
అడ్డగూడూరు/చౌటుప్పల్: మరియమ్మ లాకప్‌డెత్ కేసుపై ఏసీపీ శ్యామ్‌ప్రసాద్ దర్యాప్తులో భాగంగా ఓఎస్‌డీ మల్లారెడ్డి శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపారు. స్టేషన్‌లో ఉన్న లాకప్ గదులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రెండింటిని మరమ్మతు చేయించినా ఒకటే పనిచేస్తున్నట్లు ఇన్‌చార్జ్ ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్ తెలిపారు. అలాగే.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆలేరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎం.మణికంఠ శనివారం రాత్రి అడ్డగూడూర్ పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపారు. సీల్డ్ కవర్‌లో తన నివేదికను హైకోర్టుకు అందజేయనున్నారు. మరోవైపు.. చౌటుప్పల్ పోలీస్ సబ్ డివిజన్ ఏసీపీ సత్తయ్యను రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ కమిషనర్ మహేశ్ భగవత్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment