80 మందితో డేటింగ్ చేస్తూ ఫ్రీగా వరల్డ్ టూర్
న్యూయార్క్: ప్రపంచలోని పలు దేశాలను తిరిగి రావాలని, అక్కడి అందచందాలను ఆస్వాదించాలని, విలాసవంతమైన రిస్టారెంట్లలో, ఖరీదైనా విల్లాలలో బస చేయాలని, లగ్జరీ విమానాలలో ప్రయాణించాలని, కాస్లీ ప్రైవేటు పడవల్లో కుషీ చేయాలని ఎవరికుండదు. ఉన్నా అది కలల్లో తప్ప ఎంతటి సంపన్నులకైనా అంత ఈజీగా సాధ్యం కాదు. కానీ బ్రిటన్‌లోని కాంటర్‌బరీకి చెందిన 30 ఏళ్ల నటాలి వుడ్‌కు సాధ్యమైంది. సాధ్యమవుతోంది. అందులో ఒక్క పైసా కూడా చేతి నుంచి ఖర్చు పెట్టకుండా. అదేలా అని ఆశ్చర్యం వేయకమానదు. అదే నటాలి స్పెషాలిటీ.
రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆమె ప్రపంచ దేశాల ప్రయాణం ఇంకా ముగియలేదు. కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే టర్కీ, అబుదాబీ, దుబాయ్, కువైట్, మాల్దీవులు, ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్ లాంటి దేశాల్లో విహరించిన నటాలి ప్రస్తుతం అమెరికాలోని మయామిలో సరదాగా విహరిస్తున్నారు. అంతేకాదు సందర్శించిన ప్రతి దేశంలో కూడా సొంతానికి చిల్లిగవ్వ కూడా లేకుండా ఖరీదైన షాపింగ్ చేస్తున్నారు. నచ్చిన వస్తువులను సొంతం చేసుకుంటున్నారు.
ఆమెకు ఇదంతా సాధ్యమైందీ, అవుతున్నది డేటింగ్ వెబ్‌సైట్ ‘మిస్ ట్రావెల్’. రెండేళ్ల క్రితం ఆమె అందులో ఖాతా తెరిచారు. అందులో పరిచయం చేసుకున్న 80 మందితో ఇప్పటి వరకు డేటింగ్ చేశారు. ఆమె విమాన ఖర్చులు, బస, విలాసాలకు ఖర్చు పెట్టిందంతా డేటింగ్ చేసిన సంపన్నులైన మొగవాళ్లే. వారంతా ఆమెకు ‘బంగారాన్ని తవ్వే భామ’ అని ముద్దుగా పిలుస్తున్నా, ఆమె మాత్రం తాను బెస్ట్ వరల్డ్ ట్రావెలర్ అని చెప్పుకుంటున్నారు. తనలో ప్రపంచ దేశాలను తిరిగే తపనతో పాటు సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలనే తాపత్రయం కూడా తన పర్యటన లక్ష్యమని ఆమె చెబుతున్నారు.
తనకు నచ్చే జీవిత భాగస్వామిని ఎప్పుడు ఎంపిక చేసుకుంటానో, ఎంతకాలం ఈ ప్రపంచ యాత్ర కొనసాగుతుందో తాను ఇప్పుడే చెప్పలేనని నటాలీ చెబుతున్నారు. తనకన్నా వయస్సులో కాస్త పెద్దవాళ్లతోనే ఇప్పటి వరకు తాను డేటింగ్ చేస్తూ వచ్చానని, ఇప్పటికి 80 డేటింగ్‌లు పూర్తయ్యాయని ఆమె తెలిపారు. ప్రతి డేటింగ్ తనకు ఓ అందమైన అనుభూతినే ఇచ్చిందని చెప్పారు. తనకు సెక్స్ ముఖ్యం కాదని, కంపెనీ ముఖ్యమని అన్నారు. ఎవరైన సంపన్న వర్గానికి చెందిన మగవాళ్లు తనకు ఇట్టే సన్నిహితులవుతున్నారని, ఆ సాన్నిహిత్యం సహజంగానే సెక్స్‌కు దారితీస్తుందని ఆమె తెలిపారు. తన శరీర సౌందర్యం కూడా అందుకు కారణమేనని ఆమె చెప్పారు. తాను తన పర్యటన సందర్భంగా డేటింగ్ చేసిన మగవాళ్లతో ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టించిందీ తాను ఎప్పుడూ లెక్కవేయలేదని, ఆ ఖర్చు కోటీ రూపాయలకు పైనే ఉండవచ్చని ఆమె అన్నారు.
‘నేను డేటింగ్ చేసిన వారిలో ఎక్కువ మంది వ్యాపారవేత్తలే ఉన్నారు. వారంతా నాకు ఖర్చుపెట్టేంత స్తోమత కలిగినవారే. ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నా విషయంలో నేను నిజాయితీగానే ఉంటాను. ప్రపంచం తిరుగుతున్నా కొద్దీ ఇంకా తిరగాలనిపిస్తోంది. ఎందుకంటే ట్రావెలింగ్ అంటే నాకు ప్రాణం. అందుకు డబ్బు కావాలి. కంపెనీ కావాలి. నేను ఎక్కడికెళ్లినా, ఎవరితో వెళ్లినా ముందుగా నా రక్షణ చూసుకుంటాను. నాతో డేటింగ్ చేయాలనుకున్న వారి వివరాలు పూర్తిగా సేకరిస్తాను. వారిని కలసుకోవడానికి ముందు వారి గుర్తింపు కార్డును కోరుతాను. ఇంతవరకు నేను కలసిన వారంతా జెంటిల్‌మెన్‌లే.
ఈ జూన్ నెలలో కువైట్‌లో ఓ ఇంటర్నేషనల్ అకౌంటెంట్‌ను కలుసుకున్నాను. ఆయన ఆహ్వానంపై నేను ఆయన దేశం వెళ్లాను. ఆయన స్నేహితుడొకరికి విలాసవంతమైన పడవ ఉంది. అందులోనూ, ఖరీదైనా విల్లాలలోనూ వారం రోజులపాటు కులాసా పార్టీలు చేసుకున్నాం. ఒక్క నయా పైసా నేను చేతి నుంచి ఖర్చు పెట్టలేదు. షాపింగ్ చేసి డిజైనర్ దుస్తులు కొనుక్కున్నాను. దుబాయ్ పర్యటన కూడా నాకు ఎంతో తృప్తినిచ్చింది. మొదటి విడత లగ్జరీ హోటళ్లలో గడిపాను. రెండో విడత ఆయన లగ్జరీ విల్లాలో గడిచిపోయింది. నేను ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు కూడా వెళ్లాను. ఆయనకు ఎన్నో ప్రైవేటు విమానాలు ఉన్నాయి. అందులో ఓ విమానాన్ని మేమే ఎంగేజ్ చేసుకున్నాం. నగ్నంగా తిరిగే బీచ్‌కు వెళ్లడం కూడా నాకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చింది’ అని ప్రస్తుతం మయాంలో మకాం వేసిన నటాలి తన గురించి చెప్పుకున్నారు.
తాను వన్ వే టిక్కెట్‌పై మయామి వచ్చానని, తనను ఇక్కడికి తీసుకొచ్చిన ఓ వ్యాపారవేత్తకు దురదృష్టవశాత్తు వ్యాపార లావాదేవీలపై లండన్ తిరిగి వెళ్లిపోయారని నటాలి తెలిపారు. తాను ఎంతకాలం ఇక్కడ ఉంటానో, ఇక్కడి నుంచి ఏ దేశం వెళతానో కూడా తనకు తెలియదని అన్నారు. ‘మిస్ ట్రావెల్’ సైట్‌లో వెతుక్కునే కొత్త పార్ట్‌నర్‌ను బట్టి తన పర్యటన ఆధారపడి ఉందని చెప్పారు. తన ఈ ప్రయాణం ఎంత దూరం, ఎన్ని దేశాలు సాగుతుంతో, ఎన్ని ఏళ్లు పడుతుందో కూడా తాను చెప్పాలేనని అన్నారు.