అభివృద్ధిని అడ్డుకుంటే గుణ పాఠం తప్పదు
అభివృద్ధిని అడ్డుకుంటే గుణ పాఠం తప్పదు
Published Sat, Aug 27 2016 10:58 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
ఆలేరు
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటే గుణపాఠం తప్పదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత హెచ్చరించారు. ఆలేరులో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మించేవాళ్లమని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. తుమ్మిyì హెట్టి ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటే ఆ పత్రాలను బయటపెట్టాలని కోరారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులకు అవగాహన కొరవడిందని విమర్శించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్నదే ప్రభ్యుత ధ్యేయమన్నారు. అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తే ప్రజలు ఛీకొడతారన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి సర్పంచ్ దాసి సంతోష్, వైస్ ఎంపీపీ కొరకొప్పుల కిష్టయ్య, ఆకవరం మోహన్‌రావు, మొగులగాని మల్లేశం, చింతకింది మురళి, బెంజారం రవి, బాకీ ఆనందం, మొరిగాడి వెంకటేశ్, కర్రె అశోక్, దూడం మధు, ముస్తాఫా, దానియల్, గిరికుమార్, జల్లి నర్సింహులు, గంపల విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement