అభివృద్ధిని అడ్డుకోవడం తగదు
అభివృద్ధిని అడ్డుకోవడం తగదు
Published Tue, Sep 20 2016 8:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
ఆలేరు : ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకోవడం తగదని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతలు అన్నారు. ఆలేరులో గత 40 రోజులుగా మూసివేసిన రైల్వేగేట్‌ను మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బూర నర్సయ్యగౌడ్, విప్ గొంగిడి సునీతలను అడ్డుకునేందుకు విపక్ష నాయకులు ప్రయత్నించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధిని స్వాగతించాల్సింది పోయి.. అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైల్వేగేట్ మూసివేతతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు సీఎం కేసీఆర్, రైల్వేమంత్రి సురేష్‌ప్రభు, కేంద్రమంత్రి దత్తాత్రేయ, రైల్వేజీఎం గుప్తాలను కలిసి వివరించినట్లు పేర్కొన్నారు. గత 40 రోజులుగా నిరంతరం గేట్‌ను తెరిపించేందుకు తమ శాయశక్తులా కృషి చేశామన్నారు. అలాVó ఆర్‌యుబీ నిర్మాణానికి రూ. 6.50కోట్లు మంజూరయ్యాయని, ఇందులో రాష్ట్రం వాటా 5.25 కోట్లు, రైల్వేశాఖ 1.25 కోట్లు నిధులు విడుదలయ్యేలా ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. కొలనుపాక బీటీరోడ్డుకు రూ. 1.65కోట్లు, పోచ్చమ్మవాడ ప్రధాన రహదారిపై సైడ్‌డ్రైనేజీల నిర్మాణానికి రూ. 10 లక్షలు, ఆర్వోబీ వెంట సర్వీస్‌రోడ్లకు రూ. 30 లక్షలు నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. ఆలేరు అభివృద్ధే «ధ్యేయంగా ప్రజల సహకారంతో ముందుకెళ్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, మార్కెట్ చైర్మన్ కాలె సుమలత, ఇన్‌చార్జి సర్పంచ్ దాసి సంతోష్, నాయకులు ఆకవరం మోహన్‌రావు, పోరెడ్డి శ్రీనివాస్, చింతకింది మురళి, సిరమైన వెంకటేష్, మొరిగాడి ఇందిరా, గుత్తా శమంతారెడ్డి, పేరపు సిద్దులు, జల్లి నర్సింహులు, గంపల విజయ్, దూడం మధు, ఎగ్గిడి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
అడ్డుకున్న విపక్షాలు
ఆలేరులో రైల్వేగేట్‌ను ప్రారంభించేందుకు వస్తున్న ఎంపీ బూర నర్సయ్యగౌడ్, విప్ గొంగిడి సునీతలను అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. ఎమ్మెల్యే గో బ్యాక్ నినాదాలు ఇచ్చారు. ఒక వైపు ఎమ్మెల్యే గోబ్యాక్ అంటుంటే.. మరోవైపు టీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే జిందాబాద్ అంటు నినాదాలు ఇచ్చారు. యాదగిరిగుట్ట సీఐ రఘువీర్‌రెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష నాయకులను అడ్డుకున్నారు. టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఆధ్వర్యంలో కొద్దిసేపు రైల్వేగేట్ వద్ద బైఠాయించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు చామకూర అమరేందర్‌రెడ్డి, ఎండి సలీం, కె సాగర్‌రెడ్డి, తునికి దశరధ, ఆరె రాములు, ఎంఎ ఎక్బాల్, ఎంఎ ఎజాజ్, జూకంటి ఉప్పలయ్య, వడ్డెమాన్ శ్రీనివాస్, మంగ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement