Published
Wed, Jul 20 2016 8:21 PM
| Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
యాదాద్రిని జిల్లాగా ప్రకటించాలి : మోత్కుపల్లి
ఆలేరు : ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని జిల్లాగా అధికారికంగా ప్రకటించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఆలేరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యాదాద్రిని జిల్లా కాకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రిని జిల్లాగా అధికారికంగా ప్రకటించే వర కూ మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు. యాదాద్రి జిల్లా ఏర్పాటును స్వాగతిస్తూ, గోదావరినది జలాల సాధన కోసం చేపడుతున్న సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మరికొద్ది రోజులు పొడిగిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 5న శ్రీలక్ష్మినర్సింహాస్వామి పాదాల చెంత సంతకాలు చేసిన పోస్టుకార్డులను పెట్టి, సీఎం కేసీఆర్‌కు పోస్టు చేస్తామని చెప్పారు. 10వేల పోస్టుకార్డుల ద్వారా లక్ష సంతకాలను సేకరించామని చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, చామకూర అమరేందర్‌రెడ్డి, ఆరె రాములు, ఎండి సలీం, మల్‌రెడ్డి సాంబిరెడ్డి, ఆలేటి మల్లేశం, జూకంటి పెద్దఉప్పలయ్య, ఎండి రఫీ, భోగ సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.