Aler
-
అలకబూనిన మోత్కుపల్లి.. నేడు అనుచరులతో సమావేశం..
సాక్షి, యాదాద్రి: మాజీ మంత్రి,సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్ తొలి జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలనుకున్న మోత్కుపల్లికి అవకాశం దక్కకపోవడంతో భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. గురువారం యాదగిరిగుట్టలో తన అనుచరులతో సమావేశం అవుతున్నారు. అవమానంగా భావించి దళితబంధు పథకం ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్ మోత్కుపల్లి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆరు నెలలుగా కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అవమానంగా భావిస్తున్నారు. టికెట్లు ప్రకటించే సమయంలోనైనా సిట్టింగులకే ఇ స్తున్నామని మాట వరుసకైనా చెప్పలేదన్న ఆవేదన ఆయనలో ఉందని అనుచరులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే నకిరేకల్ టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెలే వేముల వీరేశానికి బీఆర్ఎస్ మొండిచేయి చూపడంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నకిరేకల్‌లో ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. చదవండి: అసంతృప్తులకు గాలం నమ్ముకున్న నాయకులు న్యాయం చేయలేదు: వైరా: ‘నేను నమ్ముకున్న నాయకులు న్యాయం చేయలేదు. నాకు టికెట్ రాకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు బరువెక్కిన హృదయంతో ఉన్నారు. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటా’అని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. బుధవారం ఆయన వైరాలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని, అయితే వృద్ధాప్యంలో ఉన్నందున వద్దన్నానని తెలిపారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, అందరితో కలిసి పని చేస్తానని, వైరా టికెట్ కేటాయించిన మదన్‌లాల్ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ భగవంతుడి కంటే ఎక్కువని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని చెప్పారు. చీకటి తర్వాత వెలుగు వస్తుందంటూ కేసీఆర్ ఆశీర్వాదం ఎప్పటికైనా తనకు లభిస్తుందని దీమా వ్యక్తం చేశారు. -
Mariyamma Lockup Death : సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక
అడ్డగూడూరు/చౌటుప్పల్: మరియమ్మ లాకప్‌డెత్ కేసుపై ఏసీపీ శ్యామ్‌ప్రసాద్ దర్యాప్తులో భాగంగా ఓఎస్డీ మల్లారెడ్డి శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపారు. స్టేషన్లో ఉన్న లాకప్ గదులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రెండింటిని మరమ్మతు చేయించినా ఒకటే పనిచేస్తున్నట్లు ఇన్చార్జ్ ఎస్ఐ ఉదయ్‌కిరణ్ తెలిపారు. అలాగే.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆలేరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎం.మణికంఠ శనివారం రాత్రి అడ్డగూడూర్ పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపారు. సీల్డ్ కవర్లో తన నివేదికను హైకోర్టుకు అందజేయనున్నారు. మరోవైపు.. చౌటుప్పల్ పోలీస్ సబ్ డివిజన్ ఏసీపీ సత్తయ్యను రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ కమిషనర్ మహేశ్ భగవత్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపాలు -
పరువు పోయిందని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ఆలేరు రూరల్: పరువు పోయిందని మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని సాయిగూడెంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన జన్నె భిక్షపతి (37) వ్యవసాయంతో పాటు ట్రాలీ ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆటో మరమ్మతుకు గురవడంతో ఆలేరులోని ఎస్ఎస్ ఆటోమొబైల్ దుకాణంలో విడిభాగాలను ఉద్దెరపై కొన్నాడు. అయితే, కొంత బాకీ తీర్చగా, మిగిలింది తీర్చాలంటూ షాపు నిర్వాహకుడు నాగేందర్.. గురువారం భిక్షపతిని దూషిస్తూ ఆటోను తీసుకెళ్లాడు. దీంతో తన పరువు పోయిందని మనస్తాపానికి గురైన భిక్షపతి.. ఇంటికి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకు న్నాడు. కాగా, మృతదేహాన్ని ఆటోమొబైల్ షాపు ఎదుట ఉంచి మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పరిహారం ఇప్పించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చదవండి: రెండ్రోజుల్లో నిశ్చితార్థం: అప్పు తీర్చేవారు లేరని.. -
ఎన్నికల్లో ఓడిపోవాలని.. ఏం చేశారో తెలుసా?
రాజాపేట (ఆలేరు) : ఓ వార్డు అభ్యర్థి ఇంటిముందు గుర్తుతెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్డు, వేపకొమ్మలు పెట్టడంతో భయాందోళనకు గురవుతున్న సంఘటన మండలంలోని రఘునాథపురంలో చోటుచేసుకుంది. బాధితుడు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బింగి నాగేష్ పంచాయతీ ఎన్నికల్లో నాలుగో వార్డులో పోటీలో ఉన్నాడు. కాగా రాత్రి ఎన్నికల ప్ర చారం ముగించి శుక్రవారం తెల్లవారుజాము న లేచి చూసేసరికి ఇంటిముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, వేపకొమ్మలు, కోడిగుడ్డుతో పూజలు చేసినట్లు కనిపించడంతో కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం కాలనీవాసులకు తెలవడంతోవారంతా ఆందోళన చెందుతున్నారు. -
కొడుకు చదవడం లేదని..
ఆలేరు : కుమారుడు చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆ తల్లి కలత చెందింది.. పలుమార్లు మందలించినా పద్ధతి మార్చుకోలేదు సరికదా.. చదువును మధ్యలోనే ఆపేసి ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు.. దీంతో విసిగివేసారిన ఆ తల్లి చనిపోవాలని నిర్ణయించుకుని టాయిలెట్లు క్లీన్ చేసే ద్రావణాన్ని తాగింది.. అది చూసిన కుమారుడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలేరు మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. మందనపల్లి గ్రామానికి చెందిన నర్మెట్ట వెంకటేశ్ –చంద్రకళ దంపతుల కుమారుడు బాలు ఇటీవల పాల్టెక్నిక్ డిప్లమా చదువు మధ్యలో మానేసి ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. పలుమార్లు చెప్పినా వినిపించుకోలేదు. వెంకటేశ్ ఆటోడ్రైవర్, చంద్రకళ ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. వెంకటేశ్ ఉదయం బయటకు వెళ్లగా, చంద్రకళ కొడుకును మందలించింది. కుమారుడి విషయంలో తీవ్ర మనస్తాపం చెందిన చంద్రకళ టాయిలెట్లు క్లీన్ చేసే ఫినాయిల్ తాగింది. భయాందోళనకు గురైన బాలు కూడా చంద్రకళ వదిలేసిన మిగతా ఫినాయిల్‌ను తాగాడు. ఇరుగుపొరుగు వారు గమనించి 108 ద్వారా ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఇద్దరినీ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదని తెలిసింది. -
సెక్స్ రాకెట్ : మరో ఆరుగురికి విముక్తి
సాక్షి, యాదగిరిగుట్ట : వ్యభిచార నిర్వాహకులు, బాలికల అక్రమ రవాణా ముఠా కలిసి సాగిస్తున్న చీకటి వ్యాపారానికి చెక్ పెట్టే దిశగా పోలీస్ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ‘ఆపరేషన్ ముస్కాన్’ పేరుతో వ్యభిచార గృహాలపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. వ్యభిచార ముఠా సభ్యుల చెరలో నుంచి బాలికలకు విముక్తి కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ఆరుగురికి విముక్తి కలిగించారు. ఆలేరు రైల్వేస్టేషన్లో వ్యభిచార నిర్వహకుడి అరెస్ట్ చేశారు. రక్షించిన వారిలో ఇద్దరు యువతులు, నలుగురు బాలికలు ఉన్నారు. బాలికల అక్రమ రవాణాను పూర్తిగా నివారించేందుకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఆత్మకూరు(ఎం) (ఆలేరు) : డీసీఎం బోల్తాపడిన ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మండల కేంద్రంకు సమీపంలో జేఏసీ ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బొమ్మలరామారం మండలం లక్ష్మీతండాకు చెందిన ఇంద్రావత్ పాండు(36) మోత్కూరు నుంచి తన సొంత డీసీఎం ద్వార బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామానికి ఇసుకను తరలిస్తున్నారు. డ్రైవర్, యజమాని అయిన పాండుతో పాటు కూలీలు స్వామి, లక్ష్మణ్, దారవత్ భిక్షం ప్రయాణిస్తున్నారు. ఆత్మకూరు(ఎం) మండలం జేఏసీ ఫంక్షన్ హాల్ సమీపంలో మెయిన్ రోడ్డు పక్క చెట్టును ఢీకొట్టడంతో అదుపు తప్పి పడి పోయింది. ఈ సంఘటనలో పాండు అక్కడికక్కడే మృతిచెందారు. డీసీఎంలో ప్రయాణిస్తున్న స్వామి, లక్ష్మణ్, భిక్షలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతుడి భార్య ఇంద్రావత్ శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కనకటి యాదగిరి తెలిపారు. -
గంధమల్ల నిర్మాణానికి సహకరించాలి
తుర్కపల్లి (ఆలేరు) : గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి రైతులు, గ్రామస్తులు సహకరించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం తుర్కపల్లి మండలంలోని గంధమల్ల గ్రామాన్ని సందర్శించి రైతులు, గ్రామస్తులతో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ముంపు గురవుతున్న రైతులు పూర్తిగా సహకరించాలన్నారు. ప్రాజెక్ట్ కింద నష్టపోతున్న భూ నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం జరిగేందుకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రాజెక్ట్‌లు నిర్మాణం జరిగితేనే తెలంగాణ అన్ని విధాల సస్యశ్యామలమవుతుందన్నారు. న్యాయమైన డిమాండ్లకు ఓ కమిటీ వేసుకొని తెలియజేస్తే అట్టి నిర్ణయాలను భారీ ప్రాజెక్ట్‌ల మంత్రి హరిశ్‌రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం అందే వరకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అనుమూల వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జూపల్లిలక్ష్మీచంద్రయ్య,టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షడు పడాల శ్రీనివాస్,తలారి శ్రీనివాస్,జక్కుల వెంకటేశం,గజం మురళి,బొత్తరాములు,మందల మల్లయ్య,బిచ్చిరెడ్డి,జక్కుల కిష్టయ్య,కడిపె ఇస్తారి,జెల్ల వెంకటేశం,ఎలగల రాజు,కుంభం మల్లేశం గ్రామస్తులు,రైతులు తదితరులు పాల్గొన్నారు. -
కులవృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
ఆలేరు : మారుతున్న కాలానికి అనుగుణంగా కులవృత్తుల్లో ౖనైపుణ్యం పెంపొందించుకోవాలని చేనేత రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ రాంగోపాల్‌రావు అన్నారు. ఆలేరులోని చేనేత సహకార సంఘంలో శుక్రవారం చేనేత కార్మికులకు ఆరో విడత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో చేనేత కార్మికులు నైపుణ్యంతో వస్త్రాలను రకరకాల డిజైన్లతో, నాణ్యంగా తయారుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఏడీ రతన్‌కుమార్, వీవర్స్ సర్వీస్ సెంటర్ ఏడీ íß మోద్‌కుమార్, ఏడీఓ వీఎస్ఎన్ రెడ్డి, డిజైనర్ పల్లావిజోషి, సీడీ సౌజన్య, చైర్మన్ చింతకింది వెంకటేశ్, కార్యదర్శి ఎనగందుల రామరుషి పాల్గొన్నారు. -
తపాలా సేవలను విస్త్రృత పరుస్తాం
ఆలేరు : దేశవ్యాప్తంగా తపాలా సేవలను మరింత విస్తృతపరుస్తున్నట్లు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ రమణారెడ్డి అన్నారు. ఆలేరులోని టీఎన్జీఓ భవనంలో ఆలేరు, యాదగిరిగుట్ట, రఘునాథపురం పరిధిలోని సిబ్బందికి పోస్టల్ సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్‌ల మాదిరిగానే ఇక నుంచి తపాలా శాఖల ఆధ్వర్యంలో అన్ని సేవలు లభ్యమవుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఏఎస్పీఓ శ్రీనివాస్, ఆలేర్ బ్రాంచ్ మేనేజర్ రాములు, 3 మండలాల పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి
ఆలేరు : నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలేరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో 36 గంటల పాటు బుధవారం నిరహార దీక్ష చేపట్టారు. దీక్షలో కూర్చున్న టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణికి ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టి ప్రజాభీష్టానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చెబుతున్న కేసీఆర్.. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని కోరారు. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాల్సిందేనన్నారు. దీక్షకు సీపీఐ నాయకులు గోద శ్రీరాములు, చెక్క వెంకటేశం సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో దడిగె ఇస్తారి, ఆరె రాములు, చామకూర అమరేందర్‌రెడ్డి, ఎండీ సలీం, మధుసూదన్‌రెడ్డి, గ్యాదపాక దానయ్య, జెట్ట సిద్దులు, సూదగాని రాజయ్య, భోగ సంతోష్‌కుమార్, ఎండి రఫీ, జూకంటి పెద్దఉప్పలయ్య, పల్లెపాటి బాలయ్య, బండ శ్రీను పాల్గొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్
ఆలేరు : సీఎం కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో ఆలేరులోని రైల్వేగేట్ వద్ద మంగళవారం చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనానరు. కొత్త జిల్లాల ఏర్పాటులో క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలకు, సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాజకీయాలకు తావిస్తూ సీఎం కేసీఆర్ ఇష్టానుసరంగా జిల్లాలు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలను, అన్ని పార్టీలను భాగస్వామ్యులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు దొంతిరి శ్రీధర్‌రెడ్డి, నాయకులు కావటి సిద్ధిలింగం, పులిపలుపుల మహేష్, భోగ శ్రీను, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, అల్వాల సిద్ధులు, కుండె సంపత్, కూళ్ల సిద్ధులు, దయ్యాల సంపత్, బడుగు జహంగీర్ పాల్గొన్నారు. -
ప్రజలను మోసగిస్తున్న టీఆర్ఎస్ సర్కార్
ఆలేరు : రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కార్ సాధ్యంకాని హామీలతో ప్రజలను మోసం చేస్తోందని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ ఆరోపించారు. ఆలేరులోని ఇందిరాకాంగ్రెస్ భవనంలో ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిడ్‌మానేరు ప్రాజెక్టు, డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో అవగాహన లేక హామీ ఇచ్చానని ఇటీవల సీఎం కేసీఆర్ పేర్కొనడం ఇందుకు నిదర్శనమన్నారు. జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. గతేడాది పంటలను నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ.972 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే ఆ నిధులను ప్రభుత్వం వేరే పనులకు మళ్లించడం సిగ్గుచేటన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు. ప్రభుత్వం చేసే తప్పిదాలను గ్రామస్థాయి నుంచి ఎండగడుతామని హెచ్చరించారు. సమావేశంలో జనగాం ఉపేందర్‌రెడ్డి, జూకంటి రవీందర్, కొలుపుల హరినాథ్, ఎంఎస్ విజయ్‌కుమార్, నీలం పద్మ, ఎండీ.జైనోద్దీన్, కె.సాగర్‌రెడ్డి, ఎంఏ.ఎజాజ్, జూకంటి ఉప్పలయ్య, నీలం వెంకటస్వామి, ఇల్లెందుల మల్లేశ్, గ్యాదపాక నాగరాజు, సిరిగిరి సాగర్, భీజని మధు పాల్గొన్నారు. -
బహిరంగ సభను జయప్రదం చేయాలి
ఆలేరు : నవంబర్ 13న హైదరాబాద్‌లో జరిగే మాదిగ మహాశక్తి బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఆలేరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు మాదిగ జేఏసీ పక్షాన ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నారు. మాదిగ మహాశక్తి బహిరంగ సభకు మాదిగ యువత పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో క్యాసగల్ల శ్రీకాంత్, క్యాసగల్ల యాదగిరి, కర్రె అశోక్, భిక్షపతి, ఆంజనేయులు, సంతోష్ పాల్గొన్నారు. -
ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి
ఆలేరు : అన్ని అర్హతలున్న ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీ డీపీ, సీపీఐ ఆధ్వర్యంలో పట్టణ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ విషయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు చొరవ తీసుకోకపోవడం బాధకరమన్నారు. అలాగే ఆలేరు, రాజాపేట, గుండాల మండలాలను జనగామ డివిజన్లో కలపడం ఆశాస్త్రీయమన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఒంటెద్దు పోకడలను అవలంబిస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, గోద శ్రీరాములు, ఆరె రాములు, చామకూర అమరేందర్‌రెడ్డి, చెక్క వెంకటేశ్, ఎండి సలీం, గుంటి మధుసూదన్‌రెడ్డి, జెట్ట సిద్దులు, గ్యాదపాక దానయ్య, సూదగాని రాజయ్య, గిరిరాజు వెంకటయ్య,జశ్వంత్, బాలయ్య, జెట్ట సిద్దులు, బండ శ్రీను, జూకంటి పెద్దఉప్పలయ్య, ఎండి రఫీ, గొట్టిపాముల శ్రీను, భోగ సంతోష్ పాల్గొన్నారు. -
అభివృద్ధిని అడ్డుకోవడం తగదు
ఆలేరు : ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకోవడం తగదని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతలు అన్నారు. ఆలేరులో గత 40 రోజులుగా మూసివేసిన రైల్వేగేట్‌ను మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బూర నర్సయ్యగౌడ్, విప్ గొంగిడి సునీతలను అడ్డుకునేందుకు విపక్ష నాయకులు ప్రయత్నించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధిని స్వాగతించాల్సింది పోయి.. అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైల్వేగేట్ మూసివేతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు సీఎం కేసీఆర్, రైల్వేమంత్రి సురేష్‌ప్రభు, కేంద్రమంత్రి దత్తాత్రేయ, రైల్వేజీఎం గుప్తాలను కలిసి వివరించినట్లు పేర్కొన్నారు. గత 40 రోజులుగా నిరంతరం గేట్‌ను తెరిపించేందుకు తమ శాయశక్తులా కృషి చేశామన్నారు. అలాVó ఆర్యుబీ నిర్మాణానికి రూ. 6.50కోట్లు మంజూరయ్యాయని, ఇందులో రాష్ట్రం వాటా 5.25 కోట్లు, రైల్వేశాఖ 1.25 కోట్లు నిధులు విడుదలయ్యేలా ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. కొలనుపాక బీటీరోడ్డుకు రూ. 1.65కోట్లు, పోచ్చమ్మవాడ ప్రధాన రహదారిపై సైడ్డ్రైనేజీల నిర్మాణానికి రూ. 10 లక్షలు, ఆర్వోబీ వెంట సర్వీస్రోడ్లకు రూ. 30 లక్షలు నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. ఆలేరు అభివృద్ధే «ధ్యేయంగా ప్రజల సహకారంతో ముందుకెళ్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, మార్కెట్ చైర్మన్ కాలె సుమలత, ఇన్చార్జి సర్పంచ్ దాసి సంతోష్, నాయకులు ఆకవరం మోహన్‌రావు, పోరెడ్డి శ్రీనివాస్, చింతకింది మురళి, సిరమైన వెంకటేష్, మొరిగాడి ఇందిరా, గుత్తా శమంతారెడ్డి, పేరపు సిద్దులు, జల్లి నర్సింహులు, గంపల విజయ్, దూడం మధు, ఎగ్గిడి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అడ్డుకున్న విపక్షాలు ఆలేరులో రైల్వేగేట్‌ను ప్రారంభించేందుకు వస్తున్న ఎంపీ బూర నర్సయ్యగౌడ్, విప్ గొంగిడి సునీతలను అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. ఎమ్మెల్యే గో బ్యాక్ నినాదాలు ఇచ్చారు. ఒక వైపు ఎమ్మెల్యే గోబ్యాక్ అంటుంటే.. మరోవైపు టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే జిందాబాద్ అంటు నినాదాలు ఇచ్చారు. యాదగిరిగుట్ట సీఐ రఘువీర్‌రెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష నాయకులను అడ్డుకున్నారు. టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఆధ్వర్యంలో కొద్దిసేపు రైల్వేగేట్ వద్ద బైఠాయించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు చామకూర అమరేందర్‌రెడ్డి, ఎండి సలీం, కె సాగర్‌రెడ్డి, తునికి దశరధ, ఆరె రాములు, ఎంఎ ఎక్బాల్, ఎంఎ ఎజాజ్, జూకంటి ఉప్పలయ్య, వడ్డెమాన్ శ్రీనివాస్, మంగ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
దళితులను నిర్లక్ష్యం చేస్తున్నారు
ఆలేరు : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 70ఏళ్లు కావస్తున్నా నేటికీ దళితులను చిన్నచూపు చూడడం తగదని టీ–ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మాదిగచైతన్య పాదయాత్ర సోమవారం ఆలేరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెప్పులు కుట్టేవారికి, డప్పులు కొట్టేవారికి రూ. 2వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లిస్తున్నారని, నేత, గీత, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, సమాజసేవ చేస్తున్న చెప్పులు కుట్టే, డప్పులు కొట్టేవారికి పెన్షన్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. నవంబర్ 18లోపు ప్రభుత్వం స్పందించకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీ–ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు యాతాకులు భాస్కర్, కందుల రామన్, గ్యార నరేష్, మాటూరు నాగరాజు పాల్గొన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
ఆలేరు : ఆలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆలేరులో శనివారం జరిగిన టీడీపీ మండల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని.. ఇటీవల యాదాద్రి జిల్లా సాధన ప్రజల సహకరంతోనే సాధ్యమైందన్నారు. అలాగే ఆలేరు రైల్వేగేట్ విషయంలో 5వేల మందితో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుర్తుచేశారు. తాను ఎక్కడ ఉన్న ఆలేరు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. అలాగే యాదాద్రి జిల్లా ఏర్పాటైనందున యాదగిరిగుట్టలో అక్టోబర్ 2న అభినందన సభను ఏర్పాటు చేస్తున్నామని.. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. అలాగే టీడీపీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలు బండ్రు శోభారాణి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేకు ఇక్కడి ప్రజల బాగోగులు పట్టడం లేదన్నారు. కార్యక్రమంలో అమరేందర్‌రెడ్డి, ఇస్తారి, రాములు, సలీం, దానయ్య, బాలయ్య, మల్లేశం, మల్లేశం, సంతోష్, శ్రీను, పెద్దఉప్పలయ్య, రాజయ్య, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
ఆలేరు : ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఆలేరు, రాజాపేట, గుండాల మండలాలను జనగామ రెవెన్యూ డివిజన్లో కలపాలని నిర్ణయించడం సరైందికాదని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు దొంతిరి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆలేరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనగామలో కలిసేందుకు ఈ మూడు మండలాల ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఆలేరు నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉందని, ఆలేరు ముక్కలు చెక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతపై ఉందన్నారు. ఈ విషయమై ప్రభుత్వం తన నిర్ణయాన్ని తీసుకోకుంటే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చరించారు. అలాగే ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించేందుకు అన్ని అర్హతలున్నాయన్నారు. ప్రభుత్వమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలన్నారు. ఈసమావేశంలో తునికి దశరధ, పులిపలుపుల మహేష్, పసుపునూరి వీరేశం, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, పగడాల రాంబాబు, మైదం భాస్కర్, అల్వాల సిద్దులు, దయ్యాల సంపత్, పత్తి రాములు తదితరులు పాల్గొన్నారు. -
బైక్ ర్యాలీ ప్రారంభం
ఆలేరు : రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎంకు తలొగ్గి పాలన కొనసాగిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు అన్నారు. కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా ప్రజల స్వాభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతిస్తున్నారని విమర్శించారు. స్వరాష్ట్రంలో రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా జరుపుకోవాలన్న తెలంగాణ ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. చరిత్రను మరిపించేందుకు కుట్ర చేస్తుందన్నారు. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారింగా నిర్వహించే వరకు తాము రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తునికి దశర«థ, పులిపలుపుల మహేష్, కావటి సిద్దిలింగం, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్, వడ్డెమాన్ కిషన్, ఎనగందుల సురేష్, దయ్యాల సంపత్, భోగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
ఆలేరు : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆలేరులో తిరంగయాత్రను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. నిజాం నాటి ఉద్యమకారుల త్యాగాలు, చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని ఎన్నికలకు ముందు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి.. తీరా పక్కన పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 17న విమోచన దినోత్సవ వేడుకలకు హన్మకొండలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సభకు జాతీయ బీజేపీ అధ్యక్షులు అమిత్‌షా హాజరవుతున్నందున నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డా. కాసం వెంకటేశ్వర్లు, తునికి దశరధ, పులిపలుపుల మహేష్, కావటి సిద్దిలింగం, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్, వడ్డెమాన్ కిషన్, ఎనగందుల సురేష్, దయ్యాల సంపత్, భోగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
ఆలేరు : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆలేరులో తిరంగయాత్రను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. నిజాం నాటి ఉద్యమకారుల త్యాగాలు, చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని ఎన్నికలకు ముందు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి.. తీరా పక్కన పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 17న విమోచన దినోత్సవ వేడుకలకు హన్మకొండలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సభకు జాతీయ బీజేపీ అధ్యక్షులు అమిత్‌షా హాజరవుతున్నందున నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డా. కాసం వెంకటేశ్వర్లు, తునికి దశరధ, పులిపలుపుల మహేష్, కావటి సిద్దిలింగం, చిరిగె శ్రీనివాస్, ఐడియా శ్రీనివాస్, జంపాల శ్రీనివాస్, వడ్డెమాన్ కిషన్, ఎనగందుల సురేష్, దయ్యాల సంపత్, భోగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతోనే మానసికోల్లాసం
ఆలేరు : బాలబాలికల్లో మానసిక, శారీరక ఎదుగుదలకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని డిప్యూటీæడీఈఓ మదన్మోహన్ అన్నారు. ఆలేరులో జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో తునికి సత్తమ్మ స్మారకార్థం భువనగిరి డివిజన్ స్థాయి కబడ్డీ (అండర్–14) బాలబాలికల విభాగంలో శుక్రవారం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఆటలు ఆడితే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని చెప్పారు. ఆటలకు పాఠశాలలే ప్రధాన వేదికలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మీనారాయణ, హెచ్ఎంలు ఎలిజ»ñ త్, ఉదయశ్రీ, పీఈటీలు తునికి సాగర్, పూల నాగయ్య, తునికి చంద్రశేఖర్, గడసంతల మధుసూదన్, తునికి రవి, సౌజన్య, ప్రేమలత, వల్లాల ప్రభ, రెడ్డప్పరెడ్డి, పూసలోజు కృష్ణ, డా. స్టాలిన్‌బాబు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
రైల్వేగేట్‌ను తెరిచేవరకూ ఉద్యమం
ఆలేరు : ఆలేరులోని రైల్వేగేట్‌ను తెరిచేవరకు ఉద్యమిస్తామని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఆలేరులో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గేట్ మూసివేతతో ఆలేరు రెండు భాగాలుగా విడిపోయిందన్నారు. గేట్ అవతల వైపు ఉన్న ప్రజలకు ఇబ్బందులు కల్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నిర్మించిన ఆర్వోబీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని.. ఆర్యూబీ నిర్మించే వరకూ రైల్వేగేట్‌ను తెరిపించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆలేరు, రాజాపేట, గుండాల మండలాలను భువనగిరిలోనే యథావిధిగా కొనసాగించాలన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జనగాం ఉపేందర్‌రెడ్డి, నీలం పద్మ, పులిపలుపుల మహేష్, జెట్ట సిద్దులు, కందగట్ల నరేందర్, ఎనగందుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలేరును డివిజన్‌గా మార్చాలని రాస్తారోకో
ఆలేరు : పట్టణంలో మూసివేసిన రైల్వేగేట్‌ను తెరిపించాలని, ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఈ మేరకు శనివారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హన్మకొండ–హైదరాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఆందోళనకారులు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైల్వేగేట్‌ను తెరిపించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే విషయం తెలుసుకున్న సీఐ రఘువీర్‌రెడ్డి, పలువురు ఎస్సైలు తమ పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ జనగాం ఉపేందర్‌రెడ్డి, నీలం పద్మ, కొలుపుల హరినాథ్, కె సాగర్‌రెడ్డి, మంగ నర్సింహులు, జూకంటి ఉప్పలయ్య, ఎక్బాల్, ఎజాజ్, గోద శ్రీరాములు, కావటి సిద్ధిలింగం, తునికి దశరథ, జంపాల శ్రీనివాస్, పసుపునూరి విరేశం, ఐడియా శ్రీనివాస్, రాచకొండ జనార్దన్, చామకూర అమరేందర్‌రెడ్డి, గాదపాక దానయ్య, భీజని మధు, అప్సర్ పాల్గొన్నారు. సీఐతో వాగ్వాదం... రాస్తారోకో సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత దిష్టిబొమ్మను దహనం చేసేందుకు అఖిలపక్ష నాయకులు ప్రయత్నించగా వారిని యాదగిరిగుట్ట సీఐ అడ్డుకున్నారు. దీంతో కొందరు నాయకులు రహదారిపైకి దిష్టిబొమ్మను తీసుకువచ్చి దహనం చేస్తుండగా అడ్డుకోబోయారు. ఈ క్రమంలో ఎం.డి సలీం, చెక్క వెంకటేశ్, తునికి దశరథ అనే కార్యకర్తలు కిందపడిపోవడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో ఆందోళనకారులు సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, గాయపడిన నాయకులను ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పరామర్శించారు.