Kent
-
కౌంటీల్లో సరికొత్త చరిత్ర.. 501 పరుగుల టార్గెట్‌ను ఊదేశారు
కౌంటీ క్రికెట్ క్లబ్ సర్రే జట్టు చరిత్ర సృష్టించింది. కౌంటీ చరిత్రలో రెండో అత్యధిక పరుగుల టార్గెట్‌ను(501 పరుగలు)చేధించిన సర్రే జట్టు ఔరా అనిపించింది. కౌంటీల్లో 1925 తర్వాత ఒక జట్టు 500కు పైగా పరుగుల లక్ష్యాన్ని చేధించడం ఇది రెండోసారి. ఇంతకముందు ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా నాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడిలెసెక్స్ 502 పరుగుల టార్గెట్‌ను చేధించింది. అప్పట్లో పాస్టీ హెండ్రెన్ 206 పరగులు నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మళ్లీ 98 ఏళ్ల తర్వాత 500 పరుగుల టార్గెట్‌ను అందుకున్న జట్టుగా సర్రే చరిత్రకెక్కింది. విషయంలోకి వెళితే.. కెంట్ విధించిన 501 పరుగుల భారీ టార్గెట్‌ను సర్రే జట్టు ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఐదోరోజు ఆట మొదలయ్యే సమయానికి సర్రే విజయానికి 238 పరుగులు అవసరం కాగా.. కెంట్కు ఏడు వికెట్లు కావాలి. జేమీ స్మిత్ 77 బంత్లులో 114 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో డామ్ సిబ్లే, బెన్ ఫోక్స్ ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. బెన్ ఫోక్స్(211 బంతుల్లో 124 పరుగులు, 15 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔట్ కాగా.. రెండురోజులు ఎంతో ఓపికతో ఆడిన డోమ్ సిబ్లే(511 నిమిషాల పాటు) 415 బంతుల్లో 140 పరుగులు నాటౌట్ అసమాన ఇన్నింగ్స్ ఆడి సర్రేకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. చివర్లో జోర్డాన్ క్లాక్ 26 నాటౌట్ అతనికి సహకరించాడు. ఇక అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య చేధన 418గా ఉంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి 418 పరగుల టార్గెట్‌ను అందుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. 2008లో ఆస్ట్రేలియా విధించిన 414 పరుగుల టార్గెట్‌ను ప్రొటిస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. మూడో స్థానంలో టీమిండియా ఉంది. 1976లో వెస్టిండీస్ విధించిన 403 పరుగుల టార్గెట్‌ను టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. What an effort by Dom Sibley 👏 Sibs finishes 140 not out after batting for 146.1 overs 🤩 So good to have you home 🏡 🤎 | #SurreyCricket https://t.co/iJKxxiQJOt pic.twitter.com/5Wn4Fa7okE — Surrey Cricket (@surreycricket) June 14, 2023 An incredible day 📷 🤎 | #SurreyCricket pic.twitter.com/jYWh9ho31l — Surrey Cricket (@surreycricket) June 14, 2023 చదవండి: రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరు?.. గూగుల్ AI ఊహించని పేర్లు -
బౌలర్ బ్యాటర్‌గా మారిన వేళ.. ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో అత్యద్భుతం చోటు చేసుకుంది. 76 మ్యాచ్‌ల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయని ఓ బౌలర్ ఏకంగా ఇంగ్లండ్ టీ20 చరిత్రలో ఫాస్టెస్ట్ హండ్రెడ్ను, ఓవరాల్‌గా టీ20 చరిత్రలో నాలుగో వేగవంతమైన శతకాన్ని బాదాడు. కెంట్‌తో నిన్న (మే 26) జరిగిన మ్యాచ్‌లో సర్రే బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా బౌలర్ సీన్ అబాట్ కేవలం 34 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తద్వారా 19 ఏళ్ల క్రితం తన దేశానికే చెందిన ఆండ్రూ సైమండ్స్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. #ICYMI: Sean Abbott smashed the joint-fastest century in T20 Blast history.pic.twitter.com/HItU4rVxA4— CricTracker (@Cricketracker) May 27, 2023 ఈ మ్యాచ్‌లో మొత్తం 41 బంతులు ఎదుర్కొన్న అబాట్.. 11 సిక్సర్లు, 4 బౌండరీల సాయంతో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి జట్టులో మరెవరి నుంచి సహకారం లభించకపోయినా ఒక్కడే రాణించి, జట్టు స్కోర్‌ను 200 పరుగులు దాటించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే.. అబాట్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 223 చేయగా.. ఛేదనలో తడబడిన కెంట్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెంట్ ఓపెనర్లు తవాండ ముయేయే (37 బంతుల్లో 59), డేనియల్ బెల్ డ్రమ్మండ్ (27 బంతుల్లో 52) జోడీ తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించి శుభారంభం అందించినప్పటికీ, ఆతర్వాత వచ్చిన మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో కెంట్ లక్ష్యానికి సుదూరంలో నిలిచిపోయింది. సర్రే బౌలర్లలో సునీల్ నరైన్, విల్ జాక్స్, టామ్ లేవ్స్ తలో 2 వికెట్లు.. సామ్ కర్రన్ ఓ వికెట్ పడగొట్టారు. చదవండి: శుబ్‌మన్ సూపర్ సెంచరీ.. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ -
కౌంటీల్లో ఆడనున్న అర్షదీప్ సింగ్.. టెస్ట్ జట్టులో చోటే లక్ష్యంగా..!
కెంట్: భారత లెఫ్టార్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ వచ్చే సీజన్లో ఐదు మ్యాచ్‌లలో ‘కెంట్’ కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తాడు. అర్షదీప్ భారత్ తరపున 3 వన్డేలు, 26 టి20ల్లో ఆడాడు. భవిష్యత్తులో భారత టెస్టు జట్టులో అవకాశాల కోసం ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడమని, కౌంటీలు ఆడితే ప్రదర్శన మెరుగవుతుందని కోచ్ ద్రవిడ్ చేసిన సూచనతో అతను కౌంటీ క్రికెట్ వైపు వెళుతున్నాడు. అర్షదీప్.. కెంట్ తరఫున ఆడనున్న నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. -
సుందర్ 'నమ్మశక్యం కాని బౌలింగ్'.. నోరెళ్లబెట్టిన ప్రత్యర్థి బ్యాటర్
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ 1లో బిజీగా ఉన్నాడు. లంకాషైర్ తరపున డెబ్యూ సీజన్ ఆడుతున్న సుందర్ సూపర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన సుందర్ తాజాగా కెంట్‌తో మ్యాచ్‌లో తన ఆఫ్ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. సుందర్ వేసిన బంతి గింగిరాలు తిరుగుతూ ఆఫ్‌స్టంప్ మీదుగా వెళ్లింది. అయితే బంతిని డిఫెన్స్ చేద్దామని ప్రయత్నించిన కెంట్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ విఫలమయ్యాడు. బంతి ప్యాడ్ల సందులో నుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది. బంతి ఎలా వెళ్లిందో అర్థంగాక జోర్డాన్ కాక్స్ నోరెళ్లబెట్టాడు. దీంతో కేవలం ఒక్క పరుగుకు కాక్స్ పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోనూ కౌంటీ చాంపియన్‌షిప్ షేర్ చేస్తూ.. ''సుందర్ నుంచి నమ్మశక్యం కాని డెలివరీ.. సూపర్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. తెలివైన బంతితో బోల్తా కొట్టించిన సుందర్‌ను తోటి ఆటగాళ్లు అభినందించారు. కాగా సుందర్‌కు కాక్స్‌ది రెండో వికెట్.. అంతకముందు కెంట్ కెప్టెన్ జాక్ లీనింగ్ రూపంలో తొలి వికెట్ తీసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లంకాషైర్ 182 పరుగుల తేడాతో కెంట్‌పై విజయం అందుకుంది. లంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌట్ కాగా.. కెంట్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌట్ అయి 125 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం లంకాషైర్ అద్బుత ఆటతీరు కనబరిచింది. 9 వికెట్ల నష్టానికి 436 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెంట్ అనూహ్యంగా 127 పరుగులకే కుప్పకూలింది. టామ్ బెయిలీ 5 వికెట్లతో చెలరేగగా.. వాషింగ్టన్ సుందర్ 3, విల్ విలియమ్స్ రెండు వికెట్లు తీశాడు. That is an incredible delivery from @Sundarwashi5 😲#LVCountyChamp pic.twitter.com/rLyMvMmI9l — LV= Insurance County Championship (@CountyChamp) July 28, 2022 చదవండి: Sanju Samson In T20I Squad: విండీస్‌తో తొలి టి20.. టీమిండియాకు గుడ్‌న్యూస్ ఆరేళ్ల తర్వాత జట్టులోకి.. కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్; ఇంగ్లండ్‌పై ప్రతీకారం -
అరంగేట్రంలోనే అదుర్స్! ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే.. కానీ పాపం..
County Championship 2022: టీమిండియా పేసర్ నవదీప్ సైనీ కౌంటీ చాంపియన్‌షిప్ ఎంట్రీలోనే అదరగొట్టాడు. కెంట్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు అరంగేట్రంలోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా కెంట్.. వార్విక్షైర్తో తలపడుతోంది. ఈ మ్యాచ్ ద్వారా కౌంటీల్లో అడుగు పెట్టిన సైనీ.. వార్విక్షైర్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. క్రిస్ బెంజమిన్, డాన్ మూస్లే, మిచెల్ బర్గ్స్ , హెన్రీ బ్రూక్స్, క్రెయిగ్ మిల్స్‌లను అవుట్ చేశాడు. Five wickets on debut: @navdeepsaini96 🏎 pic.twitter.com/6wzYjE8N1d — Kent Cricket (@KentCricket) July 20, 2022 ద్రవిడ్ తర్వాత ఆ ఘనత సైనీదే! టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా సహా పలువురు టీమిండియా క్రికెటర్లు కౌంటీ చాంపియన్‌షిప్-2022లో ఆడుతున్న విషయం తెలిసిందే. పుజారా ససెక్స్‌కు, ఉమేశ్ యాదవ్ మిడిల్సెక్స్ తరఫున, వాషింగ్టన్ సుందర్ లంకాషైర్ తరఫున ఆడుతున్నారు. కాగా వాషింగ్టన్ సుందర్ సైతం తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఇక సైనీ కెంట్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా గతంలో టీమిండియా వాల్, ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ జట్టుకు ఆడాడు. ఆ తర్వాత కెంట్కు ఆడుతున్న ఘనత నవదీప్ సైనీకే దక్కింది. ఇదిలా ఉంటే.. రాయల్ వన్డే చాంపియన్‌షిప్‌లో భాగంగా కృనాల్ పాండ్యా వార్విక్‌షైర్‌కు ఆడనున్నాడు. పాపం.. బౌలర్లు రాణించినా.. మ్యాచ్ విషయానికొస్తే.. జూలై 19న కెంట్‌తో ఆరంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన వార్విక్షైర్ తొలి ఇన్నింగ్స్‌ను 225 పరుగుల వద్ద ముగించింది. కెంట్ బౌలర్లలో సైనీ ఐదు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ రెండు, మిల్న్స్ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే, బ్యాటర్లు విఫలం కావడంతో 165 పరుగులకే కెంట్ కుప్పకూలింది. వర్షం కారణంగా మూడో రోజు ఆట ఆలస్యమైంది. చదవండి: Ind Vs WI ODI Series: వీళ్లతో అంత వీజీ కాదు! ఏమరపాటుగా ఉంటే మూల్యం చెల్లించకతప్పదు! -
ఇంత దారుణమా.. ఏ లెక్కన ఔటిచ్చారో చెప్పండి!
ఈ మధ్య కాలంలో క్రికెట్లో ఫీల్డ్ అంపైర్లు అనవసర తప్పిదాలు ఎక్కువగా చేస్తున్నారు. ఫలితంగా బ్యాట్స్‌మెన్ మూల్యం చెల్లించుకుంటున్నారు. తాజాగా కౌంటీ క్రికెట్లో అంపైర్ చెత్త నిర్ణయానికి బ్యాట్స్‌మన్ బలవ్వాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. కెంట్, హంప్‌షైర్ మధ్య ఆదివారం కౌంటీ మ్యాచ్ జరిగింది. కెంట్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ క్రీజులో ఉన్నాడు. హంప్‌షైర్ బౌలర్ ఫెలిక్స్ ఆర్గన్ వేసిన బంతిని అడ్డుకునే క్రమంలో జోర్డాన్ తన కాలిని ఆఫ్‌స్టంప్ అవతల అడ్డుపెట్టాడు. అతని కాలికి తగిలి బంతి గాల్లోకి లేచి ఫీల్డర్ చేతిలో పడింది. అది క్లియర్ ఔట్ కాదని తెలుసు.. అయినా ఆటగాళ్లు అప్పీల్ చేయగానే ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చేశాడు. పోని ఎల్బీ అనుకుందామంటే అసలు బంతి ఆఫ్‌స్టంప్‌కు చాలా దూరంగా వెళుతుంది. మరి ఏ లెక్కన అంపైర్ ఔట్ ఇచ్చాడనేది అర్థం కాని విషయం. అంపైర్ నిర్ణయంతో షాక్ తిన్న జోర్డాన్ కాక్స్ కొన్ని సెకన్ల పాటు క్రీజులో అలాగే నిల్చుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఫీల్డ్ అంపైర్‌ను ట్రోల్ చేశారు. ''చెత్త అంపైరింగ్.. మరి ఇంత దారుణమా.. అసలు ఇది ఏ లెక్కన ఔట్ అనేది అంపైర్ చెప్పాల్సిందే..'' అంటూ కామెంట్స్ చేశారు. ఫ్యాన్స్‌తో పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు బెన్ స్టోక్స్, లివింగ్‌స్టోన్‌లు తప్పుడు నిర్ణయం ఇచ్చిన అంపైర్‌కు తమదైన శైలిలో చురకలంటించారు. ఇక ఐస్లాండ్ క్రికెట్ కూడా తమదైన శైలిలో ట్రోల్ చేశారు.'' ఐపీఎల్‌లోనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న అంపైర్లను మార్చాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ తప్పిదాలు కౌంటీ క్రికెట్లో జరుగుతున్నాయి. మా దగ్గర ట్రెయిన్ అయిన మంచి అంపైర్లను ఐపీఎల్ కంటే ముందుగా కౌంటీలకు పంపించాలి'' అంటూ పేర్కొంది. మొన్నటికి మొన్న ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఒక నో బాల్ వ్యవహారం ఎంతటి హైడ్రామా సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంత క్లియర్‌గా నోబాల్ అని తెలుస్తున్నప్పటికి ఫీల్డ్ అంపైర్ నో బాల్ ఇవ్వకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ బ్యాట్స్‌మెన్‌ను వెనక్కి పిలవడం సిల్లీగా అనిపించినా అతని కోపాన్ని చూపించింది. ఆ తర్వాత అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ నిరసన తెలిపిన పంత్, అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే, శార్దూల్ ఠాకూర్లపై ఐపీఎల్ మేనేజ్మెంట్ కఠిన చర్యలు తీసుకుంది. అంతకముందు ఆర్సీబీ సీనియర్ ఆటగాడు కోహ్లి ఎల్బీ విషయంలోనూ థర్డ్ అంపైర్ నిర్లక్ష్యం ప్రదర్శించడం విమర్శలకు దారి తీసింది. చదవండి: Sakshi Dhoni: జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ధోని భార్య భార్యను ఒప్పించి రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ క్రికెటర్ You're the umpire. Are you giving this out? 👀#LVCountyChamp pic.twitter.com/ec4fwFJOAS — LV= Insurance County Championship (@CountyChamp) April 24, 2022 -
బౌండరీ లోపలే క్యాచ్ పట్టాడు.. అయినా సిక్స్ ఇచ్చారు
లండన్: విటాలిటీ బ్లాస్ట్ క్రికెట్లో భాగంగా సోమర్సెట్, కెంట్ మధ్య జరిగిన టి20 ఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌లో సోమర్సెట్ బ్యాట్స్‌మన్ డీప్ స్వేర్‌లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు.కెంట్ ఫీల్డర్లు జోర్డాన్ కాక్స్, డేనియల్ బెల్లు మిస్ కమ్యునికేషన్ వల్ల క్యాచ్ తీసుకునేందుకు పరిగెత్తుకు వచ్చారు. కాక్స్ క్యాచ్ పట్టాడు.. అయితే బెల్ అప్పటికే బౌండరీ లైన్‌ను తాకుతూ వెళ్లాడు.. అతనితో కాక్స్ కూడా తగిలాడు. దీంతో ఫీల్డ్ అంపైర్స్ తమ నిర్ణయంపై క్లారిటీ లేక థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించారు. ఈ విషయంలో థర్డ్ అంపైర్ బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా వ్యవహరించాడు. అతను ఔట్ కాదంటూ సిక్స్ ఇచ్చేశాడు. క్లుప్తంగా ఇది జరిగింది. చదవండి: ఇకపై బ్యాట్స్‌మన్ కాదు.. బ్యాటర్.. క్రికెట్ రూల్స్‌లో కీలక మార్పు ఇక ఒక బ్యాట్స్‌మన్ కొట్టిన బంతిని ఫీల్డర్ బౌండరీ రోప్‌కు తాకుకుండా పట్టకుంటే క్లియర్ అవుట్ అని అందరికి తెలిసిందే. ఒకవేళ బౌండరీ రోప్ తాకితే ఔట్ ఇవ్వకుండా సిక్సర్ ఇవ్వడం క్రికెట్ పుస్తకాల్లో ఆనవాయితీ. మరి ఒక ఫీల్డర్ సేఫ్‌గా క్యాచ్ పట్టినప్పటికి మరో ఫీల్డర్ వచ్చి బౌండరీ లైన్ తాకడం.. అదే సమయంలో క్యాచ్ పట్టిన ఆటగాడిని ముట్టుకుంటే ఔట్ ఇస్తారా లేక బౌండరీ ఇస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అభిమానులు కామెంట్స్ చేశారు. అది కచ్చితంగా ఔటేనని కొందరు అభిప్రాయపడితే.. కాదు అని మరికొందరు అడ్డు తగిలారు. చదవండి: IPL 2021: మాతో టెస్టు రద్దు చేసుకున్నారు.. ఐపీఎల్ కూడా రద్దు చేస్తారా! క్రికెట్ పుస్తకాల్లో.. 19.5.1 లా ప్రకారం ఒక ఫీల్డర్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకునే క్రమంలో మరో ఫీల్డర్‌కు అనుకోకుండా తగిలితే బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గానే పరిగణిస్తారు.. కానీ ఆ నిర్ణయం ఫీల్డ్ అంపైర్‌పై ఆధారపడి ఉంటుంది. నిజానికి ఇక్కడ ఇద్దరు కావాలని తగిలినట్లు ఎక్కడా కనిపించలేదు. అయితే ఇక్కడ ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోకుండా థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించాడు. థర్డ్ అంపైర్ ఏ నిర్ణయం ఇచ్చినా ఫీల్డ్ అంపైర్ పాటించాలా వద్దా అన్నది అతనిపైనే ఆధారపడి ఉంటుంది. ఇక మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ నిర్ణయమే తన నిర్ణయమని ఫీల్డ్ అంపైర్ అనుకున్నాడు. అందుకే సోమర్సెట్ జట్టు బ్యాట్స్‌మన్ ఔట్ కాలేదు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం సోమర్సెట్ 20 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటై 25 పరుగులతో పరాజయం పాలైంది. Out or not? 🤔#Blast21 #FinalsDay pic.twitter.com/J8luyZMV6o — Vitality Blast (@VitalityBlast) September 18, 2021 -
74 పరుగులకే ఆలౌట్.. అండర్సన్ అరుదైన ఘనత
మాంచెస్టర్: ఇంగ్లండ్ సీనియర్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ 38 ఏళ్ల వయసులోను అదరగొడుతున్నాడు. తాజాగా కౌంటీ క్రికెట్లో భాగంగా లంకాషైర్ తరపున ఆడుతున్న అండర్సన్ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన బౌలర్‌గా అండర్సన్ చరిత్ర సృష్టించాడు. అంతేగాక కెంట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 7 వికెట్లు తీసి సత్తా చాటాడు. అండర్సన్ దెబ్బకు కెంట్ 74 పరుగులకే ఆలౌట్ అయింది. (10-5-19-7)తో అత్యుత్తమ గణాంకాలతో మెరిసిన అండర్సన్ జాక్ క్రాలే, జోర్డాన్ కాక్స్, ఓలీ రాబిన్సన్, హీనో కుహ్న్, జాక్ లీనింగ్, మాట్ మిల్నెస్, హ్యారీ పొడ్రమ్ల వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో ముగ్గురు బ్యాట్స్మెన్లు డకౌట్లుగా వెనుదిరగడం విశేషం. అనంతరం లంకాషైర్ ఇన్నింగ్స్ కూడా తడబాటుతోనే ప్రారంభమైంది. ప్రస్తుతం 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. స్టీవెన్ క్రాఫ్ట్ 8, రాబ్ జోన్స్ 7 పరుగులతో ఆడుతున్నారు. కాగా జూన్‌లో ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా అండర్సన్ నిలిచాడు. ఇప్పటివరకు 162 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అతను 617 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ 161 టెస్టులతో రెండో స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత స్టువర్ట్ బ్రాడ్ 147 టెస్టులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా టెస్టుల్లో 600 వికెట్లకు పైగా తీసిన ఫాస్ట్ బౌలర్లలో అండర్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక కౌంటీ క్రికెట్లో బిజీగా ఉన్న అండర్సన్ ఆ తర్వాత భారత్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్ ఓటమికి అండర్సన్ ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు. కాగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. 1️⃣0️⃣0️⃣0️⃣ first-class wickets @jimmy9 👏 Anderson has taken a 5-fer in 7 overs 🐐 Watch Anderson bowl here 👉 https://t.co/uJK9OLMTgs pic.twitter.com/j2535JaiAP — LV= Insurance County Championship (@CountyChamp) July 5, 2021 -
45 ఏళ్ల వయసులో ఏమా విధ్వంసం.. 15 ఫోర్లు, 15 సిక్సర్లు
లండన్: కౌంటీ క్రికెట్లో కెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న 45 ఏళ్ల ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ డారెన్ స్టీవెన్స్ బౌండరీలు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. టాలెంట్‌కు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించాడు. శుక్రవారం గ్లామోర్గన్‌తో జరిగిన మ్యాచ్‌లో 149 బంతుల్లో 15 బౌండరీలు, 15 సిక్సర్ల సాయంతో 128 స్ట్రయిక్ రేట్‌తో 190 పరుగులు సాధించాడు. లేటు వయసులో స్టీవెన్స్ చేసిన విధ్వంసాన్ని చూసిన యువ క్రికెటర్లు ముక్కున వేలేసుకున్నారు. Enjoy EVERY boundary from Darren Stevens' 190 😍 Watch him bowl LIVE: https://t.co/4ZkDAI69AU#LVCountyChamp pic.twitter.com/rgKdT0GtaT — LV= Insurance County Championship (@CountyChamp) May 21, 2021 ఇంతటితో ఆగని స్టీవెన్స్ బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. ఆసీస్ స్టార్ ఆటగాడు మార్నస్ లబూషేన్‌ను ఎల్బీడబ్యూ చేసి వయసు మీదపడినా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని, యువ బ్యాట్స్మెన్లకు సవాల్ విసిరాడు. ఇదిలా ఉంటే, 315 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన స్టీవెన్స్ 15940 పరుగులతో పాటు 565 వికెట్లు సాధించాడు. అతనికిది 36వ ఫస్ట్ క్లాస్ సెంచరీ. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కెంట్.. స్టీవెన్స్ అద్భుత ఇన్నింగ్స్ సహకారంతో 307 పరుగులు స్కోర్ చేయగలిగింది. Of course he's just dismissed Marnus Labuschagne for the second time this season Reminder: Darren Stevens is 45!!! 🤯 Watch Now: https://t.co/4ZkDAI69AU pic.twitter.com/Zab35CrmLb — LV= Insurance County Championship (@CountyChamp) May 21, 2021 92 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును స్టీవెన్స్ ఆదుకున్నాడు. ఎనిమిదో వికెట్‌కు 36 పరుగులు, తొమ్మిదో వికెట్‌కు 166 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. అనంతరం బౌలింగ్‌లో లబూషేన్‌ను ఔట్ చేసి ప్రత్యర్ధిని కోలుకోలుని దెబ్బతీశాడు. రెండు రోజు ఆట ముగిసే సమయానికి గ్లామోర్గన్ 2 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. చదవండి: సలాం సాహా.. నిజమైన ప్రొఫెషనలిజం చూపించావు -
బంతిని అందుకునే తాపత్రయం.. బొక్కబోర్లా పడ్డాడు
లండన్: జెంటిల్మన్ గేమ్‌గా పిలుచుకునే క్రికెట్లో ఫన్నీ మూమెంట్స్ జరగడం సహజమే. ఒక్కోసారి ఎవరు ఊహించిన విధంగా జరిగితే నవ్వులు పూయడం ఖాయం. తాజాగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ చాంపియన్‌షిప్ క్రికెట్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శుక్రవారం కెంట్, గ్లామోర్గాన్ మధ్య మ్యాచ్ జరిగింది. కెంట్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 28వ ఓవర్‌ను ఆస్ట్రేలియన్ బౌలర్ మైకెల్ నెసెర్ వేశాడు. నెసెర్ వేసిన బంతిని ఇంగ్లండ్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్ ఫైన్‌లెగ్ దిశగా ఆడాడు. బ్యాట్స్‌మెన్ ఇద్దరు కూల్‌గా సింగిల్ కంప్లీట్ చేశారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ చోటుచేసుకుంది. డీప్‌లో ఉన్న ఫీల్డర్ కీపర్ కమ్ కెప్టెన్ క్రిస్ కూక్‌కు త్రో విసిరాడు. అయితే అతను బంతిని రాంగ్ సైడ్‌లో వేయగా... దానిని అందుకునే ప్రయత్నంలో క్రూక్ వికెట్ స్టంపింగ్స్‌ను పట్టించుకోలేదు. ఇంకేముంది.. బంతిని అందుకున్నాడు గానీ అప్పటికే వికెట్ల పై నుంచి దాటుతూ బొక్కబోర్లా పడ్డాడు. కూక్ ప్యాంట్‌కు చిక్కుకొని రెండు వికెట్లు మొత్తం బయటికి వచ్చాయి. కెప్టెన్ చేసిన పనికి అతని సహచర ఆటగాళ్లు నవ్వాపుకోలేకపోయారు. ఈ వీడియోనూ గ్లామోర్గాన్స్ తన ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఫన్నీ చర్యతో తన సహచరులకు నవ్వు తెప్పించిన కూక్ కెప్టెన్‌గా.. బ్యాట్స్‌మన్‌గా మాత్రం అదరగొట్టాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో గ్లామోర్గాన్స్ తరపున 365 పరుగులు సాధించి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక కెంట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కూక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 45 ఓవర్ల ఆట ముగిసేసరికి కెంట్ 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. గ్లామోర్గాన్స్ బౌలర్ మైకెల్ నెసెర్(15-10-15-4) అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. చదవండి: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. సింపుల్‌గా కొట్టేశాడు 'పో.. వెళ్లి బౌలింగ్ చేయ్ బ్రో' 😂😂😂 @Cooky_24! His teammates enjoyed this one from the skipper!#GoGlam pic.twitter.com/fRGg7si1md — Glamorgan Cricket 🏏 (@GlamCricket) May 21, 2021 -
‘కెంట్’ త్వరలో ప్రపంచమంతటా..!
లండన్: ‘యూకేలో బయట పడిన కరోనా స్ట్రెయిన్ ‘కెంట్’ త్వరలో ప్రపంచమంతటా వ్యాపించే అవకాశం ఉంది. ఈ తరహా మ్యుటేషన్ కనీసం 10 ఏళ్ల పాటు కొనసాగవచ్చు’ అంటూ యూకే కోవిడ్–19 యూకే కన్సార్టియం డైరెక్టర్ ప్రొఫెసర్ పీకాక్ అభిప్రాయపడ్డారు. 2020 సెప్టెంబర్‌లో బయటపడిన ఈ స్ట్రెయిన్ ఇప్పటికే యూకేతో పాటు మరో 50 దేశాలకు వ్యాపించిందని ఆమె చెప్పారు. వైరస్ మ్యుటేషన్ జరగకుండా ఆగిపోతే బాధపడాల్సిన అవసరం లేదని, కానీ ఈ మ్యుటేషన్ కనీసం 10 ఏళ్ల పాటు కొనసాగవచ్చని భావిస్తున్నాను అంటూ హెచ్చరించారు. అయితే పదేళ్ల పాటు మహమ్మారి కొనసాగకపోవచ్చని, కానీ పాజిటివ్ కేసుల్లో వచ్చే మ్యుటేషన్ ప్రపంచంలో అక్కడక్కడా బయట పడొచ్చని అభిప్రాయపడ్డారు. -
కరోనా యూకే వేరియంట్‌తో పెను ముప్పు..
లండన్: బ్రిటన్‌లో కనిపించిన కొత్త రకం కరోనా(యూకే కెంట్ కోవిడ్ వేరియంట్) చాలా ప్రమాదకరంగా మారవచ్చని అక్కడి టాప్ సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకం వైరస్ వ్యాక్సిన్లను సైతం బోల్తా కొట్టిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. యూకేలో కోరలు చాచిన ఈ వేరియంట్.. ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తుందని యూకే జీనోమిక్స్ డైరెక్టర్ షారన్ పీకాక్ వెల్లడించారు. ఈ వేరియంట్‌కు తగట్టుగా వ్యాక్సిన్లను తయారు చేయాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌పై బాగానే పని చేస్తున్నా.. వైరస్ కొత్త రూపాలు వ్యాక్సిన్ పనితీరును దెబ్బతీస్తాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం యూకేని గడగడలాడిస్తున్న ఈ వేరియంట్‌ను కరోనా 1.1.7గా పిలుస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ వేరియంట్ యూకే వ్యాప్తంగా విస్తరిస్తోందని, అది మరోసారి మ్యుటేట్ అయితే చాలా ప్రమాదకరంగా మారుతుందని పీకాక్ తెలిపారు. ప్రస్తుతం యూకే వేరియంట్ వైరస్‌తోపాటు దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లు చాలా ప్రమాదకరంగా రూపాంతరం చెందుతున్నాయన్నారు. ఒక మ్యుటేషన్‌పై విజయం సాధిస్తే, వైరస్ మరో మ్యుటేషన్‌తో సవాలు విసురుతుందని, ఇలా కనీసం పదేళ్ల పాటు మ్యుటేషన్ల నుంచి సవాల్లు ఎదుర్కోక తప్పదని పీకాక్ హెచ్చరించారు. -
దారుణం.. ఎత్తుక్కెళ్లి మరీ రేప్ చేయబోయాడు
వాషింగ్టన్ : కాఫీ షాప్‌లో పని చేసే ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. ప్రతిఘటించటంతో బెదిరించి బయటకు ఎత్తుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. చివరకు ఎలాగోలా ఆమె అతని నుంచి తప్పించుకుంది. వాషింగ్టన్‌లోని కెంట్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ‘హాటీ షాట్స్ ఎస్ప్రెస్సో’ అనే ఓ కాఫీ షాపు ఉంది. కస్టమర్లకు బికినీ వేసుకుని 30 ఏళ్ల మేడ్లైన్ గుయింటో అనే మహిళ కాఫీ సర్వ్ చేస్తుంటుంది(ఈ టైప్ రెస్టారెంట్లు అక్కడ సహజం). ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఆమె తన పని చేసుకుంటుండగా.. కిటికీ గుండా ఓ వ్యక్తి ప్రవేశించాడు. ఆమెపై పడి అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే ఎవరైనా వస్తారేమోనన్న భయంతో ఆమెను కత్తితో బెదిరించి కిటీకి గుండానే బయటకు ఎత్తుకెళ్లాడు. ‘చీకట్లో అతని నుంచి తప్పించుకునేందుకు శాయశక్తుల కృషి చేశా.. కానీ, లాభం లేకపోయింది. బయటకు తీసుకెళ్లాక అతను నన్ను గాయపరిచాడు. ప్రాణాలు పోయినా ఫర్వాలేదని అరిచా. నేను అంత ప్రతిఘటిస్తానని బహుశా అతను ఊహించకపోయి ఉంటాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు’ అని ఆమె ఆ భయానక ఘటనను గుర్తు చేసుకుంటోంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు మైకేల్ రేనాల్డ్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి నేర చరిత్ర ఉందని.. ఓ దోపిడీ కేసులో పదేళ్ల శిక్ష అనుభవించిన రేనాల్డ్స్ గత సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడంట. కెంట్ పోలీసులు ఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. నిందితుడు మైకేల్ రేనాల్డ్స్ -
కాఫీ షాప్ నుంచి ఎత్తుక్కెళ్లి మరీ..
-
ఒక తల్లి క్షమాపణ
భారత మూలాలున్న బ్రిటిష్ పౌరురాలు సుజాతా సేతియా(35) తన కూతురికి క్షమాపణలు చెబుతూ చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అసలు పిల్లలే వద్దనుకున్న సుజాత కూతురు పుట్టడంతో డిప్రెషన్ లోకి వెళ్లింది. ఏ దశలోనూ ఆ చిన్నారిని ప్రేమించలేదని ఒకప్పటి తన సంకుచిత బుద్ధిని మొహమాటంలేకుండా వెల్లడించిదా తల్లి. కెంట్(బ్రిటన్)లోని డార్ట్ ఫోర్డ్లో నివసించే సుజాత తన ఫేస్ బుక్ పేజీలో ఇలా రాసింది.. 'నేను పిల్లల్ని కనాలని అస్సలు అనుకోలేదు. మూడేళ్ల కిందట అయాత్ పుట్టినప్పుడు నేను చాలా బాధపడ్డా. ఆపలేని ఆమె పుట్టుక నన్ను డిప్రెషన్ లోకి నెట్టేసింది. సుదీర్ఘకాలం ఆ ఒత్తిడిలోనే ఉండిపోయా. ఇష్టం లేనిదాన్ని ప్రేమించడం ఎవరికైనా కష్టమే కదా! కాలం తన పని తాను చేసుకుపోయింది.. ఈ మధ్యే ఫ్యామిలీ మొత్తం చిన్న ట్రిప్ కి వెళ్లాం. నా జీవితాన్ని మార్చేసిన ఆ పర్యటనలో మొల్లగా నాక్కొన్ని విషయాలు అర్థమయ్యాయి. మొదటిది నేను ప్రేమించకుంన్నా నా మీద ఆధారపడటం ద్వారా తను నా ప్రేమను పొందగలిగింది. అంటే నేను ఆమెను ప్రేమించడంలేదన్నది నిజంకాదు. నా కూతురంటే నాకు చచ్చేంత ప్రేమ ఉందని తెలుసుకున్నాను. ఇన్నాళ్లూ ఒక వెర్రి భ్రమలో బతికినందుకు నన్ను నేను నిందించుకున్నా. క్షమాపణగా ఆమె బాల్యానికి సంబంధించిన అద్భుతం ఏదైనా ఇవ్వాలనుకున్నా. అందుబాటులో ఉన్న కెమెరాతో నా కూతురు అయాత్ ఫొటోలు తీశా. ఇవి కేవలం ఫొటోలేకాదు నా క్షమాపణా పత్రాలు కూడా.. -
80 మందితో డేటింగ్ చేస్తూ ఫ్రీగా వరల్డ్ టూర్
న్యూయార్క్: ప్రపంచలోని పలు దేశాలను తిరిగి రావాలని, అక్కడి అందచందాలను ఆస్వాదించాలని, విలాసవంతమైన రిస్టారెంట్లలో, ఖరీదైనా విల్లాలలో బస చేయాలని, లగ్జరీ విమానాలలో ప్రయాణించాలని, కాస్లీ ప్రైవేటు పడవల్లో కుషీ చేయాలని ఎవరికుండదు. ఉన్నా అది కలల్లో తప్ప ఎంతటి సంపన్నులకైనా అంత ఈజీగా సాధ్యం కాదు. కానీ బ్రిటన్‌లోని కాంటర్బరీకి చెందిన 30 ఏళ్ల నటాలి వుడ్‌కు సాధ్యమైంది. సాధ్యమవుతోంది. అందులో ఒక్క పైసా కూడా చేతి నుంచి ఖర్చు పెట్టకుండా. అదేలా అని ఆశ్చర్యం వేయకమానదు. అదే నటాలి స్పెషాలిటీ. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆమె ప్రపంచ దేశాల ప్రయాణం ఇంకా ముగియలేదు. కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే టర్కీ, అబుదాబీ, దుబాయ్, కువైట్, మాల్దీవులు, ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్ లాంటి దేశాల్లో విహరించిన నటాలి ప్రస్తుతం అమెరికాలోని మయామిలో సరదాగా విహరిస్తున్నారు. అంతేకాదు సందర్శించిన ప్రతి దేశంలో కూడా సొంతానికి చిల్లిగవ్వ కూడా లేకుండా ఖరీదైన షాపింగ్ చేస్తున్నారు. నచ్చిన వస్తువులను సొంతం చేసుకుంటున్నారు. ఆమెకు ఇదంతా సాధ్యమైందీ, అవుతున్నది డేటింగ్ వెబ్సైట్ ‘మిస్ ట్రావెల్’. రెండేళ్ల క్రితం ఆమె అందులో ఖాతా తెరిచారు. అందులో పరిచయం చేసుకున్న 80 మందితో ఇప్పటి వరకు డేటింగ్ చేశారు. ఆమె విమాన ఖర్చులు, బస, విలాసాలకు ఖర్చు పెట్టిందంతా డేటింగ్ చేసిన సంపన్నులైన మొగవాళ్లే. వారంతా ఆమెకు ‘బంగారాన్ని తవ్వే భామ’ అని ముద్దుగా పిలుస్తున్నా, ఆమె మాత్రం తాను బెస్ట్ వరల్డ్ ట్రావెలర్ అని చెప్పుకుంటున్నారు. తనలో ప్రపంచ దేశాలను తిరిగే తపనతో పాటు సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలనే తాపత్రయం కూడా తన పర్యటన లక్ష్యమని ఆమె చెబుతున్నారు. తనకు నచ్చే జీవిత భాగస్వామిని ఎప్పుడు ఎంపిక చేసుకుంటానో, ఎంతకాలం ఈ ప్రపంచ యాత్ర కొనసాగుతుందో తాను ఇప్పుడే చెప్పలేనని నటాలీ చెబుతున్నారు. తనకన్నా వయస్సులో కాస్త పెద్దవాళ్లతోనే ఇప్పటి వరకు తాను డేటింగ్ చేస్తూ వచ్చానని, ఇప్పటికి 80 డేటింగ్లు పూర్తయ్యాయని ఆమె తెలిపారు. ప్రతి డేటింగ్ తనకు ఓ అందమైన అనుభూతినే ఇచ్చిందని చెప్పారు. తనకు సెక్స్ ముఖ్యం కాదని, కంపెనీ ముఖ్యమని అన్నారు. ఎవరైన సంపన్న వర్గానికి చెందిన మగవాళ్లు తనకు ఇట్టే సన్నిహితులవుతున్నారని, ఆ సాన్నిహిత్యం సహజంగానే సెక్స్‌కు దారితీస్తుందని ఆమె తెలిపారు. తన శరీర సౌందర్యం కూడా అందుకు కారణమేనని ఆమె చెప్పారు. తాను తన పర్యటన సందర్భంగా డేటింగ్ చేసిన మగవాళ్లతో ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టించిందీ తాను ఎప్పుడూ లెక్కవేయలేదని, ఆ ఖర్చు కోటీ రూపాయలకు పైనే ఉండవచ్చని ఆమె అన్నారు. ‘నేను డేటింగ్ చేసిన వారిలో ఎక్కువ మంది వ్యాపారవేత్తలే ఉన్నారు. వారంతా నాకు ఖర్చుపెట్టేంత స్తోమత కలిగినవారే. ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నా విషయంలో నేను నిజాయితీగానే ఉంటాను. ప్రపంచం తిరుగుతున్నా కొద్దీ ఇంకా తిరగాలనిపిస్తోంది. ఎందుకంటే ట్రావెలింగ్ అంటే నాకు ప్రాణం. అందుకు డబ్బు కావాలి. కంపెనీ కావాలి. నేను ఎక్కడికెళ్లినా, ఎవరితో వెళ్లినా ముందుగా నా రక్షణ చూసుకుంటాను. నాతో డేటింగ్ చేయాలనుకున్న వారి వివరాలు పూర్తిగా సేకరిస్తాను. వారిని కలసుకోవడానికి ముందు వారి గుర్తింపు కార్డును కోరుతాను. ఇంతవరకు నేను కలసిన వారంతా జెంటిల్మెన్లే. ఈ జూన్ నెలలో కువైట్‌లో ఓ ఇంటర్నేషనల్ అకౌంటెంట్‌ను కలుసుకున్నాను. ఆయన ఆహ్వానంపై నేను ఆయన దేశం వెళ్లాను. ఆయన స్నేహితుడొకరికి విలాసవంతమైన పడవ ఉంది. అందులోనూ, ఖరీదైనా విల్లాలలోనూ వారం రోజులపాటు కులాసా పార్టీలు చేసుకున్నాం. ఒక్క నయా పైసా నేను చేతి నుంచి ఖర్చు పెట్టలేదు. షాపింగ్ చేసి డిజైనర్ దుస్తులు కొనుక్కున్నాను. దుబాయ్ పర్యటన కూడా నాకు ఎంతో తృప్తినిచ్చింది. మొదటి విడత లగ్జరీ హోటళ్లలో గడిపాను. రెండో విడత ఆయన లగ్జరీ విల్లాలో గడిచిపోయింది. నేను ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు కూడా వెళ్లాను. ఆయనకు ఎన్నో ప్రైవేటు విమానాలు ఉన్నాయి. అందులో ఓ విమానాన్ని మేమే ఎంగేజ్ చేసుకున్నాం. నగ్నంగా తిరిగే బీచ్‌కు వెళ్లడం కూడా నాకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చింది’ అని ప్రస్తుతం మయాంలో మకాం వేసిన నటాలి తన గురించి చెప్పుకున్నారు. తాను వన్ వే టిక్కెట్‌పై మయామి వచ్చానని, తనను ఇక్కడికి తీసుకొచ్చిన ఓ వ్యాపారవేత్తకు దురదృష్టవశాత్తు వ్యాపార లావాదేవీలపై లండన్ తిరిగి వెళ్లిపోయారని నటాలి తెలిపారు. తాను ఎంతకాలం ఇక్కడ ఉంటానో, ఇక్కడి నుంచి ఏ దేశం వెళతానో కూడా తనకు తెలియదని అన్నారు. ‘మిస్ ట్రావెల్’ సైట్లో వెతుక్కునే కొత్త పార్ట్నర్ను బట్టి తన పర్యటన ఆధారపడి ఉందని చెప్పారు. తన ఈ ప్రయాణం ఎంత దూరం, ఎన్ని దేశాలు సాగుతుంతో, ఎన్ని ఏళ్లు పడుతుందో కూడా తాను చెప్పాలేనని అన్నారు.