క్ అందుకోగా.. ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ బ్యాటర్ కోరె అండర్సన్ (36 బంతుల్లోనే శతకం), షాహిద్ అఫ్రిది 37 బంతుల్లో, జాస్ బట్లర్ 46 బంతుల్లో, సనత్ జయసూర్య 48 బంతుల్లో అందుకున్నారు. ఇక టీమిండియా తరపున విరాట్ కోహ్లి 52 బంతుల్లో సెంచరీ సాధించాడు. చదవండి: చావుదెబ్బ కొట్టిన ఆసీస్.. రికార్డులు బద్దలైన వేళ సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఎదురులేని జింబాబ్వే -
సికందర్ రజా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. ఎదురులేని జింబాబ్వే
వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ క్రికెట్ టోర్నీలో(ICC CWC 2023)ఆతిథ్య జట్టు జింబాబ్వే ఎదురులేకుండా దూసుకెళుతుంది. టోర్నీలో జింబాబ్వే వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌తో మంగళవారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. సికందర్ రజా (54 బంతుల్లోనే 102 పరుగులు) వీరోచిత సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ నాలుగు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో వన్డేల్లో జింబాబ్వే తరపున వన్డేల్లో వేగవంతమైన సెంచరీ సాధించిన ప్లేయర్‌గా సికందర్ రజా గుర్తింపు పొందాడు. కాగా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. విక్రమ్‌జిత్ సింగ్(88 పరుగులు), మాక్స్ ఒడౌడ్(59 పరుగులు), స్కాట్ ఎడ్వర్డ్స్(83 పరుగులు) రాణించగా.. సికందర్ రజా 55 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం 316 టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే కేవలం 40.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. క్రెయిగ్ ఇర్విన్(50 పరుగులు), సీన్ విలియమ్స్(91 పరుగులు) రాణించగా.. సికందర్ రజా(54 బంతుల్లో 102 నాటౌట్, ఆరు ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు. Hosts Zimbabwe make it two wins out of two after Sikandar Raza's heroics ✌️ 📝: #ZIMvNED: https://t.co/6sP9VYrxb0 | #CWC23 pic.twitter.com/u52nPJgmF6 — ICC Cricket World Cup (@cricketworldcup) June 20, 2023 చదవండి: బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్ -
వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన సీన్ విలియమ్స్
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (జూన్ 18) జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు సీన్ విలియమ్స్ మెరుపు శతకం బాదాడు. కేవలం 70 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విలియమ్స్.. జింబాబ్వే తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (70 బంతుల్లో) నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు రెగిస్ చకబ్వా పేరిట ఉండేది. చకబ్వా.. 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 బంతుల్లో సెంచరీ చేశాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విలియమ్స్, చకబ్వా తర్వాత బ్రెండన్ టేలర్ (2015లో ఐర్లాండ్‌పై 79 బంతుల్లో), సికందర్ రజా (2022లో బంగ్లాదేశ్‌పై 81 బంతుల్లో) ఉన్నారు. కాగా, నేపాల్‌తో ఇవాళ జరిగిన వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో విలియమ్స్‌తో పాటు క్రెయిగ్ ఎర్విన్ (128 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) అజేయ సెంచరీతో చెలరేగడంతో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. కుశాల్ భూర్టెల్ (99), ఆసిఫ్ షేక్ (66), కుశాల్ మల్లా (41), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (31) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేయగా.. అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే మరో 35 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఇవాలే జరిగిన మరో మ్యాచ్‌లో యూఎస్ఏపై వెస్టిండీస్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. జాన్సన్ ఛార్లెస్ (66), షాయ్ హోప్ (54), రోప్టన్ ఛేజ్ (55), జేసన్ హోల్డర్ (56), నికోలస్ పూరన్ (43) రాణించగా 49.3 ఓవర్లలో 297 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన యూఎస్ఏను గజానంద్ సింగ్ (101 నాటౌట్) వీరోచిత శతకం సాయంతో గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. గజానంద్తో పాటు ఆరోన్ జోన్స్ (23), షయాన్ జహంగీర్ (39), నోస్తుష్ కెంజిగే (34) పోరాడటంతో విండీస్‌కు విజయం అంత సులువుగా దక్కలేదు. యూఎస్ఏ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి ఓటమిపాలైంది. -
బౌలర్ బ్యాటర్‌గా మారిన వేళ.. ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో అత్యద్భుతం చోటు చేసుకుంది. 76 మ్యాచ్‌ల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయని ఓ బౌలర్ ఏకంగా ఇంగ్లండ్ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ హండ్రెడ్ను, ఓవరాల్‌గా టీ20 చరిత్రలో నాలుగో వేగవంతమైన శతకాన్ని బాదాడు. కెంట్‌తో నిన్న (మే 26) జరిగిన మ్యాచ్‌లో సర్రే బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా బౌలర్ సీన్ అబాట్ కేవలం 34 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా 19 ఏళ్ల క్రితం తన దేశానికే చెందిన ఆండ్రూ సైమండ్స్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. #ICYMI: Sean Abbott smashed the joint-fastest century in T20 Blast history.pic.twitter.com/HItU4rVxA4— CricTracker (@Cricketracker) May 27, 2023 ఈ మ్యాచ్‌లో మొత్తం 41 బంతులు ఎదుర్కొన్న అబాట్.. 11 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి జట్టులో మరెవరి నుంచి సహకారం లభించకపోయినా ఒక్కడే రాణించి, జట్టు స్కోర్‌ను 200 పరుగులు దాటించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. అబాట్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 223 చేయగా.. ఛేదనలో తడబడిన కెంట్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెంట్ ఓపెనర్లు తవాండ ముయేయే (37 బంతుల్లో 59), డేనియల్ బెల్ డ్రమ్మండ్ (27 బంతుల్లో 52) జోడీ తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించి శుభారంభం అందించినప్పటికీ, ఆతర్వాత వచ్చిన మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో కెంట్ లక్ష్యానికి సుదూరంలో నిలిచిపోయింది. సర్రే బౌలర్లలో సునీల్ నరైన్, విల్ జాక్స్, టామ్ లేవ్స్ తలో 2 వికెట్లు.. సామ్ కర్రన్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: శుబ్‌మన్ సూపర్ సెంచరీ.. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ -
36 బంతుల్లో 99 పరుగులు; ఒక్క పరుగు చేసుంటే చరిత్రలో
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆర్సీబీ వుమెన్ తొలిసారి తమ బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించారు. అయితే ఆర్సీబీ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడడంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉండడంతో పాటు రన్‌రేట్ కూడా చాలా దారుణంగా ఉంది. రన్‌రేట్ మెరుగుపరుచుకోవాలన్నా.. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలన్న కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఆర్సీబీది. అందుకే కీలకమ్యాచ్‌లో తొలిసారి జూలు విదిల్చింది. ముఖ్యంగా సోఫీ డివైన్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఆమె విధ్వంసానికి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం పరుగుల వర్షంతో తడిసిపోయింది. బంతి పడిందే మొదలు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న డివైన్ 36 బంతుల్లోనే 9ఫోర్లు, 8 సిక్సర్లతో 99 పరుగులు చేసింది. అయితే సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఔటైన డివైన్ ఆ ఒక్క పరుగు పూర్తి చేసి ఉంటే చరిత్రకెక్కేది. ఎందుకంటే మహిళల క్రికెట్లో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ డీజెఎస్ డొట్టిన పేరిట ఉంది. ఆమె 38 బంతుల్లోనే శతకం మార్క్‌ను అందుకుంది. ఆ తర్వాత అలీసా హేలీ 46 బంతుల్లో సెంచరీ సాధించి రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో బ్యూమౌంట్ 47 బంతుల్లో, నాలుగో స్థానంలో హర్మన్‌ప్రీత్ కౌర్ 49 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకుంది. కానీ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయిన సోఫీ డివైన్ అరుదైన ఫీట్‌ను మిస్ చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహిళల ఫ్రాంచైజీ క్రికెట్లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం.సోఫీ డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం పరుగు తేడాతో సెంచరీని కోల్పోయింది. స్మృతి (31 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ తొలి వికెట్‌కు 9.2 ఓవర్లలో 125 పరుగులు జోడించడం విశేషం. సోఫీ అవుటయ్యాక ఎలీస్ పెరీ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు), హీథెర్ నైట్ (15 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడు కొనసాగిస్తూ బెంగళూరు జట్టును విజయతీరానికి చేర్చారు. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లౌరా వోల్వార్ట్ (42 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), యాష్లే గార్డ్నర్ (26 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. Devine power at play ⚡ #GGvRCB #CheerTheW | @RCBTweets pic.twitter.com/YOi84P4tLB — JioCinema (@JioCinema) March 18, 2023 .@RCBTweets register their second win in a row 😍#CheerTheW #TATAWPL #GGvRCB pic.twitter.com/SHz3eh9sRA — JioCinema (@JioCinema) March 18, 2023 చదవండి: ఉత్కంఠ.. ఆఖరి బంతికి రనౌట్; టైటిల్ నిలబెట్టుకున్న లాహోర్ సూపర్ సోఫీ... ఆర్సీబీ వరుసగా రెండో విజయం -
చరిత్ర సృష్టించిన యూఏఈ క్రికెటర్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు
ICC WC League Two UAE VS NEP: యూఏఈ క్రికెటర్ ఆసిఫ్ అలీ ఖాన్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అసోసియేట్ దేశ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ టు 2019-23లో భాగంగా ఇవాళ (మార్చి 16) నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 41 బంతుల్లోనే శతక్కొట్టిన ఆసిఫ్.. ఆసోసియేట్ దేశాల క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. 7వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగి 11 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన ఆసిఫ్ మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 101 పరుగులతో (240.48 స్ట్రయిక్‌రేట్) అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఓవరాల్‌గా చూసినా ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్ల జాబితాలో ఆసిఫ్ ఖాన్ నాలుగో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇతని తర్వాత వేగవంతమైన సెంచరీ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు కోరె ఆండర్సన్ పేరిట ఉంది. ఆండర్సన్ 36 బంతుల్లో శతకం బాదాడు. ఆతర్వాత పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది (37 బంతుల్లో ), ఆసిఫ్ ఖాన్, మార్క్ బౌచర్ (44 బంతుల్లో), బ్రియాన్ లారా (45), జోస్ బట్లర్ (46), విరాట్ కోహ్లి (52) 3 నుంచి 8 స్థానాల్లో ఉన్నారు. పాక్‌లో పుట్టి యూఏఈ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న 33 ఏళ్ల ఆసిఫ్.. తన కెరీర్లో 16 వన్డేలు ఆడి సెంచరీ, 3 అర్ధసెంచరీల సాయంతో 439 పరుగులు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఆసిఫ్ ఖాన్ (101 నాటౌట్) శతక్కొట్టుడు, అర్వింద్ (94), ముహమ్మద్ వసీం (63) బాధ్యతాయుత హాఫ్ సెంచరీల సాయంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లు దీపేంద్ర సింగ్ (8-2-19-2) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. రాజ్‌బన్సీ (10-0-27-1), సోమ్‌పాల్ కమీ (9-1-74-1), సందీప్ లామిచ్చెన్ (10-0-80-1) వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్ 29 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 172 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. కుశాల్ భుర్టెల్ (50) హాఫ్ సెంచరీతో రాణించగా.. భీమ్ షార్కీ (62 నాటౌట్), ఆరిఫ్ షేక్ (30 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. నేపాల్ ఈ మ్యాచ్ గెలవాలంటే 21 ఓవర్లలో 139 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. -
41 బంతుల్లోనే శతకం.. అతిపెద్ద టార్గెట్‌ను చేధించి ప్లేఆఫ్స్‌కు
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో సంచలనాలు నమోదవుతన్నాయి. మ్యాచ్ స్కోర్లు 250 దరిదాపుల్లో నమోదవుతున్నా చేజింగ్ జట్లు అవలీలగా టార్గెట్‌నే చేధిస్తున్నాయి. తాజాగా ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జాల్మీల మధ్య జరిగిన మ్యాచ్ అందుకు ఉదాహరణ. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం 39 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 73 పరుగులు చేయగా.. సయామ్ అయుబ్ 33 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇక మహ్మద్ హారిస్(11 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్సర్లతో 35 పరుగులు), కొహ్లెర్ కాడ్మెర్(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు) మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు నమోదైంది. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ఇద్దరు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే ఆ తర్వాత వచ్చిన రిలీ రొసౌ(51 బంతుల్లోనే 121 పరుగులు, 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 52, 3ఫోర్లు, 5 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ముల్తాన్ సుల్తాన్స్ లక్ష్యం దిశగా సాఫీగా సాగిపోయింది. అయితే చివర్లో ఇద్దరు స్వల్ప తేడాతో ఔటైనప్పటికి అన్వర్ అలీ(8 బంతుల్లో 24 నాటౌట్), ఉస్మా మీర్(3 బంతుల్లో 11 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. కాగా పీఎస్ఎల్ చరిత్రలోనే అతిపెద్ద టార్గెట్‌ను చేధించిన ముల్తాన్ సుల్తాన్స్ విజయంతో ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. Name: Riley Rossouw Game: Hitting the fastest 100s in the HBL PSL RECORD-HOLDER ROSSOUW#SabSitarayHumaray l #HBLPSL8 l #PZvMS @Rileerr pic.twitter.com/JJtHoomWt3 — PakistanSuperLeague (@thePSLt20) March 10, 2023 చదవండి: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం -
శివాలెత్తిన శుభ్‌మన్ గిల్.. 11 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసకర శతకం
SMAT 2022 Quarter Final 1 PUN VS KAR: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022లో భాగంగా ఇవాళ (నవంబర్ 1) జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో పంజాబ్-కర్ణాటక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 9 పరుగుల తేడాతో గెలుపొంది సెమీఫైనల్‌కు చేరుకుంది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శుభ్‌మన్ గిల్ (55 బంతుల్లో 126) విధ్వంసకర శతకంతో రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు భారీ స్కోర్ చేసింది. గిల్‌కు జతగా అన్మోల్ప్రీత్ సింగ్ (43 బంతుల్లో 59; 9 ఫోర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. కేవలం 49 బంతుల్లోనే కెరీర్లో తొలి టీ20 శతకం బాదిన గిల్.. 11 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంసం సృష్టించాడు. కర్ణాటక బౌలర్లలో విధ్వత్ కావేరప్ప 3 వికెట్లు పడగొట్టగా.. కృష్ణప్ప గౌతమ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 💯 for @ShubmanGill! 👏 👏 What a cracking knock this has been from the right-hander in the #QF1 of the #SyedMushtaqAliT20! 👌 👌 #KARvPUN | @mastercardindia Follow the match ▶️ https://t.co/be91GGi9k5 pic.twitter.com/OaECrucM6g — BCCI Domestic (@BCCIdomestic) November 1, 2022 అనంతరం 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ, ఆతర్వాత గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అభినవ్ మనోహర్ (29 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మనీశ్ పాండే (29 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మనోజ్ భాండగే (9 బంతుల్లో 25; ఫోర్, 3 సిక్సర్లు), కృష్ణప్ప గౌతమ్ (14 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), చేతన్ (25 బంతుల్లో 33; 4 ఫోర్లు, సిక్స్) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరి పోరాటంతో కర్ణాటక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో రమన్‌దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా.. సిద్ధార్ధ్ కౌల్, బల్తేజ్ సింగ్, అశ్వనీ కుమార్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇవాళే జరిగిన మరో రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో ఢిల్లీపై విధర్భ.. బెంగాల్‌పై హిమాచల్ ప్రదేశ్ గెలుపొందాయి. హిమాచల్.. బెంగాల్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందగా.. ఢిల్లీపై విధర్భ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. సాయంత్రం 4:30 గంటలకు ముంబై-సౌరాష్ట్ర జట్ల మధ్య నాలుగో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. -
ఇంగ్లండ్ యువ బ్యాటర్ విధ్వంసం.. ఫాస్టెస్ సెంచరీ రికార్డు బద్దలు
ద హండ్రెడ్ లీగ్ 2022లో స్థానిక ఇంగ్లీష్ యువ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. లీగ్ రెండో ఎడిషన్‌లో శతకాల మోత మోగిస్తూ బౌలర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఆగస్ట్ 10న సథరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్కు చెందిన 20 ఏళ్ల ఓపెనింగ్ బ్యాటర్ విల్ స్మీడ్ 50 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి, లీగ్‌లో తొట్ట తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోక్కెగా.. తాజాగా అదే ప్రత్యర్ధిపై ఓవల్ ఇన్విన్సిబుల్స్‌కు చెందిన 23 ఏళ్ల యువ ఓపెనర్ విల్ జాక్స్ ఏకంగా 47 బంతుల్లోనే శతక్కొట్టి ఔరా అనిపించాడు. జాక్స్ మొత్తం 48 బంతుల్లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు సాధించి తన జట్టును మరో 18 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేర్చాడు. జాక్స్ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. తమ జట్టుకు మరో విధ్వంసకర బ్యాటర్ దొరికాడని ఇంగ్లీష్ అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. జాక్స్ 2019లో జరిగిన ఓ టీ10 లీగ్‌లో 25 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డుల్లోకెక్కాడు. ఆదివారం (ఆగస్ట్ 14) సథరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ ప్రత్యర్ధిని 137 పరుగులకే (100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. మార్కస్ స్టోయినిస్ (27 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. రీస్ టాప్లే 20 బంతుల్లో 3 వికెట్లు పడగొట్టి సథరన్ బ్రేవ్ పతనాన్ని శాసించాడు. అనంతరం నామమత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్.. జాక్స్ విధ్వంసం ధాటికి 82 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జాక్స్ ఒక్కడే అన్నీ తానై తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. జాక్స్ 48 బంతుల్లో 108 పరుగులు సాధిస్తే.. బ్యాటింగ్ అవకాశం వచ్చిన మిగతా నలుగురు 35 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేసి తుస్సుమనిపించారు. ఓపెనర్ జేసన్ రాయ్ లీగ్‌లో మూడోసారి డకౌట్ కాగా, రిలీ రుస్సో (13 బంతుల్లో 10; సిక్స్), కెప్టెన్ సామ్ బిలింగ్స్ (8) దారుణంగా నిరాశపరిచారు. జాక్స్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది తన జట్టుకు ప్రస్తుత ఎడిషన్‌లో మూడో విజయాన్ని (4 మ్యాచ్‌ల్లో) అందించాడు. తాజా ఓటమితో డిఫెండింగ్ ఛాంనియన్ సథరన్ బ్రేవ్ పరాజయాల సంఖ్య మూడుకు (4 మ్యాచ్‌ల్లో) చేరింది. 4 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో లండన్ స్పిరిట్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చదవండి: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ బ్యాటర్.. హండ్రెడ్ లీగ్‌లో శతక్కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు -
ఒక్క ఓవర్ 34 పరుగులు.. 64 బంతుల్లో సెంచరీ; ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ విధ్వంసం
ఇంగ్లండ్ టెస్టు జట్టు నూతన కెప్టెన్ బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్లో దుమ్మురేపాడు. ఒక ఓవర్లో 34 పరుగులు పిండుకోవడంతో పాటు 64 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్-2లో డర్హమ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న స్టోక్స్ వోర్సెస్టర్‌షైర్‌పై ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్లే అవకాశం తృటిలో కోల్పోయినప్పటికి ప్రత్యర్థి బౌలర్‌కు మాత్రం చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ 117వ ఓవర్‌కు ముందు స్టోక్స్ 59 బంతుల్లో 70 పరుగులతో ఆడుతున్నాడు. జోష్ బేకర్ వేసిన ఆ ఓవర్లో తొలి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదిన స్టోక్స్.. చివరి బంతిని బౌండరీ తరలించి 34 పరుగులు రాబట్టడంతో పాటు 64 బంతుల్లో శతకం అందుకున్నాడు. ఈ విధ్వంసం ఇక్కడితో ముగిసిపోలేదు. డర్హమ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి స్టోక్స్ 88 బంతుల్లో 8 ఫోర్లు, 17 సిక్సర్లతో 161 పరుగులు చేసి ఔటయ్యాడు. 161 పరుగుల్లో 134 పరుగులు కేవలం సిక్సర్లు, ఫోర్ల ద్వారానే వచ్చాయంటే స్టోక్స్ విధ్వంసం ఏ రేంజ్లో సాగిందో అర్థమయి ఉండాలి. ఇక రెండోరోజు లంచ్ విరామం తర్వాత డర్హమ్ 6 వికెట్ల నష్టానికి 580 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బెన్ స్టోక్స్(161 పరుగులు), బెండిగమ్(135 పరుగులు), సీన్ డిక్సన్(104 పరుగులు) ఆ తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన వోర్సెస్టర్షైర్ టీ విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.ఇక గతేడాది కాలంగా టెస్టుల్లో ఇంగ్లండ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. వరుస సిరీస్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జో రూట్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బెన్ స్టోక్స్‌ను కొత్త టెస్టు కెప్టెన్‌గా నియమించింది. చదవండి: Brendon Mccullum: ఇంగ్లండ్ వైట్‌బాల్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్! 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 4️⃣ What. An. Over. 34 from six balls for @benstokes38 as he reaches a 64 ball century 👏#LVCountyChamp pic.twitter.com/yqPod8Pchm — LV= Insurance County Championship (@CountyChamp) May 6, 2022