ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో అత్యద్భుతం చోటు చేసుకుంది. 76 మ్యాచ్‌ల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయని ఓ బౌలర్ ఏకంగా ఇంగ్లండ్ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ హండ్రెడ్‌ను, ఓవరాల్‌గా టీ20 చరిత్రలో నాలుగో వేగవంతమైన శతకాన్ని బాదాడు. కెంట్‌తో నిన్న (మే 26) జరిగిన మ్యాచ్‌లో సర్రే బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా బౌలర్ సీన్ అబాట్ కేవలం 34 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా 19 ఏళ్ల క్రితం తన దేశానికే చెందిన ఆండ్రూ సైమండ్స్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు.
#ICYMI: Sean Abbott smashed the joint-fastest century in T20 Blast history.pic.twitter.com/HItU4rVxA4
— CricTracker (@Cricketracker) May 27, 2023
ఈ మ్యాచ్‌లో మొత్తం 41 బంతులు ఎదుర్కొన్న అబాట్.. 11 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి జట్టులో మరెవరి నుంచి సహకారం లభించకపోయినా ఒక్కడే రాణించి, జట్టు స్కోర్‌ను 200 పరుగులు దాటించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. అబాట్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 223 చేయగా.. ఛేదనలో తడబడిన కెంట్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
కెంట్ ఓపెనర్లు తవాండ ముయేయే (37 బంతుల్లో 59), డేనియల్ బెల్ డ్రమ్మండ్ (27 బంతుల్లో 52) జోడీ తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించి శుభారంభం అందించినప్పటికీ, ఆతర్వాత వచ్చిన మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో కెంట్ లక్ష్యానికి సుదూరంలో నిలిచిపోయింది. సర్రే బౌలర్లలో సునీల్ నరైన్, విల్ జాక్స్, టామ్ లేవ్స్ తలో 2 వికెట్లు.. సామ్ కర్రన్ ఓ వికెట్ పడగొట్టారు.
చదవండి: శుబ్‌మన్ సూపర్ సెంచరీ.. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్
Comments
Please login to add a commentAdd a comment