Published
Sun, Jul 24 2016 9:03 PM
| Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
ఆలేరును అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలబెడతా
బొమ్మలరామారం: ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. మండల కేంద్రంలో గ్రంథాలయ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌తో పాటు నాగినేనిపల్లి, మైలారం, సోలీపేట్, బండ కాడిపల్లి గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి హారితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. మిషన్ కాకతీయ పథకం దేశానికే ఆదర్శమన్నారు. మిషన్ భగిర థతో అతి త్వరలో ప్రతి ఇంటికి గోదావరి జలాలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తిరుపతిరెడ్డి, జెడ్పీపీటీసీ జయమ్మకృష్ణారెడ్డి, తహసీల్దారు జయమ్మ, సర్పంచ్‌లు కల్పన, బండ వెంకటేశం, లక్ష్మి, రత్న ఎంపీటీసీలు మేడబోయిన శశికళగణేష్, మాంధాల రామస్వామి, లక్ష్మి, మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు గూదే బాల్ నర్సిహ్మ, వేముల సురేందర్‌రెడ్డి, దేవస్థాన కమిటీ చైర్మన్ రామిడి జంగారెడ్డి, అంజనేయులు, మల్లారెడ్డి, అంజిరెడ్డి, బీరుప్ప, సతీష్, రాంరెడ్డి పాల్గొన్నారు.