14 ఏళ్లు, 1,37,900 కిలోమీటర్లు... ఇంకా ముందుకే | bicycle tour around the world by soman debnath | Sakshi
Sakshi News home page

14 ఏళ్లు, 1,37,900 కిలోమీటర్లు... ఇంకా ముందుకే

Published Thu, Jan 12 2017 8:28 PM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM

14 ఏళ్లు, 1,37,900 కిలోమీటర్లు... ఇంకా ముందుకే

14 ఏళ్లు, 1,37,900 కిలోమీటర్లు... ఇంకా ముందుకే

ఆయన పేరు సోమన్‌ దేవ్‌నాథ్‌. పశ్చిమబెంగాల్‌ సుందర్‌బన్‌లోని ‘బసంతి’  ఆయన గ్రామం. ఓ లక్ష్యం కోసం ఆయన 2004లో తన యాత్రను ప్రారంభించారు. ఇప్పటికే 14 ఏళ్లు గడిచిపోయాయి. ఇంకా తన ప్రయాణాన్ని ఆపలేదు. 2020 వరకు తన సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తారట. ఆయన ఊరు నుంచి ప్రారంభమైన ఆయన సైకిల్‌యాత్ర రాష్ట్రం గుండా, దేశం గుండా, ఖండాల గుండా సాగి 1.37,900 కిలోమీటర్లు చుట్టింది. ఈ సందర్భంగా ఆయన సైకిల్‌పైనే 126 దేశాలు సందర్శించారు. 2020 నాటికి రెండు లక్షల కిలోమీటర్లను అధిగమించి 191 దేశాలు తిరిగి, కనీసం 20 కోట్ల మంది ప్రజలనైనా కలుసుకోవాలన్నది ఆయన లక్ష్యం. 
 
ఆయన సైకిల్‌ యాత్ర సరదాగే ఏమీ సాగలేదు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల చెరలో చిక్కుకున్నారు. ఇరాక్‌లో తృటిలో బాంబుపేలుడు నుంచి తప్పించుకున్నారు. ఆరుసార్లు ఆయన సైకిల్‌ను దొంగలు ఎత్తుకుపోయారు. ఎన్నోరోజులు నిద్రాహారాలు లేకుండా గడిపారు. అయినా లక్ష్యసాధనలో ఆయన ముందుకే సాగుతున్నారు. ప్రస్తుతం అర్జెంటీనాలో నగరాల్లో పర్యటిస్తున్న ఆయన త్వరలో అంటార్కిటికా ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఆయన బడికెళ్లి చదువుకుంటున్నప్పుడు 14 ఏళ్ల వయస్సులో ఎయిడ్స్‌ మహమ్మారి గురించి ఓ వ్యాసం చదివారట. ఆ వ్యాధి బారిన పడినవారిని సమాజం ఎంత నీచంగా నిర్దయగా చూస్తుందో తెలుసుకున్నారట. వ్యాధి గురించి మరింత లోతుగా అధ్యయనం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement