Published
Mon, Aug 29 2016 8:35 PM
| Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
ప్రజల్లో చైతన్య కోసమే సైకిల్ యాత్ర
బొమ్మలరామారం : ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకే తాను సైకిల్ యాత్ర చేస్తున్నట్లు హైదరాబాద్ రామాంతపూర్‌కు చెందిన మిట్టగోరు రాములు గౌడ్ తెలిపారు. వేములవాడ రాజన్న సన్నిధిలో తన సైకిల్ యాత్ర విరమించేందుకు వెళ్తున్న క్రమంలో మండల కేంద్రానికి చేరింది. కేంద్రం చేపట్టిన స్వచ్ఛ భారత్, యోగా, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మిషన్ కాకతీయ, హరిత హారంలాంటి పథకాలపై చైతన్యం కల్పిస్తున్నారు. గతంలో ప్రత్యేక తెలంగాణ కోసం సోనియా గాంధీ, ప్రధాని వద్దకు రెండు పర్యాయాలు ఢిల్లీకి సైకిల్ యాత్ర చేసానని తెలిపారు. ఇటివలే జూలై1న స్వచ్ఛ భారత్ నినాదంతో ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసి యాత్ర విరమించేందుకు వేముల వాడ రాజన్న సన్నిధికి బయలు దేరానని పేర్కొన్నారు. నేటికి 28000 కిలో మీటర్‌లు తిరిగి సైకిల్ యాత్ర చేశానన్నారు. 70 ఏళ్ల వయసులోనూ యాత్రను కొనసాగిస్తున్న రాములును పలువురు అభినందిస్తున్నారు.