bicycle tour
-
Lael Wilcox: 4 ఖండాలు 21 దేశాలు ...ఓ సైకిల్!
విల్కాక్స్ ‘సైకిల్ సెటప్’పై ఒక లుక్కు వేస్తే... ‘ఈ సైకిల్‌పై కొన్ని ఊళ్లు చుట్టి రావచ్చు’ అనిపిస్తుంది. ఇంకాస్త ఉత్సాహ పడితే... ‘జిల్లాలు చుట్టి రావచ్చు’ అనిపించవచ్చు. ‘ఈ సైకిల్‌తో ఎన్నో దేశాలకు వెళ్లవచ్చు’ అని మాత్రం అనిపించదు. మనం అనుకోవడం, అనుకోక పోవడం మాట ఎలా ఉన్నా ఈ సైకిల్ పైనే విల్కాక్స్ ఎన్నో దేశాలు చుట్టి వచ్చి ప్రపంచ రికార్డును సృష్టించింది.మే 26న షికాగోలోని గ్రాంట్ ΄ార్క్ నుండి బయలుదేరిన లాయెల్ విల్కాక్స్ నాలుగు ఖండాలు, 21 దేశాల మీదుగా 29,169 కిలోమీటర్ల సైకిల్ యాత్రను పూర్తి చేసింది. యాత్ర పూర్తి చేయడానికి పట్టిన కాలం... 108 రోజులు, 12 గంటల 12 నిమిషాలు.ఎన్నో దేశాలు చుట్టి వచ్చి తిరిగి షికాగోకు వచ్చిన విల్కాక్స్కు కుటుంబసభ్యులు, స్నేహితులు, షికాగో సైకిల్ సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు.తన లేటెస్ట్ రికార్డ్‌తో స్కాట్లాండ్కు చెందిన జెన్నీ గ్రాహం గత రికార్ట్ (124 రోజుల 10 గంటల 50 నిమిషాలు)ను విల్కాక్స్ బ్రేక్ చేసింది.‘ఇదొక అద్భుత రికార్డ్’ అనడంతో΄ాటు ‘ఇప్పుడు నేను విల్కాక్స్ కు అభిమానిగా మారి΄ోయాను’ అంటుంది జెన్నీ గ్రాహం.విల్కాక్స్ ‘ప్రపంచ సైకిల్ యాత్ర’ విషయానికి వస్తే...రోజుకు 14 గంటల ΄ాటు రైడ్ చేసేది. ప్రయాణానికి ముందు రకరకాల జాగ్రత్తలు తీసుకుంది. అందులో బరువు తగ్గడం కూడా ఒకటి. ‘ఈ యాత్రలో ఆహ్లాదమే తప్ప కష్టమని ఎప్పుడూ అనిపించలేదు’ అంటుంది విల్కాక్స్. ‘ఆహ్లాదంగా అనిపించింది’ అనేది ఆమె మనసు మాట అయినప్పటికీ భౌతిక పరిస్థితులు వేరు. ఎన్నోసార్లు ప్రతికూల వాతావరణం వల్ల విల్కాక్స్ ఇబ్బంది పడింది. ప్రయాణం మొదలు పెట్టిన 4వ రోజే వర్షంలో చిక్కుకు΄ోయింది. సైకిల్ టైర్ ఎన్నోసార్లు పంక్చర్ అయింది. కొన్నిసార్లు అనారోగ్యానికి గురైనప్పటికీ అంతలోనే కోలుకొని సైకిల్ చేతిలోకి తీసుకునేది. తాను ఏ రోజు ఎక్కడ ప్రయాణిస్తున్నాను అనేది సోషల్ మీడియా ద్వారా ప్రకటించేది. దీనివల్ల వందలాది మంది ఆమెను అనుసరిస్తూ ఉత్సాహపరిచేవారు. ఇది తనని ఒంటరితనం నుంచి దూరం చేసేది.‘అద్భుతమైన శారీరక, మానసిక దృఢత్వం ఆమె సొంతం’ అంటూ సైక్లింగ్ వీక్లి మ్యాగజైన్ ఎడిటర్ మారిజ్ రూక్ విల్కాక్స్ను ప్రశంసించారు.ఒక లక్ష్యం నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడే మరో కల కనడం విల్కాక్స్ అలవాటు. మరి నెక్ట్స్ ఏమిటి? అనే విషయానికి వస్తే... ఆమె ట్రాక్ రికార్డ్‌ను బట్టి చూస్తే అది పెద్ద లక్ష్యమే అనడంలో సందేహం లేదు. ఎవరీ వేదంగి కులకర్ణి?విల్కాక్స్ తాజా రికార్డ్ సందర్భంగా బాగా వినిపిస్తున్న పేరు వేదంగి కులకర్ణి. మన దేశానికి చెందిన ఆల్ట్రా సైకిలిస్ట్ వేదంగి కులకర్ణి ఇరవై ఏళ్ల వయసులో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది. పుణెకు చెందిన కులకర్ణీ యూకేలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చదువుకుంది. దాదాపు ఆరేళ్ల తరువాత కులకర్ణీ మళ్లీ తెరపైకి వచ్చింది. దీనికి కారణం...ఆమె ప్రపంచ సైకిల్ యాత్ర. కులకర్ణీ కూడా తన రైడ్‌ను 108 రోజులలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె గత రికార్డ్ చూస్తే అదేమీ అసాధ్యం కాదు అనిపిస్తుంది. అందుకే విల్కాక్స్ తాజా రికార్డ్‌కు వేదంగి కులకర్ణీ నుంచి గట్టి ΄ోటీ ఉందని విశ్లేషకులు అంటున్నారు. -
తెలుగు బాలుడి సాహసయాత్ర.. రోజుకు 150 కిలోమీటర్లు సైకిల్‌పై..
సాక్షి, న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలంటూ 10వ తరగతి పూర్తిచేసిన తెలుగు బాలుడు 15 ఏళ్ల ఉర్దనపల్లి ఆశిష్ చెన్నై నుంచి లద్దాఖ్ రాజధాని లేహ్ వరకు సైకిల్ మీద సాహసయాత్ర చేశాడు. వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఆశిష్ కుటుంబం వ్యాపారరీత్యా కొన్నేళ్ల కిందట చెన్నైలో స్థిరపడింది. సైక్లింగ్‌పై ఆసక్తి ఉన్న ఆశిష్ జూలైలో చెన్నై నుంచి సైకిల్‌పై బయలుదేరి 41 రోజుల్లోనే లేహ్‌కు చేరుకున్నాడు. సైకిల్‌యాత్రను పూర్తిచేసి తిరుగుప్రయాణంలో ఢిల్లీకి చేరుకున్న ఆశిష్ సహా అతడి కుటుంబసభ్యులు ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆశిష్ మాట్లాడుతూ సైకిల్ యాత్రలో మైదాన ప్రాంతంలో రోజూ 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పాడు. చండీఘడ్ నుంచి పర్వత ప్రాంత ప్రయాణం మొదలయ్యాక ప్రతికూల వాతావరణం, వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడినా యాత్రను కొనసాగించినట్లు తెలిపాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలన్నదే తన కల అని పేర్కొన్నాడు. తనపై తల్లిదండ్రులెప్పుడూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. చెన్నై నుంచి లండన్‌కు సైకిల్‌యాత్ర చేయనున్నట్లు ఆశిష్ చెప్పాడు. (క్లిక్: 23 నిమిషాల్లో 2005 కిక్స్.. తైక్వాండోలో బాలిక ప్రతిభ) -
600 కి.మీ.. ఆకలి కడుపుతో!
హరియాణాలోని కర్నాల్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని తమ గ్రామానికి ఖాళీ కడుపులతో దాదాపు 600 కిలోమీటర్ల దూరం సైకిల్‌పై వెళ్లిన వలస కూలీల విషాద కథనమిది. ఉత్తర ప్రదేశ్‌లోని ఒక గ్రామానికి చెందిన శివం రాథోడ్, రామానంద్ రాథోడ్‌లు నిర్మాణ కార్మికులు. వారు కర్నాల్‌లో ఎనిమిది అంతస్తుల భవన నిర్మాణ ప్రాజెక్టులో కూలీలుగా మార్చి 19న చేరారు. రోజుకు రూ. 400 కూలీగా వారి ఊరి నుంచి పలువురు ఆ ప్రాజెక్టులో కూలీలుగా చేరారు. కూలీ తక్కువైనా.. వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి కొంత డబ్బు సంపాదించుకుని వారి స్వగ్రామానికి వెళ్లాలనేది వారి ఆలోచన. కానీ దురదృష్టం వారిని వెన్నాడింది. పనిలో చేరిన మూడు రోజులకే జనతా కర్ఫ్యూ. ఆ తరువాత లాక్డౌన్. దాంతో పనులు ఆగిపోయాయి. కొన్నాళ్లు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్ నిత్యావసరాల కోసం రోజుకు ఒక్కొక్కరికి రూ. 100 ఇచ్చేవాడు. కొన్ని రోజులు గడిచాక.. తన వల్ల కాదని చేతులెత్తేశాడు. ఏప్రిల్ 29న వీరుంటున్న తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వసతి వద్దకు వచ్చి.. తన ఆదాయం కూడా పడిపోయిందని, తానేం చేయలేనని చేతులెత్తి దండం పెట్టి, వెళ్లిపోయాడు. ఆ కూలీల పరిస్థితి అగమ్యగోచరమైంది. స్థానిక ప్రభుత్వం ఇచ్చే రేషన్.. స్థానికేతరులు కావడంతో వీరికి అందలేదు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఎలాంటి సాయం అందించలేదు. ఆ కాంట్రాక్టరే దయ దలిచి శివం, రామానంద్, మరో ఇద్దరికి కలిపి మూడు పాత సైకిళ్లను సమకూర్చాడు. వాటిపైననే వారు 600 కిమీల దూరంలోని తమ గ్రామానికి బయల్దేరారు. మే 2 నాటికి ఆగ్రా సమీపా నికి చేరుకున్నారు. అంత దూరం ఎండలో ఎలా సైకిల్‌పై వెళ్తున్నారన్న ప్రశ్నకు.. కొద్ది, కొద్ది దూరం తొక్కుతూ వెళ్తున్నామని చెప్పారు. మరి భోజనమెలా? అన్న ప్రశ్నకు.. అప్పట్నుంచి అన్నం తినలేదని, తాము దాటి వచ్చిన హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల్లో హైవేపై పలు టోల్‌గేట్స్ ఉన్నా, ఎక్కడా, ఎలాంటి ఆహార సదుపాయాలు ఏర్పాటు చేయలేదని చెప్పారు. తామే కాకుండా, ఈ హైవేపై వందలాదిగా కూలీలు నడుస్తూ సొంతూళ్లకు వెళ్తున్నారని, వారు కూడా ఆకలితోటే ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఒక టోల్ గేట్ వద్ద మాత్రం ఒక పోలీస్ 2 డజన్ల అరటి పండ్లు, నమ్కీన్ ప్యాకెట్లు, బిస్కట్ ప్యాకెట్లు ఇచ్చాడని, వాటితోనే కడుపు నింపుకుంటున్నామని చెప్పారు. ఇంటివద్ద తనకు అమ్మ, చెల్లి ఉన్నారన్న శివం రాథోడ్.. ‘వారు డబ్బులు పంపిస్తాం.. అక్కడే ఉండు’అని చెప్పారు కానీ డబ్బు పంపించలేకపోయారని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వం వలస కూలీలను స్వగ్రామాలకు పంపించేందుకు నిర్ణయించిన విషయం తమకు తెలియదని, అయినా ప్రభుత్వాన్ని నమ్మలేమని వ్యాఖ్యానించారు. -
పెళ్లి కోసం 200 కి.మీ. సైకిల్ ప్రయాణం
హరింపుర్: ఉత్తరప్రదేశ్‌లోని హరింపూర్ జిల్లా పౌతియా గ్రామానికి చెందిన కల్కు ప్రజాపతి (23) తన పెళ్లి కోసం ఏకంగా 200 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. ప్రజాపతి వివాహం ఏప్రిల్ 25న జరగాల్సి ఉండగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడం, వండిపెట్టేందుకు ఎవరూ లేకపోవడంతోనే ప్రజాపతి వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకే, సైకిల్‌పై పక్క జిల్లాలో ఉన్న వధువు ఇంటికి వెళ్లి, అక్కడ పెళ్లి చేసుకొని తిరుగు ప్రయాణంలో సతీసమేతంగా సైకిల్‌పై స్వగ్రామం చేరుకున్నాడు. -
సైకిల్‌పై నిర్మల్ నుంచి జమ్మూకు..
నిర్మల్‌రూరల్ : జిల్లా కేంద్రంలోని వాసవీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఇటీవలే వేసవి సెలవుల్లో దేశవ్యాప్త సైకిల్ యాత్రను పూర్తి చేసిన ఉపాధ్యాయుడిని స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు బుధవారం ఘనంగా సన్మానించారు. పాఠశాలకు చెందిన సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు భరత్‌కుమార్ వేసవి సెలవుల్లో నిర్మల్ నుంచి బయలుదేరి ఉత్తర భారతదేశంలోని జమ్ము, గుజరాత్ తదితర రాష్ట్రాలను చుట్టి వచ్చారు. ఈ సందర్భంగా తన యాత్ర సందర్భంగా జరిగిన అనుభవాలను ఉపాధ్యాయుడు విద్యార్థులకు వివరించారు. సైకిల్ యాత్రతో ఆరోగ్యంతో పాటు జాతీయ సమైక్యతను తెలుసుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రకాల ఆచార సంప్రదాయాలను అవగతం చేసుకోవచ్చని తెలిపారు. పాఠశాల సెక్రెటరీ జగదీశ్‌రెడ్డి, కరస్పాండెంట్ పోతారెడ్డి, ప్రిన్సిపాల్ రాజేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మేమున్నామని.. మీకేం కాదని..
చిత్తూరు అర్బన్: మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, అఘాయిత్యాలు, దాడులకు ప్రధాన కారణం, వాటిపై సరైన అవగాహన లేకపోవడమే. సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి..? ఎవరిని ఆశ్రయించాలి..? ఏం చేయాలి..? అనే విషయంపై వారం క్రితం చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు జిల్లాలోని షీ టీమ్స్ పోలీసులు, మహిళా విభాగం పోలీసులతో సమావేశం నిర్వహించారు. మగువలపై ఇటీవల దాడులు ఎక్కువైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. బాధిత మహిళల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలవారే ఉన్నట్లు తేలింది. దీనిపై సమస్యలు వచ్చిప్పుడు కుంగిపోకుండా నిబ్బరంగా ఉండడంతో పాటు దాన్ని పరిష్కారించుకోవడానికి మార్గాలు చూపాలన్నారు. సైకిల్‌పై తిరుగుతూ మహిళలతో మమేకమై చైత్యన్యం తేవాలని దీనికి ఎవరు ముందుకొస్తారని ప్రశ్నించారు. అడగడమే ఆలస్యంగా నలుగురు యువ మహిళా కానిస్టేబుళ్లు ఆసక్తి చూపడంతో జిల్లాలో నెల రోజుల పాటు దాదాపు 1200 కిలో మీటర్ల దూరం సైకిల్‌పై తిరుగుతూ ‘అతివల్లో ఆత్మస్థైర్యం నింపుదాం..’ అనే నినాదంతో పల్లెల్లోకి వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు చిత్తూరు నగరం నుంచి ప్రారంభమయ్యే ఈ సైకిల్ యాత్రను కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్‌బాబులు జెండా ఊపి ప్రారంభించనున్నారు. పయనం ఇలా.. నెల రోజులకు పైగా సాగే సైకిల్ యాత్ర జిల్లాలో దాదాపు 1200 కిలోమీటర్లు తిరుగుతూ వెయ్యి గ్రామాల వరకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో సైకిల్‌పై వెళ్లే మహిళలకు ఘన స్వాగతం పలుకుతారు. విద్యార్థినులు, మహిళా సంఘాలు, నిరక్షరాస్యులైన మహిళలతో సమావేశమవుతారు. సమస్యలు వచ్చినప్పుడు ఎలా ప్రతిఘటించాలి, చట్టాలు ఏం చెబుతున్నాయి. న్యాయం ఎలా పొందాలన్న విషయాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తారు. అతివలపై జరిగే దాడుల నివారణకు చైతన్యం కల్పించడంతో పాటు ఆత్మహత్మ ఆలోచనల్ని చంపేయడం సమాజంలో ధైర్యంగా నిలబడటంపై కూడా మాట్లాడనున్నారు. వీరే ఆ నలుగురు.. సైకిల్ యాత్రకు ఎస్పీ నలుగురు చాకుల్లాంటి మహిళా కానిస్టేబుళ్లను గుర్తించి, వీరికి ఇప్పటికే శిక్షణ సైతం ఇప్చించారు. పుత్తూరు స్టేషన్లో పనిచేసే తిరుమల (డబ్ల్యూపీసీ–633), బైరెడ్డిపల్లెలోని నిర్మల (డబ్ల్యూపీసీ–721),పలమనేరులోని భార్గవి(డబ్ల్యూపీసీ–676), నాగరత్న(డబ్ల్యూపీసీ–1008)ను ఎంపిక చేశారు. -
ధ్యానేశ్వర్.. శాంతి యాత్రికుడు
కుర్రకారంతా ఫేస్బుక్కుల్లో, ట్వీటర్లో మునిగి తేలుతున్నారు. కాస్త అవకాశం దొరికితే బైకుపై షికార్లు చేస్తూ, సినిమాలు, క్రికెట్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. వీరంతా ఓ రకమయితే, శ్రద్ధగా చదివి, ర్యాంకులు సాధించి, మంచి ఉద్యోగం సంపాదించి లక్షల్లో సంపాదిస్తూ ఎంజాయ్ చేసేవారు మరోరకం. కానీ ఈ రెండు రకాల యువతకు భిన్నంగా, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా, శాంతి స్థాపనే ధ్యేయంగా సైకిల్‌పై ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు ధ్యానేశ్వర్ యావత్కర్. సైకిల్ యాత్ర అంటే ఏదో ఒకట్రెండు రోజులో, వారం పదిరోజులో కాదు.. ఏకంగా మూడేళ్లుగా పాదాలను పెడల్పై అరగదీస్తున్నాడు. ఎక్కడైనా స్కూల్ కనిపించినా, చిన్నపిల్లల సమూహం కనిపించినా ఆ సైకిల్ అక్కడే ఆగిపోతుంది. వారందరికి గాంధీ మార్గం ఎంత గొప్పదో, అహింస ద్వారా ఏం సాధించవచ్చో చెబుతాడు. గ్రామ పెద్దలను కలుస్తాడు. గాంధీ కోరుకున్న భారతదేశం కోసం చేయాల్సిన పనులేవో వివరిస్తాడు. 70,000 కిలోమీటర్లు ప్రయాణించాలనే లక్ష్యంతో తన సైకిల్ యాత్ర ప్రారంభించిన ఈ కుర్రోడు ఇప్పటిదాకా 8,642 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తిచేశాడు. 2019, అక్టోబర్ 2 నాటికి అంటే మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి పాకిస్తాన్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ మరాఠా యువకుడు. మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన యావత్కర్.. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన సేవాగ్రామ్ నుంచి తన యాత్రను ప్రారంభించాడు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ సైకిల్ యాత్ర
యాలాల: పర్యావరణ పరిరక్షణ కోరుతూ దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేపట్టిన సైకిల్ యాత్ర నేటితో 22 రోజులు పూర్తి చేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్, నిజామాబాద్ జిల్లా వాసి అయిన రవికిరణ్ శనివారం సాయంత్రం వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలోని యాలాల చేరుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మీదుగా కొనసాగిన ఆయన సైకిల్ యాత్ర తాండూరుకు చేరింది. ఇప్పటివరకు 1545 కిలోమీటర్ల దూరం తిరిగానని, 22 రోజులు పూర్తి అయ్యాయని రవికిరణ్ చెప్పారు. మొత్తం ఐదు వేల కిలోమీటర్ల యాత్ర పూర్తి చేయాలని, తద్వారా పర్యావరణంపై అవగాహనా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ వివరించారు. -
14 ఏళ్లు, 1,37,900 కిలోమీటర్లు...ఇంకా ముందుకే
-
14 ఏళ్లు, 1,37,900 కిలోమీటర్లు.. ఇంకా ముందుకే
-
14 ఏళ్లు, 1,37,900 కిలోమీటర్లు... ఇంకా ముందుకే
ఆయన పేరు సోమన్ దేవ్నాథ్. పశ్చిమబెంగాల్ సుందర్బన్లోని ‘బసంతి’ ఆయన గ్రామం. ఓ లక్ష్యం కోసం ఆయన 2004లో తన యాత్రను ప్రారంభించారు. ఇప్పటికే 14 ఏళ్లు గడిచిపోయాయి. ఇంకా తన ప్రయాణాన్ని ఆపలేదు. 2020 వరకు తన సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తారట. ఆయన ఊరు నుంచి ప్రారంభమైన ఆయన సైకిల్‌యాత్ర రాష్ట్రం గుండా, దేశం గుండా, ఖండాల గుండా సాగి 1.37,900 కిలోమీటర్లు చుట్టింది. ఈ సందర్భంగా ఆయన సైకిల్‌పైనే 126 దేశాలు సందర్శించారు. 2020 నాటికి రెండు లక్షల కిలోమీటర్లను అధిగమించి 191 దేశాలు తిరిగి, కనీసం 20 కోట్ల మంది ప్రజలనైనా కలుసుకోవాలన్నది ఆయన లక్ష్యం. ఆయన సైకిల్ యాత్ర సరదాగే ఏమీ సాగలేదు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల చెరలో చిక్కుకున్నారు. ఇరాక్‌లో తృటిలో బాంబుపేలుడు నుంచి తప్పించుకున్నారు. ఆరుసార్లు ఆయన సైకిల్‌ను దొంగలు ఎత్తుకుపోయారు. ఎన్నోరోజులు నిద్రాహారాలు లేకుండా గడిపారు. అయినా లక్ష్యసాధనలో ఆయన ముందుకే సాగుతున్నారు. ప్రస్తుతం అర్జెంటీనాలో నగరాల్లో పర్యటిస్తున్న ఆయన త్వరలో అంటార్కిటికా ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఆయన బడికెళ్లి చదువుకుంటున్నప్పుడు 14 ఏళ్ల వయస్సులో ఎయిడ్స్ మహమ్మారి గురించి ఓ వ్యాసం చదివారట. ఆ వ్యాధి బారిన పడినవారిని సమాజం ఎంత నీచంగా నిర్దయగా చూస్తుందో తెలుసుకున్నారట. వ్యాధి గురించి మరింత లోతుగా అధ్యయనం చేశారు. వ్యాధి పట్ల ప్రజలకు సరైన అవగాహన కలిగించేందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నారు. అప్పటికి ఏం చేయాలో తెలియదు. డిగ్రీ పూర్తి చేశారు. సైకిల్ కొనుక్కున్నారు. సైకిల్‌పై రాష్ట్రమంతా తిరిగి ఎయిడ్స్ వ్యాధి రాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు, వస్తే తీసుకోవాల్సిన చికిత్స, వారి పట్ల సమాజం వ్యవహరించాల్సిన తీరు గురించి ప్రచారం చేశారు. మూడు నెలలతో తన యాత్ర ఆపకూడదనుకున్నారు. మరో ఆరు నెలలు దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగి ఇదే ప్రచారం చేశారు. అప్పటికీ తృప్తినివ్వలేదు. ప్రపంచదేశాల్లో కూడా ఈ ప్రచారయాత్రను కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. మరి ఎలా? అంత డబ్బులు తనకు ఎక్కడున్నాయని ఆలోచించారు. సైకిల్‌పై వెళ్లొచ్చుకదా అన్న ఆలోచన వచ్చింది. అదే తడువుగా ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రకు మీ కుటుంబం ఒప్పుకుందా? అని దారి మధ్యలో మీడియా ఆయన్ని ప్రశ్నించగా ‘ఏ కుటుంబం? నా కుటుంబమా, గ్లోబల్ కుటుంబమా !’ అని ఆయన ప్రశ్నించారు. ‘మా నాన్న అసలు అంగీకరించలేదు. కొంతకాలం నాతో మాట్లాడలేదు. అదే పనిగా అమ్మకు నచ్చచెబుతూ వచ్చా. చివరకు అమ్మ ఒప్పుకున్నది. అమ్మతోనే నాన్నను ఒప్పించాను. అంతే నా యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో ప్రపంచం గురించి నేను కొన్ని సత్యాలు తెలుసుకున్నాను. మనం గందరగోళంలో ఉంటే, ప్రపంచం కూడా గందరగోళంగా ఉంటుంది. మనం నిరాశపడితే మనల్ని ప్రపంచం మరింత నిరుత్సాహ పరుస్తుంది. మనం ఆశావాద దృక్పథంతో వ్యవహరిస్తే. ప్రపంచం కూడా మన పట్ల అదే దృక్పథంతో వ్యవహరిస్తుంది. అంటే, మన స్పందన ఎలా ఉంటే, ప్రపంచం ప్రతి స్పందన అలాగే ఉంటుంది’ అని చెప్పారు. ‘నేను సైకిల్‌పై బట్టలు, పడుకోడానికి చాప, పడుకునే బ్యాగు, టెంట్, అల్పాహారం తీసుకెళుతున్నాను. ఇద్దరు వ్యక్తులు, ఓ కంపెనీ నా యాత్రకు ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్నారు. అయినా నా యాత్ర పూర్తి అవడానికి కావాల్సినంత డబ్బు సమకూరడం లేదు. 30 శాతం మాత్రమే సమకూరింది. అంటార్కిటికా వెళ్లేందుకు అవసరమైన టిక్కెట్లు కొనుక్కున్నాను. ముందేం జరుగుతుందో చూడాలి. ఫలితం ఆశించకుండా లక్ష్యం దిశగా సాగిపోవాలన్న భగవద్గీత సందేశమే నాకు స్ఫూర్తి’ అని ఆయన చెప్పారు. భారత్‌కు తిరిగొచ్చి సొంతూరుకు చేరుకున్నాక ఏం చేయాలన్నది మీ లక్ష్యమని మీడియా ఆయనను ప్రశ్నించగా ‘నా ఊళ్లో గ్లోబల్ గ్రామాన్ని నిర్మించడం నా లక్ష్యం. ఏ దేశం వ్యక్తినైనా, ఏ జాతి వ్యక్తినైనా నా గ్లోబల్ గ్రామానికి ఆహ్వానిస్తాను’ అని చెప్పారు. -
ప్రారంభమైన జైళ్ల శాఖ సైకిల్ యాత్ర
తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. ఈ యాత్రను చంచల్‌గూడ జైళ్ల ప్రధాన కార్యాలయంలో డీఐజీ నర్సింహులు ప్రారంభించారు. ఈ సైకిల్ యాత్రలో ఐదుగురు జైళ్ల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అవినీతి రహిత సమాజం, ఏకత్వంలో భిన్నత్వం, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ సైకిల్ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. వీరు తెలంగాణ వ్యాప్తంగా 2145 కి.మీల సైకిల్ యాత్ర చేస్తారు. -
ప్రజల్లో చైతన్య కోసమే సైకిల్ యాత్ర
బొమ్మలరామారం : ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే తాను సైకిల్ యాత్ర చేస్తున్నట్లు హైదరాబాద్ రామాంతపూర్‌కు చెందిన మిట్టగోరు రాములు గౌడ్ తెలిపారు. వేములవాడ రాజన్న సన్నిధిలో తన సైకిల్ యాత్ర విరమించేందుకు వెళ్తున్న క్రమంలో మండల కేంద్రానికి చేరింది. కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్, యోగా, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మిషన్ కాకతీయ, హరిత హారంలాంటి పథకాలపై చైతన్యం కల్పిస్తున్నారు. గతంలో ప్రత్యేక తెలంగాణ కోసం సోనియా గాంధీ, ప్రధాని వద్దకు రెండు పర్యాయాలు ఢిల్లీకి సైకిల్ యాత్ర చేసానని తెలిపారు. ఇటివలే జూలై1న స్వచ్ఛ భారత్ నినాదంతో ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసి యాత్ర విరమించేందుకు వేముల వాడ రాజన్న సన్నిధికి బయలు దేరానని పేర్కొన్నారు. నేటికి 28000 కిలో మీటర్లు తిరిగి సైకిల్ యాత్ర చేశానన్నారు. 70 ఏళ్ల వయసులోనూ యాత్రను కొనసాగిస్తున్న రాములును పలువురు అభినందిస్తున్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహన కోసం
డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవర్నెస్ నిర్వహిస్తూ వరంగల్ జిల్లా కొత్తపల్లికి చెందిన నాగరాజు నాన్‌స్టాఫ్ 50 గంటల సైకిల్ యాత్ర చందానగర్ డివిజన్లో ఆదివారం నిర్వహించారు. 26 ఆగస్టు నుండి ప్రారంభమైన సైకిల్ యాత్ర జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో కొనసాగించనున్నాడు. ఈ నేపథ్యంలో చందానగర్ డివిజన్‌కు వచ్చిన నాగరాజుకు స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. ఉదయం 7.30 గంటలకు చందానగర్ గాంధీ విగ్రహం వద్ద నాగరాజుకు స్వాగతం పలికారు. కాఫ్రా మొదటి డివిజన్ నుంచి ప్రారంభమైన నాన్‌స్టాఫ్ సైకిల్ యాత్ర నిద్ర, విశ్రాంతి లేకుండా 29 ఆగస్టు రాత్రి 12 గంటల వరకు కొనసాగుతోందని నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల అవర్నెస్ పోగ్రాం సైకిల్ యాత్ర ద్వారా తీసుకురావడం అభినందనీయమన్నారు. -
వర్షాల కోసం సైకిల్ యాత్ర
రామచంద్రాపురం: వర్షాలు కురిసి రైతులు, ప్రజలు శుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ శనివారం తెల్లాపూర్ హెల్త్‌క్లబ్ సభ్యులు ఎంపీపీ ఉపాధ్యక్షుడు చిలకమర్రి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చిలుకూరు వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. ఉదయం గ్రామంలోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలుచేసి అక్కడి నుండి చిలుకూరి బాలాజి దేవాలయం వరకు సైకిల్‌పై వెళ్లారు. ఈ సందర్బంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపించాలన్న కొరికతో తాము ఈ సైకిల్ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెల్లాపూర్ సోసైటీ చైర్మన్ మల్లెపల్లి బుచ్చిరెడ్డి, ఎంపీపీ మాజీ ఉపాధ్యక్షుడు కంజర్ల శ్రీశైలంయాదవ్, గ్రామస్థులు రాజు, మల్లేష్, గోపాల్, మల్లారెడ్డి, మహేష్, టికారామ్, నిరంజన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, బలరాం, రాజు, నర్సింలు సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. -
నిర్లక్ష్యంపై నాగరాజు సైకిల్ యాత్ర
సనత్‌నగర్: తాగి వాహనాలను నడిపి నిండు ప్రాణాలను బలితీసుకోవద్దంటూ వరంగల్ జిల్లాకు చెందిన నాగరాజు సైకిల్ యాత్ర చేపట్టాడు. బేగంపేట్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (టీటీఐ) నుంచి నిర్విరామంగా 50 గంటలపాటు నిర్వహించే సైకిల్ యాత్రను శుక్రవారం హీరో శివబాలాజీ జెండా ఊపి ప్రారంభించారు. సైకిల్ యాత్రతో కనీసం కొందరిలోనైనా మార్పు తీసుకురావానుకుంటున్నట్లు నాగరాజు తెలిపారు. -
సైకిల్ యాత్రను విజయవంతం చేయాలి
కందుకూరు: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆగస్ట్ 2న జిల్లా స్థాయిలో చేపట్టనున్న సైకిల్ యాత్రను విజయవంతం చేయాలని సంఘం సౌత్ జిల్లా కార్యదర్శి ఎర్ర యాదగిరి కోరారు. ఆదివారం మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళవారం కందుకూరు మండల కేంద్రం నుంచి సైకిల్ యాత్రను ప్రారంభించనున్నామని, ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య కార్యక్రమానికి హాజరవుతున్నారని చెప్పారు. సైకిల్ యాత్ర ద్వారా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని చెప్పారు. అవసరమైతే సమస్యల పరిష్కారం కోసం రాష్ర్టవ్యాప్త ఉద్యమం చేస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రెండు జతల దుస్తులు, అవసరమైన ఉపాధ్యాయులు, కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. సంక్షేమ వసతి గృహాల్లో బాలికలకు సరిపడు మరుగుదొడ్లు లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు, మూడు హాస్టళ్లకు ఒక్కరే వార్డెన్ నియమించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎస్ఎఫ్ఐ ఉద్యమ ఫలితంగానే 2012 సంవత్సరంలో హాస్టల్ విద్యార్థులకు కాస్మొటిక్, మెస్ చార్జీలు పెంచారని, మళ్లీ ఇప్పటి వరకు పెంచలేదన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు మాత్రం నెలకు లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేపట్టే యాత్రలో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు గూడూరు భాస్కర్, సాయికృష్ణ, అంజి, సాయికుమార్, భాను తదితరులు పాల్గొన్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదా కోసం సైకిల్ యాత్ర
-
సీఎం ఇంటి వరకు సైకిల్‌యాత్ర
ఖానాపూర్ : ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై అఖిలపక్షాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఢిల్లీకి తీసుకెళ్లాలని లేకపోతే మాదిగ విద్యార్థి సమైఖ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుంచి సీఎం కేసీఆర్ ఇంటి వరకు సైకిల్‌యాత్ర కొనసాగిస్తామని ఆ సంఘం జిల్లా కో-ఆర్డినేటర్ బిక్కి మురళికృష్ణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రెస్‌భవన్‌లో చలో ఢిల్లీ కరపత్రాలు విడుదల చేశారు. జూన్ 10న సెంట్రల్ యూనివర్సిటీలో ప్రారంభమైన సైకిల్ యాత్ర జులై 18న సీఎం కేసీఆర్ ఇంటికి చేరడంతో ముగుస్తుందన్నారు. జిల్లాలోను ఈ నెల 4న జన్నారంలో ప్రారంభమై 7వ తేదీన బాసరలో ముగుస్తుందన్నారు. ఈ నెల 5న ఖానాపూర్‌లో సైకిల్‌యాత్ర ఉంటుందన్నారు. సైకిల్‌యాత్ర అనంతరం జులై 19 నుంచి అగస్టు 12 వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహా ప్రదర్శన, ధర్నాలు, దీక్షలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల కన్వీనర్ చెట్పల్లి రాజశేఖర్, ఎంఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్చార్జి జన్నారపు ప్రవీణ్, నాయకులు మంద హరీశ్, చెట్పల్లి గణేశ్, జూకింది శ్రీకాంత్, సేర్ల సాయి తదితరులున్నారు. -
సైకిల్ ట్రిప్ 4 స్టార్టప్
ఎన్నో వ్యక్తిగత సామాజిక ఆకాంక్షలతో యువతరం ప్రారంభిస్తున్న స్టార్టప్ కంపెనీలు తక్కువ సమయంలోనే మూతపడుతున్నాయి. ఇందుకు కారణాలెలా ఉన్నా, దేశ భవిష్యత్తుకి ఎంతో అవసరమైన ఈ వ్యవస్థను పటిష్టం చేయడానికి, స్టార్టప్ కంపెనీల సమస్యలు అర్థం చేసుకొని వారి ఇబ్బందులు కొంతవరకైనా దూరం చేయడానికి సిటీ యువకుడు సైకిల్ టూర్ మొదలుపెట్టాడు. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యాత్ర ఏడాది పాటు కొనసాగనుంది. - ఓ మధు దేశంలోని ముఖ్య నగరాల్లో స్టార్టప్‌ల సమస్యలు తెలుసుకొని వీలైనంత వరకూ పరిష్కారం చూపించే దిశగా ఈ టూర్ ప్రారంభించాడు కొండాపూర్‌లో నివసించే అక్షయ్ గుంతేటి(22). ‘ఇండియా స్టార్టప్ టూర్ ’ పేరిట సాగే ఈ సైకిల్ యాత్ర విశేషాలు అతని మాటల్లోనే... స్టార్టప్‌కు సహాయం చేయాలని.. రెండేళ్ల కిందట డేటింగ్ యాప్ రూపొందించాలనుకున్నాను. దీనికి కేరళలోని కొచ్చి నుంచి ఒక టీం దొరికింది. అది ప్రారంభించాక, అక్కడికి వెళ్లి ఎన్జీఓలు, స్టార్టప్ విలేజ్ చూశాక యాప్ కన్నా.. ఔత్సాహిక వ్యాపారులకు సహాయం చాలా అవసరమనిపించింది. తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోవడం, లోన్ రాకపోవడం లాంటి చిన్న చిన్న సమస్యల వల్లే 90 శాతం స్టార్టప్స్ ఫెయిల్ అవుతుంటాయి. ఇన్వెస్టర్‌కి స్టార్టప్ కంపెనీ గురించి తెలియకపోవడం, స్టార్టప్ కంపెనీల వాళ్లకి ఇన్వెస్టర్ దొరకకపోవడం.. ఇవే బిజినెస్ ఫెయిల్యూర్‌కి ముఖ్య కారణమని అర్థమవుతోంది. అలాంటి కొన్ని స్టార్టప్స్‌కి సహాయం చేయాలని నిధియా వి రాజ్, నేను కలిసి ఇండియన్ స్టార్టప్ టూర్‌కి ప్లాన్ చేశాం. సమస్యల పరిష్కారమే ధ్యేయం.. దేశంలోని ఇన్వెస్టర్లు, సలహాదారులు, సిద్ధాంతకర్తలు, ప్రభుత్వ అధికారులను కలిసి స్టార్టప్స్‌పై అధ్యయనం, ఇవి విఫలమవడానికి కారణాలు, వాటిని అధిగమించేందుకు పరిష్కారాలు కనుక్కోవాలనే లక్ష్యంతో ఈ టూర్ ప్రారంభించాం. దీని కోసం సైకిల్ మీద 10,0020 కి.మీ ప్రయాణిస్తా. దీనిలో 40 మీటప్స్, 30 నగరాల విజిట్ ఉంటుంది. ఇప్పటికే వైజాగ్, విజయవాడ నగరాలను సందర్శించి మార్చి 30న హైదరాబాద్ వచ్చాను. భయం వద్దు.. అనుభవమే ముద్దు.. వెళ్లిన ప్రతి సిటీలో స్టార్టప్ మీటప్స్ నిర్వహించడం, అక్కడి అవసరాలు, అనువైన వ్యాపారాల రిపోర్ట్ తయారు చేయడం, ఇన్వెస్టర్లు ఎవరైనా, ఎక్కడి వారైనా తగిన స్టార్టప్ కంపెనీస్‌కి కనెక్ట్ చేయడం.. తదితర సేవల్ని ఉచితంగా అందిస్తున్నాం. స్టార్టప్ ఫెయిల్యూర్‌కి మరో ముఖ్యమైన కారణం లీగల్ అవేర్నెస్ లేకపోవడం. మీటప్ పెట్టి, లీగల్ ఎక్స్‌పర్ట్‌ని పిలిచి వారితో అవగాహన కల్పిస్తున్నాం. ఫెయిల్ అయినా సరే స్టార్టప్ కంపెనీ పెట్టి అనుభవం గడించిన వారిని నియమించుకోవడానికి పెద్ద కంపెనీలు కూడా ఇంట్రస్ట్ చూపిస్తాయి. అందుకే స్టార్టప్‌ను ప్రారంభించే విషయంలో సక్సెస్ అవుతామా? లేదా అనే భయం వ ద్దని నా సలహా. సైకిల్ సాగుతోందిలా... ఇది పూర్తిగా నాన్ ప్రాఫిట్ టూర్. టూర్లో నా టెంట్లో లేదా ఆఫర్ చేసిన వాళ్ల దగ్గర ఉంటున్నాను. సైక్లింగ్ ద్వారా సేకరించిన డాటాని నా టీమ్ మేనేజ్ చేస్తుంది. చెన్నై, వెల్లూర్, బెంగళూర్, కోయంబత్తూర్, కొచ్చి, కన్యాకుమారి, కాలికట్, మంగళూర్, గోవా, పుణె, నాసిక్, రిషికేశ్, లక్నో... ఇలా 32 నగరాలు తిరిగి చివరకు బెంగళూర్ చేరుకుంటాను. నెల రోజుల పాటు అక్కడే ఉండి తయారు చేసిన రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందించనున్నాం. స్టార్టప్‌కి ఎవరూ చేయూతనివ్వరు. కానీ వాళ్ల ఐడియాలు బాగుంటాయి. అయితే వాళ్లకి చాలా సమస్యలుంటాయి. వాటిని పరిష్కరిస్తే వందలో 10 స్టార్టప్‌లు తప్పక మనగలుగుతాయి. యావత్ స్టార్టప్ కమ్యూనిటీ అంతా ఒకే గొడుగు కిందకు వచ్చి ఆ స్ఫూర్తిని దేశమంతా విస్తరించాలన్నదే మా విజన్. -
అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సైకిల్ యాత్ర
-
మహిళా.. మేలుకో..
మార్షల్ ఆర్ట్స్‌పై యలమంచిలి యువకుడి ప్రచారం హైదరాబాద్ నుంచి విశాఖకు సైకిల్ యాత్ర సాక్షి, విశాఖపట్నం : దేశంలో ఏదో ఓ మూల రోజుకో ఘోరం. ఆడ పిల్లలపై అఘాయిత్యం. పసి పిల్లలపై కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు. పత్రికల్లో, టీవీల్లో ఇలాంటి సంఘటనలు చూసి సమాజం ఏమైపోతోందని ప్రతి ఒక్కరిలోనూ ఆవేదన. అయితే ఆ కుర్రాడు ఆవేదన పడి ఊరుకోలేదు. తనవంతుగా ఏం చేయగలనా? అని ఆలోచించాడు. మహిళలను మేల్కొలపడానికి హైదరాబాద్ నుంచి విశాఖకు సైకిల్ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి రోజూ ఒకటి రెండు చోట్ల ఆత్మరక్షణపై విద్యార్థినుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నించాడు. అతడే యలమంచిలికి చెందిన సతీష్‌కుమార్ వెలగ. 10 రోజులు.. 650 కిలోమీటర్లు సతీష్ హైదరాబాద్‌లోని జీఈ కాపిటల్స్లో ప్రాసెస్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఓ మహిళపై లైంగిక దాడి జరిగిన సంఘటనతో చలించిపోయాడు. శారీరకంగా బలహీనులైన మహిళలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటే తమను తాము రక్షించుకోగలరని, ఆ దిశగా ప్రచారం చేసేందుకు పూనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా ‘ఆడపిల్లల ఆత్మ రక్షణ-భావి తరాలకు రక్షణ’ నినాదంతో ఈ నెల 17న హైదరాబాద్‌లో సైకిల్ యాత్ర ప్రారంభించాడు. పది రోజులు ప్రయాణించి సోమవారం విశాఖ చేరుకున్నాడు. సాగరతీరంలో తన యాత్రను ముగించాడు. మధ్యలో తనకు తారసపడిన ప్రతి నగరం, పట్టణంలోని కళాశాలల వద్దకెళ్లి మహిళ ఆత్మ రక్షణపై తనకు తెలిసింది వివరించాడు. వారితో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు కృషి చేశాడు. మార్షల్ ఆర్ట్స్ బీమాలాంటిది జీవితానికి బీమా ఎలాంటిదో.. మహిళల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ కూడా అలాంటివే. టెక్నాలజీని అమ్మాయిలు వాడుకోవాలి. GoSafe, bSafe, Fightback, Life 360 తదితర అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఒంటరిగా వెళ్లేటప్పుడు ప్రయాణించే వాహనం నంబర్, ఫొటో తదితర వివరాలు వాట్స్ప్లాంటి సౌకర్యాల ద్వారా తల్లిదండ్రులు, బంధువులకు చేరే ఏర్పాట్లు చేయాలి. ఈ విషయం డ్రైవర్‌కు తెలిసేటట్టు వ్యవహరిస్తే.. వారు అనుచితంగా వ్యవహరించడానికి భయపడతారు. - సతీష్‌కుమార్ వెలగ -
అంగవైకల్యం క్రీడలకు అడ్డు కాదు
సాక్షి, హైదరాబాద్: క్రీడల్లో రాణించేందుకు అంగవైకల్యం అడ్డు కాదని హైదరాబాదీ పారా అథ్లెట్ ఆదిత్య మెహతా చాటి చెబుతున్నాడు. పారా అథ్లెట్లకు సాయమందించేందుకు నిధుల సేకరణకు నడుం బిగించాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్రకు గురువారం శ్రీనగర్‌లో శ్రీకారం చుట్టాడు. ‘ఎయిర్టెల్ ఎండ్యురెన్స్ రైడ్’ పేరిట 36 రోజుల పాటు 3800 కిలోమీటర్లు పయనించనున్నాడు. ఇందులో భాగంగా 8 రాష్ట్రాల్లో 36 నగరాలను అతను చుట్టి వస్తాడు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిత్య రెండుకాళ్లను కోల్పోయాడు. అంతటితో తన జీవితం ముగిసిపోలేదని, వైకల్యాన్ని జయించి కలల్ని సాకారం చేసుకుంటాననే ధైర్యంతో ముందడుగు వేశాడు. కృత్రిమ కాలు పరికరంతో సైక్లింగ్ క్రీడను ఎంచుకున్నాడు. కేవలం 19 నెలల వ్యవధిలోనే 31 ఏళ్ల ఆదిత్య ప్రొఫెషనల్ సైక్లిస్ట్‌గా ఎదిగాడు. ఈ ఏడాది జరిగిన పారా ఆసియా సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు రజత పతకాలు గెలుపొందాడు. తనలాంటి అంగవికలురు నిరాశలో కూరుకుపోకుండా, భవిష్యత్తుపై ఆశలు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఎండ్యురెన్స్ రైడ్‌ను ప్రారంభించాడు. దీనికి కార్పొరేట్ సంస్థలు కూడా స్పాన్సర్‌గా వ్యవహరించడంతో యాత్ర ఆరంభించాడు. దీని ద్వారా వచ్చిన నిధుల్ని పారా అథ్లెట్ల కోసం వినియోగించనున్నాడు. ‘భారత్ గొప్ప దేశం. ఇక్కడ ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. కొందరు అంగవైకల్యంతో అంతా కోల్పోయామని భావిస్తుంటారు. అలాంటి వారూ రాణించవచ్చనే సందేశంతో ఈ యాత్ర చేస్తున్నాను’ అని ఆదిత్య పేర్కొన్నాడు. -
జగన్ అరెస్టును నిరసిస్తూ ట్రై సైకిల్ యాత్ర
ధవళేశ్వరం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ట్రై సైకిల్‌పై వెళ్లి తిరిగి ఇచ్చాపురం యాత్రగా వెళుతున్న శ్రీకాకుళం జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం కార్యదర్శి నెయ్యల ప్రసాద్‌కు ఆదివారం ధవళేశ్వరంలో పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తనది శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామమని తెలిపారు. తాను స్టోన్‌క్రషర్ వర్క్స్‌లో పని చేస్తున్నానన్నారు. ఇచ్ఛాపురం నుంచి సుమారు నెల్లాళ్లు ప్రయాణించి ఇడుపులపాయకు చేరుకున్నానని వివరించారు. అక్కడ వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించినట్టు ప్రసాద్ తెలిపారు. యాత్ర మధ్యలో తిరుపతిలో జగన్ సోదరి షర్మిలను కలుసుకున్నానన్నారు. తిరిగి యాత్ర గా ఇచ్చాపురం వెళుతున్నానని ప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 2600 కిలోమీటర్లు ప్రయాణించినట్టు ఆయన తెలిపారు. కుట్రపురితంగా జగన్‌ను జైలులో నిర్బంధించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రసాద్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వారే కుట్రదారులకు బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు తలారి వరప్రసాద్ మాట్లాడుతూ వికలాంగుడైనప్పటికి జగనన్నపై ఉన్న అభిమానంతో ఇన్ని వేల కిలోమీటర్లు యాత్ర చేయడం అభినందనీయమన్నారు. ప్రసాద్‌కు వైఎస్సార్ సీపీ నాయకులు కొంత ఆర్థికసాయాన్ని అందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోలి దేవకుమార్, కేవీ రావుకొత్తపల్లి రాజు, అమీద్, రబ్బానీ, బాలిబోయిన రమణ, గోసాల రాంబాబు, తలారి వీర్రాజు, గెడ్డం అభిమన్యు, మెండు రాంబాబు, విప్పర్తి విజయకుమార్, రేలంగి ఉమ, జెట్టి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.