world tour
-
సెమీస్‌లో కిరణ్ జార్జి
ఇక్సాన్ సిటీ: కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ కిరణ్ జార్జి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 44వ ర్యాంకర్ కిరణ్ జార్జి 21–14, 21–16తో ప్రపంచ 34వ ర్యాంకర్, ఐదో సీడ్ టకుమా ఒబయాషి (జపాన్)పై గెలుపొందాడు. తద్వారా ఈ ఏడాది తొలిసారి ఓ అంతర్జాతీయ టోర్నీలో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.ఒబయాషిపై కిరణ్కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ మాజీ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)తో కిరణ్ తలపడతాడు. -
జలమార్గాన ప్రపంచయానం
భారత నౌకా దళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు జలమార్గాన ప్రపంచాన్ని చుట్టబోతున్నారు. లెఫ్టినెంట్ కమాండర్లు ఎ.రూప, కె.దిల్నా అతి త్వరలో ఈ సాహసానికి పూనుకోనున్నట్టు నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మాధ్వాల్ ఆదివారం వెల్లడించారు. నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్వీ తరిణి నౌకలో వారు ప్రపంచాన్ని చుట్టి రానున్నట్టు తెలిపారు. వారిద్దరూ మూడేళ్లుగా ‘సాగర్ పరిక్రమ’ యాత్ర చేస్తున్నారు. ‘‘సాగర్ పరిక్రమ అత్యుత్తమ నైపుణ్య, శారీరక దృఢత్వం, మానసిక అప్రమత్తత అవసరమయ్యే అతి కఠిన ప్రయాణం. అందులో భాగంగా వారు కఠోర శిక్షణ పొందారు. వేల మైళ్ల ప్రయాణ అనుభవమూ సంపాదించారు’’ అని మాధ్వాల్ వెల్లడించారు. ‘గోల్డెన్ గ్లోబ్ రేస్’ విజేత కమాండర్ (రిటైర్డ్) అభిలాష్ టోమీ మార్గదర్శకత్వంలో వారిద్దరూ శిక్షణ పొందుతున్నారు. గతేడాది ఆరుగురు సభ్యుల బృందంలో భాగంగా గోవా నుంచి కేప్‌టౌన్ మీదుగా బ్రెజిల్‌లోని రియో డిజనీరో దాకా వాళ్లు సముద్ర యాత్ర చేశారు. తర్వాత గోవా నుంచి పోర్ట్‌బ్లెయిర్ దాకా సెయిలింగ్ చేపట్టి తిరిగి డబుల్ హ్యాండ్ పద్ధతిలో బయలుదేరారు. ఈ ఏడాది ఆరంభంలో గోవా నుంచి మారిషస్‌లోని పోర్ట్ లూయిస్ దాకా డ్యూయల్ హ్యాండ్ విధానంలో విజయవంతంగా సార్టీ నిర్వహించారు. నౌకాయాన సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి భారత నావికాదళం గణనీయమైన ప్రయత్నాలు చేసిందని, సముద్ర వారసత్వాన్ని పరిరక్షించడానికి ఇలాంటి యాత్రలను ప్రోత్సహిస్తోందని మాధ్వాల్ తెలిపారు. ఐఎన్ఎస్–తరంగిణి, ఐఎన్ఎస్–సుదర్శిని, ఐఎన్ఎస్వీ–మహదీ, తరిణి నౌకల్లో సముద్రయానం ద్వారా భారత నావికాదళం సాహసయాత్రలకు కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. 2017లో జరిగిన చరిత్రాత్మక తొలి ‘నావికా సాగర్ పరిక్రమ’లో భాగంగా మన మహిళా అధికారుల బృందం ప్రపంచాన్ని చుట్టొచి్చంది ఐఎన్ఎస్వీ తరిణిలోనే! 254 రోజుల ఆ సముద్రయానంలో బృందం ఏకంగా 21,600 మైళ్లు ప్రయాణించింది. – న్యూఢిల్లీ -
27 ఏళ్లు శ్రమించి.. 195 దేశాలు చుట్టేసి..
ప్రపంచంలోని అన్ని దేశాలను సందర్శించడమే అతడి లక్ష్యం.. ఆ దిశగా ఎంతో కష్టపడ్డారు. సుమారు 27 ఏళ్లు ఎంతో శ్రమకోర్చి అన్ని దేశాలను సందర్శించి అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుతం 195 దేశాల సందర్శన పూర్తి చేసుకుని తెలుగుగడ్డపై బుధవారం అడుగుపెట్టారు. ఈ అరుదైన ఘనత సాధించిన వ్యక్తి మన తెలుగువాడు కావడం విశేషం.ప్రపంచాన్నే చుట్టేసిన 43 ఏళ్ల వయస్సు కలిగిన రవిప్రభు స్వస్థలం విశాఖపట్నం. ఆయన హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో చదువుకున్నాడు. పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రుడైన రవిప్రభు విద్యార్థి దశలోనే 1996లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వివాహం చేసుకొని ఉద్యోగం చేసుకుంటూనే విదేశాలను సందర్శించడం ప్రారంభించారు. భూటాన్ దేశాన్ని సందర్శించడంతో ప్రారంభమైన ఆయన యాత్ర వెనుజులతో ముగిసింది. ప్రపంచంలోని దేశాలను సందర్శిస్తూనే 2020లో ఒక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. మొత్తం సందర్శన విశేషాలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ వచ్చారు.అన్ని దేశాలను చుట్టేసి వచ్చిన ఆయన రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 600 మందికి పైగా అంతరిక్షంలోకి వెళ్లారు. 6,600 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రపంచంలోని 850 కోట్ల మందిలో 280 మంది మాత్రమే ప్రతి దేశాన్ని సందర్శించారని అన్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన 280 మందిలో తనకు స్థానం లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. 27 ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రయాణాల కోసం రూ.25 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. -
Moushmi Kapadia: ఎడారి చీకటి నుంచి వెన్నెల వెలుగులోకి...
‘మీ బిడ్డ నాలుగు–అయిదు సంవత్సరాలకు మించి బతకడు’ అని వైద్యులు చెప్పినప్పుడు ఎత్తైన చోటు నుంచి చీకటిలోయల్లో పడిపోయినట్లు తల్లడిల్లి పోయింది . మూడు సంవత్సరాలు డిప్రెషన్ చీకట్లో కూరుకుపోయిన మౌష్మి ఒక్కొక్క అడుగు వేస్తూ వెలుగుదారిలోకి వచ్చింది. ఆట–పాటలతో తనలో ఉత్సాహాన్ని నింపుకొంది. ఆ ఉత్సాహాన్ని శక్తి చేసుకుంది. గా దేశాన్ని చుట్టి వచ్చింది. గా ఎన్నో సాహసాలు చేసింది ఇంటి గడప దాటలేడు అనుకున్న కుమారుడికి ప్రపంచం చూపుతూ ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తోంది మౌష్మి కపాడియా... మౌష్మి కపాడియా కుమారుడు ఆర్ఎస్ఎమ్డీ) అని నిర్ధారించిన వైద్యులు ‘ఇది నయం చేయలేని వ్యాధి’ అన్నారు. ఆ బాధ మాటలకు అందనిది. తట్టుకోలేనిది. తనలో తాను ఎంతో కుమిలిపోయింది మౌష్మి. పిల్లాడికి సంబంధించి ఏం చేయాలి? ఏం చేయకూడదు, ఎలా కేర్ తీసుకోవాలో వివరించారు వైద్యులు. వేదాన్షును తీసుకొని దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న భర్త ప్రియేష్ దగ్గరకు వెళ్లింది. మూడేళ్ల వయసులో వేదాన్ష్ కు గురయ్యాడు. ఐసీయూలో ఉన్న తన బిడ్డను చూసి కుప్పకూలిపోయింది మౌష్మి. ఆ భయానకమైన రోజు ఇప్పటికీ తన కళ్లముందే కదలాడుతున్నట్టు ఉంటుంది. బిడ్డ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలియదు. తాను చేయగలిగిందల్లా దూరం నుంచి బిడ్డను చూస్తూ మనసులో ఏడ్వడం మాత్రమే. ఆశ కోల్పోయిన వైద్యులు... ‘దేవుడిని ప్రార్థించండి. మేము మా వంతు ప్రయత్నం చేశాం’ అన్నారు. ఈ మాటలు తనను మరింత కృంగిపోయేలా చేశాయి. వెంటిలేటర్‌పై అయిదురోజులు ఉన్నాడు వేదాన్షు. ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ ఒకరు మెరుగైన చికిత్స కోసం ఇండియాకు వెళితే మంచిది అని సలహా ఇచ్చాడు. అతడి సలహా ప్రకారం బిడ్డను తీసుకొని భర్తతో కలిసి ముంబైకి వచ్చింది మౌష్మి. అబ్బాయిని ఇంటికి తీసుకువెళ్లిన రోజును గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ వణికిపోతుంది మౌష్మి. ‘ఇరవై ఏళ్ల క్రితం దుబాయ్‌లో వైద్యసదుపాయాలు అంత బాగాలేవు. శ్వాస తీసుకోవడానికి అవసరమైన ప్రత్యేక యంత్రాలు లేవు’ అని దుబాయ్‌లో ఆనాటి పరిస్థితులను గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. ముంబైలోని హాస్పిటల్లో కొన్నిరోజులు ఉన్న తరువాత వేదాన్షు పరిస్థితి మెరుగుపడింది. ఆశాదీపం ఏదో కనిపించి ఆ క్షణంలో ధైర్యం ఇచ్చింది. అయితే వైద్యులు మాత్రం... ‘నాలుగు–అయిదు సంవత్సరాలకు మించి బతకడు’ అని చెప్పారు. బలహీనమైన ఊపిరితిత్తుల వల్ల వేదాన్షు ఎన్నోసార్లు నిమోనియా బారిన పడ్డాడు. ‘ఇంటి నుంచి ఆస్పత్రి–ఆస్పత్రి నుంచి ఇంటికి’ అన్నట్లు ఉండేది పరిస్థితి. కొంత కాలం తరువాత మరో బిడ్డకు జన్మనిచ్చింది మౌష్మి. ఇది మౌష్మి జీవితాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. డిప్రెషన్ అనే చీకట్లోకి తీసుకెళ్లింది. ‘అకారణంగా కోపం వచ్చేది. చీటికిమాటికి చిరాకు పడేదాన్ని. తలుపులు గట్టిగా వేసేదాన్ని. నేను డిప్రెషన్లో ఉన్నాను అనే విషయం అప్పుడు తెలియదు. ఇలా ఎందుకు చేస్తున్నాను? అని నా గురించి నేను ఆలోచించే పరిస్థితిలో లేను. ఆ సమయంలో నా ఫ్రెండ్ ఒకరు కౌన్సిలింగ్‌కు వెళ్లమని సలహా ఇచ్చారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. అయితే మందుల ప్రభావంతో ఆమె బరువు పెరిగింది. ఆ బరువు మోకాళ్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ‘ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి’ అని చెప్పారు వైద్యులు. అలా తన ఫిట్నెస్ జర్నీ మొదలైంది. కొత్త జీవితానికి మొదటి అడుగు పడింది. తనకు ఇష్టమైన టెన్నిస్ ఆడడం మొదలు పెట్టింది. ఆడుతున్న సమయంలో తన మూడ్ చేంజ్ అవుతున్నట్లు, ఉత్సాహం వచ్చి చేరుతున్నట్లు అనిపించింది. జుంబా క్లాసులలో కూడా చేరి మరింత ఉత్సాహాన్ని పెంచుకుంది. మూడేళ్లపాటు డిప్రెషన్‌తో పోరాడి బయట పడిన మౌష్మి ఇద్దరు బిడ్డలను కంటి పాపల్లా చూసుకోవాలనుకుంది. ‘గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోని బెస్ట్ మామ్ కావాలనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. మూడు సంవత్సరాలుగా తనను వెంటాడిన నిరాశానిస్పృహలు, విషాదం కోపం లాంటి వాటి నుంచి బయటపడిన తరువాత పిల్లలతో హాయిగా గడిపే కాలం, పిల్లలే నా ప్రపంచం అనే కల కన్నది. బైక్‌పై దేశాన్ని చుట్టి రావాలి... ఎత్తైన పర్వతశిఖరాలను అధిరోహించాలి అనేది తన కల. పీడకలలాంటి జీవితం నుంచి బయటపడ్డ మౌష్మి కపాడియా తన కలను నిజం చేసుకుంది. పర్వతారోహణకు సంబంధించి ఎన్నో సాహసాలు చేసింది. ఇంటికే పరిమితం అవుతాడనుకున్న వేదాన్షుకు ప్రపంచాన్ని చూపింది. ‘విషాదం తప్ప అతడికి తోడు ఏదీ లేదు’ అని ఇతరులు సానుభూతి చూపే సమయంలో ‘నిరంతరం ఆనందమే నా బలం’ అని ధైర్యంగా ముందుకువెళ్లేలా చేసింది. బిడ్డతో కలిసి 21 దేశాలకు వెళ్లి వచ్చిన మౌష్మి కపాడియా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకుంది. సవాళ్లను అధిగమించేలా... వేదాన్ష్లో వయసుకు మించిన పరిణతి కనిపిస్తుంది. ఓటమికి తలవంచని వేదాన్షు నోటి నుంచి తరచుగా వచ్చే మాట ‘హ్యాపీ ఎబౌట్ ఎవ్రీ థింగ్ అండ్ శాడ్ ఎబౌట్ నథింగ్’ ‘జీవితం మన ముందు ఎన్నో సవాళ్లు పెడుతుంది. వాటిని అధిగమిస్తామా లేదా అనేదానిపైనే మనం ముందుకు వెళ్లే దారి నిర్ణయం అవుతుంది’ అంటాడు వేదాన్ష్. -
విమానం ఎక్కకుండా ప్రపంచాన్ని చుట్టేశాడు
2013 అక్టోబర్ 10న డెన్మార్క్‌లోని ఇంటి నుంచి బయలుదేరాడు థోర్. 3,512 రోజుల తర్వాత 203 దేశాలు చూసి మే 23, 2023న మాల్దీవుల్లో యాత్ర ముగించాడు. విమానం ఎక్కకుండా ఇలా ప్రపంచాన్ని చుట్టినవాడు ఇతడే. ‘ఇన్ని దేశాలు తిరగడం ఎందుకు?’ అనంటే ‘అన్ని దేశాలు ఉన్నాయి కనుక’ అని జవాబు. జూన్ 13న మాల్దీవుల నుంచి ఇంటికి మరలుతున్నాడు థోర్. ‘తువాలు’, ‘టోంగా’, ‘సమోవా’, ‘పలావు’, ‘నౌరు’, ‘కిరిబటి’.... ఇవేంటని అనుకుంటున్నారా? దేశాలు. ఇవి మీరు విని ఉండొచ్చు. వినకపోయి ఉండొచ్చు. ఏమంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలు 193. ‘కాని ఇంకా ఉన్నాయి. అవి తమను తాము దేశాలుగా చెప్పుకుంటాయి. ఐక్యరాజ్యసమితి ఇంకా గుర్తించకపోవచ్చు’ అంటాడు థోర్. అందువల్ల థోర్ చుట్టి వచ్చిన దేశాల సంఖ్య అక్షరాలా 203. వీటిలో యూరప్ నుంచి 37, ఆసియా నుంచి 20, సౌత్ అమెరికా నుంచి 12, ఆఫ్రికా నుంచి 54... ఇలా ప్రపంచ పటంలోని అన్ని దేశాలు అతను చుట్టి వచ్చాడు. ► మనుషుల్ని కలవడానికి... ‘స్నేహితుడు అని ఎవర్ని అనాలంటే అప్పటి దాకా పరిచయం కాని అపరిచితుణ్ణే’ అనే స్లోగన్‌తో థోర్ తన ప్రపంచ యాత్ర మొదలెట్టాడు. డెన్మార్క్‌కు చెందిన 44 ఏళ్ల ఈ వివాహితుడు కొంతకాలం మిలట్రీలో, ఆ తర్వాత షిప్పింగ్ లాజిస్టిక్స్‌లో పని చేశాడు. దేశాలు చూడటం పిచ్చి. కొత్త మనుషుల్ని కలవడం ఇష్టం. అందుకని ప్రపంచంలోని అన్ని దేశాలు చుట్టి రావాలనుకున్నాడు. అయితే డబ్బు పరిమితుల దృష్ట్యా, ఎటువంటి సవాలుకు వీలులేని విమానయానం ద్వారా కాకుండా రైళ్లు, ఓడలు, వాహనాల ద్వారా ప్రపంచం చుట్టాలనుకున్నాడు. దాదాపు పదేళ్ల పాటు ఇంటి ముఖం చూడకుండా తిరిగేశాడు. ► రోజుకు 20 డాలర్లు డెన్మార్క్‌కు చెందిన కొన్ని సంస్థల స్పాన్సర్‌షిప్‌తో యాత్ర మొదలెట్టాడు థోర్. ప్రయాణానికి, తిండికి, వీసా ఫీజులకు కలిపి రోజుకు కేవలం 20 డాలర్లు (1600 రూపాయలు) ఖర్చు చేస్తూ ఈ యాత్ర సాగించాలనుకున్నాడు. దొరికిన తిండి తినడం, ఫ్రీగా బస పొందడం... లాంటి పనుల ద్వారా ఇది సాధ్యమే అనిపించాడు. అతని యాత్రను బ్లాగ్‌లో, ఫేస్బుక్లో రాస్తూ వెళ్లడం వల్ల చదివిన పాఠకులు ఎప్పటికప్పుడు సహాయం చేస్తూ వెళ్లారు. దాంతో ఇన్ని రోజులు అతని విశ్వదర్శనం సాగింది. ‘ఒక్కో దేశంలో కేవలం 24 గంటలు మాత్రమే గడుపుతూ వెళ్లాను. ఎందుకంటే ఒక దేశం నుంచి ఇంకో దేశం ప్రయాణించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ దారిలో మనుషుల్ని కలవడమే ఇష్టపడ్డాను’ అంటాడు థోర్. అతను తన ప్రయాణంలో భాగంగా మన దేశానికి డిసెంబర్ 12, 2018న వచ్చాడు. ► ప్రతిదీ లెక్క థోర్ తన ప్రయాణంలో ప్రతిదీ రికార్డు చేశాడు. ఏ మోసం లేకుండా ఎక్కడికక్కడ టికెట్లు పెడుతూ వెళ్లాడు. తన మొత్తం ప్రయాణంలో 351 బస్సులు, 158 ట్రైన్లు, 43 టుక్‌టుక్‌లు (ఆటో), 37 కంటైనర్ షిప్‌లు, 33 పడవలు, 9 ట్రక్కులు, 3 సెయిల్బోట్లు, 2 క్రూయిజ్ షిప్‌లు ఉపయోగించాడు. మే 23న మాల్దీవుల్లో ఇతని యాత్ర ముగిసింది. అయితే ఇన్నాళ్లూ కుటుంబానికి దూరంగా ఉన్నాడా? లేదు. అతని భార్య అతణ్ణి వెతుక్కుంటూ వెళ్లి కలిసేది. మొత్తం ఇన్ని రోజుల్లో 27 చోట్ల 27 సార్లు కలిసిందామె. అన్నట్టు ఈ మొత్తం యాత్ర పేరు ‘ఒన్స్ అపాన్ ఏ సాగా’. -
కలల అలలపై... అలలు అలలుగా
అలలు అలలుగా తెరలు తెరలుగా తరగలు తరగలుగా ఎగిసిపడిన కెరటాలుగా నల్ల సముద్రం , నీలి సంద్రం ఎర్ర సముద్రం మొత్తంగా సప్త సముద్రాలు వాటి లోతు తెలిసేలా , వాటి ఆటుపోట్లను అర్థం చేసుకునేలా అన్నింటిని చుట్టేస్తూ ఆమె తన కలల ప్రయాణానికి సిద్ధమైంది. పాఠాలు చెప్పే ఆ పంతులమ్మ జీవిత చరమాంకంలో సముద్ర ఘోష వింటూ తన అనుభూతులకి అక్షరరూపమివ్వాలని ఆశపడుతోంది. హాయిగా మనవలు, మనవరాళ్లతో కాలం గడిపే వయసు. ఏ బాదర బందీ లేకుండా ఎవరో వండిపెడితే తింటూ కాలం గడిపే వయసు. అయినా ఆమెలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. సర్వస్వతంత్రంగా వ్యవహరించే ఆమె తనకున్న ఆస్తుల్ని అమ్మకానికి పెట్టారు. ఎం.వి.జెమిని అనే నౌకలో ప్రపంచ యాత్ర చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆమే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన షరాన్ లేన్. ఇప్పుడు ఆమె వయసు 75 ఏళ్లు. హైస్కూలు రిటైర్డ్ టీచర్. చిన్నప్పట్నుంచి ప్రయాణాలంటే ఆమెకు చాలా ఇష్టం. అడ్వంచర్స్ అంటే చెప్పలేనంత థ్రిల్. స్కూల్లో విదేశీ భాషలు బోధించేవారు. స్కూలు పిల్లల్ని తీసుకొని యూరప్ దేశాలన్నీ చుట్టేసి వచ్చారు. అయినా ఆమెకు లైఫ్‌లో ఏదో అసంతృప్తి. ఇంకొన్ని దేశాలు తిరగాలి. అక్కడ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు తెలుసుకోవాలి. సరికొత్త రుచులు చవి చూడాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. జీవితంలో అనుక్షణం కొత్తదనం కోసం పరితపించే లేన్‌కు ఎంవి.జెమిని అనే నౌక ప్రయాణం ఒక చుక్కానిలా కనిపించింది. ఈ నౌక ప్రపంచాన్ని చుట్టి వస్తుందని సన్నిహితులు చెబితే తెలుసుకున్నారు. ఒక రోజు కాదు రెండ్రోజులు కాదు ఏకంగా మూడేళ్లు నౌక ప్రయాణం. ఆ నౌకలో అత్యంత తక్కువ ధరకి లభించే ఒక చిన్న కేబిన్లాంటి గదికి ఏడాదికి 30 వేల డాలర్లు చెల్లించాలి. తన ఆస్తిపాస్తుల్ని అమ్మేస్తే మూడేళ్లకి సరిపడా డబ్బులు వచ్చేస్తాయని ఆ గది బుక్ చేసుకున్నారు. ఆ చిన్న గదికి కనీసం కిటికీ కూడా ఉండదు. కానీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక చిన్న స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. అదే మహద్భాగ్యంగా భావించారు. నవంబర్ 1 నుంచి ఈ నౌక ప్రయాణం ప్రారంభమవుతుంది. కూతురికి చెబితే ఏమంటుందోనని ఆమెకి మాట మాత్రంగానైనా చెప్పలేదు. గాలి, ఎండ సోకని ఆ గదిలో కేవలం రాత్రి పూట మాత్రమే గడిపి మిగిలిన సమయమంతా తనకెంతో ఇష్టమైన సముద్రాన్ని చూస్తూ గడిపేస్తానని చెబుతున్నారు. నౌకలో తోటి ప్రయాణికులతో మాటలు కలపడం, కొత్త స్నేహితుల్ని చేసుకోవడం కూడా ఆమెకు ఇష్టమే. మొత్తం మూడేళ్ల పాటు సాగే ప్రయాణంలో ఎంవి జెమిని నౌక 375 రేవు పట్టణాల్లో ఆగుతుంది. ఇండియా నుంచి చైనా, మాల్దీవ్స్, ఆస్ట్రేలియా ఇలా అన్ని దేశాలు తిరుగుతుంది. ‘‘నాకున్న లక్ష్యం ఒక్కటే. ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త విషయం నా బ్లాగ్‌లో రాయాలి. కలం పేరుతో ఒక బ్లాగ్‌ను ఏర్పాటు చేసి అందులో నా అనుభవాలన్నీ కథలుగా రాస్తాను. ఎవరైనా నాలుగ్గోడల మధ్య మగ్గిపోతూ ఇంట్లో కూర్చుంటే ఏం వస్తుంది. పది మందిలో తిరిగితేనే జీవితంపై అవగాహన వస్తుంది. అందులోనూ సముద్రాన్ని చూస్తూ ప్రయాణమంటే అదో అవధుల్లేని అనుభూతి. ఇల్లంటే మన మనసుకి ఎంతో ఇష్టమైన ప్రదేశమే కావొచ్చు. కానీ విమానమో, పడవో, రైలో ఏదో ఒకటి ఎక్కి బయట ప్రపంచాన్ని చూడండి. అదెంత అద్భుతంగా ఉంటుందో’’ అని లేన్ తన మనసులో మాట వెల్లడించారు. మూడేళ్లంటే తక్కువ కాలం ఏమీ కాదు. అందులోనూ కరోనా సోకిన తర్వాత ఆమె శ్వాసకోశ సంంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అయినా కూడా ఆమె దేనికీ భయపడట్లేదు. ఇల్లు కంటే పడవే పదిలమంటున్నారు. తాను ప్రయాణించే పడవలో కూడా అనారోగ్యం వస్తే చికిత్స అందించే ఏర్పాట్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఇలా ఒంటరి ప్రయాణం ఆమెకు కొత్తేం కాదు. చాలా కాలంగా ఆమె ఒంటరిగానే జీవిస్తున్నారు. ఇప్పుడీ ప్రయాణం ఆమెలో ఉత్సాహాన్ని నింపి వయసుని మరింత తగ్గించింది. మరి మనమూ లేన్‌కి హ్యాపీ జర్నీ చెప్పేద్దాం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుం‘టూరు’ వచ్చిన ప్రపంచ పర్యాటకురాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచ పర్యటనలో ఉన్న ఇటలీ దేశస్తురాలు ఎలీనా ఎగ్జీనా సోమవారం గుంటూరు నగరానికి వచ్చారు. గత మూడున్నరేళ్లుగా బైక్‌పై 28 దేశాలను సందర్శించిన ఆమె ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా చెన్నై నుంచి వైజాగ్ వెళ్తూ మార్గ మధ్యలో గుంటూరు పండరీపురంలోని పులుగు దీపక్ నీట్, జేఈఈ ఉచిత శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ శిక్షణ పొందుతున్న విద్యారి్థనులతో మమేకమై మహిళా సాధికారతపై మాట్లాడారు. విద్యారి్థనులు విద్యావంతులుగా ఆకాశమే హద్దుగా ఎదగాలని సూచించారు. తన పర్యటన విశేషాలను వివరిస్తూ బైక్‌పై మూడున్నరేళ్ల క్రితం మొదలైన తన ప్రపంచ యాత్ర ఇప్పటికి 28 దేశాల్లో ఎక్కడా ఒక్క హోటల్లో బస చేయకుండా, నిరంతరం కొనసాగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విభిన్న సంస్కృతులు, భిన్నమైన ప్రదేశాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పారు. ఈసందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. ఎలీనాను సత్కరించిన శిక్షణా కేంద్ర నిర్వాహకుడు పులుగు దీపక్ భారతదేశ గొప్పతనాన్ని వివరించే స్పేస్ సైన్స్ పుస్తకాన్ని బహూకరించారు. గుంటూరులో తనకు లభించిన ఆదరణ, ఆతీ్మయ స్వాగతంపై ఎలీనా ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
స్టార్ హీరో షాకింగ్ నిర్ణయం?
నటుడు అజిత్ రూటే సపరేటు. ఆయనకు నటన వృత్తి. బైక్ రేస్, రైఫిల్ షూటింగ్ ప్రవృత్తి. అగ్ర కథానాయకుడిగా రాణిస్తునే మరోపక్క మనసుకు నచ్చిన పలు క్రీడాంశాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొని బహుమతులను గెలుచుకున్నారు. అనంతరం 30 రోజుల పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో బైక్‌పై ప్రయాణించి మక్కువను తీర్చుకున్నారు. ప్రస్తుతం హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మిస్తున్న తుణివు చిత్ర షూటింగ్ పూర్తి చేశారు. ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలింది. నటి మంజు వారియర్ నాయకిగా నటిస్తోంది. బ్యాంక్ రాబరింగ్ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో అజిత్ మరోసారి బైక్‌పై ప్రపంచాన్ని చుట్టి రావడానికి రెడీ అవుతున్నారు. ఈసారి ఆయన భారీ బైక్ ప్రయాణానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. 18 నెలల బైక్ ప్రయాణంలో అంటార్కిటికా సహా ఏడు ఖండాలు దాటి 62 దేశాలు చుట్టి రానున్నారని సమాచారం. అయితే అంతకుముందు నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించడానికి అజిత్ సిద్ధం అవుతున్నారు. ఈ క్రేజీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత అజిత్ బైక్ ప్రయాణం ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీంతో ఆయన ఏడాదిన్నర పాటు సినీ ప్రపంచానికి దూరంగా ఉండనున్నట్లు తెలిసింది. చదవండి: Rajeev Kanakala: సంపాదన విషయంలో గొడవలు? రాజీవ్ వ్యాఖ్యలు వైరల్ -
Inspirational Story: నా కొడుకుకు కళ్లులేకపోతేనేం.. నా కళ్లతో లోకాన్ని పరిచయం చేస్తా!
దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అనే నానుడికి మరో ఉదాహరణ ఆమె కథ. వికలాంగుడైన బిడ్డను ఇతర తల్లుల్లా చెత్త కుప్పల్లో పడేయడానికి ఆమె మాతృ హృదయం వెనుకాడింది. అమ్మకు బిడ్డ ఎప్పటికీ బరువు కాదుగా! అందుకే కడుపున మోసిన బిడ్డను ఈ సారి వీపున మోసింది. ప్రపంచం అంచులా దాకా తీసుకెళ్లింది. కళ్లు కనిపించని బిడ్డకు తన కళ్లతో లోకమంతా చూపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ తల్లీబిడ్డలకు చెందిన ఫొటోలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. వీటిని చూస్తే మీరు ఖచ్చితంగా భావోధ్వేగానికి గురౌతారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ సన్‌షైన్ కోస్ట్‌కు చెందిన నిక్కి ఆంత్రమ్ (43)కు 17 ఏళ్ల వయసులో మగ బిడ్డ పుట్టాడు. ఐతే పుట్టిన బిడ్డకు అంగవైకల్యంతోపాటు, కళ్లు కూడా కనిపించవని తెలుసుకుని కుమిలిపోయింది. ఐతేనేమి తన కళ్లతో బిడ్డకు లోకాన్ని చూపాలనుకుంది. 24 గంటలు కొడకు జిమ్మీ వెన్నంటే ఉండి ఏ కష్టం తెలియకుండా పెంచసాగింది. ఇప్పుడు జిమ్మీకి 26 ఏళ్లు. ఐతే ప్రపంచ పర్యటన (వరల్డ్ టూర్)కు వెళ్లాలనుకున్న నిక్కి తన కొడుకును కూడా తనతోపాటే తీసుకెళ్లాలనుకుంది. వీపుపై జిమ్మీని మోస్తూ హవాయి నుంచి బాలి వరకు అనేక ప్రదేశాలకు కొడుకును తీసుకెళ్తోంది. మామూలు పిల్లలకు అందినట్టే నా కొడుకుకు కూడా సకల ఆనందాలను పంచాలనుకుంటున్నాను. నా కోడుకు జిమ్మీతో కరోనా వ్యాప్తికి ముందే కెనడాను సందర్శించానలనుకున్నాను. డైపర్లు, బట్టలు, బెడ్ ప్యాడ్స్, దుప్పట్లు, దిండులు మాతో పాటు తీసుకెళ్తున్నాను. వీపుపై జిమ్మీని మోయడం ప్రాక్టీస్ చేశాను కూడా. ఇక మరిన్ని ప్రదేశాలను మేమిద్దరం సందర్శిస్తామని నిక్కీ చెబుతోంది. నిక్కీ - జిమ్మీల కథ ఎందరికో ఆదర్శం. చదవండి: నోట్లో గుడ్డలు కుక్కి.. పీక నులిమి హత్య! ఏం ఎరగనట్టు నాటకం.. -
కాఫీ దుకాణంతో ఆదాయం.. 25 దేశాలు పర్యటించిన వృద్ధ దంపతులు!
అవకాశం ఉన్నప్పుడే కలలను నెరవేర్చుకోవాలి. లేదంటే అవి ఎప్పటికీ కల్లలాగే మిగిలిపోతాయి. వాటిని సాకారం చేసుకోవాలంటే వయసు అడ్డంకి ఎప్పుడూ కాదని ఈ జంటను చూస్తే తెలుస్తుంది. 27 యేళ్ల క్రితం ఓ వృద్ధ దంపతులు ప్రపంచదేశాలు చుట్టెయ్యాలని కలగన్నారు. అంతటితో ఊరుకోలేదు. కార్యచరణ కూడా రూపొందించుకున్నారు. ఇప్పటికే దాదాపుగా 25 దేశాలకు వెళ్లివచ్చారు కూడా. ఈ నెలలో 26వ ట్రిప్పుకు వెళ్తున్నారు. కేవలం టీ దుకాణం జీవనోపాధిగా జీవనం సాగిస్తున్నా ఈ వృద్ధ దంపతులు చెప్పే విశేషాలేమిటే తెలుసుకుందాం... కేరళలోని కొచ్చికి చెందిన కేఆర్ విజయన్ (71), అతని భార్య మోహన (69) ‘శ్రీబాలాజీ కాఫీ హౌస్’అనే కాఫీ షాప్ నడుపుతున్నారు. కాఫీ దుకాణం ద్వారా ఆర్జించిన సొమ్ము ద్వారా ప్రపంచదేశాలు తిరిగిరావాలనే కలను నెరవేర్చుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాలు చుట్టేశారు. ఐతే కరోనా మహమ్మారి కారణంగా వీరి ప్రయాణం రెండేళ్లు వాయిదా పడింది. మళ్లీ ఈ నెల21 న తమ ప్రయాణం తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రిప్‌లో రష్యాకెళ్లి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్పుతిన్ను కలవాలను కుంటున్నారట కూడా. 2007లో ఇజ్రాయెల్ సందర్శనతో వీరి మొదటి విదేశీ యాత్ర ప్రారంభమైంది. వీరి చివరి యాత్ర 2009 నవంబర్ - డిసెంబర్లో సాగింది. ఈ సమయంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలను సందర్శించారు. ఈ ట్రిప్‌కు మహీంద్ర గ్రూప్ చైర్మాన్ ఆనంద్ మహీంద్ర స్పాంసర్ చేశారు కూడా. ఇలా అమెరికా, బ్రెజిల్, జర్మనీ.. వంటి ఇతర దేశాలను చుట్టేశారు. వీరు ట్రావెల్ ఏజెన్సీల సహాయంతో కేవలం బేసిక్ ఇంగ్లీష్‌తో విదేశీ యాత్రలు చేస్తున్నారు. ‘కోవిడ్ తర్వాత పర్యాటక ప్రదేశాలు తిరిగితెరిచినట్టు తెలిసింది. మా ట్రావెల్ ఏజెంట్ కూడా ఫోన్ చేసి, తర్వాత ట్రిప్ రష్యా అని చెప్పాడు. రష్యా టూర్లో మొదట మా ఇద్దరి పేర్లను తప్పక చేర్చమని చెప్పాను. ఈ ట్రిప్ అక్టోబర్ 21 నుంచి 28 వరకు ఉంటుంది. ఈ ట్రిప్‌లో మా మనుమలు కూడా పాల్గొంటున్నారని’ కేఆర్ విజయన్ మీడియాకు తెలిపాడు. "ఈ సారి రష్యా వెళ్లాలనుకుంటున్నాను. కోవిడ్ మహమ్మారి కారణంగా మేము చాలా కష్టపడ్డాము. ఇప్పుడు మళ్లీ ప్రయాణించే అవకాశం దక్కింది" అని మోహన అన్నారు. తీర్థయాత్రలకు వెళ్లే వయసులో ప్రపంచదేశాలు చుట్టెయ్యాలని ఉవ్విళ్లూరుతున్న ఈ దంపతులు నేటి యువతకు ఆదర్శం అనడంలో సందేహం లేదు కదా! చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! -
టీ కొట్టు నడుపుతూ.. రోజూ రూ.300 దాచిపెట్టి.. ఏకంగా 25 దేశాలు..
కొచ్చి: జీవితంలో ప్రతీఒక్కరికీ ఓ కల ఉంటుంది. అయితే కొందరు పరిస్థితుల ప్రభావాల వల్ల మధ్యలోనే వదిలేస్తుంటే మరికొందరు అనుకున్నది ఎలాగైనా సాధిస్తున్నారు. అచ్చం ఇలానే ఓ వృద్ధ జంట ప్రపంచాన్ని చేట్టేయాలని కలలు కన్నారు. వాటిని ఇప్పడు నిజం చేసుకుంటున్నారు. ఇందులో ఏముంది ధనవంతులు అనుకుంటే ఇలాంటివి ఈజీనే అంటారా! అలా అనుకుంటే పొరపాటే.. ఆ దంపతులు టీ కొట్టు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అలా సంపాదించిన డబ్బులతోను వాళ్లు తమ విదేశి యాత్రలను స్టార్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన వృద్ధ జంట కె.ఆర్. విజయన్, ఆయన భార్య టీ కొట్టుతో జీవనం సాగిస్తుంటారు. ప్రపంచాన్ని చుట్టేయాలన్నది వారి చిరకాల స్వప్నం. అయితే వారికి చిన్న టీ కొట్టు మాత్రమే ఆదాయ మార్గం. ఉన్నదాంతోనే వారు తమ కలలను నిజం చేసుకోవాలనుకున్నారు. అనుకున్నట్లే వారు ఇప్పటికే 25 దేశాలను చుట్టేయగా, తరువాత 26వ దేశానికి కూడా వెళ్లనున్నారు. వీరికి పెద్దగా ఇంగ్లిష్ మాట్లాడటం రాదు కాబట్టి ట్రావెల్ ఏజెన్సీల సాయం తీసుకొని వీరు తమ ప్రయాణాలు ఖరారు చేస్తుంటారు. యాత్ర ఇలా ప్రారంభమైంది కాఫీ షాపు నుంచి రోజు దాచిపెట్టిన డబ్బులు ద్వారా ఈ జంట 2007లో మొదటి సారిగా వారి విదేశీ పర్యటనను ఇజ్రాయల్‌తో మొదలుపెట్టింది. వీరి స్ఫూర్తిదాయక యాత్ర గురించి తెలియడంతో మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ అనంద్ మహింద్ర ఆ వృద్ధ జంటకు ఒక పర్యటనను స్పాన్సర్ కూడా చేసేందుకు ముందుకొచ్చారు. 2019లో.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సందర్శించారు. అదే వారు చేపట్టిన చివరి విదేశీ పర్యటన. ఎందుకంటే ఆ తర్వాత మహమ్మారి కారణంగా వారి ప్రపంచ యాత్రలకు బ్రేక్ పడింది. విదేశీ పర్యటనల కోసం ఈ జంట తమ ఆదాయం నుంచి ప్రతీ రోజు రూ.300 దాచిపెట్టేవారు. పర్యటనల కోసం కొన్న సార్లు వీరు అప్పులు చేసి తిరిగి వచ్చాక వాటిని తీర్చిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే కరోనా నుంచి ప్రపంచం క్రమంగా బయటకు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ జంట మరోసారి విదేశీ యాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే వారు రష్యా వెళ్లనున్నారు. ఎలాగూ అంత దూరం వెళ్తున్నాం కదా కుదిరితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవాలనుకుంటోంది ఈ వృద్ధ జంట. అక్టోబర్ 21న ప్రారంభమయ్యే వీరి యాత్ర అక్టోబర్ 28న ముగియనుంది. చదవండి: నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే.. -
Zara Rutherford: గాలిలో తేలినట్టుందే..!
నీటిమీద, నేల మీద ప్రపంచాన్ని చుట్టి రికార్డులు సృష్టించినవాళ్లు చాలామందే ఉన్నారు. వీరందరికీ భిన్నంగా ఓ 19 ఏళ్ల అమ్మాయి గాల్లో ప్రయాణిస్తూ ప్రపంచాన్ని చుట్టి సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. బెల్జియన్ బ్రిటిష్ సంతతికి చెందిన జరా రూథర్‌ఫర్డ్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ‘బెస్పోక్ షార్క్ ఆల్ట్రాలైట్ ’ విమానంలో ప్రపంచాన్ని చుట్టేయనుంది. ఆగస్టు పదకొండున బ్రసెల్స్‌లో ప్రారంభమయ్యే జరా ప్రపంచ యాత్ర మూడు నెలలు కొనసాగి యూరప్ లో ముగుస్తుంది. 52 దేశాలను చుట్టే క్రమంలో 51 వేల కిలోమీటర్లు ప్రయాణించనుంది. జరా తల్లిదండ్రులు ఇద్దరు పైలట్లు కావడంతో 14 ఏళ్ల వయసునుంచే విమానం నడపడం నేర్చుకుంది. పద్దెనిమిదో ఏట విమానం నడిపే లైసెన్స్ తీసుకుంది. జరా యాత్ర సవ్యంగా సాగితే ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి అతిపిన్న వయస్కురాలిగా నిలవనుంది. ప్రస్తుతం 30 ఏళ్ల వయసులో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన షెస్తావాయి (2017) పేరుమీద రికార్డు ఉండగా, పురుషుల విభాగంలో 18 ఏళ్ల అతిపిన్న వయస్కుడి మీద మరో రికార్డు ఉంది. ‘‘అమ్మ కాస్త వెనక్కు లాగినప్పటికీ, నాన్న మాత్రం ఎప్పుడూ ప్రోత్సహించేవారు. ఆ ప్రోత్సాహంతోనే ఈరోజు యాత్రకు సిద్ధమయ్యాను. నా యాత్ర విజయవంతమైన తరువాత స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్) చదువుతోన్న చాలామంది అమ్మాయిలు ప్రేరణ పొంది ఏవియేషన్ రంగంలోకి వస్తారు. ఈ విభాగంలో పురుషులకు, మహిళలకు మధ్య చాలా తేడా ఉంది. అందుకే నేను రికార్డు నెలకొల్పి ఏవియేషన్‌లో అమ్మాయిలు కూడా రాణించగలరని నిరూపిస్తాను’’ అని జరా చెప్పింది. -
తొలి టైటిల్ లక్ష్యంగా సింధు, సైనా
బాసెల్: కొత్త సీజన్లో తొలి టైటిల్ సాధించాలనే లక్ష్యంగా భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ స్విస్ ఓపెన్‌లో బరిలోకి దిగుతున్నారు. నేడు మొదలయ్యే ఈ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో సింధుకు సులువైన ‘డ్రా’ ఎదురుకాగా... సైనాకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. రెండో సీడ్‌గా పోటీపడుతున్న ప్రస్తుత ప్రపంచ చాంపియన్ సింధు తొలి రౌండ్లో టర్కీ క్రీడాకారిణి, ప్రపంచ 29వ ర్యాంకర్ నెస్లిహాన్ యిజిట్తో ఆడునుంది. ముఖాముఖి రికార్డులో సింధు 1–0తో ఆధిక్యంలో ఉంది. పదేళ్ల క్రితం నెస్లిహాన్తో మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ జూనియర్ చాలెంజ్ టోర్నీలో ఆడిన ఏకైక మ్యాచ్‌లో సింధు వరుస గేముల్లో గెలిచింది. మరోవైపు ప్రపంచ 19వ ర్యాంకర్ సైనా తొలి రౌండ్లో థాయ్‌లాండ్ అమ్మాయి, ప్రపంచ 31వ ర్యాంకర్ ఫిటాయాపోర్న్ చైవాన్‌తో తలపడుతుంది. 2019 థాయ్‌లాండ్ ఓపెన్‌లో చైవాన్‌తో ఆడిన సైనా వరుస గేముల్లో నెగ్గింది. సైనా తొలి రౌండ్ దాటితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో తలపడే అవకాశముంది. ఒకే పార్శ్వంలో సింధు, సైనా ఉండటంతో క్వార్టర్ ఫైనల్‌ను దాటితే ఈ ఇద్దరు భారత స్టార్స్ సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుంచి ఎనిమిది మంది పోటీపడనున్నారు. ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, ప్రణయ్, సౌరభ్ వర్మ, అజయ్ జయరామ్, పారుపల్లి కశ్యప్, లక్ష్య సేన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... ధ్రువ్ కపిల –అర్జున్... మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప –సాత్విక్ సాయిరాజ్... సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీలు బరిలో ఉన్నాయి. -
మళ్లీ ఓడిన సింధు, శ్రీకాంత్
బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్లు పూసర్ల వెంకట సింధు, కిడాంబి శ్రీకాంత్ వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో నిరాశ పరిచారు. సీజన్‌కు సంబంధించిన ఈ ముగింపు టోర్నీలో లీగ్ దశతోనే సరిపెట్టుకున్నారు. ప్రపంచ చాంపియన్ సింధు, మాజీ ప్రపంచ నంబర్‌వన్ శ్రీకాంత్ వరుసగా రెండో లీగ్ మ్యాచ్‌లోనూ పరాజయం పాలయ్యారు. దీంతో వీరిద్దరు సెమీస్ చేరుకునే అవకాశాలు గల్లంతయ్యాయి. మహిళల సింగిల్స్ గ్రూప్ ‘బి’లో గురువారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో తెలుగమ్మాయి సింధు 18–21, 13–21తో మాజీ ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి చవిచూసింది. గత వారం ఇదే ప్రత్యర్థి చేతిలో థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఓడిన ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు ఈ మ్యాచ్‌లోనూ తన ఆటతీరును, ఫలితాన్ని మార్చుకోలేకపోయింది. ప్రపంచ చాంపియన్‌పై మూడో సీడ్ రచనోక్‌కు ఇది ఆరో విజయం. వీరిద్దరూ పలు అంతర్జాతీయ టోర్నీల్లో ఇప్పటివరకు పది సార్లు తలపడితే సింధు 4 సార్లు మాత్రమే గెలిచింది. తొలి గేమ్‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. ఆరంభంలో అయితే సింధు దూకుడుగా ఆడటంతో 4–2తో మొదలైన ఆమె ఆధిక్యం 14–11 దాకా కొనసాగింది. ఈ దశలో రచనోక్ వరుసగా మూడు పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది. క్రమంగా సింధుపై తన ఆధిపత్యం చలాయిస్తూ 21–18తో గేమ్ నెగ్గింది. తర్వాత రెండో గేమ్‌లో సింధు పట్టు కోల్పోయింది. ఇదే అదనుగా రచనోక్ 9–8 స్కోరు వద్ద వరుసగా మూడు పాయింట్లు గెలుచుకుంది. వెంటనే సింధు కూడా మూడు పాయింట్లు చేసినప్పటికీ తర్వాత థాయ్‌లాండ్ స్టార్... సింధుకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా చెలరేగి ఆడింది. దీంతో ఈ గేమ్, మ్యాచ్ గెలిచేందుకు ఆమెకు ఎంతోసేపు పట్టలేదు. 43 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. పరాజయంపై సింధు మాట్లాడుతూ ‘ఈ రోజు నాది కాదు. నాకేం కలిసిరాలేదు. తొలి గేమ్ ఓడిపోవడం... తర్వాత నేను వెనుకబడటంతో మ్యాచ్‌లో నిరాశ తప్పలేదు’ అని పేర్కొంది. పురుషుల ఈవెంట్ గ్రూప్ ‘బి’లో భారత స్టార్ శ్రీకాంత్ 21–19, 9–21, 19–21తో నాలుగో సీడ్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడాడు. వాంగ్ జుపై శ్రీకాంత్‌కు 3–0తో మంచి రికార్డే ఉంది. అందుకు తగ్గట్లే శ్రీకాంత్ తొలి గేమ్‌ను గెలుచుకున్నాడు. కానీ రెండో గేమ్‌ను చిత్తుగా కోల్పోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో మళ్లీ పోరాటం చేసినప్పటికీ వాంగ్ జు ఆ అవకాశం ఇవ్వలేదు. గంటా 18 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ పోరులో శ్రీకాంత్‌కు పరాజయం తప్పలేదు. నేటి నామ మాత్రమైన మ్యాచ్‌లో సింధు... పోర్న్‌పవి (థాయ్‌లాండ్)తో, శ్రీకాంత్... క లంగ్ అంగుస్ (హాంకాంగ్)తో తలపడతారు. -
ఓటమితో మొదలు...
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లకు శుభారంభం లభించలేదు. బుధవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో మహిళల, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ఇద్దరికీ ఓటమి ఎదురైంది. మహిళల సింగిల్స్ గ్రూప్ ‘బి’లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్, ప్రస్తుత వరల్డ్ చాంపియన్ సింధు 21–19, 12–21, 17–21తో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–15, 16–21, 18–21తో 77 నిమిషాల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశాడు. తై జు యింగ్ చేతిలో సింధుకిది 13వ ఓటమికాగా... ఆంటోన్సెన్ చేతిలో శ్రీకాంత్‌కు రెండో పరాజయం. నేడు జరిగే రెండో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో సింధు... వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్ ఆడతారు. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌ల్లో సింధు, శ్రీకాంత్ గెలవాల్సి ఉంటుంది. తై జు యింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి గేమ్ లో గెలిచినా ఆ తర్వాత అదే జోరు కనబర్చలేకపోయింది. రెండో గేమ్‌లో వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి 0–5 తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో ఇద్దరు ప్రతి పాయింట్ కోసం పోరాడటంతో ఆట హోరాహోరీగా సాగింది. ఒకదశలో సింధు 13–14తో తై జు యింగ్ ఆధిక్యాన్ని ఒక పాయింట్‌కు తగ్గించింది. ఈ దశలోనే తై జు వరుసగా మూడు పాయింట్లు సాధించి 17–13తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న తై జు యింగ్ విజయాన్ని ఖాయం చేసుకుంది. ‘మ్యాచ్ బాగా జరిగింది. ఏ పాయింట్ కూడా సులువుగా రాలేదు. మూడో గేమ్‌లో ఇద్దరి మధ్య పాయింట్ల అంతరం ఒక పాయింట్‌కు చేరుకుంది కూడా. అయితే ర్యాలీల సందర్భంగా రెండుసార్లు నా రాకెట్ స్ట్రింగ్స్ దెబ్బతినడం తుది ఫలితంపై ప్రభావం చూపింది’ అని సింధు వ్యాఖ్యానించింది. ఆంటోన్సెన్తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ కీలకదశలో తప్పిదాలు చేశాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో 17–16తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్ ఈ దశలో వరుసగా నాలుగు పాయింట్లు సమర్పించుకొని తేరుకోలేకపోయాడు. -
3 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టేసింది!
అబుదాబి : 3 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిందో మహిళ. అతి తక్కువ సమయంలో 208 దేశాలు తిరిగింది. వివరాల్లోకి వెళితే.. యూఏఈకి చెందిన డాక్టర్ ఖావ్లా అల్ రొమైతీ అనే మహిళకు గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాలనేది కల. అందుకోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుడితే బాగుంటుందని అనిపించింది. అందుకోసం ప్రణాళికలు తయారు చేసుకుంది. ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచ యాత్ర మొదలు పెట్టింది. ఫిబ్రవరి 13వ తేదీన ఆస్ట్రేలియాలోని సిడ్నీవద్ద యాత్రను ముగించింది. ( బాయ్‌కాట్ బింగో: రణ్‌వీర్‌పై ట్రోలింగ్ ) 3 రోజుల 14 గంటల 46 నిమిషాల్లో 208 దేశాలను చుట్టేసింది. అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టినందుకుగానూ ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. గురువారం గిన్నిస్ బుక్ వారు ఇచ్చిన సర్టిఫికేట్‌తో ఫొటో దిగి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ‘‘నాకు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అంటే ఎంతో ఆసక్తి. అందుకే ప్రపంచాన్ని చుట్టేశా.. గిన్నిస్ బుక్ సర్టిఫికేట్ అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. అది మాటల్లో చెప్పలేన’’ని పేర్కొన్నారు. ( ‘కరోనా’కి జై కొడుతున్నారు! ) View this post on Instagram A post shared by 7ℭ𝔬𝔫𝔱𝔦𝔫𝔢𝔫𝔱𝔰.𝔖𝔱𝔬𝔯𝔦𝔢𝔰 (@7continents.stories) -
‘భారత కుబేరుడు’.. టీ కొట్టు యజమాని
కొచ్చి : కలలను సాకారం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ, ఆ దిశగా నిర్విరామంగా కృషి చేసి విజయం సాధించేది కొందరే. కేరళకు చెందిన విజయన్ దంపతులు ఈ కోవకు చెందినవారే. తమ చిన్ననాటి కలలను సాకారం చేసుకోవడానికి వీరు చేస్తున్న కృషిని మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా కొనియాడారు. ప్రపంచ పర్యటనే లక్ష్యంగా గత 55 ఏళ్లుగా టీ కొట్టు నిర్వహిస్తూ.. విదేశాలు చుట్టివచ్చిన ఈ 70 ఏళ్ల వృద్ధ దంపతులు నిజమైన ‘భారత కుబేరులు’ అంటూ కితాబిచ్చారు. ఈ ఆదర్శ దంపతుల విదేశీ యాత్రలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆనంద్ వారిపై ప్రశంసలు కురిపించారు. రోజూ రూ.300 పొదుపుతో.. కొచ్చిలో ఉన్న విజయన్ దంపతుల టీ స్టాల్ ఫేమస్. రోజూ 350 మందికి క్యాటరింగ్ చేస్తారు. తమ కలలను నెరవేర్చుకునే క్రమంలో వీరు రోజూ రూ.300 పొదుపు చేస్తారు. తక్కువ మొత్తంలో ఖర్చులు పెడుతూ విదేశాల్లో పర్యటిస్తారు. ఇప్పటికే సింగపూర్, అర్జెంటీనా, పెరు, స్విట్జర్లాండ్, బ్రెజిల్ లాంటి 23 దేశాలను చుట్టివచ్చిన విజయన్ దంపతులు మరిన్ని దేశాల్లో పర్యటించడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. ‘దేశదేశాలు చుట్టి రావాలన్నది నా చిన్ననాటి కల. అందుకోసం సొమ్ము కావాలి. దానికోసమే నిలకడగా ఆదాయాన్నిచ్చే టీ వ్యాపారాన్ని ఎంచుకున్నాను’ అని చెప్పుకొచ్చారు విజయన్. 1963 లో ప్రారంభమైన విజయన్ టీ స్టాల్‌కు విదేశీ యాత్రికుల తాకిడీ ఎక్కువే. ఇతర దేశాలు తిరిగిన అనుభవాల్లోంచి ఏం నేర్చుకున్నారన్న ప్రశ్నకు ‘మన దృక్పథం, మైండ్, మన సంస్కృతిలో మార్పులు చోటుచేసుకుంటాయి’ అని బదులిచ్చాడు. జీవితంలో జీవించేందుకు డబ్బు ఒక్కటే కాదు.. గొప్ప సంకల్పం కూడా ఉండాలని చాటిచెప్తున్న ఈ వృద్ధ దంపతులు నిజంగా గ్రేట్ కదా.. ఏమంటారు..!! ఈసారి తప్పకుండా వెళ్తా.. సంపద విషయంలో ఈ దంపతులు ఫోర్బ్స్ లిస్టులో లేకపోవచ్చు. కానీ, నా ఉద్దేశంలో విజయన్ దంపతులు భారతదేశంలోనే అత్యంత సంపన్నులు అని ఆనంద్ మహింద్రా పేర్కొన్నారు. ఈసారి కొచ్చి వెళ్లినప్పుడు అక్కడ టీ తీసుకుని, వారి పర్యటనల విశేషాలు తెలుసుకుంటానని ట్వీట్ చేశారు. They may not figure in the Forbes Rich list but in my view, they are amongst the richest people in our country.Their wealth is their attitude to life. The next time I’m in their town I am definitely dropping by for tea & a tour of their exhibits.. pic.twitter.com/PPePvwtRQs — anand mahindra (@anandmahindra) January 9, 2019 -
అభిలాష్‌ను కాపాడారు
న్యూఢిల్లీ: గోల్డెన్ గ్లోబ్ రేస్‌లో భాగంగా ఒంటరిగా ప్రపంచ యానం చేస్తూ హిందూమహా సముద్రంలో ప్రమాదానికి గురైన కేరళకు చెందిన నేవీ కమాండర్ అభిలాష్ టామీ(39)ను విజయవంతంగా రక్షించారు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు 1,900 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదంలో చిక్కుకున్న ఆయన్ను రక్షించేందుకు భారత్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. సోమవారం అభిలాష్ పడవ ‘తురయా’ వద్దకు చేరుకున్న ఫ్రెంచి మత్స్యకార పడవ ‘ఒసిరిస్’ సిబ్బంది ఆయన్ను రక్షించింది. ఈ విషయం తెలిసి తాము టెన్షన్ నుంచి బయటపడ్డామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ఆయన ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఒసిరిస్లో దగ్గర్లోని ఇల్ ఆమ్స్టర్డాం దీవికి, అక్కడి నుంచి ‘ఐఎన్ఎస్ సాత్పురా’లో మారిషస్ తీసుకువచ్చి, అవసరమైన వైద్య చికిత్సలు చేయిస్తాం’ అని మంత్రి ట్విటర్లో పేర్కొన్నారు. -
పైసా లేకుండా ప్రపంచ పర్యటనకు వెళ్లొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : ఆకాశ్ మల్హోత్ర గత జూలై, ఆగస్టు రెండు నెలలు ఇండోనేసియాలో ఒంటరిగా పర్యటించారు. కొమడో డ్రాగన్ల (రాక్షస బల్లులు)ను ప్రత్యక్షంగా వీక్షించడంతోపాటు సముద్ర గర్భంలోని అందాలను తిలకించడానికి స్కూబా డైవింగ్ చేశారు. మంటా రేస్‌గా ఆంగ్లంలో పిలిచే షార్క్ జాతికి చెందిన అతి భారీ జలచరం (8 మీటర్ల వెడల్పు దాదాపు 1400 కిలోల బరువు)తో కలిసి సముద్ర గర్భంలో ఈత కొట్టారు. అద్భుతమైన సూర్యోదయాన్ని ప్రత్యక్షంగా చూడడమే కాకుండా దాన్ని కెమెరా కన్నులో బంధించేందుకు మౌంట్ బాటూర్లోని క్రియాశీలక అగ్ని పర్వతాన్ని అధిరోహించారు. దేశ, విదేశాల్లో పర్యటించడం ద్వారా అనూహ్య అనుభవాలను, అనిర్వచనీయ అనుభూతులను పొందవచ్చని భావించే మల్హోత్ర ఈసారి ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఆయన అనుభవాలన్నీ తీపి గుర్తులే కాదు. ఆయన బాలి నగరంలో ఉన్నప్పుడు భూకంపం వచ్చింది. ఓ మాల్ శిథిలాలు కూలుతుంటే అందులోనుంచి అందరితోపాటు ఆయన బయటకు పరుగెత్తికొచ్చారు. 26 ఏళ్ల ఆకాశ్ మల్హోత్రకు ప్రపంచం తిరగడమంటే ఎంతో పిచ్చి. ఆయన గత నాలుగేళ్లలో 34 దేశాలు తిరిగొచ్చారు. రెండు నెలలు భారత్‌లో ఉంటే, నాలుగు నెలలు విదేశాల్లో తిరుగుతుంటారు. ‘డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ’ని నడిపే ఆకాశ్ తన పర్యటన పిచ్చికి అనుకూలంగా తన జీవన విధానాన్ని మార్చుకున్నారు. దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా రోజుకు కేవలం నాలుగు గంటలే పనిచేస్తారు. మిగతా సమయమంతా పర్యటనలోనే గడుపుతారు. ఆయన భారత్‌కు వచ్చినప్పుడు మాత్రమే తన క్లైంట్లను నేరుగా కలుసుకుంటారు. విదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్లపైనే సలహాలు, సంప్రతింపులు నడుస్తాయి. ఆయన తన పర్యటన ఫొటోలను ఎప్పటికప్పుడు ‘ఇన్స్టాగ్రామ్’లో పోస్ట్ చేయడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి. ఏ దేశానికి ఎంత చీప్‌గా వెళ్లవచ్చో, ఏయే ట్రావెల్ ప్యాకేజీలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా ఎంపిక చేసుకోవచ్చో, ఎక్కడ ఎంత చీప్‌గా ఆనందాన్ని ఆస్వాదించవచ్చో.. కిటికులన్నీ ఆకాశ్‌కు తెలుసు. ఆయన తన ‘వాండర్ విత్ స్కై’ వెబ్సైట్ ద్వారా తనలాంటి పర్యాటకులతో వీటిని షేర్ చేసుకుంటున్నారు. ప్రముఖ అమెరికా వ్యాపారవేత్త టిమ్ ఫెర్రీస్ రాసిన ‘ది 4–అవర్ వర్క్ వీక్’ పుస్తకాన్ని చదివి తాను స్ఫూర్తి పొందానని ఆయన చెబుతున్నారు. ఆకాశ్లాగా ప్రపంచ దేశాల్లో తిరగాలన్నా ఆసక్తి నేటి యువతరంలో ఎక్కువగా పెరుగుతోంది. ముఖ్యంగా సాంకేతిక రంగాల్లో పనిచేస్తే యువతలో ఈ ఆసక్తి ఎక్కువగా ఉంటోంది. స్కై స్కానర్ ఇండియా నిర్వహించిన ‘ది మిలీనియల్ ట్రావెల్ సర్వే–2017’ నివేదిక ప్రకారం 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యనున్న నేటి తరంలో 62 శాతం మంది ఏడాదికి రెండు నుంచి ఐదు సార్లు దేశ, విదేశాల్లో పర్యటిస్తున్నారు. పది శాతం మంది మాత్రం ఏడాదికి ఆరు నుంచి పది సార్లు పర్యటనలకు వెళుతున్నారు. ఇలా దేశ, విదేశీ పర్యటనలను ఇష్టపడుతున్న యువతలో స్త్రీ, పురుషులు ఆఫీసు సెలవుల్లో ఉన్న వెసలుబాటును బట్టి దగ్గరి ప్రాంతాలు, దూర ప్రాంతాల పర్యటనలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఆకాశ్ లాంటి ప్రపంచ పర్యటనను పిచ్చిగా ప్రేమించే వాళ్లు ఉద్యోగాలు వదిలేసి సొంతంగా ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ పర్యటిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్న టెక్కీలకు దేశ, విదేశాలు తిరిగేందుకు డబ్బులు ఎలా వస్తున్నాయన్నా సందేహం రావచ్చు. కూడబెట్టుకుంటున్న సొమ్ము సరిపోకపోతే వారంతా ట్రావెల్ రుణాలు తీసుకుంటున్నారు. ఇదో కొత్త ట్రెండ్. వారికి ఈ రుణాలు ఇవ్వడం కోసమే ‘క్యూబెరా, ఫింజీ, ఫేర్‌సెంట్, రూబిక్యూ’ లాంటి ఆర్థిక సంస్థలు పుట్టుకొచ్చాయి. కొలాటరల్ గ్యారంటీ, ఈ గ్యారంటీ, ఆ గ్యారంటీ అనే తలనొప్పి షరతులు లేకుండా ఈ సంస్థలు బ్యాంకులకన్నా తక్కువ ఒడ్డీతో ట్రావెల్ రుణాలను అతి సులువుగా మంజూరు చేస్తున్నాయి. అయితే ఆ సంస్థలు రుణాలు మంజూరు చేస్తున్న వారిలో 80 శాతం మంది ఉద్యోగులే ఉంటున్నారు. గత రెండేళ్లలోనే ట్రావెల్ రుణాలు 12 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయని ఉద్యోగులకు, ఇతరులకు వ్యక్తిగత లోన్లను మాత్రమే మంజూరు చేసే సాంకేతిక సంస్థ ‘క్యూబెరా’ తెలిపింది. గతేడాది ట్రావెల్ రుణాలు కావాలంటూ తమ సంస్థకు దాదాపు 1700 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 728 మంది దరఖాస్తుదారులు 28 ఏళ్ల లోపు వారేనని పేర్కొంది. తమ సంస్థ నుంచి రుణాలు కోరుతున్న ఐదు ముఖ్య కారణాల్లో ట్రావెల్ ఒకటని ‘క్యూబెరా’ వ్యవస్థాపకుడు అనుభవ్ జైన్ తెలిపారు. ట్రావెల్ రుణాల్లో రిస్క్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఉద్యోగస్థులవడం, అందులో యువకులు అవడం, పర్యటించాలనే ఉత్సాహం ఎక్కువగా ఉండడం వల్ల అంత రిస్క్ తమకు ఎదురు కావడం లేదని ఆయన అన్నారు. తామిచ్యే మొత్తం రుణాల్లో ట్రావెల్ రుణాలు గతేడాది ఐదారు శాతం ఉండగా, ఇప్పుడు 15, 16 శాతానికి చేరుకున్నాయని ఆయన వివరించారు. ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు తాము 12 శాతం వ్యక్తిగత రుణాలు పర్యటనల కోసం మంజూరు చేశామని ‘ఫింజీ’ సహ వ్యవస్థాపకులు, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అభినందన్ సంఘమ్ తెలిపారు. తాము ట్రావెల్ రుణాలను మంజూరు చేస్తుండడం వల్ల ముందుగా ఎకానబీ క్లాస్‌ను ఎన్నుకున్న పర్యాటకులు ఆ తర్వాత లగ్జరీ క్లాస్‌కు మారుతున్నారని కూడా ఆయన చెప్పారు. తాము కూడా ఆరు శాతం రుణాలను ట్రావెల్‌కే ఇస్తున్నామని, వీరి సంఖ్య గత రెండేళ్లుగా పెరుగుతోందని ‘ఫేర్‌సెంట్’ వెబ్ సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రజత్ గాంధీ తెలిపారు. తాము పెళ్లిళ్లకు, హానీమూన్లకు కూడా రుణాలను మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు. జేబులో పైసా లేకపోయినా ట్రావెల్ రుణాలను, ట్రావెల్ ప్యాకేజీలను సద్వినియోగం చేసుకొని ప్రపంచ దేశాల్లో పర్యటించవచ్చని ఆకాశ్ మల్హోత్ర సూచిస్తున్నారు. -
మూడు గంటల్లో ప్రపంచ యాత్ర.!
చికాగో : పురాణాల్లో, పౌరాణిక చిత్రాల్లో ఒక చోట మాయమై, మరో చోట ప్రత్యక్షమవడం చూస్తూనే ఉంటాం. కానీ, నిజ జీవితంలో అది సాధ్యమా అంటే.. కాదని అందరికీ తెలుసు. కానీ, మూడు గంటల్లో ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. అదెలాగంటే.. హైపర్సోనిక్ విమానంతో..! అవును దిగ్గజ విమాన తయారీ సంస్థ బోయింగ్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ధ్వని కంటే అయిదు రెట్లు వేగంగా ప్రయాణించే హైపర్సోనిక్ విమానాన్ని తయారు చేసేందుకు ప్రణాళికలు రచించింది. గంటకు 3,800 మైళ్ల వేగంతో ప్రయాణించే విమానాన్ని తయారు చేసేందుకు పూనుకుంది. ఈ విమానంలో న్యూయార్క్ నుంచి లండన్‌కు 120 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. అంటే ప్రపంచాన్ని మూడు గంటల్లో చుట్టి రావచ్చన్నమాట..! విమానం తయారీకి సంబంధించిన ప్రణాళికలు ప్రాథమిక దశలో ఉన్నాయనీ, కొన్ని సాంకేతిక చిక్కు ముడులను అధిగమించాల్సి ఉందని సంస్థ ప్రతినిధి బియానా జాక్సన్ తెలిపారు. బోయింగ్ సంస్థ ప్రయోగాలు ఫలించి హైపర్సోనిక్ విమానం గనుక అందుబాటులోకి వస్తే.. ధ్వని కంటే రెండు రెట్లు వేగంగా ప్రయాణించే ఆంగ్లో-ఫ్రెంచ్ విమానం ‘కాంకోర్డ్’ను తలదన్నినదవుతుంది. అయితే, ఈ అద్భుత విమాన సేవలు అందుబాటులోకి రావాలంటే మరో ఇరవై ఏళ్లకు పైగా సమయం పడుతుందట..! -
భాష అర్థంకాక చితక్కొట్టేశారు
సాక్షి, కామారెడ్డి: భాష అర్థం కాకపోవటంతో ఓ విదేశీయుడిపై కొందరు రైతులు దాడి చేసిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రష్యాకు చెందిన వీ వోలెజ్ (44) సైకిల్‌పై ప్రపంచయాత్రకు బయలుదేరాడు. దానిలో భాగంగా నిజామాబాద్ నుంచి షిర్డీకి వెళ్తున్నారు. శుక్రవారం సాయంత్రం బికనూర్‌కు చేరుకోగానే గాలివాన మొదలవడంతో వోలెజ్ తన ప్రయాణానికి విరామమిచ్చి సమీపంలోని పంటపొలాల్లో గుడారం ఏర్పాటు చేసుకున్నారు. ఇంతలో పొలం యాజమాని మహేందర్ రెడ్డి అక్కడికి చేరుకుని.. అప్పటికే అతని పొలంలో టెంట్ వేసుకుని సేద తీరుతున్న వోలెజ్‌ని ప్రశ్నించాడు. అతను తన భాషలో సమాధానం చెప్పటం.. రైతుకు విదేశీయుడి మాటలు అర్థం కాకపోవటంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు భాష అర్థంకాని మహేందర్‌రెడ్డి.. వోలెజ్‌ని దొంగ అనుకొని అతనిపై దాడి చేశాడు. ఇంతలో మరికొందరు రైతులు కూడా మహేందర్‌రెడ్డికి తోడు కావటంతో వోలెజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వోలెజ్‌ను ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మహేందర్ రెడ్డితో వాగ్వాదం జరుగుతున్న సమయంలో వోలెజ్ గూగుల్ ట్రాన్స్‌లేటర్ సాయం తీసుకుందామని ప్రయత్నించాడనీ.. కానీ, అంతలోనే మహేందర్ రెడ్డి అతనిపై దాడి చేశాడని పోలీసులు పేర్కొన్నారు. బాధితుడి తల, దవడ, కుడి చేతికి గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. -
14 ఏళ్లు, 1,37,900 కిలోమీటర్లు...ఇంకా ముందుకే
-
14 ఏళ్లు, 1,37,900 కిలోమీటర్లు.. ఇంకా ముందుకే
-
14 ఏళ్లు, 1,37,900 కిలోమీటర్లు... ఇంకా ముందుకే
ఆయన పేరు సోమన్ దేవ్నాథ్. పశ్చిమబెంగాల్ సుందర్బన్లోని ‘బసంతి’ ఆయన గ్రామం. ఓ లక్ష్యం కోసం ఆయన 2004లో తన యాత్రను ప్రారంభించారు. ఇప్పటికే 14 ఏళ్లు గడిచిపోయాయి. ఇంకా తన ప్రయాణాన్ని ఆపలేదు. 2020 వరకు తన సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తారట. ఆయన ఊరు నుంచి ప్రారంభమైన ఆయన సైకిల్‌యాత్ర రాష్ట్రం గుండా, దేశం గుండా, ఖండాల గుండా సాగి 1.37,900 కిలోమీటర్లు చుట్టింది. ఈ సందర్భంగా ఆయన సైకిల్‌పైనే 126 దేశాలు సందర్శించారు. 2020 నాటికి రెండు లక్షల కిలోమీటర్లను అధిగమించి 191 దేశాలు తిరిగి, కనీసం 20 కోట్ల మంది ప్రజలనైనా కలుసుకోవాలన్నది ఆయన లక్ష్యం. ఆయన సైకిల్ యాత్ర సరదాగే ఏమీ సాగలేదు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల చెరలో చిక్కుకున్నారు. ఇరాక్‌లో తృటిలో బాంబుపేలుడు నుంచి తప్పించుకున్నారు. ఆరుసార్లు ఆయన సైకిల్‌ను దొంగలు ఎత్తుకుపోయారు. ఎన్నోరోజులు నిద్రాహారాలు లేకుండా గడిపారు. అయినా లక్ష్యసాధనలో ఆయన ముందుకే సాగుతున్నారు. ప్రస్తుతం అర్జెంటీనాలో నగరాల్లో పర్యటిస్తున్న ఆయన త్వరలో అంటార్కిటికా ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఆయన బడికెళ్లి చదువుకుంటున్నప్పుడు 14 ఏళ్ల వయస్సులో ఎయిడ్స్ మహమ్మారి గురించి ఓ వ్యాసం చదివారట. ఆ వ్యాధి బారిన పడినవారిని సమాజం ఎంత నీచంగా నిర్దయగా చూస్తుందో తెలుసుకున్నారట. వ్యాధి గురించి మరింత లోతుగా అధ్యయనం చేశారు. వ్యాధి పట్ల ప్రజలకు సరైన అవగాహన కలిగించేందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నారు. అప్పటికి ఏం చేయాలో తెలియదు. డిగ్రీ పూర్తి చేశారు. సైకిల్ కొనుక్కున్నారు. సైకిల్‌పై రాష్ట్రమంతా తిరిగి ఎయిడ్స్ వ్యాధి రాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు, వస్తే తీసుకోవాల్సిన చికిత్స, వారి పట్ల సమాజం వ్యవహరించాల్సిన తీరు గురించి ప్రచారం చేశారు. మూడు నెలలతో తన యాత్ర ఆపకూడదనుకున్నారు. మరో ఆరు నెలలు దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగి ఇదే ప్రచారం చేశారు. అప్పటికీ తృప్తినివ్వలేదు. ప్రపంచదేశాల్లో కూడా ఈ ప్రచారయాత్రను కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. మరి ఎలా? అంత డబ్బులు తనకు ఎక్కడున్నాయని ఆలోచించారు. సైకిల్‌పై వెళ్లొచ్చుకదా అన్న ఆలోచన వచ్చింది. అదే తడువుగా ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రకు మీ కుటుంబం ఒప్పుకుందా? అని దారి మధ్యలో మీడియా ఆయన్ని ప్రశ్నించగా ‘ఏ కుటుంబం? నా కుటుంబమా, గ్లోబల్ కుటుంబమా !’ అని ఆయన ప్రశ్నించారు. ‘మా నాన్న అసలు అంగీకరించలేదు. కొంతకాలం నాతో మాట్లాడలేదు. అదే పనిగా అమ్మకు నచ్చచెబుతూ వచ్చా. చివరకు అమ్మ ఒప్పుకున్నది. అమ్మతోనే నాన్నను ఒప్పించాను. అంతే నా యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో ప్రపంచం గురించి నేను కొన్ని సత్యాలు తెలుసుకున్నాను. మనం గందరగోళంలో ఉంటే, ప్రపంచం కూడా గందరగోళంగా ఉంటుంది. మనం నిరాశపడితే మనల్ని ప్రపంచం మరింత నిరుత్సాహ పరుస్తుంది. మనం ఆశావాద దృక్పథంతో వ్యవహరిస్తే. ప్రపంచం కూడా మన పట్ల అదే దృక్పథంతో వ్యవహరిస్తుంది. అంటే, మన స్పందన ఎలా ఉంటే, ప్రపంచం ప్రతి స్పందన అలాగే ఉంటుంది’ అని చెప్పారు. ‘నేను సైకిల్‌పై బట్టలు, పడుకోడానికి చాప, పడుకునే బ్యాగు, టెంట్, అల్పాహారం తీసుకెళుతున్నాను. ఇద్దరు వ్యక్తులు, ఓ కంపెనీ నా యాత్రకు ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్నారు. అయినా నా యాత్ర పూర్తి అవడానికి కావాల్సినంత డబ్బు సమకూరడం లేదు. 30 శాతం మాత్రమే సమకూరింది. అంటార్కిటికా వెళ్లేందుకు అవసరమైన టిక్కెట్లు కొనుక్కున్నాను. ముందేం జరుగుతుందో చూడాలి. ఫలితం ఆశించకుండా లక్ష్యం దిశగా సాగిపోవాలన్న భగవద్గీత సందేశమే నాకు స్ఫూర్తి’ అని ఆయన చెప్పారు. భారత్‌కు తిరిగొచ్చి సొంతూరుకు చేరుకున్నాక ఏం చేయాలన్నది మీ లక్ష్యమని మీడియా ఆయనను ప్రశ్నించగా ‘నా ఊళ్లో గ్లోబల్ గ్రామాన్ని నిర్మించడం నా లక్ష్యం. ఏ దేశం వ్యక్తినైనా, ఏ జాతి వ్యక్తినైనా నా గ్లోబల్ గ్రామానికి ఆహ్వానిస్తాను’ అని చెప్పారు. -
ఒంటరి విహారం
ఒంటరి మహిళ.. ప్రపంచ పర్యటన... అంటే మాటలు కావు. దానికి ఎంతో గుండె ధైర్యం, సంకల్ప బలం ఉండాలి. ఈ రెండూ మెండుగా ఉన్న యువతి అలిస్సా రామోస్. 6 ఖండాల్లోని 44 దేశాలలో ఎవరితోడూ లేకుండా పర్యటించింది. మనదేశంలోనూ నెలరోజులపాటు పర్యటించింది. ప్రపంచదేశాల స్థితిగతులు, ఆచార వ్యవహారాలను దగ్గరుండి చూసింది. తాను ఒంటిరిని అన్న ఆలోచనతో ఏనాడూ కుంగిపోలేదు. ప్రతిరోజూ తన ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభించింది. ఆమె యాత్రా విశేషాలు మనమూ తెలుసుకుందాం! అలిస్సా రామోస్ దృఢసంకల్పం కలిగిన నేటితరం యువతి. అదే ఆమెను ప్రపంచం మొత్తం పర్యటించేలా చేసింది. స్నేహితులు గానీ కుటుంబ సభ్యులు గానీ ఎవరూ వెంట రాలేదు. కేవలం గోప్రో కంపెనీ కెమెరాను మాత్రమే తోడుగా తీసుకెళ్లింది. ‘మై లైఫ్ ఎ ట్రావెల్ మూవీ.కామ్’ అనే ప్రముఖ ట్రావెల్ ఏజె న్సీతో కలిసి తన ప్రయాణం సాగించింది. ఈ ప్రయాణంలో 28 ఏళ్ల అలిస్సా రామోస్‌కు సోషల్ మీడియాలో అనూహ్య మద్దతు లభించింది. అలిస్సా ఇన్‌స్టాగ్రామ్‌లో 60 వేల మంది ఫాలోవర్లు అమెకు అండగా నిలవడం విశేషం. ఒంటరి ప్రయాణం..! అలిస్సా ఒంటరిగా ప్రపంచ పర్యటన చేయడం వెనక ఓ కథ ఉంది. తొలుత స్నేహితులంతా కలిసి సరదాగా దక్షిణాఫ్రికాకు వెళ్లొద్దామని అనుకున్నారు. తీరా వెళ్లే సమయానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె ఒక్కతే వెళ్లాలని నిర్ణయించుకుంది. ముందు అనుకున్న ప్రకారమే అలిస్సా దక్షిణాఫ్రికా వెళ్లింది. ఈ పర్యటన విజయవంతం అయింది. దీంతో ప్రపంచాన్ని చుట్టి వస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన ఆమె జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. దక్షిణాఫ్రికా అంటే ఎలాగోలా పర్యటించిందిగానీ, ప్రపంచమంటే అంత డబ్బు ఎలా వస్తుంది? అని ఆలోచించింది. ఇందుకోసం తన దక్షిణాఫ్రికా పర్యటనలను రచనలో రూపంలో సోషల్ మీడియా ఆధారంగా పనిచేస్తున్న పలు వెబ్సైట్లకు అందించింది. ఆ విధంగా ఆమెకు వచ్చిన డబ్బునే పర్యటన కోసం వెచ్చించింది. భారత్ ఓ ప్రత్యేక అనుభూతి.. అలిస్సా భారత్ నుంచి ఎన్నో నేర్చుకున్నారు. ఇండియాలో ప్రతి రాష్ట్రం ప్రత్యేకంగా ఉంటుంది. వివిధ భాషలు, ఆచారాలు, మతాలు అన్ని వేటి కవే ప్రత్యేకం. ప్రధానంగా భారతీయ వస్త్రాధారణ ఆమెను అమితంగా ఆకర్షించింది. అదే ఆమెను చీరకట్టుకోవడం నేర్చుకునేలా చేసింది. ఇక్కడి వంటకాలు కూడా ఆమెకు ఎంతగానో నచ్చాయి. పన్నీర్ కూరలు, ఇరానీ టీ, స్వీట్లు అత్యంత ఇష్టమైన వంటకాలుగా మారాయి. ‘భారతీయలు ఎంతో మర్యాద కలిగి ఉంటారు. వీరు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు. ఇండియాలో క్రికెట్, బాలీవుడ్‌లకు ఎక్కువ ఆదరణ ఉందన్నారు. అలిస్సా తన పర్యటనల గురించి ఎప్పటికప్పుడు పలు ఆన్లైన్ వెబ్సైట్లకు కథనాలు రాస్తూనే ఉన్నారు. మహిళ ప్రపంచ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు ఎలా ఉంటాయి? అన్న ఆసక్తి తన రచనలకు ఎక్కువ ఆదరణ కలిగేలా చేసిందని అలిస్సా తెలిపారు. సంస్కృతుల నిలయం భారతదేశం అలిస్సాను అమితంగా ఆకర్షించింది. ఇక్కడ పర్యటించడం అంటే ఓ విస్తారమైన సంప్రదాయాలు, సంస్కృతులను తెలుసుకోవడమేనని అలిస్సా అభిప్రాయపడ్డారు. ఆసియా పర్యటనల్లో భారత్ పర్యటన ఓ అద్భుతమైన అనుభవాన్ని కలిగించింది అని అలిస్సా అన్నారు. నెల రోజుల పర్యటనలో భాగంగా న్యూఢిల్లీ, ఆగ్రా, జైపూర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, ముంబై, గోవాలలో పర్యటించారు. భారత్‌లో ఉన్న ప్రజలు అలిస్సాను ఎంతో గౌరవించారని, ఇక్కడ పర్యటన ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. రాజస్థాన్‌లో పర్యటించడం ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందన్నారు. జైపూర్‌లో తొలిసారిగా పర్యటించినప్పుడు అక్కడి రాజభవనాన్ని చూసి ఆశ్చర్యపోయారని తెలిపారు. తాను అక్కడ కొన్న గాజులు, ఏనుగుపై ప్రయాణం చాలా ఆనందాన్ని ఇచ్చాయన్నారు. జోధ్‌పూర్ అత్యంత ప్రియమైన నగరం అని తెలిపారు. జోధ్‌పూర్ ప్యాలెస్‌లో బస చేసినప్పుడు నిజమైన తనకు తాను రాణిగానే భావించానంది. -
ప్రపంచాన్ని చుట్టేయనున్న కేంద్ర మంత్రులు
న్యూఢిల్లీ: వచ్చే మూడు నెలల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని మంత్రులు ప్రపంచం నలుమూలలా పర్యటించనున్నారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలున్న 192 దేశాల్లో ఎన్డీఏ మంత్రులు పర్యటించాలన్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మూడు నెలల గడువులో 68 దేశాల్లో పర్యటించనున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హంగేరీ, న్యాయ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఎస్తోనియా, లాత్వియా, ఎరువుల మంత్రి అనంత్ కుమార్ టాంగో, ఆహార మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మారిషస్‌లో పర్యటిస్తారు. ఈ ఏడాది చివరికల్లా కేంద్రమంత్రులు పర్యటించని దేశాలు ఉండొద్దన్న విషయాన్ని ప్రస్తావిస్తూ... 68 దేశాల్లో ఇంకా ఎవరూ పర్యటించనట్లు తమ శాఖ గుర్తించిందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మంత్రిత్వ శాఖలకు లేఖలు రాశారు. -
80 మందితో డేటింగ్ చేస్తూ ఫ్రీగా వరల్డ్ టూర్
న్యూయార్క్: ప్రపంచలోని పలు దేశాలను తిరిగి రావాలని, అక్కడి అందచందాలను ఆస్వాదించాలని, విలాసవంతమైన రిస్టారెంట్లలో, ఖరీదైనా విల్లాలలో బస చేయాలని, లగ్జరీ విమానాలలో ప్రయాణించాలని, కాస్లీ ప్రైవేటు పడవల్లో కుషీ చేయాలని ఎవరికుండదు. ఉన్నా అది కలల్లో తప్ప ఎంతటి సంపన్నులకైనా అంత ఈజీగా సాధ్యం కాదు. కానీ బ్రిటన్‌లోని కాంటర్బరీకి చెందిన 30 ఏళ్ల నటాలి వుడ్‌కు సాధ్యమైంది. సాధ్యమవుతోంది. అందులో ఒక్క పైసా కూడా చేతి నుంచి ఖర్చు పెట్టకుండా. అదేలా అని ఆశ్చర్యం వేయకమానదు. అదే నటాలి స్పెషాలిటీ. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆమె ప్రపంచ దేశాల ప్రయాణం ఇంకా ముగియలేదు. కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే టర్కీ, అబుదాబీ, దుబాయ్, కువైట్, మాల్దీవులు, ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్ లాంటి దేశాల్లో విహరించిన నటాలి ప్రస్తుతం అమెరికాలోని మయామిలో సరదాగా విహరిస్తున్నారు. అంతేకాదు సందర్శించిన ప్రతి దేశంలో కూడా సొంతానికి చిల్లిగవ్వ కూడా లేకుండా ఖరీదైన షాపింగ్ చేస్తున్నారు. నచ్చిన వస్తువులను సొంతం చేసుకుంటున్నారు. ఆమెకు ఇదంతా సాధ్యమైందీ, అవుతున్నది డేటింగ్ వెబ్సైట్ ‘మిస్ ట్రావెల్’. రెండేళ్ల క్రితం ఆమె అందులో ఖాతా తెరిచారు. అందులో పరిచయం చేసుకున్న 80 మందితో ఇప్పటి వరకు డేటింగ్ చేశారు. ఆమె విమాన ఖర్చులు, బస, విలాసాలకు ఖర్చు పెట్టిందంతా డేటింగ్ చేసిన సంపన్నులైన మొగవాళ్లే. వారంతా ఆమెకు ‘బంగారాన్ని తవ్వే భామ’ అని ముద్దుగా పిలుస్తున్నా, ఆమె మాత్రం తాను బెస్ట్ వరల్డ్ ట్రావెలర్ అని చెప్పుకుంటున్నారు. తనలో ప్రపంచ దేశాలను తిరిగే తపనతో పాటు సరైన జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలనే తాపత్రయం కూడా తన పర్యటన లక్ష్యమని ఆమె చెబుతున్నారు. తనకు నచ్చే జీవిత భాగస్వామిని ఎప్పుడు ఎంపిక చేసుకుంటానో, ఎంతకాలం ఈ ప్రపంచ యాత్ర కొనసాగుతుందో తాను ఇప్పుడే చెప్పలేనని నటాలీ చెబుతున్నారు. తనకన్నా వయస్సులో కాస్త పెద్దవాళ్లతోనే ఇప్పటి వరకు తాను డేటింగ్ చేస్తూ వచ్చానని, ఇప్పటికి 80 డేటింగ్లు పూర్తయ్యాయని ఆమె తెలిపారు. ప్రతి డేటింగ్ తనకు ఓ అందమైన అనుభూతినే ఇచ్చిందని చెప్పారు. తనకు సెక్స్ ముఖ్యం కాదని, కంపెనీ ముఖ్యమని అన్నారు. ఎవరైన సంపన్న వర్గానికి చెందిన మగవాళ్లు తనకు ఇట్టే సన్నిహితులవుతున్నారని, ఆ సాన్నిహిత్యం సహజంగానే సెక్స్‌కు దారితీస్తుందని ఆమె తెలిపారు. తన శరీర సౌందర్యం కూడా అందుకు కారణమేనని ఆమె చెప్పారు. తాను తన పర్యటన సందర్భంగా డేటింగ్ చేసిన మగవాళ్లతో ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టించిందీ తాను ఎప్పుడూ లెక్కవేయలేదని, ఆ ఖర్చు కోటీ రూపాయలకు పైనే ఉండవచ్చని ఆమె అన్నారు. ‘నేను డేటింగ్ చేసిన వారిలో ఎక్కువ మంది వ్యాపారవేత్తలే ఉన్నారు. వారంతా నాకు ఖర్చుపెట్టేంత స్తోమత కలిగినవారే. ఎవరిని మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నా విషయంలో నేను నిజాయితీగానే ఉంటాను. ప్రపంచం తిరుగుతున్నా కొద్దీ ఇంకా తిరగాలనిపిస్తోంది. ఎందుకంటే ట్రావెలింగ్ అంటే నాకు ప్రాణం. అందుకు డబ్బు కావాలి. కంపెనీ కావాలి. నేను ఎక్కడికెళ్లినా, ఎవరితో వెళ్లినా ముందుగా నా రక్షణ చూసుకుంటాను. నాతో డేటింగ్ చేయాలనుకున్న వారి వివరాలు పూర్తిగా సేకరిస్తాను. వారిని కలసుకోవడానికి ముందు వారి గుర్తింపు కార్డును కోరుతాను. ఇంతవరకు నేను కలసిన వారంతా జెంటిల్మెన్లే. ఈ జూన్ నెలలో కువైట్‌లో ఓ ఇంటర్నేషనల్ అకౌంటెంట్‌ను కలుసుకున్నాను. ఆయన ఆహ్వానంపై నేను ఆయన దేశం వెళ్లాను. ఆయన స్నేహితుడొకరికి విలాసవంతమైన పడవ ఉంది. అందులోనూ, ఖరీదైనా విల్లాలలోనూ వారం రోజులపాటు కులాసా పార్టీలు చేసుకున్నాం. ఒక్క నయా పైసా నేను చేతి నుంచి ఖర్చు పెట్టలేదు. షాపింగ్ చేసి డిజైనర్ దుస్తులు కొనుక్కున్నాను. దుబాయ్ పర్యటన కూడా నాకు ఎంతో తృప్తినిచ్చింది. మొదటి విడత లగ్జరీ హోటళ్లలో గడిపాను. రెండో విడత ఆయన లగ్జరీ విల్లాలో గడిచిపోయింది. నేను ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు కూడా వెళ్లాను. ఆయనకు ఎన్నో ప్రైవేటు విమానాలు ఉన్నాయి. అందులో ఓ విమానాన్ని మేమే ఎంగేజ్ చేసుకున్నాం. నగ్నంగా తిరిగే బీచ్‌కు వెళ్లడం కూడా నాకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చింది’ అని ప్రస్తుతం మయాంలో మకాం వేసిన నటాలి తన గురించి చెప్పుకున్నారు. తాను వన్ వే టిక్కెట్‌పై మయామి వచ్చానని, తనను ఇక్కడికి తీసుకొచ్చిన ఓ వ్యాపారవేత్తకు దురదృష్టవశాత్తు వ్యాపార లావాదేవీలపై లండన్ తిరిగి వెళ్లిపోయారని నటాలి తెలిపారు. తాను ఎంతకాలం ఇక్కడ ఉంటానో, ఇక్కడి నుంచి ఏ దేశం వెళతానో కూడా తనకు తెలియదని అన్నారు. ‘మిస్ ట్రావెల్’ సైట్లో వెతుక్కునే కొత్త పార్ట్నర్ను బట్టి తన పర్యటన ఆధారపడి ఉందని చెప్పారు. తన ఈ ప్రయాణం ఎంత దూరం, ఎన్ని దేశాలు సాగుతుంతో, ఎన్ని ఏళ్లు పడుతుందో కూడా తాను చెప్పాలేనని అన్నారు. -
చాయ్ అమ్ముతూ.. 17 దేశాలు చుట్టేశాడు!
రైల్వే స్టేషన్లో చాయ్ అమ్మకున్న దామోదర్ దాస్.. ఇప్పుడు దేశ ప్రధాని. బహుశా చాయ్‌వాలాగా ఉన్నప్పుడు.. ఈ స్థాయికి చేరుకుంటానని ఆయన ఊహించి ఉండరేమో! దాదాపు మోదీ సమకాలీకుడే అయిన విజయన్ మాత్రం బోలెడు కలలు కన్నాడు. వాటిలో చాలా వాటిని నెరవేర్చుకున్నాడు కూడా! చాయ్ వాలాగా జీవితం ప్రారంభించిన విజయన్ ఒకప్పుడు.. చిన్న టీస్టాల్ ఓనర్. తన భార్యతో కలిసి.. భారత్ లోని అన్ని పర్యాటక ప్రాంతాలతో పాటు 17 విదేశాలూ చుట్టొచ్చాడు. విజయన్ 65 ఏళ్ల అనుభవం, 40 ఏళ్ల దాంపత్య జీవితం, 17 దేశాల పర్యటన అన్నింటినీ కలిపి 'ఇన్విజిబుల్ వింగ్స్' పేరుతో రూపొందించిన 9 నిమిషాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 'ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. కలలు నెరవేర్చుకోండి' అంటూ ఉత్సాహం రేకెత్తిస్తోంది. కొచ్చి నగరం, గాంధీనగర్‌లోని సలీమ్ రాజన్ రోడ్డు.. ఎర్రటి గోడపై తెల్లటి అక్షరాలు.. 'శ్రీబాలాజీ కాఫీ హౌస్'. అలుపు లేకుండా వచ్చే కస్టమర్లకు అలసిపోకుండా కాఫీ, టీలు అందిస్తుంటాడు.. 65 ఏళ్ల విజయన్. పక్కనే చేదోడుగా ఆయన భార్య మోహన. పరిచయస్తులు, చుట్టుపక్కలవారి దృష్టిలో వాళ్లిద్దరూ 'కొద్దిగా తేడా మనుషులు'. ఈ ఆరోపణపై విజయన్ వివరణ ఇస్తాడిలా.. 'మమ్మల్ని ఒక్కమాటైనా అనని వాళ్లు ఒక్కరూ లేరంటే అబద్ధం కాదు. టీస్టాల్ నడుపుకొనే మాకు.. విదేశీయానాలు అవసరమా? అనేది వారి ఆరోపణ. నా వరకైతే ప్రతి యాత్రా ఒక మలుపు. ఒక విజయం. ఎందుకంటే అది నా కల కాబట్టి' అని. భారతదేశంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చిన విజయన్, మోహనలు 17 విభిన్నదేశాల అందాలనూ ఆస్వాదించారు. అమెరికా వెళ్లేందుకు మాత్రం వారికింకా అనుమతి లభించలేదు. కారణం.. ఆర్థిక స్థితి. యూఎస్ వీసా కోసం ఆస్తులు చూపించడం తప్పనిసరి. మరి విజయన్ ఆస్తి.. ఒక్క టీస్టాలే! అయినాసరే, ఎప్పటికైనా అక్కడకు కూడా వెళతాననే ధీమాతో ఉన్నాడు విజయన్. ఎలా? అటే.. 'అదీ నా కలే కాబట్టి తప్పక నెరవేర్చుకుంటా' అంటాడు. విదేశీయానాల కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం, ఆనందం అనుభవించిన తర్వాత మూడు నాలుగు నెలలు రెట్టింపు కష్టంతో పనిచేసి అప్పు తీర్చడం ఈ వృద్ధ జంటకు అలవాటైన పని. -
పేరు అలా కలిసొచ్చింది..!
ఎలిజబెత్ గల్లాగెర్ అని పేరు ఉండటంతో ఈ యువతి పంట పండింది.. ఉచితంగా ప్రపంచ పర్యటనకు వెళ్లే చాన్స్ కొట్టేసింది. ఇంతకీ మ్యాటరేం టంటే.. కెనడాకు చెందిన జోర్డాన్ అక్సానీ తన ప్రేయసితో కలిసి ఈ క్రిస్మస్కు ప్రపంచ పర్యటనకు వెళ్దామని గతేడాదే విమాన టికెట్లు కొనేశాడు. ఈలోగా వారిద్దరి మధ్యా అభిప్రాయభేదాలొచ్చి విడిపోయారు. కానీ టికెట్లు అలాగే ఉండిపోయాయి. వాటిని రద్దు చేయడమూ కుదరదు. పేరు మార్చుకోవడానికీ వీల్లేదు. వాటిని అలా వేస్ట్ చేయడం నచ్చని జోర్డాన్‌కు ఓ ఐడియా వచ్చింది. వెంటనే సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రకటన ఇచ్చాడు. తన ప్రియురాలి పేరు (ఎలిజబెత్ గల్లాగెర్), కెనడా పాస్‌పోర్టు కలిగి ఉండి, ప్రపంచాన్ని చుట్టి రావాలని కోరిక ఉన్న ఏ యువతి అయినా ఈ టూర్‌కు ఫ్రీగా రావొచ్చని ఆఫర్ ఇచ్చాడు. ఇష్టం ఉంటే తనతో కలిసి రావొచ్చని, ఒకవేళ తనతో కలిసి రావడం ఇష్టం లేకున్నా, విమాన టికెట్లు ఇచ్చేస్తానని, సొంతంగానే వెళ్లొచ్చని పేర్కొన్నాడు. నోవా స్కాటియాకు చెందిన 23 ఏళ్ల ఎలిజబెత్ గల్లాగెర్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. తాను వస్తానంటూ జోర్డాన్‌ను సంప్రదించింది. డిసెంబర్ 21న న్యూయార్క్ నుంచి ప్రారంభమయ్యే వీరి ప్రయాణం.. మిలాన్, ప్రేగ్, పారిస్, బ్యాంకాక్, ఢిల్లీ మీదుగా తిరిగి టొరంటోతో ముగుస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ, తన ప్రియురాలు జోర్డాన్‌తో కలిసి వెళ్లడం గల్లాగెర్ బాయ్‌ఫ్రెండ్‌కు సుతరామూ ఇష్టంలేదట. కానీ ఆమె అతడిని ఒప్పించి, ఈ ప్రపంచయానానికి సన్నద్ధమవుతోంది. -
విహారం.. ఓ విజ్ఞానం...
నాటి రోజుల్లో యువరాజు పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేయాలంటే ... అక్కడున్న వనరులు, ప్రజల జీవనశైలి, చుట్టూ ఉన్న ప్రాంతాల వివరాలతో పాటు పొరుగు దేశాల గురించిన సమస్త సమాచారం తెలుసుకోవలసిందే! దీనిని ప్రధాన అర్హతగా భావించేవారు. అందుకే రాజుల కాలంలో వారి పుత్రులను చదువు పూర్తయ్యాక ప్రపంచ పర్యటన చేసి రావల్సిందేనని ఆదేశించేవారు. నాడే కాదు నేడూ ఆ అర్హత పిల్లలకు అందించాలంటే వారిలో పర్యటనల పట్ల ఆసక్తి పెంచాలి. ఎందుకంటే...ప్రకృతిని మించిన గురువు లేరు... బడిలో ఉపాధ్యాయులు ఎంత చెప్పినా బుర్రకెక్కని పాఠాలను ప్రకృతి సులువుగా నేర్పుతుంది. కాలు కందని బాల్యానికి కరకురాళ్ల గట్టితనాన్ని పరిచయం చేస్తుంది. ఆకాశమంత ఎత్తుకు ఎదగమని వృక్షరాజాలు, ఎటునుంచి సమస్య వచ్చినా పోరాడే నేర్పును మృగరాజులు, గంభీరంగా సాగమని నదులు, తుళ్లిపడమనే సెలయేళ్లను.. ఇలా ఎన్నింటినో ప్రకృతి పరిచయం చేస్తుంది. అనుబంధానికి రహదారి... వృత్తి, ఉద్యోగాలలో కొట్టుమిట్టాడే తల్లిదండ్రులకు, చదువుల చట్రంలో బిగుసుకుపోయిన పిల్లలకు కొత్త ఊపిరిని అందించేవి పర్యటనలే! జీవన నైపుణ్యాలు... కొత్త ప్రదేశాలలో కొత్తవారితో ఎలా మెలగాలో పిల్లలకు వాస్తవంగా తెలియజేయడంతో పాటు అమితమైన సహనాన్ని బోధిస్తుంది. తండ్రి చెయ్యి పట్టుకొని ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూసే చిన్నారి కళ్లు పరిశోధనకు తొలిమెట్టు అవుతాయి. అమ్మ చీర కొంగు పట్టుకుని నడిచే చిన్నారి అడుగులు జ్ఞానానికి మార్గాలు చూపుతాయి. అవే మన ముందు తరాలకు మనమందించే అతి గొప్ప సంపద. - ఎన్.ఆర్ -
ఆసిన్ ప్రపంచ పర్యటన, పారిస్ లో జన్మదిన వేడుకలు!
చెన్నై: ప్రపంచ పర్యటన చేస్తున్న బాలీవుడ్ నటి ఆసిన్ పారిస్ నగరంలో జన్మదిన వేడుకల్ని జరుపుకున్నారు. ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న ఆసిన్ జన్మదిన వేడుకల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు పాలుపంచుకుంటారని ఆమె సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. ఆదివారం అక్టోబర్ 26 తేదిన ఆసిన్ 29 ఏట అడుగుపెడుతున్నారు. దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఆసిన్ 2008లో గజిని చిత్రంతో బాలీవుడ్ స్టార్ గా మారారు. ఆతర్వాత లండన్ డ్రీమ్స్, రెఢీ, బోల్ బచ్చన్ చిత్రాల్లో నటించింది. ఉమేశ్ శుక్లా నిర్మిస్తున్న 'ఆల్ ఈజ్ వెల్' చిత్రంలో అభిషేక్ బచ్చన్ సరసన నటిస్తోంది.