రోహిత్‌ శర్మకు అరుదైన గౌరవం | Team India Captain Rohit Sharma Featured In The 11th Class Mathematics Textbook In Tamil Nadu - Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మకు అరుదైన గౌరవం

Published Tue, Feb 27 2024 6:29 PM | Last Updated on Tue, Feb 27 2024 6:38 PM

Team India Captain Rohit Sharma Featured In Tamil nadu 11th Class Maths Text book - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు 11వ తరగతి మ్యాథ్స్‌ సిలబస్‌లో హిట్‌మ్యాన్‌ పేరిట ఉన్న 35 బంతుల టీ20 సెంచరీని పాఠ్యాంశంగా పొందుపరిచారు.  రోహిత్‌ శతకాన్ని ఉదాహరణగా తీసుకుని గణిత శాస్త్రంలోని ఫంక్షన్స్‌ అండ్‌ రిలేషన్స్‌ కాన్సెప్ట్‌పై పలు ప్రశ్నలు అడిగారు.

రోహిత్‌ క్రికెటింగ్‌ కెరీర్‌లోని ఘనతలను పాఠ్యాంశంగా పొందుపరచడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ ఓ అప్పర్ ప్రైమరీ స్కూల్ పాఠ్యపుస్తకంలో ఇతనికి సంబంధించిన అంశాలను పాఠ్యాంశంగా చేర్చారు.

కాగా, పాఠ్యాంశంగా మారిన రోహిత్‌ టీ20 సెంచరీ 2017 డిసెంబర్‌లో చేసింది. ఇండోర్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన నాటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌  35 బంతుల్లో 10 ఫోర్, 12 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. కొద్ది నెలల కిందటి వరకు ఇది అంతర్జాతీయ టీ20ల్లో జాయింట్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీగా చలామణి అయ్యింది.

గతేడాది చివర్లో జరిగిన ఆసియా క్రీడల్లో నేపాల్‌ బ్యాటర్‌ కుశాల్‌ మల్లా.. రోహిత్‌, డేవిడ్‌ మిల్లర్‌ పేరిట సంయుక్తంగా ఉండిన ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును చెరిపేశాడు. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో కుశాల్‌ 34 బంతుల్లోనే సెంచరీని బాదాడు. 

అయితే, కుశాల్‌ పేరిట ఈ రికార్డు ఎక్కువ రోజులు నిలబడలేదు. ఇవాళ (ఫిబ్రవరి 27) నమీబియా ఆటగాడు జాన్‌ నికోల్‌ లాఫ్టీ ఈటన్‌ కుశాల్‌ రికార్డును బద్దలు కొట్టాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో లాఫ్టీ కేవలం 33 బంతుల్లోనే శతక్కొట్టి, టీ20 ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement