bommalaramaram
-
బండి సంజయ్ తరలింపులో పోలీసుల ట్విస్ట్
సాక్షి, బొమ్మలరామారం: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పోలీసులు.. సంజయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో, బొమ్మలరామారం పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అయితే, సంజయ్ అరెస్ట్ తర్వాత పోలీసులు లీగల్ ప్రొసీడింగ్స్‌కు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. భారీ కాన్వాయ్‌తో ఫుల్ భద్రత మధ్య బండి సంజయ్‌ను బొమ్మలరామారం పీఎస్ నుంచి తరలించారు. భువనగిరి మేజిస్ట్రేట్ నివాసంలో సంజయ్‌ను హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు.. కాన్వాయ్ భువనగిరి దాటి ఆలేరు వైపు వెళ్తున్నట్టు సమాచారం. దీంతో, బండి సంజయ్‌ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారన్న ఆందోళన బీజేపీ శ్రేణుల్లో నెలకొంది. - ఇక, సంజయ్‌ను వరంగల్ తరలిస్తుండగా పెంబర్తి వద్ద పోలీసుల కాన్వాయ్‌ను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. రోడ్లపై టైర్లు తగలబెట్టి కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతలకు గాయాలయ్యాయి. మరోవైపు.. పెంబర్తి వద్ద వరంగల్ పోలీసులు.. బండి సంజయ్‌ను హ్యాండోవర్ చేసుకున్నారు. కాసేపట్లో బండి సంజయ్‌ను జడ్జి వద్ద ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. - వరంగల్ పోలీసులు బండి సంజయ్‌ను పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత సంజయ్‌ను పోలీసులు వరంగల్‌కు తీసుకువెళ్లనున్నారు. - మరికాసేపట్లో వరంగల్ కోర్టులో బండి సంజయ్‌ను హాజరుపరుచున్నారు. అలాగే, బండి సంజయ్ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను సీపీ రంగనాథ్ వివరించనున్నారు. - అంతకుముందు, బండి సంజయ్‌ను తరలిస్తున్న క్రమంలో బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్న ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మహిళ కార్యకర్తలు పోలీసు వాహనాలకు అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. మహిళా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పీఎస్ వద్ద యుద్దవాతవరణం నెలకొంది. - మరోవైపు.. అకారణంగా బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను బీజేపీ లీగల్ సెల్ దాఖలు చేసింది. బీజేపీ లీగల్ సెల్.. చీఫ్ జస్టిస్ నివాసానికి వెళ్లి పిటిషన్ దాఖలు చేసింది. - బీజేపీ నేత విజయశాంతిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. -
బండి సంజయ్ అరెస్ట్.. బొమ్మలరామారం పీఎస్ వద్ద హైటెన్షన్!
సాక్షి, బొమ్మలరామారం: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, తన అరెస్ట్‌కు కారణం చెప్పాలని, వారెంట్ చూపించాలని బండి సంజయ్.. పోలీసులను ప్రశ్నించడంతో వారి మధ్య వాగ్వాదం పెరిగింది. అనంతరం, జరిగిన పరిణామాలతో సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, టెన్త్ పేపర్ల లీకేజీకి సంబంధించి ప్రెస్‌మీట్ పెట్టనున్న నేపథ్యంలో సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీఆర్పీసీ 151 కింద బండి సంజయ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం, సంజయ్‌ను బొమ్మలరామారం పీఎస్‌కు తరలించారు. ఇక, బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో పీఎస్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పీఎస్‌కు బీజేపీ నాయకులు, శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. దీంతో, పీఎస్ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. కాగా, బీజేపీ శ్రేణులు స్టేషన్ లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పీఎస్ ఎదుట కర్రలు వేసి బీజేపీ కార్యకర్తలు దగ్దం చేశారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, బండి సంజయ్ అరెస్ట్‌ను బీజేపీ జాతీయ నాయకత్వం, స్థానిక నేతలు ఖండించారు. - ఈ నేపథ్యంలో బీఎల్ సంతోష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. రాజకీయంగా బీఆర్ఎస్ సమాధి అయ్యే రోజులు దగ్గరపడ్డాయి. కేసీఆర్‌కు పాలన చేతగాక సంజయ్‌ను అరెస్ట్ చేయించారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని ఘాటు కామెంట్స్ చేశారు. - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సంజయ్ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. కారణం లేకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. తెలంగాణలో అరాచక పాలన నడుస్తోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. - డీకే అరుణ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లింది. ప్రజలు తర్వలోనే బీఆర్ఎస్ను బొందపెడతారు. అకారణంగా సంజయ్‌ను అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్య. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలి. - ఈటల రాజేందర్ స్పందిస్తూ.. కారణం చెప్పకుండా సంజయ్‌ను అరెస్ట్ చేయడం దారుణం. కేసీఆర్ చెప్పినట్టు వింటూ పోలీసులు వెన్నముక లేకుండా వ్యవహరిస్తున్నారు. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలి. - బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్ట్‌ను ఖండిస్తున్నాను. అరెస్ట్‌లకు సంజయ్ భయపడరు. ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపినందుకే అరెస్ట్ చేశారు. ఆయన్ను జైలులో పెడితే ప్రభుత్వ తప్పులు బయటకిరావు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. - బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. బండి సంజయ్‌ను కలిసేందుకు బొమ్మలరామారం పీఎస్ వెళ్లారు. దీంతో, ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం, రఘునందన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అక్కడి నుంచి నేతలందరూ వెళ్లిపోవాలని పోలీసులు చెబుతున్నారు. -
తన ఫొటో వాట్సప్ స్టేటస్‌లో పెట్టాడని..
బొమ్మలరామారం : ఓ బాలుడికి చెందిన వాట్సాప్ స్టేటస్‌లో తన ఫొటో పెట్టాడని మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బోయిన్పల్లి గ్రామానికి చెందిన సాభావత్ శిల్ప(14) మూడు చింతల పల్లి‡మండలం పోతారం గ్రామంలో ఉన్న కూరగాయల తోటలో కూలీగా జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో మండలంలోని బోటిమీది తండాకు చెందిన తేజావత్ మధుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య గల సన్నిహితంతో బాలుడు సదరు బాలిక ఫొటోను శుక్రవారం తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టాడు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిన్నారి తన పనిచేసే తోటలో గల పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మధు వేధింపులతోనే తన కూతురు శిల్ప ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి జయమ్మ షామీర్‌పేట్‌లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: శభాష్! క్రేన్‌తో వ్యక్తిని కాపాడిన పోలీసులు చదవండి: నలుగురు ఆడపిల్లల జననం: అత్తామామ, భర్త కలిసి.. చదవండి: శభాష్! క్రేన్‌తో వ్యక్తిని కాపాడిన పోలీసులు -
సోషల్ మీడియాలో హాజీపూర్ కిల్లర్ వార్త హల్చల్
సాక్షి, బొమ్మలరామారం (ఆలేరు) : రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ముగ్గురు బాలికల హత్య కేసు మరోసారి శనివారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మర్రి శ్రీనివాస్‌రెడ్డిపై ఇటీవల భువనగిరి ఏసీపీ భుజంగరావు నల్లగొండ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కానీ శనివారం హాజీపూర్ ముగ్గురు బాలికల హత్యల కేసులో సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించి పోలీసులు కీలక సాక్ష్యాధారాలు సేకరించారని, కల్పన, శ్రావణి, మనీషాలపై హత్యకు ముందు అత్యాచారానికి పాల్పడినట్లుగా టెక్నికల్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అందినదని, 300 మంది సాక్షలను విచారించి కోర్టుకు అవసరమైన బలమైన సాక్ష్యాధారాలన్నింటినీ సేకరించి కోర్టుకు అందజేయడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణకు మార్గం సుగమం అయినట్టుగా ఓ సమాచారం హల్చల్ చేసింది. వరంగల్ ఘటనలో నిందితుడు ప్రవీణ్‌కు కోర్టు ఉరిశిక్ష విధించడంతో శ్రీనివాస్‌రెడ్డి ఎలాంటి శిక్షలు పడుతాయోనని ఉత్కంఠగా ఉన్న నేపథ్యంలో ఈ సోషల్ మీడియా పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు అధికారులు ఈ విషయమై సంప్రదించగా హాజీపూర్ హత్యల కేసులో జరుగుతున్న పరిణామాలను ఎవరో అత్యుత్సహంతో సోషల్ మీడియాలో పోస్టు చేశారని, పోలీసుల విచారణను సైతం ఈ విధంగా ప్రచారం చేయడం సరికాదని ఓ సీఐ కేడర్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. -
సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాలు
సాక్షి, హైదరాబాద్ : పెను సంచలనం సృష్టించిన ముగ్గురు బాలికల వరుస హత్యల నిందితుడు,హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. ముగ్గురు విద్యార్థినులను శ్రీనివాస్ రెడ్డి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే మృతదేహాలపై ఉన్న రక్తపు మరకలు శ్రీనివాస్‌రెడ్డివిగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తేల్చింది. హత్య జరిగిన ప్రదేశంలో శ్రీనివాస్‌రెడ్డి సెల్ సిగ్నల్స్‌ను పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి కేసులో పోలీసులు 300 మంది సాక్షులను విచారించారు. నేర నిరూపణ కావడానికి కావాల్సిన బలమైన సాక్ష్యాధారాలను అన్నిటినీ కోర్టుకు పోలీసులు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలంలోని హజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలపై కిరాతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన సంఘటనలు వెలుగు చూసిన విషయం విధితమే. ఏప్రిల్ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో పాముల శ్రావణి హత్యకు గురైన తర్వాత తెట్టెబావిలో శ్రావణి మృతదేహాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకుని విచారించారు. ఈఘటన అనంతరం తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనల హత్యలు వెలుగులోకి వచ్చాయి. శ్రావణి అత్యాచారం, హత్య కేసులోనే పోలీస్ కస్టడీలో ఉన్న శ్రీని వాస్‌రెడ్డిని కోర్టుకు రిమాండ్ చేశారు. ఈ ఘటనలపై గ్రామ ప్రజలు, ప్రతిపక్షాలు, బీసీ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. పోలీసు యంత్రాంగం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ పర్యవేక్షణలో భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి ఇటీవల నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి కేసులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న శ్రీనివాస్‌రెడ్డిపై మొదటి కేసు నమోదైంది. అదే నెల 30న పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని తమ కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసుల్లో 90 రోజుల నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేశారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా శ్రీనివాస్‌రెడ్డి ఉన్నాడు. కాగా వచ్చే నెల మొదటి వారంలో నల్లగొండ సెషన్స్ కోర్టులో కేసు విచారణకు రానుంది. -
‘హాజీపూర్’ కేసులో చార్జ్‌షీట్ దాఖలు
సాక్షి, బొమ్మలరామారం(యాదాద్రి) : పెనుసంచలనం సృష్టించిన హాజీపూర్ ముగ్గురు బాలికల వరుస హత్యల కేసు నిందితుడు సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డి పై పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ఈ మేరకు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఏసీపీ, కేసు విచారణ అధికారి భుజంగరావు నల్లగొండ పోక్సో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సంచలన్మాకమైన ముగ్గురు బాలికల అత్యాచారం, హత్య కేసులలో 90 రోజుల నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేసినట్లు డీసీపీ నారాయణరెడ్డి విలేకరులకు తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న మర్రి శ్రీనివాస్‌రెడ్డిని శిక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. 90 రోజుల తరువాత తెరపైకి హత్యల కేసులు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన పాముల శ్రావణి, తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనలను కిరాతకుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన సంఘటనలు వెలుగు చూసిన విషయం విధితమే. ఏప్రిల్ నెలలో మర్రి శ్రీనివాస్‌రెడ్డి చేతిలో పాములు శ్రావణి హత్యకు గురైన తర్వాత తెట్టె బావిలో ఆమె శవాన్ని పూడ్చిన కేసులో శ్రీనివాస్‌రెడ్డిని అదుపులో తీసుకొని విచారించారు. ఈ ఘటన అనంతరం తిప్రబోయిన మనీషా, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తుంగని కల్పనల హత్యలు వెలుగులోకి వచ్చాయి. శ్రావణి అత్యాచారం, హత్య కేసులోనే పోలీస్ కస్టడీలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని కోర్టుకు రిమాండ్ చేశారు. మరో రెండు దారుణాలు వెలుగులోకి రావడంతో ఇద్దరు బాలికల అత్యాచారం, ఆపై హత్య ఘటనలపై యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా ఉ న్న శ్రీనివాస్‌రెడ్డిపై బుధవారం నాటికి దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఉరి శిక్షపడేనా ముగ్గురు బాలికలపై దారుణాలకు ఒడిగట్టిన సైకో మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్షపడితేనే నేరాలకు పాల్పడే వ్యక్తులకు తగిన గుణపాఠం కలుగుతుందని గ్రామస్తుల ప్రధాన డిమాండ్. ఈ మేరకు అమరణ నిరాహార దీక్షలు, ఆందోళనలు సైతం చేశారు. బాలికల హత్య కేసులలో దర్యాప్తు పూర్తయిందని నిందితుడికి ఎలాంటి శిక్ష పడుతుందోనని హాజీపూర్ గ్రామంతోపాటు మండలంలో తీవ్ర చర్చ జరుగుతోంది. -
ఘోరం... దారుణం!
ఈ సమాజంలో ఆడపిల్లలు ఎంతటి అభద్రతతో బతుకీడ్వవలసి వస్తున్నదో చెప్పడానికి యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ గ్రామం ఇప్పుడొక బండ గుర్తు. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా, ఎన్ని ఆటంకాలుంటున్నా పంటిబిగువున భరిస్తూ...ఎదిగితీరాలన్న పట్టుదలను ప్రదర్శించే చదువుల తల్లులకు కూడా ఆ గ్రామం ప్రతీక. ఎక్కడేం సమస్యలున్నాయో...ఏ సమస్యల్లో ఎలాంటి ప్రమాదం పొంచి ఉన్నదో పోల్చుకోలేని ప్రజాప్రతినిధుల నిర్లిప్త ధోరణికి ఆ నిస్సహాయ పల్లె ఒక విషాద సంకేతం. నిన్నటివరకూ తమ ఇంటిదీపాల్లా వెలుగులు పంచినవారు హఠాత్తుగా కనుమ రుగయ్యారని, వెతికిపెట్టి పుణ్యం కట్టుకోండయ్యా అని విలపించే తల్లిదండ్రుల్ని అసలే పట్టించు కోని పోలీసుల నిర్లక్ష్య వైఖరికి ఆ ఊరొక నిదర్శనం. హాజీపూర్‌లో అందరి కళ్లూ కప్పి నాలుగేళ్లుగా ఒక మానవ మృగం సాగించిన దారుణాలు విన్నప్పుడు ఎలాంటివారికైనా వెన్నులో చలిపుడు తుంది. ఒళ్లు గగుర్పొడుస్తుంది. రాష్ట్ర రాజధాని నగరం నుంచి గంటలోపే చేరగలిగిన ఒక చిన్న గ్రామానికి రవాణా సౌకర్యం లేని కారణంగా... ముగ్గురు చిట్టితల్లులు ఆ మృగం బారినపడ్డారని తెలిసినప్పుడు దిగ్భ్రాంతికలుగుతుంది. మర్రి శ్రీనివాసరెడ్డి అనే నరరూప రాక్షసుడికి చిక్కి తనువు చాలించిన ఆ పిల్లలను తల్చుకున్నప్పుడు ఎంతటివారికైనా దుఃఖం పొంగుకొస్తుంది. విస్మయం కలిగించే దుర్మార్గాలు ఒక్కొక్కసారి ఎంత యాదృచ్ఛికంగా బయటపడతాయో చెప్పడానికి ఈ సీరియల్ హత్యలే తార్కాణం. నాలుగేళ్లక్రితం హఠాత్తుగా కనుమరుగైన మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరోతరగతి బాలిక కల్పన గురించి పోలీసులు సక్రమంగా పట్టించుకుంటే ఈ వరస హత్యలుండేవి కాదు. అప్పట్లో శ్రీనివాసరెడ్డిపైనే అనుమానాలు కలిగినా సరైన ఆధారాలు లేక వదిలేశామని పోలీసులు చెబుతున్నారు. కానీ అంతకుముందు ఒక వివాహితను వేధించిన ఉదం తంలో గ్రామస్తులు అతడికి దేహశుద్ధి చేశారు. దానిపై కేసు కూడా నమోదైంది. అలాగే కల్పన హత్య జరిగిన కొన్నాళ్లకు 2016లో కర్నూలులో ఒక సెక్స్‌వర్కర్‌ను హత్య చేసిన కేసులో అతడు ముద్దాయి. కల్పన హత్యకు ముందు జరిగిన ఉదంతాన్నిగానీ, తర్వాత జరిగిన హత్యనుగానీ పోలీసులు గమనంలోకి తీసుకుని ఉంటే అతడి దుర్మార్గాలకు అడ్డుకట్టపడేది. గత నెల 25న హాజీపూర్ గ్రామానికే చెందిన శ్రావణి బడికెళ్లి తిరిగివస్తూ అదృశ్యమైన ఉదంతంలో దర్యాప్తు చేస్తుండగా శ్రీనివాసరెడ్డి పొలంలోని పాడుబడ్డ బావి వద్ద ఆమె పుస్తకాల సంచీ లభ్యం కావడం, ఆ మర్నాడు బావిలో ఆమె మృతదేహం బయటపడటంతోపాటు మరో బాలిక అస్థి పంజరం కూడా లభ్యం కావడం వల్ల అతడిపై అనుమానం కలిగింది. బహుశా అంతక్రితం కల్పన మాయమైనప్పుడు వ్యవహరించిన రీతిలోనే అతగాడు అక్కడక్కడే తిరుగాడితే పోలీసులు అనుమానించేవారో లేదో! కానీ పరారీ కావడం వల్ల అనుమానాలు చిక్కబడ్డాయి. ఈ రెండు హత్యల సంగతి వెల్లడయ్యాకే మార్చి 9న మాయమైన మనీషా అనే డిగ్రీ విద్యార్థిని సైతం ఇతడి అకృత్యానికి బలైందని బయట పడింది. మనీషా అదృశ్యంపై ఫిర్యాదుచేస్తే కుటుంబం పరువు పోతుందన్న భయంతో కన్నవారు మౌనంగా ఉండిపోయారు. శ్రీనివాసరెడ్డిని మరింత లోతుగా విచారిస్తే ఇంకేం బయటపడతాయో మున్ముందు చూడాల్సి ఉంది. తెలంగాణ ఉద్యమప్రాంతం గనుక, నక్సలైట్ల కదలికలు అధికంగా ఉండేవి కనుక ఇక్కడి పల్లెల్లో అందుకు తగ్గట్టే నిఘా ఉండేది. చీమ చిటుక్కుమంటే పోలీసులకు సమాచారం అందేది. కానీ హాజీపూర్ గ్రామం తీరుతెన్నులు చూస్తే ఇప్పుడలాంటి నిఘా ఉన్నట్టు కనబడదు. ఆ గ్రామం లోని కొందరు యువకులు మద్యానికి, గంజాయికి బానిసలు కావడం, శ్రీనివాసరెడ్డి తన పూర్వీ కుల ఇంటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చడం చూస్తే ఆ పల్లె దిక్కూ మొక్కూ లేని స్థితిలో పడిందని అర్ధమవుతుంది. ఊరి చివర ఒక పాడుబడిన బావి, ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే ప్రాంతం... ఆ దారి వెంబడే గ్రామానికి చెందిన పిల్లలు నిత్యం వెళ్లాల్సిరావడం వంటివి శ్రద్ధ పెట్టి గమనించి ఉంటే కనీసం అప్పుడప్పుడైనా ఆ ప్రాంతంపై నిఘా వేసి ఉంచాలని పోలీసులకు అనిపించి ఉండేది. ఒకప్పటి పెద్ద జిల్లాలు తెలంగాణ ఆవిర్భవించాక చిన్న జిల్లాలుగా మారాయి. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల ముంగిట్లో ఉంటే వారి సమస్యల్ని తెలుసుకోవడానికి, మరింత సమ ర్ధవంతమైన పాలన అందించడానికి వీలవుతుందన్నది జిల్లాల పునర్వ్యవస్థీకరణలోని ప్రధా నాంశం. కానీ అది ఆచరణలో మరింత పదునెక్కాలని హాజీపూర్ ఉదంతం తెలియజెబుతోంది. కొన్నేళ్లక్రితం మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలో అన్నారం, కొత్తపల్లి గ్రామాల పిల్లలు బస్సు సౌకర్యం లేని కారణంగా చదువు సాగడం లేదని ఆందోళన చేసి ఆ సౌకర్యాన్ని సాధించుకున్నారు. సమస్యలున్నా సర్దుకుపోవడం, రాజీపడటం ఎంత ప్రాణాంతకమో చెప్పడానికి హాజీపూర్ ఉదం తాలు తార్కాణం. పిల్లలు అదృశమయ్యారన్న ఫిర్యాదులు అందినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అలవాటైన పోలీసులకు ఇదొక గుణపాఠం. మాయమైన తమవారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు కాళ్లావేళ్లాప డినా మన దేశంలో పోలీసుల స్పందన అంతంతమాత్రమేనని చాన్నాళ్లనుంచి ఆరోపణలున్నాయి. పదేళ్లక్రితం ఈ విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది కూడా. ఏటా వేలాదిమంది పిల్లలు అదృశ్యమవుతున్నా... వారిలో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా ఉంటున్నా వెతకడం మాట అటుంచి ఫిర్యాదులు స్వీకరించడానికే పోలీసులు సిద్ధపడటం లేదు. సకాలంలో స్పందించకపో వడం వల్ల దేశంలో ఏటా వేలాదిమంది పిల్లలు వ్యభిచార గృహాల బారినపడుతున్నారు. వెట్టిచా కిరీలో మగ్గిపోతున్నారు. పోలీసులతోపాటు పిల్లల సంరక్షణకు బాధ్యతవహించాల్సిన శాఖల్లోని సిబ్బంది అందరికీ పిల్లల విషయంలో ఫిర్యాదులొచ్చినప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలి యజెప్పే శిక్షణనివ్వాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి నేరాలను నివారించడం సాధ్యమవుతుంది. -
హాజీపూర్ గ్రౌండ్ రిపోర్ట్
-
ఎమ్మెల్యే సునీతను అడ్డుకున్న హాజీపూర్ గ్రామస్తులు
-
ముగ్గురినీ హతమార్చాడు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యల కేసులో కీలక విషయలు వెలుగులోకి వచ్చాయి. 2015లో కల్పన హత్యను చేసిందీ శ్రీనివాస్ రెడ్డేనని పోలీసులు స్పష్టం చేశారు. శ్రావణి, మనీషాతో పాటు కల్పననూ తానే హత్య చేశానని శ్రీనివాస్ రెడ్డి అంగీకరించాడని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. దీంతో కల్పన కేసులో చిక్కు ముడి వీడినట్లయింది. గ్రామస్తులపై ప్రతీకారం కోసమే కామాంధుడు, సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డి.. మైనర్ బాలికలే లక్ష్యంగా క్రూరంగా అత్యాచారం చేసి హతమార్చాడని సీపీ తెలిపారు. ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బాలికలు, మహిళల కదలికలపై శ్రీనివాస్ రెడ్డి రెక్కీ నిర్వహించేవాడని.. వారిని అపస్మారకస్థితిలోకి వెళ్లేలా చేసిన తర్వాతే అత్యాచారం చేసి చంపేసేవాడని వెల్లడైంది. కాగా.. బంధువుల ఇంట్లో దాక్కున్న సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని స్పెషల్‌పార్టీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లు, లిఫ్ట్ రిపేరు టూల్‌కిట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హాజీపూర్ ఘటన వివరాలను మహేష్ భగవత్ వెల్లడించారు. వివరాలు.. సీపీ మాటల్లోనే.. 2015 నాటి ఘటనలో.. 2015లో బొమ్మల రామారం మండలం మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరోతరగతి విద్యార్థిని కల్పన (11) స్కూలు తర్వాత తన ఊరికి వెళ్తుండగా నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ఆమెను నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను హతమార్చి గన్నీబ్యాగ్‌లో మృతదేహాన్ని పెట్టి సీతారామ్‌రెడ్డి వ్యవసాయ బావిలో పడేశాడు. దీనిపై బొమ్మలరామారం పోలీసుస్టేషన్లో అదృశ్యం కేసు నమోదైంది. ఈ ఘటనలోనూ శ్రీనివాస్‌రెడ్డిపైనే అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. పోలీసుల వద్ద సరైన ఆధారాలు లేవు. అయితే శ్రావణి, మనీషాల హత్య కేసు విచారణ సందర్భంగా కల్పనను కూడా హతమార్చింది తానేనని శ్రీనివాస్ రెడ్డి.. అంగీకరించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మార్చి9న కీసర మండలం చీర్యాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హాజీపూర్‌కు చెందిన విద్యార్థిని మనీషా (17) కళాశాల నుంచి ఇంటికొచ్చే క్రమంలో శ్రీనివాస్‌రెడ్డి బైక్‌పై లిఫ్ట్ పేరుతో ఎక్కించుకొని బావి వద్దకు తీసుకువెళ్లి అపస్మారక స్థితికి వెళ్లేలా చేసి అత్యాచారం చేసి, అంతమొందించాడు. తరువాత మృతదేహాన్ని తన బావిలో పూడ్చిపెట్టాడు. అప్పట్లో స్థానిక పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఈనెల 29వ తేదీన శ్రావణి హత్యకేసు విచారణ సందర్భంగా.. బావి వద్ద దుర్వాసన వచ్చింది. ఘటనాస్థలంలో దొరికిన ఆధార్‌కార్డు. అక్కడ లభించిన మృతదేహాం (ఎముకలు) ఆధారంగా ఆమెను మనీషాగా పోలీసులు గుర్తించారు. ఈకేసులో శ్రీనివాస్‌రెడ్డి నిందితుడిగా తేలింది. చితకబాదిన గ్రామస్తులపై కోపంతో.. హాజీపూర్ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్‌రెడ్డి (28) సెల్ఫోన్లో అసభ్యకర చిత్రాలను చూడటంతోపాటు మద్యం, చెడు అలవాట్లకు బానిసయ్యాడు. 2015లో మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బొమ్మల రామారం పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం గ్రామస్తులు శ్రీనివాస్‌రెడ్డికి దేహశుద్ధి చేశారు. తనను చితకబాదిన గ్రామస్తులపై ఆయన పగ పెంచుకున్నాడు. మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని అత్యాచారం చేస్తూ హతమార్చాలని నిర్ణయించుకుని ఉన్మాదిగా మారాడు. హాజీపూర్ గ్రామం ప్రారంభంలోనే తన ఇల్లుండడంతో.. బయటకు వెళ్లే బాలికలు, మహిళల రాకపోకలు గమనిస్తుండేవాడు. శ్రావణి ఘటనతో దారుణాలు వెలుగులోకి ఈనెల 25న 9వ తరగతి విద్యార్థిని పాముల శ్రావణి (14) పాఠశాల నుంచి వచ్చి.. హాజీపూర్ వెళ్లేందుకు చెట్టుకింద బస్సు కోసం నిరీక్షిస్తుంది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన శ్రీనివాస్ రెడ్డి లిఫ్ట్ ఇస్తానని బైక్‌పై ఎక్కించుకొని తన వ్యవసాయ బావికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై కొట్టి అపసార్మక స్థితికి వెళ్లిన తరువాత బావిలో పడేశాడు. తరువాత శ్రీనివాస్‌రెడ్డి బావిలోకి దిగి ఆమెపై అత్యాచారానికి పాల్పడి, అంతమొందించాడు. బావి నుంచి తిరిగివచ్చే క్రమంలో శ్రావణి స్కూల్‌బ్యాగ్ కనబడడంతో అనుమానం రాకుండా బ్యాగ్‌ను వ్యవసాయ బావి వద్ద పడేసి వెళ్లిపోయాడు. శ్రావణి హత్య తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఈనెల 26వ తేదీన భువనగిరిలో స్నేహితుని పెళ్లికి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యాడు. పోలీసుల రాకతో పారిపోయాడు ఏప్రిల్ 26న పోలీసుల ప్రత్యేక బృందం హాజీపూర్ గ్రామానికి చేరుకొని బాలిక అదృశ్యం కేసుపై విచారణ చేస్తున్నట్టు గుర్తించిన శ్రీనివాస్‌రెడ్డి ఊరొదిలి పారిపోయాడు. విచారణలో భాగంగా వ్యవసాయ బావి వద్ద స్కూల్ బ్యాగ్, స్కూల్ ఐడీ కార్డు లభించడంతో శ్రావణి అదృశ్యం మిస్టరీ వీడింది. అత్యాచారం చేసి, హత్య చేశారని విచారణలో తేలడంతో పోలీసులు దర్యాప్తును వేగవంతంగా చేశారు. గ్రామంలో గంజాయి, మద్యం సేవించే వారిని విచారించారు. ఇందులో భాగంగా శ్రీనివాస్‌రెడ్డిపై పోలీసులకు అనుమానం వచ్చింది. అతని గురించి ఆరా తీయగా ఆచూకీ లభించకపోవడంతో పోలీసుల అనుమానాలకు బలం చేకూరింది. ప్రత్యేక పోలీసు బృందాలు, భువనగిరి పోలీసులు, బోమ్మల రామారం పోలీసులు వేర్వేరుగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఘట్కేసర్ సమీపంలోని రావిరాల గ్రామంలోని బంధువుల ఇంట్లో శ్రీనివాస్‌రెడ్డి ఉన్నట్లు తెలిసి అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా శ్రావణి, మనీషాల హత్యపై నోరువిప్పిన శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత కల్పనను చంపిన విషయాన్నీ వెల్లడించాడు. అంతా సింగిల్‌గానే చేశాడు బాలికల సీరియల్ అత్యాచారాలు, హత్యలు శ్రీనివాస్‌రెడ్డి ఒక్కడే చేశాడు. ఇందులో ఎవరి ప్రమేయం లేదని పోలీసులు నిర్ధారించారు. గతంలో శ్రీనివాస్‌రెడ్డి పని చేసిన ఆదిలాబాద్, వేములవాడ, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో విచారణ చేస్తున్నారు. మనీషా, కల్పనల ఎముకలు మాత్రమే లభించడంతో వీటిని డీఎన్ఏ ద్వారా నిర్ధారించుకుంటామని పోలీసులు వెల్లడించారు. కల్పన మిస్సింగ్ సమయంలో.. పోలీసులు వ్యవహరించిన తీరుపై వచ్చిన ఆరోపణలనూ విచారిస్తామని సీపీ స్పష్టం చేశారు. ఫేస్బుక్లో శ్రీనివాస్‌రెడ్డికి వేములవాడకు చెందిన యువతితో వివాహాం జరిగినట్టు తెలియడంతో దీనిపై పోలీసులు దృష్టిపెట్టారు. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, తదుపరి విచారణ కోసం పోలీసు కస్టడీకి తీసుకోనున్నారు. ‘శ్రావణి తండ్రికి ప్రభుత్వోద్యోగం కోసం కలెక్టర్ పరిశీలిస్తున్నారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం. బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయంపైనా ప్రభుత్వంతో కలెక్టర్ మాట్లాడుతున్నారు. గ్రామంలో గంజాయి విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నాం. బెల్టుషాపులను మూసివేయించాం. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి జీవిత ఖైదు పడేలా కేసులు నమోదు చేస్తాం’అని సీపీ తెలిపారు. -
లిఫ్ట్ పేరిట దారుణానికి ఒడిగట్టాడు
-
‘రివెంజ్ కోసమే హజీపూర్ హత్యలు’
సాక్షి, భువనగిరి : రివెంజ్ కోసమే నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి హజీపూర్‌లో వరుస హత్యలకు పాల్పడ్డాడని రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్ రెడ్డిపై 2015లో బొమ్మలరామారంలో ఓ అమ్మాయిని ఈవ్‌టీజింగ్ చేసినట్లు కేసు నమోదైందని, అప్పుడు పెద్దలు రాజీ చేశారన్నారు. ఆ సమయంలో గ్రామస్థులు అతన్ని కొట్టారని, ఇది మనసులో పెట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి దానికి రివేంజ్‌గా ఈ వరుస హత్యలకు పాల్పడ్డాడని చెప్పారు. అతనిది పూర్తిగా సైకో బిహేవియరని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరుస హత్యల కేసు వివరాలను ఆయన మంగళవారం మీడియాకు వివరించారు. ‘ఏప్రిల్ 25న బొమ్మలరామరం మండలం హజీపూర్ నుంచి శ్రావణి అనే అమ్మాయి అదృష్యమైనట్లు కేసు నమోదైంది. మరుసటి ఉదయం.. హజీపూర్‌లోని ఓ బావి దగ్గర శ్రావణి స్కూల్ బ్యాగు దొరికింది. డాగ్‌స్క్వాడ్ ద్వారా అదే ప్రాంతంలో శ్రావణి మృతదేహన్ని గుర్తించాం. ఆ గ్రామ సర్పంచ్, అమ్మాయి తండ్రి నన్ను కలవడం జరిగింది. అందరం ఆ గ్రామానికి వెళ్లాం. అదే గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్ రెడ్డి బావిలో అమ్మాయి శవం ఉందని నిర్ధారించాం. అనంతరం భువనగిరి ఏరియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించగా.. అత్యాచారం జరిపి హత్య చేసినట్లు తేలింది. డబ్బులు విషయంలో వేశ్యను చంపి.. సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు మొదలు పెట్టాం. గతంలో మర్రిశ్రీనివాస్ రెడ్డిపై కర్నూలు టూటౌన్లో కేసు నమోదైనట్లు సమాచారం అందింది. 2017లో సెక్స్‌వర్కర్ అమ్మాయిని అత్యాచారం చేసి హత్యా చేసినట్లు అతనిపై కేసు నమోదైంది. కర్నూల్లో నలుగురు స్నేహితులతో కలిసి గదికి వ్యభిచారిని తీసుకొచ్చి డబ్బుల విషయంలో గొడవపడి అక్కడ ఆమెను దారుణంగా చంపి పరారయ్యాడు. అక్కడి పోలీసులు గ్రామానికివచ్చి మరి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. పైగా అతను ఏప్రిల్ 26నే మాయం అయ్యాడు. అక్కడ కొందరు గంజాయి తాగుతున్నారని వారిని కూడా విచారించాం. చివరిగా శ్రీనివాస్ రెడ్డిపై అనుమానం వచ్చింది. పోచంపల్లి సమీపంలోని రావిరాల గ్రామంలో అతని కజిన్ దగ్గర షెల్టర్ తీసుకున్నట్లు తెలిసింది. అక్కడికి వెళ్లి పట్టుకున్నాం. లిఫ్ట్ ఇచ్చి.. బావిలో తోసేసి.. ఏప్రిల్ 29 ఉదయం భువనగిరి రూరల్ ఎస్సైకి బావి నుంచి దర్వాసన వస్తుందని ఫిర్యాదు అందితే.. మళ్లీ పరిశీలించాం. ఆ బావిలో ఆధార్ కార్డుతో పాటు, కాలేజీ ఐడెంటీ కార్డు దొరికింది. అందరి సమక్షంలో మరో మృతదేహాన్ని వెలకితీయడం జరిగింది. ఆధార్‌కార్డు, కాలేజీ ఐడేంటీ ద్వారా బీకాం సెకండీయర్ విద్యార్థిని మనీషా అని గుర్తించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను సంప్రదిస్తే.. శివరాత్రి నుంచి కనబడలేదని, గతంలో కూడా ఇలానే వెళ్లిందని చెప్పారు. మనీషా, శ్రావణి మృతదేహాలు.. శ్రీనివాస్ రెడ్డి బావిలోనే దొరికాయి. దీంతో అతన్ని మా రీతిలో విచారణ జరిపితే నేరం అంగీకరించాడు. ఏప్రిల్ 25న 11.30 సమయంలో స్కూల్ నుంచి వచ్చి టర్నింగ్ వద్ద దిగిన శ్రావణి కొద్దిసేపు పక్కనే ఉన్న చెట్టు కింద నిలబడింది. అటుగా వచ్చిన శ్రీనివాస్ రెడ్డి ఆమెకు లిఫ్ట్ ఇచ్చి బావి దగ్గరకు తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. బావిలోకి నెట్టేసి.. అనంతరం దిగి అత్యాచారం జరిపాడు. ఏం తెలియనట్టు 26న తన క్లాస్‌మెట్ పెళ్లికి వెళ్లాడు. పోలీసులు అందరు గ్రామంలోకి రాగానే పరారయ్యాడు. మనీషా, కల్పనలను అలానే.. మార్చి9న లిఫ్ట్ పేరిట బావి దగ్గరకు తీసుకెళ్లి మనీషాను అత్యాచారం చేసి పాతిపెట్టాడు. 2015లో మరో బాలిక కల్పన.. తప్పిపోయింది. అప్పట్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. ఆ కేసు గురించి ప్రశ్నించగా అది కూడా తానే చేసినట్లు శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నాడు. బాడీని సంచిలో ప్యాక్ చేసి సీతారాం రెడ్డి బావిలో పడేసినట్లు చెప్పాడు. ఆ మృతదేహం కోసం అక్కడ వెతకడం జరిగింది. మాకు కొన్ని ఎముకలు లభించాయి. వాటి పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంది. శ్రీనివాస్ రెడ్డి నాలుగు అత్యాచారా, హత్య కేసు కేసుల్లో సంబంధం ఉంది. కర్నూల్లో మరో ముగ్గురితో కలిసి చేయగా.. హజీపూర్లోనే మూడు హత్యలను మాత్రం ఒక్కడే చేసినట్లు తెలిపాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి కస్టడీలో తీసుకుని విచారిస్తాం. ఎక్కడెక్కడా ఉన్నాడో అక్కడేమైనా దారుణాలకు ఒడిగట్టాడా? అనే కోణంలో విచారణ జరుపుతాం.’ అని మహేశ్ భగవత్ పేర్కొన్నారు. -
మా పక్కనే మానవ మృగమా.. ఊహించలేకపోయాం!
-
కల్పన మృతదేహం వెలికితీత!
సాక్షి, బొమ్మలరామారం : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లోని బావి నుంచి చిన్నారి కల్పన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన వ్యవసాయ బావిలో వెతికిన పోలీసులు.. ఎట్టకేలకు కల్పన ఆస్తికలను గుర్తించారు. ఇప్పటికే శ్రావణి, మనీషా మృతదేహాలు శ్రీనివాస్‌రెడ్డికి చెందిన ఒకే బావిలో లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనీషా బ్యాగు దొరికిన మరో బావిలో కల్పన మృతదేహం ఉండి ఉండవచ్చునని అనుమానంతో పోలీసులు వెతికారు. ఆ బావిలోనే కల్పన మృతదేహం లభించింది. ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల కల్పన నాలుగేళ్ల క్రితం అదృశ్యమైంది. ఆ చిన్నారిని కూడా అత్యాచారం జరిపి హత్య చేసినట్టు మానవమృగం శ్రీనివాస్‌రెడ్డి తాజాగా పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఇదేవిధంగా శ్రావణి, మనీషాలను కూడా అత్యాచారం చేసి.. శ్రీనివాస్‌రెడ్డి దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. సిట్ ఏర్పాటు హజీపూర్ వరుస హత్యల కేసులో దర్యాప్తు విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు కోసం ఏసీపీ భుజంగరావు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. భువనగిరి ఇన్స్పెక్టర్తోపాటు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లను ఈ సిట్‌లో నియమించారు. -
మా పక్కనే మానవ మృగమా.. ఊహించలేకపోయాం!
సాక్షి, బొమ్మలరామారం : ముగ్గురు ఆడపిల్లలను హతమార్చి ఏం ఎరుగనట్టు తమ మధ్యే తిరిగిన మానవ మృగం శ్రీనివాస్ రెడ్డిని గుర్తించలేకపోయామని హజీపూర్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో చోటుచేసుకున్న వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డి గురించి విచారణలో వెల్లడవుతున్న విషయాలతో గ్రామస్థులు అవాక్కవుతున్నారు. అసలు శ్రీనివాస్ రెడ్డి గురించి అంతగా ఎవరికీ తెలియదని, అతను ఎక్కువగా ఊరిలో ఉండేవాడు కాదని, ఎవరితో అంతగా మాట్లాడేవాడు కాదని, ఇంత దారుణానికి ఒడిగడుతాడని ఊహించలేదంటున్నారు. వరంగల్, కర్నూల్లో అతనిపై కేసులు నమోదైన విషయం కూడా తెలియదంటున్నారు. తొలుత శ్రావణి ఉదంతం బయటపడ్డప్పుడు శ్రీనివాస్ రెడ్డి అందరిలానే ప్రవర్తించాడన్నారు. శ్రావణి మృతదేహం తన బావిలో ఉందని తెలిసి అందరిలానే చుట్టూ నిలబడి చూశాడని, పైగా బావిలోకి ఎలా దిగాలో కూడా సలహాలిచ్చాడని వాపోతున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే నిందితుడా? శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే నిందితుడా? ఇంకెవరైన హస్తం ఉందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యల సంఘటనలు పరిశీలిస్తే ఒక్కడి వల్ల సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఒక్కడికి బావిలోకి దిగడం సాధ్యమే కాదు. ఐదేకరాల నిర్మానుష్య ప్రాంతం కావడం.. ఇక్కడ ఏం జరిగినా.. కనపడని, అరిచినా.. వినపడని నిర్మానుష్య ప్రాంతం కావడంతో శ్రీనివాస్ రెడ్డి తన నేరాలకు అనువుగా ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గరు అమయాక ఆడపిల్లలను బలి తీసుకున్న అతన్ని చంపేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. -
బొమ్మలరామారం వరుస హత్యలు.. కీలక నిజాలు!
-
హజీపూర్ వరుస హత్యలు.. సంచలన నిజాలు!
సాక్షి, బొమ్మలరామారం: యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో చోటుచేసుకున్న వరుస హత్యల మిస్టరీకి సంబంధించి కీలక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టైన నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డి తాజాగా విచారణలో తన దారుణాల గుట్టు విప్పాడు. శ్రావణి, మనీషా, కల్పన.. ఇలా ముగ్గురు విద్యార్థినులను తానే హత్య చేశానని, వారిపై కిరాతకంగా లైంగిక దాడులు జరిపి మరీ చంపేసినట్టు శ్రీనివాస్‌రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇరవై ఎనిమిది ఏళ్ల వయస్సు వచ్చినా పెళ్లి కాకపోవడంతో శ్రీనివాస్‌రెడ్డి సైకోగా మారిపోయాడని, అతనికి తరచూ పోర్న్ వెబ్సైట్లు చూసే అలవాటు ఉందని, ఈ క్రమంలో అమాయకులైన ఆడపిల్లలపై కన్నేసిన అతను.. రాక్షసుడిగా మారి.. అమ్మాయిలపై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపి.. హత్య చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హాజీపూర్‌లో వెలుగుచూసిన మూడు హత్యలు తీవ్ర సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రావణి, మనీషా మృతదేహాలు ఒకే బావిలో లభించగా.. నెలరోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరు అమ్మాయిలను శ్రీనివాస్‌రెడ్డి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన ఆరో తరగతి విద్యార్థిని కల్పన(11)పై కూడా అత్యాచారం జరిపి హత్య చేసినట్టు నిందితుడు తాజాగా అంగీకరించాడు. దీంతో కల్పన మృతదేహం కోసం మరో బావిలో పోలీసులు వెతుకుతున్నారు. శ్రావణి, మనీషాను హత్య చేసి.. బావిలో విసిరేసినట్టే.. కల్పనను కూడా అదేవిధంగా మరో బావిలో విసిరేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమ్మాయిలను అత్యాచారం చేసి చంపిన కేసులో అరెస్టైన సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఇప్పటికే గ్రామస్తులు దాడి చేసి.. నిప్పుపెట్టిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్‌రెడ్డి దారుణాల గురించి తెలుసుకున్న హాజీపూర్ వాసులు తీవ్ర ఆగ్రహావేశంతో అతడి ఇంటిని తగలపెట్టారు. అడ్డుకున్న పోలీసులపైనా దాడికి యత్నించారు. శ్రీనివాస్‌రెడ్డిని అత్యంత కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: వరుస హత్యలు.. హాజీపూర్‌లో టెన్షన్ శ్రావణి, మనీషాల హత్య కేసు.. ఎవరీ శ్రీనివాసరెడ్డి? -
వరుస హత్యలు.. హాజీపూర్‌లో టెన్షన్
సాక్షి, బొమ్మలరామారం: వరుస హత్యలు వెలుగు చూసిన యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరు అమ్మాయిలను అత్యాచారం చేసి చంపిన కేసులో అరెస్టైన సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై గ్రామస్తులు మంగళవారం ఉదయం దాడి చేశారు. శ్రీనివాస్‌రెడ్డి దారుణాల గురించి తెలుసుకున్న హాజీపూర్ వాసులు తీవ్ర ఆగ్రహావేశంతో అతడి ఇంటిని ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. అడ్డుకున్న పోలీసులపైనా దాడికి యత్నించారు.. శ్రీనివాస్‌రెడ్డిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. హాజీపూర్ వరుస హత్యలకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన ఆరో తరగతి విద్యార్థిని కల్పన కూడా హత్యకు గురయివుంటుదన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. గతంలోనూ పలుమార్లు మహిళలతో శ్రీనివాస్‌రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడని గ్రామస్తులు వెల్లడించారని, ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండేలా కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. హాజీపూర్‌లో శ్రావణి, మనీషా మృతదేహాలు వెలుగు చూసిన సంఘటనా స్థలాన్ని ఆమె పరిశీలించారు. (శ్రావణి, మనీషాల హత్య కేసు.. ఎవరీ శ్రీనివాసరెడ్డి?) -
‘మనీషా హత్య కూడా ఆ రోజే బయట పడేది’
సాక్షి, యాదాద్రి : శ్రావణి మృతదేహం తీసిన రోజే కాస్తా లోతుగా దర్యాప్తు చేసి ఉంటే.. మనీషా హత్య కూడా వెలికి వచ్చేదన్నారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే డిగ్రీ విద్యార్థిని మనీషా శవం బయటపడ్డ సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి.. తెలంగాణలో కనీస మానవత్వం లేని ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డమ్మీ హోం మినిస్టర్‌తో సీఎం పాలన సాగిస్తున్నారన్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డ్ వైఫల్యంతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతుండగా.. మరోవైపు ఆడపిల్లలకు రక్షణ కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు హత్యకు గురయ్యారని.. దీనిపై సీఎం, హోం మినిస్టర్‌తో సహా కనీసం జిల్లా మంత్రి కూడా స్పందిచలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. జిల్లాలో జోరుగా గంజాయి దందా సాగుతుందన్నారు. పోలీసులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని.. ఫలితంగా పెద్ద ఎత్తున యువత మత్తుకు బానిసలవుతున్నారని పేర్కొన్నారు. కాగా, శ్రావణి, మనీషా కుటుంబాలకు కోమటిరెడ్డి.. చెరో యాభై వేల రూపాయల తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు. -
శ్రావణి, మనీషాల హత్య కేసు.. ఎవరీ శ్రీనివాసరెడ్డి?
సాక్షి, బొమ్మలరామారం: తెలంగాణలో సంచలనం రేపిన హాజీపూర్ హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. శ్రావణి, మనీషాలను హత్య కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. హాజీపూర్ గ్రామానికి చెందిన పాత నేరస్తుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రావణి హత్య కేసులో అతడిని విచారిస్తున్న క్రమంలోనే మనీషా హత్య కూడా వెలుగులోకి వచ్చింది. మనీషాపై అత్యాచారం చేసి చంపేసినట్టు పోలీసులు ముందు నిందితుడు అంగీకరించినట్టు తెలుస్తోంది. అతడు ఇచ్చిన వాంగూల్మం ఆధారంగా మనీషా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శ్రావణి మృతదేహాన్ని పాతిపెట్టిన బావిలోనే మనీషా మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. కీసరలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హైదరాబాద్‌లో పలు కేసులు ఉన్నాయి. హాజీపూర్ నుంచి ప్రతిరోజు కీసరకు వెళ్లే క్రమంలో అమ్మాయిలను ట్రాప్ చేసివుంటాడని అనుమానిస్తున్నారు. నెలరోజుల వ్యవధిలోనే ఇద్దరు అమ్మాయిలను అతడు హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అతడు ఇంకా ఎన్ని దారుణాలకు పాల్పడ్డాడనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు గ్రామస్తులు దాడి చేస్తారన్న భయంతో అతడి కుటుంబ సభ్యులు హాజీపూర్ వదిలి పారిపోయారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా భద్రతా దళాలను మొహరించారు. అయితే శ్రీనివాస్‌రెడ్డి అరెస్ట్‌ను పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. నెలా పది రోజుల క్రితం కాలేజీకి వెళ్లి తన కూతురు తిరిగి రాలేదని మనీషా తండ్రి మల్లేశ్ తెలిపారు. పరువు పోతుందన్న భయంతో బయటికి చెప్పలేదని, తన కూతురు హత్యకు గురవుతుందని ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యాడు. మనీషా తన నాలుగో కూతురని, హంతకుడిని కఠినంగా శిక్షించాలని అన్నాడు. తానొక వ్యక్తిని ప్రేమించానని, అతడిని పెళ్లి చేసుకుంటానని తన కుటుంబ సభ్యులతో మనీషా చెప్పిందని.. తర్వాత ఆమె కనిపించకపోవడంతో ప్రేమికుడితో వెళ్లిపోయివుంటారని అందరూ భావించారు. శ్రీనివాసరెడ్డి కారణంగా తమ గ్రామానికి చెడ్డ పేరు వచ్చిందని హాజీపూర్ వాసులు వాపోయారు. మొదటి నుంచి అతడికి నేర చరిత్ర ఉందని వెల్లడించారు. కచ్చితంగా అతడే ఈ రెండు హత్యలు చేసివుంటాడని అన్నారు. గతంలో హత్యకు గురైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన మహిళను కూడా అతడే చంపివుంటాడన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కర్నూలులోనూ శ్రీనివాసరెడ్డిపై హత్య కేసు నమోదైందని తెలిపారు. బైకు దొంగతనాలకు కూడా పాల్పడినట్టు చెప్పారు. (శ్రావణిని పూడ్చిపెట్టిన బావిలోనే మనీషా మృతదేహం లభ్యం) -
శ్రావణిని పూడ్చిపెట్టిన బావిలోనే...
సాక్షి, బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ఇటీవల వెలుగు చూసిన శ్రావణి హత్యకేసు ఉదంతం మరువకముందే మరో యువతి హత్య వెలుగు చూసింది. శ్రావణి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన బావిలోనే మరో యువతి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతురాలు నెల క్రితం నుంచి కనిపించకుండా పోయిన మనీషా అనే డిగ్రీ విద్యార్థినిగా గుర్తించారు. అస్థికలను బావిలోంచి తీయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి రెండు ఫైరింజన్లను తరలించారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కూడా హాజీపూర్ చేరుకున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరు అమ్మాయిల మృతదేహాలు బావిలో బయటపడటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. శ్రావణిని హతమార్చిన వారే మనీషాను కూడా చంపేసివుంటారని అనుమానిస్తున్నారు. కేఎల్ఆర్ డిగ్రీ కాలేజీలో బీకామ్ చదువుతున్న మనీషా ప్రియుడితో పారిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు పరువు పోతుందన్న భయంతో మిన్నకుండిపోయారు. చుట్టాలింటికి వెళ్లిందని గ్రామస్తులతో చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. అయితే ఆమె మృతదేహం బయటపడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నాలుగేళ్ల క్రితం ఆరో తరగతి విద్యార్థిని కల్పన అనే అమ్మాయి కూడా అదృశ్యమైందని హాజీపూర్ గ్రామస్తులు వెల్లడించారు. ఈ నేరాలన్ని ఒకరి పనేనా, కాదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి హత్య కేసులో హాజీపూర్‌కు చెందిన పాత నేరస్తుడు శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. వీరు ఇచ్చిన సమాచారంతోనే మనీషా హత్య వెలుగు చూసినట్టు తెలుస్తోంది. కల్పనను కూడా వీరే హత్య చేసివుంటారని ఆమె కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. హాజీపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులను మొహరించారు. (శ్రావణిని చంపిందెవరు?) -
శ్రావణి హత్య.. పోలీసుల కీలక నిర్ణయం!
సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో జరిగిన శ్రావణి దారుణ హత్య తీవ్ర సంచలనం రేపుతోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడి తర్వాత హత్య చేసినట్లుగా వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అసలు శ్రావణిని హత్య చేసింది ఎవరు? బావిలో పడేసి పూడ్చిపెట్టడం ఒక్కరి వల్ల అయ్యే పనేనా? ఈ దారుణానికి ఒడిగట్టడానికి వెనుక కారణాలేంటి అన్నది ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంంలో ఈ కేసు దర్యాప్తులో భాగంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటుచేసినట్టు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. కేసు దర్యాప్తులో అలసత్వం ప్రదర్శించిన బొమ్మలరామారం ఎస్సై వెంకటేశ్‌పై శాఖపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. శ్రావణి హత్యకు సంబంధించి గ్రామస్తుల వద్ద ఏదైనా సమాచారం ఉంటే నేరుగా రాచకొండ పోలీసుల వాట్సాప్ నంబర్ 9490617111 సమాచారం ఇవ్వచ్చునని తెలిపారు. కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఎస్వోటీ డీసీపీ సురేందర్ రెడ్డి, షీ టీమ్ అడిషనల్ డీసీపీ సలీమా, ఐటీ సెల్ అధికారులు ఉంటారని తెలిపారు. శ్రావణి పోస్ట్‌మార్టం అనంతరం ప్రాథమిక విచారణలో పలు విషయాలు వెలుగుచూశాయి. శ్రావణి ఊపిరాడక చనిపోయిందని.. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని తేలింది. దీంతోపాటు ఆమె ఎడమవైపు పక్కటెముకలు విరిగిపోయాయి. కుడివైపుపక్కటెముకలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను చంపిన తర్వాత 25 అడుగుల లోతులోని బావిలోకి పైనుంచి పడేయడంతో పక్కటెముకలు విరిగినట్లు తెలుస్తోంది. శ్రావణి మృతదేహం దొరికిన బావి వద్ద ఎండిన వరిగడ్డిని గుర్తించారు. బాలిక చనిపోయిన తర్వాత కాల్చివేయాలన్న ఆలోచనలో నిందితులు ఉన్నట్లు భావిస్తున్నారు. శ్రావణి హత్య సంఘటనపై ఆమె బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాంలో ఉన్నారు. శనివారం కూడా శ్రావణి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు, గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కోసం వెళ్తూ జాతీయ రహదారిపై మరోసారి రాస్తారోకో చేపట్టారు. ప్రజల ఆగ్రహంతో ఆ ప్రాంతమంతా అట్టుడికిపోయింది. సీపీ మహేశ్‌భగవత్ సంఘటన స్థలానికి చేరుకుని నిందితులను 24 గంటల్లో పట్టుకుని చట్టపరంగా శిక్షిస్తానని హామీ ఇవ్వడంతో శ్రావణి అంత్యక్రియలు నిర్వహించారు. @cyberabadpolice @hydcitypolice @TelanganaDGP pic.twitter.com/sekttcEbwq — Rachakonda Police (@RachakondaCop) April 27, 2019 చదవండి: శ్రావణిని చంపిందెవరు? -
శ్రావణిని చంపిందెవరు?
సాక్షి,యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో జరిగిన శ్రావణి దారుణ హత్య తీవ్ర సంచలనం రేపుతోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడి తర్వాత హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. శ్రావణి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 9వ తరగతి పూర్తి చేసిన శ్రావణి, పాఠశాలలో ప్రైవేట్ తరగతులకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా చోటు చేసుకున్న దారుణ ఘటనపై అన్ని వర్గాల్లో ఆందోళన, ఆగ్రహం పెల్లుబుకుతోంది. శ్రావణిని హత్య చేసింది ఎవరు? అనే అంశంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బావిలో పడేసి పూడ్చిపెట్టడం ఒక్కరి వల్లకాదని, నలుగురు వ్యక్తులు ఇందులో పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిందితులను 24 గంటల్లో పట్టుకుంటామని పోలీసులు శ్రావణి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అయితే హత్య వెనక డ్రగ్స్ బానిసలు ఉన్నారా, లేక వ్యక్తిగత, రాజకీయ కక్షలు.., మరేవైనా కారణాలున్నాయా అన్నది తేలాల్సి ఉంది. కాగా, విధినిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించిన ఎస్ఐని ఉన్నతాధికారులు విధుల్లోంచి తప్పించి విచారణకు ఆదేశించారు. అత్యాచారం చేసి హత్య! శ్రావణిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని డీసీపీ నారాయణరెడ్డి చెప్పారు. పోస్ట్‌మార్టం అనంతరం ప్రాథమిక విచారణలో పలు విషయాలు వెలుగుచూశాయి. శ్రావణి ఊపిరాడక చనిపోయిందని తేలింది. దీంతోపాటు ఎడమవైపు పక్కటెముకలు విరిగిపోయాయి. కుడివైపుపక్కటెముకలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను చంపిన తర్వాత 25 అడుగుల లోతులోని బావిలోకి పైనుంచి పడేయడంతో పక్కటెముకలు విరిగినట్లు తెలుస్తోంది. శవం ఉబ్బిపోయి, చర్మం ఊడిపోయింది. అయితే అత్యాచారం విషయం లో మరింత స్పష్టత కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. శ్రావణి మృతదేహం దొరికిన బావి వద్ద ఎండిన వరిగడ్డిని గుర్తించారు. బాలిక చనిపోయిన తర్వాత కాల్చివేయాలన్న ఆలోచనలో నిందితులు ఉన్నట్లు భావిస్తున్నారు. అది వీలుకాకపోవడం తో బావిలో పడేసి పూడ్చినట్లు తెలుస్తోంది. శ్రావణి హత్యకేసులో విచారణ చేపట్టిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన స్థలంలో లభించిన ఆనవాళ్లు, సెల్‌ఫోన్ సిగ్నల్స్ అధారంగా కొందరిని అనుమానిస్తున్నారు. గ్రామస్తుల రాస్తారోకో.. శ్రావణి హత్య సంఘటనపై ఆమె బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. తాము మిస్సింగ్ కేసు పెట్టినా పోలీసులు సకాలంలో స్పందించలేదని, పోలీసుల వైఫల్యాన్ని నిలదీస్తూ స్థానికులు శుక్రవారం డీసీపీ వాహనంపై దాడి చేసిన విషయం తెలిసిందే. శనివారం కూడా శ్రావణి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన భువనగిరి ఏరియా ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు, గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. సుమారు గంటకుపైగా రాస్తారోకో జరిగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కోసం వెళ్తూ జాతీయ రహదారిపై మరోసారి రాస్తారోకో చేపట్టారు. దీంతో సుమారు రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజల ఆగ్రహంతో ఆ ప్రాంతమంతా అట్టుడికిపోయింది. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని తీసుకుని బొమ్మలరామారం చేరుకున్న వారు మరోసారి ఆందోళన చేపట్టారు. సీపీ మహేశ్‌భగవత్ సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని, నిందితులను 24 గంటల్లో పట్టుకుని చట్టపరంగా శిక్షిస్తానని హామీ ఇవ్వడంతో శ్రావణి అంత్యక్రియలు నిర్వహించారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన బొమ్మలరామారం ఎస్ఐ వెంకటేశ్వర్లును హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేస్తూ డీసీపీ ఉత్తర్వులు ఇచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ బొమ్మలరామారం నుంచి హాజీపూర్‌కు వెళ్లే అడ్డదారిలో జరిగిన ఈ అమానుషానికి పాల్పడింది ఎవరనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు సీసీ కెమెరాలను అశ్రయించారు. అయితే పోలీసులు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లోని సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుస్తోంది. కాగా, సమీపంలోని వైన్స్ వద్ద ఉన్న సీసీ కెమెరాలో ముగ్గురు యువకులు బీర్లు కొనుగోలు చేసిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌కు శివారులో ఉన్న బొమ్మలరామారంలో కొందరు వ్యక్తులు ఇటీవల గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతున్నట్లు పోలీస్‌లకు ఫిర్యాదు వచ్చాయి. ఈ నేపథ్యంలో మత్తు పదార్థాలు సేవించిన వారు ఈ హత్యకు పాల్పడ్డారా? అన్న కోణంలో విచారణ జరుగుతోంది. -
శ్రావణిపై అత్యాచారం, అనంతరం హత్య...
సాక్షి, యాదాద్రి : తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థిని శ్రావణి హత్యకేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. పదోతరగతి స్పెషల్ క్లాసులకు వెళ్లిన విద్యార్థిని శ్రావణి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. స్పెషల్ క్లాసులకు శ్రావణితో పాటు ఎవరెవరు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందనే దానిపై పోలీసులు శనివారం ఆమె చదువుతున్న పాఠశాలకు వెళ్లి విచారణ చేశారు. మరోవైపు శ్రావణి మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసిన భువనగిరి ప్రభుత్వ వైద్యులు ప్రాథమిక నివేదిక వెల్లడించారు. దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేసినట్లు వైద్యులు తమ నివేదికలో తెలిపారు. మృతురాలి ఒంటిపై గాయాలు ఉండటంతో పాటు, ఆమె ఛాతీ ఎముకలు విరిగినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. చదవండి... విద్యార్థిని శ్రావణి హత్య.. ఎస్ఐపై వేటు అదృశ్యమైన బాలిక హత్య కాగా యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో గురువారం అదృశ్యమైన విద్యార్థిని శ్రావణి.. మరుసటి రోజు పాడుబడ్డబావిలో శవంగా కనిపించింది. ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ కేసు విషయంలో అలసత్వం వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బొమ్మల రామారం ఎస్ఐ వెంకటయ్యపై వేటు పడింది. ఆయనను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్చేస్తూ డీసీపీ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులను పట్టుకోవాలంటూ ఇవాళ కూడా మృతురాలి కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో రాచకొండ సీపీ మహేష్ భగవత్...24 గంటల్లో నిందితుల్ని పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
విద్యార్థిని శ్రావణి హత్య.. ఎస్ఐపై వేటు
సాక్షి, యాదాద్రి : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థిని శ్రావణి హత్య కేసు విషయంలో యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మలరామారం ఎస్ఐ వెంకటయ్యపై ప్రభుత్వం వేటు వేసింది. హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్చేస్తూ డీసీపీ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థిని శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం వహించారని ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. ఇక పదోతరగతి స్పెషల్ క్లాసులకు వెళ్లిన విద్యార్థిని శ్రావణి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దుండగులు ఆమె మృతదేహాన్ని ఓ పాడుబడ్డ బావిలో ఖననం చేయగా.. ఈ కేసు దర్యాప్తులో ఆలస్యంగా స్పందించిన పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసు వాహనాలపై దాడికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ఈ సంఘటన వెలుగుచూసింది. గురువారం అదృశ్యమైన శ్రావణి.. మరుసటి రోజు పాడుబడ్డబావిలో శవంగా కనిపించింది. ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. కుటుంబ సభ్యుల ఆందోళన విద్యార్థిని శ్రావణిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని భువనగిరి రహదారిపై హాజీపూర్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో రాకపోకలు భారీగా స్తంభించాయి. చదవండి: అదృశ్యమైన బాలిక హత్య